Karthika Deepam2 : ఆ ఇద్దరిని అలా చూసేసిన జ్యోత్స్న.. కార్తిక్ ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'(karthika depam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -110 లో.... జ్యోత్స్న ఫ్రెండ్స్ తన దగ్గరకి వస్తారు. అసలు నీతో పెళ్లి మీ బావకి ఇష్టం లేదు.. ఉంటే ఎంగేజ్ మెంట్ ని వదులుకొని ఆ పాప కోసం వెళ్తాడా అని అంటారు. మీ బావ తో పెళ్లి అనే ఆలోచన చేయకుంటే మంచిదని వాళ్ళ అంటుంటే.. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్లపై కోప్పడుతుంది. అసలు మీరు ఫ్రెండ్సేనా మంచిగా ఆలోచించాలి గానీ ఇలా మాట్లాడుతారా అని కోప్పడుతుంది. మేమ్ తప్పుగా ఏం అన్లేదు.. నిజం మాట్లాడాం.. మేమ్ వెళ్లి పోతున్నామంటూ జ్యోత్స్న ఫ్రెండ్స్ వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేముందని జ్యోత్స్న అంటుంది. వాళ్ళని అన్నట్టే ఆ దీపని అని ఉంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు.. అసలు అడగాల్సిన వాళ్ళని అడగాలంటూ జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. ఇప్పుడు వెళ్లి దీపతో గొడవపడుతుందేమోనని సుమిత్ర టెన్షన్ పడుతుంది. మరొకవైపు అనసూయ దగ్గరికి శోభ వచ్చి.. మీరు తిట్టిన తిట్లకి మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదని అంటుంది.  పాపని కావలి అనుకున్నాం..  తెచ్చుకునే పద్ధతి అదేనా.. అసలు వాడు కన్నతండ్రేనా.. నా పాప పడిపోయి ఉంటే ఏమైనా కానివ్వంటూ తీసుకోని వస్తున్నాడు. ఆ కార్తీక్ పాపని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడని అనసూయ అనగానే.. ఆ కార్తీక్ నే ఆ పాప తండ్రి కావచ్చని శోభ అనగానే.. శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది. దాని పుట్టుక గురించి మాట్లాడకంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఎవరిని పెంచుకోవాలని శోభ అంటుంటే.. నన్ను పెంచుకోవే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అనసూయ. ఎక్కడికి వెళ్ళా అని మాటివ్వు అని శౌర్య అనగానే కార్తీక్ మాటిస్తుంటాడు. అప్పుడే వద్దని దీప శౌర్య చెయ్ ఆపుతుంది‌. దాంతో కార్తీక్ దీప చెయ్ పైన చెయ్ వేస్తాడు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న చూస్తారు. కార్తీక్ బయటకు రాగానే జ్యోత్స్న మాట్లాడుతుంది. అప్పుడే దీప కూడా వస్తుంది. ఇద్దరి గురించి జ్యోత్స్న, పారిజాతంలు తప్పుగా మాట్లాడతుంటే.. కార్తీక్ వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక దీప బాధపడుతుంటే.. వాళ్ళ మాటలు పట్టించుకొకని కార్తిక్ చెప్తాడు. పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వచ్చి భోజనం చేద్దామని అంటుంది. నేను చెయ్యను అనగానే.. నువ్వు నా పైన చాలా ప్రేమ చూపిస్తావని జ్యోత్స్న అంటుంది. నువ్వు దశరత్ కూతురివి కాదే నా కొడుకు దాస్ కూతురువి నిన్ను ఈ ఆస్తులకి వారసురాలిని చేస్తేనే నా కొడుకుకి న్యాయం చేసిన దాన్ని అవుతానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతంలని పిల్వక ముందే అందరు భోజనం చేస్తుంటే జ్యోత్స్న కి కోపం వస్తుంది. అప్పుడే సుమిత్రకి కార్తీక్ ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అత్త వేసిన కొత్త ప్లాన్.. కోడలు కనిపెట్టగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -162 లో....సీతాకాంత్ ఇంట్లోనే క్యాండిలైట్ డిన్నర్ ని ఏర్పాటు చేస్తాడు. రామలక్ష్మిని కళ్ళు మూసుకొని తీసుకొని వస్తాడు. దాంతో రామలక్ష్మి సర్ ప్రైజ్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని శ్రీవల్లి, శ్రీలతలు చాటుగా వింటారు. ఇప్పుడు రామలక్ష్మి ఒక డౌట్ అడుగుతుంది చూడమని శ్రీలత అంటుంది. అప్పుడే రామలక్ష్మి మిమ్మల్ని ఒకటి అడగాలని సీతాకాంత్ తో అంటుంది. ఏంటి అడుగు అని సీతాకాంత్ అడుగుతాడు. మీకు ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని నమిత గురించి అడగలేక రామలక్ష్మి ఇండైరెక్ట్ గా అడుగుతుంది. సీతాకాంత్ నమిత తన విషయం ఎవరికీ చెప్పొద్దన్న విషయం గుర్తుకూ చేసుకొని.. ఏం ప్రాబ్లమ్ లేదని చెప్తాడు. వాళ్ళ మాటలు వింటున్న శ్రీలత.. ఇప్పుడు సీతాకాంత్ రామలక్ష్మికి అబద్ధం చెప్పాడని  శ్రీవల్లితో శ్రీలత అంటుంది. అసలేం చేస్తున్నారు చెప్పండి అత్తయ్య అని శ్రీవల్లి అడుగుతుంది. అయిన శ్రీలత చెప్పదు. ఆ తర్వాత నమితకి శ్రీలత ఫోన్ చేస్తుంది. మన ప్లాన్ ఫెయిల్ అయింది మేడమ్.. సర్ ఎంత టెంప్ట్ చేసిన టెంప్ట్ అవ్వలేదని నమిత అనగానే.. నాకు తెలుసు వాడు టెంప్ట్ అయ్యే రకం కాదని చెప్తుంది. వీడియో తీసావ్ కదా చాలు.. నేను చెప్పినట్టు చేయమని శ్రీలత చెప్తుంది. మరుసటి రోజు సీతాకాంత్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే.. ఏంటి ఇంత లేటు అని రామలక్ష్మి అడుగుతుంది. ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తుంటే.. నువ్వేంటి అలా రెడీ అయ్యావ్ యజమాని భార్య ఎలా ఉండాలి.. నేను రెడీ చేస్తాను పదా అంటూ లోపలికి తీసుకొని వెళ్లి మల్లెపూలు పెడుతుంది.. ఏం ప్లాన్ చేస్తున్నారని శ్రీలతని రామలక్ష్మి అడుగుతుంది. ఆఫీస్ కి వెళ్ళాక నీకే తెలుస్తుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు వెళ్తుంటే గుమ్మడికాయ కిందపడుతుంది. ఒకసారి లోపలికి వెళ్లి వద్దామని రామలక్ష్మి అంటుంది. దాంతో ఇద్దరు దేవుడికి దండం పెట్టుకొని ఆఫీస్ కి వెళ్తారు. ఆఫీస్ కి వెళ్ళాక కూడా రామలక్ష్మి.. అత్తయ్య ఏం ప్లాన్ చేయబోతుందనే దాని గురించి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : రంగాను కౌగిలించుకున్న వసుధార...వామ్మో నిజమేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(guppedantha Manasu ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1140 లో..... రంగా అలియాస్ రిషికి తన కుటుంబం గురించి ఫొటోస్ తో వివరిస్తాడు శైలేంద్ర. వసుధర గురించి మాత్రం చెప్పకుండా ఫోటో రివర్స్ పెడతాడు. ఎందుకు వాళ్ళ గురించి చెప్పట్లేదని రిషి అడుగుతాడు. తను ఇప్పుడు స్టోరీ లో లేదని శైలేంద్ర అంటాడు. ఒకవేళ వస్తే అని రిషి అడుగుతాడు. వచ్చే ఛాన్స్ లేదు.. అందుకే చెప్పట్లేదని శైలేంద్ర అంటాడు. రేపు ఎలా ఉండాలో అర్థం అయింది కదా అని రంగాని శైలేంద్ర అడుగగానే.. అర్థం కాలేదు సర్ డైరెక్ట్ చూస్తే అర్థమవుతుందని రిషి అంటాడు. సరే చూపిస్తాను కానీ మన ప్లాన్ తెలిసిపోతుంది కదా అని శైలేంద్ర అంటాడు. దూరం నుండి చూపించండి.. నేను అర్ధం చేసుకుంటానని రిషి అంటాడు. ఇంకొకటి రంగా.. నువ్వు నన్ను సర్ అని పిలవకూడదు.. వాళ్లకి డౌట్ వస్తుందని శైలేంద్ర చెప్పగానే.. సరే అన్నయ్య అని రిషి అంటాడు. ఆ తర్వాత రిషిగా రంగాని ఇంటికి తీసుకొని వెళ్తాడు శైలేంద్ర. రిషి కిటకి దగ్గర నుండి అందరిని చూస్తుంటాడు. శైలేంద్ర ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. కిటికీలో నుండి చూస్తున్న రంగాకి అన్ని అర్థమయ్యేలా అందరిని వరుసలు పెట్టి పిలుస్తాడు. రేపు మన కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. నాకు అదే బాధగా ఉంది ఆ బాధని పంచుకోవడానికి మిమ్మల్ని పిలిచానని శైలేంద్ర అంటాడు. మహేంద్రకి డాడ్ అంటూ పిలిచినట్లు అనిపిస్తుంది. ఎవరో పిలిచారని మహేంద్ర అనగానే.. మీ భ్రమ అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి వెళ్తూ ఏదో కింద పడేస్తాడు‌. ఆ సౌండ్ కి అందరు బయటకు వస్తారు. ఆ లోపే రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషికి శైలేంద్ర ఫోన్ చేసి.. రేపు ప్రొద్దున ఏం చెయ్యాలో గుర్తు ఉంది కదా అని అడుగుతాడు. ఎలా కాలేజీ కి వస్తావని అడుగగా ఆటోకి వస్తానని రిషి చెప్తాడు. ఆ తర్వాత రిషి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి డోర్ ఓపెన్ చేసి ఉందని అనుకుంటాడు. అప్పుడే వసుధార వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటుంది. మీరు రంగా కాదు రిషి సర్ అని తెలుసంటూ తన ప్రేమని చెప్తుంది. పొగరు కదా తెలుసుకున్నావ్.. ఇంకా ఎందుకు ఏడుస్తావంటూ రిషి తన ప్రేమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అప్పు మనసులో కళ్యాణ్.. అనుకున్నది సాధించిన రాజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -475 లో.. నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని కావ్యని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అసలు అది నీకెందుకు మాట ఇవ్వాలని స్వప్న కోప్పడుతుంది. ఏమో మీరు ఇద్దరు ఎలా ఈ ఇంటికి కోడళ్ళు అయ్యారు.. అందరి ఇష్టప్రకారమే కోడళ్ళు అయ్యారా అని రుద్రాణి అంటుంది‌. దాంతో స్వప్న కోప్పడుతుంది. మా అమ్మని ఏమైనా అంటే కొడుతానని రాహుల్ అనగానే.. మరి మా అమ్మని ఏమైనా అంటే నేను ఎలా ఊరుకుంటానని స్వప్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కళ్యాణ్ మీ అమ్మ గారు చెప్పిన సంబంధం చేసుకుంటేనే ఈ నోళ్లు మూతపడతాయని కావ్య అంటుంది. ఇంకేంటి ఒప్పుకో అని రాజ్ వెటకారంగా మాట్లాడుతాడు. అనామిక చేసిన గాయం మానలేదు. అప్పుడే పెళ్లికి సిద్ధం గా లేనని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు. అర్థం అయిందా ఇంకెప్పుడు కళ్యాణ్ విషయంలో కావ్యని ఏం అనొద్దంటూ ఇందిరాదేవి, అపర్ణ లు ధాన్యలక్ష్మికి చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరకి రాజ్ వచ్చి.. అందరిముందు ఎందుకు అలా చెప్పావని అడుగుతాడు. నేను అప్పుని కలిసాను.. తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్తే నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను కానీ తన ఇష్టంతోనే పెళ్లి జరుగుతుందని చెప్పాక నేనేం చెప్పలేదు. అయిన అప్పు అంటే ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.. పెళ్లి చేసుకున్నాకా తనని మాటలు అంటే తను బాధపడుతుంది. నా పెళ్లి జరుగుతున్నప్పుడు అప్పు ప్రేమ తెలిసింది. ఇప్పుడు అప్పు పెళ్లి జరుగుతుంటే.. నా ప్రేమ తెలిసిందని కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడని రాజ్.. లేదని కావ్యలు వాదిస్తారు. అప్పు మనసులో నిజంగా కళ్యాణ్ ఉంటే మీతో పాటు వాళ్ళ పెళ్లి చెయ్యడానికి నేను రెడీ.. ముందు అప్పుని కనుక్కోండి అని కావ్య అనగానే.. సరే అని రాజ్ అంటాడు. అదంతా విన్న రుద్రాణి.. కనకానికి ఫోన్ చేసి అప్పుని ఈ ఇంటికి కోడలు చెయ్యడనికి ప్లాన్ బాగానే వేసావ్.. ఏకంగా రాజ్ నే ఇంటికి వచ్చేలా చేసావంటూ కనకాన్ని ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతుంది. ఆ తర్వాత రాజ్ కనకం ఇంటికి వచ్చి.. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ఇప్పుడు ఇలా మాట్లాడకండి.. అప్పు ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుందని కనకం కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అప్పు కూడా నా ఇష్టప్రకారం పెళ్లి జరుగుతుందని చెప్తుంది. మీకు మీరే మోసం చేసుకుంటన్నారని రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్తాడు. వీళ్ళందరు మీ కోసం ఎదరు చూస్తున్నారు.. అక్కడ  ఏం జరిగిందని కావ్య అడుగుతుంది. తరువాయి భాగంలో బంటి అప్పు దగ్గరికి వచ్చి.. కళ్యాణ్ కి ఆక్సిడెంట్ అయిందని చెప్తాడు. దాంతో అప్పు హాస్పిటల్ కి వెళ్తుంది. నేను కళ్యాణ్ ని చూడాలని రాజ్ తో అప్పు అనగానే.. ఎందుకు నువ్వు ఏమైనా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావా? వాడి గురించి నీకెందుకని రాజ్ అనగానే..  నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానని అప్పు అంటుంది. ఆ మాట పక్కనే చాటుగా ఉండి కళ్యాణ్ వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆ తల్లీ కొడుకులు మళ్ళీ స్క్రీన్ మీదకు..ఖుషీలో ఫాన్స్

  జానకి కలగనలేదు సీరియల్ లో అలనాటి అందాల నటి రాశి నటించిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు అమరదీప్ చౌదరి, కోడలిగా ప్రియాంక జైన్ నటించారు. ఐతే అమరదీప్ - రాశి బాండింగ్ చాలా క్యూట్ గా ఉంటుంది. రియల్ మదర్ అండ్ సన్ లా కనిపిస్తారు. ఐతే వీళ్ళు కలిసి ఒక షోలో కనిపించబోతున్నారు. ఆ పిక్స్ ని అమరదీప్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "మళ్ళీ ఇంకోసారి మా అమ్మతో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాను..థ్యాంక్యూ సో మచ్ అమ్మా..నువ్వు ఒక్క స్మైల్ ఇస్తే చాలు పాజిటివ్ ఎనెర్జీ వచ్చేస్తుంది..ఎప్పటికీ మా అమ్మ నా లైఫ్ లో నా వెన్నెముకలా నిలబడుతుంది" అని పోస్ట్ చేసాడు. ఐతే బిగ్ బాస్ సెవెన్ లో అమర్ దీప్ హౌస్ మేట్ గా వెళ్ళినప్పుడు తన కొడుకు రామా అలియాస్ అమర్ దీప్ కి ఓటేయాలంటూ ఆడియన్స్ ని కోరుకుంది. జానకి కలగనలేదు సీరియల్‌లో రాశి జ్ఞానాంబగా నటించింది.  రామాగా అమర్ దీప్, ఇక జానకిగా ప్రియాంక నటించింది. ఇలా రాశి అమరదీప్ కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కలిసి మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే విషయాన్ని అమరదీప్ పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కూడా ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. "మాకు నచ్చిన తల్లీ కొడుకులు మీరు...మీ బాండింగ్ చాలా బాగుంటుంది. మిమ్మల్ని మళ్ళీ ఒక ఫ్రేమ్ లో చూడడం ఆనందంగా ఉంది.." అని కామెంట్స్ చేస్తున్నారు.

ఎప్పటికి మారతార్రా మీరంతా ?

  ఆట సందీప్‌ మాత్రమే కాదు ఆయన భార్య జ్యోతి రాజ్‌ కూడా మంచి డ్యాన్సరే. ఇప్పటికే పలు టీవీ షోల్లో వీళ్ళు కలిసే కనిపిస్తారు. సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ వాళ్ళ డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు జ్యోతి రాజ్‌ షేర్‌ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చేసిన మంచి పనికి అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మంది ఇళ్లల్లో చూస్తే ఆడవాళ్లు ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఉద్యోగం, హాబీస్ అన్నిట్లో ఉంటారు. కానీ ఇంట్లో మగవాళ్ళు, బయట మగవాళ్ళు చాలా చులకనగా చూస్తారు. వన్స్ పెళ్ళై పిల్లలు పుట్టారు అంటే ఆ మదర్స్ కి బాడీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ శరీరంతో ఇక నవ్వులపాలవుతూ ఉంటారు. ఇన్ని పనుల మధ్య మదర్స్ కి వ్యాయాయం చేసే టైం ఉండదు. ఇంట్లో పనులు చేస్తే చాలు రోజు గడిచిపోతూ ఉంటుంది. ఆ బాడీని చూసి అందరూ కామెంట్స్ చేస్తూ లావు తగ్గండి అంటూ సలహాలు ఇస్తారు. ఇప్పుడు జ్యోతిరాజ్ పరిస్థితి అలాగే ఉంది. ఎవరేమన్నారో కానీ వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది తన వీడియో ద్వారా. "రెస్పెక్ట్ విమెన్ - రెస్పెక్ట్ టాలెంట్" అని ఇంట్లో పనులు, డాన్స్ చేస్తూ, షూటింగ్స్ ఇలా అన్ని చేస్తూ ఉన్న వీడియో పోస్ట్ చేసి స్త్రీలను గౌరవించండి అని చెప్పింది. " అవును నేను ఆరోగ్యంగా,లావుగా ఉన్నాను ...ఎందుకంటే నేను పని చేసే మహిళను, బాధ్యతాయుతమైన మహిళను, భావోద్వేగాలు ఉన్న మహిళను..జాబ్ చేస్తూ ఇంట్లో పనులు చేయడం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. నేను నా పనికి విలువ ఇస్తాను, నా బాడీ స్ట్రక్చర్ కి నా అందానికి కాదు " అని పోస్ట్ చేసింది. ఇక జ్యోతి పెట్టిన ఈ కామెంట్ కి అందరూ రిప్లైస్ ఇస్తున్నారు. "ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు...మనపని మనం చేసుకుంటూ పోవాలి" అన్నారు.  

ఎమోషన్ సీన్స్ చేసేటప్పుడు రజనీకాంత్, విజయ్ సేతుపతిని గుర్తుచేసుకోండి

  గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి సర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ముఖేష్ రిషికి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. ఐతే రిషి సర్ ని ఒక అభిమాని చిన్న సలహా ఇచ్చారు. "సార్ నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను..సార్ మీరు ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ మీద ద్రుష్టి పెట్టాలి, ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు  మీరు లుక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు.. అందంగా కనిపించడం ముఖ్యం కాదు అన్ని సీన్లలో ఎమోషన్ పండించాలి.. అప్పుడే జనాలు మీకు ఇంకా బాగా  కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతె  ఒక పాత్ర ఎలివేట్ అవ్వదు.. ఒకసారి మీరే  చూడండి విజయ్ సేతుపతి , రజనీకాంత్ వంటి వాళ్ళు ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు తమ లుక్స్ గురించి పట్టించుకోరు కానీ వారు ఎమోషన్స్‌ని పండించేసి జనాలను ఆకట్టుకుంటారు.   మీరు కూడా అలా చేయాలని ఆశిస్తున్నాను.. అలా చేస్తే భవిష్యత్తులో బాగా రాణిస్తారు. " అంటూ అద్భుతమైన సలహా ఇచ్చారు. రిషి సర్ చూస్తే చాలు ఆడియన్స్ గుండెల్లో గులాబీలు పూసినట్టు ఫీలవుతారు. రిషి, వసుధార రోల్స్ కి  సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరిని తెలుగు అడియన్స్ గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారు. అటు సోషల్ మీడియాలో కూడా వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది. మరి రిషి తన ఫ్యాన్ ఇచ్చిన సలహా చదివి ఫాలో అవుతాడా చూడాలి.  

శృతిమించిన సర్కార్ 4 లోని అర్థ నగ్న డ్యాన్స్.. మోతమోగిపోతుందిగా!

  మోత మోగిపోద్ది అంటు శుభశ్రీ రాయగురు చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ నేడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. టీవీ షోలలో , ఓటీటీ వేదికలపై చూపించే అందాల ఆరబోత రోజు రోజుకి శృతిమించుతోందంటు నెటిజన్లు మండిపోతున్న వేళ తాజాగా విడుదలైన సర్కార్ 4 ( Sarkaar 4)   సక్సెస్ పార్టీ ప్రోమో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ శుభశ్రీ రాయగురు. తను హౌజ్ లో ఉన్నన్ని రోజులు డీసెంట్ గా హౌస్ మేట్స్ తో పాజిటివ్ గా ఉండేది. ఎక్కువ రోజులు గౌతమ్ కృష్ణతో కలసి ఉన్న ఈ భామ. 'దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి' అంటు శుభశ్రీ నామినేషన్ లో చెప్పిన డైలాగ్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. దాంతో బిగ్ బాస్ టైమ్ లో తను చెప్పిన ఈ మాటలని మీమర్స్ ఎక్కువగా  ట్రోల్స్ లో వాడుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత అందరిని కలుస్తూ రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఇక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ 4 ( Sarkaar 4)  సక్సెస్ పార్టీ ప్రోమోలో అమర్ దీప్ తో కలిసి శూభశ్రీ చేసిన డ్యాన్స్ మోస్ట్  వాచెబుల్ గా నిలిచింది. సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది. సుడిగాలి సుధీర్ యాంకర్ గా చేస్తున్న ఈ సర్కార్ 4 ( Sarkaar 4) లో నిహారిక కొణిదెల, బాబా మాస్టర్ , ముక్కు అవినాష్, రోహిణి, సిరి, అమర్ దీప్ చౌదరి, ఫైమా, హమీద, వర్ష, ఇమ్మాన్యుయల్, యాదమ రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ షోలో కొన్ని క్విజ్ కి సంబంధించిన ప్రశ్నలు ఉండగా.. మధ్య మధ్యలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉంటుంది. అయితే ఇందులో ఫీమేల్ డ్యాన్సర్స్ డ్రెస్సింగ్ మరీ దారుణంగా ఉంటుందంటు కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాంతో పాటు తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్ దీప్, శుభశ్రీ చేసిన డ్యాన్స్ కి ఇదేం షో రా బాబు అంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. మరి ఈ షోపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.  

విష్ణు ప్రియ ఓల్డ్ పీస్.. తక్కువకే వస్తుంది!

  తెలుగు టీవీ షోలలో, ఇన్ స్టాగ్రామ్ లో మెరిసే తారలు కాస్త భిన్నంగా ఉంటారు. వీరికి ఒక్కో షోకి ఇంత పేమెంట్ అంటు ఈవెంట్ ఆర్గనైజైర్స్  ఇస్తుంటారు. అలా శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, సుమ షో, అలీ షో , రీతు చౌదరి ' దావత్ ' షో ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తున్నాయి.  తాజాగా స్టార్ మా టీవీలో మొదలైన మరో షో కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్. ఇందులో రెండు టీమ్ లు ఉన్నాయి. ఒకటి అనసూయ టీమ్, మరోకటి శేఖర్ మాస్టర్ టీమ్. ఈ రెండు టీమ్ ల మధ్య కొన్ని టాస్క్ లు ఉంటాయి. వారిలో ఎవరు ఎక్కువగా ఆడి గెలుస్తారో వారే విజేత. అయితే ఇందులోకి తాజాగా రీతూ చౌదరి, విష్ణు ప్రియ వచ్చారు. సాధారణంగా వీరిద్దరు కలిసి ట్రిప్స్ కి వెళ్తుంటారు. ఒకానొక సందర్భంలో తన బాయ్ ఫ్రెండ్ విష్ణు ప్రియ అని రీతు చౌదరి చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరు కలసి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో విష్ణు ప్రియ కొన్ని బోల్డ్ సమాధానాలిచ్చింది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి ఇద్దరిని కలిపి ఒకసారే జంట ప్యాకేజీ కింద తీసుకున్నారా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇద్దరు కాస్త బోల్డ్ ఆన్సర్ ఇచ్చారు. ప్యాకేజ్ ఏం లేదు సపరేట్ సపరేట్ పేమెంట్సే.. మమ్మల్ని ఇద్దరిని విడివిడిగానే అప్రోచ్ అయ్యారని రీతూ చెప్పింది. విష్ణుప్రియ మాత్రం సూటిగా సుత్తి లేకుండా తన మనసులోని మాటను చెప్పింది.  మా రీతూ గారు ఒక టాక్ షో వల్ల బాగా ఫేమస్ అయి ఇన్‌స్టా రీల్స్‌లో ఇలా ఎక్కడ చూసినా ట్రెండింగ్ తనే ఉందని ఈ గొప్ప పీస్‌ను ఎంచుకోవడం జరిగింది. నేను ఓ తుప్పు పట్టిపోయిన పీస్.. ఈమె చాలా రోజులు అయింది తుప్పుపట్టి.. మనం తక్కువలో పిలిస్తే వస్తదేమోనని నన్ను పిలిచారు.. నేను కూడా బాలి వెళ్లడం జరిగింది.. సర్లే పేమెంట్‌కి హెల్ప్ అవుతుందని వెళ్ళడం జరిగిందంటూ విష్ణుప్రియ బోల్డ్ రిప్లై ఇచ్చింది.  

Brahmamudi : పెళ్ళికి రెడీగా లేను.. అప్పు మనసులో ఏం ఉందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -474 లో... కళ్యాణ్ ని కావ్య పిలిచి అప్పుని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అయిన నీకు అప్పుపైన ప్రేమ ఏంటి? మీది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే.. అదే విషయం మీ అన్నయ్య నమ్మడం లేదు.. మీరు అప్పుని ప్రేమిస్తున్నారని ఆయన నాతో వాదిస్తున్నారని కావ్య అంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. అప్పు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా అంతే అని కళ్యాణ్ అనగానే కావ్య రిలాక్స్ అవుతుంది. అయితే మీరు నాకూ ఇంకొక మాట కూడా ఇవ్వాలని కావ్య అనగానే ఏంటి పెళ్లి కి నేను రావద్దని చెప్తారా అని కళ్యాణ్ అంటాడు. కాదు మీరు అమ్మ చెప్పిన పెళ్లి సంబంధం చేసుకోవాలి. అప్పుడే తను హ్యాపీగా ఎలాంటి డౌట్స్ లేకుండా ఉంటుందని కావ్య అంటుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేనని కళ్యాణ్ అంటాడు. నాపై ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చేస్తారనుకుంటున్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి.. ఇంట్లో ఎం జరుగుతుందో పట్టించుకుంటున్నావా.. నిన్న కావ్యకు ఒక పని అప్పజెప్పావ్.. అది ఎక్కడవరకు వచ్చిందో కనుక్కోవా అని అనగానే.. ధాన్యలక్ష్మి హాల్లోకి వెళ్లి అందరికి కాఫీ ఇస్తున్న కావ్యని పిలుస్తుంది. అయిన కావ్య పలకదు. ఏంటని ధాన్యలక్ష్మి అనగానే.. నేను ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు అరుస్తున్నారని కావ్య అంటుంది. కళ్యాణ్ ని అడిగావా అని ధాన్యలక్ష్మి అనగానే.. అప్పుడే రాజ్ వస్తూ.. ఎవరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు.. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది.. అందుకే కళ్యాణ్ కి అప్పు కి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని రాజ్ అనగానే ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఏంటి అప్పుని కళ్యాణ్ ప్రేమించడమేంటని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అదేం లేదు.. కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడని కావ్య అంటుంది. వెనకాల నుండి నెట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని ధన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాజ్ కళ్యాణ్ తీసుకొని వస్తాడు. చెప్పురా నీ మనసులో అప్పు ఉంది కదా చెప్పమని రాజ్ అనగా.. లేదని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు మీరందరు అనుకున్న సమాధానం వచ్చిందా అని కళ్యాణ్ కోప్పడతాడు. ఒరేయ్ నిన్న అప్పుకి పెళ్లి అంటే బాధపడ్డవ్ కదారా అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో అప్పు మనసులోణ కళ్యాణ్ మనసులో ఏముందో నీకు తెలుసు. నాకు తెలుసు. వాళ్ళకి తెలుసని రాజ్ అనగానే.. మరి అప్పు చెప్పిందా?  అప్పు మనసేంటో తెలుసుకోండి అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ కనకం దగ్గరికి వెళ్లి.. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని చెప్తాడు. కాసేపటికి నేను నా ఇష్టప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని రాజ్ తో అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శౌర్య గుండె వీక్ గా ఉంది.. కార్తిక్,  దీప ఎమోషనల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో..‌. శౌర్య గురించి దీప బాధపడుతుంటే.. సుమిత్ర వచ్చి శౌర్యకి ఏం కాదంటూ ధైర్యం చెప్తుంది. మీరు పెద్ద మనసుతో శౌర్యని చూడడానికి వచ్చారు కానీ మీ మొహం చూసి మాట్లాడే దైర్యం చెయ్యలేకపోతున్నాను.. జ్యోత్స్న నిచ్చితర్థం ఆగిపోయింది నా వల్లే.. నా కూతురు గురించి నేనెంత బాధపడుతున్నానో నా వల్ల మీ కూతురు ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారని దీప అంటుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జ్యోత్స్న గురించి కాదు శౌర్య గురించి.. నరసింహ ఇక్కడికి రాలేదు కదా అని సుమిత్ర అడుగుతుంది. రాలేదని దీప అనగానే.. కచ్చితంగా నీ కూతురు కోసం వస్తాడు. అందరం ఉంటామని తెలుసు అయిన వచ్చాడు . ఇక్కడికి కూడా వస్తాడు. దీనికి కారణం నరసింహ కాదు నువ్వే.. నువ్వు వాడిని వదిలించుకోవట్లేదు.. వాడికి విడకులు ఇవ్వు.. అలా ఇస్తే మీ జోలికి రాడని సుమిత్ర అంటుంది. ఇప్పుడు మళ్ళీ కోర్ట్ చుట్టూ తిరగలేనని దీప అంటుంది.ఆ తర్వాత సుమిత్ర వెళ్ళిపోతు.. వేరే ఆలోచనలు పెట్టుకోకు.‌ కార్తీక్ ఇక్కడే ఉన్నాడు.. వాడు చూసుకుంటాడని చెప్పి సుమిత్ర వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ డాక్టర్ తో మాట్లాడతాడు. శౌర్య గుండె వీక్ గా ఉందని డాక్టర్ చెప్తాడు. తను భయపడే విషయాలు చెప్పొద్దని డాక్టర్ అంటాడు. ఆ తర్వాత అన్నయ్య మళ్ళీ ముహూర్తం చూసుకొని ఎంగేజ్ మెంట్ పెట్టుకుందాం.. నువ్వు బాధపడకని కాంచన అంటుంటే జరుగుతుంది.. అంటావా అని పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ తనని తిడతాడు. అపుడే సుమిత్ర వస్తుంది. పాప గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత దీపకి నరసింహా కనబడతాడు. అదే విషయం వెళ్లి కార్తీక్ కి చెప్తుంది దీప. నరసింహా కోసం కార్తిక్ చూస్తాడు. అయిన కన్పించడు. ఆ తర్వాత డాక్టర్ ఏమన్నారని దీప అడుగుతుంది. దీపకి చెప్తే బాధపడుతుందని.. అంతా బాగుంది భయంతో అలా జరిగిందని చెప్తాడు. శౌర్య నేను చెప్పినవన్ని అబద్దాలు అనుకుంటుందని దీప ఏడుస్తుంది . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కెమెరా ముందు అలా హగ్ చేసుకున్న నమిత!

  స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -161 లో... సీతాకాంత్ ని రామలక్ష్మి ప్రేమగా చూస్తుంటే అప్పుడే కాఫీ పట్టుకొని మాణిక్యం వస్తాడు. కరెక్ట్ టైమ్ కి వస్తావని అతని పైన సీతాకాంత్ చిరాకు పడతాడు. రామలక్ష్మి నవ్వుకుంటుంది. అసలిప్పుడు నేనేం చేసానని మాణిక్యం అనుకుంటాడు. ఆ తర్వాత సర్ మీతో కలిసి బయటకు వెళ్లి చాలా రోజులు అవుతుంది.. సరదాగా అలా వెళదామా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు రామలక్ష్మి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని సీతకాంత్ చెప్తాడు. దాంతో రామలక్ష్మి డిస్సప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మికి నిజంగానే నా పైన ప్రేమ మొదలు అయినట్టుందని సీతాకాంత్ అనుకుంటాడు. అదే నిజం అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు మీరేం ప్లాన్ చేస్తున్నారో నాకు చెప్పండని శ్రీవల్లి అడుగుతుంటే.. శ్రీలత చెప్పదు. అప్పుడే  నమితకి శ్రీలత ఫోన్ చేసి‌.. ఈ రోజే మన ప్లాన్ ని అమలు చేయమని చెప్తుంది. దాంతో ఈ రోజు నాకు భయంగా ఉందని నమిత అంటే.. తనపై శ్రీలత కోప్పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని రామలక్ష్మితో బయటకు వెళ్ళాలని అనుకుంటాడు. తన దగ్గర కి వెళ్లి బయటకు వెళదామని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నమిత కావాలనే ఫోన్ లో ఏడుస్తూ మాట్లాడుతుందిమ దంతో సీతాకాంత్ తన దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతాడు. నా భర్త వల్ల ప్రాబ్లమ్ సర్ అంటూ తన బాధని చెప్తుంది. మీరు చెప్తే అయిన వింటాడెమోనని నమిత అనగానే.. సరే నీ భర్తతో నేను మాట్లాడతానని సీతాకాంత్ అంటాడు. అదంతా మాణిక్యం చూస్తాడు.  ఆ తర్వాత సర్ ఇంకా రావడం లేదని రామలక్ష్మి తన క్యాబిన్ కి వెళ్తుంది. అప్పుడే మాణిక్యం రామలక్ష్మి దగ్గరికి వచ్చి.. ఆ నమిత పైన ఏదో డౌట్ ఉందని చెప్తాడు. ఆ తర్వాత నమిత తన ఇంటికి సీతాకాంత్ ని తీసుకొని వెళ్తుంది. తన భర్త లెటర్ రాసినట్టు తనే రాస్తుంది. ముందే కెమెరా ఆన్ చేసి పెడుతుంది. లెటర్ చూసి ఏడుస్తుంటే సీతాకాంత్ తన గదిలోకి వస్తాడు. అతను వెళ్లి పోయాడంటూ సీతాకాంత్ ని హగ్ చేసుకొని ఏడుస్తుంది నమిత. అదంతా కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఒకర్తే ఇంటికి వెళ్తుంది. ఏమైంది.. ఒకదానివే వచ్చావంటూ శ్రీలత అడుగుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు. బయటకు వెళదామని చెప్పి ఎక్కడికి వెళ్లారని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు వెళదాం రెడీ అవ్వమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : వసుధారకి షాకిచ్చిన రిషి.. శైలేంద్రకి  నిజం తెలిసేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1139 లో.. వసుధారకి రంగా ఇచ్చిన గిఫ్ట్ ఇస్తుంది రాధమ్మ. అది చూసిన వసుధార.. అసలు ఇందులో ఏముందని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. అందులో రంగానే రిషి అని చెప్పే జ్ఞాపకాలు ఉంటాయి. వసుధార, రిషి ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చుకున్న గిఫ్ట్ లు ఉంటాయి. అవి చూసిన వసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరే రిషి సర్ ఆని నాకు తెలుసంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంతకీ సర్ ఎక్కడికి వెళ్లారని వసుధార అనుకుంటుంది. మరోవైపు రిషిగా నటించడం కోసం శైలేంద్రతో రంగా వెళ్తాడు. ఇక అక్కడ ఇంట్లోకి వెళ్ళిన రిషి.. జగతి ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతాడు. తన తల్లితో ప్రవర్తించిన తీరుని గుర్తుకుచేసుకుంటాడు. అందరు నేను లేను అంటున్నా నువ్వు ఒక్కదానివే నమ్మావు వసుధర అని రిషి అనుకుంటాడు. రిషిగా చేయలేని పనిని రంగాగా చేయడానికి వచ్చానమ్మ అని రిషి అనుకుంటుంటే.. అప్పుడే శైలేంద్ర వచ్చి ఈవిడ ఎవరో తెలుసా అని అంటాడు. రిషి వాళ్ళ అమ్మ జగతి అని  శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత నీకు రిషి ఎలా మాట్లాడతాడో వాకింగ్ స్టైల్ అంత చెప్పాను కదా.. ఒకసారి చేసి చూపించు అనగానే రిషి చేసి చూపించగా శైలేంద్ర షాక్ అవుతాడు. అచ్చం మా రిషిలాగే చేసావని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత అందరి గురించి చెప్తానని శైలంద్ర అంటాడు. ఎవరో చెప్తే నాకెలా తెలుస్తుందని రిషి అంటాడు. అగు ఒక్క నిమిషం అంటు శైలేంద్ర వెళ్తుంటే.. ఎక్కడికి అని రిషి అంటాడు.  నువ్వు కూడా నాతో రా అని రిషిని శైలేంద్ర తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత వసుధార దగ్గరకి బుజ్జి వచ్చి.. VR లెటర్ గల అక్షరం ఇస్తాడు. అది చూసి వసుధార చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత శైలేంద్రతో రిషి ఉన్న ఫోటోని బుజ్జి చూపించగా.. వసుధార షాక్ అవుతుంది. నా అనుమానమే నిజమే అయిందని వసుధార అనుకుంటుంది. అన్న ఈ సర్ తో వెళ్ళాడు.. అన్నని అతను రంగా అని పిలుస్తున్నాడు.. అన్నకి డబ్బులు కూడా ఇచ్చాడని బుజ్జి చెప్తాడు. నాతో ఏమైనా చెప్పమన్నాడ అని వసుధార అడుగుతుంది. ఈ ఫోటో చూపించు తనే అర్ధం చేసుకుంటుంది. ఏం చేయాలో తనకి తెలుసని అన్నట్టుగా బుజ్జి చెప్తాడు. ఇప్పుడు నాకు అర్థం అయింది. ఏం చెయ్యాలో నాకు తెలుసని వసుధార అంటుంది. మరొకవైపు రిషికి అందరి ఫోటోలు చూపిస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నాకూ ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తోంది

త్వరలో ఫ్రెండ్ షిప్ డే రాబోతోంది. ఇక ఈ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీ ఐపోయింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఎవరి ఫ్రెండ్స్ తో వాళ్ళు వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఇందులో ఆది కనిపించలేదు. కానీ పంచ్ ప్రసాద్ చాన్నాళ్ల తర్వాత కనిపించాడు. ఇక ప్రసాద్ రాగానే ఇంద్రజ డైలాగ్ వేసింది " ప్రసాద్ గారు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో తెలుసా" అనేసరికి "మళ్ళీ రవ్వొద్దు" అనా అండి అని ప్రసాద్ పంచ్ వేసాడు. దానికి ఇంద్రజ పెట్టింగ్ ఫేస్ మాములుగా లేదు. ఇక ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏమిటి అని ఇంద్రజ అడిగేసరికి "తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవారు ఫ్రెండ్, పీకల్దాకా తాగించేవాడు బెస్ట్ ఫ్రెండ్" అంటూ ఒక నాటీ అర్ధం చెప్పాడు నాటీ నరేష్. తర్వాత ఆదర్శ్, అన్షు కలిసి "నీ స్నేహం" మూవీలోంచి ఫ్రెండ్ షిప్ సాంగ్ కి చాలా క్యూట్ గా డాన్స్ చేసారు. ఇక ఆమె అతని ఫ్రెండ్ అని తెలీకుండా కొంతమంది ఆకతాయిలు వచ్చి "ఏముందిరా..ఎక్కడ పట్టాడోరా" అంటూ కామెంట్ చేసేసరికి ఆదర్శ్ వాళ్ళను కొట్టేసరికి "ఐనా దాన్ని కామెంట్ చేస్తే నీకెంటిరా" అని అడిగేసరికి "తాను నా ఫ్రెండ్ రా.." అని ఆదర్శ్ చెప్పాడు గట్టిగ. దానికి ఇంద్రజ రియాక్ట్ అయ్యింది. "మేల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు నాకు. కానీ ఈ పెర్ఫార్మెన్స్ చూసాక నాకు మేల్ ఫ్రెండ్స్ ఉంటే బాగుండనిపిస్తోంది" అని చెప్పింది.  

అక్కడ స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్, ఇక్కడ మా రిషి సర్

స్టార్ మాలో గుప్పెడంత మనసు సీరియల్ అంటే చాలు కళ్లప్పగించుకుని మరీ చూస్తారు యూత్, వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మలు కూడా...యూత్ కేమో అలాంటి సర్ కావాలని, అమ్మలకేమో వాళ్ళ ఆడపిల్లలు ఇలాంటి అబ్బాయి ఐతే ఎంత బాగుండో అని కలలు కంటూ ఆ సీరియల్ చూస్తూ ఉంటారు. ఇక ఈ సీరియల్ మంచి పీక్స్ లో ఉండి మంచి రేటింగ్ రిషికి మంచి ఫాలోయింగ్ వస్తోంది అనగా దాన్ని చింపి చాట చేశారు. టైమింగ్స్ మార్చేశారు. రిషిని తీసేసారు. ఇంకో హీరోని పెట్టారు. రిషిని సోషల్ మీడియాలో ఆ సీరియల్ టీమ్ వాళ్ళు నానా మాటలు అన్నారు. ఎట్టకేలకు ఫాన్స్ తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది అనడానికి సాక్ష్యంగా మళ్ళీ సీరియల్ లోకి రిషి ఎంట్రీ ఇచ్చాడు. టైమింగ్స్ కూడా పాత టైమింగ్స్ సెట్ చేసారు. అలాంటి రిషి ఇప్పుడు ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. టైగర్ స్మార్ట్ గా ఉంటె అది రిషిలా ఉంటుందా అనేంత అందంగా ఉన్నాడు. ఇంకేముంది అసలే  అందగాడు ఇంకా ఈ లుక్ లో చూసినవాళ్లంతా ఫిదా ఐపోతున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ అని పొగిడేస్తున్నారు. సూపర్ కూల్ లుక్స్, స్టైలిష్ ఐకాన్ , సూపర్ అవుట్ ఫిట్, ఒక టైగర్ ఇంకో టైగర్ ని వేసుకుంది..లుకింగ్ లైక్ ఏ వావ్ అంటున్నారు. రిషి సర్ అంటే అట్లుంటది మరి.  

90 స్ కిడ్స్ సూపర్ అనేది ఇందుకే...

సమీరా భరద్వాజ్ అంటే చాలు పక్కా ర్యాగింగ్ క్యారెక్టర్. సింగర్ ల స్మూత్ గా పాడి మెస్మోరైజ్ చేస్తుంది. టు వెర్షన్స్ లో కామెడీ రీల్స్ చేస్తుంది. గట్టిగా అరుస్తూ తిడుతుంది. అబ్బో ఆవిడ యమా యాక్టివ్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోకి లేడీస్ అందరూ తెగ కనెక్ట్ ఐపోతున్నారు. మీరు 90 స్ కిడ్స్ ఐతే కచ్చితంగా కనెక్ట్ ఐపోతారు. ఎందుకంటే అప్పట్లో సీరియల్స్ దే హవా. ఆ సీరియల్స్ కూడా మంచి కంటెంట్ మంచి టైటిల్ సాంగ్స్ తో ప్రతీ ఒక్కరూ పాడేసేలా ఉండేవి. ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా ఉండేవి. ఇంట్లో అమ్మలతో పాటు పిల్లలు కూడా పాడేసేవాళ్ళు, సీరియల్స్ ని బోర్ లేకుండా చూసేసేవాళ్ళు. ఇప్పుడు దాని మీదే సమీరా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " 90 స్ హౌస్ లో ఒక మాములు రోజు" ఎలా ఉంటుంది అన్నదే ఆ రీల్ లోని టాపిక్. ఇక ఆ సీరియల్స్ సాంగ్స్ పాడి వినిపించింది. స్నేహ, అంతరంగాలు, విధి, అందం, ఎండమావులు, లేడీ డిటెక్టీవ్, నాగమ్మ, చక్రవాకం, మొగలి రేకులు, శ్రీ భాగవతం, పిన్ని, నమ్మకం, మెట్టెల సవ్వడి, అమ్మ ఈ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ పాడి వినిపించేసింది. ఎంతమంది 90 స్ కిడ్స్ ఈ సీరియల్స్ చూస్తూ పెరిగారు అంటూ కూడా అడిగింది. ఇక నెటిజన్స్ కామెంట్స్ కుప్పలుగా వచ్చాయి. సమీరా మర్చిపోయిన కొన్ని సీరియల్స్ ని గుర్తు చేశారు. అన్వేషిత, రహస్యం, మర్మదేశం, పంచతంత్రం, ఋతురాగాలు, నాగాస్త్రం మర్చిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అప్పటి ప్రతీ సీరియల్ రేటింగ్ బీభత్సంగా ఉండేది...రాడాన్, ఏవిఎం ప్రొడక్షన్స్ వచ్చిన చాలా సీరియల్స్ కూడా ఇప్పటికీ 90 స్ కిడ్స్ హమ్ చేస్తూనే ఉంటారు. అందులో మరి మీరు ఉన్నారా ?  

రాహుల్ ఆల్ఫా మేల్ ... కానీ మీ అందరిలా టాక్సిక్ ఆల్ఫా మేల్ కాదు

  చిన్మయి శ్రీపాద ఏదైనా కుండ బద్దలు కొట్టేస్తుంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్.  మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ అందరి గుండెల్లో దడ పుట్టించిన చిన్మయి మాట్లాడే మాటలు వింటే ఇలాంటి అమ్మాయిని భరిస్తూ ఆ రాహుల్ ఎలా ఉంటున్నాడురా బాబు అనుకోకుండా ఉండరు. ఇప్పుడు అదే జరిగింది. చిన్మయి రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది. "తండ్రి కూతుళ్ళ రిలేషన్ లో తప్పులు వెతుకుతున్నారు అని అందరూ నన్ను అంటున్నారు కానీ నేను అది కాదు చెప్పింది నా హజ్బెండ్ రాహుల్ కి. కొంతమంది మీమర్స్ కి అసలు ఎప్పుడూ నా గురించే ఆలోచన.. అసలు ఆ రాహుల్ నాతో ఎలా బతుకుతున్నాడా, ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడా  అన్నదే అల్లాలోచిస్తూ ఉంటారు. దీన్ని వదిలేసి వెళ్ళిపో మావా...డివోర్స్ ఇచ్చేయ్ మామ అని అరుస్తూ, వాగుతూ కూర్చుంటారు. పాపం వాళ్ళ వాళ్ళ ఫామిలీస్ లో ప్రొబ్లెమ్స్ ఏంటో నాకు తెలీదు కానీ. చెప్పాలంటే మా పెళ్లి జీవితం చాలా సంతోషంగా ఉంది. నేను ఎవరికైతే నచ్చనో వాళ్ళ దగ్గర నుంచి నేనే ముందుగా వెళ్ళిపోతాను. అసలు విషయం చెప్పాలంటే రాహుల్ పక్కా ఆల్ఫా మేల్ కానీ మీ అందరి లాగా టాక్సిక్ ఆల్ఫా మేల్ ఐతే కాదు." అంటూ కొంతమంది మీమర్స్ కి కౌంటర్ ఇచ్చింది.  చిన్మయి డిక్షనరీలో అసలు మొహమాటం, సిగ్గు లాంటి పదాలకు అసలు అర్ధమే ఉండదు.  వైరముత్తు, సింగర్ కార్తిక్ లాంటి వారి భాగోతాలను నిర్భయంగా బయటకు చెప్పి సెన్షేషనల్ మారింది చిన్మయి. ఇప్పటికీ ఈ ఇద్దరితో కలిసి పని చేసేందుకు చిన్మయి నో చెబుతూనే ఉంటుంది.    

భార్య అలిగిందని అలా చేసిన భర్త!

  ప్రతీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అలాగే వాటిని ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కారించుకుంటే తొలగిపోతాయి. అయితే భార్య అలక తీర్చేందుకు సీతాకాంత్ ఓ పని చేశాడు. ఎవరీ సీతాకాంత్ అనే కదా డౌట్.. అదేంటో ఓసారి చూసేద్దాం.  స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో ఈ మధ్య బాగా క్రేజ్ తెచ్చుకుంటున్న సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు ( Eto Vellipoindhi Manasu ).  ఈ సీరియల్ లో రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి, సీతాకాంత్ పాత్రలో సీతాకాంత్ చేస్తున్నాడు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ టీవీ అభిమానులకి తెగ నచ్చేసినట్టుంది. అందుకేనేమో వీరిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సీతకాంత్ కి సీరియల్స్ లో ఇప్పటికే క్రేజ్ ఉంది. తను చేసిన ' అమెరికన్ అమ్మాయి' అనే సీరియల్ అయిపోయి ఈ మధ్యే తొమ్మిది సంవత్సరాలు అయింది‌‌. ఆ సీరియల్ సీతాకాంత్, బిగ్ బాస్ మెరీనా నటించారు. అది అప్పట్లో హిట్ పేర్ గా నిలవగా.. ఇప్పుడు రక్ష నింబార్గి, సీతాకాంత్ ల జోడీ భళే కుదిరింది. ఎటో వెళ్ళిపోయింది మనసు ( Eto Vellipoindhi Manasu) లో సీరియల్ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో  సీతాకాంత్, రామలక్ష్మి ప్రేమించుకొని విడిపోతారు. ఆ జన్నలో విడిపోయిన‌ ఇద్దరు ఈ జన్మలో కలుసుకుంటారు. ఓ స్వామిజీ వారిద్దరి గత జన్మ తాలుకా జ్ఞాపకాలని సీతాకాంత్ కి చూపిస్తాడు. ఇక ఈ జన్మలో సీతాకాంత్ రామలక్ష్మి పెళ్ళి చేసుకుంటారు. అయితే సవతి తల్లి కుల్లు కుతంత్రాలు తెలియని సీతాకాంత్ అమాయకంగా తనేం చెప్తే అదే చేస్తాడు. ఇది తెలుసుకున్న రామలక్ష్మి శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో అత్తాకోడల్ల మధ్య వార్ మొదలైంది. ఇక తాజా ఎపిసోడ్ లలో సందీప్ చేసిన ల్యాండ్ డీలింగ్ వెనుక నిజానిజాలు రామలక్ష్మి బయటపెడుతుంది. దాంతో రామలక్ష్మిని పొగిడి కొన్ని కీలక భాద్యతలు అప్పగిస్తాడు సీతాకాంత్. ‌దాంతో రామలక్ష్మికి శ్రీలత మరో సవాల్ విసురుతుంది. ‌ఇక అమ్మ మీద ప్రేమతో రామలక్ష్మి మీద సీతాకాంత్ కోప్పడుతుంటాడు దాంతో రామలక్ష్మి అలిగి కూర్చుంటుంది. తన అలక తీర్చడం కోసం సీతాకాంత్ సర్ ప్రైజ్ లు ఇస్తుంటాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో రామలక్ష్మిని హోటల్ లో డిన్నర్ కి తీసుకెళ్తాడు. అది చూసి రామలక్ష్మి ఇంప్రెస్ అవుతుంది. అలక తీరిందా అని సీతాకాంత్ అనగా తీరిందని స్మైల్ ఇస్తుంది రామలక్ష్మి. కానీ ఇద్దరు మనసులో మాట చెప్పకుండా మౌనంగా ఉంటారు. మరి వీరిద్దరి మనసులోని మాటని ఎప్పుడూ బయటపెడతారు. ఎప్పుడు ఒక్కటి అవుతారని ఈ సీరియల్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రోమో నెట్టింట అత్యధిక వీక్షకాధరణ పొందుతుంది.  

చిన్ని సీరియల్ లో బ్రహ్మముడి కావ్య!

  బుల్లితెర ధారావాహికల్లో బ్రహ్మముడి సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కొత్త సీరియల్స్ వస్తున్నప్పటికీ దీనికి క్రేజ్ తగ్గట్లేదు.  ఇక నేటి నుండి స్టార్ మా టీవీలో ' చిన్ని' ప్రసారం కానుంది.  ఇది మొదలయ్యే కంటే ముందే భారీగా ప్రమోషన్స్ చేశారు మేకర్స్.‌ ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, టీవీ లో‌ ప్రోమోలతో హైప్ తీసుకొచ్చారు‌. ఇప్పుడు ఈ సీరియల్ లో మరో సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ప్రోమోని వదిలారు మేకర్స్. ఈ ప్రోమోలో చిన్నిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయాలని ఎత్తుకెళ్తుంటారు. అప్పుడే అమ్మవారి అవతారంలో బ్రహ్మముడి కావ్య ఎంట్రీ ఇస్తుంది. తను వెళ్ళి ఆ దుండగులని కొట్టి చిన్నిని కాపాడుతుంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. బ్రహ్మముడిలో రాజ్ కి భార్యగా దుగ్గిరాల ఇంటి కోడలిగా కావ్య అలియాస్ దీపిక రంగరాజు క్రేజ్ పొందింది. ఈమె తెలుగు నేర్చుకుంటూ , టీవీ షోలలో అప్పుడప్పుడు కన్పిస్తుంది. స్టార్ మా పరివారంలో తను వేసే పంచ్ లు అప్పుడప్పుడు ఇన్ స్టాలో రీల్స్ గా వస్తుంటాయి. ఇక టీవీలో వచ్చే చిన్ని సీరియల్ ప్రోమోలో దీపిక రంగరాజుని చూస్తే బ్రహ్మముడి సీరియల్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.