Karthika Deepam2 : శౌర్య కావాలని నోటీసులు పంపిన నరసింహా.. దీప ఏం చేయనుంది?

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(karthika depam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -112 లో....దీప హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే జ్యోత్స్న తనతో గొడవ పెట్టుకుంటుంది. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడకంటు జ్యోత్స్నకి సుమిత్ర చెప్తుంది. నీకు మా బావనే అంటే మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తుందని జ్యోత్స్న పూర్తిగా దీపని అపార్థం చేసుకుంటుంది. సుమిత్ర కోప్పడగా జ్యోత్స్న వెళ్ళిపోతుంది. నువ్వు నా పెద్ద కూతురు.. జ్యోత్స్న నా చిన్న కూతురు. అది ఉన్న సిచువేషన్ అర్థం చేసుకో దాని మాటలు పట్టించుకోకని దీపతో సుమిత్ర అంటుంది. మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నారని దీప ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్ళగానే శ్రీధర్ తనపై కోప్పడతాడు. మీ అమ్మ కళ్ళు తిరిగిపడిపోయింది ఫోన్ చేశా అయిన పట్టించుకోలేదు. నీకు ఆ పాప అంత ఎక్కువ అయిందా అని అడుగుతాడు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాపైన మీకు నమ్మకం లేదా ఉంటే ఇలా చెయ్యరు.. మీకు తల వంపులు తెచ్చే పని ఎప్పుడు నేను చెయ్యనంటూ కార్తీక్ లోపలికి వెళ్తాడు. ఏంటి అండి మీరు ఆలా మాట్లాడారు.. వాడు భోజనం చేసాడో లేదో అని కాంచన కార్తీక్ వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత నరసింహా కోర్టు ద్వారా శౌర్యని తెచ్చుకోవాలని అనసూయకి చెప్తాడు. అలా వద్దని అనసూయ చెప్పినా కూడా నరసింహా లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత నరసింహ లాయర్ దగ్గరికి వెళ్లి నా భార్య వేరొకడితో సంబంధం పెట్టుకొని నా కూతురిని సరిగ్గా చూసుకోవడం లేదు.. అందుకే నా కూతురు నాకు కావాలని లాయర్ కి చెప్తాడు నరసింహా. లాయర్ సరే డబ్బులు రెడీ చేసుకోమని చెప్తాడు. అలాగే నువ్వు గెలిచేలా సాక్ష్యం రెడీ చేసుకోమని చెప్తాడు. సాక్ష్యం అంటే దీప, కార్తీక్ లకి సంబంధం ఉన్నట్లు నిరూపించాలా అని నరసింహ అనుకుంటాడు. మరొకవైపు దీపకి కోర్టు నుండి నరసింహ పంపిన నోటీసులు వస్తాయ్.‌ అవి ఏంటి అర్ధం కాక దీప సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న మనసు అత్తయ్య పూర్తిగా పాడుచేస్తుంది వెంటనే అత్తయ్యని ఇక్కడ నుండి పంపాలని దశరత్ తో సుమిత్ర అంటుంది. జ్యోత్స్న తో నెగటివ్ గా మాట్లాడుతున్న పారిజాతం దగ్గరికి సుమిత్ర, దశరత్ లు వస్తారు. పిన్ని మీరు కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. అప్పుడే దీప నోటీసులు తీసుకోని వచ్చి ఇవేంటి అంటూ సుమిత్రకి చూపిస్తుంది. శౌర్య కావాలని నరసింహా నోటీసులు పంపాడని సుమిత్ర చెప్తుంది. అప్పుడు కూడా పారిజాతం దీప బాధపడేలా మాట్లాడుతుంది. నా కూతురు నా నుండి దూరం కాకుండా చుడండి అని సుమిత్ర, దశరత్ ల కాళ్ళు పట్టుకుంటుంది దీప. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.. నువ్వు కంగారుపడకంటు ఇద్దరు దీపకి ధైర్యం చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలని చూశారు.. పోలీసులని ఆశ్రయించిన నమిత!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -164 లో....నమిత కాన్ఫరెన్స్ రూమ్ కి సీతాకాంత్ పిలిచి.‌. నా భర్త వచ్చాడూ కానీ ఏం మారలేదు సర్ నన్ను కొట్టాడంటూ దెబ్బలు చూపిస్తుంది. వాడికి నేను బుద్ది చెప్తానని సీతాకాంత్ అంటాడు. అవసరం లేదు సర్ నా బతుకు నేను బతుకుతాను. మీలాంటి వారి చూపు నాపైన ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చినట్లే, మీ మనసులో స్థానం ఇస్తారా అని నమిత సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది. దాంతో నమితని దూరంగా నెడతాడు సీతాకాంత్. నువ్వు ఇలాంటి దానివనుకోలేదు.. నా ఆఫీస్ నుండి వెళ్ళిపోమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నమిత తన డ్రెస్ చింపుకొని నన్నేం చెయ్యొద్దు సర్ అంటూ అరుస్తుంటే.. అందరు వస్తారు. సర్ నాపై ఇష్టంతో ఇక్కడికి రప్పించుకున్నారు.. నన్ను బలవంతం చెయ్యబోయారని నమిత చెప్తుంది. తను చెప్పేది అబద్ధం.. నా భర్త తనని టార్చర్ చేస్తున్నాడంటే నేను నీ భర్తతో మాట్లాడుతా అన్నానని సీతాకాంత్ అంటాడు. నమితకి పెళ్లి కాలేదు.. అయిన ఒక ఆడపిల్ల అలా చెప్పుకోదు.. ఇంట్లో భార్యని పెట్టుకొని ఇదేం పని అని సందీప్ అంటాడు. మా బాస్ అలాంటివాడు కాదని ఎంప్లాయిస్ అంటారు. నన్ను ఇలా టార్చర్ చేసినందుకు మీకు బుద్ది వచ్చేలా చేస్తానంటూ నమిత వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇంట్లో పూజ చేస్తుంటారు. ఆ తర్వాత సందీప్ ఇంటికి వచ్చి శ్రీలతకి సైగ చెయ్యగానే పక్కకి వెళ్తుంది. మన ప్లాన్ సక్సెస్ అంటూ సందీప్ అనగానే శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పూజ పూర్తి అవుతుంది. సీతాకాంత్ డల్ గా ఇంటికి వస్తాడు. ఏమైంది అలా ఉన్నారని రామలక్ష్మి అడుగుతుంది. వర్క్ చేసి అలసిపోయాడని శ్రీలత అంటుంది. రామలక్ష్మికి బొట్టు పెట్టమని శ్రీలత అనగానే సీతాకాంత్ బొట్టు పెడుతుంటే.. అప్పుడే పోలీసులు వస్తారు. ఏంటి ఇలా వచ్చారని అడుగగా.. మిమ్మల్ని అరెస్ట్ చెయ్యడానికి అని పోలీసులు చెప్తారు. అయన ఏం తప్పు చేసారని అరెస్ట్ చేస్తారని రామలక్ష్మి అంటుంది. అప్పుడే నమిత వచ్చి నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలని ట్రై చేశారు.. నా జీవితం నాశనం చెయ్యాలని ట్రై చేశారని నమిత అనగానే.. అబద్ధమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : రిషి ఎంట్రీ మాములుగా లేదుగా.. షాకైన శైలేంద్ర!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1142 లో...‌మినిస్టర్ గారు కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మీరు ఎండీగా ఉండడానికి ఎవరు ఇష్టం గా లేరు.. ఇక వేరే ఆప్షన్ లేక ఇలా చెయ్యాల్సి వస్తుందని మినిస్టర్ అంటాడు. వేరే ఆప్షన్ ఎందుకు లేదు శైలేంద్రని చెయ్యొచ్చు కదా అని దేవయాని అంటుంది. అదే విషయం ముందే చెప్పాను.. శైలంద్రని చెయ్యమని రిషి గాని వసుధార గాని వచ్చి చెప్పాలని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత అందరు సంతకాలు పెడుతుంటారు. శైలంద్ర మాత్రం ఇంకా రంగా రావట్లేదని ఫోన్ చేస్తుంటే అతని ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఏంటి వీడూ టైమ్ కి హ్యాండ్ ఇచ్చాడా ఏంటని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర సంతకం పెడుతుండగా వసుధార వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. దెయ్యం అంటూ వసుధారని చూసి శైలేంద్ర భయపడుతుంటే.. అందరు ఏమైందంటూ అడుగుతారు. వసుధార చనిపోలేదు బ్రతికే ఉంది సైలెంట్ గా ఉండమని శైలేంద్రకి దేవయాని చెప్తుంది. అమ్మ వసుధార వచ్చావా.. నువ్వు వచ్చావంటే మరి రిషి అని మహేంద్ర అడుగుతాడు. వచ్చారు మావయ్య అని వసుధార చెప్తుంది. మరొకవైపు రిషి ఏంట్రి మాములుగా ఉండదు.. తను వస్తుంటే స్టూడెంట్స్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతూ పూలు చల్లతుంటారు. మహేంద్రతో పాటు అందరు రిషికి ఎదరు గా వెళ్తారు. అందరూ రిషిని చూసి షాక్ అవుతారు. అచ్చం రిషి లాగే ఉన్నాడని శైలేంద్ర అనుకుంటాడు. రిషిని వెళ్లి హగ్ చేసుకుంటాడు మహేంద్ర. చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రిషి అందరిని పలకరిస్తాడు. నువ్వు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది.. ఇక ఈ కాలేజీని అంత రిషి చూసుకుంటాడని మినిస్టర్ అంటాడు.అదంతా చూస్తున్న శైలేంద్ర స్పృహ తప్పి కిందపడిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర స్పృహలో నుండి బయటకు వచ్చి.. నువ్వు రిషివి కదా అని అంటాడు. నేను రంగాని.. ఆవిడ ఎవరో నేను కాలేజీ లోపలికి వస్తుంటే ఆపి.. రిషి సర్ అంటూ అదంతా ప్లాన్ చేసిందని చెప్తాడు. సరే నేను చెప్పినట్టు చేస్తూ ఉండు అని రంగాకి శైలేంద్ర చెప్తాడు. సరే కానీ ఆ మేడమ్ కి భర్తగా నటించలేనని రంగా అంటాడు. అలా చేయకుంటే డౌట్ వస్తుందని శైలేంద్ర అంటాడు. అప్పుడే అందరు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అప్పు పెళ్లికి ఏర్పాట్లు.. రాజ్ ఆ ఇద్దరిని కలపగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -477 లో.....కనకం దుగ్గిరాల ఇంటికి పెళ్లి పత్రికతో వస్తుంది. ఇక నుండి అయిన అనామికలా నిందలు వెయ్యకుండా నా కూతురిని ఆశీర్వదించండంటూ మొదటి శుభలేక ధాన్యలక్ష్మికి ఇస్తుంది. ఆ తర్వాత ఇంటి పెద్దలకి ఇచ్చి పెళ్లికి రండి అని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ.. పెళ్లికి రావొద్దని చెప్తుంది. ఆ తర్వాత మేమ్ అంతా ఉన్అనమాని మర్చిపోకని అపర్ణ చెప్పగానే.. కనకం హ్యాపీగా ఫీల్ అయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని తలుచుకుని‌ అప్పు ఏడుస్తుంటే.. అప్పుడే కనకం కృష్ణమూర్తిలు వస్తారు. ఇంత రాత్రి అయిన నిద్రపట్టడం లేదా అని కనకం అనగానే.. రేపు నీ పెళ్లి ఆ తర్వాత మమ్మల్ని వదిలి వెళ్ళాల్సి వస్తుందని భాదపడుతున్నావు కదా అని కృష్ణమూర్తి అనగానే.. కృష్ణమూర్తి పైన తలవాల్చి బాధపడుతుంది. ఆడదాని జీవితమే అంత.. ఎక్కువ మాట్లాడితే వాగుడు కాయ అంటారు. తక్కువ మాట్లాడితే పొగరు అంటారు.. అంటూ అత్తరింటి గురించి కనకం చెప్తుంది. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. ఏమనుకుంటుంది మీ అమ్మ కళ్యాణ్ ని ప్రతేకంగా రావద్దని చెప్పడం ఏంటని కోప్పడతాడు. ఎందుకు అలా ఆందో మీకు తెలియదా అని కావ్య అంటుంది. నా తమ్ముడిని దారుణంగా అవమానించినట్లు అనిపించిందని రాజ్ అంటాడు. మరొకవైపు కళ్యాణ్ పెళ్లి మండపం దగ్గరికి రాకుండా చేయాలి.. లేదంటే ఆ కావ్య ఏం చేసి అయిన సరే వాళ్ళ పెళ్లి చేస్తుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి.. కావ్య మన ముందు ఇలా చేస్తూ వెనకాల ఏదైనా ప్లాన్ చేస్తుందేమో.. ఎందుకైనా మంచిది కళ్యాణ్ పెళ్లి మండపానికి రావద్దని రుద్రాణి అనగానే.. వాడిని బెంగుళూరు పంపిస్తాను. మా ఇంటికి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి.. ఇలా బాధగా ఎందుకు ఉంటావ్.. అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళమని చెప్తుంది. నేను ఎక్కడికి వెళ్ళాను.. ఎప్పుడైనా నాకు ఏం కావాలో ఆలోచించావా అని కళ్యాణ్ కోప్పడతాడు.. తరువాయి భాగంలో అప్పు కళ్యాణ్ ఫొటో చూసి ఏడుస్తుంటే.. స్వప్న చూస్తుంది. నువ్వు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావ్ కదా అని స్వప్న అడుగుతుంది. కళ్యాణ్ కి స్వప్న ఫోన్ చేసి అప్పు నిన్ను ప్రేమిస్తుందని చెప్తుంది. ఆ మాటలు విన్న రాజ్ ఈ కళ్యాణ్ అప్పుని నమ్ముకొని లాభం లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

Karthika Deepam2 : దీపని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన సుమిత్ర.. జ్యోత్స్న  ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika deepam 2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -111 లో......సుమిత్ర వాళ్ళు భోజనం చేస్తుంటారు. కనీసం మమ్మల్ని పిల్వకుండానే తింటున్నారా వాళ్లకి ఎంగేజ్ మెంట్ ఆగిపోయింది అన్న బాధ కొంచెం కూడా లేదని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. అప్పుడే కార్తీక్ సుమిత్ర కి ఫోన్ చేసి అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు‌. నువ్వు త్వరగా రాకుంటే మళ్ళీ దీప ఎక్కడికైనా వెళ్ళిపోతుందని కార్తీక్ అనగానే.. సుమిత్ర బయలుదేరుతుంటుంది‌. జ్యోత్స్న తినే ప్లేట్ కిందకి విసిరేస్తుంది. ఏంటి జ్యోత్స్న ఏం చేస్తున్నావని సుమిత్ర అడుగగా.. ఎవరికి అయిన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందన్న బాధ ఉందా.. అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. నేను అసలు తింటున్నానా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు.. ఆ దీప కోసం తినే ప్లేట్ లో కడుక్కుని వెళ్ళిపోతున్నావని జ్యోత్స్న అంటుంది. నీ ప్రేమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే చూపించు అమ్మ అని జ్యోత్స్న అంటుంది. దీప పైన నాకుంది జాలి అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న అర్థం చేసుకుండ తిడుతుంది. నువ్వు భాదపడుతున్నావ్ కరెక్ట్ కానీ అది చెప్పే పద్ధతి ఇది కాదు అన్నం ఎవరైనా అలా చేస్తారా అని జ్యోత్స్న శివన్నారాయణ అంటాడు. దాంతో జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ముందు నువ్వు హాస్పిటల్ కి వెళ్లు.. జ్యోత్స్న తో నేను మాట్లాడుతానంటూ దశరత్ అనగానే సుమిత్ర వెళ్తుంది. దీప కష్టంలో ఉన్నప్పుడు మనం చూడకుండా ఉంటే ఎలా అని శివన్నారాయణ బాధపడతాడు. ఆ తర్వాత సుమిత్ర హాస్పిటల్ కి వెళ్తుంది. నువ్వు వెళ్లి తిని రెస్ట్ తీసుకోమని సుమిత్ర అంటుంది. నీ కూతురు ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయినందుకు కోపంగా లేదా అని సుమిత్రని అడుగుతాడు కార్తిక్‌. ఎందుకు కోపం ఒక పాప ప్రాణాలు కాపాడావ్.. తల్లి, బిడ్డ విడిపోకుండా చేసావని సుమిత్ర అనగానే కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాసేపటికి అక్కడ నుండి కార్తిక్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ డిశ్చార్జ్ చేశారు వెళ్లిపొమ్మన్నారు పదండి అంటూ సుమిత్ర అనగానే.. నేను రాను అని దీప అంటుంది. దాంతో సుమిత్ర తనకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత దీప దగ్గరకి జ్యోత్స్న వచ్చి ఏదో రకంగా మాటలు అంటూనే ఉంటుంది. జ్యోత్స్న ఇప్పటికే చాలా ఎక్కువ అయింది వెళ్ళు అంటూ సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : శ్రీలత మాస్టర్ ప్లాన్ అదే.. సీతాకాంత్ చుట్టూ డ్రామా!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -163 లో.....రామలక్ష్మి ఆఫీస్ కి వచ్చిన కూడా అత్తయ్య గారు ఎదో చేయబోతున్నారంటూ ఆలోచిస్తుంది. ఏంటి పని మానేసి మరి ఆలోచిస్తున్నావంటూ సీతాకాంత్ అడుగుతాడు. అప్పుడే నమిత వచ్చి.. సర్ అంటూ ఎదో నసుగుతుంది. ఏంటి నమిత ఏదైనా మాట్లాడాలా అని సీతాకాంత్ అడుగుతాడు. మళ్ళీ వస్తాను సర్ అంటూ వెళ్లిపోతుంటే.. మీరు మాట్లాడుకోండి నేను వస్తానంటూ రామలక్ష్మి వెళ్లిపోతుంది. ఏమైంది మీ అయన గురించి తెలిసిందా అని సీతాకాంత్ అడుగుతాడు. లేదు సర్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని నమిత అంటుంది. నువ్వేం కంగారు పడకు ఈవినింగ్ వరకు చూసి.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఎవరికి చెప్పొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తుంటే అందరికి తెలిసిపోతుందని సీతాకాంత్ అంటాడు. అప్పుడే ఫైల్ మర్చిపోయానంటూ రామలక్ష్మి ఫైల్ తీసుకొని బయటకు వచ్చి నమిత ఎందుకు అలా ఉంది.. ఏం జరుగుతుంది అత్తయ్య గారు మొహం వెలిగిపోతుంది. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత నమితని సందీప్ పిలిచి ప్లాన్ త్వరగా పూర్తి చేయమని చెప్తాడు. రామలక్ష్మి ఉంటే పాసిబుల్ అవదని నమిత అనగానే.. అమ్మ చెప్తే ఏదో ఒకటి చేస్తుందని శ్రీలతకి సందీప్ కాల్ చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి వర్క్ చేసుంటే అప్పుడే సీతాకాంత్ వచ్చి తన చెయ్యి పట్టుకొని.. అలా కాదంటూ చేస్తుంటే అప్పుడే శ్రీలత సీతాకాంత్ కి ఫోన్ చేసి.. రామలక్ష్మిని ఇంటికి పంపించు ఇంట్లో సాయంత్రం పూజ ఉందని చెప్పగానే సీతాకాంత్ సరేనంటూ రామలక్ష్మి ని పంపిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చాక.. ఇప్పుడు పూజ ఏంటని డౌట్ పడుతుంది. వెళ్లి రెడీ అయిరా అని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత ప్లాన్ అమలు చెయ్ అని సందీప్ నమితకి ఫోన్ చేస్తాడు. నమిత సీతాకాంత్ క్యాబిన్ కి వెళ్ళగానే అప్పుడే మాణిక్యం వస్తాడు. దాంతో కోప్పడి సీతాకాంత్ అతన్ని పంపిస్తాడు. సర్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.. కాన్ఫరెన్స్ రూమ్ కి రండి సర్ ఇక్కడ అయితే ఆ విషయం విని నన్ను తక్కువ చేసి చూస్తారని అనగానే సరే అని సీతాకాంత్ అంటాడు. నమిత లోపలికి వెళ్తుంది. సీతాకాంత్ కూడా లోపలికి వెళ్తాడు. మా ఆయన వచ్చాడు తనేం మారలేదు ఎలా హింసించాడో అంటూ దెబ్బలు చూపిస్తుంది. తనకి బుద్ది వచ్చేలా నేను చేస్తానని సీతాకాంత్ అంటాడు.. అవసరం లేదు సర్ ఇక వాడు వద్దు.. నా బ్రతుకు నేను బతుకుతాను కాకపోతే మీ లాంటి వాళ్ళు నీడగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇలా మీ చెయ్ పట్టుకొని ఏడు అడుగులు నడవాలని ఉంది. మీ ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చినట్లే మీ మనసులో స్థానం ఇస్తారా సర్ ప్లీజ్ సర్ అని సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది నమిత. దాంతో హెయ్ అంటూ కోపంగా నమితని దూరం నెడతాడు సీతాకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : ఆ మీటింగ్ లో నిజం తేలనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(guppedantha Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1141 లో.... రిషిని వసుధార హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఇన్నిరోజులు బాధపడుతుంటే.. ఎందుకు మా దగ్గరకి రాలేదని వసుధార అడుగుతుంది. నేను ఎప్పుడు మీ గురించి ఆలోచించే వాడిని అని రిషి అంటాడు. అయితే ఎందుకు రాలేదని వసుధార అడుగుతుంది. అది తెలియాల్సిన టైమ్ వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. నిన్ను అనుకోకుండా కాపాడాను అనుకుంటున్నావు కదా.. నువ్వు కష్టంలో ఉన్నావ్ కాబట్టి వచ్చానని రిషి అంటాడు. చాల సందర్బంలో కాలేజీకి ప్రాబ్లమ్ వచ్చింది.. మీరు ఎందుకు రాలేదని వసుధార అడుగుతుంది. నువ్వు ఎలాగైనా కాలేజీ ని కాపాడతావని నాకు తెలుసని రిషి అంటాడు. ఇప్పుడు కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్తుందని ఎలాగైనా కాపాడాలని వచ్చాను. మీ అన్నయ్యకి రంగా అని ఎందుకు చెప్పారు.. రిషి అని చెప్పొచ్చు కదా.. అసలు కాలేజీకి ఇలాంటి సిచువేషన్ రావడానికి కారణం తెలుసా అని వసుధార అనగానే నాకు తెలుసు అంతా తెలుసు.. నువ్వు అర్థం చేసుకోమని వసుధారకి రిషి చెప్తాడు. నేను రంగాలా ఎందుకు మారానో అన్ని త్వరలోనే తెలుస్తాయి. నేనేం చేసినా మన కోసమే అని రిషి చెప్తాడు. దాంతో రిషిని వసుధార హాగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. రేపు ఏం చెయ్యాలో అంటు వసుధారకి రిషి చెప్తాడు. మరుసటిరోజు ఉదయం కాలేజీ మినిస్టర్ గారితో మీటింగ్ జరిగి కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్లు అందరు సంతకలు పెడుతుంటే.. రిషి వచ్చి శైలేంద్ర అన్నయ్యకి బాధ్యతలు అప్పగించండని చెప్పినట్లు శైలేంద్ర నిద్రలో కల కంటాడు. నేనే ఎండీ అని అంటుంటే.. ధరణి వచ్చి నిన్నటి వరకు కాలేజీ వెళ్లిపోతుందని బాధపడి.. ఇప్పుడు ఎండీ అంటున్నారని అంటుంది. ఆ తర్వాత మినిస్టర్ గారు మీటింగ్ అరెంజ్ చేస్తారు. ఇలా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: ఆ ఇద్దరిని బ్రహ్మముడి ఏకం చేయనుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -476 లో....రాజ్ ఎందుకు మీ ఇంటికి వెళ్ళాడంటూ ధాన్యలక్ష్మి కావ్యని అడుగుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. వచ్చారా మీరేదో అక్కడ మా వాళ్ళతో కుట్ర చేసి ఆ ఇంటి పిల్లని ఈ ఇంటికి తెస్తున్నారని నాపై విరుచుకుపడుతున్నారు అక్కడ ఏం జరిగిందో చెప్పండని రాజ్ ని కావ్య అడుగుతుంది. అప్పు కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందని రాజ్ అంటాడు. మరి మీ అత్తగారు ఏమన్నారని అపర్ణ అడుగుతుంది. వాళ్లకు అసలు ఇష్టం లేదు.. పైగా ఆ టాపిక్ ఇక మాట్లాడొద్దంటూ నా కాళ్ళు పట్టుకోబోయిందని రాజ్ అంటాడు. ఇప్పుడు ఏం అంటారని ధాన్యలక్ష్మి తో కావ్య అంటుంది. మీరు ప్రతి దానికి కావ్యని, తన వాళ్ళని అనొద్దు.. వాళ్ళ తప్పేముంది మీరు ఇంకొకసారి వాళ్ళని అంటే నేను ఏ నిర్ణయం తీసుకుంటానో నాకు తెలియదు.. ఎవరు క్షమాభిక్ష పెట్టమని అడగొద్దని రాజ్ ధాన్యలక్ష్మి రుద్రాణి లకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇక లాభం లేదు.. అప్పు నోరు తెరిచి ప్రేమని బయటపెడితే గాని కళ్యాణ్ దైర్యం చెయ్యడు. నేనే ఏదో ఒకటి చెయ్యాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత బంటి అప్పు దగ్గరికి వచ్చి కళ్యాణ్ కి ఆక్సిడెంట్ అయిందని చెప్పగానే అప్పు కంగారుగా కృష్ణమూర్తికి చెప్పి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందని కనకం అడుగగా.. వాళ్ళ ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయిందని వెళ్తుందని కృష్ణమూర్తి చెప్తాడు. ఆ తర్వాత అప్పు హాస్పిటల్ కి రాగానే ఎందుకు వచ్చావ్? నీకు కళ్యాణ్ అంటే ఇష్టం లేదు కదా? నేను కళ్యాణ్ దగ్గర కి వెళ్ళనివ్వనంటూ రాజ్ తనని ఆపేస్తాడు. నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను.. ప్రేమిస్తూనే ఉంటానని అప్పు అనగానే.. మరి పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావంటూ రాజ్ అడుగుతాడు. ఇప్పటికే నా వల్ల మా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.. ఒకవేళ నేను కళ్యాణ్ ని చేసుకున్నా కూడా మా అక్కలు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండలేరని అప్పు అంటుంది. ఆ మాటలు చాటుగా కళ్యాణ్ వింటాడు. కళ్యాణ్ కి ఏం కాలేదు నీ ప్రేమ విషయం బయట పెట్టాలని చేశానని రాజ్ అంటాడు.అప్పు వెళ్ళిపోయాక కళ్యాణ్ రాజ్ దగ్గరికి వస్తాడు. చూసావ్ కదా ఏం చేస్తావో నీ ఇష్టం అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్, కళ్యాణ్ లు ఎక్కడికి వెళ్లారంటు కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అప్పుడే రాజ్, కళ్యాణ్ లు వస్తారు. ఎక్కడికి వెళ్ళావ్ రా అని కళ్అయణ్ ని ధాన్యలక్ష్మి అడుగగా.. నీకెందుకు చెప్పాలని కళ్యాణ్ అంటాడు. అప్పుడే కనకం శుభలేక తీసుకొని వచ్చి.. ధాన్యలక్ష్మికి ఇస్తుంది. ఇప్పటికైనా అపార్ధం చేసుకోకుండా ఉండండని చెప్తుంది. తరువాయి భాగంలో అప్పు వెడ్డింగ్ కార్డు పట్టుకొని కళ్యాణ్ బాధపడుతుంటాడు. ఆ తర్వాత కావ్య దగ్గరకి రాజ్ వచ్చి వాళ్ళని విడదీస్తున్నావ్.. వాళ్ళు జీవితాంతం బాధపాడాల్సి వస్తుందని రాజ్ అంటాడు. వాళ్ళని నేను విడదీయడం లేదని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రీతూ చౌదరి నిమ్మకాయల గొడవ...టచ్ చేయలేదు అన్న శేఖర్ మాస్టర్

  కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ సౌండ్ తో దుమ్ము లేపుతోంది. ఐతే శేఖర్ మాష్టర్ మాత్రం ప్రియాంక మీద ఫుల్ ఫైర్ అయ్యారు. ఇందులో శ్రీముఖి ఒక కాంటెస్ట్ పెట్టింది. ఆర్జే చైతు, అంబటి అర్జున్ అలాగే లేడీస్ లో రీతూ, విష్ణు ప్రియ కలిసి ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసారు. ఇందులో ఎం చేయాలంటే  కొన్ని నిమ్మకాయలు తీసుకుని వాటిని దండలా గుచ్చి శేఖర్ మాష్టర్ కటౌట్ కి వేయాలన్నమాట. ఐతే ఆర్జే చైతు, అంబటి అర్జున్ టీమ్ వెంటనే అది కంప్లీట్ చేసేసారు. ఐతే నిమ్మకాయలు మొత్తం కలిసి దండలో 20 మాత్రమే ఉండాలి అని గర్ల్స్ కాదు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, అలా ఉండకూడదు అని గర్ల్స్ మధ్య గట్టిగానే వాదన జరిగింది. ఇక అంబటి అర్జున్ ఫుల్ సీరియస్ గా మినిమం 20 ఉండాలన్నారు.. అన్నే ఉండాలని చెప్పలేదు అన్నాడు. 19 ఉండకూడదు, అటు 21 కూడా ఉండకూడదు అని ఆర్జే చైతు - రీతూ మధ్య వార్ నడిచింది. ఇంతలో అమర్ లేచి "ఇంకొకటి పెట్టి ఉంటె గెలుస్తావురా  అని విన్నాను కానీ అయ్యో 20 పైన ఇంకొకటి పెట్టి ఓడిపోయావురా అని అనడం  ఫస్ట్ టైం వింటున్నాను" అన్నాడు. "అందుకే బ్రెయిన్ యూజ్ చేసి ఆడాలి" అని రీతూ ఫైర్ అయ్యింది. "వెళ్లి చెయ్యి టచ్ చేయాలి  అని ఇంతకు ముందు ఆడిన గేమ్ లో మరి టచ్ చేయలేదు".. అని శేఖర్ మాష్టర్ అడిగేసరికి ప్రియాంక మధ్యలో వచ్చి నిమ్మకాయల టాపిక్ గురించి మాట్లాడేసరికి "ప్రియాంక నువ్వు మాట్లాడకు ఆగు..నువ్వు మాట్లాడాలి అనుకుంటే రీతూని కానీ విష్ణుప్రియను కానీ పంపించేసి నువ్వొచ్చి మాట్లాడు" అని సీరియస్ అయ్యేసరికి అందరూ షాక్ అయ్యారు. ఇక నెటిజన్స్ ఐతే ప్రియాంక మీద శేఖర్ మాష్టర్ ఫైర్ అవడాన్ని చాల సంతోషంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా బాగా చెప్పారు ప్రియాంకకు అంటున్నారు.  

తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్.. జ్యోతక్క ఆ వీడియో వైరల్ !

  కొందరు సెలెబ్రిటీల గురించి రెగ్యులర్ గా గాసిప్స్ అవీ వస్తుంటాయి. వాటితో సెలెబ్రిటీలు ఎంతో కొంత ఇబ్బంది పడుతుంటారు. వాటిని కొందరు పట్టించుకోకుండా ఉంటే మరికొందరు సీరియస్ గా తీసుకుంటారు. అదే విషయాన్ని చెప్తూ జ్యోతక్క తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ ఫుల్ వ్లాగ్ చేసింది. శివజ్యోతి బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న యాంకర్. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హౌజ్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ పర్సన్ గా శివజ్యోతిని చెప్తారు. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతికి కెరీర్ మలుపు తిరిగింది. మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేనంత మంచి సక్సెస్ ఫుల్ లైఫ్ ని గడుపుతుంది శివజ్యోతి‌. శివజ్యోతి( iam.savithri) కి ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే తను ఏ రీల్ చేసిన మిలియన్ లో వ్యూస్ వస్తుంటాయి. ఇక తాజాగా 'తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్' అనే వ్లాగ్ చేసింది.  ఇందులో మెడ్ ప్లస్ కి సంబంధించిన కొన్ని తప్పుడు వార్తలొస్తున్నాయంటూ వచ్చిన వాటికి సమాధానాలు చెప్తూ ఆ సంస్థ ఎండీని కలిసి మాట్లాడించింది. ఈ వ్లాగ్ లో కొంత మంది రాసిన వాటిని వివరంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి వారిని నమ్మకండి. పూర్తిగా నిజానిజాలు తెలియకుండా ఏం మాట్లాడకూడదంటు శివజ్యోతి చెప్పగా ఈ వ్లాగ్ వైరల్ గా మారింది.  

రేవ్ పార్టీలో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్

  బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్  వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ కాంటినెంటల్ రిసార్ట్‌లో జరిగిన ఒక రేవ్ పార్టీలో మెహబూబ్ దొరికినట్లు తెలుస్తోంది. మహబూబ్ బర్త్‌డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వ్హయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీలో బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు పార్టీలో పాల్గొన్నారని తెలుస్తోంది.  అధికారుల అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో ఘట్ కేసర్ ఎక్సైజ్ అధికారులు ఈ రిసార్ట్ పై దాడులు చేసి  మెహబూబ్‌ షేక్‌పై కేసు నమోదు చేశారు. అలాగే ఆయన తోపాటు పార్టీ ఆర్గనైజర్, రిసార్ట్ మేనేజర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఇటీవలి కాలంలో రేవ్ పార్టీలు ఎక్కువగా జరుగుతుంది. సినీ  . కొన్ని నెలల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ వేడి ఇంకా చల్లారక ముంది హైదరాబాద్ రేవ్ పార్టీ కలకలం సృష్టిస్తోంది.    

తన్మయ్ రూమ్‌లో కృష్ణ భగవాన్... వీడియో వైరల్!

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో తన్మయ్ కి కృష్ణ భగవాన్ కి మధ్య ఉన్న లింక్ గురించి నూకరాజు రివీల్ చేసేసాడు. "సర్ ఈ వాచ్ మీదే అనుకుంటా" అని నూకరాజు ఒక వాచ్ ని తీసుకొచ్చి కృష్ణ భగవాన్ కి ఇచ్చి చూపించాడు. "నాదే కానీ నీకెక్కడిది" అని అడిగారు కృష్ణ భగవాన్. "తన్మయ్ రూమ్ లో దొరికింది" అని నూకరాజు చెప్పేసరికి  కృష్ణ భగవాన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం మాములుగా లేవు. నిజం బయట పడిపోయిందే ఇలా స్టేజి మీద అందరి ముందు అన్నట్టుగా పెట్టారు. "మీ చేతికి ఉన్న వాచ్ ఇస్తే తీసుకెళ్ళిపోతా సర్" అని మరో డైలాగ్ వేసాడు నూకరాజు. " ఇది ఎవరిదీ" అని డౌట్ గా అసలు ఎవరి వాచీనో కూడా చూడకుండా పెట్టుకొచ్చేసి. "అది తన్మయ్ ది సర్ కంగారులో మీరు పెట్టుకొచ్చేశారు" అన్నాడు నూకరాజు. "తన్మయ్ ది కూడా (వాసిపోయిందా) వాచ్ పోయిందా" అని తన చేతి వాచ్ ని తీసి నూకరాజుకు ఇచ్చేసారు కృష్ణ భగవాన్ .. ఇక ఆ సీన్ కి ఇటు రష్మీ, అటు ఖుష్బూ తెగ నవ్వుకున్నారు. ఇక వెళ్తూ వెళ్తూ ఖుష్బూ మీద కౌంటర్ వేసాడు నూకరాజు. "అయ్యో పిచ్చి తల్లి ఎగ్జాం ఒకేసారి రాసుకుంటది స్కిట్లు ఒకేరోజు చూస్తాది...అమ్మా మీకు దణ్ణం పెడతానమ్మా.. రాయొద్దమ్మ..ఎందుకంటే మీరు పేలని పంచ్ రాసే గ్యాప్ లో పేలే పంచులు మూడెల్లిపోతున్నాయి.." అని పంచ్ పేల్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది.  

Aata Sandeep : బాడీ షేమింగ్ పై ఆట సందీప్ భార్య దిమ్మతిరిగే కౌంటర్.. నెటిజన్ల ప్రశంసలు!

  ఆట సందీప్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టి ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. అయితే సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ కూడా ఓ మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. వీళ్లిద్దరూ కలిసి ఓ డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి  టైటిల్ గెలిచారు. అయితే తాజాగా జ్యోతి రాజ్‌పై కొంతమంది నెటిజన్లు బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. దీంతో హర్ట్ అయిన ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఆమె సింగిల్‌గా చేసిన ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి కొంతమంది నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెట్టారు. మెల్లగా చెయ్ కింద బండలు పగిలిపోతాయ్.. ఇంత డ్యాన్స్ వేస్తుంటావు అయిన ఇంత లావుగా ఉంటావేంటి అంటూ పర్సనల్ కామెంట్లు చేశారు. దీంతో హర్ట్ అయిన జ్యోతి రాజ్ .. తను రెగ్యులర్ గా చేసే పనులన్నింటిని చూపిస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో కింద జ్యోతి రాజ్ తన మనసులోని భాదని పంచుకుంది. అవును నేను లావుగా ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్నాను. అయినా నేను ఒక వర్కింగ్ ఉమెన్‌ని, అలానే బాధ్యతగల మహిళని, నాకంటూ ఓ ప్యాషన్ ఉంది. నేను బ్యూటీని, బాడీ స్ట్రక్చర్‌ని నమ్మను. చేసే పనిని మాత్రమే నమ్ముతాను. అయిన ఇంటి పని, వంట పనిచేస్తూ ఫ్యామిలీ కోసం వర్కింగ్ ఉమెన్‌గా కూడా ఉండటం అంత ఈజీ కాదు. అంటు రాసుకొచ్చింది. ఈ వీడియోలో మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తేవడం నుంచి తన కుటుంబానికి టేస్టీగా వండి వడ్డించడం వరకు జ్యోతి రాజ్ చూపించింది. ఈ వీడియోకి తన భర్త సందీప్ కూడా ఓ కామెంట్ పెట్టారు. అలాంటి కామెంట్లు పట్టించుకోకు.. ఓ మంచి హృదయం ముందు ఎలాంటి అందం కూడా పనిచేయదంటూ సందీప్ కామెంట్ పెట్టాడు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన జ్యోతిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Inaya Sultana :  ఇనయాతో గౌతమ్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేశాడుగా!

  బిగ్ బాస్  సీజన్ సిక్స్ లో ఇనయా ముజిబుర్ రహమాన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవంత్, శ్రీహాన్ లతో పోటీపడి ఆడిన ఇనయా సుల్తానాకి బయట ఫ్యాన్ బేస్ పెరిగింది.  ఇక బయటకొచ్చాక గోవా టూర్లు, విదేశీ టూర్ల పేరుతో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ వైరల్ గా నిలిస్తోంది. తరచూ అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా జిమ్ ట్రైనర్ గౌతమ్ తో డేటింగ్ లో ఉన్న ఇనయా.. విచ్చలవిడిగా తిరిగేస్తూ నెట్టింట వైరల్ గా మారారు. అదే విషయం గురించి గౌతమ్ ని అడుగగా.. ఎంజాయ్ చేయడాలు.. బెడ్ రూమ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం వరకేనా? లేదంటే పెళ్లి గట్రాల్లాంటివి ఏమైనా ఉన్నాయా? అని అడిగితే.. ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు గౌతమ్‌.. పెళ్ళా? అబ్బే.. మేం ఇద్దరం చిన్న పిల్లలం.. మా గోల్స్ అచీవ్ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటే సంతృప్తిగా ఉంటుందని గౌతమ్ అన్నాడు. ‘నవంబర్‌లో మా ఎంగేజ్‌మెంట్, పెళ్లి అనే వార్తలు వస్తున్నాయి. నిజానికి నవంబర్ నాకు ఇష్టమైన నెల. అమ్మనాన్నలు కూడా నవంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారు. అదే నెల అంటే నాకూ ఇష్టమే కానీ.. కెరియర్‌పై ఫోకస్ పెట్టాం. ఇనయ గురించి మా ఇంట్లో వాళ్లకి కూడా తెలుసు. మా అమ్మ చాలా మోడ్రన్. చాలా చిల్.. ఒప్పుకోదు అనడానికి ఏం లేదు. మమ్మల్ని మా అమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇనయ స్మైల్ గురించి తెలిసిందే కదా.. అలా మా అమ్మ కూడా పడిపోయారని గౌతమ్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మా పోస్ట్‌లు చూసి చాలామంది చాలా రకాలుగా కామెంట్‌లు పెడుతున్నారు. వీళ్లు ఎంతకాలం కలిసి ఉంటారులే అని. వాటిని నేను కేర్ చేయను. మహా అయితే కొంతసేపు బాధపడతాం కానీ.. దాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్లు బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు కాసేపు బాధపడతాం.. ఆ ఫొటోలు బాగున్నాయి కదా.. లవ్ కామెంట్స్ పెట్టొచ్చు కదా.. లైక్ కొట్టొచ్చు కదా అని అనుకుంటాను. మా ఇద్దర్నీ చూసి మురిసిపోతున్నారని అనుకుంటా తప్పితే పెద్దగా పట్టించుకోను. మనకి నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవడమే. ఎవరికి తలవంచాల్సిన పనిలేదు. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండని చెప్తుంటానని గౌతమ్ చెప్పుకొచ్చాడు.

Karthika Deepam2 : ఆ ఇద్దరిని అలా చూసేసిన జ్యోత్స్న.. కార్తిక్ ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'(karthika depam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -110 లో.... జ్యోత్స్న ఫ్రెండ్స్ తన దగ్గరకి వస్తారు. అసలు నీతో పెళ్లి మీ బావకి ఇష్టం లేదు.. ఉంటే ఎంగేజ్ మెంట్ ని వదులుకొని ఆ పాప కోసం వెళ్తాడా అని అంటారు. మీ బావ తో పెళ్లి అనే ఆలోచన చేయకుంటే మంచిదని వాళ్ళ అంటుంటే.. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్లపై కోప్పడుతుంది. అసలు మీరు ఫ్రెండ్సేనా మంచిగా ఆలోచించాలి గానీ ఇలా మాట్లాడుతారా అని కోప్పడుతుంది. మేమ్ తప్పుగా ఏం అన్లేదు.. నిజం మాట్లాడాం.. మేమ్ వెళ్లి పోతున్నామంటూ జ్యోత్స్న ఫ్రెండ్స్ వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేముందని జ్యోత్స్న అంటుంది. వాళ్ళని అన్నట్టే ఆ దీపని అని ఉంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు.. అసలు అడగాల్సిన వాళ్ళని అడగాలంటూ జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. ఇప్పుడు వెళ్లి దీపతో గొడవపడుతుందేమోనని సుమిత్ర టెన్షన్ పడుతుంది. మరొకవైపు అనసూయ దగ్గరికి శోభ వచ్చి.. మీరు తిట్టిన తిట్లకి మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదని అంటుంది.  పాపని కావలి అనుకున్నాం..  తెచ్చుకునే పద్ధతి అదేనా.. అసలు వాడు కన్నతండ్రేనా.. నా పాప పడిపోయి ఉంటే ఏమైనా కానివ్వంటూ తీసుకోని వస్తున్నాడు. ఆ కార్తీక్ పాపని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడని అనసూయ అనగానే.. ఆ కార్తీక్ నే ఆ పాప తండ్రి కావచ్చని శోభ అనగానే.. శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది. దాని పుట్టుక గురించి మాట్లాడకంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఎవరిని పెంచుకోవాలని శోభ అంటుంటే.. నన్ను పెంచుకోవే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అనసూయ. ఎక్కడికి వెళ్ళా అని మాటివ్వు అని శౌర్య అనగానే కార్తీక్ మాటిస్తుంటాడు. అప్పుడే వద్దని దీప శౌర్య చెయ్ ఆపుతుంది‌. దాంతో కార్తీక్ దీప చెయ్ పైన చెయ్ వేస్తాడు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న చూస్తారు. కార్తీక్ బయటకు రాగానే జ్యోత్స్న మాట్లాడుతుంది. అప్పుడే దీప కూడా వస్తుంది. ఇద్దరి గురించి జ్యోత్స్న, పారిజాతంలు తప్పుగా మాట్లాడతుంటే.. కార్తీక్ వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక దీప బాధపడుతుంటే.. వాళ్ళ మాటలు పట్టించుకొకని కార్తిక్ చెప్తాడు. పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వచ్చి భోజనం చేద్దామని అంటుంది. నేను చెయ్యను అనగానే.. నువ్వు నా పైన చాలా ప్రేమ చూపిస్తావని జ్యోత్స్న అంటుంది. నువ్వు దశరత్ కూతురివి కాదే నా కొడుకు దాస్ కూతురువి నిన్ను ఈ ఆస్తులకి వారసురాలిని చేస్తేనే నా కొడుకుకి న్యాయం చేసిన దాన్ని అవుతానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతంలని పిల్వక ముందే అందరు భోజనం చేస్తుంటే జ్యోత్స్న కి కోపం వస్తుంది. అప్పుడే సుమిత్రకి కార్తీక్ ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అత్త వేసిన కొత్త ప్లాన్.. కోడలు కనిపెట్టగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -162 లో....సీతాకాంత్ ఇంట్లోనే క్యాండిలైట్ డిన్నర్ ని ఏర్పాటు చేస్తాడు. రామలక్ష్మిని కళ్ళు మూసుకొని తీసుకొని వస్తాడు. దాంతో రామలక్ష్మి సర్ ప్రైజ్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని శ్రీవల్లి, శ్రీలతలు చాటుగా వింటారు. ఇప్పుడు రామలక్ష్మి ఒక డౌట్ అడుగుతుంది చూడమని శ్రీలత అంటుంది. అప్పుడే రామలక్ష్మి మిమ్మల్ని ఒకటి అడగాలని సీతాకాంత్ తో అంటుంది. ఏంటి అడుగు అని సీతాకాంత్ అడుగుతాడు. మీకు ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని నమిత గురించి అడగలేక రామలక్ష్మి ఇండైరెక్ట్ గా అడుగుతుంది. సీతాకాంత్ నమిత తన విషయం ఎవరికీ చెప్పొద్దన్న విషయం గుర్తుకూ చేసుకొని.. ఏం ప్రాబ్లమ్ లేదని చెప్తాడు. వాళ్ళ మాటలు వింటున్న శ్రీలత.. ఇప్పుడు సీతాకాంత్ రామలక్ష్మికి అబద్ధం చెప్పాడని  శ్రీవల్లితో శ్రీలత అంటుంది. అసలేం చేస్తున్నారు చెప్పండి అత్తయ్య అని శ్రీవల్లి అడుగుతుంది. అయిన శ్రీలత చెప్పదు. ఆ తర్వాత నమితకి శ్రీలత ఫోన్ చేస్తుంది. మన ప్లాన్ ఫెయిల్ అయింది మేడమ్.. సర్ ఎంత టెంప్ట్ చేసిన టెంప్ట్ అవ్వలేదని నమిత అనగానే.. నాకు తెలుసు వాడు టెంప్ట్ అయ్యే రకం కాదని చెప్తుంది. వీడియో తీసావ్ కదా చాలు.. నేను చెప్పినట్టు చేయమని శ్రీలత చెప్తుంది. మరుసటి రోజు సీతాకాంత్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే.. ఏంటి ఇంత లేటు అని రామలక్ష్మి అడుగుతుంది. ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తుంటే.. నువ్వేంటి అలా రెడీ అయ్యావ్ యజమాని భార్య ఎలా ఉండాలి.. నేను రెడీ చేస్తాను పదా అంటూ లోపలికి తీసుకొని వెళ్లి మల్లెపూలు పెడుతుంది.. ఏం ప్లాన్ చేస్తున్నారని శ్రీలతని రామలక్ష్మి అడుగుతుంది. ఆఫీస్ కి వెళ్ళాక నీకే తెలుస్తుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు వెళ్తుంటే గుమ్మడికాయ కిందపడుతుంది. ఒకసారి లోపలికి వెళ్లి వద్దామని రామలక్ష్మి అంటుంది. దాంతో ఇద్దరు దేవుడికి దండం పెట్టుకొని ఆఫీస్ కి వెళ్తారు. ఆఫీస్ కి వెళ్ళాక కూడా రామలక్ష్మి.. అత్తయ్య ఏం ప్లాన్ చేయబోతుందనే దాని గురించి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : రంగాను కౌగిలించుకున్న వసుధార...వామ్మో నిజమేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(guppedantha Manasu ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1140 లో..... రంగా అలియాస్ రిషికి తన కుటుంబం గురించి ఫొటోస్ తో వివరిస్తాడు శైలేంద్ర. వసుధర గురించి మాత్రం చెప్పకుండా ఫోటో రివర్స్ పెడతాడు. ఎందుకు వాళ్ళ గురించి చెప్పట్లేదని రిషి అడుగుతాడు. తను ఇప్పుడు స్టోరీ లో లేదని శైలేంద్ర అంటాడు. ఒకవేళ వస్తే అని రిషి అడుగుతాడు. వచ్చే ఛాన్స్ లేదు.. అందుకే చెప్పట్లేదని శైలేంద్ర అంటాడు. రేపు ఎలా ఉండాలో అర్థం అయింది కదా అని రంగాని శైలేంద్ర అడుగగానే.. అర్థం కాలేదు సర్ డైరెక్ట్ చూస్తే అర్థమవుతుందని రిషి అంటాడు. సరే చూపిస్తాను కానీ మన ప్లాన్ తెలిసిపోతుంది కదా అని శైలేంద్ర అంటాడు. దూరం నుండి చూపించండి.. నేను అర్ధం చేసుకుంటానని రిషి అంటాడు. ఇంకొకటి రంగా.. నువ్వు నన్ను సర్ అని పిలవకూడదు.. వాళ్లకి డౌట్ వస్తుందని శైలేంద్ర చెప్పగానే.. సరే అన్నయ్య అని రిషి అంటాడు. ఆ తర్వాత రిషిగా రంగాని ఇంటికి తీసుకొని వెళ్తాడు శైలేంద్ర. రిషి కిటకి దగ్గర నుండి అందరిని చూస్తుంటాడు. శైలేంద్ర ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. కిటికీలో నుండి చూస్తున్న రంగాకి అన్ని అర్థమయ్యేలా అందరిని వరుసలు పెట్టి పిలుస్తాడు. రేపు మన కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. నాకు అదే బాధగా ఉంది ఆ బాధని పంచుకోవడానికి మిమ్మల్ని పిలిచానని శైలేంద్ర అంటాడు. మహేంద్రకి డాడ్ అంటూ పిలిచినట్లు అనిపిస్తుంది. ఎవరో పిలిచారని మహేంద్ర అనగానే.. మీ భ్రమ అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి వెళ్తూ ఏదో కింద పడేస్తాడు‌. ఆ సౌండ్ కి అందరు బయటకు వస్తారు. ఆ లోపే రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషికి శైలేంద్ర ఫోన్ చేసి.. రేపు ప్రొద్దున ఏం చెయ్యాలో గుర్తు ఉంది కదా అని అడుగుతాడు. ఎలా కాలేజీ కి వస్తావని అడుగగా ఆటోకి వస్తానని రిషి చెప్తాడు. ఆ తర్వాత రిషి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి డోర్ ఓపెన్ చేసి ఉందని అనుకుంటాడు. అప్పుడే వసుధార వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటుంది. మీరు రంగా కాదు రిషి సర్ అని తెలుసంటూ తన ప్రేమని చెప్తుంది. పొగరు కదా తెలుసుకున్నావ్.. ఇంకా ఎందుకు ఏడుస్తావంటూ రిషి తన ప్రేమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అప్పు మనసులో కళ్యాణ్.. అనుకున్నది సాధించిన రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -475 లో.. నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని కావ్యని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అసలు అది నీకెందుకు మాట ఇవ్వాలని స్వప్న కోప్పడుతుంది. ఏమో మీరు ఇద్దరు ఎలా ఈ ఇంటికి కోడళ్ళు అయ్యారు.. అందరి ఇష్టప్రకారమే కోడళ్ళు అయ్యారా అని రుద్రాణి అంటుంది‌. దాంతో స్వప్న కోప్పడుతుంది. మా అమ్మని ఏమైనా అంటే కొడుతానని రాహుల్ అనగానే.. మరి మా అమ్మని ఏమైనా అంటే నేను ఎలా ఊరుకుంటానని స్వప్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కళ్యాణ్ మీ అమ్మ గారు చెప్పిన సంబంధం చేసుకుంటేనే ఈ నోళ్లు మూతపడతాయని కావ్య అంటుంది. ఇంకేంటి ఒప్పుకో అని రాజ్ వెటకారంగా మాట్లాడుతాడు. అనామిక చేసిన గాయం మానలేదు. అప్పుడే పెళ్లికి సిద్ధం గా లేనని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు. అర్థం అయిందా ఇంకెప్పుడు కళ్యాణ్ విషయంలో కావ్యని ఏం అనొద్దంటూ ఇందిరాదేవి, అపర్ణ లు ధాన్యలక్ష్మికి చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరకి రాజ్ వచ్చి.. అందరిముందు ఎందుకు అలా చెప్పావని అడుగుతాడు. నేను అప్పుని కలిసాను.. తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్తే నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను కానీ తన ఇష్టంతోనే పెళ్లి జరుగుతుందని చెప్పాక నేనేం చెప్పలేదు. అయిన అప్పు అంటే ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.. పెళ్లి చేసుకున్నాకా తనని మాటలు అంటే తను బాధపడుతుంది. నా పెళ్లి జరుగుతున్నప్పుడు అప్పు ప్రేమ తెలిసింది. ఇప్పుడు అప్పు పెళ్లి జరుగుతుంటే.. నా ప్రేమ తెలిసిందని కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడని రాజ్.. లేదని కావ్యలు వాదిస్తారు. అప్పు మనసులో నిజంగా కళ్యాణ్ ఉంటే మీతో పాటు వాళ్ళ పెళ్లి చెయ్యడానికి నేను రెడీ.. ముందు అప్పుని కనుక్కోండి అని కావ్య అనగానే.. సరే అని రాజ్ అంటాడు. అదంతా విన్న రుద్రాణి.. కనకానికి ఫోన్ చేసి అప్పుని ఈ ఇంటికి కోడలు చెయ్యడనికి ప్లాన్ బాగానే వేసావ్.. ఏకంగా రాజ్ నే ఇంటికి వచ్చేలా చేసావంటూ కనకాన్ని ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతుంది. ఆ తర్వాత రాజ్ కనకం ఇంటికి వచ్చి.. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ఇప్పుడు ఇలా మాట్లాడకండి.. అప్పు ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుందని కనకం కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అప్పు కూడా నా ఇష్టప్రకారం పెళ్లి జరుగుతుందని చెప్తుంది. మీకు మీరే మోసం చేసుకుంటన్నారని రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్తాడు. వీళ్ళందరు మీ కోసం ఎదరు చూస్తున్నారు.. అక్కడ  ఏం జరిగిందని కావ్య అడుగుతుంది. తరువాయి భాగంలో బంటి అప్పు దగ్గరికి వచ్చి.. కళ్యాణ్ కి ఆక్సిడెంట్ అయిందని చెప్తాడు. దాంతో అప్పు హాస్పిటల్ కి వెళ్తుంది. నేను కళ్యాణ్ ని చూడాలని రాజ్ తో అప్పు అనగానే.. ఎందుకు నువ్వు ఏమైనా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావా? వాడి గురించి నీకెందుకని రాజ్ అనగానే..  నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానని అప్పు అంటుంది. ఆ మాట పక్కనే చాటుగా ఉండి కళ్యాణ్ వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆ తల్లీ కొడుకులు మళ్ళీ స్క్రీన్ మీదకు..ఖుషీలో ఫాన్స్

  జానకి కలగనలేదు సీరియల్ లో అలనాటి అందాల నటి రాశి నటించిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు అమరదీప్ చౌదరి, కోడలిగా ప్రియాంక జైన్ నటించారు. ఐతే అమరదీప్ - రాశి బాండింగ్ చాలా క్యూట్ గా ఉంటుంది. రియల్ మదర్ అండ్ సన్ లా కనిపిస్తారు. ఐతే వీళ్ళు కలిసి ఒక షోలో కనిపించబోతున్నారు. ఆ పిక్స్ ని అమరదీప్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "మళ్ళీ ఇంకోసారి మా అమ్మతో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాను..థ్యాంక్యూ సో మచ్ అమ్మా..నువ్వు ఒక్క స్మైల్ ఇస్తే చాలు పాజిటివ్ ఎనెర్జీ వచ్చేస్తుంది..ఎప్పటికీ మా అమ్మ నా లైఫ్ లో నా వెన్నెముకలా నిలబడుతుంది" అని పోస్ట్ చేసాడు. ఐతే బిగ్ బాస్ సెవెన్ లో అమర్ దీప్ హౌస్ మేట్ గా వెళ్ళినప్పుడు తన కొడుకు రామా అలియాస్ అమర్ దీప్ కి ఓటేయాలంటూ ఆడియన్స్ ని కోరుకుంది. జానకి కలగనలేదు సీరియల్‌లో రాశి జ్ఞానాంబగా నటించింది.  రామాగా అమర్ దీప్, ఇక జానకిగా ప్రియాంక నటించింది. ఇలా రాశి అమరదీప్ కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కలిసి మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే విషయాన్ని అమరదీప్ పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కూడా ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. "మాకు నచ్చిన తల్లీ కొడుకులు మీరు...మీ బాండింగ్ చాలా బాగుంటుంది. మిమ్మల్ని మళ్ళీ ఒక ఫ్రేమ్ లో చూడడం ఆనందంగా ఉంది.." అని కామెంట్స్ చేస్తున్నారు.