బిగ్ బాస్ హౌజ్ లో ప్రేమజంట.. కామన్ మ్యాన్‌తో రితిక సంథింగ్ సంథింగ్!

బిగ్ బాస్ సీజన్-7 గత ఆదివారం గ్రాంఢ్ గా మొదలైన సంగతి తెలిసిందే.  తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆసక్తిగా చూసే ఈ ఎంటర్టైన్మెంట్ షోకి క్రేజ్ మాములుగా లేదు. ప్రతీ సోమవారం నామినేషన్స్ తో హీటెడ్ గా సాగే హౌజ్, సండే ఫండే అంటూ హౌజ్ లోని వాళ్ళతో నాగార్జున గారు తీసుకునే స్పెషల్ ఎపిసోడ్, వీక్ మధ్యలో జరిగే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఇలా రోజుకొక కొత్త లీడ్ తో ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగుతుంది ఈ బిగ్ బాస్. అయితే ఈ బిగ్ బాస్ హౌజ్ లో ఈ సీజన్ కి పద్నాలుగు మంది మాత్రమే వచ్చారు. అందులో కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లివి ప్రశాంత్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది‌. ఇది అందరికి తెలిసిందే. అయితే తాజాగా రతికకి ఫ్యాన్ బేస్  పెరుగుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి రోజే నవీన్ పొలిశెట్టి వచ్చి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లాగా ఒక బ్యాండ్ ఇచ్చి, ఇది మేల్ కంటెస్టెంట్ మీకు నచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్ ఒకరికి ఇది ఇవ్వాలని చెప్పగా.. రతికకి పల్లవి ప్రశాంత్ ఆ బ్యాండ్ ఇచ్చాడు. దాంతో అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మొదలైంది. అయితే మొన్న జరిగిన నామినేషన్లో పల్లవి ప్రశాంత్, రతికలని హౌజ్ లోని వాళ్ళు నామినేట్ చేసినప్పుడు.. ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని బాదపడ్డారు. దీంతో ఇద్దరికి ఒకరంటే ఒకరికి బాండింగ్ పెరిగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుండగా అక్కడికి రతికి వచ్చింది. ఏం చేస్తున్నావని పల్లవి ప్రశాంత్ ని రతిక అనగా.. ఏం లేదు నా దిల్ డ్రా చేసి గుండెల్లో నుండి ఈ కెమెరాల వెనుక ఉన్న ప్రేక్షకులకు ఇచ్చేసా అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. అది విని రతిక.. హో అవునా అయితే మరి నీ దిల్ ని ఈ హౌజ్ లోని వాళ్ళలో ఎవరికిస్తావని  అడుగగా.. పల్లవి ప్రశాంత్ సిగ్గుపడ్డాడు. దాంతో నువ్వు చెప్పకుంటే నేను వెళ్తానని రతిక అంటుంది. మరి నీ దిల్ ని ఎవరికిస్తావని రతికని పల్లవి ప్రశాంత్  అడుగగా.. నీకే ఇస్తానని రతిక అంటుంది. అలా అనగా పల్లవి ప్రశాంత్ హ్యాపీగా ఫీల్ అయి గంతేస్తాడు. అక్కడే ఉన్న ప్రిన్స్ యావర్ విని, ఇంకేం నెక్స్ట్ మ్యారేజా అని యావర్ అనగా.. రతిక సిగ్గుపడుతుంది. అది చూసి మరింత సంబరపడతాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత నా దిల్ నీకే ఇస్తానని రతికతో పల్లవి ప్రశాంత్ అంటాడు. ఇక ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. నిన్న జరిగిన ఇమ్యూనిటి టాస్క్ తర్వాత రతికకి కొన్ని ఇన్సిపిరేషన్ మాటలు చెప్పాడు పల్లవి ప్రశాంత్. నీ ఆట నువ్వు ఆడు, కసిగా ఆడు అంటూ రతికతో పల్లవి ప్రశాంత్ అన్న మాటలు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు  

ఇమ్యూనిటి టాస్క్: పల్లవి ప్రశాంత్ ఆటలో సెకండ్.. ఓటింగ్ లో ఫస్ట్!

పుష్ప సినిమాలోని ఏ బిడ్డ ఇది నా అడ్డ పాటతో రెండవ రోజు బిగ్ బాస్ మొదలైంది. ఎన్నో ఉల్టా పల్టాలతో కొనసాగుతుంది బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ఇప్పుడు జరిగే కమ్యూనిటి టాస్క్ లో ఎవరైతే ఎక్కువ సమయం రింగ్ లో ఉంటారో వారికి అయిదు వారాల పాటు ఇమ్యూనిటి లభిస్తుంది. అదేకాకుండా ఎలిమినేషన్ నుండి కూడా సేఫ్ అవొచ్చు. నామినేషన్లో ఉన్న ప్రాబ్లమ్ లేదని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చెప్తాడు.  ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కిచెన్ ఏరియాలో కాసేపు కోడిగుడ్లతో టాస్క్ ఆడతారు. అది బిగ్ బాస్ ఇచ్చాడా? లేదా పర్సనల్ గా ఆడుతున్నారా అర్థం కాదు.‌ కాసేపటికి అందరూ బిగ్ బాస్ మాట కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడే రతిక నిల్చొని.. గాయ్స్ మనం మన సత్తా చాటి, మన ట్యాలెంట్ తో బిగ్ బాస్ కి గట్డి పోటీ ఇవ్వాలని అంటుంది. అది విన్న బిగ్ బాస్.. అయిపోయిందా రతిక అని బిగ్ బాస్ అనగానే అందరు నవ్వేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ రూల్స్ చెప్తాడు. బాక్సింగ్ రింగ్ లో ఇద్దరు ఫైటర్స్ ని చూపిస్తారు. మేల్ ఫైటర్, ఫీమేల్ ఫైటర్ ఇద్దరిని బాక్సింగ్ రింగ్ లో చూపించి వారితో మీరు తలబడి ఆ రింగ్ లో వీలైనంత ఎక్కువ సేపు ఉండాలని బిగ్ బాస్ చెప్తాడు. ఆ తర్వాత .. మాటల్లో కాదు చేతల్లో చూపించమని మొదటగా రతికని రింగ్ లోకి వెళ్ళమని చెప్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత కిరణ్ రాథోడ్ రింగ్ లోకి వెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ చేసి ఫైటర్ ని బయటకు తోసేస్తుంది. ఆ తర్వాత ఆట సందీప్ వెళ్ళి కాసేపు ఎదురిస్తాడు. ఇలా ఒక్కొక్కరుగా రింగ్ లోకి వెళ్ళి వారి ఇమ్యూనిటీ పవర్ ని సరిచూసుకుంటారు. ఇమ్యూనిటి టాస్క్ లో అందరి కంటే ఎక్కువ టైమ్ రింగ్ లో ఉంది ఆట సందీప్, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్.‌ తన ఇంటలిజెన్స్ తో అందరి కంటే ఎక్కువ టైమ్ ఉండి ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచాడు ఆట సందీప్. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ కొన్ని సెకండ్ల టైమ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఫీమేల్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక గెలిచింది.  ఇక విజేతలు ప్రకటించాక పల్లవి ప్రశాంత్ ఏడ్చేసాడు. తన దగ్గరికి వెళ్ళి అందరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది గేమ్ ఆడుకుంటూ పోవాలే, ఏదో ఒక చోట గెలుస్తామంటూ టేస్టీ తేజ పల్లవి ప్రశాంత్ కి చెప్పాడు. ఇక పల్లవి ప్రశాంత్ దగ్గరికి‌ ప్రియాంక జైన్ వచ్చి.. నాది ఇంటర్ పాస్, డిగ్రీ ఫెయిల్.. ఇలా ఉండిపోకు. కామన్ గా జరిగేది ఇదంతా అంటూ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ ఇస్తుంది. " ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. మన గేమ్ మనం ఆడాలి. బి స్ట్రాంగ్ , గో స్ట్రాంగ్" అంటూ గౌతమ్ కృష్ణ తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు.  

తప్పుగా మాట్లాడిన ముకుందపై అరిచేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -255 లో.. కృష్ణ, ముకుంద, మురారి ఇంటికి వస్తారు. కృష్ణ డల్ గా ఉండడంతో ప్రసాద్ ఏమైందని అడుగుతాడు. ముకుంద చాలా హ్యాపీగా రెస్టారెంట్ లో జరిగిందంతా చెప్తుంది. కొంతమంది బాయ్స్ నన్ను చూసి మురారి భార్య అనుకున్నారట ఒక అతను మాత్రమే మురారి భార్య కృష్ణ అనుకున్నారట అని నవ్వుతు చెప్తుంది. అందుకు కృష్ణ డల్ గా ఉందా అని ప్రసాద్ అంటాడు. అవునని ముకుంద అంటుంది. ఆ తర్వాత ముకుంద రెస్టారెంట్ లో జరిగింది చెప్తుంటే భవాని విని.. కోపంగా ముకుంద అని గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్? ఎవరో ఏదో అంటే ఆ విషయాన్ని పట్టుకొచి సరదాగా చెప్తున్నావా? అక్కడే వాడికి నాలుగు చివాట్లు పెట్టి రావలిసింది పోయి, ఇక్కడికి వచ్చి సరదాగా చెప్తున్నావా? వావి వరుసలు మర్చిపోయి మాట్లాడితే నేను ఒప్పుకోనని ముకుందని భవాని కోప్పడుతుంది. నీ భర్త ఎవరని ముకుందని భవాని అడుగుతుంది. ఆదర్శ్ అని ముకుంద చెప్తుంది. మరి మురారి ఎవరని అడగ్గానే నా భర్త ప్రాణ స్నేహితుడని ముకుంద చెప్తుంది. ఇంకొకసారి అలా అనకుండా ముకుందకి భవాని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరొక వైపు మధు, అలేఖ్య ఇద్దరు ముకుంద గురించి మాట్లాడుకుంటారు. నువ్వేంటి ముకుందకి సపోర్ట్ చేస్తున్నావని అలేఖ్యతో మధు అంటాడు. నువ్వేంటి కృష్ణకి సపోర్ట్ చేస్తున్నావని మధుతో అలేఖ్య అంటుంది. మరొకవైపు కృష్ణ తనని తాను అద్దంలో చూసుకుంటూ.. ఒకరికి తప్ప, అందరికి నేను ఏసీపీ సర్ భార్యలాగా ఎందుకు అనిపించలేదు? నాకేం తక్కువ అని అనుకుంటుంది. ఇప్పటికి ఇప్పుడే అందంగా రెడీ అవ్వాలని అనుకొని అన్ని రకాల జ్యూస్ ల తాగుతుంది. అది చూసి ఏం చేస్తున్నావని మురారి అడుగుతాడు. ఫేస్ గ్లో కోసమని కృష్ణ సమాధానం చెప్తుంది. కృష్ణ నువ్వు బాగుంటావని మురారి చెప్తాడు. మీకు నచ్చితే సరిపోతుందా అని కృష్ణ అంటుంది. మరొక వైపు శ్రీనివాస్ తో ముకుంద మాట్లాడుతుంది. మీరు ఎలాగైనా నా ప్రేమ గురించి పెద్ద అత్తయ్యకి చెప్పాలి. కృష్ణని చూసి జాలిపడి, రేవతి అత్తయ్య మాట విని నిజం చెప్పకుండా ఉంటే నిజం మాత్రమే మిగులుతుంది. మీ కూతురు ఉండదని ముకుంద అనగానే.. శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏంజిల్ ఎవరిని ప్రేమిస్తుందో చెప్పేసిన విశ్వనాథ్.. షాక్ లో రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -861 లో.. వసుధార దగ్గరికి విశ్వనాథ్ వస్తాడు. ఎన్నడూ లేనిది సర్ ఇక్కడికి ఎందుకు వచ్చారని వసుధార, చక్రపాణి ఇద్దరు అనుకుంటారు. విశ్వనాథ్ వచ్చి.. నీతో ఏంజిల్ ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. ఏంజిల్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నీకు తెలుసు కదా ఎవరతను అని వసుధారని విశ్వనాథ్  అడుగుతాడు. వసుధార ఇబ్బందిపడుతు రిషి సర్ అని చెప్తుంది.  ఆ మాట విని విశ్వనాథ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు చక్రపాణి బాధపడుతాడు. ఆ తర్వాత మీరు రిషి మనసులో ఏం ఉందనేది మీరు కనుక్కోండని చక్రపాణితో విశ్వనాథ్ అనగానే.. నేను అలా చెయ్యలేను అలా అడగడం కరెక్ట్ కాదని  చక్రపాణి  అంటాడు. ఆ తర్వాత విశ్వనాథ్ వెళ్ళిపోయాక చక్రపాణి ఎమోషనల్ అవుతాడు. తన తండ్రికి బాధపడవద్దని వసుధార అంటుంది. రిషి సార్ నిజం తెలుసుకుంటాడు మేమిద్దరం ఒకటి అవుతామని వసుధార చెప్తుంది. మరొక వైపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి అందరూ వీడియో కాన్ఫరెన్స్ లో డిస్కషన్ చేసుకుంటారు. మీటింగ్ లో జగతి, మహేంద్రణ రిషి, వసుధార  ఇంక స్టూడెంట్స్ ఉంటారు. మీటింగ్ లో వసుధార డల్ గా కనిపిస్తుంది. వసుధారని రిషి చూస్తూ .. అసలు వసుధారకి ఏమైంది ఎందుకు అలా ఉందని అనుకుంటాడు. ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చెయ్యండని రిషి చెప్తాడు. ఆ తర్వాత వసుధారని తన క్యాబిన్ కి రమ్మని రిషి చెప్తాడు. మరొక వైపు  జగతి, మహేంద్ర ఇద్దరు రిషిని ఇలా వీడియో కాల్ లో చూసి సంతోషపడే పరిస్థితి వచ్చిందని జగతి. ఎమోషనల్ అవుతుంది మెల్లిగా బావగారు కూడా శైలేంద్ర వైపు మారిపోతున్నారని మహేంద్రతో జగతి చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకుమని మహేంద్ర చెప్తాడు. వాళ్ళ మాటలన్ని శైలేంద్ర దేవయాని ఇద్దరు వింటారు. మరొక వైపు రిషి, వసుధార మాట్లాడుకుంటారు‌. ఏమైంది ఎందుకు అలా ఉన్నావని రిషి అడుగుతాడు. వసుధార మాత్రం విశ్వనాథ్ తన దగ్గరికి వచ్చిన విషయం రిషికి చెప్పదు. మరొక వైపు రిషి, ఏంజెల్ తో ఎందుకు పెళ్లి వద్దంటున్నాడని విశ్వనాథ్ ఆలోచిస్తాడు. రిషిని తన గదిలోకి పిలిపించుకొని.. ఏంజిల్ ప్రేమిస్తుంది ఎవరినో తెలిసిపోయింది. అది నువ్వే అని రిషి చెయ్యి పట్టుకుంటాడు విశ్వనాథ్. అది విని రిషి షాక్ అవుతూ తన చెయ్యిని తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అనామిక గదిలో కళ్యాణ్ కవితలు.. కావ్య టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -194  లో.. కావ్య ఇంటి ముందు ముగ్గు వేస్తు ఉంటుంది. రాజ్ ఫోన్ మాట్లాడుతూ చూడకుండా ముగ్గుని తొక్కుతాడు. కావ్య గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తూన్నావ్? నువ్వు వేసే తొక్కలో ముగ్గంటూ కావ్యని రాజ్ అంటాడు. అప్పుడే అటుగా వస్తున్న సీతరామయ్యని చూసి నీ ముగ్గు బాగుంది కావ్య అంటూ మెచ్చుకుంటాడు. అది చూసి సీతరామయ్య సంతోషపడతాడు. ఆ తర్వాత ముగ్గు అంటే ఇలా వేయాలి. మా అమ్మ వేస్తుంది, ఏం బాగా వెయ్యదని రాజ్ అంటాడు. ఆ మాట అపర్ణ రుద్రాణి వింటుంది. ఆ తర్వాత ఈ కావ్యని పొగడాలంటే మా అమ్మని తక్కువ చేసి మాట్లాడాలా అని తనను తాను తిట్టుకుంటాడు రాజ్. ఆ తర్వాత రుద్రాణి.. చూసావా వదిన పెళ్ళాం బెల్లంణ తల్లి అల్లం. ఏంటి ఈ గొళ్ళెమంటూ అపర్ణతో వెటకారంగా అంటుంది. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు కలిసి బయటకు వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి కార్ తో వచ్చి కళ్యాణ్ , అప్పు లు వెళ్తున్న బైక్ కి తాకిస్తుంది. ఆ తర్వాత అప్పు కోపంగా వెళ్లి ఆ అమ్మయిని తిడుతుంది. తీరా చూస్తే కార్ లో ఉన్న అమ్మయి అనామిక. తనని చూసిన కళ్యాణ్.. తిట్టకు అప్పు, తను అనామిక అని అప్పుకి  పరిచయం చేస్తాడు. నిన్ను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానని కళ్యాణ్ కి అనామిక చెప్తుంది. సరే అని అప్పుని వదిలేసి అనామికతో కలిసి వెళ్తాడు కళ్యాణ్. మరొక వైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తు టిఫిన్ కోసం కావ్యని పిలుస్తాడు. ఇంకా రెడీ కాలేదని కావ్య చెప్తుంది. నువ్వు వెళ్ళు రాజ్, కావ్య ఆఫీస్ కి టిఫిన్ తీసుకొని వస్తుందని సీతరామయ్య చెప్తాడు.. సరే అని రాజ్ అంటాడు. అలా కావ్య పై రాజ్ పాజిటివ్ గా ఉండడం చూసిన అపర్ణకి  కోపం వస్తుంది. మరొక వైపు కళ్యాణ్ ని అనామిక తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంట్లో వాళ్లకి కళ్యాణ్ ని పరిచయం చేసి తన గదిని చూపిస్తుంది. తన గదిలో కళ్యాణ్ రాసిన కవితలు గోడకి ఫ్రేమ్ తో ఉండడం చూసిన కళ్యాణ్ .. నేను రాసిన కవితలంటే ఇంత ఇష్టమా అని  అనుకుంటాడు. ఆ తర్వాత అనామిక కళ్యాణ్ ఫోటోని తనకి కన్పించకుండా జాగ్రత్తపడుతుంది. మరొక వైపు అందరూ హాల్లో కూర్చొని ఉండగా.. రాహుల్ స్వప్న ఇద్దరు ఎక్కడ కన్పించడం లేదని రుద్రాణిని  ఇందిరాదేవి అడుగుతుంది. వాళ్ళు హనీమూన్ అని పది రోజులు ఎక్కడికో వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలియదని రుద్రాణి అనగానే.. అంత నిర్లక్ష్యం ఎందుకు? వెంటనే కాల్ చేసి వెనక్కి రమ్మని చెప్పమని ఇందిరాదేవి అనగానే రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేస్తే ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఆ తర్వాత స్వప్న రాహుల్ ఎక్కడికి వెళ్లారని కావ్య టెన్షన్ పడుతుంటే.. ధాన్యలక్ష్మి వచ్చి నువ్వు టెన్షన్ పడకు‌. వాళ్ళ గురించి అలోచించకు. ముందు నువ్వు రాజ్ కి క్యారేజ్ తీసుకొని వెళ్ళు అనగానే కావ్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పదమూడు వేల ఓట్లతో మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్, రెండవ స్థానంలో శోభా శెట్టి!

    బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఇందులో ఒక్కో‌ కంటెస్టెంట్ ఒక్కో గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ఇప్పటికే టేస్టీ తేజ తన గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తుండగా శివాజీ మరో బాలాదిత్యలా అనిపిస్తుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు పూర్తవ్వగా ఓటింగ్ నిన్న రాత్రి నుండి మొదలైంది. దీన్నో అనుకున్నదే జరిగింది. పల్లవి ప్రశాంత్ కి విశేషమైన మద్దతు లభిస్తుంది. తన తప్పేం లేకున్నా నామినేట్ చేసారని, కార్నర్ చేశారని ప్రతీ బిగ్ బాస్ ప్రేక్షకుడికి తెలుసు అందుకే ఒక్క రోజే ఏకంగా పదమూడు వేల ఓట్లు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయి. రెండవ స్థానంలో శోభా శెట్టికి రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. రతిక మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక యాక్టర్, డైరెక్టర్ గౌతమ్ కృష్ణ నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు. హౌజ్ లో ఎక్కువ కమ్యూనికేషన్ లేకుండా ఉండేవారిలో కిరణ్ రాథోర్ ముందు ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుగు సరిగ్గా రాదు, అర్థం కాదు. అందుకే తను ఓటింగ్ లిస్ట్ లో చివరన ఉంది. ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గరగా ఉంది కిరణ్ రాథోడే అని వినిపిస్తుంది. కాగా షకీల గారు కంటెస్టెంట్స్ తో ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు. సింగర్ దామిణి అందరితో అంత ఈజీగా కలిసిపోలేకపోవడంతో చివర నుండి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇలాగే ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటే సింగర్ దామిణి కూడా ఎలిమినేషన్ తప్పదు. అలాగే ప్రిన్స్ యావర్.. హిందీ, ఇంగ్లీష్ తప్ప తెలుగు అంతగా రానీ మేల్ కంటెస్టెంట్. అయితే బిగ్ బాస్ గ్రాంఢ్ రిలీజ్ రోజే.. తెలుగు రోజుకొక వర్డ్ నేర్చుకోమని ప్రిన్స్ యావర్ కి నాగార్జున చెప్పాడు‌. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న అందరిలో అమర్ దీప్, ప్రియాంక సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక శోభా శెట్టి కార్తీక దీపంలో‌ నటించినట్టే ఇందులో కూడా నటిస్తుందని తెలుస్తుంది. ప్రతీ దానికి ఏడుస్తూ సింపతీని కోరుకుంటుంది. మరి తన ఏడుపు ఎంతవరకు వర్క వుట్ అవుతుందో తెలియదు. అయితే ఇప్పటివరకు నామినేషన్లో ఉన్నావారికి జరిగిన ఓటింగ్ లో  మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్, రెండవ స్థానంలో శోభా శెట్టి కొనసాగుతున్నారు. కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చివరలో ఉన్న దామిణి, కిరణ్ రాథోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి!  

నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న స్టూడెంట్ వెబ్ సిరీస్!

  వెబ్ సిరీస్ లకు ఉండే క్రేజే వేరు. కంటెంట్ కాస్త ఫ్రెష్ గా ఉండి, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఉంటే చాలు అది హిట్టు అంతే. అలాంటి వెబ్ సిరీస్ లు చూడటానికి యూత్ తో పాటు అన్ని వర్గాల వారు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాలేజీ లైఫ్ గురించి 'స్టూడెంట్' అనే వెబ్ సిరీస్ యూట్యూబ్ లో తాజాగా రిలీజైంది. కాగా ఇప్పుడది యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. షణ్ముఖ్ జస్వంత్ నటించిన ఈ వెబ్ సిరీస్ కి ఇప్పుడు ఫుల్ వ్యూస్ వస్తున్నాయి. సుబ్బు కే రాసిన ఈ కథని అవినాష్ డైరెక్ట్ చేశాడు. షణ్ముఖ్ జస్వంత్, డాన్ పృథ్వి, పృథ్వీ జకాస్, నేహా, తేకస్విని నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి విశేష స్పందన లభిస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో స్టుడెంట్ లా కన్పించడం కోసం షణ్కుఖ్ జస్వంత్ పదహారు కేజీలు తగ్గాడంట. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు షణ్ముఖ్. కాలేజ్ లైఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ స్టోరీ అయినా దాదాపు హిట్టే.. అప్పుటి కొత్తబంగారు లోకం,  హ్యాపీ డేస్ ల నుండి ఇప్పటి బేబీ సినిమా వరకు అన్ని యూత్ ని ఆకర్షిస్తూ వెండి తెర మీద పేపర్లు విసిరేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తో షణ్ముఖ్ 'స్టూడెంట్' వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ని రెండు వారాల క్రితం రిలీజ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అదే తరహాలో స్టూడెంట్స్ అంథెమ్ , ట్రైలర్ విడుదల అయి లక్షల్లో వ్యూస్ రాగా ఒక్కోక్క ఎపిసోడ్  ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. షణ్ముఖ్.. యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్.. ఆ తర్వాత 'సూర్య' వెబ్ సిరీస్ తో ప్రతీ మధ్యతరగతి కుర్రాడికి కనెక్ట్ అయ్యాడు. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి స్నేహితులుగా మారారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది.  ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -5 లో షణ్ముఖ్ ఎంట్రీ  ఇచ్చాడు.  అదే సీజన్ లో సిరి హనుమంత్ కూడా రావడంతో.. వారిద్దరి హౌస్ లో క్లోజ్ గా ఉండటం వల్ల దీప్తి సునైన, షణ్ముఖ్ ల మధ్య కథ మారింది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు వరకు షణ్ముఖ్, దీపు వాళ్ళిద్దరి చేతిపై టాటూస్ ఉండేవి.  బిగ్ బాస్ పూర్తయ్యాక వారిద్దరు విడిపోయారు. ప్రస్తుతం‌ ఎవరి బిజీలో వాళ్ళుంటున్నారు.

టేస్టీ తేజ బంఢారం బయటపడింది.. బిగ్ బాస్ కి రూల్స్ చెప్పిన రతిక రోజ్!

బిగ్ బాస్ సీజన్-7 అంతకంతకు ఆసక్తిని పెంచుతుంది. వచ్చీ రాగానే నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్ బాస్.‌. కంటెస్టెంట్ నామినేట్ చేసే ఇద్దరిని వేరే గదిలోకి పిలిచి చూపిస్తుంటే వాళ్ళు అసూయతో, కోపంతో రగిలి పోతున్నారు. ఇక ఒక కంటెస్టెంట్ తమ నామినేషన్ చెప్పేసి బయటకు రాగానే నామినేషన్ చేసిన వాళ్ళతో హీటెడ్ కన్వర్సేషన్స్ జరుగుతున్నాయి.  ఇక హౌజ్ లోకి వెళ్ళగానే బ్యాచ్ లు స్టార్ట్ అయ్యాయి. ప్రియాంక జైన్ , అమర్ దీప్ ఒక  జట్టుగా కూర్చొని మాట్లాడుకుంటే.. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ ఒక జట్టుగా, టేస్టీ తేజ, శివాజీ మరో జట్టుగా ఇలా ఒక్కొక్కరి గేమ్ ఒక్కోలా ఆడుతున్నారు. ఆయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో.. గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ ని నామినేట్ చేసింది శోభాశెట్టి.  రతికని, ప్రిన్స్ యావర్ ని ఆట సందీప్ నామినేట్ చేశాడు. రతిక, శోభాశెట్టిని నామినేట్ చేసింది దామిణి. కిచెన్ లో తనేం సహాయం చేయలేదని రతికని నామినేట్ చేసింది దామిణి. 'డిన్నర్ అయ్యాక ప్లేట్ కడగలేదు. మొత్తం హౌజ్ లో రతిక తర్వాత కిచెన్ లో‌ హెల్ప్ చేయలేనిది శోభా శెట్టే అని వారిద్దరిని నామినేట్ చేసింది దామిణి. అందరూ ఏదో ఇక హెల్ప్ చేస్తున్నారని, వీళ్ళ దగ్గర నుండి హెల్ప్ తక్కువ వచ్చిందని అందుకే అనర్హులని దామిణి అంది. అయితే బయటకొచ్చాక దామిణికి వివరణ ఇచ్చింది శోభాశెట్టి. "మార్నింగ్ నుండి నేనే గిన్నెలు కడిగాను.  అన్ని పనులు చేశాను" అని దామిణితో శోభాశెట్టి అంది. అయితే తనకేం కనపడలేదని, ఇది నా ఇష్టమని దామిణి అంది. ఇక చేసేదేమీ లేక బయటకెళ్ళి  ఏడ్చేసింది శోభాశెట్టి. టేస్టీ తేజ,  షకీల వచ్చి శోభా శెట్టిని ఓదార్చరు. షకీలా, గౌతమ్ కృష్ణని యావర్ నామినేట్ చేశాడు. 'నీ ఫాదర్ కింగా' అని షకీలా మేడమ్ అంది. ఆమె అలా అన్న ఆ టోన్ నాకు నచ్చలేదని అందుకే తనని నామినేట్ చేశానని ప్రిన్స్ యావర్ అన్నాడు‌. బాడీ ఎక్స్ పోజ్ చేస్తూ, షో ఆఫ్ చేస్తున్నాడని తేజతో గౌతమ్ కృష్ణ చెప్పాడంట, నా వల్ల ఏం అయిన ప్రాబ్లమ్ అయితే నాకే చెప్పాలి కానీ తేజకి ఎందుకు చెప్పాడని అందుకే గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు ప్రిన్స్ యావర్‌. అయితే బయటకొచ్చాక గౌతమ్ కృష్ణ అందరి ముందు మాట్లాడాడు. 'నేను అలా అనలేదు. టేస్టీ తేజనే నాతో నీ గురించి ఇలా అన్నాడు' అని గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యావర్ ని గౌతమ్ కృష్ణ అడుగగా.. నేనేం అనలేదని ప్రిన్స్ యావర్ అన్నాడు. ఇక దాంతో టేస్టీ తేజ తన గేమ్, స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడని అందరికి తెలిసింది. రతిక, ప్రిన్స్ యావర్ ని నామినేట్ చేశాడు ఆట సందీప్. షూస్ ఆమెవి నీట్ గా పెట్టుకోలేదని రతికని నామినేట్ చేశాడు. మార్నింగ్ వర్కవుట్ తర్వాత కిచెన్ లోకి వచ్చి ప్రిన్స్ హెల్ప్ చేయలేదని సందీప్ అన్నాడు. ప్రియాంక జైన్, దామిణిని రతిక నామినేట్ చేసింది. కారణం చెప్తూ.. ' డీలక్స్ రూమ్ లోకి అసలు ఎవరికి పర్మిషన్ లేదు. ఎలా వాళ్ళిద్దరు వెళ్ళి పడుకున్నారు. రూల్స్ ని అతిక్రమించినట్టు కాదు అతిక్రమించారని అందుకే వాళ్ళని నామినేట్ చేస్తున్నాని రతిక అనగా.. మీరు చెప్పిన ఈ రీజన్ ని వాళ్ళు అంగీకరిస్తారా అని అనగా.. రూల్స్ అందరికి ఒకటే కదా, వాళ్ళే కాదు మీరు కూడా అంగీకరించాలని బిగ్ బాస్ తో రతిక చెప్పింది. శోభా శెట్టి,  రతిక, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోర్ గౌతమ్ కృష్ణ, షకీల, దామిణి ఈ వారం నామినేషన్లో ఉన్నారు.  

అత్యధిక ఫాలోయింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కామన్ మ్యాన్

  బిగ్ బాస్ సీజన్-7 లో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. వ్యవసాయం వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి బిగ్ బాస్ కి వెళ్ళాలనే కోరికతో దొరికిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. ఒకనొక దశలో చనిపోవడానికి సిద్ధమైన పల్లవి ప్రశాంత్.. వాళ్ళ నాన్న చెప్పిన కొన్ని మాటలతో బ్రతికాడని, ఇక చచ్చేం సాధిస్తాం, ఉన్నప్పుడే అనుకున్నది సాధించాలనే తపనతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా తో మొదలైన సంగతి అందరికి తెలిసిందే. అయితే పవరస్త్రని ఎవరైతే దక్కించుకుంటారో వారే హౌజ్ లో  ఉండటానికి అర్హులని అప్పటిదాకా కంటెస్టెంట్స్ మాత్రమే అని హోస్ట్ నాగార్జున చెప్పగా.‌ దానికి తగ్గట్టుగానే పల్లవి ప్రశాంత్ కష్టపడుతున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో అందరూ దాదాపు సీరియల్స్, సినిమాలలో నటించి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళే.. దాంతో అందరు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైస్ బ్యాగ్, వాళ్ళ ఊరిలోని మట్టితో హౌజ్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. నాగార్జున ప్రశంసలు దక్కుంచుకున్నాడు. హౌజ్ లోకి వెళ్ళినప్పటి నుండి అందరితో కలిసి పోవాలనుకుంటున్న పల్లవి ప్రశాంత్ ని కావాలని కార్నర్ చేయాలని ప్రియాంక జైన్ నామినేషన్ చేసింది. దీంతో ప్రియాంక జైన్ మీద ఇప్పటికే ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు. నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే అందరూ పల్లవి ప్రశాంత్ పేరు చెప్తున్నారు. ఎందుకంటే అతనైతే గట్టిగా అనలేడనేమో, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అంటు ఒకరు నామినేట్ చేయగా, మాటతీరు బాగాలేదని మరొకరు, కలవట్లేదని మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో అందరు అతడినే టార్గెట్ చేస్తున్నారు. ఇక విరిగిపోయిన పల్లవి ప్రశాంత్ తనది తప్పు కాదని, తనకి కనిపించింది చెప్తుంటే అతనని అవహేళన చేస్తూ వెక్కిలి నవ్వులు నవ్వుకుంటున్నారు ప్రియాంక జైన్, అమర్ దీప్, కిరణ్ రాథోర్, షకీల.. ఇలా అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా ‌బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం గొడవలకు, వాదనలకు వెళ్ళకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు ప్రశాంత్. అయితే బయట పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే అత్యధికంగా అయిదు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండగా, అమర్ దీప్, ప్రియాంక జైన్ నాలుగు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో రెండు మూడు స్థానాలలో ఉన్నారు.  

షకీలా కన్నడ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్

షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోల్డ్ మూవీస్ కి సెంటరాఫ్ అట్రాక్షన్, కేరాఫ్ అడ్రెస్స్ ఏదైనా చెప్పొచ్చు. బోల్డ్ మూవీస్, బోల్డ్ సీన్స్ అనే పేరు వస్తే మొదటిగా గుర్తొచ్చే నటి షకీలా మాత్రమే. ఇక ఆమె కానీ ఆమె మూవీస్ కానీ సృష్టించిన సెన్సేషన్ మామూలు కాదు. మలయాళంలో షకీలా సినిమా రిలీజ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేది. ఎందుకంటే ఆమె మూవీ రిలీజ్ అంటే మిగతా మూవీస్ ఆడవు కలెక్షన్స్ రావు అనే భయం ఉండేది.  దాని కారణంగా ఆమె సినిమాలను బ్యాన్ చేసింది  మాలీవుడ్. షకీలా కూడా మరో దారి లేక మూవీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. షకీలా లైఫ్ ఎప్పుడూ ట్రాజెడీగానే ఉంటూ వచ్చింది .  ప్రొఫెషనల్ లైఫ్‌,  పర్సనల్ లైఫ్‌ అన్ని కాంట్రవర్సీలే. కస్టపడి నటించగా వచ్చిన డబ్బును సొంత అక్క తీసేసుకుని మోసం చేసింది. అలాంటి షకీలా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడింది. సినిమాల్లో ఉన్నట్టే షకీలా ఉంటుందని అనుకుంటారు చాలామంది కానీ అలా ఉండదు. అలా ఎన్నో కష్టాలు పడిన ఆమె బిగ్ బాస్ కన్నడలోని 2వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు . షకీలాకు మలయాళ నటిగా మంచి గుర్తింపు ఉంది.  తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆమె ఎన్నో మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించారు. అందుకే బిగ్ బాస్ కన్నడ టీమ్.. బిగ్ బాస్ కన్నడ ఇప్పటికి  9 సీజన్లు పూర్తి చేసుకుంది. అంటే  షకీలా 2014 లో కన్నడ బిగ్ బాస్  సెకండ్ సీజన్ లో కంటెస్టెంట్ వెళ్లారు అంటే .. దాదాపు 7 ఏళ్లు క్రితమే షకీలా  బిగ్ బాస్ హౌస్‌‌‌ను చూసేసిందన్నమాట..అలాంటి ఆమె ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ అంటే పెద్దగా భయపడాల్సిన పని లేదు అని అర్ధం . ఐతే కన్నడ  బిగ్ బాస్ లో  షకీలా.. 26 రోజులు మాత్రమే హౌజ్‌ లో ఉన్నారు  27వ రోజు ఎలిమినేట్ ఇపోయారు. ఇక  ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ 7 సీజన్‌తో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చారు. మరి ఈ సీజన్ లో  ఎన్ని రోజులు ఉంటారో గేమ్ అసలు ఎలా ఆడతారో చూడాలి. ఆమె వయసు కూడా చాలా పెద్దది. వయసులో ఉన్నవాళ్లు గేమ్స్ ఆడినట్టు ఆమె ఆడలేరు.  అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ ఎందుకు సెలెక్ట్ చేశారో అంతుబట్టని విషయం...  

నీకోసం యుద్ధం చేస్తాను...నా సెల్ ఫోన్ మాత్రం ఇవ్వను

వినాయక చవితి పండగ రాబోతున్న తరుణంలో మల్లెమాల కొత్త ఈవెంట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ప్రతీ ఫెస్టివల్ ని ఒక పండగలా కళకళలాడుతూ చేస్తుంది మల్లెమాల టీమ్. ఇక త్వరలో "స్వామి రారా" పేరుతో ఒక షో రాబోతోంది. దానికి సంబంధించి మరో కొత్త  ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇందులో చాలామంది  నటీనటులు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇక ఈ షోకి బేబీ మూవీలో లాస్ట్ సీన్ లో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఆ హీరో కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈ ఈవెంట్ కి  చాందిని చౌదరి కూడా వచ్చింది . ఆమె రాగానే అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యి అని ఆదికి చెప్పింది శ్రీముఖి. "నన్ను ఇంప్రెస్స్ చేయడమంటే అంత ఈజీ కాదు" అని చెప్పింది చాందిని. "నాకోసం యుద్దాలు చేయాలి, త్యాగాలు చేయాలి" అని కూడా చెప్పింది. "ఏమైనా చేసేస్తా" అని ఆది కొంచెం ఎక్సట్రా చేసేసరికి "ఐతే నీ ఫోన్ ఇవ్వు" అంది చాందిని "అమ్మో ఆ త్యాగం చేస్తే నా లైఫ్ ఆగమాగం ఐపోతుంది..వద్దు" అన్నాడు. దానికి చాందిని కిలకిలా నవ్వేసింది. ఇక ఈ షోకి గెస్టులుగా వచ్చిన నరేష్, పవిత్ర గులాబీ పూలు ఇచ్చుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. ఇక లాస్ట్ బేబీ మూవీ స్పూఫ్ చేశారు. కానీ అంత వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా ఫారియా అబ్దుల్లా బులెట్ మీద ఎంట్రీ ఇచ్చింది. ఫారియా రీసెంట్ గా "ది జంగబూరు కర్స్" అనే వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించింది. ఫారియా  రావడంతోనే "ఇండియా ఈజ్ మై కంట్రీ..ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్" అని చెప్పి రాంప్రసాద్ బ్రదర్ అన్నట్టుగా అతని మీద చెయ్యేసేసరికి రాంప్రసాద్ ఆమె చేతిని పక్కకు తోసేసాడు. బేసికల్లి ఒక రేంజ్ కి వెళ్ళాక మాటలుండవ్ మోతలే అంటూ శ్రీముఖి చెప్పిన డైలాగ్ తో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోలో నరేష్, పవిత్ర, ఆది, రాంప్రసాద్ మధ్య ఎలాంటి కామెడీ కంటెంట్ క్రియేట్ అయ్యిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.    

ట్రూత్ ఆర్ గేమ్ లో తప్పించుకున్న మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -254 లో.. కృష్ణ, ముకుంద, మురారి కలిసి షాపింగ్ కి వెళ్తారు. అంతకంటే ముందు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ సరదాగా గేమ్ ఆడతారు ముగ్గురు. ఎలాగైనా  మురారి, ముకుందల ప్రేమ విషయం కృష్ణకి చెప్పాలని ముకుంద అనుకుంటుంది. మురారి మనసులో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోవాలని కృష్ణ అనుకుంటుంది.  ఆ తర్వాత ముగ్గురు కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. బాటిల్  మురారి వైపు ఆగేసరికి కృష్ణ ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీరు ముందు ప్రేమించిన అమ్మయి పేరు చెప్పండని కృష్ణ అడుగుతుంది. మురారి ఇబ్బందిపడుతు రాధ అని చెప్తాడు. ఆ తర్వాత ముకుంద వైపు బాటిల్ ఆగుతుంది. అప్పుడు నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరు చెప్పమని కృష్ణ అడుగుతుంది. కృష్ణ అని ముకుంద చెప్తుంది. అప్పుడు కృష్ణ ఇప్పుడు వేరే పేరు ఉందని ముకుంద చెప్తుంది. అప్పుడే ఇద్దరు కుర్రాళ్లు వచ్చి.. ఈ ఇద్దరిలో మీ భార్య ఎవరు సర్ అని మురారిని అడుగుతారు. మేం మా ఫ్రెండ్స్ అందరం, తనని మీ భార్య అని అనుకున్నామని ముకుందని చూపిస్తారు. ఒక్కడు మాత్రం ఈవిడ మీ భార్య అని అన్నాడని కృష్ణని చూపిస్తాడు. దాంతో ఈవిడ నా భార్య అని కృష్ణని చూపిస్తాడు మురారి. అంతమందికి ముకుంద మీ భార్య అనిపించింది. ఒక్క అతనికి మాత్రం నేను మీ భార్య అనిపించింది ఎందుకలా అనిపించిందని ఆ అబ్బాయిని కృష్ణ అడుగుతుంది. ఏం లేదు మేడమ్, మీరు ట్రెడిషనల్ గా ఉన్నారు అందుకే అని ఆ అబ్బాయి చెప్తాడు. ఆ తర్వాత అంతమందికి ముకుంద భార్యలా అనిపించింది. నేను అనిపించలేదు ముకుంద ముందు నేను అంత తీసిపారేసినట్లు ఉన్నానా అని కృష్ణ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి,  ముకుంద బయలుదేరి వస్తుంటే  కృష్ణ డల్ గా ఉంటుంది. కృష్ణని డల్  మూడ్ నుండి బయటకు తీసుకొని రావాలని మురారి అనుకుంటాడు. మరొక వైపు రేవతి, మధు ఇద్దరు ముకుంద తీరు గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏంజిల్ మనసులో ఎవరున్నారో విశ్వనాథ్ తెలుసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -860 లో.. ఫణీంద్ర దగ్గర మంచి మార్కులు కొట్టేయలన్న ప్లాన్ తో డబ్బులు తీసుకొని వస్తాడు శైలేంద్ర. ఇక అలా వచ్చిన శైలేంద్ర.. ఫణింద్ర ముందు తనేదో కాలేజీ పరువు నిలబెట్టినట్లు ఫీల్ అయిపోయి డబ్బులు అరెంజ్ చేశానని ఫణింద్రకి చెప్పగానే ఫణింద్ర మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఫణీంద్ర ముందు జగతి, మహేంద్ర లను బ్యాడ్ చెయ్యాలని శైలేంద్ర ప్లాన్ వేస్తాడు. డాడ్ ఇలా తెలియకుండా కాలేజీ విషయలు గాని ఇంటి విషయాలు గాని దాచిపెట్టారా? అలా చేస్తే డాడ్ కి ఇప్పుడే చెప్పండని శైలేంద్ర అంటాడు. అదేం లేదని మహేంద్ర అంటాడు. మరొకవైపు వసుధారకి ఏంజిల్ ఫోన్ చేసి.. రిషి మనసులో ఎవరో ఉన్నారని, అందుకే నాతో పెళ్లికి ఒప్పుకోవట్లేదని అంటుంది. అలా అనగానే నీకెలా తెలుసని వసుధార అడుగుతుంది. ఆ తర్వాత ఏంజిల్ వసుధారకి రిషి డ్రా చేసిన కళ్ళ ఫోటోని పంపిస్తుంది. కళ్లు ఎవరివో తెలుసుకోమని వసుధారకి ఏంజిల్ చెప్తుంది. ఇబ్బందిగానే వసుధార సరే అంటుంది. ఆ తర్వాత  రిషికి ఆ కళ్ల ఫోటోని వసుధార పంపించగానే రిషి షాక్ అవుతాడు. ఈ ఫోటో ఏంజిల్ పంపించింది. ఆ కళ్లు ఎవరివో కనుక్కోమని అందని రిషికి చెప్తుంది వసుధార. ఆ తర్వాత  వసుధారని రిషి కలిసి.. ఎందుకిలా చేస్తున్నావ్ అని అడుగుతాడు. నేనేం చెయ్యలేదు, ఏంజిల్ నాకు పంపింది, నేను మీకు పంపానని వసుధార చెప్తుంది. రిషి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరు మీ అంతటా మీరే నిజం తెలుసుకోవాలి. మేం చెప్పిన మీరు వినరని వసుధార అనుకుంటుంది. మరొకవైపు వసుధారకి ఏంజిల్ ఫోన్ చేసి.. ఆ కళ్ళు ఎవరివో రిషిని అడిగావా? చెప్పడా అని అడుగుతుంది. లేదని వసుధార అంటుంది. ఏంజిల్ , వసుధారలు ఫోన్ లో మాట్లాడుకునేదంతా విశ్వనాథ్ వింటాడు. అంటే ఏంజిల్ మనసులో ఏం ఉందో వసుధారకి తెలుసన్నా మాట అని విశ్వనాథ్ అనుకుంటాడు. కాసేపటికి ఏంజిల్ దగ్గరికి విశ్వనాథ్ వచ్చి ఏమైందని అడిగితే.. ఏం లేదని ఏంజిల్ సమాధానం చెప్తుంది. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు కలిసి శైలేంద్ర చేసే పనుల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కావ్యని మూడు నెలల గడువు అడిగిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -193 లో.. కావ్యని బాగా చూసుకోమని రాజ్ తో సీతారామయ్య చెప్తాడు. సీతారామయ్య సంతోషం కోసం కావ్యని బాగా చూసుకుంటానని రాజ్ అబద్ధం చెప్తాడు. సరే పదా హాల్లోకి వెళదామని సీతారామయ్య వెళతాడు. నువ్వు వెళ్లి కావ్యని తీసుకొని వచ్చి ఆమెని ఆశీర్వదించు, అప్పుడే వ్రతం పూర్తవుతుందని సీతారామయ్య అనగానే.. సరే అని కావ్యని తీసుకురావడానికి రాజ్ వెళ్తాడు. రాజ్ అలా వెళ్లగానే అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా అపర్ణ ఆశ్చర్యంగా చూస్తుంది. రాజ్ కావ్య దగ్గరికి వెళ్లేసరికి.. కావ్య పుట్టింటికి వెళ్లడానికి బ్యాగ్ సర్దుకొని ఎదరుపడుతుంది. వెళ్తున్న అని రాజ్ కి చెప్పి గదిలో నుండి బయటకు వెళ్లబోతుంటే రాజ్ ఆగమని చెప్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండమని రాజ్ అనగానే.. ఎందుకు ఒక వస్తువుగానా? ఎందుకు ఉండాలి? ఎలా ఉండాలని కావ్య అడుగుతుంది. ఇన్ని రోజులు ఎదరుచూసిన దానివి, ఒక మూడు నెలలు ఎదురు చూడలేవా అని రాజ్ అంటాడు. ఈ మూడు నెలల తర్వాత నన్ను భార్యగా ఒప్పుకుంటారా అని కావ్య అడుగుతుంది. అన్నిటికి ఈ మూడు నెలల్లో సమాధానం దొరుకుతుందని రాజ్ అంటాడు. నమ్మకం లేదని కావ్య అనగానే నీకు నమ్మకం కలగాలి అంతేకదా అని రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని హాల్లోకి వెళ్తాడు. ఆ తర్వాత సీతరామయ్య కావ్యని ఆశీర్వాదం తీసుకొమని చెప్పగానే కావ్య రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు సీతారామయ్య, ఇందిరాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అపర్ణ మాత్రం కోపంగా చూస్తుంటుంది. ఆ తర్వాత అపర్ణ ఒంటరిగా ఆలోచిస్తుండగా రుద్రాణి కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. రాను రాను నీకు ఈ ఇంట్లో విలువ లేకుండా పోయింది, రాజ్ నీ మాట వినట్లేదు అన్నట్లుగా రుద్రాణి మాట్లాడగనే.. అపర్ణ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు కృష్ణుడితో తన సంతోషాన్ని చెప్పుకుంటుంది కావ్య. నా భర్త ఇంకో మూడు నెలలు టైం కావాలని అడిగాడంటే నన్ను భార్యగా ఒప్పుకుంటాడా? అంత నీ మాయంటూ దేవుడికి కావ్య మొక్కుకుంటుంది. మరొక వైపు రాజ్ కృష్ణుడు దగ్గరికి వచ్చి.. మా తాతయ్య కోసం మాత్రమే కావ్యని హ్యాపీగా చూసుకుంటానని మాటిచ్ఛాను. అంత నీ మాయ కృష్ణ అని రాజ్ మొక్కుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

టీచర్స్ డేకి సుమ చేసిన‌ వీడియో వైరల్!

ప్రతీ ఒక్కరు బాల్యంలో చదువుకునే రోజుల్లో టీచర్స్ డే ఎంతో ఇంపార్టెంట్. ఆ రోజున స్టుడెంట్స్ లో కొంతమంది టీచర్స్ అవుతారు. మరికొంతమంది వారి స్నేహితులలో టీచర్స్ ను చూసుకుంటారు. నేడు టీచర్స్ డే కాబట్టి సుమ తనకి చదువుని నేర్పించిన మాస్టర్స్‌ ని గుర్తుచేసుకుంటూ తను స్కూల్ లో ఎలా ఉందో చెప్తూ ఒక వీడియోని షేర్ చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది. బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.  అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ ' స్ట్రెస్ బస్టర్స్ ' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. అయితే  సుమ.. ' వరలక్ష్మి వ్రతానికి నేను కొన్న కొత్త చీర' అనే వ్లాగ్ ని అప్లోడ్ చేయగా  అది వైరల్ అయింది. అయితే కొన్ని రోజుల క్రితం సుమ  ' ది‌ నెస్ట్' అనే ఓల్డేజ్ హోమ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీచర్స్ డే సందర్భంగా మరొక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది సుమ. 'టీచర్ వీడు నా జుట్టు లాగేస్తున్నాడు, టీచర్ సుస్సు, గుడ్ మార్నింగ్ టీచర్' అంటూ సుమ ఫన్నీగా చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సుమ ఏం చేసినా అందులో ఒక మెసేజ్ తో పాటు ఫన్నీ ఉంటూనే పంచులు ఉంటాయి. కాగా ఇప్పుడు ఈ వీడియోకి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బిగ్ బాస్ కి ముందు తనమీద ప్రాంక్!

బిగ్ బాస్ సీజన్-7 కి వెళ్ళిన మొదటి కంటెస్టెంట్ ప్రియాంక జైన్. శివ కుమర్ , ప్రియాంక జైన్ కలిసి గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరు కలిసి 'నెవెర్ ఎండింగ్ టేల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రియాంకని శివ కుమార్ ముద్దుగా 'పరి' అని పిలుచుకుంటాడు. వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ షోలో పాల్గొనగా వీరికి ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ఫ్యాన్ పేజీలు పుట్టుకొచ్చాయి. ఇలా ఇద్దరు మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ప్రియాంక జైన్ అలియాస్ జానకి.. ముద్దుగా అమ్ములు అని పిలుస్తారు. తన పేరు కంటే తను నటించిన పాత్ర ద్వారానే ఎక్కువ ఫేమ్ లోకి వచ్చింది ప్రియాంక జైన్. 'మౌనరాగం' సీరియల్  ద్వారా బుల్లితెరకి పరిచయమైంది. ఆ సీరియల్ లో అమ్ములు పాత్రలో మూగ అమ్మాయిగా తన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత  మా టీవీలో ప్రసారమై తాజాగా పూర్తయిన 'జానకి కలగనలేదు' సీరియల్ లో అమర్ దీప్ తో జతకట్టి తన యాక్టింగ్ తో అందరిని మెప్పించింది. ప్రియాంక జైన్ ముంబైలో జన్మించింది. తనకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రస్ట్ తో, మొదట మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తమిళ్ లో 'రంగ్ తరంగ్' మూవీలో నటించింది. కన్నడలో 'గోళీసోడా', తెలుగు లో 'చళ్తే చళ్తే' మూవీలో నటించింది. అందులో అంతగా గుర్తింపు రాకపోవడంతో మా టీవీలో ప్రసారమైన మౌనరాగం సీరియల్  ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిందని చెప్పొచ్చు. ఆ సీరియల్లో హీరో శివ కుమార్ తో ప్రియాంక ఫ్రెండ్ షిప్ మొదలయింది. కాగా ఇప్పుడు ఇద్దరు ప్రేమికులుగా మరిపోయారు. ప్రియాంక, శివకుమార్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి వ్లాగ్స్ చేయడంతో వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయనడంలో ఆశ్చర్యం లేదు.  బిగ్ బాస్ హౌజ్ కి ప్రియాంక వెళ్ళేముందు షూట్ చేసిన ఒక వీడియోని శివ కుమార్ తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు. ' బిగ్ బాస్ కి ముందు ప్రాంక్ ఆన్ ప్రియాంక జైన్' అనే టైటిల్ తో చేసిన ఈ వ్లాగ్ లో.. శివ కుమార్ తన గడ్డం, మీసం తీసేసి ఒక అమ్మాయి గెటప్ వేసుకొని ప్రియాంకని ప్రాంక్ చేయాలనుకున్నాడు. కానీ  ప్రియాంక ఆ అమ్మాయి శివకుమార్ అని కనిపెట్టేసింది.‌ ఇలా ప్రియాంక బిగ్ బాస్ కి వెళ్లేముందు  తీసిన ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే సీరియల్ ద్వారా తన నటనతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రియాంక హౌజ్ లో ఎలాంటి వినోదాన్ని ఇస్తుందో? ఎలా గేమ్స్, టాస్క్ లు చేస్తుందో చూడాలి మరి.  

లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్!

  చల్లని రాతిరి వెన్నెల్లో సరదాల పందిరిలో అంటూ లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆర్జే సూర్య, ఇనయా సుల్తానా.. వీళ్ళిద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టుగా ఇనయా తన యూట్యూబ్ చానెల్ లో వీడియోని అప్లోడ్ చేసింది. బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6 లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు. అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా‌ ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది.‌ అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ  బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది. ఇనయా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన ఫ్యాన్స్ కి తెలియజెయ్యాలనే ఉదేశ్యంతో తన ప్రతి అప్డేట్ ని షేర్ చేస్తుంది. నిన్న మొన్నటిదాకా ఇనయా దుబాయ్ లోని అబుదాబికి వెళ్లి, అక్కడ పొట్టి డ్రెస్ లో దిగిన కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆర్జే సూర్యతో కలిసి లాంగ్ డ్రైవ్ అంటూ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇక కార్ లో వెళ్తూ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. నువ్వు దుబాయ్, ఊటీ అంటు సింగిల్ గా వెళ్తే మరి నీ వీడీయోలు, ఫోటోలు ఎవరు తీస్తారని ఆర్జే సూర్య అడుగగా.. నేను తీస్తానని ఇనయా చెప్పింది. కథలొద్దు నిజం చెప్పు, ఎవరు లేకుండా అలా ఎలా వ్లాగ్స్ తీస్తావని అడుగగా.. ఫోటోగ్రాఫర్ కి ఒక వేయి రూపాయలు ఎక్కువ ఇస్తానంటే వాడే తీస్తాడని ఇనయా అంది. ఆ తర్వాత ఇనయాని పాట పాడమని సూర్య అడుగగా.. ఈ వీడియో చూసే జనాలు తిడతారు, మొహం మీద ఊసేస్తారని ఇనయా అంది. సూర్యని పాడమని ఇనయా అనగా.. చల్లని రాతిరి వెన్నెల్లో సరదాల పందిరిలో అంటూ పాడాడు సూర్య. ఇలా ఇద్దరు కలిసి చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ అంటూ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

మొదటి రోజే ఫిట్టింగ్...సూట్ కేస్ ఆఫర్ చేసినప్పుడు తీసుకున్న బాగుండేది!

  బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా లాంచ్ అయి ప్రేక్షకుల అంచనాలు తారుమరు చేసింది. 21 మందిని హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి అయితే మిగతా కంటెస్టెంట్ లు నెక్స్ట్ వారం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనునుట్లు తెలుస్తుంది. 14 మంది సండే రోజు జరిగిన గ్రాండ్ లాంచ్ లో ఎంట్రీ ఇవ్వగా.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్ కోసం హీరో నవీన్ పొలిశెట్టిని హౌస్ లోకి పంపించగా.. హౌస్ లో కంటెస్టెంట్స్ ని కొద్దిసేపు సరదాగా ఆటపట్టించాడు నవీన్ పొలిశెట్టి. బిగ్ బాస్ ఎవరినైనా హౌజ్ లోకి పంపిస్తున్నారంటే టాస్క్ అయిన ఫిట్టింగ్ అయిన కంపల్సరి అన్న విషయం తెలుస్తుంది. హౌజ్ లో ఉన్న మేల్ కంటెస్టంట్ ఎందరున్నారో అందరు.. ఫీమేల్ కంటెస్టెంట్ లోని ఒకరికి లక్కీ చామ్ గల బ్రాస్ లైట్ ఇవ్వాలి. అలా నవీన్ పొలిశెట్టి చెప్పగానే.. అమర్దీప్-శోభా శెట్టికి, టేస్టీ తేజ -షకీలాకి, పల్లవి ప్రశాంత్ -రతికాకి ఇలా అందరు తమ లేడీ లక్కీ చామ్ కి బ్రాస్ లైట్ ఇచ్చారు. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి హౌజ్ లో నుండి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. కంటెస్టెంట్ ఒకరికొకరు తెలుసుకొనే ప్రయత్నంలో కొందరు... ముందే పరిచయం ఉన్నవాళ్ళు వేరొక హోస్ మేట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. జరిగింది. నాగార్జున గ్రాంఢ్ లాంచ్ రోజున స్టేజి మీద గౌతమ్ కృష్ణకి బేడీలు ఇచ్చి.. నీకు క్యూట్ గా అనిపించిన వాళ్ళకి బేడీలు వెయ్యమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్ కృష్ణ కి క్యూట్ గా శుభశ్రీ అనిపించి తనకి బేడీలు వేసాడు. ఇదేదో టాస్క్ లాగా ఉందని బేడీలు చూసి శుభశ్రీ బయపడినా.. ఆ తర్వాత వాస్తవం తెలుసుకొని కుదుటపడుతుంది. శోభా శెట్టి వచ్చి ఒక నెల రోజులు అయినట్లు ఫీల్ అయిపోయి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. మరొకవైపు బిగ్ బాస్ ఆదేశాల వరకు పడుకోకుడదేమోనని కన్ ఫ్యూషన్ లో శివాజీ ఉంటాడు. నాగార్జున ఆఫర్ చేసినప్పుడు సూట్ కేసు తీసుకున్న బాగుండేదని అనుకుంటాడు శివాజీ. చిలకకి చెప్పినట్టు చెప్పారు, డబ్బులు తీసుకొమని వింటేగా అని రతిక అంటుంది.

బిగ్ బాస్ లో హీటెక్కిన నామినేషన్లు.. నామినేషన్ లో ఉంది వీళ్ళే!

బిగ్ బాస్ 7 షురూ అయింది. నామినేషన్ , ఎలిమినేషన్ అంటూ హౌజ్ లో హీటెక్కే వాదనలు‌ మొదలయ్యాయి. ఏ మూవీకీ రాని హైప్ బిగ్ బాస్ నామినేషన్ ప్రోమోకి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా కోనసాగుతుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేది నామినేషన్ ప్రక్రియ లోనే. ఒకరినొకరు తిట్టుకోవడాలు శృతిమించితే కొట్టాడాలు  అన్నిరకాల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రతి సోమవారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది.  ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ప్రక్రియ ఉంది. వచ్చి ఒక్కరోజే అయినా  ఒక కంటెస్టెంట్ మరొక కంటెస్టెంట్ గురించి ఎలా డిసైడ్ చేస్తారనే కన్ఫ్యూషన్ తో ఆట మొదలైంది. మొదట కంటెస్టెంట్ ని స్టోర్ రూమ్ కి ఇద్దరిని నామినేట్ చేయమని చెప్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఆ నామినేట్ చేసిన ఇద్దరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నారో తెలుసుకునేలా ఏర్పాట్లు చేశాడు బిగ్ బాస్. దీంతో నామినేట్ చేయబడ్డ వారు, ఎవరైతే నామినేట్ చేశారో వారితో డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అసలు ఫైట్ మొదలైంది. మొదటగా శివాజీని పిలిచి ఏ ఇద్దరు ఈ ఇంట్లో ఉండటానికో అనర్హులని మీరు అనుకుంటున్నారో వారిని నామినేట్ చేయండని బిగ్ బాస్ కోరగా.. మొదట గౌతమ్ కృష్ణని, రెండవ కంటెస్టెంట్ గా సింగర్ దామిణిని నామినేట్ చేశాడు శివాజీ. తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ అనగా.. హౌజ్ లో ఉన్నవాళ్ళకి అందరికీ ఈ బిగ్ బాస్ కీలకం, గౌతమ్ కృష్ణ యంగ్ ఏజ్ లో ఉన్నాడు. బయటకెళ్తే హీ ఈజ్ సర్వైవ్, చాలా అవకాశాలు వస్తాయి. ఇక్కడ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేడని అనిపించిందని గౌతమ్ కృష్ణ గురించి శివాజీ అన్నాడు. ఆ తర్వాత తను మంచి మంచి పాటలు పాడింది. బయటకు వెళ్తే చాలా ఛాన్స్ లు వస్తాయి. తనని ఆడియన్స్ సేవ్ చేస్తారు. ఇక్కడ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వదని అనిపిస్తుంది. అందుకే దామిణిని నామినేట్ చేశానని శివాజీ చెప్పాడు.  ఆ తర్వాత నామినేట్ చేయడానికి స్టోర్ రూమ్ కి ప్రియాంక జైన్ వెళ్ళి.. మొదటి నామినేషన్ పల్లవి ప్రశాంత్, రెండవ నామినేషన్ రతిక అని చెప్పింది. కారణాలు చెప్పమని బిగ్ బాస్ అనగా.. నేను అందరితో క్లోజ్ అవ్వడానికి ట్రై చేశాను. కానీ వీళ్ళిద్దరు అంత క్లోజ్ అవ్వలేదు. మాతో కలవడానికి కూడా ఇష్టపడలేదు. నైట్ ఒక గుడ్ లక్ అని ఇచ్చారు కదా, అప్పటినుండి రైతు బిడ్డలమని అనుకున్నారు. నేనేమో అందరితో కలిసిపోవాలని అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరు కలవలేదని ప్రియాంక జైన్ అంది. అదంతా పల్లవి ప్రశాంత్, రతిక కన్ఫెషన్ రూమ్ లో చూశారు. " నైట్ పడుకోలేదు.. నైట్ వరకు యాక్టివ్ గా ఉన్నారు. మార్నింగ్ నుండి లేరని మరొక కారణం చెప్పింది ప్రియాంక.  నామినేషన్ ప్రక్రియ ముగిసాక .. పల్లవి ప్రశాంత్, రతిక మరియు ప్రియాంక జైన్ మధ్య డిస్కషన్ జరిగింది. "మీకు అనిపించింది మీరు చేస్తారు కదా, నాకనపించింది నేను చేస్తాను" అని ప్రియాంక అనగా.. నేనెంత యాక్టివ్ గా ఉన్నానో, నాకు తెలుసు కెమెరాస్ కి తెలుసు. నిజంగా ఇది ఇన్ వాలిడ్ అని రతిక అంది. కాసేపటికి రతిక, పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాట్లాడుకున్నారు. "నీతోనైతే మంచిగనే ఉన్నానా? ఏడ తప్పు కనిపించలేదు కదా" అని పల్లవి ప్రశాంత్ అనగా.. మనం ఆక్సెప్ట్ చేయాలే అని రతిక అంది. ఇలా మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ ముగిసింది.  ఇలాంటి హీటెక్కే నామినేషన్లు ఇంకా అవుతూనే ఉంటాయి. చూడాలి మరి ఎలా ఉంటుందో.