ఓరినీ పాసుగాల రాకేషా.. ఇదట్రా నువ్వు చెప్పేది...

సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ ముందు బీభత్సమైన సీరియస్ నెస్ తో ఏదో జరిగిపోయింది, జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చేసి మరీ చెప్తారు కొంతమంది. అందులో చూస్తే ఎం ఉండదు. జస్ట్ కామెడీని సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో కొంపలు మునిగిపోయినట్టు చెప్తారు. ఇంకొంతమంది మాత్రం బీభత్సమైన సీరియస్ విషయాన్ని కాస్తా పిచ్చ లైట్ గా చెప్పి నవ్వేస్తారు. ఇంకొంతమంది పైనుంచి ఆకాశం పడిపోతున్నా..కింద నుంచి నేల జారిపోతున్నా కూడా ఆ నాకేముందిలే అని వదిలేస్తారు. రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) మొదటి కోవకు చెందిన వాడు.  రాకేష్ రీసెంట్ గా ఒక రీల్ ని రిలీజ్ చేసాడు. ఎన్నో రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్న..కానీ ఎందుకులే అనుకుంటున్నా..కాంట్రవర్సీ ఐనా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు...దీన్ని న్యూస్ చేసి న్యూసెన్స్ చేసినా పర్లేదు. ఎన్ని రోజులను ఊరుకుంటామండీ. ఐనా ఈరోజు చెప్పేద్దాం అనుకుంటున్నా. అంటున్నారని..పడుతున్నారని అనుకుంటున్నారు...వింటున్న వాళ్లంతా రిటర్న్ చెప్పలేరని కాదు. ఎవరేమనుకున్నా ఖరాకండిగా చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. చెప్పాలనుకున్న విషయం ఒకటే ఒకటుంది వెదర్ చాలా బాగుంది. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని మొదటంతా సీరియస్ గా చెప్పి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడు.  ఆ ఒక్క మాటతో నెటిజన్స్ అంతా తెగ కామెంట్స్ చేస్తున్నారు.  "సూపర్  అన్న నువ్వు ఈ రోజు నిజంగా కామెడీ చేసావు రాకేష్ అన్న.. పోనీలే బ్రదర్ ఇప్పటికైనా చెప్పారు...మీ ధైర్యానికి,సాహసానికి శుభోదయం.నిజంగానే వాతావరణం చాలా బావుంది..." అంటున్నారు.

దీపని కలిసిన కార్తీక్.. పెళ్లి చేసుకుంటాడా..?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -102 లో.... ఎంత రిక్వెస్ట్ చేసినా దీప వచ్చేలా లేదనుకొని తను హాస్పిటల్ లో ఇచ్చిన ఫోన్ , గాజులు తనకి ఇచ్చేద్దామని కార్తీక్ అవి పట్టుకొని దీప ఉంటున్న ఇంటికి వెళ్తాడు. కార్తీక్ వెళ్లేసరికి దీప ఇంటికి తాళం వేసి ఉంటుంది. కార్తీక్ పక్కింటి వారిని‌‌.. వీళ్ళు ఎక్కడికి వెళ్లారంటూ అడుగుతాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.. మళ్ళీరామని చెప్పారని వాళ్ళు చెప్పగానే.. కార్తీక్ డిజప్పాయింట్ అవుతాడు. నేను అనుకున్నదే చేసావ్ కదా దీప అని కార్తిక్ అనుకుంటాడు. మరొకవైపు ఇప్పుడు మళ్ళీ ఆ దీప కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోయింది. దీన్నిబట్టి ఆ బిడ్డ తండ్రి అతనే ఉన్నట్లున్నాడని శోభ అనగానే.. ఆ మాట అన్నందుకే నరసింహా చెంపపగిలింది.. నీకు కూడా అలా కావాలా అని అనసూయ అంటుంది. అప్పుడే నరసింహా వస్తాడు. ఇప్పుడు ఏం తొందరపడకు. ఇక వెళ్తే పాపని తీసుకునే రావాలి. నేను ఆలోచిస్తా.. ఆ ఇంట్లో మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగుండని అనసూయ అంటుంది. ఆ తర్వాత మనం అనుకున్నది జరగాలంటే ఆ దీప ఇక్కడ ఉండాలి.. నిన్ను ఆ దీప ఇంట్లో దిగపెడతాను.. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. దీపని తీసుకొనే రావాలని పారిజాతానికి జ్యోత్స్న  చెప్తుంది. ఆ తర్వాత పూజ చేస్తున్న సుమిత్ర దగ్గరికి.. శౌర్య వచ్చి కళ్ళు మూస్తుంది. సుమిత్ర గుర్తుపట్టి.. శౌర్య వచ్చేసావా? అమ్మ ఎక్కడ అంటూ సంతోషంగా దీప దగ్గరికి వెళ్తారు. దీపని చూసిన పారిజాతం.. మనం వెళ్లి తీసుకొని వద్దామంటే తానే వచ్చిందని అంటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి సుమిత్ర వెళ్లి.. నువ్వు ఇక ఎక్కడికి వెళ్లొద్దని చెప్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. అక్కడ దీప, శౌర్యలని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసావా బావకి ఏం తెలియనట్లు.. ఇప్పుడే వాళ్ళని చూస్తున్నట్లు ఏం యాక్టింగ్ చేస్తున్నాడోనని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. శౌర్య, సుమిత్ర లోపలికి వెళ్ళాక.. మీకోసం ఇంటికి వెళ్ళానని కార్తీక్ అంటాడు. ఎందుకని దీప అనగా..  ఫోన్, గాజులు తీసుకొని వచ్చి ఇవి ఇవ్వడానికి అని కార్తిక్ చెప్తాడు. మీరు డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బాలో వెయ్యండి అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత మీ ఎంగేజ్ మెంట్ అంట అని దీప అనగానే.. అది జరగదు.. నాకు జ్యోత్స్న ఇష్టం లేదని అత్తయ్య వాళ్ళతో చెప్పడానికి ఇక్కడికి వచ్చానని కార్తీక్ అనగానే.. కారణం లేకుండా ఇలా నచ్చలేదంటే ఎలా.. మీరు హాస్పిటల్ లో అన్నది ఎవరి ద్వారా అయినా తెలిస్తే అందరు అదే నిజం కాబట్టి ఈ పెళ్లి వద్దని అంటున్నాడనుకుంటారు. మీరు అలా చెయ్యకండి అని కార్తీక్ తో దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నమిత రాకతో కీలక మలుపు.. ఉత్కంఠగా ఎటో వెళ్ళిపోయింది మనసు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -154 లో.. రామలక్ష్మి ఇచ్చిన వార్నింగ్ కి శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఎందుకలా చేస్తున్నావని శ్రీలత తనపై కోప్పడుతుంది. ఆ రామలక్ష్మి తేడావస్తే మిమ్మల్ని ఆఫీస్ నుండి బయటకు పంపిస్తానని చెప్పిందని శ్రీవల్లి అనగానే.. అది చేసేకంటే ముందే నేనంటే ఏంటో చూపిస్తానని శ్రీలత అంటుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకంత్ లు వస్తుంటారు. మీ కోసం చూస్తున్న మొదటిసారి మీరు ఇద్దరు ఆఫీస్ కి వెళ్తున్నారు. రాహుకాలం కంటే ముందే ఆఫీస్ కి వెళ్ళాలని సీతాకాంత్ , రామలక్ష్మిలతో శ్రీలత అంటుంది. అదేంటి అమ్మ.. మేమ్ ఫస్ట్ టైమ్ ఏం వెళ్లట్లేదు కదా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి కావాలనే నన్ను ఆశీర్వాదించండని శ్రీలత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నేను ఏది అనుకుంటే అది అయ్యేలా దీవించండని రామాలక్ష్మి అనగానే.. భలే ఇరికించావంటూ శ్రీలత దీవిస్తుంది. అత్తయ్య జాగ్రత్త టైమ్ కి టాబ్లెట్ వేసుకోండని రామలక్ష్మి అనగానే.. నా తర్వాత రామలక్ష్మి నీ గురించి ఆలోచిస్తుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు వెళ్ళిపోతారు. కాసేపటికి సందీప్ కూడా శ్రీలత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. మరొకవైపు ముంబై బ్రాంచ్ నుండి నమిత అనే అమ్మాయి సీతాకాంత్ ఆఫీస్ కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నమిత ఆఫీస్ కి రాగానే ఎవరు అంటూ మాణిక్యం అడుగగా.. మార్కెటింగ్ డైరెక్టర్ అని చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వచ్చి ఎంప్లాయిస్ కి సందీప్, రామలక్ష్మి ని పరిచయం చేస్తాడు. అదేంటీ నా కూతురు జనరల్ మేనేజర్ కాదా అని మాణిక్యం అడుగగా.‌. అది నీకు అనవసరం అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నమిత వస్తుంది. తనని కూడా ఎంప్లాయిస్ కి పరిచయం చేస్తాడు. రామలక్ష్మి నా భార్య అంటూ నమితకి పరిచయం చేస్తాడు సీతాకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పెళ్ళిచూపుల్లో బావని ప్రేమించానని చెప్పిన సరోజ.. అయినా పెళ్ళికి ఓకే అన్న ధనరాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1132 లో.....సరోజకి జరిగే పెళ్లి చూపులకి రంగా రావడంతో శైలేంద్ర దేవయానిలు షాక్ అవుతారు. ఏంటి ఏసీ కూడా వెయ్యలేదు.. ఎందుకు అలా వణుకుతన్నారని రంగా అనగానే అంటే ఇందాక వస్తుంటే కార్ లో ఉందని దేవయాని అంటుంది. దేవయాని వాయిస్ విన్న వసుధార ఈ వాయిస్ ఎక్కడో వినట్టుందని లోపలికి వస్తుంటుంది. అప్పుడే తనని సరోజ చూసి లోపలికి వచ్చి.. ఎక్కడ నా బావని తన భర్త అని అందరిముందు చెప్తుందోనని భయపడి వసుధారని లోపలికి రాకుండా ఆపుతుంది. మా కూతురు మిమ్మల్ని టెస్ట్ చెయ్యడానికి నా బావ అంటే ఇష్టం అంటూ చెప్తుందని ధనరాజ్ కి సంజీవయ్య చెప్తాడు. మరొకవైపు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని వసుధారపై సరోజ కోప్పడుతుంది. నీ పెళ్లి చూపులు చూడడానికి వచ్చానని వసుధార అనగానే.. అవసరం లేదంటూ వసుధారని అక్కడ నుండి పంపిస్తుంది సరోజ. ఆ తర్వాత సరోజ లోపలికి వస్తుంది. నేను బావని ప్రేమించానని సరోజ చెప్పగానే.. నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావని తెలుసని ధనరాజ్ అంటాడు. నాకు ఈ పెళ్లి ఇష్టమేనని ధనరాజ్ చెప్పగానే.. సరోజ షాక్ అవుతుంది. నేను ఎప్పుడు సరోజని మరదలిగా తప్ప.. ఇంకా ఏ ఉద్దేశంతో చూడలేదని రంగా క్లారిటీ ఇచ్చి వెళ్తాడు. అతను వెళ్తుంటే వెనక్కి తిరిగి చూసేసరికి శైలేంద్ర, దేవయాని ఇద్దరు భయపడతారు.ఇదంతా నా కూతురు కావాలనే చేసింది వచ్చేటప్పుడు కూడా ఇలాగే చేసింది.. కావాలంటే అడగండి అని సంజీవయ్య బుజ్జిని పిలుస్తాడు. మరొకవైపు మను దగ్గరకి ఏంజిల్ వస్తుంది. ఎందుకు కాలేజీ నుండి బయటకు వచ్చేసావని ఏంజిల్ అడుగగా.. మా అమ్మ ఏం చెప్తే అది చేస్తానని మను అంటాడు. ఆ తర్వాత ధరణి కాఫీ తీసుకొని వచ్చి మహేంద్రకి ఇస్తుంది. వసుధార, రిషి లు దూరం అయ్యారని మహేంద్ర బాధపడుతుంటాడు. ఆ తర్వాత వసుధారని తీసుకొని రంగా ఆటో లో వస్తుంటే.. ఆపండి నాకు టీ తాగాలని ఉందని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వర్షం కురిసిన రాత్రి.. ఆ గదిలో ఇద్దరే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -467 లో... కావ్య మొక్కలకి నీళ్లు పోస్తుంటే రాజ్ వచ్చి తనని డిన్నర్ కి ఇన్వైట్ చెయ్యడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ గొడవపడుతుంటారు. నువ్వు నాతో డిన్నర్ కి రావాలని రాజ్ అనగానే.. ఏంటి ఆర్డర్ వేస్తున్నారా? మీరు అడిగే విధానం నాకు నచ్చడం లేదని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ రిక్వెస్ట్ గా అడుగుతాడు. దాంతో సర్లే మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా వస్తానని కావ్య అంటుంది. అదంతా విన్న రుద్రాణి రాహుల్ దగ్గరికి వెళ్లి నేనొక పని చెప్తాను చెయ్ అని అంటుంది. నేను బిజీగా ఉన్నా ఆఫీస్ లో మీటింగ్ ఉందని రాహుల్ అంటాడు. కావ్యని తీసుకొని రాజ్ డిన్నర్ కి వెళ్తున్నాడు. అక్కడ తన ప్రేమని కావ్యకి చెప్పాలని అనుకుంటున్నాడు. నువ్వు రాజ్ ని డిన్నర్ కి వెళ్లకుండా ఆపాలని రుద్రాణి అనగానే.. రాహుల్ సరే అంటాడు. మీటింగ్ కి రాజ్ కంపల్సరి ఉండాలని అంటానని రాహుల్ అంటాడు. అదంతా స్వప్న విని మీ సంగతి చెప్తానని కిచెన్ లోకి వెళ్లి జ్యూస్ తీసుకొని.. అందులో మోషన్ టాబ్లెట్ కలుపుతుంది. జ్యూస్ తీసుకొని రాహుల్ దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడి జ్యూస్ ఇస్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య లు డిన్నర్ కి వెళ్తుంటే రాహుల్ ఆపి ఈ రోజు మీటింగ్ ఉంది. నువ్వు కచ్చితంగా రావాలని అంటాడు. నాకు ఎవరు రమ్మని చెప్పలేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ కి కడుపులో ఏదో తేడా కొడుతుందని పైకి వెళ్తాడు. రాజ్ కావ్య వెళ్లిపోతుంటే రుద్రాణి ఆపుతుంది. మీరు వెళ్ళండి అంటూ స్వప్న వాళ్ళని పంపిస్తుంది. అప్పుడే నీరసంగా రాహుల్ వస్తాడు. ఏం చేసావే నా కొడుకుని అని రుద్రాణి అంటుంది. మీ ప్లాన్ తెలిసి జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపానని స్వప్న అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేస్తాడు. ఇప్పటికి జరిగింది చాలు అని కోపంగా కట్ చేస్తుంది అప్పు. దాంతో కళ్యాణ్ ఎమోషనల్ గా కవితలు రాస్తాడు. మరొకవైపు రాజ్, కావ్య డిన్నర్ స్పాట్ కి వెళ్తారు. రోజు ఇలా తీసుకొని రండి ప్రశాంతంగా ఉందని కావ్య అనగా.. ఇది ఆరంభం మాత్రమే రేపటి నుండి చూడని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య, రాజ్ లు వర్షానికి ఒక దగ్గర ఆగి.. దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్తారు. వర్షం లో తడిసావ్.. అక్కడ చీర ఉంది మార్చుకోమని రాజ్ అనగానే కావ్య మార్చుకుంటుంది. ఎవరో వెళ్లినట్టు అనిపించి కావ్య భయపడి రాజ్ ని హగ్ చేసుకుంటుంది‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఇనయాలో ఈ యాంగిల్ కూడా ఉందా..!

ఇనయా సుల్తానా (Inaya Sultana) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాణేనికి రెండో వైపు మంచితనం అనేది ఉంటుంది అని ఇనయా నిరూపించి చూపించింది. ఇదంతా ఎందుకు అంటే ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. అది చూసేసరికి అందరూ షాక్ అయ్యారు. "నేను నిన్నపెట్టిన స్టోరీ చూసి చాలామంది అడుగుతున్నారు.. ఏమయ్యింది అని.. మేము సేఫ్ గా ఉన్నాం. మేము వచ్చేటప్పుడు దారిలో ఒక ఆక్సిడెంట్ జరిగింది. అది చూసి మేము చాలా పానిక్ ఐపోయాం. గౌతమ్ కి మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి వెంటనే రంగంలోకి దిగి ఆ పేషెంట్ ని కాపాడాడు. కానీ అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. మేము వాళ్ళ వాళ్ళతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం. మేము తన కోసం ప్రే చేస్తాం. మీరు కూడా అతని కోసం ప్రే చేయండి " అని చెప్పింది.  తర్వాత ఆమె స్నేహితుడు గౌతమ్ మాట్లాడుతూ "అతనికి చాలా రక్తం పోయింది. వెంటనే మా మదర్ చున్నీతో బ్లడ్ ఆగేలా చేసి అతనితో గ్యాప్ లేకుండా స్పృహ కోల్పోకుండా మాట్లాడుతూ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇలా రోడ్ ఆక్సిడెంట్ గురించి వాళ్లకు ఇన్ఫార్మ్ చేసాం. ఇక ఇనాయ చాల మంచి పని చేసింది. అక్కడి ట్రాఫిక్ ని క్లియర్ చేసింది. వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేసి పిలిపించింది. కానీ రావడానికి అరగంట పట్టింది అంబులెన్సు. ఇది వర్షా కాలం ఫ్రెండ్స్. రోడ్లు జారిపోతూ ఉంటాయి కాబట్టి బైక్స్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలి. మన జీవితం చాలా ముఖ్యం కాబట్టి.. చాలా కాన్సంట్రేషన్ గా ఉండాలి బండి మీద వెళ్ళేటప్పుడు. మన తప్పు లేకపోయినా బండి స్కిడ్ అయ్యి పడిపోతాం..స్లోగ వెళ్తే ఏమీ కాదు. ప్లీజ్ టెక్ కేర్ " అని చెప్పాడు.  ఇక నెటిజన్స్ ఐతే నిన్నమొన్నటి వరకు ఇనయాని - గౌతమ్ ని తిట్టినా వాళ్లంతా ఇప్పుడు పొగిడేస్తున్నారు. "మంచి పని చేసారంటూ అభినందిస్తున్నారు. నీ ఫేస్ చూసి ఏదో అనుకున్నాం బ్రో..కానీ నీ మనసు చాలా మంచిది." అంటున్నారు.

అర్థరాత్రి పాప కోసం వచ్చి‌న బూచోడు.. ఆ ఎంగేజ్ మెంట్ జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -101 లో.... కార్తీక్ ని కలిసానని శౌర్య  చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్ వెళ్ళిపోయాక శౌర్య లోపలికి వచ్చి.. గోడపై ఉన్న కార్తీక్ అనే పేరుని తుడిపేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావని దీప అడుగుతుంది. కార్తీక్ వచ్చాడు కదా అమ్మ.. ఇకనుండి రోజు వస్తాడు. అందుకే అని శౌర్య చెప్తుంది.  మరొకవైపు దీపని కార్తిక్ కలిసాడని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. బావకి దీప ఎక్కడ ఉందో తెలుసు.. అయిన చెప్పట్లేదు. మొన్న అమ్మ అడిగినా కూడా చెప్పడం లేదు. ఇక్కడున్నా బావకి, కడియం బాబాయ్ ఫోన్ చెయ్యగానే హడావిడిగా వెళ్లిపోయాడు.. తీరా చూస్తే శౌర్య దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి దీప దగ్గరకి వెళ్ళాడు. అక్కడ చాలాసేపు దీప, బావ కలిసి మాట్లాడుకున్నారు. అదేంటో వినలేదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. డౌట్ లేదు మీ ఎంగేజ్ మెంట్ జరగదని పారిజాతం అనగానే.. తప్పకుండా జరుగుతుంది. ముందు దీపని ఇక్కడికి తీసుకొని రావాలని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు ఇలాగే ఉండు మనవరాల.. కార్తీక్ తో నీ ఎంగేజ్ మెంట్ ఎలా జరగదో నేను చూస్తానని పారిజాతం అనుకుంటుంది.  మరొకవైపు దీప శౌర్యని పడుకోపెడుతుంది. అర్ధరాత్రి ఎవరో డోర్ కొడుతుంటే దీపకి భయమేస్తుంది. ముందు జాగ్రత్తగా చేతిలో కర్రని పట్టుకొని డోర్ తీస్తుంది.. తీరా చూస్తే నరసింహ వస్తాడు. నా కూతురిని తీసుకొని వెళదామని వచ్చానని నరసింహా అంటాడు. శౌర్య నా కూతురు అని నాకు తెలుసు కానీ తల్లి నువ్వు కాదు అని నరసింహా అంటాడు.ఆ తర్వాత శౌర్యని తీసుకొని వెళ్తా అని నర్సింహా వెళ్తుంటే.. దీప అడ్డుపడుతుంది. అప్పుడే శౌర్య లేచి అమ్మ డోర్ తియ్ అంటుంది. ఎక్కడ నరసింహని చూస్తే శౌర్య భయపడుతుందోనని దీప అనుకుంటుంది. ఆ లోపే చుట్టుపక్కన వాళ్ళు వచ్చి నరసింహాపై కోప్పడి పంపించేస్తారు.  ఆ తర్వాత డోర్ తీసి శౌర్యని దగ్గరికి తీసుకుంటుంది దీప. అమ్మ బూచోడు వచ్చాడా అని శౌర్య అనగానే.. లేదని దీప చెప్తుంది. అందుకే నాన్న దగ్గరకి వెళదామని అన్నాను.. నాన్నని వెతకడానికి కార్తీక్ హెల్ప్ తీసుకుందామా అని శౌర్య అంటుంది‌. శౌర్యా ఆ రోజు కార్తీక్ బాబు మాటలు వినలేదన్నమాట అని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ బాబు అన్నది కరెక్టే ఎక్కడున్న ఆ నరసింహా వస్తాడు. సుమిత్ర గారి దగ్గర అయితే మా జోలికి రాడని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మీ మనవడు రాత్రి నిద్ర పోనిస్తే కదా.. రాజ్ పై ఇందిరాదేవి ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -466 లో... కళ్యాణ్ మెడిటేషన్ చేస్తుంటాడు. ధాన్యలక్ష్మి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ప్రకాష్ జాగింగ్ నుండి వస్తుంటాడు. తనని ధాన్యలక్ష్మి ఆపి.. కళ్యాణ్ ని చూపిస్తుంది. చూసారా ఇప్పటికి వాడు అన్ని మర్చిపోయి మాములుగా అయ్యాడని ధాన్యలక్ష్మి చెప్పగానే ప్రకాష్ వెటకారంగా మాట్లాడతాడు. అంటే ఇన్ని రోజులు మాములుగా లేడా అంటూ సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత రాజ్ వచ్చి కళ్యాణ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ.. డిస్టబ్ చెయ్యకూడదంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కావ్య కూడా కళ్యాణ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య కళ్యాణ్ కి జ్యూస్ తీసుకొని వెళ్తుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలా ఉంటేనే ఇల్లంతా బాగుంటుందని కావ్య చెప్పి లోపలికి వెళ్తుంది.లోపలికి వెళ్ళగానే కావ్యని రాజ్ భయపెడతాడు. కావ్య చిరాకుగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి గతం చేసిన గాయాన్ని తలుచుకుంటే భవిష్యత్తు బాగుండదని సలహా ఇస్తాడు. మీరు చెప్పింది దాని గురించి అలోచించి పాత జ్ఞాపకాలు నుండి బయటకు వస్తున్నానని కళ్యాణ్ అంటాడు.  మరొకవైపు రాత్రి నిద్ర పోనట్టున్నావని ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి అడుగుతుంది. మీ మనవడు నిద్ర పోనిస్తే కదా అని కావ్య అనగానే.. అవునా అంటూ ఇందిరాదేవి నవ్వుతుంటే. అంటే రాత్రంతా గొడవపెట్టుకోవడానికే సరిపోయిందని కావ్య అంటుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణ కావ్యపై కోప్పడుతుంది. నీకు ఏమని చెప్పి పంపించినా.. నువ్వు ఏం చేసావని అపర్ణ అడుగుతుంది. ఒళ్ళంతా ఇగో ఉన్నవాడితో ఏం మాట్లాడుతామని కావ్య చెప్తుంది. ఇందిరాదేవి, అపర్ణలకి కావ్య జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడే రాజ్ వస్తాడు. నేను వాడితో మాట్లాడతానంటూ ఇందిరాదేవి మాట్లాడుతుంది. నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటని ఇందిరాదేవి రాజ్ ని తిడుతుంది. కావ్య త్వరలోనే నెల తప్పాలంటూ రాజ్ కి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. మరొకవైపు రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే బిజీ రావడంతో.. స్వప్నని చూసి ఇది కూడా బానే ఉందంటూ రొమాంటిక్ గా దగ్గరికి వస్తుంటే.. నువ్వు మనిషిగా మారినప్పుడు నా దగ్గరికి రా అని రాహుల్ పై స్వప్న కోప్పడుతుంది. ఆ తర్వాత కావ్య మొక్కలకి నీళ్లు పోస్తుంటే.. తనతో మాట్లాడాలని రాజ్ ట్రై చేస్తుంటాడు. మళ్ళీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలాగా వాదించుకుంటూ ఉంటారు. అదంతా రుద్రాణి చూస్తూ.. ఏంటి వీడు ప్రొద్దున నుండి కావ్య వెనకాలే తిరుగుతున్నాడని అనుకుంటుంది. తరువాయి భాగంలో కావ్యని రాజ్ డిన్నర్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ మేనేజర్.. రాజ్ గారు తన వైఫ్ కి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారని చెప్తాడు. దాంతో కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సవతి తల్లి కపటప్రేమని కొడుకు కనిపెట్టగలడా.. భార్య ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -153 లో.....అందరు టిఫిన్ చేస్తుంటారు. అవును ధన ఎక్కడ అని సీతాకాంత్ సిరిని అడుగుతాడు. బిజినెస్ ప్లాన్ మీద ముంబై వెళ్ళాడని సిరి చెప్పగానే.. అక్కడ ఏదైనా అవసరం అయితే చెప్పమను.. తెలిసిన వాళ్ళున్నారని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి తినకుండా ఆలోచిస్తుంటే.. ఏం ఆలోచిస్తున్నావని సీతాకాంత్ అడుగుతాడు. ఇక సీతాకాంత్ దృష్టిలో మంచి ఇంప్రెషన్ కొట్టేయడానికి శ్రీలత నటిస్తుంది. సారి రామలక్ష్మి నువ్వు జాబ్ , నా వల్లే వదులుకున్నావని శ్రీలత అంటుంది. అయ్యో అమ్మా అలా అనకని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ఆ జాబ్ పోతే ఏంటి ఆఫీస్ లో ఇంకొక జాబ్ ఇవ్వమని శ్రీలత అంటుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇవ్వు జనరల్ మేనేజర్ కి హెల్ప్ గా ఉంటుందని శ్రీలత అంటుంది. మంచి ఛాన్స్ ఒప్పుకోరా అని పెద్దాయన అంటాడు. అంటే తనకి ఇష్టముందో లేదోనని సీతాకాంత్ అనగానే.. నాకు ఇష్టమేనని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత చూసావా నువ్వు ఎప్పుడు నా కాళ్ళ దగ్గర ఉండాలని అలా చేశానని శ్రీలత అంటుంది. నా కొడుకు కింద పని చేస్తావన్నట్లు శ్రీలత పొగరుగా మాట్లాడుతుంది. ఇక నీ భర్త కని ఎక్కడికి తీసుకొని వెళ్తానో చూడమని శ్రీలత అనగానే.. చాలా థాంక్స్ అత్తయ్య..  నా భర్త పక్కనే ఉండేలా చేసావ్.. అంతే కాకుండా ఆఫీస్ లో ఎప్పుడు ఉంటే.. అక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుస్తుంది.. అంతకు మించి మేమ్ ఆఫీస్ కి వెళ్లి రావొచ్చని శ్రీలతతో రామలక్ష్మి మాట్లాడుతుంది. కాసేపటికి  రామలక్ష్మి మాటలకి శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తున్నానని సీతాకాంత్ అనగానే.. సరే వెళ్ళండి అని రామలక్ష్మి అంటుంది. అదేంటీ తను కూడా వస్తాననట్లేదని అలాగే రెండు మూడు సార్లు వెళ్తున్నా అన్నా కూడా.. రామలక్ష్మి వెళ్ళండి అని చెప్తుంది. అంటే నువ్వు రావా అని సీతాకాంత్ అంటాడు. లేదు చైర్మన్ తో కలిసి రావడమా అని రామలక్ష్మి అనగానే.. నాకు అలాంటివేం లెవ్వు.. నా డ్రైవర్ ని పెళ్లి చేసుకొని అంతకంటే పెద్ద పోస్ట్ భార్య పోస్ట్ ఇచ్చానని సీతకాంత్ అనగానే.. రామలక్ష్మి నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ధనరాజ్ కి పెళ్ళిచూపులు.. రంగాని చూసి షాకైన ఆ ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1131 లో....బుజ్జి సరోజ కలిసి పెళ్లిచూపులు చెడగొట్టడానికి ప్లాన్ చేస్తారు. బుజ్జి పెళ్లి వాళ్లు వచ్చే దార్లో ఉంటాడు. శైలేంద్ర, ధనరాజ్, దేవయానిలు వచ్చే కార్ ఆపుతారు. సరోజ నేను లవర్స్ అని బుజ్జి చెప్తాడు. ప్రూఫ్ అంటూ సరోజ రంగాతో ఉన్న ఫోటోని వాళ్లకు చూపించగానే.. రంగాని చూసి దేవయాని, శైలేంద్రలు షాక్ అవుతారు. ఎవరు అతనని శైలేంద్ర అంటాడు. సరోజ బావ రంగా అని బుజ్జి చెప్పగానే.. పదండి ఇక ఈ సంబంధం కూడా క్యాన్సల్ అయినట్లే అని ధనరాజ్ అంటాడు. ఆ తర్వాత అసలు ఎవరు ఈ రంగా.. రిషి లాగే ఉన్నాడు. ఒకవేళ రిషినే కావచ్చని దేవయాని అనగానే.. చనిపోయిన వాడు ఎలా వస్తాడని శైలేంద్ర అంటాడు. పోలీసులు చెప్పారు అంతే గానీ మనకి తెలియదు జదా అని దేవయాని అంటుంది. సరే ఒకసారి వెళ్లి చూద్దామని దేవాయని అంటుంది. ధనరాజ్ ఇక వెళదామని అనగానే.. ఒరేయ్ ఎందుకు రా? వాడు చెప్పేది నిజమో అబద్దమో తెలియదు కదా వట్టిగ బంగారం లాంటి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటావా? పదా చూద్దామని ధనరాజ్ ని దేవయాని దబాయిస్తుంది. దాంతో సంజీవయ్య ఇంటికి బయల్దేరతారు. ఆ తర్వాత ఈ విషయం సరోజకి చెప్పాలని బుజ్జి తొందరగా తన దగ్గరికి వెళ్తాడు. పెళ్లి చూపులు ఎలాగూ క్యాన్సిల్ అయిపోతాయనే ధీమాతో సరోజ ఉంటుంది. పెళ్లిచూపులకు వస్తున్నారని బుజ్జి చెప్పగానే.. ప్లాన్ ఫెయిల్ చేసావ్.. మనం ప్రేమించుకుంటున్నామని చెప్పి బావది నా ఫోటో చూపిస్తే.. వాళ్లకు డౌట్ రాదా అని బుజ్జిపై సరోజ కోప్పడుతుంది. ఆ తర్వాత పెళ్లిచూపులకి శైలేంద్ర వాళ్ళు రాగానే.. సంజీవయ్య లోపలికి రండి అంటూ పిలుస్తాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర ఇద్దరు రంగా గురించి చూస్తుంటారు. పెళ్లి కూతురికి రంగా అనే బావ ఉన్నాడట కదా అని దేవయాని అంటుంది. ఉన్నాడు అత్తయ్య.. మీరు రంగాకి ఫోన్ చేసి రమ్మని చెప్పండని సంజీవయ్య రాధమ్మకి చెప్తాడు. మరొకవైపు ఇప్పుడు పెళ్లిచూపులకి ఎందుకని రంగాతో వసుధార అనగానే.. సరోజకి నాకు మధ్యలో ఏం లేదని అక్కడ చెప్పాలని రంగా అంటాడు. అప్పుడే రాధమ్మ ఫోన్ చేసి.. రంగాని రమ్మని చెప్తుంది. ఆ తర్వాత రంగా, వసుధారని బయట నిలబెట్టి.. లోపలికి వెళ్తాడు. శైలేంద్ర, దేవయానిలు రంగా మని చూసి భయపడుతుంటారు. ఏంటి ఏసీ లేదు.. వణికిపోతున్నారని రంగా అంటాడు. కార్ లో వస్తుంటే ఏసీ ఉండేదని దేవయాని అంటుంది. ఆ మాట బయటున్నా వసుధార విని.. ఈ వాయిస్ ఎక్కడో విన్నానంటూ లోపలకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వంట గదిలో పుట్టిన వంటలక్క... రీతూ చౌదరి టెర్ జీన్స్‌పై శేఖర్ మాష్టర్ సెటైర్స్

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోమో ఇంకొకటి రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో బిందాస్ గా ఉంది. ఇక రీతూ చేసిన పని గురించి శ్రీముఖి వర్ణిస్తూ చెప్పింది. "రీతూ రీసెంట్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లి వంటలన్నీ నేర్చుకుని రెడీగా ఉందంటా..మరి ఎంత వరకు వచ్చింది నీ వంటల ప్రయాణం" అని అడిగేసరికి "వంటలు నేర్చుకుని నేర్చుకుని తన ప్యాంటు కూడా చిరిగిపోయింది" అంటూ ఆమె వేసుకొచ్చిన టెర్ జీన్స్ మీద సెటైర్స్ వేశారు శేఖర్ మాష్టర్. దానికి కౌంటర్ గా "మాష్టర్ ఎంత చూస్తున్నారు నన్ను" అంటూ రివర్స్ కౌంటర్ వేసింది రీతూ. ఇక ఎవరన్నా ఇంటికి వెళ్తే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అంటూ శ్రీముఖి అనేసరికి " మా ఇంటికి ఎవరన్నా వస్తే వెల్కమ్ డ్రింక్ ఇవ్వను వెల్కమ్ స్పీచ్ ఇస్తాను..అంతే వాళ్ళు వెళ్ళిపోతారు" అని చెప్పింది బ్రహ్మముడి కావ్య. దాంతో అందరూ నవ్వేశారు. తరువాత కావ్యను "నాన్న నీకు టెస్టులు చేసే ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయా" అని శ్రీముఖి అడిగేసరికి "అక్కా నేను వంట గదిలో పుట్టిన వంటలక్క" అని శ్రీముఖికి కౌంటర్ ఇచ్చింది. ఇక రాజుని చూసి "ఏరా రాజు ఎప్పుడైనా స్టెల్లా కోసం వంట వండావా రా" అని శ్రీముఖి అడిగింది " ప్రస్తుతానికి వంట మొత్తం నేనే చేసి పెడుతున్న" అని చెప్పాడు యాదమ్మ రాజు. దానికి అందరూ నవ్వేశారు. చివరిలో బచ్చలికూర తెమ్మని ఒక టాస్క్ ఇచ్చేసరికి అటు బాయ్స్ ఇటు గర్ల్స్ తెగ అరిచేసుకున్నారు. దాంతో అమర్ దీప్ రీతూ మీద అరిచేసాడు. ఇలా ఈ వారం షో అరుపులు, గోలలతో ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది.

నిఖిల్‌కి ముద్దులు పెట్టిన  రీతూ చౌదరి... మధ్య వర్తిగా శ్రీముఖి

కిర్రాక్ బాయ్స్ అండ్ గర్ల్స్ షోలో కొత్త లవ్ స్టోరీ బయట పడిందా ? అంటే అక్కడ ఆ షోలో ఆ విషయం కనిపిస్తోంది. ఐతే అది నిజమా, అబద్దమా అనే విషయన్ని పక్కన పెడితే అసలు నిఖిల్ - రీతూ మధ్య ఎం జరుగుతోందో అర్ధం కావడం లేదు. శ్రీముఖి టేస్టీ తేజతో డాన్స్ చేయమన్నప్పుడల్లా మూతి ముడుచుకుంటూ ఉంటుంది. ఈ విషయన్ని శ్రీముఖి పసి గట్టింది. "శ్రీముఖి నేను వేరే పీస్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా" అనేసరికి " నీకు ఏ పీస్ నచ్చిందో  చెప్పు" అని అడిగింది. "నాకు నచ్చిన పీస్ సోఫాలో లేదు ఈ స్టేజి మీదే ఉంది" అని చెప్పింది రీతూ. "నాకు తెలుసు ఆ మనిషి ఎవరో"..అంటూ నిఖిల్ ని తీసుకొచ్చింది శ్రీముఖి. "మనకు తెలీకుండా ఇక్కడ ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తోంది" అని చెప్పేసరికి నిఖిల్ గట్టిగా కాదు అన్నట్టు అరిచాడు.. "అదేంటి బ్రేక్ లో ఓకే అన్నావ్" అంటూ నిఖిల్ మీద మండిపడింది రీతూ. దానికి నిఖిల్ షాక్ అయ్యాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి "ఓ మై బేబీ" అని సాంగ్ కి డాన్స్ చేశారు. రీతూ నిఖిల్ ని తెగ ముద్దులు పెట్టేసుకుంది. ఇక నిఖిల్ పై ఇంకో అమ్మాయి కూడా మనసు పారేసుకుంది అంటూ విష్ణు ప్రియను చూపించింది శ్రీముఖి. దాంతో విష్ణు ప్రియా కూడా వెళ్లి అదే సాంగ్ కి నిఖిల్ తో కలిసి డాన్స్ చేసింది. "ఇద్దరూ కలిసి ఒకరి మీదే మనసు పారేసుకున్నారు" అంది శ్రీముఖి. వీళ్ళు డాన్స్ చేస్తుంటే రీతూ ఫీలింగ్స్ ని అందరూ చూసారు చూడడమే కాదు దాన్ని మళ్ళీ ప్లే చేసి చూపించారు. అది చూసిన శ్రీముఖి "ఈ కష్టం ఎవరికీ రాకూడదు" అంది శ్రీముఖి. ఇంతకు నిఖిల్ - కావ్య మధ్య ఎం జరిగిందో తెలీదు. ఏ షోలో ఐనా  వీళ్ళిద్దరూ కచ్చితంగా కనిపించే వాళ్ళు కానీ ఈ షోలో మాత్రం కావ్య కనిపించలేదు. మధ్యలో ఇప్పుడు  రీతూ కనిపించేసరికి ఫాన్స్ అంతా కావ్య ఏమయ్యిందంటూ ఆరా తీస్తున్నారు.

Eto Vellipoyindhi Manasu : భార్యకి గులాబీ ఇచ్చి క్షమాపణ చెప్పిన భర్త.. అతను ముంబై వెళ్ళాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -152 లో.. రామలక్ష్మి ఒంటరిగా కూర్చొని.. అసలు అత్తయ్య ప్లాన్ ఏంటని ఆలోచిస్తుంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. పాపం రామలక్ష్మి జరిగింది తలుచుకుంటూ బాధపడుతున్నట్ల ఉందని అనుకొని.. తనకి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని వస్తాడు. నాకు ప్రపోజ్ చేయడానికేమో అని రామలక్ష్మి అనుకుంటుంది. కానీ ఆ రోజ్ ఫ్లవర్ ఇస్తూ సీతాకాంత్ సారీ చెప్తాడు. నువ్వు సెలక్ట్ అయిన జాబ్ కి నా వాళ్ళ రిజైన్ చేశావని సీతాకాంత్ అనగానే.. మీరు నన్నేం చెయ్యమనలేదు.. నేనే చేశా.. ఇందులో మీరెందుకు సారీ చెప్తున్నారని రామలక్ష్మి అంటుంది. అయిన నీకు అంత సడన్ గా జాబ్ ఎందుకు చెయ్యాలనిపించిందని సీతాకాంత్ అడుగుతాడు. ఇప్పుడు నిజం చెప్పిన నమ్మే సిచువేషన్ లో లేరని రామలక్ష్మి అనుకొని‌.. ఆఫీస్ లో అయితే మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చని సిగ్గుపడుతూ వెళ్లిపోతుంటే.. సీతాకాంత్ తనపై ప్రేమ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సందీప్ ఆఫీస్ కి వెళ్తున్నాడని శ్రీవల్లి తనకి దగ్గర ఉండి రెడీ చేస్తుంది. తనకి అన్ని రకాల టిఫిన్ రెడీ చేస్తుంది. దగ్గర ఉండి వడ్డీస్తుంది. అదంతా రామలక్ష్మి చూస్తుంటుంది. కొంతమంది కుళ్ళుకుంటున్నారు.. నీకు దిష్టి తియ్యలని రామలక్ష్మి వంక చూస్తూ శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి దేవుడికి మొక్కుతూ.. బాధపడుతుంటే శ్రీలత తన దగ్గరకి వెళ్తుంది. నీ భర్తని ఆఫీస్ నుండి దూరంగా పంపిస్తాను.. ఏం చేసుకుంటావో చేసుకోమని శ్రీలత సవాలు అంటుంది. మరొకవైపు ఏంటి సీత నువ్వు చెప్పేది నిజమా.. రామలక్ష్మి నీ కోసమే జాబ్ చెయ్యాలి అనుకుందా.. చూసావా తనకి కూడా నువ్వు ఇష్టమని పెద్దాయన అంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. రామలక్ష్మి ఆఫీస్ లో నీ పక్కన జాబ్ ఇవ్వాలి.. ఉన్న జాబ్ ని తీసేస్తావో లేక జాబ్ క్రియేట్ చేస్తావో నీ ఇష్టమని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మికి నేను ఇష్టమైతే అంతకు మించి ఏముందని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటారు. సిరి, పెద్దాయన కలిసి సీతాకాంత్ పక్కన రామాలక్ష్మికి చైర్ వదిలేసి కూర్చుంటారు. ఆ తర్వాత సందీప్ టిఫిన్ చేశాడా అని సీతాకాంత్ అనగానే.. చేసాడని శ్రీవల్లి అంటుంది. అదిగో ఫైల్స్ చూస్తున్నాడని శ్రీవల్లి చెప్తుంది. మీకు మాట రాకూడదు కదా అన్నయ్య అని సీతాకాంత్ తో సందీప్ అంటాడు.. ఆ తర్వాత ధన ఎక్కడ అని సిరిని సీతాకాంత్ అడుగగా.. బిజినెస్ పని మీద ముంబై వెళ్ళాడని సిరి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మల్లెమాల ప్రొడక్షన్‌ నుంచి హైపర్ ఆది రిటైర్మెంట్!

ఢీ సెలబ్రిటీ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ గా బాబా మాష్టర్ వచ్చాడు. ఇక రావడమే ఆది మీద సెటైర్స్ వేసాడు. "చూసావా నేను ఇయర్లీ ఒన్స్ వస్తాను. నువ్వు కూడా అలా రారా..రిటైర్మెంట్ అవార్డు ఇచ్చేసి పంపేయండిరా బాబు..ఆదికి ఏదైనా గ్యాస్ ట్రబుల్ అనుకుంటా" అని పిచ్చ జోక్స్ వేసేసరికి ఆది కూడా సైలెంట్ నవ్వాడు తప్ప రిప్లై ఇవ్వలేదు. ఇక ఆది మీద ఒక చిన్న పాప కూడా సెటైర్స్ వేసింది.." నీకు ఫుడ్ పెట్టనా, స్నాక్స్ పెట్టనా" అని అడిగాడు ఆది. "నీ ముఖం కొంచెం దూరంగా పెట్టు చూడలేక చస్తున్నా" అంది ఆ పాప సీరియస్ గా. ఇక రాము రాథోడ్ చిరంజీవికి వేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక మధు బాబు డాన్స్ కూడా అదిరిపోయింది. లాస్ట్ వీక్ ఐతే మధు బాబు సగం లోనే డాన్స్ ఆపేసాడు. ఇక సుదర్శన్ మాస్టర్ తన టీమ్ తో "ఒక లైలా కోసం" సాంగ్ ని వెరైటీ డాన్స్ తో అన్ని రకాల ఎలిమెంట్స్ ని మిక్స్ చేసేసరికి బాబా మాష్టర్ పిచ్చ ఖుషీ ఐపోయాడు. హన్సికాకు అన్ని భాషల్లో ప్రొపోజ్ చేస్తానని అని తెలుగులో చెప్పాడు కన్నడ అర్ధం కాక వదిలేసాడు. ఇక లాస్ట్ లో జనులూరి వచ్చి భానుప్రియ సాంగ్ "ఆకాశంలో ఆశల హరివిల్లు" సాంగ్ కి చేసిన డాన్స్ తో అందరి మతులు పోయాయి. నెటిజన్స్ కూడా జాను డాన్స్ ని తెగ పొగిడేస్తున్నారు.

Brahmamudi : నీ కడుపు పండాలి.. రాత్రంతా అలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -465 లో.. కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి ఇలా ఎన్ని రోజులు కూర్చొని ఉంటావ్.. ఎందుకు డల్ గా ఉంటావని రాజ్ అనగానే.. నావల్ల ఇదంతా జరిగింది. అప్పు బాధ్యత నాదే అని కళ్యాణ్ అంటాడు. ఏం చేస్తావ్ రా ఏదైనా చెయ్యాలంటే చెయ్యడానికి నేనున్నా.. మీ వదిన ఉందని చెప్పి కళ్యాణ్ ని ఆ సంఘటన నుండి బయటకు తీసుకొని రావడానికి రాజ్ ట్రై చేస్తాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు కళ్యాణ్ తో మాట్లాడింది అంత విన్నాను. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించేనా.. నీ గురించి నీ భార్య గురించి పట్టించుకునుడు లేదా నీ భార్యకి కూడా కోరికలు సరదాలు ఉంటాయి కదా.. అవి పట్టించుకోవా అని ఇందిరాదేవి రాజ్ ని నిలదీస్తుంది. అదంతా కళ్యాణ్ వింటూ ఉంటాడు. మరొకవైపు కిచెన్ లో వంట చేస్తున్న కావ్య దగ్గరికి అపర్ణ వెళ్లి.. ఏం చేస్తున్నావని అడుగుతుంది. పెరుగు కి తోడు పెడుతున్నా అని కావ్య అనగానే.. ఈ ఇంట్లో అందరికి తోడు ఉంది ఒక రుద్రాణికి తప్పా.. అయినా ఎప్పుడు ఆ పని చెయ్యడం.. ఈ పని చేయడమేనా నీకంటూ సరదాగా కోరికలు ఉండవా.. మరిది గురించి ఆలోచిస్తావ్.. అత్తమామల గురించి ఆలోచిస్తావ్.. నీ భర్త గురించి ఆలోచిస్తావ్.. ఇక నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావ్.. నీ కాపురం బాగుండాలి నీ కడుపు పండాలని కావ్యతో అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ లు ఒకేసారి గదిలోకి వెళ్తారు. ఈ రోజు నుండి నువ్వు చేసిన తప్పులు అన్ని క్షమించేస్తున్నానని రాజ్ అనగానే.. నేనేం తప్పు చెయ్యలేదు.. అంత మీరే చేశారని కావ్య అంటుంది. అలా ఇద్దరు రాత్రంతా ఆర్గుమెంట్ చేస్తునే ఉంటారు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ డిన్నర్ కి తీసుకొని వెళ్లి.. తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. కావ్యని రాజ్ డిన్నర్ కి పిలుస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రుద్రాణి.. రాజ్ ప్రేమని కావ్యకి చెప్పకుండా చెయ్యాలని రాహుల్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : కొంపముంచిన బుజ్జీ.. ఆ ఫోటో చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1130 లో.. శైలేంద్ర ఇంటికి ధనరాజ్ వస్తాడు. అన్నయ్య మీరు నాకు హెల్ప్ చెయ్యాలి. ఏదో కష్టపడి కొంచెం సంపాదించుకున్నాను కానీ నాకు ఒకటే లోటు పెళ్లి అవట్లేదని శైలేంద్ర, దేవయానిలతో ధనరాజ్ అంటాడు. అయితే మేమ్ ఏం చేస్తామని శైలేంద్ర అంటాడు. మీరు ఒక హెల్ప్ చేయాలి.. ఏంటంటే నన్ను చూసి అందరు సంబంధం ఒకే చేస్తున్నారు కానీ నాకు ఎవరు లేరని రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే నాకు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకి నాకు ఒక అన్నయ్య, అమ్మ ఉన్నారని చెప్పాను.. అది మీరే కాస్త పెళ్లి చూపులకు నాతో రండి అని ధనరాజ్ అంటాడు. మేమ్ రాము అని శైలేంద్ర కోప్పడతాడు. రాకుంటే మీరు చేసిన పనులన్నీ నాకు తెలుసు.. వాటిని బయటపెడతా అని ధనరాజ్ అనగానే.. వాడితో మనకేంటి? ఒకసారి వెళ్లి వస్తే వాడిది వాడు చూసుకుంటాడని దేవయాని అనగానే శైలేంద్ర సరే అంటాడు. మరొకవైపు రంగాకి వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. అది తాగి బాగున్నా కూడా బాలేదని చెప్తాడు. అదే కాఫీ రాధమ్మకి వసుధార ఇచ్చి ఎలా ఉందని అడుగగా.. బాగుంసని రాధమ్మ చెప్తుంది. ఆ తర్వాత రంగా బిహేవియర్ కి వసుధార బాధపడి ఏడుస్తుంది. నేను కాఫీ బాలేదు అన్నందుకు ఇంత సీన్ చెయ్యాలా అని కాఫీ తాగుతూ బాగుందని రంగా అంటాడు. ఆ తర్వాత ధనరాజ్, శైలేంద్ర , దేవయానిలు పెళ్లిచూపులకి బయలుదేర్తారు. ధనరాజ్ అడ్రెస్ కోసం సంజీవయ్య కి కాల్ చేస్తాడు. పెళ్లి చూపులకి వస్తున్నాం.. లొకేషన్ షేర్ చేయ్యండని చెప్తాడు. దాంతో సరోజని లొకేషన్ షేర్ చేయమని సజీవయ్య చెప్తాడు. సరోజ లొకేషన్ షేర్ చేస్తుంది. ఆ తర్వాత సరోజ రంగా ఫ్రెండ్ బుజ్జికి ఫోన్ చేసి అబ్బాయి ఫోటో పంపిస్తుంది. ఇద్దరు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయడానికి ప్లాన్ చేస్తారు. మరొకవైపు రాధమ్మ సరోజ వాళ్ళ ఇంటికి వెళదాం.. సంజీవయ్య పిలిచి వెళ్ళడు కదా అని రంగాతో అంటుంది. నేను రాను అక్కడ బావ అంటే ఇష్టమని సరోజ అంటే బాగోదని రంగా అంటాడు. సరే అని రాధమ్మ వెళ్తుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని, ధనరాజ్ లు వస్తుంటే.. బుజ్జి అడ్డుపడతాడు. మీరు పెళ్లి చూపులకి వెళ్లే అమ్మాయి, నేను ప్రేమించుకున్నాం కావాలంటే ఫోటో చూడండి అంటూ బుజ్జి చూసుకోకుండా రంగా సరోజల ఫోటో చూపిస్తాడు. ఆ ఫొటోలో రంగాని చూసిన శైలేంద్ర, దేవయానిలు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : మాటిచ్చిన కార్తిక్.. జ్యోత్స్న మొత్తం చూసేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -100 లో... శౌర్య దగ్గర నుండి కార్తిక్ బయటకు వస్తాడు. ఏమైంది బాబు.. శౌర్య బూచోడని అంటుందని దీప అడుగుతుంది. శౌర్య నాకోసం వెతుకుంటూ వెళ్తుంటే.. ఆ నర్సింహా శౌర్యని తీసుకొని పోవాలని అనుకున్నాడంట.. ఇంతలో కడియంకి శౌర్య ఎదరుపడడంతో నాకు ఫోన్ చేసి చెప్పాడని కార్తీక్ అంటాడు. నేనే శౌర్యకి దగ్గర అయ్యాను అనుకున్నాను కానీ తను కూడా నాకు దగ్గర అయిందని, ఆ గోడ మీద నా పేరు చూసాక అర్థం అయిందని కార్తీక్ అంటాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని గుడిలో అత్తయ్య రమ్మని చెప్తే రాను అన్నారంట అని కార్తీక్ అడుగుతాడు. అదంతా జ్యోత్స్న దూరంగా ఉండి చూస్తుంది.. వాళ్ళ మాటలు వినిపించడం లేదేంటని అనుకుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇక వెళ్తానని కార్తీక్ వెళ్తుంటే.. శౌర్య వచ్చి ఏంటి వెళ్లిపోతున్నావ్ ? మళ్ళీ వస్తావా అని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళను.. మళ్ళీ వస్తాను వచ్చేటప్పుడు బోలెడు చాక్లెట్లు తీసుకొని వస్తానని కార్తీక్ అనగానే.. మళ్ళీ వస్తానని మాటివ్వమని శౌర్య అంటుంది.  దాంతో శౌర్యకి మాటిస్తాడు కార్తిక్. ఆ తర్వాత జ్యోత్స్న కన్పించడం లేదేంటి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లి ఉంటారా అని పారిజాతం అనుకుంటుంది. అప్పుడే సుమిత్ర వస్తుంది. వీళ్ళు ఎక్కడ అని సుమిత్ర అడుగుగా.. సరదాగా బయటకు వెళ్లి ఉంటారని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఒకవేళ వాళ్లకి పెళ్లి అయిన జ్యోత్స్న ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. అక్కడ ఇక్కడ వాళ్లే కదా అని సుమిత్ర అంటుంది. అది నా కొడుకు దాసు కూతురు.. నా మనవరాలు.. అన్నిటికి తనే వారసురాలు.. మీ ఒకొక్కరి సంగతి తర్వాత చెప్తా అని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ కి జ్యోత్స్న ఎదరుపడి.. దీప ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతుంది. లేదని కార్తీక్ అని అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

షోస్ వదిలేసి పొలం పనుల్లోకి యాంకర్ సుమ

  సుమ ఎం మాట్లాడిన ఎం చేసినా వెరైటీగా  ఉంటుంది. ఇప్పుడు సుమ టీవీని వదిలిపెట్టి పొలాల్లో పంట పండించడానికి వెళ్ళింది. అదేంటి అనుకుంటున్నారా..నిజం అండి. సుమ రైతక్కలతో కలిసి ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేసింది. మనం రోజూ తినే ఆహారం వెనక రైతుల కష్టం ఏంటో ఉంది అంటూ వాళ్లకు సెల్యూట్ చేసింది. పొలంలోకి దిగి వరి డబ్బులు నాటింది. "ఒక గంట పని చేస్తేనే నేను అలిసిపోయాను. రోజంతా నడుం వంచి పని చేసే వీళ్లకు ఎంత బలం ఉండాలో..నిజంగా ఇంటి పనులను, వ్యవసాయాన్ని ఇలా సమర్ధించుకుంటూ చేయడం చాలా గొప్ప విషయం..వాళ్లందరికీ నా జోహార్లు.." అంటూ వాళ్లకు దణ్ణం పెట్టింది సుమ. ఈ వీడియోని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నాకు వ్యవసాయం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిగా ఉంటుంది. ఎందుకంటే అది  ప్రకృతితో ముడిపడి ఉంటుంది.. కొన్నిసార్లు మనం కూడా వెళ్లి మట్టిలో పని చేసి ఆ మట్టిని అనుభూతి చెందాలి. మీరు మా కోసం చేస్తున్న దానికి రైతులందరికీ..నమస్కరిస్తున్నాను ..అందరికీ నా ధన్యవాదాలు, మాకు మీరు ప్రతిరోజూ కావాలి".. అంటూ కాప్షన్ పెట్టింది.  ఇక నెటిజన్స్ అంతా ఆమెను తెగ పొగిడేస్తున్నారు.  "ఇలా వర్క్ చేస్తే యోగ అవసరం ఉండదు..నిజంగా సుమక్కేనా.. కానీ వ్యవసాయం చేసినా విలువ లేదు. ఎవరూ గుర్తించరు..చిన్న చూపు చూస్తున్నారు..సుమ గారు వ్యవసాయం కూడా టచ్ చేశారా..మీరు గ్రేట్ అండి..మంచి నిర్ణయం తీసుకున్నారు." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.    

ఛీ సొరకాయనా.. ఫార్మర్ నేత్ర వీడియో వైరల్ !

  ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఏవి ట్రెండింగ్ లోకి వెళ్తాయో అర్థం కాదు. ఓ అమ్మాయి నిల్చున్న, మాట్లాడినా, ఆటలాడిన చివరికి ఏం చేసినా వైరల్ అవుతుంటాయి. అలాంటిది వ్యవసాయ రంగంలో పాపులర్ అయిన ఫార్మర్ నేత్ర మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఫార్మర్ నేత్ర(Farmer Nethra) .. వారధి ఫామ్స్( vaaradhi ) ని సొంతంగా స్టార్ట్ చేసిన నేత్ర అటు ప్రమోషన్స్.. ఇటు సేల్ తో బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్య వారధి ఫామ్స్ లోని మామిడికాయలో ప్రమోషన్ లో‌ భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో  నేత్ర ఓ వీడియో చేయగా అది ఫుల్ వైరల్ అవుతోంది.  చిన్న రసాలు, పెద్ద రసాలు, నవని, బెంగినపల్లి అంటు తన ఫామ్ లోని మామిడి పండ్ల గురించి నేత్ర చెప్పింది. అయితే ఈ వీడియోని తీసుకొని సోషల్ మీడియా ట్రోలర్స్ ఇతర వీడియోలు చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఫార్మర్ నేత్రే కన్పిస్తుంది.  తనకి ఇన్ స్టాగ్రామ్ లో 490K ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ రీల్ చేసిన మినిమమ్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి ఫార్మర్ నేత్ర ఈ బిగ్ బాస్ - 8 కి వెళ్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మోటివేషనల్ స్పీకర్ వంశీతో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలలకే వాళ్ళు విడిపోయింది. ఇప్పుడేమో తన ఇన్ స్టాగ్రామ్ లో సొరకాయ సూప్ ఎలా చేయాలో ఓ వీడియోని షేర్ చేసింది. అయితే నేత్ర ఈ వీడియోలో ఏం అందంటే.. ఛీ సొరకాయనా అని మీరందరు అనుకుంటారు. కానీ తినాలి .. హెల్తీ యు నో అని వీడియో స్టార్ట్ చేసింది‌. అయితే తను అలా అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేశారు. కొందరు సమంతలా ఉందని, మరికొందరేమో మరీ ఇంత క్యూట్ గా ఉండకూడదని, సొరకాయలో కాస్త మామిడిపండు వేస్తే అదిరిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు‌. ఈ వీడియో అప్లోడ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ ని దాటేసింది. నెటిజన్లు దేనికి ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మరి మీరు చూసేయండి‌.