ఇన్ స్టాగ్రామ్ ట్రెండింగ్ లో బ్రహ్మముడి సీరియల్ అప్పు!

నైనిషా రాయ్.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ప్రేక్షకులకు ' 'అప్పు' అంటే సుపరిచితమే. అప్పు పాత్రలో నైనిషా రాయ్ నటిస్తూ అందరికి ఆకట్టుకుంటుంది.  రాజ్ తమ్ముడు కళ్యాణ్ కి మంచి ఫ్రెండ్ లా నటిస్తుంది. 'బ్రహ్మముడి' సీరియల్ లో అప్పుగా కనకం-కృష్ణమూర్తిలకి కూతురిగా నటిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి భారం కాకూడదని అప్పు.. తను సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ చదువుకుంటుంది. ఈ సీరియల్ లో అప్పు.. లేడీ రౌడీలా అదరగొడుతుంది. నైనిషా రాయ్.. తెలుగు సీరియల్ నటి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ తో ఫేమ్ లోకి వచ్చిన నైనిషా అనేక సీరియల్స్ లో చేసింది. సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో కూడా నైనిషా రాయ్ నటించింది. 'కథానిక', 'సూర్య' వంటి సినిమాలలో నటించింది నైనిషా. పశ్చిమ బెంగాల్ లో‌ పుట్టిన నైనిషా.. అక్కడ కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత తను లా కోర్స్ చదివింది. అయితే తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది. జెమినిలో ప్రసారమైన 'భాగ్యరేఖ' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నైనిష. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన 'శ్రీమంతుడు' సీరియల్ లో కార్తీక పాత్రలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బంధం సీరియల్ లో నటించింది నైనిషా రాయ్. నైనిషా రాయ్.. ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది.  కాగా తనకి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. తన పేరు మీద చాలా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. బ్రహ్మముడి లో కళ్యాణ్ పాత్రలో చేస్తున్న కిరణ్ కాంత్ తో కలిసి కొన్ని రీల్స్ చేయగా అవి వైరల్ గా మారాయి. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ' హీ సేస్ ఇట్ ఈజ్ ఆన్ ఐ ఫీస్ట్ టు ఏ డర్టీ మైండ్' అని క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో పోస్ట్ చేసింది నైనిషా రాయ్. ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్ లోని నటులలో.. బ్రహ్మముడి సీరియల్ లోని ఎవరో ఒకరు ట్రెండింగ్ లో ఉంటూ వస్తున్నారు.   

వయ్యారాలు ఒలకబోస్తూ అషురెడ్డి!

అషురెడ్డి.. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడూ తన ఫోటోలతో‌ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన విషయాలను సోషల్ మీడీయాలో అప్డేట్ చేస్తూ తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది.అషు రెడ్డి.. ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. అందాల ఆరబోతకి పెట్టింది పేరు అన్నట్లుగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కనిపించే అషు గురించి చెప్పనక్కరలేదు. యూట్యూబ్ ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ తో నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనే చెప్పాలి.  బిగ్ బాస్ షో తర్వాత అషు.. వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉంటుంది. అషు రెడ్డి, పటాస్ హరితో కలిసి కామెడీ స్టార్స్ షోలో చేసింది. కాగా  ఆ షోలో హరి ఛాతిమీద అషురెడ్డి టాటూ చూసి అందరూ అవక్కాయ్యారు. దాంతో వాళ్ళద్దరు లవ్ లో ఉన్నట్లుగా అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారింది. అయితే తాజాగా ముగిసిన బిబి జోడిలో మెహబూబ్ తో కలిసి జతకట్టిన అషు.. డాన్స్ చెయ్యకుండానే తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలని షేర్ చేయగా అప్పట్లో అవి వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కొన్ని వారాల క్రితం 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' లో రాహుల్ సిప్లిగంజ్  తో కలిసి కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పిన అషురెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కోసం ఒక పాట పాడి,  అతను తన గుండెల్లో ఉన్నాడని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా విదేశాలకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది అషురెడ్డి. కాగా రోజు రోజుకి గ్లామర్ డోస్ ని పెంచేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోస్ ని షేర్ చేసింది. 'వాట్స్ విత్ ది థ్రెడ్స్ నౌ' అనే టైటిల్ తో‌ బ్లాక్ డ్రెస్ లో దిగిన కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అషురెడ్డి. కాగా ఇవి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.  

శ్వాస ప్రాబ్లం ఉన్న రాజ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -141 లో.. రాజ్ కావ్య చేసిన వంటలు తినకుండా ఐస్ క్రీం తింటుంటాడు. అది చుసిన కావ్య.. నేను చేసిన వంట తినకుండా, ఇలా అడ్డమైన చెత్త తినడం ఎందుకని కావ్య అడుగుతుంది. నువ్వు చేసిన వంట తినడం కంటే ఈ చెత్త తినడమే బెస్ట్.. అందుకే తింటున్నానని రాజ్ అంటాడు.  ఆ తర్వాత శృతి వేసిన డిజైన్ చూస్తూ, శృతిని రాజ్ మెచ్చుకుంటాడు. నన్ను కాకుండా నాలో ఉన్న కళని గుర్తించాడని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు స్టేషన్ ముందే ఉన్న కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడడం చూసిన అప్పు.. కానిస్టేబుల్ ని పిలిచి మా నాన్నని లోపలికి ఒకసారి పిలువండని చెప్తుంది. కానిస్టేబుల్ వెళ్లి కృష్ణమూర్తిని లోపలికి పిలుస్తుంది. మరొక వైపు ఇంట్లో ఇద్దరమే ఉన్నాము.. ఏ మాత్రం తొందరపడ్డా ముగ్గురం అవుతాం, అలా జరగకుండా ఉండాలంటే కావ్యని గదిలోకి రానివ్వకూడదు.. హాల్లో పడుకోమని చెప్పాలని రాజ్ అనుకుంటాడు. కావ్య లోపలికి రాకుండా డోర్ కి అడ్డంగా నిలబడతాడు. అప్పుడే కావ్య వస్తుంది. నువ్వు వెళ్లి హాల్లో పడుకోమని రాజ్ అనగానే.. నా భర్త గదిలోకి నేను వెళ్తున్న అని రాజ్ ని పక్కకి నెట్టి కావ్య లోపలికి వెళ్తుంది. మరొక వైపు స్టేషన్ లోపలికి కృష్ణమూర్తి వెళ్తాడు. నాన్న మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు. ఇంటికి వెళ్ళండని అప్పు అంటుంది. నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి మేమెలా ఎలా వెళతాం. నిన్ను బయటకు తీసుకురావడం నా బాధ్యత అని కృష్ణమూర్తి అంటాడు. నా మీద మీకు చాలా కోపం ఉంది కదా నాన్న అని అప్పు అంటుంది. లేదమ్మా చెప్పాలంటే గర్వంగా ఉంది. నీ తోబుట్టువులను ఎవరు ఒక్క మాట అన్నా నువ్వు ఊరుకోవు.. అదే రక్తసంబంధం అంటే అని కృష్ణమూర్తి అంటాడు. కాకపోతే కొంచెం అలోచించి ఉండాల్సిందని కృష్ణమూర్తి అంటాడు. మరొక వైపు రాజ్ నిద్రపోతుంటాడు. ఒక్కసారిగా నిద్రలో ఆస్తమా ఎక్కువై శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కావ్యపై పిల్లో వేసి తనని నిద్రలేపుతాడు. కావ్య లేచి రాజ్ కి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం చూస్తుంది. కావ్య టెన్షన్ పడుతుంది. డాక్టర్ కి ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోవడంతో కావ్య హాస్పిటల్ కి తీసుకోని వెళ్లడం కోసం సెక్యూరిటీ ని పిలుస్తుంది. సెక్యూరిటీ కి కార్ డ్రైవ్ చెయ్యడం రాకపోవడం తో.. స్కూటీ పై రాజ్ ని‌ కావ్య హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. హాస్పిటల్ లో అడ్వాన్స్ డబ్బులు పే చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని డాక్టర్స్ చెప్తారు. కావ్య దగ్గర డబ్బులు ఉండకపోవడంతో డాక్టర్స్ ని బ్రతిమిలాడుతుంది. అయిన డాక్టర్ పట్టించుకోడు. అప్పుడే కళ్యాణ్ కి కావ్య ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం రిషి  చేయనున్న సెమినార్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -808 లో.. జగతి, మహేంద్ర, ఫణింద్రలను కాలేజీ నుండి ఇంటికి వస్తాడు శైలేంద్ర. వాళ్ళు రావడం చూసిన దేవయాని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు ఇంట్లో నుండి ఎందుకు వెళ్లిపోయారు. మీరు వెళ్లినప్పటి నుండి తినాలని అనిపించడం లేదు. నిద్రపోవాలని అనిపించడం లేదని దేవయాని అంటుంది. రాత్రి తినే బానే పడుకున్నారు కదా అత్తయ్య అని ధరణి అంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళకండి అని దేవయాని అనేసరికి నువ్వు అతి చెయ్యకు దేవయాని అని ఫణీంద్ర అంటాడు. మరొక వైపు విశ్వనాథ్ వాళ్ళ కాలేజీకి రిషి వస్తాడు. ప్రిన్సిపల్ సర్ పిలుస్తున్నాడని రిషితో ప్యూన్ చెప్పడంతో.. ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్తాడు రిషి. మన కాలేజీకి ఒక ప్రపోజల్ వచ్చింది. కాలేజీ లో సెమినార్ కండక్ట్ చెయ్యండి అంటూ గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చిందని రిషితో ప్రిన్సిపల్ చెప్తాడు. ఇది మంచి అవకాశమే అని రిషి అంటాడు. ఇలాంటి సెమినార్ కండక్ట్ చెయ్యడం వల్ల వేరే కాలేజీ వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళ కాలేజీ ఎలా ఉంటుందో తెలుసుకోవడం బాగుంటుంది. సెమినార్ కి ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చెయ్యండని  ప్రిన్సిపల్ తో రిషి అంటాడు. ప్రిన్సిపల్‌ కొన్ని టాపిక్స్ చెప్పినా రిషికి అవి నచ్చవు. పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టాపిక్ తీసుకుంటే స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుందని రిషి చెప్తాడు. బాగుంది దీనికి సంబంధించిన విషయాలన్నీ మొత్తం మీరే చూసుకోండని రిషితో ప్రిన్సిపాల్ చెప్తాడు. ఈ సెమినార్ ని సక్సెస్ చేసే బాధ్యత నాది అని రిషి అంటాడు. ఆ తర్వాత రిషి ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే వెనకాల కొంతమంది స్టూడెంట్స్.. రిషి సర్, వసుధార మేడం మధ్య ఏదో ఉందంటూ తప్పుగా మాట్లాడుతారు. అది విన్న రిషి వాళ్లకి బుద్ధి చెప్పడానికి వస్తుంటే.. ఆ లోపే పాండియన్ వచ్చి అలా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడవద్దు. వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్తాడు. మా కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చి మా జీవితలు నాశనం కాకుండా చూసాడని వాళ్లకి చెప్తాడు. రిషి పాండియన్ దగ్గరికి వచ్చి.. నీలో ఇలా మార్పు వచ్చినదుకు హ్యాపీగా ఉందని పాండియన్ ని రిషి హాగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత రిషి స్టూడెంట్స్ తో సెమినార్ గురించి మాట్లాడతాడు. స్టూడెంట్స్ అందరూ మీకు వాలాంటీర్ గా ఉంటామని రిషి తో చెప్పగానే, రిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక  వైపు వసుధార గాయానికి ఏంజిల్ డ్రెస్సింగ్ చేస్తుంటే రిషి వస్తాడు. రిషి కొంచెం హెల్ప్ చేయవా.. నాకు డ్రెస్సింగ్ చేయరావట్లేదని ఏంజిల్ అంటుంది. రిషి ఇబ్బందిగానే వసుధార గాయానికి డ్రెస్సింగ్ చేస్తాడు. ఆ తర్వాత రిషి గదిలోకి వెళ్లి.. ఎందుకు వసుధార పదే పదే ఎదురుపడుతున్నావని అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

తాగిన మత్తులో మురారి చెప్పిన లవ్ ప్రపోజల్ ని కృష్ణ తెలుసుకోగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -202 లో.. మురారి అతని ఫ్రెండ్ గోపి ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఈ ప్రేమతోనే హ్యాపీగా ఉంటాం ప్రేమతోనే బాధపడుతామని గోపితో మురారి చెప్తాడు. ఆదర్శ్ భార్య అని ముకుందకి గౌరవం ఇస్తుంటే తనేమో అలా చేస్తుందని మురారి అంటాడు. ఆ తర్వాత నా భార్య అని చెప్పకూడదు కానీ కృష్ణ ఎంత అందగా ఉంటుందిరా.. అలిగినప్పుడు చూడాలిరా మూతి తిప్పుతుంటే అలానే చూడాలనిపిస్తుంది బంగారు బొమ్మరా. కృష్ణకి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది. పాపం కృష్ణ చిన్నప్పటి నుండి చాలా కష్టపడిందని కృష్ణ గురించి గోపికి చెప్తాడు మురారి. ఇప్పుడు నాకు కృష్ణతో మాట్లాడాలని ఉందని కృష్ణకి ఫోన్ చేస్తాడు మురారి. కృష్ణ నీకో విషయం చెప్పాలని మురారి అంటాడు.. ఏసీపీ సర్ ఫుల్ గా డ్రింక్ చేసినట్లు ఉన్నారని కృష్ణ అనుకుంటుంది. నేను గోపి వాళ్ళింట్లో ఉన్నాను. నువ్వు తొందరగా ఇక్కడికి రా నీకో విషయం చెప్తా అని మురారి అంటాడు. సరే అని కృష్ణ అంటుంది. నేను ఇప్పుడు వెళ్లకుంటే ఏసీపీ సర్ అలాగే తాగుతూ ఉంటాడని కృష్ణ బయలుదేరుతుంది. కృష్ణ మురారి తో మాట్లాడడం విన్న ముకుంద.. ఎలాగైనా  కృష్ణ కంటే ముందే నేను మురారి దగ్గరికి వెళ్ళాలని తను కూడా బయలుదేరుతుంది. ఆ తర్వాత మురారి దగ్గరికి కృష్ణ కంటే ముందుగానే ముకుంద వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్? ఇక్కడ నుండి వెళ్ళిపో.. కృష్ణ వస్తుందని మురారి అంటాడు. కృష్ణ రావడం గమనించిన గోపి.. వెళ్లి కృష్ణ పైకి రాకుండా ఆపుతాడు. నువ్వు కృష్ణ మాయలో పడిపోయావ్ మురారి అని ముకుంద అంటుంది. లేదు నేను కృష్ణ ప్రేమలో పడిపోయానని అంటాడు. ఐ లవ్ యు కృష్ణ అంటూ మురారి అరుస్తాడు. కృష్ణ పైకి వచ్చేలోపు ముకుంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారిని కృష్ణ తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఉదయం కృష్ణ ముందుగానే నిద్ర లేచి మురారి ని లేపుతుంది. రాత్రంతా విన్యాసాలు చేసి ఇప్పుడేంటి అలా ఉన్నారని కృష్ణ అడుగుతుంది. రాత్రి అక్కడికి ముకుంద వచ్చింది కృష్ణ చూడలేదనుకుంటా అని మురారి అనుకుంటాడు. వెళ్లి ఫ్రెషప్ అయి రండి అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ప్రియ రీఎంట్రీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ తాజాగా రెండొందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ సీరియల్ లో మెయిన్ లీడ్స్ గా కృష్ణ పాత్రలో ప్రేరణ కంబం నటిస్తుండగా, మురారి పాత్రలో ముఖేష్ గౌడ  చేస్తున్నాడు. ముకుంద పాత్రలో  యశ్మి గౌడ నటిస్తోంది. కాగా మురారికి పెద్దమ్మగా భవాని పాత్రలో ప్రియ నటిస్తుంది. ప్రియ.. అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. ఈమె 1997 లో 'మాస్టర్'  సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2021 లో బిగ్ బాస్ సీజన్-5 లో కంటెస్టెంట్ గా పాల్గొంది.‌ సినిమాల్లోనే కాకుండా‌ సీరియల్స్ లో నటించింది ప్రియ. జెమినిలో 'శక్తి' సీరియల్‌‌ ద్వారా అరగ్రేంట్రం చేయగా, 'ప్రియసఖి' సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించిన ప్రియ.. ఇప్పుడు తాజాగా స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న  'కృష్ణ ముకుంద మురారి సీరియల్' లో ముఖ్య పాత్రని పోషిస్తుంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎన్నో ట్విస్ట్ లతో రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఈ సీరియల్ లో మురారికి పెద్దమ్మగా భవానీ కొన్ని వారాల  క్రితం ఆశ్రమానికి వెళ్ళినట్టుగా‌ చూపించారు. అయితే అలా వెళ్లిన భవానీ.. ఇంకా తన క్యారెక్టర్ ఎంట్రీ రాకపోవడంతో ఈ సీరియల్ లో తన పాత్ర ముగిసిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సీరియల్ చూస్తున్న అభిమానులు తన పాత్ర కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‌కాగా ఇప్పుడు తాజాగా తన సోషల్ మీడియాలో తను ఇండియాకి వచ్చేసినట్టు.‌. కృష్ణ ముకుంద మురారి సీరియల్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా ఆమె చెప్పింది. కాగా రానున్న ఎపిసోడ్‌ లలో భవాని పాత్రలో ప్రియ ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  

వైఫ్ విషయంలోనే కాదు...అమ్మానాన్నల విషయంలో కూడా ఈ డివోర్స్ ఉంటే విడిపోయేవారు

విడాకులు అనే పదానికి కొత్త అర్ధం చెప్పారు నాగ శౌర్య. "నిఖిల్ తో నాటకాలు" యూట్యూబ్ షో లో  నిఖిల్ విజయేంద్ర సింహ శౌర్యను "అరేంజ్డ్ మ్యారేజా..లవ్ మ్యారేజా" అనే ప్రశ్నకు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. "ఒక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు చేసుకున్నాం" అని చెప్పాడు. "ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే 70 పెర్సెంట్ లవ్ మ్యారేజెస్ చేసుకున్నవాళ్లు, 30 పెర్సెంట్ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళను చూసాను..ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ లో చాలామంది విడిపోతున్నారు. అందుకే ఈ ప్రశ్నను అడిగాను..పెళ్ళైన వెంటనే డివోర్స్ అనే ఒక న్యూస్ వచ్చేస్తుంది" ఎందుకు అని అడిగాడు నిఖిల్. "లవ్ మ్యారేజెస్ లో డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. మన జనరేషన్ లో కిడ్స్ కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్లలో వాళ్ళను లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా కంఫర్ట్ గా , హ్యాపీగా ఉంటుంది అనుకుని చేసుకుంటున్నారు. కానీ గొడవలు అయ్యాయి  అంటే విడిపోయే ఆప్షన్ ఒక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో ఉంది. కానీ అమ్మతో, నాన్నతో, అన్నతో ఎందుకు ఈ ఆప్షన్ లేదు. ఉండి ఉంటె చాలామంది కూడా విడిపోయేవారు. అమ్మ, నాన్న ఎలాగో లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే అనుకుంటే డివోర్స్ అనే మాటే రాదు. నాకు లిమిటెడ్ గా డబ్బులుంటే చాలు...అంతే కానీ నేను డబ్బు కోసం పరిగెత్తను..అలా పరిగెడితే మాత్రం మనం మన ఫ్రెండ్స్ ని కోల్పోవాల్సి వస్తుంది. నేను నా వైఫ్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. పెళ్లి చేసుకున్నాక సడెన్ గా  నేను వచ్చేసి చెప్పి వెళ్ళు, చెప్పులేసుకెళ్ళు అని ఆమెకు  చెప్పడానికి నేనేమీ కంట్రోలర్ ని కాదు కదా..తన హజ్బెండ్ ని..." అని చెప్పారు శౌర్య.  

గురువుకు ద్రోహం చేసి వచ్చారనే మాటలు చాలా బాధిస్తాయి

  ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ లో తన గురువైన రాకేష్ మాష్టర్ ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్. ఈ షో ఎండింగ్ లో బ్యాక్ డ్రాప్ లో రాకేష్ మాష్టర్ ఓల్డ్ ఢీ షో వీడియోని ప్లే చేశారు. "నాకు పెళ్లి కాకముందే ఒక కొడుకు..శేఖర్...ఆకలిగా ఉన్నా కూడా నన్ను వదిలి వెళ్ళేవాడు కాదు...నాతోనే ఉండేవాడు. వాడు ఉంటే నేను బతికినట్టే" అని రాకేష్ మాష్టర్ చెప్పిన వీడియోని చూపించారు. దీనికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. "నేను హైదరాబాద్ వచ్చాక మాష్టర్ తో నాది ఏడెనిమిదేళ్ళ జర్నీ...తిరుపతిలో  రాకేష్ మాష్టర్ చాలామందిని రెడీ చేశారు. ఆయన హైదరాబాద్ కి రావడమే మాష్టర్ గా వచ్చారు. కరెక్ట్ గా అదే టైంలో మేము విజయవాడలో మస్తాన్ మాష్టర్ దగ్గర నేను, సత్య డాన్స్ నేర్చుకుంటున్నాం ...మేమున్నప్పుడు మాష్టర్ కి డ్రింక్ అనేదే అలవాటు లేదు. తర్వాత్తర్వాత వేరే ఫ్రెండ్ షిప్స్, వేరే వాళ్ళ కారణంగా మందు అలవాటయ్యింది. కొంతమంది కావాలని మందు బాటిల్స్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆయనతో తాగించి, ఆయనతో మాట్లాడించి నెగటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేశారు. ఆయన్ని కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగా మాట్లాడతారు. చాలామందికి తెలిసీ తెలియకుండా మాట్లాడేసరికి నా మనసు చాలా బాధపడుతోంది. ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు. అంత కష్టపడి వచ్చిన గురువుకే ద్రోహం చేసి వచ్చారు అని అంటున్నారు..ఈ మాటలు విన్నప్పుడల్లా చాలా బాధేస్తుంది..చెప్పాలంటే నేను ఒకరికి ద్రోహం చేయలేదు...మా గురువుగారు ఏ టైంకి పిలిచినా వెళ్ళేవాళ్ళం...పెళ్ళైనా, అర్ధరాత్రి ఐనా..మాకు మాకు చిన్న విషయాల్లో వచ్చిన మనస్పర్థల వలన చేయలేదు దానికి మీరంతా ఏదేదో రాసుకుని..ఏదేదో చేసేస్తున్నారు. మేము ఆయన దగ్గర లేనప్పుడు కూడా అదే అనుకున్నాం ఆయన ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అని..మా మాష్టర్ పైనుంచి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని కోరుకుంటున్నా"  అని కన్నీళ్లు పెట్టుకున్నారు  శేఖర్ మాష్టర్.    

మై బెటర్ హాఫ్.. క్యాప్షన్ సేస్ ఎవ్రీథింగ్!

కీర్తిభట్.. బిగ్ బాస్ సీజన్-6 తో  ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన బిహేవియర్ తో మొదట్లో కాస్త నిరాశ కలిగించిన, మెల్లగా ప్రేక్షకులకు నచ్చేసింది. తన ఫ్యామిలీ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని తను చెప్పినప్పుడు ఆ ఎపిసోడ్ అంతా చాలా ఎమోషనల్ గా సాగింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాప్-5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్న కీర్తిభట్ మొదట ఆర్జే సూర్యతో స్నేహంగా ఉండేది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పడేది కాదు. హౌస్ లో రోజులు గడిచేకొద్దీ అందరికి దగ్గరైన కీర్తభట్.. ఫ్యామిలీ వీక్ లో ఒక్కో కంటెస్టెంట్ వాళ్ళ అమ్మ, నాన్న వచ్చినప్పుడు తను చాలా బాధపడింది. అయితే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తనకు అన్నీ మంచి రోజులు వస్తాయంటూ అప్పట్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సింపతితో ప్రతీ వారం తను నామినేషన్లలో ఉన్నప్పుడు అత్యధిక ఓట్లు వేసి హౌస్ లోనే కొనసాగేలా చేశారు. అలా బిగ్ బాస్ లో ఉన్నప్పడే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కీర్తిభట్ కన్నడలో చాలా సీరియల్స్ చేసింది‌ అయితే తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ చేయగా.. బిగ్ బాస్ తర్వాత "మధురానగరిలో " సీరియల్ లో లీడ్ రోల్ చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది. కాగా తాజాగా తను పెళ్ళి చేసుకుంటున్నట్టు చెప్పిన కీర్తిభట్.. ఇప్పుడు తను చేసుకోబోయే అతడితో కలిసి ఒక పోస్ట్ చేసింది. 'మై బెటర్ హాఫ్.. క్యాప్షన్ సేస్ ఎవ్రీథింగ్'  అనే టైటిల్ ని పెట్టి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కి బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ అంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

బిగ్ బాస్ స్క్రిప్టా కాదా? అనేది బయటపెట్టిన ఆదిరెడ్డి!

ఆదిరెడ్డి.. బిగ్ బాస్ తో ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. అదిరెడ్డి బిగ్ బాస్ అంటే ఇష్టంతో.. ఇప్పటిదాకా అన్ని సీజన్లకి రివ్యూ ఇచ్చాడు. అతను ఇచ్చిన రివ్యూస్ కి లక్షల్లో వ్యూస్ వచ్చేవని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక యూట్యూబర్  గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి  కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోంచి బయటకొచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ టీవీ రంగంలోకి లేదా సినిమాలలోకి వెళ్ళాలని చూస్తారు. అయితే ఆదిరెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఫేమ్ వచ్చిన కూడా తను ఉన్న ఊరి నుండి వేరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఆదిరెడ్డి మొదటి నుండి కష్టపడేతత్వం గల వ్యక్తి. ఇది బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులకు తెలిసిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ గా కుటుంబం పట్ల తను చూపించే కేరింగ్.. అతని ఆలోచన విధానం అన్ని కూడా బాగుంటాయి. ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మికి కంటిచూపు సరిగా ఉండదు.. అయినా  కరోనా టైంలో ఫండ్స్ కింద తన పెన్షన్ డబ్బులు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఇలా తన ఫ్యామిలీ అంతా.. కొద్దో గొప్పో అందరికి తెలిసినవాళ్ళే. ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ అయిపోయి.. తన యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. నిన్న మొన్నటిదాకా ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసిన ఆదిరెడ్డి.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు. చాలా మందిలో ఉన్న ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పేశాడు. "ఇన్ని రోజులు కొంతమంది బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్ట్  అని అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ లోకి ఒక రివ్యూవర్ గా అడుగుపెట్టాను నేను. ఒక కంటెస్టెంట్ గా చెప్తున్నా అది స్క్రిప్ట్ కాదు మీకు టీవీలో ఏది చూపించారో అది మాత్రమే నిజం. మమ్మల్ని ఎవరు ఇలా యాక్ట్ చేయమని చెప్పలేదు. వీకెండ్ లో నాగార్జున సర్  మాకు కన్పించేవరకు మాకు ఎవరు కన్పించరు" అని ఆదిరెడ్డి చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-7 కి యాంకర్ శివ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు ఆదిరెడ్డి. అయితే ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్-7 గురించి చేసిన ఈ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.

సుమ  స్ట్రెస్ బస్టర్స్  కొత్త ఎపిసోడ్‌ రిలీజైంది!

బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. సుమ కనకాల.. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని చేసింది సుమ. 'స్ట్రెస్ బస్టర్స్' పేరుతో యూట్యూబ్ లో అలరించడానికి.. మరో కొత్త సీజన్ ని స్టార్ట్ చేసిన సుమ.. అందులో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేసింది. ఈ సీజన్ కోసం 3 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల యొక్క వన్ మినిట్ టాకింగ్ వీడియోని, రెండు ఫోటోలని.. వాటితో పాటుగా కాంటాక్ట్ డీటైల్స్ ని పంపించాలని అప్పట్లో సుమ చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు వారిలో కొందరిని ఫైనల్ చేసి వారితో సరదాగా మాట్లాడింది సుమ. వారితో గేమ్స్ ఆడిస్తూ, వారు చేసే అల్లరితో తను కూడా జాయిన్ అయ్యి మరింత ఆసక్తికరంగా చేసింది సుమ. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.  

రేపు అంటే ఏమిటో అప్పట్లో నాకు తెలీదు...ఏ సర్టిఫికెట్ మూవీకి మేం వెళ్తాం

జబర్దస్త్ ఈ వారం కామెడీ షో స్టార్టింగ్ లోనే పంచెస్  పేలాయి. ఈ షోకి "హిడింబా" మూవీ టీమ్ నుంచి నందిత శ్వేతా, అశ్విన్ బాబు, రఘు కుంచె, శ్రీధర్ వచ్చారు. ఇక అశ్విన్ జబర్దస్త్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు..."నేను ఎప్పుడైనా బాధగా ఉన్నాను అంటే ఆ టైంలో జబర్దస్త్ చూస్తాను" అనేసరికి హోస్ట్ సౌమ్య ఒక ఝలక్ ఇచ్చింది.."ఒకరోజు అశ్విన్ గారు ఫోన్ చేసి మీరు రండి, మీరు రండి" అని అడిగినట్లు చెప్పింది. "దేనికి రమ్మన్నానో చెప్పాలి కదా" అని అశ్విన్ అనేసరికి. "ప్రోగ్రాం ఉంది అందుకే రమ్మన్నారు" అని చెప్పింది. "ఆయన ఎవరో తెలుసా ఓంకార్ వాళ్ళ తమ్ముడు" అని కృష్ణభగవాన్ చెప్పేసరికి "నిజంగా ఓన్ బ్రదరా" అని అడిగింది "లేదండి నాలుగు రోజులకు అద్దెకు తెచ్చుకున్నారు" అని జోక్ వేశారు అశ్విన్ బాబు. "హిడింబ మూవీలో ఏం ఉంది" అని సౌమ్య అడిగేసరికి "నరమాంస భక్షకుల థీమ్ తో ఈ మూవీ రాబోతోంది...మేము ఏ సర్టిఫికెట్ తో వస్తున్నాం" అని అశ్విన్ చెప్పారు. "ఏ సర్టిఫికెట్ ఉంది అంటే కృష్ణభగవాన్ గారు ఈ మూవీకి వెళ్లొచ్చు అనేసరికి సౌమ్య నేను, సౌమ్య  వెళ్తాం" అని ఆయన అశ్విన్ కి చెప్పి నవ్వించారు..దాంతో సౌమ్య సిగ్గుపడిపోయింది. "నరమాంస భక్షకులు"అనే పదాన్ని కరెక్ట్ గా సౌమ్య చేత పలికించారు. "లాంగ్వేజ్ తెలీక ఏదేదో అనేస్తుంది అంతే " అని అన్నారు కృష్ణభగవాన్. అప్పుడు సౌమ్య ఒక విషయాన్ని షేర్ చేసుకుంది.."నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రేపు అనే పదానికి అర్ధం తెలీదు. ఈ విషయంలో మా మేనేజర్ తో నాకు గొడవ అయ్యింది. ఒక రోజు మేనేజర్ వచ్చి రేపు షార్ప్ 8 .30  అనేసరికి ఏంటి రేపు అని సీరియస్ గా అడిగాకా ఆయన చెప్పారు" అనేసరికి అందరూ నవ్వేశారు.    

ఆ ఇద్దరిపై రేవతి ఫైర్.. డ్రింక్ చేసిన మురారి ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -201 లో.. కృష్ణ ఫామ్ హౌస్ నుండి ఇంటికి రాగానే బయట ఉన్న చెప్పులు చుసి షాక్ అవుతుంది. ఇలాంటి చెప్పులే ఫామ్ హౌస్ లో చూసానని గుర్తు చేసుకొని.. ఆ డైరీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని ఆలోచిస్తూ లోపలికి వస్తుంది కృష్ణ. లోపల ఉందేమో అని అటు ఇటు చూస్తుంటుంది కృష్ణ. ఆ తర్వాత లోపలికి వచ్చిన కృష్ణని చూసిన రేవతి.. ఏంటీ అలా కంగారుగా చూస్తున్నావని అడుగుతుంది.. ఇంటి ముందు ఉన్న చెప్పులు ఎవరివని అడుగగా.. ముకుంద చెప్పులని రేవతి చెప్పగానే కృష్ణ షాక్ అవుతుంది. అసలు ఏమైందని రేవతి అడుగుతుంది. మేము కాకుండా ఫామ్ హౌస్ లో వేరే అమ్మాయి ఉందని కృష్ణ చెప్పగానే.. నీకెలా తెలుసని రేవతి అంటుంది. ఒక గది ముందు అమ్మాయి చెప్పులు చుసి డోర్ కొడితే ఎవరు డోర్ తియ్యలేదు. అక్కడ చూసిన చెప్పుల లాంటివే ఇక్కడ చూసానని కృష్ణ చెప్పగానే రేవతి షాక్ అవుతుంది. ముకుంద ఫామ్ హౌస్ కి వెళ్లిందా అని అనుకొని.. ఆ విషయం కృష్ణకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది రేవతి. ఇలాంటి చెప్పులు చాలా మందికి ఉంటాయి. ఇవన్నీ వదిలేసి భోజనం చెయమని  కృష్ణతో రేవతి చెప్తుంది. కృష్ణ వెళ్లిపోయాక ఎలాగైనా  ముకుంద సంగతి చెప్పాలని రేవతి అనుకుంటుంది. మరొక వైపు ముకుంద గీసిన మురారి బొమ్మని అలేఖ్య, మధు ఇద్దరు చూస్తూ ఎలాగైనా భవాని అత్తయ్యకి చెప్పాలని అనుకుంటారు. అప్పుడే రేవతి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. సారి అత్తయ్య మమల్ని క్షమించండంటూ అలేఖ్య అనగా‌‌.. మధు, అలేఖ్య ఇద్దరు కలిసి రేవతి కాళ్ళ మీద పడతారు. రేవతి ఇద్దరినీ కోపంతో కొడుతుంది. మరొక వైపు మురారి వాళ్ళ ఫ్రెండ్ మురారి వాళ్ళింటికి వస్తాడు. ఇంటి టెర్రస్ మీద ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు ముకుంద చేసిన పనుల గురించి మురారి చెప్తూ బాధపడతాడు. కృష్ణకి నా ప్రేమ విషయం చెప్పే అవకాశం రావట్లేదంటూ ఎమోషనల్ అవుతాడు మురారి. మరొకవైపు కృష్ణకి భోజనం పట్టుకొని రేవతి వస్తుంది. రేవతి కూడా ఇంకా భోజనం చెయ్యలేదని కృష్ణకి తెలిసి.. రేవతి తెచ్చిన భోజనాన్ని ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు. కృష్ణ ఎమోషనల్ అవుతూ రేవతిపై ప్రేమగా తల వాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

వాళ్ళిద్దరిని ఫ్లాష్ బ్యాక్ ఉందా అని అడిగిన ఏంజిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -807 లో.. విశ్వనాథ్ ఇంటి నుంచి వసుధార వెళ్లిపోవడానికి బ్యాగ్ తో హాల్లో కి వస్తుంది. అలా వచ్చిన వసుధారని చూసిన ఏంజిల్.. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఇంటికి వెళ్తున్నాను.. ఈ రోజు నుండి కాలేజీకి వెళ్ళాలని వసుధార అనగానే.. ఇంకా నీకు పూర్తిగా నయం కాకుండానే వెళ్తావా వద్దని ఏంజిల్ అంటుంది.  ఆ తర్వాత రిషి మధ్యలో కలుగజేసుకొని.. అలా నొప్పితో ఎలా వెళ్తారు. పూర్తిగా తగ్గాక వెళ్ళండని రిషి అనగానే వసుధార మనసులో సంతోషపడుతుంది. ఆ తర్వాత విశ్వనాథ్ వచ్చి.. వసుధారని వెళ్ళొద్దని చెప్తాడు. దాంతో వసుధార అక్కడే ఉండిపోతుంది. మరొక వైపు జగతి, మహేంద్ర, ఫణింద్రలు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడికి శైలేంద్ర వస్తాడు. ఎలాగైనా వాళ్ళని ఇంటికి తీసుకొని రా అని చెప్పిన దేవయాని మాటలు గుర్తు చేసుకొని శైలేంద్ర లోపలికి వస్తాడు. డాడీ మీరు పిన్ని బాబాయ్ లని తీసుకొని వస్తానని చెప్పి, మీరు కూడా ఇక్కడే ఉండిపోయారు. అక్కడ మమ్మీ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా అని ఫణింద్రతో శైలేంద్ర అంటాడు. ఇక్కడ వీళ్ళు మిషన్ ఎడ్యుకేషన్ పనులు చూసుకుంటూ ఉంటే.. నేను ఇక్కడే ఉన్నానని ఫణింద్ర అంటాడు. మీరు ముగ్గురు ఇంటికి రండని చేతులు జోడించి శైలేంద్ర  చెప్పేసరికి.. వెళ్దాం మహేంద్ర అని ఫణింద్ర అంటాడు. అప్పుడే మహేంద్రకి జగతి మెసేజ్ చేసి ఓకే చెప్పమని చెప్పమని అంటుంది. అలా జగతి చెప్పగానే మహేంద్ర ఓకే చెప్తాడు. విశ్వనాథ్ ఇంట్లో ఉన్న వసుధార టాబ్లెట్స్ చూసిన రిషి.. తన టాబ్లెట్స్ తన గదిలో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నాయని ఏంజిల్ ని పిలుస్తాడు. అప్పుడే వసుధార, ఏంజిల్  ఇద్దరు వస్తారు. ఈ టాబ్లెట్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి.. ఇప్పుడు టాబ్లెట్ వేసుకునే టైం కదా అని రిషి అనగానే.. "అవును ఆ విషయం ఇక్కడే ఉన్న వసుధారకి నువ్వే చెప్పొచ్చు కదా రిషి. మీరు వచ్చినప్పటి నుండి మీరు మాట్లాడుకోవడం చూళ్ళేదు.. మీకు ఏమైనా ప్రాబ్లమా.. మీకు ముందు ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా" అని ఏంజిల్ అడుగుతుంది. పరిచయం లేని వాళ్ళతో ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందని రిషి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీ సీనియర్ లెక్చరర్ అని రిజర్వ్  గా ఉంటున్నావా అని వసుధారని ఏంజిల్ అడుగగా.. అవునని వసుధార అంటుంది. రిషి తన టాబ్లెట్స్ వేసుకోమని చెప్పడంతో.. వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు జగతి, మహేంద్ర, ఫణింద్రలను తీసుకొని శైలేంద్ర ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఎస్సైకి చిరాకు తెప్పించిన మీనాక్షి.. రాజ్ మాడ్చేసిన ఆమ్లెట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -140 లో.. కనకం, కృష్ణమూర్తి లు అప్పు కోసం పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్లిన మీనాక్షి.. అన్ని కష్టాలు నీకే వస్తున్నాయి కనకం. అప్పుని నేను విడిపిస్తానంటూ స్టేషన్ లోపలికి వెళ్తుంది మీనాక్షి.   మరొక వైపు క్లయింట్స్ డిజైన్స్ బాగున్నాయ్ అని చెప్పడంతో రాజ్ సంతోషంగా ఉంటాడు. ఏంటి హ్యాపీగా ఉన్నారని కావ్య అడుగుతుంది. క్లయింట్స్ డిజైన్స్ ఓకే చేశారని చిరాకుగా చెప్పేసరికి.. హ్యాపీ విషయాన్ని నవ్వుతు చెప్పొచ్చు కదా.. మొహం ఎందుకు అలా పెట్టి చెప్తున్నారని కావ్య అంటుంది. ఆఫీస్ కి తీసుకొస్టే నైట్ ఏం జరిగిందో చెప్తానని అన్నావ్ కదా ఏంటో చెప్పమని రాజ్ అడుగుతాడు. నేను చెప్పనని కావ్య అనగానే.. నువ్వు అసలు మాట మీదనే ఉండవా? ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటావా అని రాజ్ అంటాడు. మరి మీరేమన్న మాట మీద ఉంటారా.. రాహుల్ గురించి బయటపడితే నన్ను భార్యగా ఒప్పుకుంటానని అన్నారు కదా. రాహుల్ గురించి బయట పెట్టాను కదా. మరి మీరేం చేశారు. మీరు చేస్తే న్యాయం.. నేను చేస్తే మోసం అంతేనా అని కావ్య అడుగుతుంది. నేను మాట తప్పాను  కానీ నీలా  మోసం చెయ్యలేదు.  పద ఇంటికి వెళదామని కావ్యతో రాజ్ అంటాడు. మరొక వైపు మీనాక్షి , ఎస్సై దగ్గరికి వెళ్లి మా అప్పుని వదిలిపెట్టండంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మీనాక్షి తన మాటలతో ఎస్సైకి చిరాకు తెప్పిస్తుంది. మీరు ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా అప్పు తో పాటు సెల్ లో వేయాలసి వస్తుందని చెప్పి మీనాక్షిని బయటకు పంపిస్తాడు ఎస్సై. మరొక వైపు కావ్య కిచెన్ లో వంట చేస్తుంటే.. రాజ్ వెళ్లి కావ్య చేసిన వంట తినకూడదని బ్రేడ్ ఆమ్లేట్ చేయాలని స్టార్ట్ చేస్తాడు. కానీ అది మర్చిపోయి ఆమెలేట్ ని మాడ్చేస్తాడు. మరొక వైపు మీనాక్షి, ఎస్సైని రిక్వెస్ట్ చేస్తుంది. మీకు లంచం ఇస్తాను అప్పుని వదిలిపెట్టండని ఎస్సైతో మీనాక్షి అనడంతో.. లంచం తీసుకోవడం కాదు ఇవ్వడం కూడా నేరమే అంటూ మిమ్మల్ని కూడా సెల్ లో వేస్తానని ఎస్సై అనగానే.. మీనాక్షి బయటకు వస్తుంది. ఆ తర్వాత కావ్య వంటలు బాగున్నాయంటూ రాజ్ చూసేలా ఊరిస్తూ తింటుంది. మీరు కూడా తినండి. వడ్డీస్తానని కావ్య అంటుంది. అప్పుడే అడుక్కునేవాడు వస్తే.. కావ్య చేసిన వంటలు అన్ని అడుక్కునే వాడికి ఇస్తాడు రాజ్. ఏంటండి మీకు ఇంత పంతం దేనికని కావ్య అడుగుతుంది. నేను చిన్నప్పటి నుండి ఇంతే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తరుణ్ మాష్టర్ కు ముద్దు పెట్టిన రాధ

'నీతోనే డ్యాన్స్' ఈ వారం ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోగ్రాంలో  డ్యాన్స్‌ల కంటే మాస్ మసాలా ముద్దులు, హగ్గులు, మధ్యమధ్యలో గొడవలు అబ్బో ఒకటేమిటి ఫుల్ మీల్ షో ఇది. ఇక లేటెస్ట్  ప్రోమోలో అయితే తరుణ్ మాష్టర్ పండగ చేసుకున్నారు. ప్రోమో స్టార్టింగ్‌లోనే నటరాజ్ మాష్టర్  బాలయ్య బాబు గెటప్‌లో నీతూతో కలిసి  చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. బాలయ్య స్టెప్స్ ని అచ్చు గుద్దినట్టు అలానే దింపేశారు  నటరాజ్ మాష్టర్. 'సూపర్ స్టార్' థీమ్ తో రాబోయే వారం ఎపిసోడ్ అదరగొట్టబోతోంది.  ఈ పెర్ఫామెన్స్‌కు  సదా, రాధ  కాంప్లిమెంట్లు ఇచ్చేశారు.   తర్వాత యాదమ్మ రాజు.. బాలయ్యను, హీరో నానిని ఇమిటేట్ చేసేసరికి శ్రీముఖితో సహా  అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక ఆ తర్వాత దీప-సాగర్  పెర్ఫామెన్స్ తో ఫిదా ఐన సదా సాగర్‌కి  ఓ హగ్ ఇచ్చింది.  అలాగే నిఖిల్-కావ్య జోడి ఎప్పటిలానే బ్లాక్ బస్టర్ .   పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. దాంతో  పేపర్లు చింపి విసిరేశారు తరుణ్ మాష్టర్. ఈసారి ఏకంగా చొక్కా కూడా చించేసుకుంటా అంటూ తెగ ఇంప్రెస్ అయిపోయారు. ఆ తర్వాత ఆట సందీప్-జ్యోతి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో సదాని చూసి సిగ్గుపడిన  తరుణ్ మాష్టర్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో  రాధని ఇంప్రెస్ చేశారు. "నాకు ఒక హీరోయిన్‌ను చూస్తే చాలా ఎక్సయిట్మెంట్  కలిగేది.. ఆ హీరోయిన్ వచ్చేసి నా పక్కన కూర్చున్నారు కదా రాధ. ఆ ఏజ్‌లో అంతా రాధ గారి ఫొటోలు అక్కడకక్కడా పెట్టుకునేవాడిని.. ఎవరూ లేనప్పుడు అలా ఆ ఫొటోలే చూసుకునేవాడిని.." అని మాష్టర్  చెప్పగానే తరుణ్ మాష్టర్ గట్టిగా పట్టుకొని నుదిటి మీద ముద్దు పెట్టేసారు రాధ. దీంతో తరుణ్ మాస్టర్.. రాధ చేతి మీద కిస్ ఇచ్చారు. "కానీ నాకు చిరంజీవి గారిని చూస్తే చాలా జెలస్ వచ్చేసేది వచ్చేది " అంటూ తరుణ్ మాష్టర్  చెప్పడంతో అందరూ నవ్వేశారు .     

దీప్తి సునైన పుస్తకం పేరేంటో తెలుసా?

ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీలు చేసే కొన్ని పోస్ట్ లు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పోస్ట్ ల కంటే ఆ పోస్ట్ గురించి వాళ్ళు రాసిన మాటలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయింది. దీప్తి సునైన చేసిన పోస్ట్ కి ఒక క్వశ్చన్ ని అడుగగా.. ఇప్పుడు దానికి రకరకాల సమాధానాలు వస్తున్నాయి. దీప్తి సునైన.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది.  షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి దీప్తి సపోర్ట్ బాగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక షన్ను, దీప్తి సునైనా ఇద్దరు విడిపోయారు. వాళ్ళు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఉన్నప్పుడు.. సిరితో క్లోజ్ గా ఉండడం వల్లనే.. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు విడిపోయి.. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే రెండు మూడు సందర్బాలలో ఈవెంట్స్ లో ఎదురుపడినా పరిచయం లేనట్లుగా ఉన్నారు. కాగా ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఇండైరెక్ట్ గా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో మాట్లాడుకుంటున్నారు. అంటే సెటైరికల్ గా ఒకరి పోస్ట్ కి మరొకరు కౌంటర్లు వేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. దీప్తి సునైన లవ్ బ్రేకప్ అయినప్పటి నుండి తన పరిధిలో తాను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని గడుపుతుంది దీప్తి సునైన.. ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. 'నీ జీవితం ఒక పుస్తకమైతే.. దానికి టైటిల్ ఏమని రాస్తావ్' అని అడిగింది దీప్తి సునైన. దీంతో ఫాలోవర్స్ కామెంట్లతో తమ అభిప్రాయాలను  తెలుపుతున్నారు. ఒకరేమో 'నా చావు నేను చస్తా నీకెందుకు' అని కామెంట్ చేయగా, మరొకరు 'ముందు నువ్వు టెన్త్ పాస్ అవ్వు' అని కామెంట్ చేసారు. ఇంకా కొందరు జీవితం ఒక ప్రయాణం ఇలాంటి పాజిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా దీప్తి సునైన అడిగిన ఈ ప్రశ్నకి ఇన్ స్టాగ్రామ్ లోని కొంతమంది సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు. కాగా దీప్తి సునైన అడిగిన ఈ ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది.  

 కుక్కలు కూడా ఇలా చేయవు...వైరల్ వీడియోపై కస్తూరి ఫైర్

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి ఫైర్ బ్రాండ్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఏ విషయాన్ని ఐనా బోల్డ్ గా తిట్టేస్తుంది.  ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్న టైపులో కనిపించే ఆమె ఆదిపురుష్ లో శ్రీరాముడికి మీసాలేంటి అని కూడా ప్రశ్నించారు. ఇప్పుడు మరో ఇన్సిడెంట్ పై ఆమె ఫైర్ అయ్యారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో  ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్రం పోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ఆమె ట్విట్టర్ లో తన స్టైల్లో స్పందించారు. ‘కుక్కలు కూడా ఇలా చేయవు. బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు ఈ  ప్రవేష్ శుక్లా  సన్నిహితుడని తెలుస్తోంది. ఆ నీచుడ్ని వెంటనే శిక్షిస్తారా లేక అలాగే  వదిలేస్తారా ? గతంలో ఎయిర్ ఇండియా విమానంలో తమిళనాడు బీజేపీ నేత చేసిన ఘటన గుర్తుకొచ్చి అడుగుతున్నా’ అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం కాస్తా  పోలీసుల దృష్టికి వెళ్లడంతో పర్వేష్ శుక్లాను అరెస్ట్ చేశారు. ఈ విషయం గురించి  సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ పోస్ట్ చేసిన ట్వీట్ ని కస్తూరి రీట్వీట్ చేశారు. ‘వావ్ చాలా స్పీడ్ గా ఆ   నీచుడిని అరెస్టు చేసి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేసినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్  తెలుసుకున్నారు. పిఓఏ, ఐపీసీ 290, ఐపీసీ 352, ఇతర సెక్షన్ల కింద అతనికి శిక్ష పడుతుంది. ఇక ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా మాత్రం నిందితుడు పర్వేష్ శుక్లాతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు’ అంటూ కూడా  కస్తూరి ట్వీట్ చేశారు.  

బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ !

బిగ్ బాస్ టెలివిజన్ రంగంలో ఎంత పాపులారిటి సంపాదించుకుందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్-7 కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతు విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకొని, ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇందులో కంటెస్టెంట్స్ ఎంపిక అనేది కీలకమైన అంశం. ఎందుకంటే  గత సీజన్లో కంటెస్టెంట్స్ ఎంపికపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్-7 భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ సెట్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.. బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా ఈ నెల ఆఖరున  జరుగనునట్లు తెలుస్తుంది. ఇక హోస్ట్ విషయానికొస్తే మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ చేయగా, రెండవ సీజన్ నేచురల్ స్టార్ నాని చేశాడు. గత నాలుగు సీజన్ల నుండి నాగార్జున వ్యవహరించగా.. ఈ సీజన్ కి నాగార్జున నో చెప్పాడంటు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అందులో వాస్తవం లేదు. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడట. దానికి సంబంధించిన అగ్రిమెంట్ లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి ప్రేక్షకుల దృష్టి మొత్తం.. ఏ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా అని ఉంది. అందరిలోనూ ఇదే  క్యూరియాసిటి ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ బిగ్ బాస్ టీం కొంతమందిని  అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. అన్ని సీజన్లలో కంటే ఈ సీజన్లో 25 మంది  కంటెస్టెంట్ లను హౌస్లోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయంట. అందులో కొంతమంది యూట్యూబర్స్, కామన్ మ్యాన్,  న్యూస్ ఛానల్ నుండి ఒకరు, జబర్దస్త్ షో నుండి, సింగర్, డాన్సర్ కేటగిరీలలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అయితే ఏ కేటగిరీలో ఎవరు బిగ్ బాస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.