హాస్పిటల్ బెడ్ మీద అఖిల్.. టైం వచ్చినప్పుడు చెప్తాను!

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్ లో ఎంతగా సందడి చేసాడో ఇప్పుడు బీబీ జోడీలో తేజస్వినితో కలిసి అంతే సందడి చేస్తున్నాడు. వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. కొన్ని రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ లో మాత్రం రెచ్చిపోయి మరీ చేస్తున్నారు. ఏమయ్యిందో ఏమో కానీ రీసెంట్ గా  అఖిల్ బాడీ మీద గాయమైనట్టు తెలుస్తోంది. ఐతే ఆ విషయాలను మాత్రం బయటకు రివీల్ చేయలేదు. అఖిల్ సార్థక్ హాస్పిటల్ బెడ్డు మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్టుగా ఒక ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. పొట్ట మీద ఏదో బలంగానే దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది..ఆ దెబ్బలకు కట్టు కట్టినట్టు కనిపిస్తోంది.  ఐతే అసలు ఏం జరిగింది ఏమిటి అనే  విషయం మీద మాత్రం తెలీదు. "చాలా బాగా ట్రీట్మెంట్ జరుగుతోంది. కానీ ఆ విషయాలను మాత్రం ఇక్కడ వివరించలేను. ప్రస్తుతానికి నాకు నయం అవుతోంది..రికవరీ అవుతున్నాను. టైం వచ్చినప్పుడు త్వరలో మీ అందరికీ క్లియర్ గా చెప్తాను నాకు ఏమయ్యింది అనే విషయాన్ని" అంటూ ఒక కాప్షన్ పెట్టాడు. ఐతే బీబీ జోడి ప్రాక్టీస్ టైములో కావొచ్చు లేదా షూటింగ్ టైంలోనే ఏదో జరిగింది అన్న విషయం అఖిల్ వేసుకున్న డ్రెస్ బట్టి అర్ధమవుతోంది. అసలింతకీ తనకు ఏం జరిగిందనే విషయాన్ని అఖిల్ చెప్పే వరకు ఫాన్స్ వెయిట్ చేయక తప్పదు. రీసెంట్ గా అరియానా కూడా బీబీ జోడి డాన్స్ పెర్ఫార్మెన్స్ టైంలో తన చేతికి అవినాష్ వల్ల ఐన గాయాన్ని చూపించి చాలా బాధ పడింది. ఈ బీబీ జోడి షోలో డాన్స్ పెయిర్స్ అంతా కూడా చాలా కష్టమైన డాన్స్ స్టెప్స్ వేస్తున్నారు. దాంతో వాళ్లకు గాయలవుతున్నాయన్న విషయం అర్ధమవుతోంది.

నాకోసం ఏమైనా జోక్స్ చెప్పొచ్చుగా క్యూట్ గా అడిగిన దీప్తి సునైనా

యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. రకరకాల వీడియోస్ తో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ చాలా  బిజీగా ఉంది దీప్తి. లేటెస్ట్ గా ఈమె పెయిటింగ్ వేస్తూ ఒక ఫోటో షూట్ చేసింది. అందులో తన క్యూట్ లుక్స్ తో, అందమైన నవ్వుతో, గోడల మీద బొమ్మలు వేస్తూ చూసే అందరినీ  ఆకట్టుకుంటుంది అమ్మడు. పెయిటింగ్ వేయడమేమో కానీ చిన్నపిల్లల్లా ఒంటినిండా రంగులు పూసుకుని కలర్ఫుల్ హోలీ ముగ్గులా కనిపించింది. ఇప్పుడు మరో ఇన్స్టాగ్రామ్ స్టేటస్ తో సందడి చేసింది. "గైస్...ఏమైనా జోక్స్ చెప్పొచ్చుగా క్యూట్ గా నాకు ప్లీజ్ ? " అని అడిగింది. మరి ఇలాంటి మెసేజ్ చూస్తే ఎవ్వరైనా ఆగుతారా అసలు. రిప్లైస్ బాగా ఇచ్చినట్టున్నారు నెటిజన్స్, ఫాన్స్..ఏమిచ్చారో తెలీదు కానీ "చాలా . కష్టపడి నాకోసం అడగగానే రిప్లైస్ ఇచ్చారు గైస్. మీ అందరి మెసేజెస్ చదివాను. 60 % మంది నేను అందంగా ఉంటానని మెసేజ్ చేశారు..థ్యాంక్యూ గైస్" అంటూ హార్ట్ షేప్, లవ్ షేప్ ఎమోజిస్ తో ధన్యవాదాలు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంటర్టైన్ చేసిన యూట్యూబర్ దీప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య గ్లామర్ షోస్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. కెరీర్ గ్రాఫ్ పెంచుకోవడం కోసం రకరకాల ఫోటో షూట్స్ లో కనిపిస్తూ కవ్విస్తోంది.

ఈ మధ్య నువ్వు చాలా బాగుంటున్నావ్...ఆరియానాకు కాంప్లిమెంట్

అరియనా గ్లోరీ  బిగ్‌బాస్ 4, బిగ్‌బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్‌గా సంద‌డి చేసింది. బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ తో బీబీ కెఫె కూడా చేసింది. హౌస్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్  ఆట‌తీరును   వివ‌రించ‌డ‌మే కాకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక వాళ్ళను  ఇంట‌ర్వ్యూ చేసి వారి ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ ని అందించే బాధ్యతను నిర్వహించింది. అరియనా బిగ్ బాస్ కి దత్త పుత్రికగా మారిపోయింది. ఇక ఈ బిగ్‌బాస్ కేఫ్ పోగ్రామ్‌కు అరియానాతో పాటు మరో హోస్ట్ గా యాంక‌ర్ శివ కూడా చేసాడు. వీళ్ళ జర్నీని చాలా నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. కొంతకాలం వీళ్ళు ఎక్కడా కలిసి కనిపించలేదు. ఇప్పుడు ఆరియానా బీబీ జోడిలో అవినాష్ కి జోడిగా డాన్స్ చేస్తోంది. తన డాన్స్ ప్రాక్టీస్ లో భాగంగా యాంకర్ శివ తనను చూడడానికి వచ్చాడు. వాళ్ళ ముచ్చట్లు వీడియో తీసి ఆరియానా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.."మీకొక విషయం తెలుసా ఈరోజు డాన్స్ ప్రాక్టీస్ క్లాస్ కి ఒక క్రేజీ గెస్ట్ వచ్చాడు. క్రేజీ యాంకర్ శివ..ఎలా ఉన్నావ్" అని అడిగింది. "వీడియోలో మొత్తం నిన్నే కవర్ చేసుకుంటున్నావ్ గా అనేసరికి" ఫ్రేమ్ అందంగా ఉందని" చెప్పింది అరియనా. "ఏంట్రా ఈ మధ్య చాలా అందంగా ఉంటున్నాను కదా" అని అరియనా అనేసరికి " నేనా" అంటూ నవ్వేసాడు శివ. "ఈమధ్య నువ్వు బాగుంటున్నావ్...బాగా తయారవుతున్నావ్...బాగా డాన్స్ చేస్తున్నావ్..అంతా బాగుంది..అల్ ది బెస్ట్ ఆరియానా" అని చెప్పాడు యాంకర్ శివ. బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు శివ.

అత్తాకోడళ్ళకు వాళ్ళ సేఫ్టీ గురించి చెప్పినా రుచించదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -95 లో.. రేవతి దగ్గరికి ముకుంద వచ్చి.. "ఏంటి మీకు బాగోలేదు కదా..‌ కిచెన్ లోకి మీరెందుకు వచ్చారు" అని అడుగుతుంది. "లేదమ్మ నేను ఇప్పుడే వచ్చాను. బ్రేక్ ఫాస్ట్ మొత్తం కృష్ణనే రెడీ చేసింది" అని చెప్పి రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ కాలేజీకి లేట్ అవుతుందని హడావిడిగా వచ్చి టిఫిన్ చేసి మురారిని పిలుస్తుంది. మురారి కాకుండా అందరూ వస్తారు. "ఏంటి అలా అరుస్తున్నావ్" అని భవాని అనగానే.. "అత్తయ్య నాకు కాలేజీకి లేట్ అవుతుంది.. అందుకే ఏసీపి సర్ ని పిలుస్తున్నా" అని చెప్తుంది. అక్కడే ఉన్న ముకుంద.. నీకు కాలేజీకి లేట్ అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళు కృష్ణ. మురారి ఏమైనా  క్యాబ్ డ్రైవరా.. నిన్ను డ్రాప్ చేసి, పిక్ చేసుకోవడానికి అని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ కాలేజీకి లేట్ అవుతుందని ఒక్కతే వెళ్తుంది. "ఏంటమ్మా ముకుంద.. ఎంత మురారి ఏసీపి అయినా వాళ్ళిద్దరూ భార్య భర్తలు. కృష్ణని కాలేజీకి తీసుకెళ్ళి తీసుకొస్తాడు. నువ్వు ఎందుకు అలా అంటున్నావ్" అని మురారి వాళ్ళ బాబాయ్ అంటాడు. దానికి ముకుంద సైలెంట్ గా ఉండిపోతుంది.  మరోవైపు రెడీ అయి వచ్చిన మురారి.. కృష్ణ ఒక్కతే వెళ్ళిపోయిందని తెలుసుకుంటాడు. ఒక్కతే ఎలా వెళ్ళిందని ఆలోచిస్తూ.. కృష్ణకి మురారి ఫోన్ చేస్తాడు. తను బిజీగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో మురారికి ఆలోచనలు ఎక్కువ అయిపోతాయి. ఇక స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ కానిస్టేబుల్ ఒక ఫైల్ తీసుకొచ్చి సంతకం చెయ్యండి‌ సర్ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ పెన్ ను తీసుకొని మురారి తన సంతకం బదులుగా కృష్ణ అని రాస్తాడు. అది చూసిన కానిస్టేబుల్.. "సర్.. మీరు కృష్ణ అని రాసారు" అని చెప్పడంతో ఈ ఫైల్ మార్చి ఇంకొక ఫైల్ తీసుకురమ్మని చెప్తాడు. కాలేజీ అయిపోయాక కృష్ణ ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. లేట్ గా వచ్చిన కృష్ణని చూసిన భవాని.. "ఎందుకు ఇంత లేట్ అయింది" అని అడుగుతుంది. కాలేజీలోనే లేట్ అయిందని కృష్ణ  అనగానే.. క్యాబ్ బుక్ చేసుకొని త్వరగా రావాలని తెలియదా అని భవాని అంటుంది. పక్కనే ఉన్న ముకుంద.. కృష్ణ, రేవతిలను ఉద్దేశించి.. అత్తాకోడళ్ళకు వాళ్ళ సేఫ్టీ గురించి చెప్పినా రుచించదని భవానీతో అంటుంది. నన్ను భవాని అత్తయ్య అడిగింది.. ఆమెకు సమాధానం చెప్పాను కదా.. నీకెందుకు చెప్పాలని ముకుందకి కృష్ణ వార్నింగ్ ఇస్తుంది. సరే పెద్ద అత్తయ్య రేపటి నుండి త్వరగా వస్తానని చెప్పి కృష్ణ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జాబ్ మానేసి కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన శివజ్యోతి!

బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక సెలబ్రిటీ లిస్ట్ లోకి చేరిపోయిన వారిలో శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఒకరు.. . ఫ్యాన్స్ అందరూ ప్రేమగా పిలుచుకునే పేరు జ్యోతక్క. మొదట టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన శివ జ్యోతి.. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని.. ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. మోస్ట్ ఎమోషనల్ గా సాగిన శివ జ్యోతి బిగ్ బాస్ జర్నీకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంతంగా శివ జ్యోతి ఫేట్ మారిపోయింది. వరుస ఆఫర్స్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీ లైఫ్ గడుపుతుంది. ప్రతి పండుగ ఈవెంట్స్ లలో శివ జ్యోతి సందడి చేస్తుంది. శివజ్యోతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో‌ షేర్ చేస్తుంది. రీసెంట్ గా జరిగిన తన పుట్టినరోజు వేడుకలను దుబాయ్ లో జరుపుకుంది. ఆ ఫొటోస్ ని షేర్ చేసింది. అయితే తాజాగా జాబ్ మానేసి 'జ్యోతక్క ముచ్చట్లు'  పేరుతో కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది శివజ్యోతి. కాగా ఆ ఛానల్ ప్రమోషన్స్ ని భారీగా చేస్తోంది. సినిమా రేంజ్ లో ప్రమోషన్ ప్లాన్ చేసింది శివ జ్యోతి. ఆ ప్రమోషన్స్ ని అన్నింటిని తన ఛానెల్ లో  "నా బలం మీరే నా బలగం మీరే "అనే కాప్షన్ తో అప్లోడ్ చేసింది. శివజ్యోతి అప్లోడ్ చేసిన ఆ వీడియో చూసిన తన ఫ్యాన్స్.. "అల్ ది బెస్ట్ అక్క" అంటూ విష్ చేస్తున్నారు.. ఇప్పటికే శివజ్యోతి తన మాటతీరుతో ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ తో వచ్చిన శివజ్యోతిని ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారో చూడాలి మరి!

స్త్రీ సంగీతం లాంటిది.. స్త్రీ లేని రోజు లేదు!

సరిగమప ఛాంపియన్ షిప్ ఈవారం ఉమెన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సహజ నటి జయసుధ గారు ఎంట్రీ ఇచ్చారు. అలాగే "పులి-మేక" వెబ్ సిరీస్ టీమ్ నుంచి లావణ్య త్రిపాఠి, సిరి హన్మంత్, కోన వెంకట్ కూడా వచ్చారు. "విమెన్ అనేది సంగీతం లాంటిది..వితౌట్ విమెన్ దేర్ ఈజ్ నో డే" అని జయసుధ చెప్పారు. ఈ షోలో జడ్జి మనో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు వాళ్ల అమ్మ గుర్తొచ్చారట. " మా అమ్మ స్టేజి యాక్ట్రెస్..మా నాన్న హార్మోనియం వాయిస్తూ ఉంటారు. మా అమ్మ సత్యభామగా నటిస్తూ ఉంటే మా నాన్న హార్మోనియం వాయిస్తూ దాని మీద ఒక దిండు పెట్టి అక్కడ నన్ను పాడుకోబెట్టుకునేవారట..ఇలాంటి తల్లితండ్రులు ఎక్కడ దొరుకుతారు" అని అన్నారు. ఇక పులి-మేక టీమ్ నుంచి లావణ్యతో "హ్యాపీ బర్త్డే సాంగ్" పాడించాడు యాంకర్ ప్రదీప్. దాంతో "ఎంత ఎదిగిపోయావమ్మా" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత లావణ్య మాట్లాడుతూ "నాకు చాలా మంది చెప్పారు..ప్లీజ్ పాడొద్దు" అన్నారు. "వాళ్లెవరో కానీ చాలా మంచి మాట చెప్పారని" ఫన్ క్రియేట్ చేసాడు ప్రదీప్. ఇక రేణుకుమార్ తన కూతురు కోసం "ఆటల పాటల పుత్తడి బొమ్మరా" సాంగ్ పాడి అందరినీ మెస్మోరైజ్ చేసాడు. అతని సాంగ్ కి లావణ్య ఫిదా ఐపోయింది. "మీ వాయిస్ చాలా స్మూత్ గా తియ్యగా ఉంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక ప్రదీప్ రేణుకుమర్ కూతురు కోసం ఒక బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇలాంటి స్టేజి మా అమ్మకు విషెస్ చెప్పకపోతే ఇంటికెళ్ళాక నాకుంటుంది అంటూ ప్రదీప్ ఈ స్టేజి మీద నుంచి వాళ్ల అమ్మకు, అక్కకు ఉమెన్స్ డే విషెస్ చెప్పాడు.

హన్సిక లవ్ షాది డ్రామా నాల్గవ ఎపిసోడ్!

హన్సిక సోహెల్ ల పెళ్ళికి సంబంధించిన అన్ని విషయాలతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రతీ శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ తో 'హన్సిక లవ్ షాది డ్రామా' సిరీస్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ లో.. హన్సిక పెళ్ళిలో హార్స్ పోల్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేస్తారు హన్సిక మేనేజర్ అండ్ సోహెల్ మేనేజర్. వాటికోసం చాలా ప్రయత్నిస్తుంటారు. హార్స్ పోల్ లో ఆడటానికి గుర్రాలు లేవని, ప్లేయర్స్ రేస్ కోసం వెళ్ళారు.. ఇప్పుడు సీజన్ నడుస్తుందని వాళ్ళు చెప్పడంతో.. హన్సిక మేనేజర్ ఏం చెయ్యలేకపోతాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా అక్కడ వారు ఒప్పుకోరు. శ్రీయా హన్సిక క్లోజ్ ఫ్రెండ్.. హన్సిక లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని సోహెల్ చెప్పాడు. శ్రీయా పెళ్ళికి రావడానికి వీలు కాదు అని వీడియో కాల్ చేసి చెప్పడంతో కాల్ కట్ చేస్తుంది హన్సిక. ఆ తర్వాత హన్సిక పెళ్ళిరోజు ధరించే డ్రెస్ కోసం ఢిల్లీలోని ఒక ఫేమస్ డిజైనర్ షాప్ లో చేయిస్తుంటారు. అవి చాలా ఖరీదైనవి. ఆ తర్వాత తన అసిస్టెంట్ భావన దగ్గరికి వెళ్తాడు సోహెల్. పెళ్ళికి ముందు తనతో ఒక డ్యాన్స్ చేస్తానని చెప్పగా.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన పాట ఒకటి ఉంది అని భావన చెప్తుంది. దానికి సోహెల్ షాక్ అవుతాడు. హార్స్ పోలో వీలుకాకుంటే మనకు ఉన్న సెకండ్ ఆప్షన్ క్యామెల్ పోలో అని సోహెల్ మేనేజర్ తో రాజస్థాన్ లోని ఈవెంట్ మేనేజర్ చెప్తాడు. దానికి అతను సరైనదే కానీ హన్సిక, సోహెల్ దీనికి ఒప్పుకుంటారా అని చెప్పి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. హన్సిక వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. "మీకు ఆ రోజే చెప్పాం కదా.. హన్సిక ఒక్కసారి చెప్పిందంటే అది ఫైనల్ దీనిలో ఏ మార్పు లేదు. హార్స్ పోల్ ఉండాల్సిందే.. మీరు గుర్రాలని ఢిల్లీ నుండి అయినా అర్జెంటినా నుండి అయినా తీసుకురండి" అని హన్సిక మేనేజర్ దిగ్విజయ్ తో  మాట్లాడుతుంది హన్సిక అమ్మ. ఆ తర్వాత పెళ్ళి కోసం తన బట్టలను ప్యాక్ చేసుకుని హన్సిక వెళ్తుంటే వాళ్ళ అమ్మ "ఎందుకమ్మ ఇన్ని బట్టలు.. కొన్ని తీసుకెళ్ళు"  అని చెప్పగా.. నాకు తెలుసమ్మా అని హన్సిక అంటుంది. పెళ్ళి అయ్యాక మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళాలంటే, అన్నయ్యతో గొడవపడకుండా ఉండాలనే ఆలోచనే నన్ను బాధపెడుతుందని హన్సిక చెప్పింది. అలా చెప్తూ ఏడ్చేసింది హన్సిక. ఆ తర్వాత రాజస్థాన్ లోని ముందోట ఫోర్ట్ అండ్ ప్యాలెస్ కి  వెళ్ళారు. అక్కడ పెళ్ళి కోసం చేసిన ఏర్పాట్లను అందరూ ఆసక్తికరంగా చూసారు. ఈ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. 

పెళ్ళిపీటల మీద కూర్చుంది కావ్య అని కనిపెట్టిన కృష్ణమూర్తి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-34 లో.. స్వప్న పెళ్ళి టైంకి జంప్ అవుతుంది. రుద్రాణి ఒక ప్లాన్ వేసి పెళ్ళికూతురుగా కావ్యని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టడానికి కనకంతో మాట్లాడుతుంది. దాంతో కనకం కావ్యని ఒప్పిస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ ఇంకా పెళ్ళి కూతురు రావట్లేదని ఎదురుచూస్తారు. ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళంతా వెళ్లిపోతుండగా.. కావ్యకి ముసుగువేసి కనకం తీసుకొస్తుంది. అప్పుడు రాజ్ కూల్ అయి పెళ్లి పీటలపై కూర్చుంటాడు. ఇక రాజ్ పిన్ని ముసుగుతో వచ్చిన కావ్యని చూసి.. "ఏంటి ఈ ముసుగు" అని అడుగుతుంది. ఇది మా ఇంటి ఆచారమని కనకం చెప్తుంది. పెళ్ళితంతు మొదలవుతుంది. ఆ తర్వాత కాళ్ళు కడిగే టైంకి అక్కడ కూర్చున్నది స్వప్న కాదు కావ్య అని కృష్ణమూర్తి తెలుసుకుంటాడు. ఇక పక్కనే ఉన్న కనకం.. "ఏం మాట్లాడొద్దు" అని కృష్ణమూర్తిని సైలెంట్ గా ఉండమని చెప్పి కవర్ చేస్తుంది. మరోవైపు రాహుల్, స్వప్న ఇద్దరు కలిసి కార్ లో వెళ్తూ ఒకరి గురించి ఒకరు మనసులో అనుకుంటారు. స్వప్న కోటీశ్వరుల కుమార్తె.. తన ఆస్తి మొత్తం నాకే అని అనుకుంటాడు రాహుల్. అలాగే స్వప్న కూడా అనుకుంటుంది. దగ్గరలో వచ్చే గుడి దగ్గర స్వప్న కార్ ఆపమని.. గుడిలో పెళ్లి చేసుకుందామని అంటుంది. మరోవైపు కనకం చేసిన పనికి కృష్ణమూర్తి మండిపడుతాడు. ఇప్పటికే నీ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి కావ్య కష్టపడుతుంది. ఇప్పుడు దానికి ఆ రాజ్ అంటే పడదు.. అప్పు, స్వప్నని తీసుకురాకుంటే కావ్య పరిస్థితి ఏంటి? నేను వెళ్ళి అందరికి నిజం చెప్తానని కృష్ణమూర్తి వెళ్తుంటాడు.. "మీరు నిజం చెప్తే నేను ఉరేసుకొని చనిపోతా" అని బెదిరిస్తుంది. దాంతో కృష్ణమూర్తి సైలెంట్ గా ఉండిపోతాడు. మరోవైపు రాహుల్ చెప్పే మాయ మాటలు నమ్ముతూ ఇంకా మోసపోతూనే ఉంటుంది స్వప్న. పెళ్లి గుడిలో కాకుండా నేను హై లెవెల్ లో చేసుకోవాలనుకుంటున్నా అని రాహుల్ అనడంతో స్వప్న ఎంతో సంతోషంగా ఓకే అంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్య ఇద్దరు ఒకరి తలమీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఇక పెళ్ళి టైంకి అప్పు, స్వప్నని తీసుకొస్తుందా? లేక రాజ్, కావ్యనే పెళ్లి చేసుకుంటాడా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తనని భార్యగా ఒప్పుకోనని చెప్పిన రిషి.. షాకైన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-701 లో.. రిషి తన పట్టుదలతో వసుధారని బాధపెడుతూనే ఉంటాడు. "నీకు నువ్వుగా వేసుకున్న తాళికి నన్ను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు. అందరి ముందు నువ్వు తలదించుకోవద్దని అలా చెప్పానంతే" అని రిషి అంటాడు. దాంతో వసుధార ఎమోషనల్ గా బయటకెళ్తుంది. జగతి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. వసుధార ఎందుకు ఏడుస్తుందో జగతికి అర్థం కాదు. మేడం నన్ను ఇంటి దగ్గర దింపండని వసుధార అనగానే.. జగతి సరేనని ఒప్పుకొని కార్ లో తీసుకెళ్తుంది. మరోవైపు రిషి దగ్గరికి మహేంద్ర వచ్చి చాలా సంతోషంగా.. "రిషి మనం పార్టీ చేసుకుందాం" అని అంటాడు. ఎందుకు డాడ్ అని రిషి అడుగుతాడు. నువ్వు వసుధార కలిసిపోయారుగా అందుకే అని మహేంద్ర అనగానే.. "నేను అందరి ముందు ఒప్పుకున్నది అందుకు కాదు. వసుధార అందరిముందు తల దించుకోకూడదనే చెప్పాను. వసుధార మెడలో తాళికి మాత్రమే నేను కారణం. నన్ను భర్తగా అనుకొని తన మెడలో తాళి వేసుకుంది. కాని తనని భార్యగా నేను ఒప్పుకోవట్లేదు" అని మహేంద్రతో రిషి అంటాడు. "ఏంటి రిషి అలా మాట్లాడుతున్నావ్? ఇంకా వసుధారని ఎప్పుడు క్షమిస్తావ్? వసుధారతో ఇదంతా అన్నావా" అని మహేంద్ర అడిగేసరికి.. చాలా క్లారిటీగా చెప్పాను డాడ్ అని రిషి చెప్పి.. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జగతి కార్ వెనకాలే రిషి వెళ్తాడు. జగతి కార్ ని రిషి తన కార్ తో దాటేసి వాళ్ళని కార్ ఆపమని చెప్తాడు. వాళ్ళు కార్ ఆపిన తర్వాత అందులో ఉన్న వసుధార దగ్గరికి వెళ్ళి.. "నాకు చెప్పకుండా కాలేజీ నుండి ఎందుకు వచ్చావ్ వసుధార" అని రిషి అడుగుతాడు. సర్ నాకు తలనొప్పిగా ఉందని వసుధార అనడంతో.. నాకు చెప్పాలి కదా అని రిషి అంటాడు. అప్పుడే ఫోన్ తీసుకొని లీవ్ అని రిషికి మెసేజ్ చేస్తుంది. నేను మాట్లాడాలని రిషి అంటాడు. నాకేం మాట్లాడాలని లేదు బై అని వసుధార చెప్పడంతో రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక వసుధార, జగతిలు కూడా వెళ్ళిపోతారు. రిషి ఇంటికెళ్ళగానే.. తనని చూసిన దేవయాని రిషితో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏంటి పెద్దమ్మ అలా వెళ్తుందని దేవయాని దగ్గరికి వెళ్తాడు రిషి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మేమేమీ జాతకాలు చూపించలేదు...

లాస్య-మంజునాథ్ బుల్లితెర మీద మంచి హిట్ పెయిర్ అన్న విషయం అందరికీ తెలుసు. లాస్య ఆల్రెడీ యాంకర్ గా ఫుల్ ఫేమస్ పర్సన్. ఇక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్న మంజునాథ్ కూడా ఈమధ్య బాగా ఫేమస్ అయ్యారు. షోస్ కి ఈ జంట వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు లాస్య ప్రెగ్నెంట్ కాబట్టి ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ అప్ లోడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. "లాస్య టాక్స్" యూట్యూబ్ ద్వారా తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఈ జంట చాల క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చారు. " లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్..ఏది బెటర్" అనేసరికి "ఏదీ కాదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు".. టోటల్ లైఫ్ లో ఏ రిలేషన్ చాలా బెస్ట్ అన్న ప్రశ్నకు "పెట్ తో ఉండే రిలేషన్ చాలా బెస్ట్..అలాగే మదర్ అండ్ బేబీ రిలేషన్ చాలా ప్యూర్ గా ఉంటుంది" అని చెప్పాడు. "మీ పెళ్ళికి ముందు జాతకాలు అవీ చూపించారా ?" అనేసరికి "లవ్ మ్యారేజ్ కాబట్టి అలాంటివి ఏమీ చూపించలేదు" అని చెప్పారు. "అక్కా మీరు డెస్టినీని నమ్ముతారా" అన్న ప్రశ్నకు "బాగా నమ్ముతాను..ఇలాంటి హస్బెండ్ దొరకడం నా డెస్టినీ" అని చెప్పింది లాస్య. "మీరిద్దరూ గొడవ పడినప్పుడు ముందు ఎవరు మాట్లాడతారు" అనేసరికి "నేనే మాట్లాడతాను" అని చెప్పాడు మంజు. "రిలేషన్ మనీ అవసరమా" అన్న ప్రశ్నకు "డబ్బు ఉండాల్సిందే..డబ్బు లేకుండా ఏదీ లేదు" అని చెప్పారు. "మీ లవ్ మ్యారేజ్ కి మీ ఫామిలీ మెంబెర్స్ ని ఎలా కన్విన్స్ చేశారు" అనేసరికి "ఫామిలీ మెంబర్స్ ని కన్విన్స్ చేయడం పెద్ద టాస్క్. కొంచెం టైం తీసుకోండి. మీరు సెటిల్ ఐతే పేరెంట్స్ ఒప్పుకుంటారు." అని చెప్పారు. "నా  కోసం చాలా కష్టపడతాడు..నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. మా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా చూసుకుంటారు. మేం ఎన్ని గొడవలు పడినా మా మధ్య అంత క్యూట్ బాండింగ్ అనేది ఉంటుంది." అని చెప్పారు లాస్య-మంజునాథ్.

మేం ఆర్టిస్టులం కాకపోయి ఉంటే ఆ ఫీల్డ్స్ లో ఉండేవాళ్ళం...

జానకి కలగనలేదు సీరియల్ సెట్ లో యూట్యూబర్ లోల నరేష్ ఒక వెరైటీ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేసాడు. "ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏం అయ్యేవారు ? " అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆర్టిస్టులను ఫాలో అయ్యే ఫాన్స్ లో, ఆడియన్స్ లో ఆ డౌట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంగా ఈ సీరియల్ ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పారు. " నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే లాయర్ అయ్యి చెట్టు కింద ప్లీడర్ లా కూర్చుని అన్ని కేసులు వాదించేవాడిని..మొదట్లో టిప్పర్ లారీ డ్రైవర్ అవ్వాలని ఉండేది ఎందుకంటే డ్రైవింగ్ అంటే ఇష్టం కాబట్టి.. " అని చెప్పాడు అమరదీప్. "నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే సినిమాటోగ్రాఫర్ ని అయ్యేవాడిని" అని చెప్పాడు మరో ఆర్టిస్ట్ అఖిల్. "నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే టెర్రరిస్టు అయ్యేది" అంటూ నటి భవిష్య చేత చెప్పించారు మిగతా సీరియల్ యాక్టర్స్. ఐతే తనకు మాత్రం ఛార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని ఉండేదని చెప్పింది.  "నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే ఎయిర్ హోస్టెస్ కానీ డాక్టర్ కానీ పోలీస్ కానీ అయ్యుండేదాన్ని" అని చెప్పింది సీరియల్ హీరోయిన్ అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్. ఇక లోలా నరేష్ ని కూడా ఇదే ప్రశ్న అడిగింది ప్రియాంక " ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే వెటర్నరీ డాక్టర్ అయ్యేవాడిని ఎందుకంటే నాకు పశువులు అంటే ఇష్టం" అని చెప్పాడు. ఇలా ఈ సీరియల్ యాక్టర్స్ అంతా ఏం అవ్వాలనుకుని ఏం అయ్యారో చెప్పారు.

యూట్యూబ్ వ్యూస్ కోసం అలాంటి పని చేసిన రాఘవ

జబర్దస్త్ ప్రతీ వారం సరికొత్తగా నవ్విస్తూ ఫుల్ మస్తీ చేస్తోంది. యూట్యూబ్ ఛానల్ లో సబ్జక్ట్స్ ఏమీ దొరక్క వ్యూస్ కోసం చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తూ దొరికిన వాటినన్నిటినీ వీడియోస్ చేసి పోస్ట్ చేసేస్తున్నారు. దీన్నే కాన్సెప్ట్ గా తీసుకుని రాబోయే జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ ఒక స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. టీం లీడర్స్ అంతా లేడీ గెటప్స్ లో వచ్చి ఎంటర్టైన్ చేశారు. నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక రాకెట్ రాఘవ రావడమే "అహా నా పెళ్ళియంటా" సాంగ్ పాడుకుంటూ వచ్చాడు. "నా యూట్యూబ్ కి మంచి పేరు, వ్యూస్ రావాలని చెప్పి నేను పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చాను..ఆ అబ్బాయంటే నాకు ఇష్టం లేదు అనుకుంటున్నారేమో...వాడు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో నాకు తెలీదు కానీ నేను ఏడిస్తే మాత్రం మాత్రం మా వాళ్ళు వాడిని చంపేస్తారు...మూతి మీద మీసం లేని మగాడా...చింపిరి జుట్టు మగాడా" అంటూ వెరైటీ డైలాగ్స్ తో స్కిట్ ని రక్తి కట్టించాడు. ఇక శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో వచ్చి డైలాగ్ చెప్పి బాబోయ్ అనిపించాడు.." హలో బాస్మతి..కేజీ 60 ఒకటే బస్తా..ఆర్గానిక్ పిల్లా" అనేసరికి "అదేంటి హైబ్రిడ్ పిల్ల" కదా అని మరో కమెడియన్ అనేసరికి " నా ఒంట్లో ప్రతీది ఆర్గనిక్కే ఫ్రెష్షు" అన్నాడు శాంతిస్వరూప్. నూకరాజు, తాగుబోతు రమేష్, వెంకీ మంకీస్ అంతా నల్లా దగ్గర నీళ్లు పట్టుకుంటూ గొడవ పెట్టుకుంటారు. ఈ స్కిట్స్ అన్నీ కూడా వచ్చే వారం అలరించడానికి రాబోతున్నాయి.

ఓ వైపు పులి... మరోవైపు అషు రెడ్డి... రాహుల్ రచ్చ రచ్చ!

రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమయ్యాడు. అతడు పాడిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట ఎంత పాపులార్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఈ పాటకి గాను ఆస్కార్ అవార్డ్ కూడా అతడిని వరించింది. అయితే తాజాగా అతను దుబాయ్ కి వెళ్ళాడు. అషురెడ్డి, రాహుల్  కలిసి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వీళ్ళు ఇద్దరే కాకుండా ఇండియా నుండి ఇంకా కొంతమంది సెలబ్రిటీలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దుబాయ్ లో సెలబ్రిటీ రీయూనియన్ పేరుతో ఒక ఈవెంట్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందులో పాల్గొనేందుకే రాహుల్ సిప్లిగంజ్ వెళ్ళాడు. గత వారం నుండి రోజుకొక బ్యూటీతో ఫొటోస్ దిగుతూ రీల్స్ చేస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. పలు సినిమాలలో పాటలు పాడుతూ బిజీగా ఉంటున్న రాహుల్.. ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఆ వీడియోలో పులి కూడా ఉండబోతున్నట్లుగా వన్ మినిట్ ఇన్ స్టా మ్యూజిక్ రీలీజ్ చేసాడు.  దుబాయ్ రీయూనియన్ కోసం వెళ్ళిన రాహుల్ సిప్లిగంజ్.. పులితో కలిసి చేసిన రీల్‌తో పాటు జెన్నీఫర్ ఇమాన్యుయల్ తో చేసిన  రీల్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. కాగా ఇప్పుడు ఈ రీల్ కూడా ట్రెండింగ్ లో ఉంది. రీయూనియన్ పేరుతో జల్సాలు చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాడు.

మురారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -94 లో.. మురారితో మాట్లాడుతుంటుంది ముకుంద. నీ అగ్రిమెంట్ భార్య ఈ మధ్య హద్దులు దాటుతుందని ముకుంద అనడంతో.. "హద్దులు అంటే ఏంటి" అని మురారి అడుగుతాడు. లిమిట్స్ అని ముకుంద చెప్తుంది. అవునా మరి లిమిట్స్ అంటే ఏంటి? మా శోభనం రోజున నువ్వు మా గది డోర్ కొట్టడమా అని మురారి అనేసరికి.. ముకుంద షాక్ అవుతుంది. "మాది అగ్రిమెంట్ మ్యారేజ్ కావచ్చు.. ఒకవేళ కృష్ణ వెళ్ళిపోయినా కూడా.. కృష్ణ నా భార్య అనే చెప్తాను. నేను తనకే సపోర్ట్ చేస్తాను" అని ముకుందకి వార్నింగ్ ఇస్తాడు మురారి. మరుసటి రోజు భవాని ఇంట్లో పని చేశాకే కాలేజీకి వెళ్ళాలని చెప్పింది గుర్తుచేసుకొని కృష్ణ ఉదయన్నే నిద్ర లేస్తుంది. తన గదిలోకే కూరగాయలు అన్నీ తెచ్చుకొని కట్ చేస్తుంది. ఆ కూరగాయలు కట్ చేసే చప్పుడు కి లేచిన మురారి.. "ఏంటి ఇక్కడ కట్ చేస్తున్నావ్" అని అడుగుతాడు. లేదు ఏసీపి సర్.. పెద్ద అత్తయ్య ఇంట్లో పని చేసే కాలేజీకి వెళ్ళమని చెప్పింది. మా గౌతమ్ సర్ ఏమో రెండు ఫైల్స్ రాసుకొని రమ్మని చెప్పాడు అని చెప్తుంది. ఆ తర్వాత ముకుంద చేసిన గొడవ అంతా మురారికి చెప్తుంది కృష్ణ.. "సరే కృష్ణ నేను రాస్తాను.. నువ్వు వంట చెయ్" అని మురారి అంటాడు. లేదు ఏసీపి సర్.. మా సీనియర్ డాక్టర్ చేతివ్రాత గుర్తుపడితే నా తలరాత మారుస్తాడని కృష్ణ చెప్తుంది. సరే నేను వెజిటేబుల్స్ కట్ చేస్తా అని మురారి కట్ చేస్తుండగా కూరగాయల ముక్కలన్ని కూడా ఒక్కొక్క వైపు పడిపోతుంటాయి. అది చూసి కృష్ణ.. నేను కట్ చెయ్యడం నేర్పిస్తానని చెప్పి.. మురారి చెయ్యి పట్టుకొని నేర్పిస్తుంది.. ఇక అలాగే మళ్ళీ పడుకున్న మురారిని కృష్ణ లేపి ఒక గిఫ్ట్ ఇస్తుంది. "ఏంటి కృష్ణ నీకు డాక్టర్ కోట్ ఇచ్చానని రివెంజ్ తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావా" అని మురారి అంటాడు. అదేం లేదు సర్ నేను వెళ్ళిపోయాక మీరు ఇచ్చిన గిఫ్ట్ నాతోనే ఉంటుంది. నేను ఇచ్చిన గిఫ్ట్ మీతో ఉంటుందని కృష్ణ సమాధానమిస్తుంది. కృష్ణ నువ్వు మాటిమాటికి వెళ్ళిపోతా అని అనకు అని  చెప్పి మురారి డల్ అవుతాడు. ఆ తర్వాత మురారి గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో గ్రీన్ కలర్ పెన్ ఉంటుంది. అది చూసి ఈ పెన్ ఏంటి కృష్ణ అని అడుగుతాడు మురారి. మీరు ఏసీపి కదా సర్.. మీరు సంతకం చేయవలసి వస్తే దీంతో చెయ్యండని కృష్ణ చెప్తుంది. కాలేజీకి లేట్ అవుతుంది సర్.. త్వరగా రెడీ అవ్వండని కృష్ణ అనగానే.. మురారి వెళ్ళి స్నానం చేసి వస్తాడు. అలా వచ్చాక కృష్ణ ఒక టవల్ తో తన తల తుడుస్తున్నట్టుగా భావిస్తాడు మురారి. ఆ తర్వాత మళ్ళీ మాములు అయి.. ఏంటి నేను ఇలా ఉహించుకుంటున్నానా అని తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజ్ తో పెళ్ళిపీటల మీద కూర్చోడానికి ఒప్పుకున్న కావ్య!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న  సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -33 లో.. స్వప్న లేచిపొయిందని తెలిసి కనకం, కావ్య, అప్పులు బాధపడుతుంటారు. మరోవైపు పెళ్ళి సమయం దగ్గర పడుతుంది. ఇంకా పెళ్ళి కూతురు రాలేదేంటని అక్కడికి వచ్చినవాళ్ళందరు  అనుకుంటారు. నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి రుద్రాణి వెళ్తుంది.  రుద్రాణి గదిలోకి వెళ్లేసరికి.. స్వప్న ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదంటూ కనకం  బాధపడుతుంటుంది. ఈ మాటలు డోర్ దగ్గర ఉండి రుద్రాణి వింటుంది. ఆ మాటలు విని.. పెళ్ళికూతురు లేచిపోయిందా? ఈ పెళ్లి జరుగుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యానని మనసులో అనుకుంటుంది. ఇక లోపల ఉన్న కనకం వాళ్ళ దగ్గరికి వచ్చి.. స్వప్న ఎక్కడ అని అడుగుతుంది. వస్తుందని కనకం అనగా.. లేచిపోయిన స్వప్న ఎక్కడ నుండి వస్తుందని రుద్రాణి అంటుంది. అలా అనగానే తనకెలా తెలుసని కనకంతో పాటు స్వప్న, అప్పులు ఆశ్చర్యపోతారు. ఏం చేయమంటారు అమ్మ అంటూ బాధపడుతుండగా.. దుగ్గిరాల ఫ్యామిలీకి కాబోయే కోడలు కోసం ప్రెస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీ వల్ల మాకు ఒక మచ్చ వచ్చేలా ఉంది. ఇన్నిరోజులు ధనవంతురాలు అని ముసుగు వేసుకున్నావ్ కదా.. ఇప్పుడు నీ ఇంకొక కూతురుకి ముసుగు వేసి పెళ్ళిపీటలపై కుర్చోపెట్టని రుద్రాణి అంటుంది. అలా తను అనగానే.. మొదట కనకం ఒప్పుకోదు. ఇక చేసేదేం లేక ఒప్పుకుంటుంది. అయితే  కావ్య  మాత్రం ఒప్పుకోదు. కనకం బ్రతిమాలేసరికి సరే అని ఒప్పుకుంటుంది. పెళ్ళిపీటల మీద మాత్రమే కూర్చుంటాను.. "అప్పు.. నువ్వు వెళ్ళి పెళ్ళి టైం వరకి అక్కని వెతికి తీసుకురా" అని కావ్య అంటుంది. దానికి అప్పు సరేనని వెళ్తుంది. ఇక అప్పు, స్వప్న ని వెతికి తీసుకొస్తుందో లేదో.. కావ్యతో రాజ్ పెళ్ళి అవుతుందో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధార మెడలో తాళిపడటానికి కారణం నేనే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -700 లో.. వసుధార మెడలో తాళి పడడానికి కారణం రిషి అని చెప్తుంది జగతి. అప్పుడే ప్రెస్ మీటింగ్ కి వచ్చిన రిషిని చూసిన దేవాయని.. "రా నాన్న రిషి జగతి ఏదో మాట్లాడుతుంది. అది అబద్ధమని చెప్పు" అని అనగానే.. రిషి స్టేజి మీదకి వెళ్ళి.. "ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు.. కానీ జగతి మేడం చెప్పిన మాటలన్నీ నిజాలే" రిషి అనగానే.. దేవయాని షాక్ అవుతుంది. వసుధార, జగతి ఇద్దరు హ్యాపీగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వసుధార మెడలో తాళి పడడానికి కారణం నేనే.. కానీ అ విషయం నా పర్సనల్.. అది ప్రెస్ ముందు డిస్కస్ చెయ్యడం కరెక్ట్ కాదు.. ఇంకా ఈ ప్రెస్ మీట్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాత్రమే.. దీని గురించిన విషయాలు వసుధార మాట్లాడుతుందని చెప్తాడు రిషి. రిషి మాటలు విన్న దేవయాని కోపంతో అక్కడ నుండి వెళ్తుండగా.. రిషి తన వెనకాలే వెళ్ళి.. పెద్దమ్మ ఆగు అని చెప్పిన వినకుండా వెళ్తుంటుంది. చిన్నప్పటి నుండి పెంచాను.. ఇప్పుడు నాకు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్ అని దేవయాని అంటుంది. పెద్దమ్మ నీకు జరిగిందంతా చెప్తాను.. కొంచెం నన్ను అర్థం చేసుకోండని రిషి అంటాడు. ఇంకా ఎక్కువ బెట్టు చేస్తే బాగోదని భావించిన దేవయాని.. సరే నాన్న రిషి.. నిన్ను అర్ధం చేసుకున్నాను అన్నట్టుగా మాట్లాడి ఫణింద్రతో కలిసి వెళ్ళిపోతుంది. మరోవైపు అందరి ముందు నన్ను భార్యగా ఒప్పుకున్నాడన్న సంతోషంలో వసుధార రిషి క్యాబిన్ దగ్గర ఉన్న హార్ట్ సింబల్ ని పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అక్కడికి రిషి వచ్చి.. "ఏంటి హ్యాపీగా ఉన్నావ్" అని అంటాడు. మీరు నా భర్త అని ఒప్పుకున్నారు కదా సార్ అని వసుధార అనగానే.. నీకు నేను భర్తనని చెప్పాను కాని నువ్వు నా భార్యవని చెప్పలేదు కదా అని అంటాడు. అందరిలో నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తే.. నీ బాధని నా బాధగా భావించి ఒప్పుకున్నాను అని రిషి అంటాడు. మరి అది నిజం కాదంటారా సర్ అని వసుధార అంటుంది. నిజమే నీ ఇష్టానికి నువ్వు తాళి నన్ను ఊహించుకొని వేసుకున్నావ్.. నా ప్రమేయం లేకుండా నీకు నచ్చినట్లు మలుచుకున్నావ్.. అని రిషి తప్పు పడుతూనే ఉంటాడు. వసుధార ఎంత అర్థం అయ్యేలా చెప్పిన రిషి వినిపించుకోడు. ఇక రిషి, వసుధారని తన భార్యగా అంగీకరిస్తాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆమె వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను...ఆదిరెడ్డి

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. విమెన్స్ డే సందర్భంగా రాబోతున్న ఈ ఎపిసోడ్ మంచి కలర్ ఫుల్ గా అంతే ఎమోషనల్ గా ఉంది. ఇందులో మానస్ వాళ్ళ అమ్మతో, తేజు వాళ్ళ అమ్మతో, ప్రభాకర్ తన కూతురితో, ఆదిరెడ్డి వాళ్ళ చెల్లెలితో, నటరాజ్ మాస్టర్ తన భార్య, కూతురితో, ఆర్జే చైతు తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్ తో కలిసి ఈ స్టేజి మీదకు వచ్చారు. మానస్ వాళ్ళ అమ్మ చూడడానికి ఒక పెద్ద సెలెబ్రిటీల ఉన్నారని శ్రీముఖి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. "మానస్ వాళ్ళ అమ్మ ఓల్డ్ జనరేషన్, కేజీఎఫ్ మమ్మీ అనుకుంటున్నారేమో..కానీ పద్మిని గారు లేటెస్ట్ జనరేషన్ " అంటూ పొగడ్తలతో ముంచెత్తి ఆమెతో డాన్స్ చేయించింది.  ఆదిరెడ్డి తన చెల్లి గురించి చెప్పాడు. ఆమెకు చూపు లేదు. ఆమె పెన్షన్ డబ్బుతోనే తాను  బెంగళూరు వెళ్లినట్లు ఆమె పెన్షన్ డబ్బుతోనే  యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఆమె వల్లనే తాను ఇక్కడి వరకు వచ్చినట్లు చెప్పాడు. ఇప్పుడు ఆమెను ఈ స్టేజి మీద నిలబెట్టాను అంటూ గర్వంగా చెప్పాడు.  తమ  ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఇద్దరు అబ్బాయిలు అంతా ఆడవాళ్ళ డామినేషన్  అని ఆదిరెడ్డి అనేసరికి "మేము మీకంటే ఎందులోనూ తక్కువ కాము..ఆడపిల్లలం" అని స్ట్రాంగ్ గా కౌంటర్ వేసింది ఆదిరెడ్డి చెల్లి. " ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఏది వచ్చినా ఫేస్ చేయాలి ఇవన్నీ నేను నేర్చుకున్నది అమ్మ దగ్గరే..నాకొక బెస్ట్ ఫ్రెండ్ అంటే అది మా అమ్మే" అని చెప్తాను అంది తేజస్విని వాళ్ళ అమ్మ గురించి. తర్వాత తేజు "సిరిమల్లె మువ్వా..నా వాడు ఎవరే" అనే సాంగ్ కి డాన్స్ చేసేసరికి "ఏంట్రా అమర్ పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని ఇట్లా వదిలేస్తారా...చూడు ఇంకా నా వాడు ఎవరే అని పాడుకుంటోంది...కాపురం చేయట్లేదేమిట్రా నువ్వు" అని ఫన్నీగా అమర్ దీప్ మీద ఫైర్ అయ్యింది శ్రీముఖి. మానస్ వాళ్ళ అమ్మ ముఖచిత్రాన్ని గీసి రంగులు పూశాడు, ఆదిరెడ్డి తనకు వచ్చిన బిగ్ బాస్ డబ్బులతో తన చెల్లికి ఒక గోల్డ్ నెక్లెస్ తీసుకొచ్చి స్టేజి మీద ఇచ్చాడు. ప్రభాకర్ కూతురు బెస్ట్ మెమరీ ఫోటో లామినేషన్ ని ప్రెసెంట్ చేసింది. తాను ఈ స్టేజిలో ఉన్నానంటే కారణం నా వైఫ్ నా కూతురు అని నటరాజ్ మాస్టర్ తన భార్యకు గజ్జెలు తెచ్చి కాళ్ళకు కాట్టి ఈ స్టేజి మీద స్టెప్స్ వేయించాడు.

అవినాష్ నీ వల్లే ఇదంతా.. వైరల్ గా మారిన అరియానా వీడియో!

సెలబ్రిటీ ఇంటర్వ్యూల పేరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సొంతం చేసుకుంది అరియానా గ్లోరీ. డైరెక్టర్ రాంగోపాల్‌వర్మతో చేసిన ఓ హాట్ ఇంటర్వ్యూ ఆమె ఫేట్‌ని పూర్తిగా మార్చేసింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ నుంచి వచ్చాక ఆమెకు బుల్లి తెర మీద అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు బీబీ జోడిలో అవినాష్ కి జోడీగా చేస్తోంది.  ఐతే బీబీ జోడి చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఒక్కోసారి కొంత మందికి గాయాలు కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలానే జరిగింది ఆరియానాకి కూడా. "మిస్టర్ ముక్కు అవినాష్ గారు చూడండి..డాన్స్ లో, పెర్ఫార్మెన్స్ లో పక్కన ఆర్టిస్టులను పట్టించుకోకుండా.. మీ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ తో పెర్ఫార్మ్ చేస్తే అవతలి వాళ్ళు ఎలా బలవుతారో.. బీబీ జోడిలో చేసిన పెర్ఫార్మెన్స్ కి నా చెయ్యి చూడండి... ఇలా దెబ్బ తగిలి కమిలిపోయింది నాకు. దీన్ని నేను ఖండిస్తున్నాను అవినాష్ గారు" అని చెప్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.  ఇక ఆరియానా స్టార్స్ తో ఈక్వల్ గా సోషల్ మీడియాని దున్నేస్తోంది. రకరకాల పోస్టులు, వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. మొదట్లో తన మీద ఎలాంటి నెగటివ్ టాక్ వచ్చినా వెంటనే వాళ్ళ మీద తిరగబడేది. కానీ తర్వాత్తర్వాత వాటిని పట్టించుకోవడం మానేసింది. బీబీ హౌస్ లో బీబీ కేఫ్ నిర్వహించింది అరియనా. ఏది జరిగినా మన మంచికే అంటూ అప్పుడప్పుడు వేదాంతం కూడా చెప్తూ ఉంటుంది ఈ అమ్మడు.

ఇండియన్ ఐడల్ 2 ఆడిషన్స్ లో అదరగొట్టిన బిఎస్ఎఫ్ జవాన్

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఆడిషన్స్ మొదలయ్యాయి. ఈ ఆడిషన్ కి చక్రపాణి అనే ఒక బిఎస్ఎఫ్ జవాన్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. ఆయన పాడిన పాటకు జడ్జెస్ కార్తీక్, తమన్, గీతామాధురి ఫిదా ఐపోయారు. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో పని చేస్తున్న చక్రపాణికి సంగీతం అంటే ప్రాణం. ఆ ఇష్టంతోనే ఈ ఆడిషన్స్ కి వచ్చినట్లు చెప్పారు. "అసలు మ్యూజిక్ వినడానికే టైం ఉండదు. కానీ బోర్డర్ లో డ్యూటీ చేస్తూ పాటలు పాడుతూ ఉంటాను" అని చెప్పారు. "కొంతమంది అవకాశం ఉండి కూడా నేర్చుకోలేకపోతున్నారు.. కానీ నెట్వర్క్ లేని చోట కూడా పాటలు నేర్చుకొని పాడడానికి వస్తున్నారంటే అది పెద్ద విషయం" అని అన్నారు థమన్.  ఇక ఆయన పాడిన పాటకు "ఎస్" అని చాలా గర్వంగా చెప్పారు కార్తీక్. "ఒక్క నిమిషం..మీరు ఎస్ అంటున్నారు..కానీ నేను నో అంటున్నాను.. ఎందుకంటే నా లీవ్స్ ఐపోయాయి. బోర్డర్ కి వెళ్లిపోవాల్సిన టైం వచ్చింది." అని చెప్పారు చక్రపాణి. "మిలిటరీ నుంచి వచ్చి ఇలా స్టేజి మీద పాట పాడడం నిజంగా చాలా గర్వించాల్సిన విషయం.. సంగీతానికి మీరు ఎంతో విలువిచ్చారు." అన్నారు థమన్. వెంటనే ముగ్గురు జడ్జెస్ లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. "మీ వాళ్ళతో మేము మాట్లాడి ఏమైనా చేయొచ్చా" అని థమన్ చక్రపాణిని అడిగారు. మరి ఈ కంటెస్టెంట్ టాప్-12 లో ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేసి ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ఆడిషన్స్ మార్చి 3 నుంచి ప్రతీ శుక్రవారం- శనివారం రాత్రి 7 గంటలకు  ప్రసారమవుతుంది.