అంబటి అర్జున్‌ ఫేక్‌ అని చెప్పిన నాగార్జున.. షాక్‌ లో కంటెస్టెంట్స్‌!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది.  ఇక పదకొండవ వారం హౌస్‌ లో ఎవరు ఎలిమినేషన్‌ అవుతారనే క్యూరియాసిటి అందరిలో మొదలైంది. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌ కోసం బిగ్‌ బాస్‌ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే.  శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున అదిరిపోయే డ్యాన్స్‌తో వచ్చాడు. నాగార్జున రావడం రావడమే ఫుల్‌ ఫైర్‌ మీద కన్పించాడు. షుగర్‌తో చేసిన బాటిల్స్‌ తీసుకొని వచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్‌ తల మీద ఆ బాటిల్‌ పగులగొట్టి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. మొదట కొత్త కెప్టెన్‌ ప్రియాంకని అభినందించాడు నాగార్జున. ఆ తర్వాత  శివాజీని లేపి.. నాకు కొన్ని డౌట్స్‌ ఉన్నాయి? కొన్ని సమస్యలున్నాయని నాగార్జున అనగా.. అప్పుడప్పుడు వచ్చే బూతులే కదా సర్‌ అని శివాజీ అన్నాడు.  ‘‘ఈ విషయంలో నీ సమర్థత ఏం అయింది. ఈ విషయంలో నీ సహనం ఏమైంది. పిచ్చి పోహా, ఎర్రి పోహా ఇవన్నీ హౌస్‌లో వాడే పదాలా శివాజీ’’ అని నాగార్జున అన్నాడు. ‘మాది పల్నాడు సర్‌.. ఇవన్నీ చాలా కామన్‌గా సరదాగా మాట్లాడుకుంటాం మేము. ఈ హౌస్‌లో ఇక ఇలాంటివి రాకుండా జాగ్రత్తగా ఉంటాను బాబు గారు’ అన్నాడు శివాజీ . అంబటి అర్జున్‌ ఇన్ని రోజులు ఫేక్‌గా నటించావ్‌. ఫ్యామిలీ వీక్‌లో మీ భార్య సురేఖ వచ్చి నీలోని ఫైర్‌ బయటకు తీయమని చెప్పింది. అప్పటి నుండి నామినేషన్‌లో ప్రశాంత్‌ మీద ఫైర్‌ అయ్యావని నాగార్జున చెప్పి బాటిల్‌ పగులగొట్టాడు. ఆ తర్వాత రతిక ఫోటో మీద బాటిల్‌ పగులకొట్టి.... ఇకనుండి కొన్ని పదాలను బ్యాన్‌ చేస్తున్నాను. ‘‘వచ్చేవారం నుండి నేనేంటో చూపిస్తాను. నేను ఆడతాను. ఇలాంటి పదాలన్నీ బ్యాన్‌ చేస్తున్నాను’’ అని రతికతో అన్నాడు. అమర్‌.. నేను విన్నర్‌ అని అనుకోకపోతే ఎలా గెలుస్తావని అమర్‌దీప్‌తో నాగార్జున అన్నాడు. చెల్లెలిని గెలిపించడం తప్ప హౌస్‌లో నువ్వేమైనా చేశావా గౌతమ్‌ అని అన్నాడు.  అసలు ఈ వారం ఏం అయినా ఆడావా ప్రశాంత్‌.. ఫ్యామిలీ వీక్‌లో వచ్చినవాళ్ళంతా టాప్‌-5లో నీ పేరు పెట్టారని, హమ్మయ్య ఇంకా నేను ప్రూవ్‌ అని అనుకున్నావా లేక ఇంకెవరికైనా అవకాశం ఇద్దామని అనుకున్నావా ప్రశాంత్‌ అని నాగార్జున అన్నాడు. ఇలా ఈ వారం కంటెస్టెంట్స్‌ ఆడిన ఆటతీరుని ప్రశ్నిస్తూ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. కాగా మరొక విషయం ఏమిటంటే.. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే.

గతం మర్చిపోయిన భర్తను మాములు మనిషిని చేయగలదా?

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘కృష్ణ ముకుంద మురారి’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -318లో.. కృష్ణ కొంగుకి మంట అంటుకొని స్పృహ తప్పి పడిపోతే మురారి ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత అదంతా నాటకం అని ముకుంద అనగానే.. అవును నాటకం. ఎంత అయిన డాక్టర్‌ కదా ఈ మధ్య ఎన్ని కుట్రలు చేస్తున్నారో కూడా తెలుస్తుందని మురారి అనగానే... అప్పుడు మధు కృష్ణకి సపోర్ట్‌గా మాట్లాడతాడు. వాళ్ళేం తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడం వాళ్ళకి చేతకాక కాదు వాళ్ళ కూతురు కృష్ణని ఏమైనా చేస్తారేమోనని వాళ్ళకి భయమని మధు అంటాడు. ఆ తర్వాత అందరూ నాకు ఎదురు తిరిగే వాళ్లే.  రేవతిని కూడా నా చెల్లెలుగానే భావించాను. కానీ తను కూడా నాకు ఎదురు తిరుగుతుంది. అందరూ భ్రమలోనే ఉండండని భవాని చెప్తుంది. ఆ తర్వాత మురారిని తీసుకొని రావడానికి ముకుంద వెళ్తుంది. మరొకవైపు కృష్ణ స్పృహలోకి వచ్చేవరకు తన దగ్గరే ఉంటాడు మురారి. ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని కృష్ణ అని సడెన్‌గా ఎందుకు పిలిచాను. అసలు మీరు నాకు గతంలో ఏం అవుతారని మురారి అడుగుతాడు. మీరు కేవలం నన్ను చదివించారని కృష్ణ అంటుంది. అప్పుడే ముకుంద వస్తుంది. పెద్దమ్మ రమ్మంటుంది కదా ఇక్కడ నిజం చెప్పరు. అక్కడకి వెళ్లి తేల్చుకుంటానని మురారి కోపంగా వెళ్తాడు. మరొకవైపు  భవాని దగ్గరికి రేవతి వచ్చి.. నేను మురారికి కన్నతల్లిని. కానీ మురారి మీ దగ్గరే పెరిగాడని భవానితో రేవతి మాట్లాడుతుంటుంది. అప్పుడే భవాని దగ్గరికి మురారి వచ్చి కృష్ణ గురించి  నిలదీస్తాడు. ‘‘అసలు వేణి గారు ఎవరు? నాకు పదే పదే గుర్తుకు వస్తున్నారు’’ అని మురారి అంటాడు. వాళ్ళు మన కుటుంబాన్ని మోసం చేశారు. నువ్వు ఇలా కావడానికి కారణం వల్లేనని భవాని చెప్తుంటే మురారికి కళ్ళు తిరిగినట్టు అవుతుంది. వెంటనే రేవతి వెళ్లి కృష్ణని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత మురారితో కృష్ణ సరదాగా మాట్లాడుతుంది. అప్పుడు మురారి నార్మల్‌ అయిపోతాడు. కాసేపటికి మీరంటే ఇందుకే అభిమానమని మురారి అంటాడు. ఆ తర్వాత మిమ్మల్ని చదివించాను కాదా దానికి ప్రతిఫలంగా మీరు మా ఇంట్లోనే ఉండండి అని మురారి అంటాడు. కృష్ణ సైలెంట్‌గా ఉంటుంది. మరొకవైపు ముకుంద వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు వింటుంది. తరువాయి భాగంలో.. మురారి నిద్ర పట్టక కృష్ణ దగ్గరికి వస్తాడు. ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. మురారి కృష్ణ ఒడిలో నిద్రపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే

ఎంక్వయిరీలో మర్డర్‌ మిస్టరీ బయటపడనుందా?

స్టార్‌ మాలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘గుప్పెడంత మనసు’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -924లో..  మహేంద్ర కోసం అనుపమ కాలేజీకి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్లని మహేంద్ర గురించి అడుగగా.. మహేంద్ర సర్‌ జగతి మేడం చనిపోయినప్పటి నుండి కాలేజీకి రావడం లేదని వాళ్ళు చెప్పగానే.. అసలు జగతి ఎలా చనిపోయిందని అనుపమ వాళ్లని అడుగుతుంది. మాకు తెలియదని వాళ్ళు చెప్తారు.  మరొకవైపు అప్పుడే వచ్చిన శైలేంద్ర.. అనుపమని చూసి వాళ్ళు మాట్లాడుకునేది వింటాడు. అనుపమని ఫోటో తీసి  దేవయానికి పంపిస్తాడు. ఆ తర్వాత దేవయానికి శైలేంద్ర ఫోన్‌ చేసి.. అనుపమ ఇక్కడికి వచ్చింది. ఫోటో పంపించాను చూడమని చెప్తాడు. అనుపమ ఫోటో చూసి దేవయాని షాక్‌ అవుతుంది. జగతి ఎలా చనిపోయిందంటూ ఎంక్వయిరీ మొదలుపెట్టింది. రిషి వసులతో మాట్లాడడానికి వచ్చిందని శైలేంద్ర అనగానే.. నువ్వు అనుపమని వెంటనే మన ఇంటికి తీసుకొని రా. అనుపమ ఇప్పుడు రిషి వసుధారలని కలిస్తే అంత తెలిసిపోతుందని దేవయాని కంగారుపడుతుంది. ఆ తర్వాత శైలేంద్ర లోపలకి వెళ్లి ఎవరో తెలియనట్టు అనుపమతో మాట్లాడుతాడు.. కావాలనే తన ముందు దేవయానికి ఫోన్‌ చేస్తాడు. ఆ తర్వాత అనుపమని ఇంటికి రమ్మని దేవయాని రిక్వెస్ట్‌ చేస్తుంది. వెళ్తే జగతి గురించి నిజాలు తెలుస్తాయి కదా అని శైలేంద్రతో పాటు అనుపమ దేవయాని దగ్గరికి వెళ్తుంటే.. అప్పుడే రిషి, వసుధారలు ఎదురుగా వస్తుంటారు. శైలేంద్ర వాళ్లని చూసి.. అనుపమని వాళ్ళిద్దరు  చూడకుండా జాగ్రత్తపడతాడు. ఆ తర్వాత అనుపమ దేవయాని దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. జగతిని చాలా బాగా చూసుకున్నానంటూ తనకి పాజిటివ్‌ గా చెప్పుకుంటూ మహేంద్రని అనుపమ దృష్టిలో నెగెటివ్‌ చెయ్యాలని ప్రయత్నం చేస్తుంది. అసలు జగతి ఎలా చనిపోయిందని అనుపమ అడగగానే.. ఎవరో రౌడీ షూట్‌ చేసాడు. అయిన ఎండీ చైర్‌ లో కూర్చొని ఉన్నప్పుటి నుండి ఇలా జగతిపై ఎటాక్‌ లు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎండీ చైర్‌ గురించి జగతి, వసుధారలకి ఆర్గుమెంట్‌లు జరిగేవి. ఆ గొడవలు చూడలేక రిషి వెళ్ళిపోయాడంటూ వసుధార గురించి నెగెటివ్‌ ఇంప్రెషన్‌ రావాలని అనుపమకి  దేవయాని చెప్తుంది. మరి మీరు ఎప్పుడు ఎండీ చైర్‌ గురించి ఆశ పడలేదా అని అనుపమ అనగానే.. శైలేంద్ర, దేవయాని ఇద్దరు షాక్‌ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

అక్క బంఢారం చెల్లి బయటపెట్టనుందా?

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘బ్రహ్మముడి’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -257లో... కావ్య కావాలనే రాజ్‌ని ఆటపట్టించాలని బుక్‌లో ఒక రొమాంటిక్‌ స్టోరీని చదువుతుంటుంది. అలా రాజ్‌ని కాసేపు అడుకుంటుంది. ఆ తర్వాత నీతో నాకు ఏ బంధం, సంబంధం ఉండదని రాజ్‌ కోపంగా చెప్పి వెళ్లిపోతాడు. ఎలా ఉండదో నేను చూస్తానని కావ్య అనుకుంటుంది.  అరుణ్‌ ఏంటి ఇలా చేస్తున్నాడని ఆలోచిస్తుంటుంది కావ్య. ఒకవైపు అరుణ్‌ ఇంక రాలేదని రాహుల్‌, రుద్రాణి ఇద్దరు వెయిట్‌ చేస్తుంటారు. అప్పుడే అరుణ్‌ వచ్చి రాహుల్‌కి ఫోన్‌ చేసి మీ ఇంటి ముందు ఉన్నానని చెప్పగానే.. నువ్వు ఇప్పుడు స్వప్నకి ఫోన్‌ చేసి బయటకు రమ్మని చెప్పు అని చెప్తాడు. రాహుల్‌ అలా చెప్పగానే అరుణ్‌ సరేనని స్వప్నకి ఫోన్‌ చెయ్యగానే.. ఇష్టం వచ్చినట్లుగా నీతో కలిసి తిరిగినంత మాత్రాన ఇంటికి ఫొటోస్‌ పంపిస్తావా అని స్వప్న తిడుతుంది. నేను మీ ఇంటి ముందు ఉన్నాను నాతో ఒక అయిదు నిమిషాలు మాట్లాడు ఎందుకు పంపించానో అర్థమవుతుందని అరుణ్‌ అనగానే.. ఎవరూ చూడకుండా స్వప్న బయటకు వస్తుంది.. మరొక వైపు అరుణ్‌తో స్వప్న మాట్లాడేది రాజ్‌ చూడాలని రాహుల్‌ రాజ్‌కీ ఫోన్‌ చేసి.. మాట్లాడాలి బాల్కనీలోకి రా అని చెప్పగానే రాజ్‌ వస్తాడు. అదేసమయంలో రుద్రాణి పైనుండి చూస్తుంటుంది. మరొక వైపు కావ్య కూడా అరుణ్‌ స్వప్న ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అరుణ్‌ని స్వప్న అడుగుతుంది. నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను. అందుకే ఇదంతా అని అరుణ్‌ చెప్పగానే.. అరుణ్‌ని తిడుతుంది స్వప్న. రాహుల్‌ ఏదో చెప్పాలి అన్నావ్‌ ఏంటని రాజ్‌ అడుగుతాడు. ఏం లేదు తర్వాత చెప్తానంటు రాహుల్‌ బాధపడుతున్నట్లుగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అరుణ్‌ , స్వప్న మాట్లాడుకోవడం రాజ్‌ బాల్కనీ నుండి చూస్తాడు. చూడగానే అపార్ధం చేసుకోకుండా ఫ్రెండ్‌ అయి ఉంటాడని రాజ్‌ అనుకుంటాడు. ఆ తర్వాత స్వప్న లోపలకు వస్తుంది. అక్కడే ఉన్న కావ్య.. స్వప్నని గదిలోకి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు రాహుల్‌ రుద్రాణిలు.. రాజ్‌కి స్వప్నపై డౌట్‌ వచ్చేలా చేసామని సంబరపడుతుంటారు.  అరుణ్‌ ఎందుకు వచ్చాడని స్వప్నని అడుగుతుంది కావ్య. స్వప్న జరిగిందంతా చెప్తుంది. ‘‘ఒకటి చెప్పాలి, మళ్ళీ ఒక సమస్య వచ్చింది’’ అని కృష్ణమూర్తితో కనకం అనగానే కృష్ణమూర్తి షాక్‌ అవుతాడు. తరువాయి భాగంలో ఇందిరాదేవి కొరియర్‌లో వచ్చిన అరుణ్‌ ఫోటోని రాజ్‌కి చూపించి.. ఇతని గురించి కనుక్కో, స్వప్నతో కలిసి ఉన్న ఫొటోస్‌ కూడా కొరియర్‌లో వచ్చాయని ఇందిరా దేవి చెప్తుంది. ఆ తరువాత రాజ్‌ కావ్యకి అరుణ్‌ ఫొటో చూపించి ఎవరని అడుగుతాడు. మా అక్క కాలేజీ ఫ్రెండ్‌ అరుణ్‌ అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే  

శృంగారం టైమ్‌లోనే దొంగతనానికి మాకు మంచి అవకాశం!

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక గౌన్‌ చుట్టూ తిరుగుతూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసింది. అందులో మొదట తాగుబోతు రమేష్‌ డాన్స్‌ వేస్తూ వచ్చాడు. ‘‘దొంగతనం రాత్రి మాత్రమే  ఎందుకు చేస్తారు’’ అంటూ తాగుబోతు రమేష్‌ అడిగిన డౌట్‌కి ఆటో రాంప్రసాద్‌ వెరైటీ ఆన్సర్‌ ఇచ్చాడు. ‘‘శృంగారం టైములో బంగారం కోసం ఎవరూ పెద్దగా పట్టించుకోరు..అందుకే ఆ టైంలోనే దొంగతనం చేస్తాము’’. ‘‘ఇంతలో బంగారం ఎంత ఉంటుంది అని నాటి నరేష్‌ అడిగేసరికి ‘‘ఒరే.. ఈ టైములో కూడా నువ్వు బంగారం కోసం అడిగావు తప్ప శృంగారం కోసం అడగలేదు చూసావా’’ అది అన్నాడు ఆటో రాంప్రసాద్‌. ఇక తాగుబోతు రమేష్‌ దొంగలుగా వచ్చిన ఆటో రాంప్రసాద్‌కి, నాటీ నరేష్‌కి ఒక దొంగతనం చేయాలనీ ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న గౌన్‌ని దొంగిలించాలని చెప్పాడు. అంతేకాదు దాని స్పెషలిటీ కూడా చెప్పాడు ఆ గౌన్‌ ఫైమా వేసుకుంటే ఐశ్యర్య లా కనిపిస్తుందట అందుకే ఆ గౌన్‌ కొట్టుకొస్తే యాభై లక్షలు ఇస్తానని, ఇండియాలో అదొక్కటే గౌన్‌ పీస్‌ ఉందని అది తన భార్య అడిగిందని చెప్పి వాళ్ళతో  డీల్‌ మాట్లాడతాడు. ఇక రాంప్రసాద్‌, నరేష్‌ ఇద్దరి దగ్గరకు రౌడీ రోహిణి వచ్చేసరికి ఆమెను పబ్‌కి వెళ్ళడానికి డబ్బులు అడుగుతారు. చివరకు వాళ్ళు కూడా డీల్‌ మాట్లాడి డబ్బులు తీసుకుని పబ్‌కి వెళ్తారు. ఇక షోని హోస్ట్‌ చేయడానికి రష్మీ వచ్చి ‘‘నాకేమన్నా పెళ్లి వయసు వచ్చిందా..నా వెనక పడే వాళ్ళను మెయింటైన్‌ చేయలేక చస్తున్నా’’ అంటూ ఇంద్రజాను అడిగేసరికి ఇంద్రజ కౌంటర్‌ వేసింది.

కొన్ని పిక్స్‌ బ్లర్‌గా ఉన్నా.. జ్ఞాపకాలు మాత్రం క్లియర్‌గా ఉంటాయి!

స్మాల్‌ స్క్రీన్‌ మీద బ్యూటీ క్వీన్‌ రష్మీ అంటే చాలు యూత్‌కి హార్ట్‌ అటాక్స్‌ వస్తాయి. ఆమె సిగ్నేచర్‌ డాన్స్‌ స్టెప్స్‌కి, ఆమె నవ్వుకు ఎంతో మంది ఫాన్స్‌ ఉన్నారు. అలాంటి రష్మీ.. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్‌ వంటి షోస్‌కి హోస్ట్‌గా చేస్తూ అందరినీ అలరిస్తోంది. అలాగే మంచి అవకాశాలు దొరికినప్పుడల్లా మూవీస్‌లో కూడా తన  హవా కొనసాగిస్తోంది. టైం దొరికినప్పుడల్లా ఫారెన్‌ టూర్స్‌కి అందమైన  బీచ్‌కి చెక్కేస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఎంజాయ్‌ చేస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ హాలిడే సెషన్‌లో భాగంగా ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ బీచ్‌కి వెళ్లి ఫుల్‌ ఎంజాయ్‌ చేసిన విషయం తెలుస్తోంది. ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘కొన్ని పిక్స్‌ బ్లర్‌గా ఉంటాయి.. కానీ, జ్ఞాపకాలు మాత్రం చాలా క్లియర్‌గా ఉంటాయి’ అంటూ ఒక కాప్షన్‌ పెట్టేసరికి నెటిజన్స్‌ రిప్లైస్‌ ఇచ్చేస్తున్నారు. ‘పిక్స్‌కి ఏముంది అక్కా మీ జ్ఞాపకాల ముందు. కానీ మీ సంతోషం ఎంతో కనిపిస్తోంది’ అని కామెంట్‌ చేయగా ‘పెళ్ళెప్పుడు ముదురమ్మాయి’ అని ‘ట్రిప్‌ని ఎంజాయ్‌ చేయడం హ్యాపీ. కానీ అదే ట్రిప్‌ని ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తే ఇంకా మజా వస్తుంది’ అంటూ రిప్లైస్‌ ఇస్తున్నారు. ఇక రష్మీ కన్నడలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన  ‘హుడుగారు బేకగిద్దరే’ మూవీని  తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’  పేరుతో రిలీజ్‌ చేశారు. ఇందులో  యాంకర్‌ రష్మీ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. ‘బాయ్స్‌ హాస్టల్‌’ తెలుగు వెర్షన్‌ కోసం స్పెషల్‌గా ఆమె పాత్రను క్రియేట్‌ చేశారు. రష్మీ బాత్‌ టబ్‌లో జలకాలాడుతూ కనిపించిన ఒక పిక్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌గా మారింది.

సుమ అడ్డాలో వెరైటీ టిఫిన్స్‌.. రామ్‌చరణ్‌ ఇడ్లీ, మహేష్‌బాబు దోశ!

సుమ ఏ షో చేసినా ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. ప్రస్తుతం సుమ అడ్డా పేరుతో చేస్తున్న షో కూడా అందర్నీ బాగా ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ప్రతివారం లాగే ఈ వారం కూడా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ షోను ఆద్యంతం ఎంతో సందడిగా చేసింది సుమ. నటీమణులు అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ, వై.విజయ, జయలక్ష్మీ ఈ షోకు గెస్టులుగా అటెండ్‌ అయ్యారు. వారికి చెరుకు గడలు ఇచ్చి తినమని టాస్క్‌ ఇచ్చింది. దాంతో ఆ నలుగురు చెరుకు గడలు కొరుకుతూ పళ్ళకు పని చెప్పారు. ఈ టాస్క్‌ పూర్తయిన తర్వాత వారితో ఓ హోటల్‌ ఓపెన్‌ చేయించింది. అన్నపూర్ణ, వై.విజయ ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాల్లో నటించారు. ఎఫ్‌3లో వాళ్లు హోటల్‌ రన్‌ చేస్తారు. కాబట్టి సరదాగా వారితో ఈ గేమ్‌ను ఆడిరచింది సుమ. ఖుష్బు బోండా, రమ్యకృష్ణ వడ, రామ్‌చరణ్‌ ఇడ్లీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ బోండాం, మహేష్‌బాబు దోశ అంటూ వారు చేసిన టిఫిన్స్‌కి పేర్లు పెట్టి అమ్మేసారు. అప్పుడు సుమకు ఒక డౌట్‌ వచ్చింది ‘మహేష్‌బాబు దోశ మనమే తినేస్తే ఆయనేం తింటారు’ అని. ఈ మాట అనే సరికి వై.విజయ షాక్‌ అయిపోయింది. తర్వాత కస్టమర్స్‌ని ఆహ్వానించి వారికి ముద్దులు పెట్టి దగ్గరుండి వారికి టిఫిన్స్‌ కూడా తినిపించి బాగా అట్రాక్ట్‌ చేసుకుంది. ఆ విధంగా ఫ్రెండ్లీ హోటల్‌ మాది అనిపించుకుంది. ఇది చూసిన శ్రీలక్ష్మీ అది ఫ్రెండ్లీ హోటల్‌ కాదు, అక్కడ తింటే  ఫుడ్‌ పాయిజన్‌ అయిపోతుంది అని సీరియస్‌గా అంది. అలా ఈ టాస్క్‌ని సరదాగా చేశారు. 

నాగార్జునకి అడ్డంగా దొరికిన శివాజీ, ప్రశాంత్.. డబుల్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది.  ఇక పదకొండవ వారం హౌస్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో మొదలైంది. అయితే శనివారం నాటి ప్రోమో కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే.  ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. ఇందులో నాగార్జున ఫుల్ ఫైర్ మీద ఉన్నట్టు రావడం రావడమే షుగర్ తో చేసిన బాటిల్స్ తీసుకొని వచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ తల మీద ఆ బాటిల్ పగులగొట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. శివాజీని లేపి.. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి? కొన్ని సమస్యలున్నాయని నాగార్జున అన్నాడు. అప్పుడప్పుడు వచ్చే బూతులే కదా సర్ అని శివాజీ అన్నాడు.  " ఈ విషయంలో నీ సమర్థత ఏం అయింది. ఈ విషయంలో నీ సహనం ఏమైంది. పిచ్చి పోహా, ఎర్రి పోహా ఇవన్నీ హౌస్ లో వాడే పదాలా శివాజీ" అని నాగార్జున అన్నాడు.  ఆ తర్వాత రతిక ఫోటో మీద బాటిల్ పగులకొట్టి.... ఇకనుండి కొన్ని పదాలను బ్యాన్ చేస్తున్నాను. " వచ్చేవారం నుండి నేనేంటో చూపిస్తాను. నేను ఆడతాను. ఇలాంటి పదాలన్నీ బ్యాన్ చేస్తున్నాను" అని రతికతో అన్నాడు. అమర్.. నేను విన్నర్ అని అనుకోకపోతే ఎలా గెలుస్తావని అమర్ దీప్ తో నాగార్జున అన్నాడు. చెల్లెలిని గెలిపించడం తప్ప హౌస్ లో నువ్వేమైనా చేశావా గౌతమ్ అని అన్నాడు.  అసలు ఈ వారం ఏం అయినా ఆడావా ప్రశాంత్.. ఫ్యామిలీ వీక్ లో వచ్చినవాళ్ళంతా టాప్-5 లో నీ పేరు పెట్టారని, హమ్మయ్య ఇంకా నేను ప్రూవ్ అని అనుకున్నావా లేక ఇంకెవరికైనా అవకాశం ఇద్దామని అనుకున్నావా ప్రశాంత్ అని నాగార్జున అన్నాడు. ఇలా ఈ వారం కంటెస్టెంట్స్ ఆడిన ఆటతీరుని ప్రశ్నిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఎవరెవరికి వార్నింగ్ ఇచ్చాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా మరోక విషయం ఏమిటంటే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి... ఏది ఎమైనా.. రేపటి ఎలిమినేషన్ రౌండ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

మా లవ్ స్టోరీ మొదటి పార్ట్!

నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితే. స్పోర్ట్స్ రిప్సెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయిన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు.  నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్  అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, అవుటింగ్ అంటు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి. అయితే ఈ వ్లాగ్స్ ని తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తుంది నేహా చౌదరి. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో మా లవ్ స్టోరీ పార్ట్ -1 అనే వ్లాగ్ ని పోస్ట్ చేసింది నేహా. అందులో తన భర్త అనిల్ తో కలిసి వారిద్దరి జర్నీ ఎలా సాగిందో వివరించింది. సినిమాటిక్ రేంజ్ లో, భారీ ట్విస్ట్ లు ఉన్నాయని నేహా చెప్పగా.. అవేమీ లేవని బిటెక్ లో కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మొదటి సారి చూసి.. హే ఈ అమ్మాయేదో బాగుందే అని అనిల్ అనుకున్నాడంట. ఇక కొన్ని రోజులకి అనిల్ ముందు ప్రపోజ్ చేసాడంట. ప్రపోజ్ చేసాక ఒక అయిదు ఆరు నెలలు టైమ్ తీసుకుందంట నేహా. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అనిల్ ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేసిందంట. వారిద్దరి పరిచయం నుండి ఇప్పటివరకు ఎలా జరిగిందో? ఏం జరిగిందో చెప్తూ చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.  

అమర్‌ దీప్ కోసం వెక్కివెక్కి ఏడుస్తున్న అరియాన!

  బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో అమర్ ని చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారని అనడంలో ఆశ్చర్యం లేదు. హౌస్ లోకి అమర్ ఎంట్రీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ టాప్ 5 పక్కా అని బిగ్ బాస్ అభిమానులు అనుకున్నారు. కానీ మొదట తన అయిదు వారాలు తన గేమ్ ని చూసిన ప్రేక్షకులు.. అసలు ఈ హౌస్ లో ఉంటాడా అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అమర్ దీప్.. ప్రతి టాస్క్ లో ఏకాగ్రతతో ఆడకుండా, ఫౌల్స్ ఆడుతు ఓడిపోతూ వస్తున్నాడు. ప్రతి వీక్ నాగార్జున తో చీవాట్లు పడుతున్నాడు కానీ ఫ్యామిలీ వీక్ తరువాత అమర్ లో చాలా మార్పు కన్పించింది. హౌస్ లో పాజిటివ్ గా ఉండడం.. గేమ్ పైన ఫోకస్ పెట్టడంతో టాప్ 5 గ్యారంటి అని అనుకుంటున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ కోసం హౌస్ మేట్స్ అంత పోటీపడగ అందులో నెక్స్ లెవెల్ కీ ప్రశాంత్, అమర్, ప్రియాంక, అర్జున్ వెళ్ళారు. చివరగా అమర్, ప్రియాంక ఉన్నారు. అయితే ఇద్దరు కూడా ఇది వరకూ కెప్టెన్ కానివారే.. కానీ హౌస్ లో అమర్ ని టార్గెట్ చేసి రతిక, గౌతమ్ లు ప్రియాంకకి సపోర్ట్ ఇస్తూ అమర్ బ్రిక్స్ ని పడిపోయేలా బాల్స్ విసిరారు. ఇన్ని రోజులు గేమ్ ని ప్రూ చేసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు టార్గెట్ చెయ్యకండి అంటూ అమర్ గట్టిగా అరుస్తూ ఏడ్చేశాడు.  అమర్ దీప్ ని ఆ మూమెంట్ చూసిన అందరు ఎమోషనల్ అయ్యారు. ఇలా ఒక కంటెస్టెంట్ ఏడ్వడమనేది ఈ సీజన్ లో ఎమోషనల్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అమర్, అరియాన క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజన్ మొదలైన నుండి అమర్ కీ సపోర్ట్ ఇస్తూ వస్తుంది అరియాన. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అమర్ ఏడవడం చూసి అరియాన ఏడుస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓక వీడియోని పోస్ట్ చేసింది. అందులో అలా అమర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటు అరియాన చెప్పుకుంటు ఎమోషనల్ అయింది. కాగా ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. 

కొత్త కెప్టెన్ గా ప్రియాంక.. ఏడ్చేసిన అమర్ దీప్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది‌. గతవారం భోలే షావలి ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది‌.  ఈ సీజన్ లో ఎన్నో ట్విస్ట్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. గత వారం ఫ్యామిలీ వీక్ అవ్వడంతో ఈ షో అత్యధిక టీఆర్పీ నమోదు చేసుకుంది. ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కంటెస్టెంట్స్ మధ్య ఎన్నో టాస్క్ లని ఇచ్చాడు బిగ్ బాస్.  చివరగా యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కోసం కంటెస్టెంట్స్ కి సరికొత్త టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లలో కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరిగాయి. ఒకవైపు ఉన్న బ్రిక్స్ ని మరోవైపు తీసుకెళ్ళాలని వాటిని కాలు కింద పెట్టకుండా తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో అందరు కంటెస్టెంట్స్ పోటీ పడగా.. రతిక మొదటగా అవుట్ అవ్వగా, సెకండ్ గౌతమ్ బయటకొచ్చేశాడు. ఆ తర్వాత అశ్వినిశ్రీ, శోభాశెట్టి, శివాజీ అవుట్ అయ్యారు. ఇక చివరగా ప్రశాంత్, అంబటి అర్జున్, అమర్ దీప్, ప్రియాంక ఉండగా.. హౌస్ మేట్స్ అందరు కలిసి ప్రశాంత్, అంబటి అర్జున్ ని టార్గెట్ చేసి బయటకు పంపించేశారు. అమర్ దీప్, ప్రియంక మిగిలారు. గౌతమ్ కృష్ణ, రతిక ఇద్దరు కలిసి అమర్ దీప్ ని టార్గెట్ చేశారు. బాల్స్ తో అమర్ దీప్ బ్రిక్స్ ఉన్న టవర్ ని పడగొడుతుంటే.. అరెయ్ ప్లీజ్ రా వద్దురా, వదిలేయ్ రా అంటూ ఏడ్చేశాడు అమర్ దీప్. ఇక మిగిలిన హౌస్ మేట్స్ అంతా ఏడ్వకు, డిఫెండ్ చేసుకో అని చెప్పారు. ఇక గేమ్ ఆడుతున్నంతసేపు అమర్ దీప్ ఏడ్చేశాడు. టాస్క్ ముగిసే సమయానికి ప్రియంక బ్రిక్స్ తో చేసిన టవర్ ఎక్కువగా ఉండటంతో ప్రియాంక గెలిచింది. అమర్‌దీప్ ఓటమిని భరించలేక ఏడ్చేశాడు. మొత్తానికి టాస్క్ గెలిచి ప్రియంక  ఈ వారం కెప్టెన్ గా నిలిచింది.  

హాలీవుడ్ పిలుస్తోంది...మీరేమంటారు ?

జగ్గూభాయ్ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. జగపతిబాబుని ఫాన్స్ ముద్దుగా జగ్గూభాయ్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఫామిలీ మూవీస్ ఎక్కువగా చేసి లేడీ ఫాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు జగపతి బాబు. వయసుతో పాటు సినిమాల్లో రోల్స్ కూడా చేంజ్ చేస్తూ వచ్చి విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. జగపతిబాబుని ఫామిలీ మూవీస్ లో ఎంత ఇష్టపడతారో విలన్ రోల్స్ లో కూడా అంతగానే ఇష్టపడతారు ఆడియన్స్. ఆయన విలనిజం రంగస్థలం, అరవింద సామెత మూవీస్ లో చూస్తే తెలిసిపోతుంది. కరుడుగట్టిన విలన్ గా నటించడంలో జగ్గుభాయ్ తర్వాతే ఎవరన్నా.. హిందీ, మలయాళం, తమిళ చిత్రాల్లో  జగపతి బాబు నటించారు. ఇక ఇప్పుడు  జగ్గూ భాయ్ కి ఏకంగా హాలీవుడ్ నుంచి  ఆఫర్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని జగపతి బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. "నన్ను హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు" అని పోస్ట్ చేశాడు. ఇక ఫాన్స్, నెటిజన్స్ ఊరుకుంటారా "మీరు హాలీవుడ్ మెటీరియల్ సర్ వెళ్ళండి", "వెళ్ళండి, హాలీవుడ్ మూవీస్ లో మిమ్మల్ని చూడాలని ఉంది" "ప్రపంచం మెచ్చే నటుడు కావలి మీరు వెళ్ళండి" " ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మావ, కుమ్మేయ్ అక్కడ కూడా " అంటూ ఓ రేంజ్ ఫైర్ ఫుల్ ఎమోజిస్ తో హాలీవుడ్ కి వెళ్లమంటూ జగ్గు భాయ్ ని నెటిజన్స్ తమతమ కామెంట్స్ తో మోటివేట్ చేశారు. విలన్‌గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు సీనియర్‌ నటుడు జగపతిబాబు .  సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్‌. మరి అలాంటి జగ్గు భాయ్ ఏ హాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నాడో తెలియాలంటే ఆయన నెక్స్ట్ పోస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే.  

Krishna Mukunda Murari: భవాని పట్టుదల ముందు కృష్ణ ప్రేమ నిలబడుతుందా? 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -317 లో.. మురారి కృష్ణ బాధపడుతు రావడం చూసి తను కూడా బాధపడతాడు. ఇక కోపంగా ముకుంద చేసిన తప్పుకి తనపై అరుస్తాడు. ఆ తర్వాత మురారిని కూల్ చెయ్యాలని ముకుంద కృష్ణకోసం చీర తీసుకొని వెళ్లి ఇవ్వు అని అనగానే.. ఇంకొకసారి ఈ తప్పు చెయ్యకని చెప్పి చీర తీసుకొని కృష్ణ దగ్గరికి వెళ్తాడు మురారి. నన్ను తిడుతారని నువ్వు ఎందుకు నిజం చెప్పకుండా వాళ్ళు అన్న మాటలు అన్నీ పడ్డావ్. కేవలం నీ చదువుకు అయ్యే ఖర్చు భరించినందుకేనా లేక గతంలో ఏదైనా అంతకు మించి ఉందా అని కృష్ణని మురారి అడుగుతాడు. ఆ తర్వాత నా భర్త మీరే అని చెప్పలేక కేవలం మీరు నన్ను చదివించారన్న కృతజ్ఞత మాత్రమే అని కృష్ణ చెప్తుంది. మీరు చెప్పేది అబద్దమని మీ కళ్ళు చెప్తున్నాయి. ఈ చీర కట్టుకొని రండి అంటూ మురారి వెళ్ళిపోతాడు. మరొకవైపు కృష్ణ విషయం ఏం చెయ్యలేకపోతున్నానని మధు ఫీల్ అవుతుంటాడు. అప్పుడే రేవతి ఏడుస్తు వస్తుంది. ఇందాక అమెరికా ఫ్రెండ్ తో అక్క మాట్లాడింది, ముకుంద అంత చెప్తుందని ఫోన్ లో అంటుంది. అసలు ముకుంద ఏం చెప్తుందని రేవతి అంటుంది. పాపం కృష్ణ ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడే ఉంటుంది. ఇందాక పెద్దమ్మతో ముకుంద చెప్తుంటే నేను విన్నాను. కృష్ణకి ఆ రింగ్ మురారి తీసుకున్నాడంట అది చెప్తే ఎక్కడ మురారిని పెద్దమ్మ  తిడుతుందోనని కృష్ణ చెప్పలేదని మధు అంటాడు. ఇక ఏడుస్తుంటే ఏం ప్రయోజనం లేదు అసలు అమెరికా ఫ్రెండ్ తో ఏం మాట్లాడవని పెద్దమ్మని వెళ్లి అడుగని మధు అనగానే సరేనని రేవతి అంటుంది. మరొకవైపు అందరు కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కృష్ణ శకుంతల కూడా వస్తుంది. కృష్ణ మురారి కలిసి క్రాకర్స్ కాలుస్తుంటే ముకుంద చుడలేకపోతుంది. ఆ తర్వాత కృష్ణ కొంగుకి మంట అంటుకుంటుంది. వెంటనే మురారి మంట అర్పుతాడు. ఆ  తర్వాత కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతే మురారి ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. మరొక వైపు ఇంకా మురారి రావడం లేదు. గతం గుర్తుకు వచ్చిందా అని అందరు అనుకుంటారు. ఆ తర్వాత రేవతి, మధు రాగానే.. మురారి ఎక్కడ అని భవాని అడుగుతుంది. కాసేపు అయ్యాక వస్తనని అన్నాడని మధు చెప్తాడు. తరువాయి భాగంలో.. మీకు అలా జరిగినప్పుడు ఎందుకు మిమ్మల్ని కృష్ణ అన్నారని మురారి అంటాడు. మరొక వైపు ఎందుకు నాకు వేణి గారే గుర్తుకు వస్తున్నారని మురారి కోపంగా అంటాడు. మరి ఇలాంటి పరిస్థితులలో.. భవాని అమెరికా ప్లాన్ ని కృష్ణ అపగలదా? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శోభా శెట్టి ఎలిమినేటెడ్.. ఇదిగో ప్రూఫ్!

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా థీమ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది‌. అయితే ఇందులో సీరియల్ బ్యాచ్ అయిన అమర్ దీప్, ప్రియాంక, శోభాశెట్టి గ్రూప్ గా ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం శోభాశెట్టి ఎక్కడుంది? ఇదేం ప్రశ్న.. బిగ్ బాస్ హౌస్ లో అని అందరు అనుకోవచ్చు ‌ కానీ  అది ఎంత వరకు కరెక్ట్. అదేంటంటే‌.. తాజాగ ఈటీవీలో 'అలీతో ఆల్ ఇన్ వన్' షో కి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో శోభాశెట్టితో పాటు చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్ కూడా గెస్ట్ లుగా వచ్చారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు శోభాశెట్టి ఎలిమినేట్ అయి బయటకొచ్చిందా? డైరెక్ట్ ఈటీవీకి వెళ్ళిందా అంటు కామెంట్స్ చేస్తున్నారు. మరి శోభాశెట్టి నిజంగానే ఎలిమినేట్ అయిందా లేక టీఆర్పీ కోసం ఎప్పుడో షూట్ చేసిన ఎపిసోడ్ ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా అంటే.. అవుననే చెప్పాలి. ఎందుకంటే అలీతో జాలీగా అనే షో అప్పుడప్పుడో టెలికాస్ట్ చేసి టీఆర్పీ పెద్దగా రాకపోవడంతో అది ఆపేసారు‌. ఇప్పుడేమో అలీతొ ఆల్ ఇన్ వన్ అంటూ ఎప్పుడో షూట్ చేసిన ప్రోమోని వదిలారు. ఈ ప్రోమో చూసిన కొందరు.. శోభాశెట్టి ఎలిమినేట్ అయిందా.. అబ్బా ఎంత హ్యాపీగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ దానికి గొడవలు పెట్టుకుంటూ మిగిలిన హౌఅ్ మేట్స్ మీదకి నోరేసుకొని పడిపోయే శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలని గత నాలుగు వారాల నుండి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకేనేమో నామినేషన్ లో ఉన్న శోభాశెట్టి కి అసలు ఓటింగ్ రావట్లేదు. దీంతో ఈ వారం శోభాశెట్టి ఎలిమినేషన్ ఖాయంగా అనిపిస్తుంది. మరి శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందా లేదా చూడాలి మరి.అయితే ఈటీవీలోని అలీతో ఆల్ ఇన్ వన్ ప్రోమోలో ఉన్న శోభాశెట్టిని చూసి‌ అందరు షాక్ అవుతున్నారు.

Guppedantha Manasu : భర్తలో వచ్చిన మార్పుని భార్య కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -923 లో.. అనుపమ బ్యాగ్ తో రావడం చూసిన విశ్వనాథ్.. మమ్మల్ని వదిలేసి మళ్ళీ దూరంగా వెళ్తున్నావా అని అని అడుగుతాడు. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండి మిమ్మల్ని బాధపెట్టాను. నేను బాధపడ్డాను కానీ ఇప్పుడు ఇలా చెయ్యను. నాకు ఒక పని ఉంది. అది పూర్తి చేసుకొని వస్తానని విశ్వనాథ్ కి అనుపమ చెప్తుంది. ఎక్కడకి వెళ్తున్నావని విశ్వనాథ్ అడుగుతాడు. ఎక్కడకి అని తెలియదు. నాకేం చెయ్యాలని మాత్రమే తెలుసని అనుపమ చెప్తుంది. నీ కోడలు కూడా నీలాగా తయారైందని విశ్వనాథ్ అంటాడు. నీకు ఒకటి చెప్తున్నాను విను. నా జీవితం లాగా నీ జీవితం కాకూడదని ఏంజెల్ కి అనుపమ చెప్తుంది. మరొకవైపు ధరణి దగ్గరికి శైలేంద్ర కాఫీ తీసుకొని వచ్చి ఇక నుండి నిన్ను ఇబ్బందిపెట్టను. నేను మారిపోయాను నిన్న డాడ్ చెప్పినప్పటి నుండి బాగా అలోచించను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ విషయంలో చాలా తప్పు చేసానని శైలేంద్ర అంటాడు. మీరు నిజంగానే మారిపోయరా అని ధరణి ఆశ్చర్యంగా అంటుంది. నేను మారిపోయాను ఇక నుండి నిన్ను హ్యాపీగా చూసుకుంటానని శైలేంద్ర అనడం ఫణీంద్ర వింటాడు. శైలేంద్ర లో వచ్చిన మార్పు చూసిన ఫణీంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు దేవయాని విని నిజంగానే శైలేంద్ర మారిపోయాడా జీవించేస్తున్నాడా అని అనుకుంటుంది. ఆ తర్వాత దేవయాని దగ్గరికి ఫణీంద్ర వచ్చి.. ఏంటి అలా ఉన్నావని అడుగుతాడు. మీరు నిన్న నా గురించి ఎంత చెడుగా మాట్లాడారు. నేను గయ్యాళినే కానీ దుర్మార్గురాలిని కాదు కోపంగా మహేంద్రని అలా అన్నాను. తర్వాత సారీ చెప్పి ఇంటికి రమ్మని చెప్పానని దేవయాని నటిస్తుంది. నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అని దేవయానితో ఫణింద్ర అంటాడు.   మరొకవైపు అనుపమ అన్న మాటలు గుర్తుకు చేసుకొని మహేంద్ర బాధపడుతుంటాడు. ఆ ప్రెషర్ తట్టుకోలేక డ్రింక్ చెయ్యబోతుంటే అప్పుడే రిషి వసుధారలు వచ్చి ఆపుతారు. మీరు పోయిన అమ్మ గురించి అలోచించి నన్ను బాధపెడుతున్నారు. ఇంకా ఎప్పుడు తాగకండి అని రిషి నాపై ఒట్టు వెయ్యమని చెయ్యి తన తలపైన పెట్టుకుంటాడు. అప్పుడు మహేంద్ర ఎప్పుడు తాగనని రిషి పైన ఒట్టు వేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర ని రిషి హగ్ చేసుకుంటాడు. మీరు ఎప్పటిలాగా ఉండాలి. కాలేజీకీ రావాలని వసుధార మహేంద్రతో అంటుంది. మీరు కాలేజీకీ వస్తున్నారని రిషి అనగానే.. మహేంద్ర సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahamamudi : నటనలో ఆ ఇద్దరు అదుర్స్.. ఎమోషనల్ గా చిన్న కూతురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మమూడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -256 లో... కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తున్న విషయం తెలుసుకొని తనపై చెయ్యి చేసుకుంటుంది కనకం. ఆ తర్వాత కృష్ణమూర్తి రాగానే సైలెంట్ గా ఉండి, ఏం చెప్పదు కనకం. ఏమైందని అడిగిన కూడా తనలో తను బాధపడుతుంది కానీ అప్పు విషయం కృష్ణమూర్తికి కనకం చెప్పదు. మరొక వైపు అందరు టిఫిన్ చేస్తుంటే..  స్వప్న టిఫిన్ చెయ్యడానికి వచ్చి ఇందిరాదేవి ని చూసి ఎక్కడ అరుణ్ గురించి అడుగుతుందేమోనని బయపడి వెనక్కి పోతుంటే రుద్రాణి కావాలనే.. స్వప్నని టిఫిన్ చెయ్యడానికి పిలుస్తుంది. స్వప్న వచ్చి ఇందిరాదేవి చూసే చూపుని తట్టుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ వచ్చి టిఫిన్ చెయ్యడానికి కూర్చొని ఉంటాడు. నిన్న నన్ను ఇరికిస్తావా ఇప్పుడు నా నటన చూడు అని మనసులో అనుకుంటాడు. కళావతి ఇడ్లీ పెట్టు, చట్నీ వెయ్యి అంటూ అటు ఇటు తిరిగేలా చేస్తాడు రాజ్. ఇక వాళ్ళని చుసిన ఇంట్లో వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారని అనుకుంటారు. ఆ తర్వాత రాజ్ టిఫిన్ పూర్తి అయి హ్యాండ్ వాష్ కి వెళ్తాడు. ఇప్పుడు నా యాక్టింగ్ చూడండని కావ్య మనసులో అనుకుంటుంది. న్యాప్కీన్ కీ బదులు తన చీర కొంగుని పెడుతుంది కావ్య. అది చూడకుండా రాజ్ తన చెయ్యిని తుడుచుకోవడంతో.. కావ్య కావాలనే ఏంటి అండి అందరిముందు న్యాప్కిన్ ఇస్తున్నాను కాదా అని.. అనగానే ఇంట్లో అందరూ చూసి నవ్వుకుంటారు. అపర్ణ కోపంగా చూడడంతో ఇది మాములుగా ఇరికించలేదుగా అనుకుంటాడు రాజ్. మరొక వైపు అరుణ్ కి  స్వప్న ఫోన్ చేస్తుంది. రాహుల్ కి ఫోన్ చేసి స్వప్న ఫోన్ చేస్తున్న విషయం అరుణ్ చెప్తాడు.. నువ్వు లిఫ్ట్ చెయ్యకని రాహుల్ చెప్తాడు.  ఆ తర్వాత ఇందిరదేవి రావడం చూసి రాహుల్  నీ పర్ ఫామెన్స్ చూపించమని రుద్రాణి చెప్పి వెళ్ళిపోతుంది. రాహుల్ ఎదో బాధపడినట్లుగా.. అరుణ్ స్వప్న  కలిసి ఉన్న ఫోట్ చేస్తుంటాడు. ఆ తర్వాత కావాలనే రాహుల్ ఆ  ఫోటో కిందకి పడేసి వెళ్తాడు. అప్పుడు ఇందిరాదేవి వచ్చి.. ఆ ఫోటో చూసి రాహుల్ కి కూడా ఈ విషయం తెలిసి బాధపడుతున్నట్లున్నాడు. ఇంట్లో ఎవరికీ తెలియకముందే  ఈ విషయం రాజ్ కి చెప్పాలని ఇందిరాదేవి అనుకుంటుంది. మరొక వైపు అప్పు బాధపడుతుంటే కనకం వచ్చి.. తనపై చెయ్యి చేసుకున్నందుకు బాధపడుతుంది. ఆ తర్వాత నాకు తెలియకుండానే అతనిని ప్రేమించానని అప్పు చెప్తూ ఎమోషనల్ అవుతుంది.ఆ మరొక వైపు రాజ్ రావడం చూసిన కావ్య.. కావాలనే ఏదో బుక్ చూస్తూ స్టోరీని రాజ్ కీ వినిపించేలా చదువుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వీడియోలో మిమ్మల్నే చూసాను..

ఈ వీడియోలో నేను మిమ్మల్నే చూసాను శీను గారు అంటూ ఆరియానా గెటప్ శీను గురించి ఒక ఇంటరెస్టింగ్ కామెంట్ చేసింది. రకరకాల గెటప్స్ తో అలరిస్తూ ఎంటర్టైన్ చేసే  జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను ఇప్పుడు "రాజు యాదవ్" మూవీలో నటించాడు. ఈ మూవీ టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చౌరస్తా ఫేమ్ రామ్ మిరియాల" ఈ సాంగ్ ని పాడాడు. ఇక దీని మీద జబర్దస్త్ మిగతా కమెడియన్స్ అంతా గెటప్ శీను మూవీ పోస్టర్ ని వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిస్ లో పోస్ట్ చేసుకున్నారు. ఆరియానా కూడా అలాగే పోస్ట్ చేసుకుంది. "హలో గెటప్ శీను గారు..ఫస్ట్ సింగల్ రిలీజ్ అయ్యింది కదా హా అది చాలా బాగుంది..మీరు కూడా బాగున్నారు చూడడానికి.. ఆ సాంగ్ ట్రాక్ ని ఇప్పుడే చూసాను.. సాంగ్ సూపర్బ్ గా ఉంది, చాలా ఫీల్ ఉంది నేను మాత్రం మీ వీడియోలో మిమ్మల్నే చూసాను శీను గారు..ఆల్ ది వెరీ బెస్ట్..కంగ్రాట్యులేషన్స్" అంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ ఐన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జబర్దస్త్ నుంచో ఒక్కొక్కరిగా యాక్టర్స్, డైరెక్టర్స్ ఐపోతున్నారు. ఆల్రెడీ సుధీర్ హీరోగా మూవీస్ చేస్తున్నాడు ఇక సైడ్ క్యారెక్టర్స్ వేస్తున్న శీను ఇప్పుడు మూవీస్ వైపు ద్రుష్టి పెట్టాడు. ఇక వేణు డైరెక్టర్ అయ్యాడు..ఇలా ఎంతో మంది స్మాల్ స్క్రీన్ మీద సక్సెస్ ఐన వాళ్లంతా బిగ్ స్క్రీన్ మీద తన లక్ ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ రాజు యాదవ్ మూవీ ద్వారా కృష్ణమాచార్య డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ మూవీలో జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది కూడా వేరేవేరే రోల్స్ లో కనిపించబోతున్నారు.

ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం... యాంకర్ గా మంచు మనోజ్

"మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" అంటూ  రీసెంట్ గా టెలికాస్ట్ ఐన ఎపిసోడ్ మంచు మనోజ్ సంబంధించిన ఒక సీక్రెట్ ని సుమ, శ్రీముఖి బయట పెట్టారు. ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా మనోజ్ వచ్చేసరికి లేడీస్ అంతా కలిసి కాసేపు ఆడిపాడారు. మనోజ్ మూవీస్ లోని హిట్ సాంగ్స్ కి పండు మాస్టర్, శ్రీ సత్య, మానస్ డాన్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. తర్వాత సుమ వచ్చి ఆ సీక్రెట్ ని రివీల్ చేసింది " వెల్కమ్ తో యాంకర్ ఫామిలీ" అని మనోజ్ కి షాక్ హ్యాండ్ ఇచ్చింది. "త్వరలో ఈటీవీ విన్ లో కొత్త షో రాబోతోంది..ఆ షో హోస్ట్ చేయబోతున్న నీకు ముందుగా హార్టీ కంగ్రాట్యులేషన్స్ " అంటూ సుమ విష్ చేసింది. "యాక్చ్యువల్లి ఇండస్ట్రీలో  ఇంతమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నారు..కానీ మేల్ యాంకర్స్ చాలా తక్కువ..అందులోనూ మీరు ఇంత హ్యాండ్సం యాంకర్ గా వస్తే మా అమ్మాయిలకు పండగే పండగ" అని శ్రీముఖి గట్టిగానే క్రీం బిస్కెట్స్ వేసేసరికి మనోజ్ గా అబ్బబ్బ అన్నాడు... ఇక మనోజ్   "ఇంతమంది లేడీస్ ని ఇక్కడ ఒకేసారి చూసేసరికి బోయపాటి గారిని రిక్వెస్ట్ చేసి ఒక సినిమా కొట్టేయండి మాతో పాటు" అని అడగలనిపిస్తోంది అన్నాడు ఫన్నీగా..  మనోజ్ డైలాగ్ కి శ్రీముఖి మళ్ళీ వేసేసింది ఒక పంచ్ " సుమక్కా యాంకర్ కి ఉండాల్సిన టైమింగ్, స్పాంటేనిటీ, కామిక్ సెన్స్, హ్యూమర్ అన్నీ ఉన్నాయి" అనేసరికి " హే వేసేసింది..అమ్మా ముఖి " అంటూ నవ్వేసాడు మనోజ్...ఇక షో గురించి చెప్పాలంటూ శ్రీముఖి గారంగా అడిగేసరికి "ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం" అనే షోకి హోస్ట్ గా చేయబోతున్నట్టు చెప్పాడు మంచు మనోజ్...సెలబ్రిటీస్ తో టాక్ గేమ్ షో అంటే మాట్లాడుకుంటూ ఆడడం ఈ షో స్పెషల్. మరి యాంకరింగ్ పూర్తిగా నేర్చుకున్నారా అని శ్రీముఖి అడిగేసరికి "ఇంకా లేదు మదర్ ఆఫ్ ది  యాంకర్స్ ఆఫ్ ది యూనివర్స్ సుమ గారి నుంచి మిగతా యాంకర్స్ ని పాయింట్స్ అన్ని తీసుకెళదాం అని ఇక్కడికి వచ్చా" అని చెప్పాడు మనోజ్.

Shobha shetty Elimination : శోభాశెట్టి ఎలిమినేషన్..‌ఉల్టా పల్టా అయితే గౌతమ్ అవుట్!

బిగ్ బాస్ సీజన్-7 పదకొండవ వారం ముగింపుకి వచ్చింది. ఇక హౌస్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో యావర్ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ ర్యాకింగ్ లో ఉండగా.. సీరియల్ బ్యాచ్ లోని శోభాశెట్టి చివరి స్థానంలో ఉంది. మరి ఈ వారం బిగ్ బాస్ ట్విస్ట్ లు ఏం చేయకుండా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేస్తారా లేక ఉల్టా పల్టా అంటూ ఆ తర్వాత స్థానంలో ఉన్న గౌతమ్ కృష్ణని ఎలిమినేషన్ చేస్తారా అనే సస్పెన్స్ అందరిలో ఉంది.  అసలు నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో యావర్ ఈ వారం ' ది బెస్ట్ ప్లేయర్' అనిపించుకుంటున్నాడు. అమర్ దీప్ కి ఒకే ఒక గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది అందులో ఫెయిల్ అయ్యాడు. ఇక అశ్వగంధ (గౌతమ్ కృష్ణ) చెత్త కారణాలు చెప్తూ శివాజీని టార్గెట్ చేయడమే పనిపెట్టుకొని మరింత నెగెటివిటి సంపాదించుకుంటున్నాడు. అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ఇప్పటికే అందరికి ప్రేక్షకులకు అర్థం అయింది‌. దీంతో హౌస్ లో ఎలిమినేషన్ లో శోభాశెట్టి, గౌతమ్, అంబటి అర్జున్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తే గౌతమ్, అర్జున్ లలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేషన్ అవుతారు.  ప్రియాంక జైన్ ఆట ఆడకపోయిన ఓట్లు అధికంగానే పడుతున్నాయి. అయితే అంబటి అర్జున్- గౌతమ్ కృష్ణలకి చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతుంది. అసలు రెండు వారాలకే బయటకొస్తుందనకున్న అశ్వినిశ్రీ నాల్గవ స్థానంలో ఉంది.  రతిక కూడా సేవ్ జోన్ లో ఉంది. ఎందుకంటే రతిక గేమ్ ఆడకపోయిన కంటెంట్ క్రియేట్ చేయడం కోసం గట్టిగానే మాట్లాడుతుంది. ఇటు అశ్వినిశ్రీతో గుసగుసలు, అటు అంబటి అర్జున్ తో చెప్పుడు మాటలు చెప్తూ రతిక ఎంతో కొంత కంటెంట్ కోసం కష్టపడుతుంది. అయితే శోభాశెట్టి తన స్నేహితురాలైన ప్రియాంకకి పట్టం కట్టడానికి ఏకంగా శివాజీతోనే గొడవకి దిగింది.  అయితే ఈ వారం నమోదైన ఓటింగ్ లో శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారమైన కచ్చితంగా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేయాలని బిగ్ బాస్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.