మహంకాళి భోనాల జాతరలో కృష్ణ ముకుంద మురారి, మల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -208  లో..  మధు, అలేఖ్య ఇద్దరు కలిసి ముకుంద, మురారిలు కలిసి ఉన్న ఫోటోలని భవానికి చూపించడానికి వెళ్తుండగా రేవతి చూసి ఏంటని అడుగగా.. వాళ్ళిద్దరి ఫోటోలు చూపిస్తాడు మధు. దాంతో వాళ్ళిద్దరిని పక్కకి తీసుకెళ్ళి.. "ముకుంద మురారీల ప్రేమ గతం.. ఈ విషయం మీకన్నా ముందే నాకు తెలుసు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా భవాని అక్కయ్యకి తెలియకూడదు" అని మధు, అలేఖ్యలతో రేవతి అంటుంది. దాంతో ఈ విషయం ఎవరికి చెప్పనని రేవతికి మధు మాటిస్తాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి కలిసి భోనాల కోసం ఏర్పాట్లు చేస్తుంటారు‌. తన ప్రేమ దక్కాలని మొక్కుకొని మురారి కోసం ఒక ప్రేమలేఖ రాస్తుంది కృష్ణ. దానిని తన కొంగుముడికి కట్టుకొని భోనం దగ్గరికి వెళ్తుంది. అక్కడ భవాని అందరూ కలిసి భోనాలు ఎత్తుకొని ఇంటి నుండి మహంకాళి టెంపుల్ కి వెళ్తారు.  మురారి ఫ్యామిలీతో కలిసి మహంకాళి భోనాల దగ్గరికి వస్తాడు. అయితే అదే సమయంలో మురారికి గౌతమ్ నుండి కాల్ వస్తుంది. ఏంటి గౌతమ్ చాలా రోజులకి కాల్ చేసావ్? స్వప్న తో నీ పెళ్ళి ఫిక్స్ అయిందా? కంగ్రాట్స్ ఆ విషయం చెప్పడానికే కాల్ చేసావా అని మురారి అడుగుతాడు. స్వప్న ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందని,  యాక్సిడెంట్ చేసింది అరవింద్ అని చెప్తాడు గౌతమ్. అవునా మరి అతనికి శిక్ష పడిందా అని మురారి అడుగగా.. లేదు అతను డబ్బు పలుకుబడి ఉపయోగించి తప్పించుకున్నాడు. ఇప్పుడు మహంకాళి గుడికి ఫ్యామిలీతో వస్తున్నాడంట అని గౌతమ్ చెప్తాడు. సరే అయితే నువ్వు కూడా రా, నేను ఇక్కడే ఉన్నానని  మురారి అనగా.. ఒక గంటలో అక్కడ ఉంటానని గౌతమ్ అంటాడు. మరోవైపు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి మహంకాళి టెంపుల్ కి వస్తుంటాడు. అయితే టెంపుల్ లో కృష్ణ, ముకుంద, భవాని, రేవతి భోనాలతో ప్రదక్షిణలు చేస్తుండగా మధు వ్లాగ్ చేస్తుంటాడు. అదే సమయంలో భవాని ముందు మార్కులు కొట్టేయాలని కృష్ణ భోనాన్ని పట్టుకోకుండా నడిచి భవాని అత్తయ్య దగ్గర సభాష్ అనిపించుకుంటానని మురారీతో కృష్ణ చెప్పి.. భోనం పట్టుకోకుండా ముందుకు నడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషి సెమినార్ కి ఫిదా అయిన జగతి, మహేంద్ర.‌. వాళ్ళిద్దరిని సత్కరించిన పాండియన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -814 లో.. సెమినార్ హాల్లో అందరూ రిషి గురించి చూస్తుంటారు. రిషి రాలేదు విశ్వం.. తన ఛాంబర్ కి వెళ్లినట్లున్నాడు. నేను వెళ్లి తీసుకొస్తానంటూ ఏంజిల్ వెళ్తుంది. ప్రిన్సిపల్ సర్ వసుధార దగ్గరికి వచ్చి.. నేను రిషి సర్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు.. మీరు చెయ్యండని చెప్పి వెళ్తాడు.  ఆ తర్వాత ఫోన్ పట్టుకొని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర, జగతి ఇద్దరు రిషి కోసం చూస్తుంటారు. "ఎందుకు సర్ ఆలా చూస్తున్నారు. ఇప్పుడు నేను రిషి సర్ కి ఫోన్ చేసాను. రిషి సర్ రారు. మీరెందుకు వచ్చారు సర్. రిషి సర్ ప్రశాంతంగా ఉంటే తనని వచ్చి డిస్టబ్ చేశారు. రిషి సర్ ని నమ్ముకొని ప్రిన్సిపల్ సర్ ఇంత పెద్ద సెమినార్ కండక్ట్ చేస్తే మీరు వచ్చి ఇలా చేసారు. ఇప్పుడు రిషి సర్ వచ్చి సెమినార్ ఇవ్వరు" అని వసుధార అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధారా మేం ఏమైనా కావాలని వచ్చామా ఇన్వైట్ చేస్తే వచ్చామని మహేంద్ర అంటాడు. అప్పుడే వసుధార అని జగతి ఏదో చెప్తుండగా.. మేడం మీతో మాట్లాడడం లేదు. నేను మహేంద్ర సర్ తో మాట్లాడుతున్నాను అంటూ వసుధార కోపంగా మాట్లాడుతుంది. నా కొడుకు ని తీసుకొని వస్తాను. వాడు పంతాలు, కోపాల కంటే బాధ్యతలకే ఎక్కువ విలువ ఇస్తాడు. వెళ్లి తీసుకొస్తానని మహేంద్ర వెళ్తుండగా.. అటువైపు నుండి రిషి ఎదురుగా వస్తాడు. అలా వచ్చిన రిషిని మహేంద్ర హగ్ చేసుకుంటాడు. పక్కనే ఉన్న విశ్వనాథ్ చూసి.. మీ మధ్య ఇంత అనుబంధం ఉందా అని అనగానే.. అవును ఈ సర్ నాకు ఆత్మీయులని రిషి చెప్తాడు. సెమినార్ నేను చెప్పలేను. పేపర్ పై రాసి ఇస్తాను. నాకు ఇప్పుడు మాట్లాడాలని లేదని రిషి అంటాడు. లేదు సెమినార్ చెప్పాలని జగతి ఇంకా స్టూడెంట్స్ పట్టుపట్టడంతో రిషి సెమినార్ మొదలు పెడతాడు. "పవర్ అఫ్ స్టడీస్ " అనే కాన్సెప్ట్ పై స్టూడెంట్స్ కి మోటివేషన్ లా రిషి మాట్లాడుతాడు. రిషి మాటలకి బాగుందంటూ స్టూడెంట్స్ క్లాప్స్ కొడుతారు. జగతి, మహేంద్ర రిషి మాటలకూ గర్వపడతారు. మరొక వైపు శైలేంద్ర చాటుగా రిషి చెప్తున్న సెమినార్ చూస్తుంటాడు. ఆ తర్వాత సెమినార్ పూర్తి అయ్యాక.. పాండియన్ వెళ్లి రిషి సర్ , వసుధార మేడం వీళ్ళిద్దరి వల్లే మాలో మార్పు వచ్చింది. అందుకు మేము వాళ్లిద్దరిని సత్కారించాలనుకుంటున్నాని పాండియన్ అంటాడు. అందుకు ప్రిన్సిపల్ సార్ ఒప్పుకొని.. జగతి, మహేంద్రల చేతుల మీదుగా రిషి, వసుధారలను సత్కరిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కావ్య ఫోన్ ని తిరిగిచ్చేసిన అపర్ణ.. రుద్రాణి మాస్టర్ ప్లాన్ లో స్వప్న కీలుబొమ్మ కానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -147 లో.. కావ్య, కళ్యాణ్ లను రాజ్ స్టేషన్ నుండి విడిపిస్తాడు. నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే వీడే దొరికాడా వాడికే సరిగా రాదని కావ్యతో రాజ్ అంటాడు. సరే నేను నేర్పిస్తానని కావ్యతో రాజ్ అంటాడు. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతు.. సరే పదండని అనగానే.. ఏంటి ఇప్పుడు ఈ రోజు నువ్వు సాధించిన విజయం చాలు.. తర్వాత చూసుకుందామని రాజ్ అంటాడు. ముగ్గురు ఇంటికి బయల్దేరతారు. మరొకవైపు రిమోట్ బ్యాటరిస్ గురించి అపర్ణ కప్ బోర్డ్స్ లో చూస్తుంటే.. తనకి అందులో ఇన్ హెలర్లు కనిపిస్తాయి. ఏంటి ఇన్ని హెల్లర్ లు ఉన్నాయని అపర్ణ అడుగుతుంది. ఆ రోజు ఇంట్లో ఇన్ హెల్లర్ లేకపోవడం వళ్లే రాజ్ కి అలా జరిగిందని ఎప్పుడు అందుబాటులో ఉండాలని.. కావ్య అలా పెట్టిందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ గురించి కావ్య ఎంత శ్రద్ధ తీసుకుంటుంది. నువ్వే కావ్యని అర్ధం చేసుకోవటం లేదని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు నేనేం అన్ననానని అపర్ణ అడుగుతుంది. కావ్య దగ్గర ఫోన్ లేకుండా నువ్వు తీసుకున్నావ్.. తనకి ఎంత ఇబ్బంది అవుతుందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడే రాజ్, కావ్య, కళ్యాణ్ ముగ్గురు వస్తారు. వాళ్లని చూసి అపర్ణ  లోపలికి కోపంగా  వెళ్తుంది. ఏంటి మమ్మీ కోపంగా ఉందని సుభాష్ ని రాజ్ అడుగగా.. అదేం లేదని సుభాష్ అంటాడు. అపర్ణ కావ్య దగ్గర నుండి తీసుకున్న ఫోన్ తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తుంది. మీరు మనస్ఫూర్తిగా ఇస్తున్నారా ఎవరైనా ఇవ్వమంటే ఇస్తున్నారా అని కావ్య అడుగుతుంది. నీకు ఫోన్ ఎంత అవసరమో తెలిసి ఇస్తున్నానని అపర్ణ అంటుంది. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ నే కాదు మీ అత్తయ్యని కూడా గెలుచుకున్నావని కావ్యతో ధాన్యలక్ష్మి అంటుంది. అదంతా చూసిన స్వప్న కోపంగా లోపలికి వెళ్తుంది. స్వప్న దగ్గరికి రాహుల్ వెళ్తాడు. ఈ ఇంట్లో నాకు విలువ లేదు కావ్యతో పోటీ పడను. నా విలువ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తానని రాహుల్ తో‌ స్వప్న అంటుంది. నాకు నీ హెల్ప్ కావాలి మోడలింగ్ చేస్తాను. ఫేమస్ అయిపోతా అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారని స్వప్న అనగానే. రాహుల్ వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. రాహుల్, స్వప్న ఇద్దరు మాట్లాడుకున్నది రుద్రాణి వింటుంది. రాహుల్ బయటకు రాగానే.. తను చెప్పింది చెయ్.. స్వప్న చేసే పనికి ఈ ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చి బయటకు పంపిస్తారు. మనకి కూడా కావలిసింది అదే కదా.. కానీ మనం హెల్ప్ చేస్తున్నట్లు ఇంట్లో వాళ్ళకి చెప్పకని మాట తీసుకోమని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి.  ఆ తర్వాత రాహుల్ వెళ్లి స్వప్నకి హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పగా.. దానికి సరేనని స్వప్న అంటుంది. మరొకవైపు కనకంకి కావ్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడే సేట్ డబ్బుల గురించి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అవమానిస్తుంటే.. కావ్య ఫోన్ లో అదంతా వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

బేబీ మూవీ మీద అనసూయ ట్వీట్...ఆ ఇద్దరి మధ్య ఏమీ లేదన్న ఆనంద్ దేవరకొండ  

ఇండస్ట్రీలో అనసూయకి, విజయ్ దేవరకొండ ఫాన్స్  మధ్య ఎం జరిగిందో తేలీదు కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్వీట్ల వార్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన "బేబీ" మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మళ్ళీ టాపిక్ వచ్చింది. అలాగే అనసూయ ఈ బేబీ మూవీ గురించి ట్వీట్ కూడా చేసింది. "ఇదంతా కామెంటరీ తప్ప వాళ్ళ మధ్య పెద్ద ఇష్యూ ఏమీ లేదు. నాకు ఆ ఇష్యూ ఏమిటో కూడా పూర్తిగా తెలీదు." అని చెప్పారు అన్నాను... అలాగే ట్విట్టర్ గురించి కూడా చెప్పుకొచ్చారు "ట్విట్టర్ ఎలా అయ్యిందంటే మధ్యలో ఒక గేట్ ఉంటుంది అటు ఇటు రెండు కుక్కలు ఉంటాయి...కెమెరా కొంచెం పక్కకు పెడితే అక్కడ అంతా ఖాళీ కొట్టుకోవచ్చు వెళ్లి. కానీ ఇక్కడ గేట్ ఉండేసరికి అరుచుకుంటారు అంతే...రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన ఎవరి మీద కామెంట్స్ చేయం..మన లోకం మనది...అదే ట్విట్టర్ కి వచ్చేసరికి ఏది పోస్ట్ చేసినా దాన్ని కామెంట్ చేస్తారు..మనం ఎవరం కూడా  ఎస్ చెప్పకుండానే ఆ సోషల్ మీడియాలోకి జాయిన్ ఐపోయాం. నేను ఈ ట్రాప్ లో పడలేదు. నేను ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్న ఆలోచనే రాదు. నా బ్రెయిన్ ఇంకా అలా ట్యూన్ కాలేదు.. కానీ మన మెమరీ అంత ఈ డివైస్ లోకి వచ్చేసింది. చాలా విషయాలు కూడా దీని వలన మరచిపోతున్న " అని చెప్పుకొచ్చారు ఆనంద్ దేవరకొండ. ఇక ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ "బేబీ" ఒక క్యూట్ లవ్ స్టోరీ త్వరలో ఆడియన్స్ ముందు రాబోతోంది.       

సింగర్ సునీత నోటా అల్లు అర్జున్ డైలాగ్....15 న డాలస్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్

సింగర్ సునీత పాట పాడినా, మాట్లాడినా వినబుద్దేస్తుంది. తెలుగు సింగెర్స్ లో  సునీతకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కేవలం సింగింగే కాదు డబ్బింగ్ కూడా చెప్తారు.  మ్యూజిక్ ఈవెంట్స్‌లో హోస్ట్‌గా, యాంకర్‌గా కూడా ఈమె సందడి చేస్తారు. ఈమె లైఫ్ ఒక ఓపెన్ బుక్...పాటలు పాడటంతో పాటు  సింగింగ్ షోస్ కి జడ్జిగా ఉంటుంది. అలాంటి సునీతకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ. కొడుకు ఆకాష్ ని హీరోని చేసేసారు సునీత..త్వరలో అతను నటించిన "సర్కార్ నౌకరి" ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక కూతురిని కూడా సింగర్ గా చేసేసారు సునీత. ఆమె ఆల్రెడీ నాగ‌చైత‌న్య న‌టించిన "స‌వ్య‌సాచి" మూవీలో " టిక్ టిక్ టిక్అ "నే పాట‌ను పాడారు కూడా. ఇక సునీత-శ్రేయ కలిశారంటే అల్లరి మాములుగా ఉండదు. ఇప్పుడు కూడా అలా సరదాగా చేసిన ఒక రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు సునీత. అల్లు అర్జున్ మూవీలోని ఒక ఫేమస్  డైలాగ్ ఐన "ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా" అనేదాన్ని సునీత చేత వాళ్ళ అమ్మాయి శ్రేయ చెప్పించింది. ఆ వీడియోని అల్లు అర్జున్ పిక్ తో కొలెజ్ చేసి "మేడం భలే ముద్దుగా చెప్పారు కదా డైలాగ్" అని కాప్షన్ రాసి పోస్ట్ చేశారు. ఇక సునీత ఇన్స్టా పేజీ మొత్తం చూస్తే వాళ్ళ పిల్లలు, పూలు, పాటలు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈమె ఇళయరాజా గారితో కలిసి 15 న డాలస్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా చేయబోతున్నారు. సునీత కుమార్తె శ్రేయ అచ్చం  అమ్మలాగే ఎంతో అందంగా ఉంటుంది. అద్భుతమైన స్వరాన్ని సొంతం చేసుకున్న శ్రేయ.. ఫ్యూచర్ లో  సింగర్‌గా రాణిస్తుందో.. హీరోయిన్‌గా మెప్పిస్తోందో చూడాలి. సునీత తన పిల్లలతో ఉన్న ప్రతీ మూమెంట్ ని అలాగే తన పర్సనల్ అప్ డేట్స్ ని తన కన్సర్ట్స్ కి సంబంధించిన విషయాలను కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు.    

తన అందానికి కారణం అది తినడమేనట

రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫాన్స్ తో బాతాకాని కూడా వేస్తుంది, ఆన్సర్స్ ఇస్తుంది. ఇప్పుడు కూడా రండి క్వశ్చన్స్ అడగండి అని పిలిచింది. కొంతమంది కొంటె నెటిజన్స్ కి మాత్రం తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆన్సర్స్ చెప్పేసింది. "నన్ను పెళ్లి చేసుకుంటావా" అంటే  "నో" అంది. " నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ఎవరికీ తెలియనిది" అనేసరికి "చెప్పనుగా" అంది. "ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా" అనడంతో "నో" అని చెప్పి పారిపోయే ఎమోజిస్ ని పోస్ట్ చేసింది. "తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఇష్టం" "నాగ చైతన్య, జూ.ఎన్టిఆర్, నాగార్జున, అల్లు అర్జున్, ఇంకా ఉన్నారు" అని సిగ్గుపడుతూ చెప్పింది. "నువ్వు ఎం తింటావ్ అంతా స్మార్ట్ గా ఉంటావ్" అనేసరికి "బ్రెయిన్ తింటాను" అని సరదాగా తన అందం వెనక ఉన్న సీక్రెట్ ని చెప్పేసింది.  "నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి" అని అడగడంతో "యూనివర్స్ ఎక్కడికి పంపిస్తే అక్కడే ఉఫ్ మని ఎగిరిపోతా" అని చెప్పింది. "నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ చేయండి..చేస్తారా" అని అడిగేసరికి "చెయ్యను" అని అంది. "మీరు అంత అందంగా ఉండడానికి రీజన్ ఏమిటి" అని స్మార్ట్ గా అడిగేసరికి "మీ ప్రేమ" అని నవ్వుతూ చెప్పేసింది. "డబ్బు ఇంపార్టెంట్ ఆర్ ఫామిలీ" అని అడగడంతో "ఫామిలీ ఇంపార్టెంట్..వాళ్ళను మంచిగా చూసుకోవడానికి డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్" అని చెప్పింది రీతూ చౌదరి. యంగ్ బ్యూటీగా  ఇప్పుడిప్పుడే పాపులర్ రీతూ ఈమధ్య కాలంలో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని, అప్పుడప్పుడు చీరలు కట్టుకుని ఫోటో షూట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తోంది.    

ఆ కాసేపు ఉండే రుచి కోసం వాటిని చంపాలా

సోషల్ మీడియాలో రష్మీ, సదా, రేణు దేశాయ్ ఎక్కువగా మీట్ ఇండస్ట్రీకి  సంబంధించిన ఫొటోస్ ని, ఆర్టికల్స్ ని ఎక్కువగా రాస్తూ షేర్ చేస్తూ ఉంటారు. జంతువులని హింసించేవి, చంపేవి, వాటి మాంసాన్ని అమ్మే వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు.  వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఐతే వీళ్ళు పెట్టే వీడియోస్ కావొచ్చు, పోస్టులు కావొచ్చు బాగా సెన్సేషల్ అవుతూ ఉంటాయి. ఈ విషయం మీద రీసెంట్ గా ట్విట్టర్ లో రష్మీకి, కొంతమంది నెటిజన్స్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఐతే ఈ వీడియోస్ చూసి, ఈ మంచి మాటలు ఎవరు చేంజ్ అవుతారు అని అందరూ అనుకుంటారు. కానీ ఒక్కరు మారినా చాలు కదా...రీసెంట్ గా రేణు దేశాయ్ మీట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వీడియో చూశాకా తాను చాలా మారిపోయాయని ఒక నెటిజన్ పోస్ట్ పెట్టాడు.   ఈ విషయానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కి రేణు దేశాయ్ తన ఇన్స్టా లో షేర్ చేసింది. "మీరు షేర్ చేసిన వీడియోను   అస్సలు చూడలేకపోయాను.. అప్పటి నుంచి నాన్ వెజ్ తినడం మానేశాను..చికెన్ కూడా తినడం మానేసాను... ఆ వీడియో నన్ను చాలా చేంజ్ చేసేసింది " అంటూ ఓ నెటిజన్ రేణూ దేశాయ్‌కి మెసెజ్ పెట్టాడు. అతని అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూనే పక్కన ఒక స్మాల్ నోట్ కూడా రాసింది. ‘ఇన్స్టాగ్రామ్ లో  అలాంటి క్రూయల్ వీడియోలు, ఫోటోలు ఎందుకు షేర్ చేస్తావు వాటి వలన ఉపయోగం ఏమిటి  అని నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. ఇలాంటి ప్రశ్నలు కొన్నేళ్లు నన్ను అడుగుతూనే వచ్చారు..కానీ నేను చెప్పేది ఒక్కటే. నాలుక మీద పది, పదిహేను నిమిషాలు ఉండే  రుచి అందించడం కోసం అమాయకపు జీవులు చావాలా. మన దేశంలో రోజూ  మాంసం తినేవారి సంఖ్య చాలా ఎక్కువని నాకు తెలుసు..అలాంటి వాళ్లంతా కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మనతో పాటు జీవాలకు  కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉంది. " అని రేణూ దేశాయ్ కోరింది...   

శ్రీవల్లి సీరియల్ 50 ఎపిసోడ్స్ సెలెబ్రేషన్స్

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీవల్లి సీరియల్ 50 ఎపిసోడ్స్ ఐన సందర్భంగా నటి శ్రీవల్లి భర్త విక్రమ్ తన టీం మొత్తానికి దావత్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కేక్ కూడా కట్ చేశారు. ముందుగా రక్త మైసమ్మ గుళ్లో పూజలు చేసుకున్నాక ఈ సెలెబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు. హిమజ ప్రసాదం వండి తీసుకొచ్చింది. అలాగే  శ్రీవాణితో కలిసి తాను కూడా జిమ్ కి వెళ్తున్నట్లు చెప్పారు. అలాగే వాళ్ళ జిమ్ కోచ్ ని కూడా ఈ సెలెబ్రేషన్స్ కి ఇన్వైట్ చేశారు. కో-డైరెక్టర్ సతీష్ గురించి కూడా చాలా చెప్పారు విక్రమ్...కమిట్మెంట్స్ ఉన్నప్పుడు అడ్జెస్ట్మెంట్స్ చేయాలంటే సతీష్ ఒక్కరే చేయగలరని చెప్పారు. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి శ్రీవాణి కూడా వచ్చింది.   ఇంకా శతమానం భవతి సీరియల్ నటి నీలిమ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. శతమానంభవతి టీం, శ్రీవల్లీ టీం ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే  ఈ రెండు సీరియల్స్ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళవి కాబట్టి అని చెప్పారు విక్రమ్. ఇక ఈ జ్ఞాపిక ప్రొడక్షన్స్ కి సన్నిహితురాలు, స్నేహితురాలు ఐన తన చెల్లి హిమజకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారని, తర్వాత తామే చూసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక  భోజనాలు చేసాక అందరూ కలిసి కేక్ కట్ చేసుకుని తిన్నారు. శ్రీవాణి, విక్రమ్ ని అక్కడికి వచ్చిన వాళ్లంతా విష్ చేశారు. వీళ్ళు బుల్లితెర మీద సీరియల్స్ లో అలాగే కొన్ని షోస్ లో, ఈవెంట్స్ లో నటిస్తుంటారు. ఇద్దరికి చెరొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో రెగ్యులర్ అప్ డేట్స్ పెడుతూ ఉంటారు.

దయా  వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ.. అయ్యగారే ఫేవరెట్ అంట!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది. విష్ణుప్రియకి బిగ్ స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని ఆశంట.. ఎందుకంటే అది వాళ్ళ నాన్న డ్రీమ్ అంట. తనలోని నటనను ఎవరు గుర్తించకపోయేసరికి డ్యాన్స్ మీద దృష్టి పెట్టి కసరత్తులు చేస్తుంది. యోగాలు, జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ డ్యాన్స్ కోసం తన బాడీనీ మలుచుకుంటుంది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే విష్ణుప్రియ.. తనకి సంబంధించిన ఒక ప్రతీ విషయాన్ని అప్డేడ్ చేస్తుంది. సీనియర్ హీరో జెడీ చక్రవర్తి మొదటిసారి నటిస్తున్న వెబ్ సిరీస్ 'దయా' లో షబానాగా విష్ణుప్రియ చేస్తుంది. అయితే తను షబానాగా చేస్తున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పింది. కాగా ఇప్పటికే తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న విష్ణుప్రియ తన ఫాలోవర్స్ కి కృతజ్ఞతలు చెప్పింది. రెగ్యులర్ గా జ్యువలరీ, డ్రెస్, ఫోటోషూట్స్ తో బిజీగా ఉండే విష్ణుప్రియ. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్  మీ క్వశ్చనింగ్' ని స్టార్ట్ చేసింది. ' మీ అమ్మ గురించి చెప్పండి' అని ఒకరు అడుగగా.. " మా అమ్మ మాటలు, హగ్స్, కిస్సెస్ అన్ని మిస్ అవుతున్నాను. తను నాతో ఉన్నంతవరకు అన్నీ మ్యాజికల్ డేస్" అని విష్ణుప్రియ అంది. మేకప్ లేకుండా ఒక ఫోటో అప్లోడ్ చేయమని ఒకరు అడుగగా.. మేకప్ లేకుండా తీసిన తన ఫోటోని విష్ణుప్రియ అప్లోడ్ చేసింది. "మీ ఫేవరెట్ ఆంధ్రా ఫుడ్" అని ఒకరు అడుగగా.. "బీరకాయ పచ్చడి, ముద్దపప్పు ఆవకాయ, బెండకాయ ప్రై" అని విష్ణుప్రియ రిప్లై ఇచ్చింది. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరని ఒకరు అడుగగా.. అక్కినేని అఖిల్ ఫోటో అప్లోడ్ చేసి, ఎప్పటికీ అయ్యగారే నా ఫేవరెట్ క్రికెటర్ అని విష్ణుప్రియ అంది.  

బిగ్ బాస్ కంటే రెడ్ఎఫ్ఎమ్ అంటేనే ఇష్టమన్న ఆర్జే చైతు!

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తనకు సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' ని స్టార్ట్ చేసింది. క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్ లో ఆర్జే చైతు పార్టిసిపేట్ చేసాడు. దాంతో కాజల్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు చైతుని అడిగింది. నీకు రెడ్ ఎఫ్ఎమ్ ఇష్టమా? లేక బిగ్ బాస్ ఇష్టమా? అని కాజల్ అడుగగా.. నాకు ఇప్పటికీ ఎప్పటికీ రెడ్ ఎఫ్ఎమ్ అంటేనే ఇష్టమని చైతు రిప్లై ఇచ్చాడు. దాంతో కాజల్ షాక్ అయి ఎందుకని అడుగగా.. నాకు ఫస్ట్ నుండి పేరు తెచ్చింది రెడ్ ఎఫ్ఎమ్.‌ నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది రెడ్ఎఫ్ ద్వారానే అని సమాధానమిచ్చాడు చైతు. నీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న ఆర్జే ఎవరని కాజల్ అడుగగా.‌. "నాకు టఫ్ కాంపిటీషన్ అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ఎవరిది వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరితో నేను కంపేర్ చేసుకోను ఎందుకంటే నాకు నేనే పోటీ" అని చైతు సమాధానమిచ్చాడు.    

ఎవరు ద్వేషించినా నేను ప్రేమిస్తూనే ఉంటాను

సింగర్ శ్రీరామచంద్ర గురించి అందరికీ తెలుసు. మంచి పాటలతో అలరిస్తూ ఉంటాడు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి  క్రేజ్ సంపాదించుకున్నాడు. 2007 లో సింగర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.  దాదాపు 15 ఏళ్లుగా పాటలు పాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మూవీలో "గెలుపు తలుపులే" అంటూ  పాడిన పాటకు ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు.   ఇక ఎన్ని పాటలు పాడినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా మంచి హిప్ వచ్చింది. అలాంటి శ్రీరామచంద్ర ఈమధ్య ఫారెన్ వెళ్లి మంచి మంచి షోస్ , ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక శ్రీరామచంద్ర, రేవంత్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ ..ఐతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే శ్రీరామచంద్ర ఇప్పుడు తన స్టేటస్ లో ఫోటో పెట్టాడు. చేతికి క్యాన్ లా పెట్టుకుని విక్టరీ అంటూ రెండు వేళ్ళు  చూపిస్తూ ఉన్న ఫోటో అది .."ద్వేషించే వాళ్ళు ద్వేషించనీ..కానీ నేను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. తిరిగి మంచిగా వస్తాను" అని ఒక హార్ట్ ఎమోజితో ఒక టాగ్ లైన్ టైపు చేసి పెట్టాడు. కానీ తనకు ఏమయ్యిందో మాత్రం ఎక్కడ చెప్పలేదు. త్వరలో ఆహా వేదిక మీద ప్రసారం కాబోతున్న నేను సూపర్ విమెన్ షోకి హోస్ట్ గా కనిపించబోతున్నాడు. 2010 కి గాను ఇండియన్ ఐడియల్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలిచాడు శ్రీరామచంద్ర.  ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడి ఎన్నో వేదికల్లో టైటిల్ విజేతగా నిలిచాడు ఈ సింగర్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1  కి హోస్ట్ గా కూడా చేసాడు. మరి ఇంతకు ఏమయ్యిందో కానీ ఇలా కొంచెం డల్ గా కనిపించాడు.    

అమ్మకు డైపర్ వేసి క్యారేజ్ పెట్టి పంపేదాన్ని.. ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈవారం ఎంత ఎంటర్టైన్ చేసిందో చివరిలో అంతగా ఏడిపించేసింది.  ఆది సౌమ్యకి వాళ్ళ అమ్మతో ఉన్న పిక్ ని లామినేషన్ చేయించిగిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక అది చూసేసరికి ఒక్కసారిగా బరస్ట్ ఐపోయింది సౌమ్య..."ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. చిన్నప్పుడు మాకు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అందరి ఇళ్లల్లోంచి అన్నం, కూర, పాలు  తెచ్చి అమ్మ నాకు అన్నం పెట్టేది. చిన్నప్పటినుంచే నేను మా వీధిలో ట్యూషన్స్ చెప్పేదాన్ని.  నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుని చదువుకోలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ బుక్స్ మాత్రమే తెచ్చుకుని చదువుకునే దాన్ని. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను నేను పెద్దయ్యాక అమ్మను బాగా చూసుకోవాలి అని. ఇక నా ఎడ్యుకేషన్ ఐపోయింది..జాబ్ వస్తుంది అనుకునే టైంలో అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. తీసుకెళ్లి హాస్పిటల్ లో చూపిస్తే అమ్మకు బ్రెయిన్ కాన్సర్ అని చెప్పారు. ఎం చేయాలో అర్ధం కాలేదు. వాళ్ళను వీళ్ళను డబ్బులు భిక్షం ఎత్తుకున్నాను. వచ్చిన వాటితో అమ్మకు ట్రీట్మెంట్ చేశారు.   రానురాను మీ అమ్మ బ్రెయిన్ చిన్న పిల్లల్లా ఐపోతుంది ఎవరిని గుర్తుపట్టలేరని చెప్పారు. అలాంటి కండిషన్ లో అమ్మ నన్ను గుర్తుపట్టడం మానేసింది. అన్ని దగ్గరుండి అమ్మకు నేనే చూసుకున్నాను. మూడున్నరేళ్లు అమ్మను నేను ఇలా చూసుకున్నాను. రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించాను. స్నానం చేయించి, డైపర్ వేసి, బట్టలు వేసి, క్యారేజ్ రెడీ చేసి సెంటర్ కి పంపించేదాన్ని.  ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అమ్మ లేదు. నేను దేవుడికి రెండు దీపాలు పెడతాను. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని...మా అమ్మ నాకు పుట్టాలని కోరుకుంటున్న" అని చెప్పి ఏడ్చేసింది. ఇక సెట్ లో అందరూ కూడా సౌమ్య మాటలకు ఏడ్చేశారు. "నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు నీ చేయి వదలడు..మీ అమ్మ నీకు పుడుతుంది" అని ఇంద్రజ చెప్పారు.    

ఏ సర్టిఫికెట్ షోలా ఉంది...ఆది ముంబైలోని ఓల్డ్ బిల్డింగ్ లా ఉన్నాడు... వేస్ట్ ఫెల్లో

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో మరీ ఘోరంగా ఏ సర్టిఫికెట్ సినిమా చూసినట్టుగా ఉంది. ఆది పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ తో ఈ వారం ఈ షో నడిపించారు. ఇందులో ఆది పెళ్లికొడుకుగా జబర్దస్త్ యాంకర్ సౌమ్య శారద పెళ్లికూతురిగా చేశారు. ఇందులో వెళ్ళాను ఎంటర్టైన్ చేయడానికి ఒక సంగీత్ షో పెట్టారు. అందరూ బాగా చేశారు కానీ పండు-శాంతి స్వరూప్ మాత్రం మాములుగా చేయలేదు. శాంతిస్వరూప్ లేడీ గెటప్ వేసుకొచ్చి పండు బట్టలు చింపేసి ముద్దులు పెట్టేసి, ముద్దులు పెట్టేసుకుని పండు అంటే చాలా ఇష్టం అంటూ కామెంట్ చేసాడు శాంతి స్వరూప్. ఇక షో స్టార్టింగ్ లో పెళ్లి చూపులకు వచ్చిన సౌమ్య ఫామిలీ పెళ్ళికొడుకు ఆది అని తెలియక వేరే అబ్బాయి దగ్గరకు వెళ్లి నిలబడింది. దానికి సౌమ్య వాళ్ళ నాన్న వచ్చి ఆది పెళ్లి కొడుకు అని సౌమ్యకు  చెప్పేసరికి ఆది పక్కకు వచ్చి కింద నుంచి పైకి చూసి "మీరా అబ్బాయి.. ముంబైలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ లా ఉన్నారు" అనేసరికి ఆది షాకైపోయాడు.."ఇది నా ఓన్ డైలాగ్" అని సౌమ్య అనేసరికి "ఒకటేశావ్ ఇక నీకు ఉంది" అని వార్నింగ్ ఇచ్చేసాడు. తర్వాత ఆదిని బైక్ మీద ఎక్కించుకుని సౌమ్య స్టేజి మీద రౌండ్లు వేసింది. ఆదికి బైక్ రాదన్న విషయాన్ని ప్రూవ్ చేసి "వేస్ట్ ఫెల్లో డాన్స్ తెలీదు, కామెడీ తెలీదు, బైక్ రైడింగ్ కూడా తెలీదు" ఆదిని ఈ వారం ఎపిసోడ్ లో చెడుగుడు ఆడేసింది సౌమ్య . ఇలా వీళ్ళిద్దరూ ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ ఇద్దరూ కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు అలాగే డ్రీం లో రెయిన్ సాంగ్ కూడా పాడేసుకున్నారు.  

పెళ్ళై ఆరు నెలలు కాలేదు...భర్తను ద్వేషిస్తున్నానంటూ పోస్ట్ పెట్టిన నేహా చౌదరి

బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఎవరో ఒకరు ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. ఎన్ని సీజన్స్ గడిచినా కూడా ఆడియన్స్ మాత్రం వాళ్ళను అస్సలు మర్చిపోలేరు. అలాంటి వాళ్ళల్లో గీతూ రాయల్, బాలాదిత్య, నేహా అని చెప్పుకోవచ్చు.  అలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో నేహా పొడుగు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకుంది.  ఆమె ఒక యాంకర్, డ్యాన్సర్, యోగా ట్రైనర్,  జిమ్నాస్ట్‌తో పాటు అథ్లెట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఆమె వివాహం చేసుకుంది. ఇంజనీరింగ్ చేసే టైంలోనే తాను ఎంతో ఇష్టపడిన అనిల్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అనిల్ జాబ్ జర్మనీలో కావడంతో అతనితో కలిసి జర్మనీ వెళ్లిపోయింది.   ఆమె యూట్యూబ్ చూస్తే చాలు ఆమె అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. జర్మనీలోని విషయాలను, విశేషాలను కూడా అన్నీ వీడియోస్ చేస్తుంది. తన ప్రియమైన భర్తతో కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది. మరి ఇద్దరి మధ్య ఏమయ్యిందో కానీ రీసెంట్ గా ఒక పోస్ట్ ఐతే పెట్టింది నేహా చౌదరి.  "ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను ఎంతో ద్వేషిస్తున్నాను.  అందుకే అనుకుంటా దీన్ని పెళ్లి అని పిలుస్తారు. నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్నునీ కారు నడపనివ్వకపోయినా, నీ డెజర్ట్ ని నాతో షేర్ చేసుకోకపోయినా, .. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా నేను నిన్ను  ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు ఇక అలా చేయను అని నాకు సారి చెప్పి ..మాటిచ్చిన ఐదు నిమిషాలకే మాట తప్పుతావు. అయినప్పటికీ.. నిన్ను చాలా  ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమించే విధానానికి నేను పడిపోయా. నువ్వు ఎప్పటికీ నావాడివే’ అని ఇన్ స్టాలో తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది.  

అమ్మను చాలా మిస్సవుతున్నా... అయ్యగారే నంబర్ వన్

అల్లరి పిల్ల విష్ణుప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే బుల్లితెర మీద అల్లరి చేస్తూ గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూనే. ఈమె రీసెంట్ గా జెడి చక్రవర్తితో కలిసి "దయ"అనే మూవీ చేసింది. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ఆస్క్ మీ ఏ  క్వశ్చన్" అంటూ అందరిని పలకరించింది. చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు " మీ అమ్మ గురించి చెప్పు" అనేసరికి "నేను అమ్మ జోక్స్ ని, హగ్స్ ని, ముద్దుల్ని మిస్సవుతున్నా..ఫిజికల్లీ నేను అమ్మను చాలా మిస్ అవుతున్నా. కానీ ఉన్నన్నాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది" అని చెప్పింది. "ఇషా ఫౌండేషన్ మీద నీ అభిప్రాయం ఏమిటి" " ప్రతీ రోజూ కొత్తగా పుట్టడమే" అని అంది. "ఆంధ్రా ఫుడ్ లో నీకు ఇష్టమైనది ఏమిటి" "బీరకాయ పచ్చడి..ముద్దపప్పు ఆవకాయ్, బెండకాయ ఫ్రై" అని చెప్పింది. "మీ క్రష్ ఎవరు" " ప్రస్తుతానికి చాలా మంది ఉన్నారు" అని సిగ్గు పడే ఎమోజిస్ ని పోస్ట్ చేసింది. "మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు" "ఇంకెవరు ఎప్పటికీ అయ్యగారే నంబర్ వన్" అంటూ అక్కినేని అఖిల్ ఫోటో పెట్టింది. "ఇష్టమైన ఫేవరేట్ ప్లేస్ ఏది" "నచ్చిన వ్యక్తి దగ్గర ఉండడం ఫేవరేట్ ప్లేస్" అని చెప్పింది. ఇలా తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పి ఈరోజుకి ఇంతే మళ్ళీ కలుద్దాం అని బై బై చెప్పింది విష్ణు ప్రియా. ఇక విష్ణుప్రియ మానస్ తో కలిసి "జరీజరీ" అనే కవర్ సాంగ్ చేసింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే  ‘గంగులు’ అనే మరో సాంగ్ తో కూడా వీళ్ళు అలరించారు. విష్ణుప్రియ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని , రీల్స్ ని  షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

రణ్వీర్ సింగ్ లాంటి అబ్బాయి కావాలి...మాకు అబ్బాయిల్లో ఈ క్వాలిటీస్ కావాలి

ఈ వారం "ఆదివారం విత్ స్టార్ మా పరివారం"లో బుల్లితెర నటీ నటులు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసేసారు. ఇందులో కొంతమంది లేడీస్ కూడా వచ్చేసారు. ఇక అబ్బాయిలు కూడా వచ్చేసరికి లేడీస్ మీకు ఇక్కడున్న అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఒక్కొక్కళ్ళని అడిగింది శ్రీముఖి. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కోరికలను చెప్పేసారు.. ముందుగా హాసిని నువ్వు చెప్పు అనేసరికి ..తనకు అండర్ స్టాండింగ్ తో పాటు ప్రేమగా చూసుకోవాలని చెప్పింది. ఐతే  నీకు మా కృష్ణ చాలా బాగా సెట్ అవుతాడు. బాగా చూసుకుంటాడు అని చెప్పింది శ్రీముఖి. ఇక శ్వేతా చెప్పు అనేసరికి..తనకు హైట్ గా ఉన్న అబ్బాయి కావాలి అని, బాగా చూసుకోవాలి..అప్పుడప్పుడు తాను పిచ్చి పిచ్చిగా చేసినా కూడా అర్ధం చేసుకోవాలి అని చెప్పింది. ఓకే నీకు మహేష్ సెట్ అవుతాడు అని చెప్పేసింది. తర్వాత శ్రీసత్యని అడిగింది..చాలా మంచోడై ఉండాలి. తానూ తన పేరెంట్స్ ఎలా చూసుకుంటుందో ఆ అబ్బాయి అలాగే చూసుకోవాలి అని చెప్పింది. ఐతే నీకు మానస్ ఫిక్స్ అంది శ్రీముఖి. తర్వాత శోభాశెట్టిని అడిగింది...తనకు హైట్ గా ఉండాలని, లవ్ చేయాలి, కేరింగ్ గా ఉండాలి, కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలని చెప్పింది. ఐతే శోభాకు అర్జున్ కళ్యాణ్ ఫిక్స్ అని చెప్పేసింది. తర్వాత డెబీజానిని అడిగింది...హైట్ ఉండాలి, స్మైల్ బాగుండాలి, అర్ధం చేసుకోవాలి అని చెప్పింది. ఐతే ఆర్జే సూర్యనే నీకు ఫిక్స్ అని చెప్పింది శ్రీముఖి..ఇలా అమ్మాయిలకు అబ్బాయిలను ఫిక్స్ చేసేసింది. చివరికి అవినాష్ వచ్చి అందరినీ అడిగావు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు అని అడిగాడు. తనకు రణ్వీర్ సింగ్ లాంటి అబ్బాయి కావాలని, హైపర్ యాక్టీవ్ గా ఉండాలని చెప్పింది శ్రీముఖి.      

బి ది చేంజ్ అంటూ పిల్లలకు పాఠాలు చెప్పిన వితిక 

వరుణ్ సందేశ్ భార్య వితిక శేరు గురించి  సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లందరికీ తెలుసు. బిగ్ బాస్ బ్యూటీగా, ఒక యాక్టర్ గా మాత్రమే కాదు ఈమధ్య తన అదరగొట్టే ఫిట్ నెస్ వీడియోస్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకుంటోంది. కండలు తిరిగిన బాడీతో టోటల్ గా చాలా చేంజ్ అయ్యింది ఈ అమ్మడు. అలాంటి వితిక ఇప్పుడు టీచర్ లా మారిపోయింది. వితిక తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో చక్కగా చీర కట్టుకుని పిల్లలకు పాఠాలు కూడా చెప్పింది. క్లాస్ లోకి వితిక ఎంట్రీ ఇస్తూనే "నా పేరు ఏంటి చెప్పండి..అనేసరికి పిల్లలంతా ఆమె పేరు చెప్పారు. ఐతే  మీకు ముందే చెప్పారా  నేను వస్తున్నానని..అని అడిగింది. లేదు టీచర్ అని చెప్పారు పిల్లలు. ఐతే మీరంతా ఫుల్ ఎక్సయిట్ అవుతున్నారా అని అడిగేసరికి ఎస్ టీచర్ అన్నారు... ఎంత బాగా నవ్వుతున్నారో అని పిల్లలకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది వితికా.. తర్వాత క్లాస్ స్టార్ట్ చేసింది.  పొద్దున్నే లేవగానే మనం చేయాల్సిన కొన్ని పనులు ఏమిటి అంటే  ఐయామ్ ద బెస్ట్, ఐయామ్ స్ట్రాంగ్.. నేను ఏదైనా చేయగలను.. నేను ఏదైనా సాధించగలను ,  నన్ను నేను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా.. నా లైఫ్‌కి నేనే రాణిని...నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటా..అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను.  ఇలా చేస్తామని నాకు ప్రామిస్ చేయండి.." అని పిల్లలకు చెప్పాకా ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. " మీరు కూడా ఇలానే మీ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో  మార్పు తీసుకురావాలనుకుంటున్నారా.. ఈరోజు నేను ఇంగ్లీష్ క్లాస్ చెప్పడానికి మణికొండలోని గవర్నమెంట్ స్కూల్‌కి వచ్చాను.. మీరు కూడా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ గురించి పిల్లలకు పాఠాలు చెప్పొచ్చు.. దానికి సంబంధించిన అప్లికేషన్లు ఓపెన్ అయ్యాయి.. బీ ద ఛేంజ్.." అంటూ  అప్లికేషన్స్ దొరికే లింక్ అడ్రస్  కూడా చెప్పేసింది వితిక. ఈ వీడియో చూసిన తన ఫ్యాన్స్, నెటిజన్స్  వితికాను పొగిడేస్తున్నారు. వితిక అంటే ఫిట్ నెస్ తో అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఇప్పుడు బీ ది చేంజ్ అంటూ అందరినీ ఎంకరేజ్ చేస్తోంది. నెటిజన్స్ వితిక చేసిన పనికి ఫుల్ ఖుషీ ఐపోయి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.    

 జడ్జెస్ తో నటరాజ్ మాష్టర్ రచ్చ...ఉంటారా, ఉండరా అని సీరియస్ ఐన రాధ  

'నీతోనే డ్యాన్స్'.. అనే డాన్స్ షో ఇప్పుడిప్పుడే కొంచెం పికప్ అవుతోంది. ఈ వారం నుంచే ఎలిమినేషన్స్ రౌండ్ కూడా స్టార్ట్ అయ్యింది. అందులో మొదటిగా యాదమ్మ రాజు- స్టెల్లా ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు సైలెంట్ గా నటరాజ్ మాష్టర్ ఒక్కసారిగా వైలెంట్ గా ఇపోయారు. నటరాజ్ మాష్టర్ రాధ మీద ఫైర్ ఐన విషయాన్ని నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమోలో చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ లో ప్రాపర్టీ రౌండ్ థీమ్ తో రాబోతోంది. కంటెస్టెంట్స్ అంతా ప్రాపర్టీస్ వాడి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఐతే  ప్రోమో ఫైనల్ లో మాత్రం మాములుగా లేదు. నటరాజ్ మాష్టర్ -నీతూ జోడి చేసిన డ్యాన్స్ చూసి "ఇప్పటివరకు చూసిన ఈ మొత్తం సీజన్‌లో నాకు ఇది పూరెస్ట్ పెర్ఫామెన్స్‌లా అనిపించింది.." అని సదా అన్నారు. "టోటల్ బ్యాడ్.. ఐయామ్ సారీ.." అని రాధ కూడా జడ్జిమెంట్ ఇచ్చేసరికి  నటరాజ్ మాష్టర్ ఇక సీరియస్ ఇపోయారు. "నేను తప్పు చేస్తే హండ్రెడ్  పర్సంట్ తలవంచి సారీ అని చెప్పేస్తాను.. ఇక్కడ నా మిస్టేక్ కాదు ...వాళ్లది మిస్టేక్.. నేను ఏదో చేసేయాలి.. నా పైత్యమంతా  ఇక్కడ రుద్దాలని రాలేదు.. ఎంటర్‌టైన్‌మెంట్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్.." అంటూ మాట్లాడబోతుండగా రాధ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. "మీకో విషయం తెలుసా.. మీ అందరి కంటే.. మా ముగ్గురి కంటే చాలా మంచి టాలెంట్స్ ఉన్న వాళ్లు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు.. వాళ్లకు లేని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి.. మనం వచ్చాము అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం.. మీరు లక్కీ, మేము లక్కీ.." అంటూ కూల్ చేయడానికి ట్రై చేశారు. కానీ నటరాజ్ మాష్టర్  మాత్రం ఇంకా సీరియస్ గా  "నా తప్పు కాదు మేడమ్.. నేను పడను.." అని చెప్పేశారు. "ఓకే మీరు ఇక్కడ డ్యాన్స్ చేయడానికి వచ్చారా..అసలు మీరు ఇక్కడ ఉంటారా లేదా అది.." చెప్పండి అంటూ రాధ చిరునవ్వుతోనే అడిగేసరికి నటరాజ్ మాష్టర్ తల వంచుకుని నిలబడ్డారు. మరి ఇంతకు అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.      

ఏంజిల్ ఆసియా ఫ్రాంక్ చేయడంతో నూకరాజు గొడవ!

ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్య వీళ్ళిద్దరు కలిసి చేసిన "ఎంగేజ్ మెంట్ కోసం రెడీ అయ్యాం", " మా లవ్ మ్యాటర్ పైన క్లారిటీ", "బక్రీద్ స్పెషల్" వ్లాగ్స్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో వీళ్ళు తాజాగా మరొక వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. నూకరాజు కి తెలియకుండా అతనిపై ఏంజిల్ ఆసియా ఫ్రాంక్ చేసింది. అయితే కెమెరాని చూడకుండా నూకరాజు బయటికి ఎలా ఉంటాడో అలా కన్పించాడు. బయట ఒక అమ్మాయి ఎవరినైనా ఏమీ లేదని డబ్బులు కావలని అడిగితే లేదనకుండా ఇచ్చిన నూకరాజు మానవత్వాన్ని పలువురు పొగిడేస్తున్నారు. ఆసియా చేసింది ఫ్రాంక్ అయిన నూకరాజులోని మంచితనాన్ని బయటకు తెలియజేసిందంటూ నెటిజన్లు ఈ వీడియోకి కామెంట్లు చేస్తున్నారు.‌ కాగా ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.