అందరం మళ్ళీ కలవాలని ఉంది!
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ చేసి కిర్రాక్ ఆర్పీ మంచి సెన్సేషన్ అయ్యాడు. ఇక ఇతని బ్రాంచ్ ఓపెనింగ్ కి జబర్దస్త్ టీం కూడా ఎంట్రీ ఇచ్చి టేస్ట్ చేసి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇక అదిరే అభి కూడా ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కి వచ్చి తన ఓల్డ్ ఫ్రెండ్స్ ని కలిసి హ్యాపీగా ఫీలయ్యాడు. కొద్ది రోజుల క్రితం అదిరే అభి "మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది…అరుచుకుంటూ నవ్వే జడ్జీలు,టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు, కామెడిని ఔపోసన పట్టిన కంటెస్టెంట్లు, అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, సమయం ఆగేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తాలు, జోకుల మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ రష్మిల అందం, స్కిట్ల మాయాజాలం..." అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
ఈ అంశం గురించి కిరాక్ ఆర్పీ బ్రాంచి ఓపెనింగ్ లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు "జబర్దస్త్ మొదలై టెన్ ఇయర్స్ ఐపోయిన సందర్భంలో అప్పటి రోజులు గుర్తొచ్చి నేను జబర్దస్త్ గురించి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఒకసారి స్కూలింగ్ ఐపోయాక ఎవరి కెరీర్ లో వాళ్ళు సెటిల్ ఐపోతారు. కానీ ఎప్పుడో ఒకసారి రీయూనియన్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక సందర్భంలోంచి వచ్చినదే మా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రీయూనియన్ ఐతే బాగుండు అన్న ఆలోచన. అందరం కలవడం ఐతే బాగుంటుంది కానీ ఆ తర్వాత జరిగేది విధి లిఖితం" అని చెప్పాడు. మరి చూడాలి అలా జబర్దస్త్ కంటెస్టెంట్స్ చాలా మంది లేరు. అందరూ కలిసి మళ్ళీ ఒక కొత్త టీంగా ఏర్పడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారా లేదా..మల్లెమాల యాజమాన్యం వాళ్లకు అవకాశం ఇస్తుందా లేదా...వేచి చూడాలి.