కృష్ణకి అబద్ధం చెప్పి‌న మురారి.. రేవతికి ఆ మాస్టర్ ప్లాన్ తెలిసేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -126 లో.. కృష్ణకి మురారి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. తనేమో మురారిని ఆటపట్టించాలని ఆటోలో వస్తూ మ్యూజిక్ వాల్యూమ్ పెంచుతుంది. అప్పుడు మురారి ఎక్కడ ఉన్నావ్ కృష్ణ సినిమా థియేటర్ లో ఉన్నావా అని అడుగుతాడు. రెండు నిమిషాల్లో మీ ఇంటిముందు ఉంటాను అనేసరికి మురారికి అర్థం కాదు. మరోవైపు రేవతి గుడి నుండి వచ్చి.. భవానికి ప్రసాదం ఇస్తుంది. మీరు కూడా వస్తే బాగుండు అక్క అని భవానీతో రేవతి అంటుంది. మిమ్మల్ని కావాలనే పంపించాను కదా అని భవాని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే కృష్ణ రావడంతో తనకి ప్రసాదం ఇస్తుంది రేవతి. కృష్ణ ఆ ప్రసాదం తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణ గదిలోకి వెళ్ళేసరికి మురారి కూర్చొని ఆలోచిస్తాడు. అప్పుడు కృష్ణ వెళ్ళి నేను అనుకున్న పని జరగలేదని మురారీతో అంటుంది. మురారి కూడా నేను అనుకున్న పని కూడా జరగలేదంటూ కృష్ణ దగ్గరగా జరుగుతాడు. "ఏంటి.. అయస్కాంతం లాగా అతుక్కుపోతున్నావ్" అంటూ కృష్ణ అడుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి కృష్ణ వెళ్ళుపోతుంటే.. చీర కొంగు ఇరుక్కుపోవడంతో కృష్ణ మురారిపై పడుతుంది. ఆ తర్వాత ఈశ్వర్ దగ్గరికి రేవతి వెళ్లి.. ఇంట్లో మాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారు.. దాని వల్ల కృష్ణకి ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం నేను ఊరుకోనని రేవతి అడుగగా.. ఏం చేసినా ఈ కుటుంబం కోసమే అని ఈశ్వర్ సమాధానమిస్తాడు. మరోవైపు కృష్ణ, మురారిలు బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నావ్ నాకు ఇచ్చిన మాట ఎక్కడి వరకు వచ్చిందని భవాని అడుగుతుంది. పెద్దమ్మ నేను చూసుకుంటానులే అని మురారి అంటాడు. కృష్ణకి కొంచెం బయట పని ఉందంట.. అందుకే తీసుకెళ్తున్నానని మురారి చెప్తాడు. ఇక అక్కడే ఉన్న ముకుంద.. ఏసీపీనే కృష్ణని బయటకు తీసుకెళ్ళాలా అని అంటుంది. నా మొగుడు నన్ను తీసుకెళ్తాడు.. నీకేంటని కృష్ణ అనగానే అది విని మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముకుంద మాత్రం కోపంగా చూస్తుంది. ఇక ఇద్దరు బయటకు వెళ్తారు.  కృష్ణ, మురారిలు రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు మురారి మనం కాసేపు లవర్స్ లాగా ఉందామని అడగగానే.. కృష్ణ సరేనంటుంది. మురారి కృష్ణని కిట్టు అని, కృష్ణ మురారి ని ముర్రు అని సరదాగా పిలుచుకుంటారు. నిన్న మీ పెద్దమ్మ ఎందుకు పిలిచిందని కృష్ణ అడుగుతుంది. మురారి నందు గురించి చెప్తుండగా.. పెద్దమ్మ వద్దని చెప్పిందని చెప్పకుండా ఆగిపోతాడు. కంపెనీకి సంబంధించి మాట్లాడడానికని మురారి అబద్ధం చెప్తాడు. మీరు ఒక జంటకి పెళ్లి చేయాలని చెప్పాను కదా అని కృష్ణ అడుగగా.. పెళ్లి చేస్తానని మురారి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నందు పెళ్ళి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇచ్చిన మురారి! 

స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.. నందుని పెళ్ళిచేసుకోవడానికి భవాని ఇంటికి వచ్చిన అబ్బాయితో మురారి పక్కకి తీసుకెళ్ళి  మాట్లాడుతాడు. ఈ పెళ్లి అంటే మీకు ఇష్టమేనా? ఎవరైనా బలవంతం చేస్తున్నారా? అని మురారి అతడిని అడుగుతాడు. నాకు ఇష్టమే.. ఎవరు నన్ను బలవంతం చెయ్యట్లేదు.. పైగా మీ ఇంటితో సంబంధం కుదుర్చుకోవడం మా వాళ్లకి ఇష్టమని ఆ అబ్బాయి చెప్తాడు. సరే మీరు నందు గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటున్నారంటే దానికి మీకు థాంక్యూ అని చెప్తాడు మురారి. ఇక ఇంతలోనే ఈశ్వర్ వచ్చి మీరు మాట్లాడుకోవడం అయిపోతే కిందకి వెళ్ళండని అబ్బాయిని పంపిస్తాడు. అక్కడికి భవాని, ప్రసాద్ లు వస్తారు. మనం ఎలాగైనా అమెరికా పంపిస్తున్నాం కదా.. అదే పెళ్లి చేసి పంపిద్దామని భవాని అంటుంది. ఈ విషయం కృష్ణకి తెలియొద్దు.. తెలిస్తే నందుకి చెప్తుంది.. దాంతో నందు మారం చేస్తుంది. అందుకే కృష్ణకి తెలియనివ్వద్దు మురారి అని భవాని అంటుంది. ఇంట్లో పెళ్ళి జరిగితే తెలియకుండా ఎలా ఉంటుందని మురారి అంటాడు. ఇంతలో ముకుంద అక్కడికి వచ్చి.. ఆ విషయం నేను చూసుకుంటానని అంటుంది. నందు పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇవ్వమని భవాని అనగానే.. భవాని చేతిలో చెయ్యి వేసి మరీ మాట ఇస్తాడు మురారి. మరోవైపు కృష్ణ దగ్గరికి గౌతమ్ వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ అని అడుగుతాడు. మీ పెళ్లి గురించే అని కృష్ణ అనగానే.. ఎందుకు ఏ గుళ్ళోనో, ఆర్య సమాజ్ లోనో చేద్దామని ప్లాన్ చేస్తున్నావా అని గౌతమ్ అడుగుతాడు. లేదు ఇంట్లో అందరిని ఒప్పించి గ్రాండ్ గా చేద్దామని అనుకుంటున్నాని కృష్ణ చెప్తుంది. నీకు ఆ భవాని, ఈశ్వర్, ప్రసాద్ ల గురించి తెలియదు. ఎంత మంచి వాళ్ళో.. అంత చెడ్డవాళ్ళు అని గౌతమ్ అంటాడు. ఒకరకంగా నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళే, నన్ను చదివించారు కాని వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అంటే మాత్రం వాళ్ళకి స్థాయి కావాలని గౌతమ్ అనగానే.. ఇప్పుడు మీరు మంచి స్థాయిలో ఉన్నారు. ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారు. చివరి వరకు ఓడిపోయినా, లాస్ట్ కి నేనే గెలుస్తాను. మీ పెళ్లి నేనే చేస్తానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మురారి దగ్గరికి ముకుంద వచ్చి.. నీ భార్య నన్ను అవమానించింది.. నన్ను మధ్యలో వదిలేసిపోయారని ముకుంద అంటుంది. కృష్ణ నాతో మాట్లాడాలని అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అలా చేసావని ముకుందని అడుగుతాడు మురారి. ఇంతలోనే భవాని పిలుస్తుందని వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత కృష్ణ ఇంకా ఇంటికి రాలేదని తనకి ఫోన్ చేస్తాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని స్వీట్స్ పంచిన రాజ్ వాళ్ళ నాన్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -64 లో.. బొమ్మలకు కలర్స్ వేస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. అసలు నిజం చెప్పు నేను వెళ్ళేలోపు నువ్వు మీ అక్కని పంపించేసావ్ కదా అని రాజ్ అడుగుతాడు.. అవును పంపించేసాను. ఇలా చెప్తే మీరు హ్యాపీగా ఉంటారా అని కావ్య అంటుంది. ఒక అమ్మయి అని చూడకుండా అందరి ముందు నన్ను లాక్కొచ్చి నేలమీద పడేసారు. ఇంతకన్నా అవమానం ఎక్కడ అయినా ఉంటుందా.. మీరు చేసిన ఈ అవమానం నేనెప్పటికి మర్చిపోనని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ వాళ్ళ నాన్న వచ్చి సంతోషంగా అందరికి స్వీట్స్ పంచుతుంటాడు. రాజ్ కంపెనీ లో అడుగు పెట్టాడో లేదో పెద్ద కాంట్రాక్ట్ మనకు వచ్చిందని రాజ్ వాళ్ళ నాన్న అందరితో చెప్తాడు. ఇంటి కోడలు అడుగుపెట్టింది పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని రాజ్ నానమ్మ అనగానే.. కష్టపడ్డది మీ పిల్లలు, మనవడు.. వాళ్ళ పేర్లు కాకుండా ఎవరి పేరో ఎందుకని చెప్తారని అపర్ణ అంటుంది. ఎవరు ఏం అనుకున్నా కావ్య ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టడం వల్లనే ఇలా జరిగిందని రాజ్ నానమ్మ అంటుంది. అప్పుడు కావ్య కంగ్రాట్స్ అని రాజ్ కి చెప్తుంది. ఎంత శత్రువు అయినా థాంక్స్ చెప్పాలి.. అది సంస్కారం అని థాంక్స్ అంటాడు రాజ్. నీకు ఏం కావాలో కోరుకో అమ్మ అని కావ్యని రాజ్ వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. ఏం కోరుకోవాలి అమ్మమ్మ గారు.. నా భర్త అందరి నోళ్లు తీపి చేసాడు. కానీ ఒక మూలన ఉన్న నేను అతనికి గుర్తురాలేదని, భర్త ఆదరణ అడగాలా? మనిషిగా నన్ను గుర్తించని ఈ ఇంట్లో నేను ఏమని అడగాలని కావ్య అంటుంది. "నాకు అర్ధమైందమ్మ.. ఎవరికైనా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. నా కోడలు పెట్టిన ఆంక్షల వల్ల నువ్వు ఇన్ని రోజులు నీ పుట్టింటికి దూరంగా ఉన్నావ్.. కనీసం కావ్య ఫ్యామీలీ వాళ్ళతో ఫోన్ లో అయినా మాట్లాడే ఛాన్స్ ఇద్దామని రాజ్ నానమ్మ అనగానే.. వద్దు అక్కడికి ఇక్కడికి రాయబారాలు వద్దని అపర్ణ అంటుంది. కావ్య వాళ్ళ ఇంట్లో ఒక వేళ స్వప్న ఉంటే రెడ్ హ్యాండేడ్ గా పట్టుకోవచ్చని మనసులో రాజ్ అనుకుంటాడు. ఫోన్ లో వద్దు నేనే డైరెక్ట్ గా తన వాళ్ళతో మాట్లాడించి తీసుకొస్తానని రాజ్ అనగానే.. అపర్ణ కోప్పడతుంది. రాజ్ మంచి ఆలోచన చేసాడు అని రాజ్ నాన్న, ఇంట్లో వాళ్ళు అంటారు. ఆ తర్వాత రాజ్, కావ్యలు వెళ్ళిపోతుంటే.. నా మాట అంటే  ఈ ఇంట్లో ఎవరికీ విలువ లేదు అంటూ అపర్ణ బాధపడుతుంది. అలా కాదు అని రాజ్ చెప్పే ప్రయత్నం చేసినా అపర్ణ వినిపించుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధార మెడలో తాళి లేకపోవడంతో రిషి ఫుల్ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -731 లో.. జగతి జయచంద్రతో.. రిషి, వసుధారల గురించి చెప్తుంది. జయచంద్ర వల్ల రిషి వసుధాలు తమ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుసుకున్నారు. వసుధారని ఇక బాధ పెట్టలేను భార్యగా అంగీకరిస్తానని రిషి అనుకుంటాడు. మరోవైపు వసుధార కూడా నేను చేసిన పని వల్ల రిషి సార్ బాధ పడ్డాడు.. నన్ను భార్యగా అంగీకరిస్తాడా అంటూ ఆలోచిస్తూ నిద్రపోతుంది వసుధార. జగతి, దేవయాని ఇద్దరు వసుధార మెడలో ఉన్న తాళి గురించి గొడవపడతారు. రిషిని ఉహించుకొని మనస్ఫూర్తిగా తనని భర్తగా అనుకొని వసుధార తన మెడలో తాళి వేసుకుందని జగతి అంటుంది. దారిన పోయే వాళ్ళందరూ ఉహించుకొని మెడలో తాళి వేసుకుంటే భార్య భర్తలు అయిపోతారా అని దేవయాని అంటుంది. ఇక ఇదంతా నిద్రలో కలకంటూ నా తాళిని ఏం చెయ్యొద్దంటూ కలవరిస్తుంది వసుధార.  మరుసటి రోజు ఉదయం దేవయాని కోపంగా ఈ జయచంద్ర వచ్చినప్పటి నుండి రిషి, వసుధారలు దగ్గరయ్యారు అనుకొని వసు దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా మ్యాటర్ దొరకచ్చని భావిస్తుంది. వసుధార గదికి దేవయాని వెళ్తుంది. అదే సమయంలో వసుధార వాష్ రూమ్ లో ఉంటుంది. వసుధార మెడలోని తాళి బెడ్ పై పడి ఉండడం చూసి అది తీసుకొని రిషి రూమ్ లోకి వెళ్తుంది దేవయాని. రిషి కిటికీ దగ్గర నిల్చొని బయట వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవయాని వస్తుంది. వసుధార వచ్చిందేమో అని రిషి అనుకొని.. రా వసుధార అంటాడు. కాని దేవయాని వచ్చి.. రిషి చూడకముందే ఆ తాళి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇక రిషి వెనక్కి చూసేసరికి వసుధార ఉండదు. తన మెడలోని తాళి అక్కడ ఉండడం చూసి కోపంగా దాన్ని తీసుకొని హాల్లోకి వచ్చి గట్టిగ వసుధార.. వసుధార అని పిలుస్తాడు. అప్పుడు అందరూ హాల్లోకి వచ్చి ఏమైందని రిషిని అడుగుతారు. నన్ను ఉహించుకొని మెడలో ఈ తాళి వేసుకున్నా అని చెప్పావ్ కదా? మరి ఇప్పుడు ఇది ఎందుకు తీసావంటూ రిషి తనపై కోప్పడతాడు. సర్ ఈ తాళి ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదని వసుధార ఏడుస్తుంది. జగతి, మహేంద్ర లు మళ్ళీ ఇదేంటని కంగారుపడుతారు. ఆ తర్వాత ఫణింద్ర ఈ గొడవ మధ్యలో కలుగజేసుకొని.. దేవయాని నువ్వు వసుధార రూమ్ లోకి వెళ్ళడం నేను చూసాను. ఆ తాళి నువ్వే వసుధార దగ్గర నుండి రిషి రూంలో పెట్టావా అని అంటాడు. దేవయాని ఏం చేయలేక.. అవును వసుధార రూంలో తాళి పడిపోయి ఉండడం చూసి రిషికి ఇస్తే.. రిషి మళ్ళీ వసుధార మెడలో వేస్తాడని ఈ విషయం చెబుదామనే లోపు ఇదంతా జరిగిందని కవర్ చేస్తుంది దేవయాని. సారీ వసుధార తప్పుగా అపార్థం చేసుకున్న అని హాగ్ చేసుకుంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జయచంద్ర సూపర్ స్పీచ్.. ఒకరికొకరు గెలిపించుకున్నారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -730 లో పెళ్లి గురించి రిషి, వసుధారలు మాట్లాడిన దానిపై జయచంద్ర  స్టూడెంట్స్ తో పాటుగా ఫాకల్టీకి పోల్ పెడతాడు. వసుధార, రిషిలకి కూడా మీలో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ పేరులోని మొదటి అక్షరాన్ని పేపర్ మీద రాయమని జయచంద్ర చెప్తాడు. అందరు తమ ఒపినియన్ ని పేపర్ పై రాసి బౌల్ లో వేస్తారు. "రిషి సర్ కరెక్ట్. నేను నా వైపు నుండే అలోచించి.. ఇన్ని రోజులు బాధ పెట్టాను" అని వసుధార అనుకొని రిషి పేరు రాస్తుంది. అలాగే రిషి కూడా "వసుధార అలా చెయ్యలేకపోతే నాకు దక్కేదే కాదు కదా.. తను చేసిందే కరెక్ట్" అని రిషి అనుకొని వసుధార పేరుని రాస్తాడు. ఇద్దరు బౌల్ లో వేస్తుండగా.. మీరు ఇద్దరు ఆ పేపర్లు నాకు ఇవ్వమని జయచంద్ర తీసుకుంటాడు. ఆ తర్వాత బౌల్ లో వేసిన పేపర్స్  అన్ని కౌంట్ చెయ్యగా ఇద్దరికి సమానంగా వస్తాయి. ఇంకా లెక్కించాలిసినవి ఉన్నాయని రిషి, వసుధారల పేపర్స్ తీస్తాడు జయచంద్ర. మొదటగా వసుధార రాసిన పేపర్ లో 'R' అక్షరం ఉందని చెప్పగా.. ఆ తర్వాత రిషి రాసిన పేపర్ ఓపెన్ చేసి చూసి 'V' అనే అక్షరం ఉందని జయచంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు ఒకరికొకరు సమర్ధించుకోవడంపై జయచంద్ర మాట్లాడుతాడు. మీరు జీవితంలో ఎదుటి వారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఇద్దరు సమానమే అని తెలుస్తుందని జయచంద్ర చెప్తాడు. పట్టరాని సంతోషంతో జగతి, పక్కనే ఉన్న మహేంద్రతో.. చూసావా మహేంద్ర ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో ఇన్ని రోజులు ఒకరి మీద ఒకరు గెలవాలనుకున్నారు. ఇప్పుడు ఒకరినొకరు గెలిపించుకున్నారని జగతి అంటుంది. మహేంద్ర సంతోషంతో అవునని అంటాడు. ఆ తర్వాత ఇక స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత వసు, రిషిలు ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటా హగ్ చేసుకుంటారు. వెనకాల వైపు నుండి జయచంద్ర చప్పట్లు కొడతాడు‌. అప్పుడు ఇద్దరు దూరంగా జరుగుతారు. ఈ ప్రపంచం మొత్తం అడ్డొచ్చినా మిమ్మల్ని విడదీయలేరు. మీ ప్రేమని నిలబెట్టుకునే బాధ్యత మీదే అని జయచంద్ర అంటాడు. అది రిషి సార్ చేతుల్లోనే ఉంది. మీరు మనది వివాహ బంధమని భావిస్తే ఈ తాళి నా మెడలో ఉంటుంది అని వసు అంటుంది. రిషికి కొంచెం టైం ఇవ్వండని జయచంద్ర అంటాడు. ఆలోచించుకోని మేమంతా సంతోషపడే విషయం చెప్పు అని మహేంద్ర అంటాడు. ఇక అందరూ కలిసి జయచంద్ర కు సెండాఫ్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఈ భవనాలు, ఆస్తులు నాకొద్దు.. నా ఆత్మగౌరవం నాకివ్వండి చాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -63 లో.. రాజ్ కోపంతో కావ్యని లాక్కొచ్చి మీ కుటుంబం మొత్తం నటిస్తూనే ఉంటారా? మోసం చేస్తూనే ఉంటారా? అని రాజ్ అంటాడు. అసలేం జరిగింది? ఇప్పుడు నేనేం తప్పు చేశానని కావ్య అడుగుతుంది. మరి ఇంత అమాయకంగా ఎలా నటిస్తున్నావ్ అని రాజ్ అనగానే.. మాటలు అంటే సరిపోదు.. నేనేం తప్పు చేశానో సాక్ష్యం చూపించమని కావ్య అడుగుతుంది. నేనే సాక్షిని, నా కళ్ళే సాక్ష్యమని కావ్యతో అంటాడు రాజ్. వీళ్ళ అక్క ఎక్కడుందో నాకు తెలిసిపోయిందని, నేను హోటల్ కి వెళ్ళాను కదా.. నా కంటే ముందే హోటల్ కి వెళ్ళి వాళ్ళ అక్కని తప్పించిందని ఇంట్లో వాళ్ళతో చెప్తాడు రాజ్.  మీ అక్కని తప్పించి ఆ ప్లేస్ లో నువ్వు ఉన్నావ్.. మీ అక్క అంటే నీకు అసూయ అని కావ్యని ఇష్టమొచ్చిన మాటలు అంటాడు రాజ్. మా అక్క అంటే నాకు అసూయ ఎందుకు ఉంటుంది. మా అక్క అమాయకురాలు. దాన్ని ఇలా చేసినవాడు ఎవరో కనుక్కుందామని వచ్చానని కావ్య అంటుంది. ఏ చెల్లి అయినా అక్క పెళ్ళి చెడగొడుతుందా? అయినా ఇష్టం లేని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా.. దిక్కులేని పక్షిలా ఆ స్టోర్ రూమ్ లో ఉంటానా? అని కావ్య అంటుంది. మీదంతా నటన అని రాజ్ అంటాడు.  ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు రాజ్ చెప్పిన మాటలు విని కావ్యని తిడతారు. ఎందుకు అందరు ఇలా మాట్లాడుతున్నారు. నేను చెప్పింది ఎవరు వినట్లేదెందుకని కావ్య అంటుంది. నువ్వు హోటల్ కి వెళ్లడం నిజమేనా అని రాజ్ నానమ్మ అడగగా.. వెళ్ళానని కావ్య చెప్తుంది. వెళ్లడం నిజమైతే రాజ్ చేసే ఆరోపణలో నిజం ఉంది కదా.. వాడి ఆవేశంలో అర్థం ఉంది కదా అని రాజ్ నానమ్మ అంటుంది. నేను హోటల్ కి వెళ్తే.. తను ఉన్న కోపంలో అక్కడ ఎవరు ఉన్నది చూసుకోకుండా కోప్పడతాడు? అందరి ముందు ఈ ఇంటి పరువు పోతుంది కదా? మీరు అవునన్నా కాదన్నా నేను ఈ ఇంటి కోడలిని ఈ ఇంటి పరువుపోకుండా కాపాడుకునే బాధ్యత నాకు ఉందని కావ్య అంటుంది. ఈ భవనాలు అంతస్తులు, నగలు నాకేం వద్దు.. నా ఆత్మగౌరవం నాకు ఇవ్వండి చాలని కావ్య అంటుంది. అలా కావ్య అనడంతో రాజ్ ఆలోచనలో పడతాడు. మరోవైపు నీ వల్లనే మనకీ కష్టాలు.. నీ వల్ల స్వప్న అలా తయారయింది. ఇప్పుడు కావ్య అత్తారింట్లో కష్టాలని భరిస్తుందని చెప్పుకుంటూ కనకంని కృష్ణమూర్తి తిడతాడు. మరోవైపు స్వప్న గుడిదగ్గర కూర్చుని.. రాహుల్ కి ఫోన్ చేస్తుంది. మన విషయం ఇంట్లో చెప్పమని స్వప్న అనగానే.. మీ చెల్లెలి వల్ల ఇప్పుడు మన విషయం ఈ ఇంట్లో చెప్పే పరిస్థితి లేదని రాహుల్ అంటాడు. మరోవైపు బొమ్మలకు కలర్లు వేస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నందుకి సీక్రెట్ గా పెళ్ళిచూపులు ఏర్పాటు చేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -124 లో.. కృష్ణ ఏదో ప్లాన్ చేస్తుందని భవాని అనుకుంటుంది. ఇక ముకుంద నువ్వు వెళ్ళు అని భవాని అనగానే.. ఉండనివ్వండి వదిన ముకుంద కూడా మన పార్టీనే అని ఈశ్వర్ అంటాడు. మురారి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ తతంగం అంతా జరిగి నందు మతిస్థిమితం కోల్పోయిందని భవాని అంటుంది. ఏంటి నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది.. పెద్ద అత్తయ్య ఏంటి కృష్ణకి భయపడుతుందని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఇక శాంత అనే ఆమెకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది భవాని. మరోవైపు గెస్ట్ హౌస్ లో కృష్ణ, మురారిలు ఉంటారు.  కృష్ణ కిచెన్ లో ఏదో సౌండ్ అయితే భయపడుతుంది. ఇదే ఆసరాగా తీసుకొని కొద్దిసేపు కృష్ణని ఆటపట్టించాలని ఇంట్లో దెయ్యం ఉందని‌ కృష్ణని బెదిరిస్తాడు మురారి. కృష్ణ నిజంగానే భయపడుతూ కళ్ళు తిరిగిపడిపోతుంది. మురారి వాటర్ చల్లి లేపుతాడు. అదంతా కలగన్నానా అని అనుకుంటుంది కృష్ణ. నాతో ఏదో మాట్లాడాలన్నావ్ చెప్పు కృష్ణ అని మురారి అనగానే.. కాలేజీ లో చెప్తాను అంటుంది కృష్ణ. మరోవైపు రేవతి వాళ్ళని గుడికి పంపించి, నందుకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది భవాని. మురారికి ఫోన్ చేసి.. కృష్ణని కాలేజీకి పంపించాక, నువ్వు ఒక్కడివే ఇంటికి రా అని భవాని చెప్పడంతో.. సరే పెద్దమ్మ అని మురారి అంటాడు. కృష్ణని కాలేజీకి పంపించి మురారి ఇంటికి వస్తాడు. అప్పుడే వస్తున్న మురారిని భవాని పిలిచి.. మన నందు గురించి తెలిసి తనని పెళ్లి చేసుకుంటా అంటున్నారని భవాని చెప్తూ.. నందు పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలని అంటుంది. ఒకసారి అబ్బాయితో మాట్లాడాలని మురారి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు. మా నందుకి మతిస్థిమితం లేదు.. మా నందుని పెళ్లి చేసుకోమని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా అని మురారి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ముకుందని మధ్యలోనే దింపేసిన కృష్ణ ప్లాన్ ఏంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -123లో..  కృష్ణ, ముకుంద, మురారి కలిసి కార్ లో బయటకు వెళ్ళడానికి బయల్దేరే ముందు.. కృష్ణ నువ్వు ముందు కూర్చో, ముకుంద వెనకాల కూర్చుంటుందని మురారి చెప్పడంతో ముకుంద కోపంగా చూస్తుంది. కృష్ణకి సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాకపోవడంతో మురారినే సీట్ బెల్ట్ పెడతాడు. అది చూసి ముకుందకి కోపం ఇంకా పెరుగుతుంది.  మరోవైపు భవాని దగ్గరికి ఈశ్వర్ వచ్చి.. వదిన నందుని అమెరికా పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ ఒక ఫైల్ తీసుకొచ్చి భవానికి చూపిస్తాడు. నందుని అమెరికా పంపించడం ప్లాన్ A అయితే మరి ప్లాన్ B ఏంటి వదిన అని ఈశ్వర్ అడుగుతాడు. అప్పుడు భవాని ఎవరికో కాల్ చేసి.. నేను చెప్పింది చేస్తే మీ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూస్తానని చెప్పగానే.. అవతలివైపు నుండి కాల్ మాట్లాడుతున్న వ్యక్తి సరే అని అంటాడు. ఇదంతా విన్న ఈశ్వర్ మీ ప్లాన్ సూపర్ వదిన.. మీరు గనుక రాజకీయాల్లో ఉంటే బాగుండని చెప్పి‌‌.. అయినా ఇవ్వన్నీ మీకు నచ్చవ్ కదా అంటాడు ఈశ్వర్. కాగా ఆ ప్లాన్ ఏంటో మాత్రం బయటకు రివీల్ చేయలేదు. మరోవైపు "కృష్ణ బాగా ఎండగా ఉంది కదా.. ఆ ఏసీ వేసుకో" అని మురారి అంటాడు. ఇక్కడ నాకు మండుతుంది అని ముకుంద అనగానే.‌. వెనకాల కూడా ఏసీ ఉందని మురారి అంటాడు. ఇక కృష్ణకి దగ్గు వస్తుంటే మురారి వాటర్ బాటిల్ ఇచ్చి తల నిమురుతుంటే ముందు చూసి నడుపు అని ముకుంద అంటుంది. నువ్వు కరెక్ట్ గా చూడలేదంటే, నువ్వు దిగవలసిన షాపింగ్ మాల్ వెళ్ళిపోతే.. మళ్ళీ నువ్వు నడిచి వెళ్ళవలిసి ఉంటుందని మురారి అంటాడు. అవును ముకుంద నువ్వు ఎక్కడ దిగాలని కృష్ణ అడగగానే.. నిన్ను కాలేజీ దగ్గర దింపేసిన తర్వాతే నేను షాపింగ్ మాల్ కి వెళ్తానని ముకుంద అంటుంది. ఏంటి ముకుంద.. నువ్వు మా ప్రైవసీకి అడ్డుగా ఉంటావ్.. నేను సర్ తో పర్సనల్ గా మాట్లాడాలని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత మురారిని కార్ ఆపమని చెప్పి ముకుందని దిగమంటుంది కృష్ణ. అదే మాట మీ ఏసీపీ సర్ ని అనమని చెప్పు కృష్ణ అని ముకుంద అనగానే.. మురారి సైలెంట్ గా ఉంటాడు. ఇక చేసేదేమీలేక ముకుంద కార్ దిగుతుంది. కృష్ణతో మాట్లాడాలని కావాలనే కార్ ఆగిపోయినట్లు యాక్ట్ చేస్తాడు మురారి. ఇక్కడే కంపనీ గెస్ట్ హౌస్ ఉంది.. ఇక్కడ కార్ రిపేర్ అయ్యేలోపు అక్కడకి వెళ్దామని కృష్ణని తీసుకెళ్తాడు మురారి. మరోవైపు ముకుంద ఇంటికి వెళ్తుంది. అక్కడ భవానీతో మాట్లాడుతుంది. మురారీతో కృష్ణ ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట అందుకే నన్ను మధ్యలో దింపేసి వాళ్ళు వెళ్ళారని భవానీతో ముకుంద అనగానే.. "ఏంటి ఈ కృష్ణ.. ఏం ప్లాన్ చేస్తుంది" అని భవాని తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

హోటల్ నుండి స్వప్న తప్పించుకోవడంతో నిరాశచెందిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-62 లో.. స్వప్న ఉన్న హోటల్ దగ్గరికి SI,  రాజ్ వస్తారు. అప్పుడే అక్కడికి కనకం వాళ్ళ అక్క, కనకం వేరే కార్లో వచ్చి రాజ్ ని చూసి దాక్కుంటారు. SI, రాజ్ లని దూరం నుండి చూసిన రాహుల్ వెంటనే ఈ విషయం స్వప్నకి కాల్ చేసి చెప్తాడు. దాంతో స్వప్న లగేజ్ మొత్తం సర్దుకొని.. హోటల్ లోని వెనకాల వైపు దాక్కుంటుంది. స్వప్నని వెతుక్కుంటూ SI, రాజ్ లు వస్తారు. హోటల్ రిసెప్షన్ లో రిజిస్టర్ చూస్తుండగా.. మేనేజర్ వచ్చి స్వప్న 207 రూంలో ఉందని చెప్తాడు. దాంతో ఇద్దరు పరుగున ఆ రూం దగ్గరికి వెళ్ళగా.‌‌. అంతలోనే స్వప్న అదే ఫ్లోర్ లో బిల్డింగ్ వెనకాల వైపు దాక్కుంటుంది. వాళ్ళు ఎంతవెతికినా కనిపించదు. దాంతో రాజ్ సీసీటీవి రూంకి మేనేజర్ ని తీసుకొని వెళ్ళి  చెక్ చేయగా.. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ రోజు డాటా తప్ప ఏమీ లేదు అంతా పోయిందని అక్కడ సీసీటీవి మానిటర్ చేసే వ్యక్తి చెప్తాడు. దాంతో మేనేజర్ అతడిని తిడతాడు. స్వప్న మళ్ళీ పారిపోయిందని అనుకుంటాడు. అదే సమయంలో రిసెప్షన్ దగ్గరికి కావ్య వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మేనేజర్ స్వప్న నాకు గుండు చేసి పారిపోయిందని చెప్పగా కావ్య షాక్ అవుతుంది. సీసీటీవి రూం నుండి బయటకు వచ్చిన రాజ్ ..రిసెప్షన్ దగ్గర ఉన్న కావ్యని చూసి తనని చేయి పట్టుకొని లాక్కొని కార్ లో తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత స్వప్నని వెతుక్కుంటూ కనకం వాళ్ళ అక్క, కనకం రాగా.. స్వప్న తన రూం బిల్ కట్టలేదని చెప్పి వారి దగ్గర మేనేజర్ డబ్బులు తీసుకుంటాడు. హోటల్ బయట కార్ లో ఉన్న రాహుల్.. ఆ హోటల్ సీసీటీవి మానిటర్ చేసే వ్యక్తికి కాల్ చేసి.. నేను చెప్పి‌న పని అయిపోయిందా అని అడుగగా.. అయిపోయింది సర్ అని అతను అంటాడు. నీ అకౌంట్ లో కాసేపట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి చూసుకోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందని అనుకొని ఇంటికొస్తాడు రాహుల్. అప్పుడే కావ్యని చేతితో లాక్కొచ్చి పడేస్తాడు రాజ్. ఆ తర్వాత అందరూ ఏమైందని రాజ్ ని అడుగగా‌.. కావ్యని ఇష్టమొచ్చినట్టు మాటలు అంటాడు. మీ కుటుంబం అంతా మాయ చేస్తూనే ఉంటారు.. మోసం చేస్తూనే ఉంటారా.. ఇలా నటిస్తూనే ఉంటారా అని కావ్యని రాజ్ అనగా.‌. అసలు ఏం అయిందని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి, వసుధార పెళ్లి గోల! స్టూడెంట్స్ పోల్ లో ఎవరు గెలవనున్నారు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-729లో.. కాలేజ్ లోని లైబ్రరీలో జయచంద్ర ఉండగా జగతి వచ్చి మాట్లాడుతుంది. రిషి తన కొడుకని, వసుధార-రిషి ప్రేమించుకున్నారని, అనుకోని పరిస్థితుల్లో వసుధార తన మెడలో తాళి వేసుకుందని జరిగిందంతా జయచంద్రకి అర్థం అయ్యేలా చెప్తుంది. వారిద్దరికి అర్థం అయ్యేలా ఈ సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలని  జయచంద్రతో జగతి చెప్పడంతో... సరే అలాగే చేస్తానని జయచంద్ర చెప్తాడు.‌ ఇక మోటివేషనల్ స్పీచ్ మొదలవుతుంది. ఏదైనా ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడదామని స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. మీరే ఏదైనా టాపిక్ చెప్పండని జయచంద్ర స్టూడెంట్స్ ని అడగగా.. కొందరు పాలిటిక్స్, మరికొందరు వేరే వేరే టాపిక్స్ గురించి చెప్పగా అవన్నీ మనం ప్రతీరోజు న్యూస్ లో, పేపర్లో చూస్తామని చెప్తాడు. ఆ తర్వాత జయచంద్రనే ఒక టాపిక్ గురించి చెప్పమంటారు స్టూడెంట్స్. దాంతో భారతీయ వివాహ బంధం గురించి స్పీచ్ ఇస్తుంటాడు జయచంద్ర. భారతీయ వివాహ బంధం చాలా గొప్పదని, దీనిని విదేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, ఇప్పుడిప్పుడే అక్కడ మన భారతీయ పద్దతిలో వివాహాలు జరుగుతున్నాయని, ఇందులో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు ఉంటాయని జయచంద్ర వివరిస్తాడు. అయితే ఈ స్పీచ్ వింటున్న రిషి తన పక్కనే ఉన్న వసుధారతో..  "విన్నావా వసుధార.. ఆ ఎనిమిది రకాలలో ఏ ఒక్కటి అయినా జరిగిందా.. నువ్వు తాళి వేసుకుంటే అది పెళ్ళి కాదు" అని చెప్తాడు. దాంతో ఉద్వేగంతో సోఫాలో కూర్చున్న వసుధార పైకి లేచి.. సర్ ఎనిమిది రకాల వివాహాలే కాదు సర్.. తొమ్మిదవ రకం ఉంది. అదే ఆపత్కాల వివాహమని వసుధార చెప్పగా.. ఏం మాట్లాడాలన్నా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని జయచంద్ర చెప్తాడు. తను బాగా ఇష్డపడిన వ్యక్తిని ఊహించుకొని తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన మెడలో తాళి వేసుకుంటే అది అపత్కాల వివాహమని వసుధార చెప్పగా.. నాకొక డౌట్ ఉందని రిషి అంటాడు. తనని స్టేజ్ మీదకి వచ్చి చెప్పమంటాడు. అలా ఒకరిని ఊహించుకుని మెడలో తాళి వేసుకుంటే అది ఊహే అవుతుంది తప్ప పెళ్ళి కాదని రిషి అనగా.. అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతారు. రిషి, వసుధారలు వీరిద్దరు మాట్లాడి‌న దాంట్లో నిజం ఉంది. ఇద్దరూ కరెక్టే.. కానీ మీకు ఎవరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందో వారి పేరుని పేపర్ లో రాసి ఇక్కడ బాక్స్ లో వేయండని జయచంద్ర చెప్తాడు. అలా జయచంద్ర స్టూడెంట్స్ తో పాటు ఫ్యాకల్టీకీ ఒపినియన్ పోల్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నందుని అమెరికాకి పంపించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -122 లో.. రేవతిని ఈశ్వర్ మా వదినకే ఎదురు మాట్లాడుతావా అని కోప్పడతాడు. ఇక రేవతి వెళ్లిపోగానే.. "ఏంటి ఈశ్వర్.. రేవతిపై అలా అరిచావు?" అని భవాని అడుగుతుంది. మరోవైపు కృష్ణ తలస్నానం చేసి సాంబ్రాణి ధూపం వేసుకుంటుంటే మురారి వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. మీరేం హెల్ప్ చేస్తారని కృష్ణ అంటుంది. నువ్వు క్షమించేవరకు నీకు హెల్ప్ చెయ్యాలి కదా అని మురారి అంటాడు. ఇంతలో రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని మురారి చెప్పినా కూడా పట్టించుకోకుండా.. కృష్ణతో గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్తూ.. ఈ కాఫీ నీకే అమ్మా అని రేవతి ఇస్తుంది. ఇక నందుని ట్రీట్ మెంట్ కోసం అమెరికాకి పంపిస్తున్న విషయం కృష్ణకి రేవతి చెప్పగానే కృష్ణ షాక్ అవుతుంది. మంచిదేగా అని మురారి అంటాడు. నువ్వు నందు గురించి మీ ఏసీపీ సర్ కి చెప్పలేదా అని రేవతి అడుగుతుంది. లేదు అత్తయ్య చెప్పలేదు.. సర్ ని బయటకు తీసుకెళ్ళి చెప్తానని కృష్ణ అంటుంది. అయినా ఈ ఏసీపీ సర్ కూడా ఆ పెద్దమ్మ కొడుకే కదా అని రేవతి అంటుంది. కృష్ణ, రేవతిలు ఏం మాట్లాడుకుంటున్నారో మురారికి అసలు అర్థం కాదు. మరోవైపు భవాని ముందు ఏదో ఫైల్ తీసుకొచ్చి పెడతాడు ఈశ్వర్. ఈ ఫైల్ ఏంటి ఈశ్వర్.. కృష్ణ చుస్తే లేనిపోని డౌట్. ఇప్పటికే రేవతి, నందుని అమెరికా పంపిస్తున్న విషయం చెప్పేసి ఉంటుంది. కానీ నందు వెళ్ళడం మాత్రం ఆగకూడదు. వీసా ఏర్పాట్లు చూడమని ఈశ్వర్ తో చెప్తుంది భవాని. మరోవైపు ముకుంద, మురారి గురించి ఆలోచిస్తుండగా.. ముకుంద దగ్గరికి అలేఖ్య వెళ్ళి.. "బావగారు బయటకు వెళ్తున్నారు.. వెళ్ళేటప్పుడు చెప్పమన్నావు కదా" అని చెప్పగానే.. అవునవను అంటూ త్వరగా ముకుంద వెళ్తుంది. ఆ తర్వాత "కృష్ణ నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది. నన్ను క్షమించమని అడగాలి" అని అనుకుంటాడు మురారి. ఇంతలో ముకుంద మురారి దగ్గరికి వచ్చి.. పదా వెళ్దామని అంటుంది. నేను నీకోసం కాదు, కృష్ణ కోసం ఎదురుచూస్తున్న అని మురారి అనగానే.. తనని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్దామని ముకుంద అంటుంది. ఇంతలో అక్కడికి కృష్ణ వస్తుంది. " నేను షాపింగ్ కి వెళ్ళాలి కృష్ణ.. నేను కూడా మీతో వస్తాను" అని ముకుంద అడిగేసరికి.. సరే నిన్ను షాపింగ్ దగ్గర డ్రాప్ చేసి మేం వెళ్తామని కృష్ణ చెప్తుంది. ముకుంద నువ్వు వెనకాల సీట్లో కూర్చో, కృష్ణ నువ్వు ముందు సీట్లో కూర్చోమని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధారని రిషి ముద్దుపెట్టుకున్నాడా.. జయచంద్రకి పెరిగిన అనుమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -728 లో.. ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉంటే జయచంద్రకి అనుమానం వస్తుందని రిషి, వసుధార గది దగ్గరికి వెళ్తాడు. సర్ మీరు మళ్ళీ వచ్చారా అని అడుగుతుంది వసుధార. ఏ రాకూడదా అని రిషి అంటాడు. వసుధారకి దగ్గరగా రిషి వెళ్తుంటే.. ముద్దు పెట్టడానికి వస్తున్నాడేమో అనుకొని.. వసుధార కళ్ళు మూసుకుంటుంది. కానీ రిషి వసుధార పక్కన ఉన్న దిండుని తీసుకుంటాడు. ఇంతలోనే ధరణి వచ్చి రిషి నువ్వు ఇక్కడే పడుకుంటావా అని అడుగుతుంది. లేదు వదిన.. నా రూమ్ లో గాలి రావట్లేదు. అందుకే చల్లగాలి కోసం పైకి వెళ్తున్నానని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు. ఆ తర్వాత రిషి వెనకాల వసుధార వెళ్లి తన చున్నీతో గాలి విసురుతుంది. మీరు జయచంద్ర సర్ కి డౌట్ రావద్దని అలా చేస్తున్నారు కదా అని వసుధార అడగగానే.. నేను సమస్యని పెద్దగా చెయ్యద్దని అనుకొని అలోచించి ఇక్కడికి వచ్చాను అని రిషి అంటాడు. కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రిషి నిద్రపోతాడు. ఉదయం లేచి రిషి, వసుధారలు జయచంద్రకి కాఫీ తీసుకొని వెళ్తారు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో జయచంద్ర తన మాటల్లో వాళ్ళకి అర్థమయ్యేలా వివరిస్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలతో పాటుగా జయచంద్ర కాలేజీకి వెళ్తాడు. కార్ లో వెళ్తుంటే మాటి మాటికి రిషిని సర్ సర్ అనడం గమనించిన జయచంద్ర.. ఏంటమ్మా వసుధార.. రిషిని సర్ అని పిలవకు.. బంధంతో‌ పిలిస్తేనే ఆ బంధం బలపడుతుంది.. ఆ పిలుపు మార్చుకోమని అంటాడు. సరే సర్  నెక్స్ట్ టైం మారుస్తుందని రిషి అంటాడు. రిషి అలా అనేసరికి నిజంగానా సర్ అంటూ వసుధార ప్రేమగా రిషి చెయ్యి పట్టుకుంటుంది. కాలేజీకి వెళ్ళాక జయచంద్ర దగ్గరికి జగతి వెళ్ళి.. సర్ మీరు రెండు జీవితాల మధ్య బంధాన్ని నిలబెట్టాలి.. రిషి నా కొడుకు.. వసుధార, రిషి లు భార్యాభర్తలు.. వాళ్ళిద్దరు చాలా మంచివాళ్ళని జయచంద్రకి జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

స్వప్న ఆచూకి తెలిసిపోయిందని చెప్పిన రాజ్.. కనకంకి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -61లో.. కావ్య గదిలో నుండి రాజ్ మెల్లిగా బయటకొచ్చి తలుపు వేస్తుండగా కళ్యాణ్ వస్తాడు. అయ్యో.. ఎవడైతే చూడొద్దనుకున్నానో వాడే చూసాడని కళ్యాణ్ ని చూసి రాజ్ తన మనసులో అనుకుంటాడు. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగగా..‌ ఇక్కడ ఏం జరుగలేదు. నువ్వేదో అర్థం చేసుకొని‌ ఇంట్లో వాళ్ళకి ఇంకేదో చెప్పకు అని రాజ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రాజ్ కి ఎస్ఐ కాల్ చేసి స్వప్న ఎక్కడుందో ఆచూకీ తెలిసిందని చెప్పడంతో నేను కూడా వస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ తన గది నుండి హాల్లోకి వచ్చి కావ్య అని గట్టిగా అరిచేసరికి అందరూ ఏం అయిందని అడిగినా రాజ్ సమధానం చెప్పడు. కావ్య రాగానే.. ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్ళావ్? అని అడుగగా.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళానని కావ్య చెప్తుంది. పెళ్ళిల్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళ అక్క కనపడట్లేదని కంప్లెంట్ ఇవ్వడానికి వెళ్ళిందని రాజ్ చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. దుగ్గిరాల ఇంట్లోని ఆడవాళ్ళు బయటకు వెళ్ళడమే తప్పు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం మరో తప్పు అని రాజ్ నానమ్మ అంటుంది. ఇప్పటివరకు నువ్వు తెలివైనదానివని, లక్షణమైనదానివని చెప్పిన అత్తయ్య మామయ్యలే నువ్వు చేసింది తప్పని అన్నారు. మళ్ళీ మీ అక్క కోసం వెళ్ళడమేంటని అపర్ణ అడుగుతుంది. క్షమించండని కావ్య అంటుంది. "నేనే ప్రశ్నార్థకంగా మారాను ఈ ఇంట్లో.. ఎవరిని సాయం అడగాలో తెలియలేదు. కాని షరతులను ఉల్లంఘించలేదు. మా అక్క కనిపించలేదనే కంప్లెంట్ ఇచ్చాను. కానీ నా వాళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు" అని కావ్య చెప్తుండగా..‌ చాలు ఆపని రాజ్ అంటాడు. నువ్వు ఈ ఇంటికి ద్రోహం చేసావ్. మీ అక్క లేచిపోయిందని రాజ్ అనగా.. చాలు ఆపండి. మా అక్కని ఎవరో ట్రాప్ చేసారు‌. తను ఎక్కడుందో తెలిస్తే నిజాలన్నీ బయటకొస్తాయని కావ్య అనగా.. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావని రాజ్ చెప్పేసి.. స్వప్నని తీసుకురావడానికి ఒక్కడే వెళ్తాడు. ఆ తర్వాత కనకంకి కళ్యాణ్ కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. రాజ్ అన్నయ్య కన్నా ముందు మీరు ఆ హోటల్ కి వెళ్ళి స్వప్నని తీసుకెళ్ళండని కనకంకి కళ్యాణ్ చెప్పగా, సరేనని కనకం వాళ్ళ అక్కకి కాల్ చేసి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత కనకం వాళ్ళ అక్క, కనకం బయల్దేరి స్వప్న ఉన్న హోటల్ దగ్గరికి వస్తారు. అప్పుడే హోటల్ దగ్గర ఎస్ఐ, రాజ్  కలిసి ఉండటం గమనించిన కనకం, వాళ్ళ అక్క భయపడతారు. మరోవైపు స్వప్న కోసం ఫుడ్ తీసుకొస్తున్న రాహుల్ హోటల్ బయట ఉన్న ఎస్ఐ, రాజ్ లని చూసేస్తాడు. ఆ విషయం స్వప్నకి కాల్ చేసి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గీతు, ఆదిరెడ్డి మధ్య క్లాషెస్ వచ్చాయా?

బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమ్ సంపాదించుకున్న వారిలో గీతు రాయల్ ఒకరు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఒక రివ్యూయర్ గా ఉండి తనకు నచ్చిన వీడియోలని యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ఒక సాధారణ యూట్యూబర్. అలా బిగ్ బాస్ సీజన్-5కి రివ్యూ చేసి.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 లో ఛాన్స్ కొట్టేసింది గీతు.‌ బిగ్ బాస్ లో‌కి అడుగుపెట్టినప్పటి నుండి తన యాటిట్యూడ్ తో హౌస్ మేట్స్ తో గొడవలు పెట్టుకుంటూ, తనదే నెగ్గాలన్న వైఖరితో  ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. దాంతో ఎక్కువ ఫ్యాన్ బేస్ సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది గీతు. బిగ్ బాస్ తో ఫేమ్ వచ్చినా కూడా తనకి తగినన్ని అవకాశాలు రాకపోవడం గీతూకి నిరాశ కలిగించింది. దీంతో చిన్న చిన్న ఈవెంట్స్ లో సైతం పాల్గొంటూ.. బిగ్ బాస్ రీ యూనియన్ పేరుతో వ్లాగ్ లు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్.. లెట్స్ ఫన్' అంటూ తన స్టేటస్ లో పోస్ట్ చేసింది. గీతు అభిమానులు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడగగా.. వాటిలో‌ కొన్నింటికి తనదైన స్టైల్ లో సమధానాలు తెలిపింది‌ గీతు. మీకు ఆదిరెడ్డికి క్లాషెస్ వచ్చాయా? చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఇది.. క్లారీఫై చెయ్యండని ఒక అభిమాని అడుగగా... క్లాషెస్ అంటూ ఏం లేవు. తన పనుల్లో బిజీగా ఉన్నాడు.. కలవడం కుదరట్లేదు అంతే. నాకేమైనా ప్రాబ్లెమ్ వస్తే తనే ముందుంటాడని క్లారిఫై చేసింది గీతు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని మరొకరు అడుగగా.. ఒక ఏజ్ వచ్చాక ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లా అనిపించరేమో అంటూ సమాధానం ఇచ్చింది గీతు. మీ జీవితంలో జరిగిన పెద్ద విషాదకర సంఘటన ఏంటని ఒకరు అడుగగా.. మా అన్న చనిపోవడం, బిగ్ బాస్ ఎలిమినేషన్, నా ఫేవరెట్ పర్సన్ టర్నింగ్ ఇన్ టూ బిగ్గెస్ట్ లెస్సన్ ఫర్ లైఫ్ అంటూ సమాధానమిచ్చింది గీతు. ఆర్జే సూర్య బ్లెస్సింగ్ రా నానా.. అని మెసేజ్ చేయగా.. "రేయ్ నానా.. నీ ఫేస్ నాకు చూపించకు. ఐ డోంట్ లైక్ ఇట్. బిబి జోడి విన్నర్ అంట.. ఒక చిన్న పార్టీ లేదు. పెద్దొళ్ళు అయ్యిపోయారురా నానా.. మేమెక్కడ గుర్తుంటాంలే ఇంకా.. మనం 8th week, 9th week ఎలిమినేషన్ బ్యాచ్ రా .. అది మర్చిపోకురా నానా.." అంటూ సమాధనమిచ్చింది గీతు. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక మొదట్లో ఆదిరెడ్డి, అతని భార్య కవితతో కలిసి కొన్ని వీడియోలు తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది గీతు. కాగా ఇప్పుడు అలాంటివేం లేకపోవడంతో ఆదిరెడ్డి, గీతూలకి క్లాషెస్ వచ్చాయేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. గీతు మాత్రం అలాంటివేం లేవంటుంది.

వెన్నెల కిషోర్ ‘అలా మొదలైంది’లో నిఖిల్-పల్లవి ప్రేమ కథ!

ఈటీవీలో ప్రసారమవుతున్న కొత్త ప్రోగ్రాం 'అలా మొదలైంది'. వెన్నెల కిషోర్ మొదటిసారి యాంకరింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి గెస్ట్ లుగా నిఖిల్, పల్లవి దంపతులు వచ్చారు.  కార్తికేయ-2 తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్.. ఈ షోకి రావడంతో కొంత ఆసక్తి కలిగిందనే చెప్పాలి. నిఖిల్ ని వారి లవ్ స్టోరీ షేర్ చేయమని వెన్నెల కిషోర్ అడగగానే.. మీకు తెలిసిందే కదా అని నిఖిల్ అనగా.. అసలు బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగిందని చెప్పమన్నాడు కిషోర్. నిఖిల్ తన లవ్ ఎలా మొదలైందో ఫ్రమ్ ది బిగినింగ్ స్టార్ట్ చేసాడు. పల్లవి, నిఖిల్ ఇద్దరు ఒక పార్టీలో కలిసారని, వాళ్ళ ఫ్రెండ్ బ్రేకప్ కి పల్లవి, నిఖిల్ కలిసి హెల్ప్ చేసారని చెప్తుండగా.‌. ఇదేదో 'ఖుషి' మూవీ స్టోరీలా ఉంది అని వెన్నెల కిషోర్ అనగానే.. ఇద్దరు నవ్వుకున్నారు. ఇక ఆ తర్వాత అలా మెల్లిమెల్లిగా తన మీద క్రష్ ఏర్పడిందని నిఖిల్ అనగా.. 'పరిచయం అయిన గంటకే నాకు ప్రపోజ్ చేసాడు' అని పల్లవి చెప్పగా.. ఏంటి భయ్యా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని వెన్నెల కిషోర్ అన్నాడు. ఆ తర్వాత తన ఇంట్లో వాళ్ళని ఒప్పించడం పెద్ద సమస్యని పల్లవి చెప్పుకొచ్చింది. మరి లవ్ అంటే మీ ఇంట్లో ఏం అనలేదా భయ్యా అని నిఖిల్ ని వెన్నెల కిషోర్ అడుగగా.. "ఫస్ట్ ఒప్పుకుంది మా అమ్మే.. తనకి నేను పెళ్ళి చేసుకోవడమే కావాలి. అందుకే ఈజీ అయిపోయింది" అని నిఖిల్ అనగా.. నిజానికి మొదట నిఖిల్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాకే మా ఇంట్లోవాళ్ళతో లవ్ చేస్తున్నట్టుగా చెప్పానని పల్లవి అంది. నా లైఫ్ లో ఒక అబ్బాయి ఉన్నాడని మా అమ్మనాన్నలతో చెప్పడంతోనే.. అబ్బాయి డాక్టరే కదా? అని అడిగారు.. దాంతో ఏం చెప్పాలో తెలియక బిజినెస్ మ్యాన్ అని చెప్పానని పల్లవి అంది. ఆ తర్వాత ఒకరోజు తనకి చెప్పకుండా గోవాకి తీసుకెళ్ళాను.. అసలు తన ఒంటి మీద డ్రెస్ తప్ప బట్టలు, లగేజీ ఏమీ తీసుకురాలేదు.. గోవాలో దిగాక తీసుకున్నాం అని నిఖిల్ అనగా... అక్కడ నాకు ఒక సర్ ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసాడు కానీ ఆ రెండు రోజులు గోవాలో ఫుల్ వర్షం దాంతో అతను వేసిన సెటప్ మొత్తం వర్షంలో పోయింది. ఆ తర్వాత రోజు ఎర్రగులాబీలతో తన దగ్గరికి వెళ్ళి ఐ వాన్నా అని నేను ప్రపోజ్ చేయడం పూర్తి చేయకుండానే.‌.. ఆ ఓకే ఓకే అని పల్లవి పూలు తీసుకుందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇది విని‌ పల్లవితో పాటు వెన్నెల కిషోర్ నవ్వుకున్నాడు. 'అలా మొదలైంది' ద్వారా నిఖిల్, పల్లవి లవ్ అలా మొదలైందని తెలిసింది.

మురారిని ఇంకా క్షమించని కృష్ణ.. సంతోషంలో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121లో.. మురారి తనని క్షమించమని కృష్ణని అడుగుతాడు. అయినా కృష్ణ క్షమించకుండా నందు రూమ్ లోకి వెళ్తుండగా.. "మరి నేనేం చెయ్యాలి కృష్ణ.. చచ్చిపోనా" అని మురారి అనేసరికి కృష్ణకి గుండె ఆగినంత పని అవుతుంది. "ఏసీపి సర్.. ఏంటా మాటలు" అని కంటతడి పెట్టుకొని వెనక్కి వచ్చి మురారితో మాట్లాడుతుంది. అవును కృష్ణ నువ్వు నన్ను క్షమించకపోతే ఏదోలా ఉందని మురారి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ గురించే ఆలోచిస్తూ మురారి హాల్లోనే పడుకుంటాడు. కృష్ణ కూడా మురారితో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఉదయం ముకుంద లేచి హాల్లోకి వచ్చేసరికి మురారి హాల్లో పడుకోవడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ, మురారిల మధ్యలో మాటలు కూడా లేవా.. ఇన్ని రోజులు మురారిని అపార్థం చేసుకున్నా అని ముకుంద అనుకుంటుంది. మురారి మాత్రం నిద్ర లేచి మళ్ళీ కృష్ణని క్షమించమని అడగాలి అని కృష్ణ దగ్గరికి వెళ్తాడు. అలా తను వెళ్లేసరికి కృష్ణ పడుకునే ఉంటుంది. మురారి మాత్రం కృష్ణను చూస్తూనే ఉంటాడు. ఇక కృష్ణ లేచి మురారితో పాజిటివ్ గా మాట్లాడుతుంది. కృష్ణ నన్ను క్షమించవా అని మురారి అడుగుతాడు. నిన్ను క్షమించాలంటే నాకు ఒక హెల్ప్ చెయ్యాలని కృష్ణ చెప్తుంది. ఏం చేయాలి చెప్పు కృష్ణ చేస్తాను అని మురారి అంటాడు. ఇద్దరు మేజర్ లకు పెళ్లి చెయ్యాలని నందు, గౌతమ్ లను దృష్టిలో పెట్టుకొని అంటుంది. ఎవరికి పెళ్లి చెయ్యాలి కృష్ణ అని మురారి అడగగానే.. టైం వచ్చినప్పుడు చెప్తాను. ముందు మీరు మాటివ్వండని కృష్ణ అనగానే సరే చేస్తానని మురారి మాటిస్తాడు. మరోవైపు భవాని, రేవతిని పిలుస్తుంది. నేను నందుని అమెరికాలో ఉన్న మా అక్క దగ్గరికి పంపిస్తున్నాను.. నీ కోడలిని ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పమని భవాని అంటుంది. నందు ఆరోగ్యం బాగుండాలనే కృష్ణ చూస్తుంది కదా అక్క.. కృష్ణ తో ట్రీట్మెంట్ ఇప్పిస్తే నందు బాగుంటుంది కదా అక్క అని రేవతి అంటుంది. ఇంతలోనే ఈశ్వర్ వచ్చి రేవతిని కోప్పడి చెప్పింది చేయమని అంటాడు. చివరికి మంచి గెలుస్తుందని రేవతి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గుడిలో కావ్యని ఎత్తుకొని ప్రదక్షిణలు చేసిన రాజ్.. సంతోషంలో కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -60 లో.. దుగ్గిరాల ఫ్యామిలీ కొత్తగా పెళ్లి అయిన  కావ్య, రాజ్ జంటను గుడికి తీసుకొస్తారు. రాజ్, కావ్య ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తుండగా.. కావ్య కాలు బెణకడంతో తను నడవలేకపోతుంది. ప్రదక్షిణలు మధ్యలో అపవద్దని పంతులు చెప్పినా రాజ్ వినడు. దీంతో రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య కావ్యని ఎత్తుకొని ప్రదక్షిణలు చేయమని రాజ్ కి చెప్తాడు. కావ్య మొదట్లో వద్దు నేను నడుస్తానని చెప్పినా.. ఆ తర్వాత కావాలని పంతంతో.. నడవలేక పోతున్నాను అని కావ్య అనడంతో.. కావ్యని ఎత్తుకొని రాజ్ ప్రదక్షిణలు చేస్తాడు.  రాజ్, కావ్య లను చూసి మారువేషంలో ఉన్న స్పప్న అసూయపడుతుంది. ఇక అక్కడే చాటునుండి చూస్తున్న కనకం, మీనాక్షి ఇద్దరు సంతోషపడతారు. మరోవైపు అపర్ణ చిరాకుగా చూస్తుంది. ఆ తర్వాత పంతులు గారు ప్రసాదం తీసుకోమని చెప్పి ఈ ప్రసాదం ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్తాడు. రాజ్ కావ్యకి, కావ్య రాజ్ కి ప్రసాదం తినిపిస్తుండగా.. మధ్యలోకి బోనంతో స్వప్న పరుగున వెళ్తూ.. ఆ ప్రసాదాన్ని కావాలని నెట్టివేస్తుంది. కానీ కిందపడిపోకుండా రాజ్ పట్టుకుంటాడు. అది చూసి మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు ప్రయత్నస్తున్నారని రాజ్ నానమ్మ అంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు ప్రసాదం తినిపించుకుంటారు. ఇదంతా దూరం నుంచి చూసి మురిసిపోతుంటుంది కనకం. అలా చూస్తున్నప్పుడు అనుకోకుండా కనకంని దుగ్గిరాల ఫ్యామిలీ చూస్తారు. అపర్ణ కోపంగా కనకంని తక్కువ చేసి మాట్లాడుతూ.. మీరు ఇంకోసారి కలవాలని ప్రయత్నిస్తే.. మీ కూతురు మీ ఇంటికి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది. మా అమ్మ అనుకోకుండా ఈ గుడికి వచ్చింది. తన తప్పేం లేదని కావ్య అంటుంది.  మరోవైపు స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. మీరు చెప్తే నమ్మలేదు కానీ ఈ రోజు చుస్తే కావ్య గురించి అర్థం అయిందని స్వప్న అంటుంది. మరో వైపు రాజ్ కి పోలీస్ స్టేషన్ నుండి SI ఫోన్ చేస్తాడు. మీ భార్య.. వాళ్ళ అక్క కన్పించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. తన గురించి వెతుకుతున్నాం.. అదే విషయం చెప్పాడానికి తనకి కాల్ చేస్తే కాల్ కలవటం లేదు. మీరు మీ భార్యకి చెప్పండని కాల్ కట్ చేస్తాడు SI. రాజ్ కోపంగా కావ్య దగ్గరికి వెళ్తూ రూమ్ ముందే ఆగిపోతాడు. లోపలికి వెళ్లొద్దని ఆలోచించి, రేపు మాట్లాడుతానని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జయచంద్ర ‌ఆశీర్వాదం తీసుకున్న వసుధార.. ‌మీరిద్దరు ఒక్కటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -727 లో.. రిషి,‌ వసుధారలు గెస్ట్ గా వచ్చిన జయచంద్రకి గది చూపిస్తారు. ఇంతలో అక్కడ వసుధార చున్నీ పడి ఉండడం గమనించిన వసుధార.. జయచంద్ర దానిని చూడకముందే తీసెయ్యాలని అనుకొని రిషికి సైగ చేస్తూ ఉండగా.. జయచంద్ర ఆ చున్నీని చూస్తాడు. ఇంతకుముందు ఈ గదిలో ఆడవాళ్ళు ఉండేవాళ్ళా అని జయచంద్ర అడుగుతాడు. వసుధార ఆ చున్నీని తీసి చేత్తో పట్టుకుంటుంది. రిషి డైవర్ట్ చేస్తూ.. మీరు మా గెస్ట్ మీకు నచ్చినట్లు ఉండండి సర్ అని అంటాడు. మీకు భోజనం ఇక్కడికి తీసుకురావాలా? అక్కడకు వస్తారా అని రిషి అడిగేసరికి.. మీకు ఏది నచ్చితే  అది చెయ్యండని జయచంద్ర అంటాడు. మీరు మా అందరితో కలిసి భోజనం చేస్తే బాగుంటుందని రిషి అనగానే సరేనంటాడు జయచంద్ర. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుండగా వసుధారని రిషి పక్కన కూర్చోమంటాడు జయచంద్ర. వసుధార, రిషిలను అనుమానం వచ్చినట్లు జయచంద్ర చూస్తుంటాడు. అది కవర్ చేయడానికి వసుధార కావాలనే.. సర్ ఇది వేసుకోండి, అది వేసుకోండి అని అంటూ ఉంటుంది. నువ్వు ఏంటమ్మా సర్ అంటున్నావ్ అని జయచంద్ర అడగగా.. నాకు అలా అలవాటయిందని చెప్తుంది వసుధార. మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అని జయచంద్ర అడుగుతాడు. వాళ్ళది అసలు మ్యారేజే కాదని దేవాయని చెప్తుండగా.. మన ఫ్యామిలీ విషయాలు ఇప్పుడు డిస్కస్ చెయ్యడం కరెక్ట్ కాదు పెద్దమ్మ అని రిషి అంటాడు. ఆ తర్వాత జయచంద్ర దగ్గరికి వాటర్ తీసుకొని వసుధార వెళ్తుంది. మీకు పెళ్లి అయ్యి ఎన్ని ఏళ్ళు అవుతుంది. మీ ఇద్దరి కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది.. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉన్నట్టుగా కనిపిస్తుంది.. నువ్వు ఎంత కష్టమైనా భరిస్తావ్.. మీ కళ్ళలో ప్రేమతో పాటు బాధ కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు విడిగా ఉండకండని జయచంద్ర చెప్తాడు. సరే సర్ అని జయచంద్ర ఆశీర్వాదం తీసుకొని  వెళ్లిపోతుంటే డోర్ దగ్గర రిషి ఉంటాడు. రిషి కళ్ళలోకి చూసి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత రిషి జయచంద్ర దగ్గరికి వస్తాడు. సీత లాంటి భార్య దొరికింది.. అలా అని ఆమె ప్రేమకు పరీక్షలు పెట్టకు.. మీరు ఇద్దరు వేరు‌వేరు కాదు ఒక్కరే.. సంతోషంగా ఉండండని జయచంద్ర చెప్తాడు. సరే గుడ్ నైట్ సర్ అని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార దగ్గరికి రిషి వెళ్తాడు. జయచంద్ర చెప్పిన మాటలన్నీ రిషితో చెప్తుంది వసుధార. సరే గుడ్ నైట్ అని రిషి వెళ్ళిపోతాడు. మేము ఇలా ఇద్దరం వేరు వేరు రూమ్ లలో పడుకుంటే సర్ కి డౌట్ వస్తుందేమోనని రిషి‌ మళ్ళీ వసుధార దగ్గరికి వెళ్తాడు. సర్ మళ్ళీ వచ్చారేంటని వసుధార అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కొత్త కారు కొన్న ఇనయా.. మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసినట్టేనా!

ఇనయ ముజిబుర్ సుల్తానా.. బిగ్ బాస్ సీజన్-6 ముందు వరకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ సీజన్-6 తో ఫుల్ ఫేమస్ అయింది. రామ్ గోపాల్ వర్మతో చిందులు వేసిన వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకొని, బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. లేడీ టైగర్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. హౌస్ లో ఎక్కువగా గొడవలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంది ఇనయా. హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కువ ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇనయ సుల్తానా బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకొని.. వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటూ వస్తోంది. హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుని తన వైపుకి తిప్పుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని కాబోలు బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక చాలా మంది రిచ్ గా ఉండాలని ఇల్లు కొనడం, కార్ కొనడం చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు ఇనయా సుల్తానా కూడా చేరింది. బిగ్ బాస్ వల్ల తన ఫ్యామిలీకి దగ్గర అయిన ఇనయా.. ఇప్పుడు కార్ కొని ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. కార్ తో దిగిన ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. My First car.. welcome to my Family అనే ట్యాగ్ తో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ విషెస్ చెప్తున్నారు. కాగా ఇప్పుడు కొత్త కారుతో ఇనయా దిగిన ఈ ఫోటోస్ ఇన్ స్టాగ్రామ్ లోని తన అభిమానులకి మంచి కిక్కు ఇచ్చాయనే చెప్పాలి. దీంతో ఇనయా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.