ఇంతకు ఏమిటా "స్త్రీ"కారం...తన కొత్త షో ఏమిటో గెస్ చేయమని చెప్పిన శ్రీరామచంద్ర  

సింగర్ శ్రీరామచంద్ర అంటే చాలు పవన్ కళ్యాణ్ సాంగ్ "గెలుపు తలుపులే తీసే" అనేది గుర్తొస్తుంది. అలాగే బిగ్ బాస్ తెలుగు  సీజన్ 5  కూడా గుర్తొస్తుంది. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో సింగర్ శ్రీరామ్ చంద్ర ఒకరు.. లవర్ బాయ్ ఇమేజ్ తో బిగ్ బాస్ లో  టాప్ త్రీగా నిలిచాడు.. సోషల్ మీడియాలో కూడా శ్రీరామచంద్రకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ .ఆయన్ని అందరూ ముద్దుగా ఎస్ఆర్సి అని పిలుచుకుంటారు. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1కి హోస్ట్‌గా వ్యవహరించారు  శ్రీరామ చంద్ర.   అలాంటి శ్రీరామచంద్ర ఇప్పుడు ఆహా వేదిక మీద మళ్ళీ మెరవబోతున్నాడు. "సరికొత్త "స్త్రీ"కారంతో వస్తున్నాడు మీకోసం. సూపర్  సర్ప్రైజ్  మీకోసం త్వరలో రాబోతోంది. త్వరలో దానికి సంబందించిన డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. అప్పటి వరకు గెస్ చేస్తూ ఉండండి.." అంటూ శ్రీరామ చంద్ర పిక్ తో ఒక లేటెస్ట్ అప్ డేట్ ని ఆహా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక దీని మీద ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకు ఈ షో ఏమిటా అనే విషయం మీద నెటిజన్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టెర్సారు. "ఓహ్ మై గాడ్...ఇదేమన్నా గేమ్ షోనా", "సూపర్ విమెన్ షోకి హోస్ట్ అనుకుంటా ""నెక్స్ట్ ఆహాలో ఒక మూవీ రాబోతోంది దానికి సంబంధించిన షాట్ అనుకుంటా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ షో ఏమిటి, ఎప్పుడు అనే విషయాలను ఆహా కానీ శ్రీరామచంద్ర కానీ రివీల్ చేయలేదు. మరి ఆ వివరాలు తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.  ఇక శ్రీరామచంద్ర ఎప్పుడు చూసినా బిజీ స్కెడ్యూల్ తోనే ఉంటాడు. ఫారెన్ లో షోస్ చేస్తూ సింగింగ్ ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈయన సింగర్ మాత్రమే కాదు నటుడు కూడా. 2013 లో తొలిసారి ఫేస్ కి  మేకప్ వేసుకున్నాడు.జగద్గురు ఆదిశంకరాచార్యులు మూవీలో  రాజా అమర్కరా పాత్రలో నటించాడు. ఆ తర్వాత 2014 లో "ప్రేమ గీమ జాంత నై" అనే మూవీలో  హీరోగా లీడ్ రోల్ లో కనిపించాడు.  

టాయిలెట్ కి అని చెప్పి వెళ్తూ ఆ పని చేసేవాడిని...నువ్వు దేన్నైనా ఫినిష్ చేసేస్తావ్

  "సుమ అడ్డా షో" ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఈ వారం మహేష్ విట్టా- హరితేజ, అష్షు రెడ్డి-మహేష్ ఆచంట వచ్చారు. ఫస్ట్ రౌండ్ లో "పరీక్షలు అనగానే ఏమి  గుర్తొస్తుంది" అని అడిగేసరికి "నేను అందరూ నిద్రపోయాక 11 గంటల నుంచి చదువుకోవడం మొదలు పెట్టేదాన్ని. అలా పరీక్ష టైం వరకు చదువుకుని ఆ తర్వాత ముఖం కడుక్కుని ఎగ్జామ్ కి వెళ్లిపోయేదాన్ని" అని హరితేజ అనేసరికి.."ఎగ్జామ్ హాల్ కి వెళ్లి అక్కడ నిద్రపోయేది" అంటూ కౌంటర్ వేసాడు మహేష్ ఆచంట. "మీరేం చేసేవారు" అంటూ సుమ మహేష్ విట్టాని అడిగేసరికి " నేను రాత్రంతా బాగా నిద్రపోయేవాడిని ఎగ్జామ్ లో ఎదో ఒకటి రాసేవాడిని..దేనికైనా ఆన్సర్ తెలీనప్పుడు టాయిలెట్ అని చెప్పి అందరి ఆన్సర్ షీట్స్ చూసుకుంటూ వెళ్ళేవాడిని" అని చెప్పాడు. "రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇంట్లో పరిస్థితి" అని అడిగేసరికి "ఇంటికి రానని చెప్పేదాన్ని" అని హరితేజ అనేసరికి "అంత బాగా చదివావు కదా.. ఎందుకు మరి భయం" అని సుమ అడిగేసరికి "అది చదవడం కాదు యాక్ట్ చేయడం" అని అసలు నిజం చెప్పేసింది హరితేజ. "మరి నీ పరిస్థితి ఏమిటి అని మహేష్ ఆచంటని అడిగింది సుమ. నేను అన్నిట్లో పాస్ అయ్యాను. ఎంబిఏలో ఒక సబ్జెక్టు ఆగింది. అని చెప్పాడు. అంటే నువ్వు ఎంబిఏ వరకు వెళ్ళావు చూసావా అది చాల గ్రేట్ అంది సుమ. "ఎంబిఏ వరకు వెళ్ళాడు కానీ నేను ఎంబిఏ ఫినిష్ చేశా" అని మధ్యలో వచ్చిన అష్షు చెప్పేసరికి "నువ్వు దేన్నైనా ఫినిష్ చేసేస్తావు" అని కౌటర్ వేసింది సుమ. ఈ నలుగురు కూడా బుల్లితెర మీద వెండితెర మీద రాణిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో తమ తమ అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు.  

పెళ్ళి తర్వాత ఫస్ట్ ట్రిప్ కి వెళ్తున్న గీతు రాయల్!

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా  ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు. గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. తన భర్తతో కలిసి ఫస్ట్ ట్రిప్‌కి వెళ్తున్నట్టుగా చెప్పింది గీతు. "షిప్ లో శ్రీలంక.. పెళ్ళయ్యాక ఫస్ట్ టైమ్ ట్రిప్" అని పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. అందులో తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుందో చెప్పినది. అటు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లతో, ఇటు యూట్యూబ్ లో వ్లాగ్స్ తో, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ లో ఉంటుంది గీతు.  

అమెరికాలో మమ్మల్ని మాములుగా ఏడ్పించలేదు!

హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో‌ నటించిన హిమజ..‌ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది. హిమజ తన ఇన్ స్టాగ్రామ్ లో గత కొంత కాలంగా సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అదేవిధంగా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ రెగ్యులర్ గా చేస్తూ పాపులారిటీని పెంచుకుంటూ వస్తోంది. కాగా తను తాజాగా 'అమెరికాలో మమ్నల్ని మాములుగా ఏడ్పించలేదు' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది హిమజ. అందులో చాలా విషయాలను షేర్ చేసుకుంది. అమెరికాలో ఒక ఈవెంట్ కి వెళ్ళిన హిమజ, అవినాష్, సావిత్రి, జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్, సోహెల్, రోహిణి అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. హిమజ తన వ్లాగ్ లో ఎవరు ఎలా ఉన్నారో చూపిస్తూ వాళ్ళ సరదా మాటలని వ్లాగ్ లో పెట్టింది.కాగా అమెరికాలో వాళ్ళంతా తిరగాలని ప్లాన్స్ వేసుకొని మరీ వచ్చారని హిమజ చెప్పింది. మాటల మధ్యలో సోహెల్ కి ఒక అవకాశం వచ్చిందని హిమజ చెప్పగా.. తనని ఇన్వాల్వ్ చేయొద్దని సోహెల్ అడ్డుకున్నాడు. ఇలా వాళ్ళు అమెరికాలో చాలా ప్లాన్స్ వేసినట్డుగా చెప్పుకొచ్చింది హిమజ.

ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిన ఏంజెల్ ఆసియా, నూకరాజు!

ఏంజెల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. జబర్దస్త్ షోలో టీం లీడర్ గా ఎదిగి తనకంటూ క్రేజ్ సంపాదించుకున్నాడు నూకరాజు.  బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే వీటిలో కామెడీ చేసి సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటాన్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా'  యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. నూకరాజు కోసం వైజాగ్ వెళ్ళి సర్ ప్రైజ్ చేసిన ఆసియా అని ఒక వ్లాగ్, ఇద్దరు కలిసి కెఎఫ్ సి చేస్తే హిట్ ఆర్ ప్లాఫ్ అని మరో వ్లాగ్, నూకరాజు పడుకున్నాక ఏం చేసానో తెలుసా వ్లాగ్ ఇలా అన్నింటికి మంచి స్పందన లభిస్తోంది. అయితే తాజాగా 'ఎంగేజ్మెంట్ కోస‌ం రెడీ అయ్యాము' అంటూ ఒక వ్లాగ్ చేసి అప్లోడ్ చేసారు. అందులో ఆసియా, నూకరాజు పెళ్ళికోసం ఫోటోషూట్, ఎంగేజ్ మెంట్ కోసం రెడీ అయ్యామని చెప్పారు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి మంచి స్పందన లభిస్తుంది.

అమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ అంటున్న హరిత జాకీ!

హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. జాకీని పెళ్ళి చేసుకుంది హరిత. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి. హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. తన కొత్త సీరియల్ కోసం తీసుకున్న శారీస్ అని ఒక‌ వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కోసం తీసుకున్మ బంగారం అంటూ ఒక వ్లాగ్, షూటింగ్ నుండి వచ్చాక ఇది నా పరిస్థితి అంటూ మరొక వ్లాగ్ చేయగా అన్నింటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా తిరుపతికి వెళ్ళి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నామంటూ ఒక వ్లాగ్ ని చేసారు హరిత జాకీ. అయితే హరిత వాళ్ళ అమ్మ బర్త్ డే ముందు ఇలా వెళ్ళాలని అనుకోలేదు. అక్కడ దారిలో వెళ్తుంటే సింగర్ గీతామధురి కూడా కలిసిందని వ్లాగ్ లో చూపించింది హరిత. ఇదంతా 'అమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ' అనే టైటిల్ తో తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది హరిత. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది. 

జానకి కలగనలేదు సీరియల్ లో శివ గెస్ట్ రోల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జానకి కలగనలేదు' ఈ సీరియల్ లో రాశి నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో అమర్ దీప్, ప్రియాంక జైన్ ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ప్రియాంక జైన్ సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రని పోషించే నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది.  జానకి కలుగలేదు సీరియల్ తో  అమర్ దీప్, ప్రియాంక జైన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా 'నీతోనే డ్యాన్స్'  షోలో పార్టిసిపేట్ చేసిన ప్రియాంక జైన్-శివ కుమార్ జోడీ తమ పర్ఫామెన్స్ తో ఆకట్టున్నారు. కాగా వీరిద్దరు కలిసి 'నెవెర్ ఎండింగ్ టేల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశారు. అందులో వీరిద్దరు కలిసొ రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. శివ కుమార్, ప్రియాంక జైన్ కలిసి చేసిన ప్రతీ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది.  ప్రియాంక జైన్ కి ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ బేస్ బాగుంది. ఆమెకు ఫ్యాన్ పేజెస్ కూడా చాలా ఉన్నాయి. కాగా తను యాక్ట్ చేస్తున్న సీరియల్ కి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది ప్రియాంక జైన్. అయితే ప్రియాంక, శివ కలిసి చేసిన తాజా వ్లాగ్ ఆసక్తికరంగా ఉంది. 'శివ గెస్ట్ అప్పీరెన్స్ ఇన్ జానకి కలగనలేదు' అనే టైటిల్ తో ఈ వీడియోని యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసారు. కాగా శివ ఆ సెట్ కి వెళ్ళి అక్కడ ఉన్న జానకి కలగనలేదు టీంతో మాట్లాడుతూ సరదగా గడిపాడు. అయితే ఈ సీరియల్ ఫ్యాన్స్ తమ కామెంట్లతో శివకి అభినందనలను తెలుపుతున్నారు. కాగా ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

తెల్వని ప్లేస్ కదా నువ్ ఏది చెప్తే అదే.. న్యూయార్క్ వీధుల్లో కొత్త జంట

రాకింగ్ రాకేష్-సుజాత ఆన్ స్క్రీన్ మీద లవ్ చేసుకున్నారు.. ఆఫ్ స్క్రీన్ లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు జబర్దస్త్ లో మంచి మంచి స్కిట్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళిద్దరూ రీసెంట్ గా న్యూయార్క్ కి వెళ్లారు. అక్కడ అన్ని చూసి ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని కూడా రాకేష్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు.  న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ కి వెళ్లారు సుజాత -రాకేష్ .. అక్కడ ఉన్న బిల్డింగ్స్ ని చూపించారు. ప్రపంచంలో ఎక్కడ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజి జరగాలి అన్నా కూడా ఇక్కడి నుంచే జరగాలి అంటూ ఆ వీధిని కూడా చూపించారు. "ఇక్కడి బిల్డింగ్స్ ని చూస్తూ ఉంటే అంతా మాయమాయగా ఉండేసరికి సుజాతకు అసలు ఏం అర్ధం కావడం లేదన్నారు" రాకేష్. "అసలు ఈ బిల్డింగ్స్ అన్నిటిని నిలబెట్టి కట్టారా...పడుకోబెట్టి కట్టాక నిలబెట్టారా, వీటిని కట్టాక డిజైన్ చేశారా..డిజైన్ చేసాక కట్టారా" అని చాలా డౌట్స్ అడిగేసరికి రాకేష్ షాకయ్యాడు. తరువాత న్యూయార్క్ లో సందులు గొందులు తిరుగుతూ వచ్చారు. చూడడానికి చాలా బాగుంది న్యూయార్క్ సిటీ అని రాకేష్ అంటే ఇక్కడా అమ్మమ్మలు, నానమ్మలు ఎంత బాగున్నారో తెలుసా అంది సుజాత.  "ఇక అమెరికన్ ఎక్సప్రెస్ కంపెనీని బయటి నుంచి చూపించేసరికి దాని మీద గద్ద బొమ్మను చూసేసరికి సుజాతకు ఒక పాట గుర్తొచ్చింది. గోరటి ఎంకన్న రాసిన "గద్దోచ్చేరా..అమెరిక గద్దోచ్చేరా అనే పాటలోని గద్ద ఇదేనా అని అడిగేసరికి కాదు అమెరికన్ ఎక్సప్రెస్ కంపెనీ అన్నాడు రాకేష్. అంటే బొమ్మనేనా అని మళ్ళీ అడిగింది..అవును అంతే అని రాకేష్ అనేసరికి నిజమేనా..లేదా ఏదో చెప్పాలని నువ్వు చెప్తున్నావా అని సీరియస్ గా అడిగింది సుజాత. లేదు అంతే అన్నాడు రాకేష్. ఏమో తెల్వని దేశానికి తీసుకొచ్చి కుక్కను చూపించి నక్క అని చెప్పిన నమ్మే పరిస్థితి నాది" అని కౌంటర్ వేసింది.  "ఈ వాల్ స్ట్రీట్ లో స్టాక్ మార్కెట్ లో కనిపించే బుల్ ఇక్కడ సెలెబ్రిటీ అందుకే దాంతో చాలా మంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు" అని చూపించింది సుజాత. అలాగే న్యూయార్క్ లో సన్ సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ దాన్ని కూడా చూపించాడు రాకేష్. "వరల్డ్ లో బిజీగా ఉన్న నగరం ఏదైనా ఉంది అంటే అది న్యూయార్క్ మాత్రమే.. ఈ ప్లేస్ ని చూడాలి అంటే నైట్ టైం చూస్తేనే దాని అందం తెలుస్తుంది" అని చెప్పారు. అలాగే అక్కడ సాయంత్ర సమయాల్లో జరిగే హంగామా మొత్తాన్ని చూపించారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒరిజినల్ ఉంటే ఎలా ఉంటుందో కూడా చూపించారు.

తన తుదిశ్వాస వరకు ఋణపడి ఉంటానని చెప్పిన రాజ్!

ముత్యాలు రాజ శేఖర్.. ఈ పేరు ఎవరికి తెలిసిఉండకపోవచ్చు.‌ కానీ బిగ్ బాస్ సీజన్-6 లో రాజ్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. తన కామ్ అండ్ కూల్ నేచర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను తనవైపుకి తిప్పుకున్నాడు రాజ్. రాజ్ ఒక మోడల్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి అడుగుపెట్టాడు. రాజ్ వాళ్ళ నాన్న 2009 లో చనిపోవడంతో తను చదువు మానేసి ఆఫీస్ బాయ్ గా చేసాడంట. ఆ తర్వాత చిన్న చితక జాబ్స్ చేస్తూ చదువుకున్నాడు. ఒక స్టేజ్ లో తనకి లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చిందని, లివ్ వాట్ యూ లవ్ అనేది తను నమ్మాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రాజ్. బిగ్ బాస్ సీజన్‌-6 లోకి ఎంట్రీ ఇచ్చాక తనలో చాలా మార్పు వచ్చింది. రాజ్ మొదట కీర్తభట్, ఇనయా సుల్తానాలతో ఎక్కువగా ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. దాంతో రాజ్ కి ఒక తోడులా, ఏది ఎలా మాట్లాడాలని, ఎవరు ఎలా ఉంటారో తెలియజేసింది ఫైమా. అయితే చలాకి చంటితో కలిసి కామెడీ చేసిన రాజ్.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులను ఆకట్టున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు.. రాజ్ ఎక్కడున్నా రాజే అని నాగార్జున అనేవాడు. అలాగే రాజ్ రెగ్యులర్ గా వాడే ఊతపదం 'మినమం ఉంటది' అనేది ఎక్కువ ఫేమస్ అయింది. అయితే రాజ్ బిగ్ బాస్ తర్వాత తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ అప్డేట్ లో ఉంటున్న రాజ్.‌ తాజాగా బిగ్ బాస్ కి థాంక్స్ చెప్తూ ఒక నోట్ రాసాడు. 'నా లైఫ్ ని మిరాకిల్ గా మార్చావ్.. నా చివరి శ్వాస ఉన్నంతకాలం నీకు ఋణపడి ఉంటాను' అని రాజ్ ఆ పోస్ట్ లో చెప్పాడు. దాంతో బిగ్ బాస్  ఫ్యాన్స్ కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలుపుతూ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

భార్యతో కలిసి టైటానిక్ పోజ్ ఇచ్చిన యాంకర్ రవి!

బుల్లితెర మీద యాంకర్ రవి గురించి తెలియని వాళ్ళు ఉండరు.. మేల్ యాంకర్స్ లో రవి ఫుల్ ఫేమస్. రవి షోస్, ఇంటర్వ్యూస్, అప్పుడప్పుడు మూవీస్ అవీ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటాడు. తన లేటెస్ట్ అండ్ కమింగ్ అప్ డేట్స్ ని కూడా ఫాన్స్ తో షేర్ చేస్తుంటాడు. అలాంటి రవి ఇప్పుడు తన వైఫ్ నిత్యా, కూతురు వియ, అలాగే నిత్యా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఒక ప్లేస్ కి వెళ్ళాడు. "కార్డేలియా క్రూజ్" లో తన ఫ్యామిలీతో కలిసి చెన్నై నుంచి శ్రీలంకపై వెళ్ళాడు. ఫస్ట్ టైం క్రూజ్ లో వెళ్తున్నామని చెప్పాడు. హైదరాబాద్  నుంచి చెన్నై వెళ్లి అక్కడినుంచి క్రూజ్ లో వెళ్లారు రవి అండ్ ఫ్యామిలీ. అలాగే తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని క్రూజ్ టాప్ లోకి అంటే టెన్త్ ఫ్లోర్ లోకి  వెళ్ళాడు. అక్కడ సముద్రపు గాలి హోరెత్తించింది. ఇక రవి, నిత్యా ఇద్దరూ కలిసి టైటానిక్ పోజ్ ఒకటి పెట్టారు. ఎక్సపెక్ట్షన్స్  పెట్టుకుని రాలేదు ..కానీ సూపర్ గా ఉంది..ఫుడ్ సూపర్ సూపర్ గా ఉంది. యాక్టువల్ గా ఇండియన్ ఓషన్ లో ఉన్నామన్నారు రవి. కార్డేలియా బ్రిడ్జి టూర్ కూడా చేశారు వీళ్లంతా. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే వస్తే మాత్రం కార్డేలియా క్రూజ్ లో ట్రావెల్ చేయండి. చాలా అమేజింగ్ గా ఉంటుంది. అలాగే ఈ క్రూజ్ ఓనర్ లైఫ్ చాలా ఇన్స్పిరేషనల్ కూడా. అలా మూడో రోజు శ్రీలంకకి వెళ్లారు. అక్కడ "ఏల నేషనల్ పార్క్" కి వెళ్లారు. తర్వాత నాలుగో రోజు త్రికోణమాలి అనే బీచ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశారు. క్రూజ్ అంటే చిన్న సైజు సిటీ లాంటిది. ఇక్కడ ప్రతీ రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక ఫైవ్ డేస్ క్రూజ్ లో ఎంజాయ్ చేసి ఆ హ్యాపీనెస్ ని తన వ్లాగ్ లో షేర్ చేసుకున్నాడు రవి. డబ్బుని చక్కగా ఖర్చుపెట్టాలి కానీ ఎక్కువగా సేవ్ చేయక్కర్లేదు. డబ్బు సంపాదించేది హ్యాపీగా ఉండడానికే కదా అని చెప్పాడు రవి.

మెహందీ ఫంక్షన్ లో మా హడావుడి!

కెవ్వు కార్తీక్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కామెడీయన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట టీంలో ఒక‌ మెంబర్ గా ఉన్న కార్తిక్..  ఆ తర్వాత టీంకి లీడర్ గా ఎదిగాడు. కెవ్వు కార్తిక్ తో ముక్కు అవినాష్ కూడా కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూయించారు.  అయితే కెవ్వు కార్తీక్- ముక్కు అవినాష్ లు అప్పట్లో వరుసగా ప్రతీ స్కిట్ హిట్ కొట్టేవారు. ఒక్కో స్కిట్ లో‌ ఒక్కో పాయింట్ తో కొత్తగా స్కిట్లు చేస్తూ సీనియర్ టీమ్స్ కి పోటీగా వచ్చేవారు. అయితే వీళ్ళు చేసే 'కన్ఫూజన్' స్కిట్ ఎప్పుడు ప్రెష్ ఫీల్ ని ఇస్తుంది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి సినిమాలలో అవకాశాలు పొందుతూ సక్సెస్ అయినవారు చాలానే ఉన్నారు. అయితే వీరిలో వేణు వెల్దండి, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, శకలక శంకర్, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర లు ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.‌ అయితే  ఈ లిస్ట్ లోకి కెవ్వు కార్తిక్ కూడా చేరాడు. జబర్దస్త్ కి రాకముందు మిమిక్రీ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్‌.. జబర్దస్త్ ద్వారా‌ గుర్తింపు తెచ్చుకొని సినిమాలలో అవకాశాలు పొందుతున్నాడు. గతేడాది రిలీజైన 'ముఖచిత్రం‌' సినిమాలో‌ నటించిన కార్తిక్.. తాజాగా 'నేను స్టూడెంట్ సర్' సినిమాలో చేసాడు. ఇప్పుడు కెవ్వు కార్తిక్ టీం లీడర్ గా మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాదులో కార్తిక్ - శ్రీలేఖల వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు టీవి ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. అయితే పెళ్ళి కోసం తను చేసిన నగల షాపింగ్,  చీరల షాపింగ్ , కన్వెన్షన్ హాల్ ని చూపిస్తూ వ్లాగ్ లు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాడు కార్తిక్. ‌ అయితే కెవ్వు కార్తిక్ - శ్రీలేఖల పెళ్ళి ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. కాగా ఇప్పుడు కార్తిక్ తన యూట్యూబ్ ఛానెల్ లో మెహెందీ ఫంక్షన్ లో ఎలా ఉంటుంది. ఏం చేస్తారు? ఏమేమీ ఆచారాలు, సంప్రదాయాలుంటాయో వివరిస్తూ 'మెహందీ ఫంక్షన్ లో మా హడావుడి' అనే టైటిల్‌ తో అప్లోడ్ చేసాడు. కాగా ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.

ఇది చూసి కనిపెడితే నా పెళ్ళాం మాములుగా కొట్టదు!

"సుమ అడ్డా షో"లో ప్రతీ వారం వచ్చే గెస్టులతో రకరకాల గేమ్స్ ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది సుమ. మరి నెక్స్ట్ వీక్ షోకి ఎవరు రాబోతున్నారు అంటే "రంగబలి" మూవీ నుంచి నాగశౌర్య, నోయెల్, యుక్తి థేరేజా, డైరెక్టర్ పవన్ రాబోతున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. స్టేజి మీదకు డైరెక్టర్ వస్తూనే చేతిలో వాచ్ పట్టుకుని వచ్చేసరికి సుమ సెటైర్ వేసేసింది. "ఎవరైనా టైంని కట్టుకుని వస్తారు కానీ ఈయన టైంని పట్టుకుని వచ్చారు" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత ఫస్ట్ రౌండ్ ఆడించింది సుమ. అందులో ముందుగా "పెళ్లి అంటే ముందుగా ఏం గుర్తొస్తుంది" అని అడిగేసరికి "శోభనం" అని చెప్పారు పవన్. ఆ ఆన్సర్ కి  "భయ్యా మీరు డైరెక్ట్ గా లాస్ట్ రౌండ్ ఆడతారా" అని సెటైర్ వేసాడు నోయెల్. "ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గెస్ చేసి చెప్పండి" అని సెకండ్ రౌండ్ లో ఒక ప్రశ్న అడిగింది సుమ. దానికి నాగశౌర్య ఫుల్ జోష్ తో "ఇది చూసి కనిపెడితే నా పెళ్ళాం మాములుగా కొట్టదు" అన్నాడు. "మీకు హీరో నాగశౌర్య ఎప్పటి నుంచి ఎలా తెలుసు..పర్సనల్ గా ఎప్పటి నుంచి తెలుసు " అని డైరెక్టర్ పవన్ ని అడిగింది సుమ. "ఆయన ఫస్ట్ మూవీ నుంచి తెలుసు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా అలా తెలుసు. మహా  ఐతే రెండేళ్ల నుంచి తెలుసు...రిలేషన్ ని గుర్తుపెట్టుకుంటాం కానీ డ్యూరేషన్ ని గుర్తు పెట్టుకోలేం కదా " అని తెలివిగా ఆన్సర్ చేసేసరికి వావ్ అంది సుమ. తర్వాత కొన్ని గాడ్జెట్స్ ని ప్లే చేసి అవేంటో చెప్పాలి అనేసరికి ప్రింటర్ ని చూసి ఏసీ అని చెప్పింది హీరోయిన్. దానికి డైరెక్టర్ పవన్ ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. "ప్రింటర్ లోంచి ఏసీ వస్తుందని నాకు తెలీదు" అన్నాడు.

సిస్టర్ బర్త్ డేకి కావ్య తీసుకున్న సర్ ప్రైజ్ గిఫ్ట్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే.  కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా  మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో  'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది.  దీపిక రంగరాజు తన పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ని మొదలుపెట్టింది. ఆ ఛానెల్ లో తన మొదటి వీడియోని 'బ్రహ్మముడి' సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది అంటూ ఆ వీడియోకి టైటిల్ ని పెట్టేసి.. అందులో 'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన నటీనటులను పరిచయం చేసిన కావ్య,  ఆ తర్వాత చీరల షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్, కొడైకెనాల్ కి వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ ఇలా ప్రతీది తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది కావ్య. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య,రాజ్ ల జోడీకి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయితే కావ్య సంప్రదాయబద్ధంగా చీరలు కడుతూ ప్రతీ తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. దాంతో ఈ సీరియల్ ని ఆసక్తికరంగా చూస్తున్నారు. అయుతే తాజాగా దీపిక తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడీయోని అప్లోడ్ చేసింది. తన సిస్టర్ బర్త్ డేకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కోసం ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్ళిన కావ్య.. అక్కడ తన సిస్టర్ కోసం ఒక జ్యువలరీ తీసుకోగా, తనకోసం రెండు తీసుకున్నట్టు వీడీయోలో చెప్పింది కావ్య. షాపింగ్ పూర్తయ్యాక తన సబ్ స్కైబర్స్,  ఫాలోవర్స్ కి కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది కావ్య.

చైతన్య మాస్టర్ ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న ప్రభుదేవా మాస్టర్!

ఢీ సీజన్ 16  ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. గత వారం టీం ఏ కొరియోగ్రాఫర్స్ అలాగే వాళ్ళ లీడర్స్ ని చూసాం. ఇక ఇప్పుడు టీమ్ బి నుంచి మరో నలుగురు కొరియోగ్రాఫర్స్ తమ కంటెస్టెంట్స్ తో రాబోతున్నారు. అందులో కృష్ణ మాస్టర్, సందీప్ మాస్టర్, ప్రభుదేవా మాస్టర్, సాయి మాస్టర్ కనిపించారు. ఈ నలుగురు నాలుగు ప్రాంతాలను ..అంటే కృష్ణ, కరీంనగర్, రాయలసీమ, కోనసీమను రిప్రెజంట్ చేయబోతున్నారు.  ఇక ఈ షోలోకి గెటప్ శీను బ్లూ కలర్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చి కాసేపు ఆదితో కలిసి ఫన్ క్రియేట్ చేసాడు. సిరి హన్మంత్, సింగర్ మధుప్రియ వచ్చారు. ఇక కంటెస్టెంట్ భూమిక చేసిన "రారా సామి" డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. భూమిక అనే పేరు చూసేసరికి ఆది, గెటప్ శీను కలిసి ఒక్కడు మూవీలోని కొండారెడ్డిగా చేసిన ప్రకాష్ రాజ్ డైలాగ్స్ చెప్పుకుంటూ  బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక ఈమె చేసిన సాంగ్ కి శేఖర్ మాష్టర్, దీపికా పిల్లి కూడా స్టేజి మీదకు వెళ్లి స్టెప్పులేశారు.  ఈ షో ప్రోమో ఎండింగ్ లో చైతన్య మాస్టర్ ఫోటోని చూపించారు. "మనందరి ఫేవరేట్ వ్యక్తి తన లాస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఈ స్టేజి మీద చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రభుదేవాని కొరియోగ్రాఫర్ గా ఈ స్టేజి మీద చూడాలి అని కోరుకున్నారు. ఈరోజు ఆ కలను, ఆయన విష్ ని నిజం చేసాడు ప్రభుదేవా" అని చెప్పాడు హోస్ట్ ప్రదీప్. ఆయన ఫోటో చూసేసరికి ప్రభుదేవా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఐతే ఈ టీం బికి సంబంధించి ఎవరెవరు లీడర్స్ ఉండబోతున్నారు...వాళ్ళ టీం పేర్లు ఏమిటి అనే విషయాలను ప్రస్తుతానికి చూపించలేదు.

కృష్ణ, మురారి కలిసుండటం చూసి ఏడుస్తున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-192లో.. ముకుంద ఫామ్ హౌస్ దగ్గర అన్నీ చూసుకునే ఆమెతో సెటిల్ చేసి.. కృష్ణ, మురారీల కోసం ఎదురుచూస్తుంది. మరొకవైపు ముకుంద గురించి రేవతి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. అప్పుడు పెద్దమ్మ అంటూ మధు అక్కడికి వస్తాడు.‌ నేను ఇక్కడే ఉన్నా కదరా ఎందుకు అరుస్తున్నావని అడుగగా.. షూటింగ్ లో లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ అరిచి అలా అలవాటైందని మధు అంటాడు. 24 గంటలు ఇంట్లో ఉండే నువ్వు షూటింగ్స్ కూడా వెళ్తావా.. సరే విషయమేంటో చెప్పు అని రేవతి అనగా.. మొదట అమితాబచ్చన్ ని కూడా నాలాగే అవమానించరంట అని మధు అంటాడు. ముందు నీ గురించి నువ్వు ఆలోచించు బాగుపడతావని రేవతి అనగానే మధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు.  కృష్ణ, మురారీలు ఇద్దరు ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ వారిద్దరి కోసం ఎదురుచూస్తున్న రాజనర్సమ్మకి కృష్ణని పరిచయం చేస్తాడు మురారి. ఆ తర్వాత అక్కడ ఉన్న చెట్లని, నేచర్ ని కృష్ణ చాలా బాగుందని చెప్తుంది. ఏసీపీ సర్ మీకొకటి చెప్పాలని కృష్ణ అంటుంది. ఏంటని చాలా ఆత్రుతగా కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. ఏం లేదు.. మీరు మంచోళ్ళు.. మంచి మనసున్న వాళ్ళని కృష్ణ అంటుంది. "అయ్యో కృష్ణ ఈ మాట కొన్ని వందల సార్లు చెప్పావ్.. జోక్స్ ఆపి చెప్పాలనుకున్నది చెప్పేయ్" అని కృష్ణతో మురారి అంటాడు. అయితే సరే నా మనసులో ఏం ఉందో నువ్వే చెప్పెయ్ అని మురారితో కృష్ణ అంటుంది. మురారి ఆలోచనలో పడి మౌనంగా ఉంటాడు.  మరొకవైపు ఇంట్లో ఉన్న మధు, అతని భార్య కలిసి ఏ రీల్ చేద్దామని ఆలోచిస్తుంటారు. కొత్తగా చేయాలని మధు అనగా.. మురారి, ముకుంద లాగా మనం మన క్యారెక్టర్స్ ని ఎక్సేంజ్ చేసుకొని రీల్ చేద్దామని మధుతో అతని భార్య అంటుంది. ఆ తర్వాత ముకుందలాగా గులాబిని తీసుకొని మధుకి ఇస్తూ ప్రపోజ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి రేవతి వచ్చి ఇద్దరిని కొట్టి.. ఇలాంటి చెత్త రీల్స్ చేస్తే తోలు వొలిచేస్తానని చెప్పగానే ఇద్దరు పారిపోతారు.  మరొకవైపు ఫామ్ హౌస్ లో‌ ఉన్న మురారి ఆలోనలో పడతాడు. కాసేపటికి కృష్ణ చెట్టు ఎక్కుతుంది. మురారి వెళ్లి దిగమని చెప్పినా దిగకుండా చెట్టు మీద ఉండి ఫోజులు‌ ఇస్తుంది కృష్ణ. కాసేపటికి పై కొమ్మకి వెళ్తానని కృష్ణ వెళ్తుండగా స్లిప్ అయి పడిపోగా.. మురారి పట్టుకుంటాడు. ఇదంతా ముకుంద దూరం నుండి చూస్తూ.. ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలని అసూయతో రగిలిపోతుంది. కృష్ణని ఎత్తుకొని మురారి ఒకటి చెప్పాలని అనగా... నన్ను దింపండి ఆ పూలు బాగున్నాయని కవర్ చేసి దిగిపోయి ముందుకు వచ్చేస్తుంది కృష్ణ. మురారి తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనుకుంటాడు. మురారి తన డైరీలోని అమ్మాయి గురించి చెప్తాడేమోనని కంగారుగా ఉంటుంది కృష్ణ. వాళ్ళిద్దరిని అలా సంతోషంగా చూసిన ముకుంద ఏడుస్తుంది.‌ ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలని తను తీసిన ఫోటోలని, వీడియోలని మురారికి పంపించాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

రాహుల్ రాలేదని రచ్చ చేసి‌న స్వప్న.. రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ సీరియస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -131 లో.. అప్పుని షాపింగ్ కి తీసుకెళ్తాడు కళ్యాణ్. అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు దుండగులు కత్తితో బెదిరిస్తారు. కత్తిని చూసిన కళ్యాణ్ భయపడతాడు. కానీ అప్పు ఒక దుండగుడిని కొట్టగానే మరొకడు పారిపోతాడు. ఆ తర్వాత అప్పు వాడిని వదిలేసి.. ఇంత భయపడేవాడివి రేపు పొద్దున పెళ్ళి అయ్యాక నీ భార్యని ఎలా చూసుకుంటావని అడుగుతుంది. నేను నీలా పెరగలేదు, చాలా స్మూత్ గా పెరిగానని కళ్యాణ్ అనగా.. సరే రేపటి నుండి గ్రౌండ్ కి వచ్చేయ్ నీకు ట్రైనింగ్ ఇస్తానని అప్పు అంటుంది. మరొకవైపు కనకం, మీనాక్షి కలిసి ఇంటిపత్రాల కోసం సేట్ తలమీద కొట్టగా స్పృహతప్పి పడిపోతాడు.‌ కాసేపటికి లేచిన సేటు.. కనకం, మీనాక్షి ఇద్దరిని తిడతారు. మీరు మమ్మల్ని తిడుతున్నారు కానీ హెల్ప్ కావాలని అడగట్లేదని మీనాక్షి అనగానే.. అవును కదా మరిచిపోయానని చెప్పి సేటు అరుస్తాడు. దాంతో వెంటనే కనకం తన చేతిలోని మత్తు ఉన్న కర్ఛీఫ్ ని సేట్ కి చూపించి మత్తులోకి జారేలా చేస్తుంది. మీనాక్షికి  మత్తు గురించి చెప్తుంది కనకం‌. అది నిజమేనా అని చూడగా తను కూడా మత్తులోకి జారుకుంటుంది. దుగ్గిరాల ఇంట్లో ఉన్న కావ్య తనకి రాజ్ సీక్రెట్ గా పరుపు తెచ్చినందుకు బెడ్ మీద మల్లెపూలతో థాంక్స్ అని రాస్తుంది. అది చూసిన రాజ్.. నాకు ఇలాంటివి నచ్చవని తీసేయమని చెప్తాడు. ఇద్దరు కాసేపు గొడవపడతారు.  మరొకవైపు కొత్త కోడలిగా అడుగుపెట్టిన స్వప్న గ్లామర్ గా రెడీ అయి ఉంటుంది. నీట్ గా చీర కట్టుకొని, సెంట్ కొట్టుకొని రాహుల్ కోసం ఎదురుచూస్తుంటుంది. టైం పది దాటినా రాహుల్ రాకపోయేసరికి విసుగుచెందుతుంది స్పప్న. వెంటనే ఇంటికి డోర్ దగ్గర ఉన్న కాలింగ్ బెల్ కొడుతూ అందరూ హాల్లోకి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత ఏమైందని అందరూ స్వప్నని అడుగగా.. రాహుల్ ఈ టైం అయినా ఇంటికి రాలేదు.‌ నాకు కోరికలు ఉంటాయి కదా అని స్వప్న అనగా.. వాడు మగాడు, బయట సవాలక్ష పనులుంటాయని రుద్రాణి అంటుంది. నాకు తెలియని పనులా అత్త అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ ప్రతీరోజు ఇలానే లేట్ గా వస్తాడా అని రుద్రాణిని స్వప్న అడుగుతుంది. పక్కనే ఉన్న అపర్ణ.. సమాధానం చెప్పు రుద్రాణి అని అడుగుతుంది. దాంతో రుద్రాణి మౌనంగా ఉంటుంది. కాసేపటికి సీతారామయ్య దగ్గరికి స్వప్న వెళ్ళి.. "సారీ తాత గారు.. నేను బలవంతంగా రాహుల్ ని పెళ్ళిచేసుకున్నానని నన్ను ఇలా పట్టించుకోవడం లేదు, అందుకే నా బాధ మీకు తెలియాలనే ఇలా చేసాను" అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

శైలేంద్ర ప్లాన్ ని తిప్పికొట్టిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -798లో.. DBST కాలేజ్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అందులో మిషన్ ఎడ్యుకేషన్ లో‌ పనులు‌ సక్రమంగా జరుగట్లేదని, దానిని మనం ఆపేద్దామమని శైలేంద్ర అంటాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు స్టాఫ్ కూడా శైలేంద్రకి అనుకూలంగా ఆపేద్దామని అంటారు. దాంతో అదంతా శైలేంద్ర ప్లాన్ అని తెలుసుకున్న జగతి వారిని ఇక చాలు.. ఆగండని చెప్తుంది. "మీలో ఎవరేం అన్నా.. నేను మిషన్ ఎడ్యుకేషన్ ని సక్రమంగా అమలు చేస్తాను. ఉండాలనుకునువాళ్ళు ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు" అని జగతి చెప్పి వెళ్లిపోతుంది.  ఆ తర్వాత అక్కడే ఉన్న ఫణీంద్ర.. జగతి నిర్ణయం సరైనదే.. తను స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం ఆలోచించిందని వారికి చెప్పగా అప్పటిదాకా శైలేంద్ర మాటకి కట్టుబడి ఉన్నవాళ్ళు కూడా మేం ఈ ప్రాజెక్ట్ లో జగతి మేడంకి సపోర్ట్ గా ఉంటామని చెప్తారు. మహేంద్ర కూడా ఒకే అంటాడు. ఆ తర్వాత మినిస్టర్ దగ్గరికి జగతి వెళ్ళి ప్రాజెక్ట్ ని సక్రమంగా చూసుకుంటానని చెప్తుంది. అయితే రిషి కోసం వెతికిస్తున్నానని మినిస్టర్ గారితో జగతి  అనగా.. అతని మనసుకు బలమైన గాయం కలిగినది. అతను రావాలంటే నిజం చెప్పాలని మినిస్టర్ అనగా.‌. టైం వచ్చినప్పుడు చెప్తానని జగతి అంటుంది. అప్పుడే అక్కడికి శైలేంద్ర వస్తాడు. స్టాఫ్ ఎవరూ ఆసక్తిగా లేరు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు వేరే కాలేజీకి ఇచ్చేయండి. కావాలంటే నాకు తెలిసిన కాలేజీలని చెప్తానని మినిస్టర్ తో శైలేంద్ర అనగా... ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ పిన్ని గురించి మీకు తెలియదని శైలేంద్ర మీద‌ మినిస్టర్ సీరియస్ అవుతాడు. ఏంటి ప్రాజెక్ట్ వదిలేస్తారా అని జగతిని మినిస్టర్ అడుగగా.. నేను చూసుకుంటానని జగతి చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన జగతి, శైలేంద్ర మాటల యుద్ధం మొదలెడతారు. నా జోలికి రావొద్దని, నాకు ధైర్యం చాలా ఎక్కువని, మిషన్ ఎడ్యుకేషన్ లో ఇన్వాల్వ్ అవ్వకని చెప్పి వెళ్ళిపోతుంది జగతి. మరొక వైపు విశ్వనాథ్ ఇంట్లో ఉన్న రిషి.. ఏంజెల్ దగ్గరికి వస్తాడు. ఏంటి రెస్ట్ తీసుకో అని ఏంజెల్ తో రిషి చెప్పగా.. పెయిన్ కిల్లర్స్ వేసుకున్న తగ్గిపోయిందని ఏంజెల్ అంటుంది. అప్పుడు రిషి తన మనసులో.. మనసుకి అయిన గాయానికి కూడా మందు ఉంటే బాగుండని అనుకుంటాడు. ఆ తర్వాత ఏంజెల్, రిషి కలిసి చపాతీలు చేస్తుండగా.. రిషి, వసుధారలు ఒకప్పుడు కలిసి చపాతీలు చేసిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చాయ్ లో సర్ఫ్ వేసారా ఏమిటి భయ్యా..హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్న సోహైల్

"కథ వేరే ఉంటుంది" అనే టాగ్ లైన్ తో బిగ్ బాస్ సీజన్ 4లో ఒక హిస్టరీ క్రియేట్ చేసాడు ఇస్మార్ట్ సొహైల్. బిగ్ బాస్ తరువాత కూడా మనోడి జోష్ కంటిన్యూ అవుతూనే ఉంది.  సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, బూట్ కట్ బాలరాజు,  మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి మూవీస్ లో నటించాడు.  ఇక ఇప్పుడు  సోహైల్ జిమ్ కి వెళ్లడం మొదలు పెట్టాడు. కొన్ని రోజులు చేసాక ఆపేసి మళ్ళీ జిమ్ కి  వెళ్లడం మొదలుపెట్టేసరికి చాలా స్ట్రైన్ ఐపోయి తన కార్ లో కూర్చుని ఒక వీడియో చేసాడు. దాన్ని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. "ఏంట్రా బాబు ఈ జీవితం..ఏం జిమ్ రా నాయనా...వర్కౌట్ చేసాక బాడీ మస్త్ జబర్దస్త్ మాదిరిగా ఉంటుంది. ఒకట్రెండు వారాలు బై మిస్టేక్ వదిలేస్తే ఇక ఐపోయినట్టే టైర్ లో గాలి పోయినట్టు పోతది...అవసరామారా మనకు జిమ్ము...కానీ చేయాలి..హెల్త్ ఈజ్ వెల్త్ అని నేర్చుకున్నా..తప్పదు చేయాల్సిందే" అని చెప్పాడు సోహైల్. అంతేకాదు రెస్టారెంట్ కి చాయ్ తాగడానికి కూడా వెళ్ళాడు సోహైల్ . ఐతే కప్పులో ఉన్నది చాయ్ నా లేదా సర్ఫ్ నురగ అనిపించేలా ఉండేసరికి అదే డౌట్ తో సోహైల్ "భయ్యా చాయ్ లో సర్ఫ్ వేసారా ఏమిటి ? ఎందిది ? చాయ్ లా సర్ఫ్ వేసినట్టు ఉంది.." అంటూ కామెంట్ చేసాడు. బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వచ్చాక రిలీజ్ ఐన ఫస్ట్ మూవీ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్.

మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నేను మ్యాజిక్ షో చేసాను

శ్రీకర్ కృష్ణ ఒక మెజీషియన్ గా అందరికీ తెలుసు. బుల్లితెర మీద ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఎదుగుతున్నాడు. అలాంటి శ్రీకర్ కృష్ణ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. " ఈటీవీలో చేసే శతమానం భవతి సీరియల్ లో అందులో కార్తీక్ అనే క్యారెక్టర్ లో హీరోగా చేస్తున్నాను...అలాగే బ్రహ్మముడి సీరియల్ లో విలన్ రోల్ లో రాహుల్ అనే క్యారెక్టర్ లో చేస్తున్నాను. నేను హీరోగా సెకండ్ మూవీ "శృతి" అని చేసాను. అది ఒక రెండు మూడు నెలల్లో రిలీజ్ కావొచ్చు. 2007 లో నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు మా స్కూల్ యాన్యువల్ డేకి ఒక మెజిషియన్ వచ్చి ఒక ట్రిక్ నేర్పించారు కానీ నాకు అది చేయడం రాలేదు. ఆ తర్వాతే అది నేర్చుకోవాలనే పట్టుదల నాలో పెరిగింది. ఇప్పటి వరకు 4  వేల షోస్ చేసాను. స్టేజి మ్యాజిక్ లో ఆల్ ఇండియా ఫస్ట్ అవార్డు వచ్చింది అలాగే రెండు సార్లు  స్టేజి మ్యాజిక్ లో స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. మాది వైజాగ్. ఐతే ఇండస్ట్రీలోకి రావడానికి ట్రైల్స్ వేసా కానీ ఎవరిని ఎలా అప్రోచ్ కావాలో తెలిసేది కాదు. 2017 లో నేను అవంతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకసారి యూత్ ఫస్ట్ జరిగింది. ఆ షోకి చీఫ్ గెస్ట్ గా  రాంచరణ్ గారు వచ్చారు. అప్పుడు ఆ షో మొత్తాన్ని నేనే హోస్ట్ చేసాను. అలాగే మ్యాజిక్ షో కూడా చేసాను. రాంచరణ్ గారికి సంబంధించిన ఒక పర్సన్ నన్ను కాంటాక్ట్ చేశారు. మెగాస్టార్ గారి బర్త్ డే సెలెబ్రేట్ చేస్తున్నాం..ఇలా ఒక మ్యాజిక్ షో చేయాలి అని అడిగారు. అలా హైదరాబాద్ వచ్చి మూడేళ్ళ పాటు మ్యాజిక్ షో చేసాను. నాన్న వేదపండితుడు...అమ్మ తెలుగు టీచర్. ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇక హైదరాబాద్ లో నా ట్రైల్స్ నేను చేసుకోవడం మొదలు పెట్టాను. అలా చాలా రోజుల తర్వాత చిరంజీవి గారి మూవీ "సైరా నరసింహారెడ్డి" మూవీలో ఒక రోల్ చేసాను. ఆ మూవీ షూటింగ్ టైంలో కిచ్చా సుదీప్ గారు, అమితాబ్ గారు, జగపతి బాబు గారు ఇలా నేను వాళ్లందరితో రోజూ ట్రావెల్ చేసేవాడిని. రీసెంట్ గా "సిరిమల్లెపువ్వా" అనే మూవీలో హీరోగా చేసాను. ఆ తర్వాత సీరియల్స్ చేయడం స్టార్ట్ చేసాను. నంబర్ వన్ కోడలు, కల్యాణ వైభోగంలో నటించాను..ఇక  ఇప్పుడు శతమానం భవతి సీరియల్ చేస్తున్నాను" అని చెప్పాడు శ్రీకర్ కృష్ణ.