ఒకప్పుడు ఆవులకు, దూడలకు వేసిది.. ఇప్పుడు నువ్వు తింటున్నావ్!

   అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటి తెచ్చుకున్న అనసూయ..‌ 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా 'రంగమార్తాండ' సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. తన తర్వాతి సినిమా 'విమానం' మూవీ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి నుండే ప్రమోషన్ ని మొదలుపెట్టింది. అయితే 'విమానం' సినిమా కథ బాగుండటంతో విమర్శకుల ప్రశంసలు పొంది భారీ హిట్ గా నిలిచింది. దాంతో అనసూయ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే, మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి దాకా జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది అనసూయ. హ్యాపీ వీకెండ్ గాయ్స్ అంటూ తను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫొటోస్ ని షేర్ చేసింది అనసూయ. అయితే అనసూయ ఏది చేసిన తప్పే అన్నట్లుగా నెటిజన్ల తీరు ఉంది. ఒక్కొక్కరు ఒక్కోలా అనసూయని తిడుతూ కామెంట్ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ కామెంట్లు చూసి చెప్పొచ్చు. అయితే అనసూయ చేసిన పోస్ట్ కి  "నువ్వు తినేది.. ఒకప్పుడు మేము ఆవులకు, దూడలకు వేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు తింటున్నావ్" అని ఒకతను కామెంట్ చేశాడు. "అది విజయ్ దేవరకొండ వెళ్లిన హోటల్ కదా.. సేమ్ అదే హోటల్ లో విజయ్ దేవరకొండ దిగిన ఫోటో తన ఇన్ స్టాగ్రామ్ లో ఉంది" అని మరొకరు కామెంట్ చేశారు. ఇప్పటికే అనసూయ, విజయ్  దేవరకొండ ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది. ఇక ఈ కామెంట్స్ కి అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.   

కృష్ణభగవాన్ మీద ప్రవీణ్ పంచ్..నువ్వు ఆ రాయి ఇచ్చాకే కిడ్నీలో రాళ్లు వచ్చాయంటూ కౌంటర్

ఎక్స్ట్రా జబర్దస్త్ లో పటాస్ ప్రవీణ్ మంచి కామెడీ స్కిట్ వేసాడు. కృష్ణ భగవాన్ మీద కామెడీ చేద్దాం అనుకున్నాడు కానీ అది రివర్స్ లో ప్రవీణ్ కే తెగిలింది. రంగురాళ్లు అమ్ముకునే అబ్బాయి క్యారెక్టర్ చేసాడు. "ఈ బీచ్ పేరేమిటో తెలుసా..మెరీనా బీచ్ కానీ అప్పుడప్పుడు రష్మీ వచ్చేసరికి రష్మీ బీచ్ ఐపోయింది" అని ప్రవీణ్ చెప్పేసరికి రష్మీ షాకైపోయింది. "ఈ బీచ్ లో నాకు రంగు రాళ్ళ బిజినెస్ ఒకటి ఉంది.. ఈ రాళ్లు పెట్టుకున్నవాళ్లంతా ఎక్కడో ఉన్నారు తెల్సా రష్మిగారు" అనేసరికి "అవునా" అంది రష్మీ. "అంతెందుకండి ఈ అమ్మాయి వెనక ఒక అబ్బాయి అలా గాలికి తిరిగేవాడు..అలా గాలికి తిరుగుతున్నాడని ఒక రింగ్ పెట్టా...గాలోడై ఇప్పుడు హిట్ కొట్టి రష్మీ కూడా దొరక్కుండా తిరుగుతున్నాడు" అంటూ ప్రవీణ్ సుడిగాలి సుధీర్ మీద ఒక పంచ్ వేసాడు. "ఒకసారి కృష్ణ భగవాన్ గారు అలా వచ్చి బీచ్ దగ్గర ఆలోచిస్తూ ఉన్నారు" ఏమైంది సర్  అని నేను అడిగితే పంచులు సరిగ్గా వేయలేకపోతున్నాను" అన్నారు .."దానికి నేను వెంటనే ఒక పచ్చ రాయి తీసి పెట్టా" అన్నాడు ప్రవీణ్. " ఆ రాయిని పెట్టుకున్నాకే కిడ్నీలో రాళ్ళోచ్చాయి" అని రివర్స్ లో కృష్ణ భగవాన్ కౌంటర్ వేసేసరికి పటాస్ ప్రవీణ్ నాలుక్కరుచుకున్నాడు. ఇక జడ్జ్ ఖుష్బూ గురించి చెప్పబోతూ ఉండగా "నాకు తెలుసు నువ్వు నా దగ్గరకే వస్తావ్ అని..ఇదిగో నా చేతులకు ఉన్నాయి రంగురాళ్లు" అని చూపించేసరికి ప్రవీణ్ వేయాల్సిన కౌంటర్లు కి  ఫుల్ స్టాప్ పెట్టేసాడు. ఫైనల్ గా అన్ని అమ్మేశాక మిగిలిన ఒక్క రింగును చూపిస్తూ "రష్మీ గారు ఒక్క రింగు తీసుకోండి మీ షష్ఠిపూర్తికి ఐనా పనికొస్తుంది" అనేసరికి రష్మీ సీరియస్ లుక్ ఒకటి ఇచ్చేసింది. దాంతో ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.  

హరిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఫైమా

  "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లేటెస్ట్ వీక్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. "సింగల్ కింగ్స్ వర్సెస్ సింగల్ క్వీన్స్" కాన్సెప్ట్ తో రాబోతోంది శ్రీముఖి. ఇక ఇందులో ఎక్స్ప్రెస్ హరి వచ్చి ఫైమాని కిస్ అడిగేసరికి ఫైమా స్కూటీ కీస్ ఇచ్చి నవ్వించింది. అడిగింది కిస్సు కీస్ కాదు అన్నాడు హరి.  "నేను హరిని పెళ్లి చేసుకుందాం" . అనుకుంటున్నానని చెప్పింది ఫైమా..ఆ మాటకు షాకైపోయింది శ్రీముఖి. "ఫైమా స్టేటస్ ఏంటో తెలుసా" అని హరిని అడిగింది శ్రీముఖి.  తర్వాత స్టేజి మీద సింగల్ కింగ్స్ కొంతమంది వచ్చారు.  ఇక అవినాష్ తన స్టయిల్లో ఈ సింగల్ కింగ్స్ తో ప్రమాణం చేయించాడు. "ఎంత అందమైన అమ్మాయి కనిపించినా సింగల్ గా ఉంటూ కింగుల్లా ఉంటాం" అని ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత సింగల్ క్వీన్స్ వచ్చేసరికి శ్రీముఖి కూడా వాళ్ళతో ప్రమాణం చేయించింది. "ఎదురుగా ఉన్న అబ్బాయిలు ఎంత టెంప్ట్ చేసినా ఎప్పటికీ సింగల్ క్వీన్స్ గానే ఉంటాం అని ప్రమాణం చేస్తున్నాం" అని చెప్పారు. ఇక క్వీన్స్ తో కూరగాయలు కట్ చేసే టాస్క్ చేయించింది హోస్ట్. కింగ్స్ తో పులప్స్ చేయించాడు అవినాష్. ఇక ఈ షోకి ఇంటర్నేషనల్ మెజీషియన్ బిఎస్ రెడ్డి వచ్చారు. వస్తూనే మ్యాజిక్ చేసి శ్రీముఖికి  పూల బొకే ఇచ్చారు. ఇక లాస్ట్ లో ఒక  అమ్మాయిని నిలబెట్టి ఆమె హాఫ్ పార్టీ ని అటు ఇటు తిప్పేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా నెక్స్ట్ వీక్ షో మంచి ఎంటర్టైనింగ్ గా కామెడీగా ఉండబోతోంది. ఈయన మ్యాజిక్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. ఆయన మ్యాజిక్ షోతో ఈ ఎపిసోడ్ ఆడియన్స్ లో ఎనర్జీ నింపబోతోంది.    

ఈ సూపర్ మామ్ ఎప్పుడూ నా సెల్ డీపీగా ఉంటుంది!

వన్యప్రాణి ప్రేమికులకు "కాలర్‌వాలి" అనే పులి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని అందరూ ముద్దుగా "మాతారాం" అని పిలుచుకుంటారు. ఈ పులి సుమారు  16 ఏళ్లకు పైగా బతికి 29 పిల్లలకు జన్మనిచ్చింది. అందుకే ఈ పులిని "సూపర్ మామ్" అని కూడా అంటారు. లాస్ట్ ఇయర్ ఈ పులి చనిపోయింది. దానికి ఘనంగా అంత్యక్రియలు కూడా జరిగాయి.  ఇప్పుడు ఎందుకు దీని గురించి చెప్తున్నా అనుకుంటున్నారు కదా..."నీతోనే డాన్స్" షోకి వచ్చే జడ్జ్ సదా గురించి అందరికీ తెలుసు. ఆమె రెగ్యులర్ గా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకరి సలహా మేరకు "అసలు సదా ఫోన్ లో ఏముంది" అనే టాపిక్ పైన చేయమన్నారట..అందుకే ఈ వీడియో చేశారు సదా. సదాకి వన్యప్రాణులంటే చాలా ఇష్టం. ఆమె సెల్ డిపిగా "మాతారం" పిక్ ని పెట్టుకున్నట్టు చూపించారు. ఐతే తాను ఈ పిక్ ని తియ్యలేదు అని చెప్పారు. అలాగే ఈ పులిని కండిషన్ లో అస్సలు చూడలేకపోయానని బాధపడ్డారు. చనిపోయే ముందు మాత్రమే చూశానని చెప్పారు. జనవరి  2022 నుంచి ఈ పులిని తన డిపిగా పెట్టుకున్నట్లు చెప్పారు. అలాగే మాయ, వీర అనే పులులు కూడా తన మనసులో స్తానం సంపాదించుకున్నాయి అని అన్నారు. ఇక తన సెల్ లో  ఎక్కువ రీల్స్ అన్ని పులుల మీదే ఉంటాయి అని వాటిని కూడా చూపించారు. ఇంకా  తన ఫేస్బుక్ పేజీని, ఇన్స్టాగ్రామ్ పేజీని ఇలా అన్ని చూపించారు. నోట్స్ అనే ఫోల్డర్ లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ గురించిన నోట్స్ ఎక్కువగా రాసుకుంటానని అది తనకు ఎంతో ఇష్టం అని అన్నారు. అలాగే ఇంట్లో తాను పెంచుకునే పిల్లులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి ఇంట్లో సీసీ కెమెరాలను ఫిక్స్ చేయించానని వాటిని తన సెల్ వీడియో ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉంటానన్నారు. ఇక తన కాల్ లిస్ట్ లో ఎక్కువగా తన మదర్ కి కాల్ చేస్తాను అని చూపించారు. ఇలా తన ఫోన్ లో ఏమేమి ఉన్నాయో చూపించారు సదా .  

చందమామను చూపించకుండా డ్రామా జూనియర్స్ చూపించి అన్నం పెడుతున్నారు

చిన్నారులు హిలేరియస్ స్కిట్స్ తో ఎంతోమందిని అలరిస్తున్న డ్రామా జూనియర్స్ సీజన్ 6  నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక జయప్రద, శ్రీదేవి, బాబూమోహన్ స్టేజి మీదకు వచ్చేసరికి యాంకర్ ప్రదీప్ ఒక స్వీట్ కామెంట్ చేసాడు. "ఇది వరకు చందమామను చూపించి అన్నం తినిపించేవాళ్లు చిన్నప్పుడు..కానీ ఇప్పుడు చూపించట్లేదు" అని చెప్పాడు. దానికి జయప్రద ఎందుకు అని అడిగింది "ఇప్పుడు డ్రామా జూనియర్స్ చూపిస్తున్నారు ఎందుకంటే రెండు చందమామలు ఇక్కడే ఉన్నాయి కదా" అనేసరికి వాళ్ళు నవ్వేశారు. ఇక ఈ ఎపిసోడ్ కి "హిడింబా" మూవీ నుంచి అశ్విన్, నందిత శ్వేతా వచ్చారు. "హలో నందిత గారు ఎలా ఉన్నారు" అని ప్రదీప్ ఏమీ తెలియనట్టు అడిగేసరికి "ఏమీ తెలియనట్టే మాట్లాడుకుంటారు మీరిద్దరూ" అని అశ్విన్ బాబు కౌంటర్ వేశారు. దానికి  "నాకు ప్రదీప్ అంటే ఇష్టం" అని చెప్పారు నందిత. ఆ మాటకు  ప్రదీప్ సిగ్గుపడిపోయారు. ఇక ఈ షోకి "రాధమ్మ కూతురు" సీరియల్ నుంచి అరవింద్- అక్షర వచ్చారు. హిడింబ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆ మూవీ టీమ్ షోకి వచ్చింది. ఇక చిన్నారులు అల్లూరి సీతారామరాజ్ స్కిట్ వేశారు. అలాగే ఇంకో టీమ్ రైతు పడే కష్టాలను చూపించారు. దాంతో బాబూమోహన్ చాలా ఎమోషనల్ ఇపోయారు. "రైతు పంట మీద ఎంత ఆశ పెట్టుకుంటాడంటే..ఎన్నో కలలుగంటారు..కలలు ఇలా కల్లలు ఐపోయినప్పుడు ఇలా హృదయవిదారకంగా ఉంటుందని బాగా చూపించావు" అంటూ ఆ చిన్నారిని మెచ్చుకున్నారు. ఆ స్కిట్ లో ఆ చిన్నారి పడే బాధకు మిగతా పిల్లలు కూడా ఏడ్చేశారు.  

పెద్ద స్టార్స్ కి మాత్రమే ఫుల్ క్యారవాన్ ఇస్తారు!

"నీతోనే డాన్స్" షో మొదలైన దగ్గర నుంచి ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. ఇక ఈ షోకి జడ్జిగా ఉన్న తరుణ్ మాష్టర్ వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తరుణ్ మాష్టర్ రీసెంట్ గా "గరం మసాలా విత్ తరుణ్ మాష్టర్" అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. ఇందులో అన్ని రకాల వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి తరుణ్ మాష్టర్ ఇప్పుడు రాధ, సదా గార్ల క్యారవాన్ వీడియో చేశారు. ఒక క్యారవాన్ లో సగం సదా గారికి, సగం తరుణ్ మాష్టర్ కి ఇచ్చారు. కానీ రాధ గారికి మాత్రం ఒక ఫుల్ క్యారవాన్ ఇచ్చేసారు. అలా ఎందుకు ఇచ్చారో కూడా చెప్పారు తరుణ్ మాష్టర్. ఈ క్యారవాన్ ఓన్లీ ఫర్ స్టార్ సెలబ్రిటీస్ కి మాత్రమే ఇస్తారట. ఎందుకంటే వాళ్లకు కాస్ట్యూమ్స్, షూట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్లకు ఈ క్యారవాన్ మొత్తాన్ని ఇచ్చేస్తారట. ఈ క్యారవాన్ లో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కి ఈ క్యారవాన్ ని పంపిస్తారట..ఇది ఎగ్జిక్యూటివ్ వ్యాన్..దీనికి పక్కా సెక్యూరిటీ ఉంటుందట. అలాగే లోపల అన్ని రకాల ఫెసిలిటీస్ ని కూడా ఆయన వీడియోలో చూపించారు. రెండు నెలల ముందుగా షూటింగ్స్ షెడ్యూల్ చెప్తేనే ఈ క్యారవాన్ ని బ్లాక్ చేస్తారని చెప్పారు. ఇక ఈ వ్యాన్ లో ఏ స్టార్ ఐతే ఉంటారో వాళ్ళ అభిరుచి ప్రకారం లోపల డిజైనింగ్ చేస్తారట. ఇలాంటి క్యారవాన్ లోకి వచ్చేసరికి నేనే కొంచెం చిరంజీవిలా ఫీలవుతున్న..అన్నారు తరుణ్ మాష్టర్..ఇక వన్ అవర్ ఉంది అంటే మేకప్ టకటకా వేసేస్తారు. ఇంత స్పీడ్ గా మేకప్ వేయించుకోవడం అనే విషయాన్ని ఎక్కువగా శ్రీదేవి, మాధురి దీక్షిత్ గారి దగ్గర చూసాను. కాస్ట్యూమ్ చేంజ్ అనగానే ఒక్క అరగంటలో వచ్చి మొత్తం చేంజ్ చేసుకుని వెళ్లిపోయేవాళ్లు. ఫారెన్ షూటింగ్స్ జరిగే టైంలో మేకప్ మేన్స్ ఎవరూ ఉండరు. ఒకే ఒక్క పెద్ద బస్సు ఉంటుంది. అందులోనే అన్ని ఉంటాయి. డ్రెస్ చేంజ్  చేసుకోవాలి అంటే మిగతా వాళ్లంతా బస్సులోంచి కిందకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసేస్తారు. అలాగే ఈ క్యారవాన్ లో ఒకే ఒక్క  టాయిలెట్ ఉంటుంది. ఇక ఫారెన్ షూటింగ్స్ లో కూర్చోవడానికి కుర్చీ, వేసుకోవడానికి  గొడుగు, తినడానికి  డైనింగ్ టేబుల్ లాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. అలాంటి టైములో మార్నింగ్ 6  నుంచి రాత్రి సూర్యుడి వెలుగు ఉండేవరకు షూటింగ్స్ చేస్తారు అని మొత్తం చెప్పారు తరుణ్ మాష్టర్.    

రవితేజకి అసలు ఆటిట్యూడ్ కానీ, ప్రౌడ్ ఫీలింగ్ కానీ లేదు!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం ఎపిసోడ్ లో  అన్స్టాపబుల్ అత్తలు- ఖతర్నాక్ కోడళ్ల మధ్య పోటీలు జరిగాయి. ఇక ఇందులో రాశి కూడా వచ్చింది ఈ షోకి. "వెంకీ" మూవీ నుంచి "మాస్ తో పెట్టుకుంటే" అనే సాంగ్ కి డాన్స్ చేసింది. తర్వాత శ్రీముఖి ఈ సాంగ్ తో తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి రాశిని అడిగింది. "మీ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో మంచి సినిమాలు చేశారు ..అంతేకాదు ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించారు. వెంకీ మూవీలో ఈ పాట ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ తో మీ  వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ .చేసుకోండి" అని అడిగింది శ్రీముఖి. " మనసిచ్చి చూడు మూవీ నుంచి కూడా నాకు రవితేజ గారు తెలుసు...అందులో నవీన్ కి ఫ్రెండ్ రోల్ చేశారు. తర్వాత మా కంబినేషన్ లో మూవీస్ ఏమీ రాలేదు. ఇక నా కెరీర్ ఎండింగ్ టైంలో ఈ మూవీ వచ్చింది. ఈ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడు నాకు చెయ్యకూడదు అనుకున్నా. ఎందుకంటే నా ఫేస్ హోంలీగా ఉంటుంది కాబట్టి మాస్ సాంగ్ అంతగా సెట్ కాదేమో అని చెప్పాను. అన్ని మూవీస్ లో నా  క్యారెక్టర్లు హోమ్లీగా ఉంటాయి కదా ..మరి ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే ఎలా అనుకుని నేను మా బ్రదర్ కి కూడా చెప్పాను. డైరెక్టర్ గారు, చాలా మంది కూడా నన్ను ఈ సాంగ్ చేయమని చెప్పారు. అప్పుడు ఒప్పుకున్నా. ఇక  ఈ సాంగ్ ని వైజాగ్ లో షూటింగ్ చేశారు. మీరు నమ్మరు కానీ రవితేజకి ఎంత క్రేజ్ ఉండేదో అప్పుడు ..ఎందుకంటే అప్పటికే ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి హిట్ మూవీస్ చేసి ఉన్నారు కదా. అక్కడ షూటింగ్ టైంలో జనాలంతా చంటి, చంటి అంటూ ఇడియట్ లో అయన రోల్ నేమ్ తో పిలిచేవారు. నేను ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాకయ్యా. కానీ ఆయన మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎం మారలేదు. మనసిచ్చి చూడు మూవీ టైములో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఆటిట్యూడ్ లేదు, ప్రౌడ్ ఫీలింగ్ లేదు..ఈ మూవీ యూనిట్ కి థాంక్స్ చెప్పాలి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే ఈ సాంగ్ కి డాన్స్ చేయమని అడుగుతారు." అని తన మెమోరీస్ ని షేర్ చేసుకున్నారు రాశి.   

తనని కృష్ణ ప్రేమిస్తుందని తెలుసుకున్న ముకుంద ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -203 లో.. పడుకున్న మురారిని కృష్ణ నిద్ర నుండి లేపుతుంది. మీరు ఎంత అడిగినా నిజం చెప్పట్లేదని కృష్ణ అంటుంది. అదేం లేదు కృష్ణ.. నీకు అబద్దం చెప్పట్లేదని మురారి అనగానే.. అన్ని అబద్ధాలని కృష్ణ అంటుంది. సారి కృష్ణ ఇన్ని అబద్ధాలు నేను ఆడలేను. నీకు ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్తానని మురారి తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత మురారి ప్రేమించిన అమ్మాయి ఎవరో గీతికకి తెలిసే ఉంటుందని, గీతికకి ఫోన్ చేసి కలుద్దామని కృష్ణ అంటుంది. దానికి గీతిక సరే అంటుంది. ఆ తర్వాత కృష్ణ, గీతికని కలుస్తుంది. వాళ్ళు మాట్లాడుకునేది చాటుగా ఉండి ముకుంద వింటుంది. ఎందుకు కలవాలని అన్నావని గీతిక అడుగగా.. నీకు ఏసీపీ సర్ ఫ్రెండ్ కదా.. నీకు ఏసీపీ సర్ ప్రేమించిన అమ్మాయి తెలుసా అని గీతికని కృష్ణ అడుగుతుంది.‌ తెలియదు. అయినా ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావని గీతిక అడుగుతుంది. ఏం చేయను.. బ్రేకప్ అయ్యాక నన్ను పెళ్లి చేసుకున్నాడా లేక మా పెళ్లితో బ్రేకప్ అయిందా తెలుసుకుందామని అడుగుతున్నాని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మురారి ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కృష్ణ గీతికకు చెప్పగానే.. ముకుంద షాక్ అవుతుంది. ఏంటి కృష్ణ కూడా మురారిని ప్రేమిస్తుందా అని అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.‌మరొక వైపు శ్రీనివాస్ దగ్గరికి భవాని వస్తుంది. మీరు ముకుంద గురించి టెన్షన్ పడకండి. తను మా ఇంటి మనిషి ఆదర్శ్ రాకుంటే నేను వేరే పెళ్లి చేస్తానంటూ శ్రీనివాస్ కి ధైర్యం చెప్తుంది భవాని. అలా చెప్పి తను వెళ్ళిపోయాక ముకుంద గురించి అసలు నిజం భవానికి చెప్పాలని శ్రీనివాస్ అనుకుంటాడు. మరొక వైపు కృష్ణ మాటలను ‌విన్న ముకుంద.. ఎమోషనల్ అవుతుంది. అటు కృష్ణ ప్రేమిస్తుంది. ఇటు మురారి ప్రేమిస్తున్నాడు. ఇన్ని రోజులు అగ్రిమెంట్ పూర్తయి కృష్ణ వెళ్ళిపోతుందని ఆశ ఉండేది. ఇప్పుడు ఇక ఆలస్యం చేయవద్దు. నేను నా ప్రేమని త్యాగం చెయ్యలేను. నా ప్రేమ ని దక్కించుకుంటానని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. కృష్ణ తన ప్రేమ ని మురారికి, మురారి తన ప్రేమని కృష్ణకి చెప్పాలని ఫిక్స్ అవుతారు. మరొక వైపు భవాని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మిషన్ ఎడ్యుకేషన్ అథారిటీ మొత్తం జగతికి అప్పగించిన ఫణీంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -809 లో.. మహేంద్ర, ఫణీంద్ర హాల్లో కూర్చొని మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే ఏదో డాక్యమెంట్స్ తీసుకొని జగతి వస్తుంది. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసావా అని ఫణింద్ర అడుగుతాడు. అన్ని రెడీ మీరు సైన్ పెడితే అయిపోద్దని జగతి అంటుంది. ఆ తర్వాత జగతి తెచ్చిన డాక్యమెంట్స్ పై ఫణింద్ర, మహేంద్రలు సంతకాలు పెడతారు. అప్పుడే దేవయాని, శైలేంద్ర వస్తారు. మీరు కూడా సంతకం పెట్టండని ఫణీంద్ర అనగానే.. ఏంటవని శైలేంద్ర అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి అథారిటి మొత్తం జగతికే అని డాక్యుమెంట్స్ రెడీ చేసి మినిస్టర్ తీసుకొని రమ్మన్నాడట.. అందుకే మీరు కూడా బోర్డు సభ్యులు కాబట్టి మిమ్మల్ని సంతకం చెయ్యమంటున్నా అని ఫణింద్ర అంటాడు. దేవయాని, శైలేంద్ర కి సంతకాలు చెయ్యడం ఇష్టం లేకున్నా ఫణింద్ర కోసం ఇద్దరు సంతకాలు చేస్తారు. అందరూ వెళ్ళిపోయాక... ఏంటి జగతి ఇదంతా నీ ప్లాన్ కదా అని దేవయాని అడుగుతుంది. అవును నా ప్లాన్ అని జగతి అంటుంది. వాళ్ళ మాటలు దూరం నుండి మహేంద్ర వింటాడు. మరొక వైపు వసుధారకి ప్రిన్సిపల్ ఫోన్ చేసి కాలేజీ లో జరిగే సెమినార్ గురించి చెప్తాడు. నేను సెమినార్ లో వచ్చి పార్టిసిపేట్ చేస్తానని ప్రిన్సిపల్ కి వసుధార చెప్తుంది. మరొక వైపు దేవయానితో జగతి ధైర్యంగా మాట్లాడం..మహేంద్ర గుర్తు చేసుకుంటాడు. అప్పుడే జగతి వస్తుంది. ఏంటి వాళ్ళతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నావని మహేంద్ర అడుగుతాడు. వాళ్ళతో అలా మాట్లాడాలి, మన బలహీనతని చూపించవద్దని జగతి అంటుంది. ఒకసారి భయపడి అందరిని దూరం చేసుకున్నాను. మళ్ళీ ఆ తప్పు చెయ్యనని జగతి అంటుంది. ఎలాగైనా రిషి, వసుధారలని తీసుకొని రావాలి. ఈ DBST కాలేజీకి నా కొడుకే రాజు.. రారాజు అని జగతి అంటుంది.  మరొక వైపు కాలేజీలో స్టాఫ్ మాట్లాడుకుంటుండగా రిషి వస్తాడు. సెమినార్ గురించి చెప్తుండగా వసుధార మేడం వచ్చాక డిస్కషన్ చేసుకుందామని ఒక మేడం అంటుంది. వసుధార మేడం వస్తున్నారా అని రిషి అడుగుతాడు. ఆవును ప్రిన్సిపల్ సర్ చెప్పారని మేడం అనగానే.. అలా ఎలా వస్తుంది. తనకి పూర్తిగా నయం కాలేదు కదా.. వసుధార కచ్చితంగా డిస్కషన్ లో ఉండాలంటే.. నేను ముందు సెమినార్ గురించి తనతో డిస్కషన్ చేస్తానని రిషి అంటాడు. మరొక వైపు అందరూ భోజనం చేస్తుండగా..  జగతి, మహేంద్ర లు పని మీద మూడు రోజులు బయటకు వెళ్తున్నామని చెప్తారు. వాళ్ళెందుకు వెళ్తున్నారని శైలేంద్ర ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కావ్య గురించి పాజిటివ్ గా చెప్పిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -142 లో.. కళ్యాణ్ కి కావ్య ఫోన్ చేసి రాజ్ గురించి చెప్తూ బాధపడుతుంది. రాజ్ ట్రీట్మెంట్ కి కళ్యాణ్ డబ్బులు పంపిస్తాడు. ఆ తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ అయ్యాక రాజ్ ఆ ప్రాబ్లెమ్ నుండి బయటపడతాడు. మరొకవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న అప్పు కోసం..  సీతరామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడి తనని బయటకు తీసుకువద్దామని కృష్ణమూర్తి తో కనకం అంటుంది. వద్దు.. ఇప్పటికే స్వప్న చేసిన పనికి మన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న కూతురు ఇలా చేసిందని ఇంకెలా మాట్లాడతారోనని వద్దని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత రాజ్ , కావ్య ఇద్దరు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తారు. రాజ్, కావ్య ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత.. కావ్య వంట చేసి రాజ్ కి భోజనం తినమని ఇస్తుంది. ఇప్పుడు కూడా నాపై పంతం ఎందుకని కావ్య తినమని చెప్తుంది. సరేనని రాజ్ తింటాడు. ఆ తర్వాత రాజ్ నిద్రపోతాడు. కావ్య మాత్రం రాత్రంతా నిద్ర పోకుండా రాజ్ ని చూస్తూనే ఉంటుంది. మరొక వైపు రాత్రంతా స్టేషన్ ముందే ఉండి బాధపడుతున్న కనకం, కృష్ణమూర్తిల దగ్గరికి కానిస్టేబుల్  వచ్చి.. మీకు ఎవరైనా పెద్దవాళ్ళు తెలిస్తే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించండి. లేదంటే విషయం కోర్ట్ కి వెళ్తే..  కోర్ట్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని చెప్తుంది. అలా కానిస్టేబుల్ చెప్పగానే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కలిసి సీతరామయ్య దగ్గరికి బయలుదేరతారు. మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శ్రీశైలం నుండి ఇంటికి వస్తారు. అలా రావడంతోనే కావ్యని అపర్ణ తిట్టడం స్టార్ట్ చేస్తుంది. రాజ్ కి రాత్రి అంత బాధ కలిగితే చెప్పాలని తెలియదా అని కావ్యని అపర్ణ అంటుంది . నేను ఉన్న టెన్షన్ లో నాకు ఆ ఆలోచన రాలేదు. ముందు తనని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప నాకు ఏది గుర్తు లేదని కావ్య అంటుంది.  మీ ఫ్యామిలీనే ఇంత అంటూ కావ్య కుటుంబాన్ని అపర్ణ తిడుతుంది. అప్పుడే గుమ్మం దాకా వచ్చి అపర్ణ మాటలు విని కనకం కృష్ణమూర్తి ఇద్దరు వెన్నక్కి వెళ్ళిపోతారు. అపర్ణ అలా కావ్య పై కోప్పడుతుండగా.. రాజ్ నిద్ర నుండి లేచి కిందకి వస్తాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి అందరూ వెళ్ళి.. ఇప్పుడు ఎలా ఉన్నావని అందరూ అడుగుతారు. అంత ఈ కావ్య వళ్లే అని అపర్ణ అంటుంది. అలా అని ఎవరు చెప్పారు.. నిజం ఏంటో తెలుసుకోకుండా ఆలా నిందించడం తప్పని, నేనే వినకుండా ఐస్ క్రీం తిన్నాను అందుకే ఇలా అయింది. తనే సెక్యూరిటీ స్కూటీపై నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళిందని రాజ్ చెప్తాడు. అలా రాజ్ తన గురించి చెప్పేసరికి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

ఇంతకు నా భార్య ఎవరు..అని అడిగిన బాబు...నీకు, నీ అన్న ఇస్తానన్న రష్మీ

ఎక్స్ట్రా జబర్దస్త్ లో నిన్న మొన్నటి వరకు చాలా కామ్ గోయింగా ఉండే బాబు ఈ వారం స్కిట్ లో రెచ్చిపోయాడు. ఇంతకు నా భార్య వర్షానా, రష్మీనా అని అడిగేశాడు..ఇంతకు ఎందుకలా అన్నాడో చూద్దాం.. ఈవారం "అత్త లేని అల్లుడు అదృష్టవంతుడు" అనే స్కిట్ లో  తాగుబోతు భర్త రోల్ లో స్కిట్ వేశారు బాబు, వర్షా, ఇమ్మానుయేల్. "నేను తాగుబొతోడిని పెళ్లి చేసుకున్నా..కానీ నువ్వు మాత్రం అలా చేసుకోకు" అని వర్షా రష్మీకి చెప్పింది. ఇంతలో బాబు మందుబాటిల్ తీసుకుని డాన్స్వ చేసుకుంటూ వచ్చాడు. తాగిన కోటాలో కొట్టుకుపోతుందని రష్మీ మీద డైలాగ్ కూడా విసిరేసాడు బాబు.."ఏమే..నేను వచ్చేలోగా అన్నం, కూరా వండమంటే..అందంగా రెడీ అయ్యి ఇక్కడ కూర్చుంటావా" అనేసరికి "ఏవండీ ఆవిడ కాదు నేను మీ ఆవిడ" అని పిలిచింది వర్షా. "రేయ్ ఒక్క ఖాళీ బాటిల్ బీర్ కే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా" అని రష్మీ గట్టిగా అరిచింది. ఇక తాగుబోతులా డైలాగ్స్ చెప్తూ వర్షాని వీపు మీద దబీ దబీ బాదేసరికి వర్షా గట్టిగా అరిచేసింది..."రేయ్ బాబు..తర్వాత నీకు ఉంటది" అంది రష్మీ.. "ఏంటి మేడం..ఇంతకు నా భార్య వర్షానా, రష్మీనా..ఎవరో చెప్పండి..నేను కన్ఫ్యూజ్ అవుతున్నా " అని ఖుష్బూని అడిగాడు. తర్వాత "అసలు నీకు మల్లెపూలు ఎవరు ఇస్తున్నారు" అంటూ బాబు వర్షాని  కొట్టడానికి పరిగెట్టేసరికి వర్షా రష్మీ దగ్గరకు వెళ్ళిపోయింది. వెంటనే  రష్మీ కర్ర తీసుకుని వచ్చి "పడతాయి నీకు వర్షాని  ఒరిజినల్ గా కొడతావా..అని కామెడీగా సీరియస్ అయ్యింది. మా అన్న లేడు అనేగా..వస్తాడు ఆగు నీ పని చెప్తాను" అని ఇన్డైరెక్ట్ గా సుధీర్ టాపిక్ ని తీసుకొచ్చేసరికి ఆగేహే నీకు నీ అన్నకు ఇద్దరినీ ఒంగోపెట్టి ఇస్తా " అని వార్నింగ్ ఇచ్చేసింది రష్మీ.    

అమర్ రహే టు థౌజండ్ నోట్ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోటుపై  కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 30 తేదీ వరకే రూ. 2 వేల నోటు చెల్లుతుందని, ఆ లోపే తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు అని ప్రకటించింది. ఈ నోటు ఇక కనిపించదు అనే కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం ఒక వెరైటీ స్కిట్ ని ప్రెజంట్ చేశారు రాంప్రసాద్ అండ్ టీమ్...రాంప్రసాద్ 500 ల నోటులా, మహేష్ ఆచంట 2 వేల నోటులా, సన్నీ వెయ్యి రూపాయల నోటులా కాస్ట్యూమ్స్ వేసుకుని ఈ స్కిట్ చేశారు. ఆఫ్ట్రాల్ రెండు వేల రూపాయలు అని కొంతమంది కమెడియన్స్ అనడంతో దాని గురించి చాలా గొప్పగా చెప్పాడు మహేష్. "అరె అన్నయ్య నువ్వు త్వరలో వెళ్ళిపోతున్నావ్ కదా.. బాన్ చేసేస్తున్నారన్న భయం లేదా నీకు " అని అడిగాడు రాంప్రసాద్. "ప్రతిక్షణం భయపడుతూనే ఉంటాను సర్. నన్ను తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టినప్పుడు బ్యాంకుల్లో జనాలు క్యూలో ఉండాలి, వాళ్ళ చేతుల్లో 2 వేల రూపాయల నోటు ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి..కుదిరితే ఈ డైలాగ్ ఎడిటింగ్ లో ఉండాలి సర్ అమర్ రహే టు థౌజండ్ నోట్" అని వీరలెవెల్ లో డైలాగ్ చెప్పాడు మహేష్. "బాధపడొద్దు అన్నయ్య. త్వరలో నువ్వు వేరే రూపంలో పుడతావ్ నాకు తెలుసు. డబ్బుకు వేల్యూ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు నాకు తెల్సు" అని చెప్పాడు రాంప్రసాద్...ఇక జడ్జి ఖుష్బూ ప్రధాని మోడీ రేంజ్ లో ఈ రోజు రాత్రి నుంచి 2 వేల నోటు చెల్లదు అని అనౌన్స్ చేసేసరికి మహేష్ కింద పడిపోయాడు. "వెయ్యి, రెండు వేల నోట్లు వెళ్లిపోయాయి ఇక రాజ్యం మొత్తం మనదే" అని 500 రూపాయల నోటు డైలాగ్ చెప్పినట్టు చెప్పాడు రాంప్రసాద్.    

మా అమ్మే నాకు మళ్ళీ కూతురిగా పుట్టాలి అంటూ ఏడ్చేసిన సౌమ్య

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. ఆదికి పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బుల్లితెర యాంకర్స్, నటీనటులు చాలామంది ఈ షోలో కనిపించారు. వర్షంలో గొడుగులు వేసుకుని మరీ ఆది పెళ్ళిచూపులకి వచ్చారు. ఆది పెళ్ళికొడుకు గెటప్ లో సూటు వేసుకుని వచ్చాడు. ఐతే ఆది పెళ్ళికొడుకు  అని తెలియక అంకుల్ అని అనేసింది వర్ష. దానికి ఆది హర్ట్ అయ్యాడు. "అంకుల్ ఏంటి నేనే పెళ్ళికొడుకుని" అనేసరికి చెవులు చిల్లులు పడేలా జారీచేసింది. ఇక వర్షంలో తడిచి వచ్చిన యాంకర్ సౌమ్యను తుండుతో తుడిచాడు ఆది. "ఎంతేశావమ్మా మేకప్ టవల్ లోకి మొత్తం వచ్చేసింది" అన్నాడు ఆది. ఇక ఇంద్రావతి చౌహాన్ ఫోక్ సాంగ్ పాడితే ఆర్జే కాజల్ మంచి మెలోడీ సాంగ్ పాడింది. ఇక సౌమ్య, ఆది ఇద్దరూ కలిసి "వాన వల్లప్పా వల్లప్పా ఒళ్లప్పగించే " అనే రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక పెళ్లి కానీ అమ్మాయిలంతా కలిసి మంచి సాంగ్స్ పాడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఆది సౌమ్య కోసం ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. వాళ్ళ అమ్మ ఫోటోని లామినేషన్ చేసి ఇచ్చాడు. అది చూసేసరికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.  అలాగే వాళ్ళ అమ్మ బ్రెయిన్ కాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్ ఉన్నప్పుడు వీడియోని ప్లే చేశారు. " మా అమ్మ ఈ పొజిషన్ లో ఉండగా మూడున్నరేళ్లు ఆమెకు సేవలు చేసాను. కానీ ఆమె నన్ను గుర్తుపట్టే పొజిషన్ లో లేరు. దేవుడు ఆమెకు ఇలాంటి పరిస్థితిని ఇస్తాడని అస్సలు అనుకోలేదు.  మా అమ్మే నాకు మళ్ళీ కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా" అని ఏడ్చేసింది సౌమ్య.    

నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు..వెళ్ళిపోతాను అని ఏడుస్తూ వెళ్లిపోయిన సత్య 

"ఆలీతో ఆల్ ఇన్ వన్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సునయన, సత్యశ్రీ, రాకింగ్ రాకేష్ వచ్చారు. "మనలో మన మాట ఓవరాల్ గా ఎన్ని సినిమాలు చేసావ్" అని సునయనని అడిగారు. "20 , 25 ప్లస్ చేసాను" అని చెప్పారామె. "హీరోయిన్ గా  ఎవరైనా అడిగారా" అని అలీ అడిగేసరికి "ఒక నిజం ఒక అబద్దం చెప్తా..అడిగారు ..కథలు అవీ నచ్చకపోవడం వలన చాల బిజీగా ఉండి" అని సునయన చెప్పేసరికి "నాకు తెలిసిన మంచి హోమియోపతి డాక్టర్ ఉన్నారు" అని ఆలీ అనేసరికి ఆమె నవ్వేశారు. తర్వాత రాకేష్ వచ్చారు.."మీ ఇద్దరిలో తెలివిగల ఎవరు" అని అడిగేసరికి "ఆవిడే " అన్నాడు.  "అలా చెప్పమందా" అనేసరికి "అలాగే చెప్పాలి ఎందుకంటే ఎదురుగా ఉన్నారు కదా" అన్నాడు రాకేష్. "సునయన తెలుసుగా నీకు" అని ఆలీ అడగడంతో "నా చిన్నప్పటి నుంచే కాదు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తోంది" అన్నాడు రాకేష్. తరువాత సత్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. "నీ డ్రెస్ పేరేమిటి..లుంగీ డాన్స్ ఆ" అని అడిగేసరికి నవ్వేసింది సత్య. ఇక ఈ ఎపిసోడ్ లో కూడా హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులు దొర్లేశాయి. "ఓపెన్ చేయగానే, ఎత్తగానే" అని రాకింగ్ రాకేష్ అనేసరికి అందరూ షాకైపోయారు. ఇక ఆలీ కూడా ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి వంత పాడారు. ఇక సునయన తన స్టోరీ పేరు "నీ తిమింగళంలో నా సముద్రం" అని చెప్పేసరికి ఆలీ ఇచ్చిన లుక్ కి రాకేష్ గట్టిగా నవ్వేశారు. ఏమయ్యిందో ఏమో కానీ  సత్యశ్రీ కన్నీళ్లు పెట్టుకుని "నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు..వెళ్ళిపోతాను" అని ఏడుస్తూ స్టేజి మీద నుంచి వెళ్ళిపోయింది..    

నవదీప్ కాలికి గాయం...ఆట పట్టించిన తేజస్వి

మూవీ షూటింగ్స్ అంటే చాలు గాయాలు అవడం కామన్. బిచ్చగాడు 2 షూటింగ్ టైంలో విజయ్ ఆంటోనీకి, అలాగే తన న్యూ మూవీ షూటింగ్లో  వరుణ్ సందేశ్ కి రీసెంట్ గాయాలయ్యాయి. ఇంకా  నటి రేణు దేశాయ్ కాలికి కూడా దెబ్బ తగిలి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో ఫేమస్ యాక్టర్ పిల్లి కళ్ళ హీరో నవదీప్ కూడా గాయాలపాలయ్యాడు.  అయితే ఎలా జరిగిందో తెలియదు కానీ.. అతడిని చూసేందుకు వెళ్లిన నటి తేజశ్వి మదివాడ.. నవదీప్‌ను ఫుల్ గా ఆట పట్టించేసింది. "నీ సుఖమే నే కోరుకున్న" అనే సాంగ్ కి  డాన్స్ చేస్తూ ఆ వీడియోని  సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నవదీప్ కాలికి గాయమైన విషయం తెలిసింది. ‘నీ సుఖమే నే కోరుతున్నా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు’కాదంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టేసింది. అందులో నవదీప్ ఎడమ కాలికి ఫ్యాక్చర్ కనిపిస్తుంది. అలాగే చేతిలో హ్యాండ్ స్టిక్ కూడా ఉంది.   తేజశ్వి ఆటపట్టిస్తుంటే ఒక  మూలన సోఫాలో కూర్చుని అలా దీర్ఘంగా ఆమె అల్లరిని చూస్తూ ఉండిపోయాడు మన హీరో. ఇంతకు నవదీప్ కి  ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు. అయితే ఈ వీడియో చూసి కొంత మంది ఫన్నీ కామెంట్లు పెడుతుంటే.. మరికొంత మంది త్వరగా కోలుకోవాలని విషెస్ మెసేజెస్ పెట్టారు.  నవదీప్ జై మూవీతో  హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చందమామ మూవీతో  మంచి హీరోగా ముద్ర వేయించుకున్నాడు. తర్వాతర్వాత మంచి మూవీస్ పడకపోయేసరికిక్  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. విలన్ రోల్స్ లో కనిపించాడు. నేనే రాజు, నేనే మంత్రి, ధ్రువ మూవీస్ లో మంచి రోల్స్ లో నటించాడు నవదీప్.  బిగ్ బాస్‌లోనూ పార్టిసిపేట్ చేసాడు. ప్రస్తుతం ఓటీటీ మూవీస్ లో నటిస్తున్నాడు.  నవదీప్, తేజశ్వి ఐస్ క్రీమ్ అనే మూవీలో కలిసి నటించారు. అలా అప్పటి నుండి వీళ్ళు  మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.. నవదీప్ రీసెంట్‌గా ‘న్యూసెన్స్’ అనే  వెబ్ సిరీస్‌తో, తేజస్విని ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్’ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి మార్క్స్ నే సంపాదించుకున్నారు.    

ఆది డబుల్ మీనింగ్ డైలాగ్...ఛి అన్న దీపికా పిల్లి

షో ఏదైనా కావొచ్చు కానీ అందులో ఎంటర్టైన్మెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం చాలా కామన్. ప్రతీ వారం ఏదో ఒక ఎపిసోడ్ లో ఏదో ఒకటి ఇలానే డైలాగ్స్ బాగా పేలతా ఉంటాయి...వైరల్ కూడా అవుతూ ఉంటాయి. అందులోనూ ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడంలో బుల్లితెర మీద హైపర్ ఆదికి మించిన వాళ్ళు లేరు. ఈ వారం ‘ఢీ ప్రీమియర్ లీగ్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది.  రావడం రావడమే వాల్తేర్ వారియర్స్ తమ సత్తా చూపించారు. చంద్రముఖి గెటప్‌లో చంద్రకళ సాంగ్ కి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. "మీ వైజాగ్ పవర్ చూపించేసారు" అని ఈ టీమ్ కి శేఖర్ మాష్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత   పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ మూవీలోని ‘కిళ్లీ కిళ్లీ నమిలాక’ అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు ఆది, దీపిక పిల్లి. లుంగీ కట్టుకుని తన స్టైల్లో స్టెప్పులేశాడు ఆది. ‘వన్స్ మనం ఫిక్సయ్యాక పిల్లైనా , కిళ్లీ అయినా నమిలెయ్యడమే’ అనగానే.. దీపిక ‘ఛీ’ అంటూ రియాక్ట్ అయింది. ఇక దీపికా పిల్లికి తండ్రిగా చమ్మక్ చంద్ర వస్తూనే మెగాస్టార్ మూవీ ‘రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆదిని అంకుల్ అంటూ చంద్ర అనడం...చంద్ర   ఎప్పటిలానే ‘రాములా’ అంటూ నవ్వించడం మంచి ఫన్ క్రియేట్ చేసింది. "అరటి పండు తొక్క" గిఫ్ట్ ఇచ్చాడంటూ ఒక టాపిక్ వచ్చింది. "మా అమ్మాయికి కూడా  ఇదే తొక్క వేసావా" అని అడిగేసరికి    దీపికనే  తొక్క ఆనాడు ఆది దానికి  ఆమె ‘ఏయ్’ అంటూ అరిచింది. "మీ అమ్మాయికి టెంట్ వేసా ఇంకా స్టెంట్ ఉంది" అని ఆది అనేసరికి   ‘ఛీ ఛీ’ అంటూ రియాక్ట్ అయ్యింది దీపికా. జడ్జెస్ మార్క్స్ ఇవ్వడానికి రెడీ అవుతూ.. కంటెస్టెంట్లను సస్పెన్స్‌లో పెట్టేసారు.  

అదే ఉంటే డేటింగ్ యాప్ లా చేసేస్తారు...మిగతా సగం జీవితం థ్రెడ్స్ తీసేసుకుంటుంది

ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా థ్రెడ్స్ అనే యాప్ ని విడుదల చేసింది. ట్విట్టర్‌కు పోటీగా  మెటా ఈ  కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఈ థ్రెడ్స్ యాప్ ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  ఆవిష్కరించారు. ఈ థ్రెడ్‌ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ టీమ్ డెవలప్ చేసింది.  ఈ థ్రెడ్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేసరికి సోషల్ మీడియా కళకళలాడిపోతోంది. ఎక్కడ చూసినా ఈ దారాలే  దారాలు. సోషల్ మీడియాలో ఏది వచ్చినా మన వాళ్లకు పండగే కదా..అలాగే ఇప్పుడు కూడా ఈ థ్రెడ్స్ తో ఫెస్టివల్  చేసుకుంటున్నారు సెలబ్రిటీస్...ఐతే ఈ థ్రెడ్స్ యాప్ గురించి నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన గోడును వెళ్లబోసుకున్నారు. "ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండాలి , స్నాప్ చాట్ లో యాక్టివ్ గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండాలి, యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండాలి, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండాలి. ఇప్పటివరకు  ఇన్స్టాగ్రామ్ వాడు సగం జీవితం తీసేసుకున్నాడు. మిగతా జీవితాన్ని కూడా తీసేసుకోవడానికి  "థ్రెడ్స్" అనేది ఒకటి స్టార్ట్ చేసాడు. ఆ థ్రెడ్స్ యాప్ లో మాములుగా లేదండి ఉదయం నుంచి ఒకటే బ్యాటింగు, ఒకటే త్రెడ్డింగ్గు..నోటిఫికేషన్స్ వచ్చి చంపేస్తున్నాయి...ఆ దేవుడుకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి..ఎందుకంటే ఆ థ్రెడ్స్ అనే ఆప్ లో ఇప్పటివరకు డిఎం అనే ఆప్షన్ లేదు. లేకపోతే దాన్ని కూడా ఒక డేటింగ్ యాప్ లా చేసేస్తారు మనవాళ్ళు దయచేసి దాన్ని కొంచెం మంచిగా వాడతారని కోరుకుంటున్నా...." అని చెప్పాడు నిఖిల్ విజయేంద్రసింహా.. ఇక ఈ వీడియోకి "హానెస్ట్లీ త్రెడ్డింగ్...మీరు అంగీకరిస్తారా" అనే కాప్షన్ పెట్టారు. "యాక్టివ్ గా ఉండమని ఎవరు అడిగారు సర్..ఉండొద్దు...ఎందుకు మీరు డిఎం గురించి ఇన్స్టాగ్రామ్ వాళ్లకు గుర్తుచేతున్నారు..వాళ్ళు ఈ వీడియో చూసి డిఎం పెడితే..థ్రెడ్స్ బ్యాటింగ్ ఉండేది..కుట్లు, అల్లికలే ఉంటాయి. " అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.    

ఇప్పటివరకు ఎనిమిది మౌంటెయిన్స్ అధిరోహించాను..

  సూపర్ క్వీన్ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమోలో లేడీస్ అంత స్పోర్ట్స్ థీమ్ సందర్భంగా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని వచ్చేసారు. స్పోర్ట్స్ థీమ్ కాబట్టి "ఏం గేమ్స్ వచ్చు" అని ప్రదీప్ అడిగేసరికి "ఆ మీనా కట్టా మీనా" అనే గేమ్ ఆడి చూపించారు. ఇన్ని కోట్లు ఖర్చుబెట్టి ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి షో చేస్తే ఆ మీనా అని ఆడుకుంటారా అని కామెడీ చేసాడు ప్రదీప్. "దొంగ -పోలీస్ ఆటంటే ఇష్టం అని పవిత్ర చెప్పేసరికి అందుకేనా నిన్న సైరన్ వినిపించేసరికి సెట్ లోంచి లేచి పారిపోతున్నావ్" అంటూ నవ్వించాడు. ఇక వీళ్ళ మధ్యన చాలా ఇంటరెస్టింగ్ గేమ్స్ ఆడించారు. అలాగే ఒక ఇంటరెస్టింగ్ పర్సనాలిటీని ఈ షోకి ఇన్వైట్ చేశారు. ఆమె ఎవరో కాదు  మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన యాదాద్రి జిల్లాకి చెందిన‌ పడమటి అన్వితారెడ్డి ఈ షోకి వ‌చ్చారు. ఆమెను సూపర్ క్వీన్స్ అంతా సత్కరించారు. "ఇప్పటివరకు ఎనిమిది మౌంటెయిన్స్ అధిరోహించాను.. అలాగే నాలుగు ఇంటర్నేషనల్ మౌంటెయిన్స్ కూడా పూర్తి చేసాను..ఇంకా పూర్తి చేయాల్సినవి మూడు ఉన్నాయి" అని చెప్పారామె ..తర్వాత వాటర్ లో ఆపిల్స్ వేసి చేతులు వాడకుండా వాటిని నోటితో తీసి పక్కనే ఉన్న టబ్బు లోకి వేసే ఒక గేమ్ ఆడించారు. తర్వాత బాల్ అండ్ బాట్ గేమ్ పెట్టేసరికి అందరూ తమకు వామిటింగ్  ప్రాబ్లమ్ అని, లోబీపీ అని, ఇంకొకళ్ళు హైబిపి అని చెప్పి తప్పించుకునేసరికి "ఎవర్రా ఏజ్ బార్ ఐన వాళ్ళను తీసుకొచ్చి నిల్చోబెట్టారు" అని కామెడీ చేసాడు ప్రదీప్. ఇక ఈ గేమ్ లో ఇద్దరు సూపర్ క్వీన్స్ ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఇక సూపర్ క్వీన్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి వీళ్ళతో ఆట ఆడించేసరికి వాళ మధ్య క్లాషెస్ వచ్చాయి. ఇలా సూపర్ క్వీన్ షో నెక్స్ట్ వీక్ మంచి గేమ్ థీమ్ తో అలరించబోతోంది.    

నాకేం తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా: ఆరోహీ 

ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు.  ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహీ, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపిన ఆరోహీ.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.  బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో ఎక్కువ రోజులు ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడిపి ఎలిమినేషన్ అయిన ఆరోహీ.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అయితే హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆర్జే సూర్యతో రీల్ ని చేసింది. నేహా చౌదరి పెళ్ళికి అందరు కలిసి వెళ్ళి అక్కడ సరదాగా గడిపారు. అయితే ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో‌ రీల్స్ తెగ చేస్తోన్న ఆరోహీ.. ఇప్పుడు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ఆప్ 'థ్రెట్స్'.. లో తనకంటూ అకౌంట్ క్రియేట్ చేసుకుంది ఆరోహీ. అయితే బిగ్ బాస్ స్క్రిప్టా కాదా అని తనని చాలామంది అడుగుతున్నారంటూ.. నాకేం తెలియదు,  గుర్తులేదు మర్చిపోయా అని సరదాగా చెప్పింది ఆరోహీ.