రోజా పై ఆది హాట్ కామెంట్స్....

  హైపర్ ఆది ఒక చిట్ చాట్ లో రోజు గురించి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత రోజా గారి మీద మీ అభిప్రాయం ఏమిటి అనేసరికి రోజా గారికి పాలిటిక్స్ ఒక వ్యక్తి అంటే ఇష్టం. తనకు ఒక వ్యక్తి అంటే ఇష్టం అన్నారు. కానీ జబర్దస్త్ జడ్జ్ గా తనకు రోజా అంటే చాలా గౌరవం ఉందని చెప్పాడు ఆది. ఎందుకంటే తనకు కానీ తన లాంటి ఎంతో మంది కమెడియన్స్ కి పేరు వచ్చింది అంటే అది వాళ్ళ వల్లే అని చెప్పాడు ఆది. అలాగే లీడర్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని గ్యాంగ్ లీడర్ గా చిరు అంటే ఇష్టం అని చెప్పాడు. ఇక పెళ్లి విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియాలో చాలామంది తనకు పెళ్లిళ్లు చేసేశారని చెప్పాడు. రియల్ లైఫ్ పెళ్లి ఎప్పుడు అంటే దానికి చాల టైం ఉందన్నాడు. పెళ్లి అయ్యింది అనే దానికన్నా పెళ్లి ఎప్పుడు అనేదే బాగుంటుంది. అదే కంటిన్యూ చేద్దాం అని చెప్పాడు. ఐతే దర్శి నుంచి ఎంఎల్ఏగా పోటీ చేస్తారు అని అన్నారు కానీ అది ఎందుకు జరగలేదు అని అడిగేసరికి..ఇదంతా సోషల్ మీడియాలో తన మీద అభిమానం వల్ల చేసిందే కానీ అలాంటిది ఏమీ లేదన్నాడు.  అలాగే వ్యూయర్ షిప్ కోసం థంబ్ నెయిల్స్ చేశారు తప్పా ఈ పోటీలు ఏమీ లేవు..కేవలం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసినట్లు చెప్పాడు ఆది.

Bigg Boss Telugu 8 : మరో ముప్పై రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8!

  బుల్లితెర టీవీ షోలలో బిగ్ బాస్ షోకి ప్రధానమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తాజాగా బిబి టీమ్ టీజర్ ని రిలీజ్ చేసి ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచేశారు. అయితే ఇందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పుడు మొదలవుతుందనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. గత సీజన్ సెవెన్ లో  రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈ సీజన్ సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని, సెట్ వర్క్ కూడా ఇప్పటికే సగం వరకు పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. మరి కంటెస్టెంట్స్ ఎవరూ అంటే.. కిర్రాక్ ఆర్పీ, ఫార్మర్ నేత్ర, అనిల్ జీలా, వేణు స్వామి, రీతు‌ చౌదరి, కుమారీ ఆంటీ, ఇంకా కొందరు డ్యాన్సర్స్ పేర్లు వినిపిస్తున్నాయి‌. అయితే ఇప్పటికే చాలామందివి ఇంటర్వ్యూలు తీసుకునట్టు తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్ లో ఉన్నవాళ్ళు ఎవరు హౌస్ లోకి వెళ్తారనేది బిగ్ బాస్ మొదలయ్యే వరకు తెలియదు. చివరి క్షణం వరకూ  ఏదైనా జరగొచ్చు. అయితే తాజాగా విడుదల చేసిన టీజర్ లో నాగార్జున మాట్లాడుతూ.. జాగ్రత్తగా కోరుకో.. ఎందుకంటే ఏదైనా అన్ లిమిటెడ్ అంటూ అన్నాడు. అంటే ఈ సారి హౌస్ లో టాస్క్ లు ఫన్ ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ అన్నీ సీజన్లలో భారీ టీఆర్పీ సాధించిన వాటిల్లో సీజన్-5,  6, 7.. మరి ఈ సీజన్ హిట్టా, ఫట్టా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే సెప్టెంబరు మొదటి వారంలో మాత్రం బిగ్ బాస్ ప్రారంభం అవుతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.  

Inaya Sultana: బిగ్ బాస్ షో వల్ల మూవీస్ ఆగిపోయాయి : ఇనయా సుల్తానా

  బిగ్ బాస్ సీజన్ సిక్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవంత్, శ్రీహాన్ లతో పోటీపడి ఆడిన ఇనయా సుల్తానాకి బయట ఫ్యాన్ బేస్ పెరిగింది.  ఇక బయటకొచ్చాక గోవా టూర్లు, విదేశీ టూర్ల పేరుతో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ వైరల్ గా నిలిస్తోంది. తరచూ అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా జిమ్ ట్రైనర్ గౌతమ్ తో డేటింగ్ లో ఉన్న ఇనయా.. విచ్చలవిడిగా తిరిగేస్తూ నెట్టింట వైరల్ గా మారారు. ఇనయా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తనకి ఫ్యాన్ బేస్ పెరిగింది. బయటకొచ్చాక రకరకాల వ్లాగ్స్ తో  మరింతగా ఫాలోయింగ్ ని పెంచుకుంది. తాజాగా ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను బిగ్ బాస్ కి వెళ్ళడం వల్లే సినిమా అవకాశాలు కోల్పోయినట్టు ఇందులో చెప్పుకొచ్చింది. అంతకముందు తనకి సినిమా ఆఫర్లు వచ్చాయంట, ఇప్పుడు అవేమీ రావడం లేదని ఇందులో చెప్పింది. అయితే తను మాట్లాడిన ఈ మాటలకి నెటిజన్లు మండిపడూతూ కామెంట్లు పెడుతున్నారు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళకుంటే ఇప్పుడు వస్తున్న ఈ అవకాశాలు కూడా రావని, అనవసరంగా నిన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్ళి సెలెబ్రిటీనీ చేశారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా థియేటర్లలో రిలీజైన 'శివం భజే' మూవీలో తను నటించింది. ఇక స్క్రీన్ మీద తన పేరుని చూసుకొని సంతోషిస్తున్నట్టు ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇనయా సుల్తానాకి ఇన్ స్టాగ్రామ్ లో  332K ఫాలోవర్స్ ఉన్నారు.  

Brahmamudi : కోరుకున్నవాడితో లేచిపోమని అక్క సలహా...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -478 లో... రుద్రాణి చెప్పింది విని కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి. నువ్వు ఇలా ఉంటే ఎలా? అమ్మమ్మ వాళ్ళింటికి కొన్ని రోజులు వెళ్ళు అని ధాన్యలక్ష్మి చెప్తుంది. నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? ఆ అనామిక మాటలు పట్టుకొని నువ్వు నన్ను బాధపెట్టావని కళ్యాణ్ అనగానే.. ఇప్పుడు తప్పు తెలుసుకొని నీ గురించి చెప్తున్నాను.. బెంగళూరు వెళ్ళమని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళమంటున్నావో తెలుసు.. నువ్వు అనుకున్నది జరగదు.. నేను పెళ్లికి రాను అంటూ కళ్యాణ్ కోపంగా వెళ్లిపోతాడు.. ఇది కూడ బెటరే అని అదంతా వింటున్న రుద్రాణి అనుకుంటుంది. మరొక వైపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. కూతురు పెళ్లికి కనకం హడావిడి అంత ఇంత కాదు.. అది తెచ్చావా ఇది తెచ్చావా అంటు కృష్ణమూర్తిని అడుగుతుంది. అప్పుడే కావ్య వస్తుంది. ఆ తర్వాత అప్పుని స్వప్న రెడీ చేస్తుంటే.. కనకం వచ్చి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావ్.. అయినా పెళ్లిజడ వెయ్యలేదని కనకం అడుగుతుంది. నాకు ఇష్టం లేదు.. అయినా వాళ్ళు పెళ్లి చూపులప్పుడు అలా ఉన్నా ఒకే అన్నారు కదా అని అప్పు అంటుంది. అప్పుడు మనం ఉన్నాం.. ఇప్పుడు చాలా మంది వచ్చారని కనకం అంటుంది. అయిన అప్పు వినదు. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో వాళ్లందరూ పెళ్లికి రెడీ అవుతారు. రుద్రాణి మాత్రం ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి.. వచ్చేటప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని అంటుంది. కావ్య పెళ్లి ఎలా జరిగిందో మర్చిపోయావా అని అంటుంది. ఇప్పుడు కళ్యాణ్ పెళ్లి కి రావడం లేదని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఎవరిని ఏం అనొద్దంటూ రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. అందరు వెళ్ళిపోతారు.. కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి.. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్.. ఇక నీ ఇష్టమని చెప్తాడు. మరొక వైపు దుగ్గిరాల కుటుంబం పెళ్లి దగ్గరికి రాగానే అందరు ఎదురుగా వెళ్లి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత కనకం కుటుంబాన్ని రుద్రాణి తక్కువ చేసి మాట్లాడుతుంటే.. స్వప్న గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య కూడా రుద్రాణికి మాటలతో మర్యాదగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత  కళ్యాణ్ ఫొటోస్ అప్పు డిలీట్ చేస్తుంటే.. స్వప్న వచ్చి నువ్వు ఇంకా కళ్యాణ్ ప్రేమిస్తున్నావా? ఇక్కడ వరకు ఎందుకు తెచ్చుకున్నావ్? ఎవరి గురించి ఆలోచించకు.. దైర్యం చేసి నాలాగా లేచిపో లేదంటే.. పెళ్లి ఆపమని స్వప్న చెప్తుంది. తరువాయి భాగంలో రెండు కుటుంబాల గురించి అలోచించి అప్పుని దూరం చేసుకుంటున్నాను వెంటనే పెళ్లి ఆపాలని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి ఆపుతానని రాజ్.. నేను మిమ్మల్ని ఆపుతానంటూ కావ్య ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శౌర్య కోసం లాయర్ ని కలవనున్న కార్తీక్.. నరసింహా ప్లాన్ ఏంటంటే! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika deepam 2 ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -113 లో.... నర్సింహా నోటీసులు విషయం సుమిత్ర దశరత్ లకి చెప్తుంది దీప. నా కూతురు నా నుండి దూరం కాకుండా చూడండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుగుతుంది దీప. మేమ్ చూసుకుంటామని వాళ్ళు అనగానే.. దీప బయటకు వచ్చి కార్తీక్ కి చెప్పాలనుకుంటుంది. మరొకవైపు ఇన్ని రోజులు ఎప్పుడు సాయం చేస్తామన్నా కూడా వద్దని అనేది.. ఇప్పుడు సాయం చేసే అవకాశం వచ్చిందని దశరత్ తో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి దీప ఫోన్ చేసుంటే.. కార్తీక్ ఇంటికి వస్తాడు. వెంటనే నోటీసులు వెళ్లి చూపిస్తుంది. సుమిత్ర వాళ్లు కూడా కార్తీక్ దగ్గరికి వస్తారు. ఈ విషయం శౌర్యకి చెప్పొద్దని కార్తీక్ అనగానే.. ఎందుకు ఏమైందని దీప అడుగుతుంది. అంటే ఇప్పటికే శౌర్య ఆరోగ్యం బాలేదు కదా అందుకే అంటున్నానని కార్తీక్ అంటాడు . మీరేం కంగారుపడకండి దీప.. నాకు తెలిసిన లాయర్ ఉంది.. నేను మాట్లాడుతానని కార్తీక్ అనగానే.. ఇప్పుడు దీపని తీసుకొని వెళ్ళమని సుమిత్ర అంటుంది. శౌర్యని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమని దీపకి సుమిత్ర చెప్తుంది. మరొకవైపు మనం దీప దగ్గరికి వెళ్లి.. నువ్వు ఇక్కడ ఉంటే నా కొడుకు జీవితం మేమ్ కోరుకున్నట్లు ఉండేలా లేదు వెళ్లిపోమందామని శ్రీధర్ అనగానే.. వద్దని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ లు వెళ్తుంటే మధ్యలో నర్సింహా అప్పులు చేసిన వాళ్ళు ఎదరు పడి అడుగుతుంటారు.  నీ భర్తని తీసుకొని వస్తానంటూ వచ్చి రాలేదు.. మా అప్పులు అంటూ గొడవచేస్తారు. నర్సింహా అడ్రెస్ చెప్తాను అక్కడికి వెళ్ళండి అని దీప అంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటావా అంటూ వాళ్ళు దీప పైన కోప్పడతారు. అప్పుడే కార్తీక్ కార్ దిగి వస్తాడు. అదంతా నరసింహా దూరం నుండి చూస్తూ.. ఇదంతా నా సెటప్పేరా అని అనుకుంటాడు. అందరు దీపని తిడుతుంటే.. మీకు ఎంతివ్వాలి.. అలా తిడతారా అంటూ వాళ్ళ అప్పులు అన్ని కార్తీక్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇదంతా ఆ నర్సింహా ప్లాన్ అయి ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకెలా తెలుసని కార్తీక్ అంటాడు. దీప పడిపోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. అదంతా నర్సింహా వీడియో తీస్తుంటాడు. ఆ తర్వాత ఇప్పుడేం వస్తావ్.. నువ్వు ఇంటికి వెళ్ళు నేను లాయర్ తో మాట్లాడతానని కార్తీక్ అంటాడు. మరొకవైపు శౌర్య నాన్నతో ఉన్నట్లు గీసిన బొమ్మలలో ఉన్న నాన్న బొమ్మని చింపేస్తుంది. అప్పుడే శౌర్యకి పాలు తీసుకొని వస్తుంది దీప. అక్కడ చింపేసిన ముక్క చూస్తుంది. అమ్మ ఆ బూచోడు మనకి వద్దని శౌర్య అంటుంది. ఆ తర్వాత  రేపు బయట నాకు పని ఉంది రావడానికి లేట్ అవుతుంది. అమ్మమ్మ దగ్గర ఉండమని దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : పోలీస్ స్టేషన్ లో భర్త.. ఆ కేసు నుండి భర్తని విడిపించగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -165 లో.... సీతాకాంత్ ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు వస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రామలక్ష్మి అడుగగా.. నేను చెప్తానంటూ నమిత వచ్చి.. నన్ను బలవంతం చెయ్యబోయాడని చెప్తుంది. అదంతా అబద్ధం కావాలనే ఇదంతా చేస్తుంది నమ్మకండి అని సీతాకాంత్ అంటాడు. నా భర్తని ఎక్కడికి తీసుకొని వెళ్లొద్దంటూ రామలక్ష్మి అడ్డుపడుతుంది. మా అన్నయ్య అలాంటి వాడు కాదని నమితపైన సిరి కోప్పడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ గురించి నమిత తప్పుగా మాట్లాడుతుంటే.. శ్రీలత వచ్చి నమితని కొడుతుంది. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడకని అంటుంది. ఆ తర్వాత మీకు సాక్ష్యం కావాలా చూపించండి ఎస్ ఐ గారు అని నమిత అనగానే.. వాళ్ళు నమిత తీసిన వీడియో చూపిస్తారు. అందులో సీతాకాంత్ నమితని బలవంతం చేయబోతుంటే వద్దని బయటకు వచ్చే వీడియో ఉంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇంకా నమ్మకపోతే మీ ఇంట్లో మనిషే సందీప్ గారు.. మీరు చెప్పండి అసలు నిజం ఏంటని నమిత అనగానే. నా నోటితో అది ఎలా చెప్పాలంటాడు సందీప్. అన్నయ్య కాన్ఫరెన్స్ రూమ్ కి నమిత వెళ్లడం నేను చూసాను. కాసేపటికి గట్టిగా నమిత అరుస్తూ బయటకు వచ్చింది. వెనకాలే అన్నయ్య ఉన్నాడని సందీప్ చెప్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది వేరే.. మీరు ఆవేవీ నమ్మకండి అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. రామలక్ష్మి ఏడుస్తుంటే నేను బయటకు తీసుకొని వస్తానని పెద్దాయన అంటాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లి ముగ్గరు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ స్టేషన్ లో ఉండగా.. రామలక్ష్మి, పెద్దాయన లాయర్ ని తీసుకొని వెళ్తారు. లాయర్ ఎస్ ఐ తో మాట్లాడతాడు. కేసు చూసి.. ఇది మాములు విషయం కాదు.. బెయిల్ కూడా రాదని లాయర్ చెప్తాడు. సీతాకాంత్ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే సాక్ష్యం కావాలని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ దగ్గరికి వెళ్లి.. అసలేం జరిగిందని అడుగుతుంది. నమిత విషయం మొత్తం సీతాకాంత్ చెప్తాడు. ఎవరు నమ్మిన నమ్మకపోయిన నువ్వు నమ్మితే చాలని సీతాకాంత్ అంటాడు. మీ గురించి తెలుసు.. నేను ఎలా నమ్ముతాను .. మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తానని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : తిట్టిపోసిన దేవయాని.. రిషి యాక్టింగ్ మాములుగా లేదుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1143 లో.... శైలేంద్ర స్పృహలోనుండి బయటకు వచ్చి రంగాతో మాట్లాడుతుంటాడు. అప్పుడే వసుధార వాళ్ళు అందరు వస్తారు. ఎందుకు అలా పడిపోయావని ఫణింద్ర అడుగుతాడు. ఎమోషన్ తట్టుకోలేక అలా పడిపోయాను.. వసుధార, రిషిలు వచ్చారు కదా అని శైలంద్ర అంటాడు. మేమ్ ఏం పడిపోలేదే అలా అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మేమ్ వెళ్ళిపోతాం అన్నయ్య అని మహేంద్ర అంటాడు. మీరు ఇక్కడే ఉండాలని ఫణీంద్ర అంటాడు. లేదు అన్నయ్య అని మహేంద్ర అనగానే.. సరే మీ ఇష్టం కానీ ఈ ఒక్క రోజు అయిన ఉండండి  రిషి అని ఫణీంద్ర అనగానే రిషి సరే అంటాడు. ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక సర్ మీరు నాతో రండి అని వసుధార అనగానే.. నేను వెళ్ళనని శైలేంద్రతో రిషి అంటాడు. వెళ్ళరా అంటూ శైలేంద్ర అనగానే రిషి వెళ్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు మహేంద్ర దగ్గరికి వెళ్తారు. నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది రిషి.. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్ .. అసలేం జరిగిందని మహేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వచ్చి.. నేను చెప్పాను కదా మావయ్య.. వాళ్ళు తప్పకుండా వస్తారని అంటుంది. ఇంతకు రిషి ఎక్కడున్నాడో ఎలా తెలిసిందని ధరణి అడుగుతుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి అవును ఎక్కడ కలిసావని అడుగుతాడు. కాలేజీ ప్రాబ్లమ్ లో ఉందని తెలిసి వచ్చాను.. ఇక్కడే రిషి సర్ ని చూసి ఏంట్రీ ప్లాన్ చేశానని వసుధార చెప్పగానే.. సేమ్ ఆ రంగా గాడు కూడ ఇదే చెప్పాడని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత దేవయాని శైలేంద్రని తిడుతుంది. ఆ రౌడీ వసుధారని చంపేశాడు అన్నావని అంటుంది. అవును వాడు నన్ను మోసం చేసాడని శైలేంద్ర అంటాడు. ఇక ఆ రంగా గాడిని తీసుకొని వచ్చి రిషిని చేసావ్.. ఇప్పుడు ఇదంతా ప్రాబ్లమ్ అవుతుందని తిడుతుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఈ రంగా గాడు నటించమంటే జీవిస్తున్నాడని దేవయానితో శైలేంద్ర అంటాడు. చాలా రోజుల తర్వాత రంగా మన ఇంటికి వచ్చాడని శైలేంద్ర అనగానే అందరు షాక్ అవుతారు. రిషి అనబోయి రంగా అన్నానంటూ శైలేంద్ర కవర్ చేస్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు సరదాగా మాట్లాడుకుంటుంటే.. మహేంద్ర వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ 8 హౌస్‌లో చోరి... దొంగను పట్టుకున్న నాగార్జున

బిగ్ బాస్ తెలుగు షోకి ఉండే క్రేజే వేరు. ఇప్పటికే ఈ సీజన్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఎనిమిదవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss season 8) లోగోని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా బిగ్ బాస్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు‌. ఇక ఇప్పుడు ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో కమెడియన్ సత్య దొంగగా , నాగార్జున జీనీగా కన్పించారు. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉంటుందో ఈ టీజర్ ద్వారా బిబి టీమ్ ముందుగానే తెలియజేశారు. అసలు టీజర్ లో ఏం ఉందంటే.. ఓ హౌస్ లోకి దొంగతనానికి ఓ దొంగ వస్తాడు . అతడు అందులోని విలువైన వస్తువలన్నీ చూస్తూ మురిసిపోతుంటాడు. అప్పుడే సడన్ గా జీని ఉండే మాయాద్వీపం కదులుతుంది. ఏంటా అని ఆ దొంగ అక్కడ చూస్తుండగానే.. అందులో నుండి మన జీనీ( నాగార్జున) వచ్చేస్తాడు. ఇక దొంగకి ఏదైనా కావాలని కోరుకో అన్ లిమిటెడ్ గా ఇస్తానని జీనీ అంటాడు. అవునా ఈ విషయం అర్జెంట్ గా మా ఆవిడకి చెప్పాలంటు దొంగ ఫోన్ చేస్తుండగా.. మన జీని అతడిని ఆపుతాడు.     బాబు ఆలోచించుకొని అడుగు.. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదంటూ చెప్పేస్తాడు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేదేంటంటే ఈసారి ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదన్నట్టుగా ఉండబోతుందంటూ బిబి మేకర్స్ చెప్పకనే చెప్పారు. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఈ సీజన్ ఎలా ఉంటుందో చూద్దాం మరి.

రైతు కుటుంబానికి పల్లవి ప్రశాంత్ ఆర్థిక సాయం

పల్లవి ప్రశాంత్ ఒక పేద కుటుంబానికి సాయం అందించాడు. మెదక్‌‌లోని చిన శంకరపేట్‌కి చెందిన పరమేశ్వర్ అనే వ్యక్తి చనిపోయాడు. అతనికి భార్య శంకరమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న భర్త చనిపోవడంతో శంకరమ్మ ముగ్గురు ఆడ పిల్లలను పెంచడం కష్టంగా మారింది. ఈ వార్త తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు.  పేద రైతులకు సాయం చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.     శంకరమ్మ ఇంటికి వెళ్లి  రూ.20 వేలు ఆర్ధికసాయం అందించాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పల్లవి ప్రశాంత్ ని చాలామంది ట్రోల్ల్స్ చేశారు. ఇస్తామన్న ప్రైజ్ మనీ ఏది, ప్రశాంత్ మోసం చేసాడు, రైతు కార్డు వాడి సింపథీతో గెలిచాడు అంటూ కొంతమంది రీసెంట్ గా వీడియోస్ కూడా చేశారు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నుంచి ఇలాంటి కార్డ్స్ వాడేవాళ్ళను తీసుకెళ్లొద్దు అంటూ కూడా వీడియోస్ చేశారు. సోషల్ మీడియా మొత్తం కూడా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక శివాజీ, బోలె షావలితో కలిసి ఎంతో కొంత హెల్ప్ చేసాడు. ఆ తర్వాత ఆపేసాడు. దాంతో అందరూ కూడా రైతులకు చేస్తామన్న హెల్ప్ ఎందుకు చెయ్యట్లేదు అని కూడా అడిగారు. ఇక ఈ ట్రోల్స్ ఆగేలా లేవు అనుకున్నాడో ఏమో పల్లవి ప్రశాంత్ ఆ కుటుంబానికి సాయం అందించాడు.  

కొంచెం అందంగా ఉంటే తట్టుకోలేరా...షర్ట్ బటన్స్ విప్పి మరీ

ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది వేసిన డైలాగ్ కి శేఖర్ మాష్టర్ ఇచ్చిన ఆన్సర్ భలే కామెడీగా ఉంది. "ముందు ఆ స్పెక్ట్స్ తియ్యి" అని శేఖర్ మాస్టర్ అన్నాడు. "కొంచెం అందంగా కనబడితే తట్టుకోలేరా" అని ఓవర్ డైలాగ్ వేసాడు ఆది. " ఎవడు..ఎవడాడు అందంగా ఉంది" అన్నాడు శేఖర్ మాష్టర్. "అందం అంటే ఏంటండీ..నేను చెప్తా ఆగు" అంటూ స్టేజి మీద షర్ట్ తీసేయడానికి రెడీ అయ్యి బటన్స్ విప్పేస్తుండగా శేఖర్ మాష్టర్ "వద్దు...ఆగు చంపేస్తా నిన్ను" అని ఆది దగ్గరకు వచ్చి షర్ట్ బటన్స్ పెట్టాడు మాష్టర్. "మా దగ్గర షర్ట్ బటన్స్ తియ్యమంటేనే సిగ్గు పడతారు ఎక్కడెక్కడికో వెళ్లి కోట్ అంతా తీసేసి" అని ఓవర్ గా డైలాగ్ చెప్పాడు ఆది. తర్వాత హన్సిక వచ్చి ఎం చెప్పిందో కానీ అటు నుంచి హోస్ట్ నందు, ఇటు నుంచి హైపర్ ఆది వచ్చి షర్ట్ లు విప్పేయడానికి రెడీ అయ్యారు. ఇక ఫైనల్ లో హన్సిక బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేశారు. పెద్ద కేక్ తెచ్చి స్టేజి మీదకు వచ్చి కంటెస్టెంట్స్ అందరూ కలిసి కట్ చేశారు. ఇక ఈ షో మధ్యలో హన్సిక తన ఇంట్లో హెల్మెట్ పెట్టుకుని డాన్స్ చేసిన ఒక అల్లరి వీడియోని ప్లే చేసి అందరూ కాసేపు నవ్వుకున్నారు. కానీ ఈ ఎపిసోడ్  చూడబోతే మొత్తం అందరూ బొత్తాలిప్పుకుని కనిపించేలా ఉన్నారు. ఐతే షోలో డాన్స్ కన్నా కామెడీ ఎక్కువగా ఉండేసరికి నెటిజన్స్ కూడా డాన్సర్స్ అందరినీ త్వరగా ఎలిమినేట్ చేసేస్తే మేము హాయిగా ఆది కామెడీ చూసుకుంటాంగా అని వెటకారంగా మాట్లాడుతున్నారు.

కొరియర్ లో డ్రగ్స్ స్కామ్స్..జాగ్రత్త ఫ్రెండ్స్

  బిగ్ బాస్ కౌశల్ రీసెంట్ గా ఒక వీడియోని వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసాడు. "మీతో ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. నిన్న నాకు ముంబైలోని  ఒక కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీకొచ్చిన పార్సెల్ లో డ్రగ్స్ ఉన్నాయి. ఆ కొరియర్ ని పోలీస్ స్టేషన్ కి పంపిస్తున్నాం. అక్కడికి వచ్చి మీ పార్సెల్ ని కలెక్ట్ చేసుకోండి.. వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అన్నారు. నేను ఆ కొరియర్ మీద ఉన్న అడ్రెస్ చెప్పమని అడిగాను. వెంటనే ఫోన్ కట్ చేశారు. రీసెంట్ గా ఇలాగే బెంగుళూరు లో ఒక ముసలావిడని ట్రాప్ చేసి ఆల్మోస్ట్ ఒక కోటి రూపాయలు లాగేసారు. అసలు పాయింట్ ఏంటంటే కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయి అనే స్కామ్స్ చాల ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను ఫేస్ చేసాను కాబట్టి మీకు కూడా ఈ విషయాన్నీ షేర్ చేసుకోవాలని చెప్తున్నా" అంటూ "అప్రమత్తంగా ఉండండి, కొరియర్‌లో డ్రగ్స్ స్కాం సాధారణమైపోయాయి. కొరియర్  నుండి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి." అని ఒక అలెర్ట్ కాప్షన్ ని కూడా పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే తమకు కూడా ఇలా జరిగాయంటూ వాళ్ళ ఎక్స్ పీరియన్స్ ని కూడా చెప్తున్నారు.   కౌశల్ ఎప్పుడూ ఏదో ఒక ఇంటరెస్టింగ్ మెసేజ్ తో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాడు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచినా కౌశల్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా ఆఫర్స్ ఏమీ లేకపోయేసరికి సోషల్ మీడియాలో లేటెస్ట్ అప్ డేట్స్ తో ఫాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు.

ఫిట్‌నెస్ జర్నీకి ఏడాది పూర్తి

    బ్రహ్మముడి మానస్ ఈ మధ్య బాడీని ఫిట్ గా ఉంచుకునే పనిలో ఉన్నాడు. అటు సీరియల్స్ ఇటు మూవీస్ లో, బుల్లితెర ఈవెంట్స్ లో, షోస్ లో నటిస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు మానస్ ఇంటి పేరుగా మారిపోయింది. పాయల్ రాజపుట్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన మూవీ  "రక్షణ" లో ఒక నెగటివ్ రోల్ లో అద్భుతంగా నటించాడు. అలాంటి మానస్ లాస్ట్ ఇయర్ పిక్ ని ఈ ఇయర్ పిక్ ని పెట్టి తన ఫిట్నెస్ జర్నీ గురించి ఒక పోస్ట్ పెట్టాడు. "నా ఈ  ఫిట్‌నెస్ ప్రయాణంలో ఒక మైలురాయిని దాటాను. ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి ఏడాది పూర్తయ్యింది. ఒక ఏడాది గట్టిగా ట్రై చేస్తే ఇలాంటి శరీరం సాధించాను. ఆ జర్నీని మీతో షేర్ చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. లాస్ట్ ఇయర్ నేను హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసాను.  పోషక ఆహరం  తినడం..తప్పనిసరిగా వ్యాయామం చేయడం వంటివి స్టార్ట్ చేశాను. భుజం, మణికట్టు గాయాలు ఉన్నా కూడా నేను కష్టపడి ఇలాంటి అందమైన శరీరాన్ని సాధించుకోగలిగాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నేను జర్నీని స్టాప్ చేయలేదు. ఈ ఏడాది మొత్తం నాకు సపోర్ట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.   నా కోచ్ కి , నా డైటీషియన్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. నా శరీరానికి అవసరమైన వ్యాయామం ఎలా చేయాలో చెప్పి ఎలాంటి డైట్ తీసుకుని బాడీని ఫిట్ గా వుంచుకోవాలో చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నా ఈ జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. "అంటూ మానస్ ఒక హార్ట్ టచింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.

హరితేజ అందాల ప్రదర్శనకి నెటిజన్లు షాక్.. వైరల్ గా మారిన ఫోటోలు!

  సోషల్ మీడియాలో తరచూ కొందరు సెలెబ్రిటీలు ఫోటోషూట్ లు చేస్తుంటారు. వాటితో ఆ రోజంతా వారే ట్రెండింగ్ లో ఉంటారు. ఇలా ట్రెండింగ్ లో తరచు ఉండేవారి లిస్ట్ పెద్దగానే ఉంది. బిగ్ బాస్ కి వెళ్ళి బయటకొచ్చాక లేడీ కంటెస్టెంట్స్ లు తమని ఎవరు మర్చిపోకూడదని అప్పుడప్పుడు ఫోటోషూట్ లతో పేరుతో నెటిజన్లకి ట్రీట్ ఇస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇనయా సుల్తానా, అషురెడ్డి, ప్రియాంక సింగ్, అరియానా , విష్ణుప్రియ, రీతు చౌదరి, హమీదా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇక ఈ జాబితాలోకి బిగ్ బాస్ ఫేమ్ హరితేజ వచ్చేసింది. హరితేజ తాజాగా మెల్ బోర్న్‌లో అందాల ఆరబోత చేసింది. ఆమె వేసుకున్న బట్టలు, చేసిన ప్రదర్శనకు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. హరితేజ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.     హరితేజ ముందుగా కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ మొదలెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టి 'మనసు మమత' సీరియల్‌లో నటించి హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు పోటెత్తాయి. ఫలితంగా 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌తో ఫుల్ పాపులర్ అయింది. సీరియల్ నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా మారిపోయింది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం నడిపించింది. తద్వారా మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో సత్తా చాటింది. నటిగా, యాంకర్‌గా అలరిస్తోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే ఛాన్స్ లభించింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.    తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు, ఆ ఫోటోల్లోని పోజులు మాత్రం వైరల్ అవుతున్నాయి. హరితేజకి ఇన్ స్టాగ్రామ్ లో 739K ఫాలోవర్స్ ఉన్నారు. తనకి భూమి అనే కూతురు కూడా ఉంది.  ఇక అలాంటి కూతురిని ఉంచుకొని ఇలాంటి ఫోటోలేంటి అని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

Karthika Deepam2 : శౌర్య కావాలని నోటీసులు పంపిన నరసింహా.. దీప ఏం చేయనుంది?

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(karthika depam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -112 లో....దీప హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే జ్యోత్స్న తనతో గొడవ పెట్టుకుంటుంది. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడకంటు జ్యోత్స్నకి సుమిత్ర చెప్తుంది. నీకు మా బావనే అంటే మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తుందని జ్యోత్స్న పూర్తిగా దీపని అపార్థం చేసుకుంటుంది. సుమిత్ర కోప్పడగా జ్యోత్స్న వెళ్ళిపోతుంది. నువ్వు నా పెద్ద కూతురు.. జ్యోత్స్న నా చిన్న కూతురు. అది ఉన్న సిచువేషన్ అర్థం చేసుకో దాని మాటలు పట్టించుకోకని దీపతో సుమిత్ర అంటుంది. మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నారని దీప ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్ళగానే శ్రీధర్ తనపై కోప్పడతాడు. మీ అమ్మ కళ్ళు తిరిగిపడిపోయింది ఫోన్ చేశా అయిన పట్టించుకోలేదు. నీకు ఆ పాప అంత ఎక్కువ అయిందా అని అడుగుతాడు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాపైన మీకు నమ్మకం లేదా ఉంటే ఇలా చెయ్యరు.. మీకు తల వంపులు తెచ్చే పని ఎప్పుడు నేను చెయ్యనంటూ కార్తీక్ లోపలికి వెళ్తాడు. ఏంటి అండి మీరు ఆలా మాట్లాడారు.. వాడు భోజనం చేసాడో లేదో అని కాంచన కార్తీక్ వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత నరసింహా కోర్టు ద్వారా శౌర్యని తెచ్చుకోవాలని అనసూయకి చెప్తాడు. అలా వద్దని అనసూయ చెప్పినా కూడా నరసింహా లాయర్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత నరసింహ లాయర్ దగ్గరికి వెళ్లి నా భార్య వేరొకడితో సంబంధం పెట్టుకొని నా కూతురిని సరిగ్గా చూసుకోవడం లేదు.. అందుకే నా కూతురు నాకు కావాలని లాయర్ కి చెప్తాడు నరసింహా. లాయర్ సరే డబ్బులు రెడీ చేసుకోమని చెప్తాడు. అలాగే నువ్వు గెలిచేలా సాక్ష్యం రెడీ చేసుకోమని చెప్తాడు. సాక్ష్యం అంటే దీప, కార్తీక్ లకి సంబంధం ఉన్నట్లు నిరూపించాలా అని నరసింహ అనుకుంటాడు. మరొకవైపు దీపకి కోర్టు నుండి నరసింహ పంపిన నోటీసులు వస్తాయ్.‌ అవి ఏంటి అర్ధం కాక దీప సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న మనసు అత్తయ్య పూర్తిగా పాడుచేస్తుంది వెంటనే అత్తయ్యని ఇక్కడ నుండి పంపాలని దశరత్ తో సుమిత్ర అంటుంది. జ్యోత్స్న తో నెగటివ్ గా మాట్లాడుతున్న పారిజాతం దగ్గరికి సుమిత్ర, దశరత్ లు వస్తారు. పిన్ని మీరు కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. అప్పుడే దీప నోటీసులు తీసుకోని వచ్చి ఇవేంటి అంటూ సుమిత్రకి చూపిస్తుంది. శౌర్య కావాలని నరసింహా నోటీసులు పంపాడని సుమిత్ర చెప్తుంది. అప్పుడు కూడా పారిజాతం దీప బాధపడేలా మాట్లాడుతుంది. నా కూతురు నా నుండి దూరం కాకుండా చుడండి అని సుమిత్ర, దశరత్ ల కాళ్ళు పట్టుకుంటుంది దీప. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.. నువ్వు కంగారుపడకంటు ఇద్దరు దీపకి ధైర్యం చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలని చూశారు.. పోలీసులని ఆశ్రయించిన నమిత!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -164 లో....నమిత కాన్ఫరెన్స్ రూమ్ కి సీతాకాంత్ పిలిచి.‌. నా భర్త వచ్చాడూ కానీ ఏం మారలేదు సర్ నన్ను కొట్టాడంటూ దెబ్బలు చూపిస్తుంది. వాడికి నేను బుద్ది చెప్తానని సీతాకాంత్ అంటాడు. అవసరం లేదు సర్ నా బతుకు నేను బతుకుతాను. మీలాంటి వారి చూపు నాపైన ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చినట్లే, మీ మనసులో స్థానం ఇస్తారా అని నమిత సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది. దాంతో నమితని దూరంగా నెడతాడు సీతాకాంత్. నువ్వు ఇలాంటి దానివనుకోలేదు.. నా ఆఫీస్ నుండి వెళ్ళిపోమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నమిత తన డ్రెస్ చింపుకొని నన్నేం చెయ్యొద్దు సర్ అంటూ అరుస్తుంటే.. అందరు వస్తారు. సర్ నాపై ఇష్టంతో ఇక్కడికి రప్పించుకున్నారు.. నన్ను బలవంతం చెయ్యబోయారని నమిత చెప్తుంది. తను చెప్పేది అబద్ధం.. నా భర్త తనని టార్చర్ చేస్తున్నాడంటే నేను నీ భర్తతో మాట్లాడుతా అన్నానని సీతాకాంత్ అంటాడు. నమితకి పెళ్లి కాలేదు.. అయిన ఒక ఆడపిల్ల అలా చెప్పుకోదు.. ఇంట్లో భార్యని పెట్టుకొని ఇదేం పని అని సందీప్ అంటాడు. మా బాస్ అలాంటివాడు కాదని ఎంప్లాయిస్ అంటారు. నన్ను ఇలా టార్చర్ చేసినందుకు మీకు బుద్ది వచ్చేలా చేస్తానంటూ నమిత వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇంట్లో పూజ చేస్తుంటారు. ఆ తర్వాత సందీప్ ఇంటికి వచ్చి శ్రీలతకి సైగ చెయ్యగానే పక్కకి వెళ్తుంది. మన ప్లాన్ సక్సెస్ అంటూ సందీప్ అనగానే శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పూజ పూర్తి అవుతుంది. సీతాకాంత్ డల్ గా ఇంటికి వస్తాడు. ఏమైంది అలా ఉన్నారని రామలక్ష్మి అడుగుతుంది. వర్క్ చేసి అలసిపోయాడని శ్రీలత అంటుంది. రామలక్ష్మికి బొట్టు పెట్టమని శ్రీలత అనగానే సీతాకాంత్ బొట్టు పెడుతుంటే.. అప్పుడే పోలీసులు వస్తారు. ఏంటి ఇలా వచ్చారని అడుగగా.. మిమ్మల్ని అరెస్ట్ చెయ్యడానికి అని పోలీసులు చెప్తారు. అయన ఏం తప్పు చేసారని అరెస్ట్ చేస్తారని రామలక్ష్మి అంటుంది. అప్పుడే నమిత వచ్చి నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలని ట్రై చేశారు.. నా జీవితం నాశనం చెయ్యాలని ట్రై చేశారని నమిత అనగానే.. అబద్ధమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : రిషి ఎంట్రీ మాములుగా లేదుగా.. షాకైన శైలేంద్ర!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1142 లో...‌మినిస్టర్ గారు కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మీరు ఎండీగా ఉండడానికి ఎవరు ఇష్టం గా లేరు.. ఇక వేరే ఆప్షన్ లేక ఇలా చెయ్యాల్సి వస్తుందని మినిస్టర్ అంటాడు. వేరే ఆప్షన్ ఎందుకు లేదు శైలేంద్రని చెయ్యొచ్చు కదా అని దేవయాని అంటుంది. అదే విషయం ముందే చెప్పాను.. శైలంద్రని చెయ్యమని రిషి గాని వసుధార గాని వచ్చి చెప్పాలని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత అందరు సంతకాలు పెడుతుంటారు. శైలంద్ర మాత్రం ఇంకా రంగా రావట్లేదని ఫోన్ చేస్తుంటే అతని ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఏంటి వీడూ టైమ్ కి హ్యాండ్ ఇచ్చాడా ఏంటని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర సంతకం పెడుతుండగా వసుధార వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. దెయ్యం అంటూ వసుధారని చూసి శైలేంద్ర భయపడుతుంటే.. అందరు ఏమైందంటూ అడుగుతారు. వసుధార చనిపోలేదు బ్రతికే ఉంది సైలెంట్ గా ఉండమని శైలేంద్రకి దేవయాని చెప్తుంది. అమ్మ వసుధార వచ్చావా.. నువ్వు వచ్చావంటే మరి రిషి అని మహేంద్ర అడుగుతాడు. వచ్చారు మావయ్య అని వసుధార చెప్తుంది. మరొకవైపు రిషి ఏంట్రి మాములుగా ఉండదు.. తను వస్తుంటే స్టూడెంట్స్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతూ పూలు చల్లతుంటారు. మహేంద్రతో పాటు అందరు రిషికి ఎదరు గా వెళ్తారు. అందరూ రిషిని చూసి షాక్ అవుతారు. అచ్చం రిషి లాగే ఉన్నాడని శైలేంద్ర అనుకుంటాడు. రిషిని వెళ్లి హగ్ చేసుకుంటాడు మహేంద్ర. చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రిషి అందరిని పలకరిస్తాడు. నువ్వు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది.. ఇక ఈ కాలేజీని అంత రిషి చూసుకుంటాడని మినిస్టర్ అంటాడు.అదంతా చూస్తున్న శైలేంద్ర స్పృహ తప్పి కిందపడిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర స్పృహలో నుండి బయటకు వచ్చి.. నువ్వు రిషివి కదా అని అంటాడు. నేను రంగాని.. ఆవిడ ఎవరో నేను కాలేజీ లోపలికి వస్తుంటే ఆపి.. రిషి సర్ అంటూ అదంతా ప్లాన్ చేసిందని చెప్తాడు. సరే నేను చెప్పినట్టు చేస్తూ ఉండు అని రంగాకి శైలేంద్ర చెప్తాడు. సరే కానీ ఆ మేడమ్ కి భర్తగా నటించలేనని రంగా అంటాడు. అలా చేయకుంటే డౌట్ వస్తుందని శైలేంద్ర అంటాడు. అప్పుడే అందరు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అప్పు పెళ్లికి ఏర్పాట్లు.. రాజ్ ఆ ఇద్దరిని కలపగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -477 లో.....కనకం దుగ్గిరాల ఇంటికి పెళ్లి పత్రికతో వస్తుంది. ఇక నుండి అయిన అనామికలా నిందలు వెయ్యకుండా నా కూతురిని ఆశీర్వదించండంటూ మొదటి శుభలేక ధాన్యలక్ష్మికి ఇస్తుంది. ఆ తర్వాత ఇంటి పెద్దలకి ఇచ్చి పెళ్లికి రండి అని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ.. పెళ్లికి రావొద్దని చెప్తుంది. ఆ తర్వాత మేమ్ అంతా ఉన్అనమాని మర్చిపోకని అపర్ణ చెప్పగానే.. కనకం హ్యాపీగా ఫీల్ అయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని తలుచుకుని‌ అప్పు ఏడుస్తుంటే.. అప్పుడే కనకం కృష్ణమూర్తిలు వస్తారు. ఇంత రాత్రి అయిన నిద్రపట్టడం లేదా అని కనకం అనగానే.. రేపు నీ పెళ్లి ఆ తర్వాత మమ్మల్ని వదిలి వెళ్ళాల్సి వస్తుందని భాదపడుతున్నావు కదా అని కృష్ణమూర్తి అనగానే.. కృష్ణమూర్తి పైన తలవాల్చి బాధపడుతుంది. ఆడదాని జీవితమే అంత.. ఎక్కువ మాట్లాడితే వాగుడు కాయ అంటారు. తక్కువ మాట్లాడితే పొగరు అంటారు.. అంటూ అత్తరింటి గురించి కనకం చెప్తుంది. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. ఏమనుకుంటుంది మీ అమ్మ కళ్యాణ్ ని ప్రతేకంగా రావద్దని చెప్పడం ఏంటని కోప్పడతాడు. ఎందుకు అలా ఆందో మీకు తెలియదా అని కావ్య అంటుంది. నా తమ్ముడిని దారుణంగా అవమానించినట్లు అనిపించిందని రాజ్ అంటాడు. మరొకవైపు కళ్యాణ్ పెళ్లి మండపం దగ్గరికి రాకుండా చేయాలి.. లేదంటే ఆ కావ్య ఏం చేసి అయిన సరే వాళ్ళ పెళ్లి చేస్తుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి.. కావ్య మన ముందు ఇలా చేస్తూ వెనకాల ఏదైనా ప్లాన్ చేస్తుందేమో.. ఎందుకైనా మంచిది కళ్యాణ్ పెళ్లి మండపానికి రావద్దని రుద్రాణి అనగానే.. వాడిని బెంగుళూరు పంపిస్తాను. మా ఇంటికి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి.. ఇలా బాధగా ఎందుకు ఉంటావ్.. అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళమని చెప్తుంది. నేను ఎక్కడికి వెళ్ళాను.. ఎప్పుడైనా నాకు ఏం కావాలో ఆలోచించావా అని కళ్యాణ్ కోప్పడతాడు.. తరువాయి భాగంలో అప్పు కళ్యాణ్ ఫొటో చూసి ఏడుస్తుంటే.. స్వప్న చూస్తుంది. నువ్వు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావ్ కదా అని స్వప్న అడుగుతుంది. కళ్యాణ్ కి స్వప్న ఫోన్ చేసి అప్పు నిన్ను ప్రేమిస్తుందని చెప్తుంది. ఆ మాటలు విన్న రాజ్ ఈ కళ్యాణ్ అప్పుని నమ్ముకొని లాభం లేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

Karthika Deepam2 : దీపని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన సుమిత్ర.. జ్యోత్స్న  ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika deepam 2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -111 లో......సుమిత్ర వాళ్ళు భోజనం చేస్తుంటారు. కనీసం మమ్మల్ని పిల్వకుండానే తింటున్నారా వాళ్లకి ఎంగేజ్ మెంట్ ఆగిపోయింది అన్న బాధ కొంచెం కూడా లేదని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. అప్పుడే కార్తీక్ సుమిత్ర కి ఫోన్ చేసి అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు‌. నువ్వు త్వరగా రాకుంటే మళ్ళీ దీప ఎక్కడికైనా వెళ్ళిపోతుందని కార్తీక్ అనగానే.. సుమిత్ర బయలుదేరుతుంటుంది‌. జ్యోత్స్న తినే ప్లేట్ కిందకి విసిరేస్తుంది. ఏంటి జ్యోత్స్న ఏం చేస్తున్నావని సుమిత్ర అడుగగా.. ఎవరికి అయిన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందన్న బాధ ఉందా.. అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. నేను అసలు తింటున్నానా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు.. ఆ దీప కోసం తినే ప్లేట్ లో కడుక్కుని వెళ్ళిపోతున్నావని జ్యోత్స్న అంటుంది. నీ ప్రేమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే చూపించు అమ్మ అని జ్యోత్స్న అంటుంది. దీప పైన నాకుంది జాలి అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న అర్థం చేసుకుండ తిడుతుంది. నువ్వు భాదపడుతున్నావ్ కరెక్ట్ కానీ అది చెప్పే పద్ధతి ఇది కాదు అన్నం ఎవరైనా అలా చేస్తారా అని జ్యోత్స్న శివన్నారాయణ అంటాడు. దాంతో జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ముందు నువ్వు హాస్పిటల్ కి వెళ్లు.. జ్యోత్స్న తో నేను మాట్లాడుతానంటూ దశరత్ అనగానే సుమిత్ర వెళ్తుంది. దీప కష్టంలో ఉన్నప్పుడు మనం చూడకుండా ఉంటే ఎలా అని శివన్నారాయణ బాధపడతాడు. ఆ తర్వాత సుమిత్ర హాస్పిటల్ కి వెళ్తుంది. నువ్వు వెళ్లి తిని రెస్ట్ తీసుకోమని సుమిత్ర అంటుంది. నీ కూతురు ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయినందుకు కోపంగా లేదా అని సుమిత్రని అడుగుతాడు కార్తిక్‌. ఎందుకు కోపం ఒక పాప ప్రాణాలు కాపాడావ్.. తల్లి, బిడ్డ విడిపోకుండా చేసావని సుమిత్ర అనగానే కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాసేపటికి అక్కడ నుండి కార్తిక్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ డిశ్చార్జ్ చేశారు వెళ్లిపొమ్మన్నారు పదండి అంటూ సుమిత్ర అనగానే.. నేను రాను అని దీప అంటుంది. దాంతో సుమిత్ర తనకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత దీప దగ్గరకి జ్యోత్స్న వచ్చి ఏదో రకంగా మాటలు అంటూనే ఉంటుంది. జ్యోత్స్న ఇప్పటికే చాలా ఎక్కువ అయింది వెళ్ళు అంటూ సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : శ్రీలత మాస్టర్ ప్లాన్ అదే.. సీతాకాంత్ చుట్టూ డ్రామా!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -163 లో.....రామలక్ష్మి ఆఫీస్ కి వచ్చిన కూడా అత్తయ్య గారు ఎదో చేయబోతున్నారంటూ ఆలోచిస్తుంది. ఏంటి పని మానేసి మరి ఆలోచిస్తున్నావంటూ సీతాకాంత్ అడుగుతాడు. అప్పుడే నమిత వచ్చి.. సర్ అంటూ ఎదో నసుగుతుంది. ఏంటి నమిత ఏదైనా మాట్లాడాలా అని సీతాకాంత్ అడుగుతాడు. మళ్ళీ వస్తాను సర్ అంటూ వెళ్లిపోతుంటే.. మీరు మాట్లాడుకోండి నేను వస్తానంటూ రామలక్ష్మి వెళ్లిపోతుంది. ఏమైంది మీ అయన గురించి తెలిసిందా అని సీతాకాంత్ అడుగుతాడు. లేదు సర్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని నమిత అంటుంది. నువ్వేం కంగారు పడకు ఈవినింగ్ వరకు చూసి.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఎవరికి చెప్పొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తుంటే అందరికి తెలిసిపోతుందని సీతాకాంత్ అంటాడు. అప్పుడే ఫైల్ మర్చిపోయానంటూ రామలక్ష్మి ఫైల్ తీసుకొని బయటకు వచ్చి నమిత ఎందుకు అలా ఉంది.. ఏం జరుగుతుంది అత్తయ్య గారు మొహం వెలిగిపోతుంది. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత నమితని సందీప్ పిలిచి ప్లాన్ త్వరగా పూర్తి చేయమని చెప్తాడు. రామలక్ష్మి ఉంటే పాసిబుల్ అవదని నమిత అనగానే.. అమ్మ చెప్తే ఏదో ఒకటి చేస్తుందని శ్రీలతకి సందీప్ కాల్ చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి వర్క్ చేసుంటే అప్పుడే సీతాకాంత్ వచ్చి తన చెయ్యి పట్టుకొని.. అలా కాదంటూ చేస్తుంటే అప్పుడే శ్రీలత సీతాకాంత్ కి ఫోన్ చేసి.. రామలక్ష్మిని ఇంటికి పంపించు ఇంట్లో సాయంత్రం పూజ ఉందని చెప్పగానే సీతాకాంత్ సరేనంటూ రామలక్ష్మి ని పంపిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చాక.. ఇప్పుడు పూజ ఏంటని డౌట్ పడుతుంది. వెళ్లి రెడీ అయిరా అని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత ప్లాన్ అమలు చెయ్ అని సందీప్ నమితకి ఫోన్ చేస్తాడు. నమిత సీతాకాంత్ క్యాబిన్ కి వెళ్ళగానే అప్పుడే మాణిక్యం వస్తాడు. దాంతో కోప్పడి సీతాకాంత్ అతన్ని పంపిస్తాడు. సర్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.. కాన్ఫరెన్స్ రూమ్ కి రండి సర్ ఇక్కడ అయితే ఆ విషయం విని నన్ను తక్కువ చేసి చూస్తారని అనగానే సరే అని సీతాకాంత్ అంటాడు. నమిత లోపలికి వెళ్తుంది. సీతాకాంత్ కూడా లోపలికి వెళ్తాడు. మా ఆయన వచ్చాడు తనేం మారలేదు ఎలా హింసించాడో అంటూ దెబ్బలు చూపిస్తుంది. తనకి బుద్ది వచ్చేలా నేను చేస్తానని సీతాకాంత్ అంటాడు.. అవసరం లేదు సర్ ఇక వాడు వద్దు.. నా బ్రతుకు నేను బతుకుతాను కాకపోతే మీ లాంటి వాళ్ళు నీడగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇలా మీ చెయ్ పట్టుకొని ఏడు అడుగులు నడవాలని ఉంది. మీ ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చినట్లే మీ మనసులో స్థానం ఇస్తారా సర్ ప్లీజ్ సర్ అని సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది నమిత. దాంతో హెయ్ అంటూ కోపంగా నమితని దూరం నెడతాడు సీతాకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.