రాజ్, కావ్య శోభనానికి ముహూర్తం పెట్టిన‌ దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.‌ ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-54 లో...  సీతారామయ్య ‌గారు పంతులిని పిలిచి కొత్త జంటకి శోభనం ఫిక్స్ చేస్తారు. రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణని పిలిచి అమ్మమ్మ శోభనం ముహూర్తం గురించి చెప్పగా.. అయ్యో  అత్తయ్య.. రాజ్ ఇంకా భార్యగా  అంగీకరించలేదు. ఆ భాధ ఇంకా అలానే ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ శోభనమని అడుగుతుంది అపర్ణ. ఎవరేం చెప్పినా వినేది లేదు.. ఈ రాత్రికి శోభనం‌ జరిగితీరుతుందని సీతారామయ్య చెప్పేసి వెళ్ళిపోతాడు. కాసేపటికి అప్పుకి కాల్ చేస్తాడు రాహుల్.. నీకొక విషయం చెప్పాలి.. మీ అక్కకి మా అన్నకి అని చెప్తుండగా అప్పు దగ్గరి నుండి కనకం ఫోన్ లాక్కుంటుంది. ఏంటి బాబు అని కనకం అడుగగా..‌ శోభనం  గదిలో బెడ్ మీద పూలతో డెకరేట్ చేశామని కళ్యాణ్ చెప్పగా.. ఎంత మంచి శుభవార్త చెప్పారు బాబు అని కనకం సంతోషపడి ఫోన్ కట్ చేసి.. అప్పుతో కావ్యకి శోభనమని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది జరిగే పని కాదులే అని అప్పు అనుకుంటుంది.   ఆ తర్వాత కావ్య తన‌ గదిలోకెళ్ళి శోభనం గురించి బాధపడుతుండగా అమ్మమ్మ వచ్చి... కావ్యని శోభనానికి రెడీ చేస్తానని చెప్తుంది. ఇప్పడెందుకు అమ్మమ్మ.. రాజ్ గారు నన్ను ఇంకా భార్యగా అంగీకరించలేదు. శోభనం గదికి రానిచ్చేవారైతే నేను ఈ స్టోర్ రూంలో ఎందుకుంటాను అమ్మమ్మ గారని కావ్య అంటుంది.  మీ మధ్య దూరం పోవడానికే ఈ ముహుర్తం పెట్టించాం. భార్యగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. తప్పదు.. ఇదే నీ ఇల్లు.. ఇక్కడే ఉండాలి.‌ఇక్కడే బతకాలి..‌ స్థిరత్వం కోసం.. అత్తవారింట్లో అస్తిత్వం కోసం.. వంశానికి ఒక వారసుడిని ఇచ్చే తొలిరాత్రి ఈ ఇంటికి నిన్ను కోడలిని చేస్తుంది. అవమానాలు, అనుమానాలు పక్కన పెట్టి శోభనానికి సిద్దంగా ఉండు.. మేం బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని అమ్మమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య.. ఏంటో అమ్మమ్మ గారు ఇలా చెప్పారు.. ఎలా జరిగేది అలా జరుగుతుంది.. ఆ దేవునిపై భారం వేసాను అని అనుకుంటుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కాలేజీ పరువుపోకుండా కాపాడిన రిషి.. రాజీనామా చేసిన ధర్మరాజు!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -721 లో.. ధర్మరాజు సడన్ గా డోర్ తియ్యడంతో రిషి కర్టెన్ వెనకాల దాక్కుంటాడు.. వసుధార మాత్రం ధర్మరాజు ముందే ఉండిపోవడంతో ధర్మరాజు చూసేస్తాడు. వసుధారని చుసిన ధర్మరాజు.. కలా? నిజామా అని అనుకుంటూ కళ్ళు నులుముకుంటుండగా వసుధారని వెనక్కి లాగుతాడు రిషి. ఇక కళ్ళు తెరిచి చూసిన ధర్మరాజు.. ఒహ్హ్ ఇది కలనా  అని అనుకొని.. సోఫా దగ్గరికి వెళ్లి పడుకుంటాడు. వసుధార రిషి ఇద్దరు గదిలో నుండి బయటకు వచ్చి సోఫాలో ఉన్న పేపర్ బండిల్ తీసుకుంటారు. రేపు కాలేజీకి వచ్చేవరకు కూడా పేపర్ బండిల్ లేవన్న విషయం ధర్మరాజుకి తెలియొద్దని రిషి అంటాడు. దాంతో వసుధార తన బ్యాగ్ లో వేస్ట్ పేపర్ ఉన్న బండిల్ తీసి రిషికి చూపిస్తూ.. ఎందుకైనా పనికొస్తాయని బ్యాగ్ లో తెచ్చానని వసుధార అంటుంది. అది విని నువ్వు గొప్ప తెలివైన దానివని రిషి అంటాడు. వట్టి బండిల్  అక్కడ పెట్టి, నిజమైన పేపర్ బండిల్ ను తీసుకెళ్తారు ఇద్దరు. ఆ తర్వాత ఉదయం పేపర్ వాల్యుయేషన్ స్పాట్ తనిఖీలు అంటూ ధర్మరాజు కొంత మంది ఆఫీసర్ లను తీసుకొని కాలేజీ కి వస్తాడు. మీ కాలేజీలో వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని సమాచారం వచ్చింది.. అందుకే తనిఖీ చెయ్యడానికి వచ్చామని మహేంద్రతో అంటాడు ధర్మరాజు. సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసేసరికి అన్ని బండిల్  కరెక్ట్ గా ఉంటాయి. "అన్ని కరెక్ట్ ఎలా ఉంటాయి.. మూడు బండిల్స్ నేను తీసుకెళ్ళాను కదా" అని ధర్మరాజు అనుకొని.. బండిల్స్  ఓపెన్ చేసి చూసి అన్ని కరెక్ట్ ఉండడంతో షాక్ అవుతాడు ధర్మరాజు. ఇక వచ్చిన ఆఫీసర్ లు వెళ్ళిపోతారు.  వాళ్ళు వెళ్ళిన తరువాత రిషిని ఒక డౌట్ అడుగుతుంది. "సర్ ధర్మరాజే.. ఈ పని చేసాడని మీకెలా తెలుసు" అని వసుధార అడుగుతుంది. జగతి మేడం రూం 'కీ' సబ్బు వాసన వస్తుందని అంది కదా.. అంతకముందు ధర్మరాజు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు కూడా సబ్బు వాసన వచ్చింది అని రిషి అంటాడు ధర్మరాజు వెళ్లిపోతుండగా రిషి ఆపి.. ఈ బండిల్ నువ్వు తీసుకెళ్ళావని నాకు తెలుసు.. అవి నీ దగ్గర నుండి మేము రాత్రి దొంగతనం చేసాం.. మంచి గౌరవప్రదమైన లెక్చరర్ వృత్తిలో ఉంటూ ఇలా చెయ్యడం కరెక్టేనా, ఇప్పుడు మీపై కేసు పెట్టి శిక్ష పడేలా చెయ్యొచ్చు కాని నేను అలా చెయ్యను మీకంటూ ఒక స్థాయి ఉంది.. దాన్ని పాడుచెయ్యలేను. ఇంకెప్పుడు ఇలా చెయ్యకండని ధర్మరాజు తో రిషి చెప్తాడు. ధర్మరాజు తప్పు చేసాననే పశ్చాపంతో.. "ఈ జాబ్ కి రాజీనామా చేస్తున్నా" అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషికి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఇదంతా జరగడానికి మీరు కూడా కష్టపడ్డారు.. మీ అందరికి థాంక్స్ అని రిషి అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అగ్రిమెంట్ మ్యారేజే అయినా మన మధ్యలో ఏ బంధం లేదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -115 లో.. కృష్ణ నువ్వు వెళ్ళొద్దని మురారి అంటాడు. ఈ ఇంట్లో నిబంధనలు అన్ని కూడా ఇంట్లో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ఎవరి వ్యక్తిత్వాన్ని తక్కువ చెయ్యడానికి కాదని మురారి అంటాడు. నేను ఇంట్లో వాళ్ళ గురించి అనట్లేదు.. నీ గురించి అంటున్నాను. నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడావ్ నువ్వు. నీది నాది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే అని  కృష్ణ అంటుంది. అగ్రిమెంట్ మ్యారేజే కానీ నాకు బాధ కలిగితే నువ్వు బాధపడ్డావ్.. నీకు బాధ కలిగితే నేను బాధపడ్డాను. మన మధ్యలో ఏ బంధం లేదా కృష్ణ అని మురారి అంటాడు. అగ్రిమెంట్ పూర్తికాకుండానే వెళ్తున్నాను అని కృష్ణ కిందకి వస్తుంది.  కృష్ణ వెళ్ళిపోవడానికి సిద్దమవుతుంది. అది చూసి ఇంట్లో తనని ఎవరు ఆపేవారు లేరని ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోనే కృష్ణ తన బ్యాగ్ తో కిందకి వస్తుంది. అందరూ హాల్లోనే ఉంటారు. రేవతి దగ్గరికి కృష్ణ వెళ్తుంది. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను కూతురులా చూసుకున్నారని రేవతిని పట్టుకొని ఏడుస్తుంది. తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని భవాని దగ్గరికి వెళ్ళి.. మీ వల్లే ఈ ఇల్లు క్రమశిక్షణలో ఉంది.. మీరంటే నాకు గౌరవం ఉందని చెప్పి, ఆశీర్వదించండని కృష్ణ అంటుంది. కృష్ణని ఆశీర్వదించాలని అనుకొని ఆగిపోతుంది భవాని. నువ్వు వెళ్ళొద్దు కృష్ణ అని ప్రసాద్ అంటాడు. సుమలత చీర తీసుకొని వచ్చి కృష్ణకి ఇస్తుంది. వెళ్ళిపోతున్న కోడలిని కూడా మర్యాదగా పంపిస్తున్న ఈ ఇంటి సంస్కారం ఎంత గొప్పదో అని కృష్ణ అంటుంది. "నువ్వు వెళ్ళకు కృష్ణ.. ఈ ఇంట్లోని వారందరి తరుపున నేను క్షమాపణ అడుగుతున్నా" అని మురారి అంటాడు. నువ్వు ఒక గొప్ప ఏసీపీవి అయ్యి ఉండి, అలా అంటున్నవేంటని ముకుంద అనగానే.. "నేను ఎంత గొప్ప ఏసీపీ అయినా కూడా ఒక భార్యకి భర్తను.. అయినా భార్యాభర్తల బంధం గురించి నీకు తెలియడానికి ఆదర్శ్ లేడు కదా" అని మురారి అనగానే ముకుంద సైలెంట్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ ఇంట్లో నుండి వెళ్లిపోతుంటే.. తప్పు చేసింది కాబట్టే వెళ్తుందని భవాని అనగానే.. కృష్ణ వెనక్కి వస్తుంది. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఎక్కడికి వెళ్ళను అని కృష్ణ అనగానే.. రేవతి, మురారి ఇద్దరు సంతోషపడతారు. ముకుంద మాత్రం డల్ అయిపోతుంది.‌ ఇంట్లో వాళ్ళందరూ హాల్ నుండి వెళ్ళిపోతారు. మురారిని బ్యాగ్ తీసుకొని రా అని కృష్ణ అంటుంది. అప్పుడు మురారి హ్యాపీగా ఫీలవుతూ సరేనని చెప్తాడు. కాసేపటికి నందు దగ్గరికి వెళ్తుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బాలయ్య ముందు నాన్సెన్స్ చేసిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ టీం!

ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్-2 రోజు రోజుకి క్రేజ్ ని సంపాదించుకుంటుంది. ఈ షో గతవారం జరిగిన ఎపిసోడ్ లో రౌండ్ లో లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ ఒకరు ఎలిమినేట్ అవగా.. ఈ వారం సరికొత్తగా ప్రారంభమైంది. సింగర్ హేమచంద్ర యాంకరింగ్ చేస్తూ తమన్, సింగర్ కార్తిక్, గీతా మాధురి జడ్జెస్ గా చేస్తున్నారు. కొత్త ట్యాలెంట్ ని వెతికితీస్తూ పాటలకు ప్రాణం పోస్తున్న ఈ షో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మొన్న జరిగిన ఎలిమినేషన్ కి అయిదు లక్షల ఓట్లు వచ్చాయని హేమచంద్ర చెప్పాడు. దీంతో ఈ షోకి విశేష స్పందన లభిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతవారం మ్యూజిక్ మాంత్రికుడు కోటి గెస్ట్ గా రాగా.. ‌ఈ వారం నట సింహం నందమూరి బాలకృష్ణ వచ్చాడు. దీంతో సింగింగ్ షో కాస్త అన్‌స్టాపబుల్ గా మారింది. అయితే ఈ‌ షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని హేమచంద్ర చెప్పడంతో.. మరి ఇంకెందుకు లేటు పిలవండని బాలకృష్ణ చెప్పడంతో.. హీరో నవదీప్, హీరోయిన్ ‌బిందుమాధవి ఇద్దరు కలిసి వచ్చారు. వీళ్ళా పాడేదని బాలకృష్ణ ఆశ్చర్యపోయి.. సరే పాడండని చెప్పగా.. శృతి తప్పిన రాగంతో పాడాడు నవదీప్.. ఆ తర్వాత అలా కాదు పాడటమని బిందుమాధవి మైక్ తీసుకొని.. ఏదో పాడగా.. ఏ‌ ఏంటయ్యా ఈ నాన్ సెన్స్ అని బాలకృష్ణ అనగా..‌ "సర్ ఇది నాన్ సెన్స్ కాదు సర్ న్యూసెన్స్ వెబ్ సిరీస్" అని బిందు మాధవి చెప్పింది. అవునా దేనిమీద అనగా.. జర్నలిజం అని నవదీప్ చెప్పాడు. "జర్నలిజమా.. ఆదివారం పొద్దున్నే టీవి పెడితే.. శనివారం సాయంత్రం నవదీప్ ఎక్కడో దొరికిపోయాడు.. అర్థరాత్రి కార్ వొదిలి పారిపోయాడు. డ్రంక్ డ్రైవ్ లో‌ క్యాచ్.. ఇప్పుడు ఇవే కదా న్యూస్" అని బాలకృష్ణ అనగానే షో అంతా నవ్వేస్తారు. ఆ తర్వాత ఏంటి రివెంజా అని బాలకృష్ణ అనగా.. మీడియా వాళ్ళతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని చాలా చిన్నవయసులో తెలుసుకున్నాను సర్ అని నవదీప్ చెప్పాడు. "నీకు పాపులారిటీ వచ్చిందే వాళ్ళ వల్ల కదా, నువ్వు కావాలని చేసావ్ కదా" అని బాలకృష్ణ అనగా..  "కొన్ని నేను చేసాను‌ సర్.. కొన్ని నా చేత చేపించారు సర్.. కొన్ని జరగకుండానే చెప్పేసారు సర్" అని నవదీప్ చెప్పాడు. ఆ తర్వాత న్యూసెన్స్ వెబ్ సిరీస్ టీజర్ ని బాలకృష్ణతో పాటు షో లోని అందరూ చూసారు. అందరూ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అల్లు అర్జున్ పోస్ట్ చేసినా నమ్మకండని చెప్పిన‌ గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-6 తో గీతు రాయల్ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ లో‌ తన గేమ్ స్ట్రాటజీతో అందరిని తికమక పెడుతూ పర్ఫామెన్స్ చేసేది. మైండ్ గేమ్ తో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ మనసులని గాయపరిచిన ఈ చిత్తూరు చిరుత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందింది. బిగ్ బాస్ కి ముందు రివ్యూ లు చెప్పే గీతు.. నిన్న మొన్నటిదాకా నీతి సూక్తులు, మోటివేషనల్ కోట్స్ చెప్తూ సమాజానికి మెసెజ్ లు‌ ఇచ్చింది.‌  ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చేస్తూ తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండే గీతు రాయల్.. ఉగాదిని వాళ్ళ‌ ఇంట్లో ఎలా జరుపుకుంటారో వీడియోని యూట్యూబ్ లో‌ రిలీజ్ చేసింది. అలా ప్రతీది తనకి ఏదనిపిస్తే అది చేయడం తన సహజ గుణమని ఎప్పుడు చెప్తుంది‌ గీతు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఆదిరెడ్డి తో మంచి ఫ్రెండ్ గా ఉంది గీతు. ఆ తర్వాత అందరిని కలుస్తూ సర్ ప్రైజ్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక స్టేటస్ పెట్టగా.. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది.  తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. "ఇన్ స్టాగ్రామ్ లో ఎవరైనా ట్రేడింగ్ లేదా క్రిప్టో లేదా బెట్టింగ్ గురించి ఏ పోస్ట్ చేసి‌నా దయచేసి నమ్మకండి. నేను పోస్ట్ చేస్తే కూడా నమ్మకండి. నేను కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఇచ్చిన కమిట్ మెంట్ వల్ల పోస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఏదో పెట్టారని చేయకండి. డబ్బులు పోతే వాళ్ళు భాద్యత తీసుకోరు. ఇదే విషయం గురించి ఒకవేళ అల్లు అర్జున్ పోస్ట్ చేసినా నమ్మకండి" అంటూ గీతు తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. తనకేమి అనిపిస్తే అది చెప్పే గీతు ఈ విషయాన్ని సూటిగా చెప్పేసింది. దీంతో నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

శేఖర్ మాస్టర్ రాకతో బిబి జోడీలో పూనకాలు లోడింగ్!

ప్రతీ శని, ఆదివారాల్లో స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో 'బిబి జోడి'. గతవారం సెమీఫైనల్‌ నుండి ఒక జోడీ ఎలిమినేట్ అయి బయటకు రాగా మిగిలిన ఐదు జోడీలతో 'గ్రాండ్ ఫినాలే' చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. శ్రీముఖి యాంకర్ గా సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్డెస్ గా చేస్తున్న ఈ డ్యాన్స్ షో ఇప్పుడు అత్యంత వీక్షకాదరణ పొందుతోంది. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో శేఖర్ మాస్టర్ గెస్ట్ గా వచ్చి.. పూనకాలు లోడింగ్ పాటకు తన డ్యాన్స్ తో అందరికి మంచి కిక్కు ఇచ్చాడు.‌ తన ఫస్ట్ మూవీ తరుణ్ మాస్టర్ తో చేసానని శేఖర్ మాస్టర్ చెప్పాడు. వంద రూపాయల నుండి ఇప్పటిదాకా వచ్చారు గ్రేట్ అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. సదాని చూస్తుంటే ఏం గుర్తురావట్లేదా మాస్టర్ అని శ్రీముఖి అడుగగా.. అదేం లేదని, తను చాలా మంచిదని.. అప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని శేఖర్ మాస్టర్ చెప్పాడు. రాధ, శేఖర్ మాస్టర్ కలిసి 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో' పాటకి డ్యాన్స్ చేసారు. అలా ఇద్దరు డ్యాన్స్ చేసాక ఇప్పటి జనరేషన్ తో కలిసి డ్యాన్స్ చేయలేకపోతున్నానే ఒక చిన్న డ్రీమ్ ఉండిపోయింది.. అది ఇప్పుడు తీరిపోయిందని రాధ చెప్పింది.  "అవినాష్-అరియానా డ్యాన్స్ అదుర్స్.. సూపర్బ్. హాఫ్ బీట్ పట్టుకొని వచ్చావ్ ఇప్పుడు ఫుల్ బీట్ లో చేస్తున్నావ్ అరియానా, ఆ తర్వాత మరొక జోడి గురించి చెప్పాలి.. ఒక హాట్ పర్ఫామెన్స్.. బాహుబలి మూవీలోని పాటకి మెహబూబ్-శ్రీసత్య పర్ఫామెన్స్ చూసి వావ్ అనిపించింది. ఫైమా-సూర్య బాగా కష్టపడుతున్నారు. ఫైమాని చూసి ఎవరైనా డ్యాన్సర్ అనుకుంటారా? ఫైమాని చాలా దగ్గర నుండి చూసాను. కామెడీ బాగా చేసి అందరిని బాగా నవ్విస్తుంది. కానీ డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తుంది ఇప్పుడు. ఎలాగైనా బెస్ట్ డ్యాన్స్ ఇవ్వాలని చాలా కష్టపడుతున్నావ్. ఇక్కడ ఉన్న అన్ని జోడీలలో కాస్ట్లీ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే చైతు-కాజల్ జోడి, మూడు సార్లు ఎలిమినేషన్ దాకా వెళ్ళి గెలిచి వచ్చారు" అని శేఖర్ మాస్టర్ చెప్పాడు.

నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు నీకు లేదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-53 లో.. కావ్య గురించి స్వప్నకి చెడు అభిప్రాయం ఏర్పడేటట్లు చేస్తాడు రాహుల్. నీ అక్క వల్లనే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను బయటకు గెంటేస్తారు అంటూ రాహుల్ అంటాడు. ఇప్పుడే వద్దు పెళ్లి, నాకు గౌరవం దక్కినప్పుడే దుగ్గిరాల ఇంటి కోడలుగా వెళ్తానని రాహుల్ తో అంటుంది స్వప్న. అక్కచెల్లెళ్ళలకి గొడవ పెట్టాను.. ఇప్పట్లో స్వప్న నన్ను డిస్టర్బ్ చెయ్యదని అనుకుంటాడు రాహుల్. మరోవైపు కనకం ఇంటికి రాగానే కృష్ణమూర్తి తిడతాడేమోనని అనుకుంటుంది. కానీ అతను కనకంని తిట్టడు. "ఒక తల్లిగా నీ కూతురుని చూడాలి అనుకునే నీ ప్రేమను నేనెలా కాదంటాను. నేను ఎందుకు తిడుతాను.. కావ్య ఎలా ఉంది" అని కృష్ణమూర్తి అడుగగా.. బాగుందని చెప్తుంది కనకం. కావ్య ఎలా ఉందో నీ కళ్ళలో సంతోషం చూస్తే కన్పిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. నీ ముఖానికి వేసుకున్న జోకర్ రంగులు ఎప్పుడు చెరిపేశావని కృష్ణమూర్తి అడుగగా.. ఎలా తెలిసిందంటూ ఎమోషనల్ అవుతుంది కనకం. నాకు మీనాక్షి అక్కడ జరిగిందంతా చెప్పిందని కృష్ణమూర్తి అంటాడు.  మరోవైపు కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి.. "నేను ఈ పనికిరాని సామాన్లు పడేసే గదికి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు నా నగల కోసం వచ్చాను" అని అంటుంది. నాకు ఈ నగలు పెట్టుకోవాలనే అశేమీ లేదని కావ్య అనగానే.. మరి ఈ నగలు అన్ని ఎందుకు దిగేసుకున్నావ్ అని అపర్ణ అడుగుగా.. "ఈ నగలు సొసైటీలో నన్ను రిచ్ గా చూపించేందుకు.. మీ అబ్బాయి వేసుకోమన్నాడు.. అమ్మమ్మ గారు కూడా బలవంతం చేస్తే వేసుకున్నాను అత్తయ్య" అని నగలు ఇస్తుంది. నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు నీకు లేదని అపర్ణ అంటుంది. నన్ను క్షమించండి.. మీరు నన్ను కోడలిగా ఒప్పుకునే వరకు మేడం అని పిలుస్తానని నగలు అపర్ణకి ఇస్తుండగా.. పనిమనిషి శాంతని పిలిచి.. ఆ నగలు తీసుకొని శుభ్రంగా కడిగి నా గదిలో పెట్టమని అపర్ణ అంటుంది. అలా అపర్ణ అనేసరికి కావ్య బాధపడుతుంది.    మరోవైపు కనకంని వెతుక్కుంటూ అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. సెక్యూరిటీ పంపించకపోవడంతో చాటుగా లోపలికి వెళ్తుంది. అప్పుని చూసిన కళ్యాణ్ తనని వెన్నక్కి లాగి.. "బ్రో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్" అని అడుగుతాడు. నేను ఎవరో తెలిసి కూడా బ్రో అంటున్నావ్ అని అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఎగ్జామ్ పేపర్స్ ని దొంగిలించిన ధర్మరాజు వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -720 లో.. ధర్మరాజు డబ్బుకి ఆశపడి వేరే కాలేజీ వాళ్ళతో చేతులు కలిపి, రిషి కాలేజీ పరువు తీయాలన్న ఉద్దేశంతో స్పాట్ వాల్యుయేషన్ పేపర్ బండిల్ ని తీసుకుపోతాడు. పేపర్ బండిల్స్ మిస్ అయ్యాయని తెలుసుకొని.. ఎవరు తీసుకువెళ్లారో తెలుసంటూ రిషి, వసుధారలు దొంగని పట్టుకోవడానికి బయల్దేరుతారు. మరోవైపు ధర్మరాజు ఫోన్ లో మాట్లాడుతుంటాడు. "రేపు రిషి వాళ్ళ కాలేజీ పరువుపోతుంది" అని అనుకుంటూ ధర్మరాజు తన చేతిలో పేపర్ బండిల్ పట్టుకొని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ.. "మీరు అనుకున్నదే అవుతుంది. నాకు డబ్బులు పంపించండి" అని చెప్తాడు. ధర్మరాజు ఫుల్ గా తాగుతూ.. రిషి సర్ రేపటితో మీ కాలేజీ పని అయిపోయిందని సంతోషపడతాడు. ధర్మరాజే ఆ పేపర్ బండిల్ తీసాడా లేదా కనుక్కోడానికి తను ఉన్న ప్లేస్ కి రిషి, వసుధారలు వస్తారు. ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరు వస్తారు. "ఏంటి వసుధార.. ఇప్పుడు కూడా బ్యాగ్ తీసుకురావాలా? ఏమైనా కాలేజీకి వెళ్తున్నామా" అని రిషి అంటాడు. అప్పుడే వసుధార తన బ్యాగ్ నుండి తాడు తీసి చూపిస్తూ.. మనం దొంగతనం చెయ్యడానికి వచ్చాము కదా అవసరం అవుద్దని తీసుకొచ్చానని అంటుంది. దొంగలకి సంబంధించిన సినిమాలు ఎక్కువగా చూస్తావా అంటాడు రిషి. అవును సర్.. మనం మన అసలు పేర్లతో కాకుండా మీరు నన్ను 'వి' అని, నేను మిమ్మల్ని 'ఆర్' ని పిలుచుకుందామని వసుధార అంటుంది. రిషి లోపలికి వెళ్తుంటే.. సర్ ఏంటీ కాలేజీకి వెళ్తున్నట్లు స్టైల్ గా వెళ్తున్నారని వసుధార అడుగుతుంది. నాలా మెల్లిగా నడవండని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళతారు. లోపలికి వెళ్ళగానే ఫుల్ డ్రింక్ లో ఉన్న ధర్మరాజుని చూస్తారు ఇద్దరు. చాటుగా వెళ్ళి అక్కడున్న రూమ్ అంతా వెతుకుతారు. అప్పుడే ధర్మరాజు.. మీ కాలేజీ పరువుపోవడం ఒకరికి కావాలని తనలో తానే మెల్లిగా  అనుకుంటుండగా.. రిషి అది విని.. ఎవరికంత అవసరం ఉందని అనుకుంటాడు. ఇక ధర్మరాజు లోపలికి సడన్ గా రావడం తో.. కర్టెన్ అడ్డుగా దాక్కుంటాడు రిషి. కానీ వసుధారని ధర్మరాజు చూసేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఇంటినుండి వెళ్ళిపోవడానికి సిద్దమైన కృష్ణ.. మురారి ఆపగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -114 లో.. గౌతమ్ తన ప్రేమ గురించి కృష్ణకి చెప్పడంతో.. నందు, గౌతమ్ ల పెళ్ళి ఎలాగైనా జరిపిస్తానని కృష్ణ గౌతమ్ తో చెప్తుంది. మరోవైపు మురారి తనకు తలనొప్పిగా ఉందని టాబ్లెట్ తీసుకురమ్మని వాళ్ళ అమ్మ రేవతిని పిలుస్తాడు. అది విని రేవతి.. "నీకు చెల్లికి తల్లికి భార్యకి తేడా తెలియట్లేదు.. ఉదయం నువ్వు కృష్ణపై ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు.. సంస్కారం కోల్పోయి ప్రవర్తించావు" అని మురారిపై రేవతి కోప్పడుతుంది. ఇక అక్కడకి  ముకుంద వచ్చి.. అవును మురారి నువ్వు కృష్ణతో అలా ప్రవర్తించడం బాలేదని అంటుంది. అందరూ నన్నే అనండి.. సరే నేను ఆలా చెయ్యడం తప్పే.. కృష్ణ వచ్చాక సారీ చెప్తాను అని మురారి వారితో అంటాడు. ఆ తర్వాత కృష్ణ ఇంటికి వస్తుంది. వెళ్ళిపోతున్నావా అని భవాని అడగగా.. అవునని కృష్ణ చెప్తుంది. "నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే.. నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలియదు గాని మురారి మాత్రం చాలా బాధపడతాడు. ఇంకా ఈ ఇంటి కోడలు వెళ్ళిపోయిందంటే మాకు బాగుండదు.. అందుకే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను.. ఇక నుండి నువ్వు నందు గురించి పట్టించుకోనని చెప్తే ఈ ఇంట్లో ఉండొచ్చు" అని భవాని అంటుంది. పక్కనే ఉన్న రేవతి.. ఒప్పుకో కృష్ణ అని అంటుంది. నేను వెళ్ళిపోతాను.. నేను బయటకు వెళ్ళినా కూడా నందు గురించి పట్టించుకుంటానని కృష్ణ అంటుంది. "ఎక్కడికి వెళ్తావ్ కృష్ణ.. ఒక ఒంటరి ఆడపిల్లని బయట సమాజం బ్రతకనివ్వదు.. భవాని అక్కకి క్షమాపణ చెప్పి ఇక్కడే ఉండు" అని రేవతి అంటుంది. తప్పు చేసింది మొహం చూపించుకోలేక వెళ్ళిపోతుందని భవాని అనగానే.. నేను ఏ తప్పు చెయ్యలేదని చెప్పేసి కృష్ణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణ బ్యాగ్ తీసుకొని తన గదిలో నుండి వస్తుండగా.. "వద్దు కృష్ణ.. వెళ్ళొద్దు" అని మురారి అంటాడు. "నేను వెళ్తాను.. ఇన్ని రోజులు మీపై గౌరవం ఉండేది. ప్రొద్దున మీరు చేసిన పనికి అది లేకుండాపోయింది. శాసనం లాగా ఇంట్లో చెప్పింది చెయ్యాలి.. ఇంటికి లేట్ గా వస్తే భోజనం పెట్టరు.. మీరు మాట్లాడిన మాటలు అన్నీ నా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. నాకు ఆత్మాభిమానం లేని దగ్గర నేను ఉండను" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నా షార్ట్స్ కరీదు 20 రూపాయలు.. దాని పేరు కుకువాక్వ

ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫ్రెష్ సింగర్స్ తో పోటా పోటీగా జరుగుతోంది. ఈ వారం "కోటి ఉగాది ఛాలెంజ్" పేరుతో కోటి కంపోజ్ చేసిన సాంగ్స్ పాడి వినిపించారు కంటెస్టెంట్స్. ఇక మానస వచ్చి "యముడికి మొగుడు" మూవీ నుంచి "అందం హిందోళం" పాడి వినిపించింది. ఈ సాంగ్ గురించి కోటి తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "మేము మెగాస్టార్ కి చేసిన ఫస్ట్ సాంగ్ ఇది. ఈ సాంగ్ చేసాక రాజ్, నేను ఆ క్యాసెట్ ని మెగాస్టార్ కి పంపించాం. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అసలు ఈ సాంగ్ పెట్టుకుంటారా లేదా అని భయపడుతూ ఉండగా ఆ రోజు సాయంత్రం పెద్ద బొకే వచ్చింది. అందులో "వెరీ మచ్ ఇంప్రెస్డ్" అని చిరంజీవి గారు సైన్ చేసి పంపించారు. ఇంకో విషయం ఏమిటి అంటే ఈ సాంగ్ కి కోరస్ అంతా కూడా థమన్ వాళ్ళ అమ్మ సావిత్రి పాడారు. ఆమె నా దగ్గర పర్మనెంట్ కోరస్ సింగర్" అని చెప్పారు కోటి. ఇక ఇదే పాటకు సంబంధించిన జ్ఞాపకాలకు థమన్ కూడా చెప్పుకొచ్చారు "కోటి గారంటే ఇన్స్టెంట్ పేమెంట్. ఇలా కోరస్ పాడేసిన వెంటనే వోచర్ మీద సైన్ చేసి డబ్బులు ఇచ్చేసేవారు. అప్పుడు మా అమ్మ డబ్బులు తీసుకుంటుంటే నాకు ఏమి కొనిస్తుందా అని ఆలోచిస్తున్నా. 1998 లో నేను అప్పుడు మా అమ్మతో రికార్డింగ్ కి వెళ్లాను. అలా నేను బస్సు లో వెళ్తున్నంత సేపు మా అమ్మ పాడిన ఆ కోరస్ నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. అలా ఇంటికి వెళ్లేంతవరకు పాడుతూనే ఉండేసరికి..నా వాయిస్ అంత నచ్చిందా అని మా అమ్మ అడిగి చాలా హ్యాపీగ ఫీలయ్యింది. అలా ఇద్దరం పాడుకుంటూ వెళ్లాం. బస్సు దిగాక ఒక స్టోర్ కనిపించింది. అక్కడ 20 రూపీస్ పెట్టి నాకు షార్ట్స్ కొనిచ్చింది మా అమ్మ.   ఆ షార్ట్స్ వేసుకున్నప్పుడల్లా ఆ సాంగ్ పాడుతూనే ఉండేవాడిని. అందుకే ఆ షార్ట్స్ కి కుకువకుకువ అని పేరు పెట్టుకున్నా. అదే టైములో మా నాన్న చనిపోయారు. అలా నా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఫస్ట్ టైం నేను కోటి గారికి ఫోన్ చేసి ఏదైనా పని ఉంటే ఇవ్వండి..మీ టీంలో జాయిన్ అవ్వాలని ఉంది అని చెప్పా. నాకు ఎవరికీ ఫోన్ చేయాలనీ అనిపించలేదు. ముందు బాలు గారికి చేసాను. తర్వాత కోటి గారికి చేసాను. బాలు గారు నన్ను కచేరీలు పిలిచారు. కోటి గారు నన్ను హలో బ్రదర్ మూవీకి పిలిచి నాతో సాంగ్ చేయించారు. అది చాలా గ్రేట్ ఫీలింగ్." అని చెప్పుకొచ్చారు.

గీతకు ఫ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ వేరే లెవెల్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చక్కని కంటెస్టెంట్స్ తో మంచి సాంగ్ పెర్ఫార్మెన్సెస్ తో ప్రతీ వారం ఈ వారం కూడా అలరించింది. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ గురించి హేమచంద్ర అడిగేసరికి జడ్జి కార్తిక్ మాట్లాడుతూ "నేను, నా సాంగ్స్ అంటే ఎంతో ఇష్టపడే ఒక లేడీ ఫ్యాన్ కేవలం నా సాంగ్స్ పాడడం కోసమే ఆమె పియానో నేర్చుకున్నారు" అని చెప్పాడు. తర్వాత గీత మాధురి మాట్లాడబోతుండగా "గీత ఫ్యాన్ నే ఇక్కడున్నా" అని కోటి చెప్పడంతో  గీత ఫుల్ ఎక్సయిట్ అయ్యింది. "నా బర్త్డే ఆగష్టు 24 1989 . ఈ నంబర్స్ వచ్చేలా వన్ రూపీ, ఫైవ్ రూపీ ఇలా అన్ని రకాల నోట్స్ కలెక్ట్ చేసి నాకు పంపించాడు. ఆ అబ్బాయి దాని కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు. దాని కింద అతని పేరు కూడా రాసుకోలేదు. థ్యాంక్యూ గీతక్క..ప్రేమతో పవన్ కళ్యాణ్ అభిమాని" అని రాసి పంపించాడు అని చెప్పింది. ఇక థమన్ మాట్లాడుతూ "దాస్ అని నాకు ఒక అభిమాని ఉన్నాడు. ఆయన నా మీద అభిమానాన్ని చాటేందుకు మౌంట్ ఎవరెస్టు ఎక్కి అక్కడ నా ఫోటో పట్టుకుని నిలబడ్డాడు. అది చాలా ఫెంటాస్టిక్ మూమెంట్. మనమైతే ఏ కొండా ఎక్కలేము చాలా కష్టం. ఎవరెస్ట్ కన్నా హైట్ గా ఎదిగావ్ కదా..ఈ సందర్భంగా నా ఫ్యాన్ దాస్ కి థ్యాంక్యూ చెప్తున్నా..." అంటూ అతని ఫోటోను కూడా బ్యాక్ గ్రౌండ్ లో చూపించాడు. తర్వాత సింగర్ కార్తికేయకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది ఆడియన్స్ లో అని చెప్పాడు హేమచంద్ర. ఇక కార్తికేయ మాట్లాడుతూ "నేను, నా పేరెంట్స్ అసలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు..మా చెల్లి నన్ను బాగా టీజ్ చేస్తోంది" అని చెప్పాడు. ఇక కార్తికేయ "లంకేశ్వరుడు" మూవీ నుంచి "పదహారేళ్ళ వయసు" సాంగ్ ని ఇరగదీసి పాడి వినిపించాడు. ఆ కుర్రాడి పాటకు కోటి సీట్ లోంచి లేచి స్టేజి మీద వెళ్లారు. ఇక జడ్జెస్ అందరూ కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఇపోయారు. కోటి - కార్తికేయ ఇద్దరూ కలిసి స్టేజి మీద గిటార్ తో జుగల్బందీ చేసి ఆకట్టుకున్నారు. కార్తికేయ వయసు 16 . ఇదే ఏజ్ లో తాను కెరీర్ స్టార్ట్ చేసినట్టు చెప్పారు కోటి.

కనకం పర్ఫామెన్స్ ‌కి ఫిదా అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌-52లో..  కొత్త కోడలిగా అడుగుపెట్టిన కావ్యని  ప్రపంచమంతా పరిచయం చేయడానికి దుగ్గిరాల ‌కుటుంబం రిసెప్షన్ ని ఏర్పాటు చేసింది. అందులో మొదట జోకర్ పర్ఫామెన్స్ ని ప్రదర్శించారు. ఆ జోకర్ గా కావ్య అమ్మ కనకం చేసింది. ఆ పర్ఫామెన్స్ చూసి అందరూ చప్పట్లతో అభినందిస్తుంటే కావ్య కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత జోకర్స్ వేషంలో ఉన్న కనకంని సీతారామయ్య పిలిచి కావ్య చేతులమీదుగా కానుక ఇప్పిస్తాడు.  కావ్యని తమ బిజినెస్ పార్టనర్స్ కి  పరిచయం చేయమని రాజ్ కి సీతారామయ్య చెప్తాడు. దాంతో కావ్యని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తాడు. అయితే అక్కడ వారితో ఇంగ్లీష్ లో కావ్య చక్కగా మాట్లాతుంది. అది చూసిన సీతారామయ్య.. మన కొత్త కోడలు ఇంగ్లీష్ అదరగొడుతుందని రాజ్ వాళ్ళ నానమ్మతో చెప్తాడు. అవునండి తనకి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసని ఆమె సీతారామయ్యతో అంటుంది. అది చూసి రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ వచ్చి.‌. "అప్పుడే మంచిదని సర్టిఫికేట్ ఇవ్వకండి అత్తయ్య.. తను మంచిగా నటిస్తుంది.. ఆ ముసగు తీసేస్తే అసలు స్వరూపం బయటపడుతుంది" అని చెప్తుంది. మరోవైపు మారువేషంలో వచ్చిన స్వప్న రిసెప్షన్ లో రాహుల్ కోసం వెతుకుతుంది. రాహుల్ ని ఫాలో చేస్తూ వెళ్తుండగా ఇద్దరూ ఢీకొని కూల్ డ్రింక్ గ్లాసెస్ కిందపడి పగిలిపోతాయి. ఆ పగిలిన గాజు ముక్కలు స్వప్న ఏరుతున్నప్పుడు కావ్య తనని చూస్తుంది. స్వప్న దగ్గరగా కావ్య వెళ్ళినప్పుడు.. రాహుల్ అడ్డుగా వచ్చి స్వప్నని చూడకుండా ఆపేస్తాడు. ఆ తర్వాత తనొక కూల్ డ్రింక్స్ సర్వ్ చేసే అమ్మాయని కావ్యకి చెప్పి.. స్వప్నని అక్కడ నుండి తప్పించుకునేలా చేస్తాడు. ఆ తర్వాత స్వప్నని రాహుల్ కలిసి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటారు. రాహుల్ మాయమాటలు చెప్తూ స్వప్నకి అంతా నెగెటివ్ గా చెప్తుంటాడు. మీ చెల్లి కావ్య నిన్ను పంపించేసి, రాజ్ కి భార్యగా ఎంతలా రెడీ అయి వచ్చిందో చూసావా. నువ్వు వెళ్ళిపోయాక ఎంత హ్యాపీగా ఉందో చూసావా అని రాహుల్ చెప్పగా.. తను అలా ఎప్పుడు చేయదు. తనకి డబ్బు పిచ్చి లేదని స్వప్న చెప్తుంది. అయ్యో స్వప్న ఇంత అమాయకురాలివేంటి.. ఇదే నిజమని కావ్య గురించి చెడుగా చెప్తాడు రాహుల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఒక అమ్మాయిని ఇలా బలవంతపెట్టడం కరెక్ట్ కాదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -113 లో.. ఒక గంట పర్మిషన్ కావాలని కృష్ణ, భవానిని అడుగుతుంది. గంట టైమ్ ఎందుకు ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపో అని భవాని అనగానే... సర్ నాకు ఒక గంట పర్మిషన్ ఇప్పించగలరా అని మురారిని కృష్ణ అడుగుతుంది. పర్మిషన్ దేనికి అని మురారి అడుగగా.. గౌతమ్ సర్ ని కలిసి మాట్లాడాలని కృష్ణ అంటుంది. మురారి వద్దని చెప్తాడు. అయినా సరే వెళ్తానని కృష్ణ వెళ్తుండగా.. తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు మురారి. కృష్ణతో మురారి అలా ప్రవర్తించడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. మురారి తన చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో.. వదలండి సర్ అని కృష్ణ చెప్పినా కూడా అతను వదలడు. దాంతో పక్కనే ఉన్న రేవతికి కోపమొస్తుంది. తను కోపంతో "ఏం చేస్తున్నావ్ రా. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావ్? ఒక అమ్మాయిని ఇలా బలవంతపెట్టడం కరెక్ట్ కాదు.. వదులు మురారి" అని భవాని చెప్తుంది. అయిన కూడా మురారి పట్టించుకోడు. "వదులు మురారి.. గంటలో వస్తానని కృష్ణ చెప్తుంది కదా" అని ముకుంద అనగానే.. నువ్వు మా మధ్యలో కలుగజేసుకోకని మురారి అంటాడు. ఇక ఈశ్వర్ వచ్చి కృష్ణ చెయ్యిని విడిపించే ప్రయత్నం చేసినా మురారి వదలడు. కృష్ణ ఒక్కసారిగా వదలండి అని కోపంగా అరిచేసరికి.. మురారి చెయ్యి వదిలేస్తాడు. "నేను ఇన్ని రోజులు చూడని వ్యక్తి ఈ రోజు నాకు మీలో కన్పించారు. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీరు నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ గా ఉన్నారు. ఒక అబ్బాయితో మాట్లాడితే మీరు అందరు మగవాళ్లలాగా ఆలోచిస్తున్నారు. మీపై ఉన్న అభిమానమంతా ఎత్తుల్లో ఉండేది.. ఇప్పుడు ఒక్కసారిగా కిందకి పడిపోయింది. నేను ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను" అని కృష్ణ చెప్పేసి గౌతమ్ ని కలవడానికి వెళ్ళిపోతుంది. మురారి మాత్రం బాధపడుతూ సైలెంట్ గా ఉండిపోతాడు.  గౌతమ్ దగ్గరికి వెళ్తుంది కృష్ణ. మీరు సీనియర్ డాక్టర్ అని మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు చెప్పింది చేశానని చెప్పిన కృష్ణ.. గౌతమ్ చెంప పగులగొడుతుంది. తన ప్రేమ విషయం అంతా కృష్ణకి చెప్తాడు. ఇంట్లో వాళ్ళు కావాలనే నందుకి అలాంటి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు గౌతమ్ చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ మాటల్లో నందుకి ఇంకా పెళ్లి కాలేదనే విషయం తెలుసుకుంటాడు గౌతమ్. ఎలాగైనా సరే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తానని గౌతమ్ కి చెప్తుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలాంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కాలేజ్ లో స్పాట్ వాల్యుయేషన్.. ధర్మరాజు ‘కీ’ కొట్టేశాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -719 లో.. వసుధార ఎక్కువగా వర్క్ చేస్తుందని రిషి కాఫీ కలుపుకొని తీసుకువచ్చి ఇస్తాడు. కాసేపు వసుధార కోసం అలా చూసి తన రూమ్ లోనే పడుకుంటాడు. ఇక వసుధార వర్క్ అయిపోయాక హాల్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఉదయం దేవయాని వచ్చేసరికి  వసుధార హాల్లో పడుకున్నది చూసి.. నీ స్థానం ఏంటో ఇప్పటికైనా అర్థం అయిందా అని దేవయాని వసుధారని అంటుంది. నా స్థానం రిషి సర్ గుండెల్లో, మీ నిజ స్వరూపం రిషి సర్ కు తెలిస్తే మీ స్థానం ఏంటో అని వసుధార అంటుంది. అప్పుడే వచ్చిన జగతితో.. చూడు జగతి నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అని దేవయాని అంటుంది. నీ కోడలు లాగా నా కోడలు నువ్వు చెప్పినట్టు వినే రకం కాదని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది జగతి. దాంతో దేవయానికి కోపమొస్తుంది. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన రిషి, వసుధారలు స్పాట్ వాల్యుయేషన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంతలోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వాల్యుయేషన్ స్పాట్ ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్ ధర్మరాజు కాలేజీకి వస్తాడు. అతనికి ఆ కాలేజీకి స్పాట్ వాల్యుయేషన్ ఇవ్వడం ఇష్టం ఉండదు. అందుకని ఏ చిన్న తప్పు కనిపించినా యాక్షన్ తీసుకోవాలని ధర్మరాజు అనుకుంటాడు. ఇక మహేంద్ర, రిషి వాళ్ళకి ధర్మరాజు తనని తాను పరిచయం చేసుకుంటాడు. కాలేజీలో వాల్యుయేషన్ స్పాట్ దగ్గర చిన్న మిస్టేక్ కూడా కనిపించడం లేదని ధర్మరాజు అనుకుంటాడు. మహేంద్ర క్యాబిన్ లో.. ధర్మరాజు, మహేంద్ర మాట్లాడుకుంటుండగా జగతి వచ్చి మహేంద్రని పిలుస్తుంది. మహేంద్ర వెళ్తుండగా తన జేబు లో ఉన్న 'కీ'(తాళంచెవి)తో పాటుగా టేబుల్ మీద ఉన్న పేపర్ వాల్యుయేషన్ బండిల్ ఒకటి కింద పడిపోవడంతో ధర్మరాజు అది గమనించి.. కీ తీసుకొని తన బ్యాగ్ లో ఉన్న సబ్బుపై పెట్టి దానిపై ముద్ర వేసి మళ్ళీ 'కీ' అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళి ఇంకొక 'కీ' ని తయారు చేసి తీసుకొని వస్తాడు. పేపర్ వాల్యుయేషన్ బండిల్ లో కొన్ని తీసుకొని వెళ్తాడు ధర్మరాజు. ఆ తర్వాత అందరూ కాలేజీ నుండి వెళ్ళిపోతుండగా జగతి, వసుధారలు.. ఆ రూమ్ తాళం తీసి ఉండడం గమనిస్తారు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే రిషి, మహేంద్రలకు కాల్ చెయ్యడంతో వాళ్ళు వచ్చి మిగతా బండిల్ లు ఏమయ్యాయ్ అని అనుకుంటారు. జగతి 'కీ' చూస్తూ ఈ 'కీ'కి సబ్బు ఉందేంటి అంటుంది జగతి. రేపు ఈ విషయం అందరికి తెలిస్తే కాలేజీ పరువుపోతుందని వసుధార అనగానే.. ఈ పని ఎవరు చేసారో నాకు తెలుసు వసుధార.. పదా వెళ్దామంటూ రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రేటింగ్ లో మొదటి స్థానంలో ‘బ్రహ్మముడి’ సీరియల్!

స్టార్ మా‌ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ వస్తుంది. కాగా తాజాగా విడుదైన టెలివిజన్ ప్రీమియర్ రన్ టైం వ్యూస్ లో అత్యంత ఎక్కువ మంది చూసిన సీరియల్ గా 'బ్రహ్మముడి' నిలిచింది. దీంతో ఇందులో కావ్య క్యారెక్టర్ చేస్తున్న దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ విషయాన్ని షేర్ చేసింది. కావ్య(దీపిక రంగరాజు) తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో ప్రతీ రోజు సీరియల్ లో జరిగే ఎపిసోడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిసేలా పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఈ సీరియల్ అభిమానులు తనని ఫాలో అవుతున్నారు. అయితే ఈ సీరియల్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే.. ఈ సీరియల్ లోని కనకం ఫ్యామిలీ, దుగ్గిరాల ఫ్యామిలీకి మధ్య జరిగే సంఘటనలు, సంభాషణలు. కనకం కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. కనకం తన ముగ్గురు కూతుళ్ళని గొప్పింటికి కోడళ్ళుగా చేయాలనే కలల కంటుంది. అయితే కనకం తన పెద్ద కూతురు స్వప్నని, దుగ్గిరాల కుటుంబ వారసుడైన రాజ్ కి ఇచ్చి పెళ్ళి చేద్దామని ముహూర్తం ఫిక్స్ చేస్తే, తను రాహుల్ తో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కనకం తన రెండవ కూతురిని పెళ్ళి పీటల మీద కూర్చోపెడుతుంది. ఆ విషయం తెలుసుకున్న రాజ్ తనని పెళ్ళి చేసుకోననగా, పెళ్ళి మండపం దగ్గర మీడియా ఉండటం వల్ల కావ్యని పెళ్ళిచేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత రాజ్ ఫ్యామిలీ పెట్టే కఠిన పరీక్షలను కావ్య ఎదుర్కొంటు వస్తుంది. ఇలా రోజు రోజుకి ఈ సీరియల్ పై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు మేకర్స్.  స్డార్ మా టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ లో 'బ్రహ్మముడి' మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ ఉండగా, మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఉంది.  

కోటి పుట్టినరోజుకు 28 రకాల వంకాయ కూరలు చేసి పంపిన లేడీ ఫ్యాన్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 స్వర కిరీటి కోటి ఛాలెంజ్ ఎపిసోడ్ జోష్ తో సాగింది.  సంగీతం అంటే ఇష్టపడే ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో సౌజన్య ముందుగా వచ్చింది.. ఈమె కన్నా ఈమె కూతురు మిహిర ఫుల్ ఫేమస్ ఐపోయింది.  ఆమెకు షడ్రుచులలో భాగంగా స్పైసీ సాంగ్ పాడమని ఛాలెంజ్ ఇచ్చారు కోటి. "ముఠామేస్త్రి" మూవీ నుంచి సాంగ్ పాడింది. కోటి ఆమె సాంగ్ కి ఫిదా ఐపోయి ఆయన కూడా స్టార్టింగ్ లైన్స్ పాడి వినిపించారు. ఇక థమన్ కూడా చక్కగా పాడావ్ అంటూ కామెంట్ చేశారు. ఈ సీజన్ లో ఎంతో మధురమైన గొంతు నీది...టాప్ 5 లో ఉంటావని అనిపిస్తోంది అంటూ కార్తీక్ చెప్పారు. కోటి సౌజన్యకు మరో ఫ్రెష్ ఛాలెంజ్ ఇచ్చారు. తాను కంపోజ్ చేసిన సాంగ్ ఇంకా రిలీజ్ కూడా కాలేదని చెప్పి స్టేజి మీద ఆమెతో కలిసి అద్భుతమైన లిరిక్స్ ఉన్న సాంగ్ పాడించారు. నెక్స్ట్ కంటెస్టెంట్ గా యుతి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు వగరు ప్లస్ ఉప్పు కలగలిసిన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోటి ఛాలెంజ్ ఇచ్చారు. దాంతో "పెదరాయుడు" మూవీ నుంచి "బావవి నువ్వు" సాంగ్ పాడింది. ఆ పాట విన్న కోటి "యుతి నాకు ముందే తెలుసు ..అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యింది. జానపదం పాట కాబట్టి ఇంకా షార్ప్ నెస్  అనేది రావాల్సి ఉంది.." అని చెప్పారు. కార్తీక్ యుతి చేసిన మిస్టేక్స్ గురించి చెప్పాడు. అలాగే థమన్ కూడా లాస్ట్ టు లైన్స్ తప్ప మిగతా సాంగ్ పాడిన విధానం అస్సలు నచ్చలేదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత యుతి తన కోరికను బయట పెట్టింది. కార్తీక్ తో కలిసి "గజినీ" మూవీ నుంచి "ఒక మారు" సాంగ్ పాడింది. తర్వాత తన దగ్గర ఉన్న మూవీ సిడి మీద ఆటోగ్రాఫ్ అడిగేసరికి "లాస్ ఆఫ్ లవ్ యుతి" అని రాశారు. తర్వాత జయరాంని పిలిచారు కోటి. పులుపు అంటే నాటీగా ఎలా ఉంటుందో అలాంటి సాంగ్ పాడాలి అని ఛాలెంజ్ ఇచ్చారు. "మల్లేశ్వరి" మూవీ నుంచి "నువ్వెంత అందగత్తెవని" సాంగ్ పాడి వినిపించాడు. ఇక హోస్ట్ హేమచంద్ర జడ్జెస్ ని లైఫ్ లో ఎదురైన బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ చెప్పమని అడిగాడు. దాంతో ముందు కోటి గారు మాట్లాడుతూ " నా బర్త్డే మే 28 . నాకు గుత్తివంకాయ కూర అంటే ఇష్టమని ఒక సందర్భంలో చెప్పాను. అది తెలుసుకున్న ఒక లేడీ ఫ్యాన్ నా కోసం 28 రకాల వంకాయ కూరలు చేసి  నన్ను తినమని పంపించారు. నా లైఫ్ లో ఇలాంటి ఒక ఫ్యాన్ ని నేనెప్పుడూ చూడలేదు" అంటూ తన బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు.

పొంగిపొర్లిన దేశభక్తి... కంటతడి పెట్టుకున్న కోటి

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 "కోటిస్ ఉగాది స్పెషల్" ఎపిసోడ్ గా ఈ వారం రాబోతోంది. ఇందులో బిఎస్ఎఫ్ జవాన్ చక్రపాణి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఎంటర్టైన్ చేసింది. "ముఠామేస్త్రి" మూవీ నుంచి సాంగ్ పాడాడు. "ఉగాది రోజు మీరు ఇంకా యూనిఫార్మ్ వేసుకునే వచ్చారు" అని తమన్ అన్నారు. తర్వాత కార్తిక్ స్టేజి మీదకు వచ్చి "జనరల్ గా మీరు ఉగాదిని ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు" అని అడిగాడు. "నా లైఫ్ లో ఉగాదిని నేనెప్పుడూ చూడనేలేదు ..ఏ ఫెస్టివల్ వచ్చినా సరే అమ్మకు ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకుంటాను..అంతేసర్" అన్నాడు ..ఆ టైములో వెనక నుంచి చక్రపాణి వాళ్ళ అమ్మ స్టేజి మీదకు "చిన్నా" అని పిలుచుకుంటూ వచ్చేసరికి ఆమెను చూసి నోటమాట రాక ఆమెను హగ్ చేసుకున్నాడు. "నాకు అమ్మంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఊరెళ్లినా అమ్మ ఒళ్లోనే పడుకుంటాను..అమ్మ ఊళ్ళోనే కూర్చుని పాటలు పడతాను. నా మూడేళ్ళ వయసులో మా నాన్న చనిపోయారు. మా అమ్మే చాలా కష్టపడి పెంచింది అని చెప్పి ఆమె కోసం కొన్న గాజులను బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను జడ్జి సీట్ లో కూర్చోబెట్టి చక్రపాణి ఆమె ముందే సాంగ్ పాడాడు...ఈ స్టేజి మీద జరిగిన ఈ మొత్తంతో కోటి, మిగతా కంటెస్టెంట్స్ అంతా కన్నీటిపర్యంతమయ్యారు. నెటిజన్స్ చక్రపాణి పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఐపోయి కామెంట్స్ పెట్టారు. "అమ్మని ఎదురుగా కూర్చోపెట్టుకుని పాట పాడడం కన్నా ఇంకా ఏమి ఉంటుంది గెలుపుకు అర్థం.. టైటిల్ ఎవరు గెలిచినా ఇంతకుమించిన విజయం..లేదు.. జై జవాన్.. జై హింద్...వీరజవాన్లకు, సైనికులందరికీ వందనాలు...మీ కలల ప్రయాణం విజయతీరాలవైపు కొనసాగాలని కోరుకుంటూ" అంటూ అందరూ ఆ జవాన్ కి విషెస్ చెప్పారు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫుల్ లెంత్ క్యారెక్టర్ వస్తే సినిమాల్లో చేస్తానన్న ఫైమా!

ఫైమా.. బిగ్ బాస్ సీజన్-6 లోకి కంటెస్టెంట్ గా వెళ్ళి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత మొదలైన బిబి జోడీ డ్యాన్స్ షో లో సూర్యతో కలిసి జోడిగా పాల్గొంటూ తన డ్యాన్స్ తో ఆకట్టుకుంటుంది. గత వారం జరిగిన బిబి జోడి సెమీఫైనల్‌లో శేఖర్ మాస్టర్ గెస్ట్ గా వచ్చాడు. ఫైమా డ్యాన్స్ చూసి తనని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ వస్తాడని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. దీంతో ఫైమా తెగ సంబరపడిపోయింది. అయితే పైమా ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానుల కోసం 'ఆస్క్ మీ క్వశ్చన్' స్టార్ట్ చేసింది. అందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను సెలెక్ట్ చేసుకొని వాటికి సమధానమిచ్చింది  ఫైమా. మిమ్మల్ని కలవాలి కానీ అది పాజిబుల్ అవుతుందా? అని ఒక అభిమాని అడుగగా.. పాజిబుల్ అవుతుందని ఫైమా అంది. మీకు సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తారా అని అడుగగా.. ఫుల్ లెంత్ క్యారెక్టర్ వస్తే చేస్తానని సమాధానమిచ్చింది ఫైమా. మీ జీవితంలో మీకు అత్యంత ముఖ్యమైన వాళ్ళెవరని ఒకరు అడుగగా.. నా ఫ్యామిలీ మొత్తం నాకిష్టమని ఫైమా చెప్పింది. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో 'బై బై రాయగఢ్' అని పోస్ట్ చేసింది ఫైమా. దీంతో తను రాయగఢ్ లో ఏదో ఒక ఈవెంట్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ని ఇన్‌ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఫైమా.

సౌమ్య రావు మీద ఇంద్రజ సీరియస్... రాఘవ వెళ్ళిపోయాడు!

ఉగాది వెళ్ళిపోయింది.. శ్రీరామ నవమి మరి కొద్ది రోజుల్లో రాబోతోంది. ఇక బుల్లితెర మీద షోస్ అన్నీ కూడా ఈ పండగ స్పెషల్ తో పానకంలా తియ్యగా ఎంటర్టైన్ చేయడానికి సరికొత్తగా ముస్తాబై వచ్చేయడానికి రెడీ ఐపోయాయి. అందులో భాగంగానే జబర్దస్త్..ఖతర్నాక్ కామెడీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో స్కిట్స్ అన్నీ కూడా మస్త్ అలరించబోతున్నాయన్న విషయం ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. రాఘవ స్కిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "ధైర్యానికి మనిషి రూపం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా ? ఎవరు అడుగేస్తే నేల అమెరికా వరకు అదురుతుందో తెలుసా ? అంటూ టీవీలో వచ్చే యాడ్స్ లా కొటేషన్స్ చెప్తూ ఉండగా వైట్ హెయిర్ తో రాఘవ గన్ తీసుకుని "డాన్ సుబ్బారావుగా" ఎంట్రీ ఇచ్చేసాడు. "అన్నా ఇది పాన్ ఇండియా స్కిట్" అని చెప్తూ ఒక విలన్ నవ్వు నవ్వాడు. రాఘవ ఒక వ్యక్తి చంపబోయేటప్పుడు అతని భార్య వచ్చి "చారులోకి కొత్తిమీర నీ తాత తెస్తాడా.." అని సీరియస్ గా అడిగేసరికి "డాన్ ని పట్టుకుని కొత్తిమీర తెమ్మంటావా" అని సీరియస్ అయ్యాడు రాఘవ " డాన్ ఐతే మొగుడు కాదా మగాడు కాదా" అని గట్టిగా భార్య అరిచేసరికి రాఘవ కళ్ళు తిరిగి కిందపడిపోయాడు. ఇక హోస్ట్ సౌమ్య రావు ఈ మధ్య స్కిట్స్ లో బాగా యాక్టివ్ గానే పెర్ఫార్మ్ చేస్తోంది. ఇందులో కూడా "అందాలలో మహోమహోదయం" సాంగ్ వస్తుంటే దేవకన్యలా డాన్స్ చేసింది. ఇలా స్కిట్స్ అన్ని జరిగాక ఫైనల్ గా "ఒక మంచి టేస్టీ పానకం చేయాలి" అంటూ కమెడియన్స్ కి టాస్క్ ఇచ్చింది యాంకర్. నూకరాజు తయారు చేసిన  పానకాన్ని ఇంద్రజ టేస్ట్ చేసింది. తర్వాత సౌమ్య " పానకం ఎవరు బాగా చేశారు మేడం" అని అడిగేసరికి " రాఘవ గారు బాగా చేసారని" చెప్పింది ఇంద్రజ. "వెంకీ, తాగుబోతు రమేష్ చేసిన పానకం ఇంకా బాగుంది..ఒకసారి టేస్ట్ చేయండి" అని చెప్పింది సౌమ్య. "చేసాను కానీ రాఘవ చేసిందే బాగుంది" అని ఇంద్రజ అనేసరికి "కృష్ణ భగవాన్ సర్ మీరు ఈ పానకం టేస్ట్ చేసి చెప్పండి" అనేసరికి " సౌమ్య మీరు ఇంతమంది దగ్గర ఒపీనియన్ తీసుకునేటట్టయితే నన్ను అడగాల్సిన అవసరం లేదు..నువ్వు చేసింది కరెక్ట్ కాదు " అని సీరియస్ అయ్యింది ఇంద్రజ. రాఘవ స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు. అసలింతకీ ఏమయ్యిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.