Bigg Boss 7 Telugu : చుక్క బ్యాచ్.. మొక్క బ్యాచ్.. మధ్యలో తొక్క బ్యాచ్!

బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలేకి మరికొన్ని వారాలే ఉన్నాయి. ఇక పన్నెండవ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అశ్వినిశ్రీ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే.  సండే ఫన్ డే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ అభిమనులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక సండే ప్రోమో రానే వచ్చింది. ఎలిమినేష్ తర్వాత అశ్వినిశ్రీ స్టేజ్ మీదకి వచ్చింది. అసలు ఊహించలేదంటూ అశ్వినిశ్రీ తన నిరాశని వ్యక్తం చేసింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు మంచి ఫ్రెండ్ దొరికాడంటూ యావర్ ని చూపించింది అశ్విని. హౌస్ లో ఎవరెలా ఉంటారని నాగార్జున అడుగగా.. ప్రియాంక, శోభా, అమర్ ఒక బ్యాచ్.. శివాజీ అన్న, యావర్, ప్రశాంత్ ఒక బ్యాచ్.. నేనే ఏకాకిలాగా మిగిలిపోయానని అశ్విని అంది. ఇక మిగిలివున్న వారిలో గౌతమ్, అర్జున్ ఉన్నారు. నేను ఆ ఏకాకి బ్యాచ్ లో కూడా లేనా అశ్విని అని అర్జున్ అనేసరికి.. "అయ్యో అర్జున్ ఎందులో లేడా.. నువ్వేదైనా చేస్తావేమోనని భయం " అని నాగార్జున అనేసరికి అందరు నవ్వేసారు. ప్రశాంత్ కొన్ని కొన్నిసార్లు మాట వినడు సర్ అని అశ్వినిశ్రీ అనగానే.. నీకు మిమిక్రీ చేయడం వచ్చా అని నాగార్జున అన్నాడు. లేదని అశ్విని చెప్పుగా.. "నువ్వు శివాజీ లాగా మిమిక్రీ చేసి చెప్పేస్తే వినేస్తాడు" అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత ప్రియాంక గురించి చెప్తూ.. మంచిదే సర్ కానీ కొంచెం తొందరపాటు అని అంది. హిట్టా ఫ్లాపా అని అడుగగా.. నా పరంగా అయితే ప్లాపే అని అశ్విని అంది. ఇక హౌస్ రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యిందని అశ్విని అంది. హౌస్ లో ఇప్పుడు చుక్క బ్యాచ్.. మొక్క బ్యాచ్.. తొక్క బ్యాచ్ ఉన్నారని నాగార్జున అనగానే.. హౌస్ లో నవ్వులు పూసాయి. మరి హౌస్ లో ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ ఎవరో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Krishna Mukunda Murari : కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కీలక మలుపు.. వాళ్ళిద్దరి పెళ్ళి ఫిక్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -324 లో... మురారిని ఇంప్రెస్ చేయడానికి ముకుంద టీ షర్ట్ వేసుకొని రాగానే.. ఈ అవతారం ఏంటని మురారి అని ముకుందని డిజప్పాయింట్ చేస్తాడు. ఆ తర్వాత ముకుంద కోపంగా ఉంటుంది.. నాకు వర్క్ ఉంది వెళ్తున్నానంటూ మురారి వెళ్తుంటే నేను వస్తానని ముకుంద అనగానే.. అవసరం లేదని చెప్పి తనని పట్టించుకోకుండా మురారి వెళ్లిపోతాడు. మరొకవైపు కృష్ణ తన చిన్నాన్నని కలిసి వస్తుంది.‌ అలా వచ్చిన కృష్ణని.. ఏం అన్నారని శకుంతల అడుగుతుంది. నేను ఎందుకు ఈ పని చేసానో ముందు ముందు నీకే తెలుస్తుందని  చిన్నాన్న అన్నాడని శకుంతలకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మధు వచ్చి నిన్ను బ్రేక్ ఫాస్ట్ కి పెద్దమ్మ రమ్మంటుందని తీసుకొని వెళ్తాడు. భవానీతో మాట్లాడటానికి ముకుంద వస్తుంది. ఇంట్లో అందరు కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారని ముకుంద అంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కిందకి వెళ్ళు అని ముకుందకి భవాని చెప్తుంది. ఇప్పుడు అత్తయ్య  ఏదో కృష్ణ విషయంలో  మంచి నిర్ణయం తీసుకుంది. అందరు షాక్ అవుతారని ముకుంద అనుకుంటుంది. రేవతి, నందు, గౌతమ్ అందరు.. కృష్ణని భవాని బ్రేక్ ఫాస్ట్ కి ఎందుకు పిలిచిందని టెన్షన్ పడుతుంటారు. అప్పుడే భవాని వచ్చి.. టిఫిన్ ఏం చేసావని అడుగుతుంది. అప్పుడే కృష్ణని మధు తీసుకొని లోపలికి వస్తాడు. ఆ తర్వాత మురారి ఇంట్లో లేని టైమ్ లో.. కృష్ణ ని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచి తన నిర్ణయం చెప్తుంది. ముకుంద, మురారీల అమెరికా ప్రయాణం కాన్సిల్ చేస్తున్నాను. ఎలాగూ ఆదర్శ్ తిరిగి వచ్చేలా లేడు. ముకుంద, మురారికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను. నాకు ముందు తెలియక ముకుంద ఆదర్శ్ లకి పెళ్లి చేసాను. ఇక నీది, మురారిది అసలు పెళ్లి కాదు. ఇందులో ఎలాంటి మార్పు లేదని భవాని అనగానే అందరూ షాక్ అవుతారు. ముకుంద మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ కోసం తన ఇంటికి మురారి వెళ్తాడు. తరువాయి భాగంలో.. బాధగా వస్తున్న కృష్ణని చూసి మురారి షాక్ అవుతాడు. అదే సమయంలో.. నీ గతంలో ఏం జరిగిందో చెప్పాలని అనుకుంటన్నానని భవాని అనగానే.. చెప్పు పెద్దమ్మ నా గతం తెలుసుకోవాలని నాకు ఉంది అని అనగానే.. నీ గతం లో నువ్వు ముకుందతో ప్రేమ లో ఉన్నావని భవాని అనగానే మురారి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ లో శివాజీ.. సీజన్-7 టైటిల్ SPY లో ఒక్కరికేనా!

బిగ్ బాస్ సీజన్-7 లో సీరియల్ బ్యాచ్ ఎంత ఫేమసో.. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ అంతే ఫేమస్. సీరియల్ బ్యాచ్ వాళ్ళేమో రివేంజ్, స్ట్రాటజీ, గ్రూపిజం అంటు మాట్లాడుకుంటూ కలిసి హౌస్ లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ వీళ్ళేమో ఫెయిర్ గా ఆడాలి‌. మనం మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. ధర్మంగా ఆడాలని వీళ్ళుంటారు. బిగ్ బాస్ సీజన్-7 తుది దశకు చేరుకుంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం నాటి ఎపిసోడ్‌లో అశ్వినిశ్రీని ఎలిమినేట్ చేసాడు నాగార్జున. మరి తర్వాతి ఎలిమినేషన్ ఎవరంటు ఇప్పటికే నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటి మద్యలో అమర్ దీప్ గతవారం, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. అయితే శుక్రవారం నాటి కెప్టెన్సీ టాస్క్ లో.. అర్జున్ కోసం శివాజీ, అమర్ కోసం శోభాశెట్టి స్టాండ్ తీసుకున్నారు. బిగ్ బాస్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోమని చెప్పగా ఇద్దరి మద్య చాలా‌సేపు డిస్కషన్ జరిగింది. దీంతో ఇచ్చిన సమయంలో నిర్ణయం తీసుకోలేదని కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశాడు బిగ్ బాస్. అయితే అమర్ దీప్ ఏడ్వడంతో తన ఫ్యాన్స్ శివాజీ వర్సెస్ అమర్ దీప్ లలో ఎవరు కరెక్ట్ అంటూ ట్విట్టర్ లో వీడియోలు పెడుతున్నారు. ఇక దీనిని చూసిన SPY(శివాజీ, ప్రశాంత్,యావర్) ఫ్యాన్స్.. అమర్ దీప్ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుండి చేసిన ఫౌల్ గేమ్, వాళ్ళ గ్రూపిజం అన్నీ బయటకు తీస్తూ.. #శివాజీ ది విన్నర్ అంటూ ట్రెండింగ్ క్రియేట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. శివాజీ, యావర్, ప్రశాంత్ ముగ్గురు కలిసి ఉండే కొన్ని వీడియో క్లిప్స్ ని ఎడిట్ చేస్తున్నారు. SPY ఫ్యాన్స్ శివాజీ, ప్రశాంత్, యావర్ ల బాండింగ్ గురించి అప్లోడ్ చేసిన వీడియోలని చూస్తే ఎవరికైన గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎమోషనల్ గాను, ఇన్ స్పైరింగ్ గాను చూపిస్తూ వాటికి తగ్గట్టు మ్యూజిక్ ని యాడ్ చేస్తున్నారు. కాగా ఇవి ఫుల్ వైరల్ గా మారాయి.

Guppedantha Manasu: తన తప్పేం లేదని వసుధార నిరూపించుకుంటుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -930 లో... వసుధార వల్లనే చిత్ర సూసైడ్ చేసుకుందని పోలీసులు వసుధారని అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. నేనేం తప్పు చెయ్యలేదని వసుధార చెప్పినా వినిపించుకోరు. చిత్ర వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ మేడమ్ వల్లనే అని చెప్పడంతో పోలీసులు వసుధారని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే రిషి, మహేంద్ర ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అప్పుడే అక్కడికి అనుపమ వస్తుంది. అక్కడ అందరి ముందు వసుధారనే తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడుతుంది. తన గురించి ఏం తెలియకుండా ఎలా ఎండీ బాధ్యతలు ఇచ్చారంటు మహేంద్ర,  రిషిలని అనుపమ అడుగుతుంది. నేనేం తప్పు చేయలేదు మేడమ్ అని వసుధార చెప్పిన కూడా అనుపమ వినిపించుకోదు. ఆ తర్వాత వసుధారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. వసుధార ఇలా చేస్తుందని అనుకోలేదు. ఎండీ స్థాయికి వెళ్ళింది అంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి అనుకున్నా కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని వసుధార గురించి తప్పుగా మాట్లేడేసరికి రిషి, మహేంద్రలకి కోపం వస్తుంది. మీరు తన గురించి తెలియకుండా మాట్లాడకండి. మిషన్ ఎడ్యుకేషన్ పేరిట ఎంత మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిందో మీకేం తెలుసు. వసుధార గురించి తప్పుగా మాట్లాడకండి అని రిషి గట్టిగనే చెప్తాడు. వసుధార తప్పు చేసిందంటే జగతి చేసినట్టే ఎందుకంటే తను జగతిని పోలి ఉంటుంది. నువ్వు వసుధారని అవమానిస్తే జగతిని అవమానించినట్లే, తను జగతి స్టూడెంట్ అని అనుపమపై మహేంద్ర కోప్పడతాడు‌. ఆ తర్వాత మహేంద్ర, రిషి తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి.. వసుధారకి బెయిల్ ఇప్పించండని అడుగుతారు. ఆ తర్వాత రిషి, మహేంద్ర ఇద్దరు స్టేషన్ కి వెళ్లి వసుధారని కలుస్తారు. చెయ్యని తప్పుకి నింద మోస్తున్నానని వసుధార ఎమోషనల్ అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు వసుధార బెయిల్ ఇప్పిస్తానని వసుధారకి రిషి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి అడిగినా ఉపయోగం లేకుండా పోతుంది. కాసేపటికి ఒక లాయర్ వచ్చి వసుధారకి బెయిల్ ఇస్తాడు. ఎవరు పంపించారని అనగానే.. అనుపమ మేడమ్ పంపిందని చెప్పి వసుధారని బయటకు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత బయట అనుపమ ఉంటుంది. థాంక్స్ అని మహేంద్ర చెప్పగానే.. నేను తన కోసం ఏం చెయ్యలేదు. తన తప్పు చేస్తే జగతి తప్పు చేసినట్టు అన్నారు కాబట్టి చేశాను. జగతి తప్పు చెయ్యదు. కానీ వసుధార తప్పు చేసిందని అంటుంది. నువ్వు తప్పు చెయ్యలేదని నిరూపించుకోమని అనుపమ అంటుంది. మీరు వసుధారా తప్పు చేసింది అన్న ఆలోచన మానుకోండి అని అనుపమకి రిషి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీరియల్ బ్యాచ్ గ్రూపిజం బయట పెట్టిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే ఉల్టా పుల్టా అంటూ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీ వారం కొత్త టాస్క్ లు కొత్త గొడవలు జరుగుతున్నాయి. అయితే ఫ్యామిలీ వీక్  తర్వాత కంటెస్టెంట్స్ అంతా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరేమి తప్పులు చేసారో చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అలాగే సీరియల్ బ్యాచ్ గ్రూప్ గా ఆడుతుందని చూపించాడు.  "మొన్నటి టాస్క్ లో శోభాశెట్టిని విఐపీ బెడ్ రూమ్ లోని వాష్ రూమ్ వాడుకోమని చెప్పావ్. యావర్ ని మెయిన్ వాష్ రూమ్స్ కి పంపించావ్. ఇదేం ఆట" అని ప్రియాంకని నాగార్జున అనగానే.. సర్ అది తెలుసు అని నవ్వింది ప్రియాంక. "ఇది నవ్వాల్సిన టైమ్ కాదు ప్రియాంక. యూ ఆర్ రాంగ్. అన్ ఫెయిర్. ఇన్ని వారాల నుండి చూస్తున్నాం. పన్నెండు వారాలు అయిపోయింది. ఇంకెప్పుడు నీ గేమ్ ఆడతావ్. శోభాశెట్టి కోసం ప్రియాంక, అమర్ కోసం శోభాశెట్టి, అమర్ కోసం ప్రియాంక .. ఇక మీరు ముగ్గురేనా.. అసలు హౌస్ లో ఇంకెవరు లేరా" అంటూ గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. ప్రియాంక కెప్టెన్ అయ్యాక.. శోభాశెట్టి, అమర్ దీప్ ఇద్దరు డిప్యూటీలు, శోభాశెట్టి కెప్టెన్ అయ్యాక ప్రియాంక, అమర్ దీప్ డిప్యూటీలు. ఇక అమర్ దీప్ కెప్టెన్ అయ్యాక మళ్ళీ వాళ్ళిద్దరే అని అనేసరికి శివాజీకి నచ్చలేదు. అందుకే అర్జున్ కోసం స్టాండ్ తీసుకున్నాడనే క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ఇక శోభాశెట్టి, గౌతమ్ లని ఇద్దరిని లేపి గతవారం బాల్స్ విసిరేసే టాస్క్ లో మీ ఇద్దరికి ఏదో కన్ఫూజన్ ఉంది కదా అని నాగార్జున అడిగాడు. అవునని ఇద్దరు అనగా.‌. వీడియో వేసి చూపించాడు. అమర్ దీప్ ని టార్గెట్ చేస్తూ గౌతమ్ బాల్స్ వేస్తుంటే.. అలా ఒక్కడినే టార్గెట్ చేసి వేయొద్దు. ఇద్దరిని కొట్టు అని శోభాశెట్టి అన్నట్టుగా ఆ వీడియోలో ఉంటుంది. ఇక శోభాశెట్టి కవర్ చేసుకోడానికి.. నేను ప్రియాంక అనే వర్డ్ మెన్షన్ చేయలేదని  చెప్తుంది.  అది చూసి అంబటి అర్జున్ ని లేపి నీకేం అర్థమైందో చెప్పమని అంటాడు. ఇద్దరిని కొట్టమని శోభాశెట్టి అంది. అంటే ప్రియాంకని కొట్టమనే అర్థం అని అంబటి అర్జున్ అంటాడు. ఇక ప్రియాంక కూడా అదే అంటుంది. అమర్ దీప్ ని అడిగితే.‌. నాకేం అర్థం కాలేదు సర్. నేను గేమ్ పోతుందనే టెన్షన్ లో ఉన్నానని చెప్తాడు. అలా మొత్తానికి సీరియల్ బ్యాచ్ చేసే మోసాలని, గ్రూప్ గా ఆడే విధానాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ వారి బండారం బయటపెట్టాడు నాగార్జున.

Brahmamudi: కొంపముంచిన DNA.. భర్తకి భార్య సవాల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -263 లో... స్వప్న తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందని నింద వేసి, తనని ఎలాగైనా ఇంట్లో నుండి బయటకు పంపించాలని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేస్తారు. నాకెవరు అడ్డు చెప్పకండని రుద్రాణి ఇంట్లో వాళ్ళకి చెప్పి స్వప్నని బయటకు గెంటేయ్యబోతుంటే స్వప్న కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో రాజ్ డాక్టర్ కి  కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి స్వప్న ని చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రుద్రాణి మాత్రం ఇది మరొక నాటకమా అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ ని రుద్రాణి అడుగుతుంది.. డాక్టర్ నేను చెప్పేది నిజమని చెప్పగానే.. రాహుల్ కూడా స్వప్న నిజంగానే ప్రెగ్నెంట్. కానీ ఆ బిడ్డకి తండ్రిని మాత్రం నేను కాదని అనగానే అందరూ షాక్ అవుతారు. స్వప్న రాహుల్ అలా అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది. నేను తప్పు చేసాను కానీ తప్పుడు మనిషిని కాదని స్వప్న చెప్తుంది. రుద్రాణి కూడా ఎవరి బిడ్డకు నా కొడుకుని తండ్రిని చెయ్యాలని చూస్తున్నావా అని అంటుంది. నేను అరుణ్ కి డబ్బులు ఇచ్చన మాట నిజమే కానీ నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. రిచ్ గా బతకాలని అనుకుంటాను. కానీ రిచ్ గా ఉండడానికి తప్పుడు పనులు చేస్తానని అనుకోకండి. ఇది నా వ్యక్తిత్వం,  నా క్యారెక్టర్ కీ సంబంధించినదని స్వప్న ధైర్యంగా మాట్లాడుతుంది. మరొకవైపు స్వప్నకి కావ్య సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. నాకు ఈ సమస్యని పరిష్కారించుకునే దైర్యం ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండని కావ్యతో స్వప్న అంటుంది. "ఒక ఆడదానివై ఉండి. ఇంత మంది ముందు నా శీలాన్ని అనుమానిస్తావా? నా కడుపులో బిడ్డ నాకూ అండగా ఉంది. ఎంత దూరం అయిన వెళ్తాను. DNA టెస్ట్ చేయిస్తాను. అప్పుడు అందులో నేను తప్పు చేశానని తెలిస్తే నా అంతట నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను" అని ఇంటి పెద్దలకి నిరూపించుకునే అవకాశం ఇవ్వమని స్వప్న కోరుకుంటుంది. ఆ తర్వాత ఆలోచించిన సీతారామయ్య .. ఇలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు నిజానిజాలు తెలియకుండా నిందలు వెయ్యకండని  రాహుల్, రుద్రాణిలకి చెప్తాడు. మరొకవైపు ఎందుకు ఇలా చేసావ్? స్వప్నని ఇంట్లో నుండి బయటకు పంపించాలని ప్రయత్నం చేస్తుంటే ఒక వైపు తల్లిని చేసావా అంటూ రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణి. ఆ DNA టెస్ట్ లో రిపోర్ట్స్ మనకి అనుకూలంగా వచ్చేలా మనం చెయ్యాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని రాజ్ అంటాడు. నిజం తెలియకుండా నిందలు వెయ్యడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది‌. స్వప్న పెళ్లి తర్వాత  అరుణ్ తో  పరిచయం రహస్యంగా ఉంచడం, అతనితో మాట్లాడటం నేను చూసానని రాజ్ అంటాడు. ఆ నిజాన్ని నేను వెలికి తీస్తాను. అది నింద. నింద మాత్రమే అని బుజువు చేస్తాను. ఇది మా అక్క  కోసం మాత్రమే చేస్తున్నా పోరాటం కాదు. ఒక  స్త్రీ చాలా సులభంగా పరాయి మగవాడికి  లొంగిపోతుందని అనుకుంటున్న మీలాంటి మగవారికి  గుణపాఠం నేర్పడానికి కూడా అని రాజ్ కి కావ్య ఛాలెంజ్ విసురుతుంది.

అశ్వినిశ్రీ ఎలిమినేటెడ్.. ముందే ఫిక్స్ అయిందిగా!

బిగ్ బాస్ సీజన్-7 ఉత్కంఠభరితంగా సాగుతుంది. గడిచిన పన్నెండు వారాలలో ఎవరెలా ఉన్నారంటూ, ఎవరేం చేస్తున్నారో ఇప్పటికే ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేశారు. ఇక గత వారం నో ఎలిమినేషన్ కావడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. ఇదే విషయం గత వారమే క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. అయితే ఆ తర్వాత నామినేషన్ లో ఒక్కొక్కరు  ఒక్కో పాయింట్ చెప్తూ ఇద్దరిని నామినేషన్ చేశారు. కానీ అశ్వినిశ్రీ ఎవరిని నామినేట్ చేయలేదు. తన దగ్గర ఏం రీజన్స్ లేవని, సిల్లీ రీజన్స్ కి నామినేషన్ చేయనని అశ్వినిశ్రీ అనగానే.. సరైన కారణాలతో నామినేట్ చేయకపోతే, ఎవరిని నామినేట్ చేయకపోతే మీరే సెల్ఫ్ నామినేషన్ అవ్వాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. అయినా అశ్వినిశ్రీ ఎవరిని నామినేట్ చేయకపోయేసరికి నామినేషన్ లోకి వచ్చేసింది‌. ఇక వారం మొత్తం జరిగిన టాస్క్ లో తను ప్రూవ్ చేసుకోడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఆ టాస్క్ లో ప్రశాంత్ తర్వాత అశ్వినిశ్రీ డెడ్ అయి తొందరగా టాస్క్ నుండి బయటకొచ్చేసినట్టు అనిపించింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్‌లో.. అశ్వినిని నాగార్జున లేపి.. కాన్ఫిడెన్సా? లేక ఓవర్ కాన్ఫిడెన్సా అని అడిగాడు. దాంతో తనకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అశ్విని నామినేషన్ చేయకపోవడానికి కారణాలు చెప్పింది‌. ఆ నామినేషన్ రోజున కడుపులో నొప్పి ఉందని, మూడ్ స్వింగ్ లో ఉన్నట్టుగా, తన మూడేం బాలేదని, ఎవరితో వాదించే ఓపిక లేదని సెల్ఫ్ నామినేషన్ తీసుకున్నానని అశ్విని చెప్పింది. అది తప్పు కదా.. వారం మొత్తం హౌస్ మేట్స్ తో ఉన్నావ్? ఒక్కరిలో కూడా తప్పు లేదా నామినేషన్ చేయడానికి అంటు క్లాస్ పీకాడు. ఇక చేసేదేమీ లేదు హౌస్ లో అయినా బయట అయినా అని ఎలిమినేషన్ ముందే హింట్ ఇచ్చేశాడు నాగార్జున.  ఇక ఒక్కొక్కరు హౌస్ లో ఎలా ఉన్నారో చెప్తూ.. వారి తప్పులని చూపించిన నాగార్జున.. సేవింగ్ ఏమీ లేదు డైరెక్ట్ ఎలిమినేషన్ అంటు నామినేషన్ లో ఉన్న అందరిని నిల్చోబెట్టి.. తలో ఫేక్ గన్ ఇచ్చి.‌ గన్ పేలిన సౌండ్ వస్తే ఎలిమినేషన్ అని చెప్పాడు. ఇక  కాసేపటికి అశ్వినిశ్రీ ఎలిమినేటెడ్, మిగిలిన వాళ్ళంతా సేఫ్ అని నాగార్జున అన్నాడు.

ఢీ ఫినాలే నుంచి  ప్రియమణి, శేఖర్ మాస్టర్‌ని తప్పించిన మల్లెమాల.. అసలేం జరిగిందంటే!

బుల్లితెరపై వచ్చే టీవీ షోలలో ఢీ షోకి ఉండే క్రేజే వేరు.‌ ఇందులో డ్యాన్సర్స్ వేసే స్టెప్పులకి ఎంతో మ‌ంది ఫ్యాన్స్ ఉన్నారు.  ఢీ జోడీలో ప్రదీప్ మాచిరాజు యాంకర్, జడ్జ్ లుగా  ప్రియమణి, శేఖర్ మాస్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు రిలీజైన ప్రోమోలో శేఖర్ మాస్టర్, ప్రియమణి కనపడలేదు. దీంతో ఇప్పుడు అందరూ దీనిపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఢీ షోలో డ్యాన్సర్స్ డ్యాన్స్ కంటే కూడా శేఖర్ మాస్టర్, ప్రియ మణి ల జడ్జిమెంట్ కే ఎక్కువ ఆదరణ అని అనడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. వీరిద్దరి జడ్జిమెంట్, హైపర్ ఆది పంచ్ ల కోసమే ఈ షోని ఎక్కువ మంది చూస్తారనేది నిజం. అయితే ఏమైందో తెలియదు గానీ ఈ రోజు రిలీజైన ప్రోమోలో ప్రియమణి, శేఖర్ మాస్టర్ కనపడకుండా ఇద్దరు కొత్త జడ్జ్ లు వచ్చినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళేవరు? ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే వచ్చారా? లేక మొత్తంగా ఉంటారా అనే ప్రశ్నలు ప్రేక్షకులలో నెలకొన్నాయి. శేఖర్ మాస్టర్ , ప్రియ మణి లేకుండా ఈ షో ఎంతమంది చూస్తారంటూ ఫ్యాన్స్ ఇప్పటికే ప్రోమో కింద కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మరి ఇందులో నిజం ఎమిటనేది తెలియదు. ఢీ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్స్ వెలుగులోకి వచ్చారు. ఢీ షో మేకర్స్ పల్లెటూరిలోని యువతీ, యవకులలోని ట్యాలెంట్ ని గుర్తుచేస్తూ వరంగల్ వారియర్స్, కరీంనగర్ వారియర్స్ హైదరాబాద్ వారియర్స్ అంటు టీమ్ లుగా విభజిస్తూ ఒక్కో రౌండ్ లో మెరుగైన ప్రదర్శన ఉన్నవారిని తీసుకుంటూ డ్యాన్స్ మీద ఆసక్తిని కలుగజేస్తుంది. అయితే హైపర్ ఆది, దీపిక పిల్లి, సిరి హనుమంత్, మహేశ్ విట్ట ఇంకా కొంతమంది ఫేమస్ సెలబ్రిటీలని ఈ టీమ్ లకి కెప్టెన్స్ గా చేసి షోకి ఫుల్ క్రేజ్ వచ్చేలా చేసారు. అయితే ఇప్పుడు షోకి ప్రియ మణి, శేఖర్ మాస్టర్ రాలేదనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Bigg Boss Promo: పల్లవి ప్రశాంత్ బూతులపై నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ సీజన్-7 పన్నెండవ వారం ముగింపుకి వచ్చేసింది. అయితే గతవారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పడంతో ఈ రోజు ప్రోమోపై భారీ అంచనాలు పెరిగాయి. నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో అంబటి అర్జున్, అమర్ దీప్ లలో ఏ ఒక్కరు కెప్టెన్ గా కాలేకపోయారు. కాబట్టి దీని గురించి హోస్ట్ నాగార్జున శోభాశెట్టి, శివాజీలకి క్లాస్ తీసుకుంటారని అందరు అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న ఈ రోజు ప్రోమో రానే వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ బూతులు మాట్లాడతావా అని నాగార్జున అడిగాడు. ఏం మాట్లాడలేదు సర్ అని ప్రశాంత్ అనగా.. దెయ్యం అయ్యాక నువ్వు అన్నావ్ కదా అని అడిగాడు. నేను కావాలని అనలేదు సర్. తప్పు అయితే సారీ అని కూడా చెప్పానని ప్రశాంత్ చెప్పాడు. ఎవరూ కావాలని అనరని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత అశ్వినిశ్రీని లేపి.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేషన్ అయ్యావా అని నాగార్జున అనగా.. అదేం లేదు సర్ అని అశ్వినిశ్రీ అంది. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా అని నాగార్జున అనగా.. అశ్వినిశ్రీ ఏడుపు మొహం పెట్టేసింది. ఇక హౌస్ లో అడగాల్సినవి చాలా ఉన్నాయి. మరి అవన్నీ తర్వాతి ప్రోమోలో ఆడ్ చేస్తారో చూడాలి. ఇప్పటికైతే అశ్వినిశ్రీ, పల్లవి ప్రశాంత్ లకి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.

హ్యఫీ వైఫ్.. హ్యాపీ లైఫ్.. పెళ్ళాం చెబితే వినాలి

పెళ్ళికి ముందు లైఫ్ ఒకలా ఉంటుంది. పెళ్ళి తర్వాత మరొకలా ఉంటుంది. తేడా ఏంటంటో.. పెళ్ళికి ముందున్న హ్యాపీ లైఫ్.. పెళ్ళి తర్వాత ఉండాలంటే ఏం చేయాలో చెప్తుంది కస్తూరి. నటి కస్తూరి.. పరిచయం అక్కర్లేని పేరు. 90 వ దశకంలో తెలుగులో అగ్రహీరోల సరసన నటించి ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది‌. చెన్నైకి చెందిన కస్తూరి మిస్ మద్రాస్ టైటిల్ ని గెలుచుకుంది. కస్తూరి తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. అందులో భారతీయుడు సినిమాలో పచ్చని చిలుకలు తోడుంటే పాటలో మెప్పించింది. అన్నమయ్య సినిమాలోని.. ఏలే ఏలే మరదలా పాటలో అందంతో ఆకట్టుకుంది. ఇలా చాలా సినిమాల్లో మంచి హిట్ సాంగ్స్ లో చేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన కస్తూరి.. ఇప్పుడు తల్లి పాత్రలో చేస్తూ తెలుగుప్రేక్షకులకి దగ్గరైంది. స్టార్ మా ఛానెల్ లో 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ లో కస్తూరి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రలో చక్కని అభినయం ప్రదర్శిస్తూ ప్రతీ ఇంట్లో గృహిణికి కనెక్ట్ అవుతుంది. బుల్లితెరపై సీరియల్స్ లో బిజీగా ఉన్న కస్తూరి.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.  సోషల్ మీడియాలో ఏదైన ఇష్యూ మీద చర్చ జరుగుతున్నప్పుడు తనకి తోచింది తను చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో ఎవరైన స్త్రీల మీద వివక్ష చూపిస్తే వారిని ఎదురించడానికి ముందు వరుసలో ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడీయోని షేర్ చేసింది కస్తూరి. ఇందులో ఒక మీడియా రిపోర్టర్ ప్రతీ జంట దగ్గరికి వెళ్ళి  ఒక ప్రశ్న అడుగుతుంటాడు. ఎక్కువ కాలం భార్యభర్తలు హ్యఫీగా ఉండాలంటే మీ సలహాలు చెప్పండని కొంతమందిని అడుగగా.. అందులో చాలామంది భార్య చెప్పిన మాట వింటే చాలు హ్యాపీగా ఉండొచ్చని అన్నారు. ఇదే విషయాన్ని కస్తూరి చెప్తూ.. "‌హ్యఫీ వైఫ్.. హ్యాపీ లైఫ్.. పెళ్ళాం చెప్పిన మాట వినండి" అని టైటిల్ పెట్టి తన అభిప్రాయాన్ని షేర్ చేసింది.  

శోభాశెట్టి వర్సెస్ శివాజీ.. అమ్మ నాన్న కూడా ఆశ పెట్టుకున్నారు!

బిగ్‌బాస్ సీజన్-7 రోజు రోజుకి ఎవరూ ఊహించని విధంగా మారుతుంది. హౌస్ లో ఫ్యామిలీ వీక్ వరకు ఓ లెక్క.. ఆ తర్వాతి నుంచి మరో లెక్క అన్నట్లుగా గేమ్ సాగుతుంది.  కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నువ్వా నేనా అన్నట్టుగా హౌస్ మేట్స్ మధ్య  హీటెడ్ ఆర్గుమెంట్ సాగాయి. కంటెస్టెంట్స్ కి ఒకే ఒక్క కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఏకాభిప్రాయంతో ఒక్కరిని రేస్ నుండి తప్పించి మరొకరిని ముందుకు కొనసాగించాలని బిగ్ బాస్ చెప్పగా.. యావర్, రతిక కలిసి ప్రశాంత్ ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు. శోభాశెట్టి, ప్రశాంత్ కలిసి అశ్వినిశ్రీని తప్పించారు. యావర్, అశ్వినిశ్రీ కలిసి గౌతమ్ ని తప్పించారు. ఇలా ఒక్కొక్కరిని తప్పించగా.. చివరకు అర్జున్, అమర్ దీప్ కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. ఇక వీరిలో ఎవరు కెప్టెనో డిసైడ్ చేయడానికి శివాజీ, శోభాశెట్టి వచ్చారు. అమర్ దీప్ కి సపోర్ట్ గా శోభాశెట్టి, అంబటి అర్జున్ కి సపోర్ట్ గా శివాజీ నిల్చున్నారు. నాకు గతవారం కెప్టెన్సీ టాస్క్ లో నన్ను గెలిపించాడు కాబట్టి నా సపోర్ట్ అమర్ దీప్ కి అని శోభాశెట్టి అంది. కానీ శివాజీ మాత్రం అర్జున్‌కి ఒక కోరిక మిగిలిపోయిందంటూ.. వాళ్ళ భార్య హౌస్ లోకి వచ్చినప్పుడు అర్జున్ ని మరోసారి కెప్టెన్ గా చూడాలనుకున్నట్టు చెప్పిందని చెప్పాడు.  "అర్థం చేసుకో అన్నా.. ప్లీజ్ ఇప్పుడు అవకాశం వచ్చింది. పోగొట్టకు అన్నా.. నీకు దండం పెడతా అన్నా.. మా అమ్మ నాన్న కూడా ఆశ పెట్టుకొని ఉంటారు అన్నా" అంటు ఏడ్చాడు అమర్ దీప్. ఏం చేయమంటావురా.. ఏడుస్తావేంటి? రేపు టికెట్ టూ ఫినాలే ఉంది. దమ్ముంటే ఆడి గెలువు అంటూ సవాల్ చేశాడు. కానీ అమర్ మాత్రం అన్నా కెప్టెన్ అవ్వాలన్నా నేను అంటూ గట్టిగా అరిచాడు. నిన్ను ఎవడు ఆపాడయ్యా అని శివాజీ అన్నాడు‌. ఇక అర్జున్ కూడా.. ఎందుకురా ఏడుస్తావ్. కెప్టెన్ అవ్వకపోతే కప్పు రాదా? కెప్టెన్ ముఖ్యమా? కప్పు ముఖ్యమా అని చెప్పాడు.  ఇక ఒక పక్కకి వెళ్ళి ఏడ్చేశాడు అమర్ దీప్. ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్పగా.. అమర్ దీప్ కి సపోర్ట్ గా శోభాశెట్టి, అంబటి అర్జున్ కి సపోర్ట్ గా శివాజీ నిల్చున్నారు. ఇక ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగిన ఫలితం రాకపోయేసరికి.. మీకు ఇచ్చిన సమయం పూర్తయింది. మీరేం నిర్ణయం తీసుకోనందువల్ల ఇద్దరిని కెప్టెన్సీ రేస్ నుండి తీసేస్తున్నాం‌. ఇక ఈ వారం నో కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పేశాడు.  

Gautham Krishna Eliminated: గౌతమ్ కృష్ణ ఎలిమినేటెడ్.. ఏడుస్తున్న రతిక, అశ్వినిశ్రీ!

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం నడుస్తుంది.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ గత సీజన్ లలో జరిగిన దాని ప్రకారం పదిహేనవ వారం ఎలిమినేషన్ ఉండదు. మధ్యలో మిగిలింది రెండే వారాలు. కానీ హౌస్‌లో ఉన్నది పది మంది. వచ్చే వారం ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిగిలేది ఎనిమిది మంది‌. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. దాంతో ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు కానీ ఈ సీజన్ లో ఉల్టా పల్టా థీమ్ తో బిగ్ బాస్ డేంజర్ జోన్ లోని ఒకరిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తాడేమోనని అనిపిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లలో.. శివాజీ, ప్రశాంత్, యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు టాప్-5 లో కచ్చితంగా ఉంటారు. అయితే టాప్-5 లో ఆ నాలుగు, అయిదు స్థానాలలో ఎవరుంటారనేది అందరిలో మిగిలిన ప్రశ్న. అమర్ దీప్ గత వారం జరిగిన టాస్క్ లో ఏడ్చేశాడు. దాంతో అతని మీద ఫౌల్స్ ఆడతాడన్న మచ్చ పోయి కాస్త పాజిటివ్ ఎపిసోడ్ వచ్చిందనే చెప్పాలి. ఇక సీరియల్ బ్యాచ్ లోని అతి ముఖ్యమైన కంటెస్టెంట్ ప్రియాంక. తన స్ట్రాటజీతో మైండ్ గేమ్ తో ఎదుటివారిని మాట్లాడనీయకుండా చేస్తూ హౌస్ లో అమర్ దీప్, శోభాశెట్టి లని తన గుప్పిట్లో పెట్టుకుందనేది వాస్తవం. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్.. ఇంకా హౌస్ లో ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. ఆ ఫేక్ అంబటి అర్జున్ ఒక్క నామినేషన్ లో మాత్రమే రీజన్స్ చెప్పి.. ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పనేదో తను చూసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇదే విషయం స్పష్టం చేస్తూ యావర్ నామినేట్ కూడా చేశాడు. దీంతో ఈ వారం గౌతమ్, అర్జున్ ఇద్దరు ఎలిమినేషన్ అవుతారని అందరు భావిస్తున్నారు‌. అయితే రతిక, అశ్వినిశ్రీ కూడా కంటెంట్ కోసం తప్ప గేమ్స్ లో జీరో ఎఫర్ట్స్ చూపిస్తున్నారు. ఒకటి రెండు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఇతర అన్ అఫీషియల్ పోల్స్‌లో తప్ప అన్నింటిలో గౌతమ్, రతిక లీస్ట్ లో ఉన్నారు. కొన్నింటిలో అశ్వినిశ్రీ, గౌతమ్ లీస్ట్ లో ఉన్నారు. మొత్తానికి ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ లు చాలానే ఉన్నాయి. మరి బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ యూజ్ చేపించి, డబుల్ ఎలిమినేషన్ కాకుండా సింగిల్ ఎలిమినేషన్ చేస్తాడా చూడాలి మరి.

Krishna Mukunda Murari : ముకుంద  అవతారం మార్చుకోమని చెప్పినా మురారి 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -323 లో.. కృష్ణ తన ఆలోచనలని నందుతో చెప్తుంటే భవాని వింటుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ తన చిన్నాన్నని కలవడానికి వెళ్తుంటే మురారి వచ్చి నేను వస్తానని అంటాడు. మురారి వస్తే నిజం తెలిసిపోయి డిస్టబ్ అయిపోతాడని అనుకొని.. వద్దు సర్ నేను హాస్పిటల్ కీ వెళ్తున్నానని చెప్పి కృష్ణ వెళ్ళిపోతుంది. అదంతా పై నుండి భవాని చూస్తుంటుంది.  ఆ తర్వాత మురారి అన్న మాటలు భవాని గుర్తుచేసుకుంటుంది. అప్పుడే భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. నేను తప్ప ఇంట్లో మీ మాట ఎవరు వింటున్నారు? మీ కూతురు అల్లుడు కూడా వినట్లేదని ముకుంద అనగానే.. అవును అందరు కూడా వాళ్ళు కలవాలని అనుకుంటున్నారు. మనం కూడా  వాళ్ళ ఇష్టాన్ని గౌరవిద్దాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను‌. ఆ నిర్ణయం మారదని భవాని చెప్పగానే.. ఏంటా నిర్ణయమని ముకుంద టెన్షన్ పడుతుంది.. ఇప్పుడు చెప్పను కృష్ణని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచాను. అక్కడే అందరికి చెప్తానని భవాని చెప్తుంది. ఇంకా కృష్ణ రాలేదు. కృష్ణ లేకుండా అసలు ఉండలేకపోతున్నానని మురారి అనుకుంటాడు. అదే సమయంలో.. ఆ కృష్ణ నేనేం ప్లాన్ చేసిన ఫెయిల్ చేస్తుందని ముకుంద డిస్సపాయింట్ అవుతుంది. ముకుంద జీన్స్ టీ షర్ట్ వేసుకొని మురారిని ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటుంది. ముకుందని అలా చుసిన మధు.. నువ్వు ఏ డ్రెస్, అడ్రస్ మార్చిన మురారీని మార్చలేవని ముకుందతో అంటాడు. మరొక వైపు గౌతమ్, నందు, మధు, రేవతి కలిసి కృష్ణ మురారి గురించి మాట్లాడుకుంటారు. అసలు పెద్దమ్మ కృష్ణని ఎందుకు బ్రేక్ ఫాస్ట్ కి పిలిచింది. కృష్ణ తినే ఫుడ్ లో ఏదైనా కలిపి రెండు రోజులు లేవకుండా చేసి  ఆ తర్వాత మురారి ముకుంద లని అమెరికా పంపించాలని అనుకుంటుందా అని మధు అనగానే.. మధుపై రేవతి కోప్పడుతుంది. మరొకవైపు కృష్ణకి గుర్తుకు చేసుకుంటూ మురారి ఉంటాడు. అప్పుడే ముకుంద టీ షర్ట్ లో రావడం చూసిన మురారి పట్టించుకోనట్టే ఉంటాడు. పైగా తన ముందు కూడా కృష్ణ గురించి మాట్లాడేసరికి ముకుందకి కోపం వస్తుంది. ఆ తర్వాత నా డ్రెస్ గురించి ఏం చెప్పలేదని ముకుంద అనగానే.. నీకు చీరనే సెట్ అవుతుంది. ముందు వెళ్లి ఈ అవతారం మార్చుకోమని మురారి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu: సూసైడ్ కి ప్రయత్నించిన కాలేజీ స్టూడెంట్.. ఇదేం ట్విస్ట్ రా మామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -929 లో... ధరణి, శైలేంద్రలని కొన్ని రోజులు ఎంజాయ్ చేసి రండి అని ఫణింద్ర చెప్తాడు. నేనే వెళ్దామని అనుకున్న మీరే పంపిస్తున్నారని ఫణీంద్రతో శైలేంద్ర చెప్తాడు. కాసేపటికి ధరణి నువ్వు వెళ్లి లగేజ్ సర్దుకొని రమ్మని శైలేంద్ర చెప్తాడు. ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు వసుధార ఆలోచిస్తు.. బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే రిషి వచ్చి వసుధారతో మాట్లాడతాడు. కాలేజీలో జరిగిన విషయం గురించి డిస్కషన్ చేస్తుంటారు. అసలు చిత్రని నిజంగానే ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడా అని వసుధార అడుగుతుంది. అలా వాళ్ళ మాటలు, వారు ప్రేమించుకున్న రోజుల వరకి వెళ్తాయి. వాళ్ళు ప్రేమించుకున్న రోజుల్లోని తీపి జ్ఞాపకాలని రిషి, వసుధారలు గుర్తుచేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు.ఆ తర్వాత వసుధార వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తుంటే అప్పుడే కాలేజీ స్టూడెంట్ చిత్ర మెసేజ్ చేస్తుంది. అది చూసి షాక్ అయి కాల్ చేస్తే ఫోన్ కలవదు. మరుసటి రోజు ఉదయం మహేంద్ర, రిషి లకి వసుధార  టిఫిన్ వడ్డీస్తుంది. రాత్రి ఎక్కడికి వెళ్ళావని వసుధారని రిషి అడుగుతాడు. వసుధార ఏదో చెప్పబోతుంటే అప్పుడే రిషికి ఎస్సై ఫోన్ చేసి.. మీ కాలేజీ స్టూడెంట్ చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేసింది. మీరు రండి అని చెప్పగానే ముగ్గురు హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత రిషి, వసుధార, మహేంద్ర కలిసి హాస్పిటల్ కీ వెళ్తారు. చిత్రని ప్రేమించిన అబ్బాయి వాళ్లని చూసి మీరు ఎందుకు వచ్చారు? మీ వల్లే చిత్రకి ఇలా జరిగిందని అతను అరుస్తుంటాడు. మా వల్ల ఏంటి అని రిషి అడుగుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ఈ విషయం తెలియగానే మీడియా వాళ్ళు కాలేజీకి చేసి DBST కాలేజీ స్టూడెంటా అని అడిగారు. ఎవరో మీ కాలేజీపై బురద జల్లడానికి ఇలా చేసి ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని రిషికి డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు  వసుధారని అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. ఎందుకని రిషి అడుగుతాడు. వసుధర రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లి బెదిరించినట్లు.. ఇదిగో వీడియోలో ఉందని చూపించగా.. అది చూసి రిషి షాక్ అవుతాడు. ఏంటి వసుధార వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావని రిషి అడుగుతాడు.. వెళ్ళాను కానీ అక్కడ జరిగింది. అది కాదని వసుధార చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Brahmamudi : భార్యని గెంటేయాలనుకున్న భర్త.. స్పృహతప్పి పడిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -262 లో... అరుణ్ కి స్వప్న డబ్బులు ఇచ్చి ఇంటికి తిరిగి వస్తుంది. స్వప్న ఎప్పుడు వస్తుందా? తనకి సంబంధించిన  బాయ్ ఫ్రెండ్ విషయం ఇంట్లో చెప్పాలని రాహుల్ వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళావంటూ రాహుల్ గట్టిగా అరుస్తుంటే ఇంట్లో వాళ్ళంతా హాల్లోకి వస్తారు. ఆ తర్వాత స్వప్నని ఎక్కడికి వెళ్ళావంటు రాహుల్ నిలదీస్తాడు. బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నానాని నాతో చెప్పి వెళ్ళిందని రుద్రాణి గొడవని ఇంకా పెద్దగా చెయ్యాలని చూస్తుంది. వెళ్ళింది బ్యూటీ పార్లర్ కాదు. ఇది ఎవడితోనో తిరిగి వస్తుంది. మనల్ని అందరిని మోసం చేస్తుందని రాహుల్ అనగానే.. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అవును నేను చెప్పింది నిజం కావలంటే ఫొటోస్ చూడండి అని చూపించగానే ఇంట్లో అందరూ చూస్తారు. అతను నా కాలేజీ ఫ్రెండ్ మాత్రమే అని స్వప్న అనగానే.. అయితే ఆ రోజు నేను అతని ఫోటో చూపించినప్పుడు తెలియదని చెప్పావ్ కాదా అని ఇందిరాదేవి అనగానే ఇదిగో ఇలాగే అనుకుంటారని చెప్పలేదని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత ఇప్పటికి అతన్ని కలుస్తుంది. మొన్న ఇంటికి పిలిపించుకొని మాట్లాడిందని రాహుల్ అనగానే.. అవును నేను చూసానని రాజ్ చెప్తాడు. మరి ఇంట్లోకి పిలిచి మాట్లాడాలి కదా ఫ్రెండ్ అయితే అని ఇందిరాదేవి అనగానే.. నేను లోపలికి పిలవలేదు తను రాలేదని స్వప్న సమాధానం చెప్తుంది. ఆ తర్వాత స్వప్నని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించాలని రాహుల్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ ని కలిసి డబ్బులు ఇచ్చి వస్తుంది. దానికి సాక్ష్యం అని  చెప్పి అరుణ్ కి స్వప్న డబ్బులు ఇస్తున్నప్పుడు చాటుగా తీసిన ఫొటోస్ ని అందరికి చూపిస్తాడు రాహుల్. నీకు అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని రుద్రాణి అడగుతుంది.  తన నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది. ఇదిగో రిసీప్ట్ అని రాహుల్ సాక్ష్యం చూపించగా ఎవరు మాట్లాడలేకపోతారు. ఆ తర్వాత స్వప్న ఎందుకు ఇలా చేసిందోనని, అరుణ్ తనని బ్లాక్ మెయిల్ చేసాడని, అందుకే అలా చేశానని స్వప్న చెప్తుంది. ఇంత జరుగుతున్న మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని స్వప్నని అపర్ణ అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి నిజంగానే సంబంధం ఉందని రాహుల్ అంటాడు.  నేను ఎవరు చెప్పిన వినను అని స్వప్నని రాహుల్ బయటకు గెంటేయబోతుంటే.. స్వప్న కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అందాల రేసులో ఆరియానా గ్లోరీ... ఐ డోంట్ కేర్!

అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ  చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని  అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియాన చాలా బాధపడింది. అరియాన ఫ్రెండ్ అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్ళిన నుండి అతనికి సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు చేస్తోంది. అయితే ఈ మధ్యే తనని ఒక నెటిజన్ ఆంటీ అన్నాడని బాధపడుతూ వీడియో చేసింది. ఇప్పుడేమో బోల్డ్ లుక్  లోని రెండు ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. చాలామంది నేను ఇలా ఉన్నానని నన్ను జడ్జ్ చేస్తుంటారు. వాళ్ళేలా జడ్జ్ చేస్తారో ఐ డోంట్ కేర్. ఎవరేం అనుకున్నా నాకు నచ్చినట్టే నేనుంటాను అంటు ఈ పోస్ట్ కి ట్యాగ్ లైన్ కూడా రాసుకొచ్చింది అరియాన. రెండు ఫోటోలు అప్లోడ్ చేసిన అరియాన మొదటి ఫోటోలో కంటే రెండో దానిలో కూర్చొని దిగిన ఫోటోకి తెగ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ హౌస్‌లో శోభా శెట్టిని గన్‌తో కాల్చిన గౌతమ్!

బిగ్ బాస్ సీజన్-7 లో పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం ముగింపుకి వచ్చింది. ఇక గ్రాంఢ్ ఫినాలేకి కొన్ని వారాలే ఉండటంతో ఈ వారం చివరి కెప్టెన్ ఎవరా అని ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా  విడుదలైన ప్రోమోలో.. పన్నెండవ వారం హౌస్ లో కొత్త కెప్టెన్సీ కోసం " మెషిన్ గన్ టాస్క్ " ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గన్ షూటింగ్ సౌండ్ వచ్చిన ప్రతీసారీ రెండు ఫోటోలు ఎదురుగా ఉంటాయి. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మరొకరిని తీసేయాలని‌‌ బిగ్ బాస్ చెప్పాడు. శోభాశెట్టి, అంబటి అర్జున్ ఇద్దరి ఫోటోలు రాగా గౌతమ్ కృష్ణ తన సపోర్ట్ ని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. గౌతమ్ తో కంపేర్ చేస్తే శోభాశెట్టి అన్ ఫెయిర్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుందని అందుకే తీసేస్తున్నట్టుగా గౌతమ్ కృష్ణ అన్నాడు. అలా అనగానే శోభాశెట్టి అందుకుంది. నేనెక్కడ ఫౌల్ చేశాను, ఎక్కడ అన్ ఫెయిర్ గేమ్ ఆడానంటూ రెచ్చిపోతూ కన్పించింది‌. ఇక గౌతమ్, ప్రియాంక కలిసి ఏకాభిప్రాయంతో శోభాశెట్టిని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించినట్టు తెలుస్తుంది. ఇక ప్రియంక మరియు శోభాశెట్టి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఇక మరోసారి గన్ షూటింగ్‌ లో .. శివాజీ, ప్రశాంత్ ల ఫోటోలు రావడంతో అటు యావర్ కాల్చే వ్యక్తిగా ఉన్నాడు. నా ఫోటో కాల్చొద్దని నేనంటున్నా అని ప్రశాంత్ అనగా.. శివాజీ అన్న ఫోటో కాల్చాలా అని యావర్ అన్నాడు‌. ఇక ఇందులో ప్రశాంత్ ఫోటో కాలిపోతుందని తెలుస్తుంది.  అమర్ దీప్, అశ్వినిశ్రీ ఇద్దరి ఫోటోలు ఉండగా.. కాల్చడానికి శోభాశెట్టి, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇద్దరు కలిసి అశ్వినిశ్రీని తప్పించినట్టు తెలుస్తుంది. నా సపోర్ట్ ఎప్పుడు అమర్ దీప్ కి, అపోజిట్ గా ఎవరున్నా తీసేస్తానని శోభాశెట్టి గర్వంగా చెప్పింది. ఇక ప్రశాంత్ తన సపోర్ట్ అమర్ కే అని చెప్పగా.. నన్ను ఈ కెప్టెన్సీ రేస్ నుండి ఎవరు తీసేసిన ఒప్పుకుంటాను కానీ నువ్వు తీసేసావ్ చూడు అది నేను తీసుకోలేకపోతున్నాని అశ్వినిశ్రీ అంది. ఇక ఇదే చిట్ట చివరి కెప్టెన్సీ టాస్క్ కాబట్టి ఎవరు కెప్టెన్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది.

టాప్ ఓటింగ్ తో శివాజీ దూకుడు.. అట్టడుగున గౌతమ్, అంబటి అర్జున్!

బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ కి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. గతవారం ఫ్యామిలీ వీక్ లో కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి గట్టిగానే చెప్పారు. అప్పటి నుండి కంటెస్టెంట్స్ బాగా ఆడుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎవరు అనర్హులనే లిస్ట్ తీస్తే.. రతిక, గౌతమ్, అంబటి అర్జున్ లు ముందుంటారు. ఎందుకంటే రతిక వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం.. ల్యాగ్ చేయడం.. ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణ చేసే సిల్లీ నామినేషన్ వల్ల నెగెటివ్ అయ్యాడు. ఇక శివాజీని టార్గెట్ చేస్తూ ప్రతీ దానికి శివాజీనే ఫోకస్ చేసి నామినేషన్ చేయడం ఒకటైతే అంబటి అర్జున్ కన్నింగ్ ప్లాన్ ని గుర్తించకుండా అతనేం చెప్పిన నమ్మడంతో పాటుగా తన ఇండివిడ్యువల్ గేమ్ ని  మర్చిపోయాడు గౌతమ్.  అశ్వినిశ్రీ టాస్క్ లో పర్వాలేదనిపించిన ఒక్క గేమ్ విన్ అవ్వకపొవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్.. వీళ్ళు ముగ్గురు ఎక్కడికెళ్ళిన, ఏ గేమ్ అయిన కలిసే ఆడతారని అందరికి తెలిసిందే.  అయితే నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో శివాజీకి అత్యధిక ఓటింగ్ తో నెంబర్ వన్ ర్యాగింగ్ లో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. మూడవ స్థానంలో  అమర్ దీప్  ఉన్నాడు. ఇక చివరి స్థానాలలో రతిక, గౌతమ్, అంబటి అర్జున్ ఉన్నారు. అశ్వినిశ్రీ కి ఓటింగ్ బాగానే ఉంది. ఇక శోభాశెట్టి, ప్రియాంక నామినేషన్ లో లేకపోవడంతో వాళ్ళు సేఫ్ అయ్యారనే చెప్పాలి లేదంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళేవారు. శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వాలని బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గౌతమ్, అర్జున్ లు ఈ డబుల్ ఎలిమినేషన్ లో బయటకు వస్తారో లేక రతికని బయటకి పంపిచేస్తారా చూడాలి మరి.  

శివాజీని అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతుంది.  ఇందులో బిగ్ బాస్ భార్య హత్యకు గురైంది. బిగ్ బాస్ భార్యని హత్య చేసిన మర్డరర్ ఎవరో కనిపెట్టమని కంటెస్టెంట్స్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటికే ఉల్టా పల్టా ట్విస్ట్ లతో కంటెస్టెంట్స్ చేత ఒక ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో పది మంది ఉండగా అందులో శివాజీ ఒక్కడే తెలివితేటలతో, స్ట్రాటజీతో గెలుస్తున్నాడు. ఇక హౌస్ లోని వారికి ఒక్కో రోల్ ఇచ్చి ఆ పాత్రకి తగ్గట్టు చేయమని బిగ్ బాస్ కోరాడు. శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న వాళ్లని ఒక్కొక్కర్నీ మర్డర్ చేయమనగా మొదట పల్లవి ప్రశాంత్ ని డెడ్ చేసి విజయం సాధించాడు శివాజీ. ఆ తర్వాత గౌతమ్ ని డెడ్ చేయమనగా ఆ టాస్క్ ని ఇచ్చిన సమయంలో శివాజీ పూర్తి చేయలేకపోతాడు. ఇక ఆ బాధ్యతని ప్రియాంకకి ఇవ్వమని శివాజీతో బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీ ఎవరికి తెలియకుండా ప్రియాంకకి తన దగ్గర ఉన్న ఫోన్ ని ఇస్తాడు. " ఐ ఆమ్ డెడ్" అనే స్టిక్కర్ ని గౌతమ్ కి వేసి డెడ్ చేయాలని ప్రియాంకతో బిగ్ చెప్పాడు. అమర్ దీప్ , అంబటి అర్జున్ పోలీసులుగా ఉండి.. ఒక్కోక్కరి ఇంటరాగేషన్ చేసి హంతకులెవరో కనిపెట్టారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందని బిగ్ బాస్ పోలీసులైన అంబటి అర్జున్  , అమర్ దీప్ లని అడుగగా .. శివాజీ అని వాళ్లు చెప్పడంతో.. కారణాలేంటని శివాజీ అడిగాడు. ఎన్నడు లేనివిధంగా జోస్ అలుకాస్ రూమ్ లోకి వెళ్ళి పడుకొని శివాజీ కనిపించాడు. వాష్ రూమ్ కి, బయటకి ఎక్కువగా తిరిగాడు. అదీ కాక ప్రియాంకతో కలిసి చాణక్యుడులాగా ఏదో ప్లాన్ చేశాడని మాకు డౌట్ ఉందని అంబటి అర్జున్ చెప్పగా.. మీ డౌట్ నిజమే మర్డరర్ శివాజీనే అని బిగ్ బాస్ చెప్పాడు. కానీ అతను రెండు హత్యలకు మాత్రమే కారణం.. మిగిలిన రెండు హత్యలు చేసిన హంతకుడు మీ మధ్యలోనే ఉన్నాడని బిగ్ బాస్ వారితో చెప్పాడు. దాంతో అందరు షాక్ అయ్యారు. ఆ తర్వాత‌ పోలీసులు శివాజీని జైల్లో వేశారు. ఇక శివాజీని జైల్లో వేసారు పోలీసులు. మళ్ళీ ఒక్కొక్కరిని ఇంటారాగేట్ చేసిన అమర్ దీప్  , అంబటి అర్జున్ లకి ప్రియాంకే హంతకురాలని తెలుస్తుంది. ఎవరు హంతకులని బిగ్ బాస్ అడుగగా.. ప్రియాంక అని అనుకుంటున్నామని పోలీసులు చెప్పారు. ఏంటి రీజన్ అని ప్రియాంక అడుగగా. . ఆపిల్ మీద అలా రాసి ఉందని సీక్రెట్ రూమ్ దగ్గర ఫస్ట్ చూసింది నువ్వే. అక్కడ నీకేం పని, యావర్ ని ఇన్ ఫ్లూయన్స్ చేసి వాష్ రూమ్ దగ్గరికి పంపించావని కారణాలు చెప్పారు పోలీసులు. మీ అనుమానం నిజమే రెండవ మర్డరర్ ప్రియాంకే అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీ, ప్రియంక దగ్గర ఉన్న ఫోన్, గొలుసులని తీసుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లో ప్రశాంత్, అశ్వినిశ్రీ, గౌతమ్, యావర్ లు ఇప్పటివరకు టాస్క్ లో డెడ్ అయ్యారు.