కాలేజీకి గెస్ట్ లుగా జగతి, మహేంద్ర.. షాక్ లో రిషి, శైలేంద్ర!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -813 లో.. గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడానికి అందరు బయటకు వెళ్తుంటే.. వసుధార కూడా వెళ్ళడానికి వస్తుంటే మీరు అక్కడి వరకు నడిచి, మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకు ఇక్కడే ఉండండని వసుధారతో రిషి అనగా.. సరేనని వసుధార అక్కడే ఉంటుంది.
ఆ తర్వాత అందరు గెస్ట్ ల కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడే జగతి, మహేంద్రల కార్ వస్తుంది. కార్ లో నుండి జగతి, మహేంద్ర దిగగానే వాళ్ళిద్దరిని చూసి రిషి షాక్ అవుతాడు.. జగతి మాత్రం వెళ్లి రిషి ని హగ్ చేసుకొని తన ప్రేమని చెప్తూ ఎమోషనల్ అయినట్లు ఊహించుకుంటుంది. కాసేపటికి పదా జగతి అని మహేంద్ర అనగానే ఊహలో నుంచి బయటకు వచ్చి.. ఇద్దరు రిషి దగ్గరికి వెళ్తారు. ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళు అన్నట్లుగానే జగతి, మహేంద్ర, రిషిల ప్రవర్తన ఉంటుంది. ఏంటి పిన్ని, బాబాయ్ లు ఎమోషనల్ అవుతున్నారని అటుగా చూసేసరికి.. అక్కడ ఉన్న రిషిని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. ఏంటి రిషి బ్రతికే ఉన్నాడా అని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. మరొకవైపు కాలేజీ ప్రిన్సిపల్ వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తాడు. రిషి ఆశ్చర్యంగా చూస్తూ పక్కకి వెళ్ళిపోతాడు. అందరూ లోపలికి వెళ్తారు. జగతి, మహేంద్రలను చూసి వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు వసుధార దగ్గరికి వెళ్లి.. ఏం తెలియనట్టుగా పరిచయం చేసుకుంటారు. రిషి, వసుధారల గురించి ప్రిన్సిపల్ జగతి, మహేంద్రలకి గొప్పగా చెప్తాడు. మరొకవైపు రిషిని శైలేంద్ర చూస్తూ.. వాళ్ళు నాకు అబద్దం చెప్పారా అని రౌడీకి కాల్ చేస్తాడు శైలేంద్ర. రిషి నా ముందే ఉన్నాడు. మీరు చనిపోయారని చెప్పారు కదా అని శైలేంద్ర అడుగుతాడు. నేను కనుక్కుని ఫోన్ చేస్తానని రౌడీ అంటాడు.
మరొక వైపు రిషి కోసం సెమినార్ హాల్లో అందరూ ఎదురు చూస్తుంటారు. ఏంటి వీళ్ళు అనుకోకుండా వచ్చారా అని ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, మోసగాడని ముద్రవేసిన వారి ముందు మోటివేషన్ స్పీచ్ ఎలా ఇవ్వాలని రిషి అనుకుంటాడు. స్టూడెంట్స్ కోసమైన నేను వెళ్లి మాట్లాడాలని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత రౌడీ కాల్ చేసి.. అవును సర్ రిషి బ్రతికే ఉన్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్తాడు.ఈ సారి అలా కాకుండా చూస్తామని రౌడీ అంటాడు. మీరేం చేయనవసరం లేదని, ఇంతమంది ఉండగా వాన్ని ఇక ఎవరేం చెయ్యలేరని శైలేంద్ర అనుకుంటాడు.