Guppedantha Manasu : బావని వెతుక్కుంటూ మరదలు ఆ ఇంటికి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1145 లో.... దేవయాని వచ్చి రిషి, వసుధారలని గదిలోకి వెళ్ళమని చెప్తుంది. వాళ్ళు వెళ్ళగానే ఎందుకు మమ్మీ అలా చెప్పావ్.. వాడు ఆ వసుధారతో ఎలా ఉంటాడని శైలేంద్ర అనగానే.. నీకు వాడు రిషినో రంగానో అన్న డౌట్ ఉంది కదా ఇప్పుడు తెలుస్తుంది.. వాడు ఎవరనేది రంగా అయితే గదిలో నుండి బయటకు వస్తాడు. రిషి అయితే లోపలే ఉంటాడని దేవయాని అంటుంది. కనిపెట్టాడనికి ఈ ప్లాన్ తప్ప మరొకటి నీ దగ్గర ఉందా అని దేవయాని అంటుంది. ఆ తర్వాత వసుధార దగ్గరికి రిషి వెళ్లి.. సరదాగా మాట్లాడతాడు. వసుధార వేలికి VR అనే అక్షరం గల రింగ్ ని  పెడతాడు రిషి. ఇక నేను గదిలో నుండి బయటకు వెళ్తాను. ఎందుకంటే శైలేంద్ర అన్నయ్యకి నా పై డౌట్ వస్తుంది. అందుకే నేనే వెళ్ళాలని రిషి బయటకు వస్తాడు. హాల్లో ఉన్న శైలేంద్ర, దేవయాని చూసి వాడు రంగానే అనుకుంటారు. మమ్మీ నువ్వు వెళ్ళు నేను తమ్ముడితో మాట్లాడి వస్తానని శైలేంద్ర అంటాడు. నేను ఆ గదిలో ఉండలేను.. టార్చర్ లాగా ఉంది.. నేను వెళ్ళిపోతానని రంగా అంటాడు. వద్దు నువ్వు చెయ్యాల్సింది చాలా ఉంది నేను చెప్తుంటా నువ్వు చేస్తుండు.. ఇప్పుడు మేడపైన పడుకోమని శైలేంద్ర అనగానే.. లేదు మహేంద్ర దగ్గర పడుకుంటానని రిషి అనగానే.. సరే అంటాడు. ఆ తర్వాత మహేంద్ర దగ్గరికి రిషి వెళ్తాడు. ఇన్నిరోజులు రిషిని మిస్ అయినందుకు మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మహేంద్ర ఒళ్ళో రిషి తలవాల్చి పడుకుంటాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరికి కొడుకు వచ్చాడు. ఈ కొడుకు దగ్గరికి తండ్రి ఇంకా రావట్లేదని అనుపమతో మను అంటాడు. మనం మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళదాం.. వాళ్ళని చుసినట్టుంట్టుందని మను అనగానే.. తర్వాత ఎప్పుడైనా వెళదామని అనుపమ అంటుంది. మరుసటి రోజు శైలేంద్ర ఇంటికి సరోజ వస్తుంది. బావ బావ అంటూ ఇంట్లోకి వస్తుంది. ఎవరు నువ్వు అంటూ ఫణీంద్ర , మహేంద్ర అడుగుతారు. శైలేంద్ర టెన్షన్ పడుతూ.. మీ బావ ఎవరని అడుగుతాడు. నా బావని నువ్వే తీసుకొని వచ్చవని సరోజ అంటుంది. అప్పుడే వసుధార, రిషి లు వస్తారు. బావ అంటూ రిషి దగ్గరికి వెళ్తుంది సరోజ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సూపర్ సస్పెన్స్ గా కోర్ట్ రూమ్ డ్రామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -115 లో......సుమిత్ర పూజ చేస్తుంటే శౌర్య తన దగ్గరికి వస్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందని అడుగగా.. బయటకు వెళ్ళింది, వస్తుంది. మనం టిఫిన్ చేద్దామని అంటుంది. కోర్ట్ లో ఏం జరుగుతుందో ఏంటో అని సుమిత్ర టెన్షన్ పడుతుంది. మరొకవైపు కోర్ట్ లో జడ్జి ముందు నరసింహా లాయర్ మాట్లాడుతుంటాడు. ఒక తండ్రి తన కూతురు కావాలని కోర్ట్ కి వచ్చాడు.. ఈ కేసు చాలా వింతగా ఉందని అంటాడు. ఆ తర్వాత లాయర్ నరసింహాతో మాట్లాడతాడు. తన బిడ్డను నిర్లక్ష్యం చెయ్యడంతో తండ్రి తన కూతురిని తెచ్చుకోవాలని అనుకుంటాడని నరసింహా తరుపున లాయర్ వీవీ అంటాడు. నిర్లక్ష్యం అనే కంటే ముందు వాళ్ళ మధ్యలో ఎంత దూరం ఉందో చెప్తే మంచిది అంటూ దీప తరుపున లాయర్ జ్యోతి అంటుంది. నీ క్లయింట్ వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి తన కూతురు కావాలి అంటున్నాడని VV అంటాడు. ఆ తర్వాత జ్యోతి నరసింహాతో మాట్లాడుతుంది. మీ కూతురిని ఇవ్వమని మీ భార్యని ప్రాధేయపడుతున్నారా అని జ్యోతి అనగానే అవునని నరసింహా అంటాడు. అయితే మీ పెళ్లి రోజు చెప్పండి అని జ్యోతి అనగానే నరసింహా తెలివిగా పెళ్లికి ఇవ్వని వాళ్ళది ఎలా గుర్తు పెట్టుకుంటానని నరసింహ అంటాడు. అయితే మీ కూతురు కావాలి అంటున్నవ్ కదా.. నీ ప్రాణానికి ప్రాణం అయిన నీ కూతురు పుట్టిన రోజు ఎప్పుడు చెప్పండి అంటూ జ్యోతి అనగానే.. నరసింహ తెలియదు అన్నట్టు బిత్తిరి మొహం వేసుకొని చూస్తుంటాడు. ఆ తర్వాత VV కలుగజేసుకొని అనవసరం అయినా ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని ఇబ్బంది పెడుతున్నారని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి శౌర్య డేటాఫ్ బర్త్ చెప్తాడు. తన కూతురు డేట్ అఫ్ బర్త్ చెప్పడానికి ఇంత టైమ్ తీసుకున్నాడు అంటే ఇక మీరే ఆలోచించండి అని జ్యోతి అంటుంది. ఆ తర్వాత దీపతో VV మాట్లాడతాడు. తన గురించి అన్నీ ఫాస్ట్ గా చెప్తుంది కానీ నర్సింహా గురించి తడబడుతుంది. భర్త గురించి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తనకి ఆల్రెడి ఒక అతనితో సంబంధం పెట్టుకుంది. అతను ఇక్కడే ఉన్నాడు అతనే అంటూ నరసింహా కార్తీక్ ని చూపిస్తాడు. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ నా కూతురిని స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడు తండ్రిగా సంతకం చేసాడు అంతేకాకుండా ఫీజు తనే కట్టాడు అప్పులు కూడా తీర్చాడని నరసింహ అంటాడు. అవి అప్పుగా తీసుకున్నానని దీప అనగానే మరి అందుకు సాక్ష్యం ఉందా అని లాయర్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : బొట్టు పెట్టండి.. అంతా మంచే జరుగుతుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -167 లో....రామలక్ష్మిపై నుండి కిందకి వస్తుంది. టీవీలో సీతాకాంత్ గురించి న్యూస్ తప్పుగా రావడం తో.. అది చూస్తూ శ్రీలత ఓవరాక్షన్ చేస్తుంది. నా కొడుకు గురించి తప్పు గా వస్తుంటే చూడలేకపోతున్నానని అంటుంది. ఆ తర్వాత టీవీలోనే కాదు.. అన్ని న్యూస్ పేపర్స్ లలో అన్నయ్య గురించి అదే న్యూస్ వస్తుందని సందీప్ అంటాడు. అదంతా చూస్తూ రామలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే మాణిక్యం వస్తాడు. తనని చూసి తనపై పడి రామలక్ష్మి ఏడుస్తుంది. అసలు ఏమైంది అమ్మ ఎవరు చేశారు ఇదంతా.. కావాలనే చేస్తున్నారు వాళ్ళని కనిపెడతానని మాణిక్యం అంటాడు. ఇదంతా నువ్వే చేస్తూన్నావ్ కదా అని శ్రీలతని మాణిక్యం అంటాడు. నేనెందుకు చేస్తానని శ్రీలత అంటుంది. అన్నయ్యని మా అమ్మ సొంతకొడుకులాగా చూస్తుంది.. అలాంటిది మా అమ్మని అలా అంటావా అని మాణిక్యంపై సందీప్ విరుచుకుపడతాడు. నా తండ్రిని ఎందుకు అలా అంటున్నావని రామలక్ష్మి అనగానే.. మరి మావయ్య అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే తప్పు లేదా అని సిరి అంటుంది. అయిన శ్రీలతనే ఇదంతా చేసిందని మాణిక్యం అంటుంటే.. ఇంకొకసారి అలా అనకని పెద్దాయన చెప్తాడు. అందరు శ్రీలతకి సపోర్ట్ గా మాట్లాడతారు. నాన్న నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని రామలక్ష్మి అనగానే.. మాణిక్యం వెళ్ళిపోతాడు. మరొకవైపు సీతాకాంత్ కి ఒక కానిస్టేబుల్ భోజనం తీసుకొని వచ్చి ఇస్తాడు. వద్దని సీతాకాంత్ చెప్తాడు. ఎందుకు అలా భోజనం ఇస్తున్నావ్ అని ఇంకొక కానిస్టేబుల్ సీతాకాంత్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడకండి అంటూ శ్రీలత అంటుంది. అప్పుడే రామలక్ష్మి కూడా వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది సీతతో మాట్లాడి సందీప్ ని చైర్మన్ ని చేయమని అడుగుదామనుకున్నానని శ్రీలత అనుకుంటుంది. రామలక్ష్మి భోజనం తీసుకొని వచ్చి.. సీతాకాంత్ కి ప్రేమగా తినిపిస్తుంది. మీరు నాకు పూజ అయ్యాక బొట్టు పెట్టకుండానే వచ్చారు.. ఇప్పుడు పెట్టండి అంతా మంచి జరుగుతుందని రామలక్ష్మి అనగానే రామలక్ష్మికి సీతాకాంత్ బొట్టు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ హౌస్ లోకి విరాట్ కోహ్లీ వస్తే...

బిగ్ బాస్ అంటే ఆ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది ఎవరికైనా. ఐతే మనం ఇప్పటి వరకు చిన్న చిన్న నటీనటులను, కామన్ మ్యాన్ ని చూసాం. మొదట్లో కొన్ని సీజన్స్ వరకు బిగ్ బాస్ రసవత్తరంగా ఉండేది..చూసే కొద్దీ చూడబుద్దేసేది. కానీ గత రెండు, మూడు సీజన్స్ నుంచి అసలు ఎందుకొచ్చిందిరా బాబు తలనొప్పి అనిపించేలా ఉంటోంది. ఎందుకంటే అందులో అంతా బూతు తప్ప వేరే ఏమీ ఉండడం లేదు.  టాలెంట్ ఇంప్రూవ్ చేసుకునేలా కానీ ఫామిలీ మొత్తం కలిసి చూసేదిలా కానీ లేదంటే పిల్లలకు ఏమన్నా అర్దమయ్యే  కాన్సెప్ట్స్ కానీ ఉండడం లేదు. ఈ షో ఏదో నడుస్తోంది అంటే నడుస్తోంది. ఇక ఇప్పుడు సీజన్ 8 కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎవరెవరు అంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఐతే ఆడియన్స్ కి  వీళ్ళు వస్తే బాగుండు అనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైములో బిగ్ బాస్ లోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటూ కొంతమంది ఆడియన్స్ ని అడిగేసరికి ఒక సీనియర్ సిటిజన్ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. "బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు వస్తే బాగుంటుంది..ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు." అనేసరికి "విరాట్ కోహ్లీ గారు ఉంటే బాగుండు అనిపిస్తోంది" అనేసరికి అందరూ షాక్ అయ్యారు. అతని ఆన్సర్ కి నెటిజన్స్ కామెడీ రిప్లైస్ ఇస్తున్నారు. "కోహ్లీ అంబానీ ఇంట్లో పెళ్ళికే వెళ్ళలేదు..ఇంకా బిగ్ బాస్ హౌస్ కా...కానీ ఐడియా చాలా బాగుంది...తాత రాక్డ్. ప్రభాస్ అన్న వస్తే చాలా బాగుంటుంది.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా విరాట్ కోహ్లీ బిగ్ బాస్ కి రావడం అన్న ఊహే భలే క్రేజీగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Karthika Deepam 2 : నా కూతురికి తండ్రివని కోర్టులో చెప్పే దమ్ము నీకుందా..?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '(karthika deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -114 లో....కార్తీక్ ఇంటికి నరసింహా డ్రింక్ చేసి వచ్చి.. ఒరేయ్ కార్తీక్ బయటకు రారా అంటూ గట్టిగా అరుస్తాడు. కార్తీక్ తో పాటు శ్రీధర్ కాంచనలు కూడా బయటకు వస్తారు. ఎందుకు వచ్చావ్ రా అని కార్తీక్ అడుగుతాడు. నా పెళ్ళాం జోలికి నా కూతురు జోలికి రాకుండా అడ్డుపడ్డావ్ కదా ఇప్పుడు కేసు కోర్ట్ కి వెళ్ళిందని నరసింహా అంటాడు. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కార్తీక్ అంటాడు. వాడిని మెడపట్టి బయటకు గెంటమని శ్రీధర్ అంటాడు. నీకు ఒక ఛాలెంజ్ చెయ్యడానికి వచ్చానని నరసింహా అంటాడు. నువ్వు నా కూతురు తండ్రి అని మొన్న హాస్పిటల్ లో చెప్పావ్ కదా నీకు దమ్ముంటే రేపు కోర్ట్ లో ఆ విషయం చెప్పగలుగుతావా.. నాకు దమ్ము ఉంది కాబట్టి కోర్టులో కేసు వేసా.. రేపెలా అడ్డుకుంటావో చూస్తానని నరసింహా అంటాడు. ఆ తర్వాత శౌర్యని తీసుకొని వెళ్లడం కాదు.. తన చేతిని కూడా పట్టుకోనివ్వనని నరసింహాకి కార్తిక్ వార్నింగ్ ఇస్తాడు. రేపు నా కూతురిని ఎత్తుకొని తీసుకొని వెళ్తానని నరసింహా అంటాడు.  నరసింహా వెళ్ళిపోయాక.. రేపు నువ్వు కోర్టుకి వెళ్లడం వద్దని శ్రీధర్ అనగానే.. వాడేదో రెచ్చగొట్టడానికి అలా అంటున్నాడు.. మీరు పట్టించుకోకండని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నరసింహా ఇంటికి వెళ్తాడు. కోర్టులో కేసు వేసా మనం గెలిచేలా ఆధారాలు సంపాదించాను.. రేపు ఈ టైమ్ కి శౌర్య ఈ ఇంట్లో ఉంటుందని నరసింహా అనగానే శోభ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అనసూయ మాత్రం టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. హాస్పిటల్ నుండి మమ్మీ దీపని తీసుకొని వస్తుందని ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.. అయిన ఆ దీప ఏ మొహం పెట్టుకొని వచ్చిందో నాకు అర్థం అవడం లేదని జ్యోత్స్న అంటుంది. రేపు కోర్ట్ కి వెళ్లి కార్తీక్ ఆవేశంలో ఏదో ఒకటి చేయకుండా అడ్డుపడాలని జ్యోత్స్నకి పారిజాతం చెప్తుంది. మరుసటి రోజు ఉదయం దీప కార్తీక్ లు కోర్ట్ దగ్గర మాట్లాడుకుంటుంటారు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. దీపపై నాకు బాధ్యత ఉందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత లాయర్ జ్యోతి వస్తుంది. ఆప్పుడే నరసింహా లాయర్ కూడా వచ్చి జ్యోతితో మాట్లాడతాడు. ఓడిపోయే కేసుని ఎందుకు ఒప్పుకున్నారనగానే.. ఆ విషయం మీకెలా తెలుసు.. కోర్టులో చూసుకుందామని జ్యోతి అంటుంది. ఆ తర్వాత నరసింహా తన లాయర్ దగ్గరికి వస్తాడు. ఆవిడ అన్ని తెలివిగా మాట్లాడుతుంది. ఆ లాయర్ తో జాగ్రత్త అని నరసింహా లాయర్ నరసింహాకి చెప్తాడు. కోర్ట్ కి అనసూయ శోభ కూడా వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అమ్మానాన్నలం కాబోతున్నాం.. మీ ఆశీర్వాదాలు అందించండి

రాకేష్ - సుజాత అమ్మా నాన్నలు కాబోతున్నారు. ఆ విషయాన్ని ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో రివీల్ చేశారు. ఒక మంచి సందర్భం చూసుకొని చెప్దామనే ఇన్నాళ్లు ఆగాం. "మా వివాహబంధం ఇంకో అడుగు ముందుకేసింది. ఈ విషయం షేర్ చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఎమోషనల్ గానే ఉంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతి రూపం ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి 9 నెలలు పట్టింది కానీ మా పెద్దవాళ్లకు చెప్పడానికి 9 నిమిషాలు పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. జన్మజన్మలకు ఆయనకు నేనే భార్యను కావాలి. మా తోటి కోడలు వీణ నన్నెంత బాగా చూసుకుంటుందో చెప్పలేను. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటినుంచి మా ఆయన నన్ను ఇంటికి పంపలేదు. చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలా అనేది కూడా ఎవరినీ అడగలేదు. నన్ను మా ఊరికి కూడా పంపలేదు. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఊరిలో ఆస్పత్రులు లేవని పంపలేదు. అలాంటి సమయంలో నన్ను చాలా బాగా చూసుకుంది. ఇల్లు గుర్తు రాకుండా ప్రేమను పంచింది తోడికోడలు. ఇలా ఎమోషనల్ అయితాననే ఇన్నిరోజులు వీడియో చేయలేదు' అంటూ సుజాత కంటతడి పెట్టుకుంది. రాకేశ్ తనని తండ్రిని చేయబోతున్నందుకు సుజాతకు థ్యాంక్స్ చెప్పాడు.  రాకేశ్ - సుజాత ఫ్యాన్స్ అంతా వాళ్లకు విషెస్ చెప్తున్నారు. 

నమిత వల్ల జైలుపాలైన భర్త.. రామలక్ష్మి ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారామవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -166 లో... సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. నేను తప్పు చేసానని ఎవరు నమ్మినా, నమ్మకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మితే చాలని సీతాకాంత్ అనగానే.. మీ గురించి నాకు తెలుసు మీరు తప్పు చేసానంటే ఎలా నమ్ముతాను మీరు నిర్ధాషి అని రుజువు చేసి బయటకు తీసుకొని వస్తానని రామలక్ష్మి సీతాకాంత్ కి చెప్పి బయటకు వస్తుంటుంది. మీడియా వాళ్ళు సీతాకాంత్ గురించి తప్పుగా మాట్లాడుతారు. మీరు అలా మాట్లాడకండి మా వారు ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను అని రామలక్ష్మి వాళ్ళతో అంటుంది. ఆ తర్వాత ఆ నమితని పట్టుకోవాలని రామలక్ష్మి అనుకొని.. మీరు ఇంటికి వెళ్ళండి తాతయ్య నేను వస్తానని అంటుంది. మరొకవైపు శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడే రామలక్ష్మి ఇంటికి వస్తుంది. ఏదైనా దారి దొరికిందా అంటూ పెద్దాయన రామలక్ష్మిని అడుగగా.. లేదని రామలక్ష్మి చెప్తుంది. నా కొడుకికి ఎలాంటి సిచువేషన్ వచ్చిందంటూ శ్రీలత ఓవరాక్షన్ చేస్తుంది. ఇందులో ఏదో కుట్ర ఉంది ఉన్నట్టుండి అన్నయ్య పైన ఇంత పెద్ద నింద ఎలా పడిందని సిరి అంటుంది. అన్నయ్య గురించి అంతా తెలుసు ఎలాంటి వాడో తెలుసు అయిన సందీప్ అన్నయ్య కూడా సీతా అన్నయ్య తప్పు చేసాడని అందరితో పాటు అంటుంటే.. ఎంత వరకు కరెక్ట్ అని సిరి అంటుంది. నేను అక్కడ చూసింది చెప్పానని సందీప్ అనగానే.. రామలక్ష్మి తన చెంప పగులగొడుతుంది. ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు అంటుంది. మా ఆయనని ఎందుకు కొట్టావ్ అక్క అని శ్రీవల్లి అడుగుతుంది. తప్పుడూ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన మీ ఆయనని కొడితేనే నీకు అలా అనిపించింది.. నిజాయితీ మంచిగా ఉంటున్నా మా అయన గురించి తప్పుగా మాట్లాడితే నాకెలా ఉంటుందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత నేను చేయలేని పని నువ్వు చేసావని పెద్దాయన రామలక్ష్మితో అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి గదిలోకి వచ్చి సీతాకాంత్ ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడే పెద్దాయన వచ్చి నమిత ద్వారా అన్ని నిజాలు బయటపడుతాయని అంటాడు. ఇందాక అక్కడికే వెళ్ళాను తాళం వేసి ఉంది ఫోన్ కలవట్లేదని రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తాడు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి పైన నుండి వస్తుంటే.. శ్రీలత టీవీ చూస్తూ నాన్న సీతా అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : శైలేంద్ర ముందు రిషి యాక్టింగ్.. డౌట్ పడిన సరోజ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1144 లో....రిషి వసుధారలు సరదాగా మాట్లాడుకుంటుంటే.. అప్పుడే మహేంద్ర వస్తాడు. అందరు జగతి గురించి మాట్లాడుకుంటారు. అనుపమ వాళ్ళు మన ఇంట్లో నుండి వెళ్లిపోయారని రిషికి మహేంద్ర చెప్తాడు. పాపం మను తన తండ్రి ఎవరో కనుక్కోకుండానే వెళ్ళిపోయాడని మహేంద్ర అనగానే.. మనుకి ఇంకా తన గురించి తెలియలేదా అని వసుధార ఆశ్చర్యపడుతుంది. అదేంటి నేను లెటర్ రాసి పెట్టి వెళ్ళాను కదా మను చూడలేదా.. ఆ శైలంద్ర ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడా అని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత రౌడీ పాండుకి  శైలేంద్ర ఫోన్ చేస్తాడు. వసుధారని చంపలేదన్న విషయం తెలిసినట్లుందని అనుకొని రౌడీ ముందుగానే.. ఆ వసుధారని పాతిపెట్టిన చోట చూస్తే లేదు సర్ అని అంటాడు. అలా అనగానే అయ్యో మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయావా అని శైలేంద్ర వెటకారంగా మాట్లాడుతుంటాడు. అయ్యో ఈ విషయం మర్చిపోయాను సర్ అని పాండు ఫోన్ కట్ చేసి శైలేంద్ర నుండి తప్పించుకుంటాడు. వీడు తెలివిగా నా నుండి తప్పించుకున్నాడని శైలేంద్ర అంటాడు.  ఆ తర్వాత బుజ్జికి రిషి ఫోన్ చేసి.. రాధమ్మ గురించి కనుక్కుంటాడు. అప్పుడే సరోజ వచ్చి.. ఫోన్ లాక్కొని మాట్లాడుతుంది. నువ్వు రావాలి లేదంటే నువ్వు ఎక్కడున్నావో కనుక్కొని నేనే వస్తానని సరోజ అంటుంది. అప్పుడే రాధమ్మ వచ్చి..  నా మనవడు ఎక్కడికి వెళ్ళాడంటూ బాధపడుతుంది. ఆ తర్వాత శైలేంద్రతో వెళ్ళడంటూ బుజ్జి ఫోటో చూపిస్తాడు. అన్న ఇతనితో వెళ్లాడని బుజ్జి చెప్పగానే అతను సరోజని చూడడానికి వచ్చిన అబ్బాయి వాళ్ళ అన్న కదా అని రాధమ్మ అంటుంది. అతనితో బావ ఎందుకు వెళ్ళడంటూ సరోజ డౌట్ పడుతుంది. ఆ తర్వాత అనుపమకి మహేంద్ర ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. మనుకి చేస్తాడు. మను లిఫ్ట్ చెయ్యగానే.. రిషి, వసుధారలు తిరిగి వచ్చారని చెప్పగానే.. మను, అనుపమ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రిషి నీతో మాట్లాడాలంటూ శైలేంద్ర వస్తాడు. అవసరం లేదని వసుధార అంటుంది. పది నిమిషాలలో రాకపోతే నేనే వస్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషిని పక్కకి తీసుకొని వెళ్లిన శైలేంద్ర.. అసలు నువ్వు రంగావేనా అని అడుగుతాడు. అదేంటి అలా అడుగుతున్నావ్.. నేనే రంగా.. నాకు ఇక్కడ కంఫర్ట్ గా లేదు.. అందరు ఒకే గానీ ఆ వసుధర గారితో కొంచెం ఇబ్బందిగా ఉందంటూ రిషి అనగానే.. అప్పుడే వసుధార వస్తుంది. తనని మేడమ్ గారు అని రిషి అనగానే.. ఏంటి మేడమ్ అంటున్నారని వసుధార ఏం తెలియనట్టు అడుగుతుంది. వెంటనే అలా కాదు మిస్టేక్ గా అన్నాడంటూ శైలేంద్ర కవర్ చేస్తాడు. అప్పుడే దేవయాని వస్తుంది. ఈ టైమ్ అయింది పడుకోండి అంటూ వసుధార, రిషిలని పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఇండియాలో ఆడవాళ్ళుగా పుట్టకుండా ఉండాల్సింది

కొంతమంది లేడీస్ రెగ్యులర్ గా ట్రోల్ అవుతూ ఉంటారు. అందులో అనసూయ, చిన్మయి శ్రీపాద రెగ్యులర్ గా ఉంటారు.  సింగర్ చిన్మయి శ్రీపాద ఏం మాట్లాడినా తూటాల్లా ఉంటాయి మాటలు. రీసెంట్ గా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ రీల్ ఎవరి మీదో కాదు. చాగంటి కోటేశ్వరావు ప్రవచనం మీద.  "మంగళ కార్యం మీద వెళ్ళేటప్పుడు ఆడది ముందు, పురుషుడు వెనక నడవకూడదు..ఒకవేళ అలా వస్తే గనక అమంగళ కార్యం మీద వస్తున్నట్టు గుర్తు" అని ఒక ప్రవచనం చెప్పారు చాగంటి. ఆ వీడియో మీద చిన్మయి కౌంటర్లు వేసింది. "అవును నడకకి రూల్స్, ముందు వెళ్తే రూల్స్,  ఇవన్నీ ఏ రాముడు, కృష్ణుడు, పరమశివుడు చెప్పారో.. అసలు మనందరం ఇండియాలో ఆడవాళ్ళుగా పుట్టకుండా ఉండాల్సింది" అంటూ చిన్మయి చేసిన కామెంట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.  చిన్మయి అసలే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పిల్లల అనుమతి లేకుండా వారిని ముట్టుకోవడం, పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి తప్పు అంటూ చిన్మయి చెబుతూనే ఉంది. మరోవైపు తమ సొంత పిల్లల్ని ప్రేమతో తాకడం, హగ్ చేసుకోవడం తప్పు ఎలా అవుతుందంటూ నెటిజన్లు కూడా వాదించారు. అలాగే చిన్మయి.. ఒక చిన్న బాబుకు  అనసూయ ఇచ్చిన లిప్ లాక్ మీద కూడా కౌంటర్లు వేసింది.

Brahmamudi : కాసేపట్లో అప్పు పెళ్ళి.. పెళ్లికూతురు గదిలోకి రాజ్ వెళ్ళి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -479 లో.....నీ మనసులో ప్రేమ పెట్టుకొని ఇంత వరకు ఎందుకు రానిచ్చావ్ .. ఇదంతా ఎవరి కోసం.. మనం హ్యాపీగా ఉంటే చాలు.. నువ్వు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నట్ల విషయం చెప్పవా అని అప్పుని స్వప్న ఆడుగుతుంది. వాడు నన్ను ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు.. నాకు ఇలా జరిగిందని జాలిగా చూస్తున్నాడని అప్పు అంటుంది. నేను వెంటనే వెళ్లి ఈ పెళ్లి ఆపుతానంటూ స్వప్న వెళ్తుంటే.. నువ్వు ఇప్పుడు వెళ్తే చచ్చిపోతానంటూ అప్పు బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు మండపానికి వస్తారు. వాళ్ళకి స్వప్న, కావ్య ఇద్దరు హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత రుద్రాణి ధాన్యలక్ష్మిని పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. కళ్యాణ్ కి స్వప్న ఫోన్ చేసి.. అప్పు ఇంకా నిన్ను ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్ళ కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది. నువ్వు, ఇంకా అప్పుని ఫ్రెండ్ లాగా చూస్తున్నావో లేదో తెలియదు కానీ ఇంకో రెండు గంటల్లో అప్పు పెళ్లి అవుతుంది. ఇక నీ ఇష్టమని కళ్యాణ్ కి స్వప్న చెప్తుంది. ఆ మాటలు రాజ్ వింటాడు. ఇక అప్పు, కళ్యాణ్ లని నమ్ముకుంటే లాభం లేదు.. నేనే ఏదో ఒకటి చెయ్యాలని రాజ్ అనుకుంటాడు.. మరొకవైపు అప్పు పెళ్లి చేసుకోవడానికి సిద్దపడింది.. మర్చిపోయిందనుకున్న కానీ ఇంకా ప్రేమిస్తుందంటే ఇక నేను ఆగలేను.. కుటుంబం కోసం మేమ్ బాధపడడం కరెక్ట్ కాదని కళ్యాణ్ పెళ్లి ఆపాలని అనుకుని వెళ్తుంటే డోర్ బయట నుండి గడియ పెడతారు. ఆ తర్వాత డోర్ లాక్ అయితే వేసావ్ కదా అని రుద్రాణి ని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వేసాను ఇదిగో కీ కూడా పట్టుకొచ్చానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ పెళ్లికొడుకు దగ్గరికి వెళ్లి అప్పు కళ్యాణ్ ఇద్దరు ప్రేమించుకున్నారని చెప్తాడు. లేదండి అప్పు ఇందాకే నేనంటే ఇష్టమని చెప్పిందని పెళ్లికొడుకు చెప్తాడు. ఆ మాటలు కావ్య విని కోప్పడుతుంది. పెళ్లి చెడగొట్టడానికే వచ్చారా అని అనగానే.. అవునని రాజ్ అంటదు. పెళ్లి ఆపుతానని రాజ్.. నేను మిమ్మల్ని ఆపుతానంటూ కావ్య  అంటుంది. ఇద్దరు  ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకొక కీ నానమ్మ దగ్గర ఉంటుందని ఇందిరాదేవికి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. తను ఇంకో కీ ఎక్కడ ఉందో చెప్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి ఫోన్ ఎవరు అని ఇందిరాదేవిని అడుగుతుంటే.. అప్పుడే ఇందిరదేవిని కనకం వచ్చి తీసుకొని వెళ్తుంది. అత్తయ్య గారితో ఫోన్ మాట్లాడింది కళ్యాణ్ అనుకుంటా అని ధాన్యలక్ష్మి అనగానే.. అమ్మ ఫ్రెండ్స్ ఎవరో చేసి ఉంటారని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తాడు. ఆ తర్వాత అందరి కళ్ళు కప్పి వాళ్ళ పెళ్లి చెయ్యాలని రాజ్ అనుకొని.. అప్పు గదిలో ఉందనుకొని  మనసులో కళ్యాణ్ పెట్టుకుని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నవ్.. నీకు ఇదే అవకాశం దైర్యం చెయ్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని వెళ్తాను వస్తావా అని రాజ్ అనగానే.. లోపల ఉన్న కావ్య వస్తానని అప్పులాగా అంటుంది. దాంతో రాజ్ బయట కార్ తో రెడీ గా ఉంటాడు. కావ్య వచ్చి కార్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడే ప్రకాష్ వచ్చి ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు.  తరువాయి భాగంలో పెళ్లి జరిగే టైమ్ కి అప్పు కన్పించదు. ఇక్కడ అప్పు లేదు.. అక్కడ కళ్యాణ్ లేడు.. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లిపోయారని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అగ్గిపెట్టెలో పట్టుచీర...పల్లవికి సిరిసిల్ల గిఫ్ట్

జీ తెలుగులో ప్రసారం కాబోయే అత్తా కోడళ్ల బోనాల జాతర ప్రోమో చాలా అందంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో చాలా హైలైట్స్ ఉన్నాయి. అలాగే ఈ షోకి సిరిసిల్ల నుంచి కొంతమంది చేనేత మహిళా కార్మికులు వచ్చారు. వాళ్ళు ఈ షోకి స్పెషల్ గా రావడమే కాదు ఒక అద్భుతాన్ని కూడా చేసి తీసుకొచ్చారు. వాళ్లంతా పల్లవి ఫాన్స్. ఆమె కోసం సిరిసిల్ల నుంచి వాళ్ల ప్రేమను, అభిమానాన్ని మూటగట్టుకొచ్చారు. అది కూడా ఒక అగ్గిపెట్టెలో. ఏంటి అనుకుంటున్నారా. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఒక అద్భుతమైన పట్టు చీరను వాళ్ల స్వహస్తాలతో తయారు చేసి ఆ అగ్గిపెట్టెలో పెట్టి మరీ తీసుకొచ్చారు. దానికి పల్లవి ఫుల్ ఖుషీ ఐపోయింది. వాళ్ళను హగ్  చేసుకుంది పల్లవి. అంతే కాదు ఇంకో స్పెషల్ ఏమిటి అంటే ఆ చీర మీద పల్లవి చిత్రం కూడా కనిపిస్తుంది. ఇక తాను కట్టుకున్న పట్టుచీర చూపించి ఆ చీర తన నాన్న ఇచ్చారని చెప్తూ వీళ్లంతా ఇచ్చిన ఈ చీరను చూసి చాలా ఆనందంగా వాళ్లకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ చీర తనకెంతో ప్రత్యేకం అని కూడా చెప్పింది.  'పసుపు కుంకుమ' సీరియల్ హీరోయిన్  గా  బుల్లితెర ప్రేక్షకులకు పల్లవి అంటే చాలా ఇష్టం.   ఈ సీరియల్‌లో అంత బాగా నటించింది. ఆ తర్వాత 'సావిత్రి' సీరియల్‌తో వచ్చి తెలుగు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది.

అతనే నా బెస్ట్ బెస్ట్ బెస్టస్ట్ ఫ్రెండ్

బుల్లితెర మీద లాస్య మంజునాధ్ గురించి అలాగే యాంకర్స్ గా ఒకప్పుడు లాస్య-రవి చేసిన అల్లరి గురించి చెప్పక్కర్లేదు. అలాంటి లాస్యమంజునాధ్ కి ఇద్దరు మగపిల్లలు. ఇక ఆమె రెండు కొడుకు మున్నుకు అక్షరాభ్యాసం వేడుకను చేసింది. జీ తెలుగు వారి ఆధ్వర్యంలో బోనాల జాతర ఈవెంట్ లో ఈ అక్షరాభ్యాసం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర నటీనటులంతా వచ్చారు. అలాగే ఒకప్పటి లాస్య బెస్ట్ ఫ్రెండ్ రవి వచ్చాడు. ఇక మంజునాథ్ అక్షరాభ్యాసం చేయించాక యాంకర్ రవి వచ్చి మా మున్ను గాడికి అంటూ ఒక వెండి లాకెట్ తో ఉన్న ఒక చెయిన్ ని మెడలో వేసి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక లాస్య ఫుల్ ఎగ్జాయిట్ అయ్యింది. రవి థ్యాంక్యూ సో మచ్ అని చెప్పింది చాలా హార్ట్ ఫుల్ గా. రవి ఐతే లాస్య చూపించిన అభిమానానికి కన్నీళ్లు పెట్టుకుని మరీ తుడుచుకున్నాడు. ఇక లాస్య కోసం ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తెచ్చానని అని చూపించాడు. "నువ్వేమన్న తెచ్చినవా నా కోసం" అని రిటర్న్ గిఫ్ట్ అడిగాడు రవి. దానికి లాస్య అరచేయి చూపించి తన చేతిలో ఉన్న ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కి కూడా చూపించింది. రెండు బ్యాండ్స్ ఒకేలా ఉండడంతో "ఓ ఒక షాప్ లో కొన్నామా ఇద్దరం" అన్నాడు. దానికి లాస్య నవ్వేసింది. తర్వాత ఇద్దరూ ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకున్నారు "అతను నా బెస్ట్ బెస్ట్ బెస్టస్ట్ ఫ్రెండ్ " అని బలంగా చెప్పింది లాస్య. ఒకప్పుడు బుల్లితెర మీద ప్రసారమైన  సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాంతో ఈ ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఆ స్నేహం ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది.  

టీఆర్పీలో మళ్ళీ ఆ సీరియలే నెంబర్ వన్.. కార్తీకదీపం-2 కి క్రేజ్ తగ్గిందా!

కార్తీక దీపం క్రేజ్ తగ్గిందా అంటే అవుననే అంటున్నాయి టీఆర్పీ రిజల్ట్స్. ఈ సీరియల్ వస్తుందంటే పనులన్నీ ఆపుకొని మరీ చూసేవారు. కానీ ఇప్పుడు క్రేజంతా బ్రహ్మముడి సీరియల్ కి వచ్చేసింది. ప్రస్తుతం స్టార్ మా టీవీలో వచ్చే సీరియల్స్ టీఆర్పీ పరంగా దూసుకెళ్తున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం. కొత్తగా మొదలైన సీరియల్స్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ దూసుకెళ్తుండగా.. పాత సీరియల్ నుండి నవ వసంతంగా వచ్చిన కార్తీకదీపం-2 ఎక్కువగా టీఆర్పీ తెచ్చుకోలేకపోతుంది. ఎందుకంటే దీపకి ఆల్రెడీ నరసింహాతో పెళ్ళి జరిగి శౌర్య అనే పాప కూడా ఉండటం.. కార్తిక్ కి జ్యోత్స్న అనే మరదలు ఉండటంతో.. డాక్టర్ బాబు, వంటలక్కల బాండింగ్ లేదా అనే డైలమాలో ఉన్నారు. దీనికి తోడు పారిజాతం చిన్నతనం చేస్తున్న కుట్రలు ఎవరికీ తెలియకపోవడం కథని బలహీనపరిచాయి. దాంతో‌ తెలుగింటి మహిళలు ఈ సీరియల్ ని ఎక్కువగా చూడట్లేదు. అందుకేనేమో కొత్తగా వచ్చిన సీరియల్ ఇంటింటి రామాయణానికి  టీఆర్పీ బాగుంటుంది. బ్రహ్మముడి సీరియల్ కి అత్యధిక టీఆర్పీ 12.82 తో మొట్టమొదటి స్థానంలో ఉండగా.. కార్తీకదీపం-2 10.96 తో రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో గుండె నిండా గుడిగంటలు 10.65 , నాల్గవ స్థానంలో ఇంటింటి రామాయాణం 9.17 ఉండగా కొత్తగా మొదలైన చిన్ని సీరియల్ 8.52 తో  అయిదవ స్థానంలో ఉంది. ఈ సీరియల్ ప్రారంభమై నెల కూడా కాకముందే ఇది టాప్-5 లో చోటు దక్కించుకుంది. ఇక టాప్- 10 లో గుప్పెడంత మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్స్ ఉన్నాయి.

కమోడ్ స్టైల్ డ్రెస్ తో కామెడీ రీల్

గుప్పెడంత మనసు సీరియల్ బిగ్ హీరో మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ గురించి అందరికీ తెలుసు. రిషి తండ్రిగా మహేంద్ర పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు. అలాంటి సాయి కిరణ్ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. చేసే రీల్స్, వీడియోస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలాంటి ఒక రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అది మాత్రం చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది. కమోడ్ స్టైల్ డ్రెస్ తో ఒక నటిని ఇమిటేట్ చేసి చూపించాడు. ఇక ఆ వీడియో చూస్తే మాములుగా ఉండదు. ఒక హీరోయిన్ ఒక ఫంక్షన్ లో సోఫాలో కమోడ్ టైపు డ్రెస్ వేసుకొచ్చి ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళను పలకరిస్తూ కనిపించింది. ఆ వీడియోలో ఆ బిట్ వరకు కట్ చేసి ఇమిటేట్ చేసి చూపించాడు. "దీదీ కమోడ్ స్టైల్ ఫాషన్ డ్రెస్ వేసింది" అంటూ కమోడ్ ఇమేజిని కూడా పెట్టాడు. ఇక నెటిజన్స్ ఐతే నవ్వుకోలేక ఛస్తున్నారు. "మీ రీల్స్ వేరే లెవెల్ లో ఉంటాయి సర్. సర్..ఏంటి సర్ ఇది...నవ్వు ఆపుకోలేకపోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ..మీలో కనిపించని కామెడీ కోణం ఉంది. అయ్యా మీరు ట్రెండ్ సెట్ చేశారు. ఇకనైనా ప్యాంట్ వేసుకోండి...మీ నుంచి ఇలాంటి కామెడీ రీల్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

రోజా పై ఆది హాట్ కామెంట్స్....

  హైపర్ ఆది ఒక చిట్ చాట్ లో రోజు గురించి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత రోజా గారి మీద మీ అభిప్రాయం ఏమిటి అనేసరికి రోజా గారికి పాలిటిక్స్ ఒక వ్యక్తి అంటే ఇష్టం. తనకు ఒక వ్యక్తి అంటే ఇష్టం అన్నారు. కానీ జబర్దస్త్ జడ్జ్ గా తనకు రోజా అంటే చాలా గౌరవం ఉందని చెప్పాడు ఆది. ఎందుకంటే తనకు కానీ తన లాంటి ఎంతో మంది కమెడియన్స్ కి పేరు వచ్చింది అంటే అది వాళ్ళ వల్లే అని చెప్పాడు ఆది. అలాగే లీడర్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని గ్యాంగ్ లీడర్ గా చిరు అంటే ఇష్టం అని చెప్పాడు. ఇక పెళ్లి విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియాలో చాలామంది తనకు పెళ్లిళ్లు చేసేశారని చెప్పాడు. రియల్ లైఫ్ పెళ్లి ఎప్పుడు అంటే దానికి చాల టైం ఉందన్నాడు. పెళ్లి అయ్యింది అనే దానికన్నా పెళ్లి ఎప్పుడు అనేదే బాగుంటుంది. అదే కంటిన్యూ చేద్దాం అని చెప్పాడు. ఐతే దర్శి నుంచి ఎంఎల్ఏగా పోటీ చేస్తారు అని అన్నారు కానీ అది ఎందుకు జరగలేదు అని అడిగేసరికి..ఇదంతా సోషల్ మీడియాలో తన మీద అభిమానం వల్ల చేసిందే కానీ అలాంటిది ఏమీ లేదన్నాడు.  అలాగే వ్యూయర్ షిప్ కోసం థంబ్ నెయిల్స్ చేశారు తప్పా ఈ పోటీలు ఏమీ లేవు..కేవలం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసినట్లు చెప్పాడు ఆది.

Bigg Boss Telugu 8 : మరో ముప్పై రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8!

  బుల్లితెర టీవీ షోలలో బిగ్ బాస్ షోకి ప్రధానమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తాజాగా బిబి టీమ్ టీజర్ ని రిలీజ్ చేసి ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచేశారు. అయితే ఇందులోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పుడు మొదలవుతుందనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. గత సీజన్ సెవెన్ లో  రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇక ఈ సీజన్ సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని, సెట్ వర్క్ కూడా ఇప్పటికే సగం వరకు పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. మరి కంటెస్టెంట్స్ ఎవరూ అంటే.. కిర్రాక్ ఆర్పీ, ఫార్మర్ నేత్ర, అనిల్ జీలా, వేణు స్వామి, రీతు‌ చౌదరి, కుమారీ ఆంటీ, ఇంకా కొందరు డ్యాన్సర్స్ పేర్లు వినిపిస్తున్నాయి‌. అయితే ఇప్పటికే చాలామందివి ఇంటర్వ్యూలు తీసుకునట్టు తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్ లో ఉన్నవాళ్ళు ఎవరు హౌస్ లోకి వెళ్తారనేది బిగ్ బాస్ మొదలయ్యే వరకు తెలియదు. చివరి క్షణం వరకూ  ఏదైనా జరగొచ్చు. అయితే తాజాగా విడుదల చేసిన టీజర్ లో నాగార్జున మాట్లాడుతూ.. జాగ్రత్తగా కోరుకో.. ఎందుకంటే ఏదైనా అన్ లిమిటెడ్ అంటూ అన్నాడు. అంటే ఈ సారి హౌస్ లో టాస్క్ లు ఫన్ ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ అన్నీ సీజన్లలో భారీ టీఆర్పీ సాధించిన వాటిల్లో సీజన్-5,  6, 7.. మరి ఈ సీజన్ హిట్టా, ఫట్టా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే సెప్టెంబరు మొదటి వారంలో మాత్రం బిగ్ బాస్ ప్రారంభం అవుతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.  

Inaya Sultana: బిగ్ బాస్ షో వల్ల మూవీస్ ఆగిపోయాయి : ఇనయా సుల్తానా

  బిగ్ బాస్ సీజన్ సిక్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవంత్, శ్రీహాన్ లతో పోటీపడి ఆడిన ఇనయా సుల్తానాకి బయట ఫ్యాన్ బేస్ పెరిగింది.  ఇక బయటకొచ్చాక గోవా టూర్లు, విదేశీ టూర్ల పేరుతో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ వైరల్ గా నిలిస్తోంది. తరచూ అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా జిమ్ ట్రైనర్ గౌతమ్ తో డేటింగ్ లో ఉన్న ఇనయా.. విచ్చలవిడిగా తిరిగేస్తూ నెట్టింట వైరల్ గా మారారు. ఇనయా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తనకి ఫ్యాన్ బేస్ పెరిగింది. బయటకొచ్చాక రకరకాల వ్లాగ్స్ తో  మరింతగా ఫాలోయింగ్ ని పెంచుకుంది. తాజాగా ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను బిగ్ బాస్ కి వెళ్ళడం వల్లే సినిమా అవకాశాలు కోల్పోయినట్టు ఇందులో చెప్పుకొచ్చింది. అంతకముందు తనకి సినిమా ఆఫర్లు వచ్చాయంట, ఇప్పుడు అవేమీ రావడం లేదని ఇందులో చెప్పింది. అయితే తను మాట్లాడిన ఈ మాటలకి నెటిజన్లు మండిపడూతూ కామెంట్లు పెడుతున్నారు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళకుంటే ఇప్పుడు వస్తున్న ఈ అవకాశాలు కూడా రావని, అనవసరంగా నిన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్ళి సెలెబ్రిటీనీ చేశారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా థియేటర్లలో రిలీజైన 'శివం భజే' మూవీలో తను నటించింది. ఇక స్క్రీన్ మీద తన పేరుని చూసుకొని సంతోషిస్తున్నట్టు ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇనయా సుల్తానాకి ఇన్ స్టాగ్రామ్ లో  332K ఫాలోవర్స్ ఉన్నారు.  

Brahmamudi : కోరుకున్నవాడితో లేచిపోమని అక్క సలహా...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -478 లో... రుద్రాణి చెప్పింది విని కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి. నువ్వు ఇలా ఉంటే ఎలా? అమ్మమ్మ వాళ్ళింటికి కొన్ని రోజులు వెళ్ళు అని ధాన్యలక్ష్మి చెప్తుంది. నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? ఆ అనామిక మాటలు పట్టుకొని నువ్వు నన్ను బాధపెట్టావని కళ్యాణ్ అనగానే.. ఇప్పుడు తప్పు తెలుసుకొని నీ గురించి చెప్తున్నాను.. బెంగళూరు వెళ్ళమని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళమంటున్నావో తెలుసు.. నువ్వు అనుకున్నది జరగదు.. నేను పెళ్లికి రాను అంటూ కళ్యాణ్ కోపంగా వెళ్లిపోతాడు.. ఇది కూడ బెటరే అని అదంతా వింటున్న రుద్రాణి అనుకుంటుంది. మరొక వైపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. కూతురు పెళ్లికి కనకం హడావిడి అంత ఇంత కాదు.. అది తెచ్చావా ఇది తెచ్చావా అంటు కృష్ణమూర్తిని అడుగుతుంది. అప్పుడే కావ్య వస్తుంది. ఆ తర్వాత అప్పుని స్వప్న రెడీ చేస్తుంటే.. కనకం వచ్చి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావ్.. అయినా పెళ్లిజడ వెయ్యలేదని కనకం అడుగుతుంది. నాకు ఇష్టం లేదు.. అయినా వాళ్ళు పెళ్లి చూపులప్పుడు అలా ఉన్నా ఒకే అన్నారు కదా అని అప్పు అంటుంది. అప్పుడు మనం ఉన్నాం.. ఇప్పుడు చాలా మంది వచ్చారని కనకం అంటుంది. అయిన అప్పు వినదు. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో వాళ్లందరూ పెళ్లికి రెడీ అవుతారు. రుద్రాణి మాత్రం ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి.. వచ్చేటప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని అంటుంది. కావ్య పెళ్లి ఎలా జరిగిందో మర్చిపోయావా అని అంటుంది. ఇప్పుడు కళ్యాణ్ పెళ్లి కి రావడం లేదని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఎవరిని ఏం అనొద్దంటూ రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. అందరు వెళ్ళిపోతారు.. కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి.. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్.. ఇక నీ ఇష్టమని చెప్తాడు. మరొక వైపు దుగ్గిరాల కుటుంబం పెళ్లి దగ్గరికి రాగానే అందరు ఎదురుగా వెళ్లి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత కనకం కుటుంబాన్ని రుద్రాణి తక్కువ చేసి మాట్లాడుతుంటే.. స్వప్న గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య కూడా రుద్రాణికి మాటలతో మర్యాదగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత  కళ్యాణ్ ఫొటోస్ అప్పు డిలీట్ చేస్తుంటే.. స్వప్న వచ్చి నువ్వు ఇంకా కళ్యాణ్ ప్రేమిస్తున్నావా? ఇక్కడ వరకు ఎందుకు తెచ్చుకున్నావ్? ఎవరి గురించి ఆలోచించకు.. దైర్యం చేసి నాలాగా లేచిపో లేదంటే.. పెళ్లి ఆపమని స్వప్న చెప్తుంది. తరువాయి భాగంలో రెండు కుటుంబాల గురించి అలోచించి అప్పుని దూరం చేసుకుంటున్నాను వెంటనే పెళ్లి ఆపాలని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి ఆపుతానని రాజ్.. నేను మిమ్మల్ని ఆపుతానంటూ కావ్య ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శౌర్య కోసం లాయర్ ని కలవనున్న కార్తీక్.. నరసింహా ప్లాన్ ఏంటంటే! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika deepam 2 ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -113 లో.... నర్సింహా నోటీసులు విషయం సుమిత్ర దశరత్ లకి చెప్తుంది దీప. నా కూతురు నా నుండి దూరం కాకుండా చూడండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుగుతుంది దీప. మేమ్ చూసుకుంటామని వాళ్ళు అనగానే.. దీప బయటకు వచ్చి కార్తీక్ కి చెప్పాలనుకుంటుంది. మరొకవైపు ఇన్ని రోజులు ఎప్పుడు సాయం చేస్తామన్నా కూడా వద్దని అనేది.. ఇప్పుడు సాయం చేసే అవకాశం వచ్చిందని దశరత్ తో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి దీప ఫోన్ చేసుంటే.. కార్తీక్ ఇంటికి వస్తాడు. వెంటనే నోటీసులు వెళ్లి చూపిస్తుంది. సుమిత్ర వాళ్లు కూడా కార్తీక్ దగ్గరికి వస్తారు. ఈ విషయం శౌర్యకి చెప్పొద్దని కార్తీక్ అనగానే.. ఎందుకు ఏమైందని దీప అడుగుతుంది. అంటే ఇప్పటికే శౌర్య ఆరోగ్యం బాలేదు కదా అందుకే అంటున్నానని కార్తీక్ అంటాడు . మీరేం కంగారుపడకండి దీప.. నాకు తెలిసిన లాయర్ ఉంది.. నేను మాట్లాడుతానని కార్తీక్ అనగానే.. ఇప్పుడు దీపని తీసుకొని వెళ్ళమని సుమిత్ర అంటుంది. శౌర్యని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమని దీపకి సుమిత్ర చెప్తుంది. మరొకవైపు మనం దీప దగ్గరికి వెళ్లి.. నువ్వు ఇక్కడ ఉంటే నా కొడుకు జీవితం మేమ్ కోరుకున్నట్లు ఉండేలా లేదు వెళ్లిపోమందామని శ్రీధర్ అనగానే.. వద్దని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ లు వెళ్తుంటే మధ్యలో నర్సింహా అప్పులు చేసిన వాళ్ళు ఎదరు పడి అడుగుతుంటారు.  నీ భర్తని తీసుకొని వస్తానంటూ వచ్చి రాలేదు.. మా అప్పులు అంటూ గొడవచేస్తారు. నర్సింహా అడ్రెస్ చెప్తాను అక్కడికి వెళ్ళండి అని దీప అంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటావా అంటూ వాళ్ళు దీప పైన కోప్పడతారు. అప్పుడే కార్తీక్ కార్ దిగి వస్తాడు. అదంతా నరసింహా దూరం నుండి చూస్తూ.. ఇదంతా నా సెటప్పేరా అని అనుకుంటాడు. అందరు దీపని తిడుతుంటే.. మీకు ఎంతివ్వాలి.. అలా తిడతారా అంటూ వాళ్ళ అప్పులు అన్ని కార్తీక్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇదంతా ఆ నర్సింహా ప్లాన్ అయి ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకెలా తెలుసని కార్తీక్ అంటాడు. దీప పడిపోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. అదంతా నర్సింహా వీడియో తీస్తుంటాడు. ఆ తర్వాత ఇప్పుడేం వస్తావ్.. నువ్వు ఇంటికి వెళ్ళు నేను లాయర్ తో మాట్లాడతానని కార్తీక్ అంటాడు. మరొకవైపు శౌర్య నాన్నతో ఉన్నట్లు గీసిన బొమ్మలలో ఉన్న నాన్న బొమ్మని చింపేస్తుంది. అప్పుడే శౌర్యకి పాలు తీసుకొని వస్తుంది దీప. అక్కడ చింపేసిన ముక్క చూస్తుంది. అమ్మ ఆ బూచోడు మనకి వద్దని శౌర్య అంటుంది. ఆ తర్వాత  రేపు బయట నాకు పని ఉంది రావడానికి లేట్ అవుతుంది. అమ్మమ్మ దగ్గర ఉండమని దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.