అసలు నిజం తెలుసుకున్న రాహుల్.. అద్దాల మేడలో కావ్యకు గది లేదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో.. రాజ్ ని పెళ్ళి చేసుకొని ఇంట్లోకి వచ్చిన‌ కావ్యని  వాళ్ళ అత్తమ్మ అపర్ణ .. తన కన్నవాళ్ళతో మాట్లాడకుండా ఉండాలని మాట ఇవ్వమంటుంది. దానికి కావ్య .. "ఈ ప్రపంచంలో ఎన్నో  మార్పులను సృష్టిస్తున్నాయి ఈ ఋతువులు.. మనుషులు మీరు.. మిమ్మల్ని మార్చలేవా.. మీరు మారుతారనే నమ్మకంతో మాట ఇస్తున్నాను" అని కావ్య ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రాజ్ వాళ్ళ నానమ్మ .. పెళ్ళికూతురిని అలా నిలబెట్టి మాట్లాడుతున్నారు ఎవరైనా ‌తనని గదిలోకి తీసుకెళ్ళండని చెప్పగా.. అందరూ ఏ రూంలోనూ ఖాళీ లేదని చెప్తారు. దీంతో రాజ్ నా రూం‌లో ఉంటుందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. నేను నీ గదిలో ఉంటే నీకు ఇష్టమేనా అని రాజ్ తో కావ్య అడుగగా.. నువ్వంటే ఎప్పటికీ ఇష్టముండదని చెప్తాడు. దాంతో నీకు ఇష్టం లేకుండా.. నువ్వు నన్ను భార్యగా ఒప్పుకునేవరకూ నీ గదిలో‌ అడుగుపెట్టను అని కావ్య చెప్తుంది. నీ జాలి నాకేం అవసరం లేదు. నువ్వు నాకు పొగరు అంటున్నావ్ కదా.. అది నా ఆత్మాభిమానం. ఆ తర్వాత అందరూ ఎక్కడవాళ్ళు అక్కడ వెళ్తారు. ఇంటిపనిమనిషి వచ్చి కావ్యని కిచెన్ లోకి తీసుకెళ్తుంది. ఇంతపెద్ద ఇంట్లో ఒక్క గది కూడా ఖాళీ లేదా.. అది ఏ రూం అని అడుగగా.. అది స్టోర్ రూం అమ్మా.. మీరు ఉండలేరని పనిమనిషి అంటుంది. గది అయితే చాలు సర్దుకుంటానని కావ్య చెప్తుంది. మరోవైపు రాహుల్, స్వప్న లు సంతోషంగా ఉంటారు. "మన పెళ్ళి విషయం ఏం చేశావ్ ? ఇప్పటికే మా అమ్మ నా గురించి ఏడుస్తుంది కావొచ్చు. మనం తొందరగా పెళ్ళి చేసుకొని వెళ్దాం. నేను తెలివైనవాడిని. గొప్పవాడిని చేసుకున్నాని నిన్ను మా అమ్మకి చూపిస్తాను" అని స్వప్న చెప్తుంది. అది విని రాహుల్ మనం గ్రాండ్ గా పెళ్ళి చేసుకుందామని, కాస్త టైం పడుతుందని చెప్తాడు. ఆ తర్వాత రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావ్ రాహుల్? రాజ్ పెళ్ళి ఆగిపోయింది తెలుసా? అని అడుగగా.. హా తెలుసు అమ్మా అని అంటాడు. "అన్నీ సగం సగం వినకు.. పూర్తిగా తెలుసుకో.. స్వప్నకి ఒక చెల్లెలు ఉంది. ఆ రోజు వినాయకుడికి రంగులు వేసింది కదా.. ఆ పూర్ గర్ల్.. ఆమెనంట. రాజ్ కి ఆ అమ్మాయితో పెళ్ళి అయింది. స్వప్న రిచ్ కాదు. మనం పెళ్ళిచూపులకి వెళ్ళిన ఇల్లు కూడా వాళ్ళది కాదంట. ఈ విషయాలన్నీ ముందే నాకు తెలుసు కానీ నేననుకున్నది నెరవేరాలని చెప్పలేదు" అని రుద్రాణి అంటుంది. "నాకైనా చెప్పుండాల్సింది కదా అమ్మా" అని రాహుల్ అంటాడు. చెప్తే ఏం చేసేవాడివి.. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోయిందని రుద్రాణి సంతోషపడుతుంది. ఇదంతా విన్న రాహుల్ "అయ్యో నేను చేసుకున్నది ఒక పూర్ గర్లా.." అని భాద, కోపం రెండూ ఒకేసారి వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

ఇమ్ము పొలంలో మొలకలొచ్చేలా చేసిన ఫరియా

ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు మూవీతో చిట్టిగా అందరి మనస్సులో నిలిచిపోయింది.   త్వరలో ఈమె సుధీర్ వర్మ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ‘రావణాసుర’ లో కనిపించబోతోంది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచవ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పుడు ఈమె బుల్లితెర మీద కనిపించి అలరించింది. "ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్" షోలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ప్రోగ్రాం మార్చ్ 19 న జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ ఈవెంట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తర్వాత ఇమ్మానుయేల్ జాతిరత్నాలు మూవీలో సాంగ్ కి  ఫరియా అబ్దుల్లాతో కలిసి డాన్స్ చేసాడు. "నెత్తి మీద మొలకలు రాని నాకు పొలంలో మొలకలు వచ్చేలా చేశారు." అనేసరికి ఫరియా నవ్వేసింది. ఇమ్ము పక్కన నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆమె వైపు తలెత్తి చూసి "మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు" అని కామెడీ చేసాడు. "ఈ మూవీలో నేను లాయర్ ని అండి" అని ఫరియా చెప్పేసరికి "జాతిరత్నాలు లాయర్" అని శ్రీముఖి అరుస్తూ చెప్పింది. ఫరియా రవి కృష్ణతో అలాగే దిలీప్ తో కలిసి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది. ఈ బ్యూటీ మూవీస్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ పక్కన కనిపించబోతున్న ఈ అమ్మడు మూవీలో ఎలా నటించిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

హోలీ సంబరాల్లో రిషీధారలు!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -709 లో.. రిషిని పిలవకుండానే ఇంట్లో జగతి,మహేంద్ర, ఫణింద్ర, వసుధార అందరూ కలిసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. అది చూసిన రిషి.. వీళ్ళంతా కావాలనే తనని పిలవలేదని అనుకుంటాడు. రిషి కిందకి వస్తుండగా వసుధారకి డాష్ ఇస్తాడు. ఆ తర్వాత "మనుషులని అర్థం చేసుకొనే బుక్స్ దొరుకుతాయి చదవండి సర్" అని వసుధార అంటుంది. "జెంటిల్ మెన్ అండ్ ప్రిన్స్ లాంటి పుస్తకాలే చదివాను" అని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వసుధార తన గదిలో బాధపడుతుంటుంది. రిషి సర్ మొదట్లో నా మీద కోపం ఉన్నా కూడా పైకి నవ్వుతూ ప్రేమగా పలకిరించేవాడు. ఇప్పుడు ప్రేమ ఉన్నా బయటికి కోపంగా మాట్లాడుతున్నాడు. రిషి సర్ బాధపడకుండా చూడాలని వసుధార అనుకుంటుంది. రిషి మరుసటి రోజు ఉదయం లేచి వసుధార కోసం ఇల్లంతా చూస్తాడు. "వసుధార ఏంటి ఎక్కడా కనిపించడం లేదు" అని మహేంద్రని రిషి అడుగుతాడు. "ఏమో రిషి.. జగతి కూడా కనిపించడం లేదు" అని మహేంద్ర అంటాడు. ఇంతలో రిషికి మెసేజ్ చేస్తుంది వసుధార. "సర్ త్వరగా రండి.. లొకేషన్ షేర్ చేస్తున్నా" అని మెసేజ్ చెయ్యడంతో.. రిషి తొందరగా వెళతాడు. ఇక అలాగే మహేంద్రకి కూడా జగతి మెసేజ్ చేసి రమ్మంటుంది. అలా మహేంద్ర వెళ్తుండగా.. అతని దగ్గరికి దేవయాని వచ్చి.. జగతి, వసుధారలు ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు రిషి ఎక్కడికి వెళ్తున్నాడని అడుగుతుంది. "నాకేం తెలియదు" అని మహేంద్ర సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వసుధార దగ్గరికి వెళ్ళిన రిషి.. "ఏంటి వసుధార.. నువ్వు ఇలా చెప్పకుండా వస్తే ఎంత టెన్షన్ అవుతుంది" అని కోప్పడతాడు. అప్పుడు వసుధార కూల్ గా ఉండండని అంటుంది. ఆ తర్వాత "హ్యాపీ హోలీ" అంటూ రిషి చెంపలపై కలర్ పూస్తుంది. రిషి మొదట కోప్పడినా తర్వాత కూల్ అయి వసుధారకి కూడా కలర్ పూస్తాడు. అలాగే జగతి "హ్యాపీ హోలీ రిషి" అని చెప్పగానే.. కొద్దిసేపు సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత "హ్యాపీ హోలి" అంటూ చెప్తాడు. అలా అందరూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శ్రీదేవి డ్రామా కంపెనీలో 'బలగం' డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తోంది. దానికి సంబందించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బింబిసార మూవీ స్పూఫ్ చేసి చూపించారు హైపర్ ఆది, నాటి నరేష్. ఆదిసార పేరుతో రాజు గెటప్ లో ఆది వచ్చాడు. సెట్ లో ఏర్పాటు చేసిన మాయా అద్దంలో తనను తాను చూసుకుని "ఏమి ఈ రాజసం, ఏమి ఈ తేజస్సు" అని తెగ సంబరపడ్డాడు ఆది. "ఇదేదో బొగడా దర్పణంలా ఉంది లేదంటే రాజసం, తేజస్సు అవన్నీ నీకు ఎక్కడున్నాయి" అని నాటీ నరేష్ ఆదిని అనరాని మాటలు అని పరువు తీసేసాడు.  ఆ తర్వాత వాళ్ళు ఆ  అద్దాన్ని టచ్ చేసేసరికి  శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ లో వచ్చి పడ్డారు. అక్కడకు వచ్చి "మాకు మాయా దర్పణం కావాలి అని బులెట్ భాస్కర్ ని అడిగేసరికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు స్కిట్స్ అవి చేసి దాన్ని పట్టుకుపోయారు. అది కావాలంటే ఆ టీంని పిలిపించాలి" అని చెప్పాడు. ఆ తర్వాత ఇమ్మానుయేల్ వచ్చి "మా ఇంటికి ఒకసారి రండి సర్...చంద్రముఖి అక్కడే ఉంది వేంకటపతి రాజా గారు" అని బింబిసార గెటప్ సూట్ కాలేదన్న విషయాన్నీ ఆదికి ఇండైరెక్ట్ చెప్పాడు.  తర్వాత 'బలగం' మూవీ టీమ్ స్టేజి మీదకు వచ్చింది. "సక్సెస్ ని షేర్ చేసుకోవడానికి నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి రాలేదు..నా ఇంటికి వచ్చాను..చాలా రోజుల తర్వాత నా ఇంటికి వచ్చినందుకు ఈ ల్యాండ్ కి.." అంటూ తాను నిలబడిన నేలను వంగి ముద్దాడాడు వేణు. ఇందులో సాయి సన్విద్ పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఇక స్టేజి మీదకు ఎస్తేర్ వచ్చింది. దాంతో "ఎంతమంది ఎస్తేర్ ఫాన్స్ ఇక్కడ" అని రష్మీ అడగడంతో అందరూ కెవ్వున అరిచారు. తర్వాత రీతూ చౌదరిని స్టేజి మీదకు పిలిచింది రష్మీ.."నీ జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయి" అనేసరికి రీతూ ఎమోషనల్ ఐపోయింది. "సాయిబాబా పటం పెట్టుకోవాల్సిన దగ్గర మా నాన్న పటం పెట్టుకోవాల్సివచ్చింది ఇప్పుడు" అని చెప్తూ ఏడ్చేసింది.

తెరవెనుక ఎంతో కష్టపడ్డాం.. అయినా ప్రోమోలో చూపించరా?

బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ ప్రస్తుతం 'బీబీ జోడి' డ్యాన్స్ షోతో బిజీబిజీగా ఉన్నాడు. తేజస్వితో కలిసి రచ్చ రంబోలా చేస్తూ తన డ్యాన్స్‌తో అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అఖిల్ తన ఫాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటాడు. అప్పుడప్పుడు తేజుతో కలిసి షికార్లకు కూడా వెళుతూ ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు కూడా చెబుతూ ఉంటాడు. రీసెంట్ గా మరి ఏమయ్యిందో మరి హాస్పిటలైజ్ కూడా అయ్యాడు. కానీ దాని డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. బీబీ జోడిలో  వీళ్ళ డాన్స్ అంటే చాలు అలనాటి అందాల నటి రాధ ఒక రేంజ్ లో హుషారైపోతుంది. రతీ, మన్మధుల్లా ఉన్నారంటూ కామెంట్స్ కూడా ఇచ్చేస్తుంది. ఐతే వాళ్ళ డాన్స్ మీద పాజిటివ్, నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. బుల్లితెర మీద ఇలాంటి షోస్ లో వస్తున్న ఈ పెర్ఫార్మెన్సెస్ కి సెన్సార్ లేదా అని అడిగిన నెటిజన్స్ కూడా ఉన్నారు.  ఇక ఇప్పుడు అఖిల్ ఒక విషయంగా చాలా బాధపడుతున్నాడు. తన బాధను ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఎవరికో తెలియాలి అన్నట్టుగా పోస్ట్ చేసాడు.  "వాళ్లకు మా డాన్స్ నచ్చకపోతే పోయింది. కానీ మేము కూడా బీబీ జోడి షోలో ఒక భాగం అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నాకు అర్ధం కానీ విషయం ఏమిటి అంటే వాళ్ళ టీఆర్ఫీలా కోసం నాతోనే ఎందుకు ఆడుకుంటారో తెలీదు .. ప్రోమోలో రెండు సెకెన్లు కూడా చూపించలేదు మేము చేసిన డాన్స్. తెర వెనుక మేము ఎన్ని రోజులు, ఎన్ని గంటలు కష్టపడితే కదా మాకు ఇంత పర్ఫెక్షన్ వచ్చేది." అంటూ చాలా బాధపడ్డాడు.  బిగ్ బాస్ తెలుగు సీజన్- 4, బిగ్ బాస్ నాన్ స్టాప్ రన్నరప్‌గా అఖిల్ సార్థక్ నిలిచాడు. అఖిల్, తేజు  బిగ్‌బాస్ ఓటిటి కంటెస్టెంట్లు కూడా. ఇప్పుడు బీబీ జోడిలో వీళ్ళ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో హాట్ గా ఎంటర్టైన్ చేస్తోంది.

అమ్మ, ఆవకాయ్, ఆర్పీ పాటలు అస్సలు బోర్ కొట్టవు

ఉగాది పండగ వస్తున్న సందర్భంగా చానెల్స్ లో కొత్త కొత్త ఈవెంట్  ప్రోమోస్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మల్లెమాల యాజమాన్యం "కలిసుందాం రండి" అనే థీమ్ తో ఒక కొత్త ఈవెంట్ ని పండగ రోజు 22 న ప్రసారం చేయడానికి ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ప్రోమోస్ ని ఒక్కొక్కొటిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి అలనాటి అందాల నటి లయ ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో లయ తన కూతురితో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తోంది. ఇప్పుడు "ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా" అని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సాంగ్ వినిపిస్తుంటే ఆమె అందంగా పింక్ కలర్ శారీలో నవ్వుతూ వచ్చింది. ఆమెకోసం హైపర్ ఆది పాట కూడా ఆ పాటే  పాడేశాడు..యాంకర్  ప్రదీప్ స్టెప్స్ వేసాడు. తర్వాత ఆర్పీ పట్నాయక్ వచ్చి "నిండు గోదారి కదా" అనే సాంగ్ పాడేసరికి "స్వీట్ వాయిస్ అంటూ వినడమే కానీ ఇప్పుడు ఇలా వింటున్న" అని హైపర్ ఆది పొగడ్తలతో ముంచెత్తాడు. అమ్మ, ఆవకాయ్, ఆర్పీ పట్నాయక్ గారి పాటలు ఎప్పటికీ అస్సలు బోర్ కొట్టవు  అలాగే కౌసల్య కూడా మంచి సాంగ్స్ పాడి అలరించింది. ఇక ఈ స్టేజి మీద కార్తీక దీపం సీరియల్ లో నటించిన సూర్య, హిమ ఇద్దరు కలిసి ఒక క్లాసికల్  సాంగ్ కి డాన్స్ చేశారు. జ్ఞానేశ్వర్, యాదమ్మరాజు కొంతమంది కమెడియన్స్ కలిసి ఆటో రాంప్రసాద్ తో  రిక్షా తొక్కిస్తారు. "చుట్టాలింటికి వెళ్ళాలి అని రిక్షా మాట్లాడమంటే నాతో రిక్షా తొక్కిస్తారా" అని కామెడీ గా ఫైర్ అయ్యేసరికి "రిక్షాతో మాట్లాడాము కానీ అదే మాట్లాడ్డం లేదు" అంటూ ఒక ఆటో పంచ్ వేససరికి రాంప్రసాద్ సైలెంట్ ఐపోయాడు. ఇలా పండగ రోజు ఇంటిల్లిపాదినీ అలరించడానికి ఈ ఈవెంట్ రాబోతోంది.

శ్రీసత్యతో కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్!

అర్జున్ కళ్యాణ్.. బిగ్ బాస్ సీజన్-6 తో ఈ పేరు అందరికి సుపరిచితమే. అతను బిగ్ బాస్ లో ఉన్నంతవరకు శ్రీసత్య చుట్టూ తిరగడంతో షో కోసం పబ్లిసిటీ కోసం చేసాడని అనుకున్నారంతా కానీ అతను బయటకొచ్చాక ఒక్క శ్రీసత్య కోసమే తను బిగ్ బాస్ కి వెళ్ళినట్లు అర్జున్ చెప్పడంతో అందరి మద్దతు అతనికి లభించింది. అయితే బిగ్ బాస్ తర్వాత బిబి జోడీ మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అర్జున్-వాసంతి జోడీలుగా పర్ఫామ్ చేస్తున్నారు.  అయితే ఆదివారం 'విత్ అర్జున్.. ఆస్క్ మీ సంథింగ్' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టాడు అర్జున్. దీంతో తన అభిమానులంతా క్వశ్చనింగ్ స్టార్ట్ చేసారు. చాలా క్వశ్చన్స్ రాగా అందులో నుండి కొన్నింటికి మాత్రం సమాధానాలు చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టాడు అర్జున్ కళ్యాణ్. బిబి జోడీ జర్నీ తో మీరు హ్యాపీగా ఉన్నారా అంటూ ఒక అభిమాని ప్రశ్న అడుగగా.. " ఎస్ డెఫినెట్లీ.. ఎందుకంటే నా ట్యాలెంట్ ని, డ్యాన్స్ ని, యాక్టింగ్ ని నిరూపించుకోడానికి ఇదొక మంచి ఫ్లాట్ ఫామ్.‌ ఫస్ట్ టూ వీక్స్ లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత నేను వసంతి కలిసి బాగా ప్రాక్టీసు చేశాం" అని చెప్పాడు.  బిబి జోడిలో‌ మీ ఫేవరెట్ జోడీ ఎవరని అడుగగా.. సండే జోడీలలో‌ అయితే రవి-భాను జోడి, శనివారం జోడీలలో అఖిల్-తేజస్విని జోడి అంటే ఇష్టం. ఎందుకంటే తేజస్విని డ్యాన్ బాగా చేస్తుంది. ఆ తర్వాత సూర్య-ఫైమా జోడీ అంటే ఇష్టమని చెప్పాడు.   శ్రీసత్యతో మీ ఫ్రెండ్ షిప్ ఎలా ఉందని ఒకరు అడుగగా.. "కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్. కీప్ ఫైటింగ్ అండ్ పాచింగ్.. బట్ స్టిల్ వీ ఆర్ ఇన్ టచ్. అన్ అఫిషీయల్ గా కలుస్తుంటామని అర్జున్ చెప్పాడు.  సత్యతో కలిసి ఒక పర్ఫామెన్స్ లేదా రీల్ అయినా చేయొచ్చు కదా అని ఒకరు అడుగగా.. బిబి జోడిలోనే ఒక పర్ఫామెన్స్ చేసాం బట్ అది ఎడిట్ లో లేపేసారు. రీల్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్‌ సత్య .. ఏం అంటావ్ సత్య రీల్ అంట చేద్దామా అని సమాధనమిచ్చాడు అర్జున్. ఎలా ప్రతీదానిని పాజిటివ్ గా తీసుకోగలుగుతున్నారని ఒకరు అడుగగా.. " నాకు నెగిటివ్ థాట్స్ వస్తాయి కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకొని పాజిటివ్ గా తీసుకోడానికే ట్రై చేస్తుంటాను. నిన్నటి పర్ఫామెన్స్ లో సదా మేడం నన్ను ఒక కుక్కలా చేసావ్ అని చెప్పడంతో దాన్ని తీసుకొని నన్ను చాలా మంది ట్రోల్ చేసారు. ఆ ట్రోలింగ్స్ అన్నీ చూసాను. కానీ వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని పాజిటివ్ గా తీసుకున్నాని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మీ ఫెవరెట్ హీరో ఎవరని అడుగగా.. పవర్ స్టార్ మ్యానరిజంతో తను వసంతి కలిసి చేసిన పర్ఫామెన్స్ లోని ఒక ఫోటోని పోస్ట్ చేసి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పాడు అర్జున్ కళ్యాణ్. మీ అమ్మ నాన్నల ఫోటోలని చూపిస్తారా అని ఒక అభిమాని ప్రశ్నించగా.. అమ్మ, నాన్నలతో కలసి తను దిగిన ఫోటోలని కూడా పోస్ట్ చేసాడు.

తేజస్విని వల్లే అఖిల్ చాలా కంఫర్ట్ గా ఉన్నాడంట!

బిబి జోడి ప్రతీ శని, ఆదివారాల్లో స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. కాగా ఈ షోకి సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్జ్ లుగా వ్యవహరిస్తుండగా శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ప్రేక్షకుల కోసం.. ఇప్పటివరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్లలోని కంటెస్టెంట్స్ తో ఈ డ్యాన్స్ షోని ఏర్పాటు చేసారు. అయితే ఇందులో శనివారం పటాకా జోడీలు, ఆదివారం ధమాకా జోడీలు తమ పర్ఫామెన్స్ ఇస్తారు. మొదట ఫైమా-సూర్య కలిసి నాన్న- కూతురి మధ్య ఎమోషన్ బాండింగ్ తీసుకొని పర్ఫామ్ చేసారు. అది చూసాక షోలో అందరూ ఎమోషనల్ అయ్యారు. జడ్జ్ తరుణ్ మాస్టర్ కి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడని చెప్పాడు. "మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇలా ఉండటానికి మా నాన్నే కారణం. మా నాన్న నాకు రెండు విషయాలు చెప్పాడు. ఎస్ ఆర్ నో.. ఎస్ చెప్పే అవసరం వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. నో చెప్పాల్సి వస్తే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే చెప్పేయాలి" అని రాధ చెప్తూ ఎమోషనల్  అయింది. ఆ తర్వాత అఖిల్-తేజస్విని జోడి డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి రాధ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రతీదేవి-కామదేవుడు కలిసి డ్యాన్స్ చేసినట్టుగా ఉందని, వాళ్ళిద్దరి కనెక్షన్ బాగా కుదిరిందని రాధ చెప్పుకొచ్చింది. "కంపోజిషన్ నుంచి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ రెండు బాడీలు ఒక సోల్ లాగా బాగుంది. ఆ కలర్స్, మూమెంట్స్ అన్నీ బాగా కుదిరాయి. మీ ఇద్దరి పర్ఫామెన్స్ చూసి నాకు నోట మాట రావట్లేదు. డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ బ్యాక్. స్పీచ్ లెస్" అని సధా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తరుణ్ మాస్టర్ మాట్లాడుతూ.. "ఇద్దరి కెమిస్ట్రీ, అన్నీ బాగా కుదిరాయి. బాగుంది" అని చెప్పాడు. అయితే చివరలో‌.. తేజస్విని నీ గురించి ఒకటి చెప్పాలని రాధ తన మనసులోని మాటని బయట పెట్టేసింది. "రొమాన్స్ చేసేటప్పుడు ఇద్దరిలో అమ్మాయి ఒక స్టెప్  ముందు ఉంటూ కంఫర్ట్ ఇస్తుంది.‌ అది ఎవ్వరూ చేయలేరు.. అంత ఈజీ కాదు. తేజస్విని వల్లనే అఖిల్ చాలా కంఫర్ట్ గా ఉన్నాడు" అని రాధ చెప్పుకొచ్చింది.

హాస్పిటల్ లో అష్షు రెడ్డి... బ్లడ్ కావాలా?

ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి. కామన్ పీపుల్ ఐనా సెలబ్రిటీస్ ఐనా సరే ఫీవర్ వచ్చిందటే బెడ్ మీద పడాల్సిందే. ఇప్పుడు అదే  వైరల్ ఫీవర్ బారిన పడింది అష్షు..  ఆమె బ్రదర్ కూడా ఫీవర్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు . హాస్పిటల్ లో ఇద్దరూ సెలైన్ ఎక్కించుకుంటూ పడుకుని ఉన్నారు. ఈ విషయాన్ని వీడియోస్ తో సహా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది అష్షు.." అన్ని చోట్ల వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం" అని చెప్పి కాప్షన్ పెట్టింది. ఇక అష్షు ఫ్రెండ్ దీక్ష పంత్ తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. "నీకేమన్నా కావాలంటే చెప్పు..బ్లడ్ కావాలన్నా అడుగు" అని పోస్ట్ చేసింది. "నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నువ్వంటే నాకు అందుకే చాల ఇష్టం..." ఆమెకు రిప్లై ఇచ్చింది.  ఇక బుల్లితెర కమెడియన్స్ యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి, అష్షు హెయిర్ స్టైలిస్ట్ రవి అంతా కూడా "గెట్ వీల్ సూన్" అంటూ మెసేజెస్ పెట్టారు. "ఎవరూ ఇబ్బంది పడకండి...త్వరలో నేను మంచిగా తిరిగి వస్తాను. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు" అంటూ ఫాన్స్ కి అష్షు భరోసా ఇచ్చింది.  బిగ్‌బాస్ సీజ‌న్ 3 తో పాటు ఓటీటీ బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది అష్షు కానీ ఫైనల్స్ కి వెళ్లలేకపోయింది ఈ జూనియర్ సమంత.  ఇక రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూల ద్వారా ఈ అమ్మడు బాలా పాపుల‌ర్ అయ్యింది. రీసెంట్ గా ఆమె పాదాలు ముద్దాడుతూ.. వర్మ క్రియేట్ చేసిన  సెన్సేషన్ ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది.

‘రాధకు నీవేరా ప్రాణం’ త్వరలో కలుద్దాం

కార్తీకదీపం సీరియల్ కి, డాక్టర్ బాబుకి, తెలుగు ఆడియన్స్ ని విడదీయరాని అనుబంధం ఉంది. కార్తీక దీపం ఐపోయిన దగ్గర నుంచి రోజు డాక్టర్ బాబు, వంటలక్కను చూడక విసిగిపోయారు. అలాంటి తన ఫాన్స్ ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి డాక్టర్ బాబు త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందని డాక్టర్ బాబు అనౌన్స్ చేసాడు. ఇప్పటికే షూటింగ్ మొదలయ్యింది..త్వరలో కలుద్దాం అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. త్వరలో డాక్టర్ బాబు కొత్త సీరియల్ రాబోతోంది అంటే ఫాన్స్ ఊరుకుంటారా... వెయిట్ చేస్తున్నాం త్వరగా రండి అంటూ మెసేజెస్ పెడుతున్నారు. కొత్త ప్రాజెక్ట్ పేరేమిటి అని అడిగేసరికి "రాధకు నీవేరా ప్రాణం" అని కామెంట్ చేసింది జీ తెలుగు. ఇందిలో పోలీస్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. 'హిట్లర్ గారి పెళ్లాం' సీరియల్ ఫేమ్ గోమతి ప్రియ నిరుపమ్ కి జోడీగా నటిస్తోంది. నిరుపమ్ ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్‌లో నటించాడు. చంద్రముఖి, ప్రేమ, కార్తీక దీపం ఇలా అనేక సీరియల్స్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. 'కార్తీక దీపం' లో క్యారెక్టర్ బాగా హిట్ అవడంతో ఆయనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఆయన ప్రొడక్షన్‌లో వస్తున్న 'పల్లకిలో పెళ్లికూతురు' సీరియల్  ఆడియన్స్‌ను అలరిస్తోంది. "రాధకు నీవెరా  ప్రాణం" సీరియల్ డాక్టర్ బాబు ఏ రేంజ్ కి తీసుకెళ్లనుందో చూడాలి. "కార్తీక దీపం లాంటి మంచి కంటెంట్ ఉన్న సీరియల్స్ చేయండి...పోలీస్ ఐనా, డాక్టర్ ఐనా, కలెక్టర్ ఐనా ఏ క్యారెక్టర్ ఐనా నిరుపమ్ కే సూటవుతుంది..." అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్ అలా అడిగేసరికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన రీతూ!

రీతూ చౌదరి జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ రీతూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తుంది, రెగ్యులర్ గా రీల్స్ అప్ డేట్ చేస్తుంది.. ఎన్నో ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అవన్నీ బాగా వైరల్ అవుతుంటాయి. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు.. లాంటి సీరియల్స్ లోనూ నటించి మెప్పించిన రీతూ చౌదరికి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎక్కువే. లేడీ కమెడియన్‌గా సత్తా చాటుకుంటూ.. సోషల్ మీడియాలో తన అందంతో అట్రాక్ట్  చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ. జబర్దస్త్ కమెడియన్‌ అజార్‌తో ప్రేమలో ఉన్నట్లుగా ఎలివేట్ అయ్యే ఎన్నో స్కిట్స్ కూడా చేశారు. కొంత కాలం క్రితం ఒక కార్ కూడా కొనుక్కుంది రీతూ.  ఐతే రీసెంట్ గా ఒక నెటిజన్ రీతుని సోషల్ మీడియాలో అప్పు అడిగాడు. "నాకు ఒక లక్ష రూపాయలు కావాలి" అని అడిగేసరికి "నా జీవితంలో అప్పు ఇస్తే గనక అప్పు తీసుకున్నవాళ్లకు మంచి జరగదట" అని రిప్లై ఇచ్చి నోరుమూయించింది. అలాగే "మనీ ఉంటే ఏదైనా చేయొచ్చా" అని మరో నెటిజన్ అడిగారు. "డబ్బు కేవలం అవసరాల కోసం మాత్రం అదేమీ సంతోషాన్ని ఇవ్వదు...చావు రాకుండా ఆపదు...ఇలా చెప్తూ పొతే బోల్డు ఉన్నాయి. డబ్బుకి కాదు మనుషులకు విలువ ఇవ్వండి" అని హితోక్తి చెప్పింది రీతూ చౌదరి. "ప్రెజంట్ ఎక్కడ ఉన్నారు" అని మరో నెటిజన్ అడిగేసరికి "హాస్పిటల్ కి వచ్చాను కొన్ని టెస్ట్స్ కోసం" అంటూ రిప్లై ఇచ్చింది. "ఇంటర్ లో టోటల్ మార్క్స్ ఎంత" అని అడిగేసరికి " సారి రా నాన్న నాకు గుర్తులేదు..నేను యావరేజ్ స్టూడెంట్ నే" అని చెప్పింది.  

ఇండియన్ ఐడల్-2 లో 'శృతి'లయలు.. లేచి వెళ్ళిపోయిన తమన్!

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రతీ శుక్రవారం, శనివారం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతుంది. గ్రాండ్ గా మొదలైన ఈ షో.. మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ షో అల్టిమేట్ సింగింగ్ టాలెంట్ ని వెతికి తీయడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ షో కి జడ్జెస్ గా ఎస్ఎస్ థమన్, సింగర్ కార్తీక్, గీత మాధురి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. కాగా ఇందులో కంటెస్టెంట్ గా శృతి అనే అమ్మాయి పాడిన పాట హైలైట్ అయింది. అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటున్న తెలుగు అమ్మాయి నండూరి శృతి. తను అమెరికాలో ఒక డాక్టర్.. అయినా కూడా తనకు మ్యూజిక్ పై ఉన్న ఇష్టంతో ఇండియాకి వచ్చి చాలా ప్రోగ్రామ్ ల లో తన గాత్రం వినిపించింది. ఇంకా పలు రకాల మ్యూజిక్ ఆల్బమ్ లను చేసింది. మ్యూజిక్ ని మెడిసిన్ తో కలపడమే తన గోల్ అంటుంది శృతి. తాజాగా విడుదల అయిన ప్రోమోలో  'శ్రీరామరాజ్యం' మూవీలోని 'శ్రీరామ లేరా ఓ రామ' అనే పాటను పాడిన శృతి.. అందరిని తన గాత్రంతో ఆకట్టుకుంది. శృతి పర్ఫామెన్స్ చూసిన ఎస్ఎస్ తమన్ వచ్చి గోల్డెన్ టికెట్ తీసుకో అని చెప్తాడు. అప్పుడే పక్కన ఉన్న మరో జడ్జ్ కార్తీక్ వన్ సెకండ్ అని ఏదో చెప్తూ ఉండగా.. తమన్ తన సీట్ నుండి వెళ్ళిపోతాడు. దీంతో ఈ ప్రోమోపై అంచనాలు పెరిగాయి. షో పై హైప్ ని క్రీయేట్ చేయడానికి ఇలా చేసారో లేక శృతికి గోల్డెన్ టికెట్ ఇవ్వడం సింగర్ కార్తీక్ కి నచ్చలేదేమో మరి తెలియాలంటే ఈ షో పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇంటికొచ్చిన వసుధారని చూసి షాక్ అయిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -708 లో.. వసుధారని అత్తారింట్లో వదిలేసి వస్తాడు చక్రపాణి. ఆ తర్వాత వసుధార తులసి చెట్టుకు పూజా చేస్తుండగా.. పైనుంచి రిషి చూసి.. ఈ వసుధార ఏంటో ఎప్పుడు నా ముందే ఉన్నట్లు భ్రమ పడుతున్నానని అనుకుంటుంటాడు. ఆ తర్వాత పూజ గదిలో నుండి వస్తున్న వసుధారని చూసి.. తను ఏంటి ఇక్కడ! అని అనుకొని.. నువ్వు ఏంటి ఇక్కడ? అని రిషి అడుగుతాడు. ఇక్కడే ఉండిపోవడానికి వచ్చేసాను సర్ అని వసుధార చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత దేవయాని వచ్చి.. చూడు రిషి నువ్వు మీడియా ముందు నా భార్య అని చెప్పడంతో.. అదే మాటను పట్టుకొని ఇంట్లోకి వచ్చేసిందంటూ చెప్తుంది. వసుధార నా రూమ్ లోకి రా అని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు. ఇక వసుధార గదిలోకి వెళ్ళగానే.. "నువ్వు చేస్తుందేంటి వసుధార. ఇక్కడికి ఎందుకు వచ్చావ్" అని రిషి అడుగుతాడు. మీరు ప్రపంచానికి ఒక నిజం చెప్పారు. దాన్ని అబద్దం చేయకూడదని వచ్చేసాను సర్ అని వసుధార అంటుంది. "నువ్వు చేస్తుంది నీకైనా అర్థమౌతుందా వసుధార.. నువ్వు ఇక్కడ నుండి వెళ్లపో.. నేను ఆలోచించుకోవాలి" అని రిషి అనగానే సరేనని అక్కడ నుండి వచ్చేస్తుంది వసుధార. ఆ తర్వాత జగతి దగ్గరకి రిషి వస్తాడు. వసుధార చేసింది మీరు సమర్థిస్తున్నారా మేడమ్ రిషి అడుగుతాడు. "నేను ఒక మాట చెప్పాను. నువ్వు మీడియా ముందు ఒప్పుకున్నావ్.. దానినే వసు చేస్తోంది. అంతకు మించి ఏం చెప్పలేను" అని జగతి అంటుంది. ఇంట్లోనే రిషిని పిలవకుండా మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధార, జగతి, మహేంద్ర, ఫణీంద్ర మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి రిషి వచ్చి.. నన్ను పిలవకుండానే మీరు మాట్లాడుకుంటున్నారా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కన్నవాళ్ళతో బంధం తెంచుకుంటేనే కోడలిగా ఎంట్రీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -41 లో... రాజ్, కావ్యలని గుమ్మం దగ్గరే ఆపేసి మాట్లాడుతుంది రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నాకు ఇష్టం వున్నా లేకున్నా నేను ఈ ఇంట్లోనే ఉండాలని కావ్య అంటుంది. అలా కావ్య అనడంతో.. నువ్వింకా ఇంట్లోకే అడుగు పెట్టలేదు.. ఇలా మాట్లాడుతున్నావ్ అని అపర్ణ అంటుంది. హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకురాకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? వాళ్ళని ఇంట్లోకి రానివ్వు అని రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య అంటాడు. అప్పుడు అపర్ణ.. నా కడుపు బాధ, మీరైనా మామయ్యకు చెప్పండి అత్తయ్యా అని రాజ్ వాళ్ళ నానమ్మతో అపర్ణ అంటుంది. ఇంట్లో పెద్ద ఆయనే.. ఆయనకు ఎదురు చెప్పను అని రాజ్ నానమ్మ అంటుంది. ఆ తర్వాత సీతారామయ్య.. రాజ్ వాళ్ళ పిన్ని ధాన్యలక్ష్మిని  పిలిచి వాళ్ళిద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు తను హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది. కావ్య లోపలికి అడుగుపెట్టబోతుంటే అపర్ణ ఆగమని అంటుంది. ఇంట్లో  అందరూ మీ ఇంట్లో వాళ్ళదే తప్పని, నీ తప్పు లేదని నమ్ముతున్నారు.. నువ్వు ఇంట్లోకి రావాలంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని చెపుతుంది అపర్ణ. దానికి కావ్య చిన్నప్పటి నుండి ఇంట్లో ప్రేమగా పెంచి పెద్ద చేసిన వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నట్లుగా సమాధానమిస్తుంది. అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోమని అపర్ణ అంటుంది. మరోవైపు కనకం బాధపడుతూ ఉంటుంది. కావ్య ఆ ఇంట్లో ఎలా ఉందో? వాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటున్నారో? అని కావ్యనే తల్చుకుంటూ బాధపడుతుంది కనకం. మరోవైపు అపర్ణ వెళ్ళిపోమనడంతో కావ్య బయటకు వెళ్తుంటుంది. మధ్యలో రుద్రాణి కల్పించుకొని.. వదిన ఏం చేస్తున్నావ్ అంటూ అడుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి  కావ్యకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినవన్నీ గుర్తొస్తాయి. తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకొని వెనక్కి వచ్చి.. "ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ ఇంటిని వదిలి రావద్దని, మా నాన్న చెప్పాడు అందుకే వెళ్ళట్లేదు" అని అపర్ణతో కావ్య అంటుంది. అయితే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్లేనా అని అపర్ణ అనగానే.. మీ మనసు ఎన్నటికైనా మారకుండా ఉంటుందా అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మురారి మాటలకు మేడ మీద నుంచి దూకబోయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-102 లో.. నందు బాధ్యతలన్ని చూసుకోమని ముకుందతో చెప్తుంది భవాని. అలా భవాని చెప్పడంతో.. "ఎవరైతే ఏంటి చూసుకోవడానికి నందుకి బాగవడం మనకు ముఖ్యం" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత తలనొప్పిగా ఉందని కృష్ణ కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టుకొని తాగుతుండగా.. రేవతి వెళ్ళి.. "నువ్వు ఎంత మంచి కోడలివి. అప్పుడే కోపంగా ఉంటావ్. అప్పుడే మాములు అయిపోతావ్. అందరి గురించి ఆలోచిస్తావ్" అని కృష్ణని పొగుడుతుంది. ఇదంతా మా నాన్న దగ్గర నుండి వచ్చిందని కృష్ణ చెప్తుంది. మరోవైపు బాల్కనీలో ముకుంద కోసం మురారి ఎదురు చేస్తుంటాడు. ఇంతలో ముకుంద వచ్చి.. "ఏంటి మురారి ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని చూసాను.. ఇన్ని రోజులకి పిలిచావ్.. ఏం మాట్లాడాలి మన ప్రేమ గురించా" అని ముకుంద అంటుంది. ప్రేమ అంటే ఏంటి ముకుంద అని అడుగుతాడు మురారి. ఇదేం ప్రశ్న అని ముకుంద అంటుంది. "నువ్వు చేసే ఏ పని కూడా ప్రేమ కి సంబంధించినది కాదు. నువ్వు ఒక ఉన్మాదిలాగా, కసాయి దానిలాగా నా వెంటపడుతున్నావ్. నిలదీస్తున్నావ్.. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నువ్వు ఆ రోజు నేను కనబడితేనే అలా మాట్లాడావ్.. లేకుంటే హ్యాపీగానే పెళ్ళి చేదుకునేదానివి" అని మురారి అంటాడు. "నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడినా భరిస్తాను.. నా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడితే భరించలేను. ఆ రోజు నువ్వు ఎదురుపడకపోయుంటే పెళ్ళిపీటల మీదనే చచ్చిపోయేదాన్ని" అని ముకుంద అంటుంది. మరి ఏం చేస్తావ్ అని మురారి అనడంతో.. ముకుంద మేడ మీద నుండి దూకబోతుంటే మురారి ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. నీ ప్రేమని నమ్ముతున్నానని మురారి చెప్తాడు. "దయచేసి ఒకటి గుర్తు పెట్టుకో.. మనం ఎప్పటికీ కలవము" అని మురారి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మురారి గదిలోకి వెళ్ళేసరికి కృష్ణ తన ప్రశ్నలతో మురారికి చిరాకు తెప్పిస్తుంది. దాంతో ముకుందపై కోపాన్ని కృష్ణ మీద చూపించి గట్టిగా అరుస్తాడు. ఇక కృష్ణ ఫీల్  అయి ఉంటుందని మురారి సరదాగా ఆటపట్టిస్తాడు. కృష్ణ కూల్ అయ్యాక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

భవానికి ఎదురుతిరిగిన కృష్ణ.. అసలేం జరిగిందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 101 లో.. మురారికి కృష్ణ పానీపూరి తినిపిస్తుండగా.. ముకుంద వచ్చి ఆపుతుంది. "నువ్వు ఏంటిక్కడ?" అని కృష్ణ అడిగితే, పని మీద వచ్చానని చెప్తుంది. కొద్దిసేపు మాట్లాడుకొని కృష్ణ, మురారిలు ఒక కార్ లో, ముకుంద వేరే కార్ లో వెళ్తారు. అందరూ ఒకేసారి ఇంటికి చేరుకొని ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళు రావడం చూసిన భవాని "ముగ్గురు కలిసే వస్తున్నారా?" అని అడుగుతుంది. "లేదు పెద్దత్తయ్య.. వాళ్ళు ఇద్దరు కాలేజీ నుండి వస్తున్నారు. నేను బొటిక్ నుండి వస్తున్నాను" అని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత భవాని అక్కడ నుండి వెళ్తుంటే కృష్ణ ఆగమని చెప్తుంది. "మీతో మాట్లాడాలి అత్తయ్య" అని కృష్ణ అనగానే.. "ఏం మాట్లాడాలి.. మళ్ళీ ఏం విప్లవం స్పష్టించబోతున్నావ్?" అని భవాని అడుగుతుంది. "లేదత్తయ్యా.. మా సీనియర్ డాక్టర్ తో నందినికి మందులు రాపించుకొని తీసుకొని వచ్చాను.. ఇక నుండి అవే వాడదాం" అని కృష్ణ అంటుంది.‌  "నువ్వు జూనియర్ డాక్టర్ వి.. అలా వెళ్ళి రెండు రోజులు కాలేదు.. అంతా తెలిసినట్లు మాట్లాడుతున్నావ్?" అని ముకుంద అనగానే.. "నేను పెద్ద అత్తయ్యతో మాట్లాడుతున్నాను. నువ్వు కలుగజేసుకోకు" అని కృష్ణ అంటుంది. "ఆ టాబ్లెట్స్ స్లో పాయిజన్ ఎక్కించినట్లుగా ఉంటుంది.. అందుకే నందు భయపడుతుంది" అని కృష్ణ అంటుంది.  దానికి సమాధానంగా.. "మేము పెద్ద సూపర్ స్పెషలిటీ సీనియర్ డాక్టర్ ని అడిగి.. ఆ మందులు వాడుతున్నాం" అని భవాని అంటుంది. అయినా సరే వినకుండా తను తెచ్చిన టాబ్లెట్స్ వాడతానని కృష్ణ గట్టిగా వాదిస్తుంది. ఇక ముకుంద కలుగచేసుకొని.. "పెద్దత్తయ్య నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పయింది.. నిన్న కాక మొన్న వచ్చి  పెద్దత్తయ్య మాటకే ఎదురు చెప్తున్నావ్" అని ముకుంద అంటుంది.  "నేను నిన్న కాక మొన్న వస్తే.. నువ్వు పుట్టగానే ఏం రాలేదు కదా. నాకంటే నాలుగు రోజుల ముందు వచ్చావ్" అని కృష్ణ అంటుంది. ఇక మధ్యలో మురారి కలుగజేసుకొని.. "నీకు ఆదర్శ్ తాళి కడితే నువ్వు ఈ ఇంటికి ఎలా వచ్చావో.. నేను తాళి కడితే కృష్ణ నా భార్యగా ఈ ఇంటికి అలాగే వచ్చింది" అని అంటాడు. "టాబ్లెట్స్ వేసుకోనని మీ అమ్మతో చెప్పు నందు" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత నందు భవాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. "నేను ఆ టాబ్లెట్స్ వేసుకోను అమ్మా" అని పిలిచేసరికి ఎమోషనల్ అవుతుంది భవాని. "ఇక నందు బాధ్యతలు అన్నీ ముకుంద నువ్వే చూసుకో.. కృష్ణ నువ్వు పట్టించుకోకు" అని భవాని చెప్పడంతో.. సరేనని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అది లేకుండా నేను అస్సలు ఉండలేను..!

  దీప్తి సునైనా కొన్నాళ్ల నుంచి ఒంటరిగా ఉంటోంది. ఆమె తన లవర్ షణ్ముఖ్ జస్వంత్ కి గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలుసు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేయడం నచ్చక దీప్తి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. షణ్ముఖ్-సిరి హద్దులు దాటి వ్యవహరించడాన్ని బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యింది. ఆ  తర్వాత షణ్ముఖ్ ని వదిలేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కి చెప్పింది. షణ్ముఖ్ తో నాకున్న లాంగ్ రిలేషన్ షిప్ కి బ్రేక్. మేమిద్దరం విడిపోతున్నామని ఒక పోస్ట్ పెట్టింది. ఇక  ఎవరి దారిలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వెబ్ సిరీస్, కవర్ పేజీ సాంగ్స్ చేసుకుంటూ బిజీ ఇపోయారు.  దీప్తి అప్పుడప్పుడు అందాల విందు చేస్తూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి తెగ ట్రై చేస్తూ పోస్టులు పెడుతుంది. షన్నుతో కలిసిపోవాలి అని ఎంత మంది ఫాన్స్ అడిగినా కూడా ఆ మాట దాటేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు తన ఫాన్స్ తో ఇన్స్టాగ్రామ్ ముచ్చట్లు పెడుతుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కొంటె ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటుంది.  రీసెంట్ గా ఒక నెటిజన్ "కీరా అంటే ఎందుకు ఇష్టం (డోంట్ స్కిప్)" అని అడిగేసరికి "నేను అది లేకుండా అది నేను లేకుండా ఉండలేము" అని కొంటె ఆన్సర్ ఇచ్చింది. "కార్ నీదేనా దీపు" అని అడిగేసరికి " లేదు..నాకు కార్ లేదు.. నేను క్యాబ్ లో వెళ్తుంటాను" అని చెప్పింది. దీప్తి బిగ్ బాస్ తెలుగు సీజన్ టులో కనిపించింది. అందులో హీరో తనీష్‌తో కలిసి రచ్చ చేసింది. దీంతో అప్పట్లో ఆమె మీద చాలా ట్రోల్స్  వచ్చాయి.  ఇక ఈమె 'ఏమోనే' అనే క్యూట్ సాంగ్‌ కూడా చేసింది.

ఆడాళ్ళు మీకు జోహార్లు అంటున్న మోనిత

రీసెంట్ గా జరిగిన ఉమెన్స్ డే వేడుకలు బయట ఎలా జరిగాయో తెలీదు కానీ సోషల్ మీడియా మాత్రం హోరెత్తిపోయింది. అందులోనూ హోలీ కూడా వచ్చేసరికి చాలా మంది లేడీస్ రంగులు పూసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఐతే కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టి మాత్రం ఉమెన్స్ డేని వేరుగా సెలెబ్రేట్ చేసుకుంది. మోనితలా రెడీ అయ్యి కొన్ని చీరలు కొనుక్కుని కార్ లో బయల్దేరింది. మధ్యలో ఒక కొబ్బరి బొండాలు అమ్మే ఆవిడ దగ్గరకు వెళ్లి కొబ్బరిబోండాం కొనుక్కుని తాగింది. బొండాలు అమ్మిన ఆవిడ మోనితను చూసి గుర్తు పట్టింది కానీ మోనిత మాత్రం టీవీలో కనిపించేది నేను కాదు మా సిస్టర్ అని చెప్పి తప్పించుకుంది. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఈ చీర..అంటూ ఒక ప్యాకెట్ ని ఆమె చేతిలో పెట్టింది. ఒక కొబ్బరి బోండాన్ని మోనిత కొట్టింది. మహిళలు అంటే ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పింది.  అలాగే కుండలు అమ్ముకునే బామ్మ దగ్గరకు వెళ్లి ఆమె చేతికి ఒక చీర ఇచ్చింది. తర్వాత చెరకు రసం అమ్మే ఆవిడ దగ్గరకు వెళ్ళింది. చెరకు మెషీన్ లో చెరకు పెట్టి రసం తీసింది. ఆ తర్వాత చెరకు రసం అమ్మే ఆవిడ చేతిలో చీర పెట్టి విషెస్ చెప్పింది. ఆ తర్వాత రోడ్డు మీద కనిపించిన ఒక స్కూల్ ఆయమ్మలుగా పని చేసే ముగ్గురు ఆడావాళ్లను పిలిచి విషెస్ చెప్పి చీరలు ఇచ్చింది. కాసేపు ఆ ముగ్గురు లేడీస్ కి మోనితకు మధ్య ఆడవాళ్లు గొప్పా - మగవాళ్ళు గొప్ప అనే విషయం మీద చిన్న డిబేట్ కూడా జరిగింది. తర్వాత హౌస్ కీపింగ్ చేసే ముగ్గురు యువతులకు కూడా చీరలు ఇచ్చింది. పెట్రోల్ బంక్ లో పని చేసే అమ్మాయికి కూడా చీర ఇచ్చింది. ఆమెకు ఆడపిల్లలు పుట్టారని తన భర్త  వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడని, కానీ ఆమె మాత్రం పెట్రోల్ బంక్ లో పని చేస్తూ కూతుళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేసిందని ఇప్పుడు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పింది మోనిత. ఇలా చాలా మంది లేడీస్ ని కలిసి వాళ్ళ కష్టాలు విని ఆడవాళ్లు ఎక్కడా తగ్గరు అని ప్రూవ్ చేసి చూపింది. యూట్యూబ్ లో తన ఛానల్ లో పెట్టిన ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇంత దరిద్రమైన స్కిట్ ని నేనెప్పుడూ చూడలేదు!

జబర్దస్త్ కామెడీ షోలో ప్రతీ వారం ఏదో ఒక స్కిట్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ గా ఉంటోంది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ముందుగా రాఘవ తన స్కిట్ తో ఎంట్రీ ఇచ్చాడు "ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య భయం. ఫస్ట్ స్కిట్ చేయబోయే టీమ్ లీడర్ కి భయం.. ఈ స్కిట్ చూసి జడ్జెస్ కి భయం.. మళ్ళీ పాత పంచులే వస్తాయేమో అని" రాఘవ అనేసరికి "వస్తాయేమో ఏమిటి వస్తున్నాయి" అని ఇంద్రజ కౌంటర్ వేసింది. "ఎవరికైనా భయం గుండెల్లో గూడు కట్టుకుంటుంది.. కానీ నాకు భయం బంగళా కట్టేసుకుంది" అన్నాడు రాఘవ. ఇలా ఈ స్కిట్ సాగితే ఫైనల్ గా నూకరాజు టీమ్ ఎంట్రీ ఇచ్చి స్కిట్ పెర్ఫార్మ్ చేసింది. నూకరాజు టీమ్ మొత్తం రివర్స్ ఫామిలీ ఎలా ఉంటుందో స్కిట్ చేసి చూపించారు. నూకరాజు లేడీ గెటప్ లో ఇల్లు ఊడుస్తూ ఉంటాడు "పాల అబ్బాయి వచ్చి ఇంట్లో అందరూ ఆరోగ్యంతో ఉన్నారా" అని అడిగేసరికి " దేవుడి దయ వలన అందరికీ ఆరోగ్యాలు పోయాయి. నిన్నే రీసెంట్ గా మా ఆయనకు ఒక కాలు పడిపోయింది. దేవుడికి మొక్కుకుంటే రెండు కాళ్ళు పడిపోయాయి" అని చెప్పేసరికి ఇంద్రజ ఒక్కసారి షాకైపోయి చూసింది. అసలేం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఒక అర్థంకాని ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. ఇక ఈ స్కిట్ అయ్యాక  హోస్ట్ సౌమ్య వచ్చి ఇది రివర్స్ స్కిట్ కాబట్టి నేను కూడా రివర్స్ లోనే అడుగుతాను "ఈ దరిద్రమైన స్కిట్ ఎలా ఉంది" అని జడ్జెస్ ని అడిగేసరికి "నేను కూడా ఇంత దరిద్రమైన స్కిట్ ఇంతవరకు చూడలేదు" అని కృష్ణ భగవాన్ పంచ్ వేశారు. దాంతో అందరూ నవ్వేశారు. అలాగే రాఘవ, శాంతి స్వరూప్ వేసిన స్కిట్ ప్రోమో కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది.