Krishna Mukundha Murari : ఎక్కడికెళ్ళిన భార్య  జ్ఞాపకాలే.. పడిపడి లేచే మనసు కథేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -311 లో.. రేవతి మధు ఇద్దరు కలిసి కృష్ణ, మురారీలని ఎక్కడికైన పంపింద్దామని అనుకుంటారు‌. అప్పుడే భవాని వచ్చి మధు చెంప చెల్లుమనిపిస్తుంది. కృష్ణని క్షేమించే ప్రసక్తే లేదు అన్నట్లుగా భవాని చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అసలు ఇదంతా చేసింది వాళ్ళు అయి ఉండరేమోనని రేవతి అంటుంది. ఎక్కడ తన భాగోతం బయటపడుతుందోనని భావించిన ముకుంద.. ఏంటి పెద్ద అత్తయ్య మాటకే ఎదరు చెప్తున్నారా అని అంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి కలిసి వస్తు ఉండడం భవాని కోపంగా చూస్తుంది. వేణి నువ్వు వెళ్ళు. నేను మురారీతో మాట్లాడాలని భవాని అంటుంది. లోపల ఎంత కోపంగా ఉన్న మురారి కోసం కృష్ణతో నవ్వుతు మాట్లాడుతుంది భవాని. కాసేపటికి కృష్ణ వెళ్లిపోతుంది. మురారి అమెరికా వెళ్తున్నాడని కృష్ణ చాలా బాధపడుతుంది. మరొకవైపు శకుంతల కృష్ణని చూడడానికి ఇంటికి వస్తుంది. శకుంతలని చుస్తుంది భవాని. తనతో మాట్లాడడం ఇష్టం లేక రేవతిని పిలిచి ఎందుకు వచ్చిందో కనుక్కొని వెళ్ళిపోమని చెప్పని భవాని అనగానే.. రేవతి తనని పంపించబోతు ఉంటుంది. అప్పుడే శకుంతలని మురారి చూసి ఆగండి. మీరు వేణి వాళ్ళ రిలేషన్ కదా అని అంటాడు. అవునని శకుంతల అంటుంది. తను మురారిని అల్లుడని పిలవకముందే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు రేవతి అని భవాని చెప్పగానే.. పదా బయటకు వెళ్దామని రేవతి అంటుంది. తనకి కాఫీ గానీ టీ గానీ ఇవ్వండని మురారి అనగానే.. వాళ్ళు కాఫీ అలాంటివి తాగరని భవాని చెప్తుంది. కాసేపటికి వేణి దగ్గరికి తీసుకొని వెళ్తుంది రేవతి. వేణి వాళ్ళ రిలేషన్స్ ని కూడా నాకు దూరం పెడుతున్నారు ఎందకని భవానితో మురారి అనగానే.. నువ్వు ప్రతిసారి వేణి గారి గురించి మాట్లాడితే పెద్ద అత్తయ్యకి కోపం వస్తుందని ముకుంద అనగానే.. ఎందుకు వేణితో మాట్లాడనివ్వడం లేదు. నాకు పదే పదే వేణి గారే గుర్తుకు వస్తున్నారని మురారి అంటాడు. మురారికి భవాని కూల్ నచ్చజెప్పి.. తననోటి వెంటే ' కృష్ణతో మాట్లాడకుండా ఉండటానికి ట్రై చేస్తాను' అనేలా భవాని చేస్తుంది. మరొకవైపు శకుంతల కృష్ణ సిచువేషన్ గురించి రేవతికి చెప్తూ బాధపడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు చిన్నమ్మ అంత సెట్ అవుతుందని శకుంతలకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వచ్చి మురారి మాట్లాడతాడు. ఒకవైపు మురారి ఎక్కడ అని ముకుందని  భవాని అడుగుతుంది. అప్పుడే మురారి కృష్ణ దగ్గరికి వెళ్లి ఇంటిలోకి వస్తాడు.  ఎక్కడికి వెళ్ళావ్ వేణి దగ్గర నుండి వస్తున్నావా అని మురారిని భవాని అడుగుతుంది. మురారి సైలెంట్ గా ఉంటాడు. ఎందుకు సైలెంట్ గా ఉన్నావ భవాని అడగ్గానే.. మీకు అబద్ధం చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉన్నానని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

guppedantha Manasu : అయ్యయ్యో.. రిషికి పెద్ద కష్టమే వచ్చిపడిందే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -917 లో.. వసుధార, రిషి ఇద్దరు విశ్వనాథ్ ఇంటి నుండి బయలుదేరి వస్తుంటారు. ఏంజిల్ మనల్ని నమ్మడం లేదని రిషి అంటాడు. ఏంటి వసుధార మా అమ్మ చనిపోయిన విషయం వాళ్ళతో చెప్పలేదని అనుకుంటున్నావా అని రిషి అంటాడు.. అవును మీరు మేడమ్ గురించి చెప్తే ఏంజిల్ నమ్మేది కదా అని వసుధార అనగానే.. మా అమ్మ చనిపోలేదు. ఎప్పుడు నాతోనే, మనతోనే ఉంటుందని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు ఇంటికి వస్తారు. కాసేపటికి మహేంద్ర దగ్గరికి వస్తారు.. మహేంద్ర వాలకం చూసి మళ్ళీ డ్రింక్ చేసాడని అనుకుంటారు. కానీ మహేంద్ర నిద్ర నుండి లేచి, నేను డ్రింక్ చెయ్యలేదు. నీకు మాట ఇచ్చాను కదా అని అంటాడు. ఆ తర్వాత అన్నయ్య వదిన శైలేంద్ర వచ్చారు. కలిసి లంచ్ కూడా చేసానని మహేంద్ర అంటాడు. ఇప్పుడు భోజనం చెయ్యండని వసుధార అనగానే ఇప్పుడు అక్కడకి రాలేను. నువ్వే ఇక్కడికి భోజనం తీసుకొని రా అని మహేంద్ర చెప్పగానే వసుధార వెళ్తుంది. ఆ తర్వాత రిషిని ప్రేమతో దగ్గరగా కూర్చొపెట్టుకొని మాట్లాడతాడు.  జగతి, మహేంద్రల మధ్య ప్రేమ గురించి మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత వసుధార గురించి కూడా చెప్తాడు. " వసుధార చాలా మంచి అమ్మాయి. నువ్వంటే చాలా ఇష్టం " మహేంద్ర గొప్పగా చెప్తుంటాడు. మరొకవైపు వసుధార డోర్ దగ్గర వరకు వచ్చి.. వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఆగిపోతుంది. వసుధార ప్రేమ విషయంలో పడిన కష్టాలు రిషికి మహేంద్ర చెప్తుంటాడు. వసుధార, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. తన కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలని రిషితో మహేంద్ర చెప్తాడు. తప్పకుండా డాడ్ వసుధారని ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటానని రిషి చెప్తాడు. వసుధార గురించి మహేంద్ర గొప్పగా చెప్పడం విని వసుధార ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత భోజనం తీసుకొని వచ్చి మహేంద్రకి ఇచ్చి వెళ్ళిపోతుంది వసుధార. మరుసటి రోజు ఉదయం వసుధార వంట చేస్తూ.. రాత్రి రిషితో మహేంద్ర చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటు ఉంటుంది. అప్పుడే  వసుధారకి రిషి కొత్తగా జూమ్కాలు తీసుకొని వచ్చి సర్ ప్రైజ్ ఇస్తాడు. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసుధార జూమ్కాలు పెట్టుకొబోతుంటే తనని ఆపి నేను పెడతానంటు రిషి ట్రై చేస్తుంటే తనకి పెట్టరాదు. ఇదేంటి ఇది పెద్ద ఇంజినీరింగ్ టాస్క్ లా ఉందే అంటు రిషి కష్టపడుతుంటాడు. ఆ తర్వాత రిషి అటుతిప్పి, ఇటుతిప్పి జుమ్కాని కిందపడేస్తాడు. ఇక వసుధార, రిషి ఇద్దరు కలిసి దానిని వెతికే పనిలో పడతారు. జుమ్కా రిషికి దొరుకుతుంది కానీ వసుధారని కొద్దిసేపు అటపట్టిద్దామని అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

ఓ బేబీ కోసం శివాజీ ఉగ్రరూపం.. గేట్లు తియ్యమన్న గౌతమ్!

బిగ్ బాస్ సీజన్-7 ఫ్యామిలీ వీక్ ఫుల్ సక్సెస్ ఫుల్ అవుతుంది. రోజుకి ముగ్గురు కంటెస్టెంట్స్ చొప్పున వారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అటు హౌస్ మేట్స్ లో కాన్ఫిడెన్స్, ఇటు ప్రేక్షకులకి కావల్సిన ఎమోషన్స్ ని ఇప్పిస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇది తెలుస్తుంది. ' ఓ బేబీ టాస్క్ ఫర్ కంటెస్టెంట్స్' అంటూ రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. గత కొన్ని రోజులుగా గౌతమ్ కృష్ణ, శివాజీల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు లావాలా బయటకొచ్చింది. గార్డెన్ ఏరియాలో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక టేబుల్ పై వరుసగా బేబీ డాల్స్ ఉంచి.‌. బజర్ మోగిన తర్వాత ఆ బేబీ డాల్స్ ని తీసుకొనొ ఎవరైతే ఆ లైన్ దాటుతారో వాళ్ళు ముందుకు వెళ్తారు. రాలేని వారు వెనక్కి వెళ్తారని బిగ్ బాస్ చెప్పగానే కంటెస్టెంట్స్ పరుగు తీసారు. ఇందులో గౌతమ్ కృష్ణ బేబీ డాల్ ని అమర్ దీప్ లాక్కొని తీసుకెళ్ళాడని వాదించాడు. అయితే అది నా గేమ్ స్ట్రాటజీ అని అమర్ దీప్ అనగానే.. గౌతమ్ సీరియస్ అయ్యాడు. ఫెయిర్ గేమ్ ఆడాలని గౌతమ్ తో శివాజీ అనగానే.. నాకు అన్యాయం జరిగిందని నేను డిఫెండ్ చేసుకుంటున్నా మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వొద్దంటూ గౌతమ్ రెచ్చిపోయాడు. ఇక ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. కెప్టెన్సీ రేస్ లో ఇటువంటివి కామన్‌.‌ కానీ ఇప్పటికే గౌతమ్ కృష్ణకి చాలా నెగెటివిటి వచ్చింది. ఇక శివాజీతో జరిగిన గొడవ తర్వాత.. బిగ్ బాస్ గేట్లు తీయండి బయటకు వెళ్తానని గౌతమ్ కృష్ణ అనడంతో హౌస్ మేట్స్ వద్దని అరుస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ గా మారింది.  

నాన్న ఎవ్వరికైనా నాన్నే.. ఫ్యామిలీ వీక్ రతికకి పాజిటివ్ అవ్వనుందా?

నాన్న కూతురు మధ్య బాండింగ్ ఎప్పుడు ప్యూర్ గా ఉంటుంది. అది బిగ్ బాస్ హౌస్ లోనైనా ఏ హౌస్ లోనైనా ప్రతీ ఒక్కరికి సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది. మన కంటికి కన్పించేది, బిగ్ బాస్ చూపించేది ఒక వైపు మాత్రమే.. అదే ఇండివిడ్యువల్ గా చూస్తే ప్రతీ ఒక్క కంటెస్టెంట్ వెనుక ఒక గతం ఉంది‌. ఒక ఎమోషనల్ కథ దాగి ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ ఎపిసోడ్ లన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. హౌస్ లోకి మొదటగా శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ వచ్చాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య, భోలే షావలి భార్య, గౌతమ్ కృష్ణ వాళ్ళ తల్లి, యావర్ అన్న, అమర్ దీప్ భార్య, శోభాశెట్టి అమ్మ.. ఇలా అందరు రావడంతో హౌస్ అంతా ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న రాగా.. ఈ ఎపిసోడ్ మీద ఫుల్ హైప్ క్రియేట్ అయింది‌.‌ కాగా తాజాగా రిలీజ్ చేసిన రెండవ ప్రోమోలో రతిక వాళ్ళ నాన్న రాములు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. వచ్చీ రాగానే రతిక పరుగున వెళ్ళి వాళ్ళ నాన్న గుండెలకు హత్తుకుంది. సరదాగా మాట్లాడింది. ఇక హౌస్ మేట్స్ అందరితో రతిక వాళ్ళ నాన్న మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ ని పిలిచి.‌‌ ఆటలు బాగా ఆడుతున్నావ్. ఇలాగే ఆడు. కప్పు కొట్టు అంటూ తన కూతురు రతిక ముందే చెప్పాడు.  రతిక వాళ్ళ నాన్న మాట్లాడిన విధానానికి పల్లవి ప్రశాంత్ ఆశ్చర్యపోయాడు. అయితే నాన్న ఎవ్వరికైనా నాన్నే. రతిక ఎంత నెగెటివిటి తెచ్చుకున్నా, వాళ్ళ నాన్న రాగానే అందరిలో ఒక పాజిటివిటి వచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రోమో కింద కామెంట్లలో రతిక గురించి నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ లో ఉన్న రతిక ఓటింగ్ లో లీస్ట్ లో  ఉంది‌. మరి ఈ ఎపిసోడ్ తనకి ప్లస్ అవుతుందా లేక ఈ వారం ఎలిమినేట్ అయి బయటకొస్తుందా చూడాలి మరి.  

రైతుబిడ్డని మహర్షి చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఆకట్టుకుంటున్నాడు. ఏ టాస్క్ అయిన తన వందశాతం ఎఫర్ట్స్ ని పెట్టి కసిగా ఆడి గెలిచి చూపిస్తున్నాడు. మొదటి వారం నుండి సీరియల్ బ్యాచ్ అంతా కలిసి రైతుబిడ్డని టార్గెట్ చేసిన, శివాజీ తన వెనుకుండి నడిపిస్తున్నాడు.  శివాజీ మాటే వేదంలా, తన గైడెన్స్ లో పల్లవి ప్రశాంత్ హౌస్ లోని అందరిచేత ప్రశంసలు పొందుతున్నాడు. అయితే బిగ్ బాస్ లో ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. మొదట శివాజీ కొడుకు వెంకట్ వచ్చినప్పుడు ఎంత హైప్ వచ్చిందో మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్‌లో యావర్ వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు అంతే హైప్ వచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న వచ్చినట్టు తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తుంది. ఇందులో మహర్షి సినిమాలోని ' పదర పదర ' అంటూ వచ్చే పాటతో ప్రేక్షకులని రైతులని కలిపేస్తూ ప్రోమోని తీర్చిదిద్దాడు బిగ్ బాస్. ఇక ఈ బిజిఎమ్ కి వాళ్ళ నాన్న హౌస్ లోకి ఎంట్రీ అవ్వడంతో పల్లవి ప్రశాంత్ పరుగున వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయితే హౌస్ లోకి బిగ్ బాస్ కొన్ని బంతిపూలని పంపించడంతో అవి చూసిన పల్లవి ప్రశాంత్ కంటనీరు తెచ్చుకున్నాడు. కాసేపటికి వచ్చిన వాళ్ళ నాన్నతో ఎన్నో విషయాలని పంచుకున్నాడు పల్లవి ప్రశాంత్. కాగా ఇప్పుడు ఈ ప్రోమోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. ఈ ప్రోమో కింద.. "కన్నతండ్రిని చూసిన ఆనందంలో రైతుబిడ్డ కంట చినుకు పూల వాన" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.    

BiggBoss 7 : నీతోటి ఉన్నవాళ్ళని కూడా నమ్మకు.. నీ ఆట నువ్వు ఆడు!

బిగ్ బాస్ సీజన్-7 ఫ్యామిలీ వీక్ ఫుల్ సక్సెస్ ఫుల్ అవుతుంది. రోజుకి ముగ్గురు కంటెస్టెంట్స్ చొప్పున వారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అటు హౌస్ మేట్స్ లో కాన్ఫిడెన్స్, ఇటు ప్రేక్షకులకి కావల్సిన ఎమోషన్స్ ని ఇప్పిస్తున్నాడు బిగ్ బాస్. ఫ్యామీలీ వీక్ లో భాగంగా మొదటగా అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చింది. అయితే అదే సమయంలో అమర్ దీప్ ని కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ పిలిచి మరీ కేక్ ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఆ తర్వాత తేజస్విని చూసి ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్. బాగా ఆడమని, ధైర్యాన్ని కోల్పోకని తేజస్విని చెప్పింది. " నీ గేమ్ నువ్వు ఆడు. నీతో ఉన్నవాళ్ళని కూడా నువ్వు నమ్మకు" అంటూ అమర్ దీప్ తో తేజస్విని అంది. ఆ తర్వాత కాసేపటికి శోభాశెట్టి వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది. " అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " సినిమాలోని అమ్మ పాటని బిజిఎమ్ గా వేసి మరింత ఆసక్తిగా మలిచారు బిగ్ బాస్ మేకర్స్. తల్లిని చూసిన శోభాశెట్టి తల్లడిల్లిపోయింది. కొన్ని రోజులుగా ఫ్యామిలీని బాగా మిస్సింగ్ అంటు శోభాశెట్టి అంటుంది. ఇప్పుడు కన్నతల్లిని చూడగానే శోభాకి కంటనీరు ఆగలేకపోయాయి. అయితే యావర్ కోసం శోభాశెట్టి వాళ్ళ అమ్మ ఒక బహుమతి తీసుకొచ్చింది. యావర్ తల్లి చనిపోయింది. అందుకే నిన్న గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు యావర్ బాగా ఏడ్చేసాడు. ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిన యావర్ కి.. కొంగులో దాచిన యావర్ తల్లి ఫోటోని ఇచ్చింది శోభాశెట్టి అమ్మ. ఆ ఫోటోని చూడగానే యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. శివాజీ చూసి అమ్మ వచ్చింది యావర్ అనగానే.. మరింత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డాడు యావర్. నేను కూడా మీ అమ్మనే అంటూ శోభాశెట్టి వాళ్ళ అమ్మ అంది. కాసేపటికి హౌస్ మేట్స్ అంతా యావర్ ని ఓదార్చారు. ఇప్పుడు యావర్ కోసం బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ తో ఈ ఎపిసోడ్ మరింత ఎమోషనల్ గా మారింది. అయితే శోభాశెట్టి వాళ్ళ అమ్మ శోభాకి కొన్ని సలహాలిచ్చింది.   

చాలా గ్యాప్ తర్వాత పునర్వితో రాహుల్ సిప్లిగంజ్!

బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది సెలబ్రిటీలు అయిపోయారు. ప్రతీ బిగ్ బాస్‌ సీజన్ లో లవ్ స్టోరీ లు కొనసాగడం ఒక ట్రెండ్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్.. సింగర్ గా తెలిసిన బిగ్ బాస్ లోకి వచ్చాకే ఫేమ్ వచ్చిందని చెప్పాలి. సీజన్-3 లో రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పునర్నవి కూడా కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. సీజన్-3 లో రాహుల్-పునర్నవి ల లవ్ ట్రాక్ అందరికి తెలిసిందే. హౌస్ లో వీళ్లిద్దరి సాన్నిహిత్యం చూస్తే బయటకు వెళ్ళగానే పెళ్లికి బాజా మోగిస్తారని అనుకున్నారంతా. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు అన్ని పునర్నవి కోసం చేసేవాడు రాహుల్. ఆ తర్వాత పునర్నవి ఎలిమినేట్ అవడంతో రాహుల్ ఫీల్ అవుతున్న దానికి బిగ్ బాస్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. దాంతో ఇద్దరు లవర్స్ అని హైప్ క్రియేట్ అయింది. అయితే అనుకోకుండా అదేమీ జరుగకుండా, ఎవరికి వారే అయిపోయారు. రాహుల్ ప్రైవేట్ అల్బమ్స్ అంటూ బిజీగా ఉంటున్నాడు. మరొకవైపు పునర్నవి విదేశాల్లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. టీవీ షో ఈవెంట్స్ లో ఒక్కసారి కూడా పునర్నవి కన్పించలేదు. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు వస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ' నీ అయ్య నా మామ' అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసాడు. తనే సొంతంగా పాడాడు. కొన్ని రోజుల క్రితం ఈ పాటకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చెయ్యగ.. ఇప్పుడు పునర్నవి చేతుల మీదుగా పాటని లాంచ్ చేయించాడు రాహుల్. ఇన్ని రోజులుగా ఒక్కసారి కూడా కలవని వీళ్ళు సడన్ గా కలిసి పాటని లాంఛ్ చెయ్యడంతో ఇద్దరు ఎక్సైట్ అయ్యారు. ఇక వీళ్ళిద్దరు కలిసిన ఈ వీడియోని తమ‌ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇక వీరి అభిమానులు.‌. చాలా రోజుల తర్వాత అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

పవిత్ర రీల్ లవ్ కాస్త రింగ్‌తో రియల్ లవ్ అయ్యింది!

బుల్లితెర మీద లేడీ కమెడియన్‌ గా పాగల్ పవిత్ర  అంటే తెలియని వారు లేరు.  అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి  ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. సంతోష్ వేలికి ఉంగరం చూపించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అన్నట్లుగా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే ఒక హార్ట్ టచింగ్ కాప్షన్ ని జోడించింది. " ఫైనల్ గా  నా జీవితంలో మంచి రోజులు వచ్చాయి. నేను సంతోష్‌ ప్రేమను  అంగీకరించాను. .మా జీవితంలో మేము కలుసుకున్న క్షణాలు చాల  ప్రత్యేకమైనవి అవి  మా చిన్న గుండెల్లో ఎప్పుడూ మెమొరీస్ గా ఉండిపోతాయి. ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది..  ఒక ఏడాది పాటు  నా కోసం వేచి ఉండి..నన్ను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు చాల ఓపికగా నా కోసం ఎదురు చూడడం చాల సంతోషంగా ఉంది..నా కోసం ఇంతగా ప్రయత్నించినా నీ ప్రేమకు చాలా ధన్యవాదాలు..సంతోష్  నా జీవితంలో భాగమైపోయాయి.. నా చివరి శ్వాస వరకు నేను మీకు అండగా ఉంటాను..ఇక నుండి అన్ని అడ్డంకులను చిరునవ్వుతో కల్సి ఎదుర్కొందాం..  నన్ను ఒక  యువరాణిలా భావించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నావా..నన్ను ఆదరించిన నా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు". ఇక లాస్ట్ ఇయర్ సంతోష్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఆమెకు తెలియకుండా సర్ప్రైజ్ గా వచ్చి లవ్ ప్రొపోజ్ చేసాడు. కానీ పవిత్ర మాత్రం  అప్పుడు ఏ సమాధానమూ చెప్పలేదు. కాస్త ఆలోచించుకోవాలి అని తప్పుకుంది.  తర్వాత సంతోష్‌ తో కలిసి వాలంటైన్స్‌ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరై అక్కడ  లవ్‌ ప్రపోజ్‌ చేసింది. ఆ తర్వాత అన్ని షోస్ లో పవిత్ర తనతో పాటు సంతోష్ ని కూడా వెంటబెట్టుకుని మరీ వచ్చేస్తోంది. ఇక ఇప్పుడు రీల్ లవ్ కాస్త రియల్ లవ్ అయ్యింది. ఇక నెటిజన్స్ కూడా వీళ్ళ లవ్ కి విషెస్ చెప్తున్నారు.

Prince Yawar : ఫైటర్‌లా ఆడు.. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పుడున్న వారిలో టాప్-5 లో ఒకడిగా యావర్ నిలిచాడనే చెప్పాలి. ఎనిమిది వారాల నుండి ప్రతీ గేమ్ లో తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు యావర్. నిన్నటి ఎపిసోడ్ లో మొదట అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చింది. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ వచ్చింది. కాసేపటికి యావర్ వాళ్ళ బ్రదర్ సుజా అహ్మద్ వచ్చాడు. "యావు.. మేరే బేటా కైసే హూ" అంటూ యావర్ బ్రదర్ సుజా అహ్మద్ వచ్చాడు. వచ్చీ రాగానే భయ్యా అంటూ యావర్ కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత కౌగిలించుకొని ఏడుస్తూ ముద్దులు పెట్టేశాడు యావర్. ఆ తర్వాత ఒక్కొక్కరిని కలిసి మాట్లాడాడు. ముఖ్యంగా శివాజీ గట్టిగా పట్టుకుని.. మీరు  యావర్ తో ఉన్నారు. మీరు‌ నాకు బ్రదర్. ఐ లవ్ యూ లైక్ ఎనీథింగ్. యావర్ కి అండగా ఉన్నారు" అంటూ చెప్పాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీ అమ్మగారు యావర్ ని కొడుకు లెక్క అని అన్నారు. చాలా థాంక్స్ గౌతమ్, ఎందుకంటే యావర్ అమ్మని బాగా మిస్ అవుతున్నాడంటూ సుజా అహ్మద్ చెప్పాడు.  హౌస్ మేట్స్ అందరితో మాట్లాడిన యావర్ బ్రదర్ సుజా అహ్మద్.. కాసేపటి తర్వాత యావర్‌ని పక్కకి తీసుకెళ్లి మంచి మాటలు చెప్పాడు. " నువ్వు ఫైటర్ గుర్తుపెట్టుకో. టైగర్ వి. ఆటలో పక్కకి ఉండకు. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్. ఒక ఫైటర్‌లా ఫైట్ చెయ్. నాకు ఆ కప్పు కావాలి. ఇక వేరే ఏం వద్దు. ఈ మధ్య నీ ఆటను చూసి నేను కొంచెం ఫీలయ్యాను. నువ్వు గెలవాలంతే. శివన్న ఉన్నాడుగా మంచివారు. చాలా బాగా గైడ్ చేస్తున్నారు. కెప్టెన్సీ ముందు ఉన్న యావర్ నాకు మళ్లీ కావాలి. అందరి ముందు చెప్పావ్ కదా ఫైటర్‌లా ఫైట్ చేస్తా అని అదే చెయ్. నీ అమాయకత్వం, నీ ప్రేమ అసలు వదులుకోకు. చాలా ముందుకు వెళ్తావ్ నువ్వు. నువ్వు ఎక్కడ దారి మారకు. నేను ఏం చెప్తున్నానో అది ఖచ్చితంగా పాటించు" అంటూ యావర్‌ని బాగా మోటివేట్ చేశాడు. కాసేపటికి శివాజీ, ప్రశాంత్ లతో యావర్ కి తోడుగా ఉన్నారు. మీకు థాంక్స్ అంటూ యావర్ వాళ్ళ బ్రదర్ సుజా అహ్మద్ అన్నాడు. వీళ్ళిద్దరి బాండింగ్ చూసి యావర్ కి మరింత ఫ్యాన్ బేస్ పెరుగుతుందనే చెప్పాలి.

గిన్నిస్ బుక్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య

ఫస్ట్ జనరేషన్ యాంకర్స్ లో  స్టిల్ కంటిన్యూ అవుతున్న యాంకర్ సుమ కనకాల..ఎన్నో యేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో యాంక‌ర్‌గా పని చేస్తూనే ఉన్నారు.  ఆమె మ‌ళ‌యాళీ   అయిన‌ప్ప‌టికీ, తల్లి సూచనల మేరకు తెలుగు నేర్చుకుని అన‌ర్ఘ‌ళంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు లైంలైట్ లో ఉన్నారు  ఆడియో రీలిజ్‌ ఈవెంట్స్, మూవీస్  ఫ్రీ రిలీజ్‌ఈవెంట్స్ తో ఆమె ఎప్పుడూ ఫుల్ బిజిగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం ఎక్కగా తగ్గేదేలే అన్నట్టుగా  యాక్టివ్‌గా ఉంటారు సుమ‌.   త‌న కొడుకు రోషన్ కనకాలను కూడా  తెలుగు ఆడియన్స్ కి బబుల్ గం మూవీతో పరిచయం చేశారు సుమ . ఈ మ‌ధ్య‌నే త‌న కొడుకు న‌టించిన సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా పాల్గొన్నారు. అలంటి  సుమ తన ఫాన్స్ తో ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ని షేర్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమె తన తాతయ్య గురించి ఒక పోస్ట్ పెట్టారు. సుమ తాతగారికి 98 యేళ్ల వ‌య‌సులో ఓ రికార్డును క్రియేట్ చేశారు. తాత‌య్య అంటే సుమ అమ్మ‌మ్మ గారి సోదరుడు. న్యాయవాద వృత్తిలో ఉన్న  ఆ తాత‌య్య‌ పేరు పి.బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్ మీన‌న్‌ . 73 యేళ్ల‌ నుంచి ఈయ‌న ఈ వృత్తిలో కొన‌సాగుతున్నారు. ఈ  లాంగ్ కేరీర్ ను పూర్తి  చేసుకున్న ఏకైక లాయ‌ర్‌గా ఆమె  తాత‌య్య వ‌ర‌ల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ విష‌యాన్ని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఆయ‌న‌కు అవార్డును అంద‌జేసింది. యాంకర్ సుమ క‌న‌కాల ఈ విషయాన్ని  గ‌ర్వంగా సోష‌ల్‌ మీడియాలోని త‌న ఖాతాలో అభిమానుల‌తో పంచుకున్నారు. సుమ స్పందిస్తూ... తాతయ్యే తన సూపర్ హీరో అని చెప్పారు. తనతో పాటు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.   సుమ పెట్టిన పోస్టు  నెట్టింట  వైర‌ల్‌ అవుతోంది. అయితే, ఈ పోస్టుపై నెటిజ‌న్లు కూడా స్పందించారు. మరి ఆ డిఎన్ ఏ అక్కడి నుంచి వచ్చింది. మీరు కూడా త్వరలో ఈ అవార్డు తీసుకుంటారు.ఇన్నేళ్లుగా యాంకరింగ్ లో  కొనసాగిన వ్యక్తి ఇంకొకరు లేరు.  మరి కొన్నేళ్ల‌పాటు ఇలాగే కొన‌సాగితే.. గిన్నిస్ రికార్డు సుమ‌ని వ‌రించ‌డం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Krishna Mukundha Murari : కృష్ణ కోసం మురారి తెచ్చిన కొత్త చీర.. ముకుంద ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310 లో.. కృష్ణకి మురారి చీర తీసుకొని వచ్చి.. ఇది కట్టుకొని ఎయిర్ పోర్ట్ కి రా అని చెప్పగానే కృష్ణ బాధపడుతుంది. నేను అక్కడకి వెళ్లినాక నువ్వు గుర్తుకు వస్తే వీడియో కాల్ చేస్తానని మురారి అంటాడు. ఆ తర్వాత మురారి తనని వదిలి పెట్టి అమెరికా వెళ్తున్నందుకు కృష్ణ చాలా బాధపడుతుంది.  మరొకవైపు ముకుందని రేవతి పిలిచి మాట్లాడుతుంది. నువ్వు మురారితో అమెరికా వెళ్తున్నావ్ కదా అని రేవతి అనగానే..  " నేను మురారి" మీ నోటి నుండి పిలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య అని ముకుంద అంటుంది. ఇక ముకుంద ఓవర్ యాక్షన్ చూడలేకపోతాడు మధు. నువ్వు అమెరికా వెళ్లి మళ్ళీ వస్తవా అని రేవతి అనగానే.. నా ప్లాన్ కరెక్ట్ గెస్ చేశారని ముకుంద అనుకొని రానని మాత్రం ఇప్పుడు చెప్పనని ముకుంద అనుకుంటుంది. మిమ్మల్ని నమ్మడం ఆపేసిన తర్వాత నుండి నన్ను నమ్మడం మొదలు పెట్టిందని ముకుంద చెప్తుంది. ఇక కృష్ణ, మురారి కలవరని ముకుంద అంటుండగా.. మురారి వచ్చి కృష్ణ కలవదు అంటున్నావ్. కృష్ణ మన కృష్ణ నేనా అని మురారి అడుగుతాడు. మన కృష్ణనే అని మధు చెప్తాడు. అవును మన కృష్ణనే అని ముకుంద చెప్తుంది.  ఆ తర్వాత కృష్ణకి చీర కొనుక్కొని వచ్చిన విషయం మురారి చెప్పగానే.. రేవతి మధు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ముకుంద మాత్రం బాధతో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మురారి తీసుకొని వచ్చిన చీర కట్టుకొని మురిసిపోతుంది కృష్ణ. అప్పుడే మురారి వస్తాడు. మీరు కాఫీ కోసం వచ్చారు కాదా అని కృష్ణ అనగానే.. కాఫీ అనేది సెకండ్ మిమ్మల్ని చూడడానికి వచ్చానని మురారి అంటాడు. మీకు నేను ఎప్పుడు గుర్తుకు వస్తానో అని కృష్ణ అనుకుంటుంది. మరొక వైపు మధు, రేవతి ఇద్దరు కృష్ణ మురారీల గురించి మాట్లాడుకుంటారు. మురారి ముకుందలని అమెరికా పంపించే కంటే ముందే.. కృష్ణ, మురారీలని ఎక్కడికైనా పంపించేద్దాం. మళ్ళీ పెళ్లి చేసుకొని వస్తారని మధు అంటాడు. అప్పుడే భవాని వచ్చి.. మధు చెంప చెల్లుమనిపిస్తుంది. ఇలా ఇద్దరు మాట్లాడుకున్న రేవతి, మధులకి భవాని క్లాస్ తీసుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu: గుప్పెడంత మనసులో కీలక మలుపు.. అభిమానులకి మైండ్ బ్లాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -916 లో... వసుధార రిషి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని ఏంజిల్ తట్టుకోలేకపోతుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్న బాధ కంటే, తనకి చెప్పకుండా చేసుకున్నారు అన్న బాధే ఏంజిల్ లో ఎక్కువగా ఉంది.  అందుకే రిషి జరిగింది మొత్తం చెప్పినా ఏంజెల్ నమ్మకుండా అదంతా ఒక నాటకమని మాట్లాడేసరికి రిషి మరింత వివరంగా చెప్తాడు. ఏంజిల్ ఎంత చెప్పిన వినకపోయేసరికి వసుధార కలుగజేసుకొని మా పరిచయం ఇప్పటిది కాదు. నేను రిషి సర్ స్టూడెంట్ ని మా మధ్య ప్రేమ మొదలై పెళ్లి వరకు వచ్చిందని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. ఎన్నిసార్లు మీ మీద నాకు డౌట్ వచ్చి అడిగిన.. మీరు చెప్పలేదు. నేను మిమ్మల్ని చాలా నమ్మాను. నన్ను మోసం చేశారని ఏంజిల్ బాధపడుతుంది. అప్పుడు రిషి సర్ చెప్పే పరిస్థితిలో లేడు. తనని కాదని నేను చెప్పలేదని వసుధార అంటుంది.  ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గర రిషి వసుధార ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. మరొకవైపు విశ్వనాథ్ ఇంట్లో ఉన్న అనుపమకి బయట ఏదో మాటలు వినిపిస్తున్నాయని బయటకు వస్తుండగా.. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చెయ్యడంతో ఆగిపోతుంది. మరొకవైపు వసుధారకి ఏంజిల్ చేతుల మీదుగా చీర తాంబూలం విశ్వనాథ్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత మీరు నన్ను ఒక తెలివి తక్కువ దదమ్మ లాగా చేశారని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత రిషి వసుధార ఇద్దరు బయల్దేరి వెళ్తారు. ఆ తర్వాత పై నుండి కిందకి వస్తున్న అనుపమని చూసి విశ్వనాథ్ ఆశ్చర్యపోతాడు.. అనుపమ ఇన్ని రోజులకి ఈ నాన్న గుర్తుకు వచ్చాడా ఇన్ని రోజులకి నాపై కోపం తగ్గిందా  అని అనగానే ఏంజిల్ షాక్ అవుతుంది. ఆ తర్వాత అనుపమని ఏంజిల్ కి విశ్వనాథ్ పరిచయం చేస్తాడు. అనుపమ నా కూతురు నీకు అత్తయ్య అని ఏంజెల్ ని పరిచయం చేస్తాడు. మరొకవైపు జగతి ఫోటో దగ్గరికి వచ్చి.. మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఇక నేను తాగాను అంటూ తమ జ్ఞాపకాల డైరీని చూస్తూ ఉంటాడు. అనుపమని గురించి అడుగుతుంది‌. నేనేం మాట్లాడలేకపోయానంటు మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మరొక వైపు అనుపమ బట్టలు సర్దతు ఉంటే.. ఒక ఫోటో కిందపడి పోతుంది. చూపించు అత్తయ్య అని ఏంజిల్ అడుగుతుంది. అది నా పర్సనల్ అని ఆ ఫోటో ని ఏంజిల్ కి చూపించదు. మరొక వైపు ఏంజిల్  మన మాట వినట్లేదు కానీ విశ్వనాథ్ గారు మన సిచువేషన్ అర్థం చేసుకున్నారని రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Brahmamudi : అమ్మచేతి గోరుముద్దలు తిన్న రాజ్.. షాక్ లో రుద్రాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -249 లో... కావ్య మొహం చూడడానికి కూడా ఇష్టం పడడం లేదు రాజ్. అందుకే కావ్య రాగానే రాజ్ వెళ్ళిపోవాలని అనుకుంటాడు. నేను కావాలని నిజం దాచలేదని కావ్య చెప్పే ప్రయత్నం చేసిన రాజ్ వినిపించుకోడు. ఇన్ని రోజులు నువ్వు అబద్ధం చెప్పవని మా అత్తతో వాదించాను. అలా అన్న ప్రతిసారీ నన్ను వెర్రివాడిని చేశావ్. మమ్మల్ని చూసి బాగా నవ్వుకునే దానివి కదా అంటూ కావ్య బాధపడేలా రాజ్ మాట్లాడుతాడు. మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఇంటిపెద్ద గురించి బాధ పడుతుంటారు. కావ్య కాఫీ తీసుకొని వచ్చినా ఎవరు తీసుకోరు. అప్పుడే ఇందిరాదేవి ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్స్, నగలు, డబ్బులు తీసుకొని హాల్లోకి వస్తుంది. నా భర్తని ఎలాగైనా కాపాడండి. నాకు పెళ్లి అయి ఇన్ని సంవత్సరాలు అయిన ఇంక భర్త చాటు భార్యనే. నాకు బయట సమాజం తెలియదు. మీరు ఏదిగిన వారు అన్ని ఎరిగిన వారు. నా భర్తని కాపాడండని ఇందిరాదేవి ఇంట్లో వాళ్ళని వేడుకుంటుంది. మరొక వైపు కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ లిఫ్ట్ చెయ్యడు. మళ్ళీ మళ్ళీ అనామిక ఫోన్ చేస్తుంది అయిన కళ్యాణ్ లిఫ్ట్ చెయ్యాడు.. మరొక వైపు ఈ ఆస్తి, డబ్బులు ఖర్చు పెట్టి నా భర్తని కాపాడండని ఇందిరాదేవి అనగానే.. ఎంత ఖర్చు పెట్టిన ఆస్తి కరిగిపోవడమే గాని ఏం ప్రయోజనం లేదు.  ఆ అవకాశం ఉంటే రాజ్ పెద్ద అన్నయ్య ఈ పని ఎప్పుడో చేసేవాళ్ళు కాదా అని రుద్రాణి అనగానే.. అందరూ షాక్ అవుతారు.. ఇందిరాదేవి మాత్రం కోపంగా.. రుద్రాణి చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవీ, అపర్ణ కలిసి రుద్రాణికి గట్టిగానే ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తాతయ్యని ఎలాగైనా కాపాడుతానని రాజ్ మాట ఇస్తాడు. మరొక వైపు అప్పు డల్ గా ఉండడంతో.. ఏమైంది అలా ఉందని అన్నపూర్ణని కనకం అడుగుతుంది. ఏమైందో తెలుసుకుంటే తెలుస్తుందని అన్నపూర్ణ అంటుంది. అయిన దానికి ఏం అవుద్ది దాని మనసులో ఎవరున్నారు తెలుసుకోవడానికి, మగ రాయుడు అని కనకం అంటుంది. అప్పుడే అప్పు దగ్గరికి అనామీక వస్తుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు. ఇంటికి వెళదామంటే సిచువేషన్ బాగా లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చానని అప్పు ఫోన్ నుండి కళ్యాణ్ కి అనామిక ఫోన్ చెయ్యగానే.. కళ్యాణ్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. నేను చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. అప్పు చేస్తే లిఫ్ట్ చేశావని అనామిక ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అనామికకి కల్యాణ్ సారీ చెప్తాడు. కళ్యాణ్ మీ ఫ్రెండ్ షిప్ కీ చాలా వాల్యూ ఇస్తాడని అప్పుతో అనామిక అంటుంది. మరొక వైపు సీతారామయ్య దగ్గరికి రుద్రాణి ఖాళీ పత్రాలు తీసుకొని వచ్చి సీతారామయ్యని కాకా పడుతుంది. ఇక తరువాయి భాగంలో కావ్య చేసిన వంట తిననని మొండికేసి కూర్చొని ఉంటాడు రాజ్. ఆ తర్వాత కావ్య కావాలనే అపర్ణకి వినపడేల ఆయన భోజనం చెయ్యలేదు. ఎవరు చెప్పిన వినట్లేదు అనగానే.. రాజ్ నా మాట వింటాడు అని అపర్ణ భోజనం తీసుకొని వెళ్లి రాజ్ కి తినిపిస్తుంది. ధాన్యలక్ష్మి, కావ్య ఇద్దరు చాటుగా ఉండి రాజ్ తినడం చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

యావర్ కి గిఫ్ట్ తెచ్చిన శోభాశెట్టి అమ్మ!

  బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు మరింత క్రేజ్ ని తెచ్చుకుంటుంది. దానికి కారణం ఫ్యామిలీ వీక్. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకుంటుండగా.. బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్ ఇస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నాడు. ఫ్యామీలీ వీక్ లో భాగంగా ఈ రోజు మొదటి ప్రోమోలో అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చినట్టు బిగ్ బాస్ చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన రెండవ ప్రోమోలో శోభాశెట్టి వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది. " అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " సినిమాలోని అమ్మ పాటని బిజిఎమ్ గా వేసి మరింత ఆసక్తిగా మలిచారు బిగ్ బాస్ మేకర్స్. తల్లిని చూసిన శోభాశెట్టి తల్లడిల్లిపోయింది. కొన్ని రోజులుగా ఫ్యామిలీని బాగా మిస్సింగ్ అంటు శోభాశెట్టి అంటుంది. ఇప్పుడు కన్నతల్లిని చూడగానే శోభాకి కంటనీరు ఆగలేకపోయాయి. అయితే యావర్ కోసం శోభాశెట్టి వాళ్ళ అమ్మ ఒక బహుమతి తీసుకొచ్చింది. యావర్ తల్లి చనిపోయింది. అందుకే నిన్న గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు యావర్ బాగా ఏడ్చేసాడు. ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిన యావర్ కి.. కొంగులో దాచిన యావర్ తల్లి ఫోటోని ఇచ్చింది శోభాశెట్టి అమ్మ. ఆ ఫోటోని చూడగానే యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. శివాజీ చూసి అమ్మ వచ్చింది యావర్ అనగానే.. మరింత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డాడు యావర్. నేను కూడా మీ అమ్మనే అంటూ శోభాశెట్టి వాళ్ళ అమ్మ అంది. కాసేపటికి హౌస్ మేట్స్ అంతా యావర్ ని ఓదార్చారు. ఇప్పుడు యావర్ కోసం బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ తో ఈ ఎపిసోడ్ మరింత ఎమోషనల్ గా మారనుంది. అయితే శోభాశెట్టి వాళ్ళ అమ్మ శోభాకి కొన్ని సలహాలిచ్చినట్టు తెలుస్తుంది.   

అమర్ దీప్ కి షాకిచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. గత నాలుగు రోజుల నుండి ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఫ్యామీలీ వాళ్ళు రావడంతో ఎమోషనల్ గా మారుతుంది. శివాజీ కొడుకు వెంకట్, ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ్, అశ్వినిశ్రీ వాళ్ల అమ్మ, భోలే షావలి భార్య వచ్చారు. ఇక నేటి ప్రోమోలో అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చినట్లు తెలుస్తోంది. అమర్ దీప్ బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ కేక్ పంపించాడు. " అమర్ దీప్ కన్ఫెషన్ రూమ్ కి రండి" అని బిగ్ బాస్ అనగానే.. హౌస్ మేట్స్ అందరు తేజస్విని గౌడ వచ్చిందనకున్నారు. కానీ అమర్ దీప్ కి కేక్ చూపించి.. మీ కోసం తేజు కేక్ పంపించిందని బిగ్ బాస్ చెప్పడంతో.. అందరి ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. తేజు వస్తుందేమోనని అనుకున్నాను.‌ మిస్ యూ తేజు అని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చాక తేజస్విని గౌడ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తేజస్విని చూసిన అమర్ దీప్ వెళ్ళి హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. మనం మళ్ళీ పెళ్ళి చేసుకుందామా అని తేజుతో అమర్ దీప్ అనగానే.. సరే అని అంది.  చాలా మిస్ అయ్యాను. ‌కొన్ని కొన్ని సార్లు నాలో‌ నేనే  ఏడ్చాను. కొన్నిసార్లు ఏడిస్తే కనపడుతుందని చెప్పి ఎవరికి తెలియకుండా ఏడ్చానని అమర్ దీప్ ఎమోషనల్ అయ్యాడు. తిను, పడుకో అని తేజస్విని అంది. ఏజ్ పెరిగేకొద్ది యంగ్ అవుతున్నానని అమర్ దీప్ అనగానే.. సర్లే అని అంది‌. ఇక గార్డెన్ ఏరియాలో తేజస్విని మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళిద్దరి ఎంగేజ్ మెంట్  ఇస్తుండగా.‌. శివాజీ మధ్యలో కలుగజేసుకొని అమర్ దీప్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తేజస్విని చేత రింగ్  తొడిగించాడు. ఇదంతా సరదాగా సాగింది.  

Shivaji: ఓటింగ్ లో నెంబర్ వన్ శివాజీ!

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ హవా కొనసాగుతుంది‌. ఏ వారమైన నామినేషన్ లో శివాజీ ఉంటే చాలు.. 70 శాతం ఓటింగ్ పడుతుంది. మిగతా హౌస్ మేట్స్ కి 20 శాతం కూడా రావడం లేదు. ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. మొదటగా శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ రావడంతో ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది‌. శివాజీని కన్సల్ట్ చేయడానికి డాక్టర్ గా మారిన కొడుకుని గుర్తపట్టలేకపోయాడు శివాజీ. ఇక నాన్న అని కొడుకు అనడంతోనే ఏడ్చేశాడు. ఈ ఎపిసోడ్ మొత్తం టీవీలో చూసే ప్రతీ ప్రేక్షకుడిని కదిలిస్తుంది. నాన్న కొడుకులది ఒక ప్యూర్ బాండింగ్ ఉంటుందని ఈ ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఓటింగ్ లో భోలే షావలి, గౌతమ్, యావర్, రతిక, శివాజీ మొత్తం అయిదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో శివాజీ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో భోలే షావలి ఉన్నాడు. ఆ తర్వాత యావర్ ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో గౌతమ్ కృష్ణ, రతిక ఉన్నారు. అయితే మొదటి స్థానంలో ఉన్న శివాజీకి అత్యధిక ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే హౌస్ మొత్తంలో ఫెయిర్ గేమ్ ఆడేది ఇతనే కాబట్టి. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ కూడా శివాజీతో మనం కావాలని ఓటింగ్ చేద్దామని చెప్పాడు. కానీ శివాజీ అలా చేయకూడదని చెప్పాడు. హౌస్ లో ఉన్నన్నిరోజులు ఫెయర్ గా ఆడుదాం, ఫెయిర్ గా ఉందామంటూ జనాల హృదయాలని గెలుచుకుంటున్నాడు శివాజీ‌. అందుకేనేమో మొన్న శివాజీ కొడుకు వచ్చిన ఎపిసోడ్  కి అత్యధిక టీఆర్పీ వచ్చింది.

Rathika Elimination : రతిక మళ్లీ ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ లాంచ్ 2.0 లో పాటబిడ్డగా అడుగుపెట్టిన భోలే షావలి.. తన పాటలతో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్ననాడు. హౌస్ లో అందరితో కలిసిపోతు చమత్కారం చేస్తూ ప్రేక్షకులకి కిక్కు ఇస్తున్నాడు. అందువల్లే నామినేషన్ లో ఉన్న భోలే షావలికి భారీగా ఓటింగ్ పడుతుంది. గతవారం టేస్టీ తేజ, రతిక ఎలిమినేషన్ లో ఇద్దరు ఉన్నప్పుడు.. ఈ ఒక్కవారం నన్ను ఈ హౌస్ లో ఉండనీయండి సర్. నా ఆటేంటో చూపిస్తా అని నాగార్జునతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డేంజర్ జోన్ లో గౌతమ్ కృష్ణ, రతిక ఉన్నారు. మరీ ఈ వారం మరో ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవుతుందా లేక బిగ్ బాస్ ఉల్టా పల్టా చేసి గౌతమ్ కృష్ణని పంపిస్తాడా చూడాలి. గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మ నిన్న చెప్పినట్టుగా  గౌతమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగానే ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అతనికి నిజంగానే ఫ్యాన్ బేస్ ఉంటే నామినేషన్ లో లీస్ట్ లో ఉండేవాడు కాదు. ఇక రతిక తన మాటతీరు ఏం మార్చుకోమపోవడం, యావర్ ఆటని డిస్టబ్ చేయడం ఇవన్నీ ప్రేక్షకులలో తనని మరింత నెగెటివ్ చేశాయి. భోలే హౌస్ లో పాడిన అమ్మ పాట ఇన్ స్ట్రాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. అప్పటికప్పుడు లిరిక్స్ అనుకొని పాటతో పాటు మ్యూజిక్ చేస్తున్న భోలే షావలికి ఫ్యాన్ బేస్ రోజురోజుకి గట్టిగానే పెరుగుతుంది. నిన్న జరిగిన ఫ్యామీలీ వీక్ ఎపిసోడ్ లో పాటబిడ్డ భోలె షావలి తన భార్యతో మాట్లాడిన తీరు, పాటలతో అలరించిన తీరుకి ప్రేక్షకులలో మరింత క్రేజ్ ఏర్పడినట్టు తెలుస్తుంది. ఓటింగ్ భారీగా పెరిగింది. నామినేషన్ లో ఉన్న అయిదుగురిలో శివాజీ నెంబర్ వన్ గా ఉండగా ఆ తర్వాత స్థానంలో భోలే షావలి ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాలలో యావర్, గౌతమ్, రతిక ఉన్నారు. అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఎవరికి గేమ్ ఆడేంత స్కోప్ లేదు. ఇక వారి ఫ్యాన్ బేస్ బట్టి ఓటింగ్ జరుగుతుంది. భోలే షావలికి అత్యధిక ఓటింగ్ రావడం చూసి బిగ్ బాస్ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. మరి ఈ వారం హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.  

భోలె  షావలి భార్య ఎంట్రీ ...ఇష్ట పడదాం..కష్ట పడదాం.. కప్పు కొడదాం!

బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. మొన్నటి ఎపిసోడ్ లో శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ రావడంతో మోస్ట్ ఎమోషనల్ గా సాగింది ఎపిసోడ్.. ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ రావడం, తనకి సీమంతం చేయడం అదంతా ఆకట్టుకోగా, కాసేపటికి అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ వచ్చి బోరున ఏడిపించేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి మొదటగా గౌతమ్ వాళ్ళ అమ్ మంగ వచ్చింది. కన్నయ్య... అంటూ అమ్మ పిలుపు విని హౌస్ లోని వాళ్ళంతా ఆశ్చర్యకరంగా గేట్ వైపు చూశారు. ఎవరు రాకపోవడంతో హౌస్ మేట్స్ అంతటా వెతికారు. ఇక కన్నయ్య పంచె వచ్చిందా అని వినపడగానే గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. కాసేపటికి మెయిన్ గేట్ నుండి గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చీ రాగానే గౌతమ్ ని హత్తుకొని ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ తో.. గౌతమ్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిందంటూ చెప్పుకొచ్చింది. కాసేపటికి యావర్ కి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోషనల్ అవ్వగా.. నేను కూడా నీకు అమ్మనే, బయటకు వచ్చాకా మా ఇంటికి రా యావర్ అంటు గౌతమ్ వాళ్ల అమ్మ అంది. ఇక హౌస్ మేట్స్ అందరికి గోరుముద్దలు తినిపించగా ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆట బాగా ఆడుతున్నావ్. ఇలాగే ఉండు. నీలాగే ఉండు అంటు గౌతమ్ కి వాళ్ళ అమ్మ కొన్ని విషయాలని షేర్ చేసింది. కాసేపటికి లవ్ సాంగ్ వేశాడు బిగ్ బాస్. దాంతో ఎవరి బాయ్ ఫ్రెండో లేక గర్ల్ ఫ్రెండో వస్తుందని అనుకున్నారంతా. అనుకున్నట్టే ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ వచ్చాడు. వచ్చీ రాగానే ఎర్రగులాబీతో ప్రపోజ్ చేశాడు. హౌస్ మేట్స్ అంతా అలానే చూస్తు ఉండిపోయారు. కాసేపటికి పెళ్ళెప్పుడు శివ్ అని ప్రియాంక అడుగగా.. నువ్వు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే చేసుకుందామని శివ్ అన్నాడు. కాసేపటికి శోభాశెట్టి వచ్చి శివ్-ప్రియంకలతో మాట్లాడింది. " హౌస్ లో నువ్వు ఒక్కదానిగానే ఆడు. బయట నీ ఫ్రెండ్స్ అయిన ఇక్కడ నువ్వు కప్పు కోసం వచ్చావ్. దాని కోసం ఇండివిడ్యువల్ గా ఆడు. అవతలి వాళ్ళు నీకు ఎంత కోపం తెప్పించాలని చూసిన అగ్రెసివ్ అవ్వకు. ఏదైనా గొడవ జరిగితే అక్కడే వదిలేసేయ్" అంటూ ప్రియాంకతో శివ్ అన్నాడు. ఇక వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ అనగానే ప్రియాంకకి ముద్దుచ్చి బయటకొచ్చేశాడు. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత భోలే షావలి భార్య హౌస్ లోకి వచ్చింది. వచ్చీ రాగానే భోలే ఏడ్చేశాడు. నా ఆట ఎలా ఉందని అడుగగా.‌ బాగుందని భోలే భార్య అంది. హౌస్ మేట్స్ అందరిని పరిచయం చేసిన భోలే.. తన భార్య కోసం పాట కూడా పాడాడు‌. ఆ తర్వాత వాళ్ళ కొడుకు గురించి అడిగి ఎమోషనల్ అయ్యాడు భోలే. కాసేపటికి భోలే భార్య బయటకొచ్చేసింది. ఇలా హౌస్ లో ఒక్కో ఫ్యామిలీ ఎంట్రీ గుండెల్ని పిండేసింది.  

Krishna Mukundha Murari : కృష్ణ మైండ్ బ్లాక్ చేసే ముకుంద ప్లాన్ ఏంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -309 లో.. మెల్లి మెల్లిగా కృష్ణకి మురారి దగ్గర అవుతున్నాడని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. తన సంతోషాన్ని రేవతితో షేర్ చేసుకుంటుంది. ఏసీపీ సర్ మనసులో నాకు త్వరలోనే స్థానం లభిస్తుందని కృష్ణ అంటుండగా.. ముకుంద వచ్చి అది అవదమ్మ అన్నట్టుగా లోపలికి వస్తుంది. ఆ తర్వాత ఇక ఇలాంటి మాటలకి బయపడే రోజులు పోయాయి ఏసీపీ సర్ నాకు దగ్గర అవుతుంటే ఇలాంటి వాటికి బయపడాల్సిన అవసరం లేదని ముకుందతో కృష్ణ అనగానే.. మీరెంత నవ్వుకున్నా ఈ రెండు మూడు రోజులే. నా ప్లాన్ తో  మీకు మైండ్ బ్లాక్  అవుతుందని ముకుంద అంటుంది. ఈ అర్ధం పర్థం లేని మాటలు ఎప్పుడు ఉండేదే కాదా అని రేవతి అంటుంది. ఇక మీరే నాకూ అసలైన అత్త కాబోతున్నారని ముకుంద అనగానే.. ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత కృష్ణ ముకుందల మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. నేను చేసే ప్లాన్ ఏంటో ముందు చెప్పే అలవాటు లేదని ముకుంద అంటుంది. నేను వెళ్తున్న మళ్ళీ మురారి నీకోసం ఇక్కడకి రావడం ఇష్టం లేదు. నువ్వు త్వరగా రా అంటూ ముకుంద వెళ్ళిపోతుంది. మరొక వైపు కృష్ణ, ముకుంద, మురారి షాపింగ్ కి వెళ్తారు‌. మురారి పక్కన కృష్ణ కూర్చోబోతుంటే.. నేను కూర్చుంటాని కృష్ణని వెనక్కి పంపిస్తుంది ముకుంద. మరొకవైపు రేవతి వాళ్ళని చూసి.. కృష్ణ మురారి  మధ్యలో ఎప్పుడు ఈ ముకుంద వస్తుంది. దాని అడ్డు తొలగించు. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానని మధుతో రేవతి అంటుంది. ఆ తర్వాత కోపంగా ఉన్న రేవతి  దగ్గరికి మధు వచ్చి.. మాట్లాడుతాడు. అప్పుడే కృష్ణకి వచ్చిన డౌట్ ని మధుకీ మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ ని రేవతికి చదివి వినిపిస్తాడు మధు. ముకుంద మురారి లు అమెరికా వెళ్ళాక అక్కడ వీసా పారేసి మురారితో అక్కడే ముకుంద ఉంటుంది కావచ్చని కృష్ణ డౌట్ ని మధు చెప్పగానే.. రేవతి షాక్ అవుతుంది.. ఆ తర్వాత మురారి దగ్గరికి మధు వెళ్లి.. ఇప్పుడు అమెరికా ఎందుకు అని అడుగుతాడు. వెళ్ళాలి. వెళ్తే నా గతం నాకు త్వరగా గుర్తుకు వస్తుంది కదా అని మురారి చెప్తాడు. కాసేపటికి కృష్ణ దగ్గరకు మురారి వచ్చి.. ఎవరిని చూసిన సొంతవాళ్లు అనే ఫీలింగ్ రావడం లేదు. ఒక మిమ్మల్ని చూస్తేనే వస్తుందని మురారి అనగానే.. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణకి మురారి చీర ఇస్తాడు. ఇది కట్టుకొని ఎయిర్ పోర్ట్ కీ రావాలని మురారి చెప్పగానే.. కృష్ణ బాధపడుతుంది. తరువాయి భాగంలో మురారి ఇచ్చిన చీర కట్టుకొని కృష్ణ మురిసిపోతుంటుంది. మురారి వచ్చి ఎయిర్ పోర్ట్ కి వెళ్లేటప్పుడు కట్టుకోమని చెప్పాను కాదా అని మురారి అనగానే.. కృష్ణ డైవర్ట్ చేస్తూ కాఫీ కావాలా అని అడుగుతుంది. కాఫీ అనేది సెకండ్. మిమ్మల్ని చూడడం కోసం వచ్చానని మురారి చెప్తాడు. అసలు ముకుంద ప్లాన్ ఏంటి? మురారి అమెరికా వెళ్తాడా లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.