Karthika Deepam2: మన ఇద్దరి దారులు ఎప్పటికీ ఒక్కటి కావు.. తన ఆచూకి దొరికేసింది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -93 లో...శౌర్య ప్రతిసారి కార్తీక్ కార్తీక్ అంటుంటే.. దీపకి ఏం చెప్పాలో అర్థం కాదు. దీప బయటకు వచ్చి శౌర్యకి ఏమని చెప్పాలి ? ఎలా చెప్పగలనంటూ బాధపడుతుంటే అప్పుడే ఇంటిముందు నుండి ఒకతను వెళ్తుంటాడు. దీపని చూసి ఫిగర్ బాగుంది.. ఎలాగైనా నాదాన్ని చేసుకోవాలని అనుకుంటాడు. దీప అతన్ని కోపంగా చూసి లోపలికి వెళ్లిపోతుంది. మరొకవైపు సుమిత్ర దశరత్ లు పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్తారు. అక్కడ దీప గురించి మాట్లాడుతూ.. సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ , జ్యోత్స్నల ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడుకుంటారు. మాకు ఒకే మీరు ముహూర్తం పెట్టించండని కాంచనా చెప్పగానే ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం లు దీపని వెతకడానికి వెళ్తారు. కార్తీక్ కార్ కన్పించగానే జ్యోత్స్న ఆగి.. చూసావా బావ ఎలా దీప కోసం వెతుకుతున్నాడో అని పారిజాతంతో అంటుంది. కార్తీక్ ని జ్యోత్స్న ఫాలో అవుతుంటే.. అతను చూసి కార్ ఆపి, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారని అడుగుతాడు. నువ్వు దీప కోసం వెతుకుతున్నావ్ కదా అందుకే అని జ్యోత్స్న అంటుంది. మీరు ఒకవైపు వెతకండి అంతే గానీ నా దారిలో ఎందుకు రావడం.. మన ఇద్దరి దారులు ఎప్పటికి ఒకటి కావని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. చూసావా గ్రానీ ఎలా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడో అని జ్యోత్స్న అంటుంది.ఆ తర్వాత దీప షాప్ కి వెళ్తుంది. అక్కడే దీప ని సొంతం చేసుకోవాలని అనుకున్న అతను ఉంటాడు. సరుకులు ఇవ్వండి అని దీప అనగానే.. నా మనిషిగా ఉంటే నువ్వేం పని చేయనవసరం లేదు.. నేను చూసుకుంటా అని అతను అనగానే.. అతని చెంపపై ఒక్కటిస్తుంది దీప. అబ్బో ఇది అందరిలాంటి ఆడది కాదని అతను భయపడుతాడు. ఆ తర్వాత సుమిత్ర  , దశరత్ లు కార్తీక్ జ్యోత్స్నల పెళ్ళి ముహూర్తం గురించి కాంచనతో మాట్లాడితే ఒకే అందని ఇంటికి వచ్చి చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ టైమ్ లో దీప కూడా ఉండి ఉంటే బాగుండేది అని పారిజాతం, జ్యోత్స్న లు అంటారు. మరొకవైపు దీప కోసం కార్తిక్ వెతుకుతుంటే దీప కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లి అర్ధం అయ్యేలా చెప్పాలని ట్రై చేస్తుంటే దీప వినదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : కొడుకుని మేనేజర్ చేయడానికి శ్రీలత కొత్త ప్లాన్.. రామలక్ష్మి ఆపేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -145 లో... శ్రీలత ఎలాగైనా సందీప్ ని జనరల్ మేనేజర్ ని చేయాలని అనుకుంటుంది. ఇంట్లో ఇంత జరుగుతున్నా మా అయనని జనరల్ మేనేజర్ ని చెయ్యడానికి బావగారు ఏమైనా పిచ్చోడా అని శ్రీవల్లి అంటుంది. అవును వాడు అమ్మ పిచ్చోడు. ఎలాంటి స్వార్థం లేదు.. మా అమ్మకి అనుకునే పిచ్చోడని శ్రీలత అంటుంది. జనరల్ మేనేజర్ అవ్వడానికి నేనొక ప్లాన్ చెప్తానంటూ సందీప్ కి శ్రీలత ప్లాన్ చెప్తుంది. ముందు జనరల్ మేనేజర్ అవ్వు.. ఆ తర్వాత ఆఫీస్ ని మొత్తం నీ గుప్పిట్లో పెట్టుకోమని సందీప్ కి చెప్తుంది శ్రీలత. మరొకవైపు సీతాకాంత్ నిద్రలేస్తు.. రామలక్ష్మిని పిలిచి తన ముందు నిల్చొమని చెప్తాడు. సీతాకాంత్ ముందుకి రామలక్ష్మి రాగానే.. సీతకాంత్ నిద్రలేచి రామలక్ష్మి మొహం చూస్తాడు. మొన్న నీ మొహం చూసినందుకే అవార్డు వచ్చింది. ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది. అది సక్సెస్ అయితే ఫారెన్ నుండి కూడా క్లయింట్స్ వస్తారని సీతాకాంత్ అంటాడు. మీరు రెడీ అవ్వండి.. నేను కాఫీ తెస్తానంటూ రామలక్ష్మి వెళ్తుంది. ఆ తర్వాత న్యూస్ ఛానెల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. రామలక్ష్మి హారతి తీసుకొని వెళ్లి.. సందీప్, శ్రీలత, శ్రీవల్లిలకి ఇస్తుంది. వాళ్ళు హారతి తీసుకోరు. మీరు రాత్రి అన్నారు కదా.. అది ఇప్పుడు జరగబోతుందని శ్రీలతకి  రామలక్ష్మి చెప్పి వెళ్తుంది. రామలక్ష్మి ఇంటర్వ్యూ చేసే ఆవిడకి కాఫీ ఇస్తూ.. ఈ ప్రశ్న సీతకాంత్ ని అడగండి అని ఒక స్లిప్ పై రాసి తన దగ్గర పడేస్తుంది. అది చూసిన ఆవిడా అడిగితే మా ఛానెల్ కి మంచి రేటింగ్ వస్తుందని అనుకుంటుంది.   ఆ తర్వాత సీతాకాంత్ ఏ సూట్ వేసుకోవాలో కన్ఫ్యూజన్ అవుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వెళ్ళి తన చీరకి మ్యాచింగ్ సూట్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. మ్యాచింగ్ సెలక్ట్ చేసావా అంటూ సీతాకాంత్ నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. అందులో మీకు పెళ్లి అయిందా.. అసలు మీ భార్యని పరిచయం చెయ్యకపోవడానికి కారణమేంటని ఇంటర్వ్యూ చేసే వారు అడుగుతారు. అది నా పర్సనల్ అంటూ సీతాకాంత్ కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Guppedantha Manasu : ఇంటి జాడ చెప్పిన రంగా.. షాక్ లో వసుధార!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1123 లో....వసుధార పెద్దావిడ దగ్గరికి వచ్చి.. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అంటుంది. ఏంటని ఆవిడా అంటుంది. మీ మనవడి పేరు నిజంగానే రంగానా అని వసుధార అడుగుతుంది. అవును అందరిని అడిగావు కదా అని పెద్దవిడా అంటుంది. మీ మనవడు చిన్నప్పుటి నుండి  మీ దగ్గరే ఉన్నాడా? అంటే చిన్నప్పుడు మీకు దూరంగా వెళ్ళిపోయి ఈ మధ్యే వచ్చాడా అని వసుధార అడుగుతుంటే.. ఆవిడ కంగారుపడుతుంది. లేదమ్మా నా మనవడు నాతోనే ఉన్నాడని పెద్దవిడ చెప్తుంది. అయితే మీరు ఎందుకు తడబడుతున్నారని వసుధార అనగానే... అదేం లేదని ఆవిడ అంటుంది. ఇన్ని రోజులు నా రిషి సర్ ని చూసుకున్నందుకు చాలా థాంక్స్ అని వసుధార అంటుంది. మీరు కూడా రిషి సర్ తో పాటు సిటీకి రండి.. మీరు మా దగ్గరే ఉందురని వసుధార అనగానే.. నువ్వు వెళ్లేసరికి నువ్వు అంటున్న రిషి సర్ మీ ఇంట్లో ఉంటే అప్పుడు కూడా ఇలాగే అంటావా అని పెద్దావిడ అంటుంది. రిషి సర్ ఇక్కడ ఉండగా అక్కడ ఎలా ఉంటారని వసుధార అంటుంది. నీ నమ్మకం నీది.. వెళ్లి రెస్ట్ తీసుకోమని‌ వసుధారని పెద్దావిడ పంపిస్తుంది. వాళ్ళ మాటలు అన్ని రంగా వింటాడు.. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వసుధార , రంగా లు బయలుదేర్తుంటే అపుడే సరోజ వస్తుంది. నీకు వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇస్తానని అన్నాను కదా చెప్పకుండా వెళ్తున్నావని వసుధారతో సరోజ అంటుంది. ఆ తర్వాత రంగాపై తన ప్రేమని గురించి సరోజ చెప్తుంది. సరోజ వసుధారకి గిఫ్ట్ ఇస్తుంది. ఇది నా పాత చీర.. నాకు ఇష్టం లేనిది అందుకే నీకు పడేస్తున్నానని సరోజ గా పొగరుగా మాట్లాడుతుంది. సరే వెళ్లి వస్తానని వసుధార చెప్తుంది. వెళ్ళు మళ్ళీ రాకని సరోజ అంటుంది. వసుధార, రంగా లు ఇద్దరు బయలుదేర్తారు. మా బావ ఇంటికి వచ్చేవరకు నాకు టెన్షన్ అని సరోజ అనుకుంటుంది. మరొకవైపు అనుపమ వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేసి ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం చెప్తుంది. ఆ తర్వాత వసుధార, రంగాలు వస్తారు. కొద్దీ దూరం ఆటోలో వస్తారు. నాకు నడుచుకుంటూ వెళ్ళాలని ఉందని వసుధార అంటుంది. ఇద్దరు నడుచుకుంటూ వస్తారు.. వాళ్ళకి కొద్ది దూరంలో మహేంద్ర వెళ్తుంటాడు కానీ వాళ్ళను చూడడు. ఆ తర్వాత ఎటువైపు వెళ్ళాలని రంగా అడుగుతాడు. ఎటు వైపో మీకు తెలియదా అని వసుధార అనగానే నాకెలా తెలుస్తుందని రంగా అంటాడు. సరే అటు వైపు అని వసుధార అనగానే ఇటువైపు అనుకుంటా అని రంగా అంటాడు. దాంతో వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అప్పుకి రెండో సంబంధం తెచ్చిన బ్రోకర్.. కళ్యాణ్  నీకు నచ్చింది చెయ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -458 లో..... రాజ్ ఫోన్ లో సుభాష్ అపర్ణల పెళ్లి రోజు రీమైండర్ పెడుతుంది  కావ్య. అప్పుడే అలారం రావడంతో రాజ్ చూసి.. రేపు మమ్మీ డాడ్ ల పెళ్లి రోజు నువ్వే రిమైండర్ పెట్టావా అని కావ్యని అడుగుతాడు. దాంతో కావ్య అవునని అంటుంది. ఇదే మంచి టైమ్.. రేపు కళ్యాణ్ ని ఆ బాధ నుండి బయటకు వచ్చేలా చెయ్యాలని రాజ్ అంటాడు. మరొకవైపు కనకం అప్పు గురించి ఆ వీధి వాళ్లు తప్పుగా అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే కనకం దగ్గరికి కృష్ణమూర్తి వస్తాడు. మనం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కనకం అంటుంది. తనకి పోలీస్ కావాలన్న కోరిక ఉందని కృష్ణమూర్తి అంటాడు. నేను ఎలాగైనా అప్పుని ఒప్పిస్తానని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొకవైపు సుభాష్ ఉదయం గదిలో నుండి రాగానే కావ్య, రాజ్ లు వెళ్లి విషెస్ చెప్తారు. కావ్య రాజ్ లు సుభాష్ కి చీర ఇచ్చి.. ఇది మీరు తీసుకొని వచ్చానని చెప్పి అపర్ణకి ఇవ్వండని అంటారు. దాంతో సుభాష్ చీర తీసుకొని వెళ్తాడు. రాజ్, కావ్య లు సరదాగా గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారా.. నా చేతిలో మనవడిని పెట్టేది ఉందా లేదా అని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడిని అడగండి అంటూ కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. నీ మనసు లో ప్రేమని బయటపెట్టరా అంటే ఇలా చేస్తున్నావని ఇందిరాదేవి రాజ్ కి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత సుభాష్ అపర్ణని విష్ చేసి తనకి చీర ఇస్తాడు. అపర్ణ సుభాష్ పై కోపంగా ఉన్నా సరే చీరను తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా రాజ్ ని వచ్చి హగ్ చేసుకొని.‌ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత అప్పుని పెళ్లి చేసుకుంటానని ఒకతను వస్తాడు. అతను రెండవ సంబంధం. మంచి సంబంధం తీసుకొని రమ్మంటే ఇలా రెండో సంబంధం.. పైగా రౌడీ ని తీసుకొని వస్తావా అని బ్రోకర్ పై కనకం కోప్పడుతుంది. మీ అమ్మాయి ఆ కళ్యాణ్ తో తిరిగింది.. నేను కాకపోతే ఎవరు చేసుకుంటారని అతను అంటాడు. దాంతో కనకం తిట్టి పంపిస్తుంది ఆ మాటలు అప్పు విని బాధపడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే ధాన్యలక్ష్మి , ప్రకాష్ లు వచ్చి.. నువ్వు ఇలా ఉండకురా నీకు నచ్చింది చెయ్.. మేమ్ ఏం అడ్డుపడమని చెప్తారు. తరువాయి భాగంలో అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజున ఇంట్లో సరదాగా గేమ్స్ ఆడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. Brahmamudi : అప్పుకి రెండో సంబంధం తెచ్చిన బ్రోకర్.. కళ్యాణ్  నీకు నచ్చింది చెయ్! స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -458 లో..... రాజ్ ఫోన్ లో సుభాష్ అపర్ణల పెళ్లి రోజు రీమైండర్ పెడుతుంది  కావ్య. అప్పుడే అలారం రావడంతో రాజ్ చూసి.. రేపు మమ్మీ డాడ్ ల పెళ్లి రోజు నువ్వే రిమైండర్ పెట్టావా అని కావ్యని అడుగుతాడు. దాంతో కావ్య అవునని అంటుంది. ఇదే మంచి టైమ్.. రేపు కళ్యాణ్ ని ఆ బాధ నుండి బయటకు వచ్చేలా చెయ్యాలని రాజ్ అంటాడు. మరొకవైపు కనకం అప్పు గురించి ఆ వీధి వాళ్లు తప్పుగా అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే కనకం దగ్గరికి కృష్ణమూర్తి వస్తాడు. మనం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కనకం అంటుంది. తనకి పోలీస్ కావాలన్న కోరిక ఉందని కృష్ణమూర్తి అంటాడు. నేను ఎలాగైనా అప్పుని ఒప్పిస్తానని కృష్ణమూర్తితో కనకం అంటుంది. మరొకవైపు సుభాష్ ఉదయం గదిలో నుండి రాగానే కావ్య, రాజ్ లు వెళ్లి విషెస్ చెప్తారు. కావ్య రాజ్ లు సుభాష్ కి చీర ఇచ్చి.. ఇది మీరు తీసుకొని వచ్చానని చెప్పి అపర్ణకి ఇవ్వండని అంటారు. దాంతో సుభాష్ చీర తీసుకొని వెళ్తాడు. రాజ్, కావ్య లు సరదాగా గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారా.. నా చేతిలో మనవడిని పెట్టేది ఉందా లేదా అని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడిని అడగండి అంటూ కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. నీ మనసు లో ప్రేమని బయటపెట్టరా అంటే ఇలా చేస్తున్నావని ఇందిరాదేవి రాజ్ కి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత సుభాష్ అపర్ణని విష్ చేసి తనకి చీర ఇస్తాడు. అపర్ణ సుభాష్ పై కోపంగా ఉన్నా సరే చీరను తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా రాజ్ ని వచ్చి హగ్ చేసుకొని.‌ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత అప్పుని పెళ్లి చేసుకుంటానని ఒకతను వస్తాడు. అతను రెండవ సంబంధం. మంచి సంబంధం తీసుకొని రమ్మంటే ఇలా రెండో సంబంధం.. పైగా రౌడీ ని తీసుకొని వస్తావా అని బ్రోకర్ పై కనకం కోప్పడుతుంది. మీ అమ్మాయి ఆ కళ్యాణ్ తో తిరిగింది.. నేను కాకపోతే ఎవరు చేసుకుంటారని అతను అంటాడు. దాంతో కనకం తిట్టి పంపిస్తుంది ఆ మాటలు అప్పు విని బాధపడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడుతుంటే ధాన్యలక్ష్మి , ప్రకాష్ లు వచ్చి.. నువ్వు ఇలా ఉండకురా నీకు నచ్చింది చెయ్.. మేమ్ ఏం అడ్డుపడమని చెప్తారు. తరువాయి భాగంలో అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజున ఇంట్లో సరదాగా గేమ్స్ ఆడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Sreemukhi : శ్రీముఖి తల్లిపై నెటిజన్ చేసిన ఆ కామెంట్ వైరల్!

  ప్రస్తుతం తెలుగు టీవీ షోలలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ శ్రీముఖి. అల్లరి రాములమ్మగా పాపులర్. బిగ్ బాస్ తర్వాత భారీ ఫాలోయింగ్ తో వరుస షోలలో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు శ్రీముఖితో పాటు వాళ్ళ అమ్మ వైరల్ గా మారింది. అంతలా ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.  శ్రీముఖే ఎనర్జీ లౌడ్ స్పీకర్ అంటే.. ఆమె తల్లి లత శ్రీ అంతకుమించి. లతశ్రీ. సోషల్ మీడియాలో చేసే రీల్స్‌కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాకి కాస్త గ్యాప్ ఇస్తుందేమో కానీ లతశ్రీ అయితే రీల్స్‌‌ను చేస్తూనే ఉంటుంది. శ్రీముఖి వాళ్ళ అమ్మ లతశ్రీ.. రకరకాల గెటప్‌లు వేసి తన డాన్స్‌ తో రచ్చ చేస్తుంది. ఈమెతో పాటు భర్త రామ్ కిషన్ కూడా రీల్స్‌లో జతకలుస్తుంటాడు. వీళ్ళిద్దరు కలిసి రీల్స్‌ చేస్తూ తమ టాలెంట్ చూపిస్తుంటారు. ఎనర్జీలో కూతుర్ని మించే అనేట్టుగా ఈ ఇద్దరూ రీల్స్‌తో చెలరేగిపోతున్నారు. అయితే వీళ్ల రీల్స్ చూసి క్యూట్ అనేవాళ్లు ఉన్నట్టే.. వామ్మో వీళ్లేంట్రా ఇలా ఉన్నారని సెటైర్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్యామిలీ రీల్స్ చేసి బతికేస్తున్నారా అని కామెంట్లు చేసే వాళ్ళున్నారు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఓ రీల్ చేయగా.. మిమ్మల్ని చూస్తుంటే ఓ సామెత గుర్తొస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కి రియాక్ట్ అయిన శ్రీముఖి ఫాదర్.. ఆపేశావేం.. ఆ సామెత ఏంటో చెప్పు అని రిప్లై ఇచ్చాడు. దాంతో ఆ నెటిజన్ ఇలా కవర్ చేసారు. ఈ వయసులో ఉన్నప్పుడు మీరు గానీ మేడమ్ గారు గానీ ఇంత యాక్టివ్ గా ఉన్నారు.. ఇంకా శ్రీముఖిలాగా ఉన్నప్పుడు ఇంకెంత యాక్టివ్ గా ఉన్నారో అంటున్నాను సర్.. నేను శ్రీముఖికి పెద్ద ఫ్యాన్ ని ఇంకా. మీరన్న మేడమ్ గారు అన్నా చాలా ఇష్టమని కవర్ చేశారు. అయితే దానికి శ్రీముఖి ఫాదర్ కౌంటర్ ఇస్తూ.. చెప్పండి చెప్పండి వినాలని ఉందని అంటూ కవర్ డ్రైవ్ వేసిన విషయాన్ని చెప్పమన్నాడు. ఇలా సోషల్ మీడియాలో సెలబ్రిటీల రీల్స్, ఫోటోలకి కామెంట్లు రావడం సాధారణం‌‌.. కానీ ఓ నెటిజన్ కామెంట్ కి శ్రీముఖి ఫాదర్ రియాక్ట్ కావడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. 

విజయ్ చేసిన సాయం మామూలుది కాదు

  విజయ్ దేవరకొండ పేరుకు స్టార్ మాత్రమే కాదు మనసున్న మంచి మనిషి అనిపించుకున్నాడు. రీసెంట్ గా ప్రసారమైన ఇండియన్ ఐడల్ సీజన్3 షోకి గెస్ట్ గా వచ్చాడు రౌడీ బాయ్. ఇదే టైములో విడికి ధన్యవాదాలు చెప్పడానికి కొంతమంది స్టేజి మీదకు వచ్చారు. స్నేహ అనే ఒక  ట్రాన్స్ జెండర్ విజయ్ చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. “నేనొక ట్రాన్స్ జెండర్ ని సార్. రెండేళ్లు  మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. మాకు బెగ్గింగే జీవనాధారం. లాక్ డౌన్ టైంలో అందరం  ఇంటికే పరిమితం అయ్యాం. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాను. ఒకరోజు  గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉండగా  విజయ్ ఫౌండేషన్ అని కనిపించింది. దానిపై క్లిక్ చేసి హెల్ప్ చేయాలంటూ  ఫామ్ ను ఫిల్ చేశాను. అంతే కేవలం  16 నిమిషాల్లోనే నాకు ఫౌండేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నాకే కాదు.. ఇలా 18 మంది ట్రాన్స్ జెండర్స్ కు మీరు సాయం చేశారు. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు” అంటూ  ట్రాన్స్ జెండర్ స్నేహ  కన్నీరు పెట్టుకుంది. అలాగే మరో కుర్రాడు ఫామిలీ కొడాఆ వచ్చి విజయ్ చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. దానికి విజయ్ స్పందించారు.  “ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎంతో మంది రూ. 500, రూ. 1000 రూపాయాలు సాయం చేశారు. వేరే వేరే చోట్ల నుంచి కూడా ఎంతో మంది సాయం చేశారు. ఇంతమంచి మనుషుల మధ్య ఉంటున్నందుకు నిజంగా గర్వపడాలి" అని చెప్పారు.  అలాగే 100 మంది పేద అభిమానుల కుటుంబాలకు కరోనా టైములో  తలా ఒక లక్షచొప్పున సాయం చేశాడు విజయ్. ఇలా విజయ్ చేసిన సాయం ఏంటి అన్న విషయం ఈ షో ద్వారా అందరికీ తెలిసింది.    

యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

  బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా సీరియల్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాటిల్లో బ్రహ్మముడి, కార్తీకదీపం-2, గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం టాప్-5 లో ఉండగా.. కొత్తగా వచ్చిన ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో సీతాకాంత్-రామలక్ష్మీ జోడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ మా టీవీలోని సీరియల్స్ అన్ని ప్రోమోలతో పోలిస్తే ఈ సీరియల్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-50 లో కొనసాగుతుంది. మరి అంతగా ఝ సీరియల్ లో ఏం ఉందంటే... గత జన్మలో సీతని చాటుగా చూసి రామ ప్రేమిస్తాడు. ఆ విషయం సీతకి తెలిసి తనకి కూడా ఇష్టమేనని చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా సీత లేచిపోయి వస్తుంది. స్నేహితుడి సహాయంతో సీతని రామ పెళ్లిచేసుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామనే టైమ్ లో పెళ్లి ఇష్టం లేని సీత వాళ్ళ అన్నయ్య పరువు మర్యాదలే ముఖ్యమని భావించి రామని చంపేస్తాడు. ఆ దిగులుతో సీత కూడా చనిపోతుంది. ఈ జన్మలో మనల్ని విడదీసినా మన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఉంటుందని గత జన్మకీ సంబంధించిన పాత్రలను ముగించారు డైరెక్టర్. ఇక ఈ జన్మకి సంబంధించిన పరిచయంలో.. గత జన్మలో రామగా చనిపోయి ఈ జన్మలో సీతాకాంత్ గా, సీతేమో రామలక్ష్మిగా పుడతారు. సీతాకాంత్ పుట్టిన ఇరవై సంవత్సరాలకి రామలక్ష్మి జన్మిస్తుంది. రామలక్ష్మి సివిల్ సర్వీస్  కోచింగ్ తీసుకుంటుంది‌. దాంతో పాటుగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. రామలక్ష్మికి ఒక తమ్ముడు, చెల్లెలు ఉండగా.. తమ్ముడు కాలేజీ, చెల్లలు స్కూల్ చదువుతుంటారు. ఇక తల్లి వంటింటికి పరిమితం‌.. ఎప్పుడు జాతకాలంటు టీవీ చూస్తు వాటినే ఫాలో అవుతుండే ఓ సాధారాణ గృహిణి.  మాణిక్యం ఎత్తులకి పైఎత్తులు వేస్తుంటాడు.  ఈ సీరియల్ లో సీతాకాంత్ ని పెంచిన అమ్మ శ్రీలత. తనని బాగా నమ్ముతున్న సీతాకాంత్ కి తెలియకుండా సందీప్ కి ఆస్తి దక్కాలని శ్రీలత కపటనాటకం ఆడుతుంటుంది. అది తెలుసుకున్న రామలక్ష్మి..‌ సందీప్, శ్రీలత, శ్రీవల్లిల అంతు చూడాలని చూస్తుంటుంది. అయితే సీతాకాంత్ కి బ్యాక్ గ్రౌండ్ లో సవతి తల్లి శ్రీలత చేసే కుట్రలు తెలియక ఆమెని నమ్ముతాడు. మరి సీతాకాంత్ కి రామలక్ష్మిపై ప్రేమ కలిగేలా, అమ్మ శ్రీలత కపటనాటకం  తెలిసేలా చేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. ఎటో వెళ్ళిపోయింది మనసు కొత్త సీరియల్ అయినప్పటికీ టాప్ సీరియల్స్ తో పోటీ పడుతుంది.   

వారానికి మూడు సార్లు ఓకే అంటున్న అనసూయ..ప్రతీ రోజూ కుదరదు!

  అందం, చలాకీతనంతో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతూనే.. వెండితెరపైనా తళుక్కున్న మెరుస్తూ.. షార్ట్ పీరియడ్‌లోనే స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది అనసూయ. పర్సనల్ ఇన్‌ఫర్మేషన్‌తో పాటు ఫ్యామిలీ అప్‌డేట్స్‌‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఇన్ స్టాగ్రామ్ లో అనసూయకి యమక్రేజ్ ఉంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ఆస్క్ మి క్వశ్చనింగ్ అంటూ మాట్లాడుతుంటుంది అనసూయ. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొందరు నెటిజన్లు.. ఏం తింటారు, వర్కౌట్లు ఎలా చేస్తారు? ఏ ఫుడ్ అంటే ఇష్టం.. ఏ సినిమాలు చేస్తున్నారు.. బుల్లితెరపై ఇక కంటిన్యూగా వస్తారా? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారు. వాటికి అనసూయ సమాధానమిచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారట అని అడుగగా.. అది రిలీజ్ కావాల్సి ఉందని ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరి అనసూయ నటించిన ఆ చిత్రం ఏంటో చెప్పలేదు. ఉస్తాద్, హరి హర వీరమల్లు, ఓజీల్లో ఏదో ఒక చిత్రంలో అనసూయ నటించినట్టుగా అయితే అర్థం అవుతోంది. బుల్లితెరపై రావడం ఆనందంగా ఉందని, ఇక కంటిన్యూగా షోలు చేయమని అభిమానులు రిక్వెస్ట్‌లు చేస్తున్నారు. అందరూ ఇలా తనను బుల్లితెరపై మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తుండటంతోనే మళ్లీ షోలు చేయడానికి బుల్లితెరకి వచ్చానని చెప్పుకొచ్చింది. కానీ తనకు ఇక్కడకు రావడంపై మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.  నాకు వీలైనంత వరకు అందరినీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తానని మాటిచ్చింది. ఇక డైలీ జిమ్ చేస్తారా? అనే ప్రశ్నకు అనసూయ సమాధానమిచ్చింది. ప్రతీ రోజూ చేయాలని ఉంటుంది కానీ కుదరదు.. నా షెడ్యూల్స్, షూటింగ్‌లు.. నా ట్రైనర్ షెడ్యూల్స్ వల్ల ప్రతీ రోజూ చేయడం కుదరదు.. కానీ వారానికి మూడు సార్లు మాత్రం కంపల్సరీగా జిమ్ చేసేందుకు ప్రయత్నిస్తానని అంది. మీ మీద వచ్చే నెగెటివ్ కామెంట్లను ఎలా చూస్తారు? ఎలా తీసుకుంటారు? అని ఓ నెటిజన్ అడిగితే.. నా మీద ఇంకా నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయా? నాకు తెలీదే అని ఆశ్చర్యపోతోన్నట్టుగా అనసూయ సమాధానమిచ్చింది‌.  

Vishnupriya: విష్ణుప్రియ రికార్డింగ్ డ్యాన్సులు!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణుప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు'  యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండేది. ఆ తర్వాత పలు ఫోక్ సాంగ్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. శ్రీముఖి, విష్ణుప్రియ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు.. కానీ చాలా రోజులు కలుసుకోలేదు. ఇక ఇప్పుడు ఇద్దరు ఒకే స్టేజ్ మీద కలిసారు. కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షో కోసం తాజాగా విడుదలైన ప్రోమోలో విష్ణుప్రియ వచ్చింది. ఇందులో బ్రహ్మముడి టీమ్ కావ్య, రాజ్, రాహుల్ వాళ్ళు రాగా.. అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జులుగా శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. రకరకాల డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ప్రోమో నిండిపోయింది. అయితే విష్ణుప్రియ ఎంట్రీపై శ్రీముఖి కౌంటర్లు వేసింది. లేడీస్ అంతా ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అందులో విష్ణుప్రియ తన గెటప్‌లో వచ్చి డ్యాన్స్ చేస్తుంది. విష్ణుప్రియ అలా డ్యాన్స్ చేస్తుంటే.. శ్రీముఖి కౌంటర్ వేసింది. ఏంటి ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు ఆపలేదా? అని సెటైర్ వేసింది. శ్రీముఖి సెటైర్‌కు అక్కడి వారంతా పగలబడి నవ్వేశారు. విష్ణుప్రియ ఏం చేయలేక బిత్తరమొహం వేసుకుని చూసింది. శ్రీముఖి ఇలానే షోలో అందరి మీద తన నోటికి వచ్చినట్టుగా కౌంటర్లు వేస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.  ఇక ఈ షోలో అయితే అనసూయ, శేఖర్ మాస్టర్‌లు కాస్త హద్దులు దాటుతున్నట్టుగానే కనిపిస్తోంది. మరి ఈ షోని ఫ్యామిలీతో‌ కలసి చూడలేనట్టుగా తయారవుతుంది. బిగ్ బాస్ సెలబ్రిటీలతో పాటు సీరియల్ నటులని షోకి తీసుకొచ్చి టీఆర్పీ తెప్పించాలని షో యాజమాన్యం భావిస్తున్నారు. అయితే ఇందులో ఎంటర్‌టైన్మెంట్ కంటే వల్గారిటీ ఎక్కువ ఉండటంతో ఫ్యామిలీతో చూడటానికి ఎవరు ఇష్టపడటం లేదు.   

బాయ్ ఫ్రెండ్‌తో వర్షంలో పోజులు.. ఫేమస్ కోసం చీప్ ట్రిక్స్!

బిగ్‌బాస్ సీజన్ 6 ద్వారా ఆడియన్స్‌‌ను బాగా ఆకట్టుకున్న ఇనయా ప్రేమలో పడిందన్న విషయం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అర్ధమైపోతుంది. తన లవ్‌ను కన్ఫార్మ్ చేసేసినట్టే అనే విషయం తెలుస్తోంది. తన లవర్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకు ఇనయా మెచ్చిన హీరో ఎవరో తెలుసా..తన జిమ్ ట్రైనర్‌ ..అతనితో క్లోజ్‌గా ఉన్న ఓ వీడియోను షేర్ చేసింది. దీనికి హార్ట్ సింబల్స్ ని ఆ వీడియోస్ లో పోస్ట్ చేసింది. అలాగే మంచి హాట్ సాంగ్ ని కూడా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టింది.  ఈ వీడియోలో ఇనయాతో పాటు ఉన్న వ్యక్తి పేరు గౌతమ్. అతనొక జిమ్ అండ్ యోగా ట్రైనర్. కొన్ని రోజులుగా ఇనయా గౌతమ్‌తో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. గౌతమ్ తన అన్ని వీడియోస్ లో కూడా తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూనే కనిపించాడు. ఐతే ఇనయా అతనికి అతుక్కుపోయి మరీ కనిపించింది. ఇక వర్షంలో రైన్ కోట్స్ వేసుకుని బండి మీద జాంజాంగా వెళ్తూ డాన్స్ లు చేస్తూ చాలా వీడియోస్ ని పోస్ట్ చేసింది. "మెల్లగా సన్నీలియోన్ ల మారిన ఇనాయ. ఫేమస్ కావడం కోసం ఇలాంటి చీప్ పిక్స్ పెట్టకండి" అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.

20 ఎకరాలకోసం నైట్‌కి ఓకే అన్న జబర్దస్త్ వర్ష

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కామెడీ ఎంత ఉందో తెలీదు కానీ అద్భుతమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఐతే టపటపా పేలిపోతున్నాయి. కొత్తగా వస్తున్న ఒక లేడీ టీమ్ ఇప్పుడు అలాంటి డైలాగ్స్ ని  ఈ షోలో చెప్పి కెవ్వు కేక పుట్టించారు. "ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చలాన్ పంపించారు ఓవర్ స్పీడ్ కి" అని భార్య డైలాగ్ వేసేసరికి .."అసలు నేను బైకే నడపలేదు కదవే" అంటూ భర్త చెప్తాడు. దానికి భార్య సిగ్గుమొగ్గలైపోతూ "అబ్బబ్బా వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కి కాదండి మీ స్పీడ్ కి" అంటూ కాలర్ పట్టుకుని మీదకు లాక్కునేసరికి భర్త సిగ్గుపడిపోయాడు. ఇక తర్వాత శ్రీదేవి అండ్ టీం వచ్చింది "ఏవండీ సూర్యుడు ఇప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తున్నాడా అండి" అని అడిగేసరికి "అవునే నీకెందుకు ఆ డౌట్ వచ్చింది" అని భర్త అన్నాడు. "అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండీ" అని భార్య సిగ్గుపడిపోతూ కులుకుతూ చెప్పింది. తర్వాత వర్ష అండ్ టీమ్ వచ్చింది. "ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయాక నన్ను అదోలా చూస్తున్నాడు" అని తన భర్తతో చెప్పేసరికి వెంటనే అతను అజర్ ని బయటకు పిలిచి "ముల్లొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముల్లుకే నష్టం " అనేసరికి వర్ష సిగ్గుపడిపోతూ ముఖం మీదకు చున్నీ కప్పేసుకుంది. ఇమ్యాన్యుయెల్ పెద్ద భూస్వామి, ఆయనకు ఒక కొడుకు అజార్. ఆయనకు 20 ఎకరాలపైన ఉంది. మా నాన్నకు నాకు పెళ్లైంది, కొడుకు ఉన్నాడని అబద్ధం చెప్పాను అని వర్ష‌కు భర్తగా నటిస్తున్న రియాజ్‌కు చెప్తాడు. దీంతో ఇరవై ఎకరాలు ఇస్తానంటే, అజార్‌కు భార్యగా నటించమని వర్షను ఒప్పిస్తాడు. దీంతో రియాజ్ వర్ష, అజార్‌కు కొడుకుగా, వారిద్దరు భార్యభర్తలుగా నటిస్తారు. ఈ క్రమంలో అజార్‌కు తండ్రి ఇమ్మాన్యుయెల్ శోభనం ఏర్పాటు చేయడంతో రియాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రియాజ్ ఇమ్మాన్యుయెల్‌ని శోభనం ఎవరికీ అని అడగ్గా మీ అమ్మనాన్నకు అని చెప్పడంతో అక్కడున్నవారందరూ తెగ నవ్వుతారు.  అసలే సోషల్ మీడియా అంతా గందరగోళంగా ఉంది. కొన్ని రోస్ట్ ఛానెల్స్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైములో ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉన్న ఇలాంటి షోస్ కూడా పిల్లల మీద ఎంతో ఎఫెక్ట్ చూపిస్తాయి. నెటిజన్స్ కూడా ఇదే విషయాన్ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. కామెడీ తగ్గిపోతుంది చూడండి..డబుల్  మీనింగ్  జోక్స్ తో  ఫేమస్ అవుతున్నారు అందరు" అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఈ షో ఎక్కువ కాలం ఉండాలి అంటే మేకర్స్ కొంత డీసెన్సీ పాటించాల్సిందే అని నెటిజన్స్, ఆడియన్స్ ఇన్డైరెక్ట్ గా చెప్తున్నారు.

Karthika Deepam2 : కార్తిక్ జపం చేస్తున్న శౌర్య.. వాళ్ళిద్దరి పెళ్ళికి ముహుర్తం ఫిక్స్ కానుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -92 లో.... కార్తీక్ అంటూ ప్రతిసారి దీపని శౌర్య అడుగుతు విసిగిస్తుంది. నువ్వు అలా కార్తీక్ అనకు అని దీప అనగానే.. మరి ఇప్పుడు మనం కార్తీక్ దగ్గరకి వెళ్తున్నామా అని శౌర్య అడుగుతుంది. లేదు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండమని శౌర్యతో దీప అంటుంది. నీపై గట్టిగా అరవలేను.. బాధపెట్టలేనని దీప తనలో తాను అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ ఎక్కడ అని శ్రీధర్ అడుగుతాడు. ప్రొద్దున వెళ్ళాడని కాంచన అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావంటూ అంటూ అడగలేదా అని శ్రీధర్ అంటుండగా.. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. కాసేపటికి కార్తీక్ కూడా వస్తాడు. దీప దొరికిందా బావ అని జ్యోత్స్న అడుగుతుంది. లేదని కార్తీక్ అంటాడు‌. దీప ఇల్లు కాళీ చేసి వెళ్ళిపోయిందని శ్రీధర్ వాళ్ళకి జ్యోత్స్న చెప్తుంది. అదేంటీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిందని శ్రీధర్ అంటాడు. శౌర్యకి ఫీవర్ గా ఉంటే రాత్రి దీప తనని తీసుకొని హాస్పిటల్ వెళ్ళింది. నాకు కాల్ చేస్తే వెళ్లనని కార్తీక్ అంటాడు. అదేంటో మా ఇంట్లో మనిషి కన్పించకపోతే నిన్ను అడగవలసి వస్తుంది.. ఎందుకు అంటే తన బాధ్యత నువ్వు తీసుకున్నావ్ గనుక.. దీప కన్పిస్తే చెప్పు బావ అంటూ జ్యోత్స్న వెళ్ళిపోతుంది. మరొకవైపు దీప వంట చేస్తు.. మీ వాళ్లే మాకు ఇలాంటి సిచువేషన్ వచ్చింది బాబు అంటూ కార్తీక్ అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. మేమ్ ఇక్కడున్నట్టు కార్తీక్ బాబుకి తెలియదు ఒకవేళ తెలిస్తే వచ్చేవాళ్ళని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ అంటూ గోడకి పేరు రాసి మాట్లాడుకుంటుంది శౌర్య. అది చూసిన దీప షాక్ అవుతుంది. మరొకవైపు సుమిత్ర వాళ్ళు దీప గురించి మాట్లాడుకుంటుంటారు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న అక్కడికి వెళ్తారు. మీరు దీపని ఏమైనా దీప అన్నారా అని  పారిజాతాన్ని సుమిత్ర అడుగుతుంది. ఇది బాగుంది నేను ఎందుకు అంటాను. అవసరం కోసం వచ్చింది.. పని ఉంటే వెళ్ళిపోయిందని పారిజాతం అంటుంది. ఇదంతా పక్కన పెట్టి జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి కి ముహూర్తం పెట్టాలని పారిజాతం అనగానే.. సరే ఈ రోజు వెళ్లి కాంచనతో మాట్లాడండి అంటూ శివన్నారాయణ అంటాడుమ ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న లు దీపని వెతకడానికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : వాళ్ళ ప్లాన్ సక్సెస్.. అవును వాడు అమ్మ పిచ్చోడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -144 లో....రామలక్ష్మి, సీతాకాంత్ లు సరదాగా ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్లి వస్తుంటారు. అప్పుడే పెద్దాయన చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు ఎప్పటికి ఇలాగా హ్యాపీగా ఉండాలి. మీరు కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. అపార్థం తర్వాత ఒకటైన బంధం బలంగా ఉంటుందని పెద్దాయన చెప్తాడు. ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలని పెద్దాయన అంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సీతాకాంత్, రామలక్ష్మిలని శ్రీవల్లి చూసి వెంటనే వెళ్లి శ్రీలత, సందీప్ లకి వాళ్ళు వచ్చారని చెప్తుంది. ఆ తర్వాత ఇక యాక్టింగ్ మొదలు పెట్టమని సందీప్ కి శ్రీవల్లి చెప్తుంది. శ్రీవల్లి కావాలనే గట్టిగా అరుస్తు.. ఏవండీ డోర్ తీయండని అంటుంది. ఆ మాటలు విన్న సీతాకాంత్ వాళ్ళు.. ఏమైంది అంటూ ఫాస్ట్ గా వస్తారు. చాలా సేపటి నుండి డోర్ తియ్యడం లేదని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తుంది. అప్పుడే ఏం తెలియన్నట్టు శ్రీలత వస్తుంది. డోర్ తీయడం లేదని శ్రీవల్లి చెప్తుంది. సీతాకాంత్ పక్కన కిటికీ నుండి చూస్తాడు. లోపల సందీప్ తాడుతో ఉరేసుకొనే ప్రయత్నం చేస్తాడు. అగురా అని సీతాకాంత్ అంటాడు. నేను తప్పు చేశాను బ్రతికే హక్కు లేదని సందీప్ యాక్ట్ చేస్తుంటాడు. సీతాకాంత్ డోర్ పగలగొట్టుకొని వెళ్లి సందీప్ ని ఆపుతాడు. ఏంటి ఈ పిచ్చి పని అని సందీప్ పై అరుస్తాడు. మీ పరువు తీసాను తప్పు చేశానని సందీప్ అంటాడు. తప్పు చేస్తే ఇలా చేస్తారా అని శ్రీలత అంటుంది. నేను బయటకు వెళ్లి ఏం పని చేసుకొని బ్రతికినా.. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. అందరికి నేను దొంగతనం చేస్తే ఇంట్లో నుండి గెంటేసారని చెప్పనా అని సందీప్ అంటాడు. ఏదో కోపంలో అలా అన్నాను కానీ నువ్వు వెళ్తుంటే ఆపేవాడిని. అంతెందుకు మీ వదినే ఆపేదని సీతాకాంత్ అంటాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత సందీప్, శ్రీలత శ్రీవల్లి లు ప్లాన్ సక్సెస్ అంటూ నవ్వుకుంటుంటే అప్పుడు రామలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ సందీప్ గురించి బాధ పడుతంటే.. మీరు ఇంతగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని రామలక్ష్మి అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సందీప్ ని సీతాకాంత్ తో మాట్లాడి జనరల్ మేనేజర్ చేయాలని శ్రీలత అనగానే.. ఇన్ని తప్పులు చేసినా ఆయన్ని జనరల్ మేనేజర్ చేయడానికి బావగారు ఏమైనా పిచ్చోడా అని శ్రీవల్లి అనగానే.. అవును అమ్మ పిచ్చోడని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరు.. నిజంగా మీ మనవడేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1122 లో.....అనుపమ మా అన్నయ్య ముందే వదినని అడిగింది. ఇంకోసారి తన జోలికి తన కొడుకు జోలికి రావద్దు అంది. అన్నయ్య కూడా వదినకి వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాదు నీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా చూడమన్నాడని మనుతో మహేంద్ర అంటాడు. బావ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది అత్తయ్య.. నిజం చెప్తేనే కదా అని ఏంజిల్ అంటుంది. ఇక తన ఇష్టమని మహేంద్ర అంటాడు. అప్పుడే అనుపమకి ఫోన్ వస్తుంది. అవతల వ్యక్తి అనుపమతో.. నువు నీ కొడుకుని తీసుకొని సిటీ వదిలేసి వెళ్ళపో లేదంటే ఇన్నాళ్లుగా దాస్తున్న నీ కొడుకు ప్రశ్నకి నేను సమాధానం చెప్తానని అంటారు. దాంతో ఎవరు మీరని అనుపమ అడుగగా‌‌.. ఫోన్ కట్  చేస్తారు. దాంతో అనుపమ టెన్షన్ పడుతుంటుంది. ఏమైందని మహేంద్ర అడుగగా.. ఏం లేదని అనుపమ చెప్తుంది. ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పమని మహేంద్ర అంటాడు. మరొకవైపు పెద్దావిడకి సరోజ భోజనం వడ్డిస్తుంటే.. అప్పుడే రంగా వస్తాడు. మేడన్ రాలేదా అంటూ వసుధారని పిలుస్తాడు. వసుధార రాగానే భోజనం చెయ్యమని అంటాడు. నాకు ఆకలిగా లేదని వసుధార అనగానే.. కొంచెం తినండి అని రంగా రిక్వెస్ట్ చేస్తాడు. పదంతో వసుధార సరే అంటుంది. సరోజ కావాలనే ప్లేట్ లో వాటర్ పోసి చూసుకులేదని అంటుంది. మేడమ్ కి సారి చెప్పమని రంగా అనగానే.. నేను చెప్పనని సరోజ అంటుంది. నేను వడ్డించనని సరోజ అనగానే.. ఎన్నో సార్లు బాధపడ్డాను ఇలా భోజనం దగ్గర అవమానం జరిగితే ఎలా ఉంటుందంటూ వసుధార కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదంటూ  సరోజపై రంగా కోప్పడతాడు. ఆ తర్వాత రంగా భోజనం తీసుకొని.. వసుధార దగ్గరకి వెళ్తాడు. భోజనం చెయ్యమని అడుగుతాడు. నేను చెయ్యనని వసుధార అంటుంది. ఆ తర్వాత రేపు నాతో వస్తారా అని వసుధార అనగానే.. సరే వస్తాను. నిన్ను మీ ఇంటిదగ్గర దిగపెడతానని రంగా అంటాడు. మీ డాడ్ మిమ్మల్ని గుర్తుపడతారు.. అప్పుడు తెలుస్తుందని వసు అంటుంది. ఆ తర్వాత రంగా దగ్గరకి సరోజ వస్తుంది. రేపు మేడమ్ వెళ్లిపోతున్నారని అనగానే.. సరోజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనే వెళ్లి దింపి వస్తానని రంగా చెప్తాడు. మరొకవైపు అనుపమకి ఒకతను ఫోన్ చేసి.. నువ్వు వెళ్ళిపోకుంటే అందరికి మహేంద్రనే మను తండ్రి అని చెప్తాను అని బ్లాక్ మెయిల్ చేయగానే.. అనుపమ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత సరోజ వసుధార దగ్గరకి వచ్చి.. వెళ్లిపోతున్నావంట కదా అంటుంది. రిషి సర్ ని అక్కడే ఉంచేసుకుంటా అని వసుధార అనగానే.. సరోజ టెన్షన్ పడుతుంది. నువ్వు వెళ్ళేటప్పుడు నా గుర్తుగా నేనొక గిఫ్ట్ ఇస్తానని సరోజ అంటుంది. ఆ తర్వాత వసుధార పెద్దావిడ దగ్గరికి వెళ్లి.. రంగా అసలు మీ మనవడేనా అని అడుగుతుంది. దాంతో ఆవిడ తడబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: నీకు కూతురు ఉంటే ఇలానే చేస్తావా.. మ్యారేజ్ డే రోజు సర్ ప్రైజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -457 లో... అనామిక అన్న మాటలు కార్తిక్ గుర్తుకుచేసుకుని బాధపడుతుంటాడు. తనకి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా మంటల్లో వేసి కాల్చేస్తాడు. అది చూసిన కావ్య.. కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. నీ బాధని ఇలాగైనా తగ్గించుకోమని సలహా ఇస్తుంది. కళ్యాణ్ ని కావ్య భోజనానికి పిలవగా.. నేను రాను వదిన అని అంటాడు. నువ్వు మాకోసం ఇప్పుడు భోజనం చేయాలని కళ్యాణ్ ని కావ్య రిక్వెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. కళ్యాణ్ డల్ గా ఉంటాడు. తినరా అని ధాన్యలక్ష్మి అంటుంది. నీ తప్పేం లేదని తెలిసింది కదరా.. ఇదంతా ఒక పీడకల అని మర్చిపోమని అపర్ణ అంటుంది. విడాకులు అయ్యాయని ఎవరు బాధపడడం లేదు. అలాంటిది నీ లైఫ్ లో లేకపోవడమే మంచిదని ఇందిరాదేవి అంటుంది. అనామిక దూరం అయిందని కళ్యాణ్ బాధపడడం లేదు. తన వల్ల అప్పు కి బ్యాడ్ నేమ్ వచ్చిందని బాధపడుతున్నాడని రుద్రాణి అనగానే.. అందరు తనపై విరుచుకుపడుతారు. నిజమేనా కళ్యాణ్ అని కళ్యాణ్ ని ధాన్యలక్ష్మి అడుగుతుంది. తప్పేంటి ఇన్నిరోజులు అని అని అనామిక వెళ్లిపోయింది. ఇక నువ్వు అంటున్నావా అని కళ్యాణ్ కోప్పడుతాడు. నీకు బుద్ది లేదా అని ధాన్యలక్ష్మిని తిడతాడు ప్రకాష్. ఇప్పుడు నేనేం అన్నాను.. అప్పు వల్లే కదా వాళ్ళు విడిపోయారని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పు వల్ల కదా నీ వల్లే.. అనామిక మొదట నా గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నా కొడుకు అలాంటివాడు కాదని అంటే ఇంత దూరం వచ్చేది కాదని కళ్యాణ్ అనగానే.. నేనేం చేశాను వద్దన్న దాన్ని వెంటేసుకొని తిరిగావని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక ఆపు.. తన పరువు తీసి తన ఇంటికి వెళ్లి వాళ్ళను అవమానించారు. తను ఒక ఆడపిల్ల.. అందరు నీ కూతురు హోటల్లో దొరికింది అంటే వాళ్లకు ఎలా ఉంటుంది. ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడకని ధాన్యలక్ష్మికి కళ్యాణ్ చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి కావ్య వచ్చి.. ఆవేశం తగ్గించుకో అప్పుకు సపోర్ట్ గా మేమ్ ఉన్నామని అంటుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడని రాజ్ అడుగుతాడు. కోపంగా ఉన్నాడు.. ఒకవేళ అప్పు సంతోషంగా ఉందని చెప్తే వాడు హ్యాపీగా ఉంటాడేమోనని రాజ్ అంటాడు. అప్పు హ్యాపీగా ఉండేలా చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత రేపు అమ్మనాన్నల పెళ్లి రోజు అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య, రాజ్ లు చీర తీసుకొని వచ్చి శుభాష్ కి ఇచ్చి అపర్ణకి ఇవ్వమంటారు. సుభాష్ చీర ఇవ్వగానే అపర్ణ తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వందేళ్లు బతుకు సీతక్క

  ధనసరి సీతక్క గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. చాలా ఇన్స్పిరేషనల్ విమెన్ . అంటే ఎంత తక్కువగా మాట్లాడి ఎంత ఎక్కువ పని చేయాలి అనేది ఈమెకు తెలిసినంత ఇంకెవరికీ తెలీదు. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె రెండు తెలుగు రాష్టాల్ర ప్రజలకు సుపరిచితమే. తెలంగాణ రాజకీయాల్లో సీతక్కది ప్రత్యేక స్థానం. విద్యార్థి దశ నుంచే పోరాటం మొదలుపెట్టి  దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసిన ధీశాలి. ఐతే తర్వాతి కాలంలో అక్కడ మారిన సిద్దాంతాలు పొసగక బయటికి వచ్చేసి రాజకీయాల్లో చేరారు.  15ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం చేసిన మాజీ నక్సలైటు సీతక్క.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. అలాంటి సీతక్క పుట్టిన రోజునాడు రచ్చ రవి విషెస్ చెప్పాడు. సీతక్క దగ్గరకు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. "బంగారు మనసున్న మా అక్క మంత్రివర్యులు సీతక్కకు జనం దిన్ ముబారక్ ..సౌవ్ సాల్ చల్లగా బతుకు అక్క" అంటూ సీతక్కతో దిగిన ఫొటోస్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. బుల్లితెర మీద రచ్చ రవిది డిఫరెంట్ స్టైల్. ఎవరి పుట్టినరోజు ఐనా కూడా వెళ్లి వాళ్లకు విషెస్ చెప్తాడు. అలాగే వాళ్ళతో ఉన్న ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాడు. అంటే ఈ రోజుల్లో ఎవరూ పుట్టినరోజులు వంటివి అసలు పట్టించుకోవడమే లేదు. కానీ రచ్చ రవి మాత్రం అందరి పుట్టినరోజులు తెలుసుకుని కచ్చితంగా వాళ్లకు విషెస్ చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు.

కండలున్న అబ్బాయి కోసం శ్రీముఖి వెయిటింగ్ అంట

  కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ షో విలేజ్ థీమ్ పేరుతో రాబోతోంది. ఇందులో శ్రీముఖి ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వేసింది. ఏంటో ఈ వారం అన్ని షోస్ కూడా రెండర్థాల తెలుగు డైలాగ్స్ లేకుండా లేవు. శ్రీముఖి అంబటి అర్జున్ తో ఆ డైలాగ్ అనేసింది " నాకేమో ఇలాంటి కండ ఉన్న అబ్బాయి ఉంటే ఒక్కసారి నన్ను వెనక నుంచి ఎత్తుకుంటే బాగుండు అనిపిస్తుంది.. ఎత్తుకోవచ్చుగా" అని దీర్ఘం తీసేసరికి "వచ్చేయ్" అంటూ అర్జున్ శ్రీముఖిని ఎత్తేసుకున్నాడు. ఇక పొతే లాస్ట్ లో ఒక గేమ్ షో నడిచింది. అందులో శ్రీకర్ కి పల్లవికి మధ్య గొడవ జరిగింది. శ్రీకర్ జడ్జ్ అనసూయ చూసి "జడ్జ్మెంట్ ఇవ్వండి" అనేసరికి "శ్రీకర్ నీ పని నువ్వు చూసుకో" అంది. "నేను అదే చేస్తున్నా" అనేసరికి " కాదు నువ్వు అలా చేయడం లేదు. నువ్వు జడ్జ్ ని ప్రశ్నిస్తున్నావ్..నేను మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడతా" అంది. " నేను రిక్వెస్ట్ చేస్తున్నా" అని శ్రీకర్ మళ్ళీ అనేసరికి "నీకు ప్రశ్నించే ఎలాంటి రైట్ లేదు" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసరికి అందరూ షాకైపోయారు. అసలక్కడ అంత సీరియస్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందన్నది ఎవరికీ అర్ధం కాలేదు. ఇక ఈ షో ప్రోమో చూసిన నెటిజన్స్ ఐతే ఫుల్ ఫైర్ అవుతున్నారు. "ఇలాంటి షోస్ వల్ల చిన్నపిల్లలా పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అనసూయ ఎందుకు అంత గట్టిగా మాట్లాడ్డం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Karthika Deepam2 : కార్తిక్ కి దూరంగా వెళ్తున్న దీప.. వెళ్ళిపోమన్నారా అమ్మ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -91 లో... శౌర్యని డిశ్చార్జ్ చేసుకొని కడియం దగ్గరికి వస్తుంది దీప. నేను ఎక్కడ ఉన్నాను.. ఏంటి అని ఎవరికీ తెలియకుండా ఉండాలనుకుంటున్నాను.. నువ్వు ఎవరికీ చెప్పకూడదని దీప అనగానే.. నా జీవితం బాగు చేసి ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావ్ ఏంటమ్మ అని కడియం అంటాడు. నా చిట్కాలు మొత్తం తెలుసుకున్నావ్ .. ఇప్పుడు హోటల్ కి కస్టమర్స్ బాగా వస్తున్నారు.. ఇంకేంటి ఇక నా అవసరం హోటల్ కి లేదు బాబాయ్ అని దీప అంటుంది. నాకు పని ఇచ్చి హెల్ప్ చేసావ్.. ఇంకొక హెల్ప్ చెయ్యాలి ఇక్కడ ఏదైనా ఇల్లు అద్దెకి చూడమని దీప అనగానే.. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉందని  దీప, శౌర్యలని తీసుకొని కడియం ఆ ఇంటికి వెళ్తాడు. అప్పుడే కడియంకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. దీప తన దగ్గరికి వచ్చినట్టు కార్తీక్ కి చెప్పొద్దని దీప అంటుంది. దాంతో కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కడియం. దీప అక్కడకి ఏమైనా వచ్చిందా అని కార్తిక్ అడుగగా.. లేదు రాలేదని కడియం అంటాడు. ఒకవేళ వస్తే నాకు ఫోన్ చెయ్యండని కార్తీక్ చెప్పగానే కడియం సరేనంటాడు. మరొకవైపు జ్యోత్స్న డల్ గా ఉండడంతో.. ఏమైందని పారిజాతం అడుగుతుంది. ఏం లేదని జ్యోత్స్న అనగానే.. ఏం లేకపోతే ఎందుకు దిగులుగా ఉన్నావని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తుంది. కార్తీక్ అన్న మాటలకి పారిజాతం షాక్ అవుతుంది. ఇక దీప వెళ్ళిపోయింది హ్యాపీగా ఉండొచ్చని జ్యోత్స్న అంటుంది. ఎందుకు ఇలా తెలివి తక్కువగా ఆలోచిస్తావ్.. శౌర్యని కూతురు అన్నవాడు.. దీపని భార్య అని చెప్పలేడా.. శత్రువుని పక్కన పెట్టుకోవాలి.. మిత్రడుని ఎదరుగా పెట్టుకోవాలి.. ఆ దీపని పక్కన పెట్టుకుంటే తన ప్రతి పని, ప్రతీ ఆలోచన మనకి తెలుస్తుంది.  ఇప్పుడు దీప ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకొని రావాలని పారిజాతం చెప్తుంది. మరొకవైపు కార్తీక్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది దీప.  కార్తీక్ కి మనం ఇక్కడున్నామని చెప్పాలి.. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుండి ఎందుకు వచ్చాం.. వాళ్లు వెళ్లిపొమ్మన్నారా అని దీపతో శౌర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భార్య అలక తీర్చిన భర్త.. అత్త మరో ఎత్తుగడ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -143 లో.. నువ్వు సీతాకాంత్ భార్యవి అని మురిసిపోతున్నావ్ కానీ నిన్ను మనస్ఫూర్తిగా సీతా పెళ్లి చేసుకున్నాడా.. కనీసం మీ పెళ్లి విషయం నలుగురికి అయిన తెలుసా.. నా భార్య అని ఎవరికి అయినా పరిచయం చేశాడా అని రామలక్ష్మితో  శ్రీలత అంటుంది. ఇప్పుడేంటి సీతాకాంత్ సర్ భార్యని కాదు.. నేను ఎవరికి తెలియదన్న భ్రమలోనే ఉన్నావా.. సరే నీ భ్రమ నేను పోగొడతాను కదా అని రామలక్ష్మి అంటుంది. అమ్మ ప్రేమ అనే బ్రహ్మస్త్రం.. నా దగ్గర ఉన్నంత కాలం నువ్వు నన్ను ఏం చెయ్యలేవని శ్రీలత అంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తుంటే.. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. నాకు తెలుసు రామలక్ష్మి అందరు నిన్ను దొంగ అంటుంటే నువ్వు ఎంత బాధపడ్డావో కానీ నేనేం మాట్లాడలేని సిచువేషన్ లో ఉన్నానని సీతాకాంత్ అంటాడు. అప్పుడే సిరి, పెద్దాయన వస్తారు. అవును వదిన నువ్వేం అనుకుంటున్నావోనని అన్నయ్య చాలా బాధపడ్డాడని సిరి అంటుంది. నువ్వు ఒంటరిగా వెళ్తే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందని నన్ను సీతా వెనకాలే పంపించాడని పెద్దాయన రామలక్ష్మికి చెప్తాడు. సీతాకాంత్ రామలక్ష్మికి సారీ చెప్తాడు. అయిన రామలక్ష్మి మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నువ్వేం బాధపడకురా తనే నిన్ను అర్థం చేసుకుంటుందని సీతకాంత్ తో పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. చేతికి ఇవ్వకుండా టేబుల్ పై పెట్టి వెళ్తుంది. నాకు చేతికి ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదంటే తనకి నాపై ఎంత కోపం ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. మళ్ళీ రామలక్ష్మి వచ్చి పాలు తీసుకొని సీతకాంత్ కి ఇస్తుంది. వద్దని అనగానే.. మీరు రోజు పాలు తాగి పడుకుంటారు కదా అని రామలక్ష్మి అనగానే.. నీ కంటే బాగా నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు రామలక్ష్మి.. ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నానో చెప్పాను కదా నీ కంటే ఎక్కవ నేనే బాధ పడ్డానని సీతాకాంత్ అంటాడు. నేను మీతో మాట్లాడను.. అలిగానని రామలక్ష్మి అంటుంది. అలక మనాలంటే ఏం చెయ్యాలని సీతాకాంత్ అంటాడు. నాకు ఐస్ క్రీమ్ కావాలని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ని సీతాకాంత్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. రామలక్ష్మి ఐస్ క్రీమ్ కింద పడిపోతే సీతకాంత్ ఐస్ క్రీమ్ తీసుకొని రామలక్ష్మి తింటుంది. మరొకవైపు సందీప్ ఇంట్లో నుండి వెళ్లి పోకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలంటూ సందీప్ , శ్రీవల్లిలకి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.