ఇదంతా ప్రాంక్..మేము విడాకులు తీసుకోవట్లేదు...వాళ్ళ పెళ్ళి ప్రకృతికి కూడా ఇష్టంలేదు

శ్రీదేవి డ్రామా కంపెనీలో  లాస్ట్ సెగ్మెంట్ మాత్రం చాలా స్మూత్ గా... విడాకులు తీసుకోవాలని అనుకునే యాదమ్మ రాజు- స్టెల్లాకు మంచి కనువిప్పు కలిగించేదిలా ప్లాన్ చేశారు. ఈ షోకి వచ్చిన జోడీస్ ఫొటోస్ ని స్క్రీన్ మీద చూపించారు. వాటి వెనక ఉన్న స్టోరీని ఆ జోడీస్ చెప్పారు. నగేష్-ప్రీతినిగమ్ ఫోటో చూపించేసరికి "పెళ్లయ్యాక మేము ఒక టెంపుల్ కి వెళ్లాం...కలిసి ఉంటే కలదు సుఖం అంటారు..కానీ నిజంగా కలిసి ఉంటే చాల హ్యాపీగాఉంటుంది" అని చెప్పారు వాళ్ళు.  శ్రీవాణి-విక్రమ్ ఫోటో చూసేసరికి అందరూ షాకయ్యారు. "విక్రమ్ గారికి పోలిక కనిపిస్తోంది కానీ వాణి అప్పటికి ఇప్పటికి ఇంత మార్పా అని ఇంద్రజ అడిగేసరికి మా ఆయనకు బోరు కొడుతూ ఉంటుంది అని అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాను ..పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయిన రోజున మా రిసెప్షన్ జరిగింది.. అప్పుడు ఫుల్ వర్షం కూడా"  అని చెప్పింది శ్రీవాణి. తర్వాత సత్తిపండు పెళ్లి ఫోటో చూపించారు. "1995 లో పెళ్లయ్యింది. అప్పుడంటే అంత ఫొటోగ్రఫీ అదీ పెద్ద అందుబాటులో లేదు..అందులోనూ నేను కేర్ తీసుకోలేదు. అప్పటికి నాకు పెళ్లి ఇష్టం లేదు..సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నా. మా అమ్మకు  నేనొక్కడినే..మా మేనత్తా వాళ్ళది పెద్ద ఫామిలీ. అందుకే ఈమెను ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆమె నా లైఫ్ లోకి వచ్చాకే నాకు బిఈడి సీట్ వచ్చింది. ఎంఎస్సి మాథ్స్ సీట్ వచ్చింది. తర్వాత నేను టీచర్ గా కూడా సెలెక్ట్ అయ్యాను. అలా అక్కడ జాబ్ చేస్తూనే జబర్దస్త్ కి వచ్చేవాడిని. అప్పుడు కూడా ఈమె నన్ను ఇబ్బంది పెట్టలేదు." అని చెప్పాడు..."పెళ్లి ఇష్టం లేదు అంటూనే ఆ ఫోటోలో నవ్వుతూ ఉన్నది సత్తిపండే " అన్నారు నగేష్.."కారణమేంటి అని ఆయన ఎందుకు అలా ఉన్నారు" అని అందరూ అడిగేసరికి " ..ఆ శివాలయ మండపంలో ఒకేసారి నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి...ఆరోజు ఫుల్ వర్షం, వరద" అని సత్తిపండు భార్య చెప్పేసరికి " ఐతే ఈ పెళ్లి ఆయనకు కానీ ప్రకృతికి కానీ ఇష్టం లేదన్నమాటా" అన్నాడు రాంప్రసాద్. చివరికి యాదమ్మ రాజు - స్టెల్లా పెళ్లి ఫోటో వేసేసరికి స్టెల్లా ఆ ఫోటో గురించి చెప్పుకొచ్చింది. "మాది ఇంటర్ క్యాస్ట్ కాబట్టి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం..మేమిద్దరం చాలా హ్యాపీ గా ఉన్నాం. ఏడేళ్లు ప్రేమించుకున్నాం కానీ పార్క్ కి కానీ పబ్బుకు కానీ వెళ్ళలేదు.." అని చెప్పారు. "మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు విడాకులు ఎందుకు అడిగావు అని రష్మీ అడిగేసరికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది..చాలా మంది యాదమ్మరాజు మీద ప్రాంక్ చేయమని అడిగారు దాంతో ఇలా ప్లాన్ చేసాం" అని చెప్పింది స్టెల్లా..దాంతో అందరూ షాకైపోయారు.    

మీ యూట్యూబ్ వల్లే నా జుట్టు ఊడిపోయింది.. ఐ సపోర్ట్ సోషల్ మీడియా...

శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్కో వారం ఒక్కోలా ఉంటుంది. ఒక వారం ఐతే చాలా సప్పగా సాగుతూ ఉంటే మరో వారం మాత్రం కొంచెం బాగుంది అనిపించేలా ఉంటుంది. కానీ ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా సెగ్మెంట్స్ పెట్టి ఫుల్ టైట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో రేంజ్ లో అలరించింది ఆడియన్స్ ని. అందులో భాగంగా శ్రీవాణితో ఒక స్పెషల్ సెగ్మెంట్ ప్లాన్ చేశారు.  సోషల్ మీడియాలో శ్రీవాణి వీడియోస్ ఎంత ఫేమస్ అవుతూ ఉంటాయో అందరికీ తెలుసు. అలాంటి శ్రీవాణిని పిలిచి యూట్యూబ్ లో వ్లాగ్ చేయాలి అంటే ఏం చేస్తారు అని రష్మీ  అడిగేసరికి చేసి చూపించింది శ్రీవాణి. "నేను శ్రీవాణి శ్రీదేవి యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్  చేయడానికి వచ్చేసాను..చాలా మంది సెలబ్రిటీస్ ని  శ్రీదేవి డ్రామా కంపెనీలోనే చూసారు కదా..అలాంటి వాళ్లందరినీ ఇప్పుడు ఈ ఛానల్ లో చూడబోతున్నారు. వాళ్లంతా ఎలా రెడీ అవుతారు, ఎలా కూర్చుంటారు, ఎలా చిట్ చాట్ చేస్తూ ఉంటారు, అసలు ఈ సెట్ అంతా ఎలా ఉండబోతోంది అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను" అని ఇంట్రో చెప్పింది.  అలా చెప్తూ ముందుగా రాంప్రసాద్ దగ్గరకు వెళ్ళింది శ్రీవాణి . "రాంప్రసాద్ గారికి ఏమయ్యింది. ఆయన తలకు ఏం జరిగింది..ఎప్పుడూ కాప్ పెట్టుకుని వస్తారు..అని చాలా మంది ఆడియన్స్  అడుగుతూ ఉన్నారు. అసలు విషయం ఏమిటి అంటే ఆయనకు జుట్టు వచ్చేసింది " అని రాంప్రసాద్ జుట్టుని  చూపించింది .."ఐతే నా జుట్టు ఊడిపోవడానికి ఫస్ట్ కారణం మీ యూట్యూబ్ ఛానల్"అనేసరికి అందరూ నవ్వేశారు.  తరువాత సెట్ మొత్తాన్ని షూట్ చేస్తున్న కెమెరాస్ ని, అలాగే పెద్ద క్రేన్ ఇక్కడ ఉంటుంది..అది అన్ని వైపులకు తిరుగుతూ కాప్చర్ చేస్తూ ఉంటుంది అని చెప్పి వాటిని చూపించింది. అలాగే ఇటు వైపు చూస్తే నవ్వు వచ్చినా రాకపోయినా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ అంటూ వాళ్ళను , అలాగే షోకి కావాల్సిన లైట్ బాయ్స్, కాస్ట్ బాయ్స్..ట్రాలీ కెమెరాని అన్నిటినీ చూపించింది.  ఇక  ఇంద్రజ దగ్గరకు వచ్చి  ఇక్కడ ఒక్కరే ఉదయం నుంచి సాయంత్రం వరకు  కూర్చుని అందరి మాటలు వింటూ ఉంటారు అని చెప్పారు శ్రీవాణి. ఇంద్రజ విషయం వచ్చేసరికి నూకరాజు, రాంప్రసాద్ లేచి ఆమెను టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక శ్రీవాణికి పోటీగా అందరూ స్టేజి మీదకు ఆండ్రోయిడ్స్ పట్టుకుని వచ్చి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నట్టుగా నటిస్తూ సరదాగా ఎంటర్టైన్ చేశారు. ఇక శ్రీవాణి చేసిన ఈ వ్లాగ్ షోలో హైలైట్ గా నిలిచింది. "సోషల్ మీడియాని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతీ ఒక్క సామాన్యుడిని కూడా చాలా హైలైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం " అని చెప్పారు ఇంద్రజ.

ఈ షో సంతకం లేకుండా కళాకారులు చెలామణి అవ్వడం ఈజీ కాదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో సింగర్ బేబీ పాడిన పాటలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆమె పాడిన పాటలకు సెట్ మొత్తం ఊగిపోయింది. ఇక ఇంద్రజ ఎనెర్జీ మాములుగా లేదు. స్టేజి మీదకు వచ్చి ఆమెను పట్టుకుని ఊపేసింది. యాదమ్మ రాజు-స్టెల్లా కలవడం కోసం కూడా స్పెషల్ గా ఒక జానపదం పాడి అలరించారు బేబీ . "చిలుక ఎందుకె అలక" అనే సాంగ్ ని పాడారు. ఐతే ఈ సాంగ్ రాసిన బాబు అనే రైటర్ ని కూడా స్టేజి మీదకు పిలిచారు. తర్వాత సాంగ్ రైటర్ బాబు మాట్లాడుతూ "అందరికీ నమస్కారమండి. కరెన్సీ నోట్ 5 రూపీస్ ఐనా 500 రూపీస్ ఐనా గవర్నర్ గారి సంతకం గాంధీ గారి బొమ్మ లేకుండా చెలామణి అవ్వదు..అలాగే నూతన కళాకారుడు సోషల్ మీడియాలో ఫేమస్ ఐనా అవ్వకపోయినా శ్రీదేవి డ్రామా కంపెనీ వారి సంతకం లేకుండా చెలామణి అవ్వడం అంత ఈజీ కాదు.. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్" అని చెప్పాడు .. ఇక రష్మీ ఎవరెవరికి ఎలాంటి సాంగ్స్ డేడికేట్ చేస్తారు అని అందరినీ అడిగింది. "ప్రియా ప్రియతమా అందాలు" అనే సాంగ్ ని నా వైఫ్ ప్రీతీకి  డేడికేట్ చేస్తానని అని చెప్పారు నగేష్. "ఎటో వెళ్ళిపోయింది మనసు" అనే సాంగ్ ని డేడికేట్ చేస్తానన్నారు సాయి రోనాక్. "ప్రియతమా నీవచట" అనే సాంగ్ ని డేడికేట్ చేస్తానన్నారు అభిలాష్. "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే" అనే సాంగ్ ని మా విక్రమ్ కి డేడికేట్ చేస్తానని చెప్పింది శ్రీవాణి. "నిండు నూరేళ్ళ సావాసం" అనే సాంగ్ ని సిద్దుకి డేడికేట్ చేస్తాను అని చెప్పింది విష్ణుప్రియ. "కోటి కోటి తారల్లోన" అనే సాంగ్ ని నా వైఫ్ కి డేడికేట్ చేస్తాను అని చెప్పాడు బుల్లితెర నటుడు ప్రియతమ్. "సముద్రమంత నా కన్నుల్లో" అనే సాంగ్ ని నా హజ్బెండ్ కి డేడికేట్ చేస్తున్నా అని చెప్పారు ఇంద్రజ.

శివబాలాజీ, మధుమిత ఢిల్లీ ట్రిప్ లో దోసకాయ మటన్!

మధుమిత.. ఆమె అసలు పేరు స్వప్న మాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ నటుడు శివ బాలాజీని పెళ్లిచేసుకుంది. మధుమిత స్వప్నమాధురి అనే పేరుతో 2002 లో విడుదలైన సందడే సందడి అనే చిత్రంలో ముఖ్యమైన సహాయపాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తరువాత మన్మథుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలలో సహాయపాత్రలు చేసింది. అర్జున్ కు చెల్లెలుగా నటించిన పుట్టింటికి రా చెల్లీ సినిమా 275 రోజులు ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. తరువాత ఆమెను కుడైకుళ్ మళై అనే సినిమాతో పార్తిబన్ తమిళ సినీపరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఆ పాత్ర పేరైన మధుమిత ను తన అసలు పేరుగా మార్చుకున్నది. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమెకు తమిళంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆముదే, ఇంగ్లిష్ కారన్ అనే తమిళ సినిమాల్లో నటించింది. కాగా మధుమిత, శివబాలాజీ కలిసి సొంతంగా 'శివమధు' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు. అందులో  కుకుంగ్ వీడీయోస్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు మధు, శివబాలాజీ దంపతులు. కాగా తాజాగా వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుండి ఆగ్రాకి వెళ్ళే హైవేలో ఒక దాబాలో ఆగి.. వాళ్ళు ఇంట్లో చేసుకున్న  దోసకాయ మటన్ కర్రీని అందరూ కలిసి తిన్నారని మధుమిత చెప్పింది. కాగా ఈ ట్రావెల్ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఒక కుటుంబం కల నెరవేర్చిన కృష్ణ, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.  ఈ సీరియల్  సరికొత్త మలుపుకి తిరగనుందా అంటే అవుననే చెప్పాలి. తాజా మంగళవారం నాటి ఎపిసోడ్‌ ప్రోమోలో కృష్ణకి ముకుంద ఎదురవుతుంది. అక్కడ ఫామ్ హౌస్ లో ముకుందని చూసిన కృష్ణ షాక్ అవుతుంది. ఇక్కడ నువ్వేంటి ముకుంద అని అడిగిన కృష్ణని.. పక్కకి తీసుకెళ్తుంది ముకుంద. ఈ సీరియల్ లో మొదటగా మురారి, ముకుంద ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ దూరమవుతారు. మురారి పోలీస్ గా ఉద్యోగం వచ్చాక.. ఒక క్రిమినల్ ని పట్టుకునే పరిస్థితులలో.. మురారి కింద హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న కృష్ణ వాళ్ళ నాన్న చనిపోతాడు. అయితే వాళ్ళ నాన్నని మురారి చంపడం చూసిన కృష్ణ షాక్ అవుతుంది. తను చనిపోతున్నానని తెలుసుకున్న కృష్ణ వాళ్ళ నాన్న.. మురారీతో కృష్ణ పెళ్ళి జరిపిస్తాడు. అయితే మురారి వాళ్ళ అన్న ఆదర్శ్, ముకుందని పెళ్ళి చేసుకుంటాడు. అయితే అదే సమయంలో ముకుంద, మురారిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా ముకుంద ఒక్కతే ఉండి, కృష్ణ మురారీలు కలిసి ఉండటాన్ని చూడలేకపోతుంది. ఎలాగైనా కృష్ణ, మురారీలను విడదీయాలని ముకుంద చూస్తుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌ లలో కృష్ణ, మురారీ ఇద్దరు కలిసిపోవాలని రేవతి వాళ్ళ ఫామ్ హౌస్ కి పంపిస్తుంది. అయితే వాళ్ళకంటే ముందే ముకుంద వెళ్ళి.. అక్కడ ఫామ్ హౌస్ ని చూసుకుమే ఆమెకు డబ్బులు ఇచ్చి తను కొన్నిరోజులు అక్కడ ఉంటానని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌ లలో పంతులు దగ్గరికి వెళ్ళిన రేవతికి కృష్ణ, మురారీ విడిపోతారని చెప్పడంతో తను టెన్షన్ పడుతూ ఉండగా, వాళ్ళిద్దరిని విడదీయాలని ముకుంద ప్లాన్ చేస్తుంటుంది. ఇలాంటి అంశాలతో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. కాగా ఇప్పుడు మురారి( ముఖేష్ గౌడ),  కృష్ణ(ప్రేరణ కంబం) ఒక పేద కుటుంబానికి అండగా నిలిచారు. 'ఎచ్ఆర్ ఫర్ యూ' అనే యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తూన్న ఒక యూట్యూబర్ కృష్ణ, మురారీల చేత వారికి ఆర్థిక సాయం అందించాడు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్ లో దేత్తడి హారిక-నోయల్!

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తనకు సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' ని స్టార్ట్ చేసింది. క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్ లో అరియాన-మెహబూబ్, అషురెడ్డి-రాహుల్ సిప్లిగంజ్ వచ్చి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా.. ఆ వీడి‌యోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు దేత్తడి హారిక- నోయల్ వచ్చారు. వారిని కాజల్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేయగా వాటికి వాళ్ళిద్దరు భిన్నమైన సమాధానాలు చెప్పారు. కాగా ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

హీరో రోనాక్ తో డాన్స్.. ఫైర్ ఐన ఇంద్రజ.. తనకు విడాకులు కావాలన్న రష్మీ

ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీకి "కనులు తెరిచినా కనులు మూసినా" మూవీ ప్రొమోషన్స్ కోసం సాయి రోనాక్, అభిలాష్, డైరెక్టర్ సందీప్ టీం వచ్చింది. ఇక సాయి రోనాక్ ని చూసేసరికి రష్మీ కళ్ళల్లో ఆనందం కనిపించింది. "ఈ ఎపిసోడ్ నాకు బాగుంది. అందరికీ జోడీలు వున్నారు. నాకు మాత్రం వీళ్ళు ఉన్నారు" అని మూవీలోని కుర్రాళ్లను చూపించింది. ఇక మూవీ గురించి ఈ ముగ్గురు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్పుకొచ్చారు. తర్వాత రాంప్రసాద్ లైన్ లోకి వచ్చి "మా రష్మీ హీరోతో కలిసి డాన్స్ చేస్తే చూడాలనుంది" అని అడిగాడు. "ఆ రొమాంటిక్ సాంగ్ కూడా గాలోడు మూవీ నుంచి చేయాలి" అని నూకరాజు అనేసరికి "వద్దులేరా క్యాన్సిల్" అన్నాడు రాంప్రసాద్. "ఉన్న మూడ్, ఉత్సాహం అన్నీ పోయాయి " అని రష్మీ అనేసరికి "ఇంతవరకు సైలెంట్ గా ఉన్నాను..ఏమిటి ఏం అంటున్నావ్.." అని ఇంద్రజ ఫైర్ అయ్యేసరికి " ఈ ఎపిసోడ్ కి ఎక్స్క్యూజ్ చేయండి మేడం" అంది రష్మీ. "కళ్ళు తెరిచే చూడు రష్మీ పక్కన రీల్ హీరో.. కళ్ళు మూసి చూడు అక్కడ రియల్ హీరో" అని సుదీర్ గురించి తెగ పొగిడేసింది ఇంద్రజ.  ఈ డ్రామా అంతా చూస్తున్న మూవీ టీమ్ కి ఏం అర్ధం కాకపోయేసరికి "మాదొక ఫామిలీ ఎపిసోడ్ అండి.. ఇంద్రజ గారు అమ్మ, రష్మీ కోడలు, కొడుకేమో సుధీర్ ఆస్తి తగాదాలు వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు" అని రాంప్రసాద్ చెప్పేసరికి "మీరే కదా పంపేశారు..ద్రోహి " అన్నారు ఇంద్రజ. "మనం ఫ్రెండ్ గా ఏం కోరుకుంటామండీ డెవలప్ కావాలని కదా అందుకే పంపించాం..వాడు డెవలప్ కాకుండా ఏదేదో ఐపోయాడు" అని చెప్పాడు రాంప్రసాద్. తర్వాత రాంప్రసాద్ చెప్పేసరికి బ్యాక్ డ్రాప్ లో " ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ ప్లే అవడంతో రష్మీ, సాయి రోనాక్ ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. అది చూసిన ఇంద్రజ చాలా ఫీలైపోయింది. "మీరు మారిపోయారమ్మా.. ఆ గాలోడి కోసం బాధపడుతూ ఉండే మీ కళ్ళు ఆనందపడుతున్నాయి" అని గట్టిగా అరుస్తూ చెప్పాడు నూకరాజు. "జస్ట్ చిన్న లీడ్ ఇచ్చాను రెచ్చిపోయిందిరా రష్మీ" అని సుధీర్ కి ఫోన్ చేసి చెప్పాడు రాంప్రసాద్. "వాళ్ళు రెచ్చగొట్టారు..నేనేం చేయలేదు" అంది రష్మీ ఏడుపు ముఖంతో.."రెచ్చగొడితే రెచ్చిపోతారా అమ్మా ..అక్కడ బాబుని చాలా మంది రెచ్చగొడుతున్నారు ...బాబు రెచ్చిపోయాడా" అన్నాడు నూకరాజు. "నాకు కూడా ఒక విడాకుల ఈవెంట్ పెట్టండి ఇంకా" అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగేసరికి "ఇక మీకు విడాకులు లేవమ్మా మావిడాకులే" అని నూకరాజు అనేసరికి అందరూ నవ్వేశారు.

బక్రీద్ స్పెషల్ గా షీర్ కుర్మా చేసిన ఆసియా, నూకరాజు!

ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. నూకరాజు కోసం వైజాగ్ వెళ్ళి సర్ ప్రైజ్ చేసిన ఆసియా అని ఒక వ్లాగ్, ఇద్దరు కలిసి కెఎఫ్ సి చేస్తే హిట్ ఆర్ ప్లాఫ్ అని మరో వ్లాగ్, నూకరాజు పడుకున్నాక ఏం చేసానో తెలుసా వ్లాగ్,  'ఎంగేజ్మెంట్ కోస‌ం రెడీ అయ్యాము' అంటూ వ్లాగ్ అప్లోడ్ చేసారు. తాజాగా బక్రీద్ స్పెషల్ వ్లాగ్ ని తమ ఛానెల్ లో అప్లోడ్ చేసారు ఆసియా, నూకరాజు. అందులో హిందూ, మస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేదు అందరూ సమానమే అంటూ వ్లాగ్ స్టార్ట్ చేసాడు నూకరాజు. ఆ తర్వాత ఇది షీర్ కుర్మానా లేక నా కర్మనా అంటూ నవ్వులు పూయించాడు నూకరాజు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసి‌‌న  ఈ వీడియోకి మంచి స్పందన లభిస్తుంది.

ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే.. స్వీట్స్ తో లిప్ లాక్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో మంచి హాట్ హాట్ సీన్స్ తో లిప్ లాక్స్ తో ఒక చిన్న సైజు మూవీని తలపించింది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న యాదమ్మరాజు- స్టెల్లా విడాకులు తీసుకుందామని అనుకున్నారు. యాదమ్మ రాజు సెల్ కి పాస్వర్డ్ పెట్టుకోవడంతో వచ్చిన తిప్పలు ఈ షోకి మెయిన్ పాయింట్. ఇక గ్రాండ్ గా విడాకుల ఫంక్షన్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మిగతా జోడీస్ అంతా వచ్చి వాళ్ళను కలపడానికి తెగ ట్రై చేశారు. ఇందులో భాగంగా ప్రీతీ నిగమ్ - నగేష్, అంజలి - పవన్, సిద్-విష్ణు , నూకరాజు - ఆసియ, సత్తిపండు వాళ్ళ వైఫ్, దొరబాబు అతని భార్య అమూల్య అందరూ వచ్చారు.  ఇక యాంకర్ రష్మీ హజ్బెండ్స్ చేతులను వెనక్కి కట్టేసింది. వాళ్ళ భార్యలను పిలిచి, ఒక టేబుల్ మీద కొన్ని స్వీట్స్ పెట్టి వాటిని వాళ్ళ నోటితో తీసుకెళ్లి తమ భర్తల నోటికి అందించాలి అని చెప్పింది. ఇక ఈ సెగ్మెంట్ లో జరిగిన ఈ టాస్క్ లో  అందరూ బాగా చేశారు. తెగ సిగ్గుపడిపోతూ మరీ వెళ్లి స్వీట్స్ తినిపించారు.  "గులాబీ జామున్లు తినే హడావిడిలో మా ఆయన నా పెదాన్ని మూడు సార్లు కొరికేసాడు" అని చెప్పింది అంజలి. "జూమ్ చేస్తే తెలుస్తుంది నేను మా ఆయనకు లిప్ కిస్ పెట్టేసుంటాను" అంది దొరబాబు వైఫ్ అమూల్య. "నాకు మాత్రం నా పెళ్లి రోజు గుర్తొచ్చింది మేడం" అని చెప్పారు సీనియర్ యాక్టర్ నగేష్. "ఫస్ట్ నైట్ ముందు ఇలా తినిపించుకున్నాం..మళ్ళీ ఇప్పుడే స్వీట్స్ తినిపించుకుంటున్నాం " అని తెగ సిగ్గుపడిపోతూ చెప్పింది విష్ణు. "వీళ్లంతా చెప్తుంటే రాంప్రసాద్ సిగ్గు పడుతున్నారని రష్మీ అనేసరికి "సిగ్గు పడడానికి ఏముంటుంది..మా ఇంట్లో స్వీట్స్ ఉండవు" అని చెప్పారు. తర్వాత  యాదమ్మ రాజు - స్టెల్లా మధ్య జాంగ్రీ తినిపించుకునేలా చేశారు. ఇలా ఈ సెగ్మెంట్ చాలా స్వీట్ స్వీట్ గా సాగిందని హజ్బెండ్స్ హ్యాపీగా ఉంటే సిగ్గుపడిపోయారు వాళ్ళ భార్యలు.

కృష్ణ, మురారి‌ విడిపోతారని చెప్పిన పంతులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -198 లో.. కృష్ణ, మురారి ఇద్దరు సరదాగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళని దూరంగా ఉండి ముకుంద చూస్తుంటుంది. కృష్ణ బాటిల్ ని తిప్పుతుంది. ఏసీపీ సర్ ట్రూత్ వచ్చింది, నిజమే చెప్పాలని కృష్ణ అంటుంది. అప్పుడే ముకుంద కాల్ చేస్తుంది. మురారి ఫోన్ కట్ చేస్తుంటే.. మళ్ళీ మళ్ళీ చేసి మురారిని విసిగిస్తుంది. ఎవరు చేస్తున్నారు. ఆ డైరీ లో ఉన్న అమ్మాయేనా చేసేదని కృష్ణ అనుకుంటుంది.  ఆ తర్వాత ముకుంద మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడంతో మురారి ముకుంద దగ్గరికి వచ్చి.. ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావని ముకుంద అంటుంది. ఇంత చెప్పినా నీతో మాట్లాడం వేస్ట్ అని చెప్పి మురారి వెళ్ళిపోతాడు. కృష్ణ దగ్గరికి వెళ్ళిన మురారి.. కృష్ణ మనం వెళ్ళాలి, నాకు అర్జెంటు వర్క్ ఉందని మురారి అంటాడు‌. ఎందుకు సర్ అబద్దం చెప్తున్నారు. మీ కాలర్ పట్టుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పాలని ఉందని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ, మురారి ఇద్దరు బయల్దేరతారు. మీ మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకొని తప్పుకుంటే అర్థం ఉంది. ఎటూ తేల్చుకోలేక తప్పుకుంటే అవివేకం అవుతుందని కృష్ణ అనుకుంటుంది. "ముకుంద ఎందుకు ఇలా చేస్తుంది. అప్పుడు బాధపడ్డాను. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను. కృష్ణ నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పలేక పోతున్నాను. సారి కృష్ణ" అని మురారి అనుకుంటాడు. మరొక వైపు కృష్ణ, మురారి లు వస్తున్న విషయం తెలిసి రేవతి వాళ్ళిద్దరికి ఫోన్ చేస్తుంది. ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చెయ్యరు. ఆ తర్వాత పంతులు గారి దగ్గరికి రేవతి వెళ్లి.. కృష్ణ, మురారీల గురించి అడుగుతుంది.  కృష్ణ మురారి విడిపోతారు. వాళ్ళని ఒకరు విడదీస్తారని పంతులు చెప్తాడు. రేవతి టెన్షన్ పడుతూ అలా జరగకుండా ఉండడానికి పరిష్కారం చూడండని అంటుంది. సరే నాకు కొంచెం టైం కావాలి అని పంతులు అంటాడు. మరొక వైపు రేవతి ఇంటికి వస్తూ.. పంతులు అన్న మాటలే గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత అలేఖ్య, మధు ఇద్దరు ఎప్పటిలాగే పొట్లాడుకుంటారు. ఆ తర్వాత ముకుంద ఇంటికి వస్తుంది. ఏం తెలియనట్లుగా కృష్ణ, మురారిలు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఫామ్ హౌస్ కి వెళ్లారని అలేఖ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

గెస్ట్ హౌస్ కి వెళ్ళిన జగతి, మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -804 లో.. మహేంద్ర దగ్గరికి జగతి వస్తుంది. జగతి రావడంతోనే మహేంద్ర ఆమెని హత్తుకుని ఇన్ని రోజులు నిన్ను బాధపెట్టాను సారి అని చెప్తాడు. రిషికి నీపై కోపం ఇంకా పెరిగిపోవచ్చు.. ఇక నిన్ను ఎప్పుడు అమ్మ అని పిలవడేమో అని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. లేదు మహేంద్ర నన్ను రిషి అమ్మ అని పిలిచాడు కానీ ఆ సిచువేషన్ లో పిలుస్తాడని నేను అనుకోలేదంటూ జగతి అంటుంది. మళ్ళీ రిషి తిరిగి రావాలి, కాలేజీ బాధ్యతలు చేపట్టాలని జగతి అంటుంది. తప్పకుండా వస్తాడు కానీ మనం ఈ ఇంట్లో ఉండొద్దు.. కీడు చేసే మనుషుల మధ్య ఉండాలని లేదు.. నా తొందరపాటు వల్ల అన్నయ్య ముందు నోరు జారుతానని మహేంద్ర అంటాడు. ఇక ఇద్దరు కాలేజీ గెస్ట్ హౌస్ కి వెళ్లాలనుకుంటారు. మరొక వైపు ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు బయటకు వెళ్ళడానికి రెడీ అవుతారు‌. వసుధార దగ్గరికి ఏంజిల్ వచ్చి నీకు కావలిసినవి అన్ని ఇక్కడే పెట్టేసాను.. ఏమైనా అవసరం ఉంటే రిషిని పిలిచి అడుగు అని వసుధారకి ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత  రిషి దగ్గరికి వెళ్లిన ఏంజిల్.. తనకొక హెల్ప్ చెయ్యాలని అడుగుతుంది. వసుధారకి ఏమైనా అవసరం ఉంటే దగ్గర ఉండి చూసుకో అని ఏంజిల్ చెప్పి వెళ్తుంది. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు బ్యాగ్ సర్దుకొని గెస్ట్ హౌస్ కి వెళ్ళడానికి హాల్లోకి వస్తారు. వాళ్ళని చూసిన దేవయాని ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. గెస్ట్ హౌస్ కి.. మిషన్ ఎడ్యుకేషన్ పనులు అక్కడ ఉండి చూసుకుంటే ఎక్కువ టైం కేటాయించవచ్చని వెళ్తున్నామని మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు. బాబాయ్ లో ఏదో మార్పు వచ్చింది.. బాబాయ్ కి, పిన్ని నిజం చెప్పేసిందా అని దేవయానితో శైలేంద్ర అంటాడు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు మంచి టైం దొరికింది. కాలేజీని మన సొంతం చేసుకోవాలని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఫణీంద్ర ఇంటికి వచ్చి మహేంద్రని పిలువగా.. జగతి, మహేంద్ర ఇద్దరు గెస్ట్ హౌస్ కి వెళ్లిన విషయం ధరణి చెప్తుంది. నువ్వు ఎలా వెళ్ళనిచ్చావని దేవయానిని ఫణీంద్ర కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శ్రీశైలం వెళ్ళడానికి దుగ్గిరాల ఫ్యామిలీ రెడీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -137 లో... రాజ్ మూలిక కలిపిన పాలు తాగి కావ్య దగ్గరికి వస్తాడు. రాజ్ మత్తులో కావ్య దగ్గరికి వస్తుంటే తనకి భయమేస్తుంది. నన్నేం చేయకండని అరుస్తుంది. అరవకు అంటూ రాజ్ అంటాడు. కాసేపటికి కావ్య ఒళ్ళో రాజ్ పడుకుంటాడు. కావ్య, రాజ్ తో పరిచయం అయినప్పటి నుండి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. మీరు ఇలా మత్తులో కాకుండా ప్రేమతో ఎప్పుడు దగ్గరికి వస్తారో అని ఎదురు చూస్తున్నా అని కావ్య అనుకుంటుంది. మరొక వైపు కృష్ణమూర్తి పడుకుని ఉండగా కనకం వచ్చి కృష్ణమూర్తి కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించండి అని కనకం అంటుంది. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావ్. నిన్ను ఎలా క్షేమించేది. నిలువ నీడ లేకుండా చేసావ్ కదా. చిన్నప్పటి నుండి అప్పు తనకు కావలిసినవి తనే కొనుక్కుంది. ఎలాగూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు మన చేతులు మీదుగా జరుగలేదు. కనీసం అప్పు పెళ్లి అయిన ఈ ఇల్లు అమ్మి మంచి వాడిని చూసి నా చేతుల మీదుగా చేద్దామని అనుకున్నా.. ఈ ఇల్లు కూడా లేకుండా చేసావ్ కదా అని కృష్ణమూర్తి అంటాడు. నేను చేసింది తప్పే కానీ అప్పుడున్న పరిస్థితిలో అలా చేయవలిసి వచ్చింది. కానీ ఆ సేటు మన ఇల్లు అన్యాయంగా తీసుకుంటాడని ఇలా చేశానని కనకం చెప్తుంది. కనకం, కృష్ణమూర్తి మాట్లాడుకున్న మాటలు అన్నీ అప్పు వింటుంది. ఎలాగైనా నాన్నకి సహాయంగా ఉండాలని అప్పు అనుకుంటుంది.  మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటుంది. అందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తాడు. ఆ తర్వాత స్వప్న అందంగా రెడీ అయి రాహుల్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అందరూ నా గురించి మాట్లాడుకుంటారని రాహుల్ తో అంటుంది. రాహుల్, స్వప్న ఇద్దరు హాల్లో కి వస్తారు. కానీ స్వప్నని ఎవరు పట్టించుకోకుపోవడంతో.. చూసావా కావ్య అందరిని తన వైపు తిప్పుకుంది. ఎవరు నీ గురించి మాట్లాడడం లేదని‌ స్వప్నతో రాహుల్ అంటాడు.. మరొక వైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి ప్రాక్టీస్ కి రమ్మంటుంది. ఈ రోజు రావట్లేదని కళ్యాణ్ చెప్తాడు. మరొక వైపు రాజ్ నిద్ర లేచేసరికి కావ్య ఒళ్ళో ఉండడం చూసి ఏమైంది అంటూ టెన్షన్ పడుతూ అడుగుతాడు. కావ్య కావాలనే రాజ్ ని ఆటపట్టిస్తుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నీ గాలి మాటల్ని ఖాళీగా ఉన్న ప్రదీప్ కి చెప్పు..

డ్రామా జూనియర్స్ సీజన్ 6 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రతీ వారం చిన్నారులు చేస్తున్న స్కిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత పెద్ద డైలాగ్స్ ని ఐనా సరే అవలీలగా చెప్పేసి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేసేస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి ప్రసారం కాబోయే ఈ షోకి "బేబీ" మూవీ నుంచి హీరో హీరోయిన్స్ వచ్చారు. వీళ్ళు మంచి ఎనెర్జీతో వచ్చి స్టేజి మీద స్టెప్పులేసి అందరిలోనూ హుషారు పెంచితే చిన్నారి కంటెస్టెంట్స్ ఐన  లోకేష్ , భారతి మాత్రం స్కూల్ యూనిఫామ్ లో వచ్చి "అమ్మాయే సన్నగా" అంటూ పవన్ కళ్యాణ్ సాంగ్ కి దుమ్ము లేపే డాన్స్ వేసి అందరిని ఫిదా చేసేసారు. స్టూడెంట్ లోకేష్, భారతి ఎనెర్జీ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్ లో ఉంటుంది. పనిలో పనిగా హోస్ట్ ప్రదీప్ మీద కూడా పంచెస్ పేల్చేశారు ఇద్దరూ. పవన్ కళ్యాణ్, భూమిక నటించిన ఖుషి మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందులో భూమిక బొడ్డు సీన్ కూడా అంతే హిట్ అయ్యింది. ఆ సీన్ ని ఈ చిన్నారులిద్దరూ రీక్రియేట్ చేసి నవ్వు తెప్పించారు. "హే మధు ఏంటి స్కూల్ కి లేట్ గా పర్లేదు కానీ..ఎగ్జామ్ కి లేట్ గా వస్తారా..కొంచెం ఐనా సీరియస్ నెస్ ఉండదా " అని లోకేష్ పవన్ కళ్యాణ్ స్టయిల్లో అదే మానరిజమ్ తో చెప్పేసరికి సెట్ లో ఉన్నవాళ్ళంతా విజిల్స్ వేశారు. లోకేష్ డైలాగ్ కి మరో కంటెస్టెంట్ భారతి కౌంటర్ ఇచ్చేసింది "నీ గాలి మాటలు ఖాళీగా ఉన్న ప్రదీప్ కి చెప్పు ..వింటాడు" అంది.. ఆ మాటలకూ ప్రదీప్ నవ్వుతూ "మధ్యలో నేనేం చేసానురా..బుద్దిగా ఎగ్జామ్ రాసుకోవచ్చు కదా" అని భారతికి చెప్పాడు ప్రదీప్. " ఆ పనేదో నువ్వు చేసుంటే హాయిగా బిటెక్ పాసయ్యేవాడివిగా" అంది భారతి "వీళ్లకు కూడా తెలిసిపోయిందిరా మనం మధ్యలో ఆపేశామని" అన్నాడు ప్రదీప్ నవ్వుతూ. ఇలా ఈ వారం చిన్నారులంతా మంచి హుషారెత్తించే స్కిట్స్ తో నవ్వించడానికి రాబోతున్నారు.  

నాకు కూడా అప్పట్లో ఒక బేబీ ఉంది

ఆహా వేదిక మీద సర్కార్ సీజన్ 3 ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసింది. దీనికి "బేబీ" మూవీ టీం వచ్చింది. ఇక ఈ స్టేజి మీదకు రాగానే స్టూడెంట్ ఆడియన్స్ ని చూసి చాలా ఖుషీ ఐపోయాడు హోస్ట్ ప్రదీప్. "మిమ్మల్ని చూడగానే నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాను..నా కాలేజీ లైఫ్ కూడా గుర్తొస్తుంది..అని చెప్పాడు..కాలేజీ లైఫ్, ఫ్లాష్ బ్యాక్ అంటే చాలు అప్పట్లో జరిగిన ఎన్నో స్టోరీస్ కూడా గుర్తొస్తాయి కదా..మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అటెండెన్స్, మార్కులు కాకుండా..అప్పటి లవ్ స్టోరీస్, క్రష్ లు గుర్తొస్తూ ఉంటాయి. అందరి లైఫ్ లో ఒక స్టోరీ ఉంటది కదా..మన లైఫ్ లో కూడా ఓ బేబీ ఉంటది కదా..నాకు ఆ రోజుల్లో ఒక బేబీ ఉంది. ఒక రోజు మా అమ్మ అరకేజీ కందిపప్పు తెమ్మని పంపించింది. అప్పుడు నేను ట్రాక్ ఫ్యాన్ట్, టీ షర్ట్ వేసుకుని కిరాణా కొట్టుకెళ్ళా ..అంకుల్ నాకు ఒక అరకేజీ కందిపప్పు ఇవ్వరా అని  అడిగేసరికి పక్కనుంచి మరో స్వీట్ వాయిస్ వినిపించింది. అరకేజీ చింతపండు ఇవ్వరా అని అడిగింది ఆ అమ్మాయి. నేను చూసి వావ్ అనుకున్నా..ఇంతలో వెనక నుంచి వాళ్ళ అన్నయ్య వచ్చి అరడజను గుడ్లు ఇవ్వరా అంకుల్ అన్నాడు. అక్కడితో మనం కట్టు...ఈసారి ధైర్యం చేసి ఎదురింట్లో ఉన్న అమ్మాయికి హలో చెపుదామని డిసైడ్ అయ్యి కావాలనే బాల్ ని వాళ్ళ ఇంట్లోకి వేసి ఆంటీ ఇంట్లోకి బాల్ పడింది అన్నాను..రా బాబు నేను నీగురించి చూస్తున్నాను..ఈరోజు రాఖీ కదా మా అమ్మాయి రాకీ కడతాను అంటోంది అనేసరికి అలా ఆ రోజు నుంచి నా లైఫ్ లో రాకీ కూడా లేదు" అని నిట్టూర్చాడు.  

ఓవర్ ప్రాక్టీస్ వల్ల ఫ్రాక్చర్...డాన్స్ చేయకుండా రెస్ట్ తీసుకోమన్న డాక్టర్

"నీతోనే డాన్స్" షో ఇప్పుడిప్పుడే మంచి రసవత్తరంగా సాగుతోంది. జోడీస్ అంతా నెమ్మదిగా సెట్ అవుతున్నారు. మొత్తం 8 జంటలతో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇకనుంచి మార్క్స్ తో యుద్ధం మొదలుకాబోతోంది అన్న విషయం కూడా రీసెంట్ ప్రోమో ద్వారా అర్ధమయ్యింది. అలాంటి టైంలో  ఈ షో నుంచి ఒక జోడి వికెట్ డౌన్ ఐపోతుందనే వార్త వినిపిస్తోంది. ఆ జోడి అంజలి-పవన్. రీసెంట్ షో ప్రోమో చూస్తే చాలు ఆ విషయం మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇద్దరూ డాన్స్ చేస్తూ మధ్యలో సడెన్ గా ఆగిపోయారు. ఇంతకు ఏమయ్యింది అని ఆడియన్స్ టెన్షన్ పడ్డారు. చివరికి పవన్ కాలికి ఫ్రాక్చర్ అవడంతో డాక్టర్ డాన్స్ ఇంకా చేయొద్దు అని చెప్పారని చెప్పింది అంజలి. 'పుష్ప' మూవీలోని 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి' పాటను పవన్- అంజలి జోడి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. కథాకళి , కాంతార గెటప్స్ ని మిక్స్ చేసి ఒక వెరైటీ లుక్ తో ఈ సాంగ్ ని ప్రాక్టీస్ చేశారు.  వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నంత సేపు జడ్జీలు కూడా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు. కానీ డ్యాన్స్ మధ్యలో సడెన్‌గా పవన్ ఆగిపోవడంతో అసలు ఏం జరిగిందో ఎవరికీ  అర్థం కాలేదు. ఆ తర్వాత తరుణ్ మాస్టర్, రాధిక, సదా స్టేజి మీదకు వచ్చి వాళ్లిద్దరినీ ఆత్మీయంగా హగ్ చేసుకుని  చాలా ఎమోషనల్ అయ్యారు. పవన్ అంజలి ఇద్దరూ గట్టిగా ఏడ్చేశారు. తర్వాత వీళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్లడం అక్కడ టెస్టులన్నీ జరిగాక ఆ రిపోర్ట్స్ ని ఆడియన్స్ కి చూపిస్తూ ఒక వీడియో కూడా చేశారు. ఇక ఆ వీడియోలో "అందరికీ చాలా థ్యాంక్స్...మాకు ఏమయ్యిందంటూ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న డాన్స్ ప్రాక్టీస్ హెవీ అయ్యేసరికి మా ఇద్దరికీ కాళ్లల్లో ఇంజూరి అయ్యిందని చెప్పారు.. పవన్‌కి  ఎమ్ఆర్ఐ చేస్తే ఏదో ఫ్రాక్చర్ అయిందని చెప్పారు.. డాన్స్ చేయకుండా రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. చాలా రోజుల తర్వాత మంచి డ్యాన్స్ షోతో మీ ముందుకొచ్చాం అని చాలా సంతోషంగా ఫీలయ్యాం..  మేము ఉన్నంత వరకు బాగా  చేయాలి అనుకున్నాం.. కానీ కుదరడం లేదు. సంకేత్‌కి చెప్పాలి.. మంచి కొరియోగ్రాఫర్ తను..  షో వాళ్లకి కూడా చెప్పాలి." అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యింది అంజలి. ఇలా ఈ షో నుంచి ఒక జోడి దూరం అవుతుండడంతో అందరూ ఫీలవుతున్నారు.

సునీత కొడుకు ఆకాష్ 'సర్కారు నౌకరి' ఫస్ట్ లుక్ వచ్చింది!

  మూవీ ఇండస్ట్రీలోకి కొత్తవాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియే. ఐతే ఇక్కడ కొంచెం తేడా ఉంది. గతంలో హీరోల వారసులు, హీరోయిన్ల వారసులు మాత్రమే మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కానీ ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు సింగర్స్ నెక్స్ట్ జెనెరేషన్స్ వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి సింగర్స్ లో సునీత ఒకరు. ఆమె తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తల్లికి తగ్గ కొడుకుగా ఆకాష్ ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేసాడు. ఆకాష్ ని ఇండస్ట్రీలోకి తీసుకురావడం కోసం ముందు నుంచి గ్రౌండ్ వర్క్ బాగానే ప్రిపేర్ చేశారు సునీత. ఆకాష్ కి సంబంధించిన ఫోటో షూట్స్, స్టిల్స్..ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్  కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ డైరెక్షన్ లో ‘‘సర్కారు నౌకరి’’ అనే సినిమాలో కనిపించబోతున్నాడు ఆకాష్. అలాగే ఈ మూవీ ద్వారానే నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా  వెండితెరకు పరిచయమవుతున్నారు. సునీత ఎప్పటినుంచో తన కొడుకు కోసం కంటున్న కల ఇప్పుడు నిజం అయ్యింది. "పెద్ద రోగం చిన్న ఉపాయం సర్కారు నౌకరి " అనే టాగ్ లైన్ తో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సింగర్ సునీత ఆ క్లిప్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. గతంలో మ్యూజిక్‌ డైరెక్టర్ , సింగర్‌ ఐన కోటి కుమారుడు హీరోగా పరిచయం అయినప్పటికి పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. తర్వాత దేవి శ్రీప్రసాద్ కూడా వెండితెరపై వెలగాలనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు.. ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ కొడుకు ఆది మాత్రం హీరోగా సెటిల్ అయ్యారు. మరి ఇప్పుడు సునీత కొడుకు ఆకాష్ సాహసం చేస్తున్నట్లే చెప్పొచ్చు. ఆయన నటించిన మూవీ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది..టీజర్, ట్రైలర్ అన్నీ బయటకు వచ్చాక మూవీ రిలీజ్ అయ్యాక ఆకాష్ ని ఆడియన్స్ ఎలా చూస్తారు..? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే  కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.

మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది...

ఢీ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ ఐపోయింది. రాబోయే వారం నుంచి టీమ్స్ మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్టుగా ఉండబోతోంది అన్న విషయం ఈ ప్రోమో ద్వారా అర్ధమైపోతుంది. ముందుగా కింగ్స్ ఆఫ్ కరీంనగర్ వెర్సెస్ సైరా రాయలసీమ టీమ్స్ మధ్య ముందుగా పోటీ మొదలయ్యింది. తర్వాత బెజవాడ టైగర్స్ వెర్సెస్ ఓరుగల్లు వీరులు టీమ్స్ మధ్య పోటీ కూడా అంతే రసవత్తరంగా సాగింది. ఇక ఈ షోకి బాలయ్య గెటప్ లో వచ్చిన హైపర్ ఆది ఒక అట్రాక్షన్ ఐతే ..యుట్యూబ్ లో  ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ మూవీస్ లో నటిస్తూ ఫేమస్ ఐన  సునయన ఈ స్టేజి మీదకు  ఎంట్రీ ఇచ్చి ఆ అట్రాక్షన్ కి కొంచెం కామెడీ ఎమోషన్ టచ్ ఇచ్చి  ఫన్ క్రియేట్ చేసింది. బ్లాక్ డ్రెస్ విత్ పంచె కట్టు, నల్ల కళ్ళద్దాలతో నోట్లో చుట్టతో సెట్ లోకి వచ్చి కూర్చుని "కాపు కాసే కరీంనగరోళ్ళు , చుట్టూముట్టిన బెజావాడోళ్ళు, కమ్ముకొస్తున్న కర్నూలోళ్లు, కత్తిగట్టిన వరంగలోళ్లు ఎగేసుకోస్తాండారు" అంటూ బాలయ్య లెవెల్లో ఒక డైలాగ్ చెప్పాడు. ఇంతలో స్టేజి మీదకు సునయన దూసుకొచ్చి "ఎవడో సతాయిస్తున్నాడని అన్నావ్" అంటూ దీపికా పిల్లిని అడిగింది వెనక నుంచి ఆది వచ్చి "హలో" అనేసరికి సునయన సిగ్గుపడిపోయింది.. డ్రీమ్స్ లో "మాష్టారు మాష్టారు" సాంగ్ వేసుకునేసరికి "మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది" అన్నాడు ఆది "నాకు మాత్రం మిమ్మల్ని చూస్తేనే బతకాలనిపిస్తోంది" అంది "ప్రదీప్ నాకు ఆది ఎలాగైనా కావాలి" అని కన్నీళ్లు పెట్టుకొనేసరికి " ఈ సమాజం ఒప్పుకోదు" అనేసరికి సెట్ లో ఉన్న టీమ్స్ అంతా గట్టిగా అరిచారు ..దాంతో ఆది దిగి వచ్చి సునయనను తన గుండెల మీద తల ఆన్చుకుని ఓదార్చాడు...వెంటనే సునయన కన్నీళ్లు తుడుచుకుని  "థాంక్యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ" అంది.. ఆ తర్వాత రీసెంట్ గా చనిపోయిన రాకేష్ మాష్టర్ ని ఈ స్టేజి మీద గుర్తు చేసుకున్నారు. ఒకప్పటి రాకేష్ మాష్టర్, శేఖర్ మాష్టర్ వీడియోని ప్లే చేసి చూపించారు. "మాష్టర్ తో ఏడెనిమిదేళ్ళ జర్నీ నాది..కానీ చాలామంది తెలిసీ తెలియక మాట్లాడుతుంటే మాత్రం చాలా బాధ కలుగుతోంది" అని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్.  

 కరివేపాకు వెళ్లి పక్కన నుంచో... మీ అమ్మతో తిట్టిస్తావా...

ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం కామెడీ ఏమో కానీ భాస్కర్ వాళ్ళ అమ్మ మాత్రం ఇమ్మానుయేల్ ని పట్టుకుని అందరి ముందు దుమ్ము దులిపేసింది. పటాస్ ప్రవీణ్ టీమ్ లో సత్తిపండు తన భార్యతో వచ్చి స్కిట్ చేసాడు. అది చూసిన రష్మీ వెంటనే మాట్లాడుతూ ఒక  సీనియర్ కపుల్ మన మధ్య ఉన్నారు అని భాస్కర్ వాళ్ళ అమ్మని నాన్నని చూపించింది. మీ పెళ్ళై ఎన్నేళ్లయింది అని అడిగేసరికి 1976 లో అయ్యింది అని చెప్పారు వాళ్ళు . "మీ ఇంట్లో వంటలో ఉప్పు తక్కువైతే ఎం చేస్తారు" అని అడిగేసరికి "ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకుంటాం" అని చెప్పారు భాస్కర్ వాళ్ళ నాన్న. "ఎప్పుడైనా నాన్నని కొట్టావా" అని భాస్కర్ వాళ్ళ అమ్మని ఇమ్మానుయేల్ ని అడిగాడు " నేను ఎప్పుడూ కొట్టలేదు. రెండు రోజులు మాట్లాడను కానీ...కొట్టడం ఉండదు...మా ఆయన అంటే చాలా ఇష్టం. నేనన్నా కూడా ఆయనకు అంతే ఇష్టం..మా ఆయనకు 18 ఏళ్ళు నాకు 13  ఏళ్ళు..అప్పుడు పెళ్లి చేశారు..అప్పుడు అన్ని రకాల ఆటలు ఆడేదాన్ని. ఆ టైములో  మా నాన్న వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను పెళ్లి చేసుకో..లేదంటే నూతిలో దూకేస్తాను అంటే పెళ్లి చేసుకున్నా  " అని చెప్పారు వాళ్ళ అమ్మ. "కోడళ్ళు ఎంతమంది" అని ఇమ్ము అడిగేసరికి "కోడళ్ళు ఎంతమందైనా కానీ పోషిస్తున్నాడా లేదా అని చూసుకుంటాను. నీ కెపాసిటీ నీది నువ్వు అందమైనదాన్ని చేసుకో..ఐనా నీ ఫేస్ కి ఒక్కతి కూడా దొరకడం లేదు ఇంకా ముగ్గురు దొరుకుతారా..నా కొడుకు భాస్కర్ అందగాడు..ఎవరైనా సరే మా అబ్బాయి మీద పైట విసిరారు కానీ మా అబ్బాయి ఎవరి మీద షర్ట్ విసరలేదు...నువ్వు విసిరినా ఎవరూ పడడం లేదు...తిట్టాను అన్నావ్ కాబట్టి  తిట్టాను. నువ్వు తేల్చుకుందాం అంటే వంద మందిని తెచ్చుకో నేను ఒక్కదాన్నే వస్తాను మా ఆయన కూడా రాడు.." అని భాస్కర్ వాళ్ళ అమ్మ అనేసరికి " నీ టీమ్ లోంచి వెళ్లిపోయానని ఎన్నెన్ని మాటలు అనిపిస్తున్నావ్ నన్ను మీ అమ్మతో...ఏందయ్యా ఇది నాకు " అని ఇమ్ము భాస్కర్ ని చూస్తూ ఫీలైపోయేసరికి "కరివేపాకు వెళ్లి పక్కన నుంచో" అని రష్మీ కూడా కౌంటర్ వేసేసింది..."ఆ మాట నేను అందామని అనుకున్న కానీ నువ్వు ఫీలవుతావని అనలేదు" అంటూ ఇమ్ముని ఒక ఆట ఆడేసుకున్నారు బులెట్ భాస్కర్ వాళ్ళ అమ్మ.  

కృష్ణని ప్రేమిస్తున్నాని మురారి చెప్పడంతో ఎమోషనల్ అయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -197 లో.. కృష్ణని స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు తీసి కాపాడతాడు. కృష్ణని  మురారి ఎత్తుకొని వెళ్తుంటే.. సడన్ గా ముకుంద ఎదురుపడుతుంది. నువ్వు ఏంటి ఇక్కడ అని మురారి షాక్ అవుతాడు. రాను అనుకున్నావా? రాలేనని అనుకున్నావా  అని ముకుంద అంటుంది. ఎందుకు వచ్చావ్ అని మురారి అడుగుతాడు. "నువ్వు ఎక్కడ ఉంటే.. నేను అక్కడే" అని ముకుంద అంటుంది. సరే నీతో మాట్లాడాలి మళ్ళీ కలుస్తా అని మురారి వెళ్ళిపోతాడు. నీతో కూడా తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ అబద్ధం చెప్పినందుకు తనని మురారి ఆటపట్టిస్తుంటాడు. మీరు నిజంగా శాడిస్ట్ అంటూ మురారిని అంటుంది కృష్ణ. అప్పుడే భవాని మురారికి ఫోన్ చేస్తుంది. మురారి ఆదర్శ్ గురించి ఏమైనా తెలిసిందా? అసలు ఆదర్శ గురించి పట్టించుకోవడమే మానేశావని మురారితో భవాని అంటుంది.. లేదు పెద్దమ్మ వారం రోజుల్లో అప్డేట్ ఇస్తా అన్నారని మురారి అంటాడు.. నువ్వు ఆదర్శ్ గురించి పట్టించుకోకుండా ఆ తింగరి పిల్లతో షికారు చేస్తున్నావా అని భవాని అంటుంది. ఆ తర్వాత భవాని ఫోన్ కట్ చేస్తుంది. ఆదర్శ్ ఎక్కడ ఉన్నావ్? త్వరగా రా అని తనలో తాను అనుకుంటాడు మురారి.  ఆ తర్వాత ముకుంద దగ్గరికి మురారి వెళ్తాడు. నీకోసం ఎదురు చూస్తున్నా అని ముకుంద అనగానే.. నేను ఈ రోజు కోసం చూస్తున్నానని మురారి అంటాడు. ఇలా ఏకాంతంగా కలిసే రోజు కోసమా అని ముకుంద అనగానే.. నన్ను ఇలా కలవడానికి ట్రై చెయ్యకనే చెప్పే రోజు కోసమని మురారి అంటాడు. మన మధ్య ఇప్పుడు ప్రేమ లేదు. నీకో నిజం చెప్పాలని మురారి అంటాడు. ఏంటి అని ముకుంద అడుగగా.. నేను కృష్ణని ప్రేమిస్తున్నానని మురారి చెప్తాడు. ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత నా విషయంలో నువ్వు తప్పు చేశానని నీకు అనిపించడం లేదా అని ముకుంద అడుగుతుంది. అనిపిస్తుంది నా ప్రాణ స్నేహితుడికి ఇచ్చి నీకు  పెళ్లి చేశానని కానీ ఇప్పుడు నువ్వు నా ప్రాణస్నేహితుడి భార్యవి అని మురారి అంటాడు. నా ప్రేమ నీకే.. నీ ప్రేమ నాకే ఇదే. నా సంకల్పం అని ముకుంద అంటుంది. మన విషయం భవాని అత్తయ్యకి చెప్తానని ముకుంద అనగానే.. అల్ ది బెస్ట్ అని మురారి అంటాడు. మురారి మాటలకి ముకుంద ఎమోషనల్ అవుతుంది. ఇవన్నీ నిజాలు ఎప్పటికైనా ఇంట్లో వాళ్లకి తెలిసేవే.. నేను మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలని మురారి అనుకుంటాడు.. ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ వచ్చి సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.