Guppedantha Manasu : గతం మొత్తం చెప్పిన రిషి.. ఏంజిల్ నమ్మలేదుగా!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -915 లో.. ఏంజిల్ ఇంటికి వచ్చి వసుధార, రిషిల గురించి అలోచిస్తుంది. దేని గురించి ఆలోచిస్తున్నావ్? రిషి నీతో పెళ్లి వద్దని చెప్పి వసుధారని పెళ్లి చేసుకున్నాడని బాధపడుతున్నావా అని విశ్వనాథ్ అనగానే.. రిషి పెళ్లికి కనీసం నన్ను పిలవలేదు. నాతో అంత క్లోజ్ గా ఉండే వసుధార కూడా ఒక్కమాట కూడా చెప్పలేదని ఏంజిల్ కోపంగా ఉంటుంది. మరొక వైపు వసుధార, రిషి ఇద్దరు కాలేజీలో ఏంజిల్ మాట్లాడిన తీరు గుర్తుకు చేసుకుంటారు. అసలు ఏంజిల్ తో ముందే అంత చెప్పి ఉంటే బాగుండు. ఇప్పుడు ఏంజిల్ ని ఫేస్ చెయ్యలేకపోతున్న అని రిషి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు విశ్వనాథ్ దగ్గరికి వెళ్తారు. మరొక వైపు ఫణింద్ర, శైలేంద్ర, దేవాయని ముగ్గురు కలిసి మహేంద్ర దగ్గరికి వెళ్తారు. రిషి ఎక్కడ అని మహేంద్రని శైలేంద్ర అడుగుతాడు. బయటకు వెళ్ళాడని మహేంద్ర చెప్తాడు. అయిన మళ్ళీ మళ్ళీ శైలేంద్ర అడుగుతూనే ఉంటాడు. దాంతో ఫణీంద్ర కోపంగా.. ఆపుతావా అంటూ శైలేంద్రని అంటాడు. నేను నీ విషయంలో తప్పుగా మాట్లాడానని మహేంద్రతో దేవయాని అంటుంది. మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య అని మహేంద్ర అనగానే.. కుదరదని దేవయాని అంటుంది. పిలిచింది నన్ను, మిమ్మల్ని కాదు మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండని ఫణింద్ర వాళ్ళకి కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర కలుగజేసుకొని అందరం కలిసే భోజనం చేద్దామని అంటాడు. మరొక వైపు రిషి వసుధార ఇద్దరు విశ్వనాథ్ ఇంటికి వెళ్తారు. ఏంజిల్ ని పెళ్లి చేసుకోమని చెప్తే పెళ్లి అయిందని చెప్పావ్? మరి వసుధారని ఎలా పెళ్లి చేసుకున్నావని రిషిని విశ్వనాథ్ అడుగుతాడు. ఎందుకంటే పదిహేను రోజుల్లో నీ భార్యని చూపించకపోతే నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పాను కాదా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇలా వసుధారని పెళ్లి చేసుకున్నాడని ఏంజిల్ కోపంగా మాట్లాడుతుంది. అది కాదు ఏంజిల్ అంటూ రిషి తన తల్లి కోసం పెళ్లి చేసుకున్నానని జగతి, మహేంద్ర ఇద్దరు తన తల్లితండ్రులని తనకి ఇది వరకే వసుధారతో ఎంగేజ్ మెంట్ అయిందని ఏంజిల్, విశ్వనాథ్ కి రిషి చెప్తాడు. కానీ ఏంజిల్ మాత్రం.. కథ బాగా అల్లావ్. ఇప్పటికి ఇప్పుడు ఎలా ఇంత బాగా అల్లావని అనగానే రిషి షాక్ అవుతాడు. మరి రిషి చెప్పిన నిజాన్ని ఏంజిల్ నమ్ముతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: తన భర్తని కాపాడమని ఇంట్లోని వాళ్ళని వేడుకున్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -248 లో.. కావ్యని రాజ్ భార్య గా ఒప్పుకొని ఇద్దరు హ్యాపీగా ఉండండని సితారామయ్య చెప్తాడు. కానీ రాజ్ మౌనంగా ఉంటాడు. ఈ ఇంట్లో అందరు మీకు నచ్చినట్టుగా ఉండేలా చూసుకొనే బాధ్యత నాది. మీరు వచ్చి రెస్ట్ తీసుకోండంటు సీతారామయ్యని ఇందిరాదేవీ గదిలోకి తీసుకొని వెళ్తుంది.  మరొకవైపు తన కూతుళ్ల విషయంలో పెద్దయన ఏం నిర్ణయం తీసుకున్నాడోనని కనకం టెన్షన్ పడుతుంది. కావ్యని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని కనకం అనగానే.. నిజమే నువ్వు ఒకసారి కావ్యకి ఫోన్ చేసి విషయం కనుకోమ్మని కృష్ణమూర్తి అంటాడు కనకం కావ్యకీ ఫోన్ చేస్తుంది. మమ్మల్ని కోడళ్లుగా ఇక్కడే ఉండమని తాతయ్య చెప్పారు కానీ తాతయ్యకి క్యాన్సర్ అని కావ్య బాధపడుతు చెప్పగానే.. కనకం కృష్ణమూర్తి ఇద్దరు షాక్ అవుతారు.. ఆ తర్వాత ఇద్దరు సీతారామయ్యని చూసి రావాలని దుగ్గిరాల ఇంటికి బయలుదేర్తారు. మరొక వైపు కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేసి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతుంది. ఇప్పుడు కాదంటూ సీతారామయ్య గురించి చెప్పి బాధపడుతాడు. అనామిక అర్థం చేసుకొని తాతయ్య జాగ్రత్త అని చెప్తుంది. మరొకవైపు ఇంట్లో గొడవలు జరుగకుండా నువ్వే చూసుకోవాలని అపర్ణకు సుభాష్ చెప్తాడు. అప్పుడే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు రావడం చూసి వాళ్లని అపర్ణ అవమానిస్తుంది. వాళ్లు వెనక్కి తిరిగి వెళ్తుంటే సుభాష్ ఆపి.. నాన్నగారు గదిలో ఉన్నారని చెప్పి వాళ్ళని లోపలికి పంపిస్తాడు. మరొకవైపు అపర్ణ అన్న మాటలు కావ్య వింటుంది. ఎందుకు వచ్చారు నాన్న అంటూ బాధపడుతుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి, కనకం ఇద్దరు సీతారామయ్య దగ్గరికి వెళ్తారు.. మీ కూతుళ్లు ఎప్పుడు ఇక్కడే ఉంటారని సీతారామయ్య అనగానే.. ఇంత మంచి మనసున్న మీకేం కాదంటు కనకం, కృష్ణమూర్తి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. మరొక వైపు స్వప్న చేసిన మోసాన్ని గుర్తుకు చేస్తు స్వప్న తో రాహుల్ గొడవపడుతుంటే రుద్రాణి వచ్చి.. ఇంట్లో ఇలా గొడవలు పడితే మనల్ని ఇంట్లో నుండి గెంటేస్తారని చెప్తుంది. మరొక వైపు కావ్య గదిలోకి రాగానే రాజ్ వెళ్లిపోతు ఉంటాడు. కావ్య ఆగమని చెప్పగానే.. కావ్య బాధపడేలా రాజ్ మాట్లాడి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో తన భర్త ని కాపాడుకోవాలని ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్స్ తీసుకొని వచ్చి నేను సుమంగళి గానే పోవాలి. నా భర్త ప్రాణాన్ని కాపాడండి. ఏ దేశంలో నా భర్తని కాపాడే  డాక్టర్ లు ఉంటారో అక్కడకి  తీసుకొని వెళ్లి  కాపాడండి. ఎంత ఖర్చు అయిన పర్వాలేదంటూ ఇందిరాదేవి ఏడుస్తుంది. ఎంత డబ్బులు ఖర్చు చేసిన ఆస్తి తరుగుతుంది కానీ ప్రయోజనం ఏముందని రుద్రాణి అంటుంది. రుద్రాణి అన్న మాటకీ రాజ్ ఎలా స్పందిస్తాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే?  

BiggBoss 7:కన్నయ్య.. నేను కూడా అమ్మనే.. పెళ్ళెప్పుడు చేసుకుందాం శివ్?

బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. నిన్న శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ రావడంతో మోస్ట్ ఎమోషనల్ గా సాగింది ఎపిసోడ్.. ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ రావడం, తనకి శ్రీమంతం చేయడం అదంతా ఆకట్టుకోగా, కాసేపటికి అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ వచ్చి బోరున ఏడిపించేసింది. ఇక ఈ రోజు రిలీజైన రెండు ప్రోమోలు మరింత ఎమోషనల్ గా ఉన్నాయి. మొదటి ప్రోమోలో కన్నయ్య... అంటూ అమ్మ పిలుపు విని హౌస్ లోని వాళ్ళంతా ఆశ్చర్యకరంగా గేట్ వైపు చూశారు. ఎవరు రాకపోవడంతో హౌస్ మేట్స్ అంతటా వెతికారు. ఇక కన్నయ్య పంచె వచ్చిందా అని వినపడగానే గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. కాసేపటికి మెయిన్ గేట్ నుండి గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చీ రాగానే గౌతమ్ ని హత్తుకొని ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ తో.. గౌతమ్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిందంటూ చెప్పుకొచ్చింది. కాసేపటికి యావర్ కి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోషనల్ అవ్వగా.. నేను కూడా నీకు అమ్మనే, బయటకు వచ్చాకా మా ఇంటికి రా యావర్ అంటు గౌతమ్ వాళ్ల అమ్మ  అంది. ఇక హౌస్ మేట్స్ అందరికి గోరుముద్దలు తినిపించగా ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆట బాగా ఆడుతున్నావ్. ఇలాగే ఉండు. నీలాగే ఉండు అంటు గౌతమ్ కి వాళ్ళ అమ్మ కొన్ని విషయాలని షేర్ చేసింది. ఇక రెండో ప్రోమోలో.. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ వచ్చాడు. వచ్చీ రాగానే ఎర్రగులాబీతో ప్రపోజ్ చేశాడు. హౌస్ మేట్స్ అంతా అలానే చూస్తు ఉండిపోయారు. కాసేపటికి పెళ్ళెప్పుడు అని శివ్ ని ప్రియాంక అడుగగా.. నువ్వు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే చేసుకుందామని శివ్ అన్నాడు. కాసేపటికి శోభాశెట్టి వచ్చి శివ్-ప్రియంకలతో మాట్లాడింది. ఇక వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ అనగానే ప్రియాంకకి ముద్దుచ్చి బయటకొచ్చేశాడు. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. అయితే హౌస్ లో ఈ రోజు కూడా గుండెల్ని పిండేసే ఎపిసోడ్ రెడీ అయిందని ఈ ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది.    

ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్..రెస్పాండ్ అవుతున్న సెలెబ్స్

ఫస్ట్ జనరేషన్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది.  ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అలాంటి ఝాన్సీ రీసెంట్ గా ఓ విషాద పోస్టు పెట్టారు.  తన దగ్గర  పనిచేసే శ్రీను అనే పర్సనల్ అసిస్టెంట్  35 ఏళ్ల  వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. "శ్రీను, శీను బాబు అని నేను ముద్దుగా పిలుచుకునేదాన్ని. ఆటను నాకు మెయిన్ సపోర్ట్ సిస్టంగా ఉండేవాడు. అతను హెయిర్ స్టైలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి పర్సనల్ అసిస్టెంట్ గా ఎదిగాడు.  నా పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను సున్నిత మనస్కుడు, జెన్యూన్ గా, చాల మంచి హ్యూమరస్ పర్సన్ కూడా. అతన్ని నేనొక తమ్ముడి లెక్క చూసుకుంటాను. ఇంత చిన్న వయసులో గుండె పోటుతో మరణించడం నాకు చాల బాధను కలిగిస్తోంది.జీవితం ఒక బుడగలాంటిది" అని సుదీర్ఘ మెసేజ్ ని పెట్టారు. ఝాన్సీ పోస్ట్ మీద హంసానందిని హార్ట్ బ్రోకెన్ అన్నారు,  యాంకర్ శిల్పా స్పందిస్తూ షాకింగ్ అని కామెంట్ పెట్టింది. మీకు జరిగిన నష్టానికి సారీ, ఓం శాంతి అంటూ అడివి శేష్ కామెంట్ చేశాడు. సో స్యాడ్ అంటూ సురేఖా వాణి,  ఓం శాంతి అంటూ ప్రగతి ఇలా చాలా మంది సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అనిత చౌదరి వాట్ ఆర్ యు టాకింగ్...లయ ఐ యాం సారీ అంటూ రెస్పాండ్ అవుతున్నారు. ఇక గాయత్రీ భార్గవి రియాక్ట్ అవుతూ.. ఇది చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది.. చాలా దారుణం.. ఆయన చాలా నిజాయితీ గల మనిషి.. నా కెరీర్ ప్రారంభంలో నేను ఆయన్ని చూసాను.. గత వారమే ఆయన్ను కలిశాను.. జీవితం ఊహాతీతం అంటూ ఎమోషనల్ అయింది.  సారీ ఝాన్సమ్మ అంటూ నందినీ రెడ్డి ఇలా సెలెబ్రిటీలంతా అంతా కూడా మెసేజెస్ పోస్ట్ చేసి స్పందిస్తున్నారు.  

BiggBoss Season 6 Telugu Arohi Rao: తొక్కలో సమాజం ఆక్సెప్ట్ చేసిన చేయకపోయిన పర్లేదు!

బిగ్ బాస్ సీజన్-6 లోని కొంతమంది ఇప్పుడు ట్రెండింగ్ లొ ఉంటున్నారు. ఇనయా సుల్తానా, ఫైమా, ఆరోహీ రావు‌ ఇలా కొంతమంది రెగ్యులర్ గా వ్లాగ్స్ రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు.  అయితే ఆరోహీ  రావు  తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు రీల్స్, ఆస్క్ మీ క్వశ్చనింగ్ అంటూ తన అభిమానులకి టచ్ లోనే ఉంటుంది.  ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు  చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది ఆరోహీ.. బిగ్ బాస్ సీజన్-6 లో మీకు అసలు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరని ఒకరు అడుగగా.. అందరు అని రిప్లై ఇచ్చింది. మీరు ఓకే అంటే పెళ్ళి చేసుకుందామని ఒకరు అడుగగా.. ఒకే నో అని రిప్లై ఇచ్చింది ఆరోహీ. మీరు శ్రీహాన్ లవ్ లో ఉన్నారంట నిజమేనా అని ఒకరు అడుగగా.. హా నువ్వొచ్చి మా పెళ్ళికి అక్షింతలు వేయు. ఏడ దొరికన సంతరా ఇది అని ఆరోహీ అంది. హలో రావు గారు.. మీరు సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నారంటే ఈ సమాజం నన్ను ఆక్సెప్ట్ చేస్తుందా అని ఒకరు అడుగగా.‌. తొక్కలో సమాజం ఆక్సెప్ట్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత నేను ఆక్సెప్ట్ చేయనని ఆరోహీ అంది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.   

biggBoss Season 7 Telugu Family Week : మోస్ట్ ఎమోషనల్ గా సాగిన ఫ్యామిలీ వీక్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామిలీ వీక్ తో మోస్ట్ ఎమోషనల్ గా సాగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మొదటగా శివాజీ కొడుకు వచ్చి అందరిని సర్ ప్రైజ్ చేయగా, ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ ఎంట్రీ ఇచ్చింది. అంబటి అర్జున్ భార్య సురేఖ బిగ్ బాస్ హౌస్ లోకి  వెళ్ళగానే అర్జున్ తో పాటు అందురు షాక్ అయ్యారు. ముఖ్యంగా అంబటి అర్జున్ సురేఖను చూడగానే ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపు ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. నిన్ను చాలా మిస్ అవుతున్నానని అర్జున్ తో సురేఖ అంది‌. ఆ తర్వాత హౌస్ లో ఎవరెలా ఉంటున్నారు? బయట ఎలా ఉందని హౌస్ మేట్స్ అడుగగా.. ఏమో తెలియదు.. గుర్తులేదు. మర్చిపోయా అని సురేఖ కామెడీ చేసింది. దాంతో హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. కాసేపటికి అంబటి అర్జున్-సురేఖ దంపతులిద్దరు సపరేట్ గా మాట్లాడుకున్నారు. నువ్వు గేమ్స్ ఆడుతున్నావ్ కానీ హౌస్ మేట్స్ తో సరిగ్గా ఉండటం లేదని, సరిగ్గా రియాక్ట్ అవ్వడం లేదని సురేఖ అంది. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. సురేఖ మిస్ అవుతున్నానని అనగానే.. అంబటి అర్జున్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక హౌస్ లో సురేఖ సీమంతం కూడా చేశారు. ఆ తర్వాత అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. అలా వాళ్ళ అమ్మని చూసిన అశ్వినిశ్రీ చిన్నపిల్లలా ఏడ్చేసింది. కాసేపు ఇద్దరు సపరేట్ గా మాట్లాడుకున్నారు. "నువ్వు ప్రతీదానికి ఏడుస్తున్నావ్. అలా ఏడ్వకూడదు. నిన్ను నువ్వు స్ట్రాంగ్ అని నిరూపించుకో. నువ్వు వీక్ అనుకునేవాళ్ళకి నీ ఆటతో నిరూపించు" అంటూ అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. కాసేపటికి సోను అనే కుక్కపిల్ల ఫోటోని అశ్వినిశ్రీకి గిఫ్ట్ గా తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ. అది చూసి అశ్వినిశ్రీ ఏడ్చేసింది. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ అన్నప్పుడు.. ఈ ఒక్క రోజు మా అమ్మని హౌస్ లో ఉంచుకుంటాను బిగ్ బాస్ అని అశ్వినిశ్రీ అనేసరికి అందరు ఎమోషనల్ అయ్యారు. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మొత్తంగా ముగ్గురు కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీలు వచ్చారు.  

Shivaji: హౌస్ మేట్స్ తో జాగ్రత్తగా ఉండు నాన్న!

బిగ్ బాస్ సీజన్-7 నిన్నటి వరకు టాస్క్, ఎలిమినేషన్, నామినేషన్ అంటు ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తుంటే వాళ్ళ మధ్య బాండింగ్ అంతా బిగ్ స్క్రీన్ పై చూస్తూ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే ఫ్యామిలీ వీక్ కి ఇంత క్రేజ్. ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివాజీ పెద్ద కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. హౌస్ లో అందరు మాములుగా ఎవరి పనుల్లో వారున్నప్పుడు.. శివాజీ మీరు‌ మెడికల్ రూమ్ కి రండి అని బిగ్ బాస్ అనగానే.. ఒకే బిగ్ బాస్ అంటూ శివాజీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ శివాజీని చూసి.. నొప్పి ఏం అయినా ఉందా? అని అడిగాడు. కాస్త ఉందని శివాజీ చెప్తాడు. ఒక రెండు మూడు రోజుల్లో అంతా సెట్ అవుతుందని డాక్టర్ చెప్పడంతో.. ఎస్ ఐ విష్.. నేను ఆడతానని శివాజీ చెప్పి బయటకు వస్తుంటాడు. అప్పుడే నాన్న అని వెంకట్ అనగానే.‌. వెనక్కి తిరిగి చూస్తాడు శివాజీ. మాస్క్ గ్లాసెస్ అన్నీ తీసేసిన వెంకట్ ని చూసి శివాజీ హత్తుకొని ఏడ్చేశాడు. కాసేపటికి శివాజీ, వెంకట్ బయటకు వచ్చి.. నా కొడుకు అంటు హౌస్ మేట్స్ తో శివాజీ చెప్పడంతో అందరు మోస్ట్ సర్ ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఇక పల్లవి ప్రశాంత్ పరుగున వెళ్ళి హత్తుకున్నాడు. శోభాశెట్టి, అమర్ దీప్, భోలే అందరు సర్ ప్రైజ్ అయ్యారు. ఇక అందరిని కలిసాక శివాజీతో ఒంటరిగా మాట్లాడాడు వెంకట్. నువ్వు వస్తావనుకోలేదు‌. తమ్ముడు వస్తాడనుకున్నాను. నీకు సిగ్గు కదా అని శివాజీ అనగానే.. నాకు యూనివర్సిటీది డేట్ 8th కి  ఉంది. మళ్ళీ నువ్వు వచ్చేసరికి కలిసే వీలుంటదో ఉండదో అని వచ్చానని వెంకట్ అనగానే.. శివాజీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్-7 లోనే మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అవుతుంది.  శివాజీ కొడుకు వెంకట్ బయటకు వచ్చే ముందు హౌస్ లో పల్లవి ప్రశాంత్, యావర్ లతో కాకుండా మిగతా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండని అనగానే.. సరేనని అన్నాడు శివాజీ. ఇంకా కొన్ని మాటలు జారుతున్నాయి, అంటే మన ఇంట్లో మీరు ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడుతున్నారు. అది వేరేవాళ్ళు వేరేలా తీసుకుంటారని వెంకట్ అనగానే.. నేనా, నెవెర్ అంటూ శివాజీ సమాధానమిచ్చాడు. ఇక పల్లవి ప్రశాంత్, యావర్ లు బాగా చేసుకున్నారని వారికి స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు వెంకట్. ఇక కొన్ని హింట్స్ అండ్ టిప్స్ కూడా ఇచ్చాడు వెంకట్. బయటకు వచ్చేముందు ఫన్ మిస్ అవుతుంది నాన్న, మాకు ఫన్ కావాలి అంటూ వెంకట్ అనగానే.. అలాగే నాన్న ఇకనుండి చూడు ఎలాగ ఉంటానో అని శివాజీ అన్నాడు. కొడుకు ఇచ్చిన ఈ కాన్ఫిడెన్స్ తో శివాజీ ఆటతీరు మరింత మెరుగుపడే అవకాశం ఉందని తెలుస్తుంది.

Krishna Mukundha Murari: కృష్ణ కోసం కాఫీ చేసిన మురారి.. మాడ్చుకున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -308 లో.. భవాని దగ్గరకు మురారి వచ్చి.. మీరెందుకు వేణి డాక్టర్ ని దూరం పెడుతున్నారు. లేదని మాత్రం చెప్పకండని మురారి అడుగుతాడు. లేదని చెప్పను. అవునని దూరం పెట్టామని భవాని అంటుంది. ఆ తర్వాత ఎందుకు దూరం పెట్టానో చెప్తాను కానీ నువ్వు వెళ్లి మళ్ళీ తనని అడగవద్దని భవాని అనగానే.. మురారి సరేనంటాడు. తనని డాక్టర్ చదివించింది మనమే కానీ ఆ కృతజ్ఞత వాళ్ళు చూపించలేదు. మన కుటుంబాన్ని దారుణంగా మోసం చేశారు. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే నీకు ఈ సిచువేషన్ రావడానికి కూడా కారణం వాళ్ళేనని భవాని చెప్తుంది. ఇక నువ్వు ఎక్కువగా ఆ అమ్మాయితో ఉండకు నేను చెప్పినట్టు వింటావా అని భవాని అనగానే మురారి వింటానని అంటాడు. దాంతో భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ నిద్ర నుండి లేచి బయటకు రాగానే మురారి ఉంటాడు.  మీకు కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి కృష్ణ లోపలికి వెళ్తుంది. అప్పుడే గ్యాస్ అయిపోతుంది. మురారి కిచెన్ లోకి వచ్చి మిమ్మల్ని వేణి అనే కంటే కృష్ణ అని పిలవాలని ఉంది. మీకు ఒకే నా అని మురారి అడుగుతాడు. ఒకే అని కృష్ణ చెప్తుంది.ఇద్దరం కాఫీ తాగాలి కాబట్టి మనం మా ఇంట్లోకి వెళ్లి తాగుదామని కృష్ణ చెయ్యి పట్టుకొని మురారి తీసుకొని వెళ్తాడు. మరొక వైపు మురారి ఎక్కడ కన్పించకపోవడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు వస్తుంటే రేవతి, మధు చూసి సంతోషపడతారు. ముకుంద మాత్రం కోపంగా చూస్తుంది. ఆ తర్వాత కృష్ణకి కాఫీ చేసుకొని వస్తాడు మురారి. ఆ తర్వాత మురారి తన గదిని చూపిస్తానంటూ కృష్ణని పైకి తీసుకొని వెళ్తాడు. ఒక్కపుడు కృష్ణ మురారి ఇద్దరు ఉన్న గదికి కాకుండా ఇప్పుడు ముకుంద ఉన్న గదిలోకి తీసుకొని వెళ్తాడు. అది చూసి.. నేనేంటి ముకుంద గదికి తీసుకొని వచ్చానని మురారి అనుకుంటాడు. ఈ రూమ్ నచ్చింది ముకుంద. నువ్వు వేరే రూమ్ కీ షిఫ్ట్ అవ్వు అని మురారి చెప్తాడు. ఆ తర్వాత మనం షాపింగ్ కీ వెళ్దామని అన్నావ్ కాదా అని మురారితో ముకుంద అంటుంది. అవును నువ్వు కూడా రావచ్చు కాదా కృష్ణ అని మురారి అనగానే.. కృష్ణ ఇబ్బంది పడుతుంటే రేవతి మధు ఇద్దరు వచ్చి వెళ్ళమని చెప్తారు. అప్పుడు కృష్ణ సరే అంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఏసీపీ సర్ నాకు దగ్గర అవుతారని రేవతితో కృష్ణ అంటుండగా అప్పుడే ముకుంద వచ్చి.. అది జరగదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu: గుప్పెడంత మనసులో కొత్త ట్విస్ట్.. విశ్వనాథ్ ఇంటికి అనుపమ!

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -914 లో.. వసుధార, రిషి ఇద్దరు విష్ కాలేజీకీ వెళ్ళడానికి హాల్లోకి వస్తారు. అక్కడే ఉన్న మహేంద్రకి విష్ కాలేజీకి వెళ్తున్నాము. మీరు రండి అని మహేంద్రతో వాళ్ళిద్దరు అనగానే.. నేను రాలేను, మీరు వెళ్ళండి. నా గురించి టెన్షన్ పడకండి. నేను ఎక్కడికి వెళ్ళను డ్రింక్ కూడా చెయ్యనని మహేంద్ర చెప్తాడు. మామయ్య మీరు మన కాలేజీ కీ వెళ్ళండని వసుధార అనగానే.. నేను వెళ్ళను అక్కడకి వెళ్తే జగతి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని మహేంద్ర అంటాడు. మరొక వైపు జగతిని షూట్ చేసిన దగ్గరికి ముకుల్ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. పాండియన్ కూడా ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్నాడు కాబట్టి ఎలా జరిగింది? ఏంటి అని అతన్ని ముకుల్ అడుగుతాడు. ఆ తర్వాత అక్కడికి రిషి, వసుధారలు వస్తారు. జగతి మేడమ్.. మీతో ఏం మాట్లాడాలనుకున్నారని ముకుల్ అడుగుతాడు. నాకు తెలియదని రిషి అంటాడు. మరొక వైపు శైలేంద్ర మనిషి అక్కడ ముకుల్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి శైలేంద్రకి ఫోన్ చేసి చెప్తాడు. మరొక వైపు సీసీ టీవీలో షూట్ చేసిన అతన్ని బైక్ నెంబర్ కన్పిస్తుంది. దాని ప్రకారం అడ్రస్ ట్రేస్ చేసాం కానీ ఆ అడ్రస్ గల ఇంటికి వెళ్తే  అతను చనిపోయడని తెలిసింది కానీ ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తున్నాం. ఏదైనా క్లూ దొరకవచ్చు కానీ అతను ఎవరో గాని ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడుతున్నాడు. కానీ ఖచ్చితంగా పట్టుకుంటానని రిషికి ముకుల్ చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు విష్ కాలేజీకీ వెళ్తారు. అక్కడున్న వాళ్లంతా రిషి, వసుధారలకీ గ్రాండ్ వెల్ కమ్ చెప్తారు.  అప్పుడే అక్కడికి విశ్వనాథ్, ఏంజిల్ ఇద్దరు వస్తారు. రిషి వసుధారలని జంటగా చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఏంజిల్ కోపంగా ఏదో అడగబోతుంటే.. ఆగు ఏంజిల్ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని విశ్వనాథ్ అంటాడు. చాలా థాంక్స్ నీ వైఫ్ ని చూపించినందుకని రిషితో ఏంజిల్ కోపంగా అంటుంది.  ఆ తర్వాత కాలేజీలో ఫాకల్టీ తో కాసేపు రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుతారు. ఇంటికి రండి అని విశ్వనాథ్ అంటాడు. సరే అని రిషి అనగానే.. వెయిట్ చేస్తుంటానని ఏంజెల్ అంటుంది. మరొక వైపు అరకు నుండి అనుపమ విశ్వనాథ్ ఇంటికి వస్తుంది. ఎవరని పనిమనిషి అడుగుతుంది. దానికి సమాధానం చెప్పకుండా.. పైన రూమ్ కీస్ ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. మళ్ళీ నాకు తెలుసులే అని అనుపమ అనగానే.. మీకేలా తెలుసని పనిమనిషి అడుగుతుంది. అది నా రూమ్ అంటూ పైకి వెళ్తుంది. అసలు అనుపమ విశ్వనాథ్ కి సంబంధం ఏంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Brahmamudi:తాతయ్యకు క్యాన్సర్.. మీరు ఇంట్లో నుండి వెళ్లిపోండి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -247  లో.. ఇంటిపెద్ద ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఎవరికి నచ్చిన నచ్చకపోయిన అందరూ అంగీకరించక తప్పదని ఇందిరాదేవి అందరిని హెచ్చరిస్తుంది. నేను మాట్లాడాలంటూ రాహుల్ మధ్యలో కలుగుజేసుకొని మాట్లాడుతాడు.  నేను ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను. స్వప్న ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను కానీ మీ అందరూ పెళ్లికి ఒప్పుకున్నాక స్వప్నని పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు తనకి కష్టం తెలియకుండా చూసుకున్నాను కానీ అలాంటి నన్ను ఈ కుటుంబాన్ని స్వప్న మోసం చేసింది. ఇక తనని నా భార్యగా ఒప్పుకోను తాతయ్య. మాకు విడాకులు ఇప్పించండని రాహుల్ అనగానే అందరూ షాక్ అవుతారు. మరొక వైపు అపర్ణ కలుగుజేసుకొని స్వప్నతో పాటు కావ్య కూడా తప్పు చేసింది. ఇద్దరిని ఇంట్లో నుండి పంపించాలని అంటుంది.   ఆ తర్వాత రుద్రాణి మీ అక్క చెల్లెలు. ఇక్కడ నుండి వెళ్లిపోండని అంటుంది. ఇక్కడ నుండి వెళ్ళేది లేదు. మమ్మల్ని బయటకు పంపిస్తే అందరిని బయటకు లాగుతాను. మీకు సపోర్ట్ చేసేవాళ్ళని కూడా అని స్వప్న అనగానే.. సుభాష్ ఒక్కసారిగా ఆపండి అంటూ అరుస్తాడు. స్వప్నది ఎంత తప్పు ఉందో, రాహుల్ ది కూడా అంతే తప్పు ఉంది. రుద్రాణిది కూడా తప్పు ఉంది. కాబట్టి మీరు అందరూ ఇంట్లో నుండి వెళ్లిపోండని సుభాష్ అనగానే.. మేమ్ ఎందుకు వెళతామని రుద్రాణి అడుగుతుంది. మేమ్ వెళ్ళిపోతాం మా ఆస్తి మాకు ఇవ్వండి అని స్వప్న అనగానే.. మీ ఆస్తి ఎక్కడిది నీ పుట్టింటి నుండి నువ్వు ఏమైనా తెచ్చావా? నీ అత్త ఏమైనా తెచ్చిందా అని అపర్ణ అడుగుతుంది.. మాకు ఆస్తి లేదా? మా నాన్న మమ్మల్ని చూసుకుంటానని బాధ్యత తీసుకున్నారు చెప్పండి నాన్న అని సీతారామయ్యని రుద్రాణి అడుగుతుంది. ఆ తర్వాత సితారామయ్య కళ్ళు తిరిగి పడిపోబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. ఆస్తి అడిగేసరికి ఇదొక నాటకమని రుద్రాణి అనగానే రాజ్ కోపంగా సీతారామయ్యకి ఉన్న క్యాన్సర్ గురించి చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను ఉండగానే నా కుటుంబం ముక్కలు అవుతుందని సీతారామయ్యు బాధపడుతుంటాడు. ఇందిరాదేవి అందరికి ఈ కుటుంబం నుండి ఎవరు ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఇక చేసేదేమీ లేక అందరూ ఒప్పుకుంటారు. ఆ తర్వాత రాజ్ కావ్యల చెయ్యి తీసుకొని ఇక నుండి అయిన కావ్యని భార్యగా ఒప్పుకోమని చెప్తాడు‌ సీతారామయ్య. దానికి రాజ్ మౌనంగా ఉంటాడు. రాజ్ దగ్గరకి కావ్య రాగానే రాజ్ వెళ్లిపోతుంటే గొడవ పడిన ప్రతిసారి మాట్లాడకుండా ఉంటే బంధం ఎలా నిలబడుతుందని కావ్య అనగానే.. వద్దని అనుకున్నప్పుడు  బంధం నిలబడినా, తెగిపోయిన ఒకటే అవుతుందని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు. మరి కావ్యని రాజ్ క్షమించగలడా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Ambati Arjun: బిగ్ బాస్ హౌస్‌లో సురేఖ సీమంతం... ఏమో గుర్తులేదు.. మర్చిపోయా!

బిగ్ బాస్ సీజన్-7 నిన్నటి వరకు టాస్క్, ఎలిమినేషన్, నామినేషన్ అంటు ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తుంటే వాళ్ళ మధ్య బాండింగ్ అంతా బిగ్ స్క్రీన్ పై చూస్తూ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే ఫ్యామిలీ వీక్ కి ఇంత క్రేజ్. అయితే తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో మరింత ఆసక్తిగా ఉంది.  ఫ్యామిలీ వీక్ లో భాగంగా మొదటగా శివాజీ కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. తాజాగా అంబటి అర్జున్ భార్య సురేఖ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు మరో ప్రోమో రిలీజ్ చేశారు. తను వచ్చీ రాగానే హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా అంబటి అర్జున్ సురేఖను చూడగానే ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపు ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. నిన్ను చాలా మిస్ అవుతున్నానని అర్జున్ తో సురేఖ అంది‌. ఆ తర్వాత హౌస్ లో ఎవరెలా ఉంటున్నారు? బయట ఎలా ఉందని హౌస్ మేట్స్ అడుగగా.. ఏమో గుర్తులేదు. మర్చిపోయా అని సురేఖ కామెడీ చేసింది. దాంతో హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. కాసేపటికి అంబటి అర్జున్-సురేఖ దంపతులిద్దరు సపరేట్ గా మాట్లాడుకున్నారు. నువ్వు గేమ్స్ ఆడుతున్నావ్ కానీ హౌస్ మేట్స్ తో సరిగ్గా ఉండటం లేదని, సరిగ్గా రియాక్ట్ అవ్వడం లేదని సురేఖ అంది. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. సురేఖ మిస్ అవుతున్నానని అనగానే.. అంబటి అర్జున్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక హౌస్ లో సురేఖ శ్రీమంతం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ సీజన్-7 లోనే మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Shobha Shetty: బిగ్ బాస్‌లో వరెస్ట్ కెప్టెన్‌.. అమర్ దీప్ డైరెక్షన్‌లో శోభాశెట్టి

బిగ్ బాస్ హౌస్ లో వారానికో కెప్టెన్ మారుతుంటారు. వారమంతా టాస్క్ లలో ఆటతీరుతో, హౌస్ మేట్స్ తో మాట్లాడే మాటతీరుతో ఎవరైతే ఆకట్టుకుంటారో వారే కెప్టెన్ అవుతారని అందరికి తెలిసిందే. గతవారం జరిగిన టాస్క్ లలో శోభాశెట్టి గెలిచి కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. ఇక శోభాశెట్టి కెప్టెన్ అవ్వడంతోనే తన సీరియల్ బ్యాచ్ మేట్స్ అమర్ దీప్, ప్రియంకలకి కూడా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినట్టు స్పష్టమవుతుంది. నిన్న జరిగిన  నామినేషన్లలో కూడా రతికకి రెండు ఓట్లు, ప్రియాంకకి రెండు ఓట్లు వచ్చి టై అవ్వడంతో బిగ్ బాస్ కెప్టెన్ గా శోభాశెట్టి నిర్ణయం అడిగాడు‌. దాంతో తన బడ్డీ ప్రియాంకని నామినేషన్ లో ఉండనీయకుండా రతికను నామినేట్ చేసింది. ఆ తర్వాత హౌస్ లో ఎవరికేం పనులు అప్పగించాలని అమర్ దీప్, ప్రియంక చెప్తూండటాన్ని బిగ్ బాస్ లైవ్ లో చూపించాడు. ఆటల్లో కలిసే ఆడతారు. హౌస్ లో ఉన్నప్పుడు కలిసే ఉంటారు. కనీసం కెప్టెన్సీ అయిన కొంచెం ఫెయర్ గా చేయండ్రా బాబు అంటు నెటిజన్లు సీరియల్ బ్యాచ్ కి చురకలు వేస్తున్నారు. ఇక ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇక మాములుగా అతిచేసే శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ లు.. ఫ్యామిలీ వీక్ లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తారో అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కిచెన్ మొత్తం క్లీన్ చేసే డ్యూటీ శివాజీకి అప్పగిద్దామని అమర్ దీప్ శోభాశెట్టికి చెప్పడం, పల్లవి ప్రశాంత్ తో బాత్ రూమ్ లు క్లీన్ చేపిద్దామని ప్రియాంక చెప్పడంతో.. సరేనని శోభాశెట్టి అంది. ఇలా వాళ్ళిద్దరు చెప్పే మాటలు వింటు వరెస్ట్ కెప్టెన్  అనిపించుకుంటుంది శోభాశెట్టి. మరి వీకెండ్ లో శోభాశెట్టి కెప్టెన్ గురించి నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

శివాజీ కొడుకును బిగ్ బాస్ ఎందుకు తీసుకు వచ్చాడు... అసలు ఏం జరిగింది!

బిగ్ బాస్ సీజన్-7 నిన్నటి వరకు టాస్క్, ఎలిమినేషన్, నామినేషన్ అంటు ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తుంటే వాళ్ళ మధ్య బాండింగ్ అంతా బిగ్ స్క్రీన్ పై చూస్తూ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే ఫ్యామిలీ వీక్ కి ఇంత క్రేజ్. అయితే తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో మరింత ఆసక్తిగా ఉంది.  ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివాజీ పెద్ద కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. హౌస్ లో అందరు మాములుగా ఎవరి పనుల్లో వారున్నప్పుడు.. శివాజీ మీరు‌ మెడికల్ రూమ్ కి రండి అని బిగ్ బాస్ అనగానే.. ఒకే బిగ్ బాస్ అంటూ శివాజీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ శివాజీని చూసి.. నొప్పి ఏం అయినా ఉందా? అని అడిగాడు. కాస్త ఉందని శివాజీ చెప్తాడు. ఒక రెండు మూడు రోజుల్లో అంతా సెట్ అవుతుందని డాక్టర్ చెప్పడంతో.. ఎస్ ఐ విష్.. నేను ఆడతానని శివాజీ చెప్పి బయటకు వస్తుంటాడు. అప్పుడే నాన్న అని వెంకట్ అనగానే.‌. వెనక్కి తిరిగి చూస్తాడు శివాజీ. మాస్క్ గ్లాసెస్ అన్నీ తీసేసిన వెంకట్ చూసి శివాజీ హత్తుకొని ఏడ్చేశాడు. శివాజీ కళ్ళలో నీళ్ళు తిరిగాయనే చెప్పాలి. ఆ తర్వాత శివాజీ, వెంకట్ బయటకు వచ్చి.. నా కొడుకు అంటు హౌస్ మేట్స్ తో శివాజీ చెప్పడంతో అందరు మోస్ట్ సర్ ప్రైజ్ గా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక పల్లవి ప్రశాంత్ పరుగున వెళ్ళి హత్తుకున్నాడు. శోభాశెట్టి, అమర్ దీప్, భోలే అందరు సర్ ప్రైజ్ అయ్యారు. ఇక అందరిని కలిసాక శివాజీతో ఒంటరిగా మాట్లాడాడు వెంకట్. నువ్వు వస్తావనుకోలేదు‌. తమ్ముడు వస్తాడనుకున్నాను. నీకు సిగ్గు కదా అని శివాజీ అనగానే.. నాకు యూనివర్సిటీది డేట్ 8th కి  ఉంది. మళ్ళీ నువ్వు వచ్చేసరికి కలిసే వీలుంటదో ఉండదో అని వచ్చానని వెంకట్ అనగానే.. శివాజీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్-7 లోనే మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Shobha Shetty Remuneration: బిగ్ బాస్‌లో శోభాశెట్టి రోజువారి సంపాదన ఎంతో తెలుసా!?

బిగ్ బాస్ సీజన్ లో ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేషన్ అవ్వగా, తొమ్మిదవ వారం  టేస్టీ తేజ‌ ఎలిమినేటెడ్ అయ్యాడు. అయితే పదవ వారం ఎవరవుతారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది. గతవారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా రతిక, తేజ ఉన్నారు. ఇక రతిక ఎమోషనల్ అయింది. ఈ ఒక్కవారం నాకు ఛాన్స్ ఇవ్వండి సర్ అంటూ నాగార్జునని రిక్వెస్ట్ చేసుకుంది రతిక. నా చేతుల్లో ఏమీ లేదు. ప్రేక్షకులు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారంటూ నాగార్జున చెప్పాడు. దాంతో రతిక ఏడ్చేసింది. బిగ్ బాస్ సీజన్-7 లో హౌస్ మొత్తంలో వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని ప్రేక్షకులలో ఎవరిని అడిగినా మొదటగా వచ్చేది శోభాశెట్టి పేరే. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ప్రియంక అని చెప్తారు. ప్రస్తుతం రతిక, అశ్వినిశ్రీ కూడా అదే  బాటలో వెళ్తున్నారు. గతవారం శోభా శెట్టి లీస్ట్ లో ఉండగా బిగ్ బాస్ తేజని ఎలిమినేషన్ చేసి ఉల్టా పుల్టా అని కవర్ చేసాడు. అయితే ఇది కచ్చితంగా అన్ ఫెయర్ అంటు నెటిజన్లు ట్రోల్స్ చేశారు. శోభాశెట్టిని ఎలాగైనా ఎలిమినేషన్ చేయాలంటూ ట్విట్టర్ లో ఒక ట్రెండే క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.  శోభాశెట్టి హౌస్ లో ఆటల్లో గొడవలు పెట్టుకుంటూ, నోరేసుకొని పడిపోతు ఉంది. అయితే గత వారం ఎలిమినేషన్ అవ్వాల్సింది కానీ ఆట సందీప్ అయ్యాడు. తర్వాత తొమ్మిదవ వారం టేస్టీ తేజ అయ్యాడు‌. నామినేషన్ లో శోభా శెట్టి సిల్లీ రీజన్స్, హౌస్ మేట్స్ లలో ప్రియంక, అమర్ దీప్ లతో సరదాగా ఉండి, మిగతా వారితో అంత చనువు లేకపోవడంతో అందరి దృష్ణిలో శోభాశెట్టి బ్యాడ్ అయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు టేస్టి తేజ, ప్రియాంక, అమర్ దీప్ లతో ఎక్కువగా ఉంది శోభాశెట్టి.  రోజుకి 30 నుంచి 40 వేల చొప్పున వారానికి గాను 2 నుంచి 3 లక్షల వరకు శోభాశెట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే తేజది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ శోభాశెట్టిని కావాలనే సేవ్ చేశారంటూ గత వారం నుండి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

జీ తెలుగు అవార్డ్స్ ఎవరెవరికి ఏ క్యాటగిరిలో

జీ తెలుగు అవార్డ్స్ కార్యక్రమం ఈ వారం మంచి ఫన్నీగా, మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో సాగింది. ఇక సెలబ్రిటీస్ వచ్చి విన్నర్స్ కి అవార్డ్స్ ని అనౌన్స్ చేసారు. నిండు నూరేళ్ళ సేవా సీరియల్ లో నటనకు గాను అరుంధతి- అమరేంద్రకు తరుణ్ భాస్కర్ అవార్డ్స్ ని అందించారు. ఉత్తమ అక్కాచెల్లెళ్లు కేటగిరీలో శుభస్య శీగ్రమ్ సీరియల్ నుంచి విష్ణు, కృష్ణ, హరి, శివ వీరంతా కలిసి కలర్ ఫోటో హీరో సుహాస్ చేతుల మీద జీ కుటుంబం అవార్డుని అందుకున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ- కావ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ వచ్చి సాయంత్రం పూట నాలుగున్నరేళ్లుగా ప్రసారమవుతున్న లాంగ్ రన్నింగ్ షోగా ఉన్న రాధమ్మ కూతురు సీరియల్ కి ఈ అవార్డు ని అందించారు. మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే బెస్ట్ రన్నింగ్  లాంగ్ ఫిక్షన్ షోగా ప్రసారమవుతున్న  గుండమ్మ కథ సీరియల్ కి అవార్డు అందించారు  పడమటి సంధ్య రాగం సీరియల్ లో రఘురాంగా నటిస్తున్న  సాయికిరణ్. ఉత్తమ భార్య క్యాటగిరిలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ యాక్టర్ భాగ్యలక్ష్మి , ఊహలు గుసగుసలాడే సీరియల్ లీని వసుందరకి అవార్డ్స్ అందించారు సర్ మూవీ హీరోయిన్ సంయుక్తా మీనన్.  ఉత్తమ తండ్రి క్యాటగిరిలో అమ్మాయిగారు సీరియల్ నుంచి సూర్యప్రతాప్ కి ఈ అవార్డుని అందించారు సంయుక్తా మీనన్. ప్రైమ్ టైంలో ఉత్తమ తల్లి క్యాటగిరిలో పడమటి సంధ్య రాగం సీరియల్ నుంచి జానకికి అవార్డు అందించారు సంయుక్తా మీనన్.  నాన్  ప్రైమ్ టైంలో ఉత్తమ తల్లి క్యాటగిరిలో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో నటించిన  యశోదకి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ భర్త క్యాటగిరిలో గుండమ్మ కథ సీరియల్ నుంచి ఆదికి అవార్డుని అందించారు సీనియర్ నటుడు పృద్వి రాజ్. ఉత్తమ కొడుకు క్యాటగిరిలో మా వారు మాష్టారు సీరియల్ యాక్టర్ గా నటించిన గణపతికి ఈ అవార్డుని అందించారు సుమ-రాజీవ్ కనకాల. నవనాయకుడు క్యాటగిరిలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ యాక్టర్ మిత్ర ఈ అవార్డుని అందుకున్నారు. ఉత్తమ వదిన- మరిది క్యాటగిరిలో గుండమ్మ- బాబీకి  ఈ అవార్డుని పాయల్ రాజపుట్ అందించింది. జీ తెలుగు-వెలుగు క్యాటగిరిలో పల్లవి - మేఘనకు అవార్డ్స్ అందించారు పాయల్ రాజపుట్. ఇలా జీ తెలుగు అవార్డ్స్ షో మంచి ఫన్నీగా సాగింది.  

కొడుకు సాంగ్ ని రిక్రియేట్ చేసిన సుమ

యాంకర్ సుమ మంచి జోష్ మీద ఉంది. తన కొడుకు రోషన్ కనకాల నటించిన మూవీ  బబుల్‌గమ్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  తాజాగా ఒక భారీ ఈవెంట్‌ ని నిర్వహించి బబుల్ గమ్‌ యొక్క టీజర్ ను విడుదల కూడా చేశారు. ఈ ఈవెంట్ ని సుమ హోస్ట్ చేసింది. అలాగే రోషన్ కనకాల కూడా బుల్లితెర మీద వచ్చే షోస్ ద్వారా కనిపిస్తూ తనని తానూ ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక రోషన్ అలా ఉంటే సుమ మరో పక్క తన కొడుకు మూవీలోని సాంగ్ కి డాన్స్ వేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఛిల్ల్ అవుతోంది. "బబుల్ గం" మూవీలో "హబీబి" అనే సాంగ్ కి తన పక్కన నలుగురు అసిస్టెంట్స్ ని పెట్టుకుకుని ఆ సాంగ్ ని రి క్రియేట్ చేసి డాన్స్ స్టెప్స్ వేసింది. "ఇలా మా అబ్బాయి రోషన్ నటించిన మూవీ నుంచి ఈ సాంగ్ ని రిక్రియేట్ చేసి స్టెప్స్ వేయడం చాల హ్యాపీగా ఉంది" అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఈ డాన్స్ చూసిన నెటిజన్స్ మాత్రం ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. "సుమ గారూ, మీరు, మీ గ్యాంగ్ డ్యాన్స్ అంటే కొరియోగ్రఫీ చేసి  ప్రాక్టీస్ చేసిన స్టెప్పులు మాత్రమే కాదని, చాలా సరదాగా వచ్చిన స్టెప్స్ వేసి అందరి హృదయాల్ని  కదిలించడమేనని నిరూపించారు..బాగుంది...ప్రతీ ఏడాది మీ బర్త్ డేకి ఏజ్ మైనస్ అవుతుంది అనుకుంటా ఎప్పుడూ  ఎనర్జిటిక్ గా ఉంటారు..నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడు నా కూతురు కూడా మిమ్మల్ని చూస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తూ ఒక నెటిజన్ మాత్రం వెరైటీగా కామెంట్ చేశారు.."డాన్స్ ని డాన్స్ లా చేయండి..స్నాక్స్ లా కాదు" అన్నారు.. మరి సుమకి డాన్స్ రాకపోయినా వెనకాల కొంతమంది అసిస్టెంట్స్ ని వేసుకుని ఇలా అప్పుడప్పుడు సరదాగా స్టెప్స్ వేస్తూ వాళ్లకు నేర్పిస్తూ రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

BiggBoss Season 7 Telugu: బిగ్ బాస్ రాజ్యంలో రాజమాతలు తీసుకున్న నిర్ణయం అదేనా?

బిగ్ బాస్ సీజన్ -7 తొమ్మిది వారాలు పూర్తిచేసుకొని పదోవారానికి అడుగుపెట్టింది‌. తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేషన్ అవ్వగా.. పదవ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారో వారి కోసం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు. బిగ్ బాస్ రాజ్యం(బిగ్ బాస్ హౌస్) లో ఉన్న ఆడవాళ్ళు రాజమాతలుగా, మిగిలిన వాళ్ళు ప్రజలుగా ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ప్రక్రియలో భాగంగా శంఖం వచ్చిన ప్రతీసారీ ప్రజలిద్దరు వచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న ఒరలలోని కత్తులని తీసి వారి నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇలా సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ వాడివేడీగా సాగింది. భోలే షావలిని అమర్ దీప్ నామినేట్ చేశాడు. బ్లాక్ బాల్ మీకు వచ్చినప్పుడు మీరు తీసుకొని వస్తే బాగుండని రీజన్ చెప్పి అమర్ దీప్ నామినేట్ చేశాడు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అక్కడ నుండి వచ్చేశానని భోలే షావలి అన్నాడు. సింహం, ఎలుకలతో ఎదవ కంపారిజన్ వద్దన్న అని భోలే షావలిని అమర్ దీప్ అన్నాడు. గౌతమ్ కృష్ణని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. " శివాజీ గారు అందరిని ఇన్ ఫ్యూయన్స్ చేశాడు" అని నువ్వు అలా ఎలా అలిగేషన్ చేస్తావని గౌతమ్ కృష్ణతో అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. అమర్ దీప్ ని యావర్ నామినేట్ చేశాడు. అమర్ దీప్ ని భోలే షావలి నామినేట్ చేశాడు. రివేంజ్ నామినేషన్ చేశావని భోలే షావలి అన్నాడు. పొడిపించినవ్ అమ్మ అని ప్రియాంక జైన్ ని భోలే షావలిని అన్నాడు. మాటల మధ్యలో.. " నాలాగా మాడ్లాడటం నువ్వు నేర్చుకోలేవు" అని అశ్వినిని ప్రియాంక అంది. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా ఉన్న ప్రియాంక, రతిక, అశ్వినిశ్రీ, శోభాశెట్టి లు నలుగురు కలిసి ఏకాభిప్రాయంతో నామినేట్ చేసిన వారి రీజన్స్ ని పరిశీలించి ఏది ఎక్కువ కరెక్ట్ అనిపిస్తే వారిని నామినేట్ చేయాలని చెప్పడంతో.. శోభాశెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి అమర్ దీప్ ని సేవ్ చేశారు. నలుగురు రాజమాతలలో ఎవరు అన్ డిజర్వింగ్ అనిపిస్తుందో ఏకాభిప్రాయంతో నిర్ణయించుకోండని అనగా.. రతికకి రెండు ఓట్లు, ప్రియాంకకి రెండు ఓట్లు వచ్చి టై అవ్వడంతో.. కెప్టెన్ గా శోభాశెట్టిని నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్పగా.. తను ప్రియాంక పేరు చెప్పకుండా రతిక పేరు చెప్పింది. దాంతో రతిక నామినేషన్ లో ఉంది. ఇక చివరగా భోలే షావలి, శివాజీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతిక నామినేషన్ లో ఉన్నారు.   

Krishna Mukundha Murari Today Episode : భవానిని నిలదీసిన మురారి.. తనకి గతం గుర్తురానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -307 లో..‌ముకుంద రెస్టారెంట్ లో గతంలో తమపై బెట్టింగ్ కట్టిన వ్యక్తిని చూసి ఎక్కడ దగ్గరకి వచ్చి మాట్లాడుతాడో అని టెన్షన్ పడుతుంది. ముకుంద టెన్షన్ పడడం కృష్ణ చూస్తుంది. తను కూడా అతన్ని‌చూస్తుంది. అతను వాళ్ళ దగ్గరకి వచ్చి.. ఆ రోజు మీతో ఉన్న సర్ ఎక్కడ అని అడుగుతాడు. దాంతో ముకుంద అతను ఎక్కడ నిజం చెప్తాడోనని అతనిపై కోపంగా అరిచి పంపిస్తుంది.  ఎందుకు అతనిపై అరుస్తున్నావని మురారి అడుగుతాడు. అతనికీ ఎప్పుడు టిప్పు ఇస్తుండేవాళ్ళం. అందుకే వచ్చి మాట్లాడుతున్నాడని ముకుంద కవర్ చేస్తుంది. నాకు ఏదో గుర్తుకు వస్తుందని మురారి అనగానే కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముకుంద మాత్రం టెన్షన్ పడుతుంది. మరొక వైపు భవాని దగ్గరకు రేవతి వచ్చి.. మీరు మురారిని అమెరికా పంపించడం నాకు ఇష్టం లేదని రేవతి అనగానే.. ఎందుకు నీ కోడలు ఉందని అంటున్నావా? అసలు తను ఉందనే పంపిస్తున్నానని భవాని అంటుంది. మురారికి ఆ సిచువేషన్ రావడానికి కారణం ఆ కృష్ణనే అని భవాని అనగానే.. నాకు ఎందుకో నమ్మాలనిపించడం లేదని రేవతి అంటుంది. ఆ తర్వాత రేవతి మీ ఇష్టం. ఇప్పటివరకు మురారి మీ బిడ్డగానే పెరిగాడు. ఇప్పుడు కూడా ఇంతే అని రేవతి చెప్తుంది. దానికి భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ ముకుంద, మురారి ముగ్గురు వస్తారు. ముకుంద వచ్చి రేవతి భవాని ఇద్దరు మాట్లాడుకోవడం చూసి.. మురారి వింటాడెమోనని మురారి కృష్ణ ఇద్దరిని  గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు భవాని కృష్ణ ఉండే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. భవాని వెళ్లేసరికి లోపల కృష్ణ, ముకుంద, మురారి మాట్లాడుకుంటు ఉంటారు. ఆ తర్వాత మురారిని ఫ్రెష్ అవ్వమని భవాని పంపిస్తుంది. మురారి, ముకుంద వెళ్ళగానే.. నువ్వు ఎక్సట్రా ఏమైనా చేస్తే ఇక్కడ కూడా ఉండవంటు కృష్ణకి భవాని వార్నింగ్ ఇస్తుంది. అక్కడే రేవతి ఎదరుపడుతుంది. ఏంటి నీ కోడలిని పలకరించడానికి వెళ్తున్నావా? నా మాట అంటే లెక్క లేదా అని రేవతిపై భవాని కోప్పడుతుంది. మరొక వైపు ముకుంద, మురారి ఇద్దరు కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. మరొక వైపు భవాని దగ్గరకు మురారి వెళ్లి.. మీరు వేణి డాక్టర్ ని ఎందుకు దూరం పెడుతున్నారని అడుగుతాడు. అవును దూరం పెడుతున్నామని భవాని చెప్తుంది. తరువాయి భాగంలో కృష్ణని మురారి గెస్ట్ హౌస్ నుండి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే అందరూ షాక్ అవుతూ చూస్తారు. కృష్ణని భవాని లోపలికి రానిస్తుందా? లేక కృష్ణనే తన భార్య అని మురారికి గుర్తుకు రానుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu Today Episode :  రిషి, వసుధారల రొమాంటిక్ సీన్.. విష్ కాలేజ్ కి వాళ్ళిద్దరు వెళ్తారా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -913 లో.. రిషి వసుధార ఇద్దరు కాలేజీకీ వెళ్తారు. చాలా రోజుల తర్వాత రిషి తన కాలేజీలో స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పారు. దాంతో స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా రిటైర్డ్ లెక్చరర్స్ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి స్టూడెంట్స్ కి క్లాస్ చెప్తారు. మరొక వైపు వసుధార దగ్గరికి ఇద్దరు లెక్చరర్స్ వచ్చి జీతాలు పెంచమని అడిగినందుకు వేరే ఫాకల్టీని తెచ్చుకున్నారు. మేమ్ యూనియన్ తో కాలేజీ ముందు ధర్నా చేస్తామని అనగానే అప్పుడే అక్కడకి వచ్చిన రిషి.. మీరు ఏమైనా చేసుకోండి. మీరు మాకు టైమ్ ఇవ్వకుండా క్లాస్ లు ఆపేసారు. అందుకే ఇలా చేసామని రిషి అంటాడు. వాళ్ళని తిరిగి పంపించండి మేమ్ వస్తామని ఫ్యాకల్టీ చెప్తారు. అవసరం లేదు. వాళ్ళని తిరిగి పంపించం, అలా అని మిమ్మల్ని వద్దని అనట్లేదని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఆ ఫ్యాకల్టీకి తిక్క కుదిరి మేమ్ కాలేజీ కీ వస్తామని చెప్తారు. కాసేపటికి ఎండీ చైర్ అనేది ఒక ముళ్ల కుర్చీ. ఆ సీటు కోసం నాపై ఎటాక్ జరిగింది. నీకు తెలుసు. అయిన నా మాట కాదనలేక గౌరవంతో కూర్చున్నావ్. నువ్వు గ్రేట్ అంటూ వసుధారని రిషి పొగుడుతాడు. మరొక వైపు రిషి చెప్పినట్టు రిటైర్డ్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి క్లాస్ లు రన్ చేస్తున్నాడు. రిషి సామాన్యుడు కాదని దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి చెప్తాడు. రిషిని దెబ్బ కొట్టాలంటే కుట్రలతో కాదు ప్రేమతో దెబ్బకొట్టాలని దేవయాని చెప్తుంది. మరొకవైపు రిషి వసుధార ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిసి.. విష్ కాలేజీ ప్రిన్సిపల్ పాండియన్ ని పిలిచి మాట్లాడతాడు. రిషి వసుధారలని కాలేజీకీ పిలుద్దామని అనుకుంటున్నాను. అందుకు కావలసిన వెల్ కమ్ ఏర్పాట్లు చూడమని పాండియన్ కి ప్రిన్సిపల్ చెప్తాడు. మరొక వైపు రిషి దగ్గరికి వసుధార వచ్చి.. మీరు చాలా చేంజ్ అయ్యారు. మొదట్లో బాగా స్టైల్ గా ఉండేవారంటు తన జ్ఞాపకాలు చెప్తూ‌ ఉంటుంది. ఆ తర్వాత వసుధార దగ్గరగా రిషి రొమాంటిక్ చూస్తూ వస్తుంటే.. వసుధార బయపడుతుంది. అప్పుడే విష్ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి.. తమ కాలేజీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. దానికి వసుధార, రిషి ఇద్దరు సరే అంటారు. ఆ తర్వాత ఇద్దరు రెడీ అయి హాల్లో ఉన్న మహేంద్రకి విష్ కాలేజీ కీ వెళ్తున్నామని చెప్తారు. దాంతో మహేంద్ర వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.