మానస్ కన్నా తోప్ యాక్టర్ లేడని చెప్పిన అమర్ దీప్!

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5 ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగు వారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తనకు సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తను ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వ్లాగ్ చేయగా దానికి మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో 'క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్' ని స్టార్ట్ చేసింది. క్రేజీ టాక్స్ విత్ ఆర్జే కాజల్ లో అమర్ దీప్ చౌదరి పార్టిసిపేట్ చేసాడు. ఉయ్యాలా జంపాలా సీరియల్ తో టీవీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అమర్ దీప్.. సిరి సిరి మువ్వలు సీరియల్ తో హిట్ ని సొంతం చేసుకున్నాడు. "జానకి కలగనలేదు" సీరియల్ తో ఇప్పుడు సక్సెస్ అయ్యాడు.  ఈ సీరియల్ తోనే అమర్ దీప్ కి క్రేజ్ వచ్చింది . ఇన్ స్టాగ్రామ్ లో అమర్ దీప్ పేరు మీద ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. ఇలా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న నటులలో అమర్ దీప్ కూడా ఉన్నాడు. అయితే తాజాగా 'క్రేజీ టాక్స్ విత్ కాజల్' లో కాజల్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అమర్ దీప్ ని అడిగింది. తెలుగు హీరోలలో ఎవరు డాక్టర్ బాబు రోల్ కి సెట్ అవుతారని కాజల్ అడుగగా.. రామ్ పోతినేని అని  అమర్ దీప్ రిప్లై ఇచ్చాడు. మహేశ్ కాళిదాస్, మానస్ ఇద్దరిలో ఎవరు బెటర్ యాక్టర్ అని కాజల్ అడుగగా.. మానస్ అని సమాధానమిచ్చాడు అమర్ దీప్. విష్ణుప్రియ, అరియాన ఈ ఇద్దరిలో నువ్వు ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్ కే ఎవరు ఎత్తేస్తారని అడుగగా.. అరియాన అని అమర్ దీప్ చెప్పాడు. కాజల్, అమర్ దీప్ ఇద్దరు అలా కాసేపు సరదగా మాట్లాడుకున్నారు  

మా ఆయనకు ఈ వీడియో చూపించొద్దు అన్న రాధ

"నీతోనే డాన్స్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో ఇంతకు ముందు ఎపిసోడ్స్ కంటే కూడా కలర్ ఫుల్ గా కనిపించబోతోంది. ఇప్పటివరకు  ప్రాపర్టీ రౌండ్, డిఫరెంట్ డాన్స్ స్టైల్స్ ఐపోయాయి.. నెక్స్ట్ వీక్ రెట్రో రౌండ్ థీమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్టార్టింగ్ శ్రీముఖి తెల్లని హంసలా ఎంట్రీ ఇచ్చింది. ఇక నటరాజ్ మాష్టర్ సీనియర్ ఎన్టీఆర్ గెటప్ లో వచ్చారు. "ఈరోజు మీ మూడ్ ఆఫులో ఉన్నదా ఆన్ లో ఉన్నదా ?" అని అడిగేసరికి "చూచెదము" అని చెప్పారు. ఇక ఆట సందీప్- జ్యోతి జోడి "రావోయి చందమామ ..మా వింత గాధ వినుమా" అనే సాంగ్ కి డాన్స్ చేసేసరికి శివ్ మాత్రం తన సందీప్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో కొంచెం డాన్స్ తగ్గినట్లు అనిపించింది అనేసరికి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. తర్వాత నిఖిల్-కావ్య జోడి "అందం హిందోళం" సాంగ్ కి అద్దిరిపోయే డాన్స్ చేశారు.. రాధా ఫిదా ఐపోయి వెళ్లి వాళ్ళతో కలిసి డాన్స్ మొత్తం చేశారు. "నేను వేసిన ఈ డాన్స్ వీడియోని మా ఆయనకు చూపించొద్దు" అన్నారు రాధ. అమరదీప్-తేజు "16 ఏళ్ళ వయసు పడిపడి లేచే మనసు" సాంగ్ కి డాన్స్ చేసేసరికి సదా మాత్రం చాలా బాగుంది అని చెప్పారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక జ్యోతి ఎంట్రీ ఇచ్చి "ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే లిప్ సింక్ కూడా క్యాలిక్యూలేట్ అవుతుందని తెలుస్తోది అనేసరికి కొరియోగ్రాఫర్ గా నేను లిప్ సింక్ అదంతా చూడను అది అసిస్టెంట్ డైరెక్టర్ పని నేను పెర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తాను" అని తరుణ్ మాష్టర్ గట్టిగా చెప్పేసారు. పవన్-అంజలి జంట "నా కళ్ళు చెబుతున్నాయి" సాంగ్ కి డాన్స్ చేశారు. "ఈ సాంగ్ కి అంత అక్రోబెటిక్స్ అవసరం లేదు" అన్నారు తరుణ్ మాష్టర్. ఫైనల్ గా నటరాజ్  మాష్టర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో రెండు మూడు సార్లు కృష్ణ గారి స్టైల్ వచ్చింది అని అంజలి చెప్పేసరికి..రా చూపించు ...చూపిస్తే నేను ఇలా నడుచుకుంటూ వెళ్లపోతాను అన్నారు మాష్టర్...దానికి అంజలి- పవన్ లేచి స్టేజి మీద నుంచి వెళ్లపోయారు. ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని చూసి నటరాజ్ మాష్టర్ వైఫ్ కూడా ఏడ్చేసింది. ఇక నెక్స్ట్ వీక్ నటరాజ్ మాష్టర్ వెర్సెస్ పవన్-అంజలి జోడి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది అని తెలుస్తోంది..  

మై విలేజ్ షో అనిల్ జీలాతో హిడింబ టీమ్ ముచ్చట్లు! 

   ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హావా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన  'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు. యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీలా ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి. తాజాగా అనిల్ జీలా కల్లివెల్లి అనే యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. అశ్విన్ నటించిన మూవీ 'హిడింబ' ప్రమోషన్స్ లో భాగంగా.. మూవీ టీం ఇందులో కొన్ని ముచ్చట్లు పంచుకున్నారు. మొదటగా అశ్విన్ పొలంలో నాటు వేస్తున్న గంగవ్వతో స్టార్ట్ చేశాడు. ఏం అవ్వా అన్నం పెడతా అన్నావ్. నాటు వేస్తున్నావా" అని గంగవ్వని అశ్విన్ ప్రేమతో పలకరించాడు. ఆ తర్వాత నాగలి దున్నతున్న అనిల్ జీల దగ్గరికి చిత్ర యూనిట్ వెళ్లి మాటకలిపి సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఇలా అనిల్ జీల, గంగవ్వలతో కల్లివెల్లి ఛానల్ లో సెలబ్రిటీస్ వచ్చి ముచ్చటిచడం కొత్తేమీ కాదు అప్పట్లో రానాతో కళ్ళు దావత్ అంటూ చేసిన ఆ వీడియో వైరల్ కాగా అదే తరహాలో హిడింబ  టీం చేసిన వీడియో వైరల్ గా మారింది. 

అన్నపూర్ణని హాస్పిటల్ కి తీసుకెళ్ళిన కనకం, కృష్ణమూర్తి.. కావ్య వేసిన డిజైన్స్ హిట్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -150 లో.. కావ్య డిజైన్స్ వేసి శృతి కి పంపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సుభాష్, ప్రకాష్ ఇద్దరు ఆఫీస్ ఫైల్స్ చూస్తారు. రాజ్ గదిలో ఫైల్స్ ఉన్నాయి అవి తీసుకొని రా అని కావ్యతో సుభాష్ అంటాడు. సరే అని కావ్య గదిలోకి వెళ్తుంది. స్నానం చేస్తున్న రాజ్ ని కావ్య ఫైల్ ఎక్కడ అని అడుగుతుంది. టవల్ వాటర్ లో పడిపోయింది. ఒక టవల్ ఇవ్వమని రాజ్ అంటాడు. టవల్ తీసుకొని రాజ్ బాత్రూమ్ డోర్ వేసేటప్పుడు కావ్య చీర కొంగు ఆ డోర్ లో ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత రాజ్ కావాలనే కొద్దిసేపు కావ్యని ఏడిపిస్తాడు.  కావ్య ఇంకా ఫైల్ తీసుకురావడం లేదని ప్రకాష్ వస్తాడు. కావ్య డోర్ తియ్యమని రాజ్ ని రిక్వెస్ట్ చేస్తుంది అయిన డోర్ తియ్యకపోయేసరికి ప్రకాష్ వచ్చేసరికి డోర్ దగ్గర నిల్చొని ఉంటుంది కావ్య. "ఏంటి కావ్య ఫైల్ తీసుకొని రా అంటే తీసుకురాలేదు" అని ప్రకాష్ అనగానే.. కావ్య కవర్ చేస్తూ అక్కడ ఉంది తీసుకొని వెళ్ళండని  చెప్తుంది. ప్రకాష్  ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. మరొకవైపు అన్నపూర్ణ బాగా దగ్గుతుంటే కనకం, కృష్ణ మూర్తి లు కంగారుపడతారు. అక్క మనం హాస్పిటల్ కి వెళదామని అన్నపూర్ణతో కనకం అంటుంది. "ఇప్పటికే మీరు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు‌‌.. వద్దు" అని అన్నపూర్ణ అంటుంది. నువ్వేం మాట్లాడకంటూ కనకం, కృష్ణమూర్తి, అప్పు అందరూ కలిసి అన్నపూర్ణని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. మరొక వైపు శృతికి కావ్య ఫోన్ చేసి మీ సర్ కి డిజైన్స్ చూపించావా అని అడుగుతుంది. ఇంక సర్ రాలేదని శృతి చెప్తుంది. అంతలోనే రాజ్ వచ్చి డిజైన్స్ రెడీ అయ్యాయా అని అడుగుతాడు. రెడీ సర్ అని కావ్య వేసిన డిజైన్స్ చూపిస్తుంది శృతి. చాలా బాగున్నాయని రాజ్ అంటాడు. అదంతా కావ్య ఫోన్లో వింటుంది. సర్ ఇది నేను వెయ్యలేదు మీరు ఒకరిని హైర్ చేసుకోమ్మన్నారు కదా అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ని హైర్ చేసుకున్నానని శృతి చెప్తుంది. "సరే ఎవరైతే ఏంటి.. మనకి కావలిసింది డిజైన్స్" అని రాజ్ చెప్పేసి వెళ్తాడు. అప్పటికే ఫోన్ కాల్ లో ఉన్న కావ్య.. శృతితో మాట్లాడుతుంది. మరొకవైపు డాక్టర్ అన్ని టెస్ట్ చేపించాలని చెప్పగానే డబ్బులు ఎంత అవుతాయని కృష్ణమూర్తి డాక్టర్ ని  అడుగుతాడు. పదివేల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్తాడు. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు డబ్బు సర్దుబాటు చేసి అన్నపూర్ణ కి టెస్ట్ లు చేపించాలని అనుకుంటారు. మరొక వైపు మోడలింగ్ షూట్ కోసం స్లిమ్ గా కన్పించాలని రాహుల్ కి స్వప్న ఒక లిస్ట్ రాసి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషిని కాపాడుకున్నామని చెప్పిన ఏంజిల్.. షాక్ లో వసుధార, జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -817 లో.. మహేంద్రని రిషి డాడ్ అని పిలవడంతో ఏంజిల్ విని ఆశ్చర్యపోతుంది. డాడ్ అని పిలిచావ్ కదా అని రిషిని అడుగుతుంది. లేదని రిషి చెప్తాడు. అక్కడే ఉన్న వసుధార, జగతి, మహేంద్రలను ఏంజిల్ అడుగుతుంది. వాళ్ళు కూడా అనలేదని చెప్పగానే నాకు ఏమైనా చెవులు వినిపిస్తలేవా అని ఏంజిల్ అంటుంది. అప్పుడే విశ్వనాథ్ వస్తాడు. రిషి పిలిచిన విషయం విశ్వనాథ్ కి ఏంజెల్ చెప్తుంది. డాడ్ అని పిలిస్తే తప్పేముందని విశ్వనాథ్ అంటాడు. ఆ తర్వాత జగతిని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది వసుధార. వసుధార నన్ను క్షమించు అని జగతి అంటుంది. అలా అనకండి. మీరు అడిగారు నేను చేశాను. అందుకే నా జీవితం ఇప్పుడు ఇలా ఉందని వసుధార  కోప్పడుతుంది. నేను ఆ విషయంలో తప్పు చేశాను. నేను అప్పుడు రిషిని కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించానని జగతి అంటుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు అనుకుంటే లాభం లేదని వసుధార అంటుంది. మీరు అతిదులుగా వచ్చారు.. ఒకరికొకరు తెలియనట్లే ఉందామని వసుధార అంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. ఇలా అందరు ఒక దగ్గర చేరి భోజనం చేయడం హ్యాపీగా ఉందని విశ్వనాథ్ అంటాడు. రిషి ఆ కర్రీ వేసుకో.. నీకు ఇష్టం కదా అని మహేంద్ర అంటాడు. రిషికి ఆ కర్రీ ఇష్టమని మీకెలా తెలుసని ఏంజిల్ అడుగుతుంది. వాళ్లకి ముందే పరిచయం ఉంది కదా చాలాసార్లు కలిసి భోజనం చేసి ఉండొచ్చు కదా అని విశ్వనాథ్ అంటాడు. మిమ్మల్ని చూస్తుంటే అందరూ ఒకే కుటుంబం లాగా అనిపిస్తున్నారని ఏంజిల్ అనగానే.. అందరూ షాక్ అవుతారు. సర్ మీరు మీ ఇంట్లో అందరూ కలిసే భోజనం చేస్తారా అని ఏంజిల్ అడుగుతుంది. అవును అందరం కలిసి వెన్నెలని చూస్తూ నేలపై కూర్చొని భోజనం చేస్తామని మహేంద్ర అంటాడు. రిషి అలా అందరు కలిసి భోజనం చేసిన దానిని గుర్తు చేసుకుంటాడు. సరే రేపు కూడా మనం అలాగే వెన్నెలని చూస్తూ భోజనం చేద్దామని ఏంజిల్ అంటుంది. సరే అని విశ్వనాథ్ అంటాడు. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. మీ కాలేజీ అంత పెద్ద స్థాయికి రావడానికి కారణం ఏంటని విశ్వనాథ్ మహేంద్రని అడుగుతాడు. మా ఎండి సర్ వళ్లే అదంతా అని మహేంద్ర చెప్తాడు. కాసేపటికి అందరూ వెళ్ళిపోయాక వసుధార, ఏంజెల్, జగతి కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. రిషి తనకి ఎప్పటి నుండి పరిచయమని ఏంజిల్ జగతితో చెప్తుంది.  రిషి ని ఎవరో కత్తితో పొడిచారు. హాస్పిటల్ లో ఉంటే విశ్వం, నేను వెళ్లి రిషిని  కాపాడుకున్నామని ఏంజిల్ అనగానే జగతి, వసుధారలు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

భవానిలాగా రెడీ అయిన కృష్ణ.. తనని ఇంప్రెస్ చేసిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -211 లో..  భవాని దగ్గరికి కృష్ణ వెళ్ళి మురారిని పోలీస్ జాబ్ మానేయమన్నామని చెప్పగా.. భవాని వద్దని పోలీస్ డ్యూటీ ఎంత గొప్పదో వివరిస్తుంది. అయితే మురారి తన గదిలో ఉండి భవానితో కృష్ణ ఏం చెప్తుందో, భవాని తనని ఏం అంటుందోనని టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు మురారి దగ్గరికి వచ్చిన కృష్ణ.. సమాజానికి పోలీస్ ఎంత ముఖ్యమో భవాని అత్తయ్య చెప్పిందని, తనపై ఇంకా గౌరవం పెరిగిందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మధు, అలేఖ్యలు తమ గదిలో కాసేపు సరదగా మాట్లాడుకుంటారు. అయితే పూజగదిలోకి ముకుంద వెళ్ళి.. తన ప్రేమ నెరవేరాలని వేడుకుంటుండగా రేవతి చూస్తుంది. ముకుంద వేడుకొని పూజ గది నుండి వెళ్తుండగా తనని ఆపిన ముకుంద.. నీ కాపురం బాగుండాలని కోరుకో, నీ వల్ల వేరే వాళ్ళు బాధపడేలా, విడిపోవాలని కోరుకోకని ముకుందతో చెప్తుంది. "నా ప్రేమలో న్యాయం ఉంది. నా ప్రేమ గొప్పది. నా ప్రేమ త్యాగాన్ని కోరుకోవట్లేదు. ఆ ప్రేమని దక్కించుకోవాలని కోరుకుంటుంది" అని ముకుంద అంటుంది. ఆ తర్వాత ముకుంద వెళ్ళిపోతుంది. మరొకవైపు భవానిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని కృష్ణ కొత్త ప్లాన్ చేస్తుంది. అది చూసిన మురారి.. మళ్ళీ పెద్దమ్మ తిడుతుంది కృష్ణ, వద్దని మురారి అంటాడు. కృష్ణ వినకుండా భవానిలాగా చీరకట్టుకొని రెడీ అవుతుంది. అలా రెడీ అయి మేడ మీద నుండి వస్తుంది. భవాని వెనుకాలే కృష్ణ నిల్చొని అచ్చం భవానిలాగే నటిస్తుంది. అలా‌ ఇద్దరు నడుచుకుంటూ మెట్ల మీద నుండి వస్తుంటే.. డైనింగ్ టేబుల్ మీద ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. వాళ్ళంతా అలా ఆశ్చర్యంగా చూడటం గమనించిన భవాని.. వీళ్ళేంటి అలా చూస్తున్నారు.. ఏమైందని తనని తాను సరిచూసుకుంటుంది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. "అచ్చం పెద్దమ్మ లాగా భళే ఉన్నావ్ కృష్ణ" అని మధు అనగానే .. కృష్ణని భవాని చూస్తుంది. ఈ తింగరిపిల్లేంటి నాలాగే రెడీ అయింది. ఏ మధు కుదురుగా ఉండలేవా అనేసరికి భవానికి నవ్వొస్తుంది. కానీ అందరి ముందు తక్కువ అవుతానని అనుకొని నవ్వు ఆపుకుంటుంది భవాని. ఆ తర్వాత రేవతి చూసి.. వేషాలు చాలు కానీ కూర్చొని తిను అంటుంది. ఏంటి రేవతి చిన్న, పెద్ద తేడాలేదా అని కృష్ణ అంటుంది. ఈ పిల్లేంటి నాలాగే మాట్లాడుతుందని భవాని తనలో తాను అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమ్మ బర్త్ డే కి రెడీ అయిన హరిత జాకీ!

హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. అగస్ట్ 14, 2001లో హరిత జాకీని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి. హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. తన కొత్త సీరియల్ కోసం తీసుకున్న శారీస్ అని ఒక‌ వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కోసం తీసుకున్మ బంగారం అంటూ ఒక వ్లాగ్, షూటింగ్ నుండి వచ్చాక ఇది నా పరిస్థితి అంటూ మరొక వ్లాగ్ చేయగా అన్నింటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 'పద్మావతి కళ్యాణం' సీరియల్ లో చేస్తున్న హరిత జాకీ.. అక్కడ సెట్ లో అందరు కలిసి దావత్ చేసుకున్నదంతా ఒక వ్లాగ్ చేయగా అది వైరల్ అయింది. ఆ తర్వాత బోనాల సాంగ్ మేకింగ్, అష్ట లక్ష్ములతో ఆషాడం గోరింటాకు పండగ వంటి వ్లాగ్స్ చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది హరిత జాకీ. అయితే తాజాగా అమ్మ బర్త్ డేకి పిల్లలతో కలిసి రెడీ అయ్యాను ఇలా' అనే టైటిల్ తో ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది హరిత జాకీ. వాళ్ళ అమ్మ బర్త్  చాలా స్పెషల్ అని, వాళ్ళ పిల్లలతో పాటు తను కూడా రెడీ అయిందని వీడియోలో చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు ఓ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.  

రైట్ పార్ట్నర్ దొరక్కపోతే ఆ పెళ్ళి అంతే!

  స్టార్ మాలో ప్రసారమవుతున్న "నీతోనే డాన్స్" షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. శనివారం ఎపిసోడ్ ఈ వారం కొంచెం కారంగా ఇంకొంచెం గారంగా సాగింది. ఆదివారం ఎపిసోడ్ మాత్రం ఫుల్ మస్తీగా మంచి జోష్ తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ చేసింది. ఇందులో సాగర్ - దీప జోడి చున్నీని ప్రాపర్టీగా తీసుకుని మంచి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి టోటల్ స్టేజి ఊగిపోయింది. మిగతా జోడి కంటెస్టెంట్స్ ఫుల్ మార్క్స్ ఇచ్చేసారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక శ్రీముఖి సాగర్-దీప మధ్య ఎంత కంపాటబిలిటీ ఉంది అనే విషయం తెలుసుకోవడానికి ఒక టాస్క్ ఇచ్చింది. "మీకు పిల్లలు పుడితే ఫస్ట్ అమ్మాయి కావాలా అబ్బాయా" అని అడిగింది దానికి సాగర్ "అబ్బాయి" అని రాసాడు..దీప "ట్విన్ గర్ల్స్, ట్విన్ బాయ్స్" కావాలని రాసింది. దానికి శ్రీముఖి సాగర్ మనిషి అనుకుంటున్నావా మెషిన్ అనుకుంటున్నావా అని దీపని కామెడీగా అడిగింది. "ఒక అమ్మాయిని వెటర్నరీ డాక్టర్ ని, మరో అమ్మాయిని హీరోయిన్ ని చేస్తారు, అలాగే ట్విన్ బాయ్స్ లో ఒకరిని ఆర్మీకి పంపిస్తాను, ఇంకొకరిని హీరోని చేస్తాను" అని చెప్పింది దీప. "ఎంత స్పాన్ ఆఫ్ లైఫ్ లో మీ బేబీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు" అని అడిగింది శ్రీముఖి "త్రి టు ఫోర్ ఇయర్స్ అని దీపా రాస్తే దీపు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు" అని సాగర్ రాసాడు. "రైట్ పార్ట్నర్ దొరక్కపోతే ఆ పెళ్లి ఒక అబద్దం ఐపోతుంది..కానీ ఒక్కసారి నేను సాగర్ ని చూసినప్పుడు అయ్యో నాకు ఇలాంటి అబ్బాయి దొరికితే బాగుండు" అనిపించింది అంటూ సదా చెప్పి తన చేత్తో హార్ట్ సింబల్ చూపించింది. ఇక తరుణ్ మాష్టర్ సాగర్ నేను నిన్ను సదా గారి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటూ ఆటపట్టించారు. దానికి సదా "నో నా మనసులో చాలా భావాలను దాచేసుకుంటున్న ఎందుకంటే సాగర్ ఆల్రెడీ కమిటెడ్ , ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి" అని చెప్పింది సదా.  

నా ఫోకసే వేరంటున్న అనసూయ!

అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ..‌ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. రంగమార్తాండ సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. అంతే కాకుండ తాజాగా విడుదల అయినా విమానం సినిమా ద్వారా తనలోని పూర్తి స్థాయి నటి బయటకు వచ్చిందని చెప్పాలి. విమానం సినిమా అనసూయకి మంచి గుర్తిoపు తెచ్చింది. అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌. ఆ గొడవ సర్దుమణిగిందనేలోపే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటోంది అనసూయ. మాములుగా వీకెండ్ ప్లాన్స్ అంటూ శుక్రవారం నుండే ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేడ్స్ ని షేర్ చేసే అనసూయ.. ఇప్పుడు వీక్ స్టార్టింగ్ లోనే  మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటో షూట్ ఫోటోలని అప్లోడ్ చేసింది. ఒక్కో ఫోటోలో ఒక్కో స్టిల్ తో బోల్డ్ గా కనిపిస్తుంది. "నేను ఎవరిని ఇంప్రెస్ చేయను. నేను అప్డేట్ అవుతుంటాను. నా ఫోకసే వేరు" అంటూ ఈ పోస్ట్ కి క్యాప్షన్ కూడా పెట్టేసింది అనసూయ. కాగా ఈ ఫోటోలు చూసిన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనసూయ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది.  

అసలైన ఫామిలీస్ మధ్య సిసలైన ఆట..ఫామిలీ నంబర్ 1

  జీ తెలుగులో ఎన్నో షోస్ కొత్త కొత్తగా వస్తూనే ఉన్నాయి. డాన్స్ షోస్ చూసాం, సింగింగ్ షోస్ చూసాం...అలాగే గేమ్ షోస్, రియాలిటీ షోస్, బిగ్ బాస్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో. ఈమధ్య కాలంలో బుల్లితెర మీద అలాంటి షోస్ ఎన్నో వస్తున్నాయి పూర్తిచేసుకుని వెళ్లిపోతున్నాయి కూడా. అంతేకాదు ఫామిలీలు ఫామిలీలు వచ్చి షోస్ లో పార్టిసిపేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు బయటి నుంచి ప్రత్యేకంగా ఎవరినీ పిలవడం లేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ లో  ఉన్న వాళ్ళతోనే షోస్ నడిచిపోతున్నాయి. జబర్దస్త్ లో కూడా మూడు తరాల వాళ్ళు నటిస్తున్న వాళ్ళను మనం చూస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే జీ తెలుగు ఒక సరి కొత్త షోతో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ఒక ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేసింది. ఆ షో పేరు "ఫామిలీ నెంబర్ 1 "...ఇందులో ధనరాజ్ అండ్ ఫామిలీతో ఫస్ట్ ఎపిసోడ్ రాబోతోంది. "కుటుంబం అంటే అమ్మా , నాన్న, భార్య, పిల్లలు..కానీ నాకు భార్య పిల్లలే అమ్మానాన్న అయ్యారు" అని ధనరాజ్ డైలాగ్ చెప్పాక వాళ్ళ వైఫ్ "ఎఫెక్షనెట్ ఫామిలీ" అంటూ ఒక బోర్డు పట్టుకుని వచ్చారు. "అసలైన అనుబంధాలతో అల్లుకున్న ఈ ఫామిలీస్ మధ్య  సిసలైన ఆట..ఫామిలీ నంబర్ 1 " అని చెప్పడంతో ఈ ప్రోమో ముగిసింది. ఐతే ఈ షో రియల్ లైఫ్ ఫామిలీ మెంబర్స్ మధ్యన జరగబోయే ఒక గేమ్ షో అనిపిస్తోంది. ఐతే ఎలాంటి  గేమ్స్ ఉండబోతున్నాయి, ఈ షోకి వచ్చే ఫామిలీస్ ఎవరెవరు అనే విషయాలను ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. ఏ ఛానల్ లో ఐనా ఒక షో వచ్చిందంటే దానికి రిలేటెడ్ గా మిగతా చానెల్స్ లో కూడా అలాంటి షోస్ స్టార్ట్ ఐపోతాయి. మరి ఈ ఫామిలీ షో ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి. ఇక ఈ షోకి హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయం మీద నెటిజన్స్ రవి కావాలని, ప్రదీప్ షో చేయాలనీ మెసేజెస్ పెడుతున్నారు. మరి ఇంతకు రెగ్యులర్ గా చూసే యాంకర్స్ ఉంటారా కొత్త వాళ్ళను తీసుకొస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఐతే ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసిన ఈ ప్రోమో ద్వారా సూపర్ క్వీన్ షో ఫైనల్స్ కి వచ్చేసింది కాబట్టి త్వరలో ఈ షోని స్టార్ట్ చేసేస్తారు అంటూ  కామెంట్స్ చేస్తున్నారు. "కొత్త షో, కొత్త కాన్సెప్ట్ అని కొంత మంది అభిప్రాయపడుతుంటే ఇంకొందరు మాత్రం ..పాత చింతకాయ పచ్చడిలా ఉంటున్నాయి జీ షోస్" అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కొత్త షోని ఎలా ప్లాన్ చేశారో ఎంత ఇంటరెస్టింగ్ గా ఉంటుందో చూడాలి.

ట్రెండింగ్ లో ఇంద్రజ చేసిన బోనాల పాట!

ఇంద్రజ.. ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇంద్రజ తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఇంద్రజ చాలా మూవీస్ లో సపోర్ట్ రోల్ కూడా చేసి ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ కామెడీ షో అయిన జబర్దస్త్ కి జడ్జ్ గా చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది.  శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో 'దసరా' మూవీలోని వెన్నెల చేసిన డ్యాన్స్ ని రిక్రియేట్ చేసినట్టుగా చెలరేగి డ్యాన్స్ చేసిన ఇంద్రజ.. మోస్ట్ వైరల్ వీడీయోల లిస్ట్ లో చేరింది. అంతేకాదు జబర్దస్త్ షోలో ఈ మధ్య ఎంట్రీ పాటకు డ్యాన్స్ కూడా చేస్తోంది. హోమ్లీ గా ఉంటూనే తనలో మరో కోణం ఉందంటూ మాస్ డ్యాన్స్ చేసి‌ నిరూపించిన ఇంద్రజ.. బయట రెగ్యులర్ గా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటుంది. అయితే కొంతకాలం క్రితం హైదరాబాద్ లోని ఒక టెంపుల్ కి వెళ్ళిన ఇంద్రజ.. అందరితో కలిసిపోయి ఏ సెక్యూరిటీ లేకుండా చాలా సాధారణ వ్యక్తిగా తిరుగుతూ వీడీయో చేసింది. అది తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా వైరల్  అయింది. జబర్దస్త్ లో తన జడ్డ్ మెంట్ తో టీమ్ లీడర్స్ తో పాటు కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేస్తూ అందరికి ఒక అమ్మలాగా ఉంటూ వస్తోన్న ఇంద్రజ.. బయట కూడా అలానే ఉంటుందని అందరు చెప్పుకుంటారు. ఇంద్రజ మొదటి సారిగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో చేసింది. అదే బోనాల పాట. ఈ పాటకు ఇంద్రజ డాన్స్.. మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్  ప్రేక్షకులను మెప్పించింది. ఇంద్రజ, సీరియల్ నటి శ్రీవాణి భర్త విక్రమాదిత్య ఈ సాంగ్ లో నటించగా.. ఈ పాట విడుదలైన కొద్దీ రోజుల్లోనే  మిలియన్ వ్యూస్ వచ్చాయి‌. కాగా ఈ విషయాన్ని విక్రమాదిత్య తన ఇన్ స్టాగ్రామ్ లో  షేర్ చేసాడు. ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో యూట్యూబ్ లోని ఇంద్రజ బోనాల సాంగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది  

ఆంటీ అనడం క్రైమ్ అంటున్న లాస్య ..జైల్లో పెట్టాలి అన్న నెటిజన్

"ఆంటీ" అనే పదం సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు ఫుల్ వైరల్ అయ్యింది. అనసూయను ఆంటీ అన్నందుకు నెటిజన్స్ కి ఆమెకు మధ్య జరిగినల్ ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ ఆంటీ అనే పదం అప్పుడప్పుడు మిగతా షోస్ లో పొరపాటున అనడం నాలుక్కరుచుకోవడం చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఐతే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ చేసిన రీల్స్ మాత్రమే కాకుండా మిగతా సాధారణ ప్రజలు చేసే షార్ట్స్, రీల్స్ ని కూడా కొంత మంది సెలెబ్రిటీస్ చేస్తూ ఉంటారు. అలా సోషల్ మీడియాలో రీసెంట్ గా శ్రీదేవి అనే ఒక అమ్మాయి "ఆంటీ" అనే కాన్సెప్ట్ తో ఒక రీల్ చేసింది. ఆ రీల్ ఫుల్ వైరల్ అయ్యింది. దాన్ని ఇప్పుడు లాస్య మంజునాథ్ కూడా చేశారు. "నన్ను ఒకళ్ళు మిస్ ఇండియాలా ఉన్నావు..బ్యూటిఫుల్ గర్ల్ అని పిలిచారు. చూసారా వినడానికి చెవులకు ఎంత బాగుందో..అలా పిలవచ్చు కదా అందరూని..అలా పిలవడం మానేసి ఆంటీ..ఆంటీ అని పిలుస్తారు" అని చేసింది. ఈ వీడియోని లాస్య కూడా చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "ఆంటీ అనడం క్రైమ్ కదా..మీరేం అంటారు" అని ఒక టాగ్ లైన్ పెట్టింది. ఇక నెటిజన్స్ కూడా కామెంట్స్ పెట్టారు. "పెళ్ళైన వాళ్లు ఆంటీనే కదా అని అంటే ఆంటీ అన్నవాళ్లను జైల్లో పెట్టాలి" అని ఇంకొకరు కామెంట్స్ పెట్టారు.  బుల్లితెర మీద  అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న యాంకర్స్ లో  లాస్య ఒకరు.  అమాయకత్వంతో,  చిలిపి అల్లరితో అందరి దృష్టిని ఆకర్షించింది.  చీమ, ఏనుగు జోకులతో ఫుల్ ఫేమస్ అయ్యింది. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని  ఫ్యామిలీకే ఎక్కువ టైం కేటాయిస్తోంది. యూట్యూబులో లాస్య టాక్స్ పేరుతో ఇంటరెస్టింగ్  వీడియోలు షేర్ చేస్తూ ఫాన్స్ ని పలకరిస్తూ ఉంటుంది..    

బచ్చాగాడు అన్న సదా....హూ ఈజ్ మై పార్టనర్ అంటూ వెతుక్కున్న జోడీస్

నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ లో "దుమ్ము లేపు" టీమ్ అద్దిరిపోయే వెరైటీ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఇందులో మొదటిగా శివ్- ప్రియాంక జోడి సైకిల్ టైర్ తో చేసిన డాన్స్ కి జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. వీళ్ళు స్టేజి మొత్తాన్ని యూజ్ చేసుకుని చేశారు. మిగతా జోడి కంటెస్టెంట్స్ అంతా తక్కువ మార్క్స్ ఇచ్చారు. కానీ జడ్జెస్ మాత్రం ఆ పెర్ఫార్మెన్స్ కి ఖుషీ ఇపోయారు. "ఇది పర్ఫెక్ట్ ప్రాపర్టీ రౌండ్" అని రాధ చెప్పారు. ఇక  సదా ఐతే "బచ్చాగాడు" అని శివ్ ని  కామెంట్ చేసింది. ఐతే ఈ కామెంట్ ఎందుకు చేసింది అంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఆట సందీప్-జ్యోతి డాన్స్ మీద శివ్ మార్క్స్ ఇచ్చేటప్పుడు "శివ్ ఏది మాట్లాడినా మా అబ్బాయి లేఖను మాట్లాడినట్టు ఉంటుంది" అని చిన్నపిల్లాడితో పోల్చేసరికి శ్రీముఖి "అంటే బచ్చాగాడు" అంటున్నావా అని సందీప్ ని అంది. ఆ కామెంట్ ని ఈ రోజు సదా రిపీట్ చేశారు. "నేను సరదాగా అన్నాను. సీరియస్ గా తీసుకోకండి" అన్నారు సదా..ఇద్దరి డాన్స్ చాలా బాగా చేశారు అని కామెంట్ చేశారు. ఇక ఈ షో స్టార్టింగ్ లో "హూ ఈజ్ మై పార్టనర్" ఫ్లెక్సీని ఈ షో స్టేజి మీద పెట్టి దాని వెనక వాళ్ళ వాళ్ళ పార్టనర్స్ ని కాళ్ళు మాత్రమే బయటకు కనిపించేలా కూర్చోబెట్టి ఎవరి పార్టనర్ ఎవరు అనే టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్ ని ఈ జోడీస్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాయి. "శివ్-ప్రియాంక క్యూటీ పై లా ఉన్నారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే స్కూల్ కి కిడ్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినట్టు అనిపించింది" అన్నారు సదా. శివ్ నీ పార్టనర్ ని పొగడాలి అని శ్రీముఖి అడిగేసరికి "టైర్స్ కి ఎండ్ అనేది ఉండదు. అలానే మా రిలేషన్ కి ఎండ్ లేదు" అని చెప్పారు ఇద్దరు. ఇక ఈ జంటకు ఫైనల్ గా మిగతా మూడు జోడి కంటెస్టెంట్స్ ఇచ్చిన మార్క్స్ 23 ..    

బలగం పొందిన విశ్వ విజయ శతకం!

'బలగం' సినిమా ప్రతి కుటుంబంలోని ప్రతీ మనిషి లోని ఎమోషన్ ని బయటకు తీసిన సినిమా.. కుటుంబ బంధాలకు పెద్ద పీటవేస్తూ అద్భుతమైన కథతో వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన బలగం మూవీ ఒక సంచలనం సృష్టించింది. ఈ మూవీ  ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రతి పల్లెలో ఈ  'బలగం' మారు మ్రోగుతోంది. మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడంతో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వేణు. ఇప్పటికే ఈ మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది. వేణు మొదటగా తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో స్టార్ చేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో లో వేణు వండర్స్ టీమ్ కి లీడర్ గా చేసి మంచి ఫేమ్ సంపాదించాడు. కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లోనే కొనసాగిన వేణు.. అనుకోని కారణాల వల్ల ఆ షోకి దూరమయ్యాడు. చాలా రోజులు తెరపై కన్పించిన వేణు.. బలగం మూవీతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. బలగం సినిమా డైరెక్ట్ చేసి.. ఆ సినిమాలోనే తను కూడా చిన్న పాత్రని పోషించిన విషయం అందరికి తెలిసిందే. 'బలగం' మూవీ ఇప్పటికే  ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డు అందుకోగా.. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు తెచ్చింది. తాజాగా బలగం  సినిమా వంద ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని వేణు తన ఇన్ స్టాగ్రామ్ లో 'విశ్వ విజయ శతకం' అంటూ క్యాప్షన్ పెట్టి కొన్ని ఫొటోలని షేర్ చేసాడు. కాగా ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.  

నిఖిల్ చాలా హాట్ అన్న సదా..నాన్న చనిపోయిన ఐదో రోజు షూటింగ్ కి వచ్చానన్న రాధా

నీతోనే డాన్స్ శనివారం ఎపిసోడ్ మస్త్ కలర్ ఫుల్ గా సాగింది. ఈ వారం షో ప్రాపర్టీ రౌండ్ థీమ్ తో జరిగింది..ఇక  జోడీస్ అన్నీ కూడా మంచి మంచి కాస్ట్యూమ్స్ తో వెరైటీ ప్రాపెర్టీస్ తో బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ షోలో లాస్ట్ వీక్ యాదమ్మరాజు- స్టెల్లా ఎలిమినేట్ అయ్యేసరికి వాళ్ళ ప్లేస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు శ్రీవాణి-విక్రమ్...పెర్ఫార్మ్ చేసింది ఫస్ట్ టైం ఐనా సరే ఒక రేంజ్ లో దుమ్ము దులిపే పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు. తర్వాత నటరాజ్ - నీతూ చేసిన డాన్స్ వరస్ట్ అని సదా, రాధ అనేసరికి వాళ్ళు ఇద్దరూ స్టేజి మీద నుంచి వెళ్లిపోయారు. దాంతో విక్రమ్-శ్రీవాణి డాన్స్ కి వాళ్ళు మార్క్స్ ఇవ్వలేదు. వాళ్ళ బదులుగా సదా-రాదా మార్క్స్ ఇచ్చారు. "ఈ స్టేజి మీదకు నేను పరువు పోగొట్టుకోవడానికి రాలేదు...మనకు ఏం కావాలో అది వాళ్ళు ఇవ్వలేనప్పుడు నేను ఏం చేయలేను." అని సీరియస్ గా చెప్పేసరికి.."అదే ప్రొఫెషనలిజం అంటే..స్క్రీన్ మీద హీరోహీరోయిన్స్ చూసి ఏమనుకుంటున్నారు. అలాగే రియల్ లైఫ్ ఉంటుందా అసలు.  నేను మా నాన్న చనిపోయిన ఐదో రోజు షూటింగ్ కి వచ్చాను. కలకు ఫుల్ స్టాప్ లేదు. అన్ని హిట్ పెర్ఫార్మెన్సెస్ ఉండాలని లేదు కదా..అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలీదు. అదే లైఫ్" అన్నారు రాధ. ఫైనల్ గా కావ్య-నిఖిల్ చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఐతే వీళ్ళు ప్రాపర్టీగా తీసుకున్న లైట్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ టోటల్ ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని సదా చెప్పారు. ఇక రాధతో నిఖిల్ "మనోహర" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక సదాని డాన్స్ చేయమని శ్రీముఖి పిలిచింది. "నేను నిఖిల్ ని చూడలేకపోతున్నా..కానీ చాలా హాట్ గా ఉన్నాడు." అంటూ సిగ్గుపడిపోయింది సదా. ఇక ఈ ఎపిసోడ్ లో లీస్ట్ మార్క్స్ తో నటరాజ్ మాష్టర్-నీతూ ఉన్నారు.

ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు 21 రూ..ఇచ్చారు...నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నా

తెలంగాణలో బోనాల పండగ జాతర ఎంత ధూమ్ ధామ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బోనాల స్పెషల్ ప్రోగ్రాంని ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి జోగిని శ్యామల వచ్చారు. ఇంద్రజ, రష్మీ ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. "నా ఏడవ ఏట బోనాల పండగలో ఒక భాగం  అయ్యాను. తెలంగాణాలో నేను ఫస్ట్ బోనం ఎత్తినప్పుడు చీరా సారె పెట్టి 21 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో నెలరోజులు చాకోలెట్స్ కొనుక్కుని తిన్నాను. ఇప్పుడు బోనాల పండగ అనేది ప్రతీ రాష్ట్రంలో ప్రతీ దేశంలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. 30 ఏళ్లుగా నేను అమ్మవారి సేవ చేస్తున్నందుకు లష్కర్ కి ఆడపచుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి  ఆలయంలో ప్రతీ ఏట తోలి బోనం ఎత్తుకునే మొదటి అవకాశం నాకే ఉంది. అందుకే నన్ను తెలంగాణ ఆడపడుచు అంటారు. నేను ఉన్నంత వరకు అమ్మవారికి తోలి బోనం ఎత్తే అవకాశం ఉంది. నేను నా జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కున్న సందర్భాలు  కూడా ఉన్నాయి. నన్నే కాదు మా పేరెంట్స్ కూడా రకరకాలుగా  అనేవారు. ఎందుకు అలా రోడ్ల మీద తిరుగుతావ్ చదువుకోవచ్చు కదా అన్నారు. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ఇళ్లల్లోకి కూడా వెళ్లి బోనాలు ఎత్తుకుంటాను నేను..స్త్రీని పూజించే పండగ, శక్తిని పూజించే పండగ. అమ్మవారికి పూజ చేసి పచ్చి కుండ మీద నిల్చుని భవిష్యవాణి చెప్తుంది జోగిని. తర్వాత ఈమె బోనాల పాటలకు డాన్స్ చేశారు. ఫైనల్ గా ఆమె భవిష్యవాణి చెప్పింది. చేసిన పూజలకు సంతోషంగా ఉన్నానని అందరినీ కాపాడుకుంటాను" అని  చెప్పడంతో ఈ బోనాల స్పెషల్ వేడుక ఎండ్ అయ్యింది.    

ఈ వారం సీరియల్స్ టీఆర్పీలో టాప్-5 లో ఆ అయిదు సీరియల్స్!

తెలుగు సీరియల్స్ లలో జీ తెలుగు, స్టార్ మా టీవీ సీరియల్స్ ని చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే తెలుగు సీరియల్స్ అన్నింటిలో బ్రహ్మముడి మొదటి స్థానంలో ఉండగా , రెండవ స్థానంలో ప్రేమ ఎంత మధురం, మూడవ స్థానంలో ఎన్నెన్నో జన్మలబంధం, ఆ నాల్గవ స్థానంలో ఎదలోయల్లో ఇంద్రధనుస్సు, అయిదవ స్థానంలో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, ఆరవ స్థానంలో గుప్పెడంత మనసు ఉన్నాయి.  బ్రహ్మముడి సీరియల్ లో రోజు రోజుకి కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలో ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియప్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ‌ధనవంతులు సమాజం ఎలా ఉంటారు.. వారి  అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని బాగా డబ్బున్నవాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది. అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికీ భారంగా ఉండాలనుకుంటుంది.    అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది. దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు  రాజ్ కి కనకం కూతురు స్వప్న నచ్చి పెళ్ళిచేసుకుందామనేసరికి తను పెళ్ళిపీటల మీద నుండి లేచిపోతుంది. దాంతో రాజ్ మేనత్త రుద్రాణి కనకం రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి రాజ్, కావ్యలకి పెళ్ళి చేస్తుంది. ఈ విషయం భరించలేని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ చాలా కోపంగా ఉంటూ.. కావ్యని ఒక స్టోర్ రూమ్ లో ఉండమని చెప్తుంది. ఇక దుగ్గిరాల కుటుంబం యొక్క ఇంటిపెద్ద  సీతారామయ్య మాటకి కట్టుబడి కావ్యని ఏమీ అనలేకపోతుంటారు. అయితే తాజా ఎపిసోడ్‌లలో.. స్వప్నని తీసుకెళ్ళింది రాహులేనని కావ్యకి తెలిసిపోతుంది. అయితే ఈ విషయాన్ని కావ్య నిరూపించడానికి తగిన ఆధారాలు సేకరించి అందరిముందు నిరూపిస్తుంది. ఆ తర్వాత కావ్య, రాహుల్ ల పెళ్ళి జరుగుతుంది. అయితే స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం కావ్యకి తెలిసిపోతుంది. కావ్య పెళ్ళి ఆపాలని చూస్తుంది. కానీ అప్పటికే రాహుల్-స్వప్నల పెళ్ళి జరుగుతుంది. ఇక స్వప్నని ఒంటరిగా గదిలోకి తీసుకెళ్ళిన కావ్య ఎందుకు మోసం చేసావని నిలదీస్తుంది. ఆ తర్వాత కావ్యని స్వప్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. మరి స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం ఎన్ని రోజులు దాయగలుగుతుంది. ఈ నిజం కావ్యతో పాటు మరెవరికైనా తెలిస్తే స్వప్న పరిస్థితేంటి?  కావ్య వాళ్ళ ఫ్యామిలీ కోసం రాజ్ కి తెలియకుండా డిజైన్స్ వేస్తుంది. మరి రాజ్ కి తెలిస్తే ఏం జరగుతుంది. రుద్రాణి ప్లాన్ లో స్వప్న కీలుబొమ్మ కానుందా ? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ అత్యంత వీక్షకాదరణ పొందుతూ ఈ వారం కూడా టీఆర్పీలో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది.

హాస్పిటల్ లో ముక్కు అవినాష్ వాళ్ళ అమ్మ!

జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి. కాగా తాజాగా అవినాష్  వాళ్ళ అమ్మకి బాగోలేదంటూ చెప్పాడు. ముక్కు అవినాష్ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. దాంతో అతనికి మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. దాంతో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ముక్కు అవినాష్, అతని భార్య కలిసి 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అని చేసిన వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కాగా ఇప్పుడు తాజాగా 'అమ్మకి ఇలా అవుతుందని అనుకోలేదు' అనే టైటిల్ తో ముక్కు అవినాష్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు. దాంతో ఈ వీడియోకి అత్యధిక సంఖ్యలో ‌వ్యూస్ వస్తున్నాయి. ముక్కు అవినాష్ వాళ్ళ అమ్మకి గుండె నొప్పి రావడంతో వాళ్ళ ఇంట్లోవాళ్ళు రాత్రికి రాత్రే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. టెస్ట్ లు చేసిన వైద్యులు అత్యవసరంగా గుండెకి స్టెంట్ వేశారట. అయితే ఆపరేషన్ తర్వాత వాళ్ళ అమ్మను ముక్కు అవినాష్ మాట్లాడించగా, అవినాష్ ని పట్టుకొని వాళ్ళ అమ్మ ఏడ్చేసింది. ఇలా వాళ్ళ అమ్మని ఆ టైంలో హాస్పిటల్ కి తీసుకొచ్చినందుకు వాళ్ళ అన్నకి,  తనని సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి  థాంక్స్ చెప్పాడు అవినాష్. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

బిగ్ బాస్ సీజన్-7 లోకి బ్యాంకాక్ పిల్ల ఎంట్రీ ఇవ్వనుందా!

గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ సీజన్-7  కంటెస్టెంట్స్ గురించి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో తాజాగా 'బ్యాంకాక్ పిల్ల' అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. యూట్యూబ్ లోని బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తను అందరికి సుపరిచితమే. తను అప్లోడ్ చేసే వీడియోలు దాదాపు వైరల్ అవుతుంటాయి. బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన లోగో తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. సెట్ పనులు కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చిందంటూ వార్తలు నెట్టింట జోరుగా కొనసాగుతున్నాయి. అందులో కామెడీ షో నుండి ఒకరు, యాంకర్ నుండి మరొకరు, కామన్ మ్యాన్ కేటగిరీ నుండి ఈ సారి ముగ్గురు లేదా నలుగురిని తీసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో 'బ్యాంకాక్ పిల్ల' వెళ్తుందని తెలుస్తోంది. బ్యాంకాక్ పిల్ల పూర్తి పేరు శ్రావణి సమంతపూడి. తన కుటుంబంతో కలిసి శ్రావణి బ్యాంకాక్ లో ఉంటుంది. 'బ్యాంకాక్ పిల్ల' పేరుతో తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి పాపులారిటీ తెచ్చుకుంది. బ్యాంకాక్ లో తను ఉండే ఇంటిని, చుట్టుపక్కల టూరిస్ట్ ప్రదేశాలని, టెంపుల్స్ ని చూపిస్తూ వ్లాగ్ లు చేసి బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అయితే మూడు రోజుల క్రితం 'ఇండియాకి వచ్చేశాం' అంటూ తన ఛానెల్ లో అప్లోడ్ చేసిన వ్లాగ్ కింద ఆల్ ది బెస్ట్ ఫర్ బిబి-7 అంటూ తెగ కామెంట్స్ రావడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్తుందేమోనని అందరిలో సందేహం మొదలైంది‌. దీంతో తనే స్వయంగా మరొక వీడియోని చేసింది బ్యాంకాక్ పిల్ల. 'నేను బిగ్ బాస్ కి.. బిగ్ బాస్ ఎంట్రీ‌‌.. మై ఫ్యామిలీ రియాక్షన్స్' అంటూ ఒక వ్లాగ్ ని చేసింది. అందులో తన గురించి బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్లు  యూట్యూబ్ లలో వస్తున్నటువంటి వాటిని చూపిస్తూ.‌. వీటిని ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారో నాకు తెలియదు. నాకైతే బిగ్ బాస్ నుండి ఏ పిలుపు రాలేదు. ఒకవేళ బిగ్ బాస్ లో అవకాశం వస్తే, పిల్లలతో కలిసి వెళ్తానని, పిల్లలు లేకుండా ఎక్కడికి వెళ్ళనని బ్యాంకాక్ పిల్ల ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.