రష్మీకి స్వయంవరం..మరి సుధీర్ ఎక్కడ?

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. సుధీర్ ఉన్నన్ని రోజులు రష్మీకి సుధీర్ కి ఏదో ఉందని గాసిప్స్ వచ్చాయి. ఎప్పుడైతే సుధీర్ షో నుంచి వెళ్లిపోయాడో అప్పుడు ఈ గాసిప్స్ కూడా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మీ ఒంటరిదైపోయింది. అందుకే ఈ కాన్సెప్ట్ మీద "రష్మీ స్వయంవరం" పేరుతో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ స్వయంవరం ఎవరికీ అన్నట్టుగా చూస్తున్న రష్మీతో  "ఇదంతా ఎందుకో తెలుసా నేను నీకు స్వయంవరం అరేంజ్ చేసాను" అని ఇంద్రజ చెప్పి షాకిచ్చింది. స్వయంవరం అనేసరికి రీసెంట్ గా తేజుని పెళ్లి చేసుకున్న అమరదీప్ గిఫ్ట్ తీసుకుని వచ్చేసరికి "పెళ్లయిపోయింది కదా ఎందుకొచ్చావ్ అని రాంప్రసాద్ అడిగాడు. ఎవరైనా రావొచ్చన్నారు అందుకే వచ్చా. మా నాన్న కూడా వస్తానన్నాడు...కానీ మా అమ్మ ఫీలవుతుందని రావొద్దని చెప్పా" అన్నాడు. ఆది, పండు, మరో కొరియోగ్రాఫర్ కలిసి రొమాంటిక్ సాంగ్ కి ఆపిల్ తింటూ డాన్స్ చేశారు. "అబ్బాయిలు కూడా రొమాంటిక్ సాంగ్స్ చేస్తారా..చేస్తే ఇంత బాగుంటుందా" అంటూ ఇంద్రజ ఆశ్చర్యపోయింది. ఇక కొత్త జంట రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఎంట్రీ ఇచ్చారు. తర్వాత రోల్ రైడ వచ్చి తన రాప్ సాంగ్స్ పాడి వినిపించాడు. ఇక శ్రీరామనవమి వేడుకలను స్టేజి మీద సంప్రదాయబద్దంగా అంతా కలిసి చేశారు. నూతన వధూవరులు కాబట్టి రాకేష్, సుజాత దండలు మార్చుకున్నారు. అనంతరం శ్రీ రామదాసు జీవిత చరిత్రను స్కిట్ రూపంలో వేసి చూపించారు అమరదీప్ మరో బుల్లితెర నటి. రష్మీకి స్వయంవరం ప్రకటించినప్పుడు గాలోడు సుధీర్ కూడా రావాలి కదా అంటూ ఆయన ఫాన్స్ హోరెత్తించే కామెంట్స్ పోస్ట్ చేశారు.   ఇలా నెక్స్ట్ శ్రీరామా నవమి స్పెషల్ ఎపిసోడ్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించడానికి రాబోతోంది.

తెలుగు వాళ్ళు ఉన్నంతవరకు విశ్వనాధ్ గారిని సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం

ఉగాది సందర్భంగా స్టార్ మాలో పండగ రోజు ప్రసారం కాబోతున్న "మా ఇంటి పండగ" ఈవెంట్ ఎపిసోడ్ కి చెందిన మరో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో కొంత భాగం కే.విశ్వనాధ్ గారికి డేడికేట్ చేశారు. ఆయన మూవీస్ లోని సాంగ్స్, డాన్స్ చేసి చూపించారు బుల్లితెర నటులు. "స్వాతిముత్యం" మూవీలో ఎవర్ గ్రీన్ సాంగ్ ఐన "సువ్వి సువ్వి " సాంగ్ కి అవినాష్ కమల్ హాసన్ లా, రాధికా రోల్ లో ప్రియాంక జైన్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ చూసిన గెస్ట్ నాని "లెజెండ్స్ ఉంటారు కానీ లెజెండ్స్ లోకెల్లా లెజెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది కే.విశ్వనాధ్ గారు" అని చెప్పారు. తర్వాత "శుభసంకల్పం" లో మరో అద్భుతమైన సాంగ్ "సీతమ్మ అందాలు" అంటూ బాలాదిత్య, తేజస్విని గౌడ డాన్స్ చేసి చూపించారు. "మన కల్చర్ ని మనం ఈరోజు వరకు గుర్తుపెట్టుకున్నాం అంటే అలాంటి గొప్ప ఫిలిం మేకర్లు అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తున్నారు కాబట్టి" అని అన్నాడు నాని. తర్వాత అంబటి అర్జున్ వచ్చి "సిరివెన్నెల" మూవీ నుంచి "ఈ గాలి ఈ నేల" అనే సాంగ్ కి డాన్స్ చేసి చూపించాడు. "తెలుగు వాళ్ళు ఉన్నంతవరకు విశ్వనాధ్ గారిని మనం సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం" అని చెప్పాడు నాని. ఈ షో ఉగాది పండగ రోజు 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కాబోతోంది. కే విశ్వనాథ్  గారు తీసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం, ఒక కళాఖండం అని చెప్పొచ్చు.  ఆ మూవీస్ లో కనిపించే పాత్రలు, వినిపించే సంగీతం, అర్థవంతమైన మాటలతో ఆయన తీసిన ప్రతి మూవీ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 

బిబి జోడి సెమీఫైనల్‌ ఎపిసోడ్‌లో జోడీల డ్యాన్స్ అదుర్స్!

ప్రతీ శని, ఆదివారాలలో స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో 'బిబి జోడి'. ఈ షో తుదిదశకు చేరుకుంది. ఆదివారం రోజు సెమీఫైనల్‌ జరిగింది. సెమీ ఫైనల్ లో మొదటగా అర్జున్-వాసంతి పర్ఫామ్ చేసారు. వారి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు ఫిధా అయ్యారనే చెప్పాలి. పర్ఫామెన్స్ తర్వాత యాంకర్ శ్రీముఖి ఎలా ఉందని అడుగగా.. తరుణ్ మాస్టర్ బాగుందని చెప్పాడు. మీ పర్ఫామెన్స్ కి నా గుండె నోట్లోకి వచ్చిందని చెప్పుకొచ్చింది సుధ. "నేను ఇప్పుడు కూడా షాక్ లో ఉన్నాను. ఆ సాంగ్ లో‌ పెప్ ఉందా అని‌ డౌట్ వచ్చింది. ఇది పవర్ ప్యాక్ డ్ పర్ఫామెన్స్ కంటే కూడా డేంజర్ ప్యాక్ పర్ఫామెన్స్. సెమీ ఫైనల్ లోనే ఫైనల్ పర్ఫామెన్స్ లా చేసారు" అని రాధ చెప్పుకొచ్చింది. అవినాష్- అరియానా జోడీ కలిసి డ్యాన్స్ చేసారు. మ్యాజిక్ ని మ్యూజిక్ ని కలిపి మ్యాజికల్ డ్యాన్స్ చేసిన వీరిద్దరి పర్ఫామెన్స్ వావ్ అనిపించింది. శ్రీముఖి వచ్చి మీరు మాయమయ్యారు కదా మళ్ళీ ఎందుకొచ్చారని అడుగగా.. బిబి జోడి ఫైనల్ కి వెళ్ళాలని మళ్ళీ తిరిగి వచ్చామని అవినాష్ చెప్పాడు. మెహబూబ్ - శ్రీసత్య జోడీ డ్యాన్స్ కి జడ్డెస్ ఫిధా అయ్యారు. సదా స్టేజ్ మీదకి వచ్చి ఇది ఫైనల్ లెవెల్ పర్ఫామెన్స్ అని చెప్పింది. నాకు ఇంతపెద్ద హార్ట్ ఉంటే అది మీకే ఇచ్చేదాన్ని అని మెహబూబ్ ని ఉద్దేశించి సదా  చెప్పింది. "మీరు చేసిన ప్రతీ చిన్న చిన్న మూమెంట్స్ కూడా వావ్ అనిపించాయి. ఐ లవ్ యువర్ పర్ఫామెన్స్" అని రాధ చెప్పింది. ఐ థింక్ దిజ్ ఈజ్ ట్రైలర్ ఫర్ ఫినాలే అని తరుణ్ మాస్టర్ చెప్పాడు.  బిబి జోడి ఫినాలే రేస్ లీడర్ బోర్డ్ లో మొదటి ప్లేస్ లో మెహబూబ్-శ్రీసత్య జోడి ఉండగా.. ఆర్జే చైతు-కాజల్, అఖిల్-తేజస్విని జోడీలు‌ లీస్ట్ లో ఉన్నారు. అఖిల్ కి ఆరోగ్య సమస్య ఉండటం వల్ల అతను డ్యాన్స్ చేయడానికి రాలేకపోయాడు దీంతో అఖిల్-తేజస్విని జోడీ ఎలిమినేట్ అయ్యారు. ఆర్జే చైతు- కాజల్, అర్జున్-వాసంతి,  మెహబూబ్-శ్రీసత్య, అవినాష్-అరియానా, సూర్య-ఫైమా జోడీలు బిబి జోడి ఫినాలాకే చేరాయి.

వైష్ణవిని, యుతిని తనదైన స్టయిల్లో ఇన్వైట్ చేసిన బాలయ్య

ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో పోటీ పడుతున్న సింగర్స్ ని ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేసే ఒక కొత్త సంస్కృతికి రూపం ఇచ్చింది ఆహా టీమ్. దానికి 'గాల విత్ బాల' పేరు పెట్టి నందమూరి బాలకృష్ణతో పరిచయ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. బాలయ్య టాప్ 12 సింగింగ్ కంటెస్టెంట్స్ ని తనదైన స్టయిల్లో ఇంట్రడ్యూస్ చేశారు.  'గాల విత్ బాల' షోలో ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఇన్వైట్ చేశారు బాలయ్య బాబు. "తాను డబ్బింగ్ లో డీజే.. చాటింగ్ లో ఆర్జే.. సింగింగ్ శివాజీ.. వైష్ణవి...ఓ వైష్ణవి..నువ్వు నడిచొచ్చే కాన్ఫిడెన్సువి" అంటూ బాలయ్య సింగర్ వైష్ణవిని స్టేజి మీదకు ఇన్వైట్ చేశారు. "హోయారే..హోయా..ముద్దులా మావయ్య" అంటూ స్టేజి మీద సాంగ్ పాడి ఓ రేంజ్ లో అలరించింది వైష్ణవి. "బాలయ్య గారి ముందు ఈ సాంగ్ పాడడం నిజంగా అమేజింగ్" అన్నారు థమన్. "అసలు కుమ్మేసావ్ అనుకో" అని గీతా మాధురి కామెంట్ చేసింది. "ఒక్కసారి మనం కాన్ఫిడెంట్ గా ఉంటే వి విల్ బికం అన్ స్టాపబుల్" అన్నారు బాలయ్య.  ఇక "బెంగళూరు బాలిక...సిగ్గులోన గోపిక..కార్తిక్ బ్రో కనిబడితే ఆపలేము తననిక..యుతి..ఓ యుతి..ఏందమ్మా నీ ఫాన్స్ గతి" అంటూ బాలకృష్ణ తనదైన స్టయిల్లో యుతిని స్టేజి మీదకు ఇన్వైట్ చేశారు. "బూచాడే..బూచాడే" అనే సాంగ్ పాడింది యుతి. ఇంకా ఆమె పెర్ఫార్మెన్స్ కి కార్తీక్ ఫిదా ఐపోయాడు.."ఫెంటాస్టిక్..ఫినామినల్ పెర్ఫామెన్స్..మైండ్ బ్లోయింగ్" అంటూ ప్రశంసల వర్షం కురిపించేసాడు. ఇక థమన్ "బూమ్ భద్దల్ పెర్ఫార్మెన్స్" అంటూ పొగిడేశారు. ఇక బాలకృష్ణ ఐతే "నీకు మంచి ఫ్యూచర్ ఉంది" అంటూ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు.

కృష్ణభగవాన్ కి ముద్దు పెట్టిన యాంకర్ సౌమ్యరావు!

ఒకప్పుడు జబర్దస్త్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే రోజులుండేవి. కానీ కొంతకాలం నుంచి ఈ షోలో చాలా మార్పులు వచ్చాయి. నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, అనసూయ ఉన్నప్పుడు అది ఫుల్ జోష్ తో ఉండేది. కానీ ఇప్పుడు ఈ షోలో ఎంత వెతికినా జోష్ కనిపించడం లేదు. ఇక హైపర్ ఆదికి సినిమాల్లో ఛాన్సులు వచ్చేసరికి ఈ షోలో అప్పుడప్పుడు అలా మెరిసి మాయమవుతున్నాడు. ఇప్పుడు కొత్త యాంకర్, కొత్త కమెడియన్స్ తో షో రేటింగ్ తగ్గిపోయింది. మరి ఏమనుకున్నారో ఏమో కానీ షోలో కొత్త కొత్త మార్పులను తీసుకొస్తున్నారు. ఇక కొత్త యాంకర్.. జడ్జి కృష్ణ భగవాన్ చేతి మీద ముద్దు పెడుతూ కనిపించింది కొత్త ఎపిసోడ్ లో. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  రాబోయే ఎపిసోడ్ లో నూకరాజు స్కిట్ లో భాగంగా సౌమ్యరావుతో ఒక ఛాలెంజ్ చేసాడు. తాను చేసే ప్రతీపని చేయాలనీ యాంకర్ సౌమ్యరావుకి చెప్పాడు. అలా నూకరాజు వెళ్లి కృష్ణ భగవాన్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. వెంటనే సౌమ్య రావు కూడా వచ్చి కృష్ణ భగవాన్ బుగ్గ మీద ముద్దు పెట్టబోయింది. కానీ వెంటనే పక్కనే ఉన్న మరో లేడీ జడ్జి ఇంద్రజ అడ్డుపడింది. దాంతో ఆయన బుగ్గ మీద పెట్టాల్సిన ముద్దును ఆయన చేతి మీద పెట్టింది. అందరూ షాకవడమే కాదు గట్టిగా నవ్వేశారు.  ఐతే ఈ షోకి మరింత టీఆర్పీ కోసం ఇలాంటి స్క్రిప్టెడ్ సీన్స్ పెట్టి ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేస్తున్నారు యాజమాన్యం. ఈ ఎపిసోడ్ ప్రోమోకి ఫాన్స్, నెటిజన్స్ నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి." టీం లీడర్స్ కన్నా జడ్జ్ లు వేసే పంచ్ లే నవ్వును తెప్పిస్తున్నాయి.. ఒక్కప్పటి జబర్దస్త్ కి ఇప్పటి జబర్దస్త్ కి చాలా తేడా ఉంది" అంటున్నారు. ఆర్పీ, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి లాంటి సీనియర్ కమెడియన్స్ ఇప్పుడు లేకపోవడం అంతా కొత్తవాళ్లే కావడంతో కామెడీ కూడా కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది.

కూతురికి మందు బాటిల్ ని గిఫ్ట్ గా పంపిన నాన్న!

గిఫ్ట్ గా ఎవరైనా ఏమైనా ఇచ్చారంటే అది ఎంతో ఆనందం ఉంటుంది కదా ఎవరికైనా.. మరి అష్షుకి వాళ్ళ నాన్న ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే మాత్రం భలే నవ్వొస్తుంది. పేరెంట్స్ మైండ్ సెట్ లో కూడా ఈమధ్య మార్పు కనిపిస్తోంది. చాలా బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకుని సంకోచం లాంటివి లేకుండా గిఫ్ట్స్ ని షేర్ చేసుకుంటున్నారు. ఇంతకు అష్షుకి వాళ్ళ నాన్న ఏం పంపించారో తెలుసా.. మందు బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చారు. మందు బాటిల్ అంటే మెడిసిన్ కాదు అందరూ తాగే మందే... తనకు ఈ మద్యం బాటిల్ గిఫ్ట్ గా పంపించడంపై అష్షు తెగ మురిసిపోయింది. "థ్యాంక్యూ సో మచ్ డాడీ...ఐతే మీరు పంపించిన ఈ గిఫ్ట్ మాత్రం అమ్మకు ఎంత మాత్రం నచ్చలేదు" అని రాసి స్మైలీ  ఎమోజి కూడా పెట్టింది. దీన్ని బట్టి అర్ధమవుతోంది అష్షు డాడీ కూచి అని తనకు ఏది ఇష్టమో వాళ్ళ నాన్న అదే ఇస్తాడని. అమ్మడు మాత్రం చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా వాళ్ళ నాన్న ప్రెజంట్ చేసిన గిఫ్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి గిఫ్ట్స్ ని పేరెంట్స్ అసలు ఇస్తారా అంటూ నెటిజన్స్ అష్షు ఫాన్స్ అడుగుతున్నారు.  టిక్ టాక్ ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన అష్షు రెడ్డికి బీభత్సమైన ఫాన్స్ ఉన్నారు. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఫుల్ ఫేమస్ అయ్యింది. డబ్ స్మాష్ వీడియోస్ తో ఇంకా ఫేమస్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన ప్రేమాయణంతో అప్పట్లో ఫుల్ ట్రెండింగ్ లో ఉండేది అష్షు. అంతే కాదు అమ్మడుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పడానికి టాటూ వేయించుకుని ఆ హాట్ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఇన్స్టానే బ్రేక్ చేసింది. బుల్లితెర షోలతో  అదరగొడుతూనే.. సోషల్ మీడియాలో తన పిక్స్ తో హల్ చల్ చేస్తూ..మూవీస్ లో అడుగుటపెట్టింది.

పంతంతో వసుధారని వదిలేసి వెళ్ళిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‌'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-714 లో.. "రిషి సర్ నన్ను ఏమన్నా కూడా నేను బాధపడుతాను కావొచ్చు..‌ కానీ నా వల్ల రిషి సర్ బాధపడుతున్నారని తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది" అని జగతితో వసుధార అంటుంది. "అర్థం చేసుకోవాలే కానీ రిషి మనసు బంగారు కొండ. ఇప్పుడు మంచుకొండలా గడ్డకట్టినట్టు ఉంది. దానిని నువ్వే నీ ప్రేమతో కరిగించుకోవాలి" అని జగతి చెప్తుంది. "రిషి సర్ బాధే నన్ను ఎక్కువ బాధిస్తుంది. నాకొచ్చిన కష్టం కంటే రిషి సర్ కష్టపడుతుంటేనే నేను భరించలేకపోతున్నాను. మా మధ్య దూరం తగ్గించాడనికి ఎంత దూరమైనా వెళ్తాను మేడం" అని జగతితో చెప్తుంది వసుధార. ఆ తర్వాత రిషి కాలేజీకి బయల్దేరి ఇంటి ముందున్న కార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే వసుధార ప్రాజెక్ట్  ఫైల్స్ తీసుకొని కార్ దగ్గరికి వస్తుంది. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు మనసులో మాట్లాడుకుంటారు. వసుధార లిఫ్ట్ అడిగితే ఇస్తా అని రిషి పట్టుదలతో ఉండగా, తను పిలవకుండా నేను వెళ్ళనని వసుధార పంతంతో ఉంటుంది. ఇక కాసేపు చూసి వసుధారతో ఏమీ మాట్లాడకుండా రిషి ఒక్కడే కార్ లో బయల్దేరి వెళ్తాడు. రిషి కార్ లో వెళ్తూ.. నువ్వు నా పక్కనుంటే బాగుంటుంది వసుధార అని తన గురించే ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత వెనకాల నుండి హారన్స్ వినిపిస్తాయి.‌ కార్ సైడ్ ఇస్తాడు రిషి. స్కూటీ మీద వసుధార, మరో బైక్ మీద మహేంద్ర, జగతి.. కార్ ని దాటేసి ముందుకి వస్తారు. అది చూసి రిషి.. వీళ్ళేంటి ఇలా నన్ను వెళ్ళనీయకుండా వస్తున్నారని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార కాలేజీకి వెళ్ళిపోతుంది. కాసేపటికి రిషి కూడా కాలేజీకి వచ్చి తన క్యాబిన్ లో కూర్చుంటాడు. ప్యూన్ ని పిలిచి.. వసుధారని రమ్మని చెప్తాడు. అతను వెళ్ళి వసుధారకి చెప్పగా.. తనని ఏదైనా అంటాడేమో అని ఆలోచిస్తుంది. తర్వాత రిషికి కాల్ చేసి నేను బిజీగా ఉన్నాను రాలేనని చెప్పగా.. మరి నేను రావాలా అని రిషి అంటాడు. వద్దులేండి సర్ నేనే వస్తానని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజ్ ఫ్యామిలీకి అసలు నిజం‌ తెలిసినట్టేనా?

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-47 లో కనకం చేసిన మోసానికి పోలీస్ కంప్లెంట్ ఇవ్వాలని రాజ్ ఫోన్ చేస్తుండగా.. "చెయ్ తప్పు ఎవరిదో తెలుస్తుంది. మంచితనం ముసుగులో ఉండి, నాకు ముసుగు కప్పి పెళ్ళి చేసి ఇప్పుడు మంచిగా నటిస్తున్న ఆ మనిషి గురించి నేను చెప్తాను" అని కావ్య అంటుంది. దాంతో ఇంట్లో షాక్ అవుతారు. మరో వైపు స్వప్న, రాహుల్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. దీంతో తన గురించి నిజం తెలిసిపోయిందేమోనని స్వప్న టెన్షన్ పడుతుంది. అంతలోనే రాహుల్ వస్తాడు. పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని స్వప్న అంటుంది. "ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అని చిరాకు తెప్పిస్తున్నవ్.. నాకు అసలే ఆఫీస్ టెన్షన్ ఉంది" అని కోప్పడతాడు రాహుల్. "నన్ను ఇంత మోసం చేసావ్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా" అని మనసులో అనుకుంటాడు రాహుల్. ఇక తర్వాత కూల్ గా స్వప్నతో మాట్లాడతాడు.  మరోవైపు ఏంటి ఇందాక ఏమో అన్నావ్ గా? దీని అంతటికి కారణం ఇంకొకరు అన్నావ్ కదా? ఎవరువాళ్ళు అని అపర్ణ అడుగుతుంది. మా అక్క వెళ్ళిపోయాక, మీకేం సమాధానం చెప్పాలో తెలియక మా అమ్మ ఉరేసుకోబోతుంటే, నేను చూసి ఆపాను. మేము మా అక్క గురించి మాట్లాడుకుంటుంటే, ఈ రుద్రాణి వచ్చి మా అక్క స్థానం లో నన్ను కూర్చోపెట్టమందని కావ్య అందరికి జరిగిన నిజం చెప్తుంది. రాజ్ మాత్రం మా ఇంట్లో వాళ్లపై నిందలు వేస్తావా అనేసరికి.. పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి.. "అవును రాజ్ తను చెప్పింది కరెక్టే.. ఆ రోజు స్వప్నని తీసుకొస్తా అని నేను వెళ్తుంటే నన్ను ఆపి తను వెళ్ళింది.. అంటే అప్పటికే స్వప్న వెళ్ళిపోయింది. తనే కావ్యని ముసుగులో తీసుకొచ్చింది" అని అంటుంది. ఇదంతా చేసింది నువ్వా అని రుద్రాణిని అపర్ణ అడుగుతుంది. "అవును నేనే చేశాను.. మన కుటుంబం పరువు కాపాడడానికి అలా చేశాను" అని రుద్రాణి అంటుంది. నేను వెళ్ళొస్తానని కావ్యకి కనకం చెప్పి వెళ్తుంటే.. ఇంకెప్పుడు రావద్దని కావ్య అంటుంది. ఆ తర్వాత ఎమోషనల్ అయి కనకం వెళ్ళిపోతుంటే.. ఆగమ్మా అని వెళ్ళి హాగ్ చేసుకొని.. ఇక్కడ జరిగిందంతా ఇక్కడే మర్చిపో అమ్మా.. నాన్న, అప్పు వాళ్ళకు చెప్పకు అని కావ్య అంటుంది. సరే అని కనకం వెళ్తుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఒక్క క్షణం పట్టదు.. అత్తింటి గౌరవం కోసం ఆగుతున్నాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-108లో.. నందుకి ట్రీట్‌మెంట్ చేస్తూ గౌతమ్ ఎమోషనల్ అవుతాడు. "నందు‌ ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావ్. ఏం చేసైనా నిన్ను కాపాడుకుంటాను. ఎలాగైనా నిన్ను దక్కించుకుంటాను" అని గౌతమ్ అంటాడు. ఆ తర్వాత కృష్ణ లోపలికి రావడంతో తనకి నందుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయటకు వచ్చేస్తాడు. గౌతమ్ వెళ్తున్నప్పుడు నందుకి ఎలా ఉందని అడుగుతుంది భవాని. అవుటాఫ్ డేంజర్ మిగతా విషయాలు కృష్ణ చెప్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నందు కోసం గౌతమ్ తన గదిలో బాధపడుతుంటాడు. నందిని దగ్గరికి ఇంజక్షన్ తీసుకొని కృష్ణ వెళ్తుండగా.. భవాని చూసి ఆపుతుంది. ఎక్కడికి? ఈ ఇంజక్షన్ ఎందుకు అని భవాని అడిగేసరికి.. నందు కోసమని కృష్ణ చెప్తుంది. ఆ ట్యాబ్లెట్స్ వల్లే కదా నందినికి అలా జరిగిందని భవాని ప్రశ్నిస్తుంది. "ట్లాబ్లెట్స్ విషయంలో ఎక్కడో ఏదో తేడా జరిగింది" అని కృష్ణ అంటుంది. ఈ ఇంజక్షన్ విషయంలో మళ్ళీ ఆ తేడా జరగదని గ్యారెంటీ ఏంటని భవాని అడుగుతుంది. ప్రయోగాలు చేయడానికి నందినే దొరికిందా అని నందిని వాళ్ళ బాబాయ్ కృష్ణని అడుగుతాడు. నందినిని తన ప్రాక్టీస్ కోసం వాడుకుంటుంది. తను చేస్తున్న ప్రయోగం ఫెయిల్ అవుతుందనే తనకి ట్యాబ్లెట్ వేసిందని ముకుంద చెప్తుంది. నువ్వు డాక్టర్ వే కదా.. చూసుకోవాలి కదా అని భవానీ అనగా.. మా సీనీయర్ డాక్టర్ ఇచ్చాడని నేను చూసుకోలేదని కృష్ణ అంటుంది. మీ వచ్చీరాని వైద్యంతో నా కూతురిని బలిచేద్దామని అనుకున్నారా అని భవానీ అడుగుతుంది. నందినిని ఒక పసిపాపలా చూసుకుంటున్నాను అత్తయ్య అని కృష్ణ అనగానే.. "మీ ఆయన కూడా నిన్ను ఒక పసిపాపలా వదిలేస్తేనే ఇలా చేసావ్" అని ముకుంద అంటుంది. మా సీనియర్ డాక్టర్ ని కనుక్కొని చెప్తాను అని గౌతమ్ కి ఫోన్ చేస్తుంది కృష్ణ.. లౌడ్ స్పీకర్ ఆన్ చేయమంటుంది ముకుంద.. ఏమైంది.. ఫోన్ ఆన్సర్ చేయలేదా? అని భవాని అంటుంది. దీనికి శిక్ష పాడాల్సిందే కదా అని భవానీ అనగా.. మురారి నువ్వడిగిన ఆధారాలు ఇవే కదా ఇంకెందుకు కృష్ణని వెనకేసుకొస్తున్నావ్ అని ముకుంద అనగా.. స్టాపిట్ అని కృష్ణ అరుస్తుంది. "ఏం చేశాను నేను.. నందిని నేను ఇన్నిరోజులు ఎంత బాగా చూసుకున్నానో‌ మీరెవరూ చూడలేదా? తన కోసం ఎంత ఆరాటపడ్డానో మీరు గమనించలేదా? నందిని నాకేమైనా శత్రువా? నన్నే కాదు ఏసీపీ సర్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయనికి నందిని అంటే ఇష్ణం లేదా?.. నేను ఇప్పుడు ఈ క్షణం నా డబ్బుతో నేను ఒక కార్ కొనుక్కోగలను కానీ అత్తింటి గౌరవాన్ని కాపాడటానికి చూస్తున్నాను" అని కృష్ణ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఎవరైనా నాకు ఎదురుతిరిగారా అని భవానీ అనగా.. "నేను మీకు ఎదురుతిరగలేదు. నాకు ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా‌.. ఇంతమంది ఒక్కటిగా చేరి నన్ను దోషిలా నిలబెడుతుంటే తట్టుకోలేకపోయాను" అని కృష్ణ ఏడుస్తుంది. ఈ ఇంటి నుండి నిన్ను శాశ్వతంగా బహిష్కరిస్తున్నా అని భవాని అంటుంది. మన ఇంటి కోడల్ని మనమే వెళ్ళగొడతామా? అక్కా ఇంత పెద్ద శిక్షా? అని రేవతి అనగా.. ఈ రోజు ఈ పిల్ల నా పెద్దరికాన్ని ప్రశ్నించింది. వెంటనే పెట్టాబేడా సర్దుకొని వెళ్ళమని భవాని చెప్తుంది. రెండు రోజుల టైం ఇవ్వండి. నేను ఏం తప్పు చేయలేదని నిరూపించుకొని వెళ్తాను అని భవానిని అడుగుతుంది కృష్ణ. మరి భవాని తన రిక్వెస్ట్ ని అంగీకరిస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!.

అష్షు ఫోన్ లిఫ్ట్ చేసిన ఆర్జీవీ...తన లవ్ ని ఎక్సప్రెస్ చేసిన హరి

ఎక్స్ప్రెస్ హరి చేత స్టేజి మీద కన్నీళ్లు పెట్టించిన అష్షురెడ్డి. "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈవారం సందడి చేయడానికి రెడీ ఐపోయింది. దాని ప్రోమో కూడా మస్త్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ షోకి ఈ వారం అవినాష్, ఫైమాని హైజాక్ చేసి వాళ్ల ప్లేస్ లో ఎక్సప్రెస్ హరి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్, భాస్కర్ వచ్చారు. ఆ తర్వాత బ్యూటీ క్వీన్స్ అష్షు, ఇనాయ, అరియానా, భానుశ్రీ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ ఆర్జీవీ రేంజ్ లో డైలాగ్ చెప్పడానికి ట్రై చేసాడు. తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. మీ ముగ్గురు ఆర్జీవీకి ఫోన్ చేయండి. ఎవరి కాల్ ఆన్సర్ చేస్తారో చూద్దాం అని చెప్పింది. మొదట ఆరియానా ఫోన్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇనాయ ఫోన్ చేసింది. కానీ నో యూజ్. ఫైనల్ గా అష్షు ఫోన్ చేసింది. ఆర్జీవీ అష్షు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సడెన్గా మీరంతా నాకు ఫోన్ చేస్తున్నారు అని అడిగేసరికి ఆరియానా లేచి ఫుల్ క్లాస్ ఇచ్చింది. "నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు" అని అడిగింది. తర్వాత అష్షుకి ముద్దు పెట్టాలంటూ శ్రీముఖి ఎక్సప్రెస్ హరికి టాస్క్ ఇచ్చింది. దాంతో హరి " అష్షు నేను నీకంటే చిన్నోడినే. ప్రేమకి అవేవి ఉండవు కాబట్టి ఈ స్టేజి మీద జెన్యూన్ గా చెప్తున్నా ఐ లవ్ యు అష్షు అంటూ ఏడ్చేశాడు" . దానికి అష్షు "హే ఏంటబ్బా ఏడుస్తాడు " అని చిరాకుపడింది. " "అష్షు యాక్సెప్ట్ చేయొచ్చుగా..హరి నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నారుగా" అని వంత పాడింది ఆరియానా. "ఎస్ చెప్తే నా అంత అదృష్టవంతుడు లేదు అనుకుంటా నో చెప్తే నీ అంత అదృష్టం నాకు లేదని అనుకుంటా..బట్ నేనెప్పుడూ నిన్ను దేవతలాగే చూసుకుంటా " అంటూ హరి ఓవర్ డైలాగ్స్ చెప్పేసరికి సమాధానం ఏం చెప్పాలో తెలియక తికమకపడింది అష్షు.

భార్య కృష్ణ కోసం పెద్దమ్మకే ఎదురుతిరిగిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -107లో.. కృష్ణ, మురారిలు ఎవరికి తెలియకుండా బయటకు వెళ్ళిన విషయం ముకుంద ఎలాగైనా భవానీతో చెప్పాలనుకుంటుంది. ఉదయం అందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా.. ఆ తింగరి పిల్లను వచ్చి తినమని చెప్పండి. అసలే నిన్నంతా పస్తులు ఉందని భవాని అంటుంది. అంత అవసరమేమీ లేదు పెద్ద అత్తయ్య.. రాత్రి కృష్ణని మురారి బయటికి తీసుకువెళ్ళి తినేసి వచ్చారని ముకుంద సమాధానమిస్తుంది. అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలోనే కృష్ణ, మురారిలు రెడీ అయి కిందకి వస్తారు. "మీరిద్దరు రాత్రి బయటికెళ్ళారా" అని భవాని అడిగేసరికి.. వెళ్ళామని మురారి చెప్తాడు. అంటే ఈ ఇంట్లో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండరా? నా నిర్ణయనికి విలువ ఇవ్వరా అంటూ భవాని   ప్రశ్నిస్తుంది. "కృష్ణ నా భార్య.. తను పస్తులుంటే నేనెలా తింటాను పెద్దమ్మ.. నేను తినలేదు‌. ఎంత కూలి చేసుకొని బ్రతికేవాడైన తన భార్యని పస్తులు ఉంచడు. అలాగే నేను కూడా నా భార్యని పస్తులు ఉంచకూడదని బయటికి తీసుకెళ్ళాను" అని మురారి అంటాడు. నిన్న నీ భార్యని వేరొకరు ఇంటి దగ్గర డ్రాప్ చేసారు. దానికేమంటావని భవాని అనగానే. కృష్ణకి లేట్ అయితే సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్ళినతనికి థాంక్స్ చెప్తానని మురారి అంటాడు. నాకు ఇన్ని రోజులుగా ఇంట్లో ఎవరు ఎదురు తిరగలేదు.. ఇప్పుడు నువ్వు నీ భార్యకి సపోర్ట్ చేసి నాకు ఎదురు మాట్లాడుతున్నావ్ అని భవాని అంటుంది. నేనెప్పుడు మీకు ఎదురు తిరగను. ఒక భర్తగా తను పస్తులు ఉండకూడదని బయటకి తీసుకువెళ్ళానని మురారి అంటాడు. అయినా సరే మీరు చేసింది తప్పు.. మీకు శిక్ష పడాలని భవాని అంటుండగానే.. నందు మెట్లమీద నుండి కిందపడి నోట్లో నుండి నురగలు కక్కుకుంటుంది.  ఇక వెంటనే హాస్పిటల్ కు వెళ్దామని  కృష్ణ తను ట్రైనింగ్ తీసుకునే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ గౌతమ్ ఉంటాడు. గౌతమ్ తనని ఎవరు గుర్తు పట్టకుండా ఫేస్ ని కవర్ చేస్తూ.. నందు కి ట్రీట్ మెంట్ చేస్తాడు. అందరిని బయటికి వెళ్ళమని చెప్తాడు గౌతమ్. ఇంట్లో వాళ్ళు ఇన్ని రోజులు వాడినవి కరెక్ట్ టాబ్లెట్స్ కాదు కాబట్టే నేను ఇచ్చిన  టాబ్లెట్స్  వాడితే ఇలా అయిందని కృష్ణతో చెప్తాడు గౌతమ్. కృష్ణ బయటకు వస్తుంది. అక్కడే ఉన్న భవాని.. నీ వల్లే నందుకి ఇలా అయిందని తిడుతుంది. పక్కనే ఉన్న ముకుంద ఇదే మంచి టైం ఇంకా రెచ్చగొడదామని.. "ఇంట్లో ఎవరు ఏది చెప్పినా పట్టించుకోవు.. వద్దన్నదే చేస్తావ్" అని ముకుంద అంటుంది. దాంతో నేను చేసింది తప్పే, నన్ను క్షమించండని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి గదిలో రొమాంటిక్ సీన్.. వసుధారకి పట్టిన చెమటలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -713 లో.. ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ జరిపిస్తుంది దేవయాని. ఆ పూజలో జగతి, మహేంద్రలు కూర్చొని నిష్టగా చేస్తారు. రిషి, వసుధారల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలని ఇద్దరు కోరుకుంటారు. పూజ పూర్తయ్యాక దేవాయని వసుధార దగ్గరికి వచ్చి.. "ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో తెలిసిందా.. నువ్వు ఈ ఇంటికి ఒక అతిధిగా మాత్రమే వచ్చావ్. రిషికి నీపై ప్రేమ లేదు. ఉంటే ఇద్దరు కలిసి పూజలో కుర్చునేవాళ్ళు కదా.. నీకు నువ్వే తెలివైనదానివని అనుకుంటావ్ కదా.. సప్తసముద్రాలు ఈది చివరికి మురికి కుంటలో పడ్డట్టయింది నీ పరిస్థితి" అని అంటుంది. అలా తను మాట్లాడిన మాటలకు వసుధార నవ్వుతుంది. మీలాగే నేను చిటికె వెయ్యగలను. మీ పెద్దరికానికి గౌరవం ఇస్తున్నాను. రిషి సర్ నా గుండెల మీద ఉన్నాడు. ఎప్పుడు రిషి సర్ వెంటే నేనుంటానని వసుధార చెప్తుంది. ఇక తను అలా మాట్లాడేసరికి దేవయానికి కోపం వస్తుంది.  ఆ తర్వాత రిషి సర్ ఇంకా లేవలేదా కాలేజీకి లేట్ అవుతుందని వసుధార తన రూమ్ ముందు వచ్చి చూస్తుంది. లోపలికి వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తుండగా.. జగతి వచ్చి.. "ఏంటి వసుధార" అని అడుగగా.. రిషి సర్ ఇంకా లేవలేదు.. వెళ్ళి లేపాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని వసుధార అంటుంది. రిషి రూమ్ లోకి వెళ్ళే స్వేచ్చ నీకు ఉంది.. వెళ్ళి లేపమని జగతి అనగానే.. వసుధార లోపలికి వెళ్తుంది. రిషిని అలానే చూస్తూ ఉండిపోతుంది వసుధార. కాసేపటికి రిషి లేచాక.. "గుడ్ మార్నింగ్ ఎండీ సర్" అని వసుధార చెప్పగా, గుడ్ మార్నింగ్ వసుధార అని చెప్తాడు.  "నువ్వు ఏంటి ఇక్కడ ఉన్నావ్" అని రిషి అడుగుతాడు. వసుధారకి చాలా దగ్గరగా వచ్చి ముద్దిద్దామని అనుకుంటాడు. కానీ మళ్ళీ తన మెడలో తాళి వేసుకున్నది గుర్తు చేసుకొని దూరంగా వెళ్తాడు. ఆ తర్వాత తాను కాలేజీకి తొందరగా రెడీ అవుతానని చెప్పి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు కిచెన్ లో వంట చేస్తున్న ధరణి దగ్గరికి వసుధార వెళ్ళి.. మీకేమైనా హెల్ప్ చెయ్యాలా మేడమ్ అని అడుగుతుంది. వద్దని ధరణి అంటుంది. నువ్వు అందరిని మేడం అని పిలవకు.. చిన్న అత్తయ్యా.. పెద్ద అత్తయ్య అని పిలువు అని ధరణి అనగానే.. రిషి సర్ నన్ను భార్యగా ఒప్పుకున్నాకే అలా పిలుస్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కూతురిని చూసెళ్దామని వచ్చిన కనకం.. అడ్డుగోడగా రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -46 లో.. కావ్యని చూడాలన్న ఆశతో రాజ్ ఇంటికి వస్తుంది కనకం. అయితే అందరు అక్కడే ఉండడంతో కనకంని చూస్తారు. తల్లిని చూసిన ఆనందంలో కావ్య పరుగెత్తుకుంటూ కనకం దగ్గరికి వచ్చి తనని హత్తుకోవాలనుకుంటుంది. ఇంతలో రాజ్ ఆగండి అని చెప్తాడు. కావ్య, కనకం ఇద్దరు ఆగిపోతారు. కావ్యని చూసిన కనకం ఏడుస్తూ ఎలా ఉన్నావ్ అని అడిగేలోపే.. రాజ్ కోపంగా ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అని అంటాడు. నా కూతురు దగ్గరికి వచ్చాను అని కనకం అనగానే.. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే ఎవరితో సంబంధం లేకుండా పోయిందని రాజ్ అంటాడు. దాంతో "అమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్" అని కనకం కావ్యని అడుగుతుంది.  రాజ్ కోపాన్ని భరిస్తూ కనకం అక్కడే ఉంటుంది. పేద కుటుంబం అయినా కూడా మాకు నిజం చెప్తే మేం ఒప్పుకునేవాళ్ళం.. ఇలా ఇంత మోసం చేశారని అపర్ణ అంటుంది. "ప్రతి తల్లితండ్రులు తమ కూతుళ్ళను గొప్పింటికి కోడళ్ళు చెయ్యాలనుకుంటారు.. అది తప్పు కాదు. మీ గురించి మా అయనకి చెప్పి మా కూతురిని మీ ఇంటి కోడలు చేసుకోండని ఒక మాట చెప్తే ఒప్పుకునే వారు.. ఇలా మోసం చేసి పెళ్ళి చెయ్యడం కరెక్ట్ కాదు" అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. నేను తప్పు చేశానంటూ కనకం అందరి కాళ్ళు పట్టుకోబోతుంటే కావ్య వద్దు అంటుంది. నువ్వు ఎందుకు బ్రతిమిలాడుతున్నావ్ అమ్మ.. ఆడపిల్ల తల్లివి అయినందుకా? నువ్వు మా కోసం ఎన్నో చేసావ్. నువ్వు అలా బ్రతిమిలాడకు అని కావ్య కనకంని అంటుంది. ఆ తర్వాత మీరు ఇంత మోసం చేస్తారా? మీ మీద పోలీస్ కంప్లెంట్ ఇస్తానని రాజ్ ఫోన్ చేయబోతుండగా.. వద్దని ఇంట్లో అందరు అంటారు. కావ్య మాత్రం చెయ్యండి తప్పు ఎవరిదో తెలుస్తుందని అనేసరికి.. కావ్యను కోపంగా చూస్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఇదే ఆఖరి రోజైతే ఎవరితో స్పెండ్ చేస్తారన్న అనిల్ రావిపూడి..ఏడ్చేసిన సుష్మ

మిస్టర్ అండ్ మిస్సెస్ షో ఎట్టకేలకు ఎండింగ్ కి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే లోకి అడుగుపెట్టింది. ఇందులో ఫోర్ పెయిర్స్ ఈ గ్రాండ్ ఫినాలేలో తలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో స్టార్టింగ్ లో ఆట సందీప్ వైఫ్ జ్యోతిరాజ్ ని స్టేజి మీదకు పిలిచింది శ్రీముఖి. " లాఖ్ స్టార్ అనే అవార్డుని ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే ఈ అవార్డు తర్వాత ఎంత లాక్స్ చేస్తుందా అని " అనేసరికి జ్యోతి మస్త్ గా నవ్వేసింది. తర్వాత బుల్లితెర నటుడు రవికిరణ్ ని స్టేజి మీదకు పిలిచింది. "ఈ వ్యక్తి కామన్ గా మాట్లాడినా క్లాస్ పీకినట్టే ఉంటుంది కాబట్టి మేము మీకు ఇస్తుంది ఇదే" అంటూ ఒక స్ట్రెస్ బస్టర్ బాల్ ని ఇచ్చింది. "ఎనీవే మీకు తెలుసుగా ఈ బాల్ తో ఎం చేయాలో" అనేసరికి "పిసుక్కోవాలి" అన్నాడు ఫన్నీగా రవికిరణ్. తర్వాత శ్రీవాణి హస్బెండ్ విక్రమ్ ని స్టేజి మీదకు పిలిచింది శ్రీముఖి "మీరు వచ్చిన ప్రతీసారి వనభోజనాలేమైనా జరుగుతున్నాయా అనిపిస్తుంది..అంటే తడి బట్టేసుకుని కూర్చుకుంటారు కదా అలా అనిపిస్తుంది" అంది "కాబట్టి మేము మీకు ఇస్తున్న అవార్డు కూడా తడి బట్టే" అని అదే అతని చేతిలో పెట్టింది. "వెట్ క్లాత్ వేసుకుని వీడియోకాల్ చెయ్యి" అని అనిల్ రావిపూడి పంచ్ డైలాగ్ వేశారు. రాకేష్-సుజాతను పిలిచి "భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే ఒకరి ఇష్టాలు మార్చుకోవడం కరెక్టా కాదా" అని అనిల్ రావిపూడి అడిగారు "లేదు సర్ నేను మాట మీద ఉండే మగాణ్ణి" అంటూ తొడ కొట్టాడు రాకేష్. తరిత్వా సుష్మ-రవికిరణ్ ని పిలిచి "ఇదే మీ జీవితంలో ఆఖరి రోజైతే మీ పేరెంట్స్ తో స్పెండ్ చేస్తారా, మీ భర్తతో స్పెండ్ చేస్తారా" అని అడిగేసరికి సుష్మ కిరణ్ ఏడ్చేసింది. ఇక ఫైనల్ లో విన్నర్ ఎవరు ? టైటిల్ గెలుచుకునేది ఎవరు ? 3 లక్షలు గెలుచుకునే జంట ఎవరు అనే విషయాలు తెలియాలి అంటే 21 వ తేదీ రాత్రి 9 .30 కి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

సౌజన్య కూతురి కాళ్లకు పట్టీలు తొడిగిన బాలయ్య

ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో పోటీ పడుతున్న సింగర్స్ ని ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేసే ఒక కొత్త సంస్కృతికి రూపం ఇచ్చింది ఆహా టీమ్. దానికి గాల విత్ బాల పేరు పెట్టి  బాలయ్య బాబుతోనే పరిచయ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు కంటెస్టెంట్ సౌజన్య వంతు వచ్చింది. "వచ్చింది వైజాగ్ వీరనారి...సింగింగ్ తోనే చేస్తుంది స్వారీ...సౌజన్య..ఓ సౌజన్య...నువ్వు ఇన్స్పిరేషన్ ఆఫ్ ఈ దునియా" అంటూ టాప్ 12 సెలెక్ట్ ఐన కంటెస్టెంట్ సౌజన్యాని తన సాంగ్ తో ఇంట్రడ్యూస్ చేశారు బాలయ్య. "గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ నుంచి ఎకిమీడా..నా జత విడనని వరమిడవ" అనే సాంగ్ ని పాడింది. ఇక ఈ సాంగ్ కి అందరూ ఫిదా ఇపోయారు " యు అరెస్టెడ్ అవర్ ఇయర్స్..నిజంగా శ్రేయా గోషాల్ వాయిస్ వింటున్నట్టే ఉంది " అని థమన్ అన్నారు. "ఎన్ బికె గారి టాప్ 12  అంటే టాప్ క్లాస్" అంది మరో జడ్జి గీతామాధురి. ఇక సౌజన్య పెర్ఫార్మెన్స్ కి ఆమె గాత్రానికి ముగ్దులైపోయి అందరూ కలిసి ఒకేసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసారు. అలా సౌజన్య ఫామిలీ మొత్తం స్టేజి మీదకు వచ్చింది. తరువాత  బాలయ్య కూడా స్టేజి మీద వాళ్ళతో కలిసి సందడి చేసారు అలాగే సౌజన్య చిన్నారి కూతురుకి చిన్న కానుక అని చెప్పి ఆమె కాళ్లకు పట్టీలు తొడిగారు. కాసేపు ఎత్తుకుని ముద్దాడారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా' తన జోరును కొనసాగిస్తోంది. కొత్త మూవీస్, కొత్త షోస్, కొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు చాల దగ్గరయింది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 , అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి కొత్త రకాల కార్యక్రమాలతో తన జర్నీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఈ షోస్ అన్నిటికీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ షోలకు కొనసాగింపుగా సీజన్ 2 లు స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగానే స్టార్ట్ ఐన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 దుమ్ము రేపడానికి సిద్దమయ్యింది. వీకెండ్స్ లో ఆడియన్స్ ని అలరించడానికి వచ్చేస్తోంది.

శృతి మించిన రోహిణి పెర్ఫార్మెన్స్...ఇబ్బంది పడిన ఆది సాయికుమార్

ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్ ఫంక్షన్ కి ఆది సాయికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఈవెంట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చిరునవ్వే విసిరావే" అనే బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తుంటే ఆది స్టేజి మీదకు మెరిసిపోయే బ్లాక్ డ్రెస్ లో మెస్మోరైజ్ చేసేసాడు. ఫస్ట్ టైం ఆది బుల్లితెర మీద తన డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరి మైండ్స్ ని బ్లాంక్ చేసేసాడు. ఆయన వెనకే జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి లంగా వోణిలో ఎంట్రీ ఇచ్చేసింది. ఆది ఆమెను చూసి తలపట్టుకున్నాడు పాపం... "నేను ఎక్కడికి వెళ్లినా ఈవిడ వచ్చేస్తారు. ఎందుకో నాకు అర్ధం కావట్లేదు" అని ఆది చాలా ఫీల్ అయ్యాడు. రోహిణి మాత్రం అతని మాటలు పట్టించుకోలేదు తనను కాదు అన్నట్టుగా తన పని తాను చేసుకుపోయింది. "అస్సలేం గుర్తుకు రాదు" అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ తన వోణి పల్లూని ఆది ముఖం మీదకు విసిరి అతన్ని కొట్టి మరీ డాన్స్ చేసింది. ఆది పరిస్థితి అతని ఫేస్ లో కనిపించేసింది... ఐతే రోహిణి పెర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం శృతి మించి మరీ చిరాకు తెప్పించేదిగా ఉంది. ఇంతలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి "ఇంతకు మీకు ఆమె బికినీలో కావాలా, శారీలో కావాలా" అని ఆదిని అడిగింది. "ఆల్రెడీ సౌందర్య గారు శారీతో చేసేసారు వి విల్ గో విత్ బికినీ" అని యమా స్టైల్ గా చెప్పేసింది రౌడీ రోహిణి. ఆ మాటకు ఆది తలదించుకోక తప్పలేదు. ఇక ఈ షో ఈ ఆదివారం జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది.

కావ్య వేసిన ముగ్గు‌‌ చూసి ఫిధా అయిన రాజ్.. తనని భార్యగా ఒప్పుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ‌గురువారం నాటి ఎపిసోడ్‌-45 లో.. దుగ్గిరాల ఇంటి కొత్త కోడలు కావ్య ఉదయమే ఇంటిముందు ముగ్గు వేస్తుంది. కావ్య ఇంటిలోకి వెళ్ళాక.. రాజ్ వాళ్ళ నానమ్మ, పనిమనిషి శాంతం వచ్చి ఆ ముగ్గుని చూస్తారు. ఏంటే శాంతా.. అప్పుడే అపర్ణ ముగ్గు వేసిందా అని అడుగుతుంది. లేదమ్మా.. ఈ ముగ్గు వేసింది ఈ ఇంటి కొత్త కోడలు కావ్యమ్మ గారు అని పనిమనిషి శాంతం చెప్తుంది. అది చూసి రాజ్ వాళ్ళ నానమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. "ఏంటి ఆ అమ్మాయి వేసిందా.. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసే ఇల్లాలు ఇంటిని కూడా అంతే అందగా తీర్చిదిద్దుతుంది" అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. రాజ్ జాకింగ్ కి వెళ్ళి వస్తూ అక్కడ ఆగి వీళ్ళు మాట్లాడుకునేది అంతా వింటుంటాడు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళాక కావ్య వేసిన ముగ్గు చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆ ముగ్గు ఒకవేళ మా అమ్మ చూస్తే ఇంప్రెస్ అవుతుందని రాజ్ అనుకొని ముగ్గుని తన కాళ్ళకున్న షూస్ తో చెరిపేసి లోపలికి వెళ్తాడు. అలా రాజ్ చెరపడం కావ్య  చూస్తుంది.  కోపం ఉన్నా కూడా ఒక్కమాట కూడా అనకుండా కావ్య లోపలికి వెళ్తుంది. పనిమనిషి శాంతం ఆ ముగ్గుని చూసి అది చెరిపేసినవాళ్ళని తిడుతుంది. అలా తిట్టడం చూసి రాజ్ కోప్పడుతాడు. ఆ తర్వాత రాజ్ ని ఫ్రెష్ అయి రమ్మని వాళ్ళ నానమ్మ చెప్తుంది.  కాసేపటికి కళ్యాణ్, కావ్య దగ్గరికి వెళ్ళి నానమ్మ మిమ్మల్ని పిలుస్తుంది వదిన అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఈ రోజు నీకు కోడలిగా బాధ్యతలు అప్పగించాలి అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. అప్పుడే రెడీ అయి రాజ్ ఆఫీస్ కి బయల్దేరి వెళ్తుంటాడు. నేను పూజలో పాల్లొనను అని రాజ్ చెప్తాడు. అది చూసి రాజ్ నానమ్మ.. "మన‌ ఆచారాలను, సంప్రదాయాలను ఇలా‌ వద్దు అనకూడదు" అని రాజ్ తో అంటుంది. సరేనని రాజ్ ఒప్పుకుంటాడు. అక్కడ పూలు, పండ్లు, చీర, అన్ని రకాలు కలిపి ఉన్న ప్లేట్ ని తన భార్య కావ్యకి ఇవ్వమని రాజ్ కి ఇస్తుంది రాజ్ వాళ్ళ నానమ్మ. అది తీసుకున్న రాజ్‌.. "తనని నా భార్యగా ఒప్పుకోను. ఇంట్లో పనివాళ్ళకి ఇస్తున్నానని అనుకుంటాను. పనివాళ్ళలో‌ ఒకరు పెరిగారని అనుకుంటాను" అని రాజ్ ఆ ప్లేట్ ని కావ్యకి ఇవ్వాలనుకుంటాడు. కావ్య వద్దంటుంది. "నీ భర్త ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావమ్మా" అని కావ్యని వాళ్ళ చిన్న అత్తయ్య అపర్ణ అడుగుతుంది. "నన్ను భార్య అని ఒప్పుకొని‌ ఇవ్వమనండి.. ఆ రోజు కచ్చితంగా తీసుకుంటాను.‌ నేను బానిసని కాదు. నాకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉంటాయి కదా" అని కావ్య అంటుంది. అక్కడే ఉన్న రాజ్ వాళ్ళ అమ్మ.. "చూసారా అత్తయ్య ఎంత పొగరో.. మీ మాటకే ఎదురు సమాధానం చెప్తుంది. ఆత్మవిశ్వాసం అంటూ విప్లవ భావాలను వల్లె వేస్తుంది" అని రాజ్ వాళ్ళ నానమ్మతో అంటుంది. అది విని కావ్య.. నేను అలా అనలేదు అమ్మమ్మ గారు.. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. బానిసని కాదు అని అన్నాను. మీకు‌ ఎదురుతిరగలేదు. క్షమించండి అమ్మమ్మ గారు అని అంటుంది. ఆ తర్వాత రాజ్ చేతిలోని ప్లేట్ చిరాగ్గా విసిరేస్తాడు. అలా ప్లేట్ కిందపడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

త్వరలో డివోషనల్ సీరియల్ శ్రీ రేణుక ఎల్లమ్మ

స్టార్ మాలో ఈమధ్య కొత్త కొత్త సీరియల్స్ హడావిడి బాగా జోరుగా సాగుతోంది. బ్రహ్మముడి, మధురానగరిలో వంటి సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఐతే అది డివోషనల్ సీరియల్ అన్నమాట. "దుష్ట సంహారం కోసం ఒకే ఆత్మలో రెండు శక్తులు పరాశక్తి స్వరూపాలుగా అవతరించిన ఇద్దరు అమ్మాయిల కథ..శ్రీ రేణుకా ఎల్లమ్మ" అంటూ త్వరలో ప్రసారం కావడానికి ప్రోమోని రెడీ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది స్టార్ మా. ఐతే ఈ సీరియల్ టైం స్లాట్ వస్తుంది అనే విషయం  ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. ఐతే ఈ సీరియల్ కన్నడలో స్టార్ సువర్ణ ఛానల్ లో ప్రసారమవుతున్న  "ఊదోఊదో శ్రీ రేణుక ఎల్లమ్మకు డబ్బింగ్ వెర్షన్ త్వరలో తెలుగులో ప్రసారం కాబోతోంది. ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ సర్వారి ఎల్లమ్మ రోల్ లో నటిస్తోంది. ఈ చిన్నారి చార్లీ మూవీలో కూడా నటించింది. రేణుక రోల్ లో నమ్మ భైరవి నటిస్తోంది.  ఇందుమతి రోల్ లో తేజస్విని శేఖర్, మంగళా దేవి రోల్ లో వీణ పొన్నప్ప, విష్ణుమూర్తి రోల్ లో ఆర్యన్ రాజ్, రేణు మహారాజ్ రోల్ లో తారక్ పొన్నప్ప, స్వర్ణలత రోల్ లో లక్ష్య శెట్టి నటిస్తోంది. స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ టాప్  10లో ఉంటున్నాయి. వీటిల్లో ఎక్కువశాతం  బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి, కృష్ణ ముకుంద మురారి, మల్లీలాంటి సీరియల్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కొత్త సీరియల్ ఎలా ఉండబోతోంది ఏ టైం స్లాట్ లో ప్రసారం కాబోతోంది అన్న విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

డాక్టర్ గౌతమే సిద్ధు అని తను గుర్తుపట్టిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -106 లో.. ముకుందకి కౌంటర్ ఇచ్చి నందు కి భోజనం తీసుకొని వెళ్ళి తినమంటుంది కృష్ణ. అప్పుడు నందు తినకుండా.. నిన్ను బండి మీద తీసుకొచ్చిన అతను ఎవరని అడుగుతుంది. అతను మా గౌతమ్ సర్ అని కృష్ణ అనగానే.. నాకేంటి సిద్దు లాగా అనిపించిందని నందు అంటుంది. "సిద్దు ఎవరు నందు" అని కృష్ణ అడగగానే.. ఇక నందు తలపట్టుకొని నాకు గుర్తు రావట్లేదని అనేసరికి సరే సరే నువ్వు ఏం ఆలోచించకు అని కృష్ణ అంటుంది. మరోవైపు కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. అబ్బా ఈ రోజు వంటలు బాగున్నాయ్ అంటాడు. బాగా తిని వచ్చారా అని కృష్ణ అనేసరికి.. "లేదు కృష్ణ నీ ముందు అలా అన్నాను.. కాని నేను కూడా తినలేదు. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను" అని మురారి అంటాడు. మరి ఏం చేద్దాం సర్ నాకు ఆకలిగా ఉందని కృష్ణ అంటుంది. బయటకు వెళ్లి తినొద్దాం.. ఇంట్లో తినొద్దని పెద్దమ్మ చెప్పింది కదా, బయట వద్దనలేదు కదా అని మురారి అంటాడు. అలా అనుకొని ఇద్దరు ఇంట్లో ఎవరికి కనపడకుండా బయటకు వెళ్తారు. బయట ఎక్కడ చూసిన అన్ని క్లోజ్ చేసి ఉంటాయ్. ఒక దగ్గర ఓపెన్ చేసి ఉన్నా కూడా.. "ఇప్పుడు ఏం లేవు అన్నీ అయిపోయాయి" అని షాప్ అతను అనడంతో.. ఇతను ఎవరు అనుకున్నావ్ ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ లేచి కూర్చోండి సర్ అని టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తారు. ఇక ఆ తర్వాత ఇద్దరు టిఫిన్ చేసి దార్లో ఐస్ క్రీం తింటూ ఇంటికి వస్తారు. కృష్ణ ఏం చేస్తుంది.. మురారి ఏమైనా భోజనం తీసుకెళ్ళి తనకి ఇచ్చాడా అని ముకుంద వాళ్ళ గదిలోకి వెళ్లి చూస్తుంది. ముకుంద వెళ్ళి వారి గదిలో చూసేసరికి మురారి, కృష్ణ ఇద్దరు లేకపోవడంతో.. ఇద్దరు బయటికి వెళ్ళారా.. వీళ్ళ సంగతి చెప్తా అని అనుకుంటుంది. ఇంతలో బయట నుండి కృష్ణ, మురారిలు వస్తారు. వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్లారని ముకుంద అడగుతుంది. నీకు ఎందుకు చెప్పాలి.. నా భర్తతో నేను బయటికి వెళ్ళాను. ప్రతి దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్ అని ముకుందకి కృష్ణ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాని తర్వాత మురారి చెయ్యి పట్టుకొని.. పదండి ఏసీపీ సర్ అని లోపలికి తీసుకెళ్తుంది కృష్ణ. రేపు మీ సంగతి పెద్ద అత్తయ్యతో చెప్తా అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.