నావికా సాగర్ పరిక్రమలో ఈ గ్లోబ్ మొత్తం చుట్టి వచ్చా..
ఈ వారం సూపర్ క్వీన్స్ షో మాత్రం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఈ షోలో సూపర్ క్వీన్స్ అంతా కూడా కింగ్స్ వేషధారణలో వచ్చి ఎంటర్టైన్ చేశారు. లిఖిత.. పుష్పరాజ్ గెటప్ లో, సుష్మిత.. ధరణి మేకప్ తో, ప్రియాంక ..నారప్పలా, కండక్టర్ ఝాన్సీ.. భీమ్లా నాయక్ లా, మౌనిక ..ఖైదీ మూవీలో ఢిల్లీ గెటప్ లో, ఎస్తేర్.. రోలెక్స్ లా, విద్యుల్లేఖ.. కొమరంభీంలా, ప్రశాంతి.. డీజే టిల్లు గెటప్ తో, సుహాసిని.. బాహుబలిలా, పవిత్ర.. అఖండ గెటప్ లో వచ్చారు. వీళ్లకు ఎన్నో రకాల ఫిజికల్ టాస్కులు ఇచ్చి ఆడించాడు ప్రదీప్. ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా నేవీలో లెఫ్ట్నెంట్ కమాండర్ గా ఉన్న ఐశ్వర్య గారిని ఇన్వైట్ చేసాడు. "మీరు ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది.
కొన్ని స్ట్రాంగ్ ప్రొఫెషన్స్ ని తీసుకునేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి...ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి...ఇలాంటి ప్రొఫెషన్ ని తీసుకోవాలి అని అంటారు. మీరు ఈ ప్రొఫెషన్ తీసుకునే ముందు ఏం అనుకున్నారు" అని ప్రదీప్ ఆమెను అడిగాడు "ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే మాత్రం ఏం చదవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేవి ఆల్రెడీ డిసైడ్ చేసేస్తూ ఉంటారు. ఈ విషయంలో నేను మాత్రం చాలా లక్కీ...ఓపెన్ మైండెడ్ పేరెంట్స్ ఉన్నారు. ఏం చేయాలన్నా నీ ఇష్టం అనే ఛాయస్ ని నాకే వదిలేసేవారు. అప్పుడు నేను ఇండియన్ నేవీలో జాయిన్ కావాలని డిసైడ్ అయ్యాను.
నేవీలో చూసినా మెన్ , విమెన్ రేషియో ఏమీ సమానంగా లేదు. లేడీస్ ఒక అడుగు ముందుకు వేసి జెంట్స్ తో సమానం అనే విషయాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. నా కెరీర్ లో అలాంటి ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేసి సక్సెఫుల్ గా 2021 కి టెన్ ఇయర్స్ సర్వీస్ ని పూర్తి చేసాను. నేను ఇండియన్ నేవీలో టెక్నికల్ ఆఫీసర్ ని. బేసిక్ వర్క్ ఏమిటి అంటే వార్ షిప్స్ ని, సబ్ మెరీన్స్ ని డిజైన్ చేసి వాటి పని తీరు చూస్తూ ఉంటాం. ఐతే నేను నేవీలో చేరాక తెలుసుకున్నది ఒకటి. రెగ్యులర్ వర్క్ కాకుండా ఏదైనా అచీవ్ చేయాలనీ అనిపించింది. అప్పుడే ఒక అవకాశం వచ్చింది. విమెన్ క్రూతో ఇండియన్ నేవీ ఒక అడ్వెంచర్ చేయాలనీ చూస్తోందని తెలిసింది. అప్పుడు ఒక ఆరుగురం సెలెక్ట్ అయ్యాము. దాని కోసం మూడేళ్లు ట్రైనింగ్ తీసుకున్నాం...2017 లో జరిగిన ఈ మిషన్ పేరు "నావికా సాగర్ పరిక్రమ". ఈ అడ్వెంచర్ పూర్తిగా సెయిలింగ్ బోట్ మీదే సాగింది. అలా మేం ఆరుగురం ఈ గ్లోబ్ మొత్తాన్ని చుట్టి వచ్చాం...ఈ టైములో చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేసాం. చివరికి ఈ మిషన్ ని 2018 లో పూర్తి చేసాం. ఇక గ్యాలెంటరీ అవార్డుని తెలంగాణ నుంచి అందుకున్న మొదటి మహిళను నేనే.." అంటూ తన అఛీవ్మెంట్స్ గురించి చెప్పారు. ఆమె బ్రేవరీకి సెల్యూట్ చేస్తూ సూపర్ క్వీన్స్ అంతా కూడా సత్కరించారు.