Brahmamudi : కళ్యాణ్ మనసులో అప్పు ఉందని తెలుసుకున్న రాజ్.. వారిని కలుపుతాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -470 లో... కళ్యాణ్ అప్పు పైన ప్రేమని ఒక పేపర్ లో రాస్తాడు. నన్ను కలవడానికి ఇష్టపడడం లేదు.. అలాంటిది తను నా ఇష్టమని చెప్తే ఎలా వింటుందని రాసి ఆ పేపర్ ని విసిరేస్తాడు. అది రాజ్ చూస్తాడు. ఆ పేపర్ తీసుకొని చదువుతాడు. అందులో అప్పు పైన కళ్యాణ్ పెంచుకున్న ప్రేమని చదివి రాజ్ షాక్ అవుతాడు. మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని స్నేహమని అంటున్నావా.. నీ ప్రేమని బయటకు తీస్తా.. నీ ప్రేమని గెలిపిస్తానని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు కనకం, కృష్ణమూర్తి లతో అప్పుకి మంచి సంబంధం వచ్చింది.. రేపు వాళ్ళు అప్పుని చూసుకోవడానికి వస్తున్నారని కనకం అనగానే.. మరి ఆ విషయం అప్పు కి చెప్పావా అనే లోపే అప్పుడే అప్పు వస్తుంది. ఇన్ని రోజులు నా నిర్ణయం అంటూ బాధపెట్టాను. ఇక మీకు నచ్చింది చెయ్యండి. మీరైన హ్యాపీగా ఉంటారని అప్పు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరకి కావ్య వెళ్ళి మాట్లాడుతుంది. పిల్లలు పుట్టాక వారికి ఏ పేరు పెట్టాలని రాజ్ ని కావ్య అడుగగా.. అప్పుడే అక్కడికి వెళ్ళావా అంటూ రాజ్ అంటాడు. అప్పుడే కావ్యకి కనకం ఫోన్ చేసి.. అప్పు పెళ్లి చూపుల సంగతి చెప్తుంది. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతు.. ఆ విషయం రాజ్ కి చెప్తుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఈ విషయం అడ్డుపెట్టుకొని కళ్యాణ్ మనసులో మాటని బయటపెట్టాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు అప్పు దగ్గరికి బంటి వెళ్లి.. నువ్వు కళ్యాణ్ ని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అది అవ్వదు.. ఇప్పటికే నా వల్ల అమ్మ నాన్నలు చాలా బాధపడ్డారని అప్పు అంటుంది. కాసేపటికి కావ్య, స్వప్న ఇద్దరు కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. అక్కాచెల్లెలు కలిసి రావడం చూసిన కనకం, కృష్ణమూర్తి లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత వెళ్లి అప్పుతో మాట్లాడుతారు. మరొకవైపు కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి.. ఇక అప్పు జీవితం సెట్ అయినట్లే అంటు, అసలు విషయం చెప్పకుండా కళ్యాణ్ మనసులో మాట బయటపెట్టాలని చూస్తాడు. ఈ రోజు అప్పు పెళ్లిచూపులు ఇక నువ్వు కోరుకున్నట్లు అప్పు జీవితం బాగుంటుందని రాజ్ అనగానే.. కళ్యాణ్ తనలో తానే బాధపడతాడు. మరొకవైపు స్వప్న కావ్యలు అప్పుని రెడీ చేస్తారు. తరువాయి భాగంలో అప్పుని చూడడానికి వచ్చిన అబ్బాయి.. అప్పు నచ్చిందని చెప్తాడు. కట్నం కూడా అవసరం లేదని అతని పేరెంట్స్ చెప్తారు. ఆ తర్వాత కావ్య, స్వప్నలు అప్పు దగ్గరికి వచ్చి.. ఏంటి అలా ఉన్నావ్? అబ్బాయి నచ్చలేదా అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ హౌస్ నుంచి శృంగార వీడియో లీక్.. బెడ్ మీద పడుకొని...

బిగ్ బాస్ (Bigg Boss) షోకి ఎంత క్రేజ్ ఉందో.. కాంట్రవర్సీలు కూడా దాని చుట్టూ అదే స్థాయిలో ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఈ షో ఉండదని.. ఇందులోని కంటెస్టెంట్ లు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారని, అందుకే ఇలాంటి షోలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసేవారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ పై ఇటువంటి విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు బెడ్ మీద రొమాన్స్ చేసుకుంటున్న వీడియో లీక్ కావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 నడుస్తోంది. ఓటీటీ వేదిక జియో సినిమాలో ప్రసారమవుతున్న ఈ షోని పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న అర్మాన్ మాలిక్ (Armaan Malik).. తన రెండో భార్య కృతిక తో రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో షో నిర్వాహకులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రియాలిటీ షో పేరుతో ఇదా మీరు చేసేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జియో సినిమా మాత్రం తమకేం పాపం తెలీదని, ఇది ఫేక్ వీడియో అని అంటోంది. తమ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేసే కంటెంట్ విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలు పాటిస్తామని, బిగ్ బాస్ లో ఎటువంటి అశ్లీల కంటెంట్ లేదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎవరో మార్ఫ్ చేశారని.. వారు ఎవరో గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జియో పేర్కొంది.

అందరు డిఫరెంట్ గా చేస్తారు.. దివి వీడియో వైరల్!

  దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. దివికి ఇన్ స్టాగ్రామ్ లో  1.2 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా పాండిచ్చేరి వెళ్ళిన దివి తన ఇన్ స్టా అకౌంట్ లో కొన్ని ఫోటోలని షేర్ చేయగా అవి ఫుల్ వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా మరో వీడియోతో నెట్టింట వైరల్ గా మారింది‌. దివి ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడుకి క్రేజ్ వేరే లెవెల్ లో వచ్చేసింది.  ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. లంబసింగి సినిమాలో దివి హీరోయిన్ గా చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.  దివి ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పడు హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమ్లెట్ వేస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది దివి. ఆ వీడియోలో దివి మాట్లాడుతూ.. ' అందరు డిఫరెంట్ గా చేస్తారు.. కానీ నేను ఇంకా ఢిఫరెంట్ గా చేశాను. అదే అవకాయ ఆమ్లెట్. చూడండి' అంటూ తను చేసిన ఆవకాయ ఆమ్లెట్ ని చూపించింది. ఇది చూసిన నెటిజన్లు మొదటగా అందరు డిఫరెంట్ గా చేయడమేంట్రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం ఉందమ్మ ఇందులో అనుకుంటూ మరికొందరు వాపోతున్నారు. ఇక దివి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

బిగ్ బాస్ సీజన్ 8లో అమృత ప్రణయ్!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదో సీజన్లోకి అడుగుపెట్టనుంది. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో కొన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా నీతోనే డ్యాన్స్ షో, ఢీ షో లోని కొంతమందిని బిబి టీమ్ అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. వీరితో పాటు అమృత ప్రణయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జనరల్ గా ఇలా రెండు పేర్లు కలిసి ఉన్నప్పుడు అమ్మాయా? లేక అబ్బాయా అనే సందేహం అందరిలోను వస్తుంది. అయితే తను అమ్మాయే.. అమృత. అప్పట్లో సోషల్ మీడియాలో పరువు హత్యతో ఫేమస్ అయిన అమృతని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట బిబి టీమ్. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత, ఇదే పట్టణానికి చెందిన దళితుడు ప్రణయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహాన్ని అంగీకరించని మారుతీ రావు.. ప్రణయ్ ను హత్య చేయించాడని అమృత తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు అడ్డుకోగా పోలీసుల సహాకరంతో తండ్రిని చివరి చూపు చూసిన అమృత అప్పట్లో వైరల్ అయింది‌.  అమృతకి నిహాన్ అనే కొడుకు ఉన్నాడు. తనతో కలిసి యూట్యూబ్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటోంది అమృత. ప్రస్తుతం తను అత్తారింట్లోనే ఉండగా.. తాజాగా తన అమ్మ కూడా చూడటానికి వచ్చిందంటూ ఓ వ్లాగ్ చేసింది అమృత. దాంతో ఈ వ్లాగ్ వైరల్ గా మారింది. ఇలా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఇన్ స్పైరింగ్ లైఫ్ జర్నీ కోసమైనా తనని బిగ్ బాస్ హౌస్ లోకి తోసుకొచ్చేస్తారని నెటిజన్లు భావిస్తున్నారు. మరి నిజంగానే తను హౌస్ లోకి రానుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Karthika Deepam2 : వంటలక్కకి దిమ్మతిరిగే షాక్..  ఆ నిజం తెలుసుకున్న కార్తిక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -104 లో.. కార్తీక్ తో మాట్లాడింది దీప గుర్తుకుచేసుకుంటుంది. ఈ కార్తీక్ బాబు‌‌.. ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకు భయంగా ఉందని దీప అనుకుంటుంది‌. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని దీపతో కార్తీక్ అంటాడు‌. ఇంట్లో శౌర్య ఉందా అని కార్తీక్ అడుగుతుంది. లేదు సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళిందని దీప చెప్తుంది. మంచి పని చేసిందని కార్తీక్ అంటాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు.. ఏంటని దీప అడుగుతుంది. స్వప్న బాధ్యతలు నాకు అప్పజెప్పావు కదా ఇప్పుడు స్వప్న ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను.. ఏం అంటావని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది. అవును దీప మీ నిర్ణయం చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ మనతో కూడా మాట్లాడాను.. ఇదిగో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అంటూ కార్తీక్... శ్రీధర్, కావేరి , స్వప్న ఉన్న ఫోటోని చూపించిగానే దీప షాక్ అవుతుంది. నాకెలా తెలుసు అనుకుంటున్నావ్.. నా కంటే ముందు నీకు తెలుసు.. అందుకే స్వప్న బాధ్యతలు నాకు అప్పజెప్పావు.. రెస్టారెంట్ లో నాన్నని టేబుల్ దగ్గరికి రాకుండా చేసావని కార్తీక్ అంటాడు. అన్ని విషయాలు చెప్పాను.. నువ్వు మాత్రం ఇంత పెద్ద నిజం ఎందుకు చెప్పలేదని దీపతో కార్తీక్ అంటాడు. మీ అమ్మ కోసం.. తనకి నిజం తెలిస్తే తట్టుకోలేరని దీప అంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటారో ఇక మీ ఇష్టమని కార్తీక్ తో దీప అంటుంది. కార్తీక్ వెళ్ళిపోయాక జ్యోత్స్న చూసి.. ఎల్లుండి ఎంగేజ్మెంట్ నాతో పెట్టుకొని.. దానితో ఏం మాట్లాడి వెళ్లిపోతున్నాడని అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్తాడు. అక్కడ శ్రీధర్ కాంచనతో సరదాగా మాట్లాడుతుంటే.. కార్తీక్ కి కోపం వస్తుంది. ఇండైరెక్ట్  గా శ్రీధర్ ని అన్నీ అంటుంటే.. వీడేంటి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు.. కావేరి గురించి దీప చెప్పిందా అని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వచ్చి మాట్లాడాలని అంటుంది. నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయావ్.. మళ్ళీ ఎందుకు వచ్చావంటూ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హోటల్ రూంలో ప్రోమో షూట్‌.. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్! 

బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16 ప్రారంభం కాగా.. రెండో సీజన్ జూన్ 10 ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభ అయ్యింది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ బాగా వర్కౌట్ అయ్యింది. నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకూ సెప్టెంబర్‌లోనే బిగ్ బాస్ ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా.. సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది.. సెప్టెంబర్ 01 ఆదివారం నాటితో ముగియనుండగా.. ఆ తరవాతి ఆదివారం నుంచి ‘బిగ్ బాస్ 8’ ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా.. డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది.  గత సీజన్ లాగే ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టుడియోస్‌లోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు నెలాఖరు వరకూ బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టుడియోలో జరగబోతుంది. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపికకి ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసి.. వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా.. జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్‌కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. ఇలా ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్‌ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్‌లోకి పంపుతారనే గ్యారంటీ లేదు.. ఇంటర్వ్యూలు జరిగి.. హోటల్ రూంలో పెట్టి.. ప్రోమో షూట్‌లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకూ కూడా అంటే.. బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టే వరకూ కూడా ఫైనల్ లిస్ట్‌లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగొచ్చు.  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ లిస్ట్ ఓసారి చూసేద్దాం.. ఫార్మర్ నేత్ర , కిర్రాక్ ఆర్పీ, వేణు స్వామి,‌ అంజలి పవన్, మై విలేజ్ షో అనిల్ , ఖయ్యూం అలీ, యాదమ రాజు, సోనియా సింగ్ , బమ్ చిక్ బబ్లూ, ప్రభాస్ శీను, అమృత ప్రణయ్, రీతు చౌదరి, సింగర్ సాకేత్, ఢీ ఫేమ్ శ్వేతా నాయుడు, సీరియల్ నటి హారిక, సీరియల్ యాక్టర్ నిఖిల్, నీతోనే డ్యాన్స్ ఫేమ్ అక్షిత, సీరియల్ నటుడు శ్రీకర్.. వీరిని బిబి టీమ్ సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.  వీరితో పాటు బర్రెలక్క, కుమారీ ఆంటీ, యాంకర్ విష్ణు ప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి‌. ఈ లిస్ట్ లో ఎవరెవరు సెలెక్ట్ అయి హౌస్ లోకి వెళ్తారో చూడాలి మరి.

Eto Vellipoyindhi Manasu : భార్యకి ప్రపోజ్ చేసిన భర్త.‌. డిస్సప్పాయింట్ అయిందింగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -156 లో.. సీతాకాంత్ ఆఫీస్ స్టాఫ్ తో కలిసి లంచ్ చేస్తుంటాడు. అక్కడ పక్కనే కూర్చొని ఉన్నా రామలక్ష్మిని ప్రేమగా చూస్తాంటాడు. అది చూసి నమిత తననే చూస్తున్నాడని అనుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఫోన్ మాట్లాడుతు.. వెళ్ళిపోతే నమిత కూడా వెనకాలే వెళ్తుంది. సీతాకాంత్ పక్క నుండి పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే‌‌.. ఏంటి సర్ అక్కడ అలా చూసి ఇక్కడికి వచ్చాకా ఇలా చేస్తున్నారని నమిత అడుగుతుంది. నిన్ను చూడడమేంటి  నా భార్య రామలక్ష్మిని చూసాను.. నా మనసంతా తనపై ప్రేమ ఉందని సీతాకాంత్ అంటాడు.  ఆ తర్వాత జ్యువలరీ ఆడ్ గురించి నమితని అడుగుతాడు. నేను రెడీ చేస్తానని సీతాకాంత్ అనగానే మీరు మల్టీ టాలెంటెడ్ సర్ అన్నీ ఒకేసారి ఎలా చూసుకుంటారని పొగుడుతుంది. దాంతో సీతాకాంత్ కోప్పడతాడు. నమిత భయపడడంతో.. జోక్ చేశానని సీతాకాంత్ అంటాడు. కొంచెం డిఫ్ఫికల్ట్ కానీ ట్రై చేస్తే వర్క్ అవుట్ అవుతుందని నమిత అనుకుంటుంది. ఆ తర్వాత ఆఫీస్ టైమ్ అయిపొయింది ఇంకా సర్ బయలుదేరడం లేదేంటని రామలక్ష్మి.. సీతాకాంత్ దగ్గరికి వస్తుంది. ఏంటి సర్ ఏదో ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ఎలా చెప్పాలని అడిగాడు అని సీతాకాంత్ అనగానే.. మీరే ఇండైరెక్ట్ గా అడుగుతున్నారా అని రామలక్ష్మి అనుకుంటుంది. మీరు ఎవరికి చెప్పాలి అనుకుంటున్నారని రామలక్ష్మి అడుగతుంది. ఆడ్ ఏజెన్సీ వాళ్లకి అని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఒక ఐడియా చెప్పమని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగగా‌‌.. ఏముంది లవ్ లో ప్యూరిటీ ఉంటే చాలని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత సందీప్ ఇంటికి రాగానే ఆఫీస్ లో శ్రీవల్లి, శ్రీలతలు జరిగింది అడిగి తెలుసుకుంటారు. ఆ రామలక్ష్మికి టార్చర్ చూపించానని సందీప్ అంటాడు‌. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఈ రోజు ఆఫీస్ లో బాగా కోటింగ్ అయిందట కదా అంటూ రామలక్ష్మి బాధపడేలా శ్రీలత మాట్లాడుతుంది. అప్పుడే సీతకాంత్ వస్తాడు.. ఆ తర్వాత రామలక్ష్మి అంటు సీతాకాంత్ ఇల్లంతా తిరిగి కిచెన్ లో ఉన్న రామలక్ష్మిని గదిలోకి తీసుకొని వెళ్లి.. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది కాన్సెప్ట్.. నువ్వు ఇచ్చిన ఐడియాతో ట్రై చేశాను. ఇది ఆడ్ ఏజెన్సీ వాళ్లకు చెప్పేది అనగానే రామలక్ష్మి డిస్సప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : జస్ట్ మిస్.. రంగానే రిషి అని శైలేంద్ర కనిపెట్టగలడా!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1134 లో.. శైలేంద్ర తను చూసింది వసుధారనో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి టీ షాప్ దగ్గరకి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు మరొకవైపు వసుధార తప్పించుకుంటుంది. రౌడీలు మళ్ళీ తప్పించుకుందంటూ టీ తాగుదాం పదండి అంటూ టీ షాప్ దగ్గరకి వెళ్తారు. ఇక అక్కడే ఉన్నా శైలేంద్ర పాండు గాడికి ఫోన్ చేసి వసుధారని చంపేశాడో లేదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తాడు. పాండు ఫోన్ లిఫ్ట్ చేసి నేను కాకినాడలో కాజా కోసం వెళ్ళానని చెప్తాడు. అప్పుడే శైలేంద్ర, పాండు లు ఒకరికొకరు ఎదరుపడతారు. ఏంట్రా కాకినాడలో ఉన్నా అన్నావని పాండుని శైలేంద్ర అడుగుతాడు. లేదు సర్ ఇక్కడ చిన్న పని ఉంటే వచ్చానని పాండు అంటాడు. సరేగానీ ఇందాక వసుధార కన్పించింది. నువ్వు నిజంగానే చంపేసావా అని అడుగుతాడు. అది వీడికి కూడా కన్పించిందా అని పాండు అనుకుంటాడు. నిజంగానే చంపామని పాండు చెప్తాడు. ఆ తర్వాత పాండు వెళ్ళిపోతాడు. వీడిని నమ్మడానికి లేదని శైలేంద్ర వసుధార ఫోటోని చూపిస్తూ టీ షాప్ అతన్ని అడుగుతాడు. తీరా చూస్తే అక్కడ పాండు ఉంటాడు. ఏంటి సర్ మా మీద నమ్మకం లేదా? మమల్ని అవమానిస్తున్నారని పాండు అనగానే.. సరేలే నమ్మానని శైలేంద్ర అంటాడు.ఆ తర్వాత టీ షాప్ అతన్ని రంగా అడ్రెస్ అడుగుతాడు ‌ రంగా ఇంటికి తీసుకొని వెళ్ళమని శైలేంద్రతో బాబుని ఇచ్చి పంపిస్తాడు. మరొకవైపు రంగా ఆటోని వాటర్ తో క్లీన్ చేస్తుంటే.‌ అప్పుడే వసుధార వస్తుంది‌ అనుకోకుండా వసుధార డ్రెస్ తడిసిపోతుంది. మీరు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోండి అని వసుధారని రంగా లోపలికి పంపించి బయటనుండి గడియ పెడతాడు. అప్పుడే శైలేంద్ర రంగా దగ్గరికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చారని రంగా అనగానే.. సరోజ గురించి మా తమ్ముడికి కొన్ని డౌట్స్ ఉన్నాయట అందుకే అని శైలేంద్ర అంటాడు. అప్పుడే వసుధార డోర్ కొడుతుంది. ఎక్కడ వసుధార బయటకు వస్తుందోనని రంగా ఆలోచిస్తాడు. సరోజ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని శైలేంద్రతో రంగా అంటాడు. అప్పుడే రాధమ్మ వస్తుంది. శైలేంద్ర మాట్లాడుతుంటే వసుధార తన వాయిస్ విని శైలేంద్ర వాయిస్ ల ఉందని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక రాధమ్మ వచ్చి గడియతీస్తుంది. ఇందాక వచ్చింది ఎవరని వసుధార అనగానే.. సరోజ ని చూడడానికి వచ్చినవాళ్ళు.. సరోజ ఇంటికి వెళ్లారని రాధామ్మ చెప్తుంది. ప్రొద్దున దేవయాని గారి వాయిస్, ఇప్పుడు శైలేంద్ర వాయిస్.. ఏంటి ఇలా ఎలాగైనా ఇప్పుడు వచ్చింది. శైలేంద్ర నో కాదో సరోజ ఇంటికి వెళ్ళాలని వయసు అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : శోభనం అక్కడే చేసేశాడు.. నాకు అంతా తెలుసు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -469 లో.. ఇందిరాదేవి అపర్ణ లు రాజ్ , కావ్యల శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళేంటి ఇంకా రావడం లేదని అపర్ణ అనగానే.. ఇద్దరు డిన్నర్ అయిపోయాక సరదాగా తిరిగి వస్తారేమోనని ఇందిరాదేవి అంటుంది. ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేసాను అత్తయ్య.. కావ్యని అపార్ధం చేసుకొని బాధపెట్టాను ఇక నుండి నా కోడలు సంతోషం కోసం ట్రై చేస్తానని అపర్ణ అనగానే ఇందిరాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. మరొకవైపు మరుసటి రోజు ఉదయం.. రాజ్ నిద్ర లేచి కావ్య నుదుటిపైన ముద్దుపెట్టి తను కిందకి వెళ్తాడు. అక్కడ ఒకతను వచ్చి.. సర్ అరెంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. నీ మొహంలా ఉన్నాయ్ తనని భయపెట్టమంటే నా పక్క నుండి వెళ్లి నన్ను భయపెట్టావని రాజ్ అంటాడు. చాలా కష్టపడ్డ కొంచెం చూసి డబ్బులు ఇవ్వండి.. మీరు ఇంకోసారి శోభనం చేసుకుంటే మళ్ళీ ఇక్కడికే రండి అని అతను అనగానే.. జీవితంలో ఒకేసారి శోభనం చేసుకుంటారని రాజ్ అంటాడు. వాళ్ళ మాటలన్నీ కావ్య వింటుంది. అతను వెళ్ళిపోయాక ఇదంతా మీ ప్లానా.. మీరు ఒళ్ళంతా ఇగోతో ఉన్నారు. ప్రేమతో భార్యని దగ్గరకి తీసుకోలేక ఇలా భయపెట్టి మీ సొంతం చేసుకున్నారా?  మీకు ఇలా చెయ్యడానికి ఈ పాడుపడ్డ బంగ్లానే దొరికిందా? ఈ విషయం అత్తయ్య, అమ్మమ్మలకి చెప్తానని కావ్య అనగానే.. రాజ్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావ్ దండం పెట్టమంటావా అని రాజ్ అనగానే.. కాళ్ళు ఎవరు పట్టుకుంటారని కావ్య అనగానే.. రాజ్ కాళ్ళు పట్టుకుంటుండగా కావ్య వద్దని చెప్తుంది. చెప్పావుగా అని రాజ్ అనగానే ఆలోచిస్తానని కావ్య అంటుంది. నువు చెప్పవ్ లే అని రాజ్ అంటాడు. సరే వెళదామని కావ్య అనగానే.. మన బట్టలు ఆరి ఉంటాయి.. అవి వేసుకొని వెళదామని రాజ్ అంటాడు. మరొకవైపు తెల్లవారింది ఇంకా రాలేదని, ఇందిరాదేవి, అపర్ణ లు టెన్షన్ పడుతుంటారు. అప్పుడే కావ్య, రాజ్ వస్తారు. ఎక్కడికి వెళ్లారురా? మీ కోసం రాత్రి శోభనం ఏర్పాట్లు చేసామని ఇందిరాదేవి అనగానే.. మీరు ఇక్కడ ఏర్పాట్లు చేశారు.. మీ మనవడు అక్కడ ఆ కార్యం పూర్తి చేసాడని రాజ్ చేసిన ప్లాన్ గురించి కావ్య చెప్తుంది. రాజ్ కోపంగా చూస్తాడు. నువ్వు ఇలా చేస్తావనుకోలేదని అపర్ణ, ఇందిరాదేవిలు అంటారు. ఆ తర్వాత ఇందిరాదేవి కావ్య దగ్గరకి వెళ్లి.. వాడు నీ మనసు తెలుసుకోకుండా ప్రవర్తించాడని తప్పుగా అనుకోకని అంటుంది. నేను ఎందుకు అలా అనుకుంటాను అమ్మమ్మ.. నాకు తెలియకుండా అతను అలా చేస్తుంటే నాకు సరదాగా అనిపించింది. నాకు నచ్చనిదే తను నన్ను తాకలేరు కదా.. అయన చేసేది నేను ముందే కనిపెట్టానని కావ్య అనగానే.. అమ్మ దొంగపిల్ల.. నాకు త్వరలోనే ఒక పాపని ఇవ్వాలని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడికి కూడా చెప్పండని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ ఏదో రాసి పారేస్తాడు. అది రాజ్ చూస్తాడు. అందులో అప్పు అంటే ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకున్నావా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఈ రోజు మా అప్పుకి పెళ్లిచూపులు అని కావ్య అనగానే.‌‌‌ రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Vindhya Vishaka : పేపర్ చీరలో యాంకర్ వింధ్య.. ట్రోల్స్ మాములుగా లేవుగా!

  కొందరికి పొద్దున్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది. మరికొందరు పేపర్ తో క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ చేస్తుంటారు. కొందరు సాయంకాలం స్నాక్స్ కోసం మిర్చి బజ్జీల బండి వారు వాడుతుంటారు. అయితే వాటితో పాటు ఇంట్లో వాడుకుంటారు. అయితే ఓ సెలెబ్రిటీ దాంతో చీర చేపించుకొని ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసింది. తనే యాంకర్ వింధ్య విశాఖ.  అప్పట్లో స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా ఫుల్ బిజీగా ఉండేది యాంకర్ వింధ్య విశాఖ. ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకి తెలుగు ప్రెజెంటర్‌గా ఈమె చేసింది‌. అయితే ఇటీవల నెమ్మదిగా మూవీ ఈవెంట్స్‌కి షిఫ్ట్ అయింది. ఈమె గలగల మాట్లాడుతూ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. పెద్ద సినిమాల ఈవెంట్స్ అన్నీ యాంకర్ సుమ హోస్ట్ చేయడం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఇక చిన్న సినిమాల ఈవెంట్స్ సంగతి ఇతర యాంకర్స్ చూసుకుంటున్నారు. తాజాగా డబ్బింగ్ చిత్రాల ఈవెంట్స్‌ను జోరుగా చేస్తుంది యాంకర్ వింధ్య విశాఖ.  భారతీయుడు-2  ప్రెస్ మీట్ కి యాంకర్ గా చేసిన వింధ్య విశాఖ, తాజాగా రాయన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి యాంకర్ గా చేసింది. ఇందులో తను పేపర్ తో కూడిన చీరతో వచ్చేసింది. అది చూసిన సోషల్ మీడియాలోని కొంతమంది ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. అయితే ఆ మీమ్స్ ని ట్రోల్స్ ని తను సరదాగా తీసుకొని ఇన్ స్టాగ్రామ్ లో స్టాటస్  గా పెట్టేస్తుంది. వింధ్య విశాఖ మొన్నటి ఐపీఎల్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేయండి అంటు చేసిన ఓ వీడియో వైరల్ అయింది. ఇక నిన్నటి న్యూస్ పేపర్ చీరతో మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. వింధ్య విశాఖకి ఇన్ స్టాగ్రామ్ లో 240K ఫాలోవర్స్ ఉన్నారు. నెట్టింట వైరల్ గా మారిన తన చీరని ఓ సారి చూసేయ్యండి.

దూసుకెళ్తున్న కాదల్ కురిసే.. యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్!

  ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ భోనాలు, కల్కి, ఎస్ ఎస్ రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్, నాని మూవీ గుర్తుందా శనివారం లాంటివి ఫుల్ ట్రెండింగ్ లో‌ ఉన్నాయి. అయితే వీటితో పోటీగా మరికొన్ని వెబ్ సిరీస్ లు, తెలంగాణ జానపద పాటలు ఉన్నాయి. అయితే డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మెహబూబ్ , బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్య కలిసి చేసిన ఓ మ్యూజిక్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 5 మిలియన్ వ్యూస్ ని దాటిన ఈ మ్యూజిక్ వీడియో ని మెహబూబ్, శ్రీసత్య కలిసి కాశ్మీర్ లోయల్లో మంచులో షూట్ చేశారు.  సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ మ్యూజిక్ వీడియోకి ప్రాణం పోశాయి. భార్గవ్ రవడ సినిమాటోగ్రఫీ చేయగా మనీష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. వైశు మాయ, మనీష్ కుమార్ ఈ పాటని పాడగా పవన్ కోపలి ఎడిట్ చేశాడు. ఏప్రిల్ 13 న మెహబూబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా నిన్నటికి 5 మిలియన్ వ్యూస్ ని దాటేసింది.  ఇక ఆ విషయాన్ని చెప్తూ మెహబూబ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.  శ్రీసత్య కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో సాంగ్ లింక్ ని పెట్టి అయిదు మిలియన్లు దాటేసిందని చెప్పుకొచ్చింది.  శ్రీసత్య, మెహబూబ్ కలిసి బిబి జోడిలో పార్టిసిపేట్ చేశారు‌. అయితే వీరికి అంతగా ఫేమ్ రాలేదు‌‌‌.‌ ఇద్దరు బిగ్ బాస్ ద్వారానే తమ సత్తా చాటుకొని ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. ప్రస్తుతం శ్రీసత్యకి వన్ మిలయన్ ఫాలోవర్స్ ఉండగా,మెహబూబ్ కి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇద్దరు ప్రమోషన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు.  మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్ లో ఉంది. ఓసారి చూసేయ్యండి.

Brahmamudi : బుల్లితెరని హీటెక్కించేసిన రొమాన్స్.. పాత బంగ్లాలో శోభనం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -468 లో.. రాజ్, కావ్య రెస్టారెంట్ కి వెళ్తారు. కావ్యని రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.. రాజ్ ఆ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్తాడు. చెప్పిందంతా గుర్తుంది కదా.. కేక్ టైమ్‌కి రావాలి. ఆ తర్వాత ఫుడ్.. తేడా రాకూడదని రాజ్ అంటాడు. సరే సర్ మీకెందుకు సర్.. మొత్తం నేను చూసుకుంటాను కదా.. మీరు వెళ్లండి కూర్చోండని అతను అంటాడు. అదే డైలాగ్ వాడతాడు రాజ్ జాగ్రత్తలు చెప్పిన ప్రతిసారీ. దాంతో రాజ్ కోపంగా.. హేయ్.. నాకెందుకు అంటావేంటయ్యా.. నాకే కావాలి.. నువ్వు సరిగ్గా చూసుకో.. సరే వెళ్తున్నానని కావ్య దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు రాజ్. ఇక కాసేపటికి మేనేజర్.. హలో ఆల్.. ఈ రోజు మన హోటల్‌కి ప్రముఖ అతిథి దుగ్గిరాల వారసుడు విచ్చేశారంటూ రాజ్ గురించి.. పొగిడి.. కేక్ పంపిస్తాడ. ఆ కేక్ వస్తున్నంత సేపు.. అన్నా చెల్లెల అనుంబంధం అంటూ పాట వస్తుంది. ఆ పాట విని రాజ్, కావ్య బిత్తరపోతారు. హ్యాపీ బర్త్ డే సిస్టర్ అని కేక్ మీద ఉంటుంది. ఇంతలో పక్క టేబుల్ వ్యక్తి.. అది నేను ఆర్డర్ చేశాను కదయ్యా అని మేనేజర్ తో అనగానే..  సారీ రాజ్ సర్.. పొరబాటు పడ్డాం.. ఈ సారి మాత్రం మీదే పక్కా మొత్తం నేను చూసుకుంటానంటు మేనేజర్ కవర్ చేసి వెళ్తాడు. ఇక రాజ్ అవన్నీ వద్దని ఫుడ్ పంపించమని చెప్తాడు.‌ ఇక ఇద్దరు ఫుడ్ తినేసి కారులో వస్తుంటారు. ఇంతలో సడన్ గా వర్షం పడుతుంది. ఇక పక్కనే ఉన్న ఓ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ క్యాండిల్స్ తో రాజ్ ముందుగానే డెకరేట్ చేసి ఉంచుతాడు. ఇక అక్కడో ఓ చీర ఉండగా దానిని మార్చుకోమని కావ్యకి రాజ్ చెప్తాడు.‌ ఇక అదే సమయంలో వెలుగులో నుండి ఎవరో వెళ్ళినట్టు కావ్యకి అనిపించగా భయపడుతుంది. ఎవరు లేరని రాజ్ అన్నాక చీర మార్చుకుంటుంది కావ్య.  మళ్ళీ భయపడిన కావ్య వెంటనే రాజ్ దగ్గరికి వచ్చి హత్తుకుంటుంది. అప్పుడే రొమాంటిక్‌గా కావ్యను కిస్ చేస్తాడు రాజ్. కాసేపటికి మధురమే ఈ క్షణమే సాంగ్ ఓ వైపు..రాజ్ , కావ్యల రొమాన్స్ మరోవైపు.. స్క్రీన్‌ని హీటెక్కిస్తాయి. ఆ సమయంలో ఇద్దరూ సిగ్గు పడటం.. దూరం జరగడం.. మళ్లీ ఏకం కావడం.. లిప్ కిస్ చేసుకోవడం.. అంతా చూపిస్తారు. వారి తొలికలయిక జరిగినట్లుగా స్క్రీన్ మీద చూపిస్తారు. దుప్పటి కప్పుకుని ఇద్దరూ ఏకం కావడంతో శోభనం అయిపోయిందన్న క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 :  తండ్రి ఎఫైర్ ని కళ్ళారా చూసేసిన కొడుకు.. ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -103 లో..  కార్తిక్, దీప మాట్లాడుకుంటారు. జోత్స్నకి మీరంటే ప్రాణం.. మిమ్మల్ని తప్ప వేరొకర్ని భర్తగా ఊహించుకోలేదు.. చిన్నప్పటి నుంచి మీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. మనం ప్రేమించే వాళ్లకంటే మనల్ని ప్రేమించే వాళ్లు మన జీవితంలోకి వస్తే జీవితం ఎంతో బాగుంటుంది.. ఈ పెళ్లి వద్దనడానికి మీ దగ్గర కారణాలు లేవు.. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి జోత్స్నకి వంద కారణాలు ఉన్నాయి.. మీ పెళ్లి అనేది మీ రెండు కుటుంబాల కల.. మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలని మీ అమ్మ గారు ఎంత ఆరాటపడుతున్నారో నాకు తెలుసు కార్తీక్ బాబు.. మీ అమ్మగారిని సంతోషపెట్టడం కొడుకుగా మీ బాధ్యత.. అని కార్తిక్ తో దీప అంటుంది. ఇక కార్తిక్ ఏం సమాధానం చెప్పలేక అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. దీప మాట్లాడిన మాటలే తల్చుకుంటు కార్తిక్ కారులో వెళ్తుండగా.. అతనికి శ్రీధర్, అతని రెండో భార్య, కూతురు స్వప్న కనిపిస్తారు. ఈవిడ స్వప్న అమ్మ గారు కదా.. నాన్న మాట్లాడుతున్నాడేంటి? డాడీకి స్వప్న వాళ్ల అమ్మ ఎవరో తెలియదు కదా.. అని అనుమానిస్తూ చూస్తాడు. ఇంతలో స్వప్న వచ్చి.. నాకు ఈ షాప్‌లో ఏం నచ్చలేదు డాడ్ అని అంటుంది. మమ్మీ షాపింగ్ అయిపోతుంది డాడ్.. నా షాపింగే మిగిలింది అని స్వప్న అనడంతో.. ఆ మాటలు కార్తీక్‌కి వినిపిస్తాయి. ఆ మాటలు విని కార్తీక్‌ షాక్ అవుతాడు. నాన్నని డాడీ అంటుందేంటు కార్తిక్ జరిగింది మొత్తం గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కార్తిక్ కి మొత్తం విషయం అర్థమవుతుంది. తన తండ్రి శ్రీధర్.. ఇంట్లో ఇల్లాలును పెట్టుకుని.. పక్క వీధిలో ప్రియురాలిని పెట్టుకున్నాడని కార్తీక్‌కి మొత్తం అర్ధం అయిపోతుంది. స్వప్న తండ్రి.. నా తండ్రి ఒక్కరేనా? అని వాళ్ల ముగ్గురూ కలిసి ఉన్న ఫొటోని తీస్తాడు కార్తీక్. ఆ తర్వాత తన తండ్రి చేస్తున్న మోసాన్ని తల్చుకుని భోరున ఏడుస్తాడు కార్తీక్. తలని కారుకేసి కొట్టుకుంటాడు. ఆ తర్వాత దూరంగా వెళ్లి తన తండ్రి గురించే ఆలోచిస్తుంటాడు. కన్ఫమ్ చేసుకోవడానికి స్వప్నని కలుస్తాడు. అయితే స్వప్న వచ్చి.. మా డాడీతో షాపింగ్‌కి వెళ్లాను ఈరోజు అని చెప్పడంతో కార్తీక్‌ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సందీప్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రామలక్ష్మి.. సీతాకాంత్ అర్థం చేసుకోగలడా!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -155 లో.....రామలక్ష్మికి తన క్యాబిన్ చూపిస్తాడు సీతాకాంత్. నీకేం కావాలన్నా అలా చిటికెస్తే ఇలా వస్తాయని సీతాకాంత్ అంటాడు. సీతాకాంత్ ప్రేమగా చూస్తుంటే తన లవ్ మ్యాటర్ చెప్తాడేమో అని రామలక్ష్మి అనుకుంటుంది.  నువ్వు ఇంటిని బాగా చూసుకుంటున్నావ్.. ఈ కంపెనీని కూడా చూసుకుంటావని ఆశ పడుతున్నానని సీతాకాంత్ రామలక్ష్మికి అల్ ది బెస్ట్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ తన క్యాబిన్ లో నుండి రామలక్ష్మిని ప్రేమగా చూస్తుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరకి సీతాకాంత్ వచ్చి.. నువ్వు మేనేజర్ కావాలి. ఇదంతా అన్యాయమని అంటాడు. అప్పుడే నాకు వేడి వేడి కాఫీ కావాలని అంటుంది నమిత. అయితే నువ్వే తెచ్చుకోపో అంటాడు. ఆ తర్వాత నిజంగా మీరు లక్కీ మేడమ్.. సీతాకాంత్ సర్ ని ఎంత మంది ట్రై చేసారో మీరు భలే పడేసారని నమిత అంటుంది. సర్ కి నేను కూడా స్పెషల్ అని నమిత అనగానే.. రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు సందీప్ తన క్యాబిన్ లోకి వెళ్తాడు. అసిస్టెంట్ మేనేజర్ ని రమ్మని చెప్పండి అని సందీప్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి క్యాబిన్ కి వచ్చి.. సందీప్ పిలిచావాట అని అడుగుతుంది. సందీప్ ఏంటి నీ బాస్ ని సర్ అను అని కోప్పడతాడు. ఈ ప్రాజెక్ట్ స్టడీ చేసి నాకు హాఫ్ అన్ అవర్ లో ఇవ్వాలి రామలక్ష్మి అనగానే.. నేను మిస్సెస్ సీతారామలక్ష్మి. మీరు మర్యాద ఇవ్వడం నేర్చుకోండని రామలక్ష్మి కౌంటర్ వేస్తుంది. రామలక్ష్మి కూర్చొబోతుంటే నేను కూర్చొమనే వరకు కూర్చొవద్దని సందీప్ అంటాడు. అప్పుడే సీతకాంత్ వచ్చి.. ఏంటి నిల్చున్నావ్ కూర్చోమని రామలక్ష్మిని కూర్చోపెడతాడు. ఇక్కడ అందరు సమానమే అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత నమిత తలకి సీతాకాంత్ తల తాకగా కొమ్ములు వస్తాయంటూ మళ్ళీ తాకించమని నమిత అనగానే.. సీతాకాంత్ తాకిస్తాడు. ఆ తర్వాత మీటింగ్ జరుగుతుంది. అందులో న్యూ కంపెనీ కోసం ల్యాండ్ సజెస్ట్ చేయమని సీతాకాంత్ చెప్పగా.. సందీప్ సజెస్ట్ చేస్తాడు. అది వద్దంటూ పర్ఫెక్ట్ రీజన్ రామలక్ష్మి చెప్పగా.. సీతాకాంత్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి పైన సందీప్ కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటే.. రామలక్ష్మి వంక సీతాకాంత్ ప్రేమగా చూస్తుంటాడు. పక్కనే ఉన్న నమిత తనని సీతాకాంత్ చూస్తున్నాడనుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : వసుధారని చూసి షాకైన శైలేంద్ర.. అతని ప్లాన్ నెరవేరేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్  'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1133 లో.. వసుధార, రంగాలు వెళ్తుంటే టీ తాగాలని ఉందని వసుధార అనడంతో.మ రంగా అటో ఆపుతాడు. టీ ఎలా చెయ్యాలో టీ షాప్ అతనికి బాబాయ్ ఇలా చెయ్యాలంటూ చెప్తాడు. మీరు నా రిషి సర్.. నాకు టీ ఎలా ఇష్టమో నేను ఎలా చేస్తానో మీరు చెప్పారని వసుధార అంటుంది. నేను కాదంటూ రంగా అంటాడు. మరొకవైపు శైలేంద్ర, దేవయానిలు ఒక దగ్గర మాట్లాడుకుంటారు. వాడు రిషి కావచ్చని దేవయాని భయపడుతుంది. అయ్యే ఛాన్స్ ఉండదు.. వాడు రంగానే ఎందుకంటే వాడి మరదలు చిన్నప్పటి నుండి వాడిని లవ్ చేస్తోందని చెప్పింది కదా అని శైలేంద్ర అంటాడు. అయిన నాకెందుకో వాడే రిషి అనిపిస్తుందని దేవయాని అంటుంది. వాడు రంగా అయితే మనం అనుకున్నది జరుగుతుంది. నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండి, వాడు రిషినో రంగానో కనుక్కోమని శైలేంద్రకి‌ దేవయాని చెప్తుంది. అప్పుడే ధనరాజ్ కార్ లో నుండి వచ్చి.. ఏంటి మీరు కారులో నన్ను ఉంచి.. మీరు మాట్లాడుకుంటున్నారని అంటాడు. ఏం లేదు అమ్మాయి నీకు నచ్చిందా అని ధనరాజ్ ని శైలేంద్ర అడుగుతాడు. నచ్చిందని అనగానే కానీ నువ్వు ఆ అమ్మాయికి నచ్చలేదు కదా అందుకే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి వాళ్ళని ఒప్పిస్తానని శైలేంద్ర అంటాడు. నేను కూడ ఉంటానని ధనరాజ్ అనగానే.. నువ్వు ఉంటే ఈ పెళ్లి సెట్ కాదని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక శైలేంద్ర రంగాని వెతికే పనిలో పడతాడు. మరొకవైపు వసుధార, రంగాలు టీ తాగుతుంటారు. ఆ తర్వాత శైలేంద్ర ఒకతన్ని ఆపి రంగా గురించి అడుగుతాడు. రిషి ఫోటో చూపిస్తాడు. అతను మా రంగా.. సూట్ లో బాగున్నాడు మీరే తీసారా.. నాక్కూడా ఇలా సూట్ లో తీస్తారా అని అతను అనగానే శైలేంద్ర కోప్పడతాడు. ముందు వీడు ఎక్కడన్నాడు కనుక్కోమని శైలంద్ర అనగానే.. అతను రంగాకి ఫోన్ చేస్తాడు. టీ షాప్ దగ్గరున్నా అని రంగా చెప్పగానే శైలేంద్ర అక్కడికి బయల్దేరి వెళ్తాడు. మరొకవైపు రంగా కి ఫోన్ వస్తే.. మళ్ళీ వస్తానంటూ వసుధారని వదిలి పెట్టి వెళ్తాడు. టీ షాప్ దగ్గర వసుధార ఉంటుంది. అక్కడ వసుధారని చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. మరొకవైపు రౌడీలు వసుధారని చూస్తారు. దాంతో వసుధార అక్కడ నుండి పరిగెడుతుంది. శైలేంద్ర కళ్ళు నులిమికొని చూసేసరికి వసుధార మాయమవుతుంది. నేను నిజంగానే వసుధారని చూసానా అని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో కీలక ఎపిసోడ్.. అది నిజమేనా!

  ప్రతీరోజు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో‌ ఆకట్టుకుంటున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. స్టార్ మా టీవీలోని సీరియల్స్ అన్ని ప్రోమోలతో పోలిస్తే ఈ సీరియల్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-50 లో కొనసాగుతుంది.  మరి అంతగా ఈ సీరియల్ లో ఏం ఉందంటే... గత జన్మలో సీతని చాటుగా చూసి రామ ప్రేమిస్తాడు. ఆ విషయం సీతకి తెలిసి తనకి కూడా ఇష్టమేనని చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా సీత లేచిపోయి వస్తుంది. స్నేహితుడి సహాయంతో సీతని రామ పెళ్లిచేసుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామనే టైమ్ లో పెళ్లి ఇష్టం లేని సీత వాళ్ళ అన్నయ్య పరువు మర్యాదలే ముఖ్యమని భావించి రామని చంపేస్తాడు. ఆ దిగులుతో సీత కూడా చనిపోతుంది. ఈ జన్మలో మనల్ని విడదీసినా మన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఉంటుందని గత జన్మకీ సంబంధించిన పాత్రలను ముగించారు డైరెక్టర్. గత జన్మలో రామగా చనిపోయి ఈ జన్మలో సీతాకాంత్ గా, సీతేమో రామలక్ష్మిగా పుడతారు. సీతాకాంత్ పుట్టిన ఇరవై సంవత్సరాలకి రామలక్ష్మి జన్మిస్తుంది. రామలక్ష్మి సివిల్ సర్వీస్  కోచింగ్ తీసుకుంటుంది‌. ఇక రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్ళి చేసుకుంటాడు. సీతాకాంత్ వాళ్ళ  సవతి తల్లి శ్రీలత   గురించి, తన  నిజస్వరూపాన్ని తెలుసుకున్న రామలక్ష్మి ఆమె ఎత్తులని చిత్తు చేస్తుంటుంది. తాజాగా యూట్యూబ్ లో రిలీజైన ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రోమోకి అత్యధిక వీక్షకాధరణ లభించింది. సీతాకాంత్ తన భార్య రామలక్ష్మి మీద ప్రేమని తెలియజేశాడు. మోకాళ్ళ మీద కూర్చొని ఓ డైమండ్ రింగ్ చేతిలో పట్టుకొని రామలక్ష్మికి లవ్ ప్రపోజ్ చేశాడు. అది చూసిన రామలక్ష్మి ఫిధా అయింది. మరి ఇది నిజమేనా.. లేక రామలక్ష్మి గానీ సీతకాంత్ గానీ కల కంటున్నారా అనేది తెలియాలంటే ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. వీళ్ళిద్దరూ కలవడం కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నేటి కథనంలో వీరిద్దరు కలుస్తారా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారింది.  

బెడ్ పై దీప్తీ సునైనా.. అందాల విందుకు నెటిజన్లు ఫిధా!

  ఇదేందయ్యా ఇది.. రోజు రోజుకి చిన్న సెలబ్రిటీల అందాల ఆరబోత శృతి మించుతోంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ లిస్ట్ లో ఉన్న కొంతమంది బోల్డ్ ఫోటో షూట్ లతో నెటిజన్లకి షాకిస్తున్నారు. అషురెడ్డి, ఇనయా సుల్తానా, అనసూయ, అరియానా లాంటి వాళ్ళు రెగ్యులర్ గా హాట్ అండ్ బోల్డ్ ఫోటో షూట్ లు తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి దాకా డిసిప్లిన్ గా ఉన్న దీప్తి సునైనా కూడా ఇప్పుడు బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాలోని కుర్రాళ్ళకి సెగ పుట్టిస్తోంది. ఓ వైపు షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు, వీడియో సాంగ్స్‌తో కొన్నాళ్లు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ.‌ బిగ్ బాస్ కి వెళ్ళి మరింతగా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది.   దీప్తి సునైనాకి ఇన్ స్టాగ్రామ్ లో ' టు క్రియేట్ ఆర్ట్ క్రియేట్ యువర్ సెల్ఫ్ ' అనే క్యాప్షన్ తో పది ఫోటోలతో కూడిన ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో తను వైట్ డ్రెస్ వేసుకొని బెడ్ పై వాలిపోయింది. ఈ ఫోటోలలో కొన్ని ఫోటోలు మాములుగా ఉన్నా.. రెండు, మూడు, ఏడు ఫోటోలు మరీ బోల్డ్ గా ఉన్నాయి.  దీంతో నెటిజన్ల పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీప్తీకి ఇన్ స్టాగ్రామ్ లో 4.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకేనేమో తను ఏ ఫోటో షేర్ చేసిన లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి‌. ప్రస్తుతం దీప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

ఆయ్ మూవీ హీరోయిన్ పై థమన్ కామెంట్స్

  ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈవారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "ఆయ్" మూవీ టీం నుంచి నార్నె నితిన్, సింగర్ రామ్ మిరియాల వచ్చారు. ఇక రామ్ తో కలిసి స్కంద అనే కంటెస్టెంట్ ఒక సాంగ్ కూడా పాడాడు. ఐతే శ్రీ ధృతి "నిన్ను కోరి" అనే సాంగ్ పాడింది. దానికి అందరూ కొన్ని కరెక్షన్స్ కొన్ని విషయాల్లో ఎలా పాడాలో చెప్పారు. "ఈ పిల్ల ఇంత టెన్షన్ పడుతోంది..ఎలా పడుతుందా" అని అనుకున్నా అన్నాడు రామ్ మిరియాల. కానీ బాగా పాడింది అన్నాడు.   ఐతే మధ్యలో థమన్ అడిగిన ప్రశ్నకు అందరూ షాక్ అయ్యారు. "మీ సినిమాలో హీరోయిన్ లేదా బ్రో" అని అడిగేసరికి "హీరోయిన్ బిజీగా ఉంది ఈరోజు రాలేకపోయింది." అని రామ్ మిరియాల ఆన్సర్ ఇచ్చాడు. దానికి "మీరు కూడా నెక్స్ట్ వీక్ రావాల్సింది" అన్నాడు థమన్. "అంటే మనమే వచ్చాము హీరోయిన్ రాలేదని థమన్ అన్నా ఫీలవుతున్నాడు..." అని రామ్ అనేసరికి థమన్ నవ్వేసాడు. " అన్నా పంపిస్తానని మా డైరెక్టర్ గారిని అడిగి" అనేసరికి "హే ఛీఛీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు " అన్నాడు థమన్. ఇంతలో గీతామాధురి థమన్ తో ఏదో మాట్లాడింది. దాంతో వెంటనే థమన్  "అలా కాదు బ్రో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం " అన్నాడు. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగాఈ మూవీలో  నటించారు.  యంగ్ ప్రొడ్యూసర్స్ గా  బన్నీ, విద్యా కొప్పినీడి ఉన్నారు.

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్.. ఎప్పుడంటే!

బిగ్ బాస్ తెలుగు 8 కమింగ్ సూన్ అంటూ ప్రోమో వదిలారు మేకర్స్. సీజన్ సెవెన్ గ్రాంఢ్ హిట్ అవ్వడంతో ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఆ అంచనాలకి తగ్గట్టుగానే బిబి టీమ్ లోగో ప్రోమోని రిలీజ్ చేశారు.  సీజన్ 8 లోగో కాస్త డిఫరెంట్‌గా ఉంది. మునుపటి సీజన్ లోగోలతో పోలిస్తే కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇక 8 నంబర్ మధ్యలో 'స్టార్' సింబల్ ఉండటం విశేషం. ఇక ఈ లోగో ప్రోమోలో సీజన్ 8 త్వరలోనే అంటూ చెప్పింది స్టార్ మా. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్‌లో పలు మార్పులు చేసి ఎలాగోలా ఆడియన్స్‌ను తిరిగి ఆకట్టుకుంది. సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత అయితే సీరియల్ యాక్టర్ అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. గతేడాది డిసెంబర్‌లో సీజన్ 7కి శుభం కార్డు పడింది. అప్పటి నుంచి సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురుచూశారు. తాజాగా బిబి‌ టీమ్ వారందరికీ శుభవార్త చెబుతూ సీజన్ 8 ప్రోమో రిలీజ్ చేసింది. ప్రస్తుతం అనసూయ, శేఖర్ మాస్టర్ కలిసి చేస్తోన్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ప్రతీ ఆదివారం వస్తుంది. ఇది పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుందని తెలుస్తోంది. మరి కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి‌. సోషల్ మీడియా ఇన్ ప్లూయన్సర్ ఫార్మర్ నేత్ర, సీరియల్ నటి అంజలి పవన్, అక్షిత, రీతూ చౌదరి, యాంకర్ వర్షిణి, యాంకర్ వింధ్య విశాఖ, ఇంద్రనీల్, తేజస్విని గౌడ, యాదమ్మ రాజు, వేణుస్వామి, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్, సుప్రీత, సంచిక్ బబ్లూ, కుమారి ఆంటీ, ఏక్ నాథ్ హారిక వీళ్ళు బిబి టీమ్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు హౌస్ లోకి ఎంటర్ అవుతారు? లేదంటే కొత్తవాళ్ళు ఇంకెవరైనా వస్తారా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.