అనుష్క కోసమే ఈ మూవీ ఒప్పుకున్నా.. డెడ్ సీన్ ఉండకూడదని కాంట్రాక్టులో రాయించా

సుమ అడ్డా షో ఈ వారం అద్దిరిపోయే పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి నవీన్ పోలిశెట్టి వచ్చాడు. "లాస్ట్ టైం మనమొక షో చేసాం. షో హిట్ అయ్యింది. మా జాతిరత్నాలు సినిమా కూడా హిట్ కొట్టింది. చెప్పాలంటే సుమ గారే మా లేడీ లక్..ఇక ఈసారి కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా..నిజం చెప్పాలి అంటే స్క్రిప్ట్ బాగుందని ఈ మూవీ ఒప్పుకున్నాను అనుకుంటారు కానీ అనుష్క గారు ఉన్నారని ఈ మూవీకి ఒప్పుకున్నా" అన్నాడు.  తర్వాత ఆరియానా, శివజ్యోతితో గేమ్ ఆడించింది సుమ. "చెప్పండి హ్యాంగోవర్ గురించి ఏం చెప్తారు" అనేసరికి "నేను అసలు అలాంటి పనులు చేయను. నాకు హ్యాంగోవర్ అంటే ఏంటో తెలీదు" అని చెప్పింది ఆరియానా. పక్క నుంచి శివజ్యోతి మాత్రం పడీ పడీ నవ్వింది ఆ జోక్ విని. తర్వాత నవీన్ , మహేష్ తో గేమ్ ఆడించింది.  "అనుష్క గారి మూవీస్ చూసారు కదా. ఆమె చేసిన వార్ జోన్ మూవీస్ లో హీరో స్టార్టింగ్ లోనే చనిపోతాడు. ఐతే ఈ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి స్టోరీ చెప్పినప్పుడు కూడా అదే విషయాన్నీ అడిగాను. ఎన్నో మినిట్ లో నన్ను లేపేస్తారు అని అడిగాను. ఐతే ఈ మూవీలో అలా ఉండదు  ఇద్దరూ ఎండింగ్ వరకు ఈక్వల్ గా చేస్తారు అని చెప్పారు.. కాంట్రాక్టు లో ఫస్ట్ ఆ విషయాన్ని రాయించాను .. డెడ్ సీన్ అనేది రాకూడదు అని చెప్పాను.." అంటూ ఈ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు నవీన్.

శ్రీజతో ఘనంగా మానస్ ఎంగేజ్‌మెంట్!

'బ్రహ్మముడి' సీరియల్ లో నటిస్తున్న రాజ్ అలియాస్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలోకి వెళ్ళొచ్చాక మంచి క్రేజ్ లో ఉన్నాడు మానస్. ఒకవైపు సీరియల్, మరొకవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ తో బిజీ గా ఉన్నాడు. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకధారణ పొందిన సీరియల్ అనడంలో ఆశ్చర్యం లేదు. మానస్  ఆ సీరియల్ లో రాజ్ పాత్రలో మెప్పిస్తున్నాడు. రాజ్ చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టాడు‌. రాజ్ మధ్యలో సినిమాలకి బ్రేక్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటున్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక సింగ్ తన చుట్టూ తిరిగినా అసలు పట్టించుకోకుండా, తన గేమ్ తను ఆడుతూ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు మానస్. అంతే కాకుండా విష్ణుప్రియతో ప్రైవేట్ అల్బమ్స్ చేశాడు. 'జరి జరి పంచే కట్టు',  'గంగులు' పాటలకి మిలియన్స్ లలో వ్యూస్ వచ్చాయి. అయితే మానస్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికి తెలుసు. తన తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా సందర్భాలల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా మానస్ తన దగ్గరి బంధువు అయిన శ్రీజతో ఎంగేంజ్ మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే శ్రీజని పెళ్లి చేసుకోనున్నాడు. సన్నిహితులు, బంధువుల మధ్య గ్రాంఢ్ గా మానస్, శ్రీజ ల ఎంగేజ్ మెంట్ జరిగింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మానస్ కి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అయిన కాజల్, విజే సన్నీ ఇద్దరు తమ ఇన్ స్టాగ్రామ్ లలో రాజ్ కి విషెస్ ని తెలియజేశారు‌. రాజ్ తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ' ఏంగేజ్డ్' అని పోస్ట్ చేశాడు.

బిగ్ బాస్-7 లేటెస్ట్ ప్రోమో అదిరింది.. సమంత గురించి అడిగిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్-7 గురించి రోజు రోజుకి ఉత్కంఠపెరిగిపోతుంది. మరి ఆ ఉత్కంఠతకి తెరతీస్తూ బిగ్ బాస్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది.  కొత్త కంటెస్టెంట్స్ తో ఊహించని ట్విస్ట్ లతో వస్తుంది బిగ్ బాస్ సీజన్ -7. అయితే ప్రతీ సీజన్ ప్రైజ్ మనీ చివరలో అనౌన్స్ చేసి చివరగా మిగిలిన ఇద్దరిలో ప్రైజ్ మనీ తీసుకోమని వెళ్ళిపోమంటారు. అయితే ఈ సారి హౌస్ లోకి వెళ్ళిన వెంటనే తీసుకొని వెళ్ళిపోమన్నాడు నాగార్జున. ఇక డబ్బులున్న ఆ సూట్ కేస్ కోసం హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ మధ్య తోపులాట కూడా జరిగినట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఈ సీజన్ అంత ఈజీ కాదని నాగార్జున అన్నాడు. అయితే ప్రోమోలో ప్రియాంక జైన్ వాయిస్ కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆమెని  హార్ట్ బ్రేకింగ్ నుండి బయటకు రా అని నాగార్జున అనగా తను నవ్వేసింది. మరొకరొని ఏం చేయలానుకుంటున్నావని నాగార్జున అడుగగా.. బిగ్ బాస్ టైటిల్ తోనే బయటకు వస్తానని ఒక కంటెస్టెంట్ అంది. దానికి నాగార్జున.. ఈ సీజన్ అన్ని సీజన్లలా కాదని అన్నాడు. మరి నాగార్జునతో మాట్లాడిన ఆ కంటెస్టెంట్ ప్రియాంక జైనా లేక మరొకరా తెలియాల్సి ఉంది. కాగా హౌస్ లోని రూమ్స్ ఎలా ఉంటాయో చూపించారు మేకర్స్. ఇక ఖుషీ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చీ రాగానే 'ఎక్కడ మీ హీరోయిన్ సమంత' అంటూ నాగార్జున అనగానే.. వదిలేయండి అన్నట్టుగా విజయ్ దేవరకొండ స్కిప్ చేశాడు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటలకి గ్రాంఢ్ లాంచ్ అవుతున్న అతిపెద్ద షో బిగ్ బాస్ కి రంగం సిద్ధం అయింది. ఉల్టా పల్టా ట్యాగ్ తో వస్తున్న ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!

రాజ్ చేసిన ఆ పనికి కావ్య ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -191 లో... కిచెన్ లో ఉన్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి కావ్యని నాతో పంపించు రెడీ చెయ్యాలి.. మీరు తర్వాత మాట్లాడుకోండని రాజ్ తో చెప్తుంది. రాజ్ సరేనని కావ్యని వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత వ్రతానికి అంతా సిద్ధం చేస్తారు. కావ్యని రెడీ చేసి ఇందిరాదేవి తీసుకొని వస్తుంది. కావ్యని చూసి అందరూ బాగున్నావని చెప్తారు. అప్పుడే కనకం, అప్పు కలిసి దుగ్గిరాల ఇంటికి వస్తారు. అందంగా రెడీ అయిన కావ్యని చూసి కనకం మురిసిపోతుంది. కనకం, అప్పులని చూసిన కావ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు దుగ్గిరాల ఇంటి కోడలిలాగా ఉన్నావని అప్పు చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి కనకం చీర కాసు తీసుకొని వస్తుంది. అది చూసిన రుద్రాణి.. అబ్బో అంత బరువు మోయలేకపోతుందని అనగానే.. అప్పు దానికి కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకని ఇందిరాదేవి అంటుంది.. ఆ తర్వాత కావ్య వరలక్ష్మి వ్రతం చేస్తుంది. వ్రతం పూర్తయిన తర్వాత అందరికి వాయినం ఇచ్చి పంపిస్తారు. కనకానికి కూడా ఇచ్చి కావ్య పంపిస్తుంది. ఆ తర్వాత అందరూ తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నువ్వు వెళ్లి రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కావ్యకి ఇందిరాదేవి చెప్తుంది‌. ఆశీర్వాదం కోసం రాజ్ దగ్గరకి వెళ్ళిన కావ్య.. కాళ్ళు మొక్కబోతుంటే రాజ్ వెనక్కి వెళ్తాడు. పైగా అక్షింతలు కిందపడేస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు.. నన్ను క్షమించండి, తనని నేను క్షమించలేనని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు. కావ్య చాలా బాధపడుతుంది. రుద్రాణి, రాహుల్, స్వప్నలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత గదిలో ఉన్న రాజ్ దగ్గరకి కావ్య వెళ్తుంది. గదిలో ఉన్న గుట్టుని బయట పెట్టారు. ఇన్ని రోజులు మీలో మార్పు రాకుండా ఉంటుందా? మార్చుకుంటాను అన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు అది లేదని కావ్య అంటుంది. వాళ్ళ మాటలు సీతారామయ్య వింటాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండి నేనేం పొందుతున్నాను. మీ అయిష్టతని సహిస్తున్నాను,  ఇష్టం లేకున్నా సహా జీవనం చేస్తున్నానని కావ్య ఎమోషనల్ అవుతుంది. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

డోంట్ టాక్ టు మీ నవీన్... ఎలా కనిపిస్తున్నా నేను నీకు!

సుమ అడ్డా షో స్టేజి మీద ఈ వారం ఎపిసోడ్ ఫుల్ నవ్వు తెప్పించేసింది. ఈ షోకి నవీన్ పోలిశెట్టి, మహేష్ ఆచంట, ఆరియానా, శివజ్యోతి ఎంట్రీ ఇచ్చారు. నవీన్ దగ్గరకు ఆరియానా వచ్చి "ఏంటి ఇన్ని నెమళ్ళు ఉన్నాయి నీ డ్రెస్ మీద" అని అడిగింది. "నాట్యం చేస్తాయి ఏం వెళ్తావా నువ్వు" అన్నాడు మహేష్ ఆచంట  కామెడీగా. " నవీన్ నాకు కూడా ఒక అబ్బాయిని చూసి పెట్టొచ్చుగా" అని అడిగింది ఆరియానా "ఒరేయ్ ప్లీజ్ నాకు పెళ్లయిపోయింది.. నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని మహేష్ ఆన్సర్ ఇచ్చాడు. "మహేష్ నేను నీ గురించి ఆలోచించట్లేదు నువ్వు అన్న లాంటివాడివని చెప్పేస్తా అందరికీ ..పెళ్లి కానీ నాకు పెళ్లి సమస్య" అంది ఆరియానా. "నిన్ను చూస్తే ఎవరూ అలా అనుకోరు అదే పెద్ద సమస్య" అని కామెడీ కౌంటర్ వేసింది శివజ్యోతి. "సర్ నాకేం తక్కువ" అనేసరికి "నీకు అన్ని ఎక్కువే" అంది శివజ్యోతి. నవీన్ పోలిశెట్టికి ఏమీ అర్ధం కాకా "నీకు పెళ్ళైపోయిందా" అని అమాయకంగా అడిగాడు నవీన్.."డోంట్ టాక్ టు మీ నవీన్..నేను పెళ్ళైపోయిందానిలా కనిపిస్తున్నానా నీకు " అంటూ సీరియస్ గా అలిగి  తన పోడియం దగ్గరకు వెళ్ళిపోయింది.  ఇక తర్వాత మహేష్ ఎంట్రీ ఇచ్చి నవీన్ టాలెంట్ గురించి చెప్పాడు "స్టాండప్ కమెడియన్ ఆయన..చితగ్గొటేసాడు. 5 బ్లాకులు, సింగల్ టేక్ లో 30 నిమిషాల్లో చేసాడు" అని చెప్పేసరికి సుమ నవీన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. "స్టాండప్ కామెడీ అనే క్యారెక్టర్ ని పెట్టి దానికి పూర్తి న్యాయం చేయగలవాళ్ళు టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారంటే అది నవీన్ మాత్రమే" అంది సుమ. నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ కృష్ణాష్టమి రోజు సెప్టెంబర్ 7న రిలీజ్ కి రెడీ అయ్యింది. నవీన్ నటించిన ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు మూవీస్ సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. ఇక ఈ మూవీలో కామెడీ ఎలా ఉంటుందో చూడాలి.

కృష్ణని ముకుంద ఎందుకు బయటకు తీసుకెళ్ళిందని మురారి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -252 లో....కృష్ణ ఇంట్లో అందరికి వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలని చెప్పడంతో కృష్ణకి బాగా తెలుసని అందరూ అనుకుంటారు. చాలా బాగా చెప్పావ్ కృష్ణ.. మనమిద్దరం వెళ్లి పూజకి సంబంధించినవన్నీ తీసుకొని వద్దామని ముకుంద చెప్పగానే.. సరేనని కృష్ణ అంటుంది. ఇప్పుడు కృష్ణని ముకుంద ఎందుకు బయటకు తీసుకొని వెళ్తుందని మురారి అనుకుంటాడు. మరొక వైపు రేవతి కూడా అలాగే అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద ఎందుకు కృష్ణని బయటకు తీసుకొని వెళ్ళిందని మురారి అనుకుంటాడు. మా ప్రేమ విషయం కృష్ణకి చెప్తుందా? కృష్ణ ఎలా రియాక్ట్ అవుతుందో అని మురారి టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే మురారి దగ్గరికి మధు వచ్చి.. ఏదో టెన్షన్ లో ఉన్నట్లు ఉన్నావ్.. డ్రింక్ చేద్దామని అనగానే మురారి చిరాకు పడుతాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసని మధు అంటాడు. నిన్న గదిలో ముకుంద రాసింది చేంజ్ చేసి రాసింది నేనే అని మధు చెప్పగానే.. అవునా అసలేం జరిగిందని మధుని మురారి అడుగుతాడు. మధు ఎలా చేంజ్ చేసాడో చెప్తాడు. ఆ తర్వాత ముకుంద, మురారి ల ప్రేమ సంగతి ముకుందనే చెప్పిందని మురారీతో మధు చెప్తాడు. కృష్ణ నువ్వు ఎప్పుడు కలిసి ఉండాలని మధు అనగానే..‌ మధుని మురారి హగ్ చేసుకుంటాడు.‌ ఆ తర్వాత మురారి దగ్గరికి ముకుంద వచ్చి.. రేపు కృష్ణని షాపింగ్ కి తీసుకొని వెళ్తున్నాను, మన ప్రేమ గురించి కృష్ణకి చెప్తానని అంటుంది. నేను చెప్పనివ్వను, నేను వస్తానని మురారి అంటాడు. ఇంకా బాగా చెప్పొచ్చు.. రా అని ముకుంద అంటుంది. మురారి కావాలనే ముకుందని రెచ్చగొట్టేల మాట్లాడతాడు. కృష్ణ గదిలోకి వచ్చేసరికి చాపని దాచిపెట్టి కృష్ణ బెడ్ పై పడుకునేల చెయ్యాలని మురారి వెళ్ళిపోతాడు. ముకుందకి కోపం వస్తుంది. మరొక వైపు ఎప్పటిలాగే మధు అలేఖ్యల మధ్య చిలిపి తగాధా జరుగుతూనే ఉంటుంది. మరొక వైపు చాప కోసం కృష్ణ వెతుకుతుంటుంది. కృష్ణ బెడ్ పై పడుకోవచ్చు కదా అని మురారి అన్నా కూడా కృష్ణ వినకుండా.. పైన ఉన్న చాపని తీసుకుంటూ.. పడుతుంటే  అప్పుడే కృష్ణని కింద పడకుండా మురారి పట్టుకుంటాడు. ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం.. మా నాన్నను బయటకు రానివ్వను

జబర్దస్త్ లో కమెడియన్స్ తో పాటు మంచి ఫేమస్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందులో యోధ అనే చైల్డ్ ఆర్టిస్ట్ మనకు బాగా తెలుసు. ఆ చిన్నారి వేసే పంచ్ డైలాగ్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రాకేష్ స్కిట్స్ లో ఈ చిన్నారి ఎక్కువగా  కనిపించేది. జడ్జ్ రోజాకు కూడా యోధ అంటే చాలా ఇష్టం. యోధ జబర్దస్త్ కి రావాలంటే వాళ్ళ నాన్న చందుని వెంట బెట్టుకుని వస్తుంది. వాళ్ళ నాన్న కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. అలాంటి యోధ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. "యోధ నువ్వెప్పుడైనా నాన్నను మిస్ ఐన ఫీలింగ్ వచ్చిందా " అని అడిగేసరికి "నేనెప్పుడూ మిస్ అవలేదు. ఏదైనా మూవీస్ చూసినప్పుడు నాన్న సెంటిమెంట్ వస్తే కనెక్ట్ ఐపోయి ఏడ్చేస్తాను. నాన్న నా పక్కనే ఉంటారు కదా ఇంకెందుకు మిస్ అవుతాను" అని చెప్పింది.  " మీ నాన్నను ఎటైనా ఒక నెల కనిపించకుండా పంపిస్తే" అని యాంకర్ అడిగేసరికి "బిగ్ బాస్ కి పంపిస్తున్నారా" అని అడిగాడు యోధా వాళ్ళ నాన్న చందు. "బిగ్ బాస్ కి పంపిస్తే పక్కా నేను నాన్నను సపోర్ట్ చేస్తా అస్సలు మిస్ అవును. మా డాడీని బిగ్ బాస్ హౌస్ లోంచి అస్సలు బయటకు రానివ్వను. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం.. నేను వెళ్ళను కానీ నాన్నను ఎలాగైనా రికమెండ్ చేసైనా పంపిస్తాను" అని చెప్పింది. "యోధ స్టార్టింగ్ రెమ్యూనరేషన్ 2500 , గోవిందుడు అందరివాడేలే మూవీలో 3500 రెమ్యూనరేషన్ తీసుకుంది. ఎక్కడికి వెళ్లినా యోధతో చాలామంది సెల్ఫీస్ తీసుకుంటారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆడపిల్లల్ని తీసుకుని యాక్టింగ్ చేయిస్తున్నానని కూడా నా వెనక చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ నేను నా వైఫ్ అవన్నీ పట్టించుకోము. యోధకి యాక్టింగ్ ఇష్టం, ప్రాణం తన కోసం ఏదైనా చేస్తాం" అని చెప్పారు యోధ వాళ్ళ నాన్న చందు.

శైలేంద్ర అగ్రిమెంట్ తో వాళ్ళకి వచ్చే సమస్యేంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -858 లో.. వసుధార దగ్గరికి రిషి వెళ్లి.. ఏంటి ఆటిట్యూడ్.. ఆ ప్రిన్సిపాల్ సర్ నా దగ్గరికి వచ్చి సిలబస్ గురించి డిస్కషన్ చెయ్యమని చెప్పారంట రాలేదు అని రిషి వసుధారపై అరుస్తాడు. మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు డిస్టబ్ చేయడమని రాలేదని వసుధార చెప్తుంది.  ఆ తర్వాత వసుధారని క్యాబిన్ లో కొన్ని పేపర్స్ తీసుకొని రమ్మని రిషి పంపిస్తాడు. వసు రిషి క్యాబిన్ కి వెళ్లి.. తన కళ్ళని డ్రా చేసి ఉంది చూసి మురిసిపోతుంది. అప్పుడే రిషి వచ్చి కోపంగా.. చేతిలో నుండి అది లాక్కుంటాడు. మీకు చెప్పిన పని మాత్రమే చెయ్యండని వసుధారపై రిషి కోప్పడతాడు. సర్ కి ఇంకా నాపై ప్రేమ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నేను ఏంజిల్ కి సరిపోనని తనకి తెలిసేలా మీరే చెయ్యాలి అని వసుధారని అడుగుతాడు రిషి. చేస్తాను ఏంజిల్  హెల్ప్ అడిగింది చేశాను, మీక్కూడా చేస్తానని వసుధార చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి డ్రా చేసిన వసుధార కళ్ళని చూస్తుంటాడు. వసుధార చాటు నుండి చూసి.. మీ డ్రాయింగ్ బాగుందని చెప్పి వెళ్ళిపోతుంది. డ్రాయింగ్ బాగుందేంటీ, బాగుంది కళ్ళు అని రిషి అనుకుంటాడు. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు దేవయాని దగ్గరికి వచ్చి.. లాకర్ లో ఉన్న నా గోల్డ్ ఇవ్వమని జగతి  అడుగుతుంది. అయిన ఇప్పుడు గోల్డ్ ఎందుకు అని అన్నీ ఆరా తీస్తుంది దేవయాని.. నాకు అవసరం ఉంది ఇవ్వండని జగతి అడుగుతుంది. అయిన దేవయాని అన్ని అడుగుతుంటుంది. అప్పుడే ఫణింద్ర వచ్చి.. ఏమైంది అని అడగ్గానే దేవయాని చెప్తుంది. ఇప్పుడు గోల్డ్ ఎందుకని ఫణింద్ర కూడా అడుగుతాడు. జగతి, మహేంద్ర ఇద్దరు సైలెంట్ గా ఉండడంతో శైలేంద్ర కలుగజేసుకొని.. జరిగిందంత చెప్తాడు... గోల్డ్ తాకట్టు పెట్టి సాలరీస్ ఇవ్వడానికి అడుగుతాన్నారు అనగానే.. ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదు గోల్డ్ పెట్టడం కరెక్ట్ కాదు, అంత డబ్బు ఇప్పుడు ఎలా సర్దుబాటు అవుతుందని ఫణింద్ర అంటాడు. నేను సర్దుబాటు చేస్తాను. ఒక ఛాన్స్ ఇవ్వండి అని శైలేంద్ర అనగానే ఫణింద్ర సరే అంటాడు.. మరొక వైపు సౌజన్య రావుని శైలేంద్ర కలిసి ఏదో అగ్రిమెంట్ రెడీ చేసి తీసుకురమ్మని అంటాడు‌. ఆ తర్వాత ఫణీంద్రకి శైలేంద్ర కాల్ చేసి.. డబ్బులు ఇవ్వడానికి మా ఫ్రెండ్ ఒప్పుకున్నాడని అంటాడు. అది విని అవునా.. నిజమేనా అని ఫణీంద్ర అంటాడు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకొమని చెప్తున్నాడని శైలేంద్ర అనగానే.. ముందు మనకి ప్రాబ్లమ్ క్లియర్ కావడం ముఖ్యం, ఆ అగ్రిమెంట్ పూర్తి చేసుకొని డబ్బులు తీసుకొని రా అని శైలేంద్రతో ఫణింద్ర చెప్తాడు. అగ్రిమెంట్ ఏంటని జగతి, మహేంద్ర ఇద్దరు  టెన్షన్ పడుతారు. ఆ తర్వాత ఈ అగ్రిమెంట్ ద్వారా కాలేజీ నీనుండి నాకు వస్తుందని సౌజన్యరావుతో శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీరియల్ యాక్టర్స్ వస్తే బిగ్ బాస్ షోకి ప్లస్ అవుతుంది!

బిగ్ బాస్ మరి గంటల్లో సందడి చేయబోతోంది. ఐతే ఇందులో ఎక్కువమంది సీరియల్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. ఐతే సీరియల్ యాక్టర్స్ బిగ్ బాస్ లోకి రావడం వలన ఉండే అడ్వాంటేజ్ గురించి గత సీజన్ కామన్ మాన్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.  "బిగ్‌బాస్-7 వాళ్లేమో ఉల్టా పుల్టా అంటున్నారు.. కంటెస్టెంట్ల ముఖాలు చూస్తే అందరూ సీరియల్ యాక్టర్సేనా  రొట్ట.. అనేసి చాలా మంది ఫీలవుతున్నారు. కానీ తెలుసుకోవాల్సిన నిజమేంటంటే.. బిగ్‌బాస్-2 విన్నర్ ఒక సీరియల్ యాక్టర్, బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ ఒక సీరియల్ యాక్టర్.. చాలా సీజన్లలో టాప్-5 వచ్చినవాళ్లంతా సీరియల్ యాక్టర్సే. సీరియల్ యాక్టర్స్ వెళ్లినంత మాత్రాన హౌస్ లో ల్యాగ్ చేస్తారని కాదు. సీరియల్ లో స్క్రిప్ట్ ఇస్తారు ఎదో చేయిస్తారు హౌస్ లో అలా ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు చేసే పనులన్నీ చూపిస్తారు. వాటిని చూడడానికి ఆడియన్స్ కి ఇంటరెస్ట్ గా ఉంటుంది. సీరియల్ ఆర్టిస్టులు రావడం వలన ఫామిలీ ఆడియన్స్ కి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఆటోమేటిక్ గా టిఆర్పి రేటింగ్ కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా మొత్తం యాక్టివ్ గా ఉంటుంది. రివ్యూస్ బాగుంటాయి. మంచి ప్రోమోస్ రిలీజ్ అవుతాయి..కొత్త కంటెంట్ క్రియేట్ అవుతుంది . సీరియల్ యాక్టర్లు ఎక్కువమంది రావడం వల్ల ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే కాదు.." అని చెప్పాడు.  ఆదిరెడ్డి చేసిన ఈ ఎనాలిసిస్ కి నెటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు. " సీరియల్ యాక్టర్స్ ఎక్కువ మంది ఉంటే ఫ్రెండ్స్ ఐపోయి..శాక్రిఫైస్ లు చేసుకుని  గేమ్ ని నెగ్లెక్ట్ చేస్తారు కదా..." అంటున్నారు. చూద్దాం మరి ఎంత మంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు...ఎంతమంది కామన్ మ్యాన్ ఉన్నారు. ఫైట్ ఎలా ఉండబోతోంది..అసలు హౌస్ లోకి ఎంతమంది ఎంట్రీ ఇస్తున్నారో చూడాలి.

వీడియో కాల్ లో వంట నేర్చుకుంటున్న అవినాష్!

పెళ్ళాం ఊరెళితే.. పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ ఏంజాయ్ చేయొచ్చు. కానీ అవన్నీ రెండు మూడు రోజులే కానీ తర్వాత భార్యని నిజంగా మిస్ అవుతామని ముక్కు అవినాష్ చెప్తున్నాడు. అసలేం జరిగిందంటే.. ముక్కు అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన శ్రీమంతం చేసి ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి పంపించాడు అవినాష్. ఇక తను పుట్టింటికి వెళ్ళాక ఇల్లంతా బోసిగా ఉందని, తనని చాలా మిస్ అవుతున్నాని అవినాష్ అంటున్నాడు. ఇక ఇదే పనిగా వంట కూడా నేర్చుకుంటున్నాడు. ఇక అవినాష్ భార్య అనూజకి వీడియో కాల్ చేసి వంట ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. ఇదంతా ' వీడియో కాల్ లో వంట నేర్చుకుంటున్నా' అనే వ్లాగ్ లో చెప్పాడు అవినాష్. జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి. గత వారం క్రితం వాళ్ళ అమ్మ హాస్పిటల్ లో ఉందని వ్లాగ్ చేయగా చాలామంది స్పందించారు. రీసెంట్ గా తన భార్య అనూజది శ్రీమంతం గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశాడు ముక్కు అవినాష్. ఇక పుట్టింటికి వెళ్ళి సోలో లైఫ్ ని లీడ్ చేస్తున్న అవినాష్.. మరో కొత్త వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు. ఇందులో తన కోసం చాలా ఎమోషనల్ అయినట్టుగా చెప్పాడు అవినాష్. రెండు రోజులు బాగుంటుంది, ఆ తర్వాత చాలా మిస్ అవుతామంటూ ఎమోషనల్ గా చెప్పాడు అవినాష్. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది‌.

సెప్టెంబర్ 11 నుంచి మామగారు కొత్త సీరియల్

  బుల్లితెర సీరియల్స్ చూసేవాళ్లకు ఇక పండగే పండగ. ఒక పక్కన బిగ్ బాస్ మరో వైపు మామగారు కొత్త సీరియల్ ఎంట్రీ.. ఇక వీక్ మొత్తం సందడే సందడి.  'స్టార్ మా' లో ఇప్పుడు మరో ధారావాహిక 'మామగారు' రాబోతోంది . దేవత సీరియల్  ఫేమ్ సుహాసిని ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. 'దేవత' సీరియల్ లో సుహాసిని పండించిన ఎమోషన్ సీన్స్  అప్పట్లో పెద్ద హిట్. ఇప్పుడు ఈ సీరియల్ తో  ఫ్యామిలీ ఆడియన్స్‌ను పలకరించబోతోంది. ఈ సీరియల్ సెప్టెంబర్ 11 నుంచి సాయంత్రం 6 .30 కి ప్రసారం కాబోతోంది.  ఇంట్లో ఆడవాళ్లు , ఇంటికొచ్చే కోడళ్ళు  ఇంటి పనులే చేయాలి కానీ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదంటూ మామగారు కండిషన్స్ పెడతారు. అలాంటి మావయ్యను కొత్త కోడలు సుహాసిని ఎలా మారుస్తుంది అనేదే ఈ సీరియల్ కథ.  చూడబోతే  ఈ సీరియల్ కూడా 'దేవత'సీరియల్ లానే ఫుల్ ఎమోషన్స్, సెంటిమెంటుతో నిండినట్టు కనిపిస్తుంది. సుహాసిని లక్ష్మీ కళ్యాణం, అడ్డా, దోస్త్ వంటి   30 మూవీస్ లో నటించింది. ఈమె తమిళం, కన్నడంలోనూ నటించింది. చంటిగాడు మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ తో బుల్లితెర మీదకు వచ్చింది. తర్వాత వరసగా సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళింది.  అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో  నటించింది. అలాంటి సుహాసిని ఈ సీరియల్ లో కూడా విపరీతంగా ఎమోషన్ పండించేస్తుందా లేదా కొంచెం కామెడీ యాంగిల్ లో ఎమన్నా ట్రై చేసిందా అనేది చూడాలి.  

ముద్దిస్తే చెప్తానంటున్న ఆది..ఛీ అన్న దీపికా పిల్లి

  ఢీ షోలో మంచి డాన్సస్ తో పాటు మంచి స్కిట్స్ కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు టీచర్స్ డే వస్తున్న సందర్భంగా ఆ టాపిక్ మీద ఈ వారం డాన్సర్స్ తమ పెర్ఫార్మెన్సెస్ చేసి చూపించారు.  ఆ స్కిట్స్ వేయడానికి ఆది, దీపికా పిల్లి ఆల్రెడీ ఉన్నారు. దీపికా వాళ్ళ చుట్టాలు పేరుతో ప్రతీవారం ఒక్కో గెస్ట్ ని పిలుస్తూ ఉంటుంది. ఇక ఈ వారం హైపర్ ఆది తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించడానికి  డైరెక్టర్ గెటప్ లో వచ్చాడు. "ఎంఎం సినిమాలు చేసావ్" అని దీపికా ఆదిని కొట్టి మరీ అడిగింది. "ముద్దిస్తే చెప్తా" అని ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే "ఛీ" అంది దీపికా. "ఎహె సినిమా పేరే ముద్దిస్తే చెప్తా" అని చెప్పేసరికి "బాగా ఆడిందా" అని ప్రదీప్ అడిగాడు.. "రెండున్నర గంటలు తీసాం..కానీ మొత్తం సెన్సార్ లో పోయింది" అని ఆది చెప్పేసరికి ప్రదీప్ షాకయ్యాడు. "ఇంత కత్తి లాంటి డైరెక్టర్ కి కత్తి లాంటి హీరో కావాలి" అని ప్రదీప్ అనేసరికి "మా చుట్టమోకడు భోజ్పూరి హీరోలా ఉంటాడు" అనేసరికి మెరుపుల డ్రెస్ తో డాన్సర్ పండు స్టేజి మీద ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత బట్టలిప్పేసి స్టేజి మీద పిచ్చిపట్టినట్టు డాన్స్ చేసేసాడు. ఇక చివరికి "సందీప్ హై స్కూల్" పేరుతో చేసిన డాన్స్ కి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయాడు. ఇక స్టేజి మీద ఉన్న కొరియోగ్రాఫర్స్ అంతా కూడా "హ్యాపీ టీచర్స్ డే" మాస్టర్ అంటూ మోకాళ్ళ మీద వంగి ఆయన ప్రణామం చేశారు. ఇక ఇందులో పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా చాలా కొత్తగా ఫ్రెష్ థీమ్ తో కంపోజ్ చేసేసరికి అవన్నీ కూడా శేఖర్ మాస్టర్ కి బాగా నచ్చాశాయి అలాగే ఆయన కూడా ఆ ఊపులో స్టేజి మీదకు వచ్చి కొన్ని స్టెప్స్ కూడా వేసెళ్లారు..  

నేను ఇక్కడ.. మా ఆయన అక్కడ.. బెంగగా ఉంది

నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు. నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్  అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి.  రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి. తన భర్త అనిల్ ది బర్త్ డే సందర్భంగా తను అక్కడ లేనని, ఇక్కడ ఇండియాలో ఉంటే చాలా బెంగగా ఉందని నేహా అంది. ఆ తర్వాత అక్కడ తన భర్త కేక్ కట్ చేసేదంతా వీడియో కాల్ లో చూసి సంబరిపడింది నేహా. అయితే బర్త్ డే గిఫ్ట్ కూడా పంపింది నేహా. అక్కడ అనిల్ కొలీగ్స్ చూసి ఆశ్వర్యపోయారు. నేహాకి ఇష్టమైన కేక్ ని కట్ చేసిన అనిల్.. తన పేరు చెప్పి తింటానన్నాడు. అలాగే నేహా ఇచ్చిన గిఫ్ట్ బాగుందంటూ అనిల్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. అయితే తను మిస్ అవుతున్నట్టుగా నేహా చౌదరి ఈ వ్లాగ్ లో పంచుకుంది. కాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

ఆ టాటు వేసినవాడు అదృష్టవంతుడు!

సినిమాలల్లో కథకి, హీరో, హీరోయిన్ లకి ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఐటమ్ సాంగ్ కి, ఆ ఐటమ్ సాంగ్ కి డ్యాన్స్ చేసే గర్ల్ ని బట్టి ఆ పాట నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అయితే ఇలాంటి పాటలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్  ఉంటుంది.  హాట్ అండ్ బోల్డ్ కంటెంట్ ని వీక్షించే ప్రేక్షకులు చాలానే ఉంటారు. అయితే ప్రేక్షకుల ఇష్టాలను తెలుసుకున్న కొందరు సెలబ్రిటీలు సినిమాల్లో కాకుండా తమ పర్సనల్ సోషల్ మీడియాలో హాట్ అండ్ బోల్డ్ ఫోటోలని షేర్ చేస్తుంటారు. అయితే వాళ్ళు అలా ఫోటోలు అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే వేలకొద్ది వ్యూస్, వందలకొద్దీ కామెంట్లు వస్తుంటాయి. అదే కోవకి చెందిన హాట్ అండ్ బోల్డ్ వీడియోని దివి ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాగా ఈ పోస్ట్ కి ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది. దాంతో దివి ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా ఇలా వచ్చి అలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.  అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. తాజాగా ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో నటించిన దివి.. అక్కడ అందాల ఆరబోతకే పరిమితమైంది. అయితే మంచి కంటెంట్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న దివికి, మరిన్ని అవకాశాలు రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో  హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో దివి ఒక మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉంది. తన అందంతో క్రేజీ పోస్ట్ లతో మరింత ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది‌ దివి. తాజాగా‌ డెనిమ్ డ్రెస్ వేసుకొని హాట్ ఫోటో షూట్ చేసిన దివి, ఆ షార్ట్ వీడియోని అప్లోడ్ చేసింది. దాంతో తన అభిమానులు కామెంట్లతో పొగడేస్తున్నారు. డీసెంట్ గర్ల్, క్యూట్ అని కొందరు అంటుంటే, ' ఆ టాటు వేసినోడు అదృష్టవంతుడు' అంటూ తన గుండెల మీద ఉన్న టాటూ గురించి కామెంట్ చేస్తున్నారు.‌‌ కాగా దివి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది  

మా నాన్న కల ఫుల్ ఫిల్ చేశాను!

ఫైమా‌ పటాస్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికీ సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తనేంటో నిరూపించుకుంది. అలా బుల్లితెరపై నవ్వులు పూయించిన ఫైమాకి బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం లభించింది.  బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా.. హౌస్ లో నవ్వులు పూయించింది. అయితే ఒకానొక దశలో తను వేసే పంచులు ఎదుటివారిని ఇబ్బంది పెడతాయని అప్పుడే తెలిసింది. దాంతో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఫైమాకి అలా వెటకారంగా మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయిన తను మారలేదు. దాంతో ప్రేక్షకులలో ఫైమాపై నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిందనే చెప్పాలి. దాంతో బిగ్ బాస్ వీక్లీ వైజ్ ఎలిమినేషన్ లో ఫైమా బయటకొచ్చింది. అయితే ఫైమా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఆ ఫ్యాన్స్ ఫైమా బయటకొచ్చాక గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అందరి దృష్టి ఫైమా మీద పడింది. అలా ఫైమా ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆ తర్వాత బిబి జోడీలో సూర్య తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. దీంతో ఫైమాకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అయితే ఫైమా తన గురించి ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది..  ఫైమా తాజాగా తన యూ ట్యూబ్ లో ఒక వీడియో నీ అప్లోడ్ చేసింది తన సొంత ఇల్లు కల ఇల్లు కట్టుకోవడం అంటూ ఫైమా చాలా సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తన సొంత ఇల్లు పూర్తయి, తన ఇంటి లైట్స్ ఫిట్ చేసింది ఫైమా. తన నాన్న చేతుల మీదగా స్విచ్ వేయించి, నాన్న కలని ఫుల్ ఫిల్ చేశానని ఒక వీడియోని అప్లోడ్ చేసింది. ఇలా చేయడం నిజంగా పిల్లల్ని కన్న ప్రతీ తల్లిదండ్రులకి గర్వంగా ఉంటుందంటూ నెటిజన్లు ప్రశంసలు అందిస్తున్నారు.   

పూజ మూర్తి ఇంట విషాదం... బిగ్ బాస్ షో క్యాన్సిల్!

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. ఆదివారం సాయంత్రం కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో లాంఛ్ కాబోతోంది. ఐతే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ ఐన ఈ టైములో అనుకోకుండా ఒక హౌస్ మేట్ ఎంట్రీ లాస్ట్ మినిట్ లో  క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరుకు చెందిన పూజా మూర్తి మనకు బాగా తెలిసిన నటి.  తెలుగు సీరియల్స్ లో నటించి  మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కన్నడ సీరియల్స్ లో నటించిన తర్వాత  తెలుగులో "గుండమ్మ కథ"  అనే సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది.  జీ తెలుగులో ప్రసారమైన  ఈ సీరియల్ కు మంచి టీఆర్పీ కూడా వచ్చింది. ఇక యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన  "సూపర్ క్వీన్" ప్రోగ్రామ్ లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. ఐతే ఈమెను బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవాలని  నిర్వాహకులు అనుకున్నారు అంతా కరెక్ట్ గా సెట్ అయ్యింది అనుకున్న టైంలో వాళ్ళ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.   బిగ్ బాస్ షో కోసం డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అంతా బాగుందనుకుకున్న సమయంలో  చివరి నిముషంలో పూజ మూర్తి  తండ్రి మరణించినట్లుగా న్యూస్ వచ్చేసరికి ఆమె  షో క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్టు పెట్టింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి... తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. "మీరు నా పక్కన లేరనే బాధను ప్రతి సెకను ఫీల్ అవుతున్నాను.. మిమ్మల్ని ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాను..  మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను..  తెలిసి తెలియక చేసిన ఏదైనా పొరపాటు చేసి ఉంటే సారీ.. మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు.. మీ ఆశీస్సులు  నాతోనే ఉంటాయి... నా మీద... అమ్మ మీద మీ ఆశీస్సులు నిరంతరం ఉంటాయి... రెస్ట్ ఇన్ పీస్ డాడీ" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

కేక పుట్టిస్తున్న స్టుడెంట్ ట్రైలర్! 

కాలేజ్ లైఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ స్టోరీ అయిన దాదాపు హిట్టే.. అప్పుటి కొత్తబంగారు లోకం,  హ్యాపీ డేస్ ల నుండి ఇప్పటి బేబీ సినిమా వరకు అన్ని యూత్ ని ఆకర్షిస్తూ వెండితెర మీద పేపర్లు విసిరేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తో షణ్ముఖ్ 'స్టూడెంట్' వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ని కొన్ని వారాల క్రితం రిలీజ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. అంతే కాకుండ  'ది స్టూడెంట్ యాంథమ్' లిరికల్ సాంగ్ కి షణ్ముఖ్ తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు. ఆ సాంగ్ కి  విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. షణ్ముఖ్.. యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్.. ఆ తర్వాత 'సూర్య' వెబ్ సిరీస్ తో ప్రతీ మధ్యతరగతి కుర్రాడికి కనెక్ట్ అయ్యాడు. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి స్నేహితులుగా మారారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది.  ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -5 లో షణ్ముఖ్ ఎంట్రీ  ఇచ్చాడు.  అదే సీజన్ లో సిరి హనుమంత్ కూడా రావడంతో.. వారిద్దరి హౌస్ లో క్లోజ్ గా ఉండటం వల్ల దీప్తి సునైన, షణ్ముఖ్ ల మధ్య కథ మారింది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు వరకు షణ్ముఖ్, దీపు వాళ్ళిద్దరి చేతిపై టాటూస్ ఉండేవి.  బిగ్ బాస్ పూర్తయ్యాక వారిద్దరు విడిపోయారు. ప్రస్తుతం‌ ఎవరి బిజీలో వాళ్ళుంటున్నారు. షణ్ముఖ్  'స్టుడెంట్' వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్  తన యు ట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు. అలా చేసిన అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా వ్యూస్ వచ్చాయి. అసలేముంది ఈ ట్రైలర్ లో అంటే.. స్టుడెంట్స్ ముందుగా పరిచయాలు, స్నేహం, ప్రేమ.. గొడవలు ఇలా స్టార్ట్ చేస్తారు. అయితే ఇవన్నీ ప్రతీ స్టుడెంట్ లైఫ్ లో కామన్. అయితే ఎప్పుడైతే వాళ్ళకి ఎదురుదెబ్బ తగులి కిందపడతారో, అప్పుడు వాళ్ళు మళ్ళీ పైకీ లేస్తారు. అలా అనుభవంలోకి వస్తేనే గానీ తెలియదని చూపించారు మేకర్స్. మరీ ఈ నెల యూట్యూబ్ లో విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చిన అంజలి పవన్

బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కావడానికి ఇంకా ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. అలాంటి టైములో ఒక యంగ్ అండ్ డైనమిక్ పెయిర్ హౌస్ లోకి రాము అంటూ చెప్పేసింది. బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు న్యూ సీజన్ లోకి ఎంట్రీ ఇస్తోంది.   ఈ సారి ఉల్టా పల్టా అంటూ సరికొత్త వెర్షన్ లో  రాబోతుంది. ఆరో సీజన్ పై ఆడియన్స్ నుంచి బాగా నెగిటివిటీ రావడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయింది. ఇక ఈ షోకి  బిగ్ బాస్ లోకి సీరియల్ నటి, యూట్యూబర్ అంజలి పవన్ వెళ్తున్నట్లుగా  వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే బిగ్ బాస్ టీం సంప్రదించి.. ఆమెతో ఒప్పందం కూడా చేసుకున్నారట. ఐతే  అనుకోని కారణంతో ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే విషయం తెలుస్తోంది.  ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.   రీసెంట్ గా "నీతోనే డాన్స్" షోలో ఈ జంట అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్స్ వరకు వెళ్లారు. ఈ షో ఎన్నాళ్ళు ఈ జంటకి నటరాజ్ మాష్టర్ జంట మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా ఉండేది. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ టీం ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో   భేదాభిప్రాయాలు వచ్చి ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.  మొగలి రేకులు సీరియల్‌తో  అంజలి పవన్‌ బాగా పాపులర్ అయ్యింది. మధ్యమధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ మంచి ఇమేజ్ దక్కించుకుంది. కొంతకాలం క్రితం ప్రసారమైన  మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా ఈ జంట మెరిసింది. వీళ్లిద్దరికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే వీళ్ళ కూతురు ధన్వికతో కలిసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.

మా అమ్మకు దూరంగా ఉండండి

అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే బుల్లితెరను వదిలిపెట్టేసిందో అప్పటినుంచి మూవీస్ లో నటిస్తూ మంచి మంచి షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది.  ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. అసలు ఈ చీర కట్టులో కుందనపు బొమ్మలా ఉంది అనసూయ . ఐతే ఉప్పల్ లో ఉన్న ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేసింది అనసూయ. ఈ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి స్టాఫ్ అంతా కూడా ఆమెతో కల్సి ఫోటోలు, సెల్ఫీలు దిగారు. అందులో ఒక పిక్ భలే అమేజింగ్ గా ఉంది. తాను ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న కుక్కపిల్ల కూడా తనతో వచ్చి కెమెరాకు పోజులు ఇచ్చింది. అనసూయకు మూగ జీవాలంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో అన్ని రకాల మూగజీవులు కనిపిస్తాయి. "చూడండి నాతో పాటు ఎవరు ఫోటో దిగుతున్నారో చూడండి " అని అనసూయ కామెంట్ పెట్టేసరికి ఆ కుక్కపిల్ల కూడా ఒక కామెంట్ పెట్టింది "మా అమ్మకు దూరంగా ఉండండి". ఈ పిక్ ని అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. అనసూయ సోషల్ మీడియాలో ఏ పిక్ పెట్టిన, ఏ వీడియో పెట్టినా అది ఫుల్ వైరల్ ఐపోతుంది. మూవీస్ లో కూడా ఆమెకు లీడ్ రోల్స్ వస్తున్నాయి. రంగస్థలం మూవీ ఆమె కెరీర్ కి మంచి  బ్రేక్ ఇచ్చింది. దాంతో డైరెక్టర్ సుకుమార్ పుష్ప లో మరో క్రేజీ రోల్ ఆఫర్ చేశారు. పుష్ప 2లో సైతం అనసూయ సందడి చేయబోతోంది. జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి అడపాదడపా వస్తున్నారు కానీ అనసూయ వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారి కూడా షోలో ఒక్క ఎపిసోడ్ లో కూడా మెరవలేదు.