Krishna Mukundha Murari : కృష్ణకి రింగ్ తొడిగిన మురారి.. షాక్ లో ముకుంద!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -313 లో.. ఇంటికి నందు, గౌతమ్ వస్తారు. వాళ్ళతో కృష్ణ తన చిన్నాన్నతో కలిసి ఇలా చేసిందంటూ కృష్ణ ని అపార్థం చేసుకొని కృష్ణ గురించి నెగెటివ్ గా నందుకి చెప్పుతుంది భవాని. మురారి అలా జరగడానికి కారణం అయిన వాళ్ళపై జాలి పడొద్దంటూ నందు గౌతమ్ లకి భవాని చెప్తుంది. మరొక వైపు కృష్ణ, ముకుంద, మురారి ముగ్గరు షాపింగ్ చూస్తుంటారు. కృష్ణ, ముకుంద ఇద్దరు మురారి నా వైపు ఉన్నాంటే నా వైపు ఉన్నాడంటూ వాదనకి దిగుతారు. సరే పదా నీకు ఏసీపీ సర్ నా వైపే ఉన్నాడని నీకు ఎలా చెప్పాలో నాకూ తెలుసని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ, ముకుంద ఇద్దరు మురారి కోసం చెరొక షర్ట్ తీసుకొని అక్కడే ఉన్న మురారిని పిలిచి ఇందులో ఇది నచ్చిందని అడుగుతారు. మురారి మాత్రం కృష్ణ తీసుకున్న షర్ట్ నచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు.. కృష్ణ మురిసిపోతుంది. ముకుంద మాత్రం కోపంగా చూస్తుంటుంది. మరొక వైపు మధు దగ్గరికి రేవతి వచ్చి.. కృష్ణ ఎక్కడ కన్పించడం లేదని చెప్తుంది. నేనే కృష్ణని వాళ్ళు వెళ్లిన షాపింగ్ కి వెళ్ళమని పంపించానని మధు చెప్పగానే రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు కృష్ణ మురారికి షర్ట్ తీసుకొని మురారికి చూపిస్తుంటుంది. అసలు ఈ కృష్ణకి మేం ఇక్కడికి వచ్చినట్టు ఎవరు చెప్పారు  ఏంటి ఈ రోజు కృష్ణ టైమ్ బాగున్నాట్టు ఉంది. కృష్ణ ఏం చేసిన మురారి ఎక్సయిట్ మెంట్ తో చూస్తున్నాడని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ ట్రీట్ మెంట్ చేసిన ఒక పాప ఫాదర్ కృష్ణని చూసి.. గుర్తుపట్టారా ఆ రోజు ఒక పాప కీ ట్రీట్ మెంట్ చేశారు. ఆ రోజు ఒక ఆర్మీ తో నాకు పని ఫేవర్ చెయ్యాలి అన్నారు కదా? ఏంటి మేడమ్ అని అతను అడుగుతాడు. అప్పుడే ముకుంద ఎక్కడ ఆదర్శ్ గురించి బయటపడుతుందోనని మురారిని అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మురారికి కృష్ణ డ్రెస్ సెలెక్ట్ చేసి ట్రయల్ చేసి రమ్మంటుoది. మరొక వైపు రేవతి దగ్గరికి నందు వచ్చి.. కృష్ణ గురించి అమ్మ చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. తరువాయి భాగంలో కృష్ణకి మురారి రింగ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అది అంత చాటు నుండి ముకుంద చూస్తుంటుంది. ఆ రింగ్ ని కృష్ణ చేతికి మురారి తొడుగుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

ఆ పొగరే తన సిగ్నేచర్.. ఆత్మీయ సమ్మేళనంలో అనుకోని అతిథి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -919 లో.. శైలేంద్ర దేవయానిలని వసుధార తీసిపారేసినట్లు మాట్లాడేసరికి.. వాళ్ళకి  ఏం మాట్లాడాలో అర్థం కాదు. నేను తల్చచుకుంటే ఇప్పటికి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది వసుధార. ఇదేంటి ఆ వసుధర శివంగిలాగా తయారైందని దేవయాని అంటుంది. ఒకవైపు అనుపమ తన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసం అందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తుంది. మరొకవైపు రిషి, వసుధార ఇద్దరు కాలేజీకి వెళ్తారు. అప్పుడే రిషికి ముకుల్ కాల్ చెయ్యడంతో వసుధార ఒక్కతే లోపలికి వెళ్తుంది. అప్పుడు శైలేంద్ర వచ్చి.. ఏంటి వసుధార రాత్రి చాలా పొగరుగా మాట్లాడావని అనగానే.. మీ నోటి నుండి పొగరు అనే మాట వస్తే చిరాకుగా ఉంటుంది. ఇంకొక సారి అనకండి. అవును నాకు పొగరు. పొగరు అనేది నా సిగ్నెచర్ అని శైలేంద్రతో వసుధార అంటుంది. అయిన మీరు కాలేజీకీ ఎందుకు వచ్చారు. ఈ రోజు అటెండర్ రాలేదు. ఆ డ్యూటీ చెయ్యడానికి వచ్చారా అని వసుధార అనగానే.. మాటలు జాగ్రత్తగా రానియ్యి వసుధార అని అంటాడు. అప్పుడే రిషి వచ్చి.. ఏంటి అన్నయ్య అలా అంటున్నావ్ వసుధార ఏం అందని అడుగుతాడు. నీకు పొగరని అంటున్నాడు సర్. అది రిషి సర్ ఎప్పుడు అనే మాటనే అని నేను అంటున్నా సర్ అని వసుధార అనగానే.. అవును వసుధారకి పొగరు. ఆ పొగరు వల్లే నేను ఇంప్రెస్ అయ్యాను. అదే తనకి ప్లస్ పాయింట్ అని రిషి అంటాడు. అప్పుడే ముకుల్ ని రిషి కలవడానికి వెళ్తాడు. ఆ తర్వాత జగతి కేసు గురించి ముకుల్ మాట్లాడతాడు. మరొక వైపు మహేంద్రకి తన ఫ్రెండ్ కాల్ చేసి అల్యూమినికీ రమ్మని చెప్తాడు. నేను రానంటూ మహేంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే రిషి వచ్చి ఎవరు ఎక్కడకి రమ్మంటున్నారని అడుగుతాడు. ఏం లేదంటూ మహేంద్ర వెళ్లిపోతుంటే.. తన పాకెట్ నుండి ఫోన్ కిందకి పడిపోతుంది. ఆ తర్వాత మహేంద్ర ఫోన్ కి అనుపమ కాల్ చేస్తుంది. అప్పుడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. రిషి మాట గుర్తు పడుతుంది అనుపమ. అలాగే అనుపమని కూడ గుర్తుపడతాడు రిషి. మేం అల్యూమిని ఫంక్షన్ చేస్తున్నాం. మీ డాడ్ ని తీసుకొని రా అని అనుపమ అనగానే.. మా డాడ్ ఎలా తెలుసని రిషి అడుగుతాడు. నువ్వు ఫంక్షన్ కి, మీ డాడ్ ని తీసుకొని రా అన్ని ప్రశ్నలకీ సమాధానం దొరుకుతుందని అనుపమ అంటుంది. అలాగే మీ అమ్మ జగతిని కూడా తీసుకొని రా అని ఫోన్ కట్ చేస్తుంది. అనుపమ ఫోన్ చేసిన విషయం గురించి వసుధారకి రిషి చెప్పి.. ఎలాగైనా డాడ్ కి తెలియకుండా డాడ్ ని ఫంక్షన్ కి తీసుకొని వెళ్ళాలని అనుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు మహేంద్రని తీసుకొని రిషి, వసుధార ఇద్దరు అల్యూమిని ఫంక్షన్ దగ్గరికి వస్తారు. అక్కడ ఆత్మీయ సమ్మేళనం అని ఫ్లెక్సీ చూసి మహేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

దుగ్గిరాల ఇంట్లో శుభవార్త.. కారణం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -252 లో.. అనామికని కళ్యాణ్ ని కలుస్తాడు. కానీ అనామిక కళ్యాణ్ పై కోపంగా ఉంటుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. అప్పు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసావని అనగానే కళ్యాణ్ అనామికని బుజ్జగిస్తాడు. అన్ని ఓకే కానీ అప్పు విషయం వచ్చేసరికి అటు వైపే ఇంపార్టెన్స్ ఉంటుందని అనామిక అంటుంది. ఒకవైపు రాజ్ వీలునామ పత్రాలు చింపి వెయ్యడంతో రుద్రాణి ప్లాన్ మిస్ అయిందని అనుకుంటుంది. అసలు ముసలోడు వీలునామా పత్రాలలో ఏం రాసి ఉంటాడు. మా పేరు మీద ఆస్తి ఏమైనా రాసి ఉంటాడా తెలుసుకోవాలని రాజ్ చింపిసిన పేపర్స్ డస్ట్ బిన్ లో ఉంటే.. అందులో నుండి ఎవరు చూడకుండా పేపర్ ముక్కలు తీసుకుంటుంది రుద్రాణి. అది చూసిన రాహుల్ ఏం చేస్తున్నావ్ ఆ పేపర్స్ తీసుకొని ఏం చేస్తావని రాహుల్ అంటాడు. రాహుల్ ని గదిలోకి తీసుకొని వెళ్లి.. ఈ పేపర్స్ అతికించు ఇందులో మన పేరున ఏం అయిన ఆస్తులు రాశాడో చూద్దాం దాన్ని బట్టి మరొక ప్లాన్ వేసి ముసలోడిని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తి రాయిచుకుంటానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాహుల్ పేపర్ అతికించగానే.. అందులో ఉన్నది చదివి రుద్రాణి షాక్ అవుతుంది. వీలునామ పత్రంలో ఈ ఆస్తులన్నింటిని అనుభవించే హక్కు అందరికి ఉంటుంది. కానీ ఈ ఆస్తులు ఎవరి పేరున రాయడం లేదు. ఈ ఆస్తులు అన్ని మునిమనవళ్ళకి చెందుతాయని అందులో ఉండడం చూసిన రుద్రాణి.. ఇదేంటి ఇలా రాశాడంటూ, ఒకవైపు కోపంగా, మరొక వైపు బాధగా  ఉంటుంది. వీలునామాలో ఏం రాశాడు అనేది ఇందిరాదేవికి సీతారామయ్య చెప్తాడు. రాజ్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి అమెరికా నుండి డాక్టర్ వస్తున్నాడు. ఎయిర్ పోర్ట్ కీ వెళ్లి రిసీవ్ చేసుకోమని చెప్పగానే.. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమైంది హ్యాపీగా ఉన్నావని అపర్ణ అడుగుతుంది. తాతయ్య కోసం అమెరికా నుండి డాక్టర్ వస్తున్నాడని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఒకవైపు  అపర్ణ  హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇంట్లో అందరిని పిలిచి ఆ విషయం చెప్తుంది. అందరూ సీతారామయ్య గురించి ఇక బయపడవలిసిన అవసరం లేదని అనుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ ని రాజ్ తీసుకొని వస్తాడు. డాక్టర్ వచ్చి రిపోర్ట్స్,  సీతారామయ్యని చుసి.. మీరేం టెన్షన్ పడనవసరం లేదు. క్యాన్సర్ ని నేను పూర్తిగా నయం చేస్తాను కానీ మీరు కూడా అతన్ని ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలని ఇంట్లోని వారితో డాక్టర్ అంటాడు. దాంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఉమ్మడి కుటుంబం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఉండండని డాక్టర్ అంటాడు. మా అయనకి కూడా ఈ కుటుంబం ముక్కలు కాకుండదనే ఉంది. మీరు కూడా అలాగే చెప్పారు. సంతోషంగా ఉంచితే ఏ మందులు మింగాల్సిన అవసరం లేదని ఇందిరదేవి సంబరపడుతుంది. తరువాయి భాగంలో.. ఎప్పటిలాగే రాజ్, కావ్యల మధ్య గొడవ జరుగుతుంది.  ఇక నుండి నేను నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చుడండని కావ్య అంటుంది. అసలు ఇంతకీ కావ్య ఏం చెయ్యబోతుందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bhole Shavali : భోలే షావలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వగా, పదవ వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. గ్రాంఢ్ లాంచ్ 2.0 లో పాట బిడ్డగా ఎంట్రీ ఇచ్చాడు భోలే షావలి. బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ కొందరు డిఫరెంట్ స్ట్రాటజీని వాడుతున్నారు. అమర్ దీప్ గత ఎనిమిది వారాలుగా డమ్మీ పీస్ లా అనిపించి, తొమ్మిదో వారం పర్వాలేదనిపించాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా మారిపోతుంటే.. పాటబిడ్డగా అడుగుపెట్టిన‌ భోలే ఫెయిర్ గేమ్ ఆడుతూ జనాల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయిదు వారాలు ఉన్న భోలే షావలి ఎన్నో పాటలని పాడాడు. అందులో అమ్మ గురించి పాడిన పాట ఎంతోమందిని చేరింది. హౌస్ లో తన పాటలతో చక్కని మాటతీరుతో ఆకట్టుకున్న భోలే షావలి.. టాస్క్ లలో పెద్దగా ఎఫర్ట్ పెట్టకపోవడం తన ఎలిమినేషన్ కి కారణమని చెప్పాలి‌. ఎందుకంటే హౌస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు టాస్క్ లు బాగా ఆడగలగాలి. ఆటతీరు, మాటతీరు కంటెస్టెంట్స్ ని టాప్ లో ఉంచేలా చేస్తాయి. ప్రతీ వారం భోలే షావలిని సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేసి నామినేషన్ లో పెట్టడంతో అతను కొన్నిసార్లు మాట జారాడు. ఇది అతనికి ఒకరకంగా మైనస్ అయింది. భోలే షావలి పాటలకి గెస్ట్ లతో పాటు నాగార్జున ఫిధా అయ్యాడు. అంతలా ఆకట్టుకున్న భోలే ఎలిమినేషన్ అవ్వడంతో ఇన్ స్టాగ్రామ్ లో అతని ఫ్యాన్స్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు.  రోజుకి పదిహేడు వేల చొప్పున వారానికి లక్ష ఇరవై అయిదు వేల వరకు భోలే షావలి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతను హౌస్ లో ఉన్న అయిదు వారాలకి గాను 6 లక్షల 25 వేల వరకు రెమ్యునరేషన్ ముట్టినట్టుగా తెలుస్తుంది. పదో వారం పాట బిడ్డ ఎలిమినేషన్ తో హౌస్ లో ఇంకా పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.  

రాత్రి 2 అయ్యింది.. కర్ర బాగా పనిచేస్తోంది... సిగ్గుపడ్డ రాజీవ్ కనకాల!

అలీతో ఆల్ ఇన్ వన్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, అనిత చౌదరి ఎంట్రీ ఇచ్చారు. "రోషన్ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు కదా..ఎప్పుడైనా తాను నటించేటప్పుడు సెట్ కి వెళ్ళావా ... నువ్వు వెళ్లే సమయానికి ఏదైనా రొమాంటిక్ సీన్ చేస్తూ ఉన్నాడా " అని అడిగాడు ఆలీ అడిగేసరికి "ఎగ్జాక్ట్లీ నేను వెళ్లేసరికి అలాంటి సీన్ చేస్తున్నాడు. "అరె నువ్వుండారా...ఎలా చేయాలో నేను చేసి చూపిస్తా" అన్నావా అని ఆలీ అడిగేసరికి రాజీవ్ కనకాల నవ్వేసాడు. తర్వాత హర్షవర్ధన్ మంచి డాన్స్ స్టెప్స్ వేసుకుంటూ వచ్చేసరికి "డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు" అన్నాడు ఆది. "మీ దగ్గరే" అన్నారు హర్షవర్ధన్. "డాన్స్ ఇలా కూడా చేయొచ్చంటావా" అని అలీ అడిగేసరికి "ఇలాగే చేయాలన్నా" అన్నారు హర్షవర్ధన్. తర్వాత అనిత చౌదరి ఎంట్రీ ఇచ్చారు. "అనిత గారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు" అనేసరికి "బాగున్నారు మిమ్మల్ని అడిగానని చెప్పామన్నారు" అంది అనిత చౌదరి. "పర్లేదు కదా ఇప్పుడు నడుస్తున్నారు కదా" అని మళ్ళీ ఆలీ అడిగేసరికి "మీరు ఇచ్చిన కర్ర బాగా పనిచేస్తోంది" అని చెప్పింది అనిత చౌదరి. తర్వాత "సినిమా చాల ఇంటరెస్టింగ్ ఉంది...రాత్రి 2 అయ్యింది. పైకి వెళ్లి పడుకోలేదు ఆ సినిమా చూసాక" అని ఆలీ అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత రాజీవ్ కనకాలను స్టేజి మీదకు పిలిచి కొన్ని ఇమేజెస్ ఇచ్చి వాటితో ఒక సినిమా కథ చెప్పామన్నారు ఆలీ..దానికి ఆయన "ఓపెన్ చేస్తే" అన్నారు "ఇంతకు ఎం ఓపెన్ చేస్తే" అంటూ ఆలీ రివర్స్ లో అడిగేసరికి రాజీవ్ కనకాల తలదించుకుని సిగ్గు పడిపోయాడు.

శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ అరుదైన రికార్డు!

బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంతగానో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. శివాజీ మాటే వేదంలా, అతనేం చెప్తే దానిని ఫాలో అవుతూ తోటి హౌస్ మేట్స్ సపోర్ట్ ని గెలుచుకున్నాడు. హౌస్ లోకి వచ్చిన మొదట్లో ఎవరితో మాట్లాడకుండా ఉన్న పల్లవి ప్రశాంత్ ని శివాజీ ఎలా ఉండాలో చెప్తూ ప్రతీసారీ తనకి సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు అదే పల్లవి ప్రశాంత్ ని టాప్-5 లో ఉండేలా చేసింది‌. బిగ్ బాస్ ఏదైన టాస్క్ పెడితే మెరుపుదాడితో ఆడే పల్లవి ప్రశాంత్.‌. తోటి హౌస్ మేట్స్ మెప్పు పొందాడు. సీరియల్ బ్యాచ్ మొత్తం కలిసి ప్రతీ నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ కలిసి గెలుపోటములని సరిసమానంగా తోసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా తమ ఆట తాము ఆడుకుంటూ యావర్, ప్రశాంత్, శివాజీ ఈ ముగ్గరు ఫెయిర్ గేమ్ ఆడుతూ బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటున్నారు.   దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చిన వారిలో దాదాపు అందరూ శివాజీ, ప్రశాంత్, యావర్ ని టాప్-5 లో ఉంచారు. బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ విన్నర్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి వస్తుందని ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. అది నిన్నటి ఎపిసోడ్ లో స్పష్టంగా తెలిసింది. నిన్న హైపర్ ఆది స్టేజ్ మీదకి వచ్చి పల్లవి ప్రశాంత్ కి క్లియర్ గా చెప్పాడు. రతిక వెనుక తిరిగి ఎక్కడ ఆగమైతావో అని అనుకున్నాం కానీ ఎదురులేని మనిషిలా నిలిచావని అన్నాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఇప్పటివరకు హౌస్ లో ఉన్న తీరుగా ఉంటే ఖచ్చితంగా టాప్-5 లో ఉంటారని తెలుస్తుంది.  

శివాజీ టాప్-5 కంటెస్టెంట్.. శోభాశెట్టి ఆంటీనా?

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పది వారాలు పూర్తిచేసుకుంది. కంటెస్టెంట్స్ ఆటతీరు, మాటతీరుకి బయట ఒక్కొక్కరికి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గతవారమంతా ఫ్యామిలీ వీక్ జరిగిన విషయం తెలిసిందే. అయితే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికరమైన ‌విషయాలు తెలిసాయి. కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి శివాజీని టాప్-5 లో ఉంచారు. గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్నయ్య, అమర్ దీప్ వాళ్ళ అమ్మ, పల్లవి ప్రశాంత్ అమ్మ, అక్క.. ఇలా ఎవరొచ్చిన శివాజీని టాప్-5 లో ఉంచారు. దీన్ని బట్టి హౌస్ లోనొ వాళ్ళకి ఇప్పటికే శివాజీ టాప్-5 లో ఉన్నాడని తెలిసిఉంటుంది. ఇక ముందు ఎవరంటేనేది తెలుస్తుంది. శివాజీ ఫ్యామిలీ నుండి శివాజీ భార్య శ్వేత, చిన్న కొడుకు రిక్కీ వచ్చారు. మేము ఇలా ఉన్నామంటే దానికి మీరూ, చిరంజీవి గారే కారణం.. అంటూ నాగార్జునతో శ్వేత అంది. ఇక శివాజీ కొడుకు రిక్కీ మాట్లాడుతూ.. నువ్వు ఎంత పెద్ద హీరోవో నాకు తెలీదు కానీ ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఒక శివన్న ఉన్నాడంటు చెప్పాడు. ఇక తమ దృష్టిలో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, ప్రియాంకలు టాప్-5లో ఉంటారని చెప్పారు.  ఇక తన భర్తను బాగా చూసుకున్న యావర్, ప్రశాంత్‌లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది శివాజీ భార్య. యావర్‌తో రిక్కీ మాట్లాడుతూ.. మా అమ్మ మీకు అమ్మే.. మీ బ్రదర్ నాకూ బ్రదరే అని అనగానే యావర్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక అమర్ దీప్- డాడీ మధ్య గొడవని బాగా ఎంజాయ్ చేశానని రిక్కీ అన్నాడు. శోభా ఆంటీ ఎక్కడ అని రిక్కీ అనగానే.. ఆంటీనా అంటు శోభా షాక్ అయ్యింది. మా అమ్మని ఆంటీ అంది అందుకే అలా అన్నానని రిక్కీ అనగానే.. శివాజీ నీ కొడుకుకి సెన్సాఫ్ హ్యూమర్ బాగానే ఉంది కదా అని నాగార్జున అన్నాడు. నాన్న నీకు ఈ అయిదు వారాలు చాలా ఇంపార్టెంట్. ఇంకెప్పుడు బయటకొచ్చేస్తానని అనొద్దని రిక్కీ చెప్పాడు.  

భోలే షావలి ఎలిమినేటెడ్!

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా థీమ్ తో అదరగొడుతుంది. కొత్త కంటెస్టెంట్స్ స్ట్రాటజీలతో ప్రేక్షకులను అందిస్తున్నారు. ఇక గతవారమంతా ఫ్యామిలీ వీక్ తో ఫుల్ ఎమోషనల్ చేశాడు బిగ్ బాస్. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ అభిప్రాయంతో శివాజీ కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సంబరాలు జరిగాయి. నాగార్జున కొత్త డ్రెస్ తో, అదిరిపోయే స్టెప్పులతో వచ్చాడు.‌ ఇక వచ్చీ రాగానే కంటెస్టెంట్స్ తో కొన్ని ఆటలు ఆడించాడు. 'ఆదికేశవ' మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ శ్రీలీల, హీరో వైభవ్ తేజ్ స్టేజ్ మీదకి వచ్చి తమ సినిమా గురించి మాట్లాడారు. ఆ తర్వాత హైపర్ ఆది వచ్చాడు. హౌస్ లో ఎవరెలా ఉన్నారో చెప్తూ ఒక్కొక్కరికి ఒక్కో సినిమా పేరుని ట్యాగ్ గా ఇచ్చాడు. కాసేపు అందరిని కడుపుబ్బ నవ్వించాడు. ఇక కాజల్ అగర్వాల్ తన సినిమా 'సత్యభామ' గురించి ప్రమోషన్స్ కోసం స్టేజ్ మీదకి వచ్చింది. హౌస్ మేట్స్ తో మాట్లాడి కాసేపు గేమ్ ఆడి వెళ్ళిపోయింది.  హౌస్ లో ఎవరు టాప్-5 లో ఉంటారో ఒక్కో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. అమర్ దీప్ వాళ్ళ అమ్మ, మానస్ స్టేజ్ మీదకి వచ్చి అమర్ దీప్ కి కాసింత బూస్ట్ ఇచ్చారు. అమర్ దీప్, శివాజీ, శోభాశెట్టి, గౌతమ్, పల్లవి ప్రశాంత్ టాప్-5 లో ఉంటారని అమర్ దీప్ ఫ్రెంఢ్ మానస్ అన్నాడు. కాసేపటికి గౌతమ్ కృష్ణ కోసం అన్నయ్య జగదీష్, హీరో చైతన్య వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి గౌతమ్ ఆట బాగుందని చెప్పారు. గౌతమ్, అంబటి అర్జున్, శివాజీ, ప్రియాంక జైన్, అమర్ దీప్ టాప్-5 లో ఉంటాడని చెప్పారు. ఇలా ఒక్కో హౌస్ మేట్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి నామినేషన్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేయగా యావర్, భోలే షావలి ఇద్దరు మిగిలారు. ఇక ఇద్దరి ఫోటోలతో ఉన్న రెండు చిచ్చుబుడ్డిలలో అంటించంగానే ఎవరి చిచ్చుబుడ్డి వెలుగుతుందో వారు సేఫ్ మిగిలిమ వారు అన్ సేఫ్ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత యావర్ సేఫ్, భోలే ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ కి బై చెప్పేసి స్టేజ్ మీద ఉన్న నాగార్జున దగ్గరికి వచ్చేశాడు భోలే. హౌస్ లో అయిదు వారాలు ఉన్న భోలే తన జర్నీ వీడియో చూసుకొని ఎమోషనల్ అయ్యాడు.  

బిగ్ బాస్ బ్యూటీ సొంత విల్లాలో రేవ్ పార్టీ.. 11 మంది అరెస్ట్!

బిగ్ బాస్ ఫేమ్ హిమజకు సంబంధించిన ఒక న్యూస్ రీసెంట్ గా  టాప్ హెడ్ లైన్స్ లో వచ్చిన విషయం తెలిసిందే.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తన సొంత విల్లాలో రేవ్ పార్టీ చేసుకున్నట్లు ఈ పార్టీపై పోలీసులు దాడి చేసి హిమజ సహా 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ వార్తపై హిమాజ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో తాను  దీపావళి పండుగ కొత్త ఇంటిలో ఘనంగా జరుపుకుంటుంటే  కొన్ని ఛానల్స్,   ఫేక్ యాప్ లు తనపై  తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటూ ఫైర్ అయ్యారు.  అటువంటి వార్తల్ని నమ్మొద్దంటూ హితవు పలికారు. తన  ఇంట్లో పార్టీ జరిగిన మాట వాస్తవమే..ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారానికి పోలీసులు  వచ్చి తన ఇంటిని సోదాలు  చేశారని తాను  కూడా ఎంక్వైరీకి సహాకరించాను అని చెప్పారు హిమజ. తనపైన తన పార్టీకి వచ్చిన వారి పైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటివేవీ లేవని స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నిహితులను పిలిచానని, పూజా కార్యక్రమాలు నిర్వహించానని హిమజ వెల్లడించారు. తాను అరెస్ట్ అయ్యానన్న వార్తలతో తనకు  ఫోన్లు వస్తున్నాయని వాటన్నిటికీ చెక్ పెట్టడానికే అందరికీ వాస్తవం ఏంటో తెలియాలనే ఉద్దేశంతోనే  ఇలా లైవ్ లోకి వచ్చానని వివరణ ఇచ్చారు.  బిగ్ బాస్ 3 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చేసరికి తెలుగు ఆడియన్స్ కి హిమజ గురించి   తెలిసింది. అప్పుడప్పుడు కొన్ని మూవీస్ లో నటించినా కూడా ఆమెకు పెద్దగా పేరు రాలేదు కానీ బిగ్ బాస్ ద్వారా మంచి పేరు వచ్చింది. ఐతే హిమజ రిలీజ్ చేసిన ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ ని క్లోజ్ చేసేసింది హిమజ.

జబర్దస్త్ యాంకర్ సిరి రెమ్యూనరేషన్ అంతా!

జబర్దస్త్ షోకి యాంకర్స్, జడ్జెస్ ప్రతీ సారీ చేంజ్ అవుతూనే ఉంటారు. ఈ కామెడీ  షోకు మొదట అనసూయ, రష్మి యాంకర్స్ గా చేశారు. అనసూయ మూవీస్ లో ఛాన్సెస్ వచ్చేసరికి ఆమె ఈ షోకి బైబై చెప్పేసింది. కొంత కాలం ఆమె ప్లేస్ లో రష్మీ ఇటు జబర్దస్త్, అటు ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ఒంటి చేత్తో నడిపించింది. ఇక ఆమెకు కూడా మూవీస్ లో ఛాన్సెస్ వస్తుండడం డేట్స్ కుదరకపోయేసరికి  ఆమె ప్లేస్ లో సౌమ్య రావు వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె కూడా షోకు బై బై చెప్పేసింది. ఇప్పుడు  ఆమె ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ వచ్చింది. రావడం ఐతే వచ్చింది కానీ ఇప్పుడు అందరి ద్రుష్టి ఆమె రెమ్యూనరేషన్ మీద ఉంది. ఇంతకు ఆమె రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఆరా తియ్యడం స్టార్ట్ చేశారు.  ఇదివరకు పనిచేసిన యాంకర్స్ కి ఒక్కో ఎపిసోడ్ కు రెండు లక్షలు రూపాయలు పుచ్చుకునేవారు. కానీ సిరి విషయంలో మాత్రం మల్లెమాలవారు కాస్త ఎక్కువ మొత్తంలో అంటే ఒక్క ఎపిసోడ్ కి సుమారు 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అంటే ఇంతకుముందు ఉన్నవాళ్ళ కంటే బాగా ఎక్కువగానే ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  సిరి హనుమంత్  పులి- మేక వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే రీసెంట్ గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించింది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీకీ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ భామ జబర్దస్త్ లో అలరిస్తోంది. ఈ షో ఎంతోమందికి మంచి లైఫ్ ఇవ్వడంతో పాటు ప్రతీ ఒక్కరికీ ఒక ప్రత్యేక ఐడెంటిటీ కూడా ఇచ్చింది.

Bigg Boss 7 : హౌస్ లో పాస్ ఎవరో? ఫెయిల్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి సరికొత్తగా సాగుతుంది. హౌస్ లో ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ సాగింది. అందులో మొదట శివాజీ వాళ్ళ కొడుకు, అంబటి అర్జున్ భార్య,‌ అశ్విని అమ్మ, శోభాశెట్టి అమ్మ, గౌతమ్ అమ్మ, ప్రియాంక బాయ్ ఫ్రెండ్, యావర్ అన్నయ్య, భోలే షావలి భార్య, రతిక వాళ్ళ నాన్న, ప్రశాంత్ వాళ్ళ నాన్న వచ్చారు. దీంతో ప్రతీ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా ఎమోషనల్ గా సాగింది. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ తో నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్ అందరిని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు నాగార్జున. హౌస్ లో కొత్త కెప్టెన్ ఎవరో మీ అభిప్రాయం చెప్పమని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి తమ అభిప్రయాలని చెప్తూ శివాజీని 9-0 ఓట్లతో గెలిపించారు. ఇక హౌస్ కి కొత్త కెప్టెన్ శివాజీ అయ్యాడు. ఇక ఈ పది వారాలుగా ఎవరు బాగా ఆడారో తెలుసుకోవాలని పాస్? ఫెయిల్? ఎవరని ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఉన్న బ్లాక్ బోర్డ్ మీద రాయమని చెప్పాడు నాగార్జున. మొదట శోభాశెట్టిని పిలిచి అడిగాడు. అమర్ దీప్ పాస్, రతిక ఫెయిల్ అని బోర్డ్ మీద శోభా శెట్డి రాసింది. సెకండ్ శివాజీ వచ్చి యావర్ పాస్ అని రతిక ఫెయిల్ అని బోర్డ్ మీద రాశాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ వచ్చి భోలే షావలి పాస్ అని, అమర్ దీప్ ఫెయిల్ అని బోర్డ్ మీద రాశాడు.‌‌ " భోలే అన్న అసలు ఫస్ట్ వీక్ లోనే వెళ్లిపోతాడని అనుకున్నాను. కానీ చాలా చేంజ్ అయ్యాడు. బాగా ఇంప్రూవ్ అయ్యాడు" అని అంబటి అర్జున్ అన్నాడు.  పక్కోడు ఓడిపోవాలని ఆడితే వాడెప్పుడు గెలవలేడు. వాడు గెలవాలని ఆడితేనే గెలుస్తాడని అమర్ దీప్ గురించి అంబటి అర్జున్ అన్నాడు. ఆ తర్వాత అమర్ దీప్ వచ్చి అర్జున్ పాస్ అని, రతిక ఫెయిల్ అని రాసాడు. ప్రియంక జైన్ వచ్చి శోభాశెట్టి పాస్ అని రతిక ఫెయిల్ అని రాసింది. శోభాశెట్టి ప్రియాంక పాస్, రతిక ఫెయిల్ అని రాసింది. గౌతమ్ కృష్ణ వచ్చి అంబటి అర్జున్ పాస్ అని, రతిక ఫెయిల్ అని రాశాడు. ఆ తర్వాత భోలే షావలి వచ్చి.. పల్లవి ప్రశాంత్ పాస్ అని, రతిక ఫెయిల్ అని రాశాడు. పల్లవి ప్రశాంత్ వచ్చి శివాజీ పాస్ అని రతిక ఫెయిల్ అని బోర్డ్ మీద రాసి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇలా హౌస్ లో ఎక్కువ మంది రతిక ఫెయిల్ అని చెప్పారు.

Krishna Mukunda Murari : నారీ నారీ నడుమ మురారి.. భార్య వర్సెస్ మాజీ ప్రియురాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -312 లో.. నందు ఇంటికి వస్తుందని మురారితో భవాని చెప్తుంది. మురారికి నందు ఎవరో కూడా గుర్తుండదు. నందు ఎవరని అనగానే.. నీ చెల్లి అని భవాని చెప్తుంది. నందు వచ్చాక ఇక్కడే వారం రోజులు ఉండమని చెప్పు అని మురారి అంటాడు. దాంతో భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ దగ్గరికి మధు వచ్చి.. ముకుంద, మురారి ఇద్దరు షాపింగ్ కి వెళ్తున్నారు. లొకేషన్ పంపిస్తాను నువ్వు కూడా వెళ్ళని కృష్ణకి మధు చెప్పగా.. సరేనని కృష్ణ అంటుంది.  మరి డబ్బులు ఉన్నాయా అని మధు అడుగగా..  మా ఆయన ఉన్నాడు కదా డబ్బులు ఎందుకని కృష్ణ అంటుంది. మరొక వైపు మురారి తనతో షాపింగ్ కి కృష్ణని కూడా తీసుకొని వెళదామని అనుకుంటాడు. అందుకే ఆ విషయం కృష్ణకి చెప్పాలని, ఇంట్లో ఎవరు చూడకుండా కృష్ణ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు . అప్పుడే మురారిని భవాని చూసి తనదగ్గరికి వస్తుంది. భవాని  వచ్చి.. ఎక్కడికి వెళ్తున్నావని మురారిని అడుగుతుంది. మురారి తడబడుతుంటే కృష్ణ దగ్గరికి వెళ్తున్నాడని భవానికి డౌట్ వచ్చి.. మీరు వచ్చేటప్పుడు ఒక లిస్ట్ చెప్తాను అవి తీసుకొని రమ్మని భవాని చెప్తుంది. కాసేపటికి ముకుంద మురారి  షాపింగ్ కి వెళ్తారు. అక్కడ ముకుంద మనిషి వచ్చి కావాలనే..  "మీరు మేడమ్ చాలా రోజులు అవుతుంది. ఇలా రావడం" అని అంటాడు. ఏంటి ముకుందతో ఇదివరకు షాపింగ్ కి వచ్చానా? నాకు గుర్తు లేదని మురారి అనుకుంటాడు. ఎప్పటిలాగే మీరే మేడమ్ కి  సెలక్ట్ చెయ్యాలని ముకుంద మనిషి అంటాడు. ఆ తర్వాత ముకుందకి మురారి చీర సెలక్ట్ చేస్తాడు మురారి. అప్పుడే ఒక అతను వచ్చి ఇది ఆల్రెడీ ఒకరు తీసుకున్నారని అనగానే.. ఆ చీర మురారి సెలక్ట్ చేసాడు కాబట్టి ఆ చీరనే ముకుంద కావాలని అనుకుంటుంది. ఆ చీర తీసుకున్న మేడమ్ ని రిక్వెస్ట్ చెయ్యండని అక్కడ ఉన్న  అతను అంటాడు. ఆ తర్వాత  ఆ చీర తీసుకుంది ఎవరో కాదు కృష్ణ.. అక్కడ కృష్ణని చూసి ముకుంద షాక్ అవుతుంది మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు.  "నేను సెలెక్ట్ చేసుకున్న చీరని ఎవరికి ఇవ్వను" అని కృష్ణ ఖచ్చితంగా చెప్తుంది. మరొక వైపు భవాని ఇంటికి నందు, గౌతమ్ ఇద్దరు వస్తారు. మురారి విషయం మొత్తం నందు, గౌతమ్ లకి భవాని చెప్తుంది. తరువాయి భాగంలో.. " నువ్వు ఒక షర్ట్ తీసుకో, నేనొక షర్టు తీసుకుంటా. ఏసీపీ సర్ ని పిలిచి ఎవరు సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చిందో అడుగుదాం" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మురారిని కృష్ణ పిలిచి.. ఏ షర్ట్ నచ్చిందోనని అడుగుతుంది. మురారి తన భార్యని గెలిపిస్తాడా లేక ఒకప్పటి మాజీ ప్రేమికురాలిని గెలిపిస్తాడా లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: ముద్దుతో భార్య కొత్త నాటకం మొదలు.. అవాక్కైన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -251 లో.. కావ్య మీద ఉన్న కోపంతో కావ్య భోజనం తీసుకొని వస్తే భోజనం చెయ్యకుండా రాజ్ వెనక్కి పంపిస్తాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మితో కలిసి కావ్య ఒక ప్లాన్ చేస్తుంది. అపర్ణని రెచ్చగొట్టి అపర్ణనే రాజ్ కి భోజనం తీసుకొని వెళ్లేలా ఇద్దరు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత రాజ్ భోజనం చెయ్యడం లేదు. ఎవరు వచ్చి చెప్పిన వినే స్టేజిలో రాజ్ లేడని ధాన్యలక్ష్మితో కావ్య అనగానే.. అది వింటుంది అపర్ణ. రాజ్ నేను చెప్తే వింటాడని భోజనం తీసుకొని అపర్ణ వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణ భోజనం తీసుకొని రావడం చూసిన రాజ్.. తాను తీసుకొని వస్తే భోజనం చెయ్యలేదని నీతో పంపించిందా అని రాజ్ అంటాడు. ఒకరు పంపించడం ఏంటి? నా కొడుకు గురించి నాకు తెలియదా? నేనే స్వయంగా వంట చేసి తీసుకొని వచ్చానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజ్ కి అపర్ణ గోరుముద్దలు తినిపిస్తుంది. అదంతా కావ్య, ధాన్యలక్ష్మి ఇద్దరు చాటు నుండి చూస్తు నవ్వుకుంటారు. ఆ తర్వాత అపర్ణ  బయటకు వచ్చి.. చూసారా రాజ్ నా మాట వింటాడు. ఇక్కడ ఎవరో నాతో ఛాలెంజ్ చేశారని హుందాగా అపర్ణ చెప్పగానే.. సారీ అత్తయ్య మిమ్మల్ని తక్కువ అంచనా వేసానని కావ్య చెప్తుంది. ఆ తర్వాత కావ్య గదిలోకి వచ్చి రాజ్ ని చూస్తూ నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుతున్నావ్ మా అమ్మ చేత పంపిస్తే తిన్నాడని అనుకుంటున్నావా అని అనగానే..  నాకేం తెలియదు ఆవిడే వంట చేసి తీసుకొని వచ్చారేమో అని కావ్య అనగానే.. ఆ మాత్రం తెలియదా వంట టేస్ట్ ని బట్టి అని రాజ్ అంటాడు. మరుసటి రోజు ఉదయం పెద్దాయన ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. అప్పడే వీలునామ రాయించుకొని లాయర్ వస్తాడు. ఆ తర్వాత అందరు ఇప్పుడు ఎందుకు ఆస్తి పంపకాలని అంటున్నా కూడా ఇప్పటికే లేట్ చేశానంటూ సీతారామయ్య వీలునామా చదవమని లాయర్ కి చెప్తాడు. లాయర్ చదవబోతుంటే రాజ్ వచ్చి వీలునామా పత్రాలు చింపేస్తాడు. అందురు హ్యాపీగా ఫీల్ అయినా రుద్రాణి, రాహుల్ లా మొహాలు మాత్రం మాడిపోతాయి. మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత అంతే గాని ఇలా ఆస్తి పంపకాలు అనే విషయం మర్చిపోండి. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని రాజ్ అనగానే చాలా బాగా చెప్పావని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో తాతయ్య కోసం మనం కలిసి ఉండాలని రాజ్ తో కావ్య అనగానే ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని దగ్గర అయిపోదామని అనుకుంటున్నావా? నిన్ను ఎప్పటికి భార్యగా ఒప్పుకోనని రాజ్ అంటాడు. నువ్వు నటించావని రాజ్ అనగానే.. నాది నాటకం అయితే మీరు కూడా నటించారని కావ్య అంటుంది‌. నటించాను ఇక ముందు కూడా నటిస్తానని రాజ్ అంటాడు. నటించడం నేను మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తానని కావ్య వెళ్లిపోతు రాజ్ కి  ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో రాజ్ అవాక్కవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu: రొమాంటిక్ గా రిషి.. మాస్ వార్నింగ్ ఇచ్చిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -918 లో.. రిషి ప్రేమగా వసుధారకి జూమ్కాలు తీసుకొని వచ్చి.. వసుధార చెవికి పెడుతుండగా జూమ్కా కిందపడిపోతుంది. రిషి జుమ్కా తీసుకొని దాచేసి, జుమ్కా కన్పించడం లేదంటూ సరదాగా ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత జుమ్కా వసుధారకి పెడతాడు. ఇద్దరు సెల్ఫీ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపటికి మీరు మళ్ళీ ఎండీ సీట్ లో కూర్చొని బాధ్యతలు తీసుకుంటారా అని వసుధార అడుగుతుంది. నేను ఎప్పుడు నీ ఎండీనే అని రిషి అనగానే.. మీరు ఎప్పుడు నా ఎండీ అని వసుధార అంటుంది. అలా అనగానే ఒక్కసారి నా మొహం చూసి చెప్పమని వసుధార దగ్గరికి తీసుకొని రిషి వస్తుంటాడు. అలా రొమాంటిక్ గా రిషి అడిగేసరికి వసుధార మెలికలు తిరిగిపోతుంది. మరొక వైపు విశ్వనాథ్ దగ్గరకు అనుపమ వచ్చి.. నేను ఓల్డ్ స్టూడెంట్స్ అందరితో ఒక అల్యూమిని ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నానని అనుపమ అనగానే.. నీ ఇష్టం నీకు నచ్చినట్టు చెయ్. నా తర్వాత ఈ ఆస్తులని చూసుకునేది నువ్వే కదా అని విశ్వ నాథ్ అనుపమతో అంటాడు. ఒకవైపు రిషి, వసుధార ఒళ్ళో పడుకొని సరదాగా కబుర్లు చెప్తుంటాడు. నీకు ఎప్పుడైన ఏంజిల్ గురించి, నా గురించి  అనుమానం వచ్చిందా అని రిషి అనగానే.. వసుధార ఒక్కసారిగా లేచి అలిగి వెళ్ళిపోతుంది. ఏమైందని రిషి అనగానే.. మీరు అడగవలసిన మాట అదేనా? మిమ్మల్ని అనుమానిస్తే నేను వసుధారని కాదంటూ బుంగ మూతి పెట్టి అలుగుతుంది. సారి చెప్పిన వసుధార అంగీకరించదు. ఏం కావాలి సారీ సారీలు తీసుకోవాలా అంటూ బుజ్జగిస్తుంటాడు. అయిన వసుధార బెట్టు చేస్తుంది. వసుధార సారీ అంటూ గట్టిగా అరుస్తుంటాడు రిషి. మామయ్య నిద్ర లేస్తాడని వసుధార అంటుంది. మరి నా సారీ యాక్సెప్ట్ చెయ్ అని రిషి అంటాడు. అయిన వసుధార యాక్సెప్ట్ చెయ్యదు. డాబా పైకి వెళ్లి గట్టిగా సారీ అని అరుస్తూ ఉంటాడు. అందరి నిద్ర డిస్టబ్ చేస్తానని రిషి అనగానే.. ఇది వరకు రిషి థాంక్స్ యాక్సెప్ట్ చెయ్యనందుకు తను ఇలా చేసింది గుర్తుకు చేసుకుంటుంది వసుధార. ఆ తర్వాత వసు రిషి సారీని యాక్సెప్ట్ చేస్తుంది. మరుసటి రోజు ఉదయం ఫణింద్రకి రిషి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు‌. అప్పుడే శైలేంద్ర వచ్చి ఫణింద్ర  దగ్గర ఫోన్ తీసుకొని.. మేం వచ్చినపుడు లేరు ఎక్కడకి వెళ్లారని అడుగుతాడు. రిషి ఏదో చెప్పబోతు ఉంటే.. వసుధార వచ్చి మిమ్మల్ని మామయ్య పిలుస్తున్నారంటూ చెప్పగానే.. వసుధారకి రిషి ఫోన్ ఇచ్చి వెళ్తాడు.. ఆ తర్వాత వసుధార, శైలేంద్రల మధ్య  మాటల యుద్ధం జరుగుతుంది. ఫోన్ దేవయాని తీసుకొని వసుధారతో కోపంగా మాట్లాడుతుంది. వసు తగ్గకుండా దేవయానికి కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sivaji Bigg Boss Captain: హౌస్ లో కొత్త కెప్టెన్‌గా వాజీ వాజీ శివాజీ... చురకలు అంటించిన నాగార్జున!

  ‌బిగ్ బాస్ సీజన్-7 ఆధ్యాంతం ఆసక్తిగా మారుతుంది. ప్రతీ వారం టాస్క్ లతో కంటెస్టెంట్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ కొనసాగింది. ఇక హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం ఓ బేబీ బాల్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. నిన్న జరిగిన ఈ టాస్క్ లో గౌతమ్-శివాజీల‌ మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో అంబటి అర్జున్, శివాజీ ఇద్దరు మిగిలారు. వీరిలో కెప్టెన్ ఎవరని చెప్పకుండా ఆ సస్పెన్స్ ని అలానే ఉంచేశాడు బిగ్ బాస్. ఇక శనివారం నాటి ప్రోమోలో ఎవరు కెప్టెనో తెలుస్తుందని బిగ్ బాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇక నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. ఈ ఇద్దరిలో కెప్టెన్ ఎవరని మీరు అనుకుంటున్నారని అడిగాడు. శోభాశెట్టి, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అశ్వినిశ్రీ దాదాపు అందరు శివాజీ పేరే కెప్టెన్ గా చెప్పారు.  "జనం మెచ్చినోడే నాయకుడని నాకు అనిపించింది సర్. అది శివాజీ‌ గారే" అని అమర్ దీప్ అన్నాడు. ఇక రాజమాతలుగా శోభాశెట్టి, ప్రియాంక చేసిన అన్ ఫెయర్ నామినేషన్ గురించి గట్టిగా అడిగాడు నాగార్జున. మీరిద్దరు కలిసి అమర్ దీప్ ని సేవ్ చేశారంటు చురకలంటించాడు. ప్రియాంక, శోభాశెట్టి ఇద్దరు చాలా డామినేట్ చేసారని అశ్వినిశ్రీ అనగానే.. శోభాని పిలిచి డామినేట్ చేస్తున్నారంట అని అడిగేసరికి‌‌.. శోభాశెట్టి తడబడింది. దీంతో ఈ వీకెండ్ సీరియల్ బ్యాచ్ కి మరోసారీ వార్నింగ్ వచ్చేలా ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే శివాజీ హౌస్ కి కొత్త కెప్టెన్ అయినట్టు వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.  

Pallavi Prashanth : నాన్నకు ప్రేమతో.. ఈ దెబ్బతో టైటిల్ విన్నర్ ఫిక్స్!

బిగ్ బాస్ సీజన్-7 ఈ వారం ఫ్యామిలీ వీక్ తో క్రేజీగా ఎమోషనల్ గా సాగుతుంది. హౌస్ లోకి మొదటగా శివాజీ కొడుకు వెంకట్ వచ్చాడు. ఆ తర్వాత అర్జున్ వాళ్ల భార్య, శోభాశెట్టి అమ్మ, భోలే భార్య, గౌతమ్ కృష్ణ అమ్మ, యావర్ అన్నయ్య.. ఇలా అందరు వచ్చి ఎమోషనల్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా రతిక వాళ్ళ నాన్న రాములు వచ్చి అందరితో మాట్లాడాడు. ఆట బాగా ఆడమని, కప్పు కొట్టాలని పల్లవి ప్రశాంత్ కి రతిక వాళ్ల నాన్న చెప్పాడు. ఇక హౌస్ లో అందరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఒక్క పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న రాకపోవడంతో పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎదురుచూసాడంట ప్రశాంత్. శోభాశెట్టి, ప్రియాంక తినమని చెప్పిన తినని మొండిగా ఉన్నాడంట ప్రశాంత్. ఆ తర్వాత బంతిపూలని పంపించాడు బిగ్ బాస్. ఆ పూలని చూసిన శివాజీ.. ' రేయ్ పల్లవి.. మీ చేనులో పూసిన బంతిపూలు రా' అని చూపించడంతో కంటతడి పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇక కాసేపటికి.. బాబు బంగారం అంటూ పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాన్నని చూసిన ఆనందంలో పరుగున వెళ్ళి కాళ్ళమీద పడిపోయాడు ప్రశాంత్. నాన్నని పైకి ఎత్తుకొని.. జై కిసాన్ జై జవాన్. మళ్లొచ్చిన అంటే తగ్గేదేలా అంటూ అరవడంతొ బిగ్ బాస్ హౌస్ మొత్తం దద్దరిల్లిపోయింది. నా బిడ్డని మంచిగా చూసుకోండ్రి అని హౌస్ మేట్స్ అందరికి చేతులెక్కి మరీ మొక్కాడు. " గొడవలు పెట్టుకోకండి. కొట్టుకోకండి.. కలిసి మెలిసి ఉండండి" అంటూ అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అన్నాడు. ఇక నాన్నకి ఆప్యాయంగా అన్నం తినిపించాడు పల్లవి ప్రశాంత్. ఓ ప్లేట్ లో అన్నం మెతుకుల్లా మీరంతా కలిసి మెలిసి ఉండాలే. ఎవరి ఆట వారిదే. ఆట అయిపోయాక అంతా మరిచిపోయి కుటుంబం మాదిరి ఉండాలి అని హౌస్ మేట్స్ తో అన్నాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న. ఇద్దరు కలిసి సపరేట్ గా మాట్లాడుకున్నారు.  నీ ఆట నువ్వు ఆడు. వేరే ఏం వద్దు. గొడవలకి పోకు. కోపం తగ్గించుకో అని ప్రశాంత్ వాళ్ళ నాన్న చెప్పాడు. ఇక నాన్న వచ్చిన సందర్భంలో భోలే షావలి అప్పటికప్పుడు లిరిక్స్ అనుకొని పాట పాడాడు. " బాపొచ్చినాడు తమ్మయ్యా.. బంతి పూలు తెచ్చాడు తమ్ముడా.. వాగై వచ్చాడు.. వంకై వచ్చాడు.. పొలమై వచ్చాడు.. చేనై వచ్చాడు.. బువ్వై(అన్నం) వచ్చాడు " అంటూ భోలే షావలిని పాటకి హౌస్ అంతా ఫిధా అయ్యారు. విజిల్స్ , కేకలతో మారుమ్రోగింది. ఈ ఎపిసోడ్ అంతా మోస్ట్ ఎమోషనల్ గా సాగింది.  

గౌతమ్ కృష్ణ ఎలిమినేటెడ్.. లేదంటే నాగార్జున తాట తీస్తాడుగా!

బిగ్ బాస్ సీజన్-7 లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో స్ట్రాటజీతో ఆసక్తిని కలిగిస్తున్నారు. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ సాగింది. అందరి హౌస్ మేట్స్ ఫ్యామీలీ వాళ్ళు వచ్చి ఎమోషనల్ అయ్యారు. అయితే ఇందులో కొంతమంది కొన్నింటిని బాగా నేర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ వారం హౌస్ కి కొత్త కెప్టెన్ కోసం ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కి ఓ బేబీ అంటూ  బేబీ డాల్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఒక  గేట్ తో కూడిన సెటప్ చేశాడు. గేట్ కి అపోజిట్ లో టేబుల్ పెట్టి దాని మీద కంటెస్టెంట్స్ ఫేస్ లతో డాల్స్ కి పెట్టాడు. బెల్ సౌండ్ వచ్చిన ప్రతీసారీ కంటెస్టెంట్స్ అంతా ఆ బొమ్మలు తీసుకొని గేట్ లోకి పరుగెత్తాలి. ఏ కంటెస్టెంట్ అయితే గేట్ లోకి చివరగా వెళ్తాడో అతడి చేతిలో ఉన్న బేబీ డాల్ మీద కంటెస్టెంట్ ఆట నుండి తప్పుకుంటాడు. ఇలా మొదట యావర్, అశ్విని,  భోలే, శోభా, ప్రియాంక, రతిక, అమర్ దీప్ ఆటనుండి తప్పుకొని చివరగా అంబటి అర్జున్, గౌతమ్, శివాజీ మిగులుతారు. అయితే వీరి ముగ్గురు పరుగెత్తుకుంటూ వెళ్ళి డాల్స్ ని పట్టుకుంటారు. గౌతమ్, అంబటి అర్జున్ గేట్ లోకి వెళ్తారు. శివాజీ మిగిలిపోతాడు. అయితే శివాజీ చేతిలో గౌతమ్ కృష్ణ డాల్ ఉంటుంది. దాంతో గౌతమ్ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది.‌ ఇక అంబటి అర్జున్, శివాజీ మిగులుతారు. గౌతమ్ కృష్ణని కావాలనే తప్పించారని, తనకి అన్యాయం జరిగిందని శివాజీతో వాదనకి దిగుతాడు గౌతమ్. ఇదంతా చూస్తున్న హౌస్ మేట్స్ ఏం అనలేకపోతారు. " ఇది గేమ్ స్ట్రాటజీ. నువ్వు తప్పుకునే ముందు అందరు తప్పుకున్నారు కదా. నువ్వు ప్రతీసారీ వాంటెడ్ గా నాతో గొడవ పెట్టుకుంటున్నావ్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు కంటెంట్ కోసం ఎంత చేసినా అది సెట్ అవ్వదు" అంటూ గౌతమ్ మీద శివాజీ ఫైర్ అయ్యాడు. ‌అయితే వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటూ నెట్టింట పెద్ద డిబేటే జరుగుతుంది. అయితే వందలో ఎనభై మంది శివాజీ కరెక్ట్ అని చెప్తున్నారు. దీంతో ప్రతీవారం లాగా ఈ వారం కూడా గౌతమ్ కృష్ణకి నాగార్జున చేతిలో గట్టి వార్నింగ్ పడేలా ఉంది.  

Brahmamudi : దుగ్గిరాల ఇంట్లో ఆస్తి చీలికలు.. లెక్కలేసుకుంటున్న రుద్రాణి! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -250 లో.. దుగ్గిరాల ఇంటికి రుద్రాణి ఏమి కాదని, కేవలం సీతారామయ్య చేరదీసి కూతురు స్థానం ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే తిరిగి వచ్చి దుగ్గిరాల ఇంట్లోనే అడపడుచు హోదాని ఏలూతుంటుంది. అయితే పెద్దాయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనకి ఒక వంతు ఆస్తి కావాలని  వీలునామా పత్రాలు తీసుకొని సీతారామయ్య దగ్గరికి వచ్చి రుద్రాణి నటిస్తుంటుంది.. మరొకవైపు రుద్రాణి సీతారామయ్య దగ్గరికి వెళ్ళడం ధాన్యలక్ష్మి చూసి షాక్ అవుతుంది. కాసేపటికి రాహుల్ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. ఏంటి మమ్మీ ఏడుస్తున్నావని రాహుల్ అనగానే .. ఏడవడం లేదు జీవిస్తున్నానని రుద్రాణి అంటుంది. ఇంతకి పెద్దాయన ఆస్తి రాసి ఇచ్చేలా ఉన్నాడా అని రాహుల్ అనగానే.. ఇవ్వకేం చేస్తాడని రుద్రాణి అంటుంది. ఇక సంతోషంగా ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తు ఇంట్లో సిచువేషన్ గురించి వెటకారంగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం అందరిని టిఫిన్ చెయ్యడానికి కావ్య పిలుస్తుంటుంది. ఆ తర్వాత ఇంటికి లాయర్ వచ్చి సీతరామయ్య గదిలోకీ వెళ్తాడు. లాయర్ లోపలికి రాగానే ఇందిరాదేవిని బయటకు పంపిస్తాడు సీతారామయ్య. అసలు ఇంటికి లాయర్ ఎందుకు వచ్చాడని ఇంట్లో వాళ్ళంతా సందిగ్ధంలో ఉంటారు. ఆ తర్వాత ఆస్తుల గురించి సీతారామయ్య ఒక వీలునామా రాసి తీసుకొని రమ్మని చెప్పగానే లాయర్ సరే అని వెళ్ళిపోతాడు. ఒకవైపు రుద్రాణి, రాహుల్ లు తమ వాటాని ఇస్తున్నారని  హ్యాపీగా ఉంటారు. మరొకవైపు ధాన్యలక్ష్మి ఆలోచిస్తుంటుంది. ఆ రుద్రాణి వల్ల ఆస్తిలో మన కళ్యాణ్ కి అన్యాయం జరుగుతుంది కావచ్చని ప్రకాష్ తో ధాన్యలక్ష్మి చెప్పగానే.. అదేం లేదు నేను అన్నయ్యని నమ్మాను. ఇప్పుడు రాజ్ ని కళ్యాణ్ నమ్ముతున్నాడు. వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ గానే ఆలోచిస్తారని ప్రకాష్ అంటాడు. మరొకవైపు సీతారామయ్య దగ్గరికి అపర్ణ వచ్చి.. మీరు ఇప్పుడు లాయర్ ని ఎందుకు పిలిచారో నాకు అర్థం అయింది. కానీ ఇన్ని రోజులు ఉమ్మడిగా ఉంటున్న మనకి ఇప్పుడు ఆస్తిలో చీలికలు వస్తాయి. ఇప్పుడు మీరు అలాంటి ఆస్తి చీలికలు చెయ్యకండి. ఎప్పటికి ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండేలా ఇంటి పెద్ద కోడలిగా నేను బాధ్యత తీసుకుంటాను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి అపర్ణ వెళ్ళిపోతుంది. మరొక వైపు సీతారామయ్యకి మంచి ట్రీట్ మెంట్ గురించి రాజ్ తెలిసిన వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడే కావ్య భోజనం తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. తరువాయి భాగంలో లాయర్ వీలునామ పత్రాలు తీసుకొని వచ్చి చదవబోతుంటే.. అప్పుడే రాజ్ వచ్చి వీలునామా  పత్రాలు చింపివేసి.. ఇది ఇంతటితో వదిలెయ్యండని చెప్తాడు. రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukundha Murari : ఎక్కడికెళ్ళిన భార్య  జ్ఞాపకాలే.. పడిపడి లేచే మనసు కథేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -311 లో.. రేవతి మధు ఇద్దరు కలిసి కృష్ణ, మురారీలని ఎక్కడికైన పంపింద్దామని అనుకుంటారు‌. అప్పుడే భవాని వచ్చి మధు చెంప చెల్లుమనిపిస్తుంది. కృష్ణని క్షేమించే ప్రసక్తే లేదు అన్నట్లుగా భవాని చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అసలు ఇదంతా చేసింది వాళ్ళు అయి ఉండరేమోనని రేవతి అంటుంది. ఎక్కడ తన భాగోతం బయటపడుతుందోనని భావించిన ముకుంద.. ఏంటి పెద్ద అత్తయ్య మాటకే ఎదరు చెప్తున్నారా అని అంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి కలిసి వస్తు ఉండడం భవాని కోపంగా చూస్తుంది. వేణి నువ్వు వెళ్ళు. నేను మురారీతో మాట్లాడాలని భవాని అంటుంది. లోపల ఎంత కోపంగా ఉన్న మురారి కోసం కృష్ణతో నవ్వుతు మాట్లాడుతుంది భవాని. కాసేపటికి కృష్ణ వెళ్లిపోతుంది. మురారి అమెరికా వెళ్తున్నాడని కృష్ణ చాలా బాధపడుతుంది. మరొకవైపు శకుంతల కృష్ణని చూడడానికి ఇంటికి వస్తుంది. శకుంతలని చుస్తుంది భవాని. తనతో మాట్లాడడం ఇష్టం లేక రేవతిని పిలిచి ఎందుకు వచ్చిందో కనుక్కొని వెళ్ళిపోమని చెప్పని భవాని అనగానే.. రేవతి తనని పంపించబోతు ఉంటుంది. అప్పుడే శకుంతలని మురారి చూసి ఆగండి. మీరు వేణి వాళ్ళ రిలేషన్ కదా అని అంటాడు. అవునని శకుంతల అంటుంది. తను మురారిని అల్లుడని పిలవకముందే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు రేవతి అని భవాని చెప్పగానే.. పదా బయటకు వెళ్దామని రేవతి అంటుంది. తనకి కాఫీ గానీ టీ గానీ ఇవ్వండని మురారి అనగానే.. వాళ్ళు కాఫీ అలాంటివి తాగరని భవాని చెప్తుంది. కాసేపటికి వేణి దగ్గరికి తీసుకొని వెళ్తుంది రేవతి. వేణి వాళ్ళ రిలేషన్స్ ని కూడా నాకు దూరం పెడుతున్నారు ఎందకని భవానితో మురారి అనగానే.. నువ్వు ప్రతిసారి వేణి గారి గురించి మాట్లాడితే పెద్ద అత్తయ్యకి కోపం వస్తుందని ముకుంద అనగానే.. ఎందుకు వేణితో మాట్లాడనివ్వడం లేదు. నాకు పదే పదే వేణి గారే గుర్తుకు వస్తున్నారని మురారి అంటాడు. మురారికి భవాని కూల్ నచ్చజెప్పి.. తననోటి వెంటే ' కృష్ణతో మాట్లాడకుండా ఉండటానికి ట్రై చేస్తాను' అనేలా భవాని చేస్తుంది. మరొకవైపు శకుంతల కృష్ణ సిచువేషన్ గురించి రేవతికి చెప్తూ బాధపడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు చిన్నమ్మ అంత సెట్ అవుతుందని శకుంతలకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వచ్చి మురారి మాట్లాడతాడు. ఒకవైపు మురారి ఎక్కడ అని ముకుందని  భవాని అడుగుతుంది. అప్పుడే మురారి కృష్ణ దగ్గరికి వెళ్లి ఇంటిలోకి వస్తాడు.  ఎక్కడికి వెళ్ళావ్ వేణి దగ్గర నుండి వస్తున్నావా అని మురారిని భవాని అడుగుతుంది. మురారి సైలెంట్ గా ఉంటాడు. ఎందుకు సైలెంట్ గా ఉన్నావ భవాని అడగ్గానే.. మీకు అబద్ధం చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉన్నానని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.