Shivaji : సంఛాలక్ గా శోభా శెట్టి ఫెయిల్.. ప్రియాంక కోసం శివాజీతో గొడవ!

బిగ్ బాస్ సీజన్-7 లో సీరియల్ బ్యాచ్ కి శివాజీకి మధ్య ఆర్గుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు టాస్క్, మరోవైపు కంటెస్టెంట్స్ స్ట్రాటజీలతో బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. హౌస్ లో గతవారం ఫ్యామిలీ వీక్ సాగగా.. ఈ  వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. గతవారం ఫ్యామిలీ వీక్ లో సీరియల్ బ్యాచ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు.. ఎవరి గేమ్ వారు ఆడండి. గ్రూప్ గా వద్దని చెప్పిన వాళ్ళు ఏం మారట్లేదు. ప్రియాంక కోసం శోభాశెట్టి మళ్ళీ ఫౌల్ గేమ్ ఆడుతుంది‌. మొదట హౌస్ లో బాటమ్-5 కి మధ్య పోటీ పెట్టగా అంబటి అర్జున్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు. ఇక ఈ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని కంటెస్టెంట్స్ తో డిఫెండ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాప్-5 లోని ఎవరితో ఆడతావని అర్జున్ ని అడుగగా యావర్ తో అని చెప్పాడు. వీరిద్దరి మధ్య ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే.. బాల్స్ ని స్టాండ్ మీద పెట్టి వాటిని పడకుండా బ్యాలెన్స్ చేయాలనే టాస్క్ ని ఇచ్చాడు‌. దీనిలో యావర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు. యావర్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని మిగిలిన నలుగురితో పోటీ పడమని చెప్పాడు బిగ్ బాస్. స్కూటర్ పై సవారి విజయానికి దారి టాస్క్ లో ప్రశాంత్ పై యావర్ గెలిచాడు. ఆ తర్వాత  ఐ లవ్ బర్గర్ ఛాలెంజ్ లో శోభా శెట్టి మీద యావర్ గెలిచాడు. మూడవ టాస్క్ విల్లు ని పట్టుకొని బాల్స్ ని పెట్టి చివరి వరకు ఉన్నవారే విజేత అని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో ఫస్ట్ బజర్ తర్వాత ప్రియాంక అవుట్ అయింది. ఇక సెకండ్ బజర్ తర్వాత శివాజీ అవుట్ అయ్యి యావర్ గెలిచాడు. అయితే ఈ టాస్క్ కి సంచాలకులుగా శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉన్నారు. ఇక అక్కడే అసలు గేమ్ మొదలైంది. ఆడిన ముగ్గరిలో ఫస్ట్ డ్రాప్ అవుట్ అయిన ప్రియాంక ఒక్కతే విన్నర్ అని శోభాశెట్టి వాదిస్తుంది. టాస్క్ నియామాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడని అశ్వగంధ(గౌతమ్ కృష్ణ), కన్నింగ్ అర్జున్ కలిసి నొక్కి పట్టీ మరీ చెప్పడంతో శోభా శెట్టి ఆలోచనలో పడింది‌. అసలు నియమాల ప్రకారం ప్రియంక ఆడిందని, యావర్ శివాజీ రాంగ్ ఆడారని ప్రియంకని గెలిపించాలని శివాజీతో శోభాశెట్టి వాగ్వాదానికి దిగింది. శివాజీ బాల్స్ ని ఎక్కువ సేపు పట్టుకున్నాడని అది లెక్కలోకి తీసుకోనని యావర్ హోల్డ్ చేశాడని చెప్పి ప్రియాంకకి సపోర్ట్ గా మట్లాడుతుంది శోభాశెట్టి. మరి సంఛాలక్ గా ఉండి తన స్నేహితురాలిని గెలిపించుకోవాలని చూస్తున్న శోభాశెట్టి ప్రయత్నం ఫలిస్తుందా? ఈ ఇష్యూలో బిగ్ బాస్ ఇన్వాల్వ్ అవుతాడా చూడాలి మరి.

Yawar : ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేసులో యావర్ ముందంజ!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. నిన్న మొన్నటి దాకా ఫ్యామిలీ వీక్ సాగింది. ఇక ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఏదీ ఊరికే రాదు. అది చిన్న పాసైన పెద్ద గోల్డ్ మెడల్ అయినా.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అదే జరుగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెడుతూ కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. మొదట హౌస్ లో బాటమ్-5 కి మధ్య పోటీ పెట్టగా అంబటి అర్జున్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు. ఇక ఈ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని కంటెస్టెంట్స్ తో డిఫెండ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాప్-5 లోని ఎవరితో ఆడతావని అర్జున్ ని అడుగగా యావర్ తో అని చెప్పాడు. వీరిద్దరి మధ్య ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే.. బాల్స్ ని స్టాండ్ మీద పెట్టి వాటిని పడకుండా బ్యాలెన్స్ చేయాలనే టాస్క్ ని ఇచ్చాడు‌. దీనిలో యావర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు. యావర్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని మిగిలిన నలుగురితో పోటీ పడాల్సి వస్తుందని బిగ్ బాస్ చెప్పాడు. ఇక తర్వాతి ఇచ్చిన టాస్క్ ' స్కూటర్ పై సవారి విజయానికి దారి'. ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ యావర్ మధ్య పోటీ జరుగగా యావర్ గెలిచాడు‌. ఆ తర్వాత శోభాశెట్టి, యావర్ కి మధ్య ' ఐ లవ్ బర్గర్' అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఒక డైస్ ని ఇచ్చి దానిని నేల మీద విసిరేస్తే బర్గర్ సింబల్ వస్తే వెళ్ళి బర్గర్ తినాలని అలా అన్ని బర్గర్ లు తిన్నాక బెల్ కొట్టాలని బిగ్ బాస్ చెప్పగా.. యావర్ ఈ టాస్క్ లో గెలిచాడు. 

Krishna Mukunda Murari: ఆ ప్లాన్ తో కృష్ణపై ముకుంద పగ తీర్చుకోనుందా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -316 లో.. మురారి కృష్ణకి గిఫ్ట్ గా రింగ్ ఇవ్వడం చూసి ఓర్వలేని ముకుంద ఎలాగైనా అందరి ముందు నిజం బయటపెట్టాలని అనుకుంటుంది. కృష్ణ పెట్టుకున్న రింగ్ నాదే అని ముకుంద చెప్పగానే.. భవాని నమ్మి తన రింగ్ తనకి ఇవ్వమని చెప్తుంది. కృష్ణ మురారి నిజం చెప్తే భవాని తిడుతుందని సైలెంట్ గా ఉంటారు. కృష్ణకి  రింగ్ రాకపోయేసరికి  మురారి తియ్యబోతుంటే.. భవాని వద్దు అని చులకనగా మాట్లాడేసరికి కృష్ణ బాధపడుతు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారి కూడా బాధపడుతు.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ వెళ్ళిపోతారు.  అందరు వెళ్ళిపోయాక భవానికి ముకుంద నిజం చెప్తుంది. రింగ్ నాది కాదు.. కృష్ణకి మురారి గిఫ్ట్ ఇచ్చాడు. అది బయట పెడితే వాళ్ళకి  మీరు చివాట్లు పెడతారని, ఇద్దరు సెట్ అవుతారని అనుకున్నాను కానీ కృష్ణ నిజం చెప్పకుండా ఆగిపోయిందని ముకుంద అంటుంది. నువ్వు అలా చెయ్యడం వల్ల మురారి దృష్టిలో నెగటివ్ అయ్యావ్. ఇంకొక సారి అలా చెయ్యకని ముకుందతో భవాని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకవైపు కృష్ణ, శకుంతల ఇద్దరు మాట్లాడుకుంటారు. మీ పెద్ద అత్తయ్య.. అల్లుడుకి ముకుందకి పెళ్ళి చేయాలని అనుకుంటుందని శకుంతల అనగానే.. నా ప్రాణం ఉండగా అది జరగదని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి నందు వస్తుంది. అసలేం జరిగిందని తెలుసుకుంటుంది. మేం ఏం తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి టైమ్ కావాలి అని కృష్ణ అంటుంది. ఏసీపీ సర్ ని ముకుంద నుండి కాపాడుకోవాలని కృష్ణ అంటుంది. మరొక వైపు అనవసరంగా మురారి దృష్టిలో నెగెటివ్ అయ్యాను. ఈ చీర కృష్ణకి ఇవ్వమని చెప్పి కూల్ చెయ్యాలని అనుకుంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి మురారి వచ్చి.. ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. నాకు కృష్ణ వాళ్ళు చేసిన తప్పు గుర్తుకు వచ్చింది. అందుకే చేశా నువ్వు బాధపడ్డావ్. అన్ని షాప్ లు తిరిగి ఈ చీర తీసుకొని వచ్చాను కృష్ణకి ఇవ్వు అని మురారిని పంపిస్తుంది ముకుంద. మరొకవైపు మురారిని అమెరికా పంపించడం ఎందుకని నందు అడుగుతుంది. అప్పుడే అమెరికా నుండి తన ఫ్రెండ్ కాల్ చేస్తే.. మూడు రోజుల్లో పంపిస్తున్నానని భవాని చెప్తుంది. అది విని రేవతి నందు ఇద్దరు షాక్ అవుతారు. మరోవైపు చీర తీసుకొని కృష్ణ దగ్గరకు వస్తాడు మరారి. కృష్ణ బాధపడుతుంటే  ఆ చీర ఇచ్చి.. నా వల్లే ఇదంతా అని సారీ చెప్తాడు. తరువాయి భాగంలో.. భవాని కుటుంబం హ్యాపీగా దీపావళి జరుపుకుంటుంది.  ఈ పండగలో  కృష్ణపై ముకుంద ఏం ప్లాన్ చేయనుందో? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu: శైలేంద్రకి ఫణీంద్ర వార్నింగ్.. అనుపమ నిజం కనిపెట్టనుందా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -922 లో.. వసుధార లేవకముందే రిషి లేచి వంట చేస్తుంటాడు. మీకు ఇక్కడ ఎక్కడ ఏం  ఉన్నాయో తెలుసా అని వసుధార అనగానే.. అన్ని తెలుసంటూ చూపిస్తాడు రిషి. ఆ  తర్వాత పైన రైస్ చూసుకోకుండా తీస్తుంటే అవి ఇద్దరిపైన పడుతాయి. కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.  అల్యూమిని ప్రోగ్రామ్ లో ఆ అనుపమ, మహేంద్ర కలుసుకున్నారంట. ఇప్పుడు ఆ అనుపమకి జగతి విషయం కనుక తెలిస్తే అసలు ఊరుకోదు. అదంతా మనమే చేసామని తెలిస్తే అసలు వదిలి పెట్టదని శైలేంద్రతో దేవయాని చెప్తుంది. ఈ క్షణం నుండీ వాళ్ళేం చేసిన నాకు తెలుస్తుంది. తెలియాలని శైలేంద్ర అనగానే.. ఫణింద్ర వచ్చి శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తడు. ఏంటి నీకు ఏం చేసిన తెలియాలా? ఎందుకు తెలియాలంటూ శైలేంద్ర పైకి విరుచుకుపడతాడు ఫణీంద్ర. అసలు ఇందంతా చూస్తుంటే జగతి చనిపోవడానికి కారణం నువ్వే అయి ఉంటావ్. మహేంద్ర ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి కారణం మీ అమ్మ అని ఫణింద్ర అంటాడు. అలా అంటున్నారు ఏంటని శైలేంద్ర అమాయకంగా అడుగుతాడు. నువ్వు ఇక్కడ వద్దు ఫారెన్ వెళ్ళిపో, మిమ్మల్ని మాట్లాడుకోవద్దని చెప్పాను కదా అని ధరణిని  పిలిచి వీళ్ళు మాట్లాడుకోకుండా చూడమని చెప్పాను కదా అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి మన మీద పడ్డారేంటని దేవయాని అనగానే.. నువ్వేం టెన్షన్ పడకు అన్నింటికి సొల్యూషన్ నా దగ్గర ఉందని శైలేంద్ర అంటాడు.  మరొక వైపు అనుపమ అన్న మాటలు మహేంద్ర గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే అనుపమ కాల్ చేసి.. జగతి గురించి ఎందుకు చెప్పలేదు అంటు విసిగిస్తుంది. దాంతో అనుపమతో కోపంగా మాట్లాడి మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మహేంద్ర కోపంగా మాట్లాడడం రిషి, వసుధార ఇద్దరు వింటారు. ఒకవైపు అనుపమ ఎలాగైనా జగతి గురించి తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ తో హాల్లోకి వస్తుంది అనుపమ. అలా రావడం చూసిన విశ్వనాథ్, ఏంజిల్ ఇద్దరు చూసి మళ్ళీ వాళ్ళని వదిలేసి వెళ్లిపోతుందని అనుకుంటారు. మిమ్మల్ని గతంలో లాగా కష్టపెట్టనని విశ్వనాథ్ తో  అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాత్రిపూట బాయ్ ఫ్రెండ్ ని కలిసిన స్వప్న!

   స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -255 లో... ఎందుకు బోర్డుపై సారి అని రాసి నేను రాసానట్టుగా కావ్య ఎందుకు చెప్పిందని రాజ్ కోపంగా ఉంటాడు. కావ్య రాగానే ఎందుకు అలా చేసావని అడుగుతాడు. కాసేపు రాజ్ తో కావ్య వెటకారంగా మాట్లాడిన కూడా.. ఆ తర్వాత తాతయ్య గారి కోసం మీలాగే నేను ప్రేమిస్తున్నట్లు నటించానని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. రాజ్ కి మాత్రం కావ్య ఏం చెప్పిందో అర్థం కాదు. ఒకవైపు అరుణ్ , స్వప్న కలిసి ఉన్న ఫొటోస్ కొరియర్ చేస్తానని చెప్పాడు. ఇంకా కొరియర్ రాలేదని అరుణ్ కి ఫోన్ చేస్తాడు రాహుల్. ఆలోగా కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ ధాన్యలక్ష్మి తీసుకొని ఇందిరాదేవీకి  ఇస్తుంది. అవి ఓపెన్ చేసిన ఇందిరాదేవి.. స్వప్న తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోస్ చూసి షాక్ అవుతుంది. ఇలా ఎవరు పంపించారని ఇందిరాదేవి వెళ్లి స్వప్నని అడుగుతుంది. స్వప్న ఆ ఫొటోస్ చూడగానే కంగారు పడుతుంది. కానీ అతను ఎవరో తెలియదని స్వప్న అంటుంది. స్వప్న చెప్పేది అబద్ధమా? లేక ఈ ఫొటోస్ అబద్ధమా అని ఇందిరాదేవి అనుకుంటుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పదు. అదంతా చూస్తున్న రాహుల్, రుద్రాణి.. ఏంటి ఇంట్లో పెద్ద గొడవ అవుతుందనుకుంటే ఆవిడేంటి అసలు ఆ విషయం ఎవరికీ చెప్పలేదని అనుకుంటారు. మరొకవైపు స్వప్న అసలు ఈ ఫొటోస్ ఎవరు పంపించారని అరుణ్ కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చెయ్యడు.  ఒకవైపు కనకం అప్పు గది సర్దుతుంటుంది. అప్పుడు తనకి కళ్యాణ్ ఫోటోపై ఐ లవ్ యూ అని రాసి ఉంది చూసి షాక్ అవుతుంది. వెంటనే అప్పు దగ్గరికి వెళ్లి ఎంత పని చేసావే అంటూ కోప్పడుతుంది. ఇప్పటికి ఆ ఇంట్లో ఇద్దరు కూతుళ్లు ఇబ్బంది పడుతున్నారని అప్పుని కొట్టబోతుంటే కృష్ణమూర్తి వచ్చి.. ఆగమని చెప్తాడు. కృష్ణమూర్తికి ఇదంతా చెప్తే బాధపడుతాడు అని కనకం చెప్పకుండా కవర్ చేస్తుంది. కృష్ణమూర్తి.. ఏమైంది అని అడిగిన కూడ డైవర్ట్ చేస్తుంది కనకం. తరువాయి భాగంలో అరుణ్ దుగ్గిరాల ఇంటి ముందుకు వచ్చి స్వప్నకి కాల్ చేస్తాడు. నీతో తిరిగినంత మాత్రాన ఆ ఫొటోస్ ఎందుకు పంపించావని అరుణ్ ని నిలదీస్తుంది స్చప్న. నేను మీ ఇంటిముందు ఉన్నాను. నువ్వు బయటకు రా అని అనగానే స్వప్న ఇంట్లో ఎవరు చూడకుం

అమ్మనాన్నలకి సర్ ప్రైజ్ ఇచ్చిన శ్రీముఖి!

  దీపావళి రోజున ప్రతీ ఇంట్లో పూలు, దీపాలతో అలంకరించి గ్రాంఢ్ గా జరుపుకుంటున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు అవుట్ డోర్ షూటింగ్ అంటు బిజీగా ఉంటే, మరికొందరు తమ ఫ్యామిలీని కలవడానికి సొంతింటికి వెళ్తున్నారు. అదే కోవలోకి శ్రీముఖి చేరింది. శ్రీముఖి తన అమ్మనాన్నలు కలిసి దీపావళి పండుగ జరుపుకుంది. శ్రీముఖీ వాళ్ల అమ్మనాన్నలకి సర్ ప్రైజ్ అని చెప్పగానే .. వాళ్ళు షాక్ అయ్యారు. ఇక సస్పెన్స్ కి తెరతీస్తూ అమ్మకి డైమండ్ నక్లెస్, నాన్నకి బంగారపు గొలుసు గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీముఖి. అయితే ఇలాంటి గిఫ్ట్ లు తనకి ప్రతీ నెల కావాలంటూ శ్రీముఖి వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది.  శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవిరంగంలోనే కాకుండా సినిమాలల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి. జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ తో గుర్తింపు తెచ్చుకుంటుంది.  శ్రీముఖి తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది. అయితే శ్రీముఖి తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి థాయ్ లాండ్ వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ లో దీపావళి స్పెషల్ గా అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  

బిగ్‌ బాస్‌ బ్యూటీపై అట్రాసిటీ కేసు నమోదు!

ఇప్పుడు సినిమాల కంటే బిగ్‌బాస్‌ గురించిన చర్చ బాగా పెరిగిపోయింది. ఈ రియాలిటీ షోకి మంచి క్రేజ్‌ వచ్చింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోయారు. బిగ్‌బాస్‌ నియమనిబంధనల ప్రకారం తోటి కంటెస్టెంట్లతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. ఒకరిపై ఒకరు దాడి చేయకూడదు.. ఇలా రూల్స్‌ ఎన్నో ఉన్నాయి. అయితే మనవాళ్ళు రూల్స్‌ పాటించరు కాబట్టి బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. తోటి ఇంటి సభ్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌పై అట్రాసిటి కేసు నమోదైంది. కన్నడ బిగ్‌బాస్‌ షోలో ఓ లేడీ కంటెస్టెంట్‌ నోరు జారి మాట్లాడినందుకు ఆమెపై అట్రాసిటీ కేసు నమోదైంది. కన్నడ బిగ్‌ బాస్‌ సీజన్‌ 10 నడుస్తోంది.  ఈ షోలో నటి తనీషా కుప్పండ కంటెస్టెంట్‌గా పాల్గొంది.  తన తోటి సభ్యులతో ఎప్పుడూ తనీషా దురుసుగా ప్రవర్తిస్తుందని, అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని ప్రచారంలో ఉంది. నవంబర్‌ 8న ప్రసారమైన ఎపిసోడ్‌లో తోటి కంటెస్టెంట్‌ డ్రోన్‌ ప్రతాప్‌ను ‘వడ్డా’ అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు భోవి సమాజ్‌ పి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బెంగుళూరు శివార్లలోని కుంబళగోడు పోలీస్‌ స్టేషన్‌లో తనిషాపై ఫిర్యాదు చేశారు. వడ్డా అనేది షెడ్యూల్డ్‌ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో భాగం. షో సందర్భంగా తనిషా భోవి వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం ఇది రెండోసారి అంటూ పద్మ వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద తనీషాపై కేసు నమోదు చేశారు.

Pallavi Prashanth: అప్పుడు రేవంత్ ఇప్పుడు ప్రశాంత్.. తగ్గేదేలే!

ఎవ్వరైనా కానీయ్.. ఏదైనా కానియ్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ రేవంత్ అన్నాడు. బిగ్ బాస్ సీజన్-6 టైటిల్ విన్నర్ రేవంత్ హౌస్ లో అగ్రెసివ్ అండ్ జెన్యున్ అండ్ ఫెయిర్ ప్లేయర్. ‌ఇప్పుడు అదే కోవలోకి పల్లవి ప్రశాంత్ చేరాడు.  బిగ్ బాస్ సీజన్-7 మొదటి వారం నుండి పది వారాల వరకు ఆటల్లో మెరుపు వేగంతో దూసుకుపోతూ.. నామినేషన్ లో తగ్గేదేలే అంటున్న రైతుబిడ్డ ‌పల్లవి ప్రశాంత్ కి విశేష ఆదరణ లభిస్తుంది. బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నుండి అరియాన వరకు దాదాపు అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రైతుబిడ్డకి సపోర్ట్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రశాంత్. మన సీరియల్ బ్యాచ్ అతడిని తక్కువ చేసి చూడటం‌‌.. అరేయ్, ఒరేయ్.. వాడు దొంగలాగే ఉంటాడంటూ బ్యాక్ బిచ్చింగ్ చేశారు. కావాలనే చాలాసార్లు ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తున్నారు సీరియల్ బ్యాచ్‌. అయితే ఎవరెన్ని సార్లు నామినేట్ చేసిన తన కాన్ఫిడెన్స్ ని కోల్పోవట్లేదు పల్లవి ప్రశాంత్. ఒక నామినేషన్ లో అయితే  ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. అయిన బరాబర్ ఇలానే ఉంటాను, తగ్గేదేలా అంటూ సవాల్ విసిరి తన ఆటతో సమాధానం చెప్పాడు ప్రశాంత్. " వీడెంత అనుకునేవాళ్ళతో, అమ్మో వీడుంటే మనం గెలవలేం" అనే స్థాయికి చేరుకున్నాడు ప్రశాంత్.   అయితే గత సీజన్-6 లో కూడా రేవంత్ ఇదే మాదిరి హౌస్ లో ఉన్నాడు‌. ఆటలో అగ్రెసివ్, నామినేషన్ లో మాస్ ఎటాక్ తో తనని తాను మల్చుకొని టైటిల్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సైతం అదే పంథాలో వెళ్తున్నాడు. టాప్-3  లో పల్లవి ప్రశాంత్ ఉంటాడని బిగ్ బాస్ ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సీజన్-7 టైటిల్ రేసులో రైతుబిడ్డ గెలుస్తాడా? లేదా తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.  

నూకరాజు ఎంగేజ్ మెంట్.. ఆసియా రాలేదంట!

ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్య వీళ్ళిద్దరు కలిసి చేసిన "ఎంగేజ్ మెంట్ కోసం రెడీ అయ్యాం", " మా లవ్ మ్యాటర్ పైన క్లారిటీ", "బక్రీద్ స్పెషల్" వ్లాగ్స్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో వీళ్ళు తాజాగా " ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ అయిపోయింది" అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు నూకరాజు. ఆసియా రాలేదని ఎంతగానో రిక్వెస్ట్ చేసిన తను రాలేదని నూకరాజు చెప్పాడు. అసలు విషయానికొస్తే నూకరాజు వాళ్ళ అన్నయ్యది ఎంగేజ్ మెంట్ అంట. దానికి సంబంధించిన పనుల్లో ఈ రోజు వరకు తనకి సమయం లేదని, బంధువలందరికి కాల్స్ చేసి చెప్తున్నాడని, ఆసియాకి కూడా కాల్ చేసి రమ్మని చెప్పిన తను రాలేదని చెప్పాడు. అన్మయ్యది ఎంగేజ్ మెంట్ అయింది. పెళ్ళి ఈ నెల 23న జరుగనుంది. మరి ఆసియా పెళ్ళికి వస్తుందో లేదో తెలియదు. చాలా సంతోషంగా ఉందంటూ తన భావాలని వ్లాగ్ లో పంచుకున్నాడు నూకరాజు.  అయితే ఈ విషయం తెలియని నెటిజన్లు వీడియో టైటిల్ మరియు థంబ్ నేల్ చూసి " కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ" అంటు ఆసియా, నూకరాజులకి  అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నా మొగుడు ఏ పూజ చేసుకున్నా ఓకే... నన్ను మాత్రం వదిలేయాలి!

అష్షు రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రకరకాల రీల్స్ చేస్తూ ఫుల్ ఛిల్ల్ అవుతూ ఉంటుంది. అలాంటి అష్షుకి ఇప్పుడు మూడ్ అంతా మొగుడు మీదకు మళ్లినట్లు తెలుస్తోంది. ఇక అష్షు తనకు కాబోయే వాడికి కండిషన్స్ చెప్తూ రీల్ చేసేసరికి వాళ్ళ అమ్మ చీపురు కట్ట పట్టుకొచ్చి చితకబాదేసింది. అష్షు రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది..అందులో " మా ఆయన ఉదయాన్నే లేచి దీపం పెట్టి నేను ఎలాగో గుడికి వెళ్ళను కాబట్టి ఆయనే గుడికి వెళ్లి పూజ చేయాలి...అలాగే నేను ఎక్కువగా అలుగుతాను..అప్పుడు బుజ్జగించాలి...నేను అలిగినప్పుడు బతిమాలాలి..ఇంకా షాపింగ్ కి తీసుకెళ్ళాలి...నాకు కొత్త బట్టలు కొనుక్కోవడం ఎక్కువగా ఇష్టం. కాబట్టి తాను కూడా ఫోర్స్ చేయకుండా నన్ను ఫ్రీగా, ఫ్రీడమ్ గా వదిలేయాలి" అనేసరికి ఆ మాటలన్నీ అష్షునే మాట్లాడుతోందనుకుని వాళ్ళ అమ్మ వెనక నుంచి చీపురు కట్ట పట్టుకొచ్చి కొట్టింది. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి " మా అమ్మ ఇది నా వాయిస్ అనుకుంది" అంటూ కామెంట్ పెట్టుకుంది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ "హహ క్యూట్" అని కామెంట్ చేసాడు. "ఎందుకు యమునా గారి వాయిస్ ఖూనీ చేస్తావ్ ..నీ ఫీలింగ్ చెప్పు" అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక అష్షు-అజయ్ కలిసి నటించిన "హే పిల్ల" అనే సాంగ్ ఈ నెలాఖరున ఆస్ట్రేలియాలో లంచ్ చేస్తున్నాడు రాహుల్ సిప్లిగంజ్.

అప్పుడు మా ఫామిలీని పక్కన పెట్టారు...ఇప్పుడు మా పక్కనే ఉంటున్నారు

ఢీ సెమీఫైనల్స్ పోటా పోటీగా జరుగుతున్నాయి. ఈ వారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఇందులో జడ్జిగా ఉన్న పూర్ణ కన్నీళ్లు పెట్టుకుని అందరినీ ఏడిపించేసింది. పూర్ణ చెప్పిన మాటలు వింటే తన గత జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. పూర్ణ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను ఫేస్ చేయాల్సి వచ్చిందంటూ ఏడ్చేసారికి పక్కనే ఉన్న శేఖర్ మాష్టర్ ఆమెను ఓదార్చారు. "మా ఫామిలీలో ఎవరూ డాన్స్ క్లాస్ కి వెళ్ళింది లేదు. నేను ఒక్కదాన్నే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అమ్మాయిని. నేను డాన్స్ నేర్చుకున్న విషయం తెలిసాక మా నాన్న తరపున వాళ్ళ ఎవరూ కూడా మాతో మాట్లాడేవారు కాదు. మా అమ్మతో మాట్లాడలేదు...మా నాన్నను కూడా పక్కన పెట్టేసారు దానికి కారణం నేను డాన్స్ నేర్చుకుని ఇండస్ట్రీకి రావడమే. ఆ సమస్యలన్నీ దాటుకుని వచ్చాను. కానీ ఒకప్పుడు ఎవరైతే మా ఫామిలీని పక్కన పెట్టారో వాళ్లంతా ఇప్పుడు మాకు బాగా క్లోజ్ ఇపోయారు. ఎవరైతే కొన్నేళ్ల పాటు నాతో మాట్లాడ్డం మానేశారో వాళ్ళు కూడా నాతో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నేను నాకంటూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను." అని చెప్పింది పూర్ణ.   ఇక ప్రదీప్ మాట్లాడుతూ  "పూర్ణ గారు మీరు ఆ కష్టాలను అన్ని దాటుకుని ఇంత దూరం వచ్చి ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ గా మారారు. మీరు నవ్వుతూ ఉంటేనే బాగుటుంది" అన్నాడు. సైరా రాయలసీమ టీమ్ మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో చేసిన పనులు, అందరితో తిట్టించుకుని డాన్స్ కోసం ఇంట్లోంచి వచ్చేసిన సందర్భాలను కలిపి మంచి డాన్స్ ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో పెర్ఫార్మ్ చేసి పూర్ణని ఏడిపించేసారు. ఇక ఈ వారం షోకి "మంగళవారం" మూవీ నుంచి హీరోయిన్ పాయల్ రాజపుత్ , డైరెక్టర్ అజయ్ భూపతి గెస్ట్స్ గా వచ్చారు.

హాస్పిటల్ బెడ్ మీద బిగ్ బాస్ తేజస్విని పిచ్చి చేష్టలు!

  తేజస్వినికి ఏమయ్యిందో కానీ హాస్పిటల్ బెడ్ మీద పిచ్చి చేష్టలు చేస్తూ ఎటో చూస్తున్న ఒక  పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది తేజస్విని మాదివాడ.. డెంటల్, మెంటల్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్లో చేరినట్లుగా కాప్షన్ పెట్టుకుంది. ఐతే ఆమె వేసుకున్న జీన్ ప్యాంట్ మోకాలి దగ్గర చింపేసుకుని కనిపించేసరికి ఒక నెటిజన్ వెరైటీగా కామెంట్ చేసాడు. "మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ అని బ్రెయిన్ ఉన్న ప్లేస్ ని ఇలా ఓపెన్ గా పెట్టారా" అంటూ ఇన్ డైరెక్ట్ గా మోకాల్లో బ్రెయిన్ ఉంది అన్న అర్ధం వచ్చేలా కామెంట్ చేసారు. ఇంకో నెటిజన్ మాత్రం "బాధపడకండి..అంతా బాగుంటుంది" అని విష్ చేశారు. ఇక తేజస్విని తాను హాస్పిటల్ కి వెళ్లడమే కాదు డెంటిస్ట్ అవతారం ఎత్తింది. పళ్ళను చెక్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని పట్టుకునేసరికి హాస్పిటల్ కి వచ్చిన పిల్లాడు నోరు తెరిచి కూర్చున్నాడు. ఈ ఫోటో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుని " ఈ పిల్లాడు నేను డెంటిస్ట్ ని అనుకుంటున్నాడు" అంటూ ఫన్నీ కామెంట్ పెట్టుకుంది. ఏదేమైనా తేజస్విని చేసిన పిచ్చి చేష్టలతో పిల్లాడు కూడా ఆమె డాక్టర్ అనుకున్నాడు మరి. తేజస్విని  "ఐస్ క్రీమ్", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి మూవీస్ తో  పాపులర్ అయ్యింది. తర్వాత  బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి ఆమె మీద చాలా నెగటివిటీ పోట్రె అయ్యింది. దానికి కారణం బిగ్ బాస్ హౌస్ లోని మరో కంటెస్టెంట్ కి చెందిన ఆర్మీ అని ఆ టైంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా కాలం ఇంట్లోంచి బయటకు రాలేదంటూ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఇక రీసెంట్ గా బీబీ జోడి డాన్స్ షోలో అఖిల్ తో కలిసి తేజు రచ్చ చేసిన సంగతి తెలిసిందే...

తలకిందులుగా వేలాడుతూ సుమ క్లాసులు!

కరోనా వచ్చిన దగ్గర నుంచి జనాలంతా కూడా చాలా హెల్త్ కాన్షస్ ఇపోయారు. ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగే లేడీస్ కూడా ఇంట్లో పని, ఉద్యోగంతో పాటు జిమ్ సెంటర్స్ కి వెళ్లి వర్కౌట్స్ చేసి ఫిట్ గా ఉంటున్నారు. ఐతే ఇప్పుడు వాతావరణం చాల చేంజ్ అయ్యింది. అసలే చలికాలం...పని చేసినా చేయకపోయినా బద్ధకం అనేది కామన్ గా ఉంటుంది ఈ కాలంలో అందులోనూ వర్షాలు కూడా పడుతున్నాయి. దాంతో బాడీ మొత్తం దిమ్ముగా ఉండి సక్రమంగా పని చేయదు...అందుకోసం చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తూ ఉంటే చాలా ఆరోగ్యం ఉండొచ్చు అంటున్నారు మన పెద్దోళ్ళు...ఇక సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీస్ చాలామంది వర్కౌట్స్ చేస్తూ ఫొటోస్ పెట్టి మిగతా లేడీస్ ని ఇన్స్పైర్ చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం..అలాంటి వారిలో నటి ప్రగతి, అనసూయ  ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఇక రీసెంట్ గా అష్షు రెడ్డి కూడా చాలా చిక్కింది...ఇక జెంట్స్ లో అఖిల్ సార్థక్, తేజు మాదివాడ ఇలా చాల మంది కూడా జిమ్స్ కి వెళ్లి కొవ్వు కరిగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సుమ వంతు వచ్చింది. సుమ ఆల్రెడీ రకరకాల డాన్సులు చేస్తూ చేయిస్తూ వీలు దొరికినప్పుడల్లా చిన్న చిన్న ఎక్స్సర్సైజులు చేస్తూ చేయిస్తూ ఉంటారు. అలాంటి సుమ "హాయ్,హలో గుడ్ మార్నింగ్.. వెల్కమ్ తో శీర్షాషన్..జీవితంలో ఏదైనా ఒక రకమైన ఎక్స్సర్సైజులు చేస్తున్నారా లేదా ? ..హలో బాబు..రోజు ఫోన్ ల్లో ఛార్జింగ్ లు పెట్టుకోవడమే కాదమ్మా...బాడీని కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి" అంటూ సుమ తల్లకిందులుగా వేళ్ళాడుతూ పొద్దుపొద్దునే ఇలా గుడ్ మార్నింగ్ చెప్తూ ఎక్స్సర్సైజుల గురించి క్లాస్ పీకింది. ఇక ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది సుమ.

బాత్రూంలోనూ బిగ్ బాస్ ఆది రెడ్డికి అదే పని... నెల సంపాదన 39 లక్షలు!

బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆది రెడ్డి రెమ్యూనరేషన్ కళ్ళు తిరిగే రేంజ్ లో ఉంది. ఎందుకంటే ఈ నెల 39 లక్షల డబ్బు వచ్చింది. దాని వెనక ఎంత కష్టం ఉందో కూడా ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ నిద్రపోయేటప్పుడు మాత్రమే తానూ నిద్రపోయి మిగతా టైం అంతా కూడా రివ్యూస్ ఇచ్చేవాడినని చెప్పారు. అంటే గట్టిగ పడుకునేది నాలుగైదు గంటలే అని చెప్పాడు. ఈ రివ్యూస్ కోసం భార్యాపిల్లలతో మాట్లాడకుండా ఉన్న ఎన్నో రోజులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. బాత్రూంలోకి వెళ్లినా కూడా బిగ్ బాస్ లైవ్ చూస్తూనే ఉంటా. పిన్ టు పిన్ నోట్ చేసుకుని చెప్పబట్టే బిగ్ బాస్ మీద పస్సిఒన్ ని పెంచుకోబట్టే ఇంత సక్సెస్ వచ్చిందన్నాడు. తక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు ఎందుకు చూపించకూడదు ఈ ఇన్కమ్ చూసాక కూడా పెయిడ్ అని ఎవరన్నా అనుకుంటే ఇంకేం చేయలేదు. ఒక వీడియో చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు..అలాంటప్పుడు పెయిడ్ అని అంటే ఇంకేమన్నా మాట్లాడతాము అన్నాడు ఆదిరెడ్డి. తనకు ఏది అనిపిస్తే అదే చెప్తానన్నాడు. తనకు కొనగలిగే వాళ్ళు ఉన్నారా అన్నాడు.  తానూ ఎంతో మందికి హెల్ప్ చేసినట్టు చేప్పాడు. సబ్స్క్రైబర్స్ కి చెప్పినంత మాత్రాన ఏమవుతుంది అందుకే తన శాలరీ ఎంతో చెప్పేసానన్నాడు ఆదిరెడ్డి. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, యూకె నుంచి చూసే వాళ్లందరికి థ్యాంక్స్ అని చెప్పాడు. అలాగే తనకు హెల్ప్ చేసిన వాళ్లకు హెల్ప్ చేస్తానని...కొత్తగా యూట్యూబ్ చానెల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటె వాళ్లకు సాయం చేస్తానని చెప్పాడు ఆది రెడ్డి.

పాయల్ తో చిందేసిన తాత..బుంగమూతి పెట్టుకున్న బామ్మ

ఢీ ప్రీమియర్ లీగ్ లో ఈ వారం ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. కొరియోగ్రాఫర్ ప్రభు టీమ్ లో సురేష్ అనే కంటెస్టెంట్ వాళ్ళ తాతయ్యను ఆది నడిపించుకుంటూ  స్టేజీ మీదకు వచ్చాడు.  అలా తీసుకొస్తున్నప్పుడు శేఖర్ మాష్టర్ నవ్వుతూ  ఒక పెద్దాయన ఇంకో పెద్దాయన్ని తీసుకొస్తున్న ఈ సీన్ తనకు చాలా నచ్చిందంటూ ఒక కామెడీ సెటైర్ వేశారు. "నేను తీసుకురావడం కాదండి..ఆయనే అడిగారు. నన్ను స్టేజి మీదకు ఎక్కించారు పాయల్ తో డాన్స్ వేయించరా అనేసరికి పాయల్ ఎలా తెలుసు అని అడిగా.. ఒకసారి టీవీలో చూశాడట అప్పటి నుంచి ఒక్క స్టెప్పయినా సరే పాయల్ తో వేయాలనుకుంటున్నాడట " అని అడిగారంటూ చెప్పాడు ఆది. ఇక వెంటనే పాయల్ లేచి ఆ తాత దగ్గరకు వెళ్ళింది ఆది ఇటు నుంచి ఆ తాతయ్య భార్యను స్టేజి మీదకు పిలిచాడు. పాయల్ వచ్చేసరికి తాతయ్య కళ్ళల్లో ఆనందం, పెదాలపై చిరునవ్వు వచ్చేసరికి "పాయల్ రాజపుత్ అని నీకు తెలీదులే..ఆయనకు తెలుసు... చూసావామ్మా ఎప్పుడైనా నీ ముందు ఇలా ఎప్పుడైనా నవ్వాడా..మీ పెళ్లి టైంలో కూడా అలా నవ్వి ఉండడు" అంటూ ఆ తాతయ్య భార్యను అడిగాడు. తర్వాత "సరసకు చెలి చెలి రా" అని పాట పెట్టేసరికి తాతయ్య మంచి ఊపుతూ పాయల్ తో కలిసి చిందేసాడు. తాత వేసిన స్టెప్పుకు ఆ బామ్మ ఏమీ అనకపోయేసరికి "అలాంటి భార్య అందరికి దొరికితే ఎంత బాగుంటుంది..ఎం చేసుకున్న పర్లేదు అనే ఫ్రీడమ్ ప్రతీ మొగుడికి దొరికితే బాగుండు " అంటూ డైరెక్టర్ అజయ్ కామెంట్ చేసాడు. దాంతో ఆది "ఏమయ్యా మీ ఆవిడ నీ డాన్సులు చూసి అలిగి బుంగమూతి పెట్టుకుంది ప్రొపోజ్ చేస్తావా" అని తాతను అడిగేసరికి " ఐ లవ్ యు" ఆ తాత బామ్మకు ప్రొపోజ్ చేసాడు.  

Rathika Rose: గోడ మీద పిల్లిలా రతిక.. కన్ ఫ్యూజన్ లో అంబటి అర్జున్!

  బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా మారుతుంది. గత వారమంతా ఫ్యామీలీ వీక్ సాగింది. ఇక ఆ వీక్ 'ఓ బేబీ' టాస్క్ లో గెలిచిన అర్జున్, శివాజీలలో హౌస్ మేట్స్ శివాజీని కెప్టెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక గతవారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగా సాగింది‌.  హౌస్ లో పది మంది ఉంటే శివాజీ, ప్రశాంత్ తప్ప మిగిలిన ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. హౌస్ లో " ఎవిక్షన్ ఫ్రీ పాస్" గురించి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మీలో మీరు డిసైడ్ చేసుకొని ఎవరు ఏ స్థానంలో ఉండాలనుకుంటారో బిగ్ బాస్ కి చెప్పండని అనగా.. శివాజీ, ప్రశాంత్, యావర్ మొదటి మూడు స్థానాలకి వచ్చారు. నాల్గవ స్థానంలో ప్రియాంక, అయిదవ స్థానంలో శోభాశెట్టి, ఆరవ స్థానంలో అమర్ దీప్, ఏడవ స్థానంలో అంబటి అర్జున్, గౌతమ్, అశ్వినిశ్రీ, రతిక చివరి స్థానాలలో ఉన్నారు. అయితే హౌస్ లో ఆక్టివ్ గా లేని రతికకి పదో స్థానం ఇచ్చారు., శోభా శెట్టికి ఏడవ స్థానం, అమర్ దీప్ కి నాల్గవ స్థానం ఇచ్చినట్టు తెలుస్తుంది.  అయితే ఇలా హౌస్ మేట్స్ తమ అభిప్రాయాలు చెప్పేటప్పుడు రతిక-అర్జున్, అర్జున్-శోభాశెట్టి మధ్య పెద్ద గొడవ జరిగింది. శోభాశెట్టి ఇండివిడ్యువల్ గా ఆడట్లేదని గ్రూప్ గా ఆడుతుందని ఫేవరిజం, లక్కు ఉన్నాయని చెప్పి అందుకే ఏడవ స్థానం ఇస్తున్నాని అర్జున్ చెప్పగా.. శోభా ఏడుస్తూ ప్రియాంక, అమర్ దీప్ లకి చెప్పుకుంది. గోడ మీద పిల్లిలా మెజారిటీ సభ్యలు చెప్పారని చెప్పడమేంటని రతిక మీద కోప్పడ్డాడు యావర్. మరి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వస్తుందో చూడాలి. అయితే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికైతే వస్తుందో వారికి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం లభిస్తుంది. లేదా తనకి నచ్చిన ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అందుకే దీనికోసం హౌస్ మేట్స్ అంత పోటీపడుతున్నారు. ఉల్టా పల్టా అంటూ కంటెస్టెంట్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అంతా కలిసి ఒకటి నుండి పది వరకు ర్యాంకింగ్స్ ఇచ్చుకున్నాక బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. మీలో వీకెస్ట్ అని భావించిన బాటమ్-5 కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పొటీ పడే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తున్నాడు. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్, రతిక, అశ్వినిశ్రీ బాటమ్-5 లో ఉన్నారు. వీరికి బిగ్ బాస్ 'ఎవిక్షన్' అని ఇంగ్లీష్ లెటర్స్ సరిగ్గా అమర్చమనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ పోటీకి సంచాలకుడిగా కెప్టెన్ శివాజీ ఉన్నాడు. ఎవిక్షన్ ఫ్రీ అని అయిదుగురు అమర్చిన అందులో అందరివి మిస్టేక్స్ ఉన్నాయి. వీటిలో తక్కువ మిస్టేక్ ఉన్నది అంబటి అర్జున్ కాబట్టి ఈ టాస్క్ లో అంబటి అర్జున్ గెలిచాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని శివాజీ తన చేతుల మీదుగా అందించాడు. అయితే ఇక్కడే బిగ్ బాస్ అసలైన ఉల్టా పల్టా ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. గెలిచిన అంబటి అర్జున్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని కంటెస్టెంట్స్ తో పోటీ పడాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు‌. ఎవరినో సేవ్ చేయడానికి ఇంత ఆడాలా? లేక నన్ను సేవ్ చేసుకోవడానికి ఈ గేమ్ ఆడాలా అని శివాజీతో  అంబటి అర్జున్ అన్నాడు. ఇక నేటి ఎపిసోడ్‌లో అంబటి అర్జున్ - పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ లతో పోటీ పడనున్నాడు. మరి ఈ టాస్క్ లో అంబటి అర్జున్ గెలిచి తనకొచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపడుకుంటాడా లేక కోల్పోతాడా తెలియాలంటే టాస్క్ లు పూర్తి అయ్యేవరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu: నీది నాది ఒకే కథ.. అటు అత్త ఇటు కోడలు!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -921 లో.. జగతి గురించి చెప్పమని మహేంద్రని అనుపమ నిలదీస్తుంటే.. అది వసుధార చూడలేక జగతి లేదన్న నిజాన్ని చెప్తుంది. అది విని అనుపమ షాక్ అవుతుంది. ఆ తర్వాత మహేంద్ర కూడా జగతి చనిపోయిందని చెప్పగానే అనుపమ ఏడుస్తు తన ఫ్రెండ్ షిప్ ని గుర్తుకు చేసుకుంటుంది. ఆ తర్వాత అనుపమ ఎమోషనల్ అవుతు.. నా జగతిని నువ్వే చంపేసావా? అసలేం జరిగింది నువ్వు దూరంగా ఉన్నావని బాధతో అలా అయిందా అని మహేంద్రని అనుపమ అడుగుతుంది. ఆ తర్వాత మా అమ్మ నా వల్లే చనిపోయింది. డాడ్ కి సంబంధం లేదు. నన్ను కాపాడే క్రమంలో అమ్మకి అలా జరిగిందని రిషి చెప్తాడు. డాడ్ అమ్మని చాలా ప్రేమగా చూసుకున్నారని రిషి చెప్తాడు. ఆ తర్వాత మహేంద్రని తీసుకొని రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు అక్కడ జరిగింది మొత్తం విశ్వనాథ్, ఏంజిల్ చూస్తారు.. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది విశ్వం అని విశ్వనాథ్ తో ఏంజిల్ అంటుంది. మరొకవైపు మహేంద్ర అనుపమ అన్న మాటలు గుర్తుకు చేసుకొని కారు ఆపమని రిషికి చెప్తాడు. కారు దిగి మహేంద్ర ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంటాడు. జగతిని గుర్తుకు చేసుకొని మహేంద్ర బాధపడుతాడు. ఏం బాధపడకండి అంటూ మహేంద్రకి రిషి, వసుధార చెప్తారు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు అనుపమ గురించి అడుగుతారు. మహేంద్ర, అనుపమ, జగతిల ఫ్రెండ్ షిప్ గురించి చెప్తాడు. ఇంట్లో వాళ్ళని ఎదిరించి మా పెళ్లి చేసింది అనుపమ అని మహేంద్ర చెప్తాడు. మరొక వైపు అనుపమ దగ్గరికి విశ్వనాథ్, ఏంజిల్ వస్తారు.  అసలు జగతి లేదు అన్న విషయం నాతో మహేంద్ర ఎందుకు చెప్పలేదు. అసలు జగతిని ఎవరు చంపేసారు. ఆ అవసరం ఎవరికి ఉంది. వీళ్ళు దాని గురించి పట్టించుకోవడం లేదా అని అనుపమ అనగానే.. రిషి వదిలి పెట్టాడు. రిషి గురించి మాకు తెలుసు. ఇంకా జగతి, మహేంద్ర కూడా మన ఇంటికి వచ్చారని ఏంజిల్ చెప్తుంది. నువ్వు అప్పట్లో మహేంద్ర గురించేనా అని విశ్వనాథ్ ఏదో చెప్పబోతుంటే.. గతం వద్దు డాడ్ అని అనుపమ ఆపేస్తుంది. ఇంచుమించు మీ అత్త జీవితం నీ జీవితం ఒకేలా ఉన్నాయని విశ్వనాథ్ అంటాడు. నీ బాధ నాకు అర్థం అయింది. అత్తయ్య రిషి తన గురించి చెప్పకుండా అన్ని విషయాలు దాచినప్పుడు నేను ఇలాగే బాధపడ్డానని ఏంజిల్ తన మనసు అనుకుంటుంది. మరొకవైపు నా దగ్గర మహేంద్ర ఈ విషయం దాచిపెడతాడని అసలు ఉహించలేదని అనుపమ అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వసుధార లేవకుముందే రిషి లేచి వంట చేస్తుంటాడు. మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు మీకు ఇక్కడ ఏం ఉంటాయో తెలుసా అని రిషితో వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari: దీపావళి సెలబ్రేషన్స్ లో ప్రమాదం పొంచి ఉందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -315 లో.. మురారి ఎవరికి తెలియకుండా కృష్ణని బయటకు తీసుకొని వచ్చి రింగ్ గిఫ్ట్ ఇస్తాడు.  మురారి స్వయంగా కృష్ణ వేలికి తొడుగుతాడు. అదంతా చాటుగా చూసిన ముకుంద.. నేను ఇలా చూస్తూ ఉంటే సరిపోదు. ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది‌. ఈ విషయం పెద్ద అత్తయ్యకి చెప్పకుండా ఒకటే సారి బ్లాస్ట్ చెయ్యాలని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద భవాని దగ్గరకు వచ్చి.. కృష్ణపై ఇంకా కోపం కలిగేలా మాట్లాడుతుంది. షాపింగ్ మాల్ లో జరిగిన విషయలు మొత్తం భవానికి ముకుంద చెప్పి.. తనని మొత్తం నెగెటివ్ గా చేస్తుంది. ఆ తర్వాత నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు అని ముకుందకి భవాని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం దీపావళి సందర్భంగా ఇంట్లో పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ తర్వాత ముకుంద మురారిలు పై నుండి కలిసి వస్తుంటే వాళ్లని చూసి భవాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతు.. వాళ్ళని అలా చూస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత నందుతో ముకుంద, మురారి లను ఫోటో తీయమని భవాని చెప్తుంది. కృష్ణ ఇంకా రాలేదు అని మురారి బయటకు వెళ్లి చూస్తుంటాడు. కాసేపటికి కృష్ణ వస్తుంది మురారికి చెరొక పక్క కృష్ణ ముకుంద కూర్చొని ఉంటారు. కృష్ణ వేలికి ఉన్నా రింగ్ ని చూస్తూ మురిసిపోతుంది. అది చూసి ఓర్వలేకపోతుంది ముకుంద.  ఆ తర్వాత ముకుంద తన కన్నింగ్ ప్లాన్ తో.. నిన్న నేను ఒక రింగ్ తీసుకున్నాను. అది కన్పించడం లేదని భవానితో చెప్తుంది. కృష్ణ పెట్టుకున్న రింగ్ నాదే అని ముకుంద అనగానే అందరు షాక్ అవుతారు. మురారి నిజం చెప్పబోయి ఆగిపోతాడు. నేనే కొని ఇచ్చానని చెప్తే ఇంట్లో అందరూ ఎందుకు కొని ఇచ్చావని తిట్టాలని ముకుంద ప్లాన్ అనుకుంటా అని మురారి అనుకుంటాడు. అలాగే కృష్ణ కూడా అలాగే అలోచించి నిజం చెప్పకుండా ఆగిపోతుంది. ఆ తర్వాత అవును ఈ రింగ్ నేను దొంగతనం చెయ్యలేదు. నాకు బయట దొరికింది అని కృష్ణ అనగానే.. ఇవ్వమని ముకుంద అంటుంది. కృష్ణ రింగ్ తియ్యడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాదు. అప్పుడే మురారి తియ్యబోతుంటే భవాని వద్దని చెప్తుంది. తరువాయి భాగంలో.. భవాని ఇంట్లో అందరూ దీపావళి జరుపుకుంటు ఉంటారు. అప్పుడే కృష్ణ కొంగుకి నిప్పు అంటుంకుంటుంది. దాంతో మురారి కాపాడతాడు. అసలు భవాని తీసుకున్న నిర్ణయం ఏంటి? మురారి తను గిఫ్ట్ ఇచ్చిన విషయం చెప్పనున్నాడా.. తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బాయ్ ఫ్రెండ్ తో భార్య దిగిన ఫోటోలు బయటపెట్టిన భర్త!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -254 లో.. కళ్యాణ్ ముందుగా గుడ్ న్యూస్ అని అప్పుతో షేర్ చేసుకోవాలని అప్పు, అనామికలని ఒక దగ్గరికి రమ్మని చెప్తాడు. ఇంట్లో వాళ్ళు అనామికతో పెళ్లి చెయ్యడానికి డేట్ ఫిక్స్ చెయ్యాలని అనుకుంటున్నారని అనగానే.. అనామిక వెళ్లి కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పు ఆ మాట విని తన ఎమోషన్ కంట్రోల్ చేసుకొని కళ్యాణ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.  మరొక వైపు కాలేజీ డేస్ లో స్వప్నని ప్రేమించిన అతనిని రాహుల్ కలిసి మాట్లాడతాడు. నాతో లేచిపోయి వచ్చిందని తెలిసి కూడా నువ్వు స్వప్నని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావ్ ఎందుకు? నీకు స్వప్నకి మధ్య రిలేషన్ ఏంటి అని అడగ్గానే అతను బయపడతాడు. ఒకప్పుడు ప్రేమించాను కానీ ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదని అతను అంటాడు. లేదు కానీ మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టు అందరూ అనుకునేలా నువ్వు చెయ్యాలి. అలా  చేస్తే నువ్వు హాస్పిటల్ పెట్టాలి అనుకుంటున్నావ్ కదా. అందుకు నేను పర్మిషన్ ఇప్పిస్తానని అనగానే అతను ఒప్పుకుంటాడు. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లోని హాల్లో.. సారి కళావతి అని బోర్డుపై రాసి ఉంటుంది‌. అలా ఉండడం చూసిన అందరు.. రాజ్ ఏంటి ఇలా రాసాడని అనుకుంటారు. కానీ అది రాసింది కావ్య. కావ్య ఏం తెలియనట్లు వచ్చి.. ఏంటి ఇది ఎవరు రాసారని అడుగుతుంది. ఇంకెవరు నీ భర్త అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు. రాజ్ ఎందుకు అలా రాసావ్ కావ్య ఎదరుగానే ఉంది కాదా అని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ ఎలాగూ నేను రాయలేదని అందరి ముందు చెప్పలేడు. రాజ్ ఏం చెయ్యలేక సారి చెప్పబోతుంటే కావ్య తన నటన మొదలు పెట్టి.. ఎందుకు సారీ అంటూ అనగానే.. ఏం నటిస్తున్నావే అని రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోతాడు.  ఒకవైపు అప్పు తన గదిలో ఏడుస్తుంటుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాను. కంగ్రాట్స్ చెప్పకుండా వచ్చిందని కనకంతో కళ్యాణ్ చెప్పగానే.. అలా ఎందుకు చేసిందంటూ అప్పుని తిడుతుంది కనకం. అప్పు ఇష్టం లేకున్నా బలవంతంగా గదిలో నుండి బయటకు వచ్చి కళ్యాణ్ తో కోపంగా మాట్లాడుతుంది.  అసలు అప్పుకి ఏమైంది అని కళ్యాణ్ కనకం ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత అప్పు గదిలోకి వెళ్లి కళ్యాణ్ ఫోటో చూస్తూ ఏడుస్తుంటుంది. మరొక వైపు ఎందుకు ఇలా చేసావని కావ్యని రాజ్ అడుగుతాడు. తరువాయి భాగంలో రాహుల్ స్వప్న బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసిన కుట్రలో భాగంగా.. స్వప్న తన కాలేజీ డేస్ లో బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోస్ ని కొరియర్ ద్వారా దుగ్గిరాల ఇంటికి పంపిస్తాడు. అవి చూసిన ఇందిరాదేవి.. అతను తెలుసా అంటూ స్వప్నని అడుగుతుంది. మరి స్వప్న ఆ సమస్య నుండి ఎలా బయటపడనుంది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.