టాప్ 5 షోస్ క్లబ్ లో ఉన్న స్టార్ మా సీరియల్స్ ఇవే...

కార్తీకదీపం ప్రసారమైనన్ని రోజులూ రేటింగ్స్ లో ముందు వరసలో నిలబడింది. ఈ సీరియల్ కి "ఇంటింటి గృహలక్ష్మి" సీరియల్ గట్టి పోటీ ఇచ్చేది. కానీ కార్తీక దీపం ఐపోయాక గృహలక్ష్మి సీరియల్ కూడా టీఆర్పీ రేటింగ్స్ లో డౌన్ ఐపోయింది. "గుప్పెడంత మనసు" సీరియల్ మాత్రం ప్రతీ వారం టాప్ రేటింగ్‌తో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది.  ఈ సీరియల్ పాత్రధారులైన రిషి, వసుధార చేస్తున్న మాయతో ఈ సీరియల్ నిలకడగా ముందు వరసలో ప్రతీ వారం నిలబడుతుంది.  ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏమిటి అంటే కార్తీక దీపం స్లాట్ లో వస్తున్న కొత్త సీరియల్ ‘బ్రహ్మముడి’ సెకండ్ ప్లేస్ లో నిలబడింది.. ఇంటింటి గృహలక్ష్మి మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. గత వారాల రేటింగ్ తో పోల్చుకుంటే ఈ వారం ఈ సీరియల్ ని వీక్షించిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉందని టీఆర్పీ రిపోర్ట్ చెప్తోంది. దేవత సీరియల్ టైం స్లాట్ లో ప్రసారమవుతున్న "కృష్ణ ముకుంద మురారి"  నాలుగో స్థానంలో నిలిచింది. గత వారం లాగే ఈ వారం కూడా "త్రినయని"  టాప్ 5 షో లిస్ట్ లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.  ఇక మిగతా షోస్ విషయానికి వస్తే బీబీ జోడి, సుమ అడ్డా షోల రేటింగ్ కూడా చాలా తగ్గింది. ఇక  జబర్దస్త్ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్ రేటింగ్స్ మాత్రం ఎలాంటి తేడా లేదు. వచ్చే వారం ఏ సీరియల్ ఏ లిస్ట్ లో ఉంటుందో గృహలక్ష్మి ఎమన్నా ముందు వరుసలోకి వస్తుందా లేదంటే ఇదే రేటింగ్ కొనసాగిస్తుందా వేచి చూడాలి.

హన్సికాస్ లవ్ షాదీ డ్రామా  సిరీస్ మొదలైంది!

హీరోయిన్ హన్సిక గత ఏడాది సోహెల్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు తనకి ఎదురయిన సమస్యలను, సవాళ్ళని తన కెరీర్ పై మీడియా ఎఫెక్ట్ ఎలా పడింది? అలాంటి దుష్ప్రచారాలను ఎలా ఎదుర్కొంది? ఎలా పెళ్ళి చేసుకుందో తెలియాలంటే డిస్నీ హాట్ స్టార్ లోని ఈ 'హన్సికాస్ లవ్ షాది డ్రామా ' సిరిస్ ని చూడాల్సిందే. హన్సిక తన సినిమా కెరీర్ లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొందని, అయితే తను లవ్ చేసిన విషయాన్ని మీడియా ముందే పసిగట్టి ఏదో రాశారు. దీంతో తను షాదీ చేసుకుందని చెప్పింది. అయితే తన షాదీ టైం లో తనకి ఇంట్లో ఎదురయ్యిన పరిస్థితులను వివరించింది హన్సిక. 'దేశముదురు' సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హన్సిక.. తెలుగులో బాగానే రాణించింది. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి సోహెల్ తో పెళ్ళి అని.. తనకి సోహెల్ ప్రపోజ్ చేసిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో అందరూ తనకి అభినందనలు తెలిపారు. అయితే ఇలా తను ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ సిరీస్ లో చూపించారు. సోహెల్ కి గతంలోనే వివాహం జరిగిందని.. అతడు తన భార్య నుండి విడిపోవడానికి కారణం హన్సికనే అంటూ బయట పత్రికలలో రావడంతో.. ఆ వార్త తనని ఎంతగానో బాధపెట్టిందని హన్సిక ఈ ఎపిసోడ్ లో చెప్పింది. హన్సిక అమ్మ తనకి బ్యాక్ బోన్ అని , తన తమ్ముడు(ప్రశాంత్ మోత్వాని) తనకు కీలక టైంలో సపోర్ట్ ఇచ్చాడని హన్సిక చెప్పుకొచ్చింది. తన పెళ్ళి జరిగే వరకు తను ప్రేమలో ఉన్నట్టు ఎవరికి చెప్పాలనుకోలేదని.. ఆ విషయం మీడియాలో ముందే రావడంతో.. చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యిందని చెప్పింది. వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా హైపర్ అవ్వడంతో.. తన తమ్ముడు ప్రశాంతంగా ఆలోచించమని చెప్పాడని చెప్పింది. "ఎవరో బయటవాళ్ళు నీ సీక్రెట్స్ రీవల్ చేస్తారని స్ట్రెస్ తీసుకోవడమెందుకు.. నువ్వే సోషల్ మీడియాలో పోస్ట్ చేసెయ్.. అప్పుడు నీ స్ట్రెస్ పోతుంది కదా" అని తన బ్రదర్ చెప్పడంతో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రతీ శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ తో 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ' లో స్ట్రీమ్ అవబోతున్న  ఈ సిరిస్ ని  చూసెయొచ్చు.

మిమ్మల్ని చూసి ఇంట్లో మమ్మల్ని అలాగే రెడీ అవ్వమంటున్నారు

సోషల్ మీడియాలో సురేఖావాణి కూతురు సుప్రీతా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అసలు వాళ్ళను అలా పక్కపక్కన చూస్తే తల్లీకూతుళ్లలా అనిపించరు.. ఏదో ఫ్రెండ్స్ లా, సిస్టర్స్ లా కనిపిస్తారు. సురేఖవాణికి 45 ఇయర్స్ వచ్చిన ఇంకా స్వీట్ 20 స్ అన్నట్టుగా ఉంటుంది ఆమె స్ట్రక్చర్..కూతురితో కలిసి పోటీ పడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈమె లైట్ పింక్ సారీ కట్టిన ఫోటో ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఈ ఫొటోకి కూడా నెటిజన్స్ కామెంట్స్ చూస్తే ఒక రేంజ్ లో ఉన్నాయి. "ఒరిజినల్ బాపు బొమ్మలా ఉన్నారు. హీరోయిన్స్ కి పోటీలా ఉన్నారుగా..మేము మిమ్మల్ని జబర్దస్త్ యాంకర్ గా చూడాలనుకుంటున్నాం..సంతూర్ మమ్మీ..." అని కామెంట్ చేస్తే ఒకావిడ మాత్రం పాపం తన బాధను కామెంట్ రూపంలో చెప్పింది. ‘మిమ్మల్ని చూసి ఇంట్లో మమ్మల్ని కూడా ఇలాగే రెడీ అవ్వమంటున్నారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎమోజీని పోస్ట్ చేసింది. ఇకపోతే సురేఖ వాణి త్వరలో ఎవర్నో పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.  ఇందులో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడ్డం ఇక కూతురు సుప్రీతా కూడా అమ్మకి పెళ్లి చేసేస్తే పోలా అనే మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అసలే ఛాన్సెస్ రావడం లేదు అని బాధపడిన సురేఖావాణి ఫొటోస్ ని ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చూస్తే గనక ఆమె పంట పండినట్లు...చేతినిండా అవకాశాలు వచ్చినట్లే.

రాజ్ ఇంట్లో కనకం పర్ఫామెన్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ -16 లోకి  అడుగు పెట్టింది. కాగా శుక్రవారం రోజున నాటి ఎపిసోడ్ లో.. దుగ్గిరాల ఫ్యామిలీని కలవడానికి కనకం రెడీ అవుతుంది. స్వీట్స్, ఫ్రూట్స్ పట్టుకొని రావడానికి ఇద్దరు అబ్బాయిలు ఇలా వీటన్నింటికి తన కూతురు కావ్య అప్పు తీరుస్తుందనే ధీమాతో.. కనకం బాగా రిచ్ గా హుందాగా రెడీ అయ్యి వెళ్తుంది. మరోవైపు శరత్ వచ్చి కావ్య వేసిన డిజైన్ లు తీసుకొని, ఆమెకు డబ్బులిచ్చి.. ఆ డిజైన్ లని రాజ్ మరదలుకి అమ్ముకుంటాడు. కావ్య వేసిన ఆ డిజైన్ లని తానే వేసానని.. రాజ్ మరదలు రాజ్ కి చెప్తుంది. బాగున్నాయ్ ఎగ్జిబిషన్ లో పెడదామని రాజ్ చెప్తాడు. ఇంతలోనే రాజ్ పిన్ని వచ్చి ఈ రోజు స్వప్న తో డేట్ కి వెళ్తున్నావ్ కదా? గిఫ్ట్ ఏమిస్తావని అడుగుతుంది. డైమండ్ రింగ్ ఇస్తున్నానని రాజ్ తీసుకున్న డైమండ్ రింగ్ చూపిస్తాడు. అప్పుడే రాహుల్ వచ్చి ఆ రింగ్ తీసుకొని.. "ఆ అమ్మాయి కూడా రిచ్. ఇలాంటి వాటికి ఇంప్రెస్ అవ్వదు. ఏదైనా వెరైటీ గా ట్రై చెయ్ రాజ్" అని అంటాడు. ఆ రింగ్ స్వప్నకి ఇచ్చి ఫ్లర్ట్  చేయాలని రాజ్ భావిస్తాడు.   మరోవైపు రాజ్ తో డేట్ వెళ్ళడానికి స్వప్న రిచ్ గా రెడీ అవుతుంది.  ఆటోలో వెళ్తే మన గురించి తెలిసిపోతుందని అప్పుతో అంటుంది. దానికి అప్పు సెటైర్ వేస్తూ స్వప్నకి చిరాకు తెప్పిస్తుంది. ఎలాగోలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా అంటూ బయల్దేరుతుంది స్వప్న. అప్పు వద్దంటుంది. రాజ్ ఇంటికి వెళ్లిన కనకం అక్కడి రాజ్ కుటుంబసభ్యులతో అన్నీ అబద్దాలు చెప్తూ నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కనకం కుటుంబం పేదవాళ్ళు అని నిజం తెలిసి కూడా చెప్పకుండా కనకం బయటపడకుండా రుద్రాణి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది. స్వప్న చెప్పింది చెప్పినట్టు రాజ్ అమ్మ వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తాళి ఎవరు కట్టారని వసుధారని నిలదీసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -683 లోకి అడుగు పెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. వసుధార మినిస్టర్ గారి దగ్గర.. "నా హస్బెండ్ ఆల్ రౌండర్" అని చెప్తుంది. ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అదృష్టవంతుడెవరో చూడాలని ఉందమ్మా అని మినిస్టర్ అంటాడు. రిషి సర్ కూడా ఇలానే అన్నాడని వసుధార అనడంతో..  రిషికి కోపం వచ్చి ఏంటి ఇంత సరదాగా ఉత్సాహంగా మాట్లాడుతుంది. బాగా పొగరని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇద్దరు బయలుదేరుతారు. జగతి, మహేంద్రలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారో లేదో ఎవరు ఫోన్ చెయ్యట్లేదని రిషి, వసుధారల గురించి అనుకుంటారు. రిషి, వసుధారలు కార్ లో వెళ్తుండగా.. మినిస్టర్ గారు ఇచ్చిన చీరని తన మీద వేసుకొని సెల్ఫీలు తీసుకుంటుంది వసుధార. అది చూసిన రిషికి కోపమొస్తుంది. రిషి సర్ నవ్వండంటూ రిషితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తుంటుంది. "సర్ మీ మొహంపై నవ్వు మిస్ అయ్యింది" అని వసుధార  అనడంతో.. కార్ బ్రేక్ వేసి కార్ లో నుండి కోపంగా దిగుతాడు. "ఏంటి నువ్వు అస్సలు.. ఎందుకు వచ్చావ్ నా లైఫ్ లోకి.. నేను  ఐ లవ్ యు చెప్పాను నువ్వు నో చెప్పావ్.. మళ్ళీ కొన్ని రోజులకి నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావ్.. సరేనని ఒప్పుకున్నాను.  నువ్వు మీ ఊరు వెళ్ళి మారిపోయావ్.. నేను ప్రేమించినప్పుడు నో చెప్పి అలాగే ఉండిపోతే బాగుండేది.. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకొచ్చావ్? వాడెవడో వచ్చి నీ మెడలో తాళి కట్టానని అంటాడు. మళ్ళీ ఇంకెవడో వచ్చి తాళి కట్టలేదు అంటాడు.  అసలు నీ మెడలో తాళి కట్టింది ఎవడు?  నాకు ఇప్పుడు నిజం చెప్పు" అని రిషి ఆవేశంతో అనడంతో..  "సర్ నా మెడలో తాళి కట్టిన వ్యక్తి గురించి మర్యాదగా మాట్లాడండి" అంటూ వసుధార కోపంగా చెప్తుంది. "ఎందుకు ఇలా చేస్తున్నావ్.. నా జీవితాన్ని నాశనం చేస్తున్నావ్.. ఇన్ని రంగులు ఎందుకు మార్చుతున్నావ్.. ఇదంతా నీ ప్లానా" అని రిషి అనడంతో.. ఒక్కసారి వసుధార గుండె ముక్కలవుతుంది. ఏంటి సర్.. ఏం మాట్లాడుతున్నారు. నేను రంగులు మార్చుతున్నానా? ఇదంతా నా ప్లానా అంటూ ఎమోషనల్ అవుతుంది. మీరు కూల్ గా అడిగితే నిజం చెప్పేదాన్నేమో కానీ నేను ఇప్పుడు చెప్పను. నా గురించి ఇన్ని తెలుసుకున్న మీరు.. నా మెడలో తాళి ఎవరు కట్టారో కూడా తెలుసుకోండని అక్కడ నుండి వెళ్లిపోతుంటుంది. అలా వెళ్లేముందు వెన్నక్కి తిరిగి.. "ఒక్క మాట సర్.. నా మెడలో తాళి కట్టింది ఎవడో అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు కదా.. ఆ విషయం నా మెడలో తాళి పడటానికి కారణం అయ్యిన వ్యక్తికి తెలిస్తే ఊరుకోడు" అని ఛాలెంజ్  విసిరి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది వసుధార. తను వెళ్ళిపోయాక.. అనవసరంగా తొందరపడ్డానా అని రిషి అనుకుంటాడు. జగతి, మహేంద్రలు ఆలోచిస్తూ రిషి, వసుధారలు ఊహకైనా అందరు.. ఇద్దరికి ఇగో టన్నుల్లో  ఉంటుందని మాట్లాడుకుంటారు. ఎవరు కూడా తగ్గరని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మురారిని గదిలోకి లాక్కెళ్ళి ముద్దుపెట్టిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఒకరి ప్రేమ, మరొకరి పంతం మధ్య నలిగిపోతున్న మురారి.. ప్రేమని గెలిపిస్తాడో లేక పంతాన్ని గెలిపిస్తాడో అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రోజుకో మలుపుతో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సీరియల్ ఎపిసోడ్ -77 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో... కృష్ణ బాధపడుతు ఒంటరిగా కూర్చుంటుంది. అప్పుడే తన దగ్గరికి వచ్చిన మురారి.. "ఏంటి అలా ఉన్నావ్" అని అడుగుతాడు. మీ అమ్మ నన్ను చదువుకోవద్దని చెప్పింది కదా.. అందుకే ఇలా ఉన్నానని కృష్ణ చెప్తుంది. నువ్వు ఏం బాధపడకు.. అమ్మ  అర్థం చేసుకుంటుందని మురారి అంటాడు. అంతలోనే అలేఖ్య వచ్చి.. "రేవతి అత్తయ్య మీ ఇద్దరిని పిలుస్తుంది" అని చెప్తుంది.  దాంతో ఇద్దరు రేవతి దగ్గరకి వెళ్తారు. "ఏంటమ్మా పిలిచావ్?" అని మురారి అడుగుతాడు. కృష్ణ నువ్వు ఎంత వరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు చదువుకో.. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను. మీ అమ్మనాన్నల కలని నిజం చెయ్యాలని ఎంత ఆరాటపడుతున్నావో మురారి నాకు అంత చెప్పాడని రేవతి అంటుంది. "నిజంగా చదువుకోవాలా అత్తయ్య"  అని కృష్ణ ఒకవైపు, "నిజమా అమ్మా" అని మురారి మరోవైపు అంటారు.  "మీ అమ్మనాన్నల కలని నిజం చేయు కృష్ణ.. నిన్ను చదువుకోవద్దని నిన్ను బాధపెట్టాను.. నన్ను క్షమించు" అని రేవతి అంటుంది. థాంక్స్ అత్తయ్య అని  కృష్ణ అనగానే.. ఆ థాంక్స్ నాకు కాదు నీ భర్త మురారికి చెప్పు అని రేవతి అంటుంది. ఆ తర్వాత మురారి చెయ్యి పట్టుకొని తన గదిలోకి పరుగెత్తుకుంటూ తీసుకుపోతుంది కృష్ణ. అది చూసిన ముకుంద.. "ఏంటీ అలా మురారిని లాక్కుపోతుంది" అని అనుకుంటుంది. గదిలోకి తీసుకెళ్లిన కృష్ణ.. "థాంక్స్ ఏసీపి సర్.. నాకు చాలా  హ్యాపీగా ఉంది" అని హగ్ చేసుకొని చెంపపై ముద్దు పెడుతుంది. దాంతో మురారి ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ ఒక్కసారిగా దూరంగా వచ్చి.. "మళ్ళీ థాంక్స్ సర్" అని చెప్తుంది. మరోవైపు ముకుంద టెన్షన్ పడుతుంది. "కృష్ణ లోపలికి ఎందుకు లాక్కొని వెళ్ళింది" అని అనుకుంటూ మురారికి మెసెజ్ చేస్తూనే ఉంటుంది. "ఏంటీ సర్ ఈ మెసెజ్ లు" అని కృష్ణ అడుగగా.. "డీజీపీ సర్ చేశారు" అని మురారి కవర్ చేస్తాడు‌. "ఏసిపి సర్ నాకు చాలా సంతోషంగా ఉంది. మనం బయటికి వెళ్దాం.. మీకు పార్టీ ఇస్తాను" అని కృష్ణ అనగానే.. సరేనని చెప్తాడు. మురారి, ముకుంద దగ్గరికి వచ్చి.. "ఏంటి ముకుందా" అని అంటాడు. "ఇంట్లో ఏం జరుగుతుంది మురారి.. కృష్ణ ఏంటి ప్రేమపక్షిలా నిన్ను లాక్కొని వెళ్తుంది" అని ముకుంద అడుగుతుంది. నువ్వు కోరుకున్నట్లే కృష్ణ చదువుకోవడానికి అమ్మ ఒప్పుకుందని మురారి అంటాడు. అప్పుడు ఎందుకు వద్దు అంది.. ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంది.‌. నాకు అర్థమైంది.. మన గురించి మీ అమ్మకి తెలిసిందని నీకు ఎప్పుడు అనిపించలేదా? అని ముకుంద అడిగేసరికి.. "నాక్కూడా అనిపించింది" అని మురారి అంటాడు.  "అప్పుడు కృష్ణ దూరంగా వెళ్తే నేను నీకు దగ్గర అవుతానని చదువువద్దు అని చెప్పింది. ఇప్పుడు ఆదర్శ్ వస్తున్నాడని చదువుకొమ్మని చెప్తుంది" అని రేవతి అనగా.. అదేం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆటో రాంప్రసాద్ కి బ్రెయిన్ ట్యూమర్... క్లారిటీ!

జబర్దస్త్ లో ఫుల్ ఫేమస్ ఐన కమెడియన్స్ లో ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ ఈ ముగ్గురు జోడి బుల్లితెర మీద సూపర్ హిట్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ అంటే వీళ్లదే అన్నట్టుగా ఉంటుంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. కిర్రాక్ ఆర్పీ రీసెంట్ గా ఓపెన్ చేసిన తన కర్రీ పాయింట్ సెకండ్ బ్రాంచ్ కి రాంప్రసాద్ వచ్చాడు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు. తనకు కోరమీను, రాగి సంకటి ఇస్తామని చెప్పాడు. అక్కడ ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.  "ఆర్పీకి జబర్దస్త్ లో కంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యాడు. టేస్ట్ చాలా బాగుంది..మా ఇంటికి కూడా చాలా దగ్గర.. టేస్ట్ బాగుంది కాబట్టే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. మా ఫ్రెండ్ కాబట్టి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ముందు మేము ఫ్రెండ్స్ తర్వాత మిగతా విషయాలు..సుధీర్ ఏదో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కి రాలేకపోయాడు.  జబర్దస్త్ రీయూనియన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా..కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఇపోయారు. నాకు రైటర్ కావడం ఇష్టం. రీసెంట్ గా ఒక వెబ్ మూవీ చేసాను. నా హెల్త్ గురించి మీకు తెలియనిది ఏముంది..మీరే రాస్తారు కదా. థంబ్ నైల్ ఏదో పెడతారు. ఆడియన్స్ లోపలి వెళ్లి చూస్తే అక్కడ అసలు కంటెంట్ ఏమీ ఉండదు. నేనేదో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే నాకేదో బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఏదేదో రాసేశారు..ఇంతకుమించి ఇంకేమీ రాయద్దు. అక్కడ ఏమీ లేదు." అని చెప్పాడు.

దుబాయ్, సౌదీలో బ్రాంచెస్ పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు..ఆర్పీ అంత మొండోడు

కిర్రాక్ ఆర్పీ తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని బ్రాంచెస్ పెట్టుకుని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కూకట్ పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’ చేపల పులుసు సక్సెస్ కావడంతో మణికొండలో సెకండ్ బ్రాంచ్ పెట్టాడు. దీని ఓపెనింగ్ కి ఎంతో మంది చిన్న, పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు.  ఇక ఈ ఓపెనింగ్ ఫంక్షన్ కి మెగా బ్రదర్ నాగబాబు కూడా వచ్చి ఆర్పీ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు మాట్లాడారు. "ఆర్పీ చాలా మొండివాడు. ఆర్పీని గౌరవంగా మాట్లాడాలి అంటూ ఆర్పీ గారు అని సంబోధించి మరీ మాట్లాడారు. ఈ చేపల పులుసు కాన్సెప్ట్ ద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ రాలేదు..తనకు ఓపెనింగ్ సెంటిమెంట్ ఉందని చెప్పారు. అది సక్సెస్ కాకపొతే తనను తిట్టుకుంటాడు అని రాలేదని చెప్పారు. కామెడీతో పాటు ఫుడ్ బిజినెస్ లో మంచి పట్టు సాధించాడు. తలచుకుంటే ఏదైనా చేసేస్తాడు ఆ నమ్మకం ఉంది నాకు. దుబాయ్, సౌదీని కూడా ఆక్రమించేసి అక్కడ కూడా బ్రాంచెస్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎప్పుడో నాకు జబర్దస్త్ టైములోనే చెప్పాడు కానీ దాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటాడని నేను అనుకోలేదు. ఇదే విషయం మీద ఫోకస్ చేస్తే ఆర్పీ తొందరలోనే కోటీశ్వరుడు ఐపోతాడు" అంటూ తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మొత్తానికి జబర్ధస్త్ నుంచి బయటికి వచ్చేసిన ఆర్పీకి నాగబాబు మంచి సపోర్ట్ గా నిలిచి వెన్ను తట్టడం మంచి విషయం.  ఇక కిర్రాక్ ఆర్పీ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ లో తన పాత మిత్రులంతా కూడా కలిసి చేపల పులుసును టేస్ట్ మంచి మార్క్స్ ఇవ్వడంతో ఆర్పీ చేపల పులుసు ట్రెండింగ్ టాపిక్ లోకి వచ్చేసింది.

గేతో ఎలా ప్రెగ్నన్సీ వస్తుంది...కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి!

సెలెబ్రిటీస్ మీద ఎన్ని గాసిప్స్ వస్తే అంత ఫేమస్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు  ఘాటుగా సమాధానాలిచ్చి కూడా ఫేమస్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు పునర్నవి కూడా అలాగే ట్రెండింగ్ టాపిక్ లోకి వచ్చేసింది. పున్ను అంటే చాలు బిగ్ బాస్ బ్యూటీగా అందరికీ గుర్తొచ్చేస్తుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలేసుకుని కబుర్లు చెప్పింది. ఉయ్యాలా జంపాల మూవీలో కూడా నటించింది.  తర్వాత స్టడీస్ కోసం లండన్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక ఆమె ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ని షేర్ చేసేసరికి అతనితో రిలేషన్ లో ఉన్నట్లు భావించారంతా. అలాగే ఆమె పొట్ట కూడా కాస్త ఎత్తుగా కనిపించేసరికి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ విషయం మీద ఆమె రెస్పాండ్ అయ్యింది. మామూలు రూమర్స్ ఐతే ఎవరూ పట్టించుకునేది కాదేమో కానీ తన  ప్రెగ్నెన్సీకి సంబంధించిన న్యూస్ అయ్యేసరికి ఆమె చాలా సీరియస్ అయిపోయింది.  "నా గే బెస్టీ వల్ల నాకు గర్భం వచ్చిందని ఒక యూట్యూబ్ వార్త రాసింది. పోయిన నెలలో నేను అనారోగ్యంగా ఉన్న నేను ఈ నెలలో ప్రెగ్నెంట్ ఐపోయాను...లైమ్ లైట్‌లో మీరు చూసేదంతా నిజం కాదు. నిజం మూడు రకాలుగా ఉంటుంది. కళ్ళతో చూసేదే నిజం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నప్పటికీ స్త్రీలను అవమానించే సంస్కృతి బాగా పెరిగిపోతోంది." అంటూ గట్టిగా క్లాస్ ఇచ్చిపడేసింది. ఈ మొత్తాన్ని కూడా పున్ను తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

నాన్న నీ కల ఈరోజు నిజమయ్యింది...నీ అకౌంట్ కి బ్లూ టిక్ వచ్చేసింది

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. అందులో లేడీ కమెడియన్స్ కూడా ఫుల్ ఫేమస్ అయ్యారు...రోహిణి, రీతూ, సత్యశ్రీ, వర్ష ఇలా చాలామంది ఉన్నారు. ఇక రీతూ విషయానికి వస్తే రీసెంట్ గా ఆమె తన నాన్నను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. తన నాన్న‌తో మంచి అనుబంధం ఉండడంతో రీతూ చౌద‌రి ఆయన గురించి పెట్టిన ఒక ఎమోష‌న‌ల్‌గా పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇప్పుడు రీతూ వాళ్ళ నాన్నతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టింది.  "నాన్న నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఎప్పుడు బ్లూ టిక్ వస్తుంది అని అడిగావు కదా..అది ఈ రోజు నిజమయ్యింది. బ్లూ టిక్ వచ్చేసింది. ఐ లవ్ యు డాడీ..మీరు పై నుంచి నన్ను చూస్తున్నారన్న విషయం నాకు తెలుసు..ఈరోజు నుంచి నేను చాలా కష్టపడి మీ పేరు నిలబెడతాను" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టుకుంది. గాయత్రి అలియాస్ రీతూ చౌదరి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..సీరియల్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని ప్రస్తుతం జబర్దస్త్ లో రాణిస్తోంది. ఇంటిగుట్టు సీరియల్ లో ఈమె నటించింది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడమే కాదు అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫుల్ ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. అలాగే గతంలో ప్రసారమైన ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపుల కార్యక్రమానికి వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా రీతూ వచ్చింది. కానీ మధ్యలోనే ఆమె ఎలిమినేట్ అయ్యింది.

నువ్వక్కడ...నేనిక్కడ..అంటూ ఆన్లైన్లో యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకున్న సుమ-రాజీవ్

తన స్పాంటేనియస్ యాంకరింగ్ తో ఎంతో మందిని అలరిస్తున్న హోస్ట్ సుమ కనకాల. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు విషయానికి వస్తే సుమ-రాజీవ్ కనకాల తమ  24వ పెళ్లి రోజును వెరైటీగా ఆన్లైన్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకే చోట లేకపోయేసరికి వీడియో కాల్ చేసుకుని  ‘నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకక్కడా అంటూ సుమ ఒక చరణం పాడితే..." మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా" అంటూ రాజీవ్ కనకాల పాడారు. ఈ వీడియోని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.  ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఈ వీడియో వాళ్లకున్న బిజీ షెడ్యూల్స్ లో మ్యారేజ్ డేని ఇలా ఒక పాట రూపంలో సెలెబ్రేట్ చేసుకోవడం వాళ్ళ అన్యోన్యతకు తార్కాణం. కొంత కాలం క్రితం ఈ జంట మీద  సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చిన విషయం..దాని గురించిన వాళ్ళు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమ ఎలాంటి షో చేస్తున్నా అందులో తప్పనిసరిగా ఏదో ఒక చోట రాజీవ్ పేరును తలచుకోకుండా ఉండదు. దేవదాస్ కనకాల డైరెక్ట్ చేసిన  "మేఘమాల" సీరియల్ లో కలిసి నటించిన  రాజీవ్ కనకాల-సుమ ఆ తర్వాత ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 1999, ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు. సుమ నేటివ్ కేరళ ఐనా కూడా తెలుగు భాష మాట్లాడితే చాలు తెలుగమ్మాయే అనిపించేలా ఉంటుంది.  తెలుగు మీద అంత గ్రిప్ తెచ్చుకుంది సుమ. స్టార్ హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్ , ఫంక్షన్, ప్రీ రిలీజ్ వేడుక ఏదైనా సరే  ఆమె యాంకరింగ్ చేయాల్సిందే. ఇక నెటిజన్స్ ఈ జంటకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని విష్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

'ఢీ-15' స్టేజి మీద పెళ్లి చేసుకున్న శేఖర్ మాస్టర్...అది చూసి ఏడ్చేసిన శ్రద్దా

'ఢీ-15' ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తోంది. ఇందులో ఈ మధ్య శేఖర్ మాస్టర్ వేస్తున్న జోక్స్ మాములుగా ఉండడం లేదు. శ్రద్ధాదాస్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్లు వేస్తోంది, స్టేజి మీద ఆడి పాడుతోంది. లేటెస్ట్ ప్రోమో చూస్తే లవర్స్ డే సందర్భంగా లవ్ థీమ్‌ మీద కంటెస్టెంట్లు డ్యాన్స్ చేశారు. మొదటిగా ఒక కంటెస్టెంట్ వచ్చి 'గీత గోవిందం' మూవీలో డాన్స్ చేస్తుండగా  "వచ్చిందమ్మా వచ్చిందమ్మా" అనే లిరిక్ రాగానే స్టేజ్‌ మీదకు శేఖర్ మాష్టర్ భార్య ఎంట్రీ ఇచ్చారు. ఇది చూసి షాకవడమే కాదు కొంచెం ఎమోషనల్ అయ్యాడు శేఖర్ మాస్టర్.. స్టేజి మీద ఇద్దరూ దండలు మార్చుకుని కాసేపు ప్రేమికులుగా మారిపోయి డాన్స్ చేశారు. మిగతా వాళ్లంతా ఆ ఇద్దరి  మీద పూల జల్లు కురిపించారు.   శేఖర్ మాష్టర్‌ను ఇంట్లో 'నాని' అని పిలుస్తారని ప్రదీప్ కి చెప్పేసరికి ప్రదీప్ ఆ పేరుతోనే పిలిచి కాసేపు ఫన్ చేసాడు. తర్వాత మరో లేడీ కంటెస్టెంట్.. "తెలుసునా తెలుసునా" అంటూ సొంతం మూవీ సాంగ్ కి డ్యాన్స్ వేసింది. ఆమెతో పాటు యాంకర్ ప్రదీప్ కూడా కొన్ని స్టెప్స్ లో పార్టిసిపేట్ చేసేసరికి శ్రద్ధా దాస్ మాట్లాడుతూ "ప్రదీప్ అక్కడ డ్యాన్స్ చేస్తుంటే వేరే అమ్మాయితో పాటు.. ప్రతి అమ్మాయి జెలస్ ఫీలవుతుంది" అనేసరికి శేఖర్ మాస్టర్ గట్టిగా అరిచేశాడు. ఇక ఫైనల్ గా మరో కంటెస్టెంట్ " ఏ నోము నోచిందో.. ఏ పూజ చేసిందో.. పరమేశ నిను కన్న తల్లి" అంటూ యోగి మూవీలో సాంగ్ కి  ఎమోషనల్‌‌గా డ్యాన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్ డ్రాప్ లో  శేఖర్ మాష్టర్ తన తల్లితో ఉన్న ఫొటోను.. అలాగే శ్రద్ధా దాస్ తన అమ్మ, నాన్నలతో ఉన్న చిన్నప్పటి ఫొటోలను ప్లే చేసి చూపించారు.  శ్రద్ధా అయితే "అది నాకు చాలా ఇష్టమైన ఫొటో.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను" అంటూ ఏడ్చేసింది. ఇక ప్రోమో ఎండింగ్ మాత్రం కేక పుట్టించింది. ఈ సాంగ్ కి డాన్స్ చేసిన కంటెస్టెంట్ వాళ్ళ అమ్మ కూడా స్టేజి మీదకు వచ్చి డాన్స్ చేయడం హైలైట్..  

పెళ్లి మీద పెద్ద ఇంటరెస్ట్ లేదు...డ్రగ్స్ కేసులో జైల్లో వేస్తే చేసేదేముంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిట్ గా ఉండే విలన్ రోల్స్ కి పెట్టింది పేరు సుబ్బరాజు. తెలుగు, తమిళంలో కలిపి 50 చిత్రాలకు పైగా నటించాడు. కృష్ణవంశీ డైరెక్షన్ లో  "ఖడ్గం" మూవీలో ఒక చిన్న పాత్ర చేసాడు, "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి" మూవీలో కూడా నటించాడు. ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేశాడు. బాహుబలి మూవీలో అనుష్క బావగా నటించి మెప్పించాడు.  లీడర్, గీత గోవిందం, కృష్ణార్జున యుద్ధం, టెంపర్, పవర్, దేశముదురు, పోకిరి, పౌర్ణమి, షాక్,  మహానది ఇలాంటి ఎన్నో మూవీస్ లో నటించాడు. ఇక ఇప్పుడు ఒక ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంకి వచ్చి ఎన్నో విషయాలను చెప్పాడు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సుబ్బరాజు పుట్టింది భీమవరంలో. వాళ్ళ నాన్న ప్రభుత్వ టీచర్. సినీ ఇండస్ట్రీకి కావాల్సింది మంచి ఫిట్ గా ఉన్న బాడీ. అలాగే మెయింటైన్ చేస్తున్నా. బాడీ ఫిట్ గా లేకపోతే నాన్న, బాబాయ్ వంటి క్యారెక్టర్స్ వస్తాయని చెప్పాడు. అవకాశాలు ఇమ్మంటూ అడిగే అలవాటు తనకు లేదని చెప్పాడు.  భీమవరం రాజులంటే రొయ్యలు, పీతలు, చేపలు, కోడి పందాలు, పేకాటలు ఉంటాయన్నారు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదని చెప్పాడు. డ్రగ్స్ విషయంలో తన పేరు ఎందుకు వచ్చిందో తెలీదు..దీని మీద తనను ప్రశ్నలు అడిగారని సమాధానాలు కూడా చెప్పానన్నారు.  వాళ్లకు తప్పనిపిస్తే జైల్లో వేస్తారు.. చేసేదేమీలేదు కదా అని చెప్పారు. ఇంకా ఏమేం చెప్పారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.   

ఏం ప్రశ్నలురా బాబు అవి...అక్కా అంటూనే!

ఒకప్పుడు ఫాన్స్ తో టచ్ లో ఉండడం పెద్ద టాస్క్. కానీ సోషల్ మీడియా బాగా పెరిగాక ఆ టాస్క్ చాలా ఈజీ ఐపోయింది. చేతిలో సెల్లు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంటే చాలు ఫాన్స్ ఆటోమేటిక్ గా టచ్ లోకి వచ్చేస్తారు.  ఇప్పుడు వెరైటీగా తన ఫాన్స్ తో చాట్ చేశారు బీబీ జోడి సత్య-మెహబూబ్. ఫాన్స్ అడిగిన ప్రశ్నలు చదవడం జవాబులు ఇవ్వడం మొత్తాన్ని వీడియో తీసి మెహబూబ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఒక ఫ్యాన్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కే మెహబూబ్ షాకయ్యాడు. "అన్నా నువ్వు వర్జినా ?"  అని అడిగేసరికి  " రేయ్.. ఏం క్వశ్చన్‌ రా అది" అని నవ్వుతూనే అరిచాడు.  తర్వాత సత్యను ఓ నెటిజన్ " మీకు మెహబూబ్ ఇష్టమా ? అర్జున్ కల్యాణ్ అంటే ఇష్టమా" అని అడిగాడు. మరో ఫ్యాన్  "సత్య అక్క ! మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు అయ్యింది" అని అడిగేసరికి గట్టిగానే ఇచ్చేసింది శ్రీసత్య.  "సో.. అక్క అని పిలిచి.. అక్కను ఇలాంటి ప్రశ్నలడుగుతావా నువ్వు" అంటూ సూటిగా అడిగేసింది. తర్వాత మెహబూబ్‌ను "మీకు శ్రీసత్యతో డ్యాన్స్ చేయడం ఇష్టమా? అషూతో చేయడం ఇష్టమా?" అని అడిగేసరికి మెహబూబ్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఒక పోజ్ పెట్టాడు తప్ప ఆన్సర్ చెప్పలేదు. " రొమాంటిక్ సాంగ్ మనోహరి చేసేటప్పుడు మీరిద్దరూ ఎలా ఫీలయ్యారు" అని మరో ఫ్యాన్ అడిగేసరికి మెహబూబ్ ఆన్సర్  "చింపేయాలి అంతే ఓకే నా" అన్నాడు. ఆ మాటకు శ్రీసత్య "చింపేస్తే ఎలా ? స్టేజ్‌పైన డ్రెస్" అంటూ ఫన్నీ కౌంటర్ వేసింది. తర్వాత వాళ్లకు ఎదురైన ప్రశ్న ఏమిటో తెలీదు కానీ  "నో ఫీమేల్ ఫ్రెండ్స్ మేటర్స్" అంటూ శ్రీసత్య ఫుల్ ఫైర్ ఐపోయింది. బీబీ జోడిలో శ్రీ సత్య-మెహబూబ్ అద్భుతంగా రొమాంటిక్ డ్యాన్సస్ తో అలరిస్తున్నారు.

బ్రాంచ్ ఓపెనింగ్ లో కనిపించని సుధీర్...అసలు నిజం చెప్పిన శీను

కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెకండ్ బ్రాంచ్ ని మణికొండలో రీసెంట్ గా ఓపెన్ చేసాడు. దీనికి ఒకప్పుడు గొడవలు పడిన జబర్దస్త్ కమెడియన్స్ అంతా వచ్చి అతన్ని విష్ చేశారు తర్వాత  చేపల పులుసు తిని ఎంజాయ్ చేసారు. ఇదే టైంలో ఇక్కడికి వచ్చిన గెటప్ శీను ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. " ఫస్ట్ బ్రాంచ్ కి ఎందుకు రాలేదు సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ కి ఎందుకు వచ్చాం అంటే రీజన్స్ లేవు అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది వచ్చాం. ఇక్కడ చేపల పులుసు చాలా బాగుంది. నాకు ఎగ్ బూర్జి తినడం, చేపల పులుసు వండి పెట్టడం ఇష్టం. నెలలో ఏదో ఒక టైంలో ఇంట్లో నేనే కుక్ చేసి ఫ్రెండ్స్ కి , ఫామిలీ మెంబర్స్ కి తినిపిస్తూ ఉంటాను. ఇక ఇప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే  మా మణికొండలో అందరికీ నెల్లూరు చేపల పులుసు దొరుకుతుంది కాబట్టి. గత పదేళ్ల నుంచి కూడా నాకు ఫుడ్ బిజినెస్ పెట్టాలని కోరిక ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వదిలేసి ఇటు రావాలి కానీ ప్రస్తుతం నా చేతిలో సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి తగ్గినప్పుడు నేను ఈ ఫీల్డ్ గురించి ఆలోచిస్తాను. సుధీర్ ఎందుకు రాలేదో నాకు కూడా తెలియదు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. మే బి కొత్త సినిమాకు సైన్ చేసాడు కాబట్టి ఆ వర్క్ షాప్స్ లో, షూటింగ్ లో బిజీగా ఉన్నాడేమో. రాజు యాదవ్ లో లిప్ లాక్ గురించి అడుగుతారేమిటి అందులో ఎమోషన్, లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా..ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి చూస్తున్నాం. త్వరలో సాంగ్స్, ట్రైలర్ తో పాటు ఒక డేట్ ని అనౌన్స్ చేయడానికి వస్తున్నాం. సుమ అడ్డా షోలో చిరు గారి ముందు వాల్తేర్ వీరయ్య స్పూఫ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది...కానీ ఆయన ముందు చేయాలంటే చాలా భయం. ఊపిరి తీసుకోలేనంత బిజీ ఐనప్పుడు మాత్రమే చూస్తా కానీ అప్పటివరకు నా వీలును, టైంని బట్టి జబర్దస్త్ చేస్తూనే ఉంటా" అని చెప్పాడు గెటప్ శీను.

రిషి సర్ ని ఆశీర్వదించిన కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ

"గుప్పెడంత మనసు" సీరియల్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అందులో రిషి క్యారక్టర్ కి మస్త్ ఫాన్స్ కూడా ఉన్నారు. రిషి అలియాస్ ముఖేష్ గౌడ క్యారెక్టర్ ఈ సీరియల్ లో మంచి స్మార్ట్ గా, నీట్ గా హుందాగా ఉంటుంది. ఆయనకు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్నారు. అలాంటి ఫాన్స్ లో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు కూడా ఒకరు. మరి అలాంటి బ్రహ్మానందం గారు , ఆలీ గారు స్వయంగా గుప్పెడంత మనసు బృందాన్ని చూడడానికి వెళ్లారు. రిషిని చక్కగా ఆశీర్వదించారు. "నువ్వు చాలా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నావ్. మా ఆవిడకు మీ మొత్తం సీరియల్ టీంకి పెద్ద ఫ్యాన్. బాగుందమ్మా వసుధారా. మిమ్మల్నందరినీ ఇలా చాలా హ్యాపీగా ఉంది. రిషి చాలా బాగా చేస్తున్నావ్ నాన్న.  ఎంతో  సంతోషంగా ఉంది.  బేలెన్స్డ్ గా నటించడం చాలా కష్టమైన పని. కానీ రిషి చాలా చక్కగా చేస్తున్నాడు. నటన కొంచెం లో అయితే తగ్గిందని అంటారు కొంచెం ఎక్కువ చేస్తే ఓవర్ చేస్తున్నారంటారు. పాత్ర ఎంత చేయాలో అంతే చేస్తున్నావ్...గాడ్ బ్లెస్స్ యు. ఐ లవ్ యు డార్లింగ్." అని బ్రహ్మానందం గారు అనేసరికి రిషి సర్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. "అంత లెజెండరీ కమెడియన్స్ మమ్మల్ని చూడడానికి రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది" అంటూ ఆ ఫొటోస్ ని వీడియోస్ ని ముఖేష్ గౌడ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. ఈ సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది.  హీరో రిషి పాత్రలో కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను గెల్చుకున్నాక ‘నాగకన్నిక’ అనే సీరియల్‌తో డెబ్యూ హీరోగా ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘ప్రేమ నగర్’ సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి ముఖేష్ అడుగుపెట్టాడు. ఇప్పుడు  ‘గుప్పెంత మనసు’ సీరియల్‌ తో మంచి బ్రేక్ వచ్చింది.  

రాజ్ తో స్వప్న డేటింగ్ కి కనకం చేస్తోన్న హడావిడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్-15 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్‌లో.. స్వప్న వాళ్ళింట్లో స్వప్న అమ్మ కనకంకి, స్వప్న వాళ్ళ నాన్న కృష్ణమూర్తికి సంభాషణ జరుగుతుంటుంది. కృష్ణమూర్తిని మంచిగా రెడీ అయ్యి‌ రా వెళ్దామని కనకం అడగుతుంది. దానికి కృష్ణమూర్తి రానని చెప్తాడు. ఎందుకు రావని కనకం అడిగితే.. నేను బొమ్మలకి రంగులు వేస్తాను కానీ నా మనసుకి కాదని అంటాడు. దానికి కనకం నిన్ను అబద్ధాలు చెప్పమనడం లేదు నిజాలు దాస్తే చాలని కనకం అనేసరికి.. నీలాగా గాల్లో మేడలు నేను కట్టలేను.. ఇన్ని సంవత్సరాలు నీతి, నిజాయితీగా ఒక్క తప్పు కూడా చేయకుండా బ్రతికాను.. ఇప్పుడు అలాగే బ్రతుకుతానని చెప్తాడు. సరే నువ్వేం నటించనవసరం లేదు.. నా కూతురిని ఎలా గొప్పింటికి కోడలిని చేయాలో నాకు తెలుసు అని కనకం అంటుంది. మొదటిరోజే అదరగొట్టావ్ అని రాజ్ ని సీతారామయ్య మెచ్చుకుంటాడు. అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఆ తర్వాత రాజ్ గురించి రుద్రాణి సీతారామయ్యతో మాట్లాడుతుంది. నాన్న రాజ్ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. తను ఎవరో కాదు మొన్న పూజలో నాట్యం చేసింది కదా ఆ అమ్మయి అని సీతారామయ్యతో రుద్రాణి చెప్తుంది. పక్కనే ఉన్న రాజ్ వాళ్ళ అమ్మ.. "ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం మనలాగే ఉంటే మనం కూడా సంబంధం కలుపుకుందాం" అని అంటుంది. దీంతో రుద్రాణి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతుంది. "ఇలా చేసే నాకు డబ్బున్న వాడిని ఇచ్చి చేసారు. ఇప్పుడు చూస్తే వాడు వదిలేసి పోయాడు. రాజ్ నువ్వు ఎవరేం చెప్పినా వినకు. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో" అని రుద్రాణి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య వాళ్ళింట్లో డబ్బులు ఈ నెల ఎక్కువగా వచ్చాయని వాళ్ళ నాన్న కృష్ణమూర్తితో చెప్తుంటుంది. కాసేపటికి రాజ్ నుండి స్వప్నకి కాల్ వస్తుంది. తను మేకప్ వేసుకుంటానని చెప్పి కావ్యని కాల్ లిఫ్ట్ చేయమంటుంది. కావ్య హలో అనగానే అవతలివైపు ఎవరా అని రాజ్ మౌనంగా ఉంటాడు.  ఇంతలో రాజ్ తమ్ముడు రాహుల్ ఫోన్ లాక్కొని ఇంప్రెస్ చేస్తూ మాట్లాడతాడు. రేపు మీకు‌‌ రాజ్ అన్నయ్యకి కలిపి డేటింగ్ చేస్తున్నాను.. బిల్ మీరే కట్టాలి అనగా స్వప్న సరే అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గర మనీ అడిగి తీసుకుంటుంది. మరోవైపు కనకం రాజ్ ఇంటికి వెళ్ళడానికి అంతా రెడీ అవుతూ, స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొని హాడావిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

భవాని కుటుంబసభ్యుల సంతోషానికి కారణం కృష్ణేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -76 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు నాటి ఎపిసోడ్ లో.. భవానీ ఇంట్లో అందరు భోజనం చెయ్యడానికి కూర్చుంటారు. ఇంకా భవాని భోజనం చెయ్యడానికి రాకపోయేసరికి. నేను వెళ్ళి తీసుకొస్తాను అని రేవతి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి రేవతి.. "అక్కా.. అందరూ భోజనం చెయ్యడానికి వచ్చారు. రా అక్కా" అని అనగానే.. "నేను రాను. ఇంట్లో ఎవరికీ వారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు.. నీలాగా బావిలో కప్పలాగా నీ కోడలిని తయారు చేద్దామనుకుంటున్నావా?  ఇంట్లో నన్ను అడగకుండా నువ్వే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావ్.. కృష్ణ వాళ్ళ అమ్మ నాన్నల కలని నిజం చేస్తానని అనుకుంటుంది.. నువ్వు ఎందుకు వద్దు అంటున్నావ్" అని భవానీ అడుగుతుంది. కృష్ణ దూరం వెళ్తే ముకుంద, మురారికి దగ్గర అవుతుంది అక్కా.. నీకెలా చెప్పాలి అని రేవతి మనసులో అనుకుంటుంది. భవాని అడిగిందానికి సమాధానం చెప్పకుండానే.. కిందకి వెళ్లి మీరు తినండి అని అనగానే.. "వదిన రానందా.. ఎందుకు రానని చెప్పింది" అని అంటాడు ఈశ్వర్. మీరు అడిగిందే అక్కా అడిగింది అని రేవతి చెప్పి.. వాళ్ళని తినమంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తారు. అలేఖ్య నాకేంటి కుడికన్ను అదురుతుందని అనుకుంటుండగా ఆదర్శ్ ఫోటో దగ్గర నిల్చొని ఉన్న ఆర్మీ ఆఫీసర్ ని చూసి ఆదర్శ్ వచ్చాడేమోనని ఇంట్లో అందరికి చెప్తుంది. అందరూ ఒక్కసారిగా సంతోషంతో హల్ లోకి వస్తారు. ముకుంద మాత్రం షాక్ అవుతుంది. హాల్ లోకి వచ్చి చూసేసరికి ఆదర్శ్ ఫోటోని చూస్తున్న ఆర్మీ ఆఫీసర్ ని చూసి అందరూ షాక్ అవుతారు. ముకుంద మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. "కృష్ణ అంటే ఎవరు? ఆవిడ  ఆదర్శ్ ని వెతకమని పంపిన మెయిల్స్ వల్ల అతని గురించి తెలుసుకోగలిగాం. ఆదర్శ్ బ్రతికే ఉన్నాడు. తొందరలోనే ఎక్కడ ఉన్నాడో, తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తామని, కమాండర్ మీకు చెప్పమని నన్ను పంపించాడు" అని ఆర్మీ ఆఫీసర్ చెప్పడంతో అందరూ సంతోషపడతారు. నా కొడుకు, కోడలు పూజ చేయడం వల్లే ఆదర్శ్ గురించి తెలిసిందని రేవతి ఆనందపడుతుంది. "పూజ చేయడమే కాకుండా వాళ్ళకి మెయిల్స్ పంపిండం వల్లే వాళ్ళు వెతికారు. ఆచూకీ తెలిసింది.. ఇదంతా కృష్ణనే చేసింది" అని ఈశ్వర్ అంటాడు. ముకుంద కంగ్రాట్స్ ఆదర్శ్ వస్తున్నాడని కృష్ణ చెప్పడంతో.. "ఈ తింగరి పిల్ల నీ కోసం ఎంత పని చేసిందో.. నువ్వు తనకి నిజంగానే  థాంక్స్ చెప్పాలి" అని భవాని అంటుంది.   "ఇది మా కుటుంబానికి చాలా గ్రేట్ న్యూస్.. థాంక్యూ సర్"  అని ఆర్మీ ఆఫీసర్ తో మురారి అంటాడు. మురారి అలా సంతోషంగా ఉండడంతో.. ఏంటీ మురారి, ఆదర్శ్ వస్తే నన్ను వదిలించుకోవచ్చు. నా టార్చర్ ఉండదు అనుకుంటున్నావా అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఆదర్శ్ గురించి తెలిసేసరికి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చిలిపి గొడవలతో మరింత దగ్గర అవుతున్న రిషి, వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -682 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ లో.. ప్రాజెక్ట్ పని మీద రిషి, వసుధారలు బయటికి రాగా మధ్యలో కార్ ఆపి టీ తాగుతారు. ఇలా నీతో కలిసి టీ తాగుతుంటే బాగుందని వసుధారని ఉద్దేశించి మనసులో అనుకుంటాడు. ఇక వాళ్ళు వెళ్ళవలిసిన వీలేజ్ కి చేరుకొని, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి అక్కడున్న పిల్లలకు, తల్లిదండ్రులకు వివరిస్తారు. కిట్స్ ఇచ్చి బయలుదేరుతుండగా అక్కడున్న ధర్మయ్య అనే వ్యక్తి వాళ్ళిద్దరిని ఆపి.. "సర్ మా పిల్లలకు, ఇక్కడున్న వాళ్ళకి ఇంత సహాయం చేస్తున్నారు. మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి" అని అంటాడు. లేదండి మీకెందుకు శ్రమ అని రిషి అనగా.. "మేము తినేదే మీకు పెడతాం సర్ రండి" అని అతను అంటాడు. సరే  అంటాడు రిషి.. వసుధార బ్యాగ్ లోంచి చాక్లెట్ తీసి.. సర్ చాక్లెట్ తిందామా ఒక్కటే ఉంది సర్ అని అంటుంది. గతంలో వసుధార ఎంగిలి చేసి రిషికి ఇచ్చింది గుర్తు చేసుకొని.. తన చేతిలో నుండి ఆ చాక్కెట్ తీసుకుంటాడు. రిషి సగం తినేసి ఇస్తాడేమో అని వసుధార ఎదురుచూస్తుంది. కానీ రిషి అలా చెయ్యకుండా మొత్తం చాక్లెట్ తినేస్తాడు. వసుధార అలానే ఆశ్చర్యపోయి చూస్తుంది. రిషి, వసుధారలు ధర్మయ్య ఇంటికి వెళ్ళగానే భోజనానికి అన్ని సిద్ధం చేస్తారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తుండగా.. "సర్ మీరు మా ఇంటికి రావడం సంతోషంగా ఉంది" అని ధర్మయ్య అంటాడు. అవును కొత్త దంపతులు చిలక గోరింకల్లా ఉన్నారని ధర్మయ్య భార్య అంటుంది. అది విన్న రిషి మనసులో సంతోషంగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నంత సేపు భార్య భర్తలు అన్నట్లుగా ధర్మయ్య దంపతులు మాట్లాడుతారు‌. హస్బెండ్ అండ్ వైఫ్ కాదని నువ్వు చెప్పొచ్చు కదా అని వసుధారని రిషి అంటాడు. మీరే చెప్పొచ్చు కదా అని రిషిని వసుధార అంటుంది. భోజనం చేసిన తర్వాత ఇద్దరు బయటకొచ్చి అక్కడ నుండి వెళ్తుంటారు. "మళ్ళీ వచ్చే సంవత్సరానికి పాపతోనో బాబుతోనో కలిపి రావాలి" అని ధర్మయ్య దంపతులు అంటుంటే..  సిగ్గు పడుతుంది వసుధార. వెళ్ళొస్తాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు. మళ్ళీ మొదలవుతుంది కోల్డ్ వార్. వసుధార కార్లో నిద్రపోతుంటే తను పడుకుంది. నేనేమైనా డ్రైవర్ అనుకుంటుందా అని కార్ ని మలుపులు తిప్పుతు బ్రేక్ వేస్తాడు. వసుధార ఒక్కసారిగా కళ్లు తెరిచి.. "ఏంటీ సర్ ఈ డ్రైవింగ్" అని అంటుంది. "హా ఏంటి.. పోనీ నువ్వు నడుపు నేను పడుకుంటాను" అని రిషి వెటకారంగా అంటాడు. ఇంతలో వసుధారకి మినిస్టర్ గారు ఫోన్ చేసి రమ్మంటాడు. ఇద్దరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే వసుధార నీకు పెళ్లి అయిందని విన్నాను. నా తరుపున ఈ చిన్న కానుక అని ఇస్తాడు.  మినిస్టర్ గారు ఒక వైపు.. రిషి ఒక వైపు అలా ఇద్దరి చేతుల మీదుగా వసుధారకి గిఫ్ట్ ఇస్తారు. చాలా థాంక్స్ సర్ అంటుంది వసుధార. మీ హస్బెండ్ ఏం చేస్తారని మినిస్టర్ అడుగగా... నా హస్బెండ్ ఆల్ రౌండర్ అని చెప్తుంది. ఒకసారి మా ఇంటికి భోజనానికి నువ్వు నీ భర్త కలిసి రావాలని మినిస్టర్ గారు అనగానే.. సరే సార్ రిషి సర్ ని కూడా తీసుకొస్తా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.