మురారి తన ప్రేమని కృష్ణకి చెప్పడానికి అడుగడుగునా అడ్డంకేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -200 లో.. మురారి కృష్ణ ఇద్దరు ఫామ్ హౌస్ నుండి ఇంటికి వస్తారు. కృష్ణ, మురారిల కంటే ముందుగా వచ్చిన ముకుంద.. మురారి డైరీని కృష్ణ చూడాలని కబోడ్ లోని బట్టలలో పెడుతుంది. కృష్ణ బట్టలు సర్దుతుంటుంది. ఆ బట్టల్లో తన డైరీని చూసిన మురారి.. వెంటనే కృష్ణ చూడకముందే డైరీని తీసుకుంటాడు. ఆ డైరీలో ఏదో ఉందని చూసేసరికి.. ముకుంద తన ప్రేమని డైరీ లో రాయడం  చూసి.. మురారి కోపంగా పేపర్ చింపేస్తాడు. ఆ తర్వాత మురారి ఆలోచిస్తుంటాడు. ఏంటి ఏసీపీ‌ సర్ మీరు ఇంకా వెళ్ళలేదా అని కృష్ణ అడుగుతుంది. నువ్వు వస్తే చెప్పి వెళదామని వెయిట్ చేస్తున్న అని మురారి అంటాడు. మీరు నాకు అబద్ధం చెప్తున్నారని కృష్ణ అనగానే.. లేదు కృష్ణ నీకు అబద్ధం చెప్పనని మురారి అంటాడు. ఇంత టెన్షన్ ఎందుకు నా ప్రేమ గురించి చెప్పేస్తా అని మురారి కృష్ణ చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు. మరొక వైపు కృష్ణ, మురారిలు ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయాలు గురించి ముకుంద ఆలోచిస్తుంటుంది. కృష్ణని మురారి ప్రేమిస్తే నా పరిస్థితేంటని ముకుంద అనుకుంటుంది. మురారి, కృష్ణని ప్రేమిస్తే.. కృష్ణ మురారిని ప్రేమిస్తుందా.. నా ప్రేమని నేను వదులుకొనని ముకుంద తన ప్రేమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు కృష్ణని బయటకు తీసుకొని వచ్చిన మురారి.. ఒక దగ్గర కార్ ఆపి కృష్ణకి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. ఏసీపీ సర్ డైరీ అమ్మాయి గురించి చెప్తాడని కృష్ణ అనుకుంటుంది. మురారి తన ప్రేమని చెప్పడానికి ధైర్యం చాలక‌‌.. ఇండైరెక్ట్ గా కృష్ణకి ప్రశ్నలు వేస్తాడు. కృష్ణ మాత్రం తన ప్రేమ బయటపడకుండా సమాధానం చెప్తుంది.. ఎలాగైనా అగ్రిమెంట్ మ్యారేజ్ ని పర్మినెంట్ చేద్దాం కృష్ణ అని మురారి  చెప్పాలనుకుంటాడు. అప్పుడే రేవతి ఫోన్ చేసి.. కృష్ణని ఎక్కడికి తీసుకొని వెళ్ళావని మురారిని అడుగుతుంది.. షాపింగ్ కి తీసుకొని వెళ్ళమని కృష్ణ చెప్తే.. తీసుకొని వచ్చానని మురారి చెప్తాడు. ఆ తర్వాత రేవతితో కృష్ణ మాట్లాడుతుంది. అత్తయ్య నన్ను రిటర్న్ రమ్మంటున్నారని అబద్దం చెప్తుంది కృష్ణ. ఎక్కడ మురారి తన డైరీ అమ్మాయి గురించి చెప్తాడోనని, అది విని తట్టుకోలేనని భావించిన మురారికి అబద్ధం చెప్తుంది. మీరు ఏదో చెప్తానన్నారని కృష్ణ అనగానే.. తర్వాత చెప్తానని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ ఇంటికి వస్తుంది. ఇంటిముందు ముకుంద చెప్పులు చూసి షాక్ అవుతుంది. ఫామ్ హౌస్ లో చూసిన చెప్పులను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషి, వసుధారలకి ఒకరంటే ఒకరికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -806 లో..  వసుధార, రిషి గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకు నాతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఎందుకు ఇంకా నా ప్రేమ గురించి పరితపిస్తుంది. నాకు గతం గుర్తు చెయ్యాలని ఎందుకు ట్రై చేస్తుంది. వీటికి దూరంగా వెళ్ళాలని రిషి ఇంటి నుండీ బయటకి వెళ్తాడు. రిషి బయటకు వెళ్ళి ఒక దగ్గర కార్ ఆపి వసుధార గురించి ఆలోచిస్తాడు. రిషి తనకు తానే మాట్లాడుకుంటాడు. అసలు తన మీద నాకు ఉన్నది ప్రేమనా,  ద్వేషమా, కోపమా మళ్ళీ తన ప్రేమని గుర్తు చేస్తుందని ఇక్కడ నుండి పారిపోతున్నానా.. నేను  ఉన్న దగ్గరికి తను వచ్చింది. కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు పారిపోవాలి. తనే కాదు.. మా డాడ్ వచ్చిన నా కోపం ఇలాగే ఉంటుంది. నేను మారనని రిషి అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. మరొక వైపు వసుధార, రిషి గురించి ఆలోచిస్తు.. మీకు కోపం ఉంది. కానీ నాపై ప్రేమ కూడా ఉందని వసుధార అనుకుంటుంది. ఒకసారి రిషి సర్ ని చూడాలని ఉందని వసుధార అనుకొని రిషి గదిలోకి వెళ్తుంది. వసుధార వెళ్లేసరికి రిషి తన గదిలో ఉండకపోయేసరికి.. రిషి కి ఫోన్ చేస్తుంది. వసుధార చేస్తుందని రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఏంజిల్, విశ్వనాథ్ లు రిషి ఎక్కడికి వెళ్లినట్లు అని ఆలోచిస్తూ ఉంటారు. రిషికి ఏంజిల్ ఫోన్ చేసి.. ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. క్యాజువల్ గా బయటకు వచ్చాను. ఇప్పుడు వస్తున్నానని  ఏంజిల్ తో రిషి చెప్తాడు. మీరు నా ఫోన్ కట్ చేసినా.. నా ప్రశ్నకి సమాధానం దొరికిందిప్పుడు. నా మనసు తేలిక అయిందని వసుధార అనుకుంటుంది. మరొక వైపు రిషి వచ్చేసరికి వసుధార హాల్లో ఎదురు చూస్తంటుంది. ఒక్క నిమిషం సర్ అని రిషిని ఆగమంటుంది. నేను ఇక్కడ ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బందిగా అనిపించి బయటకు వెళ్ళారా? మీరు ఈ టైమ్ అయినా రాకపోయే సరికి ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు టెన్షన్ పడ్డారు. నా వల్ల అసౌకర్యంగా ఉందా అని వసుధార అనేసరికి.. "మేడం మీరు అసౌకర్యం, ఇబ్బంది.. అంటూ వింతగా మాట్లాడుతున్నారు. కొందరు నా జీవితంని ఇలా చేశారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే వింతగా ఉంది. ఎదుటి వారిపై నమ్మకం ఉండాలి. అది లేకుండా చేశారు. ఈ రిషి పరిస్థితులకు బయపడి వెళ్ళడు" అని రిషి అంటాడు. మీరు ఎన్ని అన్నా నేను భరిస్తాను. ఎందుకంటే నేను అబద్ధం చెప్పాను అది మీ కోసం చేశాను అని వసుధార అంటుంది. రిషి వెళ్ళిపోయాక  పెళ్లి విషయంలో  రిషి సర్ నిజం తెలుసుకొని తర్వాత అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అర్ధం చేసుకుంటాడని వసుధార అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఏంజెల్ ఇంటి నుండి వసుధార వెళ్లిపోవడానికి రెడీ అయి హాల్లోకి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని ఏంజిల్ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

అప్పుని తీసుకెళ్ళిన పోలీసులు.. కావ్య వేసిన డిజైన్స్ ని మెచ్చుకున్న రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -139 లో... రాకేష్ తలపై అప్పు కొట్టినందుకు టెన్షన్ పడుతుంది. అప్పుడే అప్పు దగ్గరికి కనకం రాగా.. కనకం పై అప్పు కోప్పడుతుంది. నాకు చిరాకు తెప్పించకు ఇక్కడ నుండి వెళ్ళమని అంటుంది. ఎన్నడూ లేంది అప్పు టెన్షన్ పడుతుందేంటని కనకం అనుకుంటుంది.  మరొక వైపు రాజ్, కావ్య ఆఫీస్ కి వస్తారు. రాజ్ తో వచ్చిన కావ్యని చూసి.. అక్కడి సెక్యూరిటీ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తాడు. ఇప్పుడు మీ సర్ తో వచ్చానని రెస్పెక్ట్ ఇస్తున్నారా అని కావ్య అంటుంది. అప్పుడు చేసిన తప్పుకి ఇప్పటి వరకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం మేడం అని సెక్యూరిటీ అంటాడు. ఆఫీస్ లోపలికి వెళ్లిన రాజ్ అక్కడి ఎంప్లాయిని డిజైన్ పూర్తి అయ్యాయా అని అడుగుతాడు. ఇంకా లేదు సర్ అని శృతి చెప్తుంది. ఇప్పుడు ఫారెన్ నుండి క్లైంట్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలని రాజ్ శృతిపై అరుస్తాడు రాజ్. శృతి కొన్ని డిజైన్ చూపించగా బాలేవని మళ్ళీ తొందరగా రెడీ చేసి తీసుకొని రా అని రాజ్ చెప్తాడు. రాజ్ క్లయింట్ దగ్గరికి వెళ్లి.. మా డిజైనర్ ఇంకా రాలేదు. కొంచెం టైం కావాలని అడుగుతాడు. అందుకు వాళ్ళు సరే అంటారు. మరొక వైపు కనకం ఇంటికి పోలీసులు వస్తారు. ఎందుకు ఇలా వచ్చారని కృష్ణమూర్తి పోలీసులని అడుగగా.. "మీ కూతురు అప్పు, రాకేష్ అనే అబ్బాయి తలపై కొట్టిందని" అని చెప్పగానే కృష్ణమూర్తి, కనకం ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత అప్పుని పోలీస్ లు తీసుకొని వెళ్తారు. వద్దని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోకుండా తీసుకొని వెళ్తారు. మరొక వైపు రాజ్ పడుతూన్న టెన్షన్ చూడలేక శృతి దగ్గరికి కావ్య వెళ్లి తనే డిజైన్ రెడీ చేస్తోంది. మరొక వైపు స్టేషన్ లో ఉన్న అప్పు దగ్గరికి కనకం, కృష్ణమూర్తి వెళ్లి.. అప్పుని వదిలిపెట్టమని  ఎస్సై ని రిక్వెస్ట్ చేస్తారు. ఎంత రిక్వెస్ట్ చేసిన ఎస్సై, అప్పుని వదిలిపెట్టనని అంటాడు. ఆ తర్వాత కావ్య డిజైన్ రెడీ చేసి.. నువ్వు తీసుకొని వెళ్లి మీ సర్ కి చూపించు అని శృతితో అనగానే.. లేదు మేడం ఆ క్రెడిట్ మీకే దక్కాలి మీరే వెళ్ళండని శృతి అంటుంది. కావ్య వెళ్లి రాజ్ కి డిజైన్ చూపించగానే నీకేం తెలుసు డిజైన్ గురించి అని డిజైన్ చూడకుండానే చింపిస్తాడు. ఆ తర్వాత కావ్య రెడీ చేసిన డిజైన్ మళ్ళీ శృతితో కావ్య పంపిస్తుంది. బాగున్నాయ్ డిజైన్ అని శృతిని మెచ్చుకుంటాడు రాజ్. క్లయింట్స్ కి వెళ్లి చూపించగానే బాగున్నాయంటూ చెప్పగానే రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ‘కృష్ణ ముకుందా మురారి‘!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ లో మురారి పాత్రలో గగన్ చిన్నప్ప, ముకుందగా యష్మీ గౌడ, కృష్ణగా ప్రేరణ కంబం నటిస్తున్నారు.  కాగా మురారికి పెద్దమ్మ పాత్రలో టీవి యాక్టర్ ప్రియ నటిస్తుంది. ఈ సీరియల్ తాజాగా మంగళవారం నాటి ఎపిసోడ్‌తో రెండు వందల రోజులు పూర్తిచేసుకుంది. కాగా ఈ సీరియల్ ఫ్యాన్స్ ఇన్ స్టాగ్రామ్ లో అభినందనలు తెలుపుతున్నారు.  ఈ సీరియల్ ప్రారంభ ఎపిసోడ్ లలో.. వేరే దేశంలో మురారి, ముకుంద ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఇండియాకి వచ్చిన మురారికి పోలీస్ గా ఉద్యోగం వస్తుంది. ఒకరోజు ఒక క్రిమినల్ ని పట్టుకునే పరిస్థితులలో.. మురారి కింద హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న కృష్ణ వాళ్ళ నాన్న చనిపోతాడు. అయితే వాళ్ళ నాన్నని మురారి చంపడం చూసిన కృష్ణ షాక్ అవుతుంది. తను చనిపోతున్నానని తెలుసుకున్న కృష్ణ వాళ్ళ నాన్న.. మురారీతో కృష్ణ పెళ్ళి జరిపిస్తాడు. అయితే మురారి వాళ్ళ అన్న ఆదర్శ్, ముకుందని పెళ్ళి చేసుకుంటాడు. అయితే అదే సమయంలో ముకుంద, మురారిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా ముకుంద ఒక్కతే ఉండి, కృష్ణ మురారీలు కలిసి ఉండటాన్ని చూడలేకపోతుంది. ఎలాగైనా కృష్ణ, మురారీలను విడదీయాలని ముకుంద చూస్తుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌ లలో కృష్ణ, మురారీ ఇద్దరు కలిసిపోవాలని రేవతి వాళ్ళ ఫామ్ హౌస్ కి పంపిస్తుంది. అయితే ముకుంద వాళ్ళ ప్లాన్ ని పాడుచేసి ఏమీ తెలియనట్లు మళ్ళీ కృష్ణ, మురారీల కంటే ముందుగానే వచ్చేసి, మురారి డైరీని తన రూంలో పెట్టేస్తుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంటిబయట చెప్పులు చూసి.. ఎవరివని రేవతిని పిలిచి అడుగుతుంది కృష్ణ. దాంతో అవి ముకుంద చెప్పులని రేవతి చెప్తుంది. దాంతో కృష్ణ షాక్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఎపిసోడ్‌ చూడాల్సిందే.   

ఆమె పుట్టినరోజుని  ఫారెస్ట్ లో సెలబ్రేట్ చేసిన అఖిల్!

  అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లో అఖిల్ సార్థక్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల గొడవలు.. వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేవి. కాగా అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు అఖిల్ సార్థక్. అయితే తాజాగా అఖిల్ మంచి పాపులారిటీ సంపాదించుకొని.. ఈవెంట్స్, షోస్ తో బిజీగా ఉంటున్నాడు. అంతేకాకుండా బిబి జోడిలో తేజస్వినితో జతకట్టి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడి షోలో హాట్ పర్ఫామెన్స్ ఎవరిదంటే.. అఖిల్-తేజస్వినిల పేరే వినిపిస్తుంది. బిబి జోడీలో అఖిల్ కి  కౌశల్ తో నువ్వా నేనా అంటూ మాటల యుద్ధమే జరిగింది‌. అయితే కొన్ని కారణాల వల్ల అఖిల్ జోడీ ఫైనల్ వరకు వెళ్ళలేదు. అఖిల్ కి కండరాల నొప్పి వల్ల తన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో డాక్టర్లు కొన్నిరోజులు అఖిల్ ని డ్యాన్స్ చేయవద్దని చెప్పారంట.. అందుకనే బిబి జోడీ షో నుండి అఖిల్ తప్పుకున్నాడు. ఆ తర్వాత అఖిల్, తేజస్విని తరచు పార్టీలంటూ కలుస్తూనే ఉన్నారు. 'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సీన్స్ తో తేజస్విని ఆకట్టుకుంది. తేజస్విని పుట్టిన రోజుని అఖిల్ ఫారెస్ట్ లో సెలబ్రేట్  చేశాడు. అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లోనో, పబ్ లోనో పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకునే తేజస్విని.. ఇలా ఫారెస్ట్ లో సెలబ్రేట్ చేసుకోవడం మొదటిసారి అని,  ఫారెస్ట్ లో జరుపుకుంటానని కలలో కూడా అనుకోలేదంట. అక్కడ అఖిల్, తేజస్విని కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు అఖిల్.  

ఏ సర్టిఫికెట్ జోక్స్ ఎక్కువేస్తుంది.. వంటలక్క టాలెంట్ ని బయటపెట్టిన డాక్టర్ బాబు

  స్టార్ మాలో ప్రసారమైన "మా బోనాల జాతర"లో చాలా సెగ్మెంట్స్ జరిగాయి. ఇందులో కార్తీక దీపం వంటలక్క, మోనిత, డాక్టర్ బాబు ఎపిసోడ్ మంచి హైలైట్ గా ఉంది. ఎందుకంటే చాలా మంది ఫాన్స్ ఈ సీరియల్ టీంకి లెటర్స్ రాశారు. ఇక ఆ లెటర్స్ నుంచి కొన్నిటిని హోస్ట్ రవి చదివాడు. పాలకొల్లు నుంచి ప్రదీప్ అనే అతను రాసిన లెటర్ ఏంటంటే "మీరు సీరియల్ లో కనిపించిన ప్రతీసారీ చాలా క్లాసీగా కనిపిస్తారు. ఒక్కసారి మా అందరి కోసం మాస్ స్టెప్ వేస్తే చూడాలని ఉంది ప్రేమి గారు" అని రాశారు. దానికి ఈ సీరియల్ టీమ్ మొత్తం డాన్స్ చేసి చూపించింది.. "కార్తీక దీపం తర్వాత మీరు ఎవరిని ఎక్కువగా మిస్ అయ్యారు" అని రవి మోనిత అలియాస్ శోభా శెట్టిని అడిగాడు. "డాక్టర్ బాబుని" అని చెప్పింది మోనిత. తర్వాత నందిగామ నుంచి నరేంద్ర ఏం రాశారంటే "మా ప్రేమి గారిలో ఎవరికీ తెలియని హిడెన్ టాలెంట్ ఏమన్నా ఉందా..ఉంటే అదేంటి". "ఎవరికీ తెలియని టాలెంట్ ఏంటంటే ఎక్కువ సేపు నిద్రపోతాను" అని చెప్పేసరికి "అదే బ్యూటిఫుల్ స్లీప్" అన్నాడు రవి "డాక్టర్ బాబు మీలో హిడెన్ టాలెంట్ ఏంటి" అనేసరికి "అంత దాచుకుని చేసే పనులేమీ లేవు..అన్నీ ఓపెన్ గానే చేస్తాను " అని చెప్పారు. "ప్రేమి గారితో షూటింగ్ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి" అనేసరికి "ఆమెలో చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ..బయట ఎవరికీ తెలీదు కానీ ఏ సర్టిఫికెట్ జోక్స్ ఎక్కువగా వేస్తుంది" అనేసరికి డాక్టర్ బాబుని కొట్టింది దీప.."ఇదే హిడెన్ టాలెంట్" అన్నాడు రవి.  

కీర్తి-కార్తిక్ ఎంగేజ్మెంట్..పిల్లల్ని కనలేనని తెలిసి వాళ్ళు ఆ మాట అన్నారు...

సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని, బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వెళ్లిన కీర్తి భట్ రీసెంట్‌గా ఎంగే‌జ్‌మెంట్ జరుపుకుంది. త్వరలో యాక్టర్  కార్తీక్‌తో కీర్తి ఏడడుగులు వెయ్యబోతోంది.  వీరి ఎంగేజ్మెంట్ కి  సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. "మా బోనాలు జాతర" షోలో వీళ్ళ నిశ్చితార్థం స్టార్ మా నటీ నటుల మధ్యన చాలా గ్రాండ్ గా జరిగింది.  ఈ షోలో  కీర్తి తన జీవితంలో జరిగిన విషయాలను చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని కోల్పోయిన కీర్తి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అప్పట్లో ఒక పాపను కూడా ఆమె  దత్తత తీసుకుని పెంచుకుంది. ఐతే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన టైములో అనారోగ్య కారణాలతో ఆ పాప చనిపోయింది. ఇక విజయ్ కార్తీక్ తోటతో కీర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. "కీర్తికి ఫామిలీ లేదు అన్న బాధ లేకుండా నేను చూసుకుంటాను" అని కార్తీక్ చెప్పాక "నీకు నేను తోడుగా ఉంటాను.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ గా చూసుకుంటాను... నన్ను వదలకుండా ఇలాగే చూసుకో’ అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత ఈ జంట రింగ్స్ మార్చుకున్నారు. కార్తీక్ పేరెంట్స్ గురించి కీర్తి మాట్లాడింది. "నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లలేనని తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకి చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా, నువ్వే మా పాపా. మనం పాపని దత్తత తీసుకుందాం’ అన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కీర్తి. కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లి అతని స్వస్థలం.  సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాడు కార్తీక్. కన్నడలో హీరోగా ఫోర్ మూవీస్ లో నటించాడు. తెలుగులో ‘ఏబీ పాజిటివ్’, ‘చెడ్డీ గ్యాంగ్’ వంటి మూవీస్ లో కనిపించాడు. ఇక ఈ జంటకు అందరూ విషెస్ చెప్తున్నారు.  

రేవతికి మిషన్ ఉందని అబద్ధం చెప్పిన కృష్ణ, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో-199 లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఫామ్ హౌజ్ నుండి ఇంటికి బయల్దేరగా వారికన్నా ముందుగా ముకుంద ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఇంట్లోకి రాగానే మధు, అతని భార్య ఎదురుపడతారు.  మధు అతని భార్య కలిసి ముకుంద, మురారీల గది నుండి కొన్ని వస్తువులను చాటుగా తీసుకొస్తుంటారు. ఆ వస్తువులు ముకుంద చూస్తుందేమోనని ఒకవైపు మధు అతని భార్య టెన్షన్ పడగా, ముకుందేమో మురారి డైరీని తీసుకొస్తుంది. కాసేపటికి మురారి గదిలోకి వెళ్ళిన ముకుంద.. ఆ డైరీలో కొన్ని మాటలను రాసి అక్కడే ఉన్న కబోడ్ లోని బట్టలలో పెట్టేసి బయటకు వచ్చేస్తుంది. అప్పటికే కృష్ణ, మురారీలు ఇద్దరు ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన కృష్ణ, మురారీలని రేవతి ఆగమని చెప్తుంది. మీకోసం నేను వారం రోజులు లీవ్ తీసుకుంటే.. మీరు మధ్యలోనే వస్తారా అని కృష్ణ, మురారీలని రేవతి  అడుగగా.. మా కమీషనర్ సర్ ఒక మిషన్ కోసం అర్జెంట్ గా రమ్మన్నాడని మురారి అంటాడు. అలా మురారి అనగానే.. మీ కమీషనర్ కి కాల్ చేయు.‌ నేను మాట్లాడుతానని రేవతి అంటుంది. నీ కొడుకు మీద నమ్మకం లేదా.. ఇదేమైనా స్కూలా అమ్మా అని మురారి అనగానే.. నీ మాట నేను నమ్మను. కృష్ణ మాటనే నమ్ముతానని రేవతి అంటుంది. నిజమే అత్తయ్య.. ఏదో మిషన్ ఉందని తొందరగా వచ్చినట్లుగా కృష్ణ చెప్తుంది. ఇక సరేమని మురారిని వెళ్ళమంటుంది రేవతి‌. మరొకవైపు వాళ్ళ గదిలోకి వెళ్ళిన మధు అతని భార్య కలసి ముకుంద, మురారీల గురించి మాట్లాడుకుంటారు. మురారిని ముకుంద ప్రేమిస్తుందనే విషయాన్ని మధు వాళ్ల భార్య మధుకి చెప్తుంది. అవునని మధు షాక్ అవుతాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళిన మురారి తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఏంటి ఏసీఫీ సర్ అలా ఉన్నారని కృష్ణ అడుగగా.. ఏమి లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.  

వసుధారతో ఉండనని మౌనంగా వెళ్ళిపోయిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -805 లో.. ఏంజిల్, విశ్వనాథ్ బయటకు వెళ్తూ.. వసుధారకి ఏమైనా అవసరం ఉంటే చూసుకోమని రిషికి చెప్పి వెళ్తారు.. వసుధార వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించి.. బెడ్ మీద నుండి కింద పడిపోతుంది. రిషికి ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించి డోర్ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఏమైనా అవసరం ఉంటే పిలిచేది కదా అని అనుకుని వెనక్కి వెళ్లిపోయి.. మళ్ళీ  కాసేపటికి వసుధార దగ్గరికి వస్తాడు. రిషి వచ్చేసరికి వసుధార కిందపడిపోయి ఉండడంతో.. ఏమైనా అవసరం ఉంటే పిలువచ్చు కదా అని వసుధారతో రిషి అంటాడు. నేనేం కావాలని పడిపోలేదని వసుధార అనగానే.. నేను అలా అనలేదని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధారని రిషి పైకి లేపి బెడ్ పై కూర్చోపెడతాడు. మరొకవైపు మహేంద్ర, జగతి ఇద్దరు ఇంట్లో నుండి బయటకు రావడం ఫణింద్రకి తెలిస్తే కాలేజీకి వస్తాడని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే జగతి, మహేంద్రల దగ్గరికి ఫణీంద్ర వస్తాడు. ఇలా ఇంట్లో నుండి నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారని ఫణింద్ర అడుగుతాడు. కాలేజీలో ఉంటే మిషన్ ఎడ్యుకేషన్ పనులు దగ్గర ఉండి చూసుకోవచ్చని వచ్చినట్టుగా మహేంద్ర అంటాడు. అంతేనా దేవయాని ఏమైనా అన్నదా అని ఫణింద్ర అడుగుతాడు. అదేం లేదని మహేంద్ర అంటాడు. మీరు ఇంటికి వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. మీతో కాలేజీ పనులు చూసుకుంటాను. వెళ్తే అందరం వెళదాం. లేదంటే లేదని ఫణింద్ర అనగానే.. సరే ఇక్కడే ఉండండి అని మహేంద్ర అంటాడు. మరొకవైపు రిషికి ఏంజిల్ ఫోన్ చేసి.. వసుధారకి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది. వెళ్లి ఇవ్వు మేం వచ్చేసరికి లేట్ అవుద్దని చెప్తుంది. సరే అని రిషి చెప్తాడు. వసుధార దగ్గరికి రిషి వెళ్ళి టాబ్లెట్ ఇస్తాడు. నాకు బోర్ కొడుతుంది. కంపనీ ఇవ్వగలరా అని వసుధార అనగానే.. కంపనీ, కాఫీ ఇవ్వడానికి నేను మునుపటి రిషిని కాదని రిషి అంటాడు. మీరు అలా ప్రతిసారీ మేడం మేడం అంటుంటే.. నాకు బాధగా ఉంటుంది. మీరు గతం గుర్తు చేసుకోకుండా ఉండడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు అనుకుంటా, మీరు గతం గుర్తుచేసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తే మీ చేతికి ఆ బ్రాస్ లైట్ ఎందుకు ఉందని వసుధార అడగ్గానే.. రిషి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు ఎలాగైనా రిషిని తీసుకొని వచ్చి.. మునుపటి లాగా కాలేజీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

ఆఫీస్ కి తీసుకెళ్తే రాత్రి ఏం జరిగిందో చెప్తానన్న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -138 లో.. రాజ్ ని కావ్య ఏం జరిగిందో చెప్పకుండా ఆటపట్టిస్తుంది. కావ్య సిగ్గుపడుతు వెళ్లిపోతుంటే.. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు హాల్లోకి వెళ్తారు. అప్పటికే హాల్లో అందరూ రెడీ అయి ఉండడం చూసి.. ఎక్కడికి వెళ్తున్నారని కావ్య అడుగుతుంది. శ్రీశైలం వెళదాం.. మీరు వెళ్లి త్వరగా రెడీ అయి రండి అని సీతారామయ్య అంటాడు.‌ లేదు తాతయ్య నాకు ఆఫీస్ లో అర్జెంటు మీటింగ్ ఉందని రాజ్ అంటాడు. నువ్వు అయిన రా కావ్య అని ఇందిరాదేవి అనగా.. ఆయన రాకుండా నేనెలా వస్తాను. ఆయనకు వంటకి ఇబ్బంది అవుతుందని కావ్య అంటుంది.. చూసావా కావ్య రాకుంటే ఎలా బతిమిలాడుతున్నారో చూసావా? నిన్ను అలా బ్రతిమిలాడేవాళ్ళా అని స్వప్నని రాహుల్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు.‌ కావ్య, రాజ్ ఇద్దరు  తప్ప అందరూ శ్రీశైలం వెళ్తారు. మరొకవైపు వాళ్ళ నాన్నకి ఎలాగైనా సాయం చెయ్యాలని తన ఫ్రెండ్స్ కి చెప్తుంది అప్పు. ఇప్పుడు క్యాటరింగ్ చేస్తున్నాం కదా.. ఒక ఈవెంట్ చేద్దామని అప్పు వాళ్ళ  ఫ్రెండ్  అంటాడు. నాకు తెలిసిన ఈవెంట్ వాళ్ళు సెలబ్రిటీ కోసం చూస్తున్నారు. మీ బావతో నువ్వు మాట్లాడి ఆ ఈవెంట్ కి తీసుకొస్తే మనకి యూజ్  అవుతుందని అప్పు ఫ్రెండ్ అంటాడు. నాకు అలా ఇష్టముండదని అప్పు అంటుంది. మీ అక్కతోనే సరిగా మాట్లాడడు ఇంకా నీతో మాట్లాడతాడా? ఆ ఇంట్లో మీ అక్క పని మనిషి అట కదా అని అప్పు ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడేసరికి.. అప్పుకి కోపం వస్తుంది.  తన ఫ్రెండ్ రాకేష్ ని బ్యాట్ తో తల మీద కొడుతుంది. దాంతో రాకేష్ కిందపడిపోతాడు. అప్పుని తన ఫ్రెండ్ అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. మరొక వైపు రాజ్ ఆఫీస్ కి రెడీ అయి వెళ్తుంటే.. నేను కూడా వస్తానని కావ్త చెప్తుంది. అవసరం లేదని రాజ్ అనగానే.. రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా అని కావ్య అంటుంది. ఏం జరిగింది చెప్పమని రాజ్ అంటాడు. నన్ను ఆఫీస్ కి తీసుకొని వెళ్తే చెప్తానని కావ్య అనగానే.. సరే మంచి చీర కట్టుకొని రా అని‌ రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఆఫీస్ కి బయల్దేరుతారు. మరొక వైపు రాకేష్ గురించి టెన్షన్ పడుతుంది అప్పు. అప్పుడే కనకం వచ్చి అప్పుతో మాట్లాడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావని కనకం అడుగుతుంది. ఏం లేదని అప్పు పంపిస్తుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఛేజ్ లు చేసి ఆమెను లేపుకెళ్లి పెళ్లి చేసుకుందామనుకున్నా... కానీ కుదర్లేదు

"భాగ్ సాలె" మూవీ జులై 7 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ హోస్టింగ్, రాజీవ్ కనకాల కామెడీ స్టేజి మీద నవ్వులు పూయించింది. ఇక రాజీవ్ కనకాలని సుమ ఒక ప్రశ్న వేసింది.."మీ జీవితంలో ఇలాంటి భాగ్ సాలె మూమెంట్లు ఏమన్నా జరిగాయా అని " "పెళ్ళికి ముందు నేను ఆమెతో ప్రేమలో ఉన్నాను. ఐతే పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు..కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఆమెను తీసుకొచ్చేద్దామని అనుకున్నా..అప్పుడు వారాసిగూడాలో ఉండేవాడిని. నేను ఆరోజు రాత్రి చెప్పేసాను...ఒక వేళ ఏమన్నా తేడా కొడితే ఉదయాన్నే ఆ అమ్మాయిని  లేపుకెళ్లిపోదాం అనుకున్నా. ఆ రాత్రంతా వారాసిగూడలో చేజ్ లు చేసి, యాదగిరిగుట్టకు వెళ్లాలని,  మా అమ్మా నాన్న పెళ్లి చేసుకున్న ప్లేస్ కి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఎన్నో అనుకున్నా.. తెల్లవారాక లేచి చూస్తే ఏముంది... ఆమె పేరెంట్స్ కూడా ఒప్పేసుకున్నారని తెలిసింది. అక్కడా ఆ భాగ్ సాలె కుదరలేదు. కాకపొతే కేరళ వెళ్ళినప్పుడల్లా భాగ్ సాలెనే..ఎందుకంటే అక్కడ నాకు ఎవరితో మాట్లాడ్డం రాదు. వాళ్ళు మాట్లాడితే అక్కడినుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి అనుకునేవాడిని. కానీ కుదరలేదండి" అని రాజీవ్ కనకాల అనేసరికి "రాజా ఇప్పుడు నీకు మంచి బాగ్ సాలె మూవ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాను " అంది సుమ ."మా కేరళ సంప్రదాయం ప్రకారం పెళ్లయ్యాక పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి పచ్చి పాలల్లో, పచ్చి అరటిపండు వేసి తినిపిస్తారు..ఆ రోజు ఇది పెట్టినప్పుడు  రాజీవ్ గారు మొహం అదోలా పెట్టారు కానీ ఇప్పుడు మీ అందరి సమక్షంలో దాన్ని తినిపించాలి అనుకుంటున్నా" అని చెప్పింది సుమ. "భాగ్ సాలె" అంటే లాగేట్టు బామ్మర్ది, లగెత్తు బావా  ఇలా అంటారని ఆ మూవీ టైటిల్ కి అర్ధం చెప్పారు రాజీవ్ కనకాల.

శివ్ ది జిమ్ బాడీ..అందుకే డాన్స్ చేయను అని చెప్పా

"నీతోనే డాన్స్" ఆదివారం ఎపిసోడ్ లో మరో నాలుగు జంటల మధ్య పోటీ మంచి రసవత్తరంగా సాగింది. ఇందులో ప్రియాంక జైన్- శివ్ ఇద్దరూ కలిసి పంజాబీ స్టయిల్లో డాన్స్ చేశారు. వీళ్ళ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ప్రియాంక ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసింది అని తేజస్విని మార్క్స్ ఇస్తూ మరీ చెప్పింది. అప్పుడు ప్రియాంక ఒక విషయాన్ని ఈ స్టేజి మీద షేర్ చేసుకుంది. "ఐదేళ్ల క్రితం నేను స్టార్ మాలోకి వచ్చాను. స్టార్ మా నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. నాకు అమ్ములు, జానకి అనే క్యారెక్టర్లు ఉన్నాయి అంటే అది ఈ స్టేజి వల్లనే. అప్పట్లో  ఒక షో వచ్చేది..సీరియల్  సీరియల్ కి మధ్య స్టార్ మా పరివార్ లీగ్ అనే పోటీ ఉండేది. అలా ఫస్ట్ టైం నేను శివ్ తో కలిసి డాన్స్ పెర్ఫార్మ్ చేసాను. ఆ తర్వాత నేను డైరెక్ట్ గా పిఆర్ దగ్గరకు వెళ్లి శివ్ తో డాన్స్ చేయను, లైఫ్ లో ఎప్పుడూ చేయను అని చెప్పేసాను. ఎందుకంటే  అప్పట్లో శివ్ కి జిమ్ బాడీ ఉండేది. బైసెప్స్ ఉండేవి. దాంతో డాన్స్ అసలు చేయలేకపోయేవాడు. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ చేసి బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది శివ్ తో డాన్స్ చేయడం" అని చెప్పింది ప్రియాంక. ఇలా ఈ సండే ఎపిసోడ్ మంచి హుషారుగా సాగింది. మార్క్స్ విషయంలో సాగర్-దీప, ఆట సందీప్-జ్యోతి, ప్రియాంక- శివ్ మధ్య గొడవ జరిగింది కానీ రాధా సర్దిచెప్పారు. ఇక హయ్యెస్ట్  మార్క్స్ తో సందీప్- జ్యోతి జోడి గోల్డెన్ సీట్ లో కూర్చునే ఛాన్స్ కొట్టేశారు. ఈ వారం ఎలిమినేషన్ లేదు కానీ నెక్స్ట్ వీక్ ఉంటుంది అని చెప్పింది శ్రీముఖి.    

షణ్ముఖ్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఆ పోస్ట్ తనకోసమేనా!

షణ్ముఖ్.. యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్.  షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్.. ఆ తర్వాత 'సూర్య' వెబ్ సిరీస్ తో ప్రతీ మధ్యతరగతి కుర్రాడికి కనెక్ట్ అయ్యాడు.  షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి స్నేహితులుగా మారారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది.  ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -5 లో షణ్ముఖ్ ఎంట్రీ  ఇచ్చాడు.  అదే సీజన్ లో సిరి హనుమంత్ కూడా రావడంతో.. వారిద్దరి హౌస్ లో క్లోజ్ గా ఉండటం వల్ల దీప్తి సునైన, షణ్ముఖ్ ల మధ్య కథ మారింది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు వరకు షణ్ముఖ్, దీపు వాళ్ళిద్దరి చేతిపై టాటూస్ ఉండేవి.  బిగ్ బాస్ పూర్తయ్యాక వారిద్దరు విడిపోయారు. కాగా ప్రస్తుతం‌ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడటం లేదు. అసలు విషయానికి వస్తే బిగ్ బాస్-5 లో షణ్ముఖ్, సిరి హన్మంత్ లు బాగా క్లోజ్ గా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లోనే అటు షణ్ముఖ్ వాళ్ళ అమ్మ, ఇటు సిరి వాళ్ళ అమ్మ వచ్చి.‌. అంత క్లోజ్ గా ఉండొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. కానీ వాళ్ళిద్దరు ఎవరి మాటలు పట్టించుకోకుండా అదే ధోరణిని కనబరిచారు. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కొన్ని రోజులకు షణ్ముఖ్, దీపు విడిపోయారు. అప్పట్లో అది నెట్టింట్లో వైరల్ గా మారింది. దాంతో షణ్ముఖ్, సిరి తో క్లోజ్ గా ఉండడం వల్లే వాళ్ళు విడిపోయారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పటి నుండి ఇద్దరు.. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు. మరోవైపు ఒకరి సోషల్ మీడియా పోస్ట్ లకు మరొకరు ఇండైరెక్ట్ గా కౌంటర్ లు వేస్తూ వస్తున్నారు. తాజాగా షణ్ముఖ్.. 'ది రైట్ పీపుల్ విల్ స్టే టూ ఫిగర్ ఇట్ అవుట్ విత్ యూ' అని ఒక పోస్ట్ ని పెట్టాడు. కాగా ఈ పోస్ట్ దీప్తి గురించే అయి ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

యాదమ్మ రాజు- స్టెల్లా మధ్య చిచ్చు పెట్టిన శ్రీముఖి

"నీతోనే డాన్స్" షో శనివారం ఎపిసోడ్ మొత్తం కూడా నటరాజ్ మాష్టర్ ఎపిసోడ్ లా మారిపోయింది. ఆయన కట్టుకొచ్చిన శారీ, లేడీ గెటప్, వయ్యారాలు పోవడంతో అందరూ ఆయనతోనే డాన్స్ చేయడానికి మొగ్గు చూపించారు. ఈ షోలో యాదమ్మరాజు - స్టెల్లా జంట అస్సాం డాన్స్ స్టైల్ ఐన బిహులో "రాధే గోవిందా" సాంగ్ కి డాన్స్ చేశారు. ఐతే వీళ్ళ డాన్స్ కి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. జడ్జెస్ కూడా పెద్దగా ఇంప్రెస్స్ అవలేదు. ఐతే వీళ్ళ డాన్స్ ఐపోయాక శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ ఆడించింది. "రీసెంట్ టైమ్స్ లో  నీ పార్ట్నర్ దగ్గర నువ్వు దాచిపెట్టిన అబద్దం ఏదైనా ఉందా" అని అడిగింది శ్రీముఖి. "స్టెల్లాకి తెలియకుండా నేను బయటకు వెళ్తూ ఉంటా..సీరియస్లీ జానకి ఐ లవ్ యు..ఎన్నో రోజుల నుంచి చెపుదాం అనుకున్న కానీ పెళ్లి చేసుకున్నా కదా చెప్పలేకపోయా..నువ్వే నా ఫస్ట్ లవ్" అన్నాడు రాజు. వెంటనే స్టేజి మీదకు జానకి అనే అమ్మాయిని పిలిచింది శ్రీముఖి. ఆమెతో కలిసి డాన్స్ చేసేసరికి స్టెల్లా సీరియస్ ఐపోయింది.."నేను వేరే అమ్మాయితో  నిన్ను ఊహించుకోలేను అన్న విషయం తెలుసు కదా. నువ్వు ఆమెను నిజంగా లవ్ చేస్తున్నావా ? మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్...ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయి" అని సీరియస్ గా స్టేజి మీద నుంచి బయటికి వెళ్ళిపోయింది స్టెల్లా... "నువ్వు కూడా అనొచ్చుగా నాకు యదామ్మరాజు వద్దు అని" అని సదా అడిగేసరికి "అదే రోజు వస్తే గనక అప్పుడు తనకు నా బాధేమిటో అర్ధమవుతుంది మేడం" అంది స్టెల్లా. తర్వాత డేర్ లో భాగంగా నటరాజ్ మాష్టర్ తో కలిసి ఒక అద్భుతమైన డాన్స్ చేయాలి అని యాదమ్మ రాజుకి టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. ఇక ఆ ఇద్దరూ కలిసి దుమ్ముదులిపేసారు.   

ఎపిసోడ్ ఐపోయాక ఛమ్మూని మీ దగ్గరకే పంపిస్తా

  నీతోనే డాన్స్ షోలో  ఫస్ట్ వీక్ నటరాజ్ మాష్టర్ - నీతూ డాన్స్ ఎవరికీ నచ్చలేదు..అలాగే నటరాజ్ మాష్టర్ జోడికి  చాలా తక్కువ మార్క్స్ కూడా వచ్చాయి. కానీ ఆ నెక్స్ట్ వీక్ నుంచి ఈ జోడి ఇరగదీసే  డాన్సస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్ళ డాన్స్ ని చూసేకొద్దీ చూడబుద్దేసేలా చేస్తున్నారు. ఈ వారం "నీతోనే డాన్స్" లో మహారాష్ట్రకు చెందిన "లావని" డాన్స్ స్టైల్ లో వేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక షో స్టార్టింగ్ లో నటరాజ్ మాష్టర్ గెటప్ చూసి మనసు పారేసుకున్నారు తరుణ్ మాష్టర్..ఆయనతో కలిసి చేసిన గరం మసాలా డాన్స్ పెర్ఫార్మెన్స్ కి రాధా, సదా ఫిదా ఇపోయారు. నటరాజ్ " నేను మాధురి దీక్షిత్, సిల్క్ స్మిత, రాధ , సదా నా ఫాంటసీగా ఉండేవారు...దాన్ని మొత్తం నువ్వే భంగం చేసేసావ్. నేను యోగిలా ఉండేవాడిని, భోగిని చేసేసావ్" అని అన్నారు తరుణ్ మాష్టర్. మరి ఈ పోరి పేరేమిటి అని శ్రీముఖి అడిగేసరికి "చమ్మక్ చల్లు..నేను ముద్దుగా ఛమ్మూ అని పిలుచుకుంటాను " అన్నారు తరుణ్. " ఏం కాంటాక్ట్ లెన్స్, ఏం గెటప్, ఏం మేకప్" అని తరుణ్ మాష్టర్ అనేసరికి "అంత పొగుడుతున్నారుగా ఒక ముద్దిచ్చేయండి మరి ఛమ్మూకి  అని శ్రీముఖి అడిగేసరికి నటరాజ్ మాష్టర్ చేతి మీద  తరుణ్ మాష్టర్ ముద్దిచ్చారు. ఈ సీన్ కి అందరూ గట్టిగా అరిచేసరికి "నిజంగా శ్రీముఖి ఈ గెటప్ చూస్తుంటే" అని తెగ ఫీలైపోయేసరికి "ఎపిసోడ్ ఐపోయాక మీ దగ్గరకే పంపిస్తా మాష్టర్" అంది శ్రీముఖి. దానికి రాధ, నటరాజ్ మాష్టర్ డబుల్ మీనింగ్ లో అర్ధం చేసుకుని అడిగేసరికి "మాట్లాడ్డానికి పంపిస్తా అన్నా" అని కవర్ డ్రైవ్ చేసుకుంది శ్రీముఖి.  

ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్ళిన బ్రహ్మముడి కనకం!

కనకం..‌ ఇప్పుడు స్టార్ మా టీవీ ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన క్యారెక్టర్. బుల్లితెర ధారావాహికల్లో బ్రహ్మ ముడి ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం ‌ఉన్న స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మ రథం పడుతున్నారు. ఇందులో కనకం-కృష్ణమూర్తి ల కుటుంబాన్ని మధ్యతరగతి వాళ్ళలాగా చూపించాడు డైరెక్టర్. బ్రహ్మముడి సీరియల్ లో ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఉండగా.. ఒక్కో కూతురికి ఒక్కో శైలి ఉంది. అయితే కనకం క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. ఒక మధ్య తరగతి తల్లి తన కూతురి కోసం కనే కలలను ఇందులో చక్కగా చూపిస్తున్నాడు. కనకం తన కూతుళ్ళకు గొప్పింటి కోడళ్లను చెయ్యాలని అనుకుంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో నీప శివ అలియాస్ కనకం.. ఈ మద్యతరగతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కనకం మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ని చూపించడమే కాకుండా కామెడీ వెర్షన్ తో ఆకట్టుకుంటుంది. కనకంకి తెలుగులో బ్రహ్మముడి మొదటి సీరియల్ అయినప్పటికి ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.  కనకం తాజాగా తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. అయితే గతవారం "ఫ్యామిలీతో కొత్త ప్రపంచానికి వెళ్ళామంటూ" ఒక వ్లాగ్ చేసింది కనకం(నీప శివ). అక్కడ అక్వేరియంలో ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేసిన కనకం.. ఇప్పుడు చెన్నైలోని ఒక ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది.‌ అక్కడ సరదగా పిల్లలతో కలిసి ఆడుతూ ఎంజాయ్ చేసింది. ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి అవుటింగ్ కి వెళ్ళి అక్కడ వ్లాగ్ లు చేస్తూ.. తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది కనకం. అయితే తన యూట్యూబ్ ఛానెల్ ని సబ్ స్కైబ్ చేసుకున్న వాళ్ళకి థాంక్స్ చెప్పింది కనకం. అలాగే బ్రహ్మముడి సీరియల్ లో కనకం క్యారెక్టర్ ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా థాంక్స్ అంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంది కనకం.  

రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తూ అందాలను ఆరబోసిన ఇనయా!

ఇనయ ముజిబుర్ సుల్తానా.. బిగ్ బాస్ సీజన్-6 ముందు వరకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ సీజన్-6 తో ఫుల్ ఫేమస్ అయింది. రామ్ గోపాల్ వర్మతో చిందులు వేసిన వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకొని, బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. లేడీ టైగర్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. హౌస్ లో ఎక్కువగా గొడవలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంది ఇనయా. హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కువ ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇనయ సుల్తానా బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకొని.. వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటూ వస్తోంది. హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుని తన వైపుకి తిప్పుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని కాబోలు బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక చాలా మంది రిచ్ గా ఉండాలని ఇల్లు కొనడం, కార్ కొనడం చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు ఇనయా సుల్తానా కూడా చేరింది. బిగ్ బాస్ వల్ల తన ఫ్యామిలీకి దగ్గర అయిన ఇనయా.. కార్ కొని ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా వ్లాగ్స్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఇనయా..‌ తను నటించిన నటరత్నాలు సినిమా ఆడియో ఫంక్షన్ లో హాట్ లుక్స్ తో అదురగొట్టిన విషయం తెలిసిందే.  కాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక హాట్ వీడీయోని పోస్ట్ చేసింది. అందులో తను పొద్దున్నే లేచాక.. తన డే ఎలా స్టార్ట్ అవుతుందో ఒక వీడియోని షేర్ చేసింది. అందులో తన అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. దీంతో నెటిజన్లు ఆ పోస్ట్ కింద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఇస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది ఇనయా.  

మేకల మధ్య పులిలా ఉండాలని చెప్పిన సుదీప!

పింకీ అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసినా పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకి అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప.. బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్‌-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీ తో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.‌. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఖతర్ వెళ్ళినట్టుగా పింకి పోస్డ్ చేసిన ఫోటోలు.. అప్పట్లో ఎంత వైరల్ గా మారాయో అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఇండియాకి వచ్చాక తను కొత్తగా కొన్న గింబల్ కొందని పొస్ట్ చేసింది. ఆ తర్వాత వరుసగా ట్రెండింగ్ రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది సుదీప. సుదీప తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. పులితో కలిసి తను దిగిన కొన్ని ఫోటోలని కలిపి వీడియోగా ఎడిట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సుదీప. ' Dare to be a tiger in a world full of sheep'  అని టైటిల్ పెట్టి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చుట్టూ ఉన్న ఎన్నో మేకల మధ్యలో ధైర్యంగా పులిలా ఉండాలని సుదీప మాటల్లో చెప్పింది. కాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ ‌అంతా సూపర్ అంటూ సుదీపకి అభినందనలు తెలుపుతున్నారు.  

కాబోయే వాడు ఆమె మాట వినాలి... ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు

  "నీతోనే డాన్స్" షో శనివారం ఎపిసోడ్ మంచి మంచి డాన్స్ స్టైల్స్ తో అలరించింది. ముందుగా కావ్య-నిఖిల్ జోడి గర్భ-దాండియా డాన్స్ స్టైల్స్ తో ఒక మ్యాజిక్ చేద్దామనుకున్నారు కానీ ఈ వారం మాత్రం ఎందుకో వీళ్ళ డాన్స్ తేలిపోయింది. జడ్జెస్ కూడా చాలా నిరాశకు గురయ్యారు. ఇక అంజలి-పవన్, నటరాజ్ మాస్టర్-నీతూ జోడీస్ 6 మార్కులు ఇస్తే యాదమ్మరాజు-స్టెల్లా జోడి మాత్రం 7 మార్క్స్ ఇచ్చారు. ఇక ఈ షోలో ఉన్న జోడీస్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా ఆడించింది శ్రీముఖి.. అందులో భాగంగా నిఖిల్ ట్రూత్ ఎంచుకునేసరికి "మీరు ఎలాగో ఏమీ చెప్పరు కాబట్టి కావ్యకి ఒక హజ్బెండ్ వస్తే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పండి" అని అడిగింది శ్రీముఖి. "తనకు రాబోయే హజ్బెండ్ తన మాట వినాలి.. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు..తనకు కంఫర్ట్ గా ఉన్న మనిషితో తప్ప మిగతా వాళ్ళతో టైం స్పెండ్ చేయదు..ఆమెకన్నా కొంచెం హైటె ఉండాలి" అని చెప్పాడు నిఖిల్. "కంపాటబిలిటీలో ఎన్ని మార్క్స్ ఇస్తావ్" అని కావ్యను అడిగింది శ్రీముఖి. "9 మార్క్స్ ఇవ్వొచ్చు..." అని కావ్య అనేసరికి "ఫ్రెండ్స్ తో వెళ్తాడని ఒక మార్క్ తగ్గించావ్ కదా" అని శ్రీముఖి రెచ్చగొట్టేసరికి "వాడు వెళ్ళడు బయటకు" అని చెప్పేసరికి "కావ్య ఒక్కసారి స్టార్ట్ చేస్తే అన్ని నిజాలే చెప్పేస్తుంది" అంది..తర్వాత కావ్యకి డేర్ ఇచ్చింది. "మీ ఇద్దరూ ఒక ఫోటో దిగి వి ఆర్ కమిటెడ్ అని పెట్టాలి" అనేసరికి కావ్య అలాగే చేసేసింది. ఫోటో పోస్ట్ చేసి "హ్యాపీలి కమిటెడ్ టు వన్ అండ్ ఓన్లీ నిఖిల్ " అని వాళ్ళ ఇద్దరి పిక్ ని పోస్ట్ చేసేసింది కావ్య..