50 రోజులు మాత్రమే.. ఊహించని కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ సీజన్ 8

  బిగ్ బాస్ తెలుగుకి రెండు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ఉంది.  ఎవరి ఊహకి అందకుండా అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్ళే ఈ షో మరో సీజన్ కి ముస్తాబవుతోంది. ఇప్పటికి ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ ఎప్పుడెప్పుడా అనే క్యూరియాసిటిని పెంచేస్తుంది.  సాధారణంగా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా బిగ్ బాస్ తెలుగుకి సంబంధించిన పోస్ట్ లు, వీడియోలు రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక సీజన్ మొదలవుతుందనే వార్త బయటికి వస్తే అంతే. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దాంతో మరో యాభై రోజుల్లో ప్రారంభం అవుతుందని చెప్తూ కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం నెటిజన్లు తెగ పోస్ట్ లు  చేస్తున్నారు. మరి అలా నెటిజన్లు మాట్లడుకునే వారి లిస్ట్ పెద్దగానే ఉంది. వాటిల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు.. రీతూ చౌదరీ, వేణు స్వామి, ఫార్మర్ నేత్ర, సురేఖ వాణి లేదా తన కూతురు సుప్రిత, కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ, బుల్లెట్ భాస్కర్, బర్రెలక్క, చమ్మక్ చంద్ర, కుషిత కల్లపు, అమృత ప్రణయ్ లాంటి వారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బిగ్ బాస్ కొత్త సీజన్ మామూలుగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రారంభమవుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 8 కూడా సెప్టెంబర్ లో మొదటి వారం నుండి ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఈ సీజన్ నిజంగానే సెప్టెంబర్‌లో ప్రారంభం అయితే ఆగస్ట్ నుండే హౌజ్ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అలా సెట్ పూర్తయితే రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తుంటాయి. ఇక హోస్ట్ కూడా నాగార్జుననే అని మళ్ళీ మారిస్తే టీఆర్పీ తగ్గిపోతుందని  బిబి టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ చేంజ్ చేస్తే అప్‌డేట్ ముందే వచ్చేస్తుంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ సెప్టెంబరు మొదటి వారంలో మొదలవుతుందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.  

అంబానీకి పెళ్లి అప్పులు... ప్రజల్ని కట్టమంటున్న జ్యోతిరెడ్డి

  అంబానీ ఇంట పెళ్లి రోజూ ఎదో ఒక అంశంలో టాప్ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఎందుకంటే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి మాములుగా జరిగిందా మరి. రెండు ప్రీవెడ్డింగ్ షూట్లు, అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీస్ ని పిలవడాలు, వాళ్లకు గిఫ్టులు...అబ్బూ ఆ  హడావిడి మాములుగా లేదు. 5 వేల కోట్ల రూపాయల ఖరీదైన పెళ్లి మరి. ఇన్ని కోట్ల పెళ్లి అంటే మరి భారీగానే అప్పులయ్యి ఉంటాయి కదా..పెళ్ళికి ముందే జియో చార్జెస్ పెంచడంతో ఈ రెండు అంశాలను లింక్ పెట్టి మరీ అంబానీ ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు జనాలు, నెటిజన్లు. ఇప్పుడు బుల్లితెర నటి జ్యోతిరెడ్డి కూడా ఫుల్ గా కామెంట్ చేస్తూ ఒక రీల్ ని రిలీజ్ చేసింది. "మొత్తానికి పెళ్లి చేసేశాం. వధూవరులు ఎంత ముద్దుగా ఉన్నారో. ఐనా కానీ అంబానీకి గారికి ఎంతో అప్పు మిగిలి ఉండి ఉంటుంది. ఎం చేస్తాం వెంకటేశ్వర స్వామికె అప్పుల బాధ తప్పలేదు. ఇక అంబానీగారెంతా. మీరంతా రెడీగా ఉండండి. వచ్చే నెల నుంచి మ్యారేజ్ ఈఎంఐ కట్టడానికి" అంటూ అద్భుతమైన సెటైర్ వేసింది. ఇక నెటిజన్స్ ఐతే మాములుగా స్పందించడం లేదు.  "మేడం ఇది  అంబానీ ఫ్యామిలీ చూశారంటే చచ్చిపోతారేమో మేడం... మీకు జియో చార్జెస్ పెంపుపై బాగా మండినట్టుంది. ఎందుకు మేడం మీరు నిజాలు మాట్లాడతారు. పెద్దవాళ్ళు ఊరకనే అంటారా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని  అందుకే పెళ్లికి డబ్బులు లేక మన దగ్గర నుంచి తీసుకొని పెళ్లి చేస్తున్నారు వాళ్ళు.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

నిఖిల్-రీతూ మధ్య గొడవ...అనసూయను తిడుతున్న నెటిజన్స్

  కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో నిఖిల్-రీతూ మధ్య గొడవ జరిగింది. ఈ వారం కుకింగ్ థీమ్ లో చాలా కాన్సెప్ట్స్ ఇచ్చింది శ్రీముఖి. అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య బత్తాయి రసం తీసే పోటీ పెట్టింది. ఐతే అందులో రీతూ జ్యూస్ తీసి ఒక క్వాంటిటీ బోటిల్ లో పోసి అందులో చెయ్యి పెట్టి కెలికేసింది. తర్వాత అమరదీప్ లేచి శేఖర్ మాష్టర్ కి ఒక పాయింట్ చెప్పాడు. " మాష్టర్ ఇప్పుడు మన బాయ్స్ నుంచి ఒక సమస్య ఉంది. జ్యూస్ లో వాటర్ పోశారు అని మన బాయ్స్ చెప్తున్నారు" అనేసరికి రీతూ ముఖం మరీ గలీజ్ గా పెట్టింది. దాంతో శేఖర్ మాష్టర్ "నీళ్లు పోయడం ఎవరు చూసారు మన వాళ్ళల్లో" అని అడిగారు. "విష్ణుప్రియ బోటిల్ అందించింది మాష్టర్" అంటూ నిఖిల్ చెప్పాడు. తరువాత విష్ణు ప్రియా నిలబడి "నేను ఏ ప్లేయర్ కి వాటర్ అందించలేదు" అని చెప్పింది. "బత్తాయి రసం బోటిల్ లో చెయ్యి పెట్టి తీసినప్పుడు జ్యూస్ తగ్గుతుంది కానీ అంత ఫుల్ల గా ఎలా ఉంది" అని అడిగాడు నిఖిల్. దానికి రీతూ ఫుల్ ఫైర్ ఐపోయింది."అవునయ్యా మా జ్యూస్ మీ దానిలోని కంటే ఎక్కువుంది" అని చెప్పింది ..దానికి నిఖిల్ గట్టిగా రైజ్ అయ్యాడు. "నేను నీతో మాట్లాడటలేదు " అనేసరికి "నేను నీకు చెప్పట్లేదు నిఖిల్" అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది రీతూ. ఆ మాటతో అందరూ ఒక్కసారిగా రీతూ వైపు షాకింగ్ గా చూసారు. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత కక్షల్ని ఇలా ఈవెంట్స్ లో, గేమ్ షోస్ లో ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఇక ఈ షోకి అనసూయ గెటప్ ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. దాంతో బ్యాక్ గ్రౌండ్ లో "ఆకలేస్తే అన్నం పెడతా" సాంగ్ వేసేసరికి ఇక నెటిజన్స్ ఫుల్ గా తిడుతున్నారు. ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండాలని చూస్తూ ఉంటుంది అంటున్నారు.  

Biggboss Sri Sathya : ఆఫర్ల కోసం అలా చేయించుకున్న బిగ్ బాస్ శ్రీసత్య.. ఆ ముగ్గురితో !

  నాగార్జున.. హుమ్... ఇది ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న యూజర్స్ కి బాగా తెలిసిన‌ ట్రెండింగ్. ట్రోల్స్ ని మీమ్స్ ని బాగా చూసేవాళ్ళకి ఇది అర్థమవుతుంది. అలాంటిది బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన అందంతో, ఆటతో ఆకట్టుకున్న శ్రీసత్య నోటివెంట ఈ మాటలు రావడం ఇప్పుడు నెట్టింట చర్చకి దారితీసింది. యాంకర్ శివతో కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య కొన్ని నమ్మలేని నిజాలు చెప్పుకొచ్చింది. మీ పోస్ట్ లకి వ్లాగ్స్ కి కొన్ని కామెంట్లు వస్తాయి కదా చూస్తారా అని శివ అడుగగా.. అవును కానీ నేను పట్టించుకోనని శ్రీసత్య అంది. లిప్స్ కి ట్రీట్ మెంట్ చేసుకున్నారా అని అడుగగా .. అవునని ఓ విషయాన్ని తెలియజేసింది. తన లిప్స్ చిన్నగా ఉన్నాయని సినిమాల్లో రిజెక్ట్ చేస్తున్నారట. దాంతో వాళ్లకి నచ్చే విధంగా.. ముంబై హీరోయిన్ మాదిరిగా లిప్స్‌కి సర్జరీ చేయించుకుని.. ఆఫర్ల కోసం ఇలా చేసుకున్నానని శ్రీసత్య అంది. ఇక చాలామంది లిప్స్ బాలేవని కామెంట్లు చేస్తున్నారంట.లిప్ పిల్లర్ చేయించా. నా డ్రీమ్ సినిమా. కాబట్టి.. దానికోసం నేను మార్చుకుంటున్నా. ముంబై వాళ్లని ఎందుకు తీసుకుంటున్నారు. వాళ్ల పెదాలు పెద్దగా ఉంటాయి. వాళ్ల షేప్ బాగుంటుంది.. డాల్ మాదిరిగా. నాకు నా లిప్స్ పెద్ద మైనస్. పై పెదవి చాలా చిన్నగా ఉంటుంది. అందుకే పెద్దగా అయ్యేట్టు సర్జరీ చేయించా. ఈ సర్జరీ చేయించాక.. ఇప్పుడు బాగున్నారని ఆఫర్లు ఇస్తున్నారు. నాకు నా లిప్స్ నచ్చాయి.. జనానికి నచ్చడం లేదు. మరో మూడు నెలలు నన్న భరించండి..  ఆ తర్వాత మాములు అయిపోతాయని తన అభిమానులకి చెప్పింది‌ శ్రీసత్య. ఇక సాకేత్, అర్జున్ కళ్యాణ్, మెహబూబ్ ల గురించి కామెంట్లు వస్తున్నాయి కదా ఏమంటావని అడుగగా.. అసలు నేను ఎవరితో ఉన్నా వారితో రిలేషన్ లో ఉందని అంటున్నారు. నాకు అసలు డ్యాన్స్ రాదు.. ఆ డ్యాన్స్ షో కోసం మెహబూబ్ తో కలిసి చేశాను. ఆ తర్వాత సాకేత్ తో కూడా అంతే. ఇక అర్జున్ కళ్యాణ్ కి ఫస్ట్ నుండి ఎండ్ కార్డు చూపించా కానీ అతని వైపు నుండి ఎండ్ అని రావడం లేదని శ్రీసత్య అంది. మరి పెళ్ళి చేసుకుంటావా అని అడుగగా.‌ . లేదని అంది. ఇక శ్రీసత్య తన పర్సనల్ విషయాలని కూడా పంచుకుంది. 

మగాడి జీవితం గోధుమపిండి లాంటిది...డిన్నర్, విన్నర్, రన్నర్ అంటున్న నూకరాజు

  జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తాగుబోతు రమేష్-నూకరాజు కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని తెగ వాడేశారు. "కృష్ణ భగవాన్ గారు ఈరోజు లంచ్ కి రూమ్ కి రమ్మన్నారు" అంటూ తాగుబోతు రమేష్ నూకరాజుకి చెప్పేసరికి "ఎందుకు" అన్నాడు. "లంచ్ కి లంచ్ కి" అన్నారు కృష్ణ భగవాన్.. "అట్టా నేను లంచ్ కి రాను డిన్నర్ కి వెళ్తా" అంటూ తాగుబోతు రమేష్ గారం పోయేసరికి దణ్ణం పెట్టారు కృష్ణ భగవాన్. "నువ్వు డిన్నర్ కి వెళ్తే విన్నర్ ఆయనే అవుతారు..నేను రన్నర్ అవ్వాల్సి వస్తుంది" అంటూ నూకరాజు కూడా దణ్ణం పెట్టేసాడు. "మగవాడి జీవితం గోధుమ పిండి లాంటిది. నిప్పుల మీద కాలిస్తే పుల్క, కొంచెం నూనె వేసే కలిస్తే చపాతీ, డైరెక్ట్ గా నూనెలే వేసేస్తే పూరి ఐపోతుంది" దీన్ని బట్టి నీకేం అర్ధమవుతుంది అని రాఘవ అడిగేసరికి "మగాళ్ల జీవితం పొంగుతూ ఉంటుంది అంటూ డబుల్ మీనింగ్ అని తెలిసి అన్నదో, తెలీక అన్నదో డైలాగ్ ఐతే అనేసింది తెలుగు తెలీని రష్మీ. ఇక వీళ్ళ మాటల్లో కనిపించని బూతు కామెడీ బాగా ఎక్కువైపోయింది. ఐతే ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం స్కిట్స్ లో అస్లీలత ఎక్కువైపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.  

బాతు టబ్బులో కావ్య.. కావ్య ఏ క్యా అంటూ బుద్ది చెప్తున్న నెటిజన్స్

  బుల్లితెర మీద కావ్య-నిఖిల్ జోడి అంటే చాలు వాళ్ళను ఓ రేంజ్ లో చూసే అభిమానులు ఉన్నారు. గోరింటాకు సీరియల్ లో ఈ జోడి కలిసి నటించింది. వెండితెర కంటే బుల్లితెరపై నటించేవాళ్లనే ఎక్కువగా అభిమానిస్తున్నారు ఆడియన్స్.  స్టార్ మా లో ప్రసారమైన గోరింటాకు సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ కు తెలుగు ప్రేక్షకులు మంచి అభిమానం చూపించేవారు. వీరు రీల్ లైఫ్ లో ఎంత చూడముచ్చట జంటగా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా వీరిని అలాగే చూడాలనుకుంటున్నారా వీరి అభిమానులు. ఐతే కావ్య ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుంది. సీరియల్ లో తప్ప ఏ ఇతర షోస్ లో ఆమె ఎక్కువగా మాట్లాడని మాట్లాడాడు. అలాంటి కావ్య ఇప్పుడు హాట్ బ్యూటీగా మారింది. బాతు టబ్బులో పడుకుని మరీ ఫోజులిస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే నెటిజన్స్ ఐతే కొందరు హ్యాపీగా ఉన్నా కొందరు వద్దు అంటూ చెప్తున్నారు. "మీరు శారీ కట్టుకుని పుష్ప సాంగ్ కి డాన్స్ చేసిన ఫోటోని ఎందుకు డిలీట్ చేశారు. అది చాలా బాగుంది. ఎందుకు డిలీట్ చేశారో తెలీదు కానీ ఇలాంటి పోస్టులు పెట్టకండి ఇది మా రిక్వెస్ట్" అంటూ బుద్ది చెప్తున్నారు.  "అమ్మకు తెలియని కోయిలమ్మ’ అనే సీరియల్లో జంటగా నటించారు కావ్య శ్రీ – నిఖిల్. వీళ్ళు "అహ నా పెళ్ళంటా" అనే  ఓ వెబ్ సిరీస్ లో కూడా కలిసి నటించారు. ఇక బుల్లితెర పై ఈ జంట ఎప్పటికప్పుడు డాన్స్ పెర్ఫార్మన్స్ లు చేశారు. దీంతో నిఖిల్ – కావ్యశ్రీ పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం ఎక్కువగా ఉంది. మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా..చూడాలి.  

రీతూ చౌదరి అందాలను షేర్ చేసిన యాంకర్ శివ.. ఒరేయ్ ప్లీజ్ దయచేసి వదిలేయ్.. నేను ఎవరికీ దొరకను!

సోషల్ మీడియాలో విష్ణు ప్రియ, రీతూ‌ చౌదరి హావా సాగుతుంది. రోజు రోజుకి వీరి అందాల ఆరబోత ఎక్కువ అవుతుంది. యాంకర్ విష్ణు ప్రియ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రీతూ చౌదరి ఓ హాట్ అండ్ బోల్డ్ ఫోటోని షేర్ చేసింది. దానికి పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఆ కామెంట్లలో విష్ణు ప్రియ చేసిన ఓ కామెంట్ వైరల్ గా మారింది. " కొత్త కొత్త అందాలు యాయ్ రీతూ" అని విష్ణు ప్రియ కామెంట్ చేయగా.. ఒరేయ్ ప్లీజ్ దయచేసి వదిలేయ్.. నేను ఎవరికీ దొరకనని రీతూ రిప్లై ఇచ్చింది. ఇక  ఈ కామెంట్లని యాంకర్ విష్ణు ప్రియ షేర్ చేశాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నెట్టింట రీతూ చౌదరి కామెంట్ల మీద, ఫోటోల మీద నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వీరిద్దరి కామెంట్లు మరింత వైరల్ గా మారాయి.  

తొలి ఏకాదశికి అత్తతో గుడికి వెళ్ళిన దీపిక!

  ఆషాడ మాసం ప్రారంభమైంది. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా అందరు గుడికి వెళ్తున్నారు. అందులోను నిన్న తొలి ఏకాదశి కావున కొందరు సెలబ్రిటీలు యాదాద్రి, స్వర్ణ గిరి, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళి పూజలు చేస్తున్నారు. తొలి ఏకాదశి నాడు ఇద్దరు అత్తలతో గుడికి వెళ్ళింది దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తున్న దీపిక రంగరాజు గురించి స్టార్ మా అభిమానులకి తెలిసిందే. స్డార్ మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో కనకం-కృష్ణమూర్తిల కుమార్తెగా కావ్య చేస్తోంది. దుగ్గిరాల ఇండి వారసుడు అపర్ణ సుభాష్ ల‌ కొడుకు రాజ్ ని పెళ్ళి చేసుకున్న కావ్య.. ఎంతో అనుకువగా ఉంటూ అందరి మనసులు దోచేస్తోంది. అయితే కొత్త కోడలు అనామిక రావడంతో  కావ్యది ఏం తప్పు‌లేకపోయిన అప్పు ప్రేమ వల్ల తనని ధాన్యలక్ష్మి  పూర్తిగా అపార్థం చేసుకుంది. దాంతో కథలో కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు రాజ్ తీసుకొచ్చిన బాబు సుభాష్ కొడుకే అని తెలిసిపోవడంతో కథ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత అసలు మాయకి నిజం చెప్పేయడంతో ఇంట్లో ఆ గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు సీరియల్ లో కళ్యాణ్ ఒంటరితనం.. అప్పుని ఇంటిపక్కన వాళ్ళు అనే సూటిపోటి మాటలు.. సుభాష్ తో  అపర్ణ మాట్లాడకపోవడం.. ఇలా ఈ సీరియల్ సాగుతుంది. ఇక కావ్య తెలుగు మాట్లాడటం నేర్చుకుంటుంది‌. దానితో పాటు హైదరాబాద్ లోని గుళ్ళు, షాపింగ్ మాల్స్ అంటూ అన్నీ తిరిగేస్తూ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా బ్రహ్మముడి సీరియల్ లోని అపర్ణ అలియాస్ శ్రీప్రియ శ్రీకార్ , రుద్రాణి అలియాస్ షర్మితతో కలిసి హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళింది. ఇక అక్కడ పూజలు చేసి దానికి సంబంధించిన ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీపిక. ఎప్పుడు ట్రెడిషనల్ గా రెడీ అవుతూ తెలుగు సీరియల్ అభిమానుల ఆదరాభిమానాలు పొందుతుంది కావ్య అలియాస్ దీపిక. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 323K ఫాలోవర్స్ ఉన్నారు.  

Karthika Deepam2 : బావని ఫాలో అవుతూ వెళ్ళిన మరదలికి షాక్.. అసలేం జరిగిందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -99 లో... జ్యోత్స్న వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి వారి ఇంటికి వస్తాడు కార్తిక్. తన అత్తకి జోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడానికి వచ్చిన కార్తీక్ దగ్గరకు జ్యోత్స్న వస్తుంది. ఆ విషయం ఏంటో నాతో చెప్పు బావ.. మా అమ్మతో ఏం చెప్పాలనుకున్నావ్.. అదేంటో చెప్పు బావా? లేదంటే నేను చచ్చినట్టే అని తనపై ఒట్టుపెట్టుకుంటుంది జోత్స్న. ఇక కార్తీక్.. నిజం చెప్పడానికి ఇదే మంచి టైమ్ అని అనుకుంటాడు. ఇంతలో కార్తీక్‌కి కడియం ఫోన్ చేసి విషయం చెప్తాడు.  ఇక విషయం తెలుసుకున్న కార్తిక్ కంగారుగా అక్కడి నుండి బయల్దేరి వెళ్ళిపోతాడు. ఆ స్పీడ్ చూసిన జ్యోత్స్న.. దీప దగ్గరికి వెళ్తున్నాడేమోనని కంగారుగా తననే ఫాలో అవుతుంది. ఇక శౌర్యని కార్తిక్ తీసుకుని దీప ఇంటికి వెళ్తాడు. అది చూసిన జోత్స్న షాక్ అవుతుంది. ఊరికి దూరంగా దీపతో దుకాణం ఇక్కడ పెట్టావా బావ.. అడ్రస్‌తో సహా మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు బావ.. మా ముందు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. రోజూ వచ్చి దీపని ఇక్కడ కలుస్తున్నావా.. చెప్తా నీ సంగతి అని జ్యోత్స్న అనుకుంటుంది.‌ శౌర్యని దీపకి అప్పగిస్తాడు కార్తిక్. ‌అదే సమయంలో ఇంట్లోని గోడపై ఉన్న కార్తీక్ పేరును చూస్తాడు. ఇంతలో రౌడీ గమనించి.. నువ్వు నాతో లేవు కదా.. అందుకే నీ పేరు గోడపై రాశానని అంటుంది. దాంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్‌కి నాపై ప్రేమలేదు.. నీ కోసం రాడని అన్నావ్ కదమ్మా.. చూడు నా కార్తీక్ నాకోసం వచ్చేశాడు.. కార్తీక్‌ కి ఈ ఇంటి అడ్రస్ తెలియదంట.. అందుకే రాలేదు.. అడ్రస్ తెలిస్తే ఎప్పుడో వచ్చేసేవాడని శౌర్య అంటుంది. నా గుండె ఇంకా భయంతో కొట్టుకుంటూనే ఉంటుంది.. బూచోడు మళ్లీ వస్తాడా? అని కార్తీక్‌ని శౌర్య అడుగుతుంది. ఏంటి బూచాడు ఏంటని దీప కంగారుపడుతుంటే.. నీకంతా తర్వాత చెప్తాను.. శౌర్య నువ్వు రెస్ట్ తీసుకో అని  కార్తిక్ అంటాడు. నన్ను వదిలి వెళ్లిపోకు కార్తీక్.. ఇక్కడే ఉంటావ్ కదా హాస్పిటల్‌లో కూడా ఇలాగే వదిలేసి వెళ్లిపోయావని కార్తిక్ తో శౌర్య అనగా.. నిన్ను వదిలి వెళ్లను రౌడీ అని దీప వైపు చూస్తాడు. మీరు ఒకసారి బయటకు రండి మాట్లాడుకుందామని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఆ జాబ్ తమ్ముడికా? భార్యకా?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -151 లో.. సందీప్ ఇంటర్వ్యూకి వెళ్లి సెలక్ట్ అయి ఉంటాడని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతు తన కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే సందీప్ రావడం చూసి తనకి హారతి తీసుకొని వచ్చి.. జనరల్ మ్యానేజర్ అంటూ సందీప్ అని అసలు ఏం జరిగిందో కూడా చెప్పనివ్వదు. అప్పుడు శ్రీలత వచ్చి హారతి కిందపడేస్తుంది. అక్కడ జరిగింది వేరే అని శ్రీలత అంటుంది. వీడు సెలక్ట్ అయ్యాక రామలక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్లి తను సెలక్ట్ అయిందని శ్రీలత చెప్తుంది. దాంతో పెద్దాయన, సిరి, ధనలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ జాబ్ కి సందీప్ కంటే రామలక్ష్మి పర్ ఫెక్ట్ అని పెద్దాయన అంటాడు. ఇక ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారని సిరి అంటుంది. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. పడిపోయి ఉన్న హారతి చూసి ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు సీతా.. నీకు ఏ లోటు లేకుండా పెంచాను. నీ తమ్ముడికి ఒక దారి చూపిస్తావనుకుంటే, నువ్వు నీ భార్యకి జాబ్ ఇచ్చావని శ్రీలత కోపంగా మాట్లాడుతుంది. అదేం లేదు అమ్మ.. తను బాగా చెప్పింది కాబట్టి సెలక్ట్ అయిందని సీతాకాంత్ అంటాడు. ముందే పేపర్ లీక్ చేసి ఉంటారని శ్రీవల్లి అనగానే సీతాకాంత్ తనపై కోప్పడతాడు. అమ్మ నీ సంతోషం కోసం ఏది చేయమన్నా చేస్తానని సీతాకాంత్ అంటాడు. ఏది చేయమన్న చేస్తావా అయితే మాట ఇవ్వమని శ్రీలత అంటుంది. సీతాకాంత్ మాట ఇస్తుంటే.. ఆగండి అని రామలక్ష్మి అంటుంది‌. నా వల్లే ఇదంతా కదా ఈ జాబ్ కి నేను రిజైన్ చేస్తున్నా అని రామలక్ష్మి ఒక పేపర్ పై రాసి ఇస్తుంది. ఆ తర్వాత చూసావా ఎలా చేసానోనని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. నువ్వేం చెయ్యలేవు.. నీవి అన్ని మాటలే.. నావి చేతలు రేపు ఆఫీస్ లో ఏం జరుగుతుందో తెలుసా.. అసలు నువ్వు ఊహించలేవని శ్రీలత అంటుంది.ఆ తర్వాత అసలు అత్తయ్య ఏం చెయ్యాలి అనుకుంటుందని రామలక్ష్మి ఆలోచిస్తుంటే.. సీతాకాంత్ తన దగ్గరకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : ధనరాజ్ కి పెళ్ళి చూపులు.. ఒక్క ఫోన్ కాల్ తో అతను వెళ్ళగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1129 లో... బావ ఎలాగైనా పెళ్లి చూపులు చెడగొట్టని రంగాకి చెప్తుంది సరోజ. నేను చెయ్యలేను మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని రంగా అంటాడు. నువ్వు క్యాన్సిల్ చేయకుంటే ఏంటి నేను చేస్తానని సరోజ అంటుంది. పక్కనే గ్లాస్ లో రాయిలు వేస్తుంటుంది. వసుధార. ఏంటీ పెళ్లి చూపులు సక్సెస్ అవుతుందో లేదోనని వేస్తున్నావా అని సరోజ అడుగగా.. అవును సక్సెస్ అవుతుందని వసుధార అంటుంది. మరొకవైపు నేను ఎండీ చైర్ గురించి ఎన్ని చేసిన అసలు పదవి దక్కడం లేదు.. జగతి పిన్ని, రిషి, వసుధారలని లేపేశాను. ఇప్పుడు అడ్డుగా ఉన్నాడని మనుని పక్కకి తప్పించాం.. అయినా ఎండీ చైర్ రావడం లేదు.. ఆ వసుధార వచ్చి చెప్పాలట చనిపోయిన వారు వచ్చి ఎలా చెప్తారని దేవయానితో శైలేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వచ్చి.. వాళ్ళకి చిరాకు వచ్చేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత మహేంద్రని తీసుకొని ఫణీంద్ర వస్తాడు. మహేంద్ర ఈ ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉందని దేవయాని అంటుంది. మహేంద్ర నొచ్చుకునేలా ఎవరైనా మాట్లాడితే బాగుండదని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత రంగా ఫ్రెండ్ ని సరోజ పిలిచి.. నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు కదా.. అది ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యాలని సరోజ ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో నేనేం చేసిన రిషి సర్ ఇలాగే చేశారు అంటున్నావని వసుధారతో రంగా అనగా.. మీరే నా రిషి సర్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత మహేంద్ర, దేవయాని శైలేంద్ర దగ్గరికి వచ్చి.. మీరే అనుపమని ఏదో అన్నారని తెలుసని మహేంద్ర అంటాడు.‌ అలా అంటున్నావ్ బాబాయ్ అని శైలేంద్ర అంటాడు. అప్పుడే శైలేంద్రకి ఎమ్ఎస్ఆర్ అసిస్టెంట్ ధనరాజ్ కాల్ చేసి.. నాకు పెళ్లి విషయంలో హెల్ప్ చెయ్యాలని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భర్తని ఆషాడం గోరింటాకు పెట్టమన్న భార్య.. వారసుడు కావాలని అత్త డిమాండ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -464 లో.... కావ్య స్టేషన్ కి వచ్చి అప్పు ఏ తప్పు చెయ్యలేదు.. వాళ్లే తప్పుగా మాట్లాడారు, కావాలంటే రికార్డు ఉందని కావ్య అనగానే.. ఆ అబ్బాయిలు భయపడి మాదే తప్పు హోటల్ బుక్ చేస్తా వస్తావా అని అన్నామని ఒప్పుకుంటారు. దాంతో ఇన్స్పెక్టర్ అప్పుని బయటకు పంపించి అబ్బాయిలని సెల్లో వేస్తాడు. మా మరిది కూడా కోపంలో అలా చేసాడని కావ్య అనగానే.. కళ్యాణ్ ని కూడా వదిలేస్తారు. మరి అన్నయ్య అని కళ్యాణ్ అనగానే.. వచ్చేముందు అన్నారు.. నాకు ఇన్ ఫ్లూయెన్స్ చాలా ఉందన్నారు అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఇది టైమ్ చూసి కొడుతుందని రాజ్ అనుకుంటాడు. ఆయనకు కమీషనర్ తెలుసు.. మీరు మా ఆయనకి ఫోన్ ఇస్తే కమీషనర్ కి కాల్ చేస్తాడని కావ్య అంటుంది. అవునా మీకు కమీషనర్ తెలుసా ఫోన్ వద్దులే కానీ వదిలేస్తామని రాజ్ ని కూడా వదిలేస్తారు. దాంతో అందరు బయటకు వస్తారు. ఏంటే అప్పు ఎందుకు ఇలా చేస్తున్నావ్.. ఊరికే ఇలా స్టేషన్ చుట్టూ తిరిగితే అందరు ఏమనుకుంటారని కావ్య అంటుంది. ఏం చేయమంటావ్ అక్క.. వాడు వల్గర్ గా మాట్లాడుతుండు.. రోజు ఇంటికి వచ్చిన వాళ్ళు మీ అమ్మాయి హోటల్ లో దొరికిందంట కాద డబ్బున్న వాణ్ణే పట్టిందని అంటున్నారు.. అలా అంటే అమ్మ నాన్నలకి ఎలా ఉంటుందని అప్పు ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత కావ్య గోరింటాకు తీసుకొని వచ్చి.. రాజ్ ని పెట్టమని అడుగుతుంది. ఇప్పుడు ఎందుకని రాజ్ అడుగుతాడు. ఇప్పుడు ఆషాడం కదా.. అందుకే అమ్మాయి లు పెట్టుకుంటారని కావ్య అంటుంది.ఆ తర్వాత కావ్యకి రాజ్ గోరింటాకు పెడుతుంటే.. ఇక్కడ దురద లేస్తుంది. అక్కడ దురద పెడుతుందంటూ కావ్య అంటుంది. రాజ్ చిరాకు పడతాడు. ఆ తర్వాత కావ్యని రాజ్ రొమాంటిక్ గా చూస్తుంటే అప్పుడే అతనికి ఫోన్ వస్తుంది. కాసేపటికి నా వల్లే అప్పుకి ఇలాంటి పరిస్థితి అంటూ కళ్యాణ్ ఆలోచిస్తుంటే.. అప్పుడే రాజ్ వచ్చి.. నువ్వు ఇలా ఉంటే ఎలారా అని అంటాడు. అప్పు బాధ్యత నాది అని కళ్యాణ్ అంటాడు. ఏం చేస్తావ్.. అసలు నీకు ఏదైనా చేసిలే ఛాన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారా అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలోచించి మీ జీవితం నాశనం చేసుకుంటున్నారు నీ కడుపు పండాలని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పవన్ కళ్యాణ్‌పై ఆలీ సంచలన వ్యాఖ్యలు...అల్లు అర్జున్ పాటకు స్టెప్పులు!

ఇండస్ట్రీలో ఆలీ, పవన్ కళ్యాణ్ రిలేషన్ ఎంతో గొప్పదో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ప్రతీ మూవీలో ఆలీ ఉంటాడు. తనకు లైఫ్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ అని ఆలీ ఎన్నో సార్లు చెప్పాడు కూడా. అలాంటి ఆలీ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఏ మూవీలో కనిపించడం లేదు. ఇప్పుడు ఒక షోలో పవన్ కళ్యాణ్ మీద ఆలీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతే కాదు అల్లు అర్జున్ సాంగ్ కి స్టెప్పులు కూడా వేసాడు. సుమ అడ్డా షో ప్రోమోలో ఈ సీన్స్ కనిపిస్తాయి. ఈ షోకి సౌమ్య రావు, సిరి హన్మంత్, ఆలీ, శ్రీహన్ వచ్చారు. ఇక రాగానే సుమ అందరికీ వైన్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేసింది. ఐతే సుమ శ్రీహన్ ని, ఆలీని ఒక గదిలో కూర్చోబెట్టి "మీకు పాటలు వచ్చా" అని అడిగింది. దానికి ఆలీ 'ఓ అంటావా మావా" సాంగ్ పాడాడు. ఇక సుమ ఆ పాటను తనకు నచ్చినట్టు కన్వర్ట్ చేసుకుంది. ఆ పాటకు అందరూ కలిసి స్టెప్పులేశారు. ఇక తరువాత ఆలీని ఒక ప్రశ్న అడిగింది సుమ. "ఆన్-స్క్రీన్ మీద మీరు వర్క్ చేసిన హీరోల్లో బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు. రవితేజ - ఆలీ, పవన్ కళ్యాణ్- ఆలీ " అని అడిగింది. దానికి ఆలీ పవన్ కళ్యాణ్ తో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాడు. ఆ మాటకు బ్యాక్ స్క్రీన్ మీద పిఠాపురం ఎంఎల్ఏ గారి తాలూకా ఫోటో మంచి ఫైర్ తో ప్లే అయ్యేసరికి అందరూ ఎంజాయ్ చేశారు. ఇక నెటిజన్స్ ఐతే ఆలీ ఇచ్చిన ఆన్సర్ కి మండిపోతున్నారు. "కావాలనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాడు ఆలీ, ఇప్పుడు తెలిసిందా మీకు పవన్ కళ్యాణ్ వేల్యూ" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

ఆర్టిస్ట్ కాక ముందు ఆ గుడిసెలో తిరిగిన జబర్దస్త్ వర్ష.. వీడియో వైరల్!

ఫ్యామిలీ స్టార్స్ షో ప్రతీ వారం ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక ఈ వారం షో ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో వర్ష, ఇమ్ము కామెడీ మాములుగా లేదు. ఇమ్ము ఐతే కౌంటర్ లు పేల్చాడు. వర్షతో పాటు రీతూ మీద కూడా కామెడీ చేసాడు. ఇంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఒక సెగ్మెంట్ పెట్టారు. అందులో రష్మీ ఇల్లు, ఇంద్రజ ఇల్లు అంటూ చూపించారు. ఇప్పుడు అలాంటిదే ఒకటి ఫామిలీ స్టార్స్ కూడా సెగ్మెంట్ పెట్టారు. అందులో ఇమ్ము వర్షను, రీతూను గుడిసెలను చూపించాడు. "హాయ్ ఫ్రెండ్స్ ఇది గుడిసె ..సో ఈ గుడిసె ఎవరిదో కాదు ఫ్రెండ్స్ మన వర్షది..ఆర్టిస్ట్ కాక ముందు వర్ష ఈ గుడిసెలోనే ఉండేది..వర్షకి అవకాశాలు వచ్చి వెళ్ళిపోయాక..రీతూ రెంట్ కి తీసుకుంది ఫ్రెండ్స్ " అనేసరికి రీతూ షాకయ్యింది. అసలు రీతూ, వర్ష ఇలాంటి గుడిసెల్లో ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్, నెటిజన్స్. ఈ మధ్య సుధీర్ ఫామిలీ స్టార్స్ కి హోస్ట్ గా చేస్తూ తన ఫాన్స్ ని మెప్పిస్తున్నాడు. ఈ ప్రోమో కింద కామెంట్స్ అన్నీ కూడా జై సుధీర్ అంటూనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భానుశ్రీ, స్రవంతి అప్సరసల్లా వచ్చి ఎంటర్టైన్ చేశారు. స్టార్టింగ్ షో మొత్తం కూడా బిందాస్ గా నడిచింది కానీ లాస్ట్ లో మాత్రం కన్నీళ్లు పెట్టించేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

వామ్మో సుదీర్ బాత్‌రూమ్‌ చూస్తే మైండ్ పోవాల్సిందే?

ఒకప్పుడు సెలబ్రిటీస్ ఇళ్ళు ఎలా ఉంటాయి...అసలు వాళ్ళ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి...ఎంత పెద్దగా ఉంటాయి అనే లాంటి ఎన్నో సందేహాలు ఫాన్స్ లో, ఆడియన్స్ లో ఎక్కువగా ఉండేది. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. ఎందుకంటే ప్రతీ ఒక్కళ్ళు హోమ్ టూర్స్ చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. దాంతో ఫాన్స్, ఆడియన్స్ కల నెరవేరింది. చిన్నా,పెద్దా సెలబ్రిటీస్ అనే తేడా లేకుండా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో బాల్కనీ, వంట గది, వరండా, బెడ్ రూమ్, ఇట్లా రూములన్నీ కూడా చూపించేసి వర్ణించేస్తూ వీడియోస్ ని షేర్ చేస్తూ ఉన్నారు.     ఐతే బుల్లితెర ఫేమస్ యాంకర్ ఫేమస్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇళ్ళు ఎలా ఉంటుందా అనే సందేహం రాకుండా ఉండదు. ఐతే సుధీర్ ఇంటి విషయం ఏమో కానీ బాత్ రూమ్ మాత్రం కనిపించింది. దాన్ని రివీల్ చేసింది కూడా ఎవరో కాదు వర్ష లవర్, సుధీర్ ఫ్రెండ్ ఇమ్మానుయేల్. ఫామిలీ స్టార్స్ రీసెంట్ ప్రోమోలో ఈ బాత్ రూమ్ టూర్ చేసి చూపించాడు ఇమ్ము. ఇక బాత్ రూమ్ చూసేసరికి మైండ్ పోవాల్సిందే అన్నట్టుగా ఉంది.  "ఇది సుధీర్ అన్న బాత్ రూమ్ ఫ్రెండ్స్... సుధీర్ అన్నకు ఎందులో ఐనా కూడా తోడు కావాలి కాబట్టి ఇలా తోడు కోసం రెండు కామోడ్స్ పెట్టించేసుకున్నాడు.." అంటూ రన్నింగ్ కామెంటరీ చెప్పేసరికి సుధీర్ నవ్వాపుకోలేకపోయాడు. "చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు" అంటూ నవ్వుకున్నాడు. ఐతే నెటిజన్స్ మాత్రం సుధీర్ ని అలా కామెంట్ చేసిన ఇమ్ముని తిడుతున్నారు. "ఇమ్ము అన్నా నువ్వు సుధీర్ అన్నని కామెంట్ చేసేంత సీన్ లేదు...లిమిట్ లో ఉండు..." అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.  

Karthika Deepam2 : పెళ్ళి క్యాన్సిల్ చేయమని కార్తిక్ చెప్పగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -98 లో... ఇన్నిరోజులు జ్యోత్స్న అంటే ఇష్టం లేదని అందరికి చెప్పి ఉంటే బాగుండు.. సిచువేషన్ ఇక్కడి దాకా వచ్చేది కాదని కార్తీక్ ఫీల్ అవుతుంటాడు. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు.. ఎవరికి నా బాధ చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత శౌర్య ఇల్లు కడుతు ఆడుకుంటుంది. ఎందుకు కడుతున్నావని దీప అనగానే.. మనకు సొంతమైన ఇల్లు లేదు కదా అని శౌర్య అంటుంది. మనకి ఊళ్ళో ఉంది కదా అని దీప అంటుంది. ఎక్కడ ఉండనిస్తలేవు కదా.. అన్ని ఇల్లులు తిప్పుతున్నావ్.. ఇక్కడైనా ఉంచుతావో లేదో అని శౌర్య అంటుంది. ఆ తర్వాత కార్ సౌండ్ విని శౌర్య కార్తీక్ వచ్చాడని అనుకుంటుంది. నీ ఫ్రెండ్ కి నీపై ప్రేమ ఉంటే వచ్చేవారని కావాలనే కార్తీక్ గురించి శౌర్యకి చెప్తుంది దీప. ఎలాగైనా శౌర్యని తీసుకొని ఊరికి వెళ్ళాలి.. అప్పుడే కార్తీక్ బాబుని మార్చిపోతుందని దీప అనుకుంటుంది. ఆ తర్వాత కాంచన ఎంగేజ్ మెంట్ కి సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేస్తుంటే.. కార్తీక్ వస్తాడు. నేను దాన్నే కాన్సిల్ చెయ్యడానికి వెళ్తున్నానని మనసులో అనుకొని.. ఒక పనిమీద బయటకు వెళ్తున్నాను ఆశీర్వాదం ఇవ్వండని కాంచన దగ్గర కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ గురించి శౌర్య ఆలోచిస్తుంటుంది. నాకు చిన్న పని ఉంది.. బయటకి వెళ్లి వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకని శౌర్యకి దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి వెళ్ళాలని శౌర్య అనుకొని బయల్దేరుతుంది. మరొకవైపు సుమిత్ర దగ్గరికి కార్తిక్ వస్తాడు.  మమ్మీ లేదని జ్యోత్స్న చెప్తుంది. ఏంటి మమ్మీతో ఏం మాట్లాడాలని జ్యోత్స్న అనగానే.. జీవితం గురించి అని కార్తీక్ అంటాడు. నేను అత్తయ్య వచ్చేవరకు వెయిట్ చేస్తానని కార్తీక్ అంటాడు. మరొకవైపు కార్తీక్ కోసం శౌర్య వెతుక్కుంటూ వస్తుంది. అదేసమయంలో దీప ఇంటికి వెళ్లేసరికి శౌర్య  ఉండదు. దాంతో శౌర్య గురించి దీప టెన్షన్ పడుతూ వెతుక్కుంటు వెళ్తుంది. మరొకవైపు ఒంటరిగా ఉన్న శౌర్యని నర్సింహా చూసి వెంబడిస్తుంటే.. బయపడి ఒక దగ్గర దాక్కుంటుంది శౌర్య. నర్సింహా వెళ్ళిపోయాక బూచోడు వెళ్ళిపోయాడని శౌర్య అనుకుంటుంది. మరొకవైపు శౌర్య గురించి దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu: అమ్మ కోసం భార్యకి వచ్చిన జాబ్ ని భర్త వదిలేయమంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -150 లో.... సందీప్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడని శ్రీవల్లి హడావిడి చేస్తుంది. ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అయ్యావా అని సందీప్ ని సీతాకాంత్ అడుగుతాడు. అయ్యానని సందీప్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ వెళ్తుంటే రామలక్ష్మి ఎదురువస్తుంది. సందీప్ వెళ్తుంటే శ్రీవల్లి హారతి ఇచ్చి పంపిస్తుంది. కావాలనే శ్రీలత ఇక నేను అనుకున్నట్లే జరుగుతుందని సందీప్ తో శ్రీలత అంటుంది. దంతో అలా ఎందుకు అంటుందని రామలక్ష్మి డౌట్ పడుతుంది. ఆ తర్వాత  సందీప్ ఆఫీస్ కి వెళ్తాడు. తనతో పాటు ఇంటర్వ్యూ కి కొంతమంది వస్తారు. వీల్లలో నేను ఎలా సెలక్ట్ అవుతాను.. అసలు అమ్మ ఎవరిని ఏర్పాటు చేసిందని సందీప్ అనుకుంటుండగా.. అప్పుడే ఒకతను వచ్చి సందీప్ ని పక్కకి పిలిచి.. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇస్తాడు. మిగతా వాళ్ళు కూడా నేను ఏర్పాటు చేసినవాళ్ళే అసలు వాళ్ళు సమాధానం చెప్పరని సందీప్ తో అతను అంటాడు. మరొకవైపు అసలు ఎందుకు అలా అంటుందని రామలక్ష్మి ఆలోచిస్తుంటుంది. అప్పుడే పెద్దాయన ఆఫీస్ కి వెళ్తుంటే అతన్ని ఆపి జనరల్ మేనేజర్ పోస్ట్ ఎలా ఉంటుందని అడుగగా.. అది ఆఫీస్ లోనే ఇంపార్టెంట్ పోస్ట్.. దానివల్లే కంపెనీ రిపీటేషన్ బాగుంటుందని చెప్తాడు. ఈ జనరల్ మేనేజర్ పోస్ట్ ని అడ్డుపెట్టుకొని ఆఫీస్ కి లాస్ తీసుకొని రావాలని ట్రై చేస్తున్నారు.. అది సీతా సర్ పైకి వచ్చేలా చేద్దామని అనుకుంటున్నారని రామలక్ష్మి అనుకొని వెంటనే దాన్ని ఆపాలనుకుంటుంది. ఆ తర్వాత మాణిక్యానికి రామలక్ష్మి ఫోన్ చేసి.. ఏదో చెప్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. మరొకవైపు రామలక్ష్మికి సంబంధించి అప్లికేషన్ ని మాణిక్యం రెడీ చేస్తాడు. ఆ తర్వాత సందీప్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యారని చెప్తాడు. అప్పుడే మాణిక్యం ఇంకొకరున్నారని చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత ఆ పోస్ట్ కి రామలక్ష్మి సెలక్ట్ అవుతుంది. ఆ విషయం శ్రీలతకి సందీప్ ఫోన్ చేసి చెప్తాడు. రామలక్ష్మి, మాణిక్యం ఇద్దరు ఆ విషయం సీతాకాంత్ దగ్గరికి వెళ్లి చెప్తారు. నువ్వు సెలక్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది కానీ అమ్మ సందీప్ కి రావాలని అనుకుంటుంది కదా.. ఏమైనా అనుకుంటుదేమో.. నువ్వు ఇంటర్వ్యూ కి రాకుండా ఉంటే బాగుండని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : మరదలికి పెళ్ళి చూపులు.. వదిలెల్లిపోయిన ఆ ఇద్దరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1128 లో....మినిస్టర్ గారు ఎండీ గురించి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. నేను మనుకి ఎండీ బాధ్యతలు ఇద్దామని నిర్ణయం తీసుకున్నానని మినిస్టర్ అంటాడు. మీరు తనని ముందు ఉండి నడిపించండి అని మినిస్టర్ అనగానే.. అందుకు నేను సిద్ధంగా లేనని మను అంటాడు. అది విని అందరు షాక్ అవుతారు. శైలేంద్ర మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా నేను బోర్డు మెంబర్ గా రిజైన్ చేస్తున్నాని మను చెప్పి వెళ్ళిపోతాడు. అసలు ఏంటి ఇలా జరుగుతుంది.. ఫస్ట్ రిషి తర్వాత వసుధార, ఇప్పుడు మను ఇలా వదిలేసి వెళ్తున్నారు ఏంటని మినిస్టర్ అంటాడు. నేను కాలేజీని సమర్ధవంతంగా ముందు కు నడుపుతాను ఎండీ పదవి నాకు ఇవ్వండని శైలేంద్ర అనగానే.. చెప్పాను కదా ఆ వసుధార వచ్చి చెప్తేనే నీకు ఎండీ పదవి అని మినిస్టర్ అంటాడు. మరొకవైపు రాధమ్మ దగ్గరికి సరోజ వచ్చి.. చూసావా ఇప్పుడేం జరిగిందో, అందుకే నీకు తోడుగా ఒకరు ఉండాలని సరోజ అంటుంది. ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి ఉంది కదా అని రాధమ్మ అంటుంది. తను వర్క్ చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇక నిన్నేం పట్టించుకుంటుంది.. నన్ను బావ పెళ్లి చేసుకుంటే.. నేనెప్పుడు నీతోనే ఉంటాను కదా అన్ని పనులు చేస్తానని సరోజ అంటుంది. అప్పుడే సరోజ నాన్న సంజీవయ్య వస్తాడు. ఇప్పుడెలా ఉన్నారు అత్తయ్య అని రాధమ్మని అడుగుతాడు. ఇంకా నయం నా వడ్డీ డబ్బులు ఎగపెడతారేమో అనుకున్నానని అంటాడు. రేపు సరోజకి పెళ్లి చూపులు అని అనగానే... నాన్న నాకు వద్దని సరోజ అంటుంది. మరొకవైపు మహేంద్ర డల్ గా ఉంటే అప్పుడే ఫణింద్ర వచ్చి.. మను ఇలా చేయడమేంటని అడుగుతాడు. వాళ్ళు అసలు కాలేజీలో గాని నా జీవితంలో ఉండాలనుకోవడం లేదు.. నిన్నే వెళ్లిపోయారని మహేంద్ర అంటాడు. నువ్వు ఒక్కడివే ఎందుకు అక్కడ.. మా దగ్గరికి రా అని ఫణీంద్ర అంటాడు. నేను రానని మహేంద్ర అంటాడు. మరొకవైపు నా పెళ్లి చూపులు చెడగొట్టు బావ అని సరోజ రంగాని అడుగగా.. నా వల్ల కాదని రంగా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిసిందే.  

Brahmamudi : భార్యతో పాటు మరిది కూడా స్టేషన్ లో.. ఆమె ఏం చేసిందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -463 లో... అబ్బాయిల్ని ఇంత డేంజర్ గా కొడతావా అని అప్పుపై ఇన్ స్పెక్టర్ కోప్పడతాడు. సర్ నన్ను అవమానించారు.. అందుకే కొట్టానని అప్పు అంటుంది. మాకు ఫోన్ చేస్తే మేమ్ వచ్చే వాళ్ళం కదా అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఆ తర్వాత అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. వీళ్లే అన్న అప్పుని ఏడిపించిందని బంటు చెప్పగానే.. కళ్యాణ్ వాళ్ళని స్టేషన్ లోనే కొడతాడు. కానిస్టేబుల్ అడ్డు రావడంతో కళ్యాణ్ కానిస్టేబుల్ ని కొడతాడు. ఇన్‌స్పెక్టర్ కి కోపం వచ్చి కళ్యాణ్ ని కూడా అరెస్ట్ చెయ్యమని చెప్పడంతో..  కళ్యాణ్ ని కూడా అరెస్ట్ చేస్తారు. మీ వాళ్ళ నెంబర్ చెప్పమని కళ్యాణ్ ని ఇన్‌స్పెక్టర్ అడుగగా.. అతను రాజ్ నెంబర్ చెప్తాడు. మరొకవైపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కావ్యతో రాజ్ అనగానే.. ఈ కేరింగ్ మొదటి నుండి ఏమైందని కావ్య అంటుంది. అప్పుడే రాజ్ కి ఇన్‌స్పెక్టర్ కాల్ చేసి.. మీ అబ్బాయిని భయంలో పెట్టుకోరా అని ఇన్ స్పెక్టర్ తిడుతుంటే.. మా అబ్బాయా? నాకు అబ్బాయి లేడని రాజ్ అంటాడు. ఇక పక్కనే ఉన్న కావ్య.. అబ్బాయి ఏంటి ? మీకు మళ్ళీ బాబు ఉన్నాడా అని కావ్య అంటుంది. నువ్వు ఆపు అంటూ కావ్యపై రాజ్ కోప్పడతాడు. ఇన్స్పెక్టర్ గారు మీరేం అంటున్నారు నాకు అర్థం కావడం లేదని రాజ్ అనగానే.. కళ్యాణ్ ఇక్కడ కానిస్టేబుల్ ని కొట్టాడని చెప్తాడు. దాంతో కళ్యాణ్ స్టేషన్ లో ఉండడం ఏంటని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ వెళ్తుంటే.. నేను వస్తానని కావ్య అనగానే.. నా ఇన్ ఫ్లూయెన్స్ తో వాడిని బయటకు తీసుకొని వస్తానని రాజ్ కంగారుగా వెళ్తాడు. ప్రకాష్ చూసి ఏమైంది రాజ్ అలా వెళ్తున్నాడని కావ్యని అడుగుతాడు. కావ్య ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత రాజ్ స్టేషన్ కి వెళ్ళాక కోపం తో.. ఇన్‌స్పెక్టర్ పై చెయ్యి చేసుకుంటాడు. డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ పై ఇలా చేస్తావా అని రాజ్ ని కూడా అరెస్ట్ చేస్తాడు ఇన్ స్పెక్టర్. అక్కడే ఉన్న బంటు కావ్యకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దాంతో కావ్య స్టేషన్ కి వచ్చి.. అప్పు ఏం తప్పు చెయ్యదు. ఈ అబ్బాయిలు తప్పుగా మాట్లాడితే ఇలా చేసిందట అని కావాలంటే రికార్డు కూడా ఉందని కావ్య అనగానే.. రికార్డు ఎక్కడిదని బంటు అనుకుంటాడు. ఇక బంటు కూడ ఉందనగానే.. ఆ అబ్బాయిలు భయపడి.. మాదే తప్పని అంటారు. తరువాయి భాగంలో రాజ్ ని గోరింటాకు పెట్టమని కావ్య అడుగుతుంది. ఇప్పుడు ఎందుకని రాజ్ అనగానే.. ఆషాడంలో ఆడవాళ్లు పెట్టుకుంటారని కావ్య అంటుంది. అలా అనగానే కావ్యకి  రాజ్ గోరింటాకు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.