ఆ రింగ్ రంగా చేతికి ఎలా వచ్చింది.. తండ్రి కోసం మను ఆవేదన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1138 లో.. అనుపమ, మనులు దేవయాని ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన దేవయాని.. దారి తప్పి వచ్చారా అని అంటుంది. లేదు కావాలనే వచ్చామని అనుపమ అనగా.. ఎందుకని దేవాయని అడుగుతుంది. మహేంద్రతో మాట్లాడాలని అనుపమ అనగానే తనని మీరు వదిలేసి వెళ్లారని మీపై కోపంగా ఉన్నాడని దేవయాని అంటుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఎలా ఉన్నారు సర్ అని  మను అడుగుతాడు. ఎదో ఇలా ఉన్నానని మహేంద్ర అంటాడు. నేను, మను ఈ సిటీ వదిలి వెళ్లిపోతున్నాం.. అందుకు మను కూడా ఒప్పుకున్నాడు.. ఒకసారి నిన్ను కలిసి చెప్పి వెళదామని వచ్చామని అనుపమ అంటుంది. ఇన్నిరోజులు ఒక ప్రశ్నకి సమాధానం కోసం చూసావ్.. ఆ ప్రశ్నకి సమాధానం రాకుండానే వెళ్ళిపోతావా అని మహేంద్ర అనగానే.. ఆ ప్రశ్నకి సమాధానం అవసరం లేదని వెళిపోతున్నానని మను అంటాడు. ఆ తర్వాత మహేంద్ర దగ్గర మను ఆశీర్వాదం తీసుకుంటాడు. మీరు ఈ సిటీ వదిలి వెళ్లొద్దని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్ర వెళ్ళిపోతాడు. మీకు సిగ్గు అభిమానం ఉంటే.. మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టకండని దేవయాని అనగానే మనుకి కోపం వస్తుంది. కానీ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు శైలేంద్ర చెప్పిన దానికి ఒప్పుకొని రంగా డబ్బులు కూడా తీసుకుంటాడు. ఇప్పుడే నాతో రావాలని శైలేంద్ర అంటాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పి వస్తానని రంగా అంటాడు. అంత టైమ్ లేదని శైలేంద్ర అంటాడు. సరే బుజ్జి లకి డబ్బులు ఇచ్చి వస్తానని రంగా ఎదరుగా ఉన్న బుజ్జి దగ్గరకి వెళ్తాడు. బుజ్జి కి డబ్బులు ఇచ్చి.. నానమ్మని హాస్పిటల్ లో చూపించమని రంగా అంటాడు. పని మీద వెళ్ళాడు వస్తాడని చెప్పమని రంగా అంటాడు. మరి మేడమ్ గారు అడిగితే ఏమని చెప్పాలని బుజ్జి అంటాడు. రంగా తన జేబు లో నుండి VR అనే అక్షరాలు గల రింగ్ ని బుజ్జికి ఇచ్చి ఇది మేడమ్ గారికి ఇవ్వు మేడమ్ నిర్దారించుకుంటుంది. అంతే కాకుండా సర్ తో ఉన్న ఫోటోని మేడమ్ కి చూపించు అర్థం చేసుకుంటుంది.. ఫోన్ లో ఏం చేయాలో చెప్తానని బుజ్జికి రంగా చెప్తాడు. మరొకవైపు శైలంద్ర దేవయానికి ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ ఆ రంగా గాడు నాతో వస్తున్నాడని చెప్తాడు. ఆ తర్వాత రంగా, శైలేంద్ర లు ఇద్దరు బయల్దేరతారు. మరొకవైపు అమ్మ నా తండ్రి మహేంద్ర సారె కదా అని మను అంటాడు. దాంతో అనుపమ షాక్ అవుతుంది. నీకెందుకు అలా అనిపించిందని అనుపమ అనగానే.. సర్ ని కలిసినప్పుడల్లా ఏదో ఎఫ్ఫిక్షన్ అని మను అంటాడు. నా తండ్రి ఎవరో ఇప్పటికైనా చెప్పు.. అసలు నువ్వు నా కన్నా తల్లీవేనా ఇన్నిసార్లు అడుగుతున్నా.. నా వేదన అర్థం అవ్వడం లేదా అని మను అనగానే.. అమ్మ అంటే అర్థం తెలుసకున్న రోజు, నువ్వు ఈ ప్రశ్న అడుగమని అనుపమ చెప్పి బాధపడుతు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తన మనసులో మాటని కళ్యాణ్ బయటపెడతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -473 లో... రుద్రాణి మాటలు నమ్ముతుంది ధాన్యలక్ష్మి. ఈ కావ్య అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటుంది. అందుకే ఇప్పుడే కళ్యాణ్ కి పెళ్లి ఎందుకు అంటుందని అనగానే.. కావ్య ధాన్యలక్ష్మిని కోప్పడుతుంది. ఇప్పుడు మేమ్ మా ఇంటినుండి వచ్చాము. ఈ రోజు అప్పుకి పెళ్లిచూపులు పెళ్లి ఫిక్స్ అయిందని కావ్య అంటుంది. అయితే నీ మనసులో ఏ ఉద్దేశం లేకుంటే కళ్యాణ్ ని పెళ్లి కి ఒప్పించమని ధాన్యలక్ష్మి అనగానే.. అందుకు కావ్య సరే అంటుంది. మరొకవైపు కళ్యాణ్, అప్పు లు ఒక దగ్గర కలుసుకుంటారు. అప్పు కళ్యాణ్ వంక డైరెక్ట్ గా చూడలేకపోతుంది అప్పు. నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలి. ఈ పెళ్లి బలవంతంగా చేసుకుంటున్నావా? ఇష్టంగా చేసుకుంటున్నావా అని అప్పుని కళ్యాణ్ అడుగుతాడు. ఇష్టం లేదని చెప్పు అప్పు.. నా మనసులో నువ్వున్నావని చెప్తానని కళ్యాణ్ అనుకుంటాడు. ఇష్టపడి చేసుకుంటున్నాను.. మా వాళ్లకి ఇష్టం అని అప్పు అనగానే కళ్యాణ్ బాధపడతాడు. నాకు ఇష్టం లేదు మా వాళ్ళ కోసం చేసుకుంటున్న అని నీతో ఎలా చెప్పగలనని అప్పు తన మనసులో అనుకుంటుంది. కళ్యాణ్ బాధపడుతు.. ఆల్ ది బెస్ట్ చెప్తాడు.ఆ తర్వాత అసలు నువ్వు ఎందుకు మా పిన్నికి మాటిచ్చావ్.. అసలు కళ్యాణ్ మనసులో ఏముందో నీకు తెలుసా? తన మనసులో అప్పు ఉంది అని రాజ్ అంటాడు. మీరు కూడా అనామికలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళది కేవలం స్వచ్ఛమైన స్నేహం మాత్రమేనని కావ్య అంటుంది. అయిన అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని రాజ్ అంటాడు. అదేం లేదు నేను కళ్యాణ్ ని అడుగుతానని కావ్య అంటుంది. మరొకవైపు నేను చేసింది వర్క్ అవుట్ అయిందని రాహుల్ కి రుద్రాణి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య కళ్యాణ్ ని పిలిచి.. నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అయిన మీ మధ్య స్నేహం మాత్రమే ఉంది.. నాకు తెలుసు అదేం లేదు‌ కదా అని  కావ్య అంటుంది‌. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నానని మీ అన్నయ్య నాతో అంటున్నారు.. నువ్వు చెప్పు మీ మనసులో అప్పు ఉందా అని కావ్య అడుగుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ మనసులో అప్పు ఉంది.. అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని రాజ్ అనగానే.. మీకు అర్థం అవడం లేదా కళ్యాణ్ ని అడిగాను అదేం లేదని కావ్య అంటుంది. చెప్పురా నీ మనసులో అప్పు లేదా.. పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదా అని రాజ్ కళ్యాణ్ ని అడుగుతాడు. ఇప్పుడూ అప్పుని ప్రేమించడం ఏంట్రారా చెప్పమని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బూచోడిని చూసి భయపడ్డ శౌర్య.. వాడే మీ నాన్న!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -107 లో......కార్తీక్, జ్యోత్స్నల ఎంగేజ్ మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉంటారు. అప్పుడే పారిజాతం వచ్చి నువ్వు అనుకున్నది ఆపాలని చూసావ్.. నేను జరగాలని చూసాను.. నాదే గెలిచింది.. నా అనుభవం ముందు నీ ఆవేశం ఎంత అని పారిజాతం అంటుంది. నేను తగ్గింది గెలవడం కోసమేనని కార్తీక్ అంటారు. ఏంటి మనవడితో ఏదో మాట్లాడుతున్నావంటూ శ్రీధర్ అంటాడు. ఏం లేదు నాకు వీడిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదని పారిజాతం అంటుంది. ఆ తర్వాత శౌర్య, కార్తీక్ దగ్గరికి వచ్చి.. నేను నీ దగ్గర కూర్చుంటానని అంటుంటే వద్దని దీప పిలుస్తుంది. పర్లేదు కూర్చోమను అని  కార్తిక్ అంటే.. ఇదేం గెట్ టూ గెదర్ కాదు అందరు కలిసి కూర్చొవడానికి ఇక్కడ మనం ఇద్దరమే కూర్చోవాలని జ్యోత్స్న అంటుంది. దాంతో సుమిత్ర శౌర్యని పిలిచి తన ఒళ్ళో కూర్చో పెట్టుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ దీప వంక చూస్తుంటే.. నువ్వు ఇక్కడున్నావ్ నీ మనసు ఎక్కడో ఉందని జ్యోత్స్న అంటుంది. కొన్నిచోట్ల మనిషి ఉంటే చాలు మనసుతో పని లేదని కార్తీక్ అంటాడు. నాకు మనసు కూడా కావాలని జ్యోత్స్న అంటుంది. ఇది రెండో పెళ్లి అని జ్యోత్స్న అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. అంటే నేను పుట్టక ముందే నన్ను పెళ్ళాన్ని చేసుకున్నావ్ కదా ఇది రెండవసారి అంటున్నా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏంటి అమ్మ ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నావని దీపతో శౌర్య అంటుంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు తాంబులాలు మార్చుకుంటుంటే.. అప్పుడే నర్సింహా వస్తాడు. నర్సింహాని చూసి బూచోడని శౌర్యా అరుస్తుంది. దంతో తాంబులాలు మార్చుకోకుండా ఆగుతారు. ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. నరసింహాతో పాటు అనసూయ కూడా వస్తుంది. నా కొడుకు బిడ్డని తీసుకొని వెళ్ళడానికి వచ్చానని అనసూయ అంటుంది. ఆ తర్వాత అందరూ వద్దని అంటారు. మీరందరు కలిసి కార్తీక్ అన్న మాట నిజం చేసేలా ఉన్నారని నరసింహా అనగానే.. ఏం అన్నాడని అడుగుతారు. శౌర్యకి తండ్రి అతనేనట అని నరసింహా అనగానే.. అందరు షాక్ అవుతారు. కార్తీక్ నువ్వు అన్నావా అని ఇంట్లో వాళ్ళు అడుగగా.. అన్నానని చెప్తాడు. ఆ తర్వాత నా మనవరలు ఎక్కడ అంటూ అనసూయ.. శౌర్య పైన దాక్కొని ఉన్నా శౌర్యా దగ్గరికి వెళ్తుంది. నానమ్మ అంటూ అనసూయ దగ్గరకి వస్తుంది శౌర్య. మీ నాన్న అని అంటావ్ కదా తీసుకోని వచ్చానంటూ కిందకి తీసుకొని వెళ్తుంది. ఆమ్మో బూచోడు అని శౌర్య భయపడుతుంటే.. బూచోడు కాదు అతనే మీ నాన్న అని అనసూయ చెప్పగానే.. శౌర్య ఏడుస్తూ‌.. బూచోడు మా నాన్న కాదంటూ దీప దగ్గరకి వెళ్తుంది. బూచోడు నాన్ననా అమ్మ అని దీపని శౌర్య అడుగుతుంది. అడుగుతుందిగా చెప్పమని అందరు అనగానే.. వాడే మీ నాన్న అని దీప అంటుంది. దాంతో శౌర్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బంఢారం బయటపెట్టేసిన రామలక్ష్మి... సందీప్ కి వార్నింగ్ ఇచ్చిన సీతాకాంత్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -159 లో.. మీరు ఇన్ని రోజులు సీతా సర్ కి పెళ్లి ఎందుకు చేయలేదని శ్రీలతని అడుగుతుంది రామలక్ష్మి. నేను ఎప్పుడు వాడికి పెళ్లి చేస్తాను అన్నాను.. నిన్ను కూడా వారసుడిని ఇప్పుడిస్తావని అడిగాను.. నువ్వు సమాధానం చెప్పలేదు. ఇప్పుడూ చెప్పు వారసుడిని ఎప్పుడు ఇస్తావని శ్రీలత అడుగుతుంది. మాకు ఈ మధ్య పెళ్లి అయింది.. ఎప్పుడో పెళ్లి అయిన శ్రీవల్లి, సందీప్ లని వదిలేసి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత అసలు పెళ్లి చేసుకోకపోవడం అనేది పూర్తిగా అది నా నిర్ణయం.. నువ్వు ఆలా అమ్మని అడిగి బాధపెట్టకని సీతాకాంత్ కోపంగా భోజనం చేయకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి సందీప్ వచ్చి.. చూసావా మమ్మీ ఆ రామలక్ష్మి అన్నయ్య ముందే ఎన్ని మాటలు అంటుందోనని సందీప్ అంటాడు.అది వదిలేయ్ గాని పని ఎంత వరకు వచ్చింది. ఒకే మమ్మీ ఏ డౌట్ లేకుండా పని పూర్తి అవుతుందని సందీప్ అంటాడు. దాని వాళ్ళ నష్టం జరిగితే అది సీతాకాంత్ వళ్లే జరిగిందని చెప్పి చైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు. ఆ తర్వాత ఆ సామ్రాజ్యానికి నువ్వే రాజ్ వి అని శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. వాళ్ళ మాటలు సీతాకాంత్ విన్నాడేమో అని భయపడతారు కానీ సీతాకాంత్ వచ్చి రామలక్ష్మి మాటలు పట్టించుకోకూ అమ్మ అని చెప్తాడు.ఆ తర్వాత మాణిక్యం సందీప్ ని కలిసి పెద్దాయన దగ్గరికి వస్తాడు. నేను సిరి గ్రూప్ ఇండస్ట్రీస్ నుండి వచ్చాను. అసలేం జరిగింది ఏం భయపడకని అడుగుతాడు. దాంతో పెద్దాయన జరిగింది చెప్తాడు. ఆ విషయం మాణిక్యం రామలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. రామలక్ష్మి పెద్దాయనతో ఫోన్ లో మాట్లాడుతుంది. వచ్చి నిజం చెప్పమంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు రామలక్ష్మి పెద్దాయన కోసం ఎదరుచూస్తుంది. అప్పుడే పెద్దాయన వచ్చి మీరు కొన్న ల్యాండ్ ఇండస్ట్రీకి పనికి రాదు ఇల్లు కట్టుకొవడానికి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఆ విషయం చెప్పాడానికి వస్తే ప్రొద్దున పట్టించుకోలేదని పెద్దాయన చెప్పగానే సందీప్ టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత సందీప్ పైన కోప్పడతాడు సీతాకాంత్. సందీప్ కవర్ చేయాలనీ ట్రై చేస్తాడు కానీ.. పెద్దాయన మీతో చెప్పానని అనగానే సీతాకాంత్ కి కోపం వస్తుంది. థాంక్స్ మంచి పని చేశారని సీతాకాంత్ పెద్దాయనని పంపిస్తాడు. ఆ తర్వాత అమ్మ మొహం చూసి వదిలిపెడుతున్నా ఇంకొకసారి ఇలా చేసావో.. ఏం చేస్తానో తెలియదంటూ సీతాకాంత్ సందీప్ కి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఎలా ఉందని రామలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్లి కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : వసుధారకి గిఫ్ట్ ఇచ్చిన రిషి..

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1137 లో.... రంగాకి రిషి ఫోటోని చూపించి, ఇతను నా తమ్ముడు సేమ్ నీలాగా ఉన్నాడు ముందు నేను నమ్మలేదు కానీ నువ్వు వేరు వాడు వేరని ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని శైలేంద్ర అంటాడు. అతను ఒక కాలేజీ ఎండీ మంచి మనిషి అలాంటివాడు ఇప్పుడు మా మధ్య లేడు. అందుకే నీతో అవసరం వచ్చిందని శైలేంద్ర అంటాడు. దాంతో అయితే నాతో ఏం అవసరమని రంగా అడుగుతాడు. నువ్వు నాతో రిషిలా మా కాలేజీ కకి రావాలి ఎండీగా ఉండాలని శైలేంద్ర అనగానే.. నా వల్ల కాదు.. నేను పెద్దగా చదువుకోలేదు సర్ అని రంగా అంటాడు. అది నిజమే కానీ నువ్వు వచ్చి నన్ను ఎండీని చెయ్యండి అని చెప్పు చాలు.. ఇప్పుడు ఇలా చెయ్యకపోతే కాలేజీ నాశనం అవుతుంది. స్టూడెంట్ భవిష్యత్తు పాడవుతుంది. నువ్వు ఇది చేస్తే కాలేజీని స్టూడెంట్స్ ని మా బాబాయ్ ని కాపాడిన వాడివి అవుతావు. నువ్వు ఊరికే ఏం చేయకు,  నీకు కోటి రూపాయలు ఇస్తాను. అప్పులన్నీ తీరీపోతాయని రంగాని రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. నేను ఒప్పుకోనని రంగా అనగానే.. నువ్వు అలోచించి నిర్ణయం చెప్పమని శైలేంద్ర అంటాడు.ఆ తర్వాత ఇలా వాడికి డబ్బులు ఆఫర్ చేశాను కానీ వాడు సైలెంట్ గా వెళ్లి పోయాడని దేవయానికి శైలేంద్ర వచ్చి చెప్తాడు. అలా డబ్బులు తీసుకోలేదంటే వాడు రిషి కావచ్చని దేవయాని అంటుంది. వాడు రిషి కాదు రంగా అని శైలేంద్ర అంటాడు. వాడే ఫోన్ చేస్తాడు ఒప్పుకుంటాడని శైలేంద్ర అనగానే.. అపుడే ధరణి చాటుగా ఆ మాటలు వింటుంది‌. వీల్లెదో ప్లాన్ చేస్తున్నారులని ధరణి అనుకుంటుంది. ఆ తర్వాత మీరు కాలేజీ గురించి ఆలోచించకుండా.. నన్ను ఎలా రంగా కాదు రిషి అని ప్రూవ్ చెయ్యాలని స్వార్థంగా ఆలోచిస్తున్నారని వసుధార పైన రంగా కోప్పడతాడు. మీరు రండీ ఇద్దరం వెళదామని వసుధార అంటుంది. నేను రానని కోపంగా రంగా వెళ్తాడు. ఆ తర్వాత వసుధార మొహం కడుక్కొని అద్దం దగ్గరికి వెళ్లి చేసుకుంటుంది. తన చేతికి ఉన్న రింగ్ కనిపించదు. దాంతో అంతా వెతుకుతుంది. వెళ్లి రాధమ్మకి చెప్తుంది. దొరుకుతుందని రాధమ్మ అంటుంది. రిషి సర్ ఎక్కడా అని వసుధార అడగ్గానే.. బుజ్జిని తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు. నీకు ఇది ఇవ్వమన్నాడని ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడని, దానిని వసుధారకి ఇస్తుంది రాధమ్మ. మరొకవైపు శైలేంద్రని రంగా కలుస్తాడు. శైలేంద్ర చెప్పిన దానికి రంగా సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టిన రుద్రాణి.. నిలదీసి‌న కావ్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -472 లో.. ధాన్యలక్ష్మి సాంగ్స్ వింటుంటే.. అప్పుడే తన దగ్గరకి రుద్రాణి వస్తుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. కళ్యాణ్ గురించి అన్నీ చెప్పాను కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పిందని రుద్రాణి అనగానే.. ఇప్పుడు కళ్యాణ్ కి పెళ్లి ఏంటి విడాకులు అయి రెండు రోజులే అయింది. ఇంకా వాడు సెట్ అవ్వలేదని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు.. కరెక్ట్ టైమ్ అనుకొని కళ్యాణ్ కి మాయమాటలు చెప్పి అప్పుని ఇచ్చి పెళ్లి చేస్తోందని రుద్రాణి అంటుంది. అలా చేస్తూ ఉంటే నేను చూస్తానా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ కావ్య గురించి నీకు తెలియదా అపర్ణని ఎలా ఉండేదాన్ని.. ఎలా మార్చింది రాజ్ ని ఎలా మార్చిందని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. మరొకవైపు పెళ్లి ఫిక్స్ అయినందుకు కనకం కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఎందుకో బాధగా ఉంది.. మీ దగ్గర డబ్బులు లేవు.. వాళ్ళున్న వాళ్ళు కాదని స్వప్న అనగానే.. ఇప్పుడు నాకు అలాంటి ఆలోచనలు లేవు. మీరు డబ్బున్న ఇంటికి ఇస్తే మీరు కష్టం అనుభవించారు. ఇప్పుడు కావ్య జీవితం కుదుటపడిందని కనకం అంటుంది. అయినా వాళ్లకు ఏదైనా అవసరమొస్తే మనం ఉన్నాం కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పు అక్కడ నుండి బయటకు వస్తుంది. తన వెనకాలే కావ్య, స్వప్నలు వస్తారు. ఏంటి అలా వున్నావ్ పెళ్లి ఇష్టం లేదా అని కావ్య అడుగుతుంది. నా వల్ల అమ్మనాన్న ఇద్దరు చాలా బాధపడ్డారు.. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా.. అని అప్పు అంటుంది. ఆ తర్వాత అక్కచెల్లెల్లు సరదాగా మాట్లాడుకుంటారు. కాసేపటికి అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. ఒకసారి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పు మొదట వద్దన్న ఆ తర్వాత సరేనంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి ఇంట్లో అందరిని పిలిచి.. కళ్యాణ్ కి పెళ్లి చెయ్యాలనుకుంటున్నానని అనగానే అందరు షాక్ అవుతారు. నాకు చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావంటూ ప్రకాష్ తనపై కోప్పడతాడు. అప్పుడే కావ్య, స్వప్నలు వస్తారు. ఇప్పుడే కళ్యాణ్ కి పెళ్లి ఏంటని కావ్య అనగానే.. మరి ఎప్పుడు చెయ్యాలి. నువ్వు ఏదైనా ప్లాన్ చేసావా అని ధాన్యలక్ష్మి అనగానే.. నేనేందుకు చేస్తానని కావ్య అంటుంది. అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నావా అని ధాన్యలక్ష్మి అనగానే.. తనపై కావ్య కోప్పడుతుంది. ఏంటి అక్క నీ కోడలు అలా మాట్లాడుతుందని అపర్ణకి ధాన్యలక్ష్మి చెప్తుంది. నేనే మాట్లాడమని చెప్పానని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో నువ్వెందుకు కళ్యాణ్ ని పెళ్లి కి ఒప్పిస్తానని మాటిచ్చావని కావ్య పైన రాజ్ కోప్పడతాడు. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్య వెళ్లి కళ్యాణ్ ని మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

టాప్ రేటింగ్ తో బ్రహ్మముడి.. సెకెండ్ పొజిషన్ లో ఏం ఉందంటే!

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా సీరియల్స్ కి ఉండే క్రేజే వేరు. స్టార్ మా టీవీలో ప్రైమ్ టైమ్ లో వచ్చే సీరియల్స్ కి ఉండే టీఆర్పీ మరే ఇతర సీరియల్ కి ఉండదు. ఇక ఈ వారం ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో ఓసారి చూసేద్దాం. కొత్తగా మొదలైన సీరియల్స్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ దూసుకెళ్తుండగా.. పాత సీరియల్ నుండి నవ వసంతంగా వచ్చిన కార్తీకదీపం-2 ఎక్కువగా టీఆర్పీ తెచ్చుకోలేకపోతుంది. ఎందుకంటే దీపకి ఆల్రెడీ నరసింహాతో పెళ్ళి జరిగి శౌర్య అనే పాప కూడా ఉండటం.. కార్తిక్ కి జ్యోత్స్న అనే మరదలు ఉండటంతో.. డాక్టర్ బాబు, వంటలక్కల బాండింగ్ లేదా అనే డైలమాలో ఉన్నారు. దీనికి తోడు పారిజాతం చిన్నతనం చేస్తున్న కుట్రలు ఎవరికీ తెలియకపోవడం కథని బలహీనపరిచాయి. దాంతో‌ తెలుగింటి మహిళలు ఈ సీరియల్ ని ఎక్కువగా చూడట్లేదు. అందుకేనేమో కొత్తగా వచ్చిన సీరియల్ ఇంటింటి రామాయణానికి  టీఆర్పీ బాగుంటుంది. బ్రహ్మముడి సీరియల్ కి అత్యధిక టీఆర్పీ 12.51 తో మొట్టమొదటి స్థానంలో ఉండగా.. కార్తీకదీపం-2 రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో గుండె నిండా గుడిగంటలు, నాల్గవ స్థానంలో ఇంటింటి రామాయాణం ఉండగా కొత్తగా మొదలైన చిన్ని సీరియల్ అయిదవ స్థానంలో ఉంది. ఈ సీరియల్ ప్రారంభమై నెల కూడా కాకముందే ఇది టాప్-5 లో చోటు దక్కించుకుంది. ఇక టాప్- 10 లో గుప్పెడంత మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు చోటు దక్కించుకున్నాయి.   

Brahmamudi : అప్పుకి పెళ్ళి ఖాయం చేసిన పెద్దలు.. మరి కళ్యాణ్  ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -471 లో.....కావ్య, స్వప్నలు అప్పుని రెడీ చేస్తారు. నాకూ ఇలా నచ్చదు.  చీర కట్టుకుంటే నాకు కంఫర్ట్ ఉండదు.. నాలా నేను ఉంటానని అప్పు అంటుంది. అప్పుడే స్వప్న బంటిని పిలిచి.. అప్పు ఎలా ఉందని అడుగుతుంది. బంటి కామెడీగా ఎదరుగా ఉన్న అప్పుని చూడకుండా.. ఇక్కడ అప్పు ఎక్కడ ఉందని అంటాడు. నాక్కూడా ఇది ఇలా నచ్చట్లేదని స్వప్న అంటుంది. సరే నీకు నచ్చినట్టు ప్యాంటు షార్ట్ లోనే ఉండమని అప్పుతో కావ్య అంటుంది. మరొకవైపు కళ్యాణ్ అప్పు గురించి ఆలోచిస్తూ.. తను గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ ని చూసి బాధపడతాడు. అది చూసి రాజ్.. కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఈ షర్ట్ పాతగా అయిపోయిందిరా.. నీకోసం అమెరికా నుండి కొత్తవి తెప్పించాను.. ఇదిలా ఇవ్వు ఇలాంటి పాతవి పెట్టుకోవద్దు.. డస్ట్ బిన్ లో పారేయ్యలంటూ రాజ్ ఆ షర్ట్ తీసుకొని బయట డస్ట్ బిన్ లో పడేస్తాడు. తన వెనకాలే వద్దు అన్నయ్య అంటూ కళ్యాణ్ వచ్చి డస్ట్ బిన్ లో నుండి షర్ట్ తీసి.. ఇది నాకు ఇష్టమైన జ్ఞాపకమని కళ్యాణ్ అంటాడు. అప్పుపైన ప్రేమని దాచుకున్నట్లు ఇది కూడా దాచుకుంటావా అని రాజ్ అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని రాజ్ అంటాడు. అప్పు జీవితం బాగుండాలని అనుకున్నా కానీ నేను కోరుకున్నట్లే జరుగుతుంటే.. నాకు ఎందుకో బాధగా ఉందని కళ్యాణ్ అంటాడు. అదంతా వింటున్న రుద్రాణి.. నేను అనుకున్నట్లే అయింది. ఎలాగైనా రాజ్ ఇప్పుడు అప్పు కళ్యాణ్ లని ఒకటి చేయాలని ట్రై చేస్తాడు. వాళ్ళిద్దరు ఒకటి కాకుండా నేనే ఏదో ఒకటి చేయాలని రుద్రాణి అనుకుంటుంది. మరొకవైపు పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళు వస్తారు. వాళ్ళు అనామిక పెట్టిన కేసు గురించి తెలిసే వస్తారు. అందులో అప్పు తప్పేం లేదని మాకు తెలుసు.. అప్పు మాకు బాగా నచ్చింది.. కట్నం కూడా అవసరం లేదని వాళ్ళు అనగానే .. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్లి ముహూర్తం వచ్చే శుక్రవారం ఉందని పంతులు చెప్పడంతో ఇరు కుటుంబాలు.. అదే ముహూర్తం ఖాయం చేస్తారు . తరువాయి భాగంలో ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. మా ఫ్రెండ్ కూతురు ఉంది.. కళ్యాణ్ కి సెట్ అవుతుంది.. నువ్వు వెళ్లి ఒకసారి చూసిరా అని రుద్రాణి అంటుంది. మరొకవైపు అప్పు దగ్గరికి స్వప్న, కావ్యలు వచ్చి.. ఏంటి ఇలా ఉన్నావ్ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : అల్లాడించిన కార్తిక్ బాబు.. దిమ్మతిరిగే షాక్ !

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -106 లో.....కార్తీక్ నా జీవితానికి సంబంధించిన విషయం చెప్పాలని అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఈ విషయం చెప్పేటప్పుడు అందరు ఉండాలి దీప కూడా ఉండాలి అనగానే శౌర్య వెళ్లి దీపని తీసుకొని వస్తుంది. ఏంటి బాబు పిలిచారట అని దీప అడుగుతుంది. చెప్తానని కార్తీక్ అంటాడు. ఏం చెప్తాడోనని అందరు టెన్షన్ పడతారు. ఆల్రెడీ పెళ్లి అయిన నా  జీవితం గురించి చెప్తానని అనగానే.. అందరు షాక్ అవుతారు. డౌట్ లేదు దీప పేరు చెప్తాడని జ్యోత్స్న వెనకాల నుండి కత్తి రెడీగా పెట్టుకుంటుంది. అది చూసి పారిజాతం టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి అయిన నా గురించి ఎందుకు అన్నానంటే.. ముందే భార్యాభర్తలుగా పైనే డిసైడ్ అవుతుంది గనుక. కేవలం మనం నిర్ణయం మాత్రమే తీసుకోవాలి. పెళ్లి అయిన జంటకే మళ్ళీ పెళ్లి చేస్తారు. ఎవరు ఆ పెళ్లి అయిన జంట అనుకుంటున్నారా అని కార్తీక్ అనగానే.. దీప, జ్యోత్స్న ఎవరి పేరు చెప్తాడని టెన్షన్ పడుతారు. ఎవరో కాదు నేను జ్యోత్స్న అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ అంటూ పారిజాతం స్పృహ తప్పిపడిపోతుంది. స్పృహ లోకి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా అమ్మ అని కార్తీక్ కాంచన ని అడుగుతాడు. చాలా హ్యాపీగా ఉందని కాంచన చెప్తుంది. ఇక షాపింగ్ కి వెళ్లడమే అని అనగానే.. అవసరం లేదు నా ఫ్రెండ్ కి మాల్ ఉంది.. ఫోన్ చేస్తే అన్ని తానే తీసుకొని వస్తాడని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాంచన శ్రీధర్ ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మరొకవైపు శోభ ఇంక పాపని తీసుకొని రావడం లేదని ఇండైరెక్ట్ గా అనసూయతో కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే నరసింహ వస్తాడు. ఒరేయ్ రేపు వెళ్లి పిల్లని తీసుకొని రావాలని అనసూయ నరసింహాతో చెప్తుంది.ఆ తర్వాత థాంక్స్ బాబు మంచి నిర్ణయం తీసుకున్నారని దీప అంటుంది. తండ్రి గురించి శౌర్యకి నిజం తెలియద్దని మీరు అనుకుంటున్నారు.. మా అమ్మకి నాన్న గురించి తెలియద్దని నేను అనుకుంటున్నానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత రోజు ఇక కార్తీక్ బాబు దగ్గరకి వెళ్లొద్దని శౌర్యకి దీప చెప్తుంది. మరొకవైపు మా నాన్న మా అమ్మని మోసం చెయ్యకుంటే నా నిర్ణయం వేరేలా ఉండేది.. రేపు జ్యోత్స్న తో ఎంగేజ్ మెంట్ ఎవరు ఆపలేరు.. అంత అవసరం కూడా లేదని కార్తీక్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగా

Eto Vellipoyindhi Manasu : తమ్ముడిని గొప్పగా పొగిడి‌న అన్నయ్య.. ఆ నిజం కనిపెట్టగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -158 లో.. సీతాకాంత్ మీటింగ్ లో సందీప్ ని మెచ్చుకుంటాడు. ఇంత తక్కువ టైమ్ లో కంపెనీ ని కావలసిన ల్యాండ్ రెడీ చేసావ్.. నువ్వు నా తమ్ముడు అయినందుకు గర్వంగా ఉందంటూ గొప్పగా పొగుడుతాడు. ఆ డాకుమెంట్స్ చూసారా అని రామలక్ష్మి అడుగగా.. చూసానని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే వైస్ చైర్మన్ ని చేస్తానని అనగానే సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదో చేస్తున్నాడు ముందు.. అది కనుక్కోవాలని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత సందీప్ కోసం ఒక పెద్దాయన ఆఫీస్ కి వస్తాడు. అప్పుడే సందీప్ అతని దగ్గరికి వస్తాడు. మీరు కొన్న ల్యాండ్ ఓనర్ ని.. ఒకతనికి అమ్మాను.. వాడు బ్రోకర్.. ఆ ల్యాండ్ మిమ్మల్ని మోసం చేసి అమ్ముతున్నాడు.. అది మీకు ఉపయోగపడదని పెద్దాయన అంటుంటే.. నీకు అనవసరం పెద్దవాళ్ళ మ్యాటర్. అందులో ఇన్వాల్వ్ అవ్వకండి .. మీకేమైన కావాలంటే ఆ బ్రోకర్ ని అడిగి ఇప్పిస్తాను.. మీరు ఈ విషయం ఎక్కడ చెప్పొద్దంటూ సందీప్ అతనిపైన కోప్పడతాడు. అదంతా దూరం నుండి మాణిక్యం చూస్తాడు.. కానీ అతనికి ఏం అర్థం కాదు.. వెళ్లి రామలక్ష్మికి చెప్తాడు. నువ్వు డౌట్ పడుతుంది నిజమే అమ్మ.. ఎవరో పెద్దాయన ల్యాండ్ అంటు వచ్చాడని మాణిక్యం అంటాడు. అదేంటో కనుక్కోవాలి నాన్న.. నువ్వు ఆ పెద్దాయన అడ్రెస్ ఎక్కడో కనుక్కోమని రామలక్ష్మి అంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావనగానే రామలక్ష్మి డబ్బులు తీసి మాణిక్యానికి ఇస్తుంది. డబ్బుల కోసం వచ్చావా అని సీతాకాంత్ అంటాడు. ఇక వెళదామా అంటు రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వెళ్ళగానే.. సందీప్ చేసిన పనిని గొప్పగా చెప్తాడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. వంట నేను చేస్తానని చెప్తాడు.. ఆ తర్వాత సీతాకాంత్ వంట చేస్తుంటే రామలక్ష్మి హెల్ప్ వేస్తుంది. అందరు భోజనం చేస్తుంటే వంటలు బాగున్నాయని అంటారు. వంటలు కాదు మాకు బాబునో పాపనో ఇవ్వండి అని పెద్దాయన అంటాడు. ఆ కోరిక అత్తయ్యకి లేదేమో అని రామలక్ష్మి అనగానే.. ఎందుకు అలా అంటున్నవని శ్రీలత అంటుంది. అలా మీకు ఉంటే ఇన్నాళ్లు కగా సీతా ర్ కి పెళ్లి ఎందుకు చెయ్యలేదని రామలక్ష్మి అంటుంది. దాంతో నేనేం చెయ్యను అన్లేదని శ్రీలత అంటుంది. నువ్వు బాబునో పాపనో ఎప్పుడిస్తున్నావ్ చెప్పమని శ్రీలత అనగానే.. అయినా మమ్మల్ని అంటున్నారేంటి మా కన్న ముందు పెళ్లి అయిన శ్రీవల్లి, సందీప్ లని అడగండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : ఆ కాలేజీని వసుధార కాపాడుకోగలదా.. శైలేంద్ర డీలింగ్ కి అతను ఒప్పుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1136 లో... దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి.. రంగా వేరు, రిషి వేరు.. వాడు రిషి కాదు రంగానే అని చెప్తాడు. అయితే వాడితో మనకి పని ఉంది వాడిని తీసుకొని వచ్చి మినిస్టర్ చెప్పినట్టు చెప్పిపిస్తే చాలు.. ఇక ఎండీ నువ్వే.. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. ఆ రంగా మనతో కాలేజీకి రావాలని దేవయాని చెప్తుంది. మనపై డౌట్ రాకుండా మాట్లాడమని దేవయాని చెప్తుంది. సరే వాడిని ఒప్పించి తీసుకొని వస్తానని శైలేంద్ర అంటాడు. మరొకవైపు మీరు చేస్తుంది తప్పు మేడమ్.. కాలేజీకి ఎండీ అంటున్నారు.. మీరు లేకపోతే కాలేజీ పరిస్థితి ఏంటని ఆలోచించడం లేదు. కనీసం మీ మావయ్య గురించి ఆలోచించడం లేదు.. ఎప్పుడు రిషి సర్ అంటూ నా వెంట తిరుగుతున్నారని రంగా కోప్పడతాడు. దాంతో మీరు రిషి సర్ నే అందుకే ఇలా ఆలోచిస్తున్నారని వసుధార అంటుంది. ఆ తర్వాత బుజ్జి ఫోన్ తీసుకొని.. వసుధార కాలేజీకి ఫోన్ చేస్తుంది. మీ ఎండీ గారికి ఫోన్ ఇవ్వండి అనగానే.. మా కాలేజీకి ప్రస్తుతం ఎండీ ఎవరు లేరు.. రేపు కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని అతను చెప్తాడు. దాంతో వసుధార షాక్ అవుతుంది. ఆ విషయం రంగాకి చెప్తుంది. చూసారా మీ వల్ల మీ రిషి సర్ కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్లిపోతుందని రంగా అంటాడు. సర్ మీరు నాతో రండీ కాలేజీని కాపాడుకుందామని వసుధార అనగానే.. నేను రానంటూ రిషి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రంగా దగ్గరికి సంజీవయ్య వచ్చి.. నీతో పెళ్లి కొడుకు అన్నయ్య ఏదో మాట్లాడాలంట అని చెప్తాడు. సరే అని రంగా అంటాడు. మేడమ్ మీరు ఇంట్లోనే ఉండండి అని వసుధారకి రంగా చెప్తాడు. ఆ తర్వాత అసలు మొన్న వినిపించిన వాయిస్ శైలేంద్ర దేనా అని వసుధార అనుకుంటుంది. రిషి సర్ తను ఇంకా భయటపడడం లేదని వసుధార అనుకుంటుంది. మరొక వైపు సంజీవయ్య రంగాని తీసుకొని వస్తాడు. కాసేపటికి సంజీవయ్యని వెళ్ళమని చెప్తాడు శైలేంద్ర. ఆ తర్వాత నిన్నే డౌట్స్ క్లారిటీ చేసాను కదా.. మళ్ళీ ఏం మాట్లాడాలని రంగా అంటాడు. నీపై నాకు ఏ డౌట్ లేదంటూ రంగాకి రిషి ఫోటోని చూపించి.. ఇతను నా తమ్ముడు రిషేంద్ర భూషణ్.. కాలేజీ ఎండీ అంటూ రిషి గురించి గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీనా...ఎంటర్టైన్మెంట్ విత్ కాంట్రోవర్సి పక్కా గ్యారెంటీ

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో రాబోతోంది. దానికి సంబందించిన ఒక లోగో కూడా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ 8 సింబల్ చూసి రెండు ఇల్లు ఉంటాయేమో ఈ కొత్త సీజన్ లో అనే డౌట్ కూడా రైజ్ చేస్తున్నారు చాల మంది.  ఐతే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ ని అప్ డేట్ చేస్తుకుంటూ వెళ్తున్నారు బిగ్ బాస్ టీమ్.  ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన కంటెస్టెంట్స్ పేర్లు చూస్తే షో వేణుస్వామి, బర్రెలక్క, కుమారీ ఆంటీ, తేజశ్విని గౌడ, వైష్ణవి పిస్సే, బంచిక్ బబ్లూ, సాకేత్, శ్వేతా నాయుడు, యాదమరాజు, మై విలేజ్ షో అనీల్, నిఖిల్, అక్షిత, సోనియా సింగ్, ఖయూమ్, రేఖా భోజ్ వంటి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే శివాజీ పేరు కూడా మళ్ళీ వినిపిస్తోంది. అయితే శివాజీని కంటెస్టెంట్ గా కాదు.. బిగ్ బాస్ న్యూ సీజన్  బజ్ కి హోస్ట్ గా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ అంటే మాటలు కాదు. అందులో అడిగే ప్రశ్నలు మాములుగా ఉండవు. బుర్రను బొప్పికట్టించేలా లోపల ఎం జరిగిందో హోస్ట్ చెప్పించగలగాలి. ఆ టాలెంట్ శివాజితో పుష్కలంగా ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎలాగో పొలిటికల్ అనలిస్ట్ గా కూడా శివాజీకి మంచి పేరు కూడా ఉంది. బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేయడం శివాజీకి పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రజలు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని కోరేసుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ విత్ కాంట్రవర్సీ, ఎంటర్టైన్మెంట్ విత్ కుళ్ళు కామెడీ ఇలా అన్నమాట. సో ఆ ఎంటర్టైన్మెంట్ విత్ కాంట్రవర్సి అంటే మొదటగా గుర్తొచ్చేది ఆర్జివి, తరువాత శివాజీ. చూడాలి ఒక వేళ శివాజీ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ ఐతే ఆడియన్స్ కల నెరవేరినట్టే.. బిగ్ బాస్ చూడకపోయినా బజ్ ని చూసే గారెంటీ ఉంది.  

నా ఎజ్ 24 మాత్రమే.. సిద్ధూ.. వద్దమ్మా వద్దు

  ఈ వారం కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఎపిసోడ్ ప్రోమో సూపరో సూపర్ లా ఉంది. అమ్మాయిలైతే అచ్చమైన తెలుగింటి ఆడపిల్లల్లా అందంగా మెరిసిపోయారు. ఐతే ఇందులో బ్రహ్మముడి కావ్య చేసిన అల్లరి ఎప్పటిలాగే ముద్దుగా క్యూట్ గా ఉంది. అల్లరి క్యూట్ గా ఉంటే ఉంది కానీ శేఖర్ మాష్టర్ ని కూడా పటాయించేసింది ఈ వారం ఈ అల్లరి పిల్ల. బొమ్మరిల్లు మూవీలో జెనీలియా రోల్ కనిపించి అందరినీ మెస్మోరైజ్ చేసేసింది. జెనీలియా వేసుకున్న కాస్ట్యూమ్ వేసుకొచ్చి స్టేజి మీద గంతులేసింది. శ్రీముఖి అడిగింది "నీ పేరేమిటి" అనేసరికి "హహ హాసిని" అంటూ నవ్వుతూ చెప్పింది కావ్య. "సరే నీ సిద్దు ఎక్కడా" అని అడిగింది శ్రీముఖి.   దాంతో కావ్య సిద్దు అంటూ వేలు పెట్టి శేఖర్ మాష్టర్ ని చూపించేసరికి "వద్దమ్మా వద్దు" అన్నాడు దణ్ణం పెడుతూ. "అంతేనా" అని జూనియర్ జెనీలియాలా గారంగా అడిగేసరికి "ఇంకేం కావాలి" అన్నాడు శేఖర్ మాష్టర్. "వీలయితే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ" అని అడిగింది. ఇక గోమతి ప్రియా ఐతే "ఎం మాయ చేసావే" మూవీలో సమంత రోల్ పోషించింది. ఆమె లాగే చీర కట్టుకుని బాగ్ తగిలించుకుని స్టేజి మీదకు వచ్చి "నా పేరు జెస్సి. నా ఏజ్ 24 .. మా డాడీ అడిగితే వీళ్లంతా నా బ్రదర్స్ అని చెప్తాను" అంటూ సినిమా డైలాగ్ చెప్పింది. దాంతో అటు ఇటు కానీ గెటప్ లో ఉన్న యాదమ్మ రాజు లేచి "మరి నేను" అని అడిగాడు "సిస్టర్ " అని చెప్తా అంది గోమతి ప్రియా. ఇక లాస్ట్ లో పల్లవికి, అంబటి అర్జున్ కి మధ్య బిగ్ ఫైట్ అయ్యింది.

బిగ్ బాస్ ప్రోమోలు చేసేది ఆ వెబ్ సిరీస్ డైరెక్టరా!

  ఇదేందయ్యా ఇది.. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలవుతుండగా దానికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో జరిగేది ఒకటైతే.. బయట మనకి టీవీలో చూపించేది మరొకటి. అందులోను టీవీ చూసే అభిమానులని ఆకట్టుకునే ప్రోమో చేయడమంటే కత్తి మీద సామే. హౌస్ లో జరిగే ఆటలో పెద్ద విషయం లేకపోయిన ప్రోమోలతోనే హైప్ ఇచ్చేస్తుంటారు బిబి టీమ్. ఈరోజు బిగ్ బాస్ చూడాల్సిందే అనేట్టు చేసేవి కూడా ఈ ప్రోమోలే. ప్రోమో చూసిన తరువాత ఏమైనా కట్ చేశాడా ఎడిటర్ మామ అంటూ బోలెడన్ని జోక్‌లు వేసుకుంటారు. ప్రతి ప్రోమో కింది ఎడిటర్ మామ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ బిగ్ బాస్ ప్రోమోలను రూపొందించే వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతనే దర్శకుడు ముఖేష్ ప్రజాపతి(Mukesh Prajapati ) . తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ 5 లో అంజలి ప్రధాన పాత్ర పోషించిన ' బహిష్కరణ ' వెబ్ సిరీస్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ సిరీస్ దర్శకుడే ముఖేష్ ప్రజాపతి.  బహిష్కరణ ప్రెస్ మీట్ లో భాగంగా కొంతమంది సెలెబ్రిటీలు వచ్చారు. వారిలో సోహైల్ దర్శకుడి గురించి నిజాలు బయటపెట్టేశాడు. ముఖేష్ అన్న.. బిగ్ బాస్‌లో మా ప్రోమోలు, Avలు చేసేవాడు. చాలా హ్యాపీగా ఉంది. బుల్లితెర నుంచి ఎవరైనా యాక్టర్ అయిన డైరెక్టర్ అయిన చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే ముఖేష్ అన్నని నాతో సినిమా చేయమని అడిగాను. నాకు హిట్ కావాలి.. డైరెక్ట్ చేస్తావా? అని అడిగాను. కానీ ముఖేష్ అన్న వేరే ప్రాజెక్ట్ ఏదో చేస్తా అన్నాడు. బహిష్కరణ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తరువాత దీనమ్మా జీవితం ఇలాంటి డైరెక్టర్ పడాల్రా అని అనుకున్నానంటు సోహైల్ చెప్పుకొచ్చాడు. సోహైల్ స్పీచ్‌ని బట్టి బిగ్ బాస్ ప్రోమోలను అంత రసవత్తరంగా కట్ చేసేది ముఖేష్ ప్రజాపతి అని విషయం బయటకు వచ్చింది. మరి బిగ్ బాస్ ప్రోమోలు ఎడిట్ చేసే మన ఎడిటర్ మావ ముఖేష్ ప్రజాపతికి ఓ లైక్ వేస్కోండి.

Karthika Deepam2 : ఎంగేజ్ మెంట్ గురించి కార్తిక్ ఏం చెప్పనున్నాడు.. దీప, జ్యోత్స్నల టెన్షన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -105 లో..... నీతో మాట్లాడాలని దీపతో జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయావ్.. మళ్ళీ ఎవరు పిలవకుండా ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. బావనా బావ కాదు నా భర్త.. చిన్నప్పటి నుండి నా బావతో ఎలా ఉండాలో కలల కన్నాను.. దాన్ని ఎవరో వచ్చి కూల్చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోనని దీపతో జ్యోత్స్న అంటుంది. నీతో ఎవరు చెప్పారో.. అదంతా వాళ్ళకి నాపై ఉన్న కోపం, ద్వేషంతో అలా చెప్పారు. నేను కేవలం నీ ఎంగేజ్ మెంట్ చూడడానికే వచ్చానని దీప చెప్తుంది. ఒకవేళ బావతో నా పెళ్లి జరగకుంటే ఈ జ్యోత్స్న బ్రతకదని చెప్పి తను వెళ్లిపోతుంది. కార్తీక్ బాబుకి జ్యోత్స్న అంటే ఇష్టం లేదు.. జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది. ఈ ఎంగేజ్ మెంట్ ఇష్టం లేదని కార్తీక్ బాబు చెప్తే.. హాస్పిటల్ లో తను అన్నమాట వీళ్ళకి తెలిస్తే ఎలా.. అందుకే వద్దని అంటున్నారని అనుకుంటారు. అప్పుడు నా పరిస్థితేంటి ? నా బిడ్డ పరిస్థితేంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి.. కార్తీక్ బాబు ఏం నిర్ణయం తీసుకుంటారోనని దీప కంగారు పడుతుంది. మరొకవైపు కార్తీక్ శ్రీధర్ చేసిన మోసం గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే కాంచన భోజనానికి పిలుస్తుంది. శ్రీధర్ కాంచనకి భోజనం తినిపిస్తుంటే.. వద్దు నేను తినిపిస్తానని ప్లేట్ తీసుకుంటాడు. వీడికి ఏమైనా తెలిసిందా అని శ్రీధర్ అనుకుంటాడు. కార్తీక్ బాబు ఏ నిర్ణయం తీసుకుంటాడో అని దీప ఆలోచిస్తుంది. అదేవిధంగా కార్తీక్ కూడా ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు కాంచన, శ్రీధర్ లు రెడీ అయి ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడడానికి రమ్మని చెప్పారని అని అనగానే.. నేను రాను మీరు వెళ్ళండి అంటూ శ్రీధర్ వంక చూస్తుంటే.. వీడి చూపేదో తేడాగా ఉందని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత కాంచన తన డెలివరికి వెళ్లినప్పుడు.. అయిన ఆక్సిడెంట్ గురించి, అప్పుడు కార్తీక్ బాగుంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు నీ పెళ్లి అయి, నా మేనకోడలు నా కోడలు అయి ఇంటికి రావాలి.. మీ పిల్లలు ఇంట్లో తిరగాలని కాంచన అనగానే.. సరే అమ్మ వస్తానని కార్తీక్ అంటాడు. అలా అనగానే అనవసరం నేనే వీడిని అపార్ధం చేసుకున్నానా.. వీడికి ఏం తెలియలేదని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళు హాల్లో మాట్లాడుకుంటు ఉంటారు‌. సన్నాయి మేళాలతో కార్తీక్ కుటుంబం సుమిత్ర ఇంటికి వస్తారు. ఇప్పుడు నా జీవితానికి సంబంధించిన విషయం చెప్పబోతున్నాను.. దీప కూడా ఉండాలని కార్తిక్ అంటాడు‌. శౌర్య వెళ్లి దీపని తీసుకొని వస్తుంది. ఏం చెప్తాడో అని ఓవైపు పారిజాతం, జ్యోత్స్న.‌ మరొకవైపు దీప టెన్షన్ పడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : కూపీలాగుతున్న రామలక్ష్మి.. ఆ నిజం కనిపెట్టగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -157 లో... రామలక్ష్మిని సీతాకాంత్ తీసుకొని వచ్చి.. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది. ఆడ్ ఏజెన్సీకి ఇవ్వాల్సిన నా కాన్సెప్ట్ అనగానే.. రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. నువ్వు ఇచ్చిన ఐడియాతో ఇలా కాన్సెప్ట్ రెడీ చేశాను. ఈ రింగ్ తీసుకోమని సీతాకాంత్ అనగానే.. నాకేం వద్దు మీ రింగ్ అని రామలక్ష్మి కోపంగా పక్కకి వెళ్తుంది. కాన్సెప్ట్ మాత్రం ఆడ్ వాళ్ళకి కానీ నిజంగానే నా ప్రేమ నీకు చెప్పాను రామలక్ష్మి.. ఈ రింగ్ ఇచ్చి నా మనసులో మాట నీకు చెప్తానని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి కూడా సర్ కళ్లలో నా పైన ప్రేమ కన్పించింది. మరి అంతా చెప్పేసి ఆడ్ కోసం అన్నారని రామలక్ష్మి అనుకుంటుంది. మరుసటిరోజు ఉదయం సందీప్ దగ్గరికి ఒకతను ల్యాండ్ కొనమని అందుకు కమిషన్ ఇస్తానని సూట్ కేసులో డబ్బులు తీసుకొని వస్తాడు. ఆ డబ్బులు చుసిన శ్రీవల్లి ఒప్పుకోండి అంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. విషయం చెప్పగానే ఒప్పుకోమని శ్రీలత అంటుంది. అది ఇండస్ట్రీ పెట్టడానికి సెట్ అవ్వదని శ్రీలత అంటుంది. ఐతే ఏంటి తర్వాత ఇండస్ట్రీ పెట్టాక అందరు సీతాకాంత్ ని తిడుతారు. అదంతా సీతాకాంత్ కావాలనే చేసాడని రూమర్స్ క్రియేట్ చేస్తానని శ్రీలత అనగానే.. సందీప్ ఆ డీల్ ఒప్పుకొని డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది. ఎందుకు ఎలా వాడు మేనేజర్ అయ్యాడని మాణిక్యం అడగ్గానే.. రామలక్ష్మి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి నమిత దగ్గరికి వెళ్తుంది. పని చేసుకోకుండా సీతాకాంత్ వైపు నమిత చూస్తుంటుంది. అది గమనించిన రామలక్ష్మి.. మీరు వర్క్ చెయ్యడం కాకుండా ఎక్కువ చూడడం చేస్తున్నారని అంటుంది. సర్ నా రోల్ మోడల్.. మీరు జాక్ పాట్ కొట్టారు మేడమ్ అని నమిత అంటుంది‌. అప్పుడే సీతాకాంత్ కి దగ్గు వస్తుంటే.. రామలక్ష్మి వాటర్ తీసుకొని వెళ్తుంటుంది‌. తనకంటే ముందే నమిత వెళ్లి వాటర్ ఇస్తుంది. సీతాకాంత్ చూసుకోకుండా థాంక్స్ రామలక్ష్మి అని అంటాడు. అప్పుడు నమితని చూసి నువ్వా.. వెళ్లి వర్క్ చేసుకోమని అనగానే నమిత వెళ్తుంది. వెనకాల వున్నా రామలక్ష్మి కోపంగా చూస్తుంది. ఆ ఫైల్ ఇవ్వమని సీతాకాంత్ అనగానే.. నేను ఎందుకు ఇస్తాను మీరంటే ఇష్టమున్న వాళ్ళు చాలా మంది ఆఫీస్ లో ఉన్నారు.. వాళ్ళు ఇస్తారంటూ కోపంగా వెళ్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత మాణిక్యంతో చెప్పి రామలక్ష్మిని రమ్మని సందీప్ చెప్పగానే.. మాణిక్యం వెళ్లి రామలక్ష్మికి చెప్తాడు. రామలక్ష్మి రాగానే పేపర్స్ తన మొహం పైన విసురుతాడు సందీప్. నేను చెప్పినట్టు ప్రిపేర్ చేయమంటే చేయలేదని సందీప్ అంటాడు.  సీతా సర్ ఒకే చేయకుండా నేను చెయ్యనని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్లి బాధపడుతుంటే.. అప్పుడే మాణిక్యం వచ్చి.. వాడేదో అని ఉంటాడని అంటాడు. ఏదో ల్యాండ్ గురించి ఒకటే ఫోన్ మాట్లాడుతున్నాడని మాణిక్యం చెప్తాడు. వాడు ఏదో ప్లాన్ తోనే జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఈ ల్యాండ్ ఏంటో ఆ పేపర్స్ వాడి చేతికి వెళ్లకముందే నా చేతికి రావాలి.. అప్పుడే మనం దీన్ని ఆపగలమని రామలక్ష్మి అనగానే.. నువ్వు టెన్షన్ పడకు పేపర్స్ కావాలి కదా.. వాడేంటో? వాడి ప్లాన్ ఏంటో నేను కనుక్కుంటా అని మాణిక్యం అంటాడు. అప్పుడే బోర్డు మీటింగ్ కి రమ్మంటున్నారని పీఏ వచ్చి రామలక్ష్మికి చెప్పగానే.. తను మీటింగ్ కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అబ్బాయిల్ని రూమ్‌కి రప్పించుకుంటున్న అమ్మాయిలు.. గుట్టు విప్పిన మిర్చీ మధవి! 

గుప్పెడంత మనసు సీరియల్ లో దేవయానిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన నటి మిర్చీ మధవి. అందులో నెగెటివ్ రోల్ కి తనకి మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి కాస్త బ్రేక్ తీసుకుంది.‌ ఇక గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజ్య లావణ్యల ఇష్యూ మీద మాట్లాడిన మిర్చీ మధవి వారి అపార్ట్‌మెంట్ లో‌ జరుగుతున్న ఘోరాలని బయటపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో మిర్చి మాధవి మాట్లాడుతూ.. డిస్ట్రబ్ చేసేవాళ్లకి కూడా తెలుసు. వీళ్లు పడతారా లేదా అని. ఇటు నుంచి రెస్పాన్స్ లేకపోతే హాయ్ అంటే హాయ్ అని వెళ్లిపోతారు. అలా కాకుండా.. హాయ్ అన్న తరువాత.. ఆహా అని.. అటు చూడటం ఇటు చూడటం.. అలా చేయడం ఇలా చేయడం లాంటివి చేస్తుంటే.. రా రా బాబూ అని డైరెక్ట్‌గా చెప్పడమే. మన పని మనం చేసుకుంటే ఎవరూ మన జోలికి రారు. కానీ వాళ్లు డిస్ట్రబ్ చేసినప్పుడు నువ్వు సిగ్నల్ ఇస్తే మాత్రం వాళ్లు ట్రై చేస్తుంటారు. మా అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. దానికి ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో ఇంకో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వీళ్లంతా రాత్రి పది దాటిన తరువాత కలిసి.. ఒక చోటికి వెళ్లిపోయి.. తెల్లారిన తరువాత వస్తుంటారు. ప్రతిరోజు ఇదే తంతు. గత మూడు నాలుగు నెలులుగా ఇదే జరుగుతుంది. కొన్ని రోజులకి బయట నుంచి ఎవరో వచ్చి.. ఆ అబ్బాయిల్ని చచ్చినట్టు కొట్టారు. తలలు పగలకొట్టారు. వాళ్లతో వెళ్లిన అమ్మాయిలు బాగానే ఉన్నారు. తప్పు చేసిందేమో అమ్మాయిలు కానీ శిక్ష మాత్రం అబ్బాయిలకు పడిందంటూ మిర్చీ మధవి అంది. మన ఇంట్లోని పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చూస్తున్నారని గమనించుకోవాలని, కనడం కాదని.. వాళ్లని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలని అంది. సమాజానికి ఉపయోగపడతారో లేదో తరువాత సంగతి.. ముందు కన్న మీకు ఉపయోగపడతారో.. కనీసం వాళ్ల కోసం వాళ్లు ఉపయోగపడేలా అయిన పెంచుకోవాలి. మన ఫ్యామిలీ బాగుంటే.. సమాజం బాగున్నట్టే. ఎవరికి వాళ్లు సరిగ్గా ఉంటే ఇలాంటి ఘోరాలు జరగవు. షార్ట్ కట్‌లో డబ్బు సంపాదించేయాలి.. సెక్స్.. బాయ్ ఫ్రెండ్.. డ్రగ్స్ ఇవన్నీ తాత్కాలికమే అంటు మిర్చీ మధవి చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ విన్నర్ అవుతానని ముందే నాకు చెప్పేశాడు!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనగానే అందరికి గుర్తొచ్చే మొదటి పేరు పల్లవి ప్రశాంత్.. అలా అందరి చేత ప్రశంసలు అందుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి టీవీ అభిమానులందరికి  తెలుసు. అయితే పల్లవి ప్రశాంత్ తాజాగా 'బహిష్కరణ' వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. అతనితో పాటు సోహైల్‌, మెహబూబ్‌, వీజే సన్నీ, అర్జున్‌, అవినాష్‌ , రీతు చౌదరిలు కూడా వచ్చారు. అందులో సోహెల్ అండ్ పల్లవి ప్రశాంత్ ఇచ్చిన స్పీచ్ లు వైరల్ గా మారాయి.  ప్రెస్ మీట్ లో హీరోయిన్ అంజలికి‌ పల్లవి ప్రశాంత్ రోజా పువ్వు ఇచ్చాడు. ఆ తర్వాత తను మాట్లాడుతూ ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ వెబ్ సిరీస్‌ దర్శకుడు.. బిగ్‌ బాస్‌ లాస్ట్ సీజన్ సమయంలో తన ఏవీ షూట్‌ చేశాడట. ఆ ఒక్క రోజే ఆయనతో అనుబంధం ఏర్పడిందని, కష్టపడి బాగా తీశాడని తెలిపాడు పల్లవి ప్రశాంత్‌. ఏవీ షూట్‌ అంతా అయిపోయిన తర్వాత నువ్వే బిగ్‌ బాస్‌ విన్నర్‌ వి అని చెప్పాడని, అప్పుడు తనకు చాలా హ్యాపీగా అనిపించిందని, అదే కాన్ఫిడెన్స్ తో షోకి వెళ్లినట్టు పల్లవి ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు. ఇక బహిష్కరణ దర్శకుడు ముఖేష్ ప్రజాపతి బిగ్ బాస్ ప్రోమోలు ఎడిట్ చేస్తాడని తెలిసాక నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Guppedantha Manasu : రంగానే రిషినా.. బుజ్జి మనసులో మాట చెప్పేసిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1135 లో... శైలేంద్రని రంగా తీసుకొని సరోజ ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడే దారిలో రంగాని పలకరిస్తూ వెళ్తుంటారు. వాళ్ళ మాటల్లో రంగానే అతను రిషి కాదని క్లారిటీకి వస్తాడు. బుజ్జి ఆటో తీసుకొని వస్తాడు. సర్ అందులో సరోజ ఇంటికి వెళదాం.. ఇక్కడ పక్కనే అని రంగా అనగానే అవసరం లేదని శైలేంద్ర అంటాడు. వెళదామన్నారు ఏదో అడగాలన్నారు అని రంగా అనగానే..  ఏం లేదు నాకు నువ్వు రంగావి మంచివాడివి అన్న నమ్మకం వచ్చింది. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని చెప్పండి అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర వసుధార ఫోటో రంగాకి బుజ్జికి చూపించి ఈవిడ మీకు తెలుసా అని అడుగుతాడు. చెప్పొద్దంటూ బుజ్జికి రంగా సైగ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తెలియదంటారు. దాంతో శైలేంద్ర అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మేడమ్ గారు మన ఇంట్లోనే ఉంటే తెలియదని అబద్ధం చెప్పావ్ అని బుజ్జి అడుగుతాడు. నాకు ఎందుకో అతని మీద డౌట్ వచ్చింది.. అందుకే అలా చెప్పాను.. ఒకవేళ తెలిస్తే ఎలా అని బుజ్జి అనగానే.. తెలిసినప్పుడు చూసుకుందామని రంగా అంటాడు. అన్న ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు.. మేడమ్ గారి మీద కావాలనే వాటర్ పోశారు. ఇప్పుడు మేడమ్ తెలియదంటున్నాడు.. కొంపదీసి మేడమ్ గారు అన్నట్లు అన్న రిషి సర్ ఆ అని బుజ్జి అనుకుంటాడు. ఆ తర్వాత సరోజ దగ్గరికి వసుధార వెళ్లి రిషి సర్ వచ్చారా అంటూ అడుగుతుంది. నా బావని నాకు దూరం చేసావంటు వసుధారని సరోజ తిడుతుంటే.. రంగా వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు.. అందుకు వేరే వాళ్ళని తిడితే బాగోదని అంటాడు. అబ్బాయి వాళ్ళకి సరోజ ఇష్టమని చెప్పారని సంజీవయ్యకి రంగా చెప్తాడు. ఆ తర్వాత రంగా, వసుధారలు ఇంటికి వస్తారు. మళ్ళీ రంగాని రిషి సర్ ఏమో అని బుజ్జి మనసులో అనుకుంటాడు. నువ్వు ఏం అనుకుంటున్నావో నాకు తెలుసని బుజ్జి మనసులో అనుకున్నది వసుధార చెప్తుంది. మరొకవైపు దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి.. వాడు రిషి కాదు రంగా అని చెప్తాడు. అయితే వాడితో మనకి లాభం ఉంది. మినిస్టర్ ఏం అన్నాడని దేవయాని అనగానే.. రిషి అయిన వసు అయిన నిన్ను ఎండీగా చేయమని చెప్పాలని మినిస్టర్ చెప్పాడు కదా అని శైలేంద్ర, దేవయాని చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.