అందాల రేసులో ఆరియానా గ్లోరీ... ఐ డోంట్ కేర్!

అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ  చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని  అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియాన చాలా బాధపడింది. అరియాన ఫ్రెండ్ అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్ళిన నుండి అతనికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు చేస్తోంది. అయితే ఈ మధ్యే తనని ఒక నెటిజన్ ఆంటీ అన్నాడని బాధపడుతూ వీడియో చేసింది. ఇప్పుడేమో బోల్డ్ లుక్  లోని రెండు ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. చాలామంది నేను ఇలా ఉన్నానని నన్ను జడ్జ్ చేస్తుంటారు. వాళ్ళేలా జడ్జ్ చేస్తారో ఐ డోంట్ కేర్. ఎవరేం అనుకున్నా నాకు నచ్చినట్టే నేనుంటాను అంటు ఈ పోస్ట్ కి ట్యాగ్ లైన్ కూడా రాసుకొచ్చింది అరియాన. రెండు ఫోటోలు అప్లోడ్ చేసిన అరియాన మొదటి ఫోటోలో కంటే రెండో దానిలో కూర్చొని దిగిన ఫోటోకి తెగ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ హౌస్‌లో శోభా శెట్టిని గన్‌తో కాల్చిన గౌతమ్!

బిగ్ బాస్ సీజన్-7 లో పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం ముగింపుకి వచ్చింది. ఇక గ్రాంఢ్ ఫినాలేకి కొన్ని వారాలే ఉండటంతో ఈ వారం చివరి కెప్టెన్ ఎవరా అని ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా  విడుదలైన ప్రోమోలో.. పన్నెండవ వారం హౌస్ లో కొత్త కెప్టెన్సీ కోసం " మెషిన్ గన్ టాస్క్ " ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గన్ షూటింగ్ సౌండ్ వచ్చిన ప్రతీసారీ రెండు ఫోటోలు ఎదురుగా ఉంటాయి. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మరొకరిని తీసేయాలని‌‌ బిగ్ బాస్ చెప్పాడు. శోభాశెట్టి, అంబటి అర్జున్ ఇద్దరి ఫోటోలు రాగా గౌతమ్ కృష్ణ తన సపోర్ట్ ని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. గౌతమ్ తో కంపేర్ చేస్తే శోభాశెట్టి అన్ ఫెయిర్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుందని అందుకే తీసేస్తున్నట్టుగా గౌతమ్ కృష్ణ అన్నాడు. అలా అనగానే శోభాశెట్టి అందుకుంది. నేనెక్కడ ఫౌల్ చేశాను, ఎక్కడ అన్ ఫెయిర్ గేమ్ ఆడానంటూ రెచ్చిపోతూ కన్పించింది‌. ఇక గౌతమ్, ప్రియాంక కలిసి ఏకాభిప్రాయంతో శోభాశెట్టిని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించినట్టు తెలుస్తుంది. ఇక ప్రియంక మరియు శోభాశెట్టి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఇక మరోసారి గన్ షూటింగ్‌ లో .. శివాజీ, ప్రశాంత్ ల ఫోటోలు రావడంతో అటు యావర్ కాల్చే వ్యక్తిగా ఉన్నాడు. నా ఫోటో కాల్చొద్దని నేనంటున్నా అని ప్రశాంత్ అనగా.. శివాజీ అన్న ఫోటో కాల్చాలా అని యావర్ అన్నాడు‌. ఇక ఇందులో ప్రశాంత్ ఫోటో కాలిపోతుందని తెలుస్తుంది.  అమర్ దీప్, అశ్వినిశ్రీ ఇద్దరి ఫోటోలు ఉండగా.. కాల్చడానికి శోభాశెట్టి, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇద్దరు కలిసి అశ్వినిశ్రీని తప్పించినట్టు తెలుస్తుంది. నా సపోర్ట్ ఎప్పుడు అమర్ దీప్ కి, అపోజిట్ గా ఎవరున్నా తీసేస్తానని శోభాశెట్టి గర్వంగా చెప్పింది. ఇక ప్రశాంత్ తన సపోర్ట్ అమర్ కే అని చెప్పగా.. నన్ను ఈ కెప్టెన్సీ రేస్ నుండి ఎవరు తీసేసిన ఒప్పుకుంటాను కానీ నువ్వు తీసేసావ్ చూడు అది నేను తీసుకోలేకపోతున్నాని అశ్వినిశ్రీ అంది. ఇక ఇదే చిట్ట చివరి కెప్టెన్సీ టాస్క్ కాబట్టి ఎవరు కెప్టెన్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది.

టాప్ ఓటింగ్ తో శివాజీ దూకుడు.. అట్టడుగున గౌతమ్, అంబటి అర్జున్!

బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ కి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. గతవారం ఫ్యామిలీ వీక్ లో కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి గట్టిగానే చెప్పారు. అప్పటి నుండి కంటెస్టెంట్స్ బాగా ఆడుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎవరు అనర్హులనే లిస్ట్ తీస్తే.. రతిక, గౌతమ్, అంబటి అర్జున్ లు ముందుంటారు. ఎందుకంటే రతిక వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం.. ల్యాగ్ చేయడం.. ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణ చేసే సిల్లీ నామినేషన్ వల్ల నెగెటివ్ అయ్యాడు. ఇక శివాజీని టార్గెట్ చేస్తూ ప్రతీ దానికి శివాజీనే ఫోకస్ చేసి నామినేషన్ చేయడం ఒకటైతే అంబటి అర్జున్ కన్నింగ్ ప్లాన్ ని గుర్తించకుండా అతనేం చెప్పిన నమ్మడంతో పాటుగా తన ఇండివిడ్యువల్ గేమ్ ని  మర్చిపోయాడు గౌతమ్.  అశ్వినిశ్రీ టాస్క్ లో పర్వాలేదనిపించిన ఒక్క గేమ్ విన్ అవ్వకపొవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్.. వీళ్ళు ముగ్గురు ఎక్కడికెళ్ళిన, ఏ గేమ్ అయిన కలిసే ఆడతారని అందరికి తెలిసిందే.  అయితే నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో శివాజీకి అత్యధిక ఓటింగ్ తో నెంబర్ వన్ ర్యాగింగ్ లో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. మూడవ స్థానంలో  అమర్ దీప్  ఉన్నాడు. ఇక చివరి స్థానాలలో రతిక, గౌతమ్, అంబటి అర్జున్ ఉన్నారు. అశ్వినిశ్రీ కి ఓటింగ్ బాగానే ఉంది. ఇక శోభాశెట్టి, ప్రియాంక నామినేషన్ లో లేకపోవడంతో వాళ్ళు సేఫ్ అయ్యారనే చెప్పాలి లేదంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళేవారు. శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వాలని బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గౌతమ్, అర్జున్ లు ఈ డబుల్ ఎలిమినేషన్ లో బయటకు వస్తారో లేక రతికని బయటకి పంపిచేస్తారా చూడాలి మరి.  

శివాజీని అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతుంది.  ఇందులో బిగ్ బాస్ భార్య హత్యకు గురైంది. బిగ్ బాస్ భార్యని హత్య చేసిన మర్డరర్ ఎవరో కనిపెట్టమని కంటెస్టెంట్స్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటికే ఉల్టా పల్టా ట్విస్ట్ లతో కంటెస్టెంట్స్ చేత ఒక ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో పది మంది ఉండగా అందులో శివాజీ ఒక్కడే తెలివితేటలతో, స్ట్రాటజీతో గెలుస్తున్నాడు. ఇక హౌస్ లోని వారికి ఒక్కో రోల్ ఇచ్చి ఆ పాత్రకి తగ్గట్టు చేయమని బిగ్ బాస్ కోరాడు. శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న వాళ్లని ఒక్కొక్కర్నీ మర్డర్ చేయమనగా మొదట పల్లవి ప్రశాంత్ ని డెడ్ చేసి విజయం సాధించాడు శివాజీ. ఆ తర్వాత గౌతమ్ ని డెడ్ చేయమనగా ఆ టాస్క్ ని ఇచ్చిన సమయంలో శివాజీ పూర్తి చేయలేకపోతాడు. ఇక ఆ బాధ్యతని ప్రియాంకకి ఇవ్వమని శివాజీతో బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీ ఎవరికి తెలియకుండా ప్రియాంకకి తన దగ్గర ఉన్న ఫోన్ ని ఇస్తాడు. " ఐ ఆమ్ డెడ్" అనే స్టిక్కర్ ని గౌతమ్ కి వేసి డెడ్ చేయాలని ప్రియాంకతో బిగ్ చెప్పాడు. అమర్ దీప్ , అంబటి అర్జున్ పోలీసులుగా ఉండి.. ఒక్కోక్కరి ఇంటరాగేషన్ చేసి హంతకులెవరో కనిపెట్టారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందని బిగ్ బాస్ పోలీసులైన అంబటి అర్జున్  , అమర్ దీప్ లని అడుగగా .. శివాజీ అని వాళ్లు చెప్పడంతో.. కారణాలేంటని శివాజీ అడిగాడు. ఎన్నడు లేనివిధంగా జోస్ అలుకాస్ రూమ్ లోకి వెళ్ళి పడుకొని శివాజీ కనిపించాడు. వాష్ రూమ్ కి, బయటకి ఎక్కువగా తిరిగాడు. అదీ కాక ప్రియాంకతో కలిసి చాణక్యుడులాగా ఏదో ప్లాన్ చేశాడని మాకు డౌట్ ఉందని అంబటి అర్జున్ చెప్పగా.. మీ డౌట్ నిజమే మర్డరర్ శివాజీనే అని బిగ్ బాస్ చెప్పాడు. కానీ అతను రెండు హత్యలకు మాత్రమే కారణం.. మిగిలిన రెండు హత్యలు చేసిన హంతకుడు మీ మధ్యలోనే ఉన్నాడని బిగ్ బాస్ వారితో చెప్పాడు. దాంతో అందరు షాక్ అయ్యారు. ఆ తర్వాత‌ పోలీసులు శివాజీని జైల్లో వేశారు. ఇక శివాజీని జైల్లో వేసారు పోలీసులు. మళ్ళీ ఒక్కొక్కరిని ఇంటారాగేట్ చేసిన అమర్ దీప్  , అంబటి అర్జున్ లకి ప్రియాంకే హంతకురాలని తెలుస్తుంది. ఎవరు హంతకులని బిగ్ బాస్ అడుగగా.. ప్రియాంక అని అనుకుంటున్నామని పోలీసులు చెప్పారు. ఏంటి రీజన్ అని ప్రియాంక అడుగగా. . ఆపిల్ మీద అలా రాసి ఉందని సీక్రెట్ రూమ్ దగ్గర ఫస్ట్ చూసింది నువ్వే. అక్కడ నీకేం పని, యావర్ ని ఇన్ ఫ్లూయన్స్ చేసి వాష్ రూమ్ దగ్గరికి పంపించావని కారణాలు చెప్పారు పోలీసులు. మీ అనుమానం నిజమే రెండవ మర్డరర్ ప్రియాంకే అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీ, ప్రియంక దగ్గర ఉన్న ఫోన్, గొలుసులని తీసుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లో ప్రశాంత్, అశ్వినిశ్రీ, గౌతమ్, యావర్ లు ఇప్పటివరకు టాస్క్ లో డెడ్ అయ్యారు.  

Guppedantha Manasu: గుప్పెడంత మనసులో హ్యాపీ డేస్.. అదే కారణం! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -928 లో.. వసుధార ఒంటరిగా అనుపమ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. ఏంటి అనుపమ.. మేడమ్ అలా మాట్లాడుతున్నారు. దేవయాని గారు ఏమైనా నా గురించి నెగెటివ్ గా చెప్పారా అందుకే అలా మాట్లాడారా.. అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే  అలాంటి ఉండకుండా చూసుకోవాలి. లేదంటే మా మధ్యలో విబేధాలు వస్తాయని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత వసుధార దగ్గరికి రిషి వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు. అనుపమ గారి గురించేనా అని అనగానే.. అవునని వసుధార అంటుంది. ఆవిడ రావడంతో డాడ్ లో మార్పు వచ్చింది. ఇన్నిరోజులు తెలియని ఇష్టాలు తెలిసాయి. అందుకే మేడమ్ ని వస్తూ ఉండమని చెప్పానని రిషి అంటాడు. మేడన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారో అని వసుధార అనగానే.. తన జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఉన్నాయో మనకి తెలియదు కదా అని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళ్తారు.  హాల్లో ఫోన్ చూస్తూ మహేంద్ర హ్యాపీగా ఉండడం చూసిన రిషి, వసుధార సంబరపడతారు. మీలో ఏదో మార్పు వచ్చిందని రిషి అనగానే.. లేదు ఎప్పటిలాగే ఉన్నానని మహేంద్ర అంటాడు. మరొకవైపు అనుపమకి దేవయాని ఫోన్ చేసి మాట్లాడుతుంది. అనుపమ మహేంద్రని కలిసిన విషయం చెప్తుంది. ఇక కావాలనే దేవయాని.. వసుధార పైన నెగెటివ్ ఇంప్రెషన్ రావాలని అనుకొని ఆ వసుధారతో జాగ్రత్త అని మరి మరి చెప్పగానే.. ఎందుకు అలా చెప్తున్నావ్ అని అనుపమ అడుగుతుంది. మరుసటి రోజు ఉదయం కాలేజీలో ఒక అబ్బాయి, అమ్మాయిని లవ్ చేస్తున్నానంటూ వెంటపడితే వసుధార ఆ అబ్బాయి చెంప పగులగొడుతుంది.  ఆ తర్వాత రిషి వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు ధరణి కాఫీ తీసుకొని వచ్చి ఫణింద్ర, దేవయాని, శైలేంద్రలకి ఇస్తుంది. శైలేంద్ర కాఫీ బాగుందంటూ ధరణిని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఇంట్లో ఒక పనిమనిషిని పెట్టించి..  ధరణి, శైలేంద్రలని బయటకు కొన్ని రోజులు ఎంజాయ్ చేయడానికి పంపిస్తున్నానని ఫణింద్ర దేవయానికి చెప్తాడు. ధరణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవయాని మాత్రం ఇప్పుడు ఎందుకని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బాయ్ ఫ్రెండ్ కి మసాజ్ చేసిన రతిక!

బిగ్‌ బాస్ సీజన్-7 లో ప్రతీవారం కొత్త టాస్క్ లతో మంచి కిక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ లో సీక్రెట్ టాస్క్ జరుగలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో..  సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారమంతా హౌస్‌లో జరిగిన మర్డర్ వెనుక మిస్టరీని ఛేదించే పనిలో అమర్ దీప్, అర్జున్ పోలీసులుగా తిరుగుతున్నారు. ఇక బిగ్‌బాస్ భార్యను హత్య చేసింది తానే అని తెలీకుండా శివాజీ తిరుగుతూ మరికొంతమందిని చంపాలి. బిబి మాన్షన్ మేనేజర్ గా శివాజీ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ప్రకారం.. మిసెస్ బిగ్ బాస్ ని చంపింది శివాజీ‌ కానీ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. శివాజీనే హంతకుడు అనే విషయం హౌస్ లో ఏ ఒక్కరికి తెలియదు. అంబటి అర్జున్, అమర్ దీప్ పోలీసులుగా ఉన్నారు. అశ్విని, శోభాలను పార్టీలో ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లుగా వ్యవహరించాలని, బ్రేకింగ్ న్యూస్ కోసం వెతుకుతూ ఇద్దరూ పోటీ పడాలని రోల్ ఇచ్చాడు. అలానే యావర్, ప్రియాంకలు బ్రదర్ అండ్ సిస్టర్లుగా సహాయకులని చెప్పాడు. ఇక రతికకి డ్రైవర్ రోల్ ఇచ్చాడు. ఇక తనని ప్రేమిస్తూ చుట్టూ తిరిగే తోటమాలి గెటప్‌లో గౌతమ్,  ప్రశాంత్‌కి వంటచేసేవాడిగా పాత్ర ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే ప్రశాంత్ చేసే ఏ వంట మిసెస్ బిగ్ బాస్ కి నచ్చేది కాదని చెప్పాడు బిగ్ బాస్. ఇక మర్డరర్ రతిక అని డౌట్ ఉందని బిగ్ బాస్ తో అంబటి అర్జున్, అమర్ దీప్ లు అనగా రతికని జైల్లో వేశాడు.‌ ఇక నిన్న టాస్క్ సమయం ముగిసాక హౌస్ లో కొన్ని గొడవలు వస్తున్నాయి. శివాజీకి తలనొప్పిగా ఉందని రతిక ఆయిల్ పెట్టి మసాజ్ చేసింది. ఇక అదే మంచి టైమ్ యావర్ ని ఆటపట్టిద్దామని గౌతమ్ కృష్ణ ప్లాన్ చేశాడు. రతిక నేను నీ లవర్ ని కదా నాకు మసాజ్ చేస్తావా అని అనగానే.. సరే దా చేస్తానని రతిక గౌతమ్ కి మసాజ్ చేసింది. అది చూసిన యావర్ ఫీల్ అయిననట్టు తెలుస్తుంది. ఇక చివర్లో.. జస్ట్ జోక్ మచ్చా, నిజంగా చేయమనలేదురా అని యావర్ తో గౌతమ్ అన్నాడు. మొత్తంగా యావర్-రతికల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే క్లారిటీ ప్రేక్షకులకు వచ్చేసింది.

Krishna Mukunda Murari : కృష్ణ గురించిన అసలు నిజం భవానికి తెలియనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -322 లో.. అమెరికా వెళ్లి త్వరగా రండి అని కృష్ణ అందరి ముందు మురారికి చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత కృష్ణ మాట్లాడిన దాని గురించి రేవతి, మధు ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్క ముంది మన తింగరి ఎంత దైర్యంగా మాట్లాడిందని మధుతో రేవతి అనగానే.. మరి మీ కోడలంటే ఏం అనుకున్నావని మధు అంటాడు. ఆ తర్వాత మురారికి గతం గుర్తుకు వస్తే బాగుండని మధు అనగానే.. ఎందుకని రేవతి అడుగుతుంది. ఎప్పటిలాగే కృష్ణ, మురారీలతో రీల్స్ చేసి డబ్బులు సంపాదించవచ్చని అంటాడు.. అప్పుడే కృష్ణ వచ్చి ఏసీపీ సర్ కీ గతం గుర్తుకు వచ్చి.. నా దగ్గరికి రావాలి కానీ ఏకంగా సినిమానే తియ్యచ్చని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ వంట చేస్తూ.. భవాని అత్తయ్య నన్ను నమ్మడం లేదు. పూర్తిగా భ్రమ లో ఉందని అనుకుంటుంది. అప్పుడే మురారి వచ్చి మీకు వంటలో హెల్ప్ చేస్తానని అంటాడు. ఆ తర్వాత కృష్ణ వంట చేస్తూ ఉంటే.. మురారికి వేడి ఆయిల్ చెయ్యిపై పడుతుంది. దాంతో కృష్ణ వెంటనే మురారి చేయికి ఆంటిమెంట్ రాస్తుంది. ఆ తర్వాత కృష్ణ తన చేతితో మురారికి భోజనం తినిపిస్తుంది. మురారి ఇంట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడని మధుని రేవతి అడుగుతుంది. మురారికి కృష్ణ భోజనం తినిపిస్తుంది అనగానే రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు మురారి దగ్గరికి ముకుంద వస్తుంది. కృష్ణ టాపిక్ మురారి తియ్యగానే ముకుందకి కోపం వస్తుంది. కృష్ణ ఏం తప్పు చెయ్యకపోతే ఈ ఇంట్లోకి రావడానికి ఎందుకు భయపడుతుందని ముకుంద అంటుంది. అయిన కృష్ణ తప్పు చేసిందంటే మురారికి నమ్మాలని అనిపించదు. మరొకవైపు కృష్ణ నందుతో మాట్లాడుతుంది. అమెరికాకి ఏసీపీ సర్ వెళ్తే గతం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత నా దగ్గరే ఉంటాడని నందుతో కృష్ణ చెప్తుంది. ఆ మాటలు భవాని వింటుంది. తరువాయి భాగంలో  కృష్ణ తన చిన్నాన్నని కలవడానికి వెళ్తు ఉంటే.. మురారి వచ్చి నేను వస్తానని అంటాడు. ఇప్పుడు ఏసీపీ సర్ తో వెళ్తే చిన్నాన్న అన్ని నిజాలు చెప్తాడు. ఏసీపీ సర్ మైండ్ డిస్టబ్ అవుతుందని కృష్ణ అనుకుంటుంది. మరొకవైపు భవాని వాళ్ళని చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahamamudi: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు.. భార్యపై భర్త ఆరోపణలు!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -261 లో.... స్వప్న తన నగలు అమ్మి అరుణ్ కి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటుంది‌. కాసేపటికి నగలు అన్ని బ్యాగ్ లో పెట్టుకొని బయలుదేరుతుంది స్వప్న. మరొక వైపు స్వప్న నగలు సర్దుకోవడం చూసి.. ఇప్పుడు నిన్ను ఇంట్లో నుండి పంపించడానికి ఆఫీషియల్ గా ఛాన్స్ ఇచ్చావని రాహుల్ అనుకుంటాడు. మరొక వైపు రాత్రి దొంగ కట్టిన కట్లు అలాగే ఉంచుకొని నిద్రపోయిన రాజ్, కావ్య ఇద్దరు నిద్రలేవగానే ఇబ్బంది పడుతారు.. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. అదేంటి అలా కట్లు కట్టుకున్నారని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య.. మీ అబ్బాయి గారే అని కావ్య అంటుంది.. ఆ తర్వాత ధాన్యలక్ష్మి కట్లు విప్పుతుంది. మరొక స్వప్న బ్యాగ్ తో వెళ్లడం చూసిన రుద్రాణి.. ఎక్కడికి వెళ్తున్నావ్? ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది. పార్లర్ కి వెళ్తున్నాను క్రీమ్స్ అన్ని అయిపొయాయి మళ్ళీ తెచ్చుకోవాలి కదా అందుకే ఈ బ్యాగ్ అని రుద్రాణితో చెప్పి స్వప్న కంగారుగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్వప్న ఎంత ఈజీగా అబద్ధం చెప్తుందోనని రుద్రాణితో రాహుల్ అనగానే.. అది ఏం చేస్తే మనకేంటి అది అరుణ్ కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఫొటోస్ కావాలని అరుణ్ కి చెప్పమని రాహుల్ తో చెప్తుంది. మరొకవైపు కృష్ణమూర్తి కుటుంబం టిఫిన్  చేస్తూ.. అప్పుకి  ప్రేమగా తినిపిస్తు  మాట్లాడతాడు. నువ్వు చేసింది తప్పని నేను అనడం లేదు. ఆ అబ్బయికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోయే ప్రయత్నం చేయమని ప్రేమగా అప్పుకీ చెప్తాడు కృష్ణమూర్తి. మరొక వైపు దుగ్గిరాల కుటుంబంలో.. కావ్య  టిఫిన్ తీసుకొని వచ్చి రాజ్ ని అటపట్టిస్తుంది. మరొక వైపు అరుణ్ ని స్వప్న కలిసి డబ్బులు ఇస్తుంది. ఇంకొకసారి ఇలా చెయ్యకంటూ అరుణ్ కి స్వప్న వార్నింగ్ ఇస్తుంది. మరొక వైపు ఇదంతా చేస్తుంది మనమేనని స్వప్నకి అరుణ్ చెప్తే పరిస్థితి ఏంటని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అప్పుడే రాహుల్ ఫోన్ కి అరుణ్ ఫోన్ కి స్వప్న డబ్బులు ఇస్తున్న ఫొటోస్ ని పంపిస్తాడు. ఆ ఫొటోస్ రుద్రాణికి రాహుల్ చూపిస్తాడు. దీంతో స్వప్న ఒక తిరుగుబోతుదని ఇంట్లో నుండి పంపిస్తానని రాహుల్ తో రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో..  స్వప్నని రుద్రాణి.. ఇంట్లో నుండి గెంటేయబోతుంటే కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. దాంతో డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది.. గుడ్ న్యూస్ స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు. తన బాయ్ ఫ్రెండ్ వల్లే ఆ కడుపు వచ్చిందని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణ పెళ్లి మురారీతో కాదు..!

ఇదేం ట్విస్ట్ రా మామా.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో మురారి పెళ్లి చేసుకుంది కృష్ణనే కదా.. మరి కాదంటే ఎలా అనుకుంటే పొరపాటే. అసలు విషయం ఏంటంటే సీరియల్ లో కృష్ణ పాత్రని చేస్తున్న ప్రేరణ కంబం పెళ్లి నిన్న జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇన్ స్ట్రాగ్రామ్ లోని కృష్ణ ముకుంద మురారి పేజీలో షేర్ చేసారు. కాగా ఇప్పుడు కృష్ణ పెళ్ళి ట్రెండింగ్ లో ఉంది. స్టార్ మా సీరియల్స్ లో టాప్-5 లో కృష్ణ ముకుంద మురారీ సీరియల్ ఒకటి. ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సీరియల్ లో మొదట విదేశాలలో ముకుంద, మురారి ఇద్దరు ప్రేమించుకుంటారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు ఇండియాకి వచ్చేస్తారు‌. అయితే ముకుంద, మురారి ఇద్దరికి వేరు వేరు వ్యక్తులతో పెళ్ళి జరుగుతుంది. ముకుంద పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు మురారి సోదరుడు ఆదర్శ్ నే.. ఇదే అసలు ట్విస్ట్ . ఇక పెళ్ళి జరిగిన మరుసటి రోజునే ఆదర్శ్ మిలటరీలోకి వెళ్లిపోతాడు. ఇక ఆదర్శ్ కోసం ఎదురు చూడకుండా మురారిని ఎలాగైనా దక్కించుకోవాలని ముకుంద ప్రయత్నిస్తుంటుంది‌‌. ఇక మురారి పెళ్లి చేసుకున్న కృష్ణ.. అమాయకురాలు, తింగరిది. అయితే పెళ్ళికి ముందు ముకుంద మురారి ప్రేమించుకున్నారని కృష్ణకు తెలుస్తుంది. కానీ కృష్ణని మురారి పెళ్ళి చేసుకున్నాక తన ప్రేమలో పడతాడు  మురారి. అయుతే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్స్ లలో... మురారికి యాక్సిడెంట్ అయి మొహం పాడయిందని ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. దాని తర్వాత అతనికి గుర్తుకు రాడు. ఇక గతం గుర్తుచేపించడనానికి అమెరికాకి పంపిస్తున్నట్టుగా భవాని చెప్తుంది. శ్రీపధ్ దేష్ పాండే, ప్రేరణ కంబం ల పెళ్లి ఫోటో, వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది.  అయితే బుల్లితెరపై ఆన్ స్క్రీన్ పై కృష్ణ మురారి ల జంట ఎంత హిట్టో అందరికి తెలిసిందే. అయితే బయట ఆఫ్ స్క్రీన్ లో ప్రేరణ, శ్రీపధ్ లు ఒక్కటయ్యారు. కాగా ఈ సీరియల్ అభిమానులు కొత్త జంటకి కంగ్రాట్స్ చెప్తున్నారు.  

రతిక కొత్త ప్రేమాయణం.. మరీ ఇంతలా చేయాలా?

బిగ్‌ బాస్ సీజన్-7 లో ప్రతీవారం కొత్త టాస్క్ లతో మంచి కిక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ లో సీక్రెట్ టాస్క్ జరుగలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో..  సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారమంతా హౌస్‌లో జరిగిన మర్డర్ వెనుక మిస్టరీని ఛేదించే పనిలో అమర్ దీప్, అర్జున్ పోలీసులుగా తిరుగుతున్నారు. ఇక బిగ్‌బాస్ భార్యను హత్య చేసింది తానే అని తెలీకుండా శివాజీ తిరుగుతూ మరికొంతమందిని చంపాలి. బిబి మాన్షన్ మేనేజర్ గా శివాజీ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ప్రకారం.. మిసెస్ బిగ్ బాస్ ని చంపింది శివాజీ‌ కానీ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. శివాజీనే హంతకుడు అనే విషయం హౌస్ లో ఏ ఒక్కరికి తెలియదు. అంబటి అర్జున్, అమర్ దీప్ పోలీసులుగా ఉన్నారు. అశ్విని, శోభాలను పార్టీలో ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లుగా వ్యవహరించాలని, బ్రేకింగ్ న్యూస్ కోసం వెతుకుతూ ఇద్దరూ పోటీ పడాలని రోల్ ఇచ్చాడు. అలానే యావర్, ప్రియాంకలు బ్రదర్ అండ్ సిస్టర్లుగా సహాయకులని చెప్పాడు. ఇక రతికకి డ్రైవర్ రోల్ ఇచ్చాడు. ఇక తనని ప్రేమిస్తూ చుట్టూ తిరిగే తోటమాలి గెటప్‌లో గౌతమ్,  ప్రశాంత్‌కి వంటచేసేవాడిగా పాత్ర ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే ప్రశాంత్ చేసే ఏ వంట మిసెస్ బిగ్ బాస్ కి నచ్చేది కాదని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అమర్ దీప్, అంబటి అర్జున్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేసేది హిలేరియస్ గా అనిపించింది. ఇక రతికని గౌతమ్ దొంగచాటుగా చూస్తూ ప్రేమించాలని బిగ్ బాస్ చెప్పగా.. ఏకంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు గౌతమ్. రతిక పాప బుగ్గ గిల్లేశాడు గౌతమ్. నేను ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే ఇట్ల కన్ను కొడతానంటూ రతిక కన్ను కొట్టింది. మళ్లీ కొట్టు.. మంచిగ కొట్టినవులే అంటూ గౌతమ్ సిగ్గుపడిపోయాడు. నాకు ఈరోజు రోజా పువ్వు తేలేదా అంటూ రతిక అడుగగా.. నువ్వే రోజ్ పువ్వు లెక్కన ఉన్నావ్ కదే.. నీకు రోజ్ ఎందుకే అంటూ ఇద్దరూ ప్రేమ ముచ్చట్లలో మునిగిపోయారు. ఇది చూసిన మేనేజర్ శివాజీ.. బాబు అలా చేయకూడదంటూ రతికని పక్కకి తీసుకెళ్ళాడు. ఇక అమర్ దీప్ ని జామ కాయలు దొంగతనం చేసుకొని తినేవాడివని శివాజీ అనడం అంతా ఫుల్ ఫన్ ఎపిసోడ్ గా నిలిచింది.

Krishna Mukunda Murari: అవును వాళ్ళిద్దరు ఒక్కటయ్యారు.. పెద్దమ్మ చూసేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -321 లో.. రేవతిని భవాని పిలిచి.. మళ్ళీ ఆ కృష్ణ ఏదో ప్లాన్ చేస్తుందట, ముకుందతో త్వరగా అమెరికా వెళ్ళండని చెప్తుందట, ఎందుకని అడుగగానే.. రేవతి షాక్ అవుతుంది. ఏమో తెలియదు. కృష్ణ మాకేం చెప్పలేదని రేవతి, మధు చెప్తారు. ఆ తర్వాత కోర్ట్ హియరింగ్ ఉందేమో.. ఎక్కడ వాళ్ళ తప్పు తెలిసిపోతుందని ఇలా చేస్తుందేమో.. దాని గురించి నేనే కనుక్కుంటానని భవాని చెప్తుంది. మరొకవైపు కృష్ణ అన్న మాటలు మురారి గుర్తుకు చేసుకొని.. ఒక్క రోజు కూడా కృష్ణని చూడకుండా ఉండలేకపోతున్న అమెరికాకి వెళ్తే ఎన్ని రోజులు పడుతుందోనని మురారి అనుకుంటాడు. మరొక వైపు శకుంతలతో కలిసి కృష్ణ భోజనం చేస్తుంటుంది. వంటలు చాలా బాగున్నాయంటూ కృష్ణ తింగరి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే.. రేవతి మధు, నందు, గౌతమ్ అక్కడికి వస్తారు. వాళ్ళు మురారిని ఎందుకు త్వరగా అమెరికా పంపించాలని చూస్తున్నావని  కృష్ణ పై కోపంగా ఉంటే.. కృష్ణ సరదాగా మాట్లాడుతుంది‌. రేవతికి మరింత కోపం వస్తుంది. కాసేపటికి మురారిని కృష్ణ అమెరికా ఎందుకు వెళ్ళమని అంటుందోనని చెప్తుంది. మురారి అమెరికా వెళ్తే గతం గుర్తుకు వస్తుంది.  ఇప్పుడు గతం గుర్తుకు రాకుండానే నాకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత గతం గుర్తుకు వస్తే మురారి నాతోనే ఉంటాడు కదా అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు ముకుంద దగ్గరికి మురారి వెళ్తాడు. ముకుంద మనం అమెరికా నుండి రావడానికి ఎంత టైమ్ పడుతుందని అనగానే.మ ఎవరు అడగమన్నరు కృష్ణనా అని ముకుంద అనగానే కృష్ణనే నన్ను వెళ్లమని చెప్పిందిని మురారి చెప్తాడు. మరొక వైపు కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. భవాని దగ్గరికి తీసుకొని వెళ్తాడు. "నాకు ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ తో కృష్ణ మాట్లాడుతుంది. ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని కృష్ణ వాళ్ళు మాట్లాడుకుంటారు నెంబర్ ఇవ్వండి" అని భవానితో మురారి అనగానే.. నెంబర్ క్రిమినల్ కి ఇస్తే ఎలా అని, ఇవ్వను ఆ నెంబర్ కాన్ఫిడెన్శియల్ అని భవాని చెప్తుంది. ఆ తర్వాత త్వరగా రండి అని మురారికి  కృష్ణ చెప్పి వెళ్లిపోతుంది. తరువాయి భాగంలో‌‌.. మురారికి కృష్ణ అన్నం తినిపించడాన్ని భవాని చూస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

Amardeep Eliminated: అమర్ దీప్ ఎలిమినేటెడ్.. గాయం కారణంగా బయటకు!

ఈ సీజన్-7 లో.. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ల కంటే కంటెస్టెంట్స్ చేస స్ట్రాటజీలు నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి‌. నిన్న మొన్నటి దాకా ఫ్యామీలీ వీక్ లో ఎమోషనల్ ఎపిసోడ్ లుగా మలచడంలో బిగ్ బాస్ ప్రోమోలతో ఆకర్షించగా, కంటెస్టెంట్స్ ఏడ్చేస్తూ సెంటిమెంట్ తో పిండేశారు. మూడు వారాల క్రితం శివాజీ చేతికి గాయం కారణంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకున్నారంతా కానీ ఇప్పుడు ఆ సిచువేషన్ అమర్ దీప్ కి వచ్చింది. ఎందుకంటే హౌస్ లో జరుగుతున్న టాస్క్ లో అమర్ దీప్ అస్వస్థతకు గురయ్యాడంట. అందుకే అతడిని మెడికల్ రూమ్ కి తీసుకెళ్ళారంట బిగ్ బాస్ యాజమాన్యం. హెల్త్ చెకప్ చేసి సెలైన్ కూడా పెట్టారంట.‌ హౌస్ లో ఇప్పటి వరకు పెట్టిన అన్ని టాస్క్ లలో ఒకటి, రెండు గేమ్ లు మినహా దాదాపు అన్నింట్లో ఫౌల్ గేమ్స్ ఆడాడు. ప్రతీవారం నాగార్జున వార్నింగ్ ఇవ్వడం, ఇకనుండి రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పడం.. ఇలా ప్రతీవారం జరుగుతుంది. ఫిజికల్ టాస్క్ లు ఆడే అమర్ దీప్ కి మెంటల్ గేమ్స్ ఆడలేడని ఇప్పటికే తేలిపోయింది. సీరియల్ బ్యాచ్ లో ప్రియాంక, శోభాశెట్టి ఇద్దరు ఏది చెప్తే అదే ఫాలో అవుతూ నెగెటివిటి తెచ్చుకున్న అమర్ దీప్.. ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా వరకు మారాడు. తనే సొంతంగా డెసిషన్ తీసుకుంటున్నాడు. అయితే ప్రతీ టాస్క్ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి డిస్కషన్ చేసుకోవడం, మాట జారడంతో  ప్రేక్షకుల దృష్ణిలో నెగెటివ్ అవుతున్నాడు అమర్ దీప్. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం అమర్ దీప్ ఫిజికల్ గా ఏదో ప్రాబ్లమ్ అని తెలిసింది. ఒకవేళ అమర్ దీప్  నిజంగానే ఆడలేని స్థితిలో ఉంటే వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు బిగ్ బాస్. ఎందుకంటే ఇంకా మిగిలింది నాలుగు వారాలే‌. టికెట్ టూ ఫినాలే రేస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మాత్రమే వెళ్తారనే విషయం తెలిసిందే. ఇప్పటిదాకా అమర్ దీప్ టాప్-5 లో ఉంటాడని అనుకున్నారంతా కానీ ఇలా టాస్క్ లో ఓవర్ అగ్రెసివ్ అవుతూ గాయాల పాలవ్వుతున్నాడు అమర్ దీప్. అయితే ఇప్పుడు అమర్ దీప్ ఎలిమినేటెడ్ అంటూ వార్తలు వైరల్ గా మారాయి.

హత్యలు చేస్తున్న శివాజీ...జైలుకెళ్ళిన రతిక!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతుంది.  ఇందులో బిగ్ బాస్ భార్య హత్యకు గురైంది. బిగ్ బాస్ భార్యని హత్య చేసిన మర్డరర్ ఎవరో కనిపెట్టమని కంటెస్టెంట్స్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటికే ఉల్టా పల్టా ట్విస్ట్ లతో కంటెస్టెంట్స్ చేత ఒక ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో పది మంది ఉండగా అందులో శివాజీ ఒక్కడే తెలివితేటలతో, స్ట్రాటజీతో గెలుస్తున్నాడు. ఇక హౌస్ లోని వారికి ఒక్కో రోల్ ఇచ్చి ఆ పాత్రకి తగ్గట్టు చేయమని బిగ్ బాస్ కోరాడు. శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న వాళ్లని ఒక్కొక్కర్నీ మర్డర్ చేస్తూ రావాలి. అయితే ఈ టాస్క్ లో మొదటగా పల్లవి ప్రశాంత్ ని స్టోర్ రూమ్ లో ఉండమన్నాడు శివాజీ. ఆ తర్వాత ప్రశాంత్ మొక్కను తీసుకొని పోస్ట్ బాక్స్ లో పెట్టి‌న శివాజీ సీక్రెట్ టాస్క్ ని గెలిచాడు. ఇలా టాస్క్ లో ప్రశాంత్ ని హత్య చేసిన శివాజీ మొదటి టాస్క్ లో విజేతగా నిలిచాడు.  అమర్ దీప్ , అంబటి అర్జున్ పోలీసులుగా ఉండి.. ఒక్కోక్కరి ఇంటరాగేషన్ చేసి హంతకులెవరో కనిపెట్టారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందని బిగ్ బాస్ పోలీసులైన అంబటి అర్జున్  , అమర్ దీప్ లని అడుగగా .. రతిక అని వాళ్లు చెప్పడంతో రతికని జైల్లోకి తీసుకెళ్ళారు పోలీసులు.

Guppedantha Manasu: ఇంటికి రాకని అనుపమకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -927 లో.. జగతి ఫోటో మహేంద్ర చూస్తు.. అనుపమ అన్న మాటలు గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే రిషి వచ్చి.. మీ ఫ్రెండ్ ని అలా వదిలేసి వచ్చారని అడుగుతాడు.. తన మాటలు చాలా బాధగా ఉన్నాయి. అందుకే అని మహేంద్ర అంటాడు. మీరు ఎందుకో ఆవిడా నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పాలా అని రిషి అనగానే.. వద్దని మహేంద్ర చెప్తాడు. మరి వెళ్ళండి అక్కడికి అని రిషి చెప్తాడు. మరోకవైపు  వసుధార గురించి దేవయాని చెప్పిన మాటలు అనుపమ గుర్తుకు చేసుకొని.. నువ్వు ఇప్పుడు ఎండీ కదా? ఆ పదవి అంటే చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. అనుభవం ఉండాలి. మరి ఇంత చిన్న ఏజ్ లో ఆ స్టేటస్ కి వచ్చావంటే గ్రేట్ అని అనుపమ అనగానే.. నేను రాలేదు రిషి సర్ నన్ను కూర్చోపెట్టారని వసుధార అంటుంది. నీ కంటే ముందు ఎండీగా ఎవరున్నారని అనుపమ అడుగుతుంది. జగతి మేడమ్ ఉన్నారని వసుధార చెప్పగానే.. అనుపమ డౌట్ గా చూస్తూ నువ్వు  డబ్బుకు  ప్రాముఖ్యత ఇస్తావా?  హోదాకి ప్రాముఖ్యత ఇస్తావా అని అడుగుతుంది. అవి రెండు కాదు ప్రేమకు ప్రాముఖ్యత ఇస్తానని వసుధార చెప్తుంది. ఈవిడేంటి ఇలా అడుగుతుందని వసుధార తన మనసులో అనుకొని..  మీరు నా గురించి ఏం అనుకున్న పర్వాలేదు.  మీరు జగతి మేడన్ ఫ్రెండ్‌. నేను మేడమ్ ని ఎలా చూస్తానో, మిమ్మల్ని అలానే చూస్తానని వసుధార అంటుంది.. ఈ అమ్మాయి చాలా తెలివిగలదని అనుపమ అనుకుంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. అనుపమకి ఇష్టమైన వంటలు వసుధారకి చెప్పి ప్రిపేర్ చెయ్యమని చెప్తాడు. మరొకవైపు వంట చేస్తున్న ధరణి దగ్గరికి శైలేంద్ర వచ్చి.. తనతో ప్రేమగా మాట్లాడుతాడు. అది చూసి ధరణి మురిసిపోతుంది. ఆ తర్వాత ధరణికి శైలేంద్ర చీర గిఫ్ట్ గా ఇస్తాడు. అలా శైలేంద్ర ప్రేమగా మాట్లాడుతుంటే ధరణి ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు రిషి, వసుధార, అనుపమ మహేంద్ర అందరు కలిసి భోజనం చేస్తుంటారు. అనుపమ, మహేంద్ర తమ కాలేజీ డేస్ లో చేసిన చిలిపిపనులు గుర్తుకు చేసుకుంటారు. వాళ్ళిద్దరిని రిషి గమనిస్తుంటాడు. ఆ తర్వాత మీ హస్బెండ్ ఏం చేస్తారని వసుధార అనగానే.. అనుపమ సైలెంట్ అవుతుంది. కాసేపటికి  అనుపమ వెళ్లిపోతు.. ఇందాక నువ్వు ఒక్కటి అడిగావు కదా? నేను పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగా ఉన్నాను. జగతి పెళ్లి చేసుకోని ఒంటరిగా ఉంది. నేను చేసుకోక ఒంటరిగా ఉన్నానని అనుపమ అనగానే.. " అనుపమ.. నువ్వు ఇంకొకసారి ఇక్కడికి రాకు" అని మహేంద్ర కోప్పడి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత డాడ్ మాటలు పట్టించుకోకండి వస్తూ ఉండండి అని రిషి అనగానే.. వస్తాను, నువ్వు ఒక పని చెప్పావ్ కదా మీ డాడ్ ని జగతి బాధ నుండి బయటకు తీసుకొని రమ్మని చెప్పావ్ కదా? మిమ్మల్ని చూడడానికి వస్తానని అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: కన్నపేగు బంధమే.. దొంగ అంత పని చేశాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -260 లో.. కనకం నిద్రలో ఒక కల కంటుంది. అప్పు గదిలోకి కనకం వెళ్ళి చూసేసరికి అప్పు సుసైడ్ చేసుకున్నట్లు కల కంటుంది. దాంతో ఒక్కసారిగా‌ కనకం నిద్ర నుండి ఉలిక్కిపడి లేవగానే.. ఏంటి అని కృష్ణమూర్తి అడుగుతాడు. ఆ తర్వాత కనకం అప్పు గదిలోకి వెళ్తుంది. కనకం వెళ్లేసరికి అప్పు తన గదిలో ఉండదు. దాంతో కనకానికి  ఇంకా టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత కనకం ఇంట్లో చుసి బయటకు వస్తుంది. అప్పు బయట బాధపడుతు ఉండడం చూసి.. ఇక్కడ ఎందుకు ఉన్నావని కనకం అడుగుతుంది. నాకు ఇక్కడ ఉండే స్వేచ్చ కూడా లేదా అని అప్పు అనగానే.. నీకు ఎప్పుడు స్వేచ్ఛ ఇచ్చాను. అబ్బాయిలతో ఫ్రెండ్ షిప్ చేసినా, వాళ్ళతో తిరిగినా, నీకు ఎప్పుడు అడ్డుచెప్పలేదని కనకం అనగానే.. అడ్డు చెప్పిన బాగుండేది. ఇప్పుడు నాకు ఈ సిచువేషన్ రాకపోయేదేమోనని అప్పు అంటుంది. ఆ తర్వాత అప్పుని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది కనకం. నేను నీ దగ్గర పడుకుంటానని కనకం చెప్తుంది. కావ్య ఉంటే నన్ను కష్టపెట్టేది కాదని అన్నాను కదా? నువ్వు బాధపడ్డావా అని కనకం అడుగుతుంది. లేదు అక్క అంటే నాకు ఇష్టం. ఎందుకు బాధపడుతానని అప్పు అంటుంది. కానీ నువ్వు నువ్వు నా పక్కన ఉంటే దైర్యంగా ఉంటుంది. ఒక కొడుకులాగా నన్ను ఎప్పుడు వదిలి వెళ్లొద్దని కనకం అనగానే.. అప్పు ఎమోషనల్ అయి కనకాన్ని హత్తుకొని ఏడుస్తుంది. మరొకవైపు రాజ్ కావ్య పడుకున్నాక వారి గదిలోకి దొంగ వస్తాడు. రాజ్ కావ్యల కాళ్ళు చేతులు కట్టివేస్తాడు ఆ దొంగ. ఆ తర్వాత ఇద్దరికి మెలుకువ వస్తుంది. వచ్చిన తర్వాత దొంగని చూసి ఇద్దరు బయపడతారు‌‌. దొంగ అన్నయ్య అంటూ కావ్య మాట్లాడేసరికి.. నన్ను ఇంతవరకు ఎవరు ఇలా పిలువలేదు. నా దొంగ చెల్లి అంటూ ఆ దొంగ అంటాడు‌. కాసేపు కావ్య, ఆ దొంగ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రాజ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత రాజ్ కావ్యల కట్లు విప్పకుండానే దొంగ వెళ్ళిపోతాడు. మరొకవైపు పది లక్షలు ఎవరిని అడగాలి. అరుణ్ డబ్బులు తీసుకొని రమ్మని లొకేషన్ కూడా షేర్ చేసాడని స్వప్న టెన్షన్ పడుతుంది. నగలు తాకట్టు పెడతా ఇంట్లో వాళ్ళు నగలు ఎక్కడ అంటే రాహుల్ పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకీ ముందు నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తు రాహుల్ దొరికిపోయాడు కదా.. రాహుల్ తీసుకొని వెళ్ళిపోయాడని అబద్దం చెప్పొచ్చని స్వప్న అనుకుంటుంది. అదంతా రాహుల్ విని షాక్ అవుతాడు. తరువాయి భాగంలో అరుణ్ ని స్వప్న కలిసిన విషయం రాహుల్ ఇంట్లో అందరికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు  ఆగాల్సిందే.

రతికకు గట్టిగా ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. షాకైన గౌతమ్!

వాడిని అనవసరంగా వదిలేసారురా.. మడతబెట్టాల్సింది. ఇది గౌతమ్ కృష్ణతో అంబటి అర్జున్ అన్న మాట. హౌస్ లోకి వచ్చేకంటే ముందే అందరి ఆట చూసి గట్టిగ ప్లాన్ చేసుకొని వచ్చాడు అంబటి అర్జున్. అందుకే హౌస్ లోకి వచ్చిన నుండి కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. మొదటి వారం అమర్ దీప్ ని నామినేట్ చేసి సీరియల్ బ్యాచ్ కి వ్యతిరేకం అన్నట్టు కలరింగ్ ఇచ్చి.. ఇక హౌస్ లో కొన్ని వారాలే మిగిలిందని శివాజీ, ప్రశాంత్, యావర్ లని టార్గెట్ చేశాడు అంబటి అర్జున్. ఇక ప్రతీవారం వీళ్ళ ముగ్గిరినే టార్గెట్ చేస్తూ గౌతమ్ కృష్ణకి లేనిపోనివి కల్పించి చెప్పి అతని మైండ్ ని పొల్యూట్ చేశాడు అర్జున్. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణకి ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో? ఎవరు సేఫ్ గేమ్ అవుతున్నారో అర్థం కాక అంబటి అర్జున్ ని అన్న అన్న అంటు అతనేం చెప్పిన గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. దీంతో హౌస్ లో వీళ్ళిద్దరి ప్రవర్తన వల్ల వీరిద్దరికి నెగెటివిటి బాగా పెరిగింది. హౌస్ లోకి  రైతుబిడ్డగా ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రతీ టాస్క్ లో తన వంద శాతం ఇస్తున్నాడు. టాస్క్ అంటే ప్రాణం పెట్టి ఆడుతానంటూ పల్లవి ప్రశాంత్ చాలాసార్లు చెప్పాడు.. చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన రేస్ లో బ్యాలెన్సింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హౌస్ మేట్స్ అంతా పోటీ పడ్డారు. ఒక స్టాండ్ కి ముందు భాగంలో  టేబుల్ మీద మొదట ఒక ప్లేటు, తర్వాత సాసర్, చిన్న కప్, పెద్ద ప్లేట్ అని బిగ్ బాస్ చెప్పిన విధంగా పేర్చుకుంటూ రావాలి. ఇది గేమ్ అని ఇందులో గెలిచిన వారిదే ఎవిక్షన్ పాస్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాస్క్ మొదలైన కొద్ది సమయానికి శోభాశెట్టి అవుట్ అయింది. ఆ తర్వాత అమర్ దీప్, శివాజీ, అంబటి అర్జున్, యావర్, రతిక ఇలా వరుసగా అవుట్ అయ్యారు. ఇక చివరగా అశ్వినిశ్రీ, ప్రియంక, పల్లవి ప్రశాంత్ ఉండగా.‌. అశ్వినిశ్రీ అవుట్ అయింది. కాసేపటికి ప్రియాంక అవుట్ అయింది. పల్లవి ప్రశాంత్ ఒక్కడే మిగిలాడు. కాసేపటికి " ఉడతా ఉడతా ఊచ్" పాటని పల్లవి ప్రశాంత్ ని పాడమ్మన్నాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచి ఎవిక్షన్ పాస్ ని పల్లవి ప్రశాంథ్ సొంతం చేసుకున్నాడని బిగ్ బాస్ చెప్పేదాకా ఆ బ్యాలెన్స్ ని అలాగే కంటిన్యూ చేశాడు పల్లవి ప్రశాంత్.‌ ఎవిక్షన్ పాస్ టాస్క్ ముందు నామినేషన్ లో.. ఇటుకల టాస్క్ లో ఎన్ని ఇటుకలు తెచ్చావ్? అసలేం ఏం ఆడావని రతిక అన్న ప్రశ్నకి నోటితో చెప్పకుండా ఎవిక్షన్ పాస్ గెలిచి చూపించాడు ప్రశాంత్. అలాగే గౌతమ్ చేసిన సిల్లీ నామినేషన్..  గతవారం జరిగిన టాస్క్ లో శోభాశెట్టి, ప్రశాంత్ ఇద్దరు సంఛాలకులుగా ఉండగా ప్రశాంత్ సంఛాలకుడిగా ఫెయిల్ అయ్యాడని గౌతమ్ నామినేట్ చేశాడు.‌ అతని ప్రశ్నకి ఆడి గెలిచి చూపించాడు ప్రశాంత్. ఇక ప్రశాంత్ గెలిచాక శివాజీ వెళ్ళి హత్తుకొని.. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా నువ్వు అంటూ‌ శివాజీ‌ అన్నాడు.

పల్లవి ప్రశాంత్ పెళ్ళి స్టోరీ.. ఫోటోస్ వైరల్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి కారణం కంటెస్టెంట్స్ ఆటతీరు, మాటతీరు బాగుండటమే. అయితే బిగ్ బాస్ ఇచ్చే ఉల్టా పల్టా ట్విస్ట్ లకి కంటెస్టెంట్స్ కే కాదు ఈ షోని  వీక్షించే ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అవుతుంది‌. బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అదరగొడుతున్నాడు. హౌస్ లో ఏ టాస్క్ అయిన తన వందశాతం పెడుతూ దూకుడుగా ఆడుతున్నాడు ప్రశాంత్. ఇతని ఆటతీరుకి సెలబ్రిటీలు సైతం ఫిధా అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. బిగ్ బాస్ రివ్యూ లు ఇచ్చే యూట్యూబర్స్, సోషల్ మీడియా పేజీలలో సైతం రైతుబిడ్డ ఆటతీరుకి ప్రశంసల వర్షం కురుస్తుంది. హౌస్ లోకి వచ్చిన మొదటి, రెండు వారాల్లో రతికతో క్లోజ్ గా ఉండటం చూసిన అభిమానులు ప్రశాంత్ ఎక్కువ రోజులు ఉండడని అనుకున్నారంతా.. అయితే శివాజీ సలహాలతో టాస్క్ లని మెరుపు వేగంతో ఫినిష్ చేస్తున్నాడు. నామినేషన్స్‌లో కూడా ఆచీతూచి సరైన పాయింట్లతో ఎదుటివారిని నామినేట్ చేస్తూ తనను నామినెట్  చేసిన వారితో తాను డిఫెండ్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఎవిక్షన్ పాస్ కోసం అతను ఆడిన ఆటని చూసి తోటి కంటెస్టెంట్స్ ప్రశాంత్‌కి ఫిధా అయ్యారు. వీడేం ఆడతాడు. ఏం ఆడలేడని అనుకున్న అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలకి తన విజయంతో సమాధానం చెప్పాడు ప్రశాంత్.  పల్లవి ప్రశాంత్ గురించి ఈ మధ్య నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది‌. అదేంటంటే పల్లవి  ప్రశాంత్ కి పెళ్ళి జరిగిందని తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి పల్లవి ప్రశాంత్ నిజంగానే పెళ్ళి చేసుకున్నాడా? లేక అదేదైనా షార్ట్ ఫిల్మ్ కోసం తీసిన ఫోటోసా... లేదా... మార్ఫింగ్ చేశారా.. ఇలా అనేక విషయాలకు సమాధానం తెలియాల్సి ఉంది‌. అయితే టిక్ టాక్ ఉన్నప్పుడు అతను వ్యవసాయ చేస్తున్నప్పటి వీడియోలతో పాటు కొన్ని ఫ్రెండ్స్ తో చేసినవి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ తో ఫ్యాన్స్ కి దగ్గరగా ఉన్నాడు ప్రశాంత్. ఒక రైతుబిడ్డగా అడుగుపెట్టిన ప్రశాంత్ కి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... బిగ్ బాస్ హౌస్‌లో వున్న పల్లవి ప్రశాంత్‌కి పెళ్ళి అయిందా... లేదా... అసలు ఆ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాలు తెలియాలంటే ప్రశాంత్ ఫ్యామిలీ నుంచే క్లారిటీ రావాల్సి వుంది.

బ్రహ్మముడి కావ్యకి అరుదైన అవార్డు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే..  కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా  మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో  'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది.  దీపిక రంగరాజు ఒక యూట్యూబ్ ఛానెల్ ని మొదలుపెట్టింది. ఆ ఛానెల్ లో తన మొదటి వీడియోని అప్లోడ్ చేసింది. " బ్రహ్మముడి సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది" అంటు తన మొదటి వ్లాగ్ ని అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బ్రహ్మముడి సీరియల్ లో ఆన్ స్క్రీన్ మీద రాజ్-కావ్యల జంటకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి పేరు మీద ఇన్ స్టాగ్రామ్ లో చాలా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే బ్రహ్మముడి లో కావ్య పాత్రలో ఎలా కన్పిస్తుందో.. బయట కూడా అలాగే సంప్రదాయ దుస్తులలో కన్పిస్తుంటుంది దీపిక‌. అందుకే తనకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. " మై ఫస్ట్ స్టార్ మా పరివార్ అవార్డ్" అంటు తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది దీపిక అలియాస్ కావ్య. బ్రహ్మముడి సీరియల్ లో తన నటనకి గాను మొన్న జరిగిన " స్టార్ మా పరివార్ అవార్డ్స్" లో.. ఉత్తమ కూతురి క్యాటగిరీలో కావ్యకి అవార్డ్ వచ్చింది. దీంతో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోని చేసింది దీపిక. బ్రహ్మముడి సీరియల్ లోని రుద్రాణి(షర్మిత), అపర్ణ, ధాన్యలక్ష్మి, ఇందిరా దేవీ.. అందరు ఒకే దగ్గర ఉన్నారంటు వారందరు తనకి మంచి సపోర్ట్ ఇస్తున్నారంటు చెప్పింది. అలాగే తనని సపోర్ట్ చేస్తూ.. బ్రహ్మముడి కావ్యని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరున థాంక్స్ చెప్పింది. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి నేను కష్టపడుతూనే ఉంటానని దీపిక అలియాస్ కావ్య చెప్పుకొచ్చింది.

బొచ్చు వెనక్కి రాదు... ఖుష్బూ లేచి వెళ్లిపోయారు!

స్మాల్ స్క్రీన్ మీద నవ్వుల్నీ పండించే షో జబర్దస్త్. ఈ షోలో స్కిట్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తగ్గేదేలే అన్నట్టుగానే ఉంటుంది. ఐతే ఈ షోలో ఎప్పుడైనా కంటెంట్ లేనప్పుడో లేదా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడో ఆడియన్స్  మైండ్ ని డైవర్ట్ చేసే ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు. ఇక ఇప్పుడు అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది..ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. అందులో మహేష్ బాబు, తాళ్ళూరి రామేశ్వరి నటించిన "నిజం" మూవీని స్పూఫ్ గా చేసి బులెట్ భాస్కర్, నాటీ నరేష్ టీమ్ స్కిట్ వేశారు. ఇందులో గోపీచంద్ గా బుల్లెట్ భాస్కర్, మహేష్ బాబుగా నరేష్ కనిపించారు. గోపీచంద్ పాత్రలో భాస్కర్ “పెద్దమ్మ తల్లికి అమ్మోరు తల్లిని బలి ఇవండ్రా” అని అంటాడు..అప్పుడు జడ్జి కృష్ణభగవాన్ మధ్యలో కలగజేసుకుని "గుండు ఫస్ట్ నుంచి ఉండాలి సర్ ఇప్పుడు గుండు సెటప్ పెట్టుకోవడం కష్టం సర్" అంటాడు భాస్కర్. ఇక కుష్బూ కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యారు.   "స్పూఫ్  చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ఫీల్ అవ్వడానికి ఏం లేదు కదా” అన్నారు. ఆ మాటలకూ భాస్కర్ కు కోపంవచ్చేసింది  “ నేను స్కిట్ కోసం ప్రాణమిస్తా, అలాంటిది జుట్టు పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు గుండు అన్నారు కాబట్టి  గుండులోనే స్కిట్ చేసి  చూపిస్తా” అంటూ స్టేజి మీదే గుండు గీయించుకుని అందరినీ షాక్ కి గురి చేశాడు. గుండు గీయించుకున్న మధ్యలో భాస్కర్ జడ్జెస్ వంక చాల కోపంగా ఒక చూపు చూసారు. గుండు గీయించుకున్నాక  “ఇప్పుడు ఓకేనా సార్” అంటూ  కృష్ణ భగవాన్‌ను అడిగాడు భాస్కర్. “ఆ ఎఫెక్ట్ కావాలన్నాం కానీ.. నిజంగా గుండు గీయించుకుంటే ఎలా ?” అని భగవాన్ రిప్లై ఇచ్చేసరికి భాస్కర్ ఇంకా సీరియస్ గా  “ఈ విషయాన్ని మీరు గుండు గీయించుకోక ముందు చెప్పాలి.. అంతా అయిపోయాక ఇప్పుడు బొచ్చు వెనక్కి రాదు ?” అంటూ గట్టిగానే జవాబిచ్చాడు. భాస్కర్ మాటలపై కుష్బూకు  కోపం వచ్చేసింది . “మాకు ఓ రెస్పాన్స్‌బులిటీ ఇచ్చారు. అందుకే ఇక్కడ కూర్చోబెట్టారు. ఆమాత్రం చెప్పే  ఫ్రీడమ్ లేదంటే ఎలా ?” అంటూ చాల ఘాటుగా అడిగారు ఖుష్బూ. "ఒక జడ్జిగా మాకు ప్రశ్నించే హక్కు  లేదంటే, మేమెందుకు ఇక్కడ ఉండాలంటూ" సీటులో నుంచి లేచి వెళ్లిపోయారు ఇద్దరు జడ్జెస్ . “థాంక్యూ మేడం” అంటూ భాస్కర్ కూడా స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు.