డబుల్ ఎలిమినేషన్ కాదు ట్రిపుల్ ఎలిమినేషన్.. బయటకు వచ్చేదెవరు?

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం నడుస్తుంది.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ గత సీజన్ లలో జరిగిన దాని ప్రకారం పదిహేనవ వారం ఎలిమినేషన్ ఉండదు. మధ్యలో మిగిలింది రెండే వారాలు. కానీ హౌస్‌లో ఉన్నది పది మంది. వచ్చే వారం ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిగిలేది ఎనిమిది మంది‌. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. దాంతో ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు కానీ ఈ సీజన్ లో ఉల్టా పల్టా థీమ్ తో బిగ్ బాస్ డేంజర్ జోన్ లోని ఒకరిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తాడేమోనని అనిపిస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లలో.. శివాజీ, ప్రశాంత్, యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు టాప్-5 లో కచ్చితంగా ఉంటారు. అయితే టాప్-5 లో ఆ నాలుగు, అయిదు స్థానాలలో ఎవరుంటారనేది అందరిలో మిగిలిన ప్రశ్న. అమర్ దీప్ గత వారం జరిగిన టాస్క్ లో ఏడ్చేశాడు. దాంతో అతని మీద ఫౌల్స్ ఆడతాడన్న మచ్చ పోయి కాస్త పాజిటివ్ ఎపిసోడ్ వచ్చిందనే చెప్పాలి. ఇక సీరియల్ బ్యాచ్ లోని అతి ముఖ్యమైన కంటెస్టెంట్ ప్రియాంక. తన స్ట్రాటజీతో మైండ్ గేమ్ తో ఎదుటివారిని మాట్లాడనీయకుండా చేస్తూ హౌస్ లో అమర్ దీప్, శోభాశెట్టి లని తన గుప్పిట్లో పెట్టుకుందనేది వాస్తవం. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్.. ఇంకా హౌస్ లో ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. ఆ ఫేక్ అంబటి అర్జున్ ఒక్క నామినేషన్ లో మాత్రమే రీజన్స్ చెప్పి.. ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పనేదో తను చూసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇదే విషయం స్పష్టం చేస్తూ యావర్ నామినేట్ కూడా చేశాడు. దీంతో ఈ వారం గౌతమ్, అర్జున్ ఇద్దరు ఎలిమినేషన్ అవుతారని అందరు భావిస్తున్నారు‌. అయితే రతిక, అశ్వినిశ్రీ కూడా కంటెంట్ కోసం తప్ప గేమ్స్ లో జీరో ఎఫర్ట్స్ చూపిస్తున్నారు. గత నాలుగు వారాల నుండి శోభాశెట్టి ఎలిమినేషన్ ఆగుతుంది‌. కారణమేంటంటే బిగ్ బాస్ మన సీరియల్ బ్యాచ్ కి ఫేవరిజం చూపిస్తున్నాడా లేక శోభాశెట్టి వెళ్ళిపోతే హౌస్ లో గొడవలు పెట్టుకునేది ఎవరు ఉండరని భావిస్తున్నాడా ఏమో తెలియదు. అంతుచిక్కని విషయం ఏంటంటే.. శోభాశెట్టి ఏ వారం నామినేషన్స్‌లో ఉన్నా.. అన్ అఫీషియల్ పోల్ ప్రకారం ఆమె అందరికంటే లీస్ట్‌లో ఉంటుంది. కానీ ఆదివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి.. శోభా యు ఆర్ సేఫ్ అని అనేస్తారు. పోనీ ఒకటి రెండు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఇతర అన్ అఫీషియల్ పోల్స్‌లో రిజల్ట్ తప్పుగా వచ్చిందంటే అనుకోవచ్చు. కానీ నూటికి తొంభై శాతం శోభాశెట్టికి వ్యతిరేకంగానే పోల్స్ వస్తున్నాయి. ఇక ఈ వారం నామినేషన్ లోనే లేదు. కెప్టెన్ అయినందున ఎలిమినేషన్ నుండి ప్రియంక తప్పించుకుంది.

భార్య మాటకి విలువనిచ్చిన భర్త.. కొత్తగా మొదలైందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -320 లో.. కృష్ణ ఒడిలో మురారి నిద్రపోతు తెల్లవారిందన్న  విషయం మర్చిపోతాడు. కాసేపటికి కృష్ణ నిద్ర లేపుతుంది. పూర్తిగా కృష్ణ ప్రేమలో  ఉన్న మురారి నాకు గతం గుర్తుకు రాకుండా ఉంటేనే బాగుండనిపిస్తుందని మురారి అనగానే.. కృష్ణ మొహం డల్ అవుతుంది. కృష్ణ దగ్గర నుండి మురారి రావడం చుసిన రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవైపు భవాని మాట్లాడిన మాటలు గుర్తుకు చేసుకుంటాడు మురారి. అప్పుడే భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. నిన్న మురారి మనల్ని  అడిగిన ప్రశ్నలు కృష్ణని ఎందుకు అడగలేదని ముకుందతో‌ భవాని అంటుంది. మనపైన ఇంత కోపంగా ఉంటున్నాడు. ఆ కృష్ణతో సరదాగా ఉంటున్నాడని భవానీతో ముకుంద చెప్తుంది. వాళ్ళని కలవనియకూడదు. వీలైనంత త్వరగా  అమెరికాకి పంపించాలని భవాని అనుకుంటుంది. ఒకవైపు కృష్ణ ముగ్గు వేస్తుంటే మురారి వచ్చి సరదాగా మాట్లాడతూ తను కూడా ముగ్గు వేస్తాడు. అదంతా ముకుంద చూస్తుంటుంది. మరొకవైపు మధు, రేవతిలతో భవాని మాట్లాడుతుంది. మధు మీరు ఆ కృష్ణకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. తప్పు చేసిందని నేను అంటున్నా దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తప్పు చెయ్యలేదని అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని భవాని వాళ్లని అడుగుతుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గర నుండి మురారి వస్తాడు. ఎక్కడకి వెళ్ళావని మురారిని భవాని అడుగుతుంది. తల తిరిగినట్లు గా ఉందని మురారి అంటాడు. అంటే కృష్ణ దగ్గరికి వెళ్ళావా? సరే లోపలికి వెళ్ళమని భవాని సాధారణంగా మాట్లాడుతుంది. కాసేపటికి భవాని కోపంగా మధు, రేవతిలతో మాట్లాడుతుంది. ముకుంద మురారిలని త్వరగా అమెరికా పంపించాలని అనగానే ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి.. అమెరికా మూడు రోజుల్లో వెళ్తున్నామని చెప్పగానే వీలైతే ఈ రోజు వెళ్ళండని కృష్ణ అనగానే.. ముకుంద షాక్ అవుతుంది.. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. అమెరికా వెళ్ళాలని లేదని అనగానే.. వెళ్ళండి సర్ అని మురారికి  కృష్ణ చెప్తుంది. అలా చెప్పగానే నువ్వు చెప్పావ్ కాబట్టి వెళ్తున్నా అని మురారి అంటాడు. కృష్ణ, మురారి మాట్లాడుకున్న మాటలన్నీ విని భవానికి చెప్తుంది ముకుంద. అప్పుడు భవాని కోపంగా రేవతిని పిలిచి.. ఆ కృష్ణ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది? వీలైతే ఈ రోజే వెళ్ళండని ముకుందతో కృష్ణ అంటుందంట అని భవాని చెప్పగానే.. రేవతి షాక్ అవుతుంది..ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అక్రమ సంబంధం.. అప్పు సూసైడ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -259 లో... అరుణ్ కి రాహుల్ ఫోన్ చేసి స్వప్నని డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేయమని చెప్తాడు. దాంతో స్వప్నకు అరుణ్ ఫోన్ చేస్తాడు. స్వప్న మాత్రం మళ్ళీ ఎందుకు కాల్ చేసావ్ రా ఇడియట్? నీకు నాకు ఏం సంబంధం ఉందంటూ  తిడుతుంది. అక్రమ సంబంధం ఉందని అరుణ్ అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్? మనం ఫ్రెండ్స్ మాత్రమే అని స్వప్న అంటుంది. నువ్వు ఇప్పుడు పది లక్షలు డబ్బులు తీసుకొని రాకపోతే మనం ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలన్నీ గ్రాఫిక్స్ చేసి పంపిస్తానని అరుణ్ అంటాడు. నువ్వు ఇప్పుడు పది లక్షలు తీసుకొని వస్తే ఇక నీ జోలికి రానని అరుణ్ చెప్తాడు. దానికీ స్వప్న కూడా సరేనని అంటుంది. ఇప్పుడు పది లక్షలు ఎక్కడ నుండి తీసుకొని రావలని స్వప్న టెన్షన్ పడుతుంది. అదే సమయంలో స్వప్న టెన్షన్ పడడం చూసిన రాహుల్ , రుద్రాణి  ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు కళ్యాణ్ ని అప్పు మర్చిపోలేక ఏమైనా చేసుకుంటుందని అనుకొని అప్పుని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది కనకం. మరొకవైపు రాజ్ కి ఎస్సై ఫోన్ చేసి అరుణ్ గురించి తెలిసిన విషయాలు చెప్తాడు. అరుణ్ మీ ఇంటి కోడలు స్వప్న కాలేజీ ఫ్రెండ్.. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతకు మించి బ్యాడ్ గా లేదని ఎస్సై అంటాడు.  కావ్య చెప్పింది కరెక్టే.. నేనే స్వప్నని తప్పుగా అర్థం చేసుకున్ననా అని రాజ్ అనుకుంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. రాజ్ వెటకారం మాటలకి కావ్య సెటైర్ లు వేస్తుంటుంది. మరొక వైపు కనకం చెప్పిన పనులన్ని అప్పు చేస్తుంటుంది. ఏంటి అప్పుకి పని చెప్తున్నావ్. అది ఖాళీగా ఉండి కళ్యాణ్ ఆలోచనతో ఏమైనా చేసుకుంటుందనా అని‌ కనకాన్ని అన్నపూర్ణ అడుగుతుంది. " దానిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు కూడా దాని మనసు మార్చడానికి ప్రయత్నం చేయు" అని అన్నపూర్ణకి కనకం చెప్తుంది. తెల్లవారింది కాఫీ పెడదామని వంటింట్లోకి వెళ్తుంది కనకం. పాలు వంటింట్లో అప్పటికి ఉండవు ఇదేంటి అప్పు ఇంకా పాలు తీసుకురాలేదు పాలు తీసుకు రమ్మని చెబుదామని అప్పు రూమ్ కి వెళ్తుంది. అప్పు చేతికి మణికట్టు దగ్గర గీత ఉంటుంది. అది చూసి వెంటనే కనకం షాక్ అవుతుంది. అప్పు సూసైడ్ చేసుకుందని భయపడుతుంది. మరొకవైపు స్వప్న టెన్షన్ పడుతుంటే.. రాహుల్ వచ్చి ఏమైంది ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ఏం అవసరం లేదని స్వప్న చెప్తుంది. రేపటి లోగా పది లక్షలు ఎలా తీసుకొని రావాలని టెన్షన్ పడుతుంది. ఒకవైపు రాజ్ డోర్ వేస్తుంటే ఆ డోర్ వెనక్కి వచ్చి రాజ్ ముక్కుకి తాకూతుంది. దాంతో అది చూసిన కావ్య నవ్వుతుంటే.. రాజ్ కి కోపం వస్తుంది. తరువాయి భాగంలో.. రాహుల్ ఇంట్లో అందరి ముందు స్వప్న ఎవరితోనో తిరుగుతుందంటూ ఫొటోస్ చూపిస్తాడు.. ఆ తర్వాత అతను నాకు ఫ్రెండ్ అని స్వప్న చెప్పగానే ఆ రోజు ఫోటో చూపించి అడిగితే.. అతను నాకు తెలియదని చెప్పావని ఇందిరాదేవి అనగానే.. ఇంట్లో అందరు షాక్ అవుతారు.. ఆ తర్వాత ఏం జరిగింది.. అప్పు నిజంగానే సూసైడ్ చేసుకుందా, లేదా అని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

హత్యకు గురైన బిగ్ బాస్ భార్య...  హౌస్‌లోకి పోలీసులు ఎంట్రీ!

బిగ్ బాస్ సీజన్-7 లో ఉల్టా పల్టా ట్విస్ట్ లు మాములుగా లేవుగా... ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి దాకా ఫ్యామిలీ వీక్ అంటు ఎమోషనల్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడేమో ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ ఇచ్చాడు. అందులో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోని అమర్ దీప్, అంబటి అర్జున్ ని మినహాయించి మిగతా హౌస్ మేట్స్ కి ఆక్టివిటి ఏరియాలో విందు ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. అయితే అందరు భోజనానికి కూర్చున్నప్పుడు.. ఎక్కువ ఆలోచించకు నీ ఇటుకల తెలివి ఆపేసెయ్ అని రతికతో శివాజీ అంటాడు. పెద్దయ్య ఇందులో ఏం లేదా అని రతిక అనగానే.. నువ్వు అతిగా ఆలోచించకని బిగ్ బాస్ అంటాడు. ఆ తర్వాత అందరు బయటకు వస్తారు. బిగ్ బాస్ హౌస్ లో మీరు విందు చేసే సమయంలో హత్య జరిగిందని, అది ఎవరో కాదు మిసెస్ బిగ్ బాస్ ని ఎవరో హత్య చేశారని కంటెస్టెంట్స్ చెప్పాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లోని వాళ్ళంతా షాక్ అయ్యారు. కాసేపటికి స్టోర్ రూమ్ నుండి అంబటి అర్జున్, అమర్ దీప్ లు ఇద్దరు పోలీసులుగా వచ్చారు. దాంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. శివాజీకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మరి ఈ సీక్రెట్ టాస్క్ ని శివాజీ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిలుస్తాడా లేదా తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. మరి హౌస్ లో జరిగిన మిసెస్ బిగ్ బాస్ హత్యను చేసిందెవరో కంటెస్టెంట్స్ కనిపెట్టగలరా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu: ఆ చావు వెనుక దాగి ఉందెవరో తను కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -926 లో.. మహేంద్ర దగ్గరికి అనుపమ వచ్చి జగతి విషయంలో మహేంద్రే దోషి అన్నట్లుగా మాట్లాడుతుంటుంది. అలా అనుపమ అనగానే మహేంద్రకి కోపం వస్తుంది. నిన్ను నమ్మి జగతిని నీ చేతిలో పెడితే ఇలా చేసావని అనుపమ అంటుంది. స్టాప్ ఇట్ అంటూ మహేంద్ర గట్టిగా అరుస్తాడు. అప్పుడే వసుధార, రిషి ఇద్దరు అక్కడికి వస్తారు. మరొక వైపు చాటుగా అనుపమ ఏం మాట్లాడుతుందని శైలేంద్ర వింటుంటాడు.  ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు లోపలకు వచ్చి అనుపమని పలకరిస్తారు. రిషి చూసావా? అనుపమ ఎలా మాట్లాడుతుందోనని మహేంద్ర బాధపడుతు చెప్తాడు. మేడమ్ అమ్మ ఎలా చనిపోయిందనే విషయం మీకు మొత్తం చెప్పాను అయిన మీరు ఇలాగే మాట్లాడితే డాడ్ చాలా బాధపడుతాడని అనుపమతో రిషి అంటాడు. కాసేపటికి మహేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార కాఫీ తాగి వెళ్ళండి అని అనుపమని అడిగితే.. భోజనం చేసి వెళ్తానని అనుపమ చెప్తుంది. ఆ తర్వాత రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే శైలేంద్ర కీ ఫోన్ వస్తుంది. ఆ సౌండ్ విని ఎవరు ఎవరున్నారని వసుధార బయటకు వెళ్లేలోపు శైలేంద్ర గుర్తుపట్టకుండా ఉండాలని మొహానికి బ్లాక్ పెయింట్ పూసుకుంటాడు. ఆ తర్వాత బైక్ మీదుగా వెళదామని స్టార్ట్ చెయ్యబోతుంటే బైక్ స్టార్ట్ కాకా తోసుకుంటు వెళ్తాడు. అది వెనకాల నుండి వసుధార చూసి శైలేంద్రలా ఉన్నాడని ధరణి కి ఫోన్ చేసి శైలేంద్ర సర్ ఇంటి దగ్గర ఉన్నాడా అని అడుగగా.. ధరణి లేడని చెప్తుంది. మరొకవైపు శైలేంద్ర బైక్ ని తోసుకుంటూ వెళ్తాడు. ఒకతను చూసి ఏమైందని అడిగి.. నీ బైక్ బాగు చేస్తాను డబ్బులు ఇవ్వు అనగానే శైలేంద్ర డబ్బులు ఇస్తాడు. అవి తీసుకోని బైక్ కీ ఆన్ చేసి వెళ్ళండి అనగానే శైలేంద్ర షాక్ అవుతాడు. వసుధార నువ్వు పెట్టే టెన్షన్ కి బైక్ కీ కూడా ఆన్ చెయ్యడమే మర్చిపోయానని శైలేంద్ర అనుకుంటాడు.  మరొకవైపు అనుపమ, రిషి ఇద్దరు మాట్లాడుకుంటారు. జగతిని ఎన్ని రోజులు మహేంద్ర కీ దూరంగా ఉందని అనుపమ అనగానే.‌. డాడ్ బాధని చూడలేక నేనే వాళ్లని కలిపానని రిషి అంటాడు. దేవయాని అన్న మాటలు అనుపమ గుర్తుకు చేసుకొని.. నువ్వు మీ అమ్మని ఏమని పిలిచేవాడివని అడుగగానే.. మేడమ్ అని పిలిచేవాడిని అని రిషి చెప్తాడు. ఎవరైనా అలా పిలుస్తారా? నువ్వు నీ తల్లిని ఎంత బాధపెట్టి ఉంటావ్.. ఇదేనా ఇంకా ఏమైనా జగతిని బాధపెట్టిన విషయాలు ఉన్నాయా అని అనుపమ అడుగుతుంది. మేడమ్ మీరు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇంకా డాడ్ కి ఎలా ఉందో.. ప్లీజ్ వీలైతే అమ్మా బాధ నుండి డాడ్ ని బయటకు తీసుకొని రండి అని రిషి చెప్తాడు. ఆ తర్వాత కాఫీ తీసుకొని రావాలా అని వసుధార అడుగుతుంది.  నేనే కలుపుకుంటానని వసుధారతో అనుపమ లోపలికి వెళ్తుంది. మరొకవైపు శైలేంద్ర అవతారం చూసి దొంగ వచ్చాడనుకోని ధరణి కర్రతో కొడుతుంది. ఆ తర్వాత ధరణి.. నేను శైలేంద్ర ని అని చెప్తాడు. రెడీ అవ్వు బయటకు వెళదామని శైలేంద్ర అనగానే.. ధరణి హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌

పెద్దోడు ఓడిపోయాడు.. చిన్నోడు గెలిచాడు... శివాజీ హ్యాపీ!

గత వారం ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన గేమ్స్‌లో విజయం సాధించి ఎవిక్షన్ పాస్ ని తన సొంతం చేసుకున్నాడు యావర్. అయితే శనివారం రోజు వచ్చిన నాగార్జున యావర్‌కు కంగ్రాట్స్ చెబుతూనే... నువ్వు ఆడిన గేమ్స్‌ని ఒక్కసారి చూద్దామా అంటూ యావర్ ఆడిన గేమ్స్‌ని చూపించాడు. ఆ వీడియోలో బిగ్ బాస్ చెప్పిన గేమ్ రూల్స్‌ను యావర్ పాటించకుండానే గేమ్ విన్నర్‌గా నిలిచాడనే విషయం తెలిసిపోయింది. యావర్ తను చేసిన ఫౌల్ గేమ్‌ని చూసి తనకొచ్చిన ఎవిక్షన్ పాస్ ని  నిజాయితీగా  తిరిగి బిగ్ బాస్‌కి అప్పగించాడు. ఈ రోజు ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన రేస్ లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. కాగా శివాజీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్-7 లో పన్నెండవ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఒకే ఒక్క టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌. ఇందులో ఎవరైతే గెలుస్తారో వారిదే ఎవిక్షన్ పాస్ అని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ తమ సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. నిన్నంతా నామినేషన్ ల హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ టార్గెట్ చేసి మాటలు జాగ్రత్తగా రానీయి అనడం.. నేనేంటో చూపిస్తానని చెప్పడం. అమర్ దీప్, రతికల మధ్య మాటల యుద్ధం అంతా హైలైట్ అవ్వగా.. నేడు విడుదల చేసిన మొదటి ప్రోమోలో ప్రియంక వర్సెస్ శివాజీ హీటెడ్ ఆర్గుమెంట్ సాగినట్టుగా తెలిసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన రెండో ప్రోమోలో యావర్-అంబటి అర్జున్, గౌతమ్-ప్రశాంత్ ల మధ్య కొన్ని సంభాషణలు చూపించాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్.. " మీకు ఇదే చివరి అవకాశం.. ఎవిక్షన్ పాస్ పొందడానికి ఒకే ఒక్క టాస్క్ ఇస్తున్నాను. ఇందులో గెలిచిన వారిదే ఎవిక్షన్ పాస్ " అని  చెప్పాడు. ఒక టేబుల్ స్టాండ్ మీద మొదట ప్లేట్, తర్వాత కప్పు, సాసర్ అంటూ ఒక్కొక్కటిగా పేర్చాలి.. ఇక వాటిని కింద పడకుండా ఎంత ఎక్కువ సేపు ఉంటారో వారే విజేత అని కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ చెప్పగా.. మొదట శోభాశెట్టి అవుట్ అయింది. ఆ తర్వాత అశ్వినిశ్రీ, రతిక, అంబటి అర్జున్, శివాజీ, యావర్, గౌతమ్ అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. చివరగా ప్రియాంక, ప్రశాంత్ రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ టాస్క్ పూర్తయిందని, పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడని నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎవరికి దక్కిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సిరి దృష్టిలో టాప్-5 వాళ్ళేనట!

బిగ్ బాస్ ఉల్టా పల్టాతో ఈ సీజన్ సరికొత్తగా మొదలైంది. సక్సెస్ ఫుల్ గా పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం రన్ అవుతుంది. కామన్ మ్యాన్ దగ్గర నుండి సెలబ్రిటీలు సైతం బిగ్ బాస్ ని చూస్తుంటారు. మొన్న మూవీ ప్రమోషన్స్ కి వచ్చిన హీరో శ్రీకాంత్ బిగ్ బాస్ ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవలేదని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని బట్టే తెలుస్తుంది బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో. ఈ సీజన్ మరికొన్ని వారాల్లో  పూర్తి కానుంది. దీంతో ఎవరి గేమ్ ఎలా ఉందో? ఎవరి బిహేవియర్ ఎలా ఉందోనని ఒక అంచనాకి వచ్చి ప్రతీవారం నామినేషన్ లో ఉన్న తమ కంటెస్టెంట్ కీ ఓటు వేసి సేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పది మంది ఉండగా గత వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పడంతో అశ్విని, గౌతమ్ ఇద్దరు సేవ్ అయ్యారు. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సీజన్‌‌.. అంచనాలకు తగ్గట్టు కంటెస్టెంట్స్ బాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. గత వారం ఫ్యామిలీ వీక్ లో ప్రతీ కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ వచ్చి వారి అభిప్రాయాలని చెప్తూ.. టాప్-5 లో ఎవరుంటారనేది పెట్టడం జరిగింది. అందులో కామన్ గా శివాజీ, ప్రశాంత్, యావర్ ఉండడం జరిగింది. ఇలా ఒక్కొక్కరి అభిప్రాయంలో తమ టాప్-5 ని సెలెక్ట్ చేయడంతో హౌస్ లోని వారందరికి ఒక ఐడియా వచ్చేసింది. అసలు విషయనికొస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారి గురించి ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ.. ఇలా ఎవరికి వారే తమ సపోర్ట్ ని ఇస్తున్నారు. సిరి హనుమంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ లో కొన్ని విషయాలని షేర్ చేసుకుంది. మీ దృష్టిలో బిగ్ బాస్ హౌస్ లోని వారిలో టాప్-5 ఎవరని తన అభిమానులు అడుగగా.. నాకు అమర్, అర్జున్ టాప్ 5 లో ఉండాలని ఉంది. ఉండాలి కూడా గేమ్ బాగా ఆడుతున్నారు. ఇంక శివాజీ, ప్రశాంత్ టాప్-5 లో ఉంటారు. శోభాశెట్టి, యావర్ ఈక్వల్ గా ఆడుతున్నారు. శోభాశెట్టికి నెగెటివిటి ఎక్కువగా ఉంది. శివాజీ, ప్రశాంత్, యావర్ లు టాప్-5 ఉంటారు. అమర్ దీప్, శోభాశెట్టి కూడా ఉండాలని కోరుకుంటున్నానంటూ సిరి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంది.

శివాజీకి నామినేషన్ లో భారీ మెజారిటీ ఖాయం.. ఇదే సాక్ష్యం!

బిగ్ బాస్ సీజన్-7 లో శివాజీ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలిసిందే. నామినేషన్ లో శివాజీ ఉంటే చాలు అత్యధిక ఓటింగ్ శాతం నమోదవుతుంది. మిగిలిన హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరికి కలిపి 30 శాతం ఓటింగ్ వస్తే శివాజీకి ఒక్కడికే 70 శాతం ఓటింగ్ నమోదవుతుంది. మొన్నటి ఫ్యామిలీ వీక్ లో‌ వచ్చిన ప్రతీ ఒక్కరు శివాజీని టాప్-3 లో ఉంచడంతో ఈ సీజన్ టైటిల్ శివాజీదే అని అందరు ఫిక్స్ అయ్యారు. అయితే హౌస్ మొత్తంలో ఫెయిర్ గేమ్ ఆడుతూ, ఎవరి మీద కన్నింగ్ ప్లాన్ వేయకుండా ఆడేది శివాజీ, యావర్, ప్రశాంత్ మాత్రమే.. అందుకే వీళ్ళు ముగ్గురు నామినేషన్ లో ఉంటే చాలు వీరే టాప్-3 లో ఉంటున్నారు. ఇక సీరియల్ బ్యాచ్ చేసే స్ట్రాటజీలని యావర్, ప్రశాంత్ లకి అర్థమయ్యేలా చెప్తూ వారిని సరైన విధంగా మాట్లాడేలా చేస్తూ మంచి సపోర్టింగ్ ఇస్తున్నాడు శివాజీ. ఓ బేబీ టాస్క్ లో గాయాలవుతున్న పదకొండు మందికి పోటీగా ఆడి గెలచి కెప్టెన్సీ రేస్ లో నిలిచాడు శివాజీ‌. దీంతో శివాజీ గ్రాఫ్ మరింత పెరిగింది. నిన్న యావర్ ని అమర్ దీప్, అంబటి అర్జున్ నామినేట్ చేసాక.. నేను కావాలని చేయలేదంటూ యావర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. సిగరెట్ తాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు యావర్. అప్పుడే శివాజీ అక్కడికి వచ్చి.. నీకు పదవ వారమే చెప్పాను. ఈ ఐదు వారాలు చాలా ముఖ్యమని, కోప్పపడకని శివాజీ అన్నాడు. నాకు తెలియకుండా జరిగిందానికి నామినేట్ చేయడమేంటి అన్న.. నేను వెళ్లిపోతా అన్నా అంటూ యావర్ ఏడ్చేశాడు. అది రాంగ్ మీ అన్నకి మాటిచ్చినవ్.. నా బిడ్డల మీద ఒట్టు. నేను ఇక్కడ ఫోర్స్‌గా ఉన్నాను. మీరు హ్యాండిల్ చేయలేరనే ఉన్నాను ఎందుకు ఏడుస్తున్నావ్‌ రా? చేతకాదా ఆడటం.. లైఫ్‌లో మళ్లీ ఇలాంటి సిచువేషన్ రాదు. నేను ఇలా చేసుకున్నా తెలియని వయసులో కోపంతో.. అంటూ శివాజీ మంచి సపోర్టివ్ గా మాట్లాడాడు. ఆ తర్వాత.. " అమర్ అలా ఎలా నామినేట్ చేస్తాడన్నా.. సంచాలక్ వాడే కదా.. తప్పు వాడిది కదా" అని యావర్ చెప్పగా.. ఆడియన్స్‌ చూస్తారు కదరా అని శివాజీ అన్నాడు. ఒకవైపు హౌస్ లోని కంటెస్టెంట్స్ కి అండగా ఉంటూ, మరొకవైపు టాస్క్ లలో తన ఆటతీరుతో అదరగొడుతున్న శివాజీకి భారీ మెజారిటీ ఖాయమని తెలుస్తుంది. అయితే అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఇద్దరు కన్నింగ్ గా  ఆలోచిస్తూ.. శివాజీ, ప్రశాంత్, యావర్ లని అన్ ఫెయిర్ నామినేషన్ చేయడంతో కావాలని టార్గెట్ చేస్తున్నారనేది అందరికి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇలాంటి కన్నింగ్ స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఫెయిర్ గేమ్ ఆడే కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేసిన అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఈ వారం ఎలిమినేట్ అవుతారా లేదా చూడాలి మరి.  

Gowtham Elimination : అంబటి అర్జున్ కన్నింగ్ ప్లాన్ అదేనా.. ఈ వారం గౌతమ్ ఎలిమినేషన్ ఫిక్స్!

బిగ్ బాస్ హౌస్ లో పన్నెండవ వారం నామినేషన్ ప్రక్రియ వాడి వేడిగా సాగింది‌. ప్రియాంక కెప్టెన్ కాబట్టి తనని ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అమర్ దీప్ నామినేషన్ ప్రక్రియని మొదలెట్టాడు‌‌. తన మొదటి నామినేషన్ యావర్ ని చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్ లో నువ్వు కాళ్ళు కింద పెట్టావని అని అమర్ దీప్ అనగా.. అది తెలియకుండా చేశాను‌‌ తెలిసి తప్పు చేయనని యావర్ అన్నాడు. ఆ తర్వాత రతికని అమర్ దీప్ నామినేట్ చేశాడు. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. అంబటి అర్జున్ మరియు గౌతమ్ కృష్ణ ఇద్దరు కలిసి శివాజీ, ప్రశాంత్, యావర్  లని టార్గెట్ చేశారు.‌ వీరిద్దరు కలిసి కావాలని నామినేట్ చేసినట్టుగా అభిమానులకి స్పష్టంగా తెలిసింది.‌ అసలు నామినేషన్ పాయింట్ లేకుండా చెత్త రీజన్ తో పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ నామినేట్ చేశాడు. ఒకప్పుడు నామినేషన్స్ అంటే పల్లవి ప్రశాంత్‌లో అపరిచితుడు దూరిపోయేవాడు. అసలు ఎదురుగా ఉన్నవాళ్లని మాట్లాడనిచ్చేవాడే కాదు. కానీ ఈ వారం నామినేషన్స్‌లో మాత్రం చాలా కూల్‌గా కామెడీ చేస్తూ ఇచ్చిపడేశాడు ప్రశాంత్. పన్నెండవ వారం నామినేషన్ లో గౌతమ్ చేసిన సిల్లీ రీజన్స్ వెనుక అంబటి అర్జున్ ఉన్నాడని అందరికి తెలిసిందే. యావర్, శివాజీలని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే .. ఆ రోజు టాస్క్ లో నువ్వు కాలు కింద పెట్టావ్‌ అలా ఇంకోసారి చేయకూడదని నామినేట్ చేస్తున్నానని యావర్ తో అంబటి అర్జున్ అన్నాడు‌. ఆ తర్వాత శివాజీని నామినేట్ చేశాడు. " ప్రశాంత్ అరిచాడని మీకు డిస్టబెన్స్ అవుతుందని అన్నారు‌. అదే మీరు గేమ్ అయిపోయాక ప్రశాంత్ పై గట్టిగా అరిచారు‌. అప్పటికి యావర్ గేమ్ ఆడుతున్నాడు. మీకు డిస్టబ్ అయినట్టు అతనికి కూడా డిస్టబ్ అవుతుంది కదా" అని శివాజీతో అంబటి అర్జున్ అన్నాడు. ఇక్కడ సంచాలకులు శోభాశెట్టి, ప్రశాంత్ కానీ వీరిద్దరిని నామినేట్ చేయకుండా శివాజీని నామినేట్ చేయడమేంటని, నామినేషన్ కి ముందు అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఇద్దరు అనుకొని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు భావిస్తున్నారు.  అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.

Prashanth vs Goutham Krishna: పల్లవి ప్రశాంత్ vs గౌతమ్.. నామినేషన్ ల హైరానా!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికి పదకొండు వారాలు పూర్తిచేసుకుంది. ఇక పన్నెండవ వారం నామినేషన్ లతో హీటెక్కిపోయింది హౌస్. గతవారం గౌతమ్, అశ్వినిశ్రీ చివరిదాకా వెళ్ళి సేవ్ అయ్యారు.‌ ప్రస్తుతం హౌస్ లో ఎవరు అనర్హులు అని తేల్చే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గత వారం మొత్తం ఎవరు ఏ టాస్క్ ఆడారు? ఎవరెలా మాట్లాడారు? ఎవరేం చేశారో వివరిస్తూ ఒక్కో కంటెస్టెంట్ మరొక కంటెస్టెంట్ ని నామినేట్ చేస్తారు. నామినేషన్ ప్రక్రియ లో భాగంగా పల్లవి ప్రశాంత్ ని రతిక నామినేట్ చేసింది. గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అర్జున్ ఎన్ని ఇటుకలు తీసుకొచ్చాడు నువ్వెన్ని తీసుకొచ్చావ్ అంటూ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది రతిక. నీ నామినేషన్ లో నాకు ఏ పాయింట్ కనపడలేదు సేఫ్ గా ఆడావని రతికతో పల్లవి ప్రశాంత్ అన్నాడు.  మొన్న జరిగిన విల్లుపై బాల్ బ్యాలెన్స్  టాస్క్ లో.. ఫౌల్స్ చేసిన యావర్, శివాజీ విన్ అయ్యారు. వాళ్లిద్దరు క్లియర్ గా పట్టుకున్నప్పుడు ప్రియాంక విన్ కావాలి కదా కానీ సంఛాలక్ గా నువ్వు ఉన్నావ్ అది నువ్వు చెప్పలేదు. ఫెయిల్ అయ్యావని ప్రశాంత్ ని గౌతమ్  నామినేట్ చేశాడు. నా పంచ ఆనవాయితీ లెక్క నీ అనవాయితీ కూడా సాగిందని గౌతమ్ అనగా.. ఆ పంచ ఊడకుండా చూసుకోమని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఆ తర్వాత గౌతమ్ రెచ్చిపోయి ఎక్కువ తక్కువ మాట్లాడకు.. నన్ను అనడానికి నువ్వు ఎవరని గౌతమ్ అనగానే.. బరాబర్ మాట్లాడతానని ప్రశాంత్ అన్నాడు. పంచ అనేది తెలుగోడి సంస్కృతి దాని గురించి నువ్వు మాట్లాడటం మంచిది కాదని గౌతమ్ అన్నాడు. నేను అలా అనలేదని, పంచ ఊడిపోకుండా చూసుకోమని మాత్రమే అన్నానని పల్లవి ప్రశాంత్ సరైన వివరణ ఇచ్చాడు.  ఆ తర్వాత శివాజీని గౌతమ్ కృష్ణ సిల్లీ రీజన్ తో నామినేట్ చేసాడు. ఒక ఆడియన్ గా నేను చూసాను‌‌ మీరు చేసింది తప్పు అంటూ గౌతమ్ అనగానే.. నీ దగ్గర నామినేట్ పాయింట్ లేకుంటే మాట్లాడకు.  

Krishna Mukunda Murari:  మురారి ఇచ్చిన ట్విస్ట్.. ముకుంద ప్లాన్ నెరవేరేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -319 లో.. మురారి మాములు సిచువేషన్ లోకి రాగానే మురారితో కృష్ణ సరదాగా మాట్లాడేసరికి మురారి ఎప్పటిలాగే అవుతాడు. ఆ తర్వాత మిమ్మల్ని నేను చదివించాను కదా అందుకు ప్రతిఫలంగా నేను ఒకటి అడుగుతానని మురారి అనగానే... ఏంటని కృష్ణ అడుగుతుంది. నువ్వు ఈ ఇంట్లోనే ఉండు అని మురారి అంటాడు. ఇప్పుడు మీరు పిలిస్తే పలికేంత దగ్గర ఉన్నాను కాదా అని కృష్ణ అనగానే.. చూస్తే కనపడేంత దగ్గర ఉండాలని మురారి అంటాడు. మీరు అమెరికా వెళ్లి వచ్చాక అప్పుడు మీకు గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు మీ పక్కనే ఉంటానని కృష్ణ మురారికి చెప్తుంది. మరొకవైపు వాళ్ళ మాటలు అన్ని ముకుంద వింటుంది. కృష్ణ భవాని దగ్గరికి వచ్చి.. మీరేం టెన్షన్ పడకండి. ఏసీపీ సర్ ఇప్పుడు సెట్ అయ్యారని కృష్ణ చెప్తుంది. నాకు చిరాకుగా ఉంది. తనని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పమని రేవతికి భవాని చెప్తుంది. " నన్ను ఏసీపీ సర్ ఇక్కడే ఉండమని అంటున్నారు కానీ నేను ఒప్పుకోలేదు అది మీకు నేనిచ్చే రెస్పెక్ట్" అని భవానితో కృష్ణ అంటుంది. ఇప్పుడు ఒక్క మాట అత్తయ్య అని మిమ్మల్ని పిలిస్తే ఏసీపీ సర్ కి నిజం తెలిసిపోతుంది కానీ నేను అలా చెయ్యనని కృష్ణ చెప్తుంది. నా మాటకి విలువ ఇస్తున్నానని నటించకు. అలా పిలిస్తే  అవుట్ హౌస్ నుండి పంపిస్తానని నీకు భయమని భవాని అంటుంది. మరొకవైపు శకుంతలకి కృష్ణ జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత లాయర్ ఫోన్ చేసిండని శకుంతల చెప్పగానే.. అవునా మనం వెళ్లి చిన్నాన్నని అసలు ఏం జరిగింది? చెయ్యని తప్పు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడో తెలుసుకోవాలని కృష్ణ అంటుంది. మరొకవైపు డ్రింక్ చేసి మధు ఎలాగైనా మురారికి నిజం చెప్పాలని అనుకుంటాడు. ఆ తర్వాత భవాని వచ్చి డ్రింక్ చేసి ఉన్న మధు చెంప చెల్లుమనిపిస్తుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. సరదాగా కృష్ణతో కబుర్లు చెప్తూ కృష్ణ ఒడిలో నిద్రపోతాడు. ఉదయo నిద్రలేచిన మురారిని వాళ్ళ ఇంటికి పంపిస్తుంది కృష్ణ. తరువాయి భాగంలో మనం ఎన్ని రోజులు అమెరికాలో ఉంటామని ముకుందని మురారి అడుగుతాడు. అమెరికా వెళ్ళడం ఎందుకు? అక్కడ నాకు ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ నెంబర్ ఇస్తే కృష్ణ మాట్లాడుతుందని మురారి అంటాడు. మంచి పని. ఇప్పుడు అక్క నెంబర్ ఇస్తే ముకుంద ప్లాన్ సక్సెస్ అవ్వదని రేవతి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu: దేవాయని కుట్ర అనుపమకి తెలియనుందా? 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -925 లో.. దేవయాని కుట్రలో భాగంగా అనుపమని తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఆ తర్వాత అనుపమకి మహేంద్ర, వసుధార, రిషిలపై నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా మాట్లాడుతుంది. ఎప్పుడు వసుధార, జగతిలకి ఎండీ చైర్ గురించి ఆర్గుమెంట్ జరిగేది. అందరి కన్ను ఎండీ చైర్ పైనే అని శైలేంద్ర అనగానే.. మరి నీకు ఎప్పుడు ఎండీ చైర్ గురించి ఆలోచన రాలేదా అని అనుపమ అడుగుతుంది. నాకు అలాంటి కోరికలేం లేవని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఆ వసుధార మాములుది కాదు. స్టూడెంట్ గా కాలేజీలో జాయిన్ అయ్యి రిషిని ప్రేమిస్తున్నానని తన చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఎండీ అయిందని దేవయాని చెప్తుంది. మహేంద్ర, జగతిలకి చాలా రోజులు దూరంగా ఉన్నాడు. ఇంకా రిషి అయితే చిన్నప్పుడు తనని వదిలేసి వెళ్ళిపోయిందన్న కోపంతో తనని అమ్మ అని కూడా పిలిచే వాడు కాదు.. మేడమ్ మేడమ్ అనేవాడని వసుధార, రిషిల గురించి నెగెటివ్ గా,  తమ గురించి పాజిటివ్ గా చెప్తుంది దేవయాని. ఆ తర్వాత అనుపమ వెళ్ళిపోతుంది. నువ్వు అనుపమ వెనకాల వెళ్ళు. నా ఊహ కరెక్ట్ అయితే మహేంద్ర దగ్గరికి వెళ్లి నేను చెప్పిన వాటి గురించి అడుగుతుందని శైలేంద్రతో దేవయాని చెప్తుంది. మరొక వైపు రిషి ప్యూన్ దగ్గర నుండి ఫైల్స్ తీసుకొని వసుధార క్యాబిన్ కి వెళ్లి ఆటపట్టిస్తాడు. సర్ మీరు ఎందుకు ఫైల్స్ తెచ్చారని వసుధార అడుగుతుంది.. ఆ తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ.. ఫైల్స్ చెక్ చేస్తుంటారు. కాసేపటికి వర్క్ పూర్తి చేసుకొని వస్తాను. మీరు వెళ్ళండని రిషిని పంపిస్తుంది వసుధార. మరొకవైపు వసుధారకి ధరణి ఫోన్ చేసి.. ఇందాక ఇక్కడికి అనుపమ అని జగతి అత్తయ్య ఫ్రెండ్ వచ్చిందని ధరణి చెప్తుంది. ఎందుకు వచ్చిందని వసుధార అడుగుతుంది. ఏం తెలియదు చాలా సేపు ఆవిడతో అత్తయ్య మాట్లాడారని ధరణి చెప్తుంది. ఇప్పుడే ఇక్కడ నుండి అనుపమ వెళ్లిపోయిందని ధరణి చెప్తుంది.   ఆ తర్వాత వసుధార వెంటనే రిషికి ఫోన్ చేసి.. నేను వస్తున్నా ఆగండి అని చెప్పగానే రిషి కార్ దగ్గర వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు ఇంటికి బయలుదేర్తారు. మరొకవైపు మహేంద్ర దగ్గరికి అనుపమ వచ్చి.. ఎప్పటిలాగా మళ్ళీ మళ్ళీ జగతి గురించి అడుగుతుంది. నువ్వు జగతి దూరంగా ఉన్నారంట? అసలు రిషి కూడా జగతిని దగ్గరికి తియ్యలేదు అంట అని అనుపమ అనగానే.. అసలు ఇదంతా నీకు ఎవరు చెప్పారు?  ఎక్కడ నుండి వస్తున్నావని అనుపమపై మహేంద్ర ఆరుస్తాడు. మరొక వైపు శైలేంద్ర అనుపమని ఫాలో అయి చాటుగా అనుపమ మహేంద్ర మాటలు వింటాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు ఇంటికి వస్తారు. అనుపమ ఇంట్లో ఉండడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : పోలీసులకి ఫోటో పంపించిన రాజ్.. వాళ్ళిద్దరి గదిలో దొంగ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -258 లో.... కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తుందని తెలిసిన కనకం బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడే కృష్ణమూర్తి వస్తాడు. కృష్ణమూర్తికి నిజం చెప్పాలని కనకం అనుకొని చెప్తుంది. మనకి ఒక సమస్య వచ్చిందని అనగానే.. ఏమైందని కృష్ణమూర్తి కంగారుపడుతాడు. మన అప్పు ఆడపిల్ల.. దానికి క మనసు ఉంటుందని గుర్తుకు చేసిందని కనకం అనగానే.. అది మంచి విషయమే కాదా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ మనసులో ఒక మనిషిని కోరుకుంటుంది. అది కళ్యాణ్ అని కనకం అనగానే.. కృష్ణమూర్తి షాక్ అవుతాడు. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లని ఎరగా వేసి ఈ ఇంటికి కోడళ్ళని చేశారని నింద మన మీద పడింది. కావ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిన బలవంతంగా చేసాం. ఇప్పుడు అప్పు నాకు అతను ఇష్టమని చెప్పినా పెళ్లి చెయ్యని అసమర్థుడుని అని కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. ఇందిరాదేవి వచ్చి అరుణ్ ఫోటోని చూపిస్తూ.. ఇతను ఎవరు మన ఇంటికి స్వప్నతో కలిసి ఉన్న ఫొటోస్ కొరియర్ చేశారు. అవి ఎవరైనా చూస్తే బాగోదని చింపేసాను. ఈ ఫోటో స్వప్నకి చూపించి ఎవరని అడిగితే తెలియదని చెప్పింది. ఎవరు? ఏంటి తెలియకుండా అపార్ధం చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ఇతను ఎవరో ఎందుకు ఫొటోస్ పంపించాడో కనుక్కోమని రాజ్ కి ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. ఈ ఫోటోలో ఉన్న అతను ఎవరో తెలుసా అని అడుగుతాడు. అరుణ్ మా అక్క కాలేజీ ఫ్రెండ్ అని కావ్య చెప్తుంది. ఎందుకు అడుగుతున్నారని కావ్య అనగానే రాజ్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అక్క నా దగ్గర ఏమైనా దాస్తుందా అని కావ్య అనుకుంటుంది. మరొక వైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పు నీతో ఇక ఎక్కడికి రాదని కృష్ణమూర్తి కోపంగా అంటాడు. కళ్యాణ్ ఫీల్ అవుతాడని కనకం భావించి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. మరొక వైపు స్వప్న దగ్గరికి కావ్య వచ్చి రాజ్ కి నీపై డౌట్ వచ్చింది. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని కావ్య అడుగుతుంది. తప్పు చేసినప్పుడే ఎవరికి బయపడలేదు ఇంకా తప్పు చెయ్యకపోతే ఎందుకు బయపడుతానని స్వప్న అంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది స్టేజ్ 2 స్టార్ట్ చెయ్యాలని అనుకుంటాడు. అరుణ్ కి ఫోన్ చేస్తాడు రాహుల్. " స్వప్నకి ఫోన్ చేసి డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చెయ్" అని అరుణ్ తో రాహుల్ చెప్తాడు. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తు.. స్వప్న గురించి ఆలోచిస్తుంటాడు. స్వప్న నిజంగా ఏదైనా తప్పు చేస్తుందా? లేక నేనే ఎక్కవ ఆలోచిస్తున్నానా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఎస్ఐ కి రాజ్  ఫోన్ చేసి ఫోటో పంపిస్తున్నాను. అతని గురించి అన్ని డీటెయిల్స్ కావాలని చెప్తాడు. ఆ తరువాయి భాగంలో  రాజ్ కావ్యల గదిలోకి దొంగ వచ్చి.. వాళ్ళిద్దరి చేతులు, కాళ్ళు కట్టివేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

యూత్ కి నయని పావని నయనానందం!

బిగ్ బాస్ ఇప్పటికి మంచి క్రేజ్ తో ముందుకు సాగుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. హౌస్ లోకి మొదట మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్  రాగా..  2.0 లో అయిదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అంబటి అర్జున్, అశ్వినిశ్రీ, నయని పావని, భోలే షావలి, పూజా మూర్తి వచ్చారు.  బిగ్ బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్  అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది.  టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా  సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వచ్చిందట. ఇక ఎంట్రీ లోనే అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్ లోని మొదటి వారానికే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది నయని. తన ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని నెటిజన్లు అప్పట్లో ఫుల్ ట్రోల్ చేశారు. ఇక హౌస్ నుండి బయటకొస్తుంటే హౌస్ లోని వారంతా ఎమోషనల్ అయ్యారు. శివాజీని డాడీ అంటూ ఎంతో ప్రేమగా ఉన్న నయని.. నాకు హౌస్ లోకి వెళ్ళాక నాన్న దొరికాడని అంది. ఇక ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ట్యాలెంట్ చూపిస్తుంది నయని. బ్లూ కలర్ డ్రెస్ లో అందాలని చూపిస్తూ, హావభావాలని వ్యక్తం చేస్తూ యూత్ ని అట్రాక్ట్ చేసేలా తమ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. తను చేసిన ఈ ఫోటోలు కొన్ని మరీ బోల్డ్ గా ఉండటంతో నయని నెట్టింట వైరల్ గా మారింది.   

గుప్పెడంత మనసు జగతి అందాల ఆరబోత!

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లోని కొందరు నటీనటుల ఆన్ స్క్రీన్ కి వారి పర్సనల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ లోని రుద్రాణి(షర్మిత).. అందులో కాస్త పద్దతిగా ఉన్న బయట పాప్ స్టార్ లా ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో గుప్పెడంత మనసు సీరియల్ లోని జగతి అలియాస్ జ్యోతిరాయ్ ఉంటుంది. ఆమె తన పర్సనల్ లైఫ్ లో పొట్టి పొట్టి డ్రెస్ లతో దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడమ్ అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత  'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది. తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రతీరోజు "గుప్పెడంత మనసు" సీరియల్ లో చీరకట్టులో ఒక అమ్మ పాత్రలో జగతిని చూసే ప్రేక్షకులకు, ఈ ఫోటోస్ నచ్చకపోవచ్చు. బోల్డ్ లుక్ లో నాభి అందాలని చూపిస్తుంది  జ్యోతి రాయ్.  టీజర్ ఈజ్ కమింగ్ సూన్ అంటు పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోని చూసిన నెటిజన్లు.. 'మిమ్మల్ని ఇంత ట్రేండీగా చూడాలని లేదు జగతి మేడం. అమ్మగా మాత్రమే చూడాలనుకుంటున్నాం' అని ఒకరు కామెంట్ చేయగా.. నేను చేసేది నటన మాత్రమే ‌ నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుందని రిప్లై ఇచ్చింది జగతి. ఇంకా కొన్ని నెగెటివ్ కామెంట్లు రావడంతో తన పోస్ట్ కి కామెంట్ చేసే ఆప్షన్ ని తిసేసింది జ్యోతిరాయ్. కాగా ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.  

బిగ్ బాస్ లో కోట బొమ్మాళి.. శివాజీని పెద్దాయనని చేశారుగా!

బిగ్‌బాస్‌ హౌస్ లో ఆదివారం ఫన్ డే అంటరు. కానీ ఈ వారం అందరికి టెన్షన్ డే అనే అంటారు. ఎందుకంటే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బయటకు వెళ్తున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సండే కాబట్టి మూవీ టీమ్ ని తీసుకొచ్చాడు నాగార్జున. 'కోట బొమ్మాళి పీఎస్' మూవీ టీమ్ బిగ్‌బాస్ స్టేజ్‌పైకి వచ్చేసింది. హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్.. తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్‌‍బాస్‌ కి వచ్చారు. ముఖ్యంగా శ్రీకాంత్, శివాజీ మంచి ఫ్రెండ్స్ కాబట్టి కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. కోట బొమ్మాళి టీమ్ వచ్చీ రాగానే తమ సినిమాలో తెగ వైరల్ అయిన 'లింగ్ లింగ్ లింగ్ లింగిడీ' సాంగ్‌కి శివానీ, రాహుల్ విజయ్ స్టెప్పులేశారు. ఇక బిగ్‌బాస్ చూస్తారా అని నాగార్జున అడగ్గానే అయ్యో సీజన్ 1 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూశానంటూ శ్రీకాంత్ చెప్పాడు. ఇక తర్వాత తమ సినిమా విశేషాల గురించి శ్రీకాంత్ వివరించాడు. కాసేపటికి కంటెస్టెంట్స్ కి పరిచయం చేశాడు నాగార్జున. " మీలో హుషారు రావాలని నా ఫ్రెండ్స్‌ని తీసుకువచ్చాను. శివాజీకి అయితే బెస్ట్ ఫ్రెండ్"  అని నాగార్జున చెప్పాడు. ఇక శివాజీని చూడగానే రేయ్ బావా పక్కకి రా అంటూ చాలా ఆప్యాయంగా పలకరించాడు శ్రీకాంత్. ఇన్ని రోజులు ఎలా ఉన్నావ్ రా బాబు అని శ్రీకాంత్ అనగానే హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. రైతుబిడ్డ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టావ్‌. హౌస్ లో అందరితో ఎలా ఉంటావో అనుకున్నాను కానీ నీ ఆటతో, మాటతీరుతో అందరితో కలిసిపోయావ్. ఇప్పుడు బయట నీ ఫాలోయింగ్ మాములుగా లేదని ప్రశాంత్ తో నాగార్జున అనగానే హౌస్ మేట్స్ అంతా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత " గేమ్ అయితే చాలా బ్రహ్మండంగా ఆడుతున్నావ్"  శివాజీ అంటూ శ్రీకాంత్ అన్నాడు. వరుసగా ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వచ్చాడు శ్రీకాంత్. అశ్వద్దామ 2.0 సీక్రెట్ రూమ్ నుండి వచ్చాక నీ గేమ్ బాగుందని గౌతమ్ తో శ్రీకాంత్ అన్నాడు. శోభాని కన్నడలో ఎలా ఉన్నావని శ్రీకాంత్ అనగానే.. ఎప్పటిలానే కన్నడలో మొదలపెట్టింది శోభాశెట్టి. దీంతో మొదలుపెట్టారా అంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చారు. పటాకా సర్.. ఫైర్ అండీ బాగా క్రాకర్‌లా పేలుతుంది అంటూ శ్రీకాంత్ అనగా.. శోభాకి క్రాక్ అన్నావా అని నాగార్జున అన్నాడు. ఇంతలో శివాజీ మధ్యలో లేచి.. "సర్ ఈళ్లు ఎవరు? ఎందుకొచ్చారు" అని అడిగాడు. నిన్ను చూడటానికి వచ్చామంటు శ్రీకాంత్ పంచ్ ఇచ్చాడు. ఇక తర్వాత మిమ్మల్ని జిమ్‌లో చూసి మీరు శివాజీ కంటే చిన్నోడని అనుకున్నాని శ్రీకాంత్‌తో అంబటి అర్జున్ అనగానే.. ఊరుకోవయ్యా మాటి మాటికి ఏజ్ గురించి మాట్లాడతావంటు శివాజీ కామెడీ చేశాడు. అవును.. అర్జున్ నిజమే బయట కూడా శివాజీ నా కంటే పెద్దోడనే అనుకుంటారంటూ ఇంకో కౌంటర్ వేశాడు శ్రీకాంత్. ఈ దెబ్బకి తలుపులు తీయండి సర్ వెళ్లిపోతాను. ఈ నరకం నేను తట్టుకోలేకపోతున్ననంటూ శివాజీ అనగానే అందరూ తెగ నవ్వుకున్నారు.  

బిగ్ బాస్ ట్విస్ట్.. నో ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్-7 పదకొండు వారాలు పూర్తిచేసుకుంది. అయితే పదకొండవ వారం హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉండగా నో ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ నుండి పదో వారం భోలే షావలి ఎలిమినేషన్ అయింది తెలిసిందే. అయితే పదకొండవ వారం మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉండగా మొదట యావర్, ఆ తర్వాత అమర్ దీప్, ప్రియంక, శోభాశెట్టి, రతిక, అంబటి అర్జున్ లని సేవ్ చేసాడు నాగార్జున. ఇక హౌస్ లో అశ్వినిశ్రీ, గౌతమ్ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరు అనుకున్నారు. ఇక ఇద్దరి పేర్లు ఉన్న బాక్స్ లని తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చారు. వాటిలో తమ చేతిని ఉంచి నాగార్జున చెప్పినప్పుడు తీయాలని చెప్పాడు. ఎవరి చేతికి ఎరుపు రంగు అంటుకుంటుందో వారు ఎలిమినేటెడ్, ఆకుపచ్చ రంగు అంటుకుంటుందో వారు సేఫ్ అని అశ్వినిశ్రీ, గౌతమ్ లకి చెప్పాడు. ఇక కాసేపటికి ఇద్దరు తమ చేతులని బయటకు తీయగా ఇద్దరికి ఆకపచ్చ రంగు అంటుకుంది. ఇక ఆ తర్వాత హౌస్ లోని వారంతా షాక్ అయ్యారు. మీరిద్దరు సేఫ్ అని అశ్వినిశ్రీ, గౌతమ్ లకి చెప్పాడు నాగార్జున. ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున అన్నాడు. ఎందుకంటే యావర్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని తిరిగి ఇచ్చేశాడు కాబట్టి బిగ్ బాస్ ఇద్దరిని సేవ్ చేశాడు. లేదంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేవారు మరొకరు సేవ్ అయ్యేవారని నాగార్జున చెప్పాడు. దీంతో హౌస్ లోని వారంతా షాక్ అయ్యారు. పదకొండవ వారం ఉల్టా పుల్టా ట్విస్ట్ తో కంటెస్టెంట్స్ లతో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.  

డబుల్ ఎలిమినేషన్.. కంటెస్టెంట్స్ షాక్!

బిగ్ బాస్ సీజన్-7 ‌నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు హౌస్ లో పదిమంది కంటెస్టెంట్స్ ఉండగా ఎవరినో ఎలిమినేషన్ చేస్తారో అనుకున్నారంతా కానీ నో ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. సండే ఫండే అంటూ నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్ కి వచ్చీ రాగానే.. ఆడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ ఫ్రెండ్ అని రెండు ట్యాగ్ లు మీతోటి హౌస్ మేట్స్ కి ఇవ్వాలని నాగార్జున చెప్పాడు.  అంటే హౌస్ లో ఎవరిని మీరు ఫ్రెండ్ గా కలుపుకోలవానుకుంటున్నారు. ఎవరిని డిలీట్ చేయాలనుకుంటున్నారని కంటెస్టెంట్స్ తో నాగార్జున చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ని కొత్త స్నేహితుడిగా చేర్చుకున్నాడు అమర్ దీప్. వచ్చిన కొత్తలో అసలేం తెలియలేదు. ఇప్పుడు బాగా కలిసిపోయాడు. అందుకనే నాకు మంచి ఫ్రెండ్ అవుతాడని చేసుకుంటున్నాని అమర్ దీప్ చెప్పి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ని తొడిగాడు. రతికకి బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ఇచ్చాడు అమర్ దీప్. మొన్నటి వరకు నామినేషన్ లో చెప్పేవాడు ఇప్పుడు అలా లేడు. బాగా కలిసిపోతు‌న్నాడు అందుకే ఫ్రెండ్ పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ అని గౌతమ్ అన్నాడు. అంబటి అర్జున్ శివాజీకి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్ ఇచ్చాడు. తెలిసో తెలియకో నువ్వు ఫౌల్ చేశావ్ అది ఇంకోసారి రిపీట్ కాకూడదని బ్లాక్ స్టాంప్ ని యావరకి ఇచ్చాడు అంబటి అర్జున్. పల్లవి ప్రశాంత్ కి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్, అశ్వినిశ్రీ కి బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ఇచ్చింది ప్రియంక జైన్. ఈ మధ్య తను మాతో కలుస్తుందని అశ్వినిశ్రీకి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్ ని ఇచ్చింది శోభాశెట్టి. మొన్నటి గేమ్ లో అమర్ దీప్ ని టార్గెట్ చేసి గౌతమ్ ఆడటం నాకు నచ్చలేదని శోభాశెట్టి చెప్పి అతనికి బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ఇచ్చింది. అంబటి అర్జున్ కి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్ ని ఇచ్చాడు శివాజీ‌. రతికని ఫ్రెండ్ గా బ్లాక్ చేస్తున్నాను కానీ బిడ్డగా ఎప్పుడు నాతోనే ఉంటుందని శివాజీ బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ని ఇచ్చాడు. ఆ తర్వాత నాగార్జున కొన్ని గేమ్స్ ఆడిస్తూ, ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చాడు. చివరగా  అశ్వినిశ్రీ, గౌతమ్ కృష్ణ ఉన్నారు. నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇస్తూ వీరిద్దరిని సేవ్ చేశాడు నాగార్జున. ఇప్పుడు ఎలిమినేషన్ లేదు కాబట్టి తర్వాతి వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అది ఎప్పుడు? ఏంటనేది బిగ్ బాస్ మీకు‌ చెప్తాడని కంటెస్టెంట్స్ తో నాగార్జున అన్నాడు. దీంతో కంటెస్టెంట్స్ తో పాటు అభిమానులు షాక్ అయ్యారు.  

ఎవిక్షన్‌ పాస్‌ తిరిగిచ్చేసిన యావర్‌.. ఫిధా అయిన అభిమానులు!

బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఎవిక్షన్‌ పాస్‌ ఎంత కీలకమో అందరికి తెలిసిందే. ఎవిక్షన్‌ పాస్‌ తో నామినేషన్‌లో ఉన్న ఎవరినైన సేవ్‌ చేయొచ్చు లేదా డేంజర్‌ జోన్‌లో ఉంటే తమని తాము సేవ్‌ చేసుకోవచ్చు. దీనికోసం బిగ్‌ బాస్‌ ఎన్నో టాస్క్‌లని  కంటెస్టెంట్స్‌ చేత ఆడిరచాడు. బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది.  ఇక పదకొండవ వారం హౌస్‌లో ఎవరు ఎలిమినేషన్‌ అవుతారనే క్యూరియాసిటి అందరిలో మొదలైంది. అయితే నిన్న జరిగిన శనివారం నాటి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారింది. శుక్రవారం వారం నాడు హౌస్‌లో ఏం జరిగిందో ప్రేక్షకులకు నాగార్జున చూపించాడు. అయితే నాగార్జున రావడం రావడమే ఫుల్‌ ఫైర్‌ మీద కన్పించాడు. షుగర్‌ తో చేసిన బాటిల్స్‌ తీసుకొని వచ్చి ఒక్కో కంటెస్టెంట్‌ తల మీద ఆ బాటిల్‌ పగులగొట్టి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. మొదట కొత్త కెప్టెన్‌ ప్రియాంకని అభినందించాడు. ఆ తర్వాత అంబటి అర్జున్‌ని లేపి నిజాలు మాట్లాడమని చెప్పాడు. ఆ రోజు టాస్క్‌లో ఎవరు గెలిచారని అడిగాడు. రూల్స్‌ ప్రకారం ప్రియాంక గెలిచిందని అంబటి అర్జున్‌ అనగా.. బాల్స్‌ కిందపడితే అవుట్‌ కదా రూల్‌.. మరి గేమ్‌ లో ప్రియాంక విల్లుమీద ఉన్న బాల్స్‌ కిందపడిపోతే అవుట్‌ అనే కదా తను తప్పుకుందని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత అందరికి ఒక క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.  ఇక యావర్‌, అంబటి అర్జున్‌ మధ్య జరిగిన బాల్స్‌ బ్యాలెన్స్‌ టాస్క్‌లో  ఏం జరిగిందనే ఫుటేజ్‌ ని బిగ్‌ స్క్రీన్‌ మీద వేసి చూపించాడు. ఇక బాల్‌ పైన పెట్టేప్పుడు యావర్‌ కాలు నేలమీద ఉందని స్పష్టంగా ఉందని నాగార్జున చెప్పాడు. మరి నువ్వు ఫౌల్‌ ఆడావ్‌  కదా యావర్‌ అని నాగార్జున అనగానే సారీ సర్‌.. నేను అది గమనించలేదు. కానీ ఫౌల్‌ గేమ్‌ ఆడి నేను గెలిచాను కాబట్టి ఈ ఎవిక్షన్‌ పాస్‌కి అన్‌ డిజర్వింగ్‌ అని యావర్‌ చెప్పి దానిని తిరిగి ఇచ్చేశాడు. దీంతో హౌస్‌ లోని వాళ్ళంతా షాక్‌ అయ్యారు. అంబటి అర్జున్‌ ఇన్ని రోజులు ఫేక్‌గా నటించావ్‌. ఫ్యామిలీ వీక్‌లో మీ భార్య చెప్తేనే నిజంగా ఉన్నావని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌, రతిక, గౌతమ్‌లు చేసిన తప్పులకి వార్నింగ్‌ ఇచ్చాడు. ఇలా ఈ వారం కంటెస్టెంట్స్‌ ఆడిన ఆటతీరుని ప్రశ్నిస్తూ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. నామినేషన్‌లో ఉన్న శోభాశెట్టి, గౌతమ్‌ కృష్ణ, అశ్వినిశ్రీ, రతిక ఈ వారం డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే ఆదివారం నాటి పూర్తి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే.