బిపి ట్యాబ్లెట్స్ లేకుండా సీరియల్ ని ఎప్పుడు చూస్తాం సర్!

డైరెక్టర్ కుమార్ పంతం..గుప్పెడంత మనసు సీరియల్ తో పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య స్టార్ట్ చేసిన బ్రహ్మముడి సీరియల్ కూడా అత్యధిక టీఆర్పీతో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. దీంతో ఇప్పుడు స్టార్ మా టీవీ ఛానెల్ లో‌ ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలో టాప్ -5 లో ఈ రెండు సీరియల్స్ ఉండటం విశేషం. కుమార్ పంతం.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నాడు. తను ఎంచుకున్న గుప్పెడంత మనసు కథని ఒక క్లాస్ అమ్మయి, కాలేజ్ ఎండి ని ఇంప్రెస్ చేయడం.. కాలేజ్ టాపర్ గా వసుధార రావడం, దానికి కాలేజ్ ఎండీ రిషి తనకి దగ్గర అవడంతో ఈ గుప్పెడంత మనసు సీరియల్ మరింత క్రేజ్ ని సంపాదించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి, వసుధారల లవ్ స్టోరీకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. అలాగే డైరెక్టర్ కుమార్ పంతం చేస్తోన్న సీరియల్ బ్రహ్మముడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కవే.బ్రహ్మముడి సీరియల్ లో ప్రతీ పాత్రకి ఒక్కో ఇంపార్టెన్స్ ఇస్తూ కథని ఆసక్తికరంగా మలిచాడు. ఈ కథలో కావ్య పాత్రకి సింప్లిసిటిని అద్ది, బాగా డబ్బున్న కుటుంబంగా దుగ్గిరాల ఫ్యామిలీని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు ‌చూపిస్తున్నాడు. స్వప్న పాత్రలో హమీదా, కావ్యగా దీపిక రంగరాజు, అపర్ణగా శ్రీప్రియ, రాజ్ గా మానస్, కళ్యాణ్ గా కిరణ్, కనకంగా నీపా, రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ.. ఇలా అందరూ తమ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్ లలో ట్రెండింగ్ లో ఉన్నవాళ్ళే.. ఇలా అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. చింటు పంతం రాసిన ఈ కథ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీరియల్ ముందు వరకు ఎవరికి అంతగా తెలియని డైరెక్టర్ చింటు పంతం.. బుల్లితెరపై ఈ సీరియల్ ని ఆరాధించే అభిమానుల వల్ల అందరికి తెలిసిపోయాడు. అతను ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసిన మంచి స్పందన లభిస్తుంది. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ కుమార్ పంతం తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' స్టార్ట్ చేసాడు. అందులో అభిమానులు కొన్ని ప్రశ్నలు వేయగా డైరెక్టర్ కుమార్ పంతం క్రేజీగా సమాధానమిచ్చాడు. ' గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి గుడ్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సర్' అని ఒకరు అడుగగా.. మనకి ఎప్పుడు గుడ్ డేసే అని కుమార్ చెప్పాడు. "గుప్పెడంత మనసులో ఏమైనా ట్విస్ట్ లు ఎక్పెక్ట్ చేయొచ్చా సర్" అని అడుగగా.. చాలా ఉన్నాయి దాచాం అని చెప్పాడు. "రిషీధారలని కలపండి సర్.. మాకు టెన్షన్‌ తో పిచ్చెక్కుతుంది సర్" అని అడుగగా.. ప్రేమికుల మధ్య గొడవలు లేకపోతే  సరదా ఉండదబ్బా అని కుమార్ అన్నాడు. "సర్ బిపి ట్యాబ్లెట్స్ లేకుండా సీరియల్ ని ఎప్పుడు చూస్తాం సర్" అని ఒకరు అడుగగా.. కొన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేయండని కుమార్ చెప్పాడు.

మా బోనాల జాతరలో కీర్తి భట్ ఎంగేజ్మెంట్...సందడి చేసిన కార్తీదీపం జంట 

    ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసం మొదలవడమే బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. బోనాల జాతర అంటే చాలు అన్ని చోట్ల తీన్ మార్ డాన్సులు దుమ్మురేపుతూ ఉంటాయి . ఈ బోనాల జాతరను పురస్కరించుకుని చానెల్స్ కూడా షోస్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ మా ఛానల్ లో "మా బోనాల జాతర" ఈవెంట్ త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర ఆర్టిస్టులంతా పార్టిసిపేట్ చేసి ధూమ్ ధామ్ చేసేసారు. ఇక ఈ ప్రోమోలో కార్తీక దీపం దీప, డాక్టర్ బాబు, మోనిత హైలైట్ అయ్యారు. "ఊపులో ఉన్నారంటే తెలంగాణ జనాలు..మొదలయ్యాయి బోనాలు" అంటూ రవి మంచి జోష్ తో ఈ షో గురించిన ఇంట్రో చెప్పేసాడు. ఈ షోని రవి, వర్షిణి హోస్ట్ చేశారు. ప్రియదర్శి, కావ్య, బలగం వేణు కూడా డాన్సులు చేశారు. "సినిమా హిట్ ఐతే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది...లోకల్స్ వస్తే ఎంటర్టైన్మెంట్ దద్దరిల్లిపోద్ది" అంటూ నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు మంచి ఎనెర్జీతో డైలాగ్ చెప్పాడు. ఇక ఈ షోలో కళ్ళకు గంతలు కట్టి కుండల్ని కొట్టే పోటీ పెట్టారు. సైకిల్ పోటీలు, బెలూన్స్ ని పగలగొట్టే పోటీలు ఇలా నిర్వహించారు. "కార్తీక దీపం సీరియల్ ఐపోయాక మీరు ఎవరిని బాగా మిస్ అయ్యారు" అని హోస్ట్ వర్షిణి అడిగేసరికి ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా అనే సాంగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంటే డాక్టర్ బాబు, దీప అలా హీరో హీరోయిన్స్ లా పరిగెత్తుకుని వస్తుండగా మధ్యలో మోనిత అడ్డుగా నిలబడింది. ఆ సీన్ చూసేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఫైనల్ ఇందులో కీర్తి భట్ ఎంగేజ్మెంట్ ని కూడా చూపించారు. ఇక ఈ ప్రోమోకి నెటిజన్స్ కామెంట్స్ మాత్రం మాములుగా లేవు. "కీర్తి భట్ ఎంగేజ్మెంట్ వ్వావ్ కంగ్రాట్యులేషన్స్, వసుధారా ఒక్కటే వచ్చింది...మా రిషి సర్ ఎక్కడా...." అంటూ అడుగుతున్నారు

శ్రీసత్య-ఫైమా పెళ్లి చేసుకోబోతున్నారట...నరకానికైనా వెళ్తుందట

పటాస్ ఫైమా-శ్రీ సత్య ఎంత బెస్ట్ ఫ్రెండ్సో ఆడియన్స్ అందరికీ  తెలుసు. బిగ్ బాస్ హౌస్ నుంచి వీళ్ళు చాలా చక్కటి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా తరచూ కలుస్తూనే ఉన్నారు. అలాంటి శ్రీసత్య హోమ్ టూర్ ని ఫైమా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఇంటికి వెళ్లి చూసాక అక్కడ గోడ మీద అన్నీ బిగ్ బాస్ మూమెంట్స్ తో ఉన్న ఫొటోస్ కనిపించాయి. "నన్ను మర్చిపోయావని అనుకున్నా కానీ బానే పెట్టుకున్నావు నా ఫొటోస్ నువ్వు..నేనంటే అంత ఇష్టమా నీకు" అంది ఫైమా. "నాకు హౌస్ లో చాలా తక్కువ మంది కనెక్ట్ అయ్యారు. ఫైమా హౌస్ లో కంటే కూడా బయట ఎక్కువగా కనెక్ట్ అయ్యింది.." అని శ్రీసత్య చెప్పేసరికి "మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం" అంటూ బాంబు పేల్చింది ఫైమా. ఆ మాటకు శ్రీసత్య షాకయ్యింది. "నాకు అబ్బాయిలంటే ఇష్టం అమ్మాయిలు కాదు" అని ఆన్సర్ ఇచ్చింది శ్రీ సత్య. "బయట బాగా కలిసాం అన్నావ్ కదా అదే పెళ్లి చేసుకుంటే ఇంకా బాగా కలుస్తాం అని అలా అన్నా" అంది ఫైమా. తర్వాత శ్రీసత్య వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ ని చూపించాక ఇద్దరూ కలిసి బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసారు. "చెప్పాలంటే నాకు బయటకు వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు కానీ నా శ్రీసత్య పిలిచింది కాబట్టి కచ్చితంగా వెళ్తాను..శ్రీసత్య నువ్వు పిలిస్తే స్వర్గానికే కాదు నరకానికి కూడా వస్తాను" అని చెప్పింది ఫైమా. "నేను అక్కడికి వెళ్ళినప్పుడు పిలవలేను ఫైమా" అని శ్రీసత్య అనేసరికి "అమ్మా షాపింగులకు, పెళ్లిళ్లకు అన్నిటికి పిలుస్తావ్ కానీ నరకానికి పిలవ్వా..లేదు పిలువు వచ్చి వాలిపోతా" అని చెప్పింది ఫైమా.  

ఒక మనిషిని తయారుచేస్తున్నా.. సో వెయిట్ పెద్ద మ్యాటర్ కాదు

దేవదాస్ మూవీతో  తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది ఇలియానా. ఈ మూవీలో అచ్చమైన తెలుగింటి ఆడపిల్లల కనిపించింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఆ తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చివరగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని మూవీలో నటించింది. ఆ తర్వాత మూవీస్ లో పెద్దగా కనిపించలేదు. అలాంటి ఇలియానా ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ విషయాలను తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ ఇచ్చింది. "  బేబీ హార్ట్ బీట్ ని ఫస్ట్ టైం విన్నప్పుడు మీ  ఫీలింగ్ ఏమిటి" అని అడిగేసరికి "నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లోకెల్లా ఇది ఒక బెస్ట్ మూమెంట్. ఆ శబ్దం విన్నప్పుడు నాలో వచ్చిన సంతోషాన్ని నేను వివరించి చెప్పలేను. కొన్ని కన్నీళ్లు, కొంత సంతోషం, ఎంతో రిలీఫ్ గా ఎంతో హాయిగా అనిపించింది. ఉప్పెనంత ప్రేమకు గుర్తు ఈ చిన్న విత్తనం.. ఈ విత్తనమే త్వరలో పెద్దగా ఎదిగి బయటకు రాబోతోంది." అని చెప్పింది "మీకేమన్న బీచ్ హౌస్ ఉందా..ఎందుకంటే చాలా ఫొటోస్ వీడియోస్ అక్కడివే ఎక్కువగా కనిపిస్తాయి అందుకే అడుగుతున్నా" అనడంతో "లేదు మాకు బీచ్ హౌస్ అనేది లేదు...కానీ నాకు సముద్రపు ఒడ్డు అంటే చాలా ఇష్టం..నా ఆత్మను శాంత పరుస్తుంది..నా మనసును సంతోషంగా ఉంచుతుంది ఈ సముద్రపు ఒడ్డు" అని చెప్పింది. "బర్ఫీ 2 ఉంటే మీరు చేస్తారా..ఆ మూవీకి నేను పెద్ద ఫ్యాన్" అనేసరికి "వావ్..నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. బర్ఫీ మూవీ నాకు ఎప్పుడూ చాలా స్పెషల్..ఎందుకు అంత స్పెషల్ అంటే బర్ఫీ ఒక్కటే ఉంటుంది." అని చెప్పింది. "వెయిట్ పెరిగిపోతున్నారనే బాధ ఉందా" "మొదట్లో కొంచెం అనిపించింది. కానీ తర్వాత తెలిసింది. నేను ఒక మనిషిని నా లోపల తయారు చేస్తున్నా కాబట్టి వెయిట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. మీ బాడీ, మనసు చెప్పినట్టు వినండి...సంతోషంగా ఉండండి..మీకు ఏది సరైనది అనిపిస్తుందో అదే చేయండి" అని చెప్పింది ఇలియానా.      

తమ్ముడు మూవీ తొమ్మిదిసార్లు చూసా...కాలేజీ నుంచి ఫోన్ వస్తే నాన్నలా మాట్లాడేవాడిని

"సర్కార్ సీజన్ 3 " ఈ వారం షోకి "ఉస్తాద్" మూవీ టీం నుంచి కావ్య, సింహ, డైరెక్టర్ ఫణి దీప్, సాయి కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. గేమ్ మధ్యలో కావ్యతో కలిసి ప్రదీప్ స్టేజి మీద డాన్స్ చేసాడు.."వల్లంకి పిట్టా" సాంగ్ ప్లే చేసేసరికి "కావ్య చిన్నప్పటి ఆ వాయిస్ నీదేనా.. ఆ పాడింది నువ్వేనా" అని డైరెక్టర్ ఫణి కావ్యని అడిగేసరికి "ఈ విషయం అడుగుతున్నందుకు నీకు టూమచ్ గా అనిపించట్లేదా" అంది కావ్య.."చిన్నప్పుడు పాడితే విన్నాం ఇప్పుడు పాడితే వినాలి కదా" అని కౌంటర్ వేసాడు ప్రదీప్. "వచ్చింది ఉస్తాద్ ప్రొమోషన్స్ కి ఐతే గంగోత్రి ప్రొమోషన్స్ చేయిస్తారేమిటి" అని ఫన్నీగా సీరియస్ అయ్యింది కావ్య. తర్వాత "రియల్ మీ ఆస్క్ మీ ఎనీథింగ్ " అంటూ ప్రదీప్ ని ఒక ప్రశ్న అడిగారు. "మీరు అతి ఎక్కువసార్లు చూసిన సినిమా ఏది" అని అడగడంతో.."నేను తమ్ముడు సినిమా తొమ్మిది సార్లు చూసాను. నా ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్లి ఆ సినిమా చూసేవాడిని..చూస్తున్నంత సేపు ఆ సినిమా డైలాగ్స్ , సాంగ్స్ అన్ని చెప్పేసేవాడిని..నేను థియేటర్ ఓనర్ మంచి ఫ్రెండ్స్ ఐపోయాం. నేను మూవీకి చాలా రెగ్యులర్ గా వచ్చేవాడిని అని ఇంటర్వెల్ లో ఫ్రీగా రెండు సమోసాలు కూడా ఇచ్చేవారు. చాలా దూరం నుంచి బస్ లో వెళ్లి మరీ ఆ మూవీ చూసేవాళ్ళం. ఇంటికి వచ్చేసరికి కాలేజీ నుంచి ఫోన్లు వచ్చేవి...రోజూ కాలేజీ బంక్ కొడితే ఇంట్లో డౌట్ వస్తుంది అని తెలిసి రోజు రోజు విడిచి రోజు సినిమాకు వెళ్ళేవాడిని. ఐనా ఇంటికి ఫోన్లు వచ్చేవి. ఇక అప్పుడు ఇంటికి వచ్చేసరికి ఫోన్స్ వచ్చాయి అంటే నేనే మిమిక్రి చేసి మా నాన్నలా మాట్లాడేసేవాడిని. భలే సరదా టైం అది. మా ఫ్రెండ్స్ మొత్తం భయంభయంగా, ధైర్యంగా మా అంతటా మేము సినిమాలకు వెళ్లడం అప్పుడే స్టార్ట్ చేసాం" అని చెప్పాడు ప్రదీప్..    

కష్టపడిన వాడు, స్లిప్ పెట్టి రాసిన వాడు ఒకటే ఐపోయినట్టు ఉంది నా ఫీలింగ్

గీతూ రాయల్ పేరు వింటే చాలు ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్ సీజన్ 6 .. ఇందులో ఆమె ఏడ్చిన ఏడుపులు, అరిచిన అరుపులు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి గీతూ రెగ్యులర్ గా తన బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన ఫొటోస్ ని, వీడియోస్ ని తరచూ అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియో పోస్ట్ చేసి "ఈ ఎపిసోడ్ లో నా ఏడుపు చూసే నాకు ఏడుపొస్తోంది" అని ఫన్నీగా పెట్టుకుంది. తర్వాత చాలా రోజులయ్యింది మాట్లాడుకుని మాట్లాడుకుందామా" అని అడిగింది " ఏం చేస్తున్నావ్  ఈ మధ్య కాలంలో" అనేసరికి "బిగ్ బాస్ అన్ని సిరీస్ చూస్తున్నా..వెబ్ సిరీస్ చూస్తున్నా..హరీపాటర్ చూసా ఏం తీశాడులే సినిమా ..అందులో ఉన్నట్టు నాకు మంత్రాలు వచ్చి ఉండాలి అనుకుంటున్నా" అని చెప్పింది. "బ్లూ టిక్ మీద మీ అభిప్రాయం ఏమిటి" అని అడిగేసరికి "అందరికీ బ్లూ టిక్ రావాలనే ఆశ ఉంటుంది. నాకు కూడా ఒక టైంలో బ్లూ టిక్ ఎప్పుడొస్తుందా నేను ఎప్పుడు ఫేమస్ అవుతానా అనే ఆశ ఉండేది...ఇక నాకు బ్లూ టిక్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. జీవితం అంతా కలగన్నాను కదా ఈ బ్లూ టిక్ కోసం అనుకున్నా..నాకు బ్లూ టిక్ వచ్చిన టు మంత్స్ కే 700 కే బ్లూ టిక్ అమ్మేస్తుంటే చాలా బాధగా అనిపించింది..ఏడాది మొత్తం కష్టపడి చదివిన వాడు, స్లిప్ పెట్టి రాసిన వాడు ఇద్దరూ ఒకటే ఐపోయినట్టు ఉంది పరిస్థితి " "ఆదిరెడ్డిని మిస్ అవుతున్నారా" "అవును..హైదరాబాద్ లో ఉంటే తరచూ కలిసేవాళ్ళం..కానీ నెల్లూరులో ఉండిపోయాడు కదా..కొన్ని బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నాడు. ఒక ఇల్లు కడుతున్నాడు..ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు" "బిగ్ బాస్ ని మిస్ అవుతున్నారా ..బిగ్ బాస్ ఓటిటికి ఛాన్స్ వస్తే వెళ్తారా.."బిగ్ బాస్ నుంచి వచ్చిన త్రి మంత్స్ వరకు చాలా మిస్ అయ్యాను...నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చినా వెళ్ళను..." అని చెప్పింది గీతూ..  

డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. అందుకేనా ఈ పవర్ ఫుల్ వార్నింగ్

అష్షురెడ్డి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతే బోల్డ్ గా ఉంటుంది అలాగే ఆన్సర్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వార్నింగ్ ఇచ్చేసింది.. టిక్ టాక్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆర్జీవీ అభిమాని...ఆమె  గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో సూపర్ హాట్ ఫొటోస్ తో యూత్ ని మెస్మోరైజ్ చేస్తూ ఉంటుంది.  బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తన హవా ఎప్పుడూ కొనసాగిస్తూ ఉంటుంది. అలాంటి అష్షు ఈ మధ్య ఫారెన్ వెళ్లి రకరకాల స్టేజి షోస్ అవీ చేస్తోంది. వాటికి సంబందించిన ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అప్ లోడ్ చేస్తూ వస్తోంది. ఐతే అష్షు రీసెంట్ గా తన ఇన్స్టా స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "ఇది ఎవరికీ సంబంధించింది అంటే...కొంతమందితో నాకున్న ఫ్రెండ్ షిప్ కి సంబంధించి కొన్ని  మీడియా వర్గాలు రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.. దాన్నితీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విషయంలో సంబంధిత వ్యక్తులకు  నిజానిజాలు తెలియజేస్తాను. నా ఫోన్ నంబర్ ని బహిరంగంగా పోస్ట్ చేస్తే మాత్రం సహించేది లేదు" అంటూ ఒక వార్నింగ్ ఇచ్చేసింది. అష్షు ఈ మధ్య బుల్లితెర మీద ఎక్కడా కనిపించడం లేదు..ఐతే ఇప్పుడు ఇలాంటి ఒక వార్నింగ్ ఎందుకు పాస్ చేసిందా అని చూస్తే గనక డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈయన కాల్ లిస్ట్ ని డీకోడ్‌ చేసిన పోలీసులకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డి పేరుతో పాటు ఇంకొంతమంది పేర్లు బయటకు తీసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

కాలికి బెల్టుతో..చేతిలో స్టిక్ తో వరుణ్ సందేశ్...

హ్యాపీ డేస్  హీరో వరుణ్ సందేశ్ మూవీ షూటింగ్ లో గాయపడ్డాడు. "ది కానిస్టేబుల్" అనే మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తన కాలికి గాయమయ్యింది. కాలు కొంచెం బెటర్ అవ్వాలంటే త్రి వీక్స్ రెస్ట్ ఇవ్వాలని చెప్పడంతో ఇంట్లోనే కాలికి బెల్ట్ వేసుకుని స్టిక్ తో నడుస్తూ కనిపించాడు. ఈ విషయాన్నీ వితిక షేరు వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది "వరుణ్ సందేశ్ బాగున్నారు. తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ లో కాలికి గాయమయ్యింది. అతనికి మూడు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు...మీరంతా ఆయన మీద చూపిస్తున్న ప్రేమకు.. కోలుకోవాలంటూ చెప్తున్న విషెస్ కి థాంక్యూ" అని చెప్పింది. వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘ఢీ’ షోలో ఒక టీమ్‌కు లీడర్ గా ఉన్నారు. 'హ్యాపీ డేస్' మూవీతో ఒక మంచి బబ్లీ బాయ్ గా ఆడియన్స్ లో ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.   తర్వాత 'కొత్త బంగారు లోకం', 'ఏమైంది ఈవేళ', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వంటి మూవీస్ లో నటించారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మైఖేల్' మూవీలో  వరుణ్ సందేశ్ ఒక డిఫరెంట్ రోల్ చేశారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.  ప్రస్తుతం 'ది కానిస్టేబుల్', 'చిత్రం చూడర' అనే మూవీస్ లో చేస్తున్నారు. అతను చేసే మూవీస్  ఆశించిన ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. రీసెంట్ గా చేసిన  ‘ఇందువ‌ద‌న’ అనే హార‌ర్ కామెడీతో వ‌చ్చినా పెద్దగా లాభం లేకపోయింది. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం తర్వాత మంచి బ్రేక్ రాకపోవడంతో సైలెంట్ గా ఉన్న వరుణ్ ఇప్పుడు  ఈ రెండు సినిమాల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. వ‌రుణ్ సందేశ్ న‌టిస్తున్న ‘ది కానిస్టేబుల్’ మూవీని ఆర్యన్ శుభాన్ డైరెక్ట్ చేస్తున్నారు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది.  

పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన రిషి.. కేడీబ్యాచ్ లో మార్పు మొదలవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -797 లో.. విశ్వనాథ్ కంగారుగా రిషి దగ్గరకి వస్తాడు. ఏమైంది సర్ అని రిషి అడుగుతాడు. మన కాలేజీ లోని కేడి బ్యాచ్ ఏదో తప్పు చేసి పోలీస్ లకి దొరికిపోయారట.. ఆ విషయం ఇప్పుడే ఎస్ఐ గారు చెప్పారు. మన స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారంటే మన కాలేజీ పరువు పోతుందని విశ్వనాథ్ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత మీరేం టెన్షన్ పడకండి సర్ నేను చూసుకుంటాను. మన కాలేజీ పరువు పోకుండా నేను చూసుకుంటానని విశ్వనాథ్ కి చెప్తాడు. ఆ తర్వాత రిషి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అదే సమయంలో వసుధార స్టేషన్ కి వస్తుంది. అక్కడ స్టేషన్ బయట ఉన్న వసుధారని చూసిన రిషి.. ఏంటి నువ్వు వచ్చావని అడుగుతాడు. మన స్టుడెంట్స్ ఇలా ఉంటే మన కాలేజీ పరువుపోతుందని, ఇలా వచ్చానని వసుధార అంటుంది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. రిషి, వసుధారని చూసిన ఎస్ఐ..  DBST కాలేజీ చైర్మన్ అని గుర్తుపడుతాడు. సర్ మీరు వచ్చారా అని గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటే.. అక్కడే ఉన్న కేడి బ్యాచ్ కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి ఈ ఎస్ఐ కి రిషి సర్ తెలుసా ఇంకేముంది మా మీద ఉన్న కోపంతో ఇంకా మా గురించి ఎస్ఐ కి ఏం చెప్తాడో అని కేడి బ్యాచ్ అనుకుంటారు. రిషి, వసుధారలను ఎస్ఐ లోపలికి తీసుకొని వెళ్లి మాట్లాడుతాడు. "సర్ మీరేంటి ఇక్కడ అని" రిషిని ఎస్ఐ అడుగుతాడు. వాళ్ళు నా స్టూడెంట్స్.‌. వాళ్ళని వదిలి పెట్టండి అని రిషి చెప్తాడు. దానికి ఎస్ఐ ఒకే అంటాడు. రిషి సర్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని వదిలి పెడుతున్నా అని కేడీబ్యాచ్ తో చెప్పి వదిలిపెడతాడు ఎస్ఐ. వసుధారని రిషి తన కార్ లో ఎక్కమంటాడు. కేడి బ్యాచ్ ని రిషి కార్ ఫాలో అయి రమ్మని చెప్పామంటాడు.. రిషి నైట్ కాలేజీ దగ్గరికి కేడి బ్యాచ్ ని తీసుకొని వస్తాడు. "చూడండి వీళ్లని.. టైం విలువ వీళ్ళకు తెలుసు కాబట్టి నైట్ చదువుకుంటున్నారు" అని కొందరిని చూపిస్తూ కేడి బ్యాచ్ లో మార్పు వచ్చేలా రిషి చెప్తాడు. ఇప్పటికైనా మారండి అని కేడి బ్యాచ్ కి రిషి చెప్తాడు. మీరు నిజంగా జెంటిల్ మెన్ సర్ అని వసుధార తనలో తాను అనుకుంటుంది. మరొక వైపు జగతి మీటింగ్ లో మిషన్ ఎడ్యుకేషన్ పనులు గురించి లేట్ చెయ్యాద్దని జగతి అంటుంది. మీరు మిషన్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ బడ్జెట్ ని వినియోగిస్తున్నారని శైలేంద్ర అంటాడు. దాని గురించి జగతి వాదిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్లాస్టిక్ వాడకండి...అవగాహన కల్పిస్తున్న ఆదిరెడ్డి

ప్లాస్టిక్ లేనిదే మనిషి జీవితం లేదు అనే పరిస్థితి నెలకొంది. ప్లాస్టిక్ మనల్ని కబళిస్తోందని తెలిసినా, కాలుష్యం పెరిగిపోవడానికి ముఖ్య కారణం అని తెలిసినా మనం చాలా లైట్ తీసుకుంటూ ఉన్నాం. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మనం లైవ్ లో చూసేస్తున్నాం...రుతువులు మారిపోయాయి. సంవత్సరం పొడవునా ఎండాకాలం తప్ప మరో కాలం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. అలాంటి ప్లాస్టిక్ నివారించడం కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆది రెడ్డి కూడా ప్లాస్టిక్ మీద అవగాహన కల్పించడానికి రెడీ అయ్యాడు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. "హే ఫోక్స్ నేను ఆదిరెడ్డిని..నేను కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ప్లాస్టిక్ కాలుష్యానికి కారణం అంటూ ఒక క్యాంపైన్ చేస్తున్నాను. ప్లాస్టిక్ సమస్య అసలు ఎక్కడ వస్తోంది అంటే మనం డ్రింక్స్ తాగేటప్పుడు ప్లాస్టిక్ స్ట్రాస్ వాడతాం, అలాగే కేక్స్ కోసేటప్పుడు ప్లాస్టిక్ చాకులను వాడతాం..వాటితో పని పూర్తయ్యాక తీసి విసిరి పారేస్తాం. ఐతే ఈ ప్లాస్టిక్ భూమిలో కలవకపోగా కాలుష్యానికి పెద్ద ముప్పులా పరిణమిస్తోంది. కాబట్టి ఎవరైనా కేక్స్ కొనేటప్పుడు ప్లాస్టిక్  చాకులు తీసుకోవద్దు. అలాగే ప్లాస్టిక్ స్ట్రాస్ బదులుగా పేపర్ స్ట్రాస్ ని వాడండి అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఐతే ఈ విషయాల మీద ఎవరూ స్పందించడం లేదు. మీరు ఈ పోస్ట్ ని చివరి వరకు చదివాక "క్లాప్స్" ఎమోజిని రిప్లైగా పంపించండి. నేను మీకు ఒక టెక్స్ట్ పంపిస్తాను..ఈ పోస్ట్ చదివిన అందరికీ ధన్యవాదాలు" అని చెప్పాడు ఆదిరెడ్డి.  ఈ  ప్లాస్టిక్ అనే పదం "ప్లాస్టికో" అనే గ్రీకుపదం నుంచి పుట్టింది. దీనిని మొదటిసారి అలెగ్జాండర్‌ పార్క్స్‌ అనే బ్రిటిష్‌ సైంటిస్ట్  తయారు చేశాడు. ఈ ప్లాస్టిక్ భూసారాన్ని నాశనం చేస్తోంది. వీటి కారణంగా జంతువులు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నాయి. మరి ఆదిరెడ్డి తన వంతుగా ప్లాస్టిక్ గురించి అవగాహన కల్పిస్తున్నాడు.

ఆ డైరెక్టర్ పెద్ద సైకో...నా మీద చెయ్యెత్తాడు...అమ్మనా బూతులు తిట్టాడు

ఎప్పుడూ ఎవరికీ చెప్పని విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బుల్లితెర నటుడు శ్రీకర్ కృష్ణ. "కల్యాణ వైభోగం" సీరియల్ నుంచి తాను అసలు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది,  రావటానికి కారణం ఏమిటి అనే విషయాన్నీ చెప్పారు.  ఆ సీరియల్ డైరెక్టర్ రాంబాబు పెట్టిన టార్చెర్ ని కొన్ని నెలలు భరించి ఫైనల్ గా తట్టుకోలేక కంప్లైంట్ చేయడంతో డైరెక్టర్ ని మార్చలేరు కాబట్టి తన క్యారెక్టర్ ని చంపేసి అక్కడితో తన రోల్ కి మంగళం పాడేశారని చెప్పారు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇండస్ట్రీలో  ఆర్టిస్ట్ అవుదామని వచ్చేవాళ్ళు అన్ని రకాల మాటలు పడాల్సిందే...అన్ని అడ్డంకులను దాటాల్సిందే అన్నారు.  డైరెక్టర్ రాంబాబు మాట్లాడితే చాలు బూతులు తప్ప మరేమీ వినిపించవు. కోవిడ్ తో బాధపడుతూనే షూటింగ్ చేసినా కనీసం మానవత్వం లేకుండా తిట్టారన్నారు. రీజన్ లేకుండా తన మీద చెయ్యెత్తసరికి భరించలేకపోయానంటూ బాధపడ్డారు. ఆయన  ఒక సైకో టైపని, ఇంట్లో కూడా అలాగే ఉంటారని చెప్పారు. "కల్యాణ వైభోగం సీరియల్ లో చేసిన ప్రతీ ఆర్టిస్ట్ ఆయనతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ ఆయన్ని ఎందుకు ఉంచారో మాకు ఎప్పుడూ అర్ధం కాని విషయం .విజె సన్నీ కూడా ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసాడు. కానీ బయటకు వచ్చాక చెప్పలేదు ఎందుకో తెలీదు...తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. అప్పటికి నేను స్టార్టింగ్ స్టేజి కాబట్టి  ఎలాగైనా సరే పేరు తెచ్చుకోవాలని ఆయన్ని ఎన్ని బూతులు తిట్టినా పడి ఉన్నాను. ఆయన క్యాస్ట్ పిచ్చి, డబ్బు పిచ్చి..నాతో ఉన్న కోయాక్టర్ ని ఒక రకంగా సర్ అని ట్రీట్ చేస్తాడు. నను ఏరా ఒరేయ్ అంటాడు. నాకు ఒంట్లో బాగోక మా నాన్న నాతో షూటింగ్ కి వచ్చినప్పుడు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో  తిట్టేసాడు...అమ్మాయిలు ఉన్నా కూడా ఏం మాట్లాడతాడో అతనికే తెలీదు. ఏడు నెలలు మనసు చంపుకుని బతికాను.. సెట్ లో నాకు ఎవరూ వేల్యూ ఇచ్చేవారు కాదు. అసిస్టెంట్లు కూడా వేల్యూ ఇచ్చేవారు కాదు. డైరెక్టర్ అమ్మనా బూతులు తిడుతూ ఉంటే వాళ్లంతా నాకు వేల్యూ ఎందుకు ఇస్తారు. మనిషికి రెస్పెక్ట్ అనేది ఎక్కడుంటుంది. ఈ విషయంలో  ఎన్నోసార్లు ఏడ్చాను. డైరెక్టర్ నే అడిగాను  నా వల్ల ఏదన్న సమస్యా అని...లేదమ్మా బాగా చేస్తున్నావ్ చేసుకో అని  చెప్పేవాడు అంతే" అంటూ డైరెక్టర్ రాంబాబు గురించి అతని మనస్తత్వం గురించి చెప్పారు.

కృష్ణ, మురారీలను దగ్గరుండి పంపించిన రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-191లో.. కృష్ణ, మురారి ఇద్దరు నిద్రపట్టక.. రేవతి అన్న మాటలు గుర్తు చేసుకుంటారు. ఎందుకు రేవతి అత్తయ్య ఇలా ప్రవర్తిస్తుందని కృష్ణ అనుకుంటుంది. మీ రేవతి అత్తయ్య మాటల కంటే నాకు నీ మాటలు బాగుంటాయని మురారి అంటాడు. అలా ఇద్దరు సరదాగా మాట్లాడుకొని పడుకుంటారు. మరొకవైపు రేవతి దేవుడికి మొక్కుతుంటుంది. ఎలాగైనా కృష్ణ, మురారి ఇద్దరు దగ్గర కావాలి. అలాగే వాళ్ళ మధ్యలో ఎవరు రాకుండా చూడు దేవుడా.. ఆదర్శ్ రావాలి. తను ముకుందతో హ్యాపీగా ఉండాలని దేవుడికి రేవతి  మొక్కుకుంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం మురారి కంటే ముందుగా కృష్ణ  లేచి ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి అందంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత మురారి నిద్ర లేచి రెడీ అయి ఉన్న కృష్ణని చూసి.. ఈ రోజేంటి ఇంత అందంగా ఉందని కృష్ణని అలాగే చూస్తుంటాడు. ఏసీపీ సర్.. ఏంటి అలా చూస్తున్నారు లేట్ అవుతుంది త్వరగా రెడీ అయి రండని మురారితో కృష్ణ అంటుంది.. ఆ తర్వాత మురారి రెడీ అయి డైరీ కోసం చూస్తాడు. కృష్ణ లగేజ్ పట్టుకొని కిందకి వెళ్తుంది. మురారి మాత్రం డైరీ కోసం వెతుకుతాడు. రేవతి పిలవడంతో మురారి కిందకి వెళ్తాడు. ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలి. ఒకరిని విడిచి ఒకరు ఉండొద్దని నాకు మాట ఇవ్వండని రేవతి అంటుంది. కృష్ణ, మురారి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. కాసేపటికి ముందైతే దేవుడికి మొక్కుకోండని రేవతి అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి కృష్ణ మురారీలను ఫామ్ హౌస్ కి పంపిస్తారు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కలిసి కార్ లో వెళ్తుంటే.. మురారి గదిలో డైరీ ఏమైందని ఆలోచిస్తుంటాడు. ఏదో ఆలోచిన్నట్లు కనిపెట్టిన కృష్ణ.. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారని మురారిని అడుగగా.. అలాంటిదేమీ లేదని మురారి అంటాడు. మరొక వైపు మురారి, కృష్ణ వెళ్ళబోయే ఫామ్ హౌస్ ని చూసుకునే ఆవిడ దగ్గరికి ముకుంద వెళ్తుంది. కొంత డబ్బిచ్చి నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. నేను ఉన్నట్లు ఎవరికి తెలియద్దు ముఖ్యంగా రేవతి అత్తయ్యకు తెలియద్దని ముకుంద ఆవిడకి చెప్తుంది. దానికి ఆవిడ సరేనని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రాజ్ ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తీసుకొచ్చేదేంటని కావ్య డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -130 లో.. అప్పు షాపింగ్ ఉందని మియాపూర్ వెళ్లాలని కళ్యాణ్ తో అప్పు అంటుంది. సరేనని బైక్ మీద అప్పుని తీసుకొని వెళ్తాడు కళ్యాణ్. మరోవైపు కనకంతో మాట్లాడుతూ మీనాక్షి టెన్షన్ పడుతుంటుంది. మీ ఇల్లు కంటే నరకమే మేలని కనకంతో మీనాక్షి అంటుంది. ఈ పేదరికం వల్ల నా మనసెప్పుడో రాయిలా మారింది అక్క అని కనకం అంటుంది.  ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి మీనాక్షి వెళ్ళి.. మీకు స్టోర్ రూంలో ఏం పని లేదు కదా అని అడుగుతుంది. నాకేం పనిలేదు.. మీకు పనిలేదా అని కృష్ణమూర్తి అంటాడు. మీకు స్టోర్ రూంలో పని ఉంటే నాకు చెప్పండని కృష్ణమూర్తితో మీనాక్షి చెప్పి వెళ్ళి హాల్లో కూర్చుంటుంది. కాసేపటికి కృష్ణమూర్తి బొమ్మలకు రంగులు వేసే బ్రష్ ఎక్కడుందోనని స్టోర్ రూంలో చూడటానికి వెళ్తుంటాడు. అక్కడే హాల్లో ఉన్న మీనాక్షి అతడిని గమనించి.. ఆగండి.. మీకు స్టోర్ రూంలో పని ఉంటే నాకు చెప్పండని చెప్పాను కదా అని మీనాక్షి అంటుంది. నా పని నన్ను చేసుకోనివ్వండని చెప్పి కృష్ణమూర్తి స్టోర్ రూంకి వెళ్ళి తన పెయింట్ బ్రష్ ల డబ్బా తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. స్టోర్ రూంకి వెళ్ళి మామూలుగా వచ్చిన కృష్ణమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన మీనాక్షి.. ఆ స్టోర్ రూంకి వెళ్ళి చూడగా అక్కడ సేట్ ఉండడు. అది చూసి షాక్ అయిన మీనాక్షి కంగారుగా కనకం దగ్గరికి వెళ్తుంది. సేట్ స్టోర్ రూంలో లేడని కనకంతో మీనాక్షి అనగా.. నాకు తెలుసని కనకం అంటుంది. మరి నాకు చెప్పలేదేంటి అని మీనాక్షి అంటుంది. నీకు చెప్తే నువ్వు  టెన్షన్ పడుతావని చెప్పలేదని కనకం అంటుంది.  మరోవైపు రాజ్ కార్ లో ఒక లగేజీ బ్యాగ్ ని  ఎవరికీ తెలియకుండా తీసుకొస్తాడు. తాడుతో కట్టేసి బ్యాగ్ ని పైకి తీసుకెళ్తుంటే కావ్య, సుభాష్ చూస్తారు. రాజ్ తో దొంగచాటుగా ఏదో తీసుకొస్తున్నాడు. అదేంటో తెలుసుకోండని సుభాష్ తో చెప్తుంది కావ్య. రాజ్ మెళ్ళిగా ఆ బ్యాగ్ ని పైకి లాగుతుండగా వాళ్ళ నాన్న రావడంతో ఆ తాడుని వదిలేస్తాడు రాజ్‌. దాంతో కిందనే ఉండి రాజ్ కోసం చూస్తున్న సుభాష్ కి తగిలి పడిపోతాడు. కాసేపటికి కిందకి వస్తాడు రాజ్. స్పృహ తప్పి పడిపోయిన సుభాష్ ఒఐ నీళ్ళు చల్లి లేపుతాడు రాజ్. ఆ తర్వాత మెల్లిగా సుభాష్ ని డైవర్ట్ చేస్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.  

అన్నిటినీ వదిలేసి సరిగ్గా నెల ఐపోయింది!

నేహా చౌదరి స్టార్ స్పోర్ట్స్ యాంకర్‌గా బాగా పాపులర్.  బిగ్ బాస్ సీజన్-6లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. హౌస్ లో చక్కగా ఆడింది తర్వాత ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వలన  హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.  ఈమె ఒక  యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తోంది. అందులో తన పర్సనల్ వీడియోలతో పాటు, ఇంట్లో వేడుకలు, సరదా సరదా ముచ్చట్లు, తన హజ్బెండ్ తో కబుర్లు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. పెళ్లి కూతురు గెటప్ లోనే బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చి షాక్ ఇచ్చింది. ఇప్పుడు నేహా తన భర్తతో కలిసి జర్మనీ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కూడా రకరకాల వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తోంది నేహా. ఇప్పుడు రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "నా దేశాన్ని, నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా ఫ్రెండ్స్ ని వదిలి కొత్త జీవితం మొదలు పెట్టి సరిగ్గా నెల అయ్యింది" అంటూ మంచం మీద బుంగ మూతి పెట్టుకుని ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసుకుంది.   2019 సైమా అవార్డ్స్  ఈవెంట్ కి హోస్టుగా వ్యవహరించింది. ఆ తర్వాత స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా అవకాశం దక్కించుకుని  ప్రో కబడ్డీ, ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ సహా పలు ఈవెంట్స్ కి యాంకర్ గా పని చేసింది. యాక్టర్, డాన్సర్ గా మోడలింగ్ రంగంలో రాణించిన నేహా చౌదరి యోగ టీచర్ గా కూడా కొంతకాలం వర్క్ చేసింది. అలాగే కొన్ని చానెల్స్ కూడా యాంకర్ గా కనిపించింది. స్పోర్ట్స్‌ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ అమ్మడు రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది.  ఇక నేహా త‌న క్లాస్‌మేట్ అనిల్‌నే వివాహం చేసుకుంది. ఈమె పెళ్ళికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా వచ్చి సందడి చేశారు.

వైరల్ అవుతున్న సదా తీసిన వైల్డ్ లైఫ్ ఫుటేజ్!

సదా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న సదా.. ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ అందరికి దగ్గరగా ఉంటుంది. తనచుట్టూ ఎప్పుడు గ్రీనరీ ఉండేలా చూసుకుంటుంది సదా.. తన ఇంట్లో కూడా మొత్తం గ్రీన్ కలర్ వస్తువులు, గ్రీన్ సోఫాలు ఇలా తనకిష్టమైన గ్రీన్ కలర్ ని  చూసుకుంటుంది. సదాకి అడవిలోకి వెళ్ళి ఫోటోగ్రఫీ తీయడం ఒక ఇష్టమైన అలవాటు. అందుకే రెగ్యులర్ గా తను తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఆ ఫోటోలకి అత్యధిక వ్యూస్ కూడా వస్తున్నాయి. సదా.. తెలుగు సీనీ పరిశ్రమలో 'జయం' మూవీతో అరంగేట్రం చేసిన సదా.. మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ తో కలిసి 'ఊపిరి' సినిమాలో నటించింది. జయం, నాగ, లీలా మహల్ సెంటర్, దొంగ-దొంగది, ఔనన్న కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, శంకర్ దాదా జిందాబాద్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 మొదలగు సినిమాలలో నటించిన సదా.. తన సినిమా కెరీర్ లో 'జయం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సదా ముంబైలో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి అక్కడే తన జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఈ మధ్యకాలంలో ఎమోషనల్ అవుతూ ఒక వ్లాగ్ ని చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సినిమాలలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న సదా.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పలు టీవీ షోస్ లో జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. 'ఢీ' డాన్స్ షోకి శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జ్ గా వ్యవహరించగా వీళ్ళిద్దరి జడ్జిమెంట్ అంటే ఎంటర్‌టైన్మెంట్ కి కేరాఫ్ గా ఉంటుంది. బిబి జోడికి జడ్జిగా చేసి ఆ షోకి మరింత క్రేజ్ వచ్చేలా చేసింది సదా. అయితే సదాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. దాంతో తను తాజాగా 'మాయా వర్సెస్ రోమా' అనే ఫుటేజ్ ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో ఫుటేజ్ చూసినవారంతా లైక్స్ తో పాటు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అందులో ఉన్న మాయా అంటే తనకి చాలా ఇష్టం అన్నట్లు ఆ పోస్ట్ కింద వివరించింది సదా. కాగా ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.     

ఇది కాకపోయి ఉంటే టీచర్ ని అయ్యేదాన్ని

బుల్లితెర మీద "కార్తీక దీపం" సీరియల్ లో హిమ రోల్ లో  అమాయకపు అమ్మాయి పాత్రలో నటించింది కీర్తి భట్. ఇప్పుడు "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తోంది. కీర్తి భట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కి ఆమె గురించి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 6  లో ఆమె తన గురించి మొత్తం చెప్పేసింది. తన జీవితంలో వున్న విషాదాన్ని పంచుకోవడంతో ఆడియన్స్ కి ఆమె ఇంకా బాగా దగ్గరయ్యింది. కీర్తిభట్ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు పిల్లలంటే చాల ఇష్టం కూడా. అలా తన ఫోటో షూట్స్ తో పాటు తన సీరియల్ లో నటించే పిల్లాడితో ఎన్నో ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి కీర్తి ఇప్పుడు మాట్లాడుకుందాం రండి అంటూ ఫాన్స్ ని పిలిచింది. ఇక వాళ్ళు ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగారు.."మీ ఫింగర్స్ ఎలా ఉన్నాయి అక్కా" "అలాగే ఉన్నాయి నో చేంజెస్" అంటూ తన చేతివేళ్ళ ఫోటోని పోస్ట్ చేసింది. "నటి కాకపోయి ఉంటే ఏం అయ్యేవారు" అనేసరికి "టీచర్" ని అని చెప్పింది. "మీకు ఇష్టమైన ప్లేస్" "మా ఇల్లు" " బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది" "గుడ్ బాగుంది" "మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు" "ఇంకెవరూ మీరే" అంటూ దర్శన్ భరద్వాజ్ అనే పేరును టాగ్ చేసింది. "ప్రశ్నలు అడిగినా మీరు రిప్లై ఇస్తారా"  అని ఒక ఫ్యాన్ అడగడంతో  "ఇవ్వడానికి ట్రై చేస్తాను" అని చెప్పింది కీర్తి భట్..ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాకా తన లైఫ్ లో జరిగిన ఘోర సంఘటనను, తనవాళ్లందరినీ పోగొట్టుకున్న తీరుని వివరించి చాలా బాధపడింది.  తనలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక కీర్తి  2017 లో రూపొందిన కన్నడ చిత్రం 'ఐస్ మహల్' తో ఈమె నటిగా మారింది.  

డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ.. ఒక్క సినిమాకే మరీ ఇంతనా!

బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు. అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఏ విషయాన్ని‌ అయినా ముక్కుసూటిగా మాట్లాడే ఇనయా.. బిగ్ బాస్ తో ఎంతగానో ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా‌ ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది.‌ అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ  బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది. రీసెంట్ గా ఒక కారు కూడా కొన్న ఇనయా.. గత వారం ఐకియా నుండి ఫర్నీచర్ ని ఆర్డర్ చేసి.. వాటి అన్ బాక్స్ చేసి చూపించింది. అయితే తన గురించి ప్రతీ విషయాన్ని అభిమానులకు తెలియాజేయాలనే ఉద్దేశంతో.. ప్రతీ అప్డేట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది ఇనయా.   అయితే గతవారం తన‌కొత్త మూవీ అప్డేడ్ గురించి చెప్పింది ఇనయా. తను అంతకంటే ముందే మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. కాగా తను నటించిన 'నటరత్నాలు' ఆడియో లాంఛ్ ఫంక్షన్ జరిగింది. అందులో తన అందాలతో అందరిచూపుని తనవైపుకి తిప్పుకుంది. ఇనయా‌ఈ డ్రెస్ తో ఉన్న ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. మొదటి సినిమాకే ఆ డ్రెస్ ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  మరి ఈ కామెంట్లకి ఇనయా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.   

కిరణ్మయి మొదటి వ్లాగ్ లో బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్!

డైరెక్టర్ కుమార్ పంతం.. బ్రహ్మముడి సీరియల్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అంతకముందు గుప్పెడంత మనసు సీరియల్ తో పేరు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు స్టార్ మా టీవీ ఛానెల్ లో‌ ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలో టాప్ -5 లో ఈ రెండు సీరియల్స్ ఉండటం విశేషం.  కుమార్ పంతం.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నాడు.  బ్రహ్మముడి సీరియల్ లో ప్రతీ పాత్రకి ఒక్కో ఇంపార్టెన్స్ ఇస్తూ కథని ఆసక్తికరంగా మలిచాడు. ఈ కథలో కావ్య పాత్రకి సింప్లిసిటిని అద్ది, బాగా డబ్బున్న కుటుంబంగా దుగ్గిరాల ఫ్యామిలీని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు ‌చూపిస్తున్నాడు. స్వప్న పాత్రలో హమీదా, కావ్యగా దీపిక రంగరాజు, అపర్ణగా శ్రీప్రియ, రాజ్ గా మానస్, కళ్యాణ్ గా కిరణ్, కనకంగా నీపా, రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ.. ఇలా అందరూ తమ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్ లలో ట్రెండింగ్ లో ఉన్నవాళ్ళే.. ఇలా అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. చింటు పంతం రాసిన ఈ కథ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీరియల్ ముందు వరకు ఎవరికి అంతగా తెలియని డైరెక్టర్ చింటు పంతం.. బుల్లితెరపై ఈ సీరియల్ ని ఆరాధించే అభిమానుల వల్ల అందరికి తెలిసిపోయాడు. అతను ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసిన మంచి స్పందన లభిస్తుంది. ఇప్పుడు తాజాగా కుమార్ పంతం భార్య కిరణ్మయి కూడా పాపులర్ అయింది. జీ తెలుగులో ప్రసారమవుతున్న 'పడమటి సంధ్యారాగం' సీరియల్ లో హీరోకి తల్లిపాత్రలో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా తను 'మీ కిరణ్మయి' అని సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం 'ఫైనల్లీ నేనొచ్చేసా' అనే మూడు నిమిషాల వీడియోని అప్లోడ్ చేసి వెల్ కమ్ చెప్పిన కిరణ్మయి.. తన మొదటి వ్లాగ్ లో కుమార్ పంతంని ఇంటర్వూ చేసినట్టుగా స్టార్ట్ చేసింది. అందులో కుమార్ ని ప్రశ్నలు వేయగా అతను కొన్నింటికే సమాధానమిచ్చాడు. అయితే వ్లాగ్ సరదగా సాగింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.  

గీతికని సపోర్ట్ అడిగిన ముకుంద.. రేవతి కొత్త ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -190 లో.. ముకుంద ఫ్రెండ్ గీతిక ఇంటికి వస్తుంది. గీతికను కృష్ణ చూసి ఎలా ఉన్నావని అడుగుతుంది. ఎలాగైనా ఏసీపీ సర్ డైరీ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. నిన్నోకటి అడగాలి గీతికా? చెప్తావా అని కృష్ణ అడుగుతుంది. అడుగు కృష్ణ చెప్తానని గీతిక అనగా.. ఏసీపీ సర్ నీకు ఎప్పటి నుండి తెలుసని కృష్ణ అడుగుతుంది. ఆమ్మో ఇప్పుడు నిజం చెప్తే సిచుయేషన్ ఎలా ఉంటుందోనని అనుకున్న గీతిక.. అబద్దం చెప్పడం బెటర్ అని ముకుంద-ఆదర్శల పెళ్లి అప్పటి నుండి తెలుసని గీతికా అంటుంది. గీతిక ఏదో దాస్తున్నట్లు కృష్ణకి అనిపిస్తుంది. ఆ తర్వాత ముకుంద గదిలోకి గీతిక వెళ్తుంది. ముకుంద గదిలోకి వెళ్ళిన గీతిక.. బయట కృష్ణతో జరిగిందంతా ముకుందకి చెప్తుంది. ఆ తర్వాత తను ఉన్న సిచువేషన్ అంతా చెప్పి.. నాకు మీ డాడ్ పొలిటికల్ సపోర్ట్ కావాలి గీతిక అని ముకుంద అంటుంది. ముకుంద ఏం చెయ్యాలనుకుంటుందో గీతికకి చెప్తుంది. మరొక వైపు మురారి, రేవతి తనతో మొదటి నుంచి చేయించిన పనులను బోర్డుపై రాస్తుంది కృష్ణ. అప్పుడే రేవతి వచ్చి ఆ బోర్డు పై లవ్ సింబల్ వేస్తుంది. మిమ్మల్ని కొన్ని రోజులు ఇంటి నుండి బహిష్కరిస్తున్నానని రేవతి అనగానే.. కృష్ణ మురారి లు షాక్ అవుతారు. మిమ్మల్ని వారం రోజులు బయటకు పంపిస్తున్నాను. మన ఫామ్ హౌస్ కి వెళ్ళండి. రేపే మీ ప్రయాణం. ఇక మీరేం మాట్లాడొద్దని రేవతి చెప్పేసి వెళ్తుంది. రేవతి మాటలను అలేఖ్య, మధు ఇద్దరు వింటారు. ఆ తర్వాత గీతిక వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ముకుంద హెల్ప్ గురించి చెప్తుంది. తప్పకుండా ముకుందకి హెల్ప్ చేస్తాను.. టెన్షన్ పడకని చెప్పని గీతిక వాళ్ళ నాన్న చెప్తాడు. ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి ముకుంద దగ్గర నుండి గీతిక వెళ్ళిపోతుంది.  మరొక వైపు కృష్ణ, మురారిలను కలపడానికి రేవతి అత్తయ్య వాళ్ళని ఫామ్ హౌస్ కి పంపిస్తుందని అలేఖ్య మధు ఇద్దరు మాట్లాడుకుంటారు. అది ముకుంద వింటుంది. కృష్ణ మురారీల బంధం శాశ్వతం చేయడానికి రేవతి అత్తయ్య విశ్వప్రయత్నలు చేస్తుందని ముకుంద అనుకుంటుంది. ఇది ఆట ఆడడానికి చదరంగం కాదు‌‌.. రణరంగం ఎలాగైనా మురారిని దక్కించుకుంటానని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు రేవతి అన్న మాటలు గుర్తు చేసుకుంటారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.