సౌజన్య కూతురి కాళ్లకు పట్టీలు తొడిగిన బాలయ్య

ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో పోటీ పడుతున్న సింగర్స్ ని ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేసే ఒక కొత్త సంస్కృతికి రూపం ఇచ్చింది ఆహా టీమ్. దానికి గాల విత్ బాల పేరు పెట్టి  బాలయ్య బాబుతోనే పరిచయ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు కంటెస్టెంట్ సౌజన్య వంతు వచ్చింది. "వచ్చింది వైజాగ్ వీరనారి...సింగింగ్ తోనే చేస్తుంది స్వారీ...సౌజన్య..ఓ సౌజన్య...నువ్వు ఇన్స్పిరేషన్ ఆఫ్ ఈ దునియా" అంటూ టాప్ 12 సెలెక్ట్ ఐన కంటెస్టెంట్ సౌజన్యాని తన సాంగ్ తో ఇంట్రడ్యూస్ చేశారు బాలయ్య. "గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ నుంచి ఎకిమీడా..నా జత విడనని వరమిడవ" అనే సాంగ్ ని పాడింది. ఇక ఈ సాంగ్ కి అందరూ ఫిదా ఇపోయారు " యు అరెస్టెడ్ అవర్ ఇయర్స్..నిజంగా శ్రేయా గోషాల్ వాయిస్ వింటున్నట్టే ఉంది " అని థమన్ అన్నారు. "ఎన్ బికె గారి టాప్ 12  అంటే టాప్ క్లాస్" అంది మరో జడ్జి గీతామాధురి. ఇక సౌజన్య పెర్ఫార్మెన్స్ కి ఆమె గాత్రానికి ముగ్దులైపోయి అందరూ కలిసి ఒకేసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసారు. అలా సౌజన్య ఫామిలీ మొత్తం స్టేజి మీదకు వచ్చింది. తరువాత  బాలయ్య కూడా స్టేజి మీద వాళ్ళతో కలిసి సందడి చేసారు అలాగే సౌజన్య చిన్నారి కూతురుకి చిన్న కానుక అని చెప్పి ఆమె కాళ్లకు పట్టీలు తొడిగారు. కాసేపు ఎత్తుకుని ముద్దాడారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా' తన జోరును కొనసాగిస్తోంది. కొత్త మూవీస్, కొత్త షోస్, కొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు చాల దగ్గరయింది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 , అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి కొత్త రకాల కార్యక్రమాలతో తన జర్నీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఈ షోస్ అన్నిటికీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ షోలకు కొనసాగింపుగా సీజన్ 2 లు స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగానే స్టార్ట్ ఐన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 దుమ్ము రేపడానికి సిద్దమయ్యింది. వీకెండ్స్ లో ఆడియన్స్ ని అలరించడానికి వచ్చేస్తోంది.

శృతి మించిన రోహిణి పెర్ఫార్మెన్స్...ఇబ్బంది పడిన ఆది సాయికుమార్

ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్ ఫంక్షన్ కి ఆది సాయికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఈవెంట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చిరునవ్వే విసిరావే" అనే బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తుంటే ఆది స్టేజి మీదకు మెరిసిపోయే బ్లాక్ డ్రెస్ లో మెస్మోరైజ్ చేసేసాడు. ఫస్ట్ టైం ఆది బుల్లితెర మీద తన డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరి మైండ్స్ ని బ్లాంక్ చేసేసాడు. ఆయన వెనకే జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి లంగా వోణిలో ఎంట్రీ ఇచ్చేసింది. ఆది ఆమెను చూసి తలపట్టుకున్నాడు పాపం... "నేను ఎక్కడికి వెళ్లినా ఈవిడ వచ్చేస్తారు. ఎందుకో నాకు అర్ధం కావట్లేదు" అని ఆది చాలా ఫీల్ అయ్యాడు. రోహిణి మాత్రం అతని మాటలు పట్టించుకోలేదు తనను కాదు అన్నట్టుగా తన పని తాను చేసుకుపోయింది. "అస్సలేం గుర్తుకు రాదు" అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ తన వోణి పల్లూని ఆది ముఖం మీదకు విసిరి అతన్ని కొట్టి మరీ డాన్స్ చేసింది. ఆది పరిస్థితి అతని ఫేస్ లో కనిపించేసింది... ఐతే రోహిణి పెర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం శృతి మించి మరీ చిరాకు తెప్పించేదిగా ఉంది. ఇంతలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి "ఇంతకు మీకు ఆమె బికినీలో కావాలా, శారీలో కావాలా" అని ఆదిని అడిగింది. "ఆల్రెడీ సౌందర్య గారు శారీతో చేసేసారు వి విల్ గో విత్ బికినీ" అని యమా స్టైల్ గా చెప్పేసింది రౌడీ రోహిణి. ఆ మాటకు ఆది తలదించుకోక తప్పలేదు. ఇక ఈ షో ఈ ఆదివారం జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది.

కావ్య వేసిన ముగ్గు‌‌ చూసి ఫిధా అయిన రాజ్.. తనని భార్యగా ఒప్పుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ‌గురువారం నాటి ఎపిసోడ్‌-45 లో.. దుగ్గిరాల ఇంటి కొత్త కోడలు కావ్య ఉదయమే ఇంటిముందు ముగ్గు వేస్తుంది. కావ్య ఇంటిలోకి వెళ్ళాక.. రాజ్ వాళ్ళ నానమ్మ, పనిమనిషి శాంతం వచ్చి ఆ ముగ్గుని చూస్తారు. ఏంటే శాంతా.. అప్పుడే అపర్ణ ముగ్గు వేసిందా అని అడుగుతుంది. లేదమ్మా.. ఈ ముగ్గు వేసింది ఈ ఇంటి కొత్త కోడలు కావ్యమ్మ గారు అని పనిమనిషి శాంతం చెప్తుంది. అది చూసి రాజ్ వాళ్ళ నానమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. "ఏంటి ఆ అమ్మాయి వేసిందా.. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసే ఇల్లాలు ఇంటిని కూడా అంతే అందగా తీర్చిదిద్దుతుంది" అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. రాజ్ జాకింగ్ కి వెళ్ళి వస్తూ అక్కడ ఆగి వీళ్ళు మాట్లాడుకునేది అంతా వింటుంటాడు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళాక కావ్య వేసిన ముగ్గు చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆ ముగ్గు ఒకవేళ మా అమ్మ చూస్తే ఇంప్రెస్ అవుతుందని రాజ్ అనుకొని ముగ్గుని తన కాళ్ళకున్న షూస్ తో చెరిపేసి లోపలికి వెళ్తాడు. అలా రాజ్ చెరపడం కావ్య  చూస్తుంది.  కోపం ఉన్నా కూడా ఒక్కమాట కూడా అనకుండా కావ్య లోపలికి వెళ్తుంది. పనిమనిషి శాంతం ఆ ముగ్గుని చూసి అది చెరిపేసినవాళ్ళని తిడుతుంది. అలా తిట్టడం చూసి రాజ్ కోప్పడుతాడు. ఆ తర్వాత రాజ్ ని ఫ్రెష్ అయి రమ్మని వాళ్ళ నానమ్మ చెప్తుంది.  కాసేపటికి కళ్యాణ్, కావ్య దగ్గరికి వెళ్ళి నానమ్మ మిమ్మల్ని పిలుస్తుంది వదిన అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఈ రోజు నీకు కోడలిగా బాధ్యతలు అప్పగించాలి అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. అప్పుడే రెడీ అయి రాజ్ ఆఫీస్ కి బయల్దేరి వెళ్తుంటాడు. నేను పూజలో పాల్లొనను అని రాజ్ చెప్తాడు. అది చూసి రాజ్ నానమ్మ.. "మన‌ ఆచారాలను, సంప్రదాయాలను ఇలా‌ వద్దు అనకూడదు" అని రాజ్ తో అంటుంది. సరేనని రాజ్ ఒప్పుకుంటాడు. అక్కడ పూలు, పండ్లు, చీర, అన్ని రకాలు కలిపి ఉన్న ప్లేట్ ని తన భార్య కావ్యకి ఇవ్వమని రాజ్ కి ఇస్తుంది రాజ్ వాళ్ళ నానమ్మ. అది తీసుకున్న రాజ్‌.. "తనని నా భార్యగా ఒప్పుకోను. ఇంట్లో పనివాళ్ళకి ఇస్తున్నానని అనుకుంటాను. పనివాళ్ళలో‌ ఒకరు పెరిగారని అనుకుంటాను" అని రాజ్ ఆ ప్లేట్ ని కావ్యకి ఇవ్వాలనుకుంటాడు. కావ్య వద్దంటుంది. "నీ భర్త ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావమ్మా" అని కావ్యని వాళ్ళ చిన్న అత్తయ్య అపర్ణ అడుగుతుంది. "నన్ను భార్య అని ఒప్పుకొని‌ ఇవ్వమనండి.. ఆ రోజు కచ్చితంగా తీసుకుంటాను.‌ నేను బానిసని కాదు. నాకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉంటాయి కదా" అని కావ్య అంటుంది. అక్కడే ఉన్న రాజ్ వాళ్ళ అమ్మ.. "చూసారా అత్తయ్య ఎంత పొగరో.. మీ మాటకే ఎదురు సమాధానం చెప్తుంది. ఆత్మవిశ్వాసం అంటూ విప్లవ భావాలను వల్లె వేస్తుంది" అని రాజ్ వాళ్ళ నానమ్మతో అంటుంది. అది విని కావ్య.. నేను అలా అనలేదు అమ్మమ్మ గారు.. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. బానిసని కాదు అని అన్నాను. మీకు‌ ఎదురుతిరగలేదు. క్షమించండి అమ్మమ్మ గారు అని అంటుంది. ఆ తర్వాత రాజ్ చేతిలోని ప్లేట్ చిరాగ్గా విసిరేస్తాడు. అలా ప్లేట్ కిందపడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

త్వరలో డివోషనల్ సీరియల్ శ్రీ రేణుక ఎల్లమ్మ

స్టార్ మాలో ఈమధ్య కొత్త కొత్త సీరియల్స్ హడావిడి బాగా జోరుగా సాగుతోంది. బ్రహ్మముడి, మధురానగరిలో వంటి సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఐతే అది డివోషనల్ సీరియల్ అన్నమాట. "దుష్ట సంహారం కోసం ఒకే ఆత్మలో రెండు శక్తులు పరాశక్తి స్వరూపాలుగా అవతరించిన ఇద్దరు అమ్మాయిల కథ..శ్రీ రేణుకా ఎల్లమ్మ" అంటూ త్వరలో ప్రసారం కావడానికి ప్రోమోని రెడీ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది స్టార్ మా. ఐతే ఈ సీరియల్ టైం స్లాట్ వస్తుంది అనే విషయం  ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. ఐతే ఈ సీరియల్ కన్నడలో స్టార్ సువర్ణ ఛానల్ లో ప్రసారమవుతున్న  "ఊదోఊదో శ్రీ రేణుక ఎల్లమ్మకు డబ్బింగ్ వెర్షన్ త్వరలో తెలుగులో ప్రసారం కాబోతోంది. ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ సర్వారి ఎల్లమ్మ రోల్ లో నటిస్తోంది. ఈ చిన్నారి చార్లీ మూవీలో కూడా నటించింది. రేణుక రోల్ లో నమ్మ భైరవి నటిస్తోంది.  ఇందుమతి రోల్ లో తేజస్విని శేఖర్, మంగళా దేవి రోల్ లో వీణ పొన్నప్ప, విష్ణుమూర్తి రోల్ లో ఆర్యన్ రాజ్, రేణు మహారాజ్ రోల్ లో తారక్ పొన్నప్ప, స్వర్ణలత రోల్ లో లక్ష్య శెట్టి నటిస్తోంది. స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ టాప్  10లో ఉంటున్నాయి. వీటిల్లో ఎక్కువశాతం  బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి, కృష్ణ ముకుంద మురారి, మల్లీలాంటి సీరియల్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కొత్త సీరియల్ ఎలా ఉండబోతోంది ఏ టైం స్లాట్ లో ప్రసారం కాబోతోంది అన్న విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

డాక్టర్ గౌతమే సిద్ధు అని తను గుర్తుపట్టిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -106 లో.. ముకుందకి కౌంటర్ ఇచ్చి నందు కి భోజనం తీసుకొని వెళ్ళి తినమంటుంది కృష్ణ. అప్పుడు నందు తినకుండా.. నిన్ను బండి మీద తీసుకొచ్చిన అతను ఎవరని అడుగుతుంది. అతను మా గౌతమ్ సర్ అని కృష్ణ అనగానే.. నాకేంటి సిద్దు లాగా అనిపించిందని నందు అంటుంది. "సిద్దు ఎవరు నందు" అని కృష్ణ అడగగానే.. ఇక నందు తలపట్టుకొని నాకు గుర్తు రావట్లేదని అనేసరికి సరే సరే నువ్వు ఏం ఆలోచించకు అని కృష్ణ అంటుంది. మరోవైపు కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. అబ్బా ఈ రోజు వంటలు బాగున్నాయ్ అంటాడు. బాగా తిని వచ్చారా అని కృష్ణ అనేసరికి.. "లేదు కృష్ణ నీ ముందు అలా అన్నాను.. కాని నేను కూడా తినలేదు. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను" అని మురారి అంటాడు. మరి ఏం చేద్దాం సర్ నాకు ఆకలిగా ఉందని కృష్ణ అంటుంది. బయటకు వెళ్లి తినొద్దాం.. ఇంట్లో తినొద్దని పెద్దమ్మ చెప్పింది కదా, బయట వద్దనలేదు కదా అని మురారి అంటాడు. అలా అనుకొని ఇద్దరు ఇంట్లో ఎవరికి కనపడకుండా బయటకు వెళ్తారు. బయట ఎక్కడ చూసిన అన్ని క్లోజ్ చేసి ఉంటాయ్. ఒక దగ్గర ఓపెన్ చేసి ఉన్నా కూడా.. "ఇప్పుడు ఏం లేవు అన్నీ అయిపోయాయి" అని షాప్ అతను అనడంతో.. ఇతను ఎవరు అనుకున్నావ్ ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ లేచి కూర్చోండి సర్ అని టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తారు. ఇక ఆ తర్వాత ఇద్దరు టిఫిన్ చేసి దార్లో ఐస్ క్రీం తింటూ ఇంటికి వస్తారు. కృష్ణ ఏం చేస్తుంది.. మురారి ఏమైనా భోజనం తీసుకెళ్ళి తనకి ఇచ్చాడా అని ముకుంద వాళ్ళ గదిలోకి వెళ్లి చూస్తుంది. ముకుంద వెళ్ళి వారి గదిలో చూసేసరికి మురారి, కృష్ణ ఇద్దరు లేకపోవడంతో.. ఇద్దరు బయటికి వెళ్ళారా.. వీళ్ళ సంగతి చెప్తా అని అనుకుంటుంది. ఇంతలో బయట నుండి కృష్ణ, మురారిలు వస్తారు. వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్లారని ముకుంద అడగుతుంది. నీకు ఎందుకు చెప్పాలి.. నా భర్తతో నేను బయటికి వెళ్ళాను. ప్రతి దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్ అని ముకుందకి కృష్ణ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాని తర్వాత మురారి చెయ్యి పట్టుకొని.. పదండి ఏసీపీ సర్ అని లోపలికి తీసుకెళ్తుంది కృష్ణ. రేపు మీ సంగతి పెద్ద అత్తయ్యతో చెప్తా అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పూజలో కూర్చోడానికి మనకి ఆ అర్హత ఉందా..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -712 లో.. దేవయాని పూజ పేరుతో ఏం ప్లాన్ చేసిందో అని జగతి మహేంద్రలు ఆలోచిస్తారు. జగతి దగ్గరికి రిషి, వసుధారల బట్టలు తీసుకొని వస్తుంది దేవయాని. "నువ్వు మహేంద్ర ఇద్దరు కలిసి నవ దంపతులు అయిన రిషి, వసుధారలకి ఈ బట్టలు ఇవ్వండి. వాళ్ళిద్దరే ఈ పూజలో కూర్చోవాలి. నువ్వు  ఇలాంటివి ఏం పట్టించుకోవు కదా" అని జగతి తో దేవాయని అంటుంది. జగతి ఆ బట్టలు తీసుకొని మహేంద్ర దగ్గరకి వెళ్ళి, పూజ పేరుతో ఏదో ప్లాన్ చేసింది అనుకున్నాం కదా.. ఆ  ప్లాన్ ఇదే. వసుధారతో కలిసి పూజలో కూర్చోవడం రిషికి ఇష్టముండదు. అప్పుడు వసుధారని రిషి కోప్పడి, ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాడు.. ఇదే తన ప్లాన్" అని జగతి అంటుంది.  మనం ఫస్ట్ అయితే వసుధారకి ఈ బట్టలు ఇచ్చి రిషికి ఇవ్వమందామని తన దగ్గరికి జగతి, మహేంద్ర ఇద్దరు వెళ్తారు. వాళ్ళిద్దరు తీసుకొచ్చిన ఆ బట్టలు వసుధార చూస్తుంది. "ఈ బట్టలు ఇప్పుడు రిషి సర్ కి ఇచ్చి పూజ మీద మనమే కూర్చోవాలని చెప్తే సర్ ఒప్పుకోడు. ఇప్పటికే సర్ కి నామీద కోపం ఉంది" అని వసుధార అంటుంది. నువ్వు రిషి దగ్గరికి వెళ్ళి ఈ బట్టలు దేవాయని అక్క పంపిందని చెప్పు అని జగతి, మహేంద్రలు అక్కడ నుండి వెళ్ళిపోతారు. రిషి దగ్గరికి వసుధార వెళ్ళగానే అనుకున్నటుగానే రిషి కోప్పడతాడు. మనం నిజమైన భార్య భర్తలమా మనకి ఆ అర్హత ఉందా అని రిషి అంటాడు. "సర్.. దేవయాని మేడం ఇచ్చారు" అని వసుధార అనగానే.. పెద్దమ్మతో నేను చెప్పుకుంటానని రిషి అంటాడు. పూజకి టైం అవుతుంది. ఆ దంపతులను రమ్మనండి అని పంతులు పిలుస్తాడు. రిషి, వసుధార ఇంకా రావట్లేదేంటి, ఇద్దరు గొడవ పడుతున్నట్లు ఉన్నారు.. ఈ వంకతో వసుధారని రిషి బయటకు పంపిస్తాడని దేవయాని మనసులో అనుకుంటుంది. రిషి, వసుధారలు రెడీ అయి కిందకి వస్తారు. అలా వాళ్ళిద్దరు రావడం చూసి దేవయాని.. "ఏంటి వీళ్ళకి గొడవేం జరగలేదా" అని అనుకుంటుంది. దేవయాని దగ్గరికి వచ్చి.. "పెద్దమ్మ మేం పూజలో కుర్చోవట్లేదు. డాడ్, జగతి మేడం కూర్చుంటారు" అని రిషి చెప్తాడు. లేదు నాన్న మీరు కూర్చోండని దేవయాని అనగానే.. మీతో తర్వాత మాట్లాడుతా పెద్దమ్మ అని రిషి అంటాడు. ఆ తర్వాత పక్కనే ఉన్నవాళ్ళతో.. డాడ్, మేడం మీరిద్దరు కూర్చోండని రిషి అనగానే.. జగతి, మహేంద్రలు కూర్చొని పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గుండె పిండేసావ్..నీది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్

"గాల విత్ బాల" అంటూ ఇండియన్ ఐడల్ సీజన్ 2 కంటెస్టెంట్స్ తో ఆడిపాడారు బాలయ్య. ఇప్పుడు సింగర్ గా సెలెక్ట్ ఐన కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. "తన వయసేమో పదహారు...జోరేమో సెలయేరు ..కార్తికేయ..నీ ఫాలోయింగ్ ఏందిరయ్యా" అని డాన్స్ తో కూడిన ఇంట్రడక్షన్ ఇచ్చారు బాలయ్యబాబు. ఇక కార్తికేయ తన టాలెంట్ చూపించుకుని టైం వచ్చేసరికి చేతిలో గిటార్ పట్టుకుని స్టేజి మీదకు వచ్చాడు. తర్వాత  కేరాఫ్ కంచరపాలెం మూవీ నుంచి "ఆశాపాశం" సాంగ్ ఇరగదీసి మంచి ఎనెర్జీతో పాడి వినిపించాడు. ఆ పాట విని "గుండె పిండేశావయ్యా..ఇది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ " అని కాంప్లిమెంట్  ఇచ్చారు బాలయ్య. "నీ ఎనెర్జీ మాములుగా లేదు చాలా హైలో ఉంది" అని తమన్ పొగిడేశారు. అలాగే మరో జడ్జి కార్తిక్ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. "యూ హావ్ మై హార్ట్..కీప్ ఇట్ సేఫ్ " అంటూ బాలయ్య కార్తికేయ టీ షర్ట్ మీద బ్లాక్ మార్కర్ తో రాసి ఒక హైఫై ఇచ్చారు. ఇండియన్ ఐడల్ సీజన్ 2  కోసం సెలెక్ట్ ఐన  సింగర్స్ ను తన డాన్స్ తో ఒక రేంజ్ లో పరిచయం చేసే  స్పెషల్ ఎపిసోడ్ తో ఒక్కో సింగర్ ని బాలయ్య ద్వారా పరిచయం చేయిస్తోంది ఆహా.. ఈ ఎపిసోడ్ కు "గాల విత్ బాల" అనే ట్యాగ్ ఇచ్చారు. ఇక దీని  కోసం బాలకృష్ణ వాళ్ళ పేర్లతో ఉన్న పాటలు కూడా పడేసారు. అన్‌స్టాపబుల్‌ షోలో ట్రెడిషనల్ గా కనిపించిన బాలయ్య ఇందులో మాత్రం ట్రెండీ స్టైలిష్ లుక్ లో కనిపించి ఫాన్స్ ని అలరించారు.

నీ అందం మా మతి పోగొడుతోంది అంటూ డాన్స్ చేసిన బాలయ్య

ఇండియన్ ఐడల్ సీజన్ 2  చాలా గ్రాండ్ ఇంకెంతో కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది.   బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో సాలిడ్ గా ఎంట్రీ  ఇచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక్కో సింగర్ కంటెస్టెంట్ ని తనదైన స్టయిల్లో పాట పాడి మరీ వాళ్ళను మెస్మోరైజ్ చేసి వాళ్ళను స్టేజి మీద ఆహ్వానిస్తున్నారు. ఇక ఇప్పుడు శృతి వంతు వచ్చింది. న్యూ జెర్సీలో పుట్టిన పిల్ల...తన రూటే సెపరేటు మళ్ళా..శృతి ఓ శృతి..నీ అందం పోగొట్టే మా మతి.." అంటూ ఆమెను బాలయ్య స్టేజి మీదకు పిలిచేసరికి ఆమె కూడా మంచి ఎనెర్జీతో రెడ్ కలర్ డ్రెస్ లో డాన్స్ చేస్తూ వచ్చేసింది. "హాయి హాయి హాయే హాయి" అనే సాంగ్ ని చాలా స్టైలిష్ గా మంచి ఎనెర్జీతో  పాడి వినిపించింది. "జనరల్ గా చెప్పాలంటే హై నోట్స్ పాడేటప్పుడు కొన్నిచోట్ల హర్ట్ ఐపోతుంది...కానీ నీ హై నోట్స్ మాత్రం ఫ్లాటి" అంటూ థమన్ వెరైటీగా ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసరికి బాలయ్య గట్టిగా అరిచారు. "శృతి అమేజింగ్ పెర్ఫార్మెన్స్" అని కార్తిక్ కూడా చెప్పేసరికి ముగ్గురు జడ్జెస్ బాలయ్య అంతా కలిసి ఒకే శృతిలో బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆమె పెర్ఫార్మెన్స్ ని మెచ్చుకున్నారు. ఇక బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎనెర్జీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్స్ లో ఉత్సాహం రేకెత్తించడానికి చాలా డౌన్ అవుతారు కొన్ని సందర్భాల్లో..ఇక ఇప్పుడు కూడా ఆయన శృతి పాటకు ఫిదా ఐపోయి స్టేజి మీదకు వచ్చి ఆమెతో కలిసి అదే పాటకు డాన్స్ చేసి అలరించారు. ఇక నెటిజన్స్ ఐతే బాలయ్యను తమ పొగడ్తల మెసేజెస్ తో ముంచెత్తారు.  వీరసింహా రెడ్డి మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య  బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో  ఎన్‌బీకే 108లో నటిస్తున్నాడు.

ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న సామెతను నిజం చేసావ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2  విన్నర్ కౌశల్ మంద గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. నటుడుగా తెలుగు అభిమానులకు కౌశల్ సుపరిచితమే. అలా బిగ్‌బాస్ సెకండ్  సీజన్ విన్నర్ అయ్యేసరికి కౌశల్ ఫాలోయింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కౌశల్ ఆర్మీ పేరుతో సైన్యం కూడా తయారయ్యింది. కొంతమంది ఫ్యాన్స్ ఒక గ్రూప్‌గా ఉండి అతనికి క్రేజ్ తీసుకొచ్చారు అంటే ఆయన సత్తా ఏమిటో అర్ధమయ్యింది. అలాంటి కౌశల్ తన కో బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. " నా ప్రియమైన  బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్..వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఐన స్టార్స్ తో కలిసి ఆస్కార్ అవార్డ్స్ వేదిక మీద మెరవడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. బిగ్ బాస్ టైటిల్ గెలిచేసాక ఇంకా వాళ్ళు ఏమీ చేయరులే అనుకునే వారికి మీ విజయం ఒక గుణపాఠం. వాళ్ళు అక్కడితో ఆగిపోరు అనుకున్నది చేసి చూపిస్తారు అని నిరూపించారు. తెలుగులో ఒక సామెత ఉంది " కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని" దాన్ని ఈరోజు మీరు నిజం చేసి చూపించారు. నీకు ఇంత మంచి గుర్తింపు రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నీ సొంతం కావాళ్ళని ఇలాగే మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని కోరుకుంటున్నా" అని తన మనసులో ఉన్న ఫీలింగ్ రాసుకున్నాడు. కౌశల్ బిగ్ బాస్ తర్వాత బీబీ జోడీలో అభినయశ్రీతో కలిసిడాన్స్ పెర్ఫార్మెన్సులు చేసాడు. ఇక   రాహుల్ సిప్లిగూంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్. అలాంటి రాహుల్ ఈరోజున సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ పాడి ఆస్కార్ కోసం హిస్టరీ క్రియేట్ చేయడంలో ఒక భాగమయ్యాడు. ఇలా ఇప్పుడు రాహుల్ ఒక సెలబ్రిటీ ఐపోయాడు. గల్లీ స్థాయి నుంచి ఆస్కార్ వేదిక వరకు వెళ్లడం అంటే అంతా ఈజీ కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఇప్పుడు రాహుల్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చిందని అతని పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అతని ఫ్రెండ్స్ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

కృష్ణ ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు శిక్ష వేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-105 లో.. కృష్ణ కోసం మురారి తీసుకొచ్చిన చీరని ముకుంద తనకి తెలియకుండా తీసుకుంటుంది. కాసేపటి తర్వాత ఆ చీర‌ని ముకుంద కట్టుకొని.. మురారి ముందుకి వస్తుంది. అప్పుడు మురారి ఆ చీరను చూసి షాక్ అవుతాడు. "ఏంటి మురారి ఈ రోజు నీ బర్త్ డే కాదు, నా బర్త్ డే కాదు.. ఎందుకు మరి ఈ రోజు నాకు చీర తీసుకొచ్చావ్.  నీ నుండి నేను ఈ ప్రేమనే కోరుకున్నానని ముకుంద అంటుంది. ఇప్పుడు ఈ చీర ముకుంద కోసం కాదు కృష్ణ కోసం అంటే లేనిపోని గొడవ అవుతుందని మురారి తన మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటాడు. ఇంతలో మురారిని భవానీ పిలవడంతో మురారి తన దగ్గరికి వెళ్తాడు.   "ఏంటి కృష్ణ ఇంకా ఇంటికి రాలేదు. ఈ ఇంటి కోడలు ఇంత లేట్ గా వస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు. ఈ ఇంటి కోడళ్ళు చీకటి పడకముందే ఇల్లు చేరాలి" అని భవాని అంటుంది. ఈ ముకుంద వల్ల కృష్ణని డ్రాప్ చేయడం.. పికప్ చేయడం లేదు పెద్దమ్మా.. కృష్ణ ఒక్కతే రావడం వల్ల లేట్ అవుతుందని మురారి అంటాడు. అక్కడే ఉన్న రేవతి ఆ మాటలు వింటుంది. ఇంటికి వచ్చాక కృష్ణని ఏమైనా అంటుందేమో అని భావిస్తుంది. నేను కృష్ణకి అర్థం అయ్యేలా చెప్తానులే అక్కా.. నువ్వు కృష్ణని వచ్చాక ఏం అనకు అని భవానీతో అంటుంది. ఇంతలో కృష్ణని గౌతమ్ ఇంటికి తీసుకొస్తాడు. గౌతమ్ బండి మీద కృష్ణని డ్రాప్ చెయ్యడం.. ఇంట్లో వాళ్ళందరు చూస్తారు. కృష్ణ లోపలికి వచ్చాక భవానీ ఆగమంటుంది. "ఎందుకు ఇంత లేట్ అయింది.‌ఎవరు అతను" అని కృష్ణని భవాని అడుగుతుంది. నాకు లేట్ అయిందని, మా సర్ ఇంటి వరకు డ్రాప్ చేసారని కృష్ణ చెప్తుంది. "ఇంటికి లేట్ గా వచ్చినందుకు, నీకు ఈ రోజు భోజనం లేదు. ఇదే నీకు లేట్ గా వచ్చినందుకు శిక్ష" అని భవానీ అంటుంది. సరేనని చెప్పేసి కృష్ణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మురారి గదిలోకి వెళ్ళి అతను కూడా కృష్ణను కోప్పడతాడు. ఈ రోజు త్వరగా వస్తా అని చెప్పావ్.. బయటకు వెళదామన్నావ్.. ఇంత లేట్ గా వచ్చావ్ అని మురారి అంటాడు. "అక్కడ గొడవ అయిపొయింది.. ఇప్పుడు ఇక్కడ నువ్వు మొదలెట్టావా" అని కృష్ణ అంటుంది. నేను ఇంకో సంవత్సరం ఉంటానని కృష్ణ అంటుంది. మురారి డల్ అయిపొయి కృష్ణ గురించే ఆలోచిస్తాడు.. భోజనం తీసుకొని నందు దగ్గరికి కృష్ణ వెళ్తుండగా ముకుంద చూస్తుంది. నిన్ను పెద్ద అత్తయ్య భోజనం చెయ్యద్దని చెప్పింది కదా.. ఎందుకు భోజనం ప్లేట్ లో వేసావ్ అని ముకుంద అనగానే.. "నువ్వు మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్. గాడిద పని గాడిదే చెయ్యాలి. కుక్క పని కుక్కే చెయ్యాలి. ఈ భోజనం నందు కోసం" అని చెప్పి వెళ్ళిపోతుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శ్రద్దాను లవ్ చేస్తున్నట్లు చెప్పిన లిఖిత్..మందు గ్లాసుతో పండు

ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఉగాది పండగ రోజు ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో లిఖిత్ అనే కుర్రాడు "జలజలపాతం నువ్వు" సాంగ్ కి  బాగా డాన్స్ చేసాడు. దానికి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయి "లిఖిత ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావా" అని అడిగేసరికి "శ్రద్దా మేడంని లవ్ చేశా అని చెప్పాడు". నేను సముద్రాన్ని చూద్దామనుకుంటే మీరు సునామీనే చూపించారు" అని చెప్పింది శ్రద్దా. "టీం బి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి టీం ఏ వాళ్ళు  బాగా చేయాలనీ కోరుకుంటున్నా" అని పండు అనేసరికి "శోభితా ఏమిటిది..ఏ టీం వాళ్ళను అంటున్నాడు" అని శేఖర్ మాస్టర్ అనడంతో  శోభిత ఫుల్ సీరియస్ లుక్ ఇచ్చింది పండు వైపు. పండు ఆమె లుక్ కి భయపడి "శోభిత అక్కడ లేదు ఇక్కడ ఉంది" అంటూ తాను వేసుకున్న టీ షర్ట్ వెనక ఉన్న ఒక జపాన్ అమ్మాయి బొమ్మ చూపించి ఫన్ క్రియేట్ చేసాడు. ఇక వీకెండ్ టైటిల్ విన్నర్ డాన్స్ మాస్టర్ రాజు వచ్చి డాన్స్ ఇరగదీసాడు. ఈ ఉగాది సందర్భంగా మన ఢీ షో తరపున ఒక కొరియోగ్రాఫర్ కొత్త పోస్టర్ రిలీజ్ చేద్దామనుకుంటున్న అని చెప్పాడు ప్రదీప్. తరువాత పోస్టర్ ప్లీజ్ అని పండు ఫోటోని స్క్రీన్ మీద వేయించాడు. "పండు ఇంత గొప్పదా" అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే పండు ఆ పోస్టర్ ని వేయొద్దని అరిచాడు. ఇప్పుడు ఫస్ట్ లుక్ చూసాం సెకండ్ లుక్ చూద్దాం అనేసరికి ఇంకో పోస్టర్ వచ్చింది. అందులో మందు గ్లాస్ పట్టుకుని కూర్చున్న పోజ్ కనిపించింది. "పర్లేదు వీడియోనే చూపించండి నాకేమన్నా భయమనుకున్నారా" అని పండు ఆ పోస్టర్స్ చూసి రేచిపోయేసరికి టీజర్ చూపించాడు ప్రదీప్. దాంతో అందరూ నవ్వేశారు . ఫైనల్ గా ఉప్పెన మూవీలో "జలజల" సాంగ్ కి శ్రద్దా దాస్ , శేఖర్ మాస్టర్ మంచి రొమాంటిక్ స్టెప్స్ తో డాన్స్ చేశారు. వాళ్ళను అలా చూసిన హైపర్ ఆది నెత్తి మీద తెల్ల క్లాత్ కప్పుకుని అంతా ఐపోయింది అన్న లెక్కలో బాధపడుతూ కూర్చున్నాడు.

అందరికీ షాక్ ఇచ్చిన దేవయాని.. కొత్త ప్లాన్ వేసిందా?

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -711 లో.. ధరణి దగ్గరికి రిషి వెళ్ళి.. "అన్నయ్య గురించి మీరు ఏం బాధ పడకండి.. నేను రప్పిస్తాను. ఇన్ని రోజులు చాలా ఓపికగా వెయిట్ చేశారు. వదిన మీరు చాలా గ్రేట్" అని రిషి అంటాడు. వీళ్ళిద్దరి మాటలు దేవయాని చాటుగా వింటుంది. అనవసరంగా ఆ వసుధార శైలేంద్ర టాపిక్ తీసింది.. ఇప్పుడు రిషి ఏమో శైలేంద్రని తీసుకొస్తా అంటున్నాడు. ఏం చేసైనా శైలేంద్రని రాకుండా చెయ్యాలని దేవయాని తన మనసులో అనుకుంటుంది. మరోవైపు వసుధారని వెతుక్కుంటూ రిషి ఇంటి డాబా పైకి వెళ్తాడు. రిషి వెళ్ళేసరికి వసుధార తన నాన్నతో ఫోన్ మాట్లాడుతుంది. నీ కోసం చాలా సేపటి నుండి వెతుకుతున్నానని రిషి అంటాడు. ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా సర్ అని వసుధార అంటుంది. కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. "నువ్వు ఈ ఇంటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది వసుధార.. నువ్వు వచ్చాక నేను మళ్ళీ కొత్తగా పుట్టానేమో అనిపిస్తుంది" అని రిషి అంటాడు. మన మధ్య ప్రేమ ఎంతుందో దూరం కూడా అంతే ఉందని అంటుంది వసుధార. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. "గుడ్ నైట్ చెప్పి వెళ్ళండి సర్" అని వసుధార అనగానే.. నువ్వు చెప్పొచ్చు కదా అని రిషి అంటాడు. రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకునే మాటలన్ని దేవాయని చాటుగా వింటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం.. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఎప్పుడు లేనిది దేవయాని అందరికి కాఫీ చేసుకొని తీసుకువస్తుంది. ఈ రోజు ఎవరు కాలేజీకి వెళ్ళట్లేదు. ఈ రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాను అని అంటుంది.. ఇలా దేవాయని సడన్ గా పూజ అంటుందేంటి. ఇందులో ఏదో ప్లాన్ ఉందని జగతి, మహేంద్రలు అనుకుంటారు. జగతి మనిద్దరం కలిసి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నన్ను ఎప్పుడు కూడా గయ్యాళి లాగా చూస్తారు కదా.. నేను కూడా అందరి గురించి ఆలోచిస్తానని అర్ధం చేసుకోమని జగతితో దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కళ్ళు తిరిగిపడిపోయిన కావ్య.. రాక్షసత్వంగా బిహేవ్ చేసిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-44 లో.. కావ్యని భోజనానికి తీసుకొని వస్తుంది రాజ్యలక్ష్మి . కావ్యని చూసిన అపర్ణ.. శాంత నువ్వు రాజ్ కి భోజనం వడ్డించమని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలాగే కావ్య వైపు రాజ్ కోపంగా చూస్తుంటాడు. కూర్చోండి వదిన అని కళ్యాణ్ అనగానే.. నాకు ఇక్కడ కూర్చుని భోజనం చెయ్యాలో? వెళ్ళిపోవాలో? అర్థం కావట్లేదని కావ్య అంటుంది. నాక్కూడా అర్థం కావట్లేదని చెప్పి రాజ్ తన ప్లేట్ లో చెయ్యి కడిగేసి వెళ్ళిపోతాడు. ప్లేట్ లో రాజ్ వదిలేసిన అన్నం తిని వెళ్ళు.. మీరు అలాంటి భోజనం పండగలకి వండుకుంటారు కదా అని కావ్యని రేఖ అంటుంది. "అవును మేం పండగలకి వండుకొని కడుపునిండా తింటాం.. అయినా రాజ్ కి నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాననే కోపం ఉంది. మరి నీకు నాకు ఏం గొడవలు లేదు కదా.. నేను అంటే నీకు ఎందుకంత కోపమని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రుద్రాణి వస్తుంది. "మీ అమ్మానాన్నలకి ఫోన్ చేశాను. వాళ్ళు ఇంకా మీ అక్క రాలేదనే బాధలోనే ఉన్నారు. నీ గురించి అడిగితే.. నువ్వు బాగున్నావ్ అని చెప్పాను" అని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఇంకా మా అక్క రాలేదా అని కావ్య ఆలోచిస్తుంది. అందరూ పడుకున్నాక ఎవరికీ కనపడకుండా బయటకెళ్ళి పోలీస్ కంప్లెంట్ ఇవ్వడానికి కావ్య వెళ్తుంది. అలా కావ్య వెళ్ళడం చూసిన రుద్రాణి.. రాజ్ దగ్గరికి వెళ్ళి కావ్య కనిపించడం లేదు.. కావ్య ఎక్కడికో వెళ్ళిందని చెప్తుంది. ఆ తర్వాత కావ్య కోసం రాజ్ ఎదురుచూస్తుంటాడు. కాసేపటికి కావ్య చాటుగా వస్తుండగా.. ఆగు ఎక్కడికి వెళ్ళావ్ అని రాజ్ అడుగుతాడు. దాంతో కాసేపట్లోనే ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. ఎక్కడికి వెళ్ళావో చెప్పమని రాజ్ తన చెయ్యి పట్టుకొని లాగేసరికి, కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.. ఏమైందని అందరూ అడుగుతారు. రోజంతా తినకుండా ఉంటే నీరసం వచ్చి పడిపోరా అని కళ్యాణ్ అంటాడు. కావ్య అన్నం తినలేదా ధాన్యలక్ష్మి? భోజనం తీసుకురాపో అని రాజ్  వాళ్ళ నానమ్మ అనగానే తను తీసుకువస్తుంది. "నేను తినను సంప్రదాయం ప్రకారం.. ఆయన భోజనం చేసిన తర్వాతే నేను చేస్తాను" అని కావ్య అంటుంది. రాజ్ కోపంతో పెళ్లి మోసం చేసి చేసుకున్నావ్.. సంప్రదాయం ప్రకారం కాదని బలవంతంగా కావ్యకి అన్నం తినిపిస్తాడు రాజ్.‌ ఇంత రాక్షసత్వంగా బెహేవ్ చేస్తున్నావ్ కదా.. నీ మీద కక్ష తీర్చుకుంటానని కావ్య అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది  స్వప్న ఫోన్ చేస్తే రాహుల్ లిఫ్ట్ చెయ్యకపోయేసరికి తనలో టెన్షన్ మొదలవుతుంది. మరోవైపు కావ్య అత్తారింట్లో ఎలా ఉందోనని అప్పు ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

‘సుమ అడ్డా’లో అవసరాల శ్రీనివాస్‌ని తిట్టిన స్టూడెంట్!

ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి మూవీ మార్చి 17 న థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండేసరికి ప్రొమోషన్స్ ని స్టార్ట్ చేసింది ఈ మూవీ టీమ్. ఇందులో భాగంగా అవసరాల శ్రీనివాస్, కల్యాణి మాలిక్, మాళవికా నాయర్, సౌమ్య వీళ్లంతా "సుమ అడ్డా" షోకి వచ్చారు. వచ్చే వారం ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఇక ఈ షోకి వచ్చిన ఒక లేడీ స్టూడెంట్ అవసరాల శ్రీనివాస్ ని ఇండైరెక్ట్ గా తిట్టేసింది. సుమ షోకి ప్రతీ వారం కాలేజీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఈ వారం కూడా అలాగే వచ్చిన  ఈ స్టూడెంట్స్ ని వెరైటీగా ఒక ప్రశ్న అడిగింది " సైకోల్లా బిహేవ్ చేసేది అబ్బాయిలా, అమ్మాయిలా" అనేసరికి "షాపింగ్ కి తీసుకెళ్లకపోతే అమ్మాయిలు ఎంత సైకోల్లా ప్రవర్తిస్తారు అంటే డివోర్స్ ఇచ్చేస్తారు" అని ఒక స్టూడెంట్ చెప్పాడు. "అలా డివోర్స్ లు ఇచ్చుకుంటూ పొతే చాలా కాపురాలు పోతాయి" అని కామెడీ చేసింది సుమ. "అబ్బాయిలు ఎంత సైకోగాళ్ళంటే వాళ్ళు పెంచుకునే జుట్టు, గడ్డం బట్టి చెప్పొచ్చు..అండమాన్ జైలు నుంచి పారిపోయి వచ్చిన ఖైదీల్లా ఉంటారు ఒక్కొక్కళ్ళు" అని మంచి ఫోర్స్ తో ఒక లేడీ స్టూడెంట్ తన అభిప్రాయాన్ని చెప్పేసరికి అవసరాల శ్రీనివాస్ సిగ్గు పడి నవ్వుకుంటూ తలా దించుకున్నాడు. " నా పరువు పోయిందిగా..ఇంకా ఎలా తలెత్తుకుని తిరగ్గలను" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ వేశారు. సుమ కూడా పగలబడి నవ్వేసింది. "సుమ గారు నాకు ఒక రేజర్ ఉంటే ఇప్పించారు ప్లీజ్ అర్జెంటు గా" అని అవసరాల శ్రీనివాస్ ఫన్నీ అడగడం భలే నవ్వు తెప్పించింది. తర్వాత పాగల్ పవిత్ర వచ్చి అవసరాలతో కలిసి "ఆరడుగులుంటాడా" అనే సాంగ్ కి డాన్స్ చేసింది. అదే టైంకి పటాస్ ప్రవీణ్ అది చూసి "నువ్వు సెల్ సిగ్నల్ కోసం టవర్ కింద తిరిగినట్టుంది కానీ డాన్స్ చేస్తున్నట్టు లేదు" అన్నాడు ఫన్నీగా.

మ్యారేజ్ డేట్ బ్రో..భోజనాలకు వస్తాం...

ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆరోహితో  మంచి సందడి చేసాడు. ఇప్పుడు బీబీ జోడిలో ఫైమాతో కలిసి డాన్స్ ఇరగదీస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సూర్య తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. "కీర్తితో మీ ఫ్రెండ్ షిప్ అలాగే ఉందా ?" "మా వర్క్స్ లో మేము బిజీగా ఉన్నాము..ఇప్పటి వరకు కలవలేదు" అని చెప్పాడు. "మ్యారేజ్ డేట్ బ్రో..భోజనాలకు వస్తాం" అని అనేసరికి " డెఫినెట్లీ మామ..మ్యారేజ్ సెటిల్ అవగానే ఇన్స్టాగ్రామ్ లో కార్డు అప్ డేట్ చేస్తాను. మా ఇంట్లో గట్టిగానే పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు" అని చెప్పాడు. "మీరు చాలా హ్యాండ్ సం గా ఉంటారు మూవీస్ కి ఎందుకు ట్రై చేయరు " అనడంతో " తమిళ్, తెలుగు, కన్నడలో త్వరలో రాబోతున్న ఒక మూవీలో లీడ్ క్యారెక్టర్ కి సైన్ చేసాను. అంతకన్నా ముందు నా కంటెంట్ తో యూట్యూబ్ ద్వారా మిమ్మల్నందరినీ సర్ప్రైజ్ చేయాలని" అంటూ చెప్పాడు. "మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి" అని అడిగిన నెటిజన్ కి " క్రికెట్ కి రిలవెంట్ గా ఉన్న ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా" అన్నాడు. "మీది ఆంధ్రనా తెలంగాణానా" అని అడగడంతో "ఆంధ్రప్రదేశ్ జన్మనిచ్చింది...తెలంగాణ బతుకునిచ్చింది. నేను రెండు ప్రాంతాలకు చెందిన వాడిని" అని చెప్పాడు. "కీర్తి, ఆరోహి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే" అనేసరికి "టైంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఫోన్ చేయగలిగిన బెస్టీ ఆరోహి..నాకు ఇష్టమైన పిచ్చి ఫెలో కీర్తి..మెం ముగ్గురం కలిస్తే రచ్చే...కానీ కలిసేది చాలా తక్కువ" అని చెప్పాడు.

బౌన్సర్ జాబ్ ఖాళీగా ఉంది అంటూ రోహిణికి హింట్ ఇచ్చిన నాని

ఉగాది మాస్ ధమాకా ఈవెంట్ అవార్డ్స్ మరో ప్రోమో రిలీజ్ చేసింది. ఉగాది మరి కొద్ది రోజుల్లో రానున్న సందర్భంగా చానెల్స్ అన్నీ కొత్త కొత్త ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నాయి. ఇక ఈ షోకి ఊర మాస్ నేచురల్ స్టార్ నాని షోలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. ఉంగరాల జుట్టుతో ఫుల్ బబ్లీ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ షోకి తన లేడీ ఫాన్స్ కూడా వచ్చారు. రీతూ చౌదరి నాని చూసి తన గుండె 72 సార్లు కాకుండ 172 సార్లు కొట్టుకుంటోంది అని ఆయన మీద ఇష్టాన్ని చెప్పేసరికి బిపి టాబ్లెట్స్ వేసుకో అని నాని సలహా ఇచ్చాడు. ఇక పాగల్ పవిత్ర వచ్చి ఒక్కసారి టచ్ చేస్తారా ప్లీజ్ మిమ్మల్ని టచ్ చేయాలంటే నా చెయ్యి చూసారా ఎలా షివర్ అవుతుందో అనేసరికి ఆమె చేతిని టచ్ చేసాడు నాని. దాంతో పవిత్ర కరెంటు పాస్ ఐనట్టు బిల్డప్ ఇచ్చేసింది. దాంతో నాని "ఎవుర్రా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావ్" అంటూ ఒక డైలాగ్ చెప్పి శ్రీముఖికి హైఫై ఇచ్చాడు.  ఇక సీన్ లోకి రౌడీ రోహిణి ఎంట్రీ ఇచ్చింది. "నువ్వేం భయపడమాకు బావ..నీ ఎనకమాల ఎంతమంది అమ్మాయిలు వచ్చినా నేను చూసుకుంటా" అనేసరికి "పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు బౌన్సర్స్ ని పెడతారు కదా ఆ జాబ్ ఖాళీగా ఉంది" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. నాజ్రియా ఇమేజ్ ని శ్రీముఖి చూపించేసరికి ఆమె చాలా నాటీగా ఉంటుంది అని చెప్పాడు నాని. తర్వాత సాయి పల్లవి ఇమేజ్ ని చూపించి అడిగేసరికి ఉగాది పచ్చడిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ చేదు కదా అని చెప్పాడు. చాలా బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ చేసింది అన్నాడు. తర్వాత సిల్క్ స్మితకి ట్రిబ్యూట్ పేరుతో స్పెషల్ డాన్స్  పెర్ఫార్మెన్స్ చేసింది భానుశ్రీ. ఎప్పటికైనా సిల్క్ స్మిత ఓన్లీ వన్ ఇంకెవ్వరూ ఆమెలా లేరు, రారు అని చెప్పాడు నాని.  స్టేజి మీద వెరైటీ క్రికెట్ కూడా ఆడాడు నాని. మరి ఈ షో ఉగాది ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది అన్న విషయం అర్ధమవుతోంది. మరి ఈ ఈవెంట్ లో ఎలాంటి సెగ్మెంట్స్ ఉన్నాయి..నాని కానీ ఇతర గెస్ట్స్ కానీ ఎలాంటి పంచ్ డైలాగ్స్ వేసారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

నందుకి బాగైతే నా పేరొద్దు.. నీ పేరు చెప్పు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -104 లో.. "నీ భార్యని నందు గురించి పట్టించుకోవద్దని చెప్పు" అని మురారితో ముకుంద అనగానే.. తను నందు బాగుండాలనే చూస్తుంది కదా అని మురారి అంటాడు. నువ్వు అలా కృష్ణ కి సపోర్ట్ చేస్తూ వస్తే నిన్ను ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే నేను చూస్తుండలేను. నువ్వు కృష్ణకి సపోర్ట్ చేయకు అని ముకుంద అంటుంది. "అయినా అదేదో సామెత అన్నట్లు కత్తికి లేని దురద కందకి ఎందుకు అన్నట్లు మా పెద్దమ్మ, బాబాయ్ లు నన్ను అంటే నీకేం బాధ" అని మురారి అంటాడు. "అవునా.. సరే వెళ్ళు. ఇక వెళ్ళి కృష్ణని తీసుకొని రా" అని ముకుంద అనగానే.. అవును వెళ్ళాలి ఈ రోజు కృష్ణ కూడా త్వరగా వస్తానందని మురారి అంటాడు. కోపంలో ఉన్న ముకుంద.. "మధ్యలో పానీపూరి కూడా తినిపించు" అని వెటకారంగా అంటుంది. అలా తను అనగానే అవును కృష్ణకు పానీపూరి అంటే ఇష్టమని మురారి చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి మురారి వెళ్ళిపోతాడు. మరోవైపు నందు ఫోటో చూస్తుంటాడు గౌతమ్. ఇంతలో కృష్ణ రావడంతో తనని చూసిన గౌతమ్.. "అలా అడగకుండా లోపలికి వస్తావా" అని కోప్పడతాడు. నందు గురించి నీ ద్వారా తెలుసుకోవడానికి ఇలా కోపంగా మాట్లాడుతున్నా లేదంటే నీకు డౌట్ వస్తుందని‌ గౌతమ్ తన మనసులో అనుకుంటాడు. నందుకి ఈ టాబ్లెట్స్ ఇవ్వు.. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఈ హాస్పటల్ కే తీసుకొని రా, నందుకి బాగైతే నా పేరు కాకుండా నీ వల్ల బాగైందని చెప్పు అని గౌతమ్ అనగానే.. సరేనంటుంది కృష్ణ. సర్ ఈ రోజు త్వరగా వెళతానని కృష్ణ పర్మిషన్ అడుగగా.. దానికి ఓకే చెప్తాడు గౌతమ్. కృష్ణకి తెలియకుండా తనకోసం మురారి ఒక చీర తీసుకుంటాడు. దాన్నిచ్చి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత మురారికి కాల్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ హడావిడిలో ఆ చీరని సోఫాలో పెడతాడు. ఫోన్ మాట్లాడి వచ్చేసరికి సోఫాలో చీర ఉండదు. దీంతో చీర ఏమైందని ఆలోచిస్తుంటాడు మురారి. మరోవైపు కృష్ణకి కాలేజీలో లేట్ అవడంతో గౌతమ్ తనని తన బైక్ మీద తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వాస్తు బాగుందని చెప్పి ఈ ఇల్లు ఇప్పించింది బ్రహ్మానందం గారే...

రచ్చ రవి బుల్లితెర కమెడియన్ గా నెమ్మదిగా ఎదుగుతూ ఒదుగుతూ అలా అలా సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రచ్చ రవి చేసిన మూవీస్ లో ఆయన క్యారక్టర్ కూడా బాగా హైలైట్ అవుతూ మంచి పేరునే సంపాదిస్తున్నాడు. ‘వన్స్‌మోర్‌ ప్లీజ్‌’ అనే వేదికపై తానేంటో నిరూపించుకుని ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు.  అలాంటి రచ్చ రవి తన అందమైన ఇంటిని అందులో తాను సంపాదించుకున్న అవార్డ్స్ ని కూడా చూపించాడు. తన ఇంట్లో ఒక షో కేసుగా కనిపించడానికి ఒక చెట్టును పళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. కష్టపడితే ప్రతిఫలం వస్తుంది అనే విషయాన్ని  లైవ్ గా తన పిల్లలకు చూపించాలంటే ఇదొక్కటే మార్గం అని దాన్ని ఏర్పాటు చేయించుకున్నాడట. ఆ చెట్టు కిందే కూర్చుని భోజనాలు చేస్తారని చెప్పుకొచ్చాడు.  "చెట్టు పిట్టకు గూడు కట్టుకోమని చెప్తుంది మనకు నీడనిస్తుంది. కానీ మనం ఎం చేస్తున్నాం పళ్ళను తినాల్సింది పిట్టను తిని చెట్టుని కొట్టి పొల్యూషన్ ని పెంచేస్తున్నాం" అంటూ చెట్టు గురించి చాలా అద్భుతంగా చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో బ్రహ్మానందం ఫోటో పెట్టుకున్నాడు రచ్చ రవి. ఎందుకు అంటే ఈ ఇల్లు వాస్తు చూసి బాగుంది అని ఇప్పించింది ఆయనే అని చెప్పాడు. కళ్యాణవైభోగం, రాజా ది గ్రేట్‌, శతమానం భవతి, నేనే రాజు నేనే మంత్రి, మ్యాస్ట్రో, ఎంసీఏ, ఎఫ్‌2, గద్దలకొండ గణేశ్‌, సరిలేరు నీకెవ్వరు, క్రాక్‌, బట్టర్ ఫ్లై, బలగం మూవీస్ లో డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్న  పాత్రలు వచ్చాయన్నారు.  ఎదుటి వారి మీద ఎలాంటి వ్యంగ్యం లేకుండా 30 వేల మందిని నవ్వించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సంపాదించాడు రవి. రచ్చ రవి జబర్దస్త్‌ ఆర్టిస్టుగా, స్టాండప్‌ కమెడియన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, స్కిట్స్‌ రైటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ‘రచ్చ రవి’ అనే యాప్‌తో ఎంతో మందికి సామాజిక సేవ కూడా చేస్తున్నట్లు చెప్పాడు.  చార్లీ చాప్లిన్‌ , జంధ్యాల కామెడీ అంటే ఇష్టమన్నాడు    రచ్చ రవి.

వారిద్దరి ప్లాన్ సక్సెస్.. తనని తీసుకెళ్ళలేదని దేవయాని ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -710లో.. దేవయాని తన భర్తతో.. అసలు వీళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు.. రాను రాను ఇంట్లో నేను అంటే గౌరవం లేకుండా పోయిందని అంటుంది. ఇంతలోనే రిషి, వసుధారలు సంతోషంగా హోలీ జరుపుకొని ఇంటికి అందరూ ఒకేసారి వస్తారు.. అలా ఒంటి మీద రంగులతో వచ్చిన అందరిని చూసి కోపంతో ఊగిపోతుంది దేవయాని. మీరంతా ఎక్కడికి వెళ్ళారని దేవయాని అడుగుతుంది. అప్పుడు వసుధార వచ్చి దేవయానిని హాగ్ చేసుకొని హ్యాపీ హోలీ అని చెప్తుంది. హోలీ జరుపుకొని వస్తున్నాం పెద్దమ్మ.. నాకు చాలా హ్యాపీ గా ఉందంటూ దేవయానితో రిషి చెప్తాడు. మరి మాకెందుకు చెప్పలేదు. చెప్తే మేం కూడా వచ్చేవాళ్ళం కదా అని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత కాసేపటికి స్వీట్ చేసి తీసుకొస్తాను అని వసుధార అంటుంది. ఆ తర్వాత ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నానని వసుధారతో రిషి అంటాడు. థాంక్స్ సర్ అని వసుధార అనగానే.. నేనే నీకు థాంక్స్ చెప్పాలని రిషి అంటాడు. డాడ్ వాళ్ళతో ఇలా పండగ సెలబ్రేట్ చేసుకువడం చాలా హ్యాపీగా ఉందని రిషి అనగానే.. మీ కళ్ళలో మెరుపు.. మీ పెదాల్లో సంతోషం.. ఇవే నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చాయి సర్ అని వసుధార అంటుంది. మొత్తానికి మంచి ప్లాన్ చేసి రిషి, వసుధారలు కలిసి హ్యాపీగా పండగ సెలబ్రేట్ చేసుకునేలా చేసారని జగతితో మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి లు హోలీ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటారు. అక్కడికి దేవయాని వచ్చి.. రిషి నువ్వు అంత సంతోషంగా ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్తే నీ సంతోషాన్ని చూసేదాన్ని కదా.. మీరంతా నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు. సెలబ్రేషన్ ఇక్కడే అందరం చేసుకునేవాళ్ళం కదా.. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్ అంటూ వసుధారని బ్లేమ్ చేసేలా మాట్లాడుతుంది దేవయాని. ఆ మాటలు విన్న రిషి.. వసుధార తప్పు చేసావ్.. ఇంకోసారి పెద్దమ్మని పిలవకుండా ఏం చెయ్యకని అంటాడు. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తూ.. ధరణి భర్త గురించి మాట్లాడుకుంటారు. అన్నయ్యని రమ్మనచ్చు కదా పెద్దమ్మా అని రిషి అంటాడు. వాడికి చాలా అగ్రిమెంట్ లు ఉన్నాయి.. రావడం ఇప్పట్లో వీలు అవదని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.