ఫస్ట్ టైం చిరంజీవి గారితో ప్రైవేట్ జెట్ లో ట్రావెల్ చేశా!

నీతోనే డాన్స్ ఈ వీక్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ రౌండ్ కూడా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఎనిమిది జంటల నుంచి ఒక జంట కూడా ఎలిమినేట్ ఐపోయింది. ఐతే రాధా ఇక్కడ శ్రీముఖికి ఒక ట్విస్ట్ ఇచ్చారు. "అందరూ తమ తమ ఫ్యాన్ మూమెంట్స్ ని చెప్పేసారు కానీ ఒక్కరు మాత్రం చెప్పలేదు, చెయ్యలేదు, చూపించలేదు" అని రాధ అనేసరికి "శ్రీముఖి" అని కోరస్ పాడారు సదా, తరుణ్ మాష్టర్. ఇక రాధ సీట్ లోంచి లేచి స్టేజి మీదకు శ్రీముఖి దగ్గరకు వచ్చారు. "నేను ఒక ఫోటో పంపించాను కదా..చూపిస్తారా అని రాధ అడిగేసరికి చిరంజీవితో కలిసి జాటర్ ఫ్లయిట్ లో కూర్చున్న శ్రీముఖి ఫోటోని ప్లే చేశారు. "అందరూ తమ తమ ఫ్యాన్ మూమెంట్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాని ఈ ఫోటో చూస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తోంది. నా చిరు గారిని నేను కలిసినప్పుడు..నీకు తెలుసా శ్రీముఖి...మన డాన్స్ షోలో ఉన్నారు కదా ..తనకు నేనంటే చాలా ఇష్టం..నేనేదో చాలా ఇష్టం అనుకుని అక్కడికి వెళ్తే నీ గురించి మాట్లాడారు" అని స్వీట్ గా శ్రీముఖి మీద కోప్పడ్డారు రాధ. "హబ్బా ఇది చాలు ఈ జీవితానికి. ఐ లవ్ హిం మ్యాడ్ ..రాధమ్మ థ్యాంక్యూ సో మచ్ ఈ మూమెంట్ ని మళ్ళీ గుర్తుచేసినందుకు..నా జీవితంలో ఎన్నో ఫ్లయిట్స్ ఎక్కాను కానీ కానీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ జెట్ లో చిరంజీవి గారితో కలిసి ట్రావెల్ చేసాను..నేను చిరంజీవి గారు, కెమెరా క్రూ..ఆయన్ని అలా చూస్తుండి పోయాను రాధమ్మ..ఈ పిక్ గాడ్ ఫాదర్ మూవీ టైంలోది ..." అని చెప్పింది శ్రీముఖి. "ఆయన నీ గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు రాధా. "గాడ్ ఫాదర్" మూవీ టైంలో చిరు ప్రైవేట్ జెట్ లో శ్రీముఖి ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇందులో చిరు లుక్ ని చూసిన శ్రీముఖి `ఐ లవ్యూ చిరంజీవి గారు.. ఈ లుక్‌లో మీరు చాలా హాట్‌గా ఉన్నారు..మిమ్మల్ని చూసి తట్టుకోలేపోతున్నాను` అంటూ శ్రీముఖి ఓపెన్‌గా ఓ కామెంట్ చేసేసరికి  చిరు సిగ్గుపడిపోయారు. అప్పట్లో శ్రీముఖి కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ షో ఫైనల్ లో లీస్ట్ స్కోర్స్ తెచ్చుకున్న జంటలు యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీప మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది. ఇక ఇందులో యాదమ్మ రాజు- స్టెల్లా జంట ఎలిమినేట్ అయ్యారు.    

సాగర్ డాన్స్ ని రజనీ డాన్స్ తో పోల్చిన తరుణ్ మాస్టర్!

నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ లో నాలుగు జంటలు డాన్స్ లు అదరగొట్టేశాయి. ఇందులో సాగర్ -దీప జోడి డాన్స్ కి జడ్జెస్ అంతా ముద్దులిచ్చేశారు. స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ తో వీళ్ళు  చేసిన డాన్స్ స్టేజి మీద మంచి కలర్ ఫుల్ గా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించింది.  ఇక సదా ఐతే రియల్లీ లవ్ యు గైస్ అని చెప్పేసారు. అసలు ఏం తినొచ్చారు మీరు ఈరోజు. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు అని అన్నారు.  ఇక జడ్జి రాధా ఐతే తాను ఎలా చెప్పారో అలాగే చేశారని కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇద్దరి ఈక్వల్ గా డాన్స్ చేసారని చెప్పారు. సాగర్ గుడ్ డైరెక్టర్ మాత్రమే కాదు బ్యూటిఫుల్ స్టూడెంట్ అని కూడా చెప్పారు రాధ. దానికి సాగర్ కూడా ఆ కాంప్లిమెంట్ ని యాక్సెప్ట్ చేసి ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే అని చెప్పారు.  ఇక తరుణ్ మాష్టర్ సాగర్ దీప డాన్స్ కి ఫిదా ఇపోయారు కానీ పేపర్ లో సగం పీస్ మాత్రం చింపుతా నెక్స్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుండాలి అప్పుడు పేపర్ ఫుల్ చింపేస్తాను అన్నారు. సాగర్ డాన్స్ చూస్తుంటే ఎలా ఉందంటే రజనికాంత్ గారు ఫుల్ డాన్స్ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పారు. ఇక సాగర్ డాన్స్ కి అమరదీప్ జోడి 8  మార్క్స్, శివ్ జంట 9 మార్క్స్, ఆట సందీప్ జంట 10 మార్క్స్ ఇచ్చేసారు. గత ఎపిసోడ్ లో ఎలాగైనా ఆట సందీప్ మాష్టర్ నుంచి ఫుల్ మార్క్స్ తీసుకుంటాను అని అన్నారు. అలాగే ఈ వారం ఫుల్ మార్క్స్ సంపాదించుకున్నారు. ఇక  గత ఎపిసోడ్ లో ఈ జంటల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. కానీ ఈ వారం మాత్రం వీళ్ళు హగ్ చేసుకుని కనిపించారు. దానికి శ్రీముఖి కూడా ఆశ్చర్యపోయింది. "సాగర్ దీప జోడి చాలా ఎనర్జిటిక్ గా చేశారు. ఎక్కడా ఎనెర్జీ డ్రాప్ ఐనట్టు కనిపించలేదు. ఎలా ఐతే శివ్ జోడి కం బ్యాక్ పెర్ఫార్మెన్స్ తో ఎలా వచ్చారో మీరు కూడా అలాగే వచ్చారు. కానీ దీప డాన్స్ మాత్రం ఇంకా అద్దిరిపోయింది" అని సందీప్ మాష్టర్ చెప్పేసరికి దీప స్టేజి మీద ఏడ్చేసింది. ఇకసాగర్ ని చూసాక ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అని కోరింది శ్రీముఖి.  

ఏంజిల్ లవ్ ప్రపోజల్.. వసుధార షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -811 లో.. వసుధార, రిషి  ఇద్దరు  సెమినార్ గురించి డిస్కషన్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి ఏంజిల్ వస్తుంది. మా రిషి అనుకుంటే ఏదైనా అయిపోద్ది.. సెమినార్ గురించి ఇప్పటి వరకు అందరూ కాన్ఫరెన్స్ లో మాట్లాడేలా చేశాడని ఏంజిల్ అంటుంది.  నువ్వు ఇంత హ్యాండ్సమ్,  టాలెంటెడ్ గా ఉంటావ్.. ఇప్పటివరకు నీకు ఏ అమ్మాయి ప్రపోజ్ చెయ్యలేదా రిషి అని ఏంజెల్ అంటుంది. రిషి మౌనంగా ఉంటాడు. వసుధార మా రిషి బాగుంటాడు కదా.. నువ్వు ఒక సీనియర్ లెక్చరర్ గా కాకుండా, ఒక అబ్బాయిలా చూడు అని వసుధారతో ఏంజిల్ అంటుంది. అవును ఏంజిల్ సర్ బాగుంటారని వసుధార అంటుంది. ఆ తర్వాత " ఐ లవ్ యు అని ఇంత వరకు ఏ అమ్మాయి నీకు చెప్పలేదా రిషి" అని రిషిని ఏంజిల్ అడుగుతుంది.  ఏంజిల్ నోటి నుండి ఆ మాట వినగానే వసుధార షాక్ అవుతుంది. అలా ఏంజిల్ అనగానే.. తనకి వసుధార ప్రపోజ్ చేసిందంతా  గుర్తుచేసుకుంటాడు రిషి.. "ఏం అవసరం లేని విషయం మాట్లాడకు ఏంజిల్" అని రిషి అంటాడు. సరే నేను వెళ్తున్నా.. కానీ నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో కానీ తనకంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరని ఏంజెల్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ అదృష్టవంతురాలు నేనే అని వసుధార తనలో తాను అనుకుంటుంది. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు ఒక హోటల్ లో స్టే చేస్తుంటారు. వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు స్టే చేసే హోటల్ ముందే ఉండి జగతికి ఫోన్ చేస్తాడు శైలేంద్ర. మీరు ఎక్కడ వున్నారో తెలుసుకుందామని కాల్ చేశాను.. నేను కాలేజీకి వెళ్లి ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోవాలా అని శైలేంద్ర కావాలనే  అడుగుతాడు. అవసరం లేదని జగతి అంటుంది. మరొక వైపు రిషి వర్క్ చేస్తూ అలాగే హాల్లో పడుకుంటాడు. అలా పడుకున్న రిషిని సోఫాలో పడుకోపెట్టి తన చేతిలో ఉన్న లాప్టాప్ తీసుకొని వెళ్లి తన గదిలో వర్క్ చేస్తుంది వసుధార. ఆ తర్వాత రిషి మధ్యలో లేచి లాప్టాప్ ఏంజిల్ తీసుకువెళ్లిందా అని అనుకుంటాడు. వసుధార గది దగ్గరికి వెళ్లేసరికి.. తను వర్క్ చేస్తుంటుంది. ఈ టైమ్ వరకు చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది.. ఇంప్రెషన్ కోసం చేస్తున్నావా అని రిషి అంటాడు. ఇంట్రస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాని, వర్క్ అయిపోయిందని, ఎవరు చేస్తే ఏంటి వర్క్ అయితే అయిపోయింది కదా అని వసుధార అంటుంది. థాంక్స్ అని రిషి అంటాడు. మరుసటిరోజు ఉదయం వసుధార కాలేజీకి వెళ్లి రిషి సర్ సెమినార్ వినాలని రెడీ అయి హాల్లోకి వస్తుంది. నేను వస్తాను సర్ నన్ను కాలేజీకి తీసుకెళ్లండని అక్కడే ఉన్న విశ్వనాథ్ తో వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముకుంద ఎవరిని ప్రేమించిందో తెలుసుకోవాలని మురారికి చెప్పిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -205 లో.. కృష్ణని ప్రేమిస్తున్నానని నిజం చెప్పలేక సతమతమవుతాడు మురారి. చెప్పండి ఏసీపి సర్.. ఒకవేళ అది తప్పు అయినా నేను ఏం అనను అర్థం చేసుకుంటానని కృష్ణ అంటుంది. నేను కళ్ళు మూసుకుంటాను మీరు చెప్పండని కృష్ణ అనగానే.. మురారి చెప్పాలనుకొని చెప్పలేకపోతాడు. అప్పుడే అలేఖ్య వచ్చి.. నిన్ను భవాని అత్తయ్య రమ్మంటుందని మురారిని పిలుస్తుంది. ఆ తర్వాత గీతికను అడిగితే తను అబద్దం చెప్పింది. గీతిక ముకుందని కలిసిందో లేదో తననే వెళ్లి కనుకుంటా అని ముకుంద దగ్గరికి వెళ్తుంది కృష్ణ. అక్కడ గదిలో ముకుంద, మురారి కలిసి ఉన్న  ఫోటో పట్టుకొని చూస్తూ.. నన్నెలా మర్చిపోయావ్ అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ముకుంద దగ్గరికి కృష్ణ వస్తుంది. కృష్ణని చూసి టెన్షన్ గా ఫోటో కింద పడేస్తుంది ముకుంద. కృష్ణ వచ్చి ఆ ఫోటో చూడకుండా ముకుందకి ఇస్తుంది. ఏంటి కృష్ణ ఏదో ఆడాగాలని వచ్చినట్లు ఉన్నావని ముకుంద అడుగుతుంది. గీతిక ఏమైనా వచ్చిందా అని కృష్ణ అడుగుతుంది. లేదు, ఎందుకు‌ అలా అడుగుతున్నవని ముకుంద అడుగగా.. కాజువల్ గా అడిగాననని కృష్ణ చెప్తుంది. మరొక వైపు భవాని దగ్గరికి మురారి వస్తాడు. ఆదర్శ్ గురించి తెలుసుకుంటానని మాట ఇచ్చావ్.. ఇప్పటివరకు కనుక్కోలేదు. అసలు ఆదర్శ్ గురించి ఇంత వెతికిస్తున్నాం అయినా తెలియట్లేదంటే ఆదర్శ్ కి ఈ ఇంటికి రావడం ఇష్టం లేదని శ్రీనివాస్ అన్నాడు. ఆదర్శ్ కి ఇక్కడికి రావడం ఇష్టం లేదేమో.. పెళ్లికి ముందు ఆదర్శ్ ఎవరైనా ప్రేమించాడా అని మురారిని భవాని అడుగుతుంది. అదేం లేదు పెద్దమ్మ అని మురారి అంటాడు. మరి ముకుంద ఎవరైనా ప్రేమించిందేమో? ఆ విషయం తెలిసి వెళ్ళిపోయాడెమో అని భవాని అంటుంది. నువ్వు చెప్పింది నిజం అని ఎలా చెప్పాలి పెద్దమ్మ అని మురారి తన మనసులో అనుకుంటాడు. నువ్వు అన్ని విషయాలు కనుక్కుంటానని మాట ఇవ్వు అని మురారితో భవాని అంటుంది. సరేనని మురారి మాట ఇస్తాడు. నువ్వు ఇదివరకు ఒకసారి మాట తప్పావు.. మళ్ళీ ఇప్పుడు మాట తప్పితే జీవితంలో క్షమించనని భవాని అంటుంది.  మరొక వైపు మురారి గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంటాడు. ఏదో చెప్తాను అన్నారు కదా చెప్తారా అని కృష్ణ అడుగుతుంది.. లేదు కృష్ణ తర్వాత చెప్తానని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కావ్య అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలనే రాజ్ ప్లాన్ నెరవేరుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -144 లో.. అప్పుని కళ్యాణ్ పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తాడు. అందరు కలిసి కనకం ఇంటికి బయల్దేరుతారు. కళ్యాణ్ కి కనకం కాఫీ చేస్తుంది. ఇది తీసుకొని వెళ్లి కళ్యాణ్ కి ఇవ్వమని అప్పుకి కాఫీ ఇస్తుంది కనకం. నాకు ఇవన్నీ సెట్ కావు.. నాకేమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా? వెళ్లి నువ్వే ఇవ్వమని అప్పు అంటుంది. అయిన వినకుండా కనకం కాఫీని అప్పుతో పంపిస్తుంది. అప్పు కాఫీ తీసుకొని వస్తుంటే కళ్యాణ్ షాక్ అవుతాడు. ఏంటి నువ్వు తీసుకోని వస్తున్నావా అని కళ్యాణ్ అంటాడు. ఆ తరువాత కళ్యాణ్, అప్పు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు.  మరొక వైపు తన దగ్గర కొంత డబ్బు ఉంచుకోమని ఎలా చెప్పాలని చేతిలో డబ్బులు పట్టుకొని రాజ్ ఆలోచిస్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఏంటి చేతిలో డబ్బులు.. మీ అమ్మా నేను చేసిన సాయానికి థాంక్స్ చెప్పింది. మీరు డబ్బుతో థాంక్స్ చెపుదాం అనుకుంటున్నారా? మానవత్వానికి వెల కడుతున్నారా అని కావ్య అనేసరికి.. ఇప్పుడు ఈ డబ్బు ఇస్తే ఇలాగే అనుకుంటుందని ఫోన్ లో రాజ్ వాళ్ళ బాబాయ్ తో మాట్లాడినట్లు మాట్లాడతాడు రాజ్. ఆ తర్వాత డబ్బు ఇక్కడ పెడుతున్నాను నీకు అవసరం ఉంటే యూజ్ చేసుకోమని  కావ్యకి  రాజ్ చెప్తాడు. మరొక వైపు అప్పుకి  తన ఫ్రెండ్ కాల్ చేసి రమ్మంటాడు. అప్పు వెళ్తుంటే కనకం అడ్డుపడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్లి మళ్ళీ ఏ గొడవ పెట్టుకోకు నువ్వు అమ్మాయివనే విషయం మర్చిపోకని కనకం అంటుంది. "మనకు గుర్తుందా అప్పు అమ్మాయి అనే విషయం" అని కనకంతో అప్పు వాళ్ళ పెద్దమ్మ అంటుంది. తనకి పెళ్లి వయసు వచ్చింది. మనం దాని గురించి ఆలోచిస్తున్నామా అని అప్పు వాళ్ళ పెద్దమ్మ అంటుంది. నువ్వు అలాంటి విషయం ఇప్పుడు మాట్లాడకని అప్పు అంటుంది. ఆ తరువాత కనకం కళ్యాణ్ కి ఫోన్ చేసి కావ్యకి ఫోన్ ఇవ్వమంటుంది. అత్తారింట్లో తను ఎలా ఉందో కనకం కనుక్కుంటుంది. నేను బాగున్నాను అమ్మా.. ఏదైనా నేను ఇక్కడ చూసుకోగలనని కావ్య అంటుంది. మరొక వైపు కావ్యకి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడానికి బ్యాంకు నుండి ఎగ్జిక్యూటివ్ ని ఇంటికి రమ్మంటాడు రాజ్. అతను ఇంటికి వస్తాడు. ఎక్కడ కావ్య కోసం రప్పించానని అందరికి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమోనని అందరికి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి రప్పించానని రాజ్ చెప్తాడు. ఒక్కొక్కరిగా అందరు తమ వివరాలని ఎగ్జిక్యూటివ్ కి చెప్తారు. కావ్య మాత్రం అక్కడ ఉండదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మైకేల్ జాక్సన్, అల్లు అర్జున్ డాన్స్ వీడియోస్ చూసి డాన్స్ నేర్చుకున్నా

నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ లో కావ్య-నిఖిల్ జంట చేసిన పెర్ఫార్మెన్స్ కి అందరూ షాకైపోయారు. చాలా యూనిక్ గా కొత్తగా చేశారు ఈ జంట. ఇక సదా ఫిదా ఐపోయి త్వరలోనే నిఖిల్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. తర్వాత మిగతా కంటెస్టెంట్ జంటలంతా మంచి స్కోర్స్ ఇచ్చారు. ఇక శ్రీముఖి వాళ్ల లైఫ్ లో ఉన్న ఫ్యాన్ మోమెంట్ ఏమిటి అని అడిగింది. "నా లైఫ్ లో ఇంకా  ఫ్యాన్ మోమెంట్ అనేది ఇంకా రాలేదు. ఎప్పటికైనా అల్లు అర్జున్ గారిని కలుస్తాను..నేను చిన్నప్పుడు డాన్స్ క్లాస్ కి వెళ్లనే లేదు. మైకేల్ జాక్సన్ గారు, అల్లు అర్జున్ గారి డాన్స్ వీడియోస్ చూసి డాన్స్ నేర్చుకున్నా. కానీ ఏదో ఒక రోజు నేను అల్లు అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటా.. అల్లు అర్జున్ చాలా గట్టి మనిషి..." అని చెప్పాడు నిఖిల్. కాని నీకోసం అల్లు అర్జున్ గారు ఒక సర్ప్రైజ్ పంపించారు అని చెప్పి అల్లు అర్జున్ తో నిఖిల్ దిగిన ఫోటోని ప్లే చేసి చూపించింది శ్రీముఖి. ఇక తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పింది కావ్య. ఆమె మాటకు తరుణ్ మాష్టర్ మధ్యలో వచ్చి "కావ్య..పవన్ కళ్యాణ్ నటించిన అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి మూవీలో ఒక సాంగ్ ని ఈ స్టేజి మీదే షూట్ చేసాం. అప్పుడు డాన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా టెన్షన్ పడిపోయేవారు. ఆ సాంగ్ టైములో నా దగ్గరకు వచ్చి మాష్టర్ గారు మా అన్నయ్య ఇప్పటికే చాలా పెద్ద స్టార్. కానీ నేను హీరోగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా..జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా హీరోగా అని అడిగారు..పర్లేదు. నీ లాగే మీ అన్నయ్య కూడా హీరోగా ట్రై చేసేటప్పుడు నేను అసిస్టెంట్ గా చేసాను..కంగారేమీ పడక్కర్లేదు అని చెప్పా...కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ ఇపోయారు " అని అప్పటి ఫ్యాన్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు తరుణ్ మాష్టర్.    

పవన్ కళ్యాణ్ దేవుడికంటే ఎక్కువ నాకు...కనిపిస్తే కాళ్ళ మీద పడతాను

తనకు పవన్ కళ్యాణ్ అంటే దేవుడి కంటే ఎక్కువ అని చెప్పాడు యాదమ్మ రాజు. నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ లో యాదమ్మ రాజు-స్టెల్లా ఇద్దరూ కలిసి ఈగ మూవీలో సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసారు. ఐతే ఆ సాంగ్ కి వీళ్ళ డాన్స్ కి పెద్దగా మ్యాచ్ కాలేదు. జడ్జెస్ కి కూడా పెద్దగా నచ్చలేదు. స్కూల్ లో జరిగే ఫంక్షన్ డ్రామాలా ఉందంటూ కామెంట్ చేశారు. ఇకపోతే మిగతా కంటెస్టెంట్ జోడీస్ మాత్రం చాలా తక్కువ మార్క్స్ ఇచ్చారు. యాదమ్మ రాజు చాలా ఫీలవుతూ సైలెంట్ గానే ఇచ్చిన మార్క్స్ ని యాక్సెప్ట్ చేసాడు. ఈ వారం వీళ్లకు, అంజలి జంటకు మధ్య జరిగిన మాటల యుద్ధంతో యాదమ్మ రాజు కొంచెం ఫీలైనట్టే కనిపించాడు. అందుకే ప్రతీ ఎపిసోడ్ లో హుషారుగా ఉండే రాజు ఈ వారం చాలా డల్ గా డాన్స్ చేస్తూ కనిపించాడు. ఇక ఆ మూడ్ నుంచి వాళ్ళను బయటకు తేవడానికి శ్రీముఖి ట్రై చేసింది వాళ్ళ జీవితంలో ఫ్యాన్ మోమెంట్ ఏమిటి అని అడిగింది. "నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఆయన్ని కలిసే ఛాన్స్ రాలేదు. ఆయన నాకు దేవుడి కంటే ఎక్కువ. మూవీస్ పరంగా కన్నా ఆయన చేసే పనులు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. జానీ సినిమాకు ఫస్ట్ డే ఐదు రూపాయల టికెట్ పెట్టుకుని వెళ్లి మూవీ చూసా. అప్పటికి నాకు ఏమీ తెలియదు. ఇక అప్పటినుంచి  నేను ఊహించుకుంటూనే ఉంటాను" అని చెప్పాడు రాజు. "సడెన్గా పవన్ కళ్యాణ్ నీ ముందుకు వస్తే ఎం మాట్లాడతావ్ " అని అడిగింది శ్రీముఖి " ఎం మాట్లాడను, ఆయన కాళ్ళ మీద పడతాను" అని తన మనసులో పవన్ కళ్యాణ్ గురించి ఉన్న అభిప్రాయాన్ని చెప్పేసాడు. పవన్ కళ్యాణ్ అంటే చాలు యూత్ లో ఒక అట్రాక్షన్, అడ్మిరేషన్ అనేవి ఉన్నాయి. ఆయన్ని అభిమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో యాదమ్మ రాజు కూడా ఉన్నాడు.  

మహేష్ బాబుతో చేయడం చాలా హ్యాపీ...ఈసారి టీవీలో స్ట్రైట్ గా కూర్చుని చూడండి

నీతోనే డాన్స్ షోలో యాదమ్మరాజు జంటకి పవన్-అంజలి జంటకు ఈ శనివారం ఎపిసోడ్ లో  చిన్న క్లాష్  అయ్యింది. అంజలి-పవన్ జోడి "శంకర్ దాదా ఎంబిబిఎస్" మూవీ నుంచి ఒక సాంగ్ కి డాన్స్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయ్యాక యాదమ్మరాజు-స్టెల్లాని మార్క్స్ ఇమ్మని అడిగింది శ్రీముఖి. వాళ్ళు 8 మార్క్స్ ఇచ్చారు. పవన్ ఎనేర్జి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంది .. కానీ అంజలి ఎనెర్జీ తగ్గింది అని చెప్పారు. అలాగే ఒక స్టెప్ కూడా అంజలి వేయలేదు అని చెప్పాడు. దానికి శ్రీముఖి "ఓహో మీరు పవన్ లో చిరంజీవిని చూసారు..అందుకే ఆయన పక్కన చేసిన హీరోయిన్ లో ఎనర్జీ తగ్గింది అని అంటున్నారా" అంది.. "అవును" అన్నాడు రాజు. "లేదు ఈ సారి ఎం  చేస్తారంటే టీవీలో స్ట్రైట్ గా కూర్చుని చూడండి..అప్పుడు తెలుస్తుంది నా ఎనర్జీ డ్రాప్ అయ్యిందా లేదా అని ఎందుకంటే ఇప్పుడు సైడ్ కి కూర్చున్నారు కదా " అంది అంజలి. "చూసాక నీ స్టెప్స్ మీద కామెంట్ చెప్తా" అన్నాడు రాజు. "ఈసారికి నుంచి మేము కూడా అయ్యో పాపం అని కాకుండా..ఎక్కడ పూల కుండీ ఎగిరింది, షర్ట్ ఎగిరిందా లేదా, జుట్టు ఎగిరిందా లేదా అని కూడా చూస్తాం" అని అంజలి సీరియస్ గా చెప్పేసరికి "నాకు అనిపించింది చెప్పాను...సారీ" అన్నారు యాదమ్మ రాజు జంట. తర్వాత అందరితో కలిపి చిరంజీవి వీణ స్టెప్ వేయించింది శ్రీముఖి. అలాగే వాళ్ల లైఫ్ లో ఫ్యాన్ మోమెంట్ ఏమిటి అని కూడా అడిగింది "సరిలేరు నీకెవ్వరూలో మహేష్ బాబు పక్కన ఇలా కలిసి నటించిన మోమెంట్ మర్చిపోలేనిది. రాజకుమారుడు టైంలో చేసాను. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో ఇలా సాంగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ. నా ఫస్ట్ మూవీ 16 టీన్స్ టైములో రాకేష్ మాష్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ గా చేస్తూ అప్పుడు కూడా ఆయనే కోరియోగ్రఫీ చేశారు." అని తన లైఫ్ లో ఫ్యాన్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు    

ఫాన్స్ ఉంటే చాలు ఏమైనా చేసేస్తారు..విలన్ అట్రాక్షన్ తో ఉన్న హీరోతో నటించాను

నీతోనే డాన్స్ షో ఈ శనివారం ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ - నీతూ జోడి బాలకృష్ణ మూవీస్ లోని సాంగ్స్ కి డాన్స్ వేసి అదరగొట్టేసాడు. ఇక అచ్చంగా బాలకృష్ణను దింపేశారు నటరాజ్ మాష్టర్. ఈ పెర్ఫామెన్స్ కి అందరూ ఫుల్ ఫిదా ఇపోయారు. ఇక రాధ కామెంట్ల  వర్షం కురిపించారు.."హీరోస్ లో ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్న వ్యక్తిని నేను అసలు చూడలేదు అన్నారు. బాలకృష్ణ గారితో నేను నాలుగైదు సినిమాలు చేసాను. ప్రతీసారి ఆయన తన బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఆయన స్పిరిట్ ని, ఆయన ఎనెర్జీని ఇమిటేట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. కానీ నటరాజ్ మాష్టర్ మీరది చేసి చూపించారు." అన్నారు. ఇక కంటెస్టెంట్ జోడీస్ అంత కలిసి 27 మార్కులు ఇచ్చారు నటరాజ్ మాష్టర్ జోడికి. "మీ లైఫ్ లో షేర్ చేసుకునే బెస్ట్ ఫ్యాన్ మూమెంట్" ఏమిటి అని శ్రీముఖి అడిగింది. "బాలకృష్ణ గారితో నేను వర్క్ చేసాను. ఒక 20 సెకండ్స్ మూవ్మెంట్ చూపించాను. మీకు ఒకే నా లేదంటే మార్చేయనా అని అడిగాను. లేదు. చాల బాగుంది మాష్టర్. లేదు..నేను చేసేస్తా అని వెంటనే నేర్చుకుని స్పాట్ లో చేసేసారు..ఆయన ముందు ఫాన్స్ ఉంటే చాలు ఏమైనా చేసేస్తారు." అని చెప్పారు నటరాజ్ మాస్టర్.  తర్వాత రాధను అడిగింది శ్రీముఖి "రాధమ్మ మీ లైఫ్ లో జరిగిన సూపర్ స్టార్ మోమెంట్ ఏమిటి " అని " నేను రజనీకాంత్ గారికి పెద్ద ఫ్యాన్ ని. నేను ఏడవ తరగతి చదివేటప్పుడు "ఆడు పులి ఆట్టం" అని మూవీ వచ్చింది. ఒక రోజు మాకు స్కూల్ చాలా ఎర్లీగా ఐపోయింది. నేను నా ఫ్రెండ్ షీలా  థియేటర్ కి వెళ్లి మూవీ చూసాం ..ఆ మూవీలో స్టైల్ గా సిగరెట్ తాగుతూ బైక్ మీద కూర్చున్నతన్ని చూసాను. తర్వాత  ఆయన విలన్ అని తెలిసింది ..అలా ఆయన్నే  ఇమాజిన్ చేసుకుంటూ వస్తుంటే నా ఫ్రెండ్ అడిగింది ఏమిటి అని..చాలా బాగున్నాడు కదా అని అన్నాను..ఏమే అతను విలన్ అంది నా ఫ్రెండ్..అవన్నీ నాకు తెలీదు. ఫస్ట్ టైం నా లైఫ్ లో విల్లన్ అట్రాక్షన్ తో ఉన్న హీరోతో నేను నటించడం అనేది జస్ట్ ఇమాజిన్..ఆయనతో చేసిన ప్రతీ షూట్ మోమెంట్ నాకు గుర్తుంది." అని చెప్పారు రాధ..  

ట్రెండింగ్ లో బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ చింటు పంతం బర్త్ డే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ ఎంత పాపులర్ అవుతుందో అందరికి తెలిసిందే.. ఇందులో ఒక్కో పాత్రకి ఒక్కో ప్రాధాన్యతను‌ ఇస్తూ కథని ముందుకి తీసుకెళ్తున్నాడు డైరెక్టర్ చింటు పంతం.  బ్రహ్మముడికి ఇంత పాపులారిటీ రావడానికి కారణం కథ బాగుండటం ఒకటైతే.. ఇందులోని నటీనటులు మరొక కారణం.. హీరో రాజ్ పాత్రలో మానస్ నేచురల్ గా నటిస్తుండటం ఈ సీరియల్ కి మరింత ఫ్యాన్ బేస్ వచ్చింది. అయితే దుగ్గిరాల కుటుంబానికి  కనకం-కృష్ణమూర్తిల కుటుంబానికి మధ్య ఉన్న అంతులేని దూరాన్ని బ్రహ్మముడి వేసి కలిపేశాడు డైరెక్టర్ చింటు పంతం. మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు కూతుర్లు ఉన్న తల్లి కనకం పాత్రలో నీప ఆకట్టుకుంటుంది. కనకం పెద్ద కూతురిగా స్వప్న రిచ్ లుక్ లో కనిపిస్తూ టైం దొరికినప్పుడల్లా రాహుల్ తో ప్రేమాయణం నడుపుతుంది. ఇక స్వప్నకి చెల్లెలుగా కావ్య అలియాస్ దీప రంగరాజు ఆ పాత్రలో ఇమిడిపోయింది. స్వప్న, కావ్యల ముద్దుల చెల్లెలు లేడీ రౌడీగా అప్పు మాస్ యాక్టింగ్ తో ఇరగదీస్తుంది. అయితే ఈ కథలో ముఖ్య పాత్రలుగా రాజ్-కావ్యలను ఎంచుకున్న చింటు పంతం.. వీరిద్దరిని కలపడానికి ముందు వీరి మధ్య ఎక్కువ దూరాన్ని కలిగించి.. ఆ తర్వాత దూరాన్ని తగ్గిస్తూ బ్రహ్మముడి ఉందంటూ మళ్ళీ కలిపేస్తున్నాడు. తాజాగా స్వప్న-రాహుల్ పెళ్ళితో కథలో మంచి ఇంటెన్స్ ని క్రియేట్ చేసాడు చింటు పంతం. డైరెక్టర్ చింటు పంతం తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నాడు. కథలో కావ్య పాత్రకి సింప్లిసిటిని అద్ది, బాగా డబ్బున్న కుటుంబంలోని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుండటం ఈ 'బ్రహ్మముడి' కి అదనపు బలాన్నిస్తున్నాయి. స్వప్న పాత్రలో హమీదా, కావ్యగా దీపిక రంగరాజు, అపర్ణగా శ్రీప్రియ, రాజ్ గా మానస్, కళ్యాణ్ గా కిరణ్, కనకంగా నీపా, రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ.. ఇలా అందరూ తమ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్ లలో ట్రెండింగ్ లో ఉన్నవాళ్ళే.. ఇలా అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. చింటు పంతం రాసిన ఈ కథలో కలిగే ట్విస్ట్ లకి, కుటుంబ విలువలకి సీరియల్ చూడటం కోసం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సీరియల్ ముందు వరకు ఎవరికి అంతగా తెలియని డైరెక్టర్ చింటు పంతం.. బుల్లితెరపై ఈ సీరియల్ ని ఆరాధించే అభిమానుల వల్ల అందరికి తెలిసిపోయాడు. అతను ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసినా మంచి స్పందన లభిస్తుంది. ఈ రోజు డైరెక్టర్ కుమార్ పంతం పుట్టిన రోజు కావున 'బ్రహ్మముడి' సీరియల్ ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. కాగా సీరియల్ యాక్టర్స్ అంతా తమ విషెస్ ని కుమార్ పంతంకి తెలియజేస్తున్నారు.  

అర్జున్ కళ్యాణ్ చేసిన పోస్ట్ తన కోసమేనా!

అర్జున్ కళ్యాణ్.. బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమయ్యాడు. శ్రీసత్య గురించి మాట్లాడితే అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ లో శ్రీసత్య వెంటే అర్జున్ కళ్యాణ్ ఉంటూ.. తనతోనే ఎక్కువ టైం గడిపేవాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు ఒక వెబ్ సీరీస్ లో యాక్ట్ చేసాడు.. అది కూడా ఎక్కువ పాపులారిటి రాకపోయేసరికి ఎవరికి ఎక్కువగా తెలియలేదు.  ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీసత్య కోసం తన గేమ్ ని కొన్ని సందర్బాలలో త్యాగం చేసాడు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కి రావడం కూడా.. శ్రీ సత్య వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అర్జున్ కళ్యాణ్. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక కూడా శ్రీ సత్య వల్లే బయటకు వచ్చాడంటూ అప్పట్లో ఒక న్యూస్ కూడా వైరల్ అయింది. అయితే తాజాగా జరిగిన బిబి జోడి షోలో అర్జున్ కళ్యాణ్ కి జోడిగా శ్రీ సత్య వస్తుందనే వార్తలు వినిపించిన.. చివరికి వాసంతి కృష్ణన్ తో జత కట్టాడు. మరొక జోడిగా మెహబూబ్ తో శ్రీ సత్య జత కట్టింది. బిబిజోడీలో కూడా శ్రీసత్య, అర్జున్ ల మధ్యలో ఏదో ఉన్నట్లుగా.. జడ్జెస్, యాంకర్ శ్రీముఖి కూడా సరదాగా  ఆటపట్టించారు. కానీ  శ్రీసత్య మాత్రం.. అర్జున్ పై ప్రేమ లేదని, తనొక ఫ్రెండ్ అంటూ చెప్పింది. అయితే ఓ ఇంటర్వ్యూ లో అర్జున్ మాట్లాడతూ.. మా మధ్య ఏం లేదు. బిగ్ బాస్ లో నేను శ్రీసత్య విషయంలో చేసింది ఎంటర్టైన్మెంట్ కోసమే చేసామంటూ చెప్పాడు.  అయితే ఈ ఇంటర్వ్యూకి ముందు.. ఒకానొక సందర్భంలో శ్రీసత్య కోసమే బిగ్ బాస్ కి వచ్చానట్టు, తను ఎక్కడుంటే అక్కడే ఉండాలని అందుకుగాను బిగ్ బాస్ లోకి రావడానికి  చాలా కష్టపడ్డాడని, తనతో కలిసి ఉండటానికి బిగ్ బాస్ షోకి వచ్చినట్టుగా అర్జున్ కళ్యాణ్  చెప్పాడు. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు మరొక కొత్త సోషల్ ఆప్ 'థ్రెడ్స్' వచ్చింది. దీంతో సెలబ్రిటీలంతా దీనిని ఫాలో అవుతూ పోస్ట్ లు చేస్తున్నారు. అయితే అర్జున్ కళ్యాణ్ తన 'థ్రెడ్స్' ఆప్ లో చేసిన ఒక పోస్ట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. " ఎవరు అంత బిజీగా ఉండరు. అది వారి వారి ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఒకవేళ అవతలి వ్యక్తికి నువ్వు ఇష్డమైతే, వాళ్ళు కచ్చితంగా నీకు మెసెజ్ గానీ కాల్ గానీ చేస్తారు. ఇందులో క్షమించేది, అబద్ధాలు చెప్పేది, హార్ట్ బ్రేక్ అవ్వడమనేది.. అంటూ ఏమీ ఉండవు" అని అర్జున్ కళ్యాణ్ ఆ పోస్ట్ లో చెప్పాడు. అయుతే ఈ పోస్డ్ శ్రీసత్య కోసమే చేసినట్టున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ పోస్ట్ కి విశేష స్పందన లభిస్తుంది.  

కనకం రీల్ ఫ్యామిలీని కలిసిన రియల్ ఫ్యామిలీ!

నీప అలియాస్ కనకం.. ఈ పేరంటే స్డార్ మా టీవీ ప్రేక్షకులకు సుపరిచితమే. బుల్లితెర ధారావాహికల్లో టీఆర్పీలో నెంబర్ వన్ ర్యాంకింగ్ తో దూసుకెళ్తున్న స్టార్ మా టీవీ సీరియల్ "బ్రహ్మముడి". ఈ సీరియల్ కి ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ సీరియల్ కథ, కథనం బాగుంటుంది. ఇందులో రాజ్, కావ్య, కనకం, స్వప్న, దుగ్గిరాల ఫ్యామిలీ ఇలా అందరు బాగా నటిస్తున్నారు. ప్రతీ పాత్రకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇందులోని క్యారెక్టర్స్ అన్నీ కూడా సమాజంలో ప్రస్తుతం ‌ఉన్న స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో కనకం-కృష్ణమూర్తి ల కుటుంబాన్ని మధ్యతరగతి వాళ్ళలాగా చూపించాడు డైరెక్టర్. బ్రహ్మముడి సీరియల్ లో ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు ఉండగా.. ఒక్కో కూతురికి ఒక్కో శైలి ఉంది. అయితే కనకం క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. ఒక మధ్యతరగతి తల్లి తన కూతురి కోసం కనే కలలను ఇందులో చక్కగా చూపిస్తున్నాడు. కనకం తన కూతుళ్ళకు గొప్పింటి కోడళ్లను చెయ్యాలని అనుకుంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో నీప శివ అలియాస్ కనకం.. ఈ మద్యతరగతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కనకం మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ని చూపించడమే కాకుండా కామెడీ వెర్షన్ తో ఆకట్టుకుంటుంది. కనకంకి తెలుగులో బ్రహ్మముడి మొదటి సీరియల్ అయినప్పటికి ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.  కనకం తాజాగా తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. "ఫ్యామిలీతో కొత్త ప్రపంచానికి వెళ్ళామంటూ" ఒక వ్లాగ్ చేసింది కనకం(నీప శివ). అక్కడ అక్వేరియంలో ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత చెన్నైలోని ఒక ఎగ్జిబిషన్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది.‌ అక్కడ సరదాగా పిల్లలతో కలిసి ఆడుతూ ఎంజాయ్ చేసింది. ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి అవుటింగ్ కి వెళ్ళి అక్కడ వ్లాగ్ లు చేస్తూ.. తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది కనకం. బ్రహ్మముడిలోని కనకం రీల్ ఫ్యామిలీని, బయట ఉన్న తన రియల్ ఫ్యామిలీ కలవడంతో ఆ అనుభవాలను పంచుకుంది కనకం. ఈ ఫ్యామిలీ మీట్ లో విక్రమాదిత్యతో పాటు హమీద కుడా ఉన్నారు.  నీప తన కుటుంబాన్ని, సీరియల్ లోని కనకం కుటుంబాన్ని కలిసినట్టుగా చేసిన ఈ వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది.

గుప్పెడంత మనసు సీరియల్ లో సరికొత్త ట్విస్ట్.. రిషికి ఏంజిల్ లవ్ ప్రపోజల్?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకాధారణ పొందుతూ రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే ఈ సీరియల్ గత కొన్నిరోజులుగా రోజుకొక ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది. స్క్రీన్ మీద రిషి, వసుధారల లవ్ స్టోరీకి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో  రిషి మ్యానరిజంకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు. రిషి, వసుధారల లవ్ స్టోరీని ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతారు. కాగా ఈ సీరియల్ ఇప్పుడు ఎమోషనల్ గా మారిపోయింది. ఈ మధ్య గుప్పెడంత మనసు సీరియల్ టైమింగ్ స్లాట్ చేంజ్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. స్లాట్ టైమింగ్ చేంజ్ చెయ్యొద్దంటూ పెద్ద ఎత్తున మా టీవీ యాజమాన్యంకి రిక్వెస్ట్ చేశారు. అయితే గుప్పెడంత మనసు సీరియల్ ప్రోమోలకి కామెంట్ సెక్షన్ లో ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్ రైటర్ చేంజ్ అయ్యాడు. అలాగే ఈ సీరియల్ టైమింగ్ స్లాట్ కూడా చేంజ్ అయింది. అయినా రేటింగ్ మాత్రం తగ్గలేదు. ఇదంతా శైలేంద్ర ఎంట్రీ వల్లే జరిగిందంటూ అతడిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సీరియల్ లో కథని కొన్ని రోజులు ముందుకు తీసుకెళ్లారు మేకర్స్. ఆ తర్వాత రిషి అందరికి దూరంగా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్, అతని కూతురు ఏంజిల్ తో కలిసి ఉంటున్నాడు రిషి. ఈ మధ్య వసుధార కూడా గాయాలు అవడంతో రిషి, విశ్వనాథ్, ఏంజిల్ ఇంటికి వస్తుంది. అయితే రానున్న ఎపిసోడ్‌లో రిషికి ఏంజిల్ లవ్ ప్రపోజ్ చేస్తుందని తెలుస్తుంది. దాంతో రిషి, వసుధార ఇద్దరు షాక్ అవుతారు. మరి ఏంజిల్ ప్రపోజల్ ని రిషి అంగీకరిస్తాడా?  ఏంజిల్ కి, వసుధార అసలు నిజం చెప్పనుందా? తెలియాలంటే ఈ సీరియల్ లో తర్వాత జరిగే ఎపిసోడ్స్ ని మిస్ అవ్వకూడదని అర్థమవుతుంది.

సుమ ఉంటే బీపీ టాబ్లెట్స్ అవసరం లేదు

సుమ అడ్డా షోకి త్వరలో రాబోయే గెస్టులతో జరిగిన షూటింగ్ ని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది సుమ. ఇక ఈ షోకి సింగర్ సునీత తన కొడుకు ఆకాష్ నటించిన మూవీ 'సర్కార్ నౌకరి' ప్రమోషన్స్ లో భాగంగా వచ్చారు. అలా షూటింగ్ గ్యాప్ లో సుమ-సునీత మధ్య చిన్న చిట్ చాట్ లాంటిది జరిగింది.  డిఫరెంట్ కంటెంట్ తో ఈ మూవీ వస్తోంది.. చూడండి అని చెప్పింది సుమ. "సుమ నువ్వు నా సెంటిమెంట్.. సుమ ఉంటే బీపీ టాబ్లెట్స్ అవసరమే లేదు" అంటూ తన ఫ్రెండ్ గురించి పొగిడేశారు సునీత. "సుమకి మరి..ఈ టాబ్లెట్స్ అస్సలే అవసరం లేదు..నో షుగర్, నో బీపీ, నో కొలెస్ట్రాల్..హ్యాపీగా మన ఇద్దరం ఇలాగే ఉండాలి  " అని చెప్పింది సుమ. "అసలు టైం గడుస్తున్నా కూడా ఇలాగే ఉండిపోయాం. మన వయసు కూడా పెద్దగా పెరగడం లేదు" అని సుమ కామెడీగా అనేసరికి "మన పిల్లలు మాత్రం తాటి చెట్లలా పెరిగారు" అంది సునీత. "మన జీవితాలు పార్లల్ గా వెళ్తున్నాయి. ప్రతీ విషయంలో ఎవరో ఒకరం ముందు వెనకగా వెళ్తూనే ఉన్నాం...మా అబ్బాయి సినిమా వచ్చేసింది.. ఇక మీ అబ్బాయి రోషన్ ఫిలిం రావాలి..."అని సునీత అనేసరికి "ఫస్ట్ కోడలు మాత్రం నీకే వస్తుందిలే" అంది సుమ సెటైరికల్ గా. తర్వాత  షూటింగ్ టైములో  ఏ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందో చూపించింది. ఇక ఈ షూటింగ్ మొత్తం ఆకలి ఆకలి అంటూ అరుస్తూనే ఉంది సుమ...బ్రేక్ కావాలి బ్రేక్ కావాలి అంటూ ఫైనల్ గా టీం మొత్తాన్ని తీసుకెళ్లి ఫుల్ గా ఫుడ్డు లాగించేసింది.  సుమ, సునీత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్..సుమ ఇండస్ట్రీకి ముందుగా వస్తే ఆ తర్వాత సునీత ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి వీళ్ళ జర్నీ ఇప్పటివరకు అలా కొనసాగుతూనే వస్తుంది. యాంకర్ సుమ  ఎక్కడ ఉంటే అక్కడ మాటల ఊట ...సింగర్  సునీత ఎక్కడ ఉంటే అక్కడ పాటల తోట.

మహిళల కోసం 'నేను సూపర్ ఉమెన్' త్వరలో

"అభిప్రాయలు మార్చుకోండి సర్ ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి" అంటూ అల్టిమేట్ డైలాగ్ తో ఈ షో ప్రోమో ఎండ్ అయ్యింది. ఇంతకు ఈ మాటలు ఏ షోకి సంబంధించినవి అనుకుంటున్నారా "నేను సూపర్ ఉమెన్" అనే కొత్త షోలోవి ఈ డైలాగ్స్. ఆహాలో త్వరలో ప్రసారం కాబోతోంది ఈ షో. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఇందులో ఒక అమ్మాయి దుస్తులు మడత పెడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి తెలిసిన అంకుల్ వచ్చారు. "గీతా... అంకుల్ వచ్చారు కాఫీ" అని అడిగేసరికి "కాఫీ తర్వాత ముందు కూర్చోమ్మా... అమ్మ అబ్బాయి ప్రశాంత్ యూఎస్ లో లక్షలకులక్షలు సంపాదిస్తున్నాడు. నువ్వు ఊ అను వెంటనే పెళ్ళికి ఒప్పిస్తా" అని సలహా ఇచ్చేసరికి "లేదు అంకుల్ ఇంకా టైం ఉంది పెళ్ళికి.. ఇప్పుడు నా బిజినెస్ గ్రో అవ్వాలి"అని చెప్తుంది. "ఎందుకమ్మా నీకు ఈ బిజినెస్ గొడవలు.. హాయిగా పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలతో సెటిల్ ఐపో" అని ఆ అంకుల్ సలహా ఇచ్చి తన సెల్ లో కొడుకు ప్రశాంత్ ఫోటోని చూపించాడు. "ఏరోబూట్ అనే రోబోటిక్ కంపెనీలో డెవలపర్ గా పనిచేస్తున్నాడు" అని చెప్పి.. "ఇంతకు నువ్వేం బిజినెస్ చేస్తున్నావమ్మా" అని కాఫీ తాగుతూ అడిగారు అంకుల్. "ఏరోబూట్ అని చిన్న రోబోటిక్స్ కంపెనీ ఉంది అంకుల్ నాకు.. ఇదిగో మాటల్లోనే మీ కొడుకు నాకు కాల్ చేస్తున్నాడు యూఎస్ లో షిఫ్ట్ ఐపోయినట్టుంది..స్టేటస్ అప్ డేట్ కనుక్కుని వస్తాను అంకుల్" అని ఆమె అక్కడినుంచి గర్వంగా లేచి వెళ్తుంటే నాలుక్కరుచుకుని అంకుల్ అలా చూస్తూ ఉండిపోయారు. ఓవరాల్ గా షో థీమ్ ని చాలా అందంగా చెప్పారు. ఆడవాళ్లు అంటే ఇంకా వంటిల్లు, పిల్లలు కాదు ఆ జనరేషన్ మారింది బిజినెస్ లు చేస్తూ కంపెనీలు కూడా నడుపుతున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ ప్రోమోని డిజైన్ చేశారు.

తండ్రి కాబోతున్న అవినాష్

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి చెప్పాల్సిన అవసరం లేకుండానే ప్రతీ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపిస్తూ పెద పాలేరులా అలరిస్తూ ఉంటాడు. అలాంటి అవినాష్ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. జబర్దస్త్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో అవినాష్ ఒకరు. జబర్దస్త్ క్రేజ్ తో అతనికి  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే  అవకాశం లభించింది. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఇచ్చి తన జోకులతో అందరిని ఎంటర్టైన్ చేసాడు. తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక అనుజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక తాను  తండ్రి కాబోతున్నానంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేసాడు. ఇప్పుడు అనుజాకు నాలుగో నెల నడుస్తోందని చెప్పాడు. ఈ విషయాన్నీ తన  పేరెంట్స్ కి తన అత్తామామకు కూడా చెప్పడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారన్నారు.  ఇకపోతే అమ్మాయా, అబ్బాయా అంటూ ఎవరికి ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని చెప్పారు. ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టేసుకుని తమ ప్రేమను ఈ వీడియోలో చూపించేసుకున్నారు. బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ మాత్రమే తింటూ హ్యాపీగా ఉండాలి అంటూ తన వైఫ్ కి స్వీట్ సజెషన్స్ కూడా ఇచ్చాడు. తండ్రికి అర్ధం తాను తండ్రి అయ్యేంతవరకు తెలీలేదని ఇప్పుడు తాను చాలా హ్యాపీగా ఉన్నానని నైట్ నిద్రపోయేటప్పుడు తన బేబీ స్కాన్ రిపోర్ట్స్ చూసుకుని మరీ పడుకుంటానని చెప్పాడు అవినాష్. తన బేబీ హార్ట్ బీట్ వినడం చాలా హ్యాపీగా ఉందన్నాడు.  ఇక ఇంట్లో తన వైఫ్ కి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాను అని...నెటిజన్స్ కి కూడా అలా ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే హెల్ప్ చేయమని సలహా ఇచ్చారు. మీరంతా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే ఏం తినాలి ఎలా ఉండాలో తన వైఫ్ కి అవసరమైనన్ని టిప్స్ కూడా ఇస్తూ ఉండమని కోరారు అవినాష్ అండ్ అనుజా.

భవాని రాగానే యాక్టింగ్ స్టార్ట్ చేసిన ముకుంద! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -204 లో.. భవాని ఆశ్రమం నుండి వస్తుందని ఈశ్వర్ అతని కొడుకు మధు ఎదురుచూస్తుండగా, భవాని వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్తారు. చాలా రోజుల తర్వాత ఇల్లు చూసి మురిసిపోతుంది భవాని‌. భవాని ఇంట్లోకి వచ్చాక మొదటగా.‌‌. ముకుంద ఎక్కడ అని రేవతిని అడుగుతుంది‌. అలా భవాని అడగడంతోనే రేవతి షాక్ అవుతుంది. అదేంటి అక్కా.. మురారి గురించి అడుగుతావని అనుకుంటే ముకుంద గురించి అడిగావేంటని రేవతి అంటుంది. కారణం లేకుండా ఏదీ అడుగనని నీకు తెలుసు కదా అని భవాని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మధు.. తను గదిలో ఉందని చెప్తాడు. ముకుంద.. మీ అత్తయ్య వచ్చారని రేవతి పిలుస్తుంది. ఇక ఇదే చాన్స్ అని ముకుంద తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఒంటరిగా ఉంటున్నట్టు, వాళ్ళ అమ్మకి బాగోలేకపోవడం వల్ల తను బాధపడుతున్నట్టుగా భవానిని పట్టుకొని ఏడుస్తుంది. ఇక ఇదంతా భవాని నమ్మి తనని అక్కున చేర్చుకుంటుంది. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ, మురారి వస్తారు‌. భవానిని చూసి హ్యాపీగా ఆశీర్వాదం తీసుకుందామని తన దగ్గరగా వెళ్తుంటే.. వద్దని భవాని అంటుంది. ఏం అయిందని మురారి అడుగగా.. మీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడమేనా .. ఇంట్లో ఒంటరిగా ఉన్న ముకుందని పట్టించుకోరా అని మురారిని అడుగుతుంది భవాని. దాంతో మురారి మౌనంగా ఉంటాడు. "ఇక నుండి ముకుంద అంటే మన ఫ్యామిలీ.‌. ఉమ్మడి కుటుంబం అంటే ఎవరి గదుల్లో వారుండటం కాదు అందరు కలిసి ఉండటం" అని భవాని చెప్తుంది. ముకుందకి ధైర్యం చెప్పి పంపిస్తుంది భవాని. ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్తారు. కృష్ణ, మురారి వారి గదిలో ఉండి ఒకరితో ఒకరు ఏదో చెప్పాలని ఒకేసారి మాట్లాడుతారు. నీకొకటి చెప్పాలి కృష్ణ కానీ చెప్పడానికి ధైర్యం చాలట్లేదని అనగానే.. సరే కళ్ళు మూసుకుంటాను అప్పుడు చెప్పండని కృష్ణ కళ్ళు మూసుకుంటుంది. అయినా మురారికి చెప్పడానికి నోటి నుండి మాట రాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషిని చూడటానికి బయల్దేరిన జగతి, మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -810 లో.. రిషి ఇంటికి వస్తుండగా.. వసుధార గురించి ఆలోచిస్తుంటాడు‌. నేను పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను. నేను చెయ్యాలనుకున్నది చేస్తాను. మిషన్ ఎడ్యుకేషన్ లాగే ఈ కాన్సెప్ట్ ని కూడా తీర్చిదిద్దుతానని రిషి అనుకుంటాడు. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు.. రిషి వసుధారలు ఉన్న దగ్గరికి వెళ్లడానికి అంతా రెడీ చేసుకుంటారు. నేను రిషిని దోషిని చేసానని జగతి బాధపడుతుంది. నువ్వు రిషి కోసం చేసావని మహేంద్ర అంటాడు. మనం వెళ్తున్నట్లు ఎవరితో చెప్పకూడదు.. చెప్తే మనల్ని ఫాలో చేస్తారని జగతి అంటుంది. అప్పుడే శైలేంద్ర వెళ్తూ జగతి మాటలు వింటాడు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత దేవయాని దగ్గరికి శైలేంద్ర వచ్చి.. "పిన్ని బాబాయ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు.. నాకు అర్థం అయింది.. అదేంటో తెలుసుకోవాలి" అని దేవయానితో అంటాడు శైలేంద్ర. మరొక వైపు రిషి ఇంటికి వస్తాడు. ఇంటి ముందు ప్రిన్సిపల్ సర్ పంపిన కార్ డ్రైవర్.. వసుధార కోసం చూస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏంటని డ్రైవర్ ని రిషి అడుగుతాడు. వసుధార మేడమ్ ని తీసుకొని ప్రిన్సిపల్ సర్  రమ్మన్నాడని డ్రైవర్ చెప్తాడు. వసుధార మేడమ్ రాదు. మీరు వెళ్ళండి ప్రిన్సిపల్ సార్ కి చెప్పానని రిషి చెప్తాడు. వసుధార రెడీ అయి వస్తుంటే రిషి వెళ్లకుండా అడ్డుపడతాడు. మీరు కాలేజీ కి, ఈ పరిస్థితిలో వెళ్లడం అవసరమా అని రిషి అంటాడు. సర్ నేను ఇప్పుడు కాలేజీకి అవసరమని వసుధార అంటుంది. ఇంటిదగ్గర ఉండి వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటి ఉందని రిషి చెప్పగానే వసుధార లోపలికి వెళ్తుంది. జగతి, మహేంద్రలు సంతోషంగా ఉంటారు. చాలా రోజుల తర్వాత రిషిని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని మహేంద్రతో జగతి అంటుంది. నాక్కూడా అలాగే ఉందని మహేంద్ర అంటాడు. మరొక వైపు జగతి మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని శైలేంద్ర వాళ్ళని ఫాలో చేస్తాడు. వాళ్ళని ఫాలో చేస్తున్న విషయం దేవయానికి ఫోన్ చేసి శైలేంద్ర చెప్తాడు. వాళ్ళని కూడా రిషి లాగే చంపేస్తానని దేవయానితో శైలేంద్ర అంటాడు. లేదు అలా చెయ్యకు ఓపిక పట్టని దేవయాని చెప్తుంది. మరొకవైపు సెమినార్ కి సంబంధించి.. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్,  రిషి, వసుధార అందరూ వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అప్పుని పోలీస్ స్టేషన్ నుండి విడిపించిన కళ్యాణ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -143 లో... కావ్య వల్లే నేను పెద్ద ప్రాబ్లమ్ నుండి బయటపడ్డానని రాజ్ చెప్పగానే.. అందరూ అపర్ణని కోప్పడతారు. అలా ఏది నిజమో తెలియకుండా ఎలా పడితే అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని అపర్ణని అంటుంది ఇందిరాదేవి. మరొక వైపు కనకం, కృష్ణమూర్తి లు.. దుగ్గిరాల ఇంటినుండి బయటకు వచ్చి నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల నా కూతురు ఆ ఇంట్లో ఎలా ఉందో చూడండి. అసలు అబద్ధం ఆడకూడదని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం కోర్ట్ కి పోకుండా ఎస్సై  కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుదామని కృష్ణమూర్తి అంటాడు. మరొక వైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తే.. స్విచాఫ్ రావడంతో నేనే వాళ్ళింటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇస్తానని కళ్యాణ్ అనుకొని అప్పు వాళ్ళింటికి వెళ్తాడు. కళ్యాణ్ వెళ్లేసరికి అప్పు ఇంట్లో వాళ్ళ పెద్దమ్మ తప్ప ఎవరు ఉండరు. అప్పు పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్తే, మళ్ళీ వాళ్ళింట్లో వాళ్ళకి కళ్యాణ్ చెప్తే కావ్యకి ప్రాబ్లమ్ అవుతుందని అప్పు పెద్దమ్మ అందరూ పెళ్లికి వెళ్లారని కళ్యాణ్ కి చెప్తుంది. కానీ కళ్యాణ్ కి అప్పు వాళ్ళ పెద్దమ్మ తడబడుతూ మాట్లాడేసరికి.. ఏదో దాస్తుందని అర్థం అవుతుంది. మరొక వైపు కావ్య ఉల్లిపాయలు కట్ చేస్తూ కళ్ళకి నీళ్లు కారుతుంటే అపర్ణ అన్న మాటలకూ ఏడుస్తుందనుకొని.. కావ్యని బాధపడకని చెప్తుంది ధాన్యలక్ష్మి. నేనేం బాధపడట్లేదు ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళలో ఈ కన్నీళ్లు వస్తున్నాయని కావ్య చెప్తుంది. మరొక వైపు అప్పుని స్టేషన్ నుండి కళ్యాణ్ విడిపిస్తాడు. రాకేష్ తో కంప్లైంట్ వెనక్కి తీసుకునేల చేసి అప్పుని బయటకు విడిపిస్తాడు. ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు. బంతి ద్వారా నిజం తెలిసిందని కళ్యాణ్ అంటాడు. అప్పుని విడిపించినందుకు.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్తారు. మరొకవైపు అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి.. నువ్వు నిజం ఏంటో తెలియకుండా అందరిముందు కావ్యని తిట్టావ్. అందుకు నువ్వు కావ్య కి సారీ చెప్పాలని సుభాష్ అంటాడు. సారీ చెప్పనని అపర్ణ అంటుంది. థాంక్స్ అయినా చెప్పమని సుభాష్ అపర్ణని కావ్య దగ్గరికి తీసుకెళ్తాడు. అపర్ణ థాంక్స్ చెప్తుంది. మళ్ళీ తనని అవమానిస్తుంది. మరొక వైపు కావ్య దగ్గర డబ్బు లేదని గ్రహిస్తాడు రాజ్. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు ఒక్క రూపాయి కూడా కావ్య దగ్గర లేదా? అలా ఎలా ఉంటుందని.. తన దగ్గర కొంత డబ్బు ఉంచాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.