అకౌంట్స్ సీజ్ అయ్యాయని మేనేజర్ చెప్పడంతో జగతి, మహేంద్ర షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -857 లో.. కాలేజీ స్టాఫ్ కి సాలరీలు ఇంకా పడలేదని తెలుసుకున్న జగతి వెంటనే మేనేజర్ తో మాట్లాడుతుంది. అసలు ప్రాబ్లమ్ ఏంటని అడుగుతుంది. ఎమో మేడం తెలియదని మేనేజర్ చెప్తాడు. అప్పుడే ఫణింద్ర , శైలేంద్ర ఇద్దరు వస్తారు. ఏమైందని ఫణింద్ర అడుగుతాడు. చిన్న ప్రాబ్లమ్ అని మహేంద్ర అనగానే.. శైలేంద్ర, మేనేజర్ ని పంపించు వాళ్ళు చూసుకుంటారని ఫణింద్ర చెప్తాడు. చేసేదేమీ లేక సరేనని మహేంద్ర వాళ్లని పంపిస్తాడు.  మరోక వైపు వసుధార గురించి రిషి ఆలోచిస్తూ.. కార్ డ్రైవ్ చేస్తుంటాడు. అప్పుడే వసుధార వస్తున్న ఆటోకి అడ్డంగా వస్తాడు. ఆటో డ్రైవర్ రిషినీ కోప్పడుతుంటే వసుధార ఆపుతుంది. మీరు వెళ్ళండని చెప్పి ఆటో డ్రైవర్ ని అక్కడ నుండి పంపిస్తుంది. ఏంటి సర్ మీరు ఏదో అలోచిస్తూ, ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ చెయ్యడం కరెక్ట్ కాదని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషి వెళ్ళబోతుంటే వసుధార ఆగమని చెప్తుంది. నేను డ్రైవింగ్ చేస్తానని వసుధార అడుగుతుంది. మొదట నిరాకారించిన ఆ తర్వాత రిషి ఒప్పుకుంటాడు. మరొకవైపు జగతి, మహేంద్రల దగ్గరికి మేనేజర్ వస్తాడు. ఏమైంది అని జగతి అడుగుతుంది. అకౌంట్స్ మొత్తం సీజ్ అయ్యాయి ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే చెప్పట్లేదు మూడు రోజుల తర్వాత రమ్మని చెప్పారని మేనేజర్ చెప్పగానే.. జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. ఇప్పుడు అందరికి సాలరీ ఎలా ఇవ్వాలి. అందరికి అవసరాలు ఉంటాయి కదా అని జగతి అంటుంది.  జగతి తన గోల్డ్ బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొని సాలరీస్ ఇద్దామని, ఆ తర్వాత అంత క్లియర్ అయ్యాక మల్లీ గోల్డ్ తీసుకోవచ్చని జగతి చెప్తుంది. దానికి మహేంద్ర కూడా సరేనంటాడు. మరొక వైపు క్లాస్ కి రాను, మీరు లాస్ట్ క్లాస్ లో చెప్పింది చెయ్యండి అని పాండియన్ కి రిషి చెప్తాడు. మరొక వైపు ప్రిన్సిపల్ సిలబస్ గురించి రిషి తో డిస్కషన్ చేసి కలిసి వర్క్ చెయ్యండని వసుధారతో చెప్తాడు. వసుధార సరేనని రిషి క్లాస్ లో ఉన్నాడునుకొని వెళ్తుంది కానీ రిషి తన క్యాబిన్ లో ఏదో ఆలోచిస్తూ ఉండేసరికి డిస్టబ్ చెయ్యడం ఎందుకని వసుధార వెళ్ళిపోతుంది.  ఆ తర్వాత రిషికి ప్రిన్సిపల్ ఫోన్ చేసి.. వసుధార మేడమ్ మీ దగ్గరికి వచ్చిందా కలిసి డిస్కషన్ చేసి చెయ్యమని చెప్పానని రిషికి చెప్తాడు ప్రిన్సిపల్.. ఆ తర్వాత వసుధార నా దగ్గరికి రాలేదని,  తన దగ్గరికి వెళ్తాడు రిషి. ప్రిన్సిపల్ సర్ నన్ను కలవమని చెప్పాడంట? ఎందుకు రాలేదు ఇగోనా  అని అడుగుతాడు.  మీరు ఏదో డిస్టబ్ లో ఉన్నారు. ఎందుకు డిస్టబ్ చెయ్యడమని రాలేదని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముకుందని రెచ్చగొట్టేలా మాట్లాడిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -251లో.. మురారికి కృష్ణ ఇంజక్షన్ వేయాలని చెప్పగానే.. మురారికి భయం వేస్తుంది. అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే కృష్ణ ఆపుతుంది. మురారి తప్పించుకొని అటు వైపు ఇటు వైపు వెళ్తూ ఉంటాడు. మురారిని కృష్ణ ఆపుతుంది. దంతో కృష్ణ పడిపోతుంటే మురారి పట్టుకుంటాడు. అప్పుడే కృష్ణ కళ్ళలోకి చూస్తూ ఉన్న మురారికి తనకి తెలియకుండానే ఇంజక్షన్ వేస్తుంది కృష్ణ. మరొక వైపు కృష్ణ మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చిందని ముకుంద అనుకుంటుంది. కృష్ణని మురారి ప్రేమిస్తున్నట్లు తెలిసిపోయిందా? ఇదంతా రేవతి అత్తయ్య ప్లాన్ అయి ఉంటుంది. ఎలాగైనా మురారిని నా సొంతం చేసుకోవాలి. అది మా నాన్న వల్లే అవుతుంది. పెద్ద అత్తయ్య కి మా ప్రేమ విషయం చెప్పమని మా నాన్నతో చెప్పాలని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు మురారికి కృష్ణ జ్యూస్ తీసుకొని వెళ్తుంది. కావాలనే మురారి కృష్ణని కాసేపు ఆటపట్టిస్తాడు.. ఆ తర్వాత నువ్వు నా ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చావ్ కదా అని మురారి అడుగుతాడు. నా ప్రేమ విషయం తెలుసుకోవడానికి ఇలా అంటున్నారా? నేను ఎందుకు చెప్తానని కృష్ణ అనుకొని నా స్వార్థం కోసం వచ్చానని కృష్ణ అంటుంది. ఏంటని మురారి అడిగితే.. మేరే కనుక్కోండని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కృష్ణ క్యాంపు నుండి వచ్చినప్పటి నుండి తనలో చాలా మార్పు వచ్చింది హ్యాపీగా ఉంటుందని మురారి అనుకుంటాడు. అప్పుడే మురారి దగ్గరికి ముకుంద వస్తుంది. తనని చూసిన మురారి.. ఫొటోస్ చూపిస్తా అని నన్ను టెన్షన్ పెడతావా? నీ సంగతి చెప్తా అని మురారి అనుకుంటాడు. ఇందాక కృష్ణ జ్యూస్ తీసుకొని వచ్చింది తను తాగి నాకు మిగతా గ్లాస్ ఇచ్చింది. అది నేను తాగాను చాలా బాగుంది. అంతే కాకుండా నా షర్ట్ పై జ్యూస్ పడితే తనే క్లీన్ చేసిందని ముకుందని రెచ్చగొట్టేల మురారి మాట్లాడతాడు. నువ్వేం చెయ్యలేవు ఫొటోస్ చూపిస్తా అని నన్ను బెదిరించావ్ ? ఎం జరిగింది ఇక ముందు కూడా అలాగే జరుగుతుందని మురారి అంటాడు. అలా మురారి అనేసరికి ముకుందకి కోపం పెరిగిపోతుంది. మరొక వైపు కృష్ణ దగ్గరకి రేవతి వచ్చి.. నీ ప్రేమ విషయం ఏమైనా మురారి బయటపెట్టడా అని రేవతి అడుగుతుంది. లేదని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత భవాని వచ్చి.. రేపు ఏంటి స్పెషల్ అని అడుగుతుంది. రేపు వరలక్ష్మి వ్రతమని కృష్ణ చెప్తుంది.. వరలక్ష్మి వ్రతం గురించి కృష్ణ ఇంట్లో అందరికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కావ్య చేసే వరలక్ష్మి వ్రతంలో రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -190 లో.. అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పు ఫోన్ చేస్తే కళ్యాణ్ ఫోన్ కట్ చెయ్యడం తో అప్పు కోపంగా ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ అనామికని కలిసాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. సారీ అని చెప్తాడు. నాకు ఇంకొక ఫ్రెండ్ దొరికిందని కళ్యాణ్ అనగానే.. తను నేను ఒకటేనా అని అప్పు అడుగుతుంది. లేదు తను నా అభిమాని. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అని చెప్తాడు. ఆ తర్వాత అనామికతో మాట్లాడిందంతా అప్పుకి కళ్యాణ్ చెప్తాడు. మరొక వైపు కనకం, కృష్ణమూర్తిలకి ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది. రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. మీరు తప్పకుండా రండి అని వారిద్దరిని ఇందిరాదేవి పిలుస్తుంది. మొన్న అంత గొడవ జరిగింది. మళ్ళీ మేము ఎలా రాగలమని కనకం అంటుంది. అదంతా మర్చిపోండి మీరు రేపు వచ్చి కావ్యతో వరలక్ష్మి వ్రతం జరిపించండని ఇందిరాదేవి చెప్పగా.. దానికి కనకం సరే అంటుంది. మరొక వైపు కావ్య దగ్గరికి అపర్ణ వస్తుంది. నిన్ను నేను ఎప్పటికి కోడలిగా అంగీకరించను నువ్వు ఒక్కసారి నాకు ఎదరు తిరిగినందుకు నిన్ను ఇంటి బయట నిలబెట్టాడు నా కొడుకు అని అపర్ణ అంటుంది. నన్ను అర్థం చేసుకోండని కావ్య అనగానే.. నిన్ను అర్థం చేసుకోవడానికి నువ్వేమైనా పుస్తకమా అని కావ్యని తక్కువ చేసి మాట్లాడుతుంది అపర్ణ. మీరు అనుకున్నది ఏది జరగట్లేదు. మీరు వద్దన్న ప్రతీసారి నాకు అణుకువగా జరుగుతుందని కావ్య అంటుంది. మామయ్య గారు చెప్తే వినట్లేదు. మీ అబ్బాయి చెప్తే వింటారెమో అని కావ్య అనగానే.. అక్కడ ఉంది నా కొడుకు అని అపర్ణ పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఆ మాటలు అన్ని రాజ్ వింటాడు. కావ్య వెళ్తుంటే పూజ నువ్వు చేయు, ప్రతిఫలం నేను ఇస్తానని రాజ్ అంటాడు. ఏంటని కావ్య అడుగుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సి అని రాజ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు కావ్య పూజకి అంతా సిద్ధం చేస్తుంది. వరలక్ష్మి అమ్మవారిని కావ్య బాగా అలంకరణ చేస్తుంది. బాగా చేసావని కావ్యని ఇందిరాదేవి మెచ్చుకుంటుంది.. దానికి కూడా అపర్ణని రెచ్చగొట్టాలని‌ రుద్రాణి ప్రయత్నం చేస్తుంది..కానీ ఇందిరాదేవి గొడవ కాకుండా ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

నాకు ఒక పెళ్లి కూడా అవ్వట్లేదు.. మీకు పెళ్లి.. మళ్లీ పెళ్లి ఎలా ?

త్వరలో  వినాయకచవితి పండగ రాబోతోంది. ఈ నేపథ్యంలో  ఈటీవీలో 'స్వామి రారా' అంటూ ఓ స్పెషల్ ఈవెంట్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోలో   పలువురు సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్  సెలబ్రెటీలూ అందరూ  పాల్గొని ఈ  ఈవెంట్‌ లో పార్టిసిపేట్ చేశారు. ఇక ఈ షోకి  నరేష్ -పవిత్ర లోకేశ్ స్పెషల్ గెస్టులుగా వచ్చారు. అలాగే  హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, చాందినీ చౌదరి , డైరెక్టర్ బలగం వేణుని కూడా వచ్చారు.  దీనికి  సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. యాంకర్ శ్రీముఖి షోకి హోస్ట్ గా చేసింది. సీరియల్ యాక్టర్ మానస్ ,  రీతూ చౌదరి,  వర్షతో పాటు, అన్నపూర్ణమ్మ   శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు కూడా ప్రోమోలో మెరిశారు. ఫారియా అబ్దుల్లా మాత్రం స్టేజి మీద బులెట్ డ్రైవ్ చేసుకుంటూ మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఇక ప్రోమో ఎండింగ్ లో  హైపర్ ఆది వేసిన డైలాగ్ ఈ ప్రోమోకి హైలైట్ గా నిలిచింది. నరేశ్ దగ్గర వెళ్లి  "నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు.. పెళ్లి.. మళ్లీ పెళ్లి ఎలా సార్.." అని అడిగాడు. నరేష్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆది భుజం మీద చెయ్యేసి  నవ్వేశారు. వీళ్లిద్దరో ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ ఐన విషయం తెలిసిందే.  రీసెంట్ గా తన  పెళ్లి వ్యవహారం, విడాకుల ఇష్యూ, పవిత్ర లోకేశ్‌తో ప్రేమాయణం మొత్తాన్ని కలిపి  'మళ్లీ పెళ్లి' అంటూ ఓ మూవీ కూడా తీశారు. ఇందులో నరేశ్-పవిత్ర లోకేశ్ కలిసి హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి ప్రొమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు. ఈ మూవీ రిలీజ్ అయ్యేంతవరకు మంచి  హైప్ క్రియేట్ చేశారు ఇద్దరు. ప్రతీ ప్రమోషన్ లో స్టేజి మీద ముద్దులు ఇచ్చిపుచ్చుకున్నారు కూడా .    మొత్తానికి ఈ మూవీ రిలీజ్ అయ్యింది  కానీ పెద్దగా కలెక్షన్స్ లేవు .  మరి చూడాలి ఈ షోలో ఇంతకు నరేష్ ఎం ఆన్సర్ చెప్పారు అలాగే పవిత్ర ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయం.

మగవాళ్ళకు జాగ్రత్తలు చెప్తున్న సుమ కనకాల!

మగవాళ్ళకి మాత్రమే ఇది.. అవును సుమ చెప్తుంది 'మగవాళ్ళు తస్మాత్ జాగ్రత్త' అని కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. అదేంటంటే మగవాళ్ళు బ్రాస్ లైట్స్ పెట్టుకోకూడదంట.. ఎందుకంటే చేతులని జేబులో పెట్టుకుంటే పొరపాటున ప్యాంట్ కి చిక్కుకుంటే ఎంత తీసిన రాకపోతే కష్ణమని, ఇబ్బంది అవుతుందని సుమ కనకాల అంది. అలా ఎందకు అందంటారా.. తన తోటి వ్యక్తి బ్రాస్ లైట్ తో ఉన్న చేతిని జేబులో పెట్టుకున్నాడు. అది ఎంత తీసినా రావట్లేదు. చాలా సేపటికి అది బయటకు వచ్చింది. అది చూసి సుమ స్పందించింది. త్రివిక్రమ్ గారు.. మీరు ఎందుకండి అలా అన్నారు.. అదే రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నా ఎక్కడికో తెలియట్లేదని ఎందుకన్నారండి ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఇన్ స్పైరింగ్ గా తీసుకొని ఇతను ఎంత ఇబ్బంది పడ్డాడో అంటూ సరదాగా అనేసింది సుమ. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా విశేష స్పందన లభిస్తుంది. బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.  అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ 'స్ట్రెస్ బస్టర్స్' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే  సుమ.. 'వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా  అది వైరల్ అయింది. అయితే కొన్ని రోజుల క్రితం  'ది‌ నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని ప్రారంభించి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మానవ సేవే మాధవ సేవ అంటూ పలువురు తన సేవని గుర్తించిన సంగతి తెలిసిందే. 

ప్రేమ యాత్రలకు.. అంటూ డ్యూయెట్ పాడుకుంటున్న నవీన్ పోలిశెట్టి, సుమ కనకాల

  సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నవ్వించడానికి వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కి  మంచి ఎంటర్టైనర్, హీరో కం కమెడియన్ నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చారు. నవీన్ తో పాటు మహేష్ ఆచంట కూడా వచ్చాడు. రావడంతోనే సుమ మీద పెద్ద జోక్ వేసేశాడు. షోకి వచ్చిన మహేష్ కి పూల బొకే ఇచ్చింది సుమ .."ఛ నీకెందుకు బొకే ఐనా మా ప్రోగ్రాంకి ఏవైనా దోషాలు ఉంటే నువ్వు అప్పుడప్పుడు వచ్చి పోతుంటావు కాబట్టి అవి పోతాయి" అని కౌంటర్ వేసింది. దానికి మహేష్ కి బాగా కోపం వచ్చి రివర్స్ కౌంటర్ వేసాడు "అంటే మీరు కూడా లైఫ్ లాంగ్ ఉంటున్నారు మీరు కూడా దోషమేనా" అనేసరికి నవీన్ పోలిశెట్టి బుర్ర గోక్కుంటూ నవ్వేసాడు. సుమ ఆ కౌంటర్ కి షాకైపోయింది. తర్వాత "ప్రేమ యాత్రలకు" అంటూ నవీన్, సుమ ఇద్దరూ కలిసి బ్లాక్ అండ్ వైట్ డ్యూయెట్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక ఫైనల్ గా కృష్ణుడిలా ఫ్లూట్ వాయించాడు. "కృష్ణాష్టమికి కొడతారు ఉట్టి...సెప్టెంబర్ 7 కి రిలీజ్ అవుతుంది మీ శెట్టి అండ్ మిష్టర్ పోలిశెట్టి " అని చెప్పి సెట్ లో కట్టిన ఉట్టిని పగలగొట్టాడు. ఇక పల్లెటూళ్లలో పొలాల్లోకి వెళ్ళడానికి వాడే నీళ్ల చెంబును గురించి ఎక్ష్ప్లైన్ చేస్తూ నవీన్ పోలిశెట్టి చెప్పిన డైలాగ్స్ కి ఫిదా ఇపోయారు స్టూడెంట్స్, అరియనా, శివ జ్యోతి. అనుష్క శెట్టి  ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'  ఇందులో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న  నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. ఫస్ట్ ఈ మూవీని  ఆగస్టు 4 న రిలీజ్ చేస్తామని చెప్పి  తర్వాత ఆగస్టు 18 వస్తుందంటూ ఊహాగానాలు వచ్చాయి. వాటికి బ్రేక్ వేస్తూ కరెక్ట్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్.  సెప్టెంబర్ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు  ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు.

పూర్తైన  ఇంటికి దీపం ఇల్లాలు  సీరియల్...

    ఇప్పటివరకు ఎంతో అలరించిన "ఇంటికి దీపం ఇల్లాలు" సీరియల్ ఇప్పుడు పూర్తయిపోయింది. ఇక ఫైనల్ డే షూటింగ్ చాలా సందడిగా సాగింది. ఇక సెట్ లో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యుట్యూబ్స్ కోసం వీడియోస్ షూట్ చేసుకున్నారు. ఇక నీమా సింగ్ చాల ఫీలయ్యింది. "సీరియల్ ఐపోతోంది అనే ఒక రకమైన తెలియని బాధగా ఉంది" అని చెప్పడంతో శివ కుమార్ వచ్చి "ఎందుకంటే నీమా సింగ్ నన్ను చాలా మిస్ అవుతుంది..అందుకే బాధపడుతోంది  " అని చెప్పాడు. "నిన్ను మిస్ అవుతున్నానా..నీతో రెండు సీరియల్స్ చేసేసరికి తలనొప్పి వచ్చింది నాకు పో" అని ఫన్నీగా కసురుకుంది. ఇక షూటింగ్ లో సన ఎలా ఉంటారో కూడా శివ కుమార్ చెప్పాడు. రోజూ సన తినడానికి ఏదో ఒకటి సెట్ మొత్తానికి ఇస్తారని చాలా మంచి మనసు ఉన్న అమ్మ అని కితాబిచ్చాడు. ఇక రెండున్నరేళ్లు ఎలా కలిసిపోయామో మాకే తెలీదు...సడెన్ గా సీరియల్ ని ఆపేసారు అనే చెప్పారు ఈ సీరియల్ టీమ్. .ఇక నెటిజన్స్ కూడా ఈ సీరియల్ ఐపోవడంతో చాలా నిరాశలో ఉన్నారు. ఐతే కొంతమంది నెటిజన్స్ మాత్రం డబ్బింగ్ సీరియల్స్ కి పెద్దగా ఆదరణ ఉండదు..ఇలా త్వరగా ముగిసిపోతాయి అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ టీమ్ అంత కలిసి డిన్నర్ చేసి కాసేపు చిట్ చాట్ చేసుకుని ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సన కూడా ఈ సీరియల్ ఎండింగ్ షూటింగ్ ని వీడియో తీసి తన యుట్యూబ్ లో అప్ లోడ్ చేసుకున్నారు. ఇక నెటిజన్స్ సీరియల్ ఐపోయినందుకు చాలా బాధపడుతున్నారు.

బిగ్ బాస్ బజ్‌ లక్కీ విన్నర్ కి వీకెండ్ ఎపిసోడ్‌ని సెట్‌కి వెళ్లి లైవ్‌లో చూసే అవకాశం

  బిగ్ బాస్ సీజన్ 7  ఈ నెల 3 నుంచి ప్రారంభం కాబోతోంది. "మా  హౌస్‌లో మాత్రమే కాదు.. మీ హౌస్‌లో కూడా" అంటూ బిగ్ బాస్ బజ్ కి సంబంధించి ఒక  ఆసక్తికరమైన ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా.  ఆదివారం సాయత్రం 7 గం. స్టార్ మాలో కర్టెన్ రైజర్ ఉండబోతోంది. ఇక ప్రతీ శని, ఆదివారాల్లో రాత్రి 9గంటలకు ఈ షో ప్రసారం కానుంది.  సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి లేటెస్ట్ అప్ డేట్స్ ని హౌస్ మేట్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇందులో కొన్ని చేంజెస్ చేశారు. ఈ శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్ ఎపిసోడ్‌ని సెట్‌కి వెళ్లి లైవ్‌లో చూసే అవకాశాన్ని కల్పిస్తోంది స్టార్ మా.  ప్రతిరోజు ‘బిగ్ బాస్ బజ్‌ " లో అడిగే ప్రశ్నలకు ఫేస్ బుక్ లైవ్‌లో కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే  లక్కీ విన్నర్‌ని వీకెండ్ ఎపిసోడ్‌కి ఆడియన్స్ గా  పంపించే సదవకాశం అందిస్తోంది.  ఇక బిగ్ బాస్ బజ్ యాంకర్  గీతూ... ఇక ఈ  బిగ్ బాస్ బజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే.. సెప్టెంబర్ 4 ఉదయం 10 గంటలకు.. తిరిగి సాయంత్రం 6 గంటలకు.  ఇంకెందుకు ఆలస్యం.. బిగ్ బాస్ సెట్‌కి వెళ్లి.. లైవ్‌లో షో చూడాలనుకునే, నాగార్జునతో ముచ్చటించాలనుకునే ఆసక్తి ఉన్న ఆడియన్స్ ట్రై చేయండి మరి. బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎప్పుడూ  లేని విధంగా ఉంటుందంటూ మంచి హైప్ క్రియేట్ చేశారు నాగార్జున.  సరికొత్త రూల్స్‌, టాస్క్‌లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన రీతిలో ఉంటుందని చెప్పడంతో ఆడియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు షో వస్తుందా ఆ రూల్స్ ఏమిటా ఆ హౌస్ మేట్స్ ఎవరా అని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆదివారం సాయంత్రం స్టార్ మా హయ్యెస్ట్ రేటింగ్ ని అందుకోబోతోంది అనే విషయం తెలుస్తోంది.

హర్ష నూతన ఇంటి గృహప్రవేశం...హాజరైన సాయి ధరమ్ తేజ్

యూట్యూబర్ గా, షార్ట్ ఫిలిం మేకర్ గా , నటుడిగా,సినిమాల్లో  కమెడియన్ గా  గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష చెముడు  నూతన గృహ ప్రవేశం చేశాడు. ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ చేస్తో ఫుల్ బిజీ ఐపోయాడు. రవితేజ ప్రొడ్యూసర్ గా రూపుదిద్దుకుంటున్న "సుందరం మాస్టర్" అనే మూవీలో  హీరోగా చేస్తున్నాడు వైవా హర్ష. రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న  హర్ష ఇప్పుడు సొంతింట్లోకి కూడా  అడుగుపెట్టాడు. ఇక ఈ  గృహప్రవేశానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ విచ్చేసి విష్ చేసాడు. హర్ష, సాయిధరమ్ తేజ్ మంచి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ , ఇండస్ట్రీ పెద్దలు, హర్ష అభిమానులు అందరూ కూడా అభినందనలు చెప్తున్నారు. వైవా వీడియోస్ తో బాగా పాపులర్ ఐన హర్ష   2013లో మసాలా మూవీతో  సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన వైవా హర్ష తర్వాత  మైనే ప్యార్‌కియా, పవర్‌, గోవిందుడు అందరివాడేలే, సూర్య వర్సెస్‌ సూర్య, సైజ్‌ జీరో, దోచేయ్‌, శంకరా భరణం, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్‌, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్‌ ఐ లవ్యూ, భానుమతి అండ్‌ రామకృష్ణ వంటి మూవీస్ లో నటించి మెప్పించాడు. కొంత కలం క్రితం వచ్చి సూపర్ హిట్ ఐన సుహాస్‌ నటించిన అవార్డు ఫిలిం "కలర్‌ ఫొటో"లో వైవా హర్ష నటన ఎవరూ మర్చిపోలేరు. ఈ మూవీ  తర్వాత మరిన్ని సూపర్‌ హిట్ మూవీస్ కూడా చేసాడు . వివాహ భోజనంబు, మంచి రోజులొచ్చాయ్‌, కార్తికేయ 2, బింబిసార, బేబీ, మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ వంటి సూపర్‌ హిట్ మూవీస్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే ఇప్పటివరకు కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన వైవా హర్ష ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని  పరీక్షించుకుంటున్నాడు. "సుందరం మాస్టర్‌' మూవీతో  హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీతో సంతోష్‌ డైరెక్టర్ గా  పరిచయమవుతున్నాడు. రీసెంట్ గా  రిలీజైన ఈ  టీజర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

అనామికని చూసి ప్లాట్ అయిన కళ్యాణ్.. వరలక్ష్మి వ్రతం కావ్య చేయగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -189 లో.. అనామిక కాఫీ షాప్ లో కలుస్తానని చెప్పగానే.. కళ్యాణ్ వెయిట్ చెయ్యలేక త్వరగా అనామికని కలవడానికి కాఫీ షాప్ కి బయల్దేరి వెళ్తాడు. కాఫీ షాప్ కి వెళ్ళగానే అందరూ అక్కడ కళ్యాణ్ కి వెల్ కమ్ చెప్తారు.. కానీ ఇంకా అప్పటికి అనామిక రాకపోవడంతో మళ్ళీ  ఎప్పటిలాగే చేస్తుందని అనుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ కాఫీ షాప్ లో అనామిక కోసం వెయిట్ చేస్తుంటాడు అనామిక తప్ప అందరు కళ్యాణ్ దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. ఒక  అమ్మాయి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది.. తనే అనామిక అయి ఉంటుందా అని అడుగుతాడు. లేదు మేడమ్ వస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక ఆంటీ వస్తుంది. కొంపదీసి ఈవిడ అనామికనా అని భయపడుతాడు. ఆవిడా వచ్చి ఒక రోజ్ ఇచ్చి మీ కవిత్వం బాగుంటుంది. నేను అనామిక కాదు మేడమ్ వస్తున్నారని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక బామ్మ వస్తుంది. మళ్ళీ ఈవిడ అనామిక అయి ఉంటుందా అని అనుకొని బయపడతాడు. అప్పుడు ఆ బామ్మ వచ్చి రోజ్ ఇచ్చి.. మనవరాలు వస్తుందని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంత సేపు వెయిట్ చెయ్యాలో అని కళ్యాణ్ అనుకుంటాడు. మరొక వైపు రాజ్ తో సీతారామయ్య మాట్లాడుతాడు. నువ్వు కావ్యపై ప్రవర్తించే తీరుపై నాకు  మీ కాపురం గురించి  భయం వేస్తుంది. కావ్యకి పొగరని నువ్వు, మీ అమ్మ అనుకుంటున్నారు కానీ అది ఆత్మగౌరవమని ఎందుకు అనుకోవడం లేదని సీతరామయ్య అడుగుతాడు. మీరు ఇద్దరు కలిసి మెలిసి ఉంటేనే నేనే నిశ్చింతగా ఉంటానని సీత రామయ్య చెప్తాడు. కానీ రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరొక వైపు కళ్యాణ్ దగ్గరికి అనామిక వస్తుంది. అనామికని చూసిన కళ్యాణ్ ఫ్లాట్ అవుతాడు. అనామికతో ఉన్నప్పుడు అప్పు ఫోన్ చేస్తూనే ఉంటుంది. కళ్యాణ్ అప్పు ఫోన్ చెయ్యడం చూసి స్విచాఫ్ చేస్తాడు.. ఆ తర్వాత అనామికకి కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తాడు. అది చూసి అనామిక సంతోషపడుతుంది.. మరొక వైపు అందరూ భోజనం చేస్తూ వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సారి ఈ పూజ కావ్య చేస్తుందని ఇందిరాదేవి చెప్తుంది.  అపర్ణ ఏమైనా అంటుందేమో అని కావ్య ఇబ్బందిగానే ఒప్పుకుంటుంది. మరొక వైపు కోపంగా ఉన్న అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యకుండా స్విచాఫ్ చేసావని కళ్యాణ్ పై అప్పు అరుస్తుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గదిలోని ఫోటోలని మార్చిందెవరు.. అది చూసి ముకుంద షాక్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -250 లో.. మురారి క్యాంప్ లో పిల్లలని ఎలా సేవ్ చేసాడో భవానికి చెప్తూ ఉంటాడు. మురారిని చుసిన భవాని.. ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. మరొక వైపు కృష్ణ గదిలోకి వెళ్లి ముకుందతో తను కలిసి ఉన్న ఫోటోలని చూస్తుందేమో అని మురారి టెన్షన్ పడుతుంటాడు. మరొక వైపు కృష్ణ  తన తింగరి పనులు మళ్ళీ మొదలుపెడుతుంది. ఇంట్లో ఎన్ని మెట్లు ఉన్నాయని లెక్కపెడుతుంటుంది. అది చూసిన మురారి ఆశ్చర్యపోయి చూస్తాడు. ఆ తర్వాత మురారి కృష్ణ దగ్గరికి  వెళ్లబోతుంటే ముకుంద ఎదురుపడుతుంది. నా ప్రేమని కాదని కృష్ణని ఎలా ప్రేమిస్తావ్? నీ సంగతి చెప్తానని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వెళ్లి ఏదో ఫొటో చూపిస్తుంది. ఏంటి ముకుంద మేం కలిసి ఉన్న ఫోటో చూపిస్తుందేమోనని మురారి టెన్షన్ పడుతాడు. కానీ ముకుంద మాత్రం మురారిని టెన్షన్ పెట్టాలని అలా చేస్తుంటుంది. ఆ తర్వాత కృష్ణ గదిలోకి వెళ్ళబోతుంటే.. మురారి ఆపుతాడు. ఇప్పుడే వెళ్ళకని, ఎక్కడ ముకుంద మురారి లు కలిసి ఉన్న ఫొటోస్ చూస్తుందని కంగారు పడుతాడు. అప్పుడే ముకుంద కృష్ణ దగ్గరికి వచ్చి.. నీకు సర్ ప్రైజ్ అంటూ కృష్ణ కళ్ళు మూసుకొని.. గదిలోకి తీసుకొని వెళ్తుంది ముకుంద. మురారి టెన్షన్ పడుతుంటాడు. కృష్ణని ముకుంద తీసుకొని వెళ్లేసరికి గదిలో.. ముకుంద, మురారి ల ఫొటోస్ ఉండవు. వెల్ కమ్ కృష్ణ అని రాసి ఉంటుంది. అది ఎవరు మార్చారని ముకుంద షాక్ అవుతుంది.. అది చుసిన కృష్ణ.. ముకుంద నే అలా చేసిందని అనుకొని థాంక్స్ చెప్తుంది. మురారికి కూడా అది ఎవరు చేశారో అర్థం కాదు. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు హ్యాపీగా ఉండాలని రేవతి దేవుళ్ళకి మొక్కుకుంటుంది. మరొక వైపు ఫొటోస్ ఎవరు మార్చారని మురారి అనుకుంటాడు. ఇంకెవరు అమ్మ మార్చి ఉంటుందని మురారి అనుకుంటాడు. మరొక వైపు మురారికి టాబ్లెట్స్, ఇంజెక్షన్ ఇవ్వడానికి అంతా  రెడీ చేస్తుంది కృష్ణ. మురారి భయంతో వెళ్ళాబోతుంటే కృష్ణ ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏంజిల్ కోసం రిషి పెళ్ళిపెద్ద అయ్యాడా.. అసలేమైందని జగతి కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -856 లో.. వసుధార, ఏంజిల్  కలిసి రిషితో మాట్లాడతారు. ఏంజిల్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది, మీరేమంటారని రిషిని అడుగుతుంది వసుధార. అప్పుడు రిషి కోపంగా మాట్లాడతాడు. అయినా నా నిర్ణయం ఏంజిల్ కి చెప్పానని రిషి సమాధానం చెప్తాడు.  ఆ తర్వాత తను నా పర్సనల్ విషయంలో కలుగుజేసుకోవడమేంటి? నువ్వు అంటే నా ఫ్రెండ్ వి తనెవరు అని వసుధార గురించి రిషి అంటాడు. దాంతో ఏంజిల్.. తనకి నువ్వు తెలుసు కదా అందుకే అడిగిందని చెప్తుంది. ఆ తర్వాత రిషి కోపంగా వెళ్ళబోతుంటే.. చెయ్యి పట్టుకొని ఆపుతుంది వసుధార. మీరు ఏంజిల్ గురించి ఏదో ఒక క్లారిటీ ఇవ్వండని వసుధార అడుగుతుంది. నేను చెప్పాలిసింది ఎప్పుడో చెప్పానని రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన వసుధార.. ఏంజిల్ గురించి మాట్లాడినప్పుడు, రిషి కోపంగా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని బాధపడుతుంది. మరొక వైపు రిషి కూడా ఏంజెల్ తరుపున వసుధార మాట్లాడుతుందని ఆలోచిస్తాడు. ఎలాగైనా ఈ విషయం విశ్వనాథ్ సర్ కి చెప్పి, ఏంజిల్ పెళ్లి గురించి మాట్లాడాలని రిషి అనుకొని విశ్వనాథ్ దగ్గరికి వెళ్తాడు. ఏంజిల్ పెళ్లి గురించి మీతో మాట్లాడాలని విశ్వనాథ్ తో రిషి చెప్తాడు. మీరు మీకు తెలిసిన వాళ్లలో ఏంజిల్ గురించి చెప్పి మంచి సంబంధం చూడండి, ఏంజిల్ ని అర్థం చేసుకునేవాళ్ళని చూడవచ్చు కదా అని విశ్వనాథ్ తో రిషి చెప్తాడు. ఆ తర్వాత తన మనసులో ఎవరో ఉన్నారని చెప్పిందని, ఆ విషయం తనే చెప్తానందని రిషితో విశ్వనాథ్ అంటాడు. అప్పుడే ఏంజిల్ వచ్చి.. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. నీ పెళ్లి గురించి, నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యమని రిషి చెప్తున్నాడని విశ్వనాథ్ అనగానే.. రిషి పెళ్లి పెద్ద అయ్యాడా? నేను తర్వాత చెప్తానని విశ్వనాథ్ కి  ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత రిషితో మళ్ళీ తన ఇష్టం గురించి చెప్పాలని ప్రయతించిన రిషి.. తన మనసులో ఉన్న మాటని క్లారిటీ గా చెప్తాడు. మరొక వైపు కాలేజీలో వర్క్ చేసే వాళ్ళకి ఇంకా జీతాలు పడలేదని ఒక ఎంప్లాయి వచ్చి జగతి కి చెప్తాడు. జగతి మేనేజర్ ని పిలిచి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ లోకి  ఆకాశ వీధుల్లో  సినిమా హీరో!

బిగ్ బాస్ హౌస్ లోకి గౌతమ్ కృష్ణ వెళ్ళనున్నాడా అంటే.. అవును వెళ్తున్నాడు. అతనే హింట్ ఇచ్చాడు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అతను వెళ్తాడా లేదా అనే డౌట్ ఉండేది.. కానీ నేటితో అది పక్కా ఫిక్స్ అయింది. తాజాగా‌ గౌతమ్ కృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేశాడు. అందులో ఒకరు ' సెప్టెంబర్ 3rd వస్తున్నారా' అని అడుగగా..  గుండెల్లోకి డైరెక్ట్ ఎటాక్ అని గౌతమ్ కృష్ణ రిప్లై ఇచ్చాడు. యంగ్ హీరో గౌతమ్‌ కృష్ణ ఒకవైపు హీరోగా, మరొకవైపు దర్శకత్వం వహించిన సినిమా ‘ఆకాశ వీధుల్లో’. ఈ సినిమా గౌతమ్ కృష్ణకి తొలి సినిమా అయిన ఇప్పటికే చాలా సినిమాలు చేసినంత అనుభవంతో అతను నటించాడు. పూజిత పొన్నాడ, గౌతమ్ కృష్ణ, సత్యం రాజేశ్, దేవి ప్రసాద్ ఫ్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఆకాశ వీధుల్లో సినిమా కథేంటంటే.. సిద్ధు (గౌతమ్ కృష్ణ) పెద్ద రాక్‌ స్టార్‌ కావాలని చదువును నిర్లక్ష్యం చేసి తన తండ్రి దేవీ ప్రసాద్ తో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడి కొన్నాళ్ళ తర్వాత నిషాతో మనం లివింగ్ లో ఉందామని చెప్పగా.. నిషా తనకు ప్రేమపై నమ్మకం లేదని చెప్పి, అతనికి దూరంగా ఉంటుంది. దాంతో ప్రేమ విఫలం అయ్యి మద్యపానం, మాదకద్రవ్యాలకు సిద్దు బానిస అవ్వడంతో అతని జీవితం తలకిందులవుతుంది, అతను ఈ సమస్యలన్నింటిని ఎలా ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ. మొదటి సినిమా 'ఆకాశ వీధుల్లో' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టు తనే ఇన్ స్టాగ్రామ్ లో హింట్ ఇచ్చాడు. ఆస్క్ మి క్వశ్చనింగ్ లో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధనమిచ్చాడు గౌతమ్ కృష్ణ. మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటని ఒకరు అడుగగా.. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3, అని రిప్లై ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. అన్న మీరు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్స్ లోకి వచ్చారా అని ఒకరు అడుగగా.. అవునని రిప్లై ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. నెక్స్ట్ మూవీ ఏంటని అనగా.. త్వరలోనే చెప్తామని అన్నాడు. ' టీవీలో చూడొచ్చా మిమ్మల్ని లైక్ షోస్' అని ఒకరు అడుగగా.. " చూడొచ్చు, చూడాలనుకుంటే చూడొచ్చు" అని గౌతమ్ కృష్ణ రిప్లై ఇచ్చాడు. సెప్టెంబర్ 3rd వస్తున్నారా అంటే డైరెక్ట్ గుండెల్లోకి అని చెప్పిన గౌతమ్ కృష్ణ  పక్కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా? మరి ఇది నిజమేనా కాదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

తప్పించుకున్న స్వప్న.. అనామికని కళ్యాణ్ కలవనున్నాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -188 లో.. దుగ్గిరాల ఇంటి కోడలికి ఎంత స్వేచ్ఛ ఇచ్చారో మీ ఇంటి కోడలిని చూస్తే తెలుస్తుంది. ఇంత గొప్పింటి వాళ్ళైనా మాములు మనిషి లాగా వెళ్లి వాళ్ళ ఇంట్లో వర్క్ చేశారు. మీ ఇద్దరికీ సన్మానం చేద్దామని అనుకుంటున్నామని మీడియా వాళ్ళు.. కావ్య, రాజ్ లకి సన్మానం చేస్తారు.. ఈ ఫొటోస్ తో పెద్ద ఆర్టికల్ రాస్తామని మీడియా వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఇదంతా కావ్య వల్లే.. అప్పుడు కావ్య ఏదో తప్పు చేసిందని అందరూ అన్నారు కానీ ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుతున్నారు అని సీతరామయ్య అంటాడు. ఈ సందర్భంగా నీకేం కావాలో అడుగమని సీతరామయ్య అంటాడు. నాకేం వద్దు తాతగారు.. ఇంట్లో అందరూ నాతో మాట్లాడాలి. నన్ను కూడా ఈ ఇంటి మనిషిలా చూడాలని కావ్య చెప్తుంది. ప్రొద్దున చెప్పాను కదా అని సుభాష్ అంటాడు. దానికి అందరూ ఒప్పుకుంటారు. మీరు ఎంత మంది ఒప్పుకున్న నా దృష్టిలో ఎప్పుడు స్థానం ఇవ్వనని అపర్ణ కోపంగా చెప్పేసి లోపలికి వెళ్తుంది. మరొక వైపు స్వప్న తను ప్రెగ్నెంట్ కాదని అందరికి తెలిసిపోతుందని ఇంటికి వెళదామని అంటుంది. సరేనని రాహుల్, రుద్రాణి, స్వప్న బయల్దేరుతుండగా డాక్టర్ వచ్చారని నర్సు చెప్తాడు. స్వప్నని తీసుకొని రాహుల్, రుద్రాణి కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. స్వప్న లోపలికి వెళ్లేసరికి.. అక్కడి డాక్టర్ కి స్వప్న ప్రెగ్నెంట్ కాదని విషయం తెలుసు.‌ ఇప్పుడు కూడా వాళ్లకి చెప్పకండని స్వప్న డాక్టర్ కి రిక్వెస్ట్ చేస్తుంది. మీ కడుపులో బేబీ ఆరోగ్యంగా ఉందని స్వప్నతో డాక్టర్ చెప్తుంది. ఇక అక్కడే ఉన్న రాహుల్ , రుద్రాణి డాక్టర్ తో మాట్లాడతారు. ఇప్పుడు నీకు మూడు నెలలు.. నీ కడుపు పెరుగకుంటే అందరికి డౌట్ వస్తుంది. అప్పుడు నేను మోసం చేసానని అనుకుంటారని డాక్టర్ అనగానే నేను చూసుకుంటానని స్వప్న చెప్తుంది. మరొక వైపు కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేసి.. తనకి పెళ్లి కాలేదు, పైగా మిమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసింది నేనే అని చెప్పగానే కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. నీకు ఒక గిఫ్ట్ పంపాను చుడండని అనామిక చెప్తుంది. కళ్యాణ్ , అనామిక పంపిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే.. అందులో కళ్యాణ్ పేరు మీద తన కవితల బుక్ ప్రింట్ అయి ఉంటుంది. అది చూసి కళ్యాణ్ ఇంకా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ పై కాఫీ షాప్ లో కలుద్దామని ఉండడంతో కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే వెళ్లి కలవాలని అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

వాళ్ళిద్దరి ప్రేమ విషయం చెప్తానని చెప్పిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -249 లో.. కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన మధు గట్టిగా అరుస్తాడు. అది విని భవాని.. ముకుంద తన ప్రేమ గురించి ఈ గదిలో చూస్తే తెలుస్తుందని కూడా పట్టించుకోకుండా, కృష్ణ, మురారీల దగ్గరికి వెళ్తుంది. మురారి తలకి ఉన్న కట్టు చూసిన భవాని.. మురారికి ఏమైందోనని కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, ఏమైందని అడుగుతుంది. అప్పుడు కృష్ణ జరిగిందంతా భవానికి చెప్తుంది. ఆ తర్వాత మురారిని కాపాడింది కృష్ణనే అని తన గురించి గొప్పగా భవానికి రేవతి చెప్పగానే.. చాలా థాంక్స్ అని భవాని చెప్తుంది. తన భర్తని తను ఎప్పుడు కాపాడుకుంటునే ఉంటుందని రేవతి అంటుంది. ఆ తర్వాత ఇంటికి పెద్ద కోడలు ముకుంద.. నువ్వు వాళ్లకి హారతి ఇవ్వు అని చెప్పగానే ముకుంద కోపంగానే హారతి ఇస్తుంది. కృష్ణ, మురారిలని ఎవరు విడదీయలేరని మధు అనుకుంటాడు. పాపం ముకుంద.. తన ప్రేమ దక్కించుకుంటానని అనుకుంది. ఎంత ఫీల్ అవుతుందో అని అలేఖ్య అనుకుంటుంది. ఆ తర్వాత అలేఖ్య, మధు ఇద్దరు కలిసి కృష్ణ రావడం గురించి మాట్లాడుకుంటారు. మరొక వైపు మళ్ళీ కృష్ణ ఎందుకు తిరిగి వచ్చిందని మురారిని ముకుంద అడుగుతుంది. మళ్ళీ ముకుందకి ఛాన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటుంది. అలా కాకుండా చూడాలని మురారి అనుకుంటాడు. అప్పుడంటే మేము అగ్రిమెంట్ మ్యారేజ్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఇద్దరం అలా లేమని కృష్ణపై తన ప్రేమని చెప్తాడు.. ఆదర్శ్ మంచివాడు తనతో మళ్ళీ లైఫ్  ని స్టార్ట్ చెయ్ అని మురారి చెప్తాడు. కానీ ముకుంద మాత్రం మురారితోనే కలిసి ఉంటానని అనుకుంటూ.. నీ ప్రేమ కావాలని ఎప్పటిలాగే మాట్లాడుతుంది. మన ప్రేమ విషయం ఎలాగు పెద్ద అత్తయ్య తెలుసుకోవాలని అనుకుంటుంది. అదేదో నేను చెప్తానని మురారిని ముకుంద  బ్లాక్ మెయిల్ చేయగానే మురారి టెన్షన్ పడతాడు‌. మరొక వైపు రేవతి దగ్గరికి కృష్ణ వచ్చి.. మీరు నాకు అబద్ధం చెప్పి తీసుకొని వచ్చారా లేక ఏసీపీ సర్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా అని కృష్ణ అడుగుతుంది. నేను అబద్ధం చెప్పలేదు. నిజంగానే మురారి నిన్ను ప్రేమిస్తున్నాడని రేవతి చెప్తుంది. ఏసీపీ సర్ నా మీద ఉన్న ప్రేమని నాకు చెప్పేలా నేనే చేస్తాను. ఏసీపీ సర్ నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు తెలుసని మీరు చెప్పకండని రేవతికి కృష్ణ చెప్తుంది. మరొకవైపు మురారితో భవాని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శైలేంద్ర చెప్పినట్టుగా మేనేజర్ చేస్తాడా.. ఏంజిల్ కి రిషి ఏం చెప్పనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -855 లో... రిషి కోసం వసుధార ఇంటికి వస్తుంది ఏంజిల్. ఏంజిల్ రావడం చూసిన రిషి లోపలికి వెళ్లిపోతాడు. ఏంజిల్ వచ్చి.. ఇంకా రిషి ఇంటికి రాలేదు నీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. లేదు వర్క్ ఉందేమో వస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళమని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. వసు చక్రపాణి లు కంగారుగా మాట్లాడడం చూసిన ఏంజిల్ రిషి ఇక్కడ ఉన్నాడా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏంజిల్ ఇక్కడే ఉంటే డౌట్ వస్తుందని.. నేను ఇంకో పది నిమిషాల్లో వస్తాను. నువ్వు కంగారుపడకని ఏంజిల్ కి రిషి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చుసిన ఏంజిల్ ఏంటి రిషి నేను మీతో మాట్లాడుతున్నా అని తెలిసి ఇలా చేసినట్టు ఉన్నాడని డౌట్ గా అనేసరికి.. రిషి సర్ ఇక్కడ ఎందుకు ఉంటాడని వసుధార చెప్తుంది.. ఆ తర్వాత ఏంజెల్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రిషి బయటకు వచ్చి.. నాకు ఆ ఇంటికి వెళ్లాలని లేదని చెప్తాడు. ఎందుకని వసుధార అడుగుతుంది. నీకు తెలుసు కదా అని రిషి అంటాడు. అయిన విశ్వనాథ్ సర్ కోసం అయిన వెళ్ళాలని రిషి ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ కి కాఫీ ఇస్తుంది ఏంజిల్. అప్పుడే రిషి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. రిషి రావడంతో ఏంజిల్ బయటకు వెళ్ళిపోతుంది. ఏమైంది మీకేమైనా గొడవ అయిందా అని విశ్వనాథ్ అడుగుతాడు. అదేం లేదని ఏంజిల్ ని పిలిచి.. మన మధ్య ఏం గొడవ లేదు కదా అని రిషి అంటాడు. నీకు లేదేమో నాకు ఉందని ఏంజిల్ అంటుంది. మనం ఫ్రెండ్స్ మాత్రమే.. ఫ్రెండ్స్ మధ్య ఇలా ఉండకూడదని రిషి చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే రిషి వెనకాల ఏంజిల్ వచ్చి.. నీ ఉద్దేశం మారదా అని అడుగుతుంది. నా ఉద్దేశ్యం,  నిర్ణయం.. రెండు మారవు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోమని ఏంజిల్ కి రిషి చెప్తాడు. మరొకవైపు కాలేజీ మేనేజర్ దగ్గరికి శైలేంద్ర వెళ్లి.. కాలేజీ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి తెలుసుకుంటాడు. నేను చెప్పినట్లు చేస్తే నీ కూతురు పెళ్లికి కావలసిన డబ్బు ఇస్తానని మేనేజర్ కి చెప్తాడు శైలేంద్ర. కాలేజీకి,  జగతి కి ప్రాబ్లమ్ క్రియేట్ చేసేలా మేనేజర్ కి శైలేంద్ర ఏదో చెప్తాడు. మరొకవైపు వసుధారని ఏంజిల్ కలుస్తుంది. నువ్వు నా ప్రేమ విషయం గురించి రిషితో నువ్వే చెప్పాలి. రిషిని రమ్మని చెప్పానని అనగానే.. అప్పుడే రిషి వస్తాడు. రిషి రాగానే ఏంజిల్ ప్రేమ గురించి వసుధార అడుగుతుంది. ఏంజిల్ తన ఇష్టాన్ని చెప్పినప్పుడు, మీరు కూడా మీ నిర్ణయం చెప్పాలి కదా అని రిషితో వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ సీజన్-7లోకి షకీలా ఎంట్రీ ఇవ్వనుందా?

కొన్ని నెలల నుండి బిగ్ బాస్ సీజన్-7 గురించి ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ టైమ్ రానే వచ్చింది. మరో వారంలో బిగ్ బాస్ సీజన్-7 తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. అయితే ఇందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే ఈ సారి కాస్త భిన్నంగా ఉండబోతుందంట బిగ్ బాస్. ఎవరూ ఊహించనివిధంగా ఈసారి ఉండబోతుందన్నట్టుగా ఇప్పటికే ప్రోమోలో నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరనే ఆసక్తితో పాటు కంటెస్టెంట్స్ లిస్ట్ లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  మొగలిరేకులు ఫేమ్ సాగర్ కన్ఫమ్ అని వినిపిస్తుంది. కార్తీకదీపం సీరియల్ ఫేమ్ మోనిత అలియాస్ శోభిత శెట్టి కూడా వెళ్తున్నట్టు సమాచారం. అయితే ఒకరు మీడియా నుండి వెళ్తున్నట్టుగా ఉంది కానీ అది ఎవరనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ‌అయితే రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి కాస్త భిన్నంగా కొత్త కంటెంట్ తీసుకరావడానికి 'షకీలా' ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. తనతో ఆల్రెడీ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం కూడా జరిగిందంట. ఈ సారి షకీలాని పాజిటివ్ గా చూపించడానికి ఒక పవర్ ఫుల్ 'AV' ని కూడా షూట్ చేసారంట. తను ఎన్నో బీ గ్రేడ్ సినిమాల్లో చేసాక తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయంట. డబ్బుల కోసం వాళ్ళ అమ్మ మొదటిసారి షకీలాని అక్కడికి పంపించందంట. అయితే తను అప్పుడు ప్లే గర్ల్స్ అనే పిక్చర్ ఓకే అయిందంట. అదే టైమ్ లో డబ్బులకి ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మ పంపించిందంట. వాళ్ళ అక్కతోనే షకీలా వెళ్ళిందని ఒక ఇంటర్వూలో చెప్పింది‌. కాగా ఇలా తను ఇలా అవడానికి కారణమేంటి? ఎందుకిలా జరిగిందని షకీలా చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. అయితే తన గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలని చూపిస్తూ, తన ఆఫ్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉందని షార్ట్ వీడియో తీసారంట బిగ్ బాస్ మేకర్స్. అయితే తను కూడా ఒక ఆడదే, తనకి సమాజంలో సరైన గుర్తింపు లేదంటూ సమాజానికి చెప్పేలా తనని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేయాలని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుందంట. అందుకే ఈ సారి తనని బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నారంట. మరి షకీలా కన్ఫమా కాదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ లో ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ జీల!

అనిల్ జీల.. 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ తో చాలా మందికి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన  'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు. యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి...  అనిల్ జీల సొంతంగా ఒక మూవీ స్క్రిప్ట్ రాస్తున్నాడన్న విషయం తెలిసిందే. అనిల్ జీల రాసిన కథని కొంతమంది ప్రొడ్యూసర్స్ కి కూడా వినిపించాడంట. అయితే ఈ తరుణంలో బిగ్ బాస్ వాళ్ళు తనని అప్రోచ్ అయినట్టు చెప్పాడు. తన గురించి AV  కూడా  ‌తీసుకొని వెళ్ళారంట. కానీ మళ్ళీ కాల్ రాలేదని అనిల్ జీల అన్నాడు. ఒకవేళ ఎలా ఉంటుందంటు తనవాళ్ళని అడిగి తెలుసున్నాడు అనిల్ జీల. అయితే అందరూ బిగ్ బాస్ లోకి వెళ్తే చాలా క్రేజ్ వస్తుందని చెప్పారంట. వాళ్ళ అమ్మ అయితే చాలా ఎక్సైట్ మెంట్ గా ఫీల్ అవుతుందంట. అనిల్ జీలా వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇలా బిగ్ బాస్ లోకి రమ్మని పిలిచారని చెప్పగా.. ఒకవేళ నువ్వు వెళ్తే మేమంతా ఫ్యామిలీ వీక్ లో వస్తామంటూ చెప్పిందంట. అయితే ఒకవైపు తను రాసిన కథని ప్రొడ్యూసర్స్ కి వినిపించే పనిలో ఉన్న అనిల్ జీల.‌. బిగ్ బాస్ లోకి వెళ్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. తనేమో ఇక వెళ్ళను అని చెప్పాడు. మరో వారంలో మొదలయ్యే బిగ్ బాస్ లో ఇంకా ఎవరు వెళ్తారనే క్లారిటీ లేకుండా అంతా ఉల్టా పల్టా చేస్తున్నారని టాక్ నడుస్తుంది. మరి మై విలేజ్ షో అనిల్ జీల బిగ్ బాస్ లోకి వెళ్తాడా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

పెళ్ళి అయిన తర్వాత నా ఫస్ట్ రాఖీ పండుగ!

  అమ్మాయిలకి పెళ్ళికి ముందు ఒక ప్రపంచం పెళ్ళి తర్వాత మరొక ప్రపంచం అనిపిస్తుంది. ముఖ్యంగా రాఖీ పండుగకి అన్నని, లేదా తమ్ముడిని మిస్ అవుతున్న ఫీలింగ్ ప్రతీ ఒక్క అమ్మాయికి ఉంటుంది. రాఖీ పండుగకి తన అన్నయ్యతో అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు మా అత్తగారింట్లో ఉన్నా అంటూ ఎమోషనల్ వీడియోని అప్లోడ్ చేసింది యాదమరాజు భార్య స్టెల్లా. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో యాదమరాజు ఒకడు‌.  యాదమరాజు కామెడీ టైమింగ్ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాదు పటాస్ షో లో తన పంచ్ లతో అప్పట్లో నవ్వులు పూయించాడు. జబర్దస్త్ లోని అన్ని టీమ్స్ లో ఒక కంటెస్టెంట్ గా చేసిన యాదమరాజు తాజాగా కొత్త టిమ్ తో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాదమరాజు, స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అప్పటి నుండి స్టెల్లాతో కలిసి వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ టూర్ కి వెళ్ళిన వ్లాగ్ చేసి తమ యూట్యూబ్ ఛానెల్ ' స్టెల్లారాజ్ 777' లో ఇద్దరు కలిసి అప్లోడ్ చేస్తున్నారు. అమెరికాలో జాబ్ చేసి వచ్చిన స్టెల్లా, యాదమరాజుని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. వీళ్ళిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో హిలేరియస్ స్కిట్లు చేశారు. తమ యూట్యూబ్ ఛానెల్ ఇప్పటికే ఎనిమిది లక్షల మంది సబ్ స్కైబర్స్ కలిగి ఉంది. కాగా వీళ్ళు చేసిన వ్లాగ్స్ అన్నీ దాదాపు లక్షకు పైగా వ్యూస్ వస్తున్నాయి. పెళ్ళి అయిన కొత్తల్లో అత్తగారింట్లో, మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్, లాస్ట్ డే ఇన్ ఇండియా, హోమ్ టూర్ ఇలా పాపులర్ అయిన వ్లాగ్స్ చాలానే ఉన్నాయి. అయితే  కొన్ని వారాల క్రితం యాదమరాజుకి యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? ఎలా జరిగింది? యాక్సిడెంట్ తర్వాత ఎలా ఉన్నాడో చెప్తూ 'మా ఆయన యాక్సిడెంట్ తర్వాత ఎలా అయ్యాడంటే' అనే వ్లాగ్ చేసి తమ యూట్యూబ్ ఛానెల్  లో అప్లోడ్ చేసింది స్టెల్లా. అయితే తాజాగా పెళ్ళి అయిన తర్వాత నా ఫస్ట్ రాఖీ పండుగ అనే వ్లాగ్ చేసింది స్టెల్లా. ఇందులో తన అన్నతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో చెప్పుకొచ్చింది స్టెల్లా. వాళ్ళ అన్నకి స్టెల్లా రాఖీ కట్టిన తర్వాత కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత తనకి గిఫ్ట్ ఏదని స్టెల్లా అడుగగా.. తనకోసం తీసుకున్న చీరని ప్రెజెంట్ చేశాడు వాళ్ళ అన్న. ఇదంతా ఎమోషనల్ గా సాగింది. 'జీవితం గడిచేకొద్దీ మనం మారవచ్చు, మన మార్గాలు మారవచ్చు. అన్నా చెల్లెల్ల బంధం ఎప్పటికీ మారదు' అని మెసెజ్ ఇచ్చారు స్టెల్లా యాదమరాజు దంపతులు.