‘గుప్పెడంత మనసు’ సీరియల్ TRP లో మూడవ స్థానంలో ఉండటానికి కారణమేంటి?

బుల్లితెరపై స్టార్ మా టీవీలో వచ్చే సీరియల్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమాల్ని తలపించే ట్విస్ట్ లతో సాగదీస్తూ రోజుకో మలుపుతో ఈ సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో స్టార్ మాటీవీలో వచ్చే 'గుప్పెడంత మనసు'  సీరియల్ కి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అదే కాకుండా ఈ మధ్యలో మొదలైన 'బ్రహ్మముడి' సీరియల్ ఇప్పటికే అత్యధిక TRP తో దూసుకుపోతుంది. అయితే ఈ రెండు సీరియల్స్ కి డైరెక్టర్ కుమార్ పంతం ఒక్కడే కావడం విశేషం. విభిన్న కథా కథనంతో ఈ రెండు సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. 'బ్రహ్మముడి' సీరియల్ కి  సెలబ్రిటీస్ ప్రమోట్ చెయ్యడం వల్ల దీనిపై భారీ అంచనాలే పెరిగాయి. అయితే ఇప్పుడు TRP లో మొదటి స్థానంలో 'బ్రహ్మముడి', మూడవ స్థానంలో 'గుప్పెడంత మనసు' సీరియల్స్ ఉన్నాయి. ఈ సీరియల్స్ డైరెక్టర్ కుమార్ పంతం.. తను డైరెక్ట్ చేస్తున్న సీరియల్స్ షూటింగ్ అప్‌డేట్స్ ని ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ ఇస్తూ ఈ సీరియల్ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. కాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్' అని పోస్ట్ చేయగా.. ఫ్యాన్స్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగారు. ఒక అభిమాని.. 'మీ డైరెక్షన్ లో మీకు టఫ్ అనిపించిన సీన్ ఏంటి' అని అడుగగా.. అన్ని టఫ్ సీన్సే అని బదులిచ్చాడు కుమార్ పంతం. మరొక అభిమాని.. 'గుప్పెడంత మనసు సీరియల్ TRP తగ్గడానికి కారణం ఏంటి' అని అడుగగా.. అప్స్ అండ్ డౌన్ కామన్ అంటూ కుమార్ సమాధానమిచ్చాడు. గుప్పెడంత మనసు TRP లో మూడవ స్థానంకి వెళ్ళిపోయింది.. మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కి రావాలని ఒకరు అడుగగా.. రావాలి అదే ట్రై చేస్తున్నామని కుమార్ చెప్పుకొచ్చాడు. మరొక అభిమాని.. 'మీకు గుప్పెడంత మనసు ఇష్టమా? లేక బ్రహ్మముడి ఇష్టమా అని అడుగగా.. నా ఆన్సర్ మీరే గెస్ చెయ్యండని ప్రేక్షకుల ఊహకే వదిలేసాడు డైరెక్టర్. డైరెక్టర్ కుమార్ పంతం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కి విశేష స్పందన రావడంతో వైరల్ గా మారింది. అయితే ప్రేక్షకులు కోరుకుంటున్నట్లుగా TRP లో మూడవ స్థానంలో ఉన్న గుప్పెడంత మనసు మళ్ళీ మొదటి స్థానంలోకి వస్తోందో లేదో చూడాలి మరి.

వాళ్లు ఆంటీ అంటే ఆ అర్థాలు వేరు అంటున్న అనసూయ!

అనసూయ భరద్వాజ్.. యాంకర్ గా కెరీర్‌ మొదలుపెట్టి నటిగా రాణిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 'రంగస్థలం' లో రంగమ్మత్త క్యారెక్టర్ నుండి తాజాగా విడుదలైన 'రంగ మార్తాండ' వరకు తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది అనసూయ.  అయితే తనని ఎవరైనా ఆంటీ అంటే దానికి గట్టిగా రియాక్ట్ అయ్యే అనసూయ.. ఆ మాట వింటే అంతలా కోపం రావడానికి కారణమేంటో చెప్పింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్న ఈ భామ ఆదివారం సెలవు దొరకడంతో తన ఇన్ స్టాగ్రామ్ లో  ప్రేక్షకులతో చిట్ చాట్ చేసింది. 'లెట్స్ చాట్.. I have about 45 Mints .. What's up ' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేయడంతో అనసూయ అభిమానులు ప్రశ్నలతో ముంచెత్తారు. దీంతో అనసూయ వీలైనంతవరకు రిప్లై ఇచ్చింది. మొదట ఒక అభిమాని 'అక్క మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది' అని అడుగగా.. ఎందుకంటే వాళ్ళ అర్థాలు వేరే ఉంటాయి కాబట్టి.. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా.. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయని సమాధానమిచ్చింది. "సండే స్పెషల్ ఏంటి మేడమ్" అని ఒక అభిమాని అడుగగా.. అమ్మ చేసిన మామిడికాయ పప్పు, ఆలు ఫ్రై చుక్క కూర పచ్చడి అని అనసూయ సమధానమిచ్చింది. "కొత్త మూవీ అప్డేట్ ఏదైనా?" అని ఒక అభిమాని ప్రశ్నించగా.. ఎస్ ఉంది.. ఏప్రిల్ మధ్యలో మొదలవుతుంది. ఒక గొప్ప డైరెక్టర్ తో కలిసి చేస్తున్నాను.. మొత్తం అప్డేట్ కోసం ఆగాల్సిందేనని సమాధానమిచ్చింది. సండే కదా ఏమైనా సినిమా చూస్తారా? అని మరొకరు అడుగగా.. ఎస్ ... పిల్లలతో కలిసి 'మెజిషియన్స్ ఎలిఫెంట్' చూడాలనుకుంటున్నానని సమాధానమిచ్చింది.  మీరు చాలా మందికి ఇన్సిపిరేషన్.. మీరు ఇలా సైలెంట్ గా ఉంటే ఏం బాలేదని ఒకరు అడుగగా.. నేను సైలెంట్ గా లేను.. రూట్ మార్చాను.. అయినా నేను మాట్లాడాలనుకుంటే నన్ను నేనే ఆపలేను అని అనసూయ చెప్పింది. మీరు నా టీనేజ్ క్రష్ మేడమ్.. సండే సెల్ఫీ ప్లీజ్ అని అడుగగా.. తన సెల్ఫీ ఫోటోని అప్లోడ్ చేసింది. ఈరోజు వెజ్ ఆర్ నాన్ వెజ్ అని ఒక అభిమాని అడుగగా.. నిన్న, ఈరోజు, రేపు ఏ రోజైనా తినేది వెజ్ తింటాను.. ఎందుకంటే నేను వెజిటేరియన్ ని అని బదులిచ్చింది. ఇలా తనకు సంబంధించిన కొన్ని విషయాలను తన అభిమానులతో పంచుకుంది అనసూయ.

రాఘవేంద్రరావు నిర్మాణంలో 'ఎద లోయల్లో ఇంద్రధనుస్సు' సీరియల్!

స్టార్ మా టీవీలో కొత్తగా ప్రారంభం అవుతున్న సీరియల్ 'ఎద లోయల్లో ఇంద్రధనస్సు'. RK ప్రొడక్షన్స్ పై కె. రాఘవేంద్రరావు ఈ సీరియల్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థ నిర్మించిన శాంతినివాసం, మనోయజ్ఞం, అగ్నిసాక్షి, మంగమ్మ గారి మనవరాలు వంటి సీరియల్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిన విషయమే. కాగా ఈ సీరియల్ మొదట 'పంతులమ్మ తెలుగమ్మాయి' అనే పేరుతో చెప్పగా.. ఇప్పుడు మరో కొత్త టైటిల్ "ఎద లోయల్లో ఇంద్రధనస్సు" అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సీరియల్ లో ముఖ్యపాత్రలో ఏక్ నాథ్ నటిస్తున్నాడు. ఏక్ నాథ్ కి జోడిగా స్వాతి నిత్యానంద్ నటిస్తోంది. ఈమె మలయాళ నటి. మలయాళం లో చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులో స్వాతి నిత్యానంద్ కి ఇదే తొలి సీరియల్ కావడం విశేషం. 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ సాక్షి అలియాస్ రసజ్ఞ ఈ సీరియల్ లో ఏక్ నాథ్ కి సోదరిగా నటిస్తుంది. సీనియర్ యాక్టర్ రాజ్ కుమార్..  స్వాతికి మేనమామ పాత్రలో చేస్తున్నారు. ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ కి రీమేక్ గా వస్తుంది. అయితే ఈ సీరియల్ కథ 'గుప్పెడంత మనసు' సీరియల్ కథకు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో కాలేజీ ఏండి గా రిషి, కాలేజీ స్టూడెంట్ గా వసుధార.. వాళ్లిద్దరి మధ్యలో సాగే ప్రేమకథ అత్యంత వీక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. 'ఎదలోయల్లో ఇంద్రధనస్సు' సీరియల్ లో ముఖ్య పాత్రను పోషిస్తున్న ఏక్ నాథ్ స్కూల్ ఎండీగా, స్వాతి స్కూల్ టీచర్ గా చేస్తుందని సీరియల్ ప్రోమోని చూస్తే తెలుస్తుంది.  స్టార్ మా టీవీలో ఈ సీరియల్ ని 'గుప్పెడంత మనసు' సీరియల్ స్లాట్ టైంలో ప్రసారం చేసి.. గుప్పెడంత మనసుని ఇంకా ముందు స్లాట్ లో ప్రసారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ కొత్త సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ ని బీట్ చేస్తుందో లేదో చూడాలి మరి. 

రిషి ఇంటికి అతిథిగా జయచంద్ర.. రూమ్ ఖాళీ చేసిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -726 లో కాలేజీని విజిట్ చేయడానికి జయచంద్ర వస్తున్నాడని ఫణింద్ర వాళ్ళు కావలిసిన ఏర్పాట్లు చేస్తారు. ఇంతలోనే రిషి వచ్చి జయచంద్ర గారికి హోటల్స్ లో ఉండడం ఇష్టముండదంట అని చెప్తాడు. జగతి, మహేంద్ర, ఫణింద్ర, వసుధార లు అక్కడే ఉంటారు. మన కాలేజీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేద్దామా అని మహేంద్ర అనగానే.. సర్ కి అక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో ఉండదో అని రిషి అంటాడు. ఇంతలోనే వసుధార మధ్యలో కలుగజేసుకొని.. సర్ మన ఇంట్లోనే ఉండేవిధంగా ఏర్పాటు చేద్దామని అంటుంది. రిషి, ఫణింద్రలు మంచి ఆలోచన అంటారు. అక్కడే ఉన్న దేవయాని.. అతను ఇంటికి ఎందుకు? అయినా గెస్ట్ రూమ్ లో వసుధార ఉంటుంది కదా అని దేవాయని అంటుంది. నేను ధరణి మేడం రూమ్ లో అడ్జస్ట్ అవుతానని వసుధార చెప్తుంది. కోపంతో దేవయాని వెళ్లిపోతుంటే.. పెద్దమ్మ ఎక్కడికి అంటాడు రిషి. జయచంద్ర గారు ఉండడానికి ఇంట్లో ఏర్పాట్లు చేస్తానని, తనకి ఇష్టం లేకున్నా అలా మాట్లాడి వెళ్ళిపోతుంది దేవయాని.  ఆ తర్వాత జయచంద్ర కాలేజీకి వస్తాడు. తనని అందరూ కలిసి లోపలికి ఆహ్వానిస్తారు. మహేంద్ర అందరిని పరిచయం చేస్తాడు. జయచంద్ర రిషి గురించి  కాలేజీ గురించి  గొప్పగా స్పీచ్ ఇస్తాడు. స్టూడెంట్స్ తో కాసేపు మాట్లాడి ఓల్డ్ కల్చర్, మోడరన్ కల్చర్ గురించి రేపు వివరిస్తానని జయచంద్ర స్టూడెంట్స్ కి చెప్తాడు. ఆ తర్వాత కాలేజీకి సంబంధించిన అన్ని రకాల ప్రోగ్రామ్స్ గురించి లాప్టాప్ లో వివరిస్తాడు రిషి. జయచంద్రకి రిషి వారి ఇంట్లోనే ఉండేలా ఏర్పాట్లు చేసానని చెప్తాడు. నాకు మీతో గడపడం సంతోషమే అని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్తుండగా రిషి.. సర్ రావడం ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. అంత గొప్ప వ్యక్తి మన ఇంటికి రావడం గ్రేట్ అని రిషి అంటాడు‌. సర్ వెళ్లిపోయేంత వరకు మనం ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉందామని రిషి అనగానే.. సరే అంటుంది వసుధార. మరోవైపు ధరణి వసుధార రూమ్ లోని బట్టలు తీసుకుపోతుండగా వసుధార చున్నీ ఒకటి కింద పడిపోతుంది. ఆ తర్వాత జయచంద్ర ఇంటికి వస్తాడు. దేవయాని తనని తాను పరిచయం చేసుకుంటుంది. మీ కోసం రూమ్ ఏర్పాటు చేసామని చెప్పి, రిషి తీసుకెళ్ళు అని అంటుంది.. రిషి, వసుధారలు జయచంద్రకు రూమ్ చూపిస్తారు. అందులో తన  చున్నీ కిందపడి ఉండడం చూస్తుంది వసుధార. జయచంద్ర సర్ చూడకముందే అది తీసెయ్యాలని రిషికి సైగ చేస్తుంటే.. జయచంద్ర వసుధారని చూసి, ఆ చున్నీ వైపు చూసి ఇంతకుముందు ఈ గదిలో అమ్మాయి ఉండేదా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

స్వప్న పేరు వినగానే కనకంకి పూనిన అమ్మవారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-59లో.. నవదంపతులు గుడికి వెళ్ళాలని దుగ్గిరాల సీతారామయ్య చెప్తాడు. దాంతో కావ్యని రాజ్ పక్కకి తీసుకెళ్ళి.. నీకు నాతో రావడం ఇష్టంలేదని చెప్పమని చెప్తాడు. దానికి కావ్య నిరాకరిస్తుంది. ఇష్టం లేదు.. ఇష్టం లేదని మీరు అన్నప్పుడల్లా నా గుండెల్లో ముల్లుతో గుచ్చినట్టుగా ఉంటుంది. మీరే అర్థం చేస్కోండని కావ్య రాజ్ తో అనగా.. ఆ ఇష్టం లేదు అనే పదాన్ని నీకే రాసిస్తున్నాను.. ఇకనుండి తాతయ్య చెప్పినప్పుడల్లా నీకే ఇష్టం లేదని చెప్పేసేయ్ అని రాజ్ అంటాడు. వాహ్ వాహ్ ఏం చెప్పారండి.. మీరేం చెప్పినా నేను మీతో పాటు గుడికి వస్తాను.. నన్నెవరూ ఆపలేరు. మరోవైపు కనకం, వాళ్ళ అక్క కలిసి అదే గుడికి వస్తారు. ఎందుకు తీసుకొచ్చావ్ నిజం చెప్పమని కనకం వాళ్ళ అక్క అడుగగా.. అదేం లేదక్కా.. నిజంగా మొక్కు అని అంటుంది. ఆ తర్వాత స్వప్న మారువేషంలో వస్తుంది. చెట్టు దగ్గర పూనకాలు వచ్చిన అమ్మోరు లాగా నిజం చెప్తాను రండని అంటుంది.  స్వప్న మంచిదని మారువేషంలో ఉన్న స్వప్న చెప్పేసరికి.. కనకంకి స్వప్న పేరు వినగానే.. ఒక్కసారిగా అమ్మవారు పూనినట్టుగా పూనకం వస్తుంది. స్వప్న మంచిది కాదని, తనని అనవసరంగా నాకిచ్చావని కనకం కోపంతో స్వప్న మీదికి రెచ్చిపోతుంది‌. దీంతో అమ్మవారి వేషంలో ఉన్న స్వప్న పారిపోతుంది. ఆ తర్వాత మామూలు మనిషి అయిన కనకం.. నాకేం జరిగిందని అంటుంది. నీకు పిచ్చి పట్టిందని వాళ్ళ అక్క కనకంకి చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు కాసేపు అలా మాట్లాడుతుండగా.. దుగ్గిరాల ఫ్యామిలీతో పాటుగా కావ్య, రాజ్ లు కలిసి వస్తారు. అది చూసి కనకం, వాళ్ళ అక్కకి మైండ్ బ్లాక్ అవుతుంది. కనకం, వాళ్ళ అక్క వెంటనే కాళ్ళు వంకరబెట్టి నడుచుకుంటూ పారిపోతారు. ఆ తర్వాత రాజ్, కావ్యల పేరు మీద అర్చన చేపిస్తారు సీతారామయ్య. అక్కడ ఉన్న పూజారి నవదంపతులకి 'బ్రహ్మముడి' వేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమంటాడు. వాళ్ళు అలా ప్రదక్షిణలు చేస్తుండగా రాజ్ కావ్యని తక్కువ చేసి మాట్లాడేసరికి తనకి కోపం వచ్చి.. కాలు బెణికినట్టుగా యాక్ట్ చేస్తుంది. దీంతో అది చూసిన పంతులు గారు మీ భార్యని చేతులతో ఎత్తుకొని ప్రదక్షిణలు చేయండని పంతులు చెప్పగా.. రాజ్ నేను చేయనని అనడంతో, సీతారామయ్య నువ్వే చేయాలని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

భార్యను ప్రేమించడానికి లీవ్ తీసుకున్న మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -120 లో.. కృష్ణ ఆలోచనలో పడి మురారి పరధ్యానంగా ఉంటాడు. అప్పుడే స్టేషన్ కి డిజీపి వస్తాడు. ఏంటి మురారి నువ్వు ఇలా చేస్తున్నావ్ భార్య పెట్టే టెన్షన్ కి ఇలా అయ్యావా అని అడుగుతాడు డీజీపీ. లేదు సర్ అని మురారి అంటాడు. ఇంతలోనే డీజీపి భార్య ఫోన్ చేసి.. ఇంటికి తొందరగా రండని తిడుతుంది. అప్పుడు డీజీపీ సరే అని ఫోన్ కట్ చేస్తాడు. నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావ్ మురారి, అదేంటో చెప్పమని అడుగుతాడు. నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్తాడు మురారి. ఏంటి మొన్ననే పెళ్ళి అయింది.. ఇంతలోనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అని డిజీపి అడుగగా.. లేదు సర్.. నా భార్యనే ప్రేమిస్తున్నానని చెప్తాడు. సరే సరే నువ్వు రెండు రోజులు లీవ్ తీసుకొని.. నీ లవ్ ని క్లియర్ చేసుకోమని డీజీపీ చెప్పి వెళ్ళిపోతాడు.  మరోవైపు నందుని ఎలాగైనా గౌతమ్ కి దగ్గర కానివ్వద్దని భవాని ఆలోచిస్తుంది. ఫారెన్ లో ఉంటున్న తన అక్క దగ్గరికి పంపించాలని దానికి కావలిసిన ఏర్పాట్లు చెయ్యమని ఈశ్వర్ తో చెప్తుంది భవాని. కృష్ణ కాలేజీకి వెళ్తుంది. అక్కడ గౌతమ్ ని కలిసి మాట్లాడుతుంది. సర్ అని కృష్ణ పిలవడంతో.. నన్ను అన్నయ్య అని పిలవమని గౌతమ్ చెప్తాడు. ఇక అక్కడే ఉన్న గౌతమ్ ఫ్రెండ్ బాలు.. ఏంటి రా విలన్ లా ఉండే నువ్వు హీరో అయ్యావ్ అని అడుగుతాడు. అంతా కృష్ణ వల్లే.. తనే నన్ను ఇలా మార్చింది. నందుకి నాకు పెళ్లి చేస్తానని చెప్పిందని గౌతమ్ అంటాడు.  మరోవైపు మురారి ఇంటికెళ్ళడంతోనే.. కృష్ణ నిన్ను క్షమించిందా అని ముకుంద అడుగుతుంది. ముకుంద అడిగే అన్ని ప్రశ్నలకు చిరాకుగా సమాధానం చెప్పి తన గదిలోకి వెళ్తాడు మురారి.. ఆ తర్వాత కృష్ణ ఇంటికి రాగానే నందు దగ్గరికి వెళ్తుంది. నందు చాలాసేపటి నుండి కృష్ణ అంటూ అడుగుతుంది. కృష్ణ వచ్చాక.. నేను కూడా నీతో పాటు హాస్పిటల్ కి వస్తాను. అక్కడ సిద్దు ఉంటాడని నందు అంటుంది. అక్కడ సిద్దు ఎందుకు ఉంటాడని సర్ది చెప్తుంది కృష్ణ. ఇక నందుని డైవర్ట్ చేయడానికి నీకు చీర కడతానని అంటుంది కృష్ణ. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక నందుని తీసుకొని గదిలోకి వెళ్తుంది కృష్ణ.  ఆ తర్వాత కృష్ణతో మురారి మాట్లాడుతుంటాడు. నువ్వు ఇలా ఉంటే.. నేను ఏ పని చెయ్యలేకపోతున్నాను. నీతో మాట్లాడాలని రెండు రోజులు లీవ్ పెట్టాను. నన్ను క్షమించావా అని మురారి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

డిస్టర్బ్ అయిన జగతి.. ఈ వసుధార అన్నీ సగం పనులే చేస్తుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 725 లో... జగతికి‌ అసలు‌ నిజం తెలుస్తుంది. దాంతో తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఫంక్షన్ నుండి వచ్చిన మహేంద్ర జగతిని చూసి.. ఏంటి డిస్టర్బ్ గా ఉన్నావని అడుగుతాడు. మనకి తెలియకుండా ఏదో జరుగుతుందంటే నమ్మలేదు కదా.. మనముందు అలానే ఉన్నారు.. కానీ మనకి తెలియకుండా వాళ్ళ రిలేషన్ మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేద్దామనుకున్నారని మహేంద్రతో జరిగిందంతా చెప్తుంది జగతి. వాళ్ళ మధ్య ఉన్న దూరం అలానే ఉంది. పాపం పిల్లలు మహేంద్ర‌‌.. మానసిక ఒత్తిడికి గురవుతయన్నారు. ఇలా అయితే ఏం కాదు.. వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని జగతి అనగా... వాళ్ళు చెప్తే వింటారా అంటే.‌. రిషి నాకు చాలా చేసాడు. అక్క దేవాయనికి ఎదురించి నన్ను ఇక్కడ ఉండేలా చేసాడు. వాళ్ళిద్దరరి మధ్య ఉన్న చిక్కుముడి విప్పి.. వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేద్దాం మహేంద్ర అని జగతి చెప్తుంది. సరే చేద్దామని మహేంద్ర అంటాడు. రిషి తన గదిలో అద్దంలో చూసుకుంటూ వసుధారకి తనకి మధ్యగల ప్రేమే బంధమని నమ్మాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.  ఆ తర్వాత బెడ్ మీద ఒక పేపర్ మీద నెమలీక పెట్టి.. ఈ రోజు భోజనంలో తీపి, చేదు, కారంతో పాటు ఆనందం కుడా కావాలని వసుధార ఒక పేపర్ మీద రాస్తుంది. అది చదివిన రిషి వాళ్ళ ఇంటి టెర్రస్ మీద కూర్చొని తినేలా ఏర్పాటు చేస్తాడు రిషి. తనేం చేసినా నా ఆనందం కోసమే అని అనుకుంటాడు రిషి. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మా పాత రోజులు గుర్తుచేసావమ్మ వసుధార థాంక్స్ అమ్మ అని ఫణీంద్ర భూషన్ అంటాడు. అనవసరమైన కాలయాపణ కాకపోతే ఏంటిది.. ఇవన్నీ మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తారని దేవయాని అనగా.. కలిసి మాట్లాడుకొని ఆనందంగా తినకపోతే కోట్ల ఆస్తులు ఉండి కూడా అనవసరమని జగతి చెప్తుంది. ఆ తర్వాత అందరూ తినేస్తారు.  ఆ తర్వాత ఉదయం రిషి, వసుధార, ఫణీంద్ర భూషన్ అందరూ కలిసి ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ జయచంద్ర గారి ఇంటర్వ్యూ చూస్తారు. ఆదర్శ భవితకు ఉత్తమ విలువలకు శ్రీకారం చుడదామని చెప్తాడు. మంత్రి గారు జయచంద్ర గారి ఉపన్యాసాలు మన కాలేజీలో పెట్టమని చెప్పాడు.  కాలేజీకి వెళ్ళిన వసుధార మహేంద్ర రూంకి వెళ్లి అక్కడ ఒక గిఫ్ట్ మీద MD అని రాసి ఉంటుంది. అది చూసి దాని వెనుకాలా MH అని రాద్దామని రాసేలోపే రిషి రావడాన్ని గమనించి వచ్చేస్తుంది వసుధార. వసుధార వెళ్ళిపోయాక ఆ గిఫ్ట్ చూసి.. ఈ పొగరు(వసుధార) అన్నీ సగం పనులు చేస్తుందని అనుకొని..M తర్వాత H రాస్తాడు..MH అని రాస్తాడు. వెంటనే వసుధార వచ్చి.. థాంక్స్ సర్.. నేను ఏది వదిలిపెట్టిన మీరు పూర్తి చేస్తారు. మీరు జెంటిల్ మెన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అందరూ కలిసి కాలేజీలో జయచంద్ర గారి ఉపన్యాసం కోసం ఫ్లిక్స్ లు కడుతూ ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అందరి ముందు సీతారామయ్యకి క్షమాపణలు చెప్పిన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-58 లో..  కావ్య దగ్గరికి వచ్చి ఏం మాట్లాడకుండా ఉన్న రాజ్ ని చూసి.. మనసులో మాట్లాడుకుంటే  ఎలా తెలుస్తుంది. ‌రాత్రి నీ గదిలో మన మధ్య ఏం జరగలేదు కదా అని రాజ్ అడుగగా... ఎందుకు జరుగలేదు..‌జరిగిపోయిందని కావ్య చెప్తుంది. దయచేసి నిజం చెప్పు అని రాజ్ అడుగగా... అది జరిగిపోయిందని చెప్తాడు. నేను రాత్రి జరిగిందాని గురించి చెప్పవా ప్లీజ్ అని అడుగగా.. అంత కుతూహలంగా ఉందా అని కావ్య అడుగుతుంది. మర్యదగా నిజం చెప్పు.. అసలేం జరిగిందని రాజ్ అడుగగా..‌ ఒక వారం తర్వాత కనపడండి అంతా గుర్తుతెచ్చుకొని చెప్తానని కావ్య అంటుంది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి..  ఏం చేయాలనుకుంటున్నారని అడుగుతాడు. నా కొత్త కవిత్వం వినవా అని తను రాసిన కొత్త కవిత చెప్తుండగా.. రాజ్ ఆపేసి.. ఈ కళావతికి వినిపించు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు స్వప్న, రాహుల్ వారి గదిలో మాట్లాడుకుంటారు. నేను ఏమి అడిగినా నువ్వు పట్టించుకోవట్లేదని అడుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలని రాహుల్ అడగుతాడు. నేను మా అమ్మతో మాట్లాడతాను అని చెప్పి కనకంకి కాల్ చేసి, బ్యాంక్ నుండి లోన్ ఇప్పిస్తామని చెప్పి మాట్లాడుతుంది స్వప్న.. ఆ తర్వాత కనకం వాళ్ళ అక్కతో కలిసి బంజారాహిల్స్ దుర్గమ్మ గుడికి వెళ్తున్నామని చెప్తుంది కనకం.  దుగ్గిరాల సీతారామయ్య ఇంట్లో వాళ్ళందరని పిలుస్తాడు.  రాజ్ నువ్వు గుడికి తీసుకెళ్ళి పూజ జరిపించి, నీ చేతులతో నీ భార్యకి ప్రసాదం తినిపించాలని సీతారామయ్య చెప్తాడు. దాంతో రాజ్ వెంటనే నిల్చొని.. నో.. తాతయ్య ఇప్పటికే ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాను.. ఇక నన్ను ఇబ్బంది పెట్టకండని అడుగుతాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న అపర్ణ.. వాడిని ఇంకా ఇబ్బంది పెట్టకండని అంటుంది. ఇక చాలు ఆపు.. నీకు ఇష్టం లేదని, ఆ ఇష్టాన్ని బలవంతంగా నీ కొడుకుపై రుద్దాలని చూడకు. మీ మామయ్య ముందు నిల్చొని నిర్ణయాలు అమలు చేసేంత పెద్దదానివయ్యావా అపర్ణ.. ఈ ఇంటికి, ఆస్తికి అధిపతి మా ఆయన సీతారామయ్య.. నా భర్తకే ఎదురు సమధానం చెప్తావా? ఇప్పటికిప్పుడు నా భర్తకి, నీ తల్లి కొడుకులు సారీ చెప్పండని రాజ్ వాళ్ళ నానమ్మ అనగా.. రాజ్ సారీ చెప్తాడు.  ఆ తర్వాత అపర్ణ క్షమాపణ కోరుతుంది. ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్ళండని రాజ్ వాళ్ళ నానమ్మ చెప్తుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ పక్కకి తీసుకెళ్ళి నీకు నాతో గుడికి రావడం ఇష్టం లేదని వెళ్ళి తాతయ్య వాళ్ళతో చెప్పు అని రాజ్ అనగా.. నాకు ఎందుకు ఇష్టం లేదని చెప్తాను నీకే ఇష్టం లేదని చెప్తాను అని కావ్య అంటుంది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గౌతమ్ మీద రెట్టింపైన భవాని పంతం.. కృష్ణకి తెలిసిపోయిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -119 లో.. కృష్ణతో మురారి మాట్లాడుతుంటాడు. నువ్వు గ్రేట్ కృష్ణ.. దేనికి బయపడవు. ఎదురు ఉండి పోరాడతావు.. నీ ముందు అన్యాయం జరిగితే నువ్వు ఒప్పుకోవు అని మురారి అంటాడు. సర్ ఏంటి మీరు.. ఇలా మాట్లాడుతున్నారు. స్టేషన్ కి వెళ్ళరా అని కృష్ణ అడుగుతుంది. మరోవైపు భవాని, ఈశ్వర్, ప్రసాద్ ముగ్గురు కలిసి గౌతమ్ గురించి మాట్లాడుకుంటారు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్ను అత్తయ్య అంటాడు.. వాణ్ణి ఇంకొకసారి ఈ ఇంటి గడప దాటకుండా చెయ్యాలని భవాని అంటుంది. నాకు చాలా కోపం వచ్చింది ఎక్కడ ఇంట్లో వాళ్ళకి నందు ప్రేమ విషయం బయటపడుతుందో అని సైలెంట్ గా ఉన్నానని ఈశ్వర్ అంటాడు. అసలు కృష్ణకి వాడు నందు గురించి చెప్పి ఉంటాడా అని డౌట్ పడతాడు ఈశ్వర్. ఏది ఏమైనా ఇది నా జీవితంలో ఒక సవాలు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. వాణ్ణి వదిలిపెడితే నేను ఓడినట్లే అని భవాని అంటుంది.  మరోవైపు కృష్ణతో చాట్ చేస్తాడు మురారి. నీతో మాట్లాడాలి కృష్ణ.. నీకు దండం పెడతాను. నువ్వు ఇలా ఉండకు.. ఎప్పటిలాగా మనం ఫ్రెండ్లీ గా ఉందాం.. నువ్వు ఇలా ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వస్తేనే నేను డ్యూటీకి వెళ్తానని మెసెజ్ చేసి కార్ దగ్గర ఎదురు చూస్తుంటాడు. అప్పుడే ముకుంద వచ్చి మాట్లాడుతుంది. నాకోసమే ఎదురుచూస్తున్నావా మురారి అని ముకుంద అడుగగా.. లేదని చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ వస్తుంది. ముకుంద మురారిలని చూసిన కృష్ణ.. మీరు మాట్లాడుకుంటున్నారు కదా.. మాట్లాడడం అయిపోయాక వస్తా అని కృష్ణ వెళ్తుంటే మురారి తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. కృష్ణ కోపంగా చెయ్యి వదలండి.. నా చెయ్యి పట్టుకునే అర్హత మీకు లేదని కృష్ణ అంటుంది. సరే నేను తర్వాత మాట్లాడుతానని మురారి అనగానే.. నేను తర్వాత మాట్లాడను అని చెప్పేసి కృష్ణ వెళ్ళిపోతుంది. ముకుంద నువ్వు ఇంత మొండిగా ఎందుకు చేస్తున్నావ్? అని మురారి అడుగుతాడు. నాది ప్రేమ అని ముకుంద ఏదో చెప్తుండగానే.. అక్కడ నుండి వెళ్ళిపోతాడు మురారి. ఏంటి ఈ మురారి.. కృష్ణకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడా? లేక నాకు దూరమవ్వాలని చూస్తున్నాడా అని అనుకుంటుంది ముకుంద.    ఆ తర్వాత నందు మెట్ల మీద నుండి వెళ్తుండగా కృష్ణ తనని ఆపుతుంది. ఏమైంది నందు? ఎక్కడికి వెళ్తున్నావని కృష్ణ అడుగగా.. సిద్దు కావాలి అంటుంది. సిద్దు లేడమ్మా అని కృష్ణ చెప్తుంది. ఇదంతా దూరంగా భవాని చూస్తుంది. ఆ తర్వాత కృష్ణని పిలిచి.. నందు ఏం అంటుందని అడుగుతుంది. సిద్దు కావాలంట అత్తయ్య.. ఈ గౌతమ్ సార్ వచ్చాడు కదా, నందుకి సిద్దు వచ్చినట్లుగా అనిపించిందంట అని చెప్తుంది. ఈ సిద్దు ఎవరు అత్తయ్యా అని కృష్ణ అడుగుతుంది. తెలిసి అడుగుతుందా లేక తెలియకుండానా అని మనసులో అనుకొని.. నందు చిన్ననాటి ఫ్రెండ్ అని కవర్ చేసి భవాని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు స్టేషన్ కి వెళ్ళిన మురారి.. కృష్ణ ఆలోచనలోనే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తాగిన మత్తులో కావ్య గదిలోకి వెళ్ళిన రాజ్.. అసలు నిజం తెలిసిపోయింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టీఆర్పీ లో టాప్ -5 లో ఉంటుంది. కాగా గురువారం నాటి ఎపిసోడ్-57లో.. ఉదయం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో ఉంటారు.  అప్పుడే కావ్య గది నుండి బయటకొస్తాడు రాజ్. అది చూసినవాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అసలు ఆ అమ్మాయంటేనే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఏం చేసావ్? అసలు ఎందుకు వెళ్ళావ్? ఇలాంటి విషయం నేను అడగలేనని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రుద్రాణి ఏమైందని అడుగుతుంది. నాకేం తెలియదని రాజ్ అంటాడు. ఇప్పుడు నిజం చెప్పు అసలు ఏం జరిగిందని అడగగా.. అసలు ఆ కళావతి అంటేనే నాకిష్టం లేదని అంటాడు. రాజ్ వాళ్ళ అమ్మమ్మ సంతోషిస్తుంది. రాజ్ వాళ్ళ అమ్మ బాధపడుతుంది. నాకేమీ గుర్తు రావడం లేదని రాజ్ చెప్తుండగా.. రాత్రి ఏం జరుగిందో నాకు  తెలుసని కళ్యాణ్ అంటాడు. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. రాత్రి రాజ్ అన్నయ్య తాగేసి ఆ కావ్య గదిలోకి వెళ్తుండగా నేను ఆపాను.. రాజ్ అన్నయ్య మాత్రం నా భార్య గదిలోకి నేను వెళ్తా నీకెందుకని చెప్పి కావ్య ఉన్న గది తాళం తీసుకొని మరీ వెళ్ళాడని కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు. అందరూ రాజ్ తాగాడంటే ఆశ్చర్యపోతారు. రాజ్ నువ్వు తాగావా అని అపర్ణ అడగగా.. ఏమో గుర్తులేదని రాజ్ అంటాడు. దాంతో రాజ్ వాళ్ళ అమ్మ కోపంతో హాల్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి ఇంతకీ రాత్రి శోభనం జరిగిందా అని కళ్యాణ్ ని రుద్రాణి అడగగా... గది బయట వరకూ నాకు తెలుసు.. లోపల ఏం జరిగిందో తెలియదని చెప్పేసి వెళ్ళిపోతాడు. కనకం వాళ్ళ అక్క ఇంటికి వచ్చి వెళ్తుంది. స్వప్న ఎక్కడికి వెళ్ళిందో తెలియదు.. ఇష్టం లేని పెళ్ళి చేసి కావ్య గొంతు కోసానని కనకం వాళ్ళ అక్కతో చెప్పుకుంటూ బాధపడుతుంది.  వాళ్ళ అక్క ఓదారుస్తుంది. గుండె బరువెక్కింది.. కాసేపు ప్రశాంతంగా ఉందామని కనకం, వాళ్ళ అక్క కలిసి గుడికి వెళ్తారు. మరోవైపు రాజ్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని కావ్యనే డైరెక్ట్ గా అడుగుదామని వెళ్తాడు. కావ్య దగ్గరికి వెళ్ళాక తనతో ఏమీ మాట్లాడకుండా.. మనసులో మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాడు.. హాలో రాజ్ గారు.. మీలో మీరే మాట్లాడుకొని వెళ్ళిపోతే నాకెలా తెలుస్తుందని అడగగా.‌. రాజ్ తడబడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

గౌతమ్ కి కొసరి కొసరి వడ్డించిన రేవతి.. భవానికి పెరిగిన కోపం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. కృష్ణ మీద కోపంతో‌ భవానీ ఆమెను ఇంటి నుండి బహిష్కరించగా.. తనేం తప్పు చేయలేదని నిరూపించుకోవాలని.. నందుకి ట్యాబ్లెట్లు ఇచ్చిన వాళ్ళ సీనియర్ డాక్టర్ ని ఇంటికి తీసుకొస్తుంది కృష్ణ. దీంతో ఏం జరుగుతుందా అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -118 సాగింది. గౌతమ్ సర్ ఇంటికి వస్తున్నారని భవానీతో  చెప్తుంది కృష్ణ. "నందు టాబ్లెట్స్ విషయంలో నన్ను బ్లేమ్ చెయ్యడంలో సక్సెస్ అయింది ముకుంద.. నేను నందు టాబ్లెట్స్ విషయంలో ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికే గౌతమ్ సర్ ని రమ్మన్నాను" అని కృష్ణ ఇంట్లోవాళ్ళతో చెప్తుంది. ఇంతలోనే గౌతమ్ వస్తాడు. గౌతమ్ ని చూసిన భవాని, ఈశ్వర్, ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతారు. దాని తర్వాత గౌతమ్ ని కృష్ణ అందరికి పరిచయం చెద్దామని అనుకునేలోపే.. వద్దు కృష్ణమ్మ నేను గెస్ చేసి చెప్తానంటూ.. ఒక్కొక్కరి గురించి గౌతమ్ చెప్తాడు. "ఆమె మీ పెద్ద అత్తయ్య భవాని దేవి.. ఈ ఇంటికి రాజమాత. వీళ్ళు ఈశ్వర్, ప్రసాద్ లు.. ఈ ఇంటికి రక్షక భటులని, ఆమె మీ చిన్న అత్తయ్య.. మీరు కృష్ణ ని కోడలు లా కాకుండా కూతురు లా చూసుకుంటారంట కదా.. ఇవ్వన్నీ కృష్ణ నాకు చెప్పింది" అంటాడు గౌతమ్. మురారిని బావ అని గౌతమ్ పిలుస్తాడు. మురారి షాక్ అవుతాడు. కృష్ణ నాకు చెల్లెలు కాబట్టి మురారి బావ అవుతాడని గౌతమ్ అంటాడు. వీళ్ళని నేను అపార్ధం చేసుకున్నానా అని మురారి బాధపడతాడు. ఇక అందరూ భోజనం చెయ్యడానికి వెళ్తారు. భవాని, ఈశ్వర్ ఇంకా ప్రసాద్ లు మాత్రం వెళ్లకుండా.. గౌతమ్ గురించి మాట్లాడుకుంటారు. ఈ కృష్ణకి నందు గురించి తెలిసే తీసుకొచ్చిందా.. అసలు వాడికి ఎంత ధైర్యం ఈ ఇంటికి రావడానికి అని భవాని అంటుంది. నందు వాడిని చూడకూడదు.. కిందకి రాకుండా చూసుకోండని భవాని చెప్తుంది. మరోవైపు భోజనం చేస్తున్న గౌతమ్ కి.. అది వేసుకోండి, ఇది వేసుకోండి అల్లుడు గారని రేవతి అంటుంటే.‌. ఈశ్వర్ కి కోపం వస్తుంది. నందుకి టాబ్లెట్స్ నేనే ఇచ్చాను.. అందులో కృష్ణ తప్పేం లేదు.. ఎవరికో ఒకరికి మాత్రమే ఇలా అవుతుంది. నందు కి మెల్లి మెల్లిగా గతం గుర్తుకొస్తుందని గౌతమ్ చెప్తాడు. ఇక నందు పైనుండి కిందకి వస్తుంటే.. భవాని తనని చూసి ప్రసాద్.. నందు ని పైకి తీసుకెళ్ళు అని చెప్తుంది. నందుని ప్రసాద్ పైకి తీసుకెళ్లడం గౌతమ్, కృష్ణ చూసి ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత భోజనం చేసి వెళ్తూ.. నందు కేసు ఒక్కటే ఇక మిగిలిందని గౌతమ్ అనగానే.. మాకు కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ లు నందుని చూసుకోవడానికి ఉన్నారు అని భవాని అంటుంది. ఇక వెళ్లిపోండని ఈశ్వర్ అంటాడు. గెస్ట్ లను ఎక్కువ సేపు మీ ఇంట్లో ఉండనివ్వరా అని చెప్పేసి గౌతమ్ వెళ్ళిపోతాడు. మురారి బాధపడుతుండగా.. కృష్ణ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేను పాత రిషిని కాలేకపోతున్నాను.. మన కథ కొత్తగా మొదలైంది కానీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.  ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌ లో... "కొత్తగా మనం పరిచయమవుదాం.. మన కథ కొత్తగా మార్చుకుందాం.. మళ్ళీ పాత రిషి వసుధారలుగా ఉందాం" అని ఒక ఒప్పందానికి వచ్చిన రిషి వసుధారలు వాళ్ళు అనుకున్నట్టుగానే చేస్తుంటారు. వసుధార కాలేజీ తర్వాత ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా చేస్తుంటుంది. అది తెలుసుకొని ఆ రెస్టారెంట్ కి ఒక రెగ్యులర్ కస్టమర్ లాగా రిషి వెళ్తాడు. రిషి వెళ్ళగానే కాఫీ తీసుకొస్తుంది. అది తాగేసాక టిప్ ఇస్తాడు రిషి. నా దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తావా.. ఇక్కడ చేస్తే నీకొచ్చే దానికంటే రెట్టింపు డబ్బులు ఇస్తానని రిషి చెప్పగా.. సరేనని వసుధార అంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్ బయట‌ కొంచెం దూరంలో వసుధార కోసం ఎదురుచూస్తుంటాడు రిషి. వసుధార రెస్టారెంట్ నుండి బయటకొచ్చి రోడ్ మీద నడుస్తూ వస్తుండగా.. తనని చూసిన కొందరు దుండగులు తప్పుగా ప్రవర్తిస్తుంటారు. రిషి అక్కడికి వెళ్ళి ఆ దుండగులని కొట్టి వసుధారని కాపాడి తన కార్ లో ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికొచ్చాక రిషి వసుధార మాట్లాడుకుంటారు. అప్పుడే కిటికీలో నుండి రిషి మాట్లాడే మాటలన్నీ జగతి వింటుంది. "మనం మన కథని కొత్తగా ప్రారంభించలేం.. మనం కొత్తగా ప్రేమించుకోలేం.‌ నేను పాత రిషిలా నాలోకి నేను ప్రవేశించలేకపోతున్నాను.. జగతి మేడం మీద మొదట కోపం ఉండేది. ఇప్పుడు గౌరవం ఏర్పడింది. కొత్తగా కోపం తెచ్చుకుందామనుకున్నా రావట్లేదు. మనం టైం ట్రావెల్ చేయలేం. గతంలోని అలజడులు.. అయిన గాయాలు.. ఆ భారాన్ని నేను మోయలేను.. ఈ టైం ట్రావెల్ మన సమస్యకి పరిష్కారం కాదు. కొత్త సమస్య అవుతుంది.‌ కాబట్టి ఈ టాపిక్ ని వదిలేద్దాం" అని రిషి అంటాడు. మరి మన మధ్య దూరం ఎలా తగ్గుతుందని వసుధార అడుగుతుంది. మనం ఎంత వెతికినా కొన్ని సమస్యలకు కాలమే సమధానం చెప్పాలని వసుధారతో రిషి చెప్పేసి వెళ్తుండగా.. తన చేయి పట్టుకొని మన ప్రేమ అని అడగగా.. ఈ రిషేంద్ర భూషణ్ ఇచ్చింది తిరిగి తీసుకోడు..‌ఇదే రిషేంద్ర భూషణ్.. నీ వల్ల మారాను వసుధార.. నువ్వు నేను వేరు వేరుగా ఉండటమేమి బాగోలేదు.. అందుకే రిషీధారలు ఒక్కటయ్యేవరకు ఎదురుచూద్దామని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఇదంతా కిటికీలోంచి చూసిన జగతి... ఇదా ఇన్ని రోజులుగా వీరి మధ్య జరిగేదని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కొత్తగా మొదలైన రిషిధార ప్రేమకథ.. జగతి పసిగట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -723లో.. వసుధార, రిషి మళ్ళీ తమ మొదటి పరిచయం నుండి జర్నీ మొదలు పెట్టి స్వచ్ఛమైన, దాపరికాలు లేని ప్రేమని పొందాలని అనుకుంటారు. ఇలా చేస్తున్నట్టుగా ఎవరికి చెప్పొద్దని అనుకుంటారు. ఇక రిషి ఉదయం లేచి కాలేజీకి రెడీ అయి వస్తుంటే.. చిన్న మావయ్య, అత్తయ్య, వసుధార వాళ్ళు కాలేజీకి వెళ్లిపోయారని ధరణి చెప్తుంది. అవునా నేను కూడా వెళ్తున్నా అని బయల్దేరుతాడు రిషి. ఈ వసుధార ఆల్రెడి క్యారెక్టర్ లోకి వెళ్లినట్లుందని అనుకొని.. ఇట్స్ బిగిన్ అని వసుధారకి మెసేజ్ చేస్తాడు రిషి. ఒకే సార్ అని రిప్లై ఇస్తుంది వసుధార. ఇక కాలేజీకి ఎప్పుడు రిషితో వెళ్లే వసుధార.. మాతో వస్తుందేంటని జగతికి డౌట్ వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి ఏమైంది గొడవ పడ్డారా అని జగతి తన మనసులో అనుకొని.. వసు ఆర్ యూ ఓకే అని అడుగుతుంది. ఓకే మేడం ఎందుకలా అడుగుతున్నారు అని వసుధార అంటుంది.  వసుధార మొదటి రోజు కాలేజీ కి వచ్చినట్లుగా భావించి, జగతి మేడం ఇచ్చిన రికమండేషన్ లెటర్ పట్టుకొని రిషి కోసం ఎదురుచూస్తుంది. ఇక రిషి కార్ వచ్చి కాలేజీ ముందు ఆగుతుంది. అందులో నుండి రిషి కళ్ళజోడు పెట్టుకొని స్టైల్ గా ఒక ఆటిట్యూడ్ తో నడిచివస్తుంటే.. వసుధార గమనించి, రిషి వెనకాల వస్తూ.. సర్ ఐ ఆమ్ వసుధార ఈ కాలేజీ లో అడ్మిషన్ కావాలని వసుధార అడుగుతుంది. మీ అడ్మిషన్ అప్లికేషన్ బాక్స్ లో ఇవ్వండి అది బాగుంటే వాళ్ళే పిలుస్తారని రిషి సమధానమిస్తాడు. సర్.. ఇది జగతి మేడం ఇచ్చిన రికమండేషన్ లెటర్ అని చూపించాగానే.. రిషి గతంలో జగతిని తిట్టిన మాటలు గుర్తుచేసుకుంటాడు. రికమండేషన్ లెటర్ చింపేసి రిషి లోపలికి వెళ్తుంటే.. జగతి చూస్తుంది. దాంతో జగతి దగ్గరకి రిషి వచ్చి.. సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. జగతికి రిషి ఎందుకు సారీ చెప్పాడో అర్ధం కాదు. వసుధార దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని అడుగుతుంది. రిషి మన మధ్యలో జరిగిన ఒప్పందం గురించి ఎవరికి చెప్పద్దు అన్న విషయం గుర్తు చేసుకొని.. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను మేడం అని వసుధార అంటుంది. వసుధార రిషి ఇద్దరు గ్రౌండ్ కి వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడతారు. కాసేపు మళ్ళీ వారి మధ్య ఉన్న ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. మనం పూర్తిగా మన గతంలోకి వెళ్తేనే.. మనం దగ్గర అవుతాం. ఇక గతంలోనే ఉందామని చెప్పి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్ళి.. వసు కోసం చూస్తే ఎక్కడా కనిపించదు. నేను అలా అన్నానని కొంపతీసి ఇల్లు వదిలి వెళ్లిపోయిందా అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజ్ కావ్యల శోభనం జరిగిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -56 లో... రాజ్ కావ్యల శోభనం చెడగొట్టాలని రాహుల్ భావించి.. రాజ్ దగ్గరికి వెళ్ళి కావ్యపై అన్నీ కల్పించి చెప్తాడు. నీ వెనకాల ఉన్న ఆస్తి కోసమే ఆ కావ్య అలా చేసింది. అసలు తప్పంతా నీదే రాజ్ ఎంత ఈజీగా మోసపోయావని రాహుల్ అనగానే.. అవును నన్ను ఫూల్ ని చేసి పెళ్లి చేసుకుంది.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటూనే పెళ్లి చేసుకుందని రాజ్ అంటాడు. మరి ఎందుకు నువ్వు ఇదంతా భరించాలి... తప్పు చేసిన వాళ్ళ మీద కదా నీ కోపాన్ని చూపాలని రాజ్ కి మందు తాగమని రాహుల్ ఇస్తాడు. ఇప్పుడు ఒకసారి జరిగిందంతా ఆలోచిస్తే అసలు స్వప్న వెళ్ళలేదు.. కావ్యనే వెళ్ళిపోయేలా చేసి పెళ్లి పీటలపై కూర్చొని ఉన్నట్టుంది.. డబ్బు కోసం ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా చేస్తారని రాహుల్ అంటాడు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇదంతా కావాలనే ఆ కావ్య చేసింది దానికి బుద్ది చెప్తానంటూ రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నీ శోభనం జరగకుండా ఇదంతా నా ప్లాన్ రాజ్ అని రాహుల్ తన మనసులో అనుకుంటాడు. రాజ్ ఫుల్ గా తాగి కావ్య ఉన్న స్టోర్ రూమ్ కు వెళ్తుంటే కళ్యాణ్ ఆపి.. అన్నయ్య ఏం నువ్వు చేస్తున్నావ్? తాగావా? అని అడుగుతాడు. నేను ఇప్పుడు ఆ కళావతికి బుద్ది చెప్పాలి.. అయినా నా భార్య దగ్గరికి నేను వెళ్తుంటే.. ఆపే హక్కు నీకు ఎక్కడిదిరా అని చెప్పేసి.. కావ్య ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. స్టోర్ రూంకి బయటవైపు గడియపెట్టి  ఉండడంతో లోపల దాక్కోని బయట గడియా పెట్టించవా అని గడియ తీసి లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడికి వచ్చారు? వెళ్లిపోండని కావ్య అంటుంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్? నీకు బుద్ది చెప్పాకే వెళ్తాను.. అయినా ఇది నా ఇల్లు.. నన్ను వెళ్ళమంటావా అని రాజ్ అంటాడు. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడదామని కావ్య చెప్పినా కూడా వినకుండా తాగిన మైకంలో కావ్యపై పడిపోతాడు. అప్పుడు కావ్య రాజ్ ని బెడ్ పై పడుకోబెట్టబోతుండగా.. కావ్య నుదిటి మీద ఉన్న కుంకుమ రాజ్ షర్ట్ కి అంటుకుంటుంది. ఎంత వద్దనుకున్నా మనం దగ్గర అవుతున్నామా.. నాకు ఎందుకో నచ్చడం లేదని కావ్య అనుకుంటుంది. నువ్వు ఎంత అందంగా ఉంటే మాత్రం.. నిన్ను అస్సలు క్షమించనని కావ్యని తల్చుకుంటూ నిద్రపోతాడు. ఆ తర్వాత ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య రూమ్ లో నుండి రాజ్ చెప్పులు చేతిలో పట్టుకొని వస్తుంటే.. అందరూ షాక్ అవుతారు. రాత్రి శోభనం ఇష్టం లేదు అన్నట్లు మాట్లాడి ఇప్పుడు కావ్య రూమ్ లో నుండి బయటకు వస్తున్నావని రాజ్ నానమ్మ అంటుంది. ఏంటి వీళ్ళు శోభనం జరిగిందని అనుకుంటున్నరా అని రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గౌతమ్ ని ఇంటికి పిలిచిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి  ఎపిసోడ్-117 లో.. "నువ్వు నందు గురించి ఆలోచిస్తూ మా పెద్దమ్మతో పంతానికి పోతున్నావు" అని కృష్ణతో మురారి అంటాడు. "నేను నందు ఆరోగ్యం బాగవ్వాలని ఆలోచిస్తున్నా.. నందు విషయంలో నేనేం తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి రేపు గౌతమ్ సర్ ని ఇంటికి రమ్మంటున్నా" అని కృష్ణ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌతమ్ కి ఫోన్ చేసి.. రేపు మా ఇంటికి రండని చెప్పగానే.. "నేను రాలేను కృష్ణ.. నేనంటే మీ వాళ్ళకి చాలా కోపం" అని గౌతమ్ అంటాడు. నందు కోసం రండి సర్ అని కృష్ణ అంటుంది. సరే వస్తాను ఇదివరకు భయపడి నందుని దూరం చేసుకున్నాను.. ఇక భయపడను వస్తానని గౌతమ్ అంటాడు.  ఆ తర్వాత ఉదయం రేవతి కిచెన్ లో వంట చేస్తుండగా.. కృష్ణ వెళ్ళి ఇంటికి గెస్ట్ వస్తున్నారు.. స్పెషల్ వంటలు చెయ్యండి అత్తయ్య అని చెప్తుంది. ఎవరని రేవతి అడుగగా.. మన నందుని ప్రేమించిన వ్యక్తి వస్తున్నాడు అని కృష్ణ చెప్తుంది. అలా తను చెప్పగానే రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా చేస్తే.. నీతో పాటు నన్ను కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేస్తారని రేవతి అంటుంది. మీకు నందు ప్రేమ విషయం తెలుసా? అని రేవతిని అడుగుతుంది కృష్ణ. అప్పుడు రేవతి నాకేం తెలియదు అనడంతో నందు, గౌతమ్ ల ప్రేమ విషయం చెప్పడంతో పాటుగా నందుకి గతం గుర్తు రాకుండా టాబ్లెట్స్ వాడుతున్నారని నిజాలన్నీ రేవతికి చెప్పేస్తుంది కృష్ణ. మన నందు ప్రేమించిన సిద్దు ఎవరో కాదు మా గౌతమ్ సర్.. అందుకే ఈ రోజు అతడిని ఇంటికి పిలిచానని కృష్ణ చెప్పడంతో.. రేవతి సరే అని చెప్పి వంటలు తయారు చేస్తానని చెప్తుంది.  ఆ తర్వాత కృష్ణ తన రూమ్ లోకి వెళ్లేసరికి మురారి స్నానం చేసి వస్తాడు. కాస్త తల తుడవచ్చు కదా కృష్ణ అని అనగానే.. నా కన్నీళ్లు నేనే తుడుచుకున్నానని కృష్ణ అంటుంది. కృష్ణ కోపం తగ్గించాలని మురారి సరదాగా మాట్లాడినా తను మాత్రం కోపంగానే ఉంటుంది. కిందకి రండి.. గౌతమ్ సర్ వస్తున్నాడు టాబ్లెట్స్ గౌతమ్ సార్ ఇచ్చాడని చెప్తాడు. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలని కృష్ణ అంటుంది. ఆ విషయం మొన్న నాకు ఎందుకు చెప్పలేదని మురారి అడుగుతాడు. మీరు పురుషాహంకారంతో ఉన్నారు కదా.. అందుకే చెప్పలేదని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. అందరూ హాల్లో ఉంటారు. మధు, అలేఖ్యలు ఇంట్లోకి వచ్చి భవాని ఆశీర్వాదం తీసుకుంటారు. వంటగదిలో నుండి గుమగుమలు వస్తున్నాయి.. మేము వస్తున్నామని చేసారా? అని మధు అంటాడు. లేదు కృష్ణ గెస్ట్ ని ఇన్వైట్ చేసింది అని రేవతి అనగానే.. పక్కబే ఉన్న భవాని.. గెస్ట్ ఎవరని అడుగుతుంది. మా గౌతమ్ సర్ వస్తున్నారని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నడుం పట్టుకున్న మురారి.. కృష్ణకి కొంచెం ఇష్టం... కొంచెం కోపం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -116 లో.. నందు దగ్గరికి వెళ్తుంది కృష్ణ. అక్కడికి వెళ్ళాక.. "సిద్దు మంచివాడు కాదు కృష్ణ" అని నందు అనగానే.. "లేదు నందు.. సిద్దు చాలా మంచోడు" అని కృష్ణ చెప్తుంది. నీకు సిద్దుని నేను చూపిస్తానని కృష్ణ అనగానే.. వద్దు బాబాయ్ లు చంపేస్తారని నందు అంటుంది. సిద్దుని చూపిస్తాను కానీ నువ్వు సిద్దుని చూసినట్లు ఇంట్లో ఎవరికి చెప్పొద్దని కృష్ణ చెప్పడంతో సరేనంటుంది నందు. మరోవైపు కృష్ణ వాళ్ళ నాన్న ఫోటో దగ్గర మురారి నిలబడి.. గురువుగారు నేను కృష్ణకి సారీ చెప్తున్నాను అని అంటుండగా కృష్ణ వచ్చి.. జవాబు లేని దగ్గర మాట్లాడటం అనవసరమని అంటుంది. "నన్ను క్షమించు కృష్ణ.. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయంతో అలా మాట్లాడాను. నువ్వు ప్రతిసారీ గౌతమ్ సర్ గురించి నా ముందు అంటుంటే అసూయగా ఉండేది.. నేనొక ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించాను. సారీ కృష్ణ" అని అంటాడు మురారి. "ఉన్మాది లాగా కాదు.. అనుమానిలాగా ప్రవర్తించావ్. రెండు నెలలుగా నీతో ఒకే గదిలో ఉంటున్నాను.. నేను ఎలాంటిదాన్నో అర్ధంకాలేదా? అందరూ చెప్తున్నా నా చెయ్యి పట్టుకొని ఒక దోషిని చూసినట్టు చూసావ్. నాపై గౌరవం అప్పుడు కన్పించలేదా. ఇక చాలు" అని కృష్ణ వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు కృష్ణ పడిపోతుంటే.. తన నడుము పట్టుకొని కింద పడకుండా మురారి కాపాడతాడు. దాంతో కృష్ణ కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మరోవైపు భవాని దగ్గరికి ముకుంద వెళ్ళి.. మీరు కృష్ణని వెళ్ళకుండా ఎందుకు ఆపారు అత్తయ్య అని అడుగుతుంది. కృష్ణ ఈ ఇంటి నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు.. ఏదో క్రమశిక్షణలో పెట్టాలని అలా చేశాను.. నువ్వు ఎక్కువగా కృష్ణ గురించి అలోచించి నీ మనసుపాడు చేసుకోకని భవాని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారి గులాబీ రేకులతో సారీ అని రాస్తాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. మళ్ళీ పడుకోవడానికి నందు రూమ్ లోకి వెళ్తుంటే.. ఎక్కడికి కృష్ణ.. నువ్వు ఇలా వెళ్తే అమ్మ ఏం అనుకుంటుందని మురారి అనగానే.. "అత్తయ్యకి నిజం తెలిసిన రోజు.. నేనే మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్తాను.. అత్తయ్య నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పగానే చాలా బాధపడింది.. ఆ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మనసుకి నచ్చని అమ్మాయితో శోభనం ఎలా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -55 లో.. రాజ్ కావ్యల శోభనంకు దుగ్గిరాల కుటుంబం ముహూర్తం పెడతారు. రాజ్ గదిలో ఉండి ఆలోచిస్తూ.. కావ్య లోపలికి వచ్చినట్లు మళ్ళీ ఇద్దరికి బాగా గొడవ అయినట్లు ఉహించుకుంటాడు. నో అలా జరగకూడదు.. ఈ శోభనం జరుగకూడదని రాజ్ అనుకుంటాడు. మరోవైపు గదిలో ఉన్న కావ్య దగ్గరికి అపర్ణ వెళ్లి కావ్యని తక్కువ చేసి అనరాని మాటలు అంటుంది. ఈ శోభనం జరుగకూడదని కావ్యని లోపలే ఉంచి బయట గడియ పెట్టి అపర్ణ వెళ్ళిపోతుంది. దాంతో కావ్య బాధపడుతూ.. నేను ఏమైనా జంతువునా? ఇలా బంధించారు? డోర్ తియ్యండని అంటుంది కావ్య. మరోవైపు రాజ్, కావ్యలకు శోభనం జరుగకూడదు.. ఒక వేళ జరిగితే మనం ఇంత చేసిన దానికి ప్రయోజనం ఉండదు.. ఎలాగైనా ఈ శోభనం జరుగకుండా చేసే బాధ్యత నీదే అని రాహుల్ తో అంటుంది రుద్రాణి. కలపడం కష్టం కాని విడగొట్టడం ఈజీ అని రాహుల్  అంటాడు. రాజ్ తో మాట్లాడడానికి రాజ్ నానమ్మ, తాతయ్య వస్తారు. అప్పుడు రాజ్ మీరు చెప్పారని పెళ్ళి చేసుకున్నాను కాని నాకు అమ్మాయి ఇష్టం లేదని రాజ్ అంటాడు. రాజ్ నానమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాజ్ వినడు. ఇక రాజ్ తాతయ్య.. నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంతలో రాజ్ దగ్గరికి రాహుల్ వచ్చి నెగెటివ్ గా మాట్లాడుతాడు. ఇష్టంలేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్.. నీకు నచ్చిన అమ్మాయి స్వప్న.. వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందంటూ రాజ్ కి చిరాకు తెప్పిస్తాడు. కావ్య మీద ఇంకా ద్వేషం కలిగేలా అన్నీ కల్పించి చెప్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్ ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాను.. నా మనసుకు నచ్చని అమ్మాయితో శోభనం ఎలా చేసుకోవాలని గదిలోకి వెళ్ళి.. డెకరేట్ చేసిన రూమ్ ని చెడగొడతాడు. కావ్య మాత్రం ఆ గదిలోనే బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాత్రి 12 నుంచి న్యూ జర్నీ.. రిషిని హగ్ చేసుకున్న వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -722 లో... రిషి, వసుధారలు కాలేజీలో తమ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. "నాకు పాత రోజులు కావాలి.. నీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, దాపరికాలు లేని ప్రేమ కావాలి" అని వసుధారతో రిషి అంటాడు. "మనం పాత రిషి సర్, వసుధారలు అయిపోదామా.. మన ప్రేమ, మన పరిచయం మళ్ళీ మొదలుపెడదాం. అప్పుడైనా మనం సంతోషంగా ఉంటామేమో" అని వసు అంటుంది. "బాగానే ఉంది కాని మన చుట్టూ మనల్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు.. మనల్ని అంగీకరిస్తారా" అని రిషి అంటాడు. మనం మన జర్నీని మళ్ళీ మనకోసం మొదలు పెడదాం అనుకున్నాం.. వేరే వాళ్ళ కోసం కాదని వసుధార అంటుంది. మీరు నా పాత ఎండీలాగా మారాలి అని చెప్తుంది. మన జర్నీ ఈ రాత్రి 12 గంటల నుండి మొదలు పెట్టాలని రిషి, వసుధారలు ఒక ఒప్పందానికి వస్తారు. మరోవైపు జగతి, మహేంద్రలు కలిసి.. రిషి మన కాలేజీ పరువు కాపాడాడు. నిజంగా రిషి గ్రేట్ అంటూ ఫణీంధ్ర, దేవయానిలకు కాలేజీలో జరిగిన విషయాలు మొత్తం చెప్తారు. అంతలోనే రిషి, వసుధార ఇద్దరు కలిసి వస్తారు. "రిషి నువ్వు ఆ పేపర్స్ గురించి చాలా కష్టపడ్డావంట కదా. నాకు తెలుసు నాన్న, నువ్వు కాలేజీ కోసం ఏమైనా చేస్తావని.. అందరూ నీ గురించి గొప్పగా పొగుడుతుంటే హ్యాపీగా ఉంది నాన్న" అని దేవాయని అంటుంది. ఈ గొప్పతనం నాది కాదు వసుధారది.. తను కూడా చాలా కష్టపడిందని రిషి చెప్తాడు. సర్ నేను చేసిందేమీ లేదు.. అంత మీరే చేశారని వసుధార అనగానే.. ఎవరు గొప్పతనం ఒప్పుకోరు కదా అని ఫణింధ్ర అంటాడు. రిషి అలా వసుధారని పొగడటం దేవయానికి నచ్చదు.. దాంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రిషి తన‌ గదిలో, వసుధార తన గదిలో ఉండి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. 12 ఎప్పుడు అవుతుందా, న్యూ జర్నీ ఎప్పుడు మొదలు పెడదామా అన్నట్లుగా ఇద్దరు చూస్తారు. పన్నెండు అవడంతోనే ఇద్దరు ఒకేసారి హాల్లోకి వచ్చి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఏడు వరకు పాత రిషీ వసుధారలం.. మిగతా టైంలో మాములుగా ఉందామని రిషి అంటాడు. వసుధార సరే అంటుంది. బెస్టాఫ్ లక్ అని ఇద్దరు చెప్పుకొని, రిషి వెళ్ళిపోతుండగా.. వసుధార వెనకాల నుండి వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది. ఇదేంటని రిషి అడగగా.. ప్రేమ సర్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

త్వరలో జీ తెలుగులో సూపర్ క్వీన్ సీజన్ 2

సూపర్ క్వీన్ సీజన్ 2 త్వరలో జీ తెలుగులో ప్రసారం కావడానికి సిద్దమయ్యింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల కోసమే ప్రత్యేకించి రూపొందిస్తున్న ఎన్నో షోస్ లో ఇది కూడా ఒకటి. జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, అవమానాలు ఎన్ని ఉన్నా ఎంతమంది వెనకగా నవ్వుకున్నా వెనకడుగు వేయకుండా.. జీవితంలో సక్సెస్ తో బుద్ది చెప్పి ఆడియన్స్ మనస్సులో ఒక ప్రత్యేక  స్థానాన్ని సంపాదించుకున్న బుల్లితెర నటీమణులతో ‘సూపర్‌ క్వీన్‌’ అనే షో స్టార్ట్ అయ్యి సీజన్ 1 ని సక్సెస్ ఫుల్ గా  పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఇందులో పల్సర్ బైక్  కండక్టర్ ఝాన్సీ, నటి విద్యురామన్, మౌనిక యాదవ్, ప్రియాంక చౌదరి, యాంకర్ ప్రశాంతి, సుహాసిని, ఎస్తేర్, జబర్దస్త్ పవిత్ర, లిఖిత మూర్తి, అనాలా సుష్మిత..రాబోతున్నారు. ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు.  "నా ప్రయాణం నా కోసం కాదు...నా గమ్యం నాది కాదు, నేను అనే పదం తప్ప..నేను అనే నిజం తెలీదు, నా ఓటమి ఎదురుగా వేల మంది, నా గెలుపు వెనక నెన్నొక్కతిని, నా భయం నా ఓటమి ఎందరిని ఓడిస్తుందో అని, నా భాగ్యం నా గెలుపు ఎంత మందిని కుంగదీస్తుందో అని , నా నవ్వు కొందరిని బాధపెడుతోంది, నా బాధ ఎందరికో నవ్వునిస్తుంది, అందరూ ఉన్నా ఒంటరిని నేను..ఐనా నేను రాణిని నా జీవితానికి మహారాణిని" అంటూ యాంకర్ ఉదయభాను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చింది. "వాళ్ళ ఆవేదన సముద్రమంత లోతు..వాళ్ళ ఆప్యాయత కొండంత ఎత్తు... సివంగుల మధ్య సమరం ఆరంభం" అంటూ ఒక టాగ్ లైన్ ఇచ్చాడు ప్రదీప్...మరి ఈ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారో ఎవరు సూపర్ క్వీన్ అవార్డు ని అందుకుంటారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.