జ్యోతి రాయ్ బోల్డ్ ఫోటో వైరల్..నెటిజన్ల కామెంట్ల మోత!

  మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత  మనసు  సీరియల్ తో ఒక టాప్ తెలుగు సినిమా హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి జ్యోతి రాయ్.. ఆ సీరియల్ లో జగతి అనే ఒక సాంప్రదాయబద్దమైన క్యారక్టర్ లో నటించి  ఎంతో మంది అభిమానులని సంపాదించింది. ఇప్పుడు సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో తన సత్తా చాటడానికి సిద్ధం అవుతుంది.  జ్యోతి రాయ్ తన ఇన్ స్టా లో తన లేటెస్ట్ ఫొటోని షేర్ చేసింది. అది మామూలుగా లేదు. బ్లాక్ కలర్ స్లర్ట్ లో ఫోన్ చూస్తూ థైస్ కనిపించేలా ఉన్న ఈ ఫోటోని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.  ఇక తను అప్లోడ్ చేసిన ఈ ఫోటోకి ఓ కొటేషన్ కూడా రాసింది. ' కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ' దే విల్ లైక్ మి', కాన్ఫిడెన్స్ ఈజ్ ' ఐ విల్ బి ఫైన్, ఇఫ్ దే డోంట్ ' అనే క్యాప్షన్ కూడా ఈ ఫోటోకి ఆడ్ చేసింది జ్యోతి రాయ్. అయితే ఈ ఫోటోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. హాట్, లుక్స్ సో ప్రెట్టీ, మరీ ఇంత అందాన్ని తట్టుకోలేమండి అని కామెంట్లు పెట్టగా.. మరికొందరు మరీ బోల్డ్ కామెంట్లు పెడుతున్నారు‌.  కొంత కాలం క్రితం తనది ఓ ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటు పుకార్లు రాగా జ్యోతి రాయ్ ఒక్కసారిగా హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది.  ఆ న్యూస్ వైరల్ అవ్వడంతో తనకి విపరీతమైన సింపథీ లభించిందనే చెప్పాలి. జ్యోతి రాయ్ కి ఇన్ స్టాగ్రామ్ లో  496K ఫాలోవర్స్ ఉన్నారు‌. ఓ యంగ్ డైరెక్టర్ తో రిలీషన్ లో ఉన్న ఈ భామ రెగ్యులర్ గా హాట్ అండ్ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.   

గర్ల్ ఫ్రెండ్ బొక్క.. అవే వస్తాయి.. తమన్ జీవిత పాఠాలు

  ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో ఎలిమినేషన్ రౌండ్ 2 లో యంగెస్ట్ సింగర్ రావుల భరత్ రాజ్ మీద జడ్జెస్ థమన్, కార్తిక్ కలిసి కాసేపు జోక్స్ వేసి నవ్వించారు. భరత్ పాడిన సాంగ్ మీద కొన్ని కరెక్షన్స్ చెప్పాక "భరత్ నువ్వు చూడడానికి ఏఐలా ఉన్నావు. ఎం చెప్పాలో తెలీట్లేదు..ఇది కాంప్లిమెంట్ భరత్. నువ్వు చాలా ఈజీగా ఏ పాటైనా కానీ పాడేస్తున్నావ్. నీ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు . ఫైనల్లీ గీతా చెప్పింది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని అప్పుడు నువ్వు నవ్వావ్..దాంతో నువ్వు ఏఐ కాదు హ్యూమన్ బీయింగ్ అని అర్ధమయ్యింది." అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత థమన్ మాట్లాడాడు. "నువ్వింకా బాగా మెచ్యురిటీతో పాడాలి. నీకు ఇంకా టైం ఉంది. గర్ల్ ఫ్రెండ్ బొక్క ఇవన్నీ వద్దు ఇప్పుడు..మ్యూజికల్ గా గెలువు...ఆటోమేటిక్ గా అవే వస్తాయి లైఫ్ లోకి." అంటూ కొన్ని జీవిత పాఠాలు చెప్పారు. ఇక ఆడియన్స్ కార్తీక్ ని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నని గీతా అడిగింది. కార్తిక్ పాడిన సాంగ్స్ లో "ఒక మారు...అరెరే ...నిజంగా నేనేనా" ఈ సాంగ్స్ లో ర్యాంక్స్ ఇమ్మని "అడిగేసరికి "అది కష్టం కానీ చెప్తా.. నా కన్సర్ట్స్ అన్ని కూడా ఒక మారు సాంగ్ తో స్టార్ట్ చేస్తా, తర్వాత నిజంగా నేనేనా అనే సాంగ్ సెకండ్ ప్లేస్" అని చెప్పాడు కార్తీక్.  

Karthika Deepam2 : పెళ్ళి ఆపడానికి కార్తిక్ ప్రయత్నం.. జ్యోత్స్న అర్థం చేసుకోగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -97 లో... కార్తీక్ ఇంట్లోకి వస్తుంటే‌. రండి కాబోయే పెళ్లికొడుకు గారు అని కాంచన అంటుంది. వచ్చే వారం నిశ్చితార్థం అంట కదా.. ఇప్పుడు పిన్ని కాల్ చేసి చెప్పిందని కాంచన అంటుంది. ఇంట్లో నాన్న లేడా అని కార్తీక్ అడుగుతాడు. లేడు ఎందుకు అని కాంచన అంటుంది. పెళ్లి గురించి మాట్లాడడానికి అని కార్తీక్ అంటాడు. నిశ్చితార్థం అయ్యాక వెంటనే పెళ్లి ఉంటుందని కాంచన అనగానే.. నిశ్చితార్ధం ఆపాలని కార్తీక్ అంటాడు. ఇప్పటికే బిజినెస్ గురించి లేట్ చేసావని, నీపెళ్లి నా చేతులు మీదుగా చెయ్యాలని ముచ్చటపడుతున్నానని కాంచన అనగానే.. కార్తీక్ ఏం మాట్లాడలేకపోతాడు. మరొకవైపు దీప వంట చేసి శౌర్యకి భోజనం తీసుకొని వస్తుంది. కానీ శౌర్య అలిగి కూర్చొని ఉంటుంది. నన్ను అమ్మమ్మ దగ్గరకి వెళ్ళనివ్వలేదని శౌర్యా అంటుంది. ఇప్పుడు మనం ఆ ఇంట్లో ఉండడం లేదు కదా అని దీప అంటుంది. కార్తీక్ దగ్గర కి తీసుకొని వెళ్లట్లేదు.. కార్తీక్ దారిలో కన్పిస్తే కూడా మాట్లాడనివ్వలేదని శౌర్య అంటుంది. నువ్వు స్కూల్ కి వెళ్ళాలని దీప అనగానే.. నేను వెళ్ళనంటూ శౌర్య కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. మరొకవైపు ఎందుకురా దాని జోలికి వెళ్లి దెబ్బలు తింటావా అని నర్సింహాపై అనసూయ కోప్పడుతుంది .మరి మా చుట్టాల పిల్లని పెంచుకోవాలా అని శోభ అనగానే.. వద్దు నేను నా మనవరాలిని తెచ్చుకుంటా అని అనసూయ అంటుంది. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళు కార్తీక్ జ్యోత్స్నల ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడుకుంటారు. మరొకవైపు శౌర్యకి దీప అన్నం తినిపిస్తూ.. జ్యోత్స్న, కార్తీక్ కి ఎంగేజ్ మెంట్ అంట, సుమిత్ర గారు చెప్పారని అనగానే.. మనం వెళ్తున్నామా అని శౌర్య అంటుంది. మరొకవైపు జ్యోత్స్నకి అర్థం అయేటట్టు.. నేను చెప్పాలా అని కార్తీక్ అనుకుంటాడు. మళ్ళీ వద్దులే అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : అత్త కపటనాటకం.. కోడలు  బయటపెట్టగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -149 లో.. తను అనుకున్న బిజినెస్ ని చేసుకోవడానికి ధనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తాడు సీతాకాంత్. దాంతో ధన, సిరిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరోవైపు సందీప్ ని జనరల్ మేనేజర్ ని చెయ్యడానికి శ్రీలత ప్లాన్ వేసింది. అందులో భాగంగా శ్రీవల్లి, సందీప్ ని సీతాకాంత్ తో మాట్లాడమని పంపిస్తుంది. మీరు ఇంటికి ఇల్లరికం వచ్చిన ధనకి ఒక దారి చూపిస్తున్నారు. అలాంటిది మీ తమ్ముడికి కూడ ఒకదారి చూపించండని సీతాకాంత్ ని శ్రీవల్లి అడుగుతుంది. ఏ పని లేకుండా ఇలాగే తయారు అవుతారు. అందుకే ఆఫీస్ లో జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కదా.. ఆ పోస్ట్ మా ఆయనకి ఇప్పించండని శ్రీవల్లి అంటుంది. అవును అన్నయ్య ఇకమీదట ఎలాంటి తప్పు చెయ్యనని సందీప్ అంటాడు. ఆ పోస్ట్ కి సందీప్ సరిపోడు.. దానికి మంచి చదువు, తెలివి కావాలి.. కావాలంటే ఏ ఫ్యూన్, అటెండర్ లాంటివి చూడు అని పెద్దాయన అంటాడు. అలా అంటారేంటని శ్రీవల్లి అంటుంది. మావయ్యగారు చెప్పింది నిజమే.. సందీప్ ఆ పోస్ట్ కి సరిపోడని శ్రీలత అంటుంది. ఏది ఎవరికి ఇవ్వాలో అన్నయ్యకి బాగా తెలుసు.. ఎవరు చెప్పనవసరం లేదని సిరి అంటుంది. నేను కుటుంబం వాళ్ళని చూడను.. టాలెంట్ ని మాత్రం చూస్తాను.. రేపు నువ్వు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వు.. నువ్వు సక్సెస్ అయితే జాబ్ వస్తుంది. లేదంటే లేదని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత నేను అంత చదువుకోలేదు.. అంత పెద్ద జాబ్ కి ఇంటర్వ్యూ ఏ లెవెల్ లో ఉంటుందో.. నాకు భయం లగా ఉందని సందీప్ భయపడుతుంటే.. నిన్ను అలా ఎలా వదిలేస్తానురా నిన్ను జనరల్ మేనేజర్ గా చూడాలి అనుకున్నాను అంతే.. ఇంటర్వ్యూ చేసేవాల్లలో ఒకరు మనవాళ్ళు ఉంటారు. నీకు జాబ్ వచ్చినట్టే అని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఏదో ఆలోచిస్తుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి కాఫీ తీసుకొని రమ్మని చెప్తాడు. అయిన రామలక్ష్మి పట్టించుకోదు. మళ్ళీ పిలుస్తాడు మీరు నిజంగానే ఆ పోస్ట్ మీ తమ్ముడికి ఇస్తారా అని రామలక్ష్మి అడుగుతుంది. సెలక్ట్ అవుతూనే ఇస్తామని సీతాకాంత్ అంటాడు. కాసేపటికి సీతాకాంత్ ఆఫీస్ కి రెడీ అవుతాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడని సందీప్ ని రెడీ చేస్తుంది శ్రీవల్లి. నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా అని  సందీప్ ని సీతాకాంత్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కొంపముంచిన బంటు.. కథ మళ్ళీ మొదటికి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -462 లో... సుభాష్ ఇచ్చిన చీరని అపర్ణ పనిమనిషికి ఇవ్వడంతో సుభాష్ బాధపడతాడు. దాంతో అపర్ణ దగ్గరకి సుభాష్ వెళ్లి మాట్లాడగా.. తను సుభాష్ బాధపడే విధంగా మాట్లాడుతుంది. దాంతో కావ్య వెళ్లి అపర్ణకి నచ్చజెప్పాలని చూస్తుంది. నువ్వు నాకే ఎదురు మాట్లాడుతున్నావా అంటూ అపర్ణ కోప్పడుతుంది. ఇది నా కాపురానికి సంబంధించిన విషయమని అపర్ణ అంటుంది.కానీ మీరు మర్చిపోయి మామయ్యని అర్ధం చేసుకోండని కావ్య అంటుంది. రాజ్ తప్పు చేస్తే నువ్వు ఊరుకునేదానివా.. నువ్వు రాజ్ తప్పు చెయ్యడని నమ్మావ్.. ఒకవేళ తప్పు చేసాడని నిరూపణ అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అన్నావని అపర్ణ అంటుంది.‌నా నమ్మకం పోయింది అంతే అని అపర్ణ అంటుంది. మరోవైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే తను లిప్ట్ చెయ్యదు. అప్పుడే స్వప్న వెళ్తుంటే.. కళ్యాణ్ పిలిచి అప్పు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. నీ ఫోన్ ఇవ్వమని అంటాడు. ఫోన్ మాట్లాడ్డం ఇష్టం లేక చెయ్యట్లేదు.. నువ్వు ప్రాబ్లెమ్ ని మళ్ళీ పెద్దగా చెయ్యకని స్వప్న అంటుంది. అప్పుడే రాహుల్ వచ్చి ఒకసారి అప్పు తో మాట్లాడించవచ్చు కదా అని స్వప్నతో అంటాడు. మీకేం తెలుసంటూ రాహుల్ పైకి‌ స్వప్న విరుచుకుపడుతుంది.‌ మరొకవైపు రాహుల్, రుద్రాణి లు కలిసి కళ్యాణ్ సెట్ అయి ఆఫీస్ కి వెళ్తే పరిస్థితి ఏంటని అనుకుంటారు. ఆ తర్వాత ఇక అమ్మానాన్న కలవరంటావా అని కావ్యని రాజ్ అడుగుతాడు. మొన్న మీరు నాకేదో చెప్తానన్నారు.. ఏంటి అది అని కావ్య అడుగుతుంది. నువు కళ్ళు మూసుకోమని కావ్యతో రాజ్ అనగానే.. కావ్య కళ్ళు మూసుకుంటుంది. తనలోని ప్రేమని చెప్పాలని ట్రై చేస్తాడు. అప్పుడే కావ్య వాష్ రూమ్ కు కెళ్ళి వచ్చి రేపు కళ్ళు మూసుకుంటాను.. రేపు చెప్పండి అంటూ పడుకుంటుంది. మరుసటిరోజు ఉదయం అప్పు, బంటీలు బయటకు వెళ్తే.. అక్కడ కొంతమంది అబ్బాయిలు అప్పు గురించి తప్పుగా మాట్లాడతారు. మాతో కూడా హోటల్ కి వస్తావా అని వాళ్ళు అనగానే.. అప్పు కోపంగా వాళ్ళ తల పగులగోడుతుంది. ఆ తర్వాత అప్పు స్టేషన్ లో ఉంటుంది. ఆ విషయం కళ్యాణ్ కి బంటు ఫోన్ చేసి చెప్తాడు‌ హడావిడి గా కళ్యాణ్ వెళ్తుంటే.. ఎక్కడికి అని ధాన్యలక్ష్మి అంటుంది. బయటకు వెళ్తున్నానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : ఎండీ పదవి వద్దని చెప్పిన మను.. షాక్ లో మినిస్టర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1127 లో..... దేవయాని చేస్తున్న బ్లాక్ మెయిల్ కి అనుపమ బయపడి తన పెద్దమ్మ దగ్గరకి వస్తుంది. కాసేపటికి మనుని రమ్మని చెప్తుంది. మను వచ్చాక ఇక మనం ఇక్కడే ఉండాలని అనుపమ అనగానే.. ఎందుకు? ఏం జరిగిందని మను అడుగుతాడు. ఏం లేదు ప్లీజ్ నేను చెప్పింది విను అని అనుపమ అనగానే.. ఏదో జరిగింది దాస్తున్నారు చెప్పండి అని మను అంటాడు.‌ మీరు ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి.. నా తండ్రి ఎవరో చెప్పండి.. లేదంటే ఈ గన్ తో షూట్ చేసుకుంటానని మను తన తల దగ్గర గన్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత వద్దని అనుపమ అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి గన్ ని లాక్కుంటాడు.అసలు ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా అని మహేంద్ర అడుగుతాడు. ప్లీజ్ మహేంద్ర మన ఫ్రెండ్ షిప్ పై గౌరవం ఉంటే ఏం అనకని అనుపమ అంటుంది. ఆ తర్వాత మహేంద్ర వెళ్ళిపోయాక.. నీకు నన్ను అమ్మ అని పిలవాలని ఉంది కదా.. నీకు ఎంతుందో నిన్ను అమ్మ అని పిలిపించుకోవాలని నాకు అంతకు పది రేట్లు ఉందని అనుపమ అంటుంది. అమ్మ అని పిలుపు అనగానే.. మను అమ్మ అని పిలిస్తూ ఎమోషనల్ అవుతాడు. నేను చెప్పినట్టు విను మనం ఇక్కడే ఉందాం.. కాలేజీలో కూడ నువ్వు జోక్యం చేసుకోకని అనుపమ అనగానే.. మను సరే అంటాడు. మరొకవైపు రంగా నానమ్మ రాధమ్మ కిందపడిపోతుంది. అప్పుడే వసుధార వచ్చి హెల్ప్ చేస్తుంది. రంగా వస్తాడు. అప్పటికే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంది. టైమ్ కి ఎవరు హెల్ప్ చేసి కాపాడారని డాక్టర్ అంటుంది. ఆ తర్వాత రంగా ఎమోషనల్ అవుతూ వసుధారకి థాంక్స్ చెప్తాడు. ఏంటి సర్ ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. రిషి సర్ కాదా నిజంగానే రంగానా అని అనుకొని.. లేదు నా రిషి సర్ అని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత మినిస్టర్ గారు కాలేజీ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసానో తెలుసా అని ఎండీ చైర్ గురించి అని మాట్లాడతాడు. నాకు ఈ కాలేజీకి ఎండీ గా మను ఉంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నానని మినిస్టర్ అనగానే.. మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా అని శైలేంద్ర ఆవేశపడుతుంటే.. ఫణీంద్ర తనపై కోప్పడతాడు.ఆ తర్వాత మనునే ఎండీ అని మినిస్టర్ అనగానే.. అందుకు నేను సిద్దంగా లేనని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సింగర్ పార్వతి ఊరిలో హైపర్ ఆది ఫోటో!

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా పార్వతి ఎంట్రీ ఇచ్చింది. పార్వతి అంటే చాలు అందరికీ గుర్తొచ్చేది విషయం ఊరికి బస్సు వేయించిన సరిగమప సింగర్ పార్వతి..పార్వతి అంటే పాట ఎలా గుర్తొస్తుందో ఊరికి బస్సు కూడా అలాగే గుర్తొచ్చేస్తుంది. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీకి స్పెషల్ కలర్ అద్దడానికి సరిగమప సింగర్స్ శ్రీచరణ్-పార్వతి వచ్చారు. ఇక వాళ్ళు పాడిన పాటలకు ఇంద్రజ ఫుల్ ఫిదా ఐపోయింది. ఇక లాస్ట్ లో ఒక సెగ్మెంట్ పెట్టింది రష్మీ. "శ్రీదేవి డ్రామా కంపెనీ ఫొటోస్ తో పాటు మెమోరీస్ కూడా ఇవ్వబోతోంది" అనే సెగ్మెంట్ అది. ఇందులో నచ్చినవాళ్లతో ఫొటోస్ తీసుకుని వాళ్ళ వాళ్ళ మెమోరీస్ ని షేర్ చేసుకున్నారు. ఇందులో హైపర్ ఆది సింగర్ పార్వతితో ఫోటో దిగాలని కోరుకున్నాడు. ఇక పార్వతి కూడా స్టేజి మీదకు వచ్చి ఆదితో ఫోటో దిగింది. "పార్వతికి జబర్దస్త్ వాళ్లంటే చాలా ఇష్టం అని చెప్పింది.. ఇక ఈ ఫోటోని తన ఊరి వాళ్లందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అన్నాడు ఆది. ఈ రాబోయే ఎపిసోడ్ కి పార్వతిని తీసుకురావడంతో నెటిజన్స్ నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.. పార్వతిని తీసుకురావడం చాలా గ్రేట్ గా ఉంది. పార్వతి వాయిస్ నేచురల్ గా ఉంటుంది." అంటున్నారు. ఇక పార్వతి సరిగమప జడ్జెస్ కి కూడా ఎంతో నచ్చిన వాయిస్..కోటి గారు కూడా పార్వతి గాత్రాన్ని బాగా ఆస్వాదించారు.  

పిల్లలు చనిపోతున్నారు...బెట్టింగ్ యాప్స్ ఆపు శివజ్యోతక్క

బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతుండడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇన్ని జీవితాలు నాశనం అవుతున్నా సెలబ్రిటీలు మాత్రం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వాళ్లలో బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి గురించి చాలా చెప్పుకోవాలి. శివజ్యోతి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ని ఆపకపోవడం పై యూట్యూబర్ యువసామ్రాట్ రవి కౌంటర్ ఇచ్చాడు.  బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద సునామీలా విరుచుకుపడుతున్నారు యువసామ్రాట్ రవి. యూట్యూబర్ హర్షసాయి ఇష్యూతో హాట్ టాపిక్‌గా మారిన యువసామ్రాట్ రవి.. యాంకర్ శివజ్యోతి పై వీడియో రిలీజ్ చేసాడు. ‘ శివజ్యోతక్కా.. మంచి ఫిల్టర్  చెప్పక్కా.. ఈమధ్య వీడియోల్లో కర్రిగా కనిపడుతున్నా.. నీలాగ తెల్లగా  కనిపించాలా’ అంటూ ఆమె ఫేస్ కి ఫిల్టర్లు వేసి వీడియోస్ చేస్తుందంటూ సెటైర్ వేసాడు. ఆమె బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇందులో శివజ్యోతి.. "నాలాగే మీరు కూడా బెట్టింగ్‌లో డబ్బులు పెట్టండి.. 2 వేలు పెడితే.. పాతికవేలు, మూడు వేలు పెడితే 35 వేలు, 4 వేలు పెడితే.. ఇలా చెప్తూ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసేస్తుంది. ఈమె బెట్టింగ్ వ్యవహారాన్ని  బయటపెట్టిన యువ సామ్రాట్ రవి సైటైర్లు వేస్తూ.. ‘ఏంటక్కా.. ఫిల్టర్ గురించి మాట్లాడమంటే బెట్టింగ్ అంటావూ.. నువ్వు కూడా సేమ్ బ్యాచా అక్కా.. ?  ఇవన్నీ ఇక బంద్ చేయండి. పిల్లలు చనిపోతున్నారు ..అర్ధం చేసుకోండ్రీ..  బయట పబ్లిక్ రియాక్షన్ ఇంకా గలీజ్‌గా ఉంటుంది. జైహింద్’ అంటూ శివజ్యోతికి  కౌంటర్ ఇచ్చాడు.

కార్తీక్ ఎమోషనల్.. నా ఎంగేజ్ మెంట్ ఆ దీప చూడాలి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -96 లో....గుడిలో సుమిత్ర దీపని చూస్తుంది. ఎందుకు వెళ్ళావంటే సమాధానం చెప్పదు. వచ్చేవారం జ్యోత్స్న, కార్తీక్ లకి ఎంగేజ్ మెంట్.. నువు తప్పకుండా రావాలి. నా చిన్న కూతురు ఎంగేజ్ మెంట్ కి పెద్ద కూతురు కంపల్సరీ రావాలని సుమిత్ర రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత సుమిత్ర వెళ్ళాక.. అమ్మ గుడికి అందరు వచ్చారు. కార్తీక్ రాలేదేంని శౌర్య అడుగుతుంది. నాకేం తెలుసని దీప ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. మరొకవైపు దీప ఉండి వెళ్లిన అవుట్ హౌస్ కి కార్తీక్ వెళ్లి.. శౌర్య బుక్స్ చూసి ఎమోషనల్ అవుతాడు. అక్కడే దీప కార్తీక్ ఇవ్వాల్సిన డబ్బుల బాక్స్ ని చూస్తాడు. అది ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉంటాయి. అందులో మీ డబ్బులు మీకు గడువులోగా ఇస్తాననే చీటీ రాసి ఉంటుంది. అది చూసి ఇంత నిజాయితీ ఏంటి దీప అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ బయటకు వస్తాడు. అప్పుడే పారిజాతం వచ్చి.. ఏంటి జ్ఞాపకాలు వెతుకుంటున్నావా అని అడుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ .. నాకు పెళ్లి ఇష్టం లేదన్నా కదా అని కార్తీక్ అంటాడు. ఈ విషయం అత్తయ్య వాళ్ళు వచ్చాక చెప్తానని కార్తీక్ అనగానే.. చెప్తే మీ అమ్మ బతకదని పారిజాతం అంటుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని కార్తీక్ అంటాడు. అప్పుడే సుమిత్ర వాళ్ళు గుడి నుండి వస్తారు. శుభవార్త వినాలని నేను నా మనవడు ఎదురు చూస్తున్నామని పారిజాతం అంటుంది. పారిజాతం ప్రవర్తన వల్ల కార్తీక్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న రాగానే పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముహూర్తం గురించి చెప్తుంది. కార్తీక్ వెళ్తుంటే సుమిత్ర పిలిచి.. దీప కన్పించిందని చెప్తుంది.  ఆ తర్వాత కార్తీక్ కార్.. దీప వెళ్లే అటో పక్కనే వెళ్తుంది. కార్తీక్ అంటూ శౌర్య అంటుంది. ఆటో ఫాస్ట్ గా వెళ్ళమని శౌర్యా అంటుంది. అవసరం లేదని దీప అంటుంది. మరొకవైపు దీప ఇక్కడే ఉందిమ మనం ఎంగేజ్ మెంట్ రోజు ఇక్కడే ఉంచాలి. నా ఎంగేజ్ మెంట్ అది చూడాలి.. ఎలాగైనా ఎక్కడ ఉందో కనిపెట్టాలని జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అటు అమ్మ ప్రేమ‌‌.. ఇటు భార్య ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -148 లో....రామలక్ష్మి, సీతాకాంత్ లు బారసాల ఫంక్షన్ కి వెళ్తుంటే.. శ్రీలత ఆపాలని కళ్ళు తిరిగిపడిపోయినట్లు నటిస్తుంది. దాంతో వాళ్ళు వెళ్లకుండా ఆగిపోతారు. టాబ్లెట్ వేసుకోలేదు నాన్న అందుకే ఇలా జరిగిందని సీతాకాంత్ తో శ్రీలత అంటుంది. దాంతో టాబ్లెట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటు శ్రీవల్లిని సీతాకాంత్ అంటుంటే.. ఆ డ్యూటీ రామలక్ష్మిదని శ్రీవల్లి అంటుంది. ఇక రామలక్ష్మిపై సీరియస్ అవుతాడు సీతాకాంత్ . అమ్మని జాగ్రత్త గా చూసుకోండి అంటూ సీతాకాంత్ వెళ్ళిపోతాడు.  శ్రీలత కాళ్ళు రామలక్ష్మి నొక్కుతుంటే.. చూసావా నా ప్లాన్ ఎలా ఉందోనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత మేమ్ వెళ్లకుండా ఉండడానికి ఇదంతా చేసారా అని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి కోపంగా శ్రీలత కాళ్ళు గట్టిగా నొక్కుతుంది‌‌. ఏయ్ ఏం చేస్తున్నావ్.. నొప్పిగా ఉందని శ్రీలత అంటుంది‌. చూసావా నన్ను ఒక్క నిమిషం కూడా నీ కాళ్ళు పట్టించలేకపోయావని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు ఆఫీస్ లో సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఆలోచిస్తుంటాడు. పాపం తను ఎప్పుడు సరదాగా బయటకు వెళదామన్నా.. ప్రతిసారీ ఇలా జరుగుతుందని  సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు సీతాకాంత్ గురించి రామలక్ష్మి ఆలోచిస్తుంది‌. అక్కడ తన డైరీ ఉంటుంది. అది ఓపెన్ చేసి చదవాలని అనుకుంటుంది. ఒకవేళ నన్ను ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూస్తున్నానని రాసి ఉంటే మళ్ళీ బాధపడతానని రామలక్ష్మి చదవకుండా ఆగుతుంది. ఆ తర్వాత సందీప్ ని ఎలాగైనా జనరల్ మేనేజర్ ని చెయ్యాలని అనుకోని శ్రీవల్లి, సందీప్ లకి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. మరొక వైపు సీతాకాంత్ లాయర్ ని పిలిపించి ధనకి ఇవ్వాలసింది ఫైల్ రూపంలో రెడీ చేసి ధనకి ఇస్తాడు. ఇదంతా నీ కష్టం మీద నువ్వు సొంతంగా డెవలప్ అవ్వని సీతాకాంత్ అంటాడు. దాంతో సిరి, ధనలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధారని ఇంటికి తీసుకొచ్చిన రంగ.. షాక్ లో సరోజ...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1126 లో.. రంగా మళ్ళీ వసుధారని తీసుకొని వస్తాడు. దాంతో మళ్ళీ ఎందుకు దీన్ని తీసుకొని వచ్చావంటూ సరోజ కోప్పడుతుంది. వసుధార చీర కట్టుకొని వస్తుంటే.. మేడమ్ మీకు ఈ చీర బాగుందని రంగా చెప్తాడు. ఈ చీర ప్రొద్దున సరోజనే ఇచ్చిందని వసుధార చెప్తుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావని వసుధారని సరోజ అడుగుతుంది. రిషి సర్ తీసుకొని వచ్చాడు. అయినా నేనేం వట్టిగనే రాలేదు.. పైన పెంట్ హౌస్ ఉంది కదా అందులోకి రెంట్ కి వచ్చానని వసుధార అంటుంది. అదేంటి రెంట్ ఎందుకని సరోజ అంటుంది. మాకు డబ్బులు కావాలి మీ నాన్నకి అప్పు కట్టాలి కదా అని రంగా అనగానే.. మా నాన్నకి చెప్పి అప్పు కట్టడం వద్దని చెప్తానని సరోజ అంటుంది. నేను ఉండమని మాటిచ్చాను సరోజ అని రంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సరోజ వసుధారతో కాసేపు వాదిస్తుంది.  మరొకవైపు అనుపమ బాధపడుతూ.. తన పెద్దమ్మ దగ్గరకి వస్తుంది. అనుపమ తనని దేవయాని బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం చెప్తుంది. ఇన్నిరోజులు ఆ నిజం ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడ్డాను.. ఎన్ని బాధలు, ఇబ్బందులు వచ్చినా నిజం చెప్పలేదు.. ఇప్పుడు ఇలా తను బ్లాక్ మెయిల్ చేస్తుంది. నేను మను వాళ్లకు దూరంగా ఉంటానని అనుపమ అంటుంది. అప్పుడే మహేంద్ర ఫోన్ చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగగా.. బయటకు వచ్చాను. అది నీకు అనవసరం అంటూ మహేంద్రతో అనుపమ కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే మహేంద్ర దగ్గరకి మను వస్తాడు. మీ అమ్మ ఎక్కడికి వెళ్లిందో అర్ధం కావడం లేదని అనగానే.. మను వాళ్ళ గ్రానీకి ఫోన్ చేస్తాడు. దాంతో అనుపమ ఇక్కడే ఉందని తను చెప్తుంది. మహేంద్రతో మాట్లాడి నువ్వు త్వరగా ఇక్కడికిరా అని మనుతో గ్రానీ చెప్తుంది.  మరొకవైపు వసుధార ట్యూషన్ చెప్తుంది. ఊళ్ళో పిల్లలు అందరిని వసుధార దగ్గర కి తీసుకొని వస్తారు. ఈ ఊళ్ళో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మీరు చేస్తున్నారు మా పిల్లలని మీ చేతిలో పెడుతున్నామని వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఇది ఊళ్ళో వాళ్ళ దృష్టిలో మంచిది అయిందని సరోజ కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత అనుపమ దగ్గరకి మను వస్తాడు. ఇక నుండి మనం ఇక్కడే ఉందామని అనుపమ అనగానే.. మను ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆమెని ఏడ్పించారు.. ఇతను స్టేషన్ కి వెళ్ళాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -461 లో....అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో ఫన్నీ గేమ్స్ ఆడుతారు. కేక్ కట్ చెయ్యడానికి ఇద్దరు రెడీగా ఉంటారు. అప్పుడే రుద్రాణి కావాలనే పనిమనిషిని జ్యూస్ తీసుకొని రమ్మని చెప్తుంది. పనిమనిషి అపర్ణ ఇచ్చిన చీర కట్టుకొని వచ్చి అందరికి జ్యూస్ ఇస్తుంటే.. ఆ చీర చూసిన రాజ్, కావ్య, సుభాష్ లు షాక్ అవుతారు. ఇక కేక్ కట్ చెయ్యండి అని అందరు అంటుంటే సుభాష్ వెళ్లిపోతుంటాడు. సుభాష్ ని రాజ్ ఆపి వద్దని చెప్తాడు. ఇక అపర్ణ అందరి ముందు నవ్వుతూ.. లోపల సుభాష్ పై కోపాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇద్దరు అయిష్టంగా కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత అపర్ణ కేక్ సుభాష్ కి కాకుండా రాజ్ కి తినిపిస్తుంది. దాంతో సుభాష్ డిస్సపాయింట్ అవుతాడు. అందరు బయట ఉంటే అపర్ణ గదిలో ఉంటుంది. సుభాష్ వెళ్లి ఎందుకు నేను ఇచ్చిన చీర పనిమనిషికి ఇచ్చావని అడుగుతాడు. అది నాకు ఇష్టం అన్నట్లుగా అపర్ణ సమాధానం చెప్తుంది. కొద్దీసేపు అపర్ణతో వాదించి సుభాష్ వెళ్ళిపోతాడు. సుభాష్ కి రాజ్ , కావ్యలు ఎదురుపడతారు. సుభాష్ ఏం జరుగనట్టు మాములుగా ఉంటే.. ఇంకా మీరు అన్ని మర్చిపోయి కలిసిపోలేదా అని రాజ్ అంటాడు. ఇక మీరు మమ్మల్ని కలిపే ప్రయత్నం చెయ్యకండి. కొద్దిరోజులు అనామిక, కళ్యాణ్.. కొద్దిరోజులు రాహుల్, స్వప్న‌. కొద్దిరోజులు ఆ మాయ గురించి.. ఇలా మీరు మీ సంతోషం కోల్పోతున్నారని సుభాష్ చివాట్లు పెడతాడు. ఆ తర్వాత అపర్ణ దగ్గరకి కావ్య వెళ్తుంది. మీ మావయ్య పంపిస్తే వచ్చావా అని అపర్ణ అంటుంది. నాకు ఎవరు చెప్పలేదని కావ్య అంటుంది. మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని కావ్య అనగానే.. నాకే ఎదురు మాట్లాడుతున్నావా అంటూ అపర్ణ కోప్పడుతుంది. మీకు ఎదురుమాట్లాడే దైర్యం నాకు లేదని కావ్య అంటుంది. తరువాయి భాగంలో అప్పుని కొందరు అబ్బాయిలు ఏడిపిస్తే.. అప్పు వాళ్ళని కొడుతుంది. దాంతో అప్పు స్టేషన్ కి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న కళ్యాణ్ అప్పుని ఎవరు ఏడిపించారంటూ అక్కడున్న అబ్బాయిలను కొడతాడు. దాంతో కళ్యాణ్ కూడా అరెస్ట్ అవుతాడు. ఆ విషయం రాజ్ కావ్యలకి స్టేషన్ నుండి పోలీసులు కాల్ చేసి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సుమ, రష్మీ, ఇంద్రజ... ఎక్కడ దొరికార్రా పించన్ బ్యాచ్ 

  జబర్దస్త్ ఇప్పుడు సరదా శుక్రవారం, సరిపోదా శనివారంగా డివైడ్ అవ్వడంతో కామెడీ కూడా కొంచెం బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక సరిపోదా శనివారం షోలో బులెట్ భాస్కర్ స్కిట్ మాములుగా లేదు. ఇందులో ఫేమస్ సెలబ్రిటీస్ పట్టుకుని అంత మాట అనేశాడు. ఇంతకు ఏమయ్యిందంటే బులెట్ భాస్కర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకు మొత్తం అప్పజెప్పారు. ఐతే భాస్కర్ పెళ్లి ఈవెంట్ కి యాంకర్స్ గా సుమ, రష్మీ, ఇంద్రజ అని ఈవెంట్ మేనేజర్ లిస్ట్ చూపించేసరికి భాస్కర్ ఒక్కసారిగా ఫైర్ ఐపోయి ఆ లిస్ట్ ని విసిరిగొట్టాడు. "నేనేమన్నా ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెళ్లి చేసుకుంటున్నానా.. ఎక్కడ దొరికార్రా ఈ పించన్ బ్యాచ్ నీకు" అంటూ నాటీ నరేష్ మీద ఫైర్ అయ్యాడు. "రష్మీకి తెలుగు రాదు ఐనా పదేళ్ల నుంచి యాంకరింగ్ చెయ్యట్లేదు. కాబట్టి శ్రీదేవి కూతురు జాన్వీని యాంకరింగ్ కి పెట్టు. " అన్నాడు భాస్కర్. ఇక నాటీ నరేష్ మరి మేల్ యాంకర్ ని ఎవరిని పెడదాం ఫామిలీ స్టార్ ని పెడదామా అనేసరికి "హా విజయ్ దేవరకొండ... సూపర్ పెట్టెయ్" అన్నాడు దానికి నరేష్ ఆయన కాదు సుడిగాలి సుధీర్ అంటూ చెప్పాడు. "మరి గెస్టులుగా ఎవరిని పిలుద్దాం..షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్" అని నరేష్ అడిగేసరికి " ఒకప్పుడు షారుఖ్ ని, సల్మాన్ ని చూడడానికి అందరూ ముంబై వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకే అక్కడ పని లేక వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసుకుంటున్నారు" అంటూ పంచ్ డైలాగ్స్ ఈ స్కిట్ లో ఎంటర్టైన్ చేసాడు.  

ఆ ఇంట్లో గొడవలకు ఈ ఇంట్లో అలకేందుకే చిలక

  జబర్దస్త్ శుక్రవారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో నూకరాజు - రష్మీ మధ్య ఆ కోపం ఇంకా చల్లారినట్టు లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ జబర్దస్త్ కి పాకింది. నూకరాజు స్కిట్ లో ముందుగా రష్మీ దగ్గరకు వెళ్లి "వుండు ఎంత సేపు ఉంటావో మాట్లాడకుండా..అసలు తప్పు నీది కాదు నాది కాదు ఆ అమ్మది. ఇలా నిప్పు గీసి అలా పెట్టేసింది. ఆ మంటలో నువ్వు, నేను కాలిపోయాం..కానీ మచ్చ మాత్రం నా మీద పడిపోయిందే.. ఆ ఇంట్లో గొడవలకు ఈ ఇంట్లో అలకేందుకే చిలక,. నాన్సెన్స్..ఏదో ఒకటి మాట్లాడు లేదంటే సూసైడ్ లెటర్ రాసి అందులో ఇద్దరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటా ..నువ్వు ఇలాగే ఉంటె నేను జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతా చూస్కో..చిలిపి మనిద్దరి మధ్య మొదలయిందని నాకు అర్ధమయ్యింది " అంటూ రష్మిని కాసేపు బుజ్జగించి, బతిమాలి, బామాలి చివరికి నవ్వించాడు నూకరాజు. ఇక నూకరాజు నాగేశ్వరావు గెటప్ లో, తాగుబోతు రమేష్ నాగార్జున గెటప్ లో వచ్చి అలరించారు. ఇలా ఈ వారం సరదా శుక్రవారంలో స్కిట్స్ అన్నీ అలరించాయి.  

గతజన్మలోని ప్రేమికులు ఈ జన్మలో కలుస్తారా!

  కొన్ని కథలు చూస్తుంటే మనం అందులో ఇన్వాల్వ్ అవుతాం. అలా చూస్తూ చూస్తూ ఉండిపోతాం. అంత చక్కని కథని స్టార్ మా అభిమానులకి దగ్గర చేస్తుంది ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్.  కొత్త నటీనటులు, కొత్త కథ, ఢిఫరెంట్ గా చూపిస్తున్న ఈ సీరియల్  రోజు రోజుకు ఫ్యాన్ బేస్ పెంచుకుంటుంది. దానికి కారణం రామలక్ష్మి, సీతాకాంత్ ల జోడీ. బ్రహ్మముడి కావ్య, రాజ్ ల తర్వాత గుప్పెడంత మనసు రిషి, వసుధారలు ఉండగా.. మళ్ళీ అంతటి క్రేజ్ వీరిద్దరికే వస్తోంది. సీతాకాంత్, రామలక్ష్మిలకి ఇన్ స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఈ సీరియల్ అంత హిట్ అవ్వడానికి కారణమేమంటే.. రామలక్ష్మి, సీతాకాంత్ గత జన్మలో ప్రేమించుకుంటారు‌. కానీ విధి వీరిద్దరిని దూరం చేస్తుంది. అయితే ఆ జన్మ జ్ఞాపకాలు ఎప్పుడు సీతాకాంత్ ని వెంబడిస్తూనే ఉంటాయి. అదే సమయంలో రామలక్ష్మి కనపడటం.. స్వామిజీ చెప్పినట్టు రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్ళి చేసుకుంటాడు.  అయితే ఈ సీరియల్ మొదట్లో తన చెల్లి సిరి కోసం రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్లి చేసుకుంటాడు. మాణిక్యం తన కొడుకు ధనతో సిరి పెళ్ళి జరిపించడమే కాకుండా సీతాకాంత్ ఆఫీస్ లో ఉద్యోగం కూడా ఇచ్చేలా చేస్తాడు‌. రామలక్ష్మికి సీతాకాంత్ పై ప్రేమ మొదలవుతుంది. కానీ సీతాకాంత్ తనకి భార్య స్థానం ఇవ్వలేదని అనుకుంటుంది. అదే సమయంలో రామలక్ష్మి కూడా తనకి భర్త స్థానం ఇవ్వలేదేమోనని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. ఇక వీరిమధ్య దూరం పెంచడానికి సవతి తల్లి శ్రీలత, ఆమె కొడుకు సందీప్, కోడలు శ్రీవల్లి ప్లాన్ చేస్తుంటారు. మరోవైపు సీతాకాంత్ , రామలక్ష్మిలకి సపోర్ట్ గా పెద్దాయన ఉంటాడు‌. మరి గత జన్మలోని ఈ ప్రేమికులు ఈ జన్మలో కలుస్తారా లేదా అనేది మిగతా కథ. తాజాగా యూట్యూబ్ లో రిలీజైన ప్రోమోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. బ్రహ్మముడి, గుప్పెడంత మనసు సీరియల్స్ తో పోటీపడుతూ ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీని పొందుతుంది. షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను యూట్యూబర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసాడు మూవీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. బిగ్ బాస్ కి వెళ్ళాడు. దీప్తి సునాయానాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. తర్వాత దీప్తి వదిలేసింది. ఇక షన్ను కూడా చాలా ఇష్యుస్ లో పట్టుబడడం వంటివి జరిగాయి. ఆ తర్వాత అసలు షన్ను కనిపించడమే మానేసాడు. అలాంటి షన్ను రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. "మీకు కూడా మీ కుటుంబంలో ఎవరైనా స్నేహితుడు లేదా సిఏ  విద్యార్థి ఉన్నట్లయితే అతను సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మీ ఫ్రెండ్స్ , ఫామిలీ మెంబర్స్  వారిని ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి. సిఏ చదివేవారికి కాదు అందరికీ సపోర్ట్ అవసరం. నాకు చాలాసార్లు చావాలని అనిపించేది. కానీ ధైర్యంగా ఉండడం నేర్చుకున్నా.  ఎన్ని సమస్యలు వచ్చినా  నేర్చుకోడానికి ప్రయత్నిస్తాను కానీ ఒక్కసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోరు కుటుంబం తప్ప ... దయచేసి ఏ  సమస్యనైనా  ధైర్యంతో ఎదుర్కోండి .. నొప్పిని తట్టుకుంటే ఆ దేవుడే మీకు మంచి మార్గం చూపిస్తాడు. నాకు అర్ధమైన విషయం మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని " అంటూ హితవు చెప్పాడు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం అంటూ ఈ పోస్ట్ లో తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.  

నొప్పిని తట్టుకుంటే ఏదైనా చేయగలం.. మీరు కూడా సపోర్ట్ చేయండి!

షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను యూట్యూబర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసాడు మూవీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. బిగ్ బాస్ కి వెళ్ళాడు. దీప్తి సునాయానాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. తర్వాత దీప్తి వదిలేసింది. ఇక షన్ను కూడా చాలా ఇష్యుస్ లో పట్టుబడడం వంటివి జరిగాయి. ఆ తర్వాత అసలు షన్ను కనిపించడమే మానేసాడు. అలాంటి షన్ను రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. "మీకు కూడా మీ కుటుంబంలో ఎవరైనా స్నేహితుడు లేదా సిఏ  విద్యార్థి ఉన్నట్లయితే అతను సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మీ ఫ్రెండ్స్ , ఫామిలీ మెంబర్స్  వారిని ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి. సిఏ చదివేవారికి కాదు అందరికీ సపోర్ట్ అవసరం. నాకు చాలాసార్లు చావాలని అనిపించేది. కానీ ధైర్యంగా ఉండడం నేర్చుకున్నా.  ఎన్ని సమస్యలు వచ్చినా  నేర్చుకోడానికి ప్రయత్నిస్తాను కానీ ఒక్కసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోరు కుటుంబం తప్ప ... దయచేసి ఏ  సమస్యనైనా  ధైర్యంతో ఎదుర్కోండి .. నొప్పిని తట్టుకుంటే ఆ దేవుడే మీకు మంచి మార్గం చూపిస్తాడు. నాకు అర్ధమైన విషయం మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని " అంటూ హితవు చెప్పాడు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం అంటూ ఈ పోస్ట్ లో తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.  

మహిళలు ఎదగాలంటే షార్ట్ కట్ క్యాస్టింగ్ కౌచ్

  బిగ్ బాస్ ఫేమ్ నోయల్ భార్య ఎస్తర్ నోరోన్హా గురించి అందరికి తెలుసు. సంస్కార్ కాలనీ, భీమవరం బుల్లోడు, టెనెంట్, ది వెకెంట్ హౌస్ వంటి చిత్రాలతో ఎస్తర్ నోరోన్హా బాగా క్రేజ్ తెచ్చుకుంది. బోల్డ్ సీన్లలో ఎక్కువగా మెరిసిన ఈ భామకి సినిమాలో అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకొచ్చింది ఎస్తర్‌. మహిళలపై వేధింపులు సమాజంలో అన్నిచోట్లా ఉన్నాయని కానీ ఇండస్ట్రీలో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తుందని ఎస్తర్ చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో తొందరగా ఎదగాలనే కోరికతో ఏం చేయడానికైనా సిద్ధపడితే అడ్వాంటేజ్ తీసుకుంటారని, తొందరగా పైకి రావాలని కోరుకునే వారికి అదే షార్ట్ కట్ అని ఎస్తర్‌ అంది. ఈ ఇండస్ట్రీ కాదు ఎందులోనైనా మహిళలపై వేధింపులు సహజం కానీ ఇక్కడే ఎక్కువగా జరగడానికి కారణం ఇక్కడున్న పరిస్థితులేనని ఎస్తర్ అంది. అవకాశాల కోసం ఏం చేయగలవు అనే వాళ్లు, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్లు ఉంటారని అంది‌. నా దారిలో నేను వెళతాను అనుకునే వారిని ఎవరూ బలవంత పెట్టరని, ఆ ఛాయిస్ మాత్రం మనకు ఉందని చెప్పింది. తనవరకు తను టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను నమ్ముకుంటానని ఎస్తర్ చెప్పుకొచ్చింది. తన టాలెంట్ ద్వారా వచ్చే గుర్తింపునే కోరుకుంటానని ఎస్తర్ చెప్పుకొచ్చింది. అయితే తను చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

వాసంతి ఇంకా దొరకలేదు... ఏపీ సీఎంకి ట్యాగ్ చేసిన యాంకర్ రష్మీ

  రష్మీ అంటే చాలు ఆమె సోషల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్  చేస్తూ ఉంటుంది. మూగ జీవాలను కూడా బాగా చూసుకుంటూ ఉంటుంది.రీసెంట్ గా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి వాసంతిని, 15 ఏళ్ల ముగ్గురు మైనర్ బాలురు కలిసి  హత్యచారం చేసిన దారుణమైన ఘటన గురించి తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు గడిచినా ఇంత వరకు బాలిక మృతదేహం దొరకలేదు. ఇక ఘటన  రష్మీ  స్పందించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.  ‘వాళ్లు పెద్ద వాళ్లలా హత్యాచారం చేసినప్పుడు వాళ్లకు పడే , శిక్ష కూడా పెద్ద వాళ్లకు ఎలా వేస్తారో అలాగే ఉండాలి. ముఖ్యంగా వాళ్లు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాపపడటం లేదు. కాబట్టి, వాళ్లు కచ్చితంగా మైనర్లు  కాదు. మైనర్లు అనే ఒకే ఒక్క కారణంతో  తక్కువ శిక్షతో బయటపడడం  కరెక్ట్ కాదు’ అని ట్వీట్ చేసింది. ఈ పోస్టును  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎంవోకు ట్యాగ్ చేసింది. అయితే రష్మీ చేసిన పోస్టుకు పలవురు నెటిజన్స్ కూడా రియాక్ట్ అవతూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. యూట్యూబర్ హనుమంతు విషయంలో సాయి ధరమ్ తేజ్ ముందుకొచ్చి ఎలా రియాక్ట్ అయ్యారో రష్మీ కూడా ఈ విషయం పై రియాక్ట్ అయ్యారు.  

ఒక్కసారి చేస్తే వదిలిపెట్టను...అందుకే సర్జరీ చేయించుకున్నాను!

   శ్రీ సత్య గురించి చెప్పాలంటే బిగ్ బాస్ బ్యూటీగా చెప్పుకోవచ్చు.. ఆమె కొన్ని మూవీస్ చేసింది. అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చాక కొన్ని డాన్స్ షోస్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసి శ్రీ సత్య ఫేస్ గురించే టాపిక్ నడుస్తోంది. ఫేస్ లో ఏదో తేడా కొడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఐతే ఇప్పుడు శ్రీసత్య ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. "ఎక్కడికి ఛాన్స్ కోసం వెళ్లాలన్నా చిన్నపిల్లగా ఉన్నావ్ అంటున్నారు. దానికి నా లిప్ కూడా ఒక సమస్యగా ఉంది. అందుకే లిప్ ఫిల్లింగ్ చేయించా. ఐతే ఇదేమీ పెర్మనెంట్ ఇదే కాదు ఒక మూడు నెలలు వరకే ఉంటుంది. ముంబై, చెన్నై వాళ్ళను ఇండస్ట్రీలోకి తీసుకోవడానికి కారణం వాళ్ళ ఫేస్ డాల్స్ లా ఉంటుంది. నా లిప్స్ నాకు మైనస్ ఎందుకంటే పై పెదం చిన్నగా ఉంటుంది. ఐతే సినిమా వాళ్ళు చూసి ఇప్పుడు బాగుంది అంటున్నారు. ఐతే ఈ లిప్ ఫిల్లింగ్ అనేది తొందరలోనే పోతుంది. అప్పటి వరకు తప్పదు భరించండి అని చెప్పింది. అలాగే పెళ్లి టాపిక్ వచ్చేసరికి అసలు పెళ్లే చేసుకోను...ఫీలింగ్స్ చచ్చిపోయాయి. కే-డ్రామాస్ ఫాంటసీ అంటే ఇష్టం.. వాళ్ళ ప్రేమించుకునే విధానం నచ్చుద్ది. నాకు ఆటిట్యూడ్ అంటారు కానీ అలా ఉండను. కానీ కొంచెం భయం ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే నటించడం రాదు నాకు ..ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే వదిలిపెట్టను" అని చెప్పింది శ్రీసత్య.