వీడియో చూడండి...చెప్పి మోసం చేసాను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -173 లో.... సీతాకాంత్ దగ్గరకి రామలక్ష్మి వస్తుంది. ఇంకా నిద్రపోతున్నారా అని తన దగ్గర వరకు వెళ్లి పక్కన కూర్చుంటుంది. ప్రేమగా నా మనసుని దొంగిలించి దొరలా నిద్రపోతున్నావా.. అభిమానం ఉందని మాత్రమే చెప్తున్నారు.. ప్రేమ ఉందని చెప్పట్లేదు బాగా అలసిపోయినట్లున్నారు పడుకోండి అని సీతాకాంత్ ని చూస్తూ రామలక్ష్మి అని వెళ్లిపోతుంటే.. తన చీర కొంగుపట్టుకొని సీతాకాంత్ లాగినట్లు అనిపిస్తుంది. వెంటనే మళ్ళీ వెనకాలకి వచ్చి సీతాకాంత్ మొహంలో మొహం పెడుతుంది. అప్పుడే సీతాకాంత్ నిద్ర లేచి నాతో ఏదైనా చెప్పాలా అని అంటాడు. గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చానని కవర్ చేస్తుంది.. అలా చెప్పకపోతే మీ కోసం వచ్చానని చెప్పొచ్చు కదా అని సీతాకాంత్ అనుకుంటాడు నన్ను అడగకపోతే మీ ప్రేమ విషయం మీరే చెప్పొచ్చు కదా అని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు సేవ్ చేసిన అమ్మాయి నందిని.. తన దగ్గరకి ఒకతను వచ్చి సారీ మేడమ్ కంపెనీ మీకు ఇస్తాను అని చెప్పి మోసం చేసాను.. మీకు ఎదరుతిరిగి భయపడుతున్నా అని అతను రిక్వెస్ట్ చేస్తుంటే.. నాకు నమ్మకద్రోహం చేస్తే నేను వదలనని నందిని అంటుంది. ఆ తర్వాత మనం ఇండియాకి వచ్చి బుద్ది చెప్పాలి అనుకున్నది ఈ చోప్రాకీ.. ఇక మన నెక్స్ట్ బిజినెస్ ఏంటి మేడమ్ అంటూ నందిని పిఏ నందినితో అంటుంది. ఆ తర్వాత బోర్డు మెంబర్ ని సందీప్ ఇంటికి పిలుస్తాడు. నేనే చైర్మన్ కావాలి సపోర్ట్ చెయ్యాలనగానే.. లేదు మీ అన్నయ్య నిర్దోషి అని ఋజువు అయింది కదా అని అతను అంటాడు.. అప్పుడే శ్రీలత వచ్చి మచ్చ అయితే పడింది కదా.. మీరు సందీప్ కీ సపోర్ట్ చేస్తే మీ వాటా మీకు అందుతుందని శ్రీలత అంటుంది దాంతో బోర్డు మెంబర్ సరే అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కీ బయలుదేర్తాడు. షేర్ మార్కెట్ లో షేర్స్ అన్ని పడిపోయాయంట బోర్డు మెంబెర్ మీటింగ్ అరెంజ్ చేశారు వెళ్తున్నామని సీతాకాంత్ అంటాడు. నేను వస్తానని రామలక్ష్మి అనగా.. వద్దని సీతాకాంత్ వెళ్తాడు. మీటింగ్ జరుగుతుంది. అందులో అందరూ సందీప్ గారు చైర్మన్ ఉంటేనే బాగుంటుందని చెప్తారు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అవసరం లేదు పక్క వాళ్లు పెట్టె ప్రలోభాలకి తీసుకొని నిర్ణయం తప్పు అవుతుందని రామలక్ష్మి అనగానే.. కంపెనీని పైకి తీసుకొని వచ్చే నిర్ణయం తప్పు ఎలా అవుతుందని బోర్డు మెంబర్ అంటాడు. అయితే ఒక వీడియో చూడండి అని రామలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో నన్ను కాదని కంపెనీ కాపాడుదామని చూస్తున్నావా అని శ్రీలత అనగానే.. నేను కంపెనీని మా అయనని కాపాడుతానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇంత సడెన్ గా నిర్ణయం ఎలా తీసుకుంటారు.. దీని వెనకాల ఎవరో ఉన్నారని సీతాకాంత్ అనగానే.. ఉన్నారు మీ అమ్మ అని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : ఎండీ పదవి నుండి తప్పుకున్న వసుధార...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1151 లో....మహేంద్ర, వసుధారలు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటారు. వసుధార కాలేజీ నుండి వెళ్ళిపోయాక ఏం జరిగిందో మహేంద్ర చెప్తాడు.  కాలేజీనీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పాక చాలా బాధేసింది కానీ రిషి మళ్ళీ తిరిగి వచ్చి కాలేజీని కాపాడాడని వసుధారతో మహేంద్ర అంటాడు. మావయ్య ఇక నేను ఎండీగా ఉండలేనని వసుధార అంటుంది. అప్పుడే రిషి వచ్చి అలా ఎందుకు అంటున్నావని అంటాడు. నేను ఆల్రెడీ రాజీనామా చేసాను.. ఆ సీటులోకి నేను రాలేనని చెప్పి వసుధార వెళ్తుంది. తన వెనకాలే రిషి వెళ్లి.. నీ నిర్ణయం మారదా నీ రిషి సర్ చెప్పినా కూడ వినవా అని రిషి అనగానే.. సారీ సర్ నా భయాలు నాకు ఉంటాయని వసుధార అనగానే.. పొగరుకి భయమా? నీకు ఎంత దైర్యం ఉంటుందని వసుధార గురించి రిషి గొప్పగా మాట్లాడుతుంటాడు. శత్రువులకి భయపడుతున్నావా అని రిషి అడుగుతాడు. శత్రువులకి భయపడే క్యారెక్టర్ కాదు సర్.. మీకోసమే వద్దని అంటున్నాను.. మీరు మళ్ళీ నన్ను ఎండీని చేసి వెళ్ళిపోతారని భయమేస్తుందని వసుధార అంటుంది. అదేం లేదు ఎప్పుడు నీతోనే ఉంటానని రిషి అంటాడు.‌ నాకు ఒక మాట ఇవ్వండి.. దానికి కట్టుబడి ఉండాలని రిషి దగ్గర వసుధార మాట తీసుకుంటుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని రిషి అంటాడు. ఏంటని రిషి అడుగగా.. టైమ్ వచ్చినప్పుడు చెప్తానని వసుధార అంటుంది. మరొకవైపు రంగా దగ్గరకి సరోజ రావడానికి ధనరాజ్ కి కాల్ చేస్తుంది. నువ్వు నా గురించి తెలుసుకున్నావ్.. నీ గురించి కూడా తెలుసుకోవాలి కదా.. అందుకే సిటీకీ వస్తానని  సరోజఅనగానే ధనరాజ్ సరే అంటాడు. ఆ తర్వాత రిషికి శైలేంద్ర ఫోన్ చేసి.. మీటింగ్ అరెంజ్ చేస్తాను.. అందులో నా పేరు చెప్పమని చెప్తాడు.. అర్హత ఉన్న వాళ్ళ పేరు చెప్తానని రిషి అనగానే.. వసుధార వచ్చింది అని అలా మాట్లాడుతన్నావా.. సరే అంటూ శైలేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మరొకవైపు మహేంద్ర దగ్గరకి అనుపమ వస్తుంది. రిషిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి అనుపమ గురించి జగతి గురించి మాట్లాడతాడు. మావయ్యకి ఇద్దరు కొడుకులు అని మావయ్యకి తెలిసే టైమ్ దగ్గరలోనే ఉందని అనుపమకి వసుధార చెవిలో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కోడలు చేసిన పనికి అత్త షాక్...రూమ్ నుండి వెళ్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -486 లో... కావ్యపై రాజ్ కోపంతో.‌. నువ్వు చేసిన వంట తిననని అంటాడు. దాంతో రాత్రి ఆకలి వెయ్యడంతో రాజ్ కిచెన్ లోకి వచ్చి.. ఏదైనా ఉందేమో అని చూస్తాడు. పాలు ఉండటంతో రాజ్ వేడి చేసుకుంటుండగా అతనికి చేయి కాలుతుంది. అప్పుడే కావ్య వస్తుంది. మీరు నేను చేసిన వంట తినను అన్నారని, వంట శాంతని చెయ్యమని చెప్పానని కావ్య అనగానే.. అవునా అంటూ వెళ్లి భోజనం పెట్టుకుని తింటుంటాడు. అప్పుడే అపర్ణ వస్తుంది. రాజ్ భోజనం చెయ్యడం చూసి కావ్య చేతి వంట తిననని వెళ్లిపోయావ్ కదా అని అపర్ణ అనగానే.. ఇది కావ్య చెయ్యలేదు, పనిమనిషి శాంత చేసిందని చెప్తాడు. ఆ తర్వాత రాజ్ భోజనం చేసి వెళ్ళిపోయాక.. థాంక్స్ రాజ్ తినకుండా ఎలా పడుకుంటాడని అనుకున్న అబద్ధం చెప్పి అయిన తినేల చేసావని కావ్యతో అపర్ణ అంటుంది. మీరు ఒకసారి భోజనం చెయ్యను అన్నప్పుడు.. నేను అలాగే పనిమనిషి శాంత చేసిందని చెప్పి మావయ్య గారితో పంపించానని కావ్య అనగానే.. గడుసు కోడలు అంటూ కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజ్ పడుకొని కూడా  కళ్యాణ్ ని కావ్య ఇంటికి రమ్మని పిలువలేదని కోపంగా ఉంటాడు. కాసేపు ఇద్దరికి గొడవ జరుగుతుంది. నువ్వు రమ్మని చెప్పకుంటే ఏంటి.. నేను రమ్మని చెప్తానంటూ  కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారని రాజ్ అడిగితే.. కళ్యాణ్ చెప్పడు. ఆ తర్వాత ఇంటికి రమ్మని అడుగుతాడు. లేదు అన్నయ్య రాలేమని కళ్యాణ్ కచ్చితంగా చెప్పడంతో రాజ్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ రూమ్ బయట చూడగానే.. అప్పు ఫ్రెండ్స్ అందరు బయట పడుకొని ఉంటారు. చూసావా అప్పు వాళ్లు మనకి ప్రైవసీ ఇవ్వడానికి ఎలా బయట పడుకున్నారో.. ఇక మనం వాళ్ళని ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టవద్దని కళ్యాణ్ అంటాడు. మరి ఎక్కడికి వెళదామని అప్పు అడుగుతుంది. ఎక్కడికైనా వెళదామని కళ్యాణ్ అంటాడు. సరే నేను ఎక్కడైనా ఉంటాను కానీ నీ గురించి ఆలోచిస్తున్నానని అప్పు అంటుంది. ఉదయం తన ఫ్రెండ్స్ తో అప్పు ఇక మేమ్ వెళ్ళిపోతామని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గుప్పెడంత మనసు కి శుభం కార్డు...

  బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా సీరియల్స్ కి క్రేజ్ ఎక్కువ. అందులోను గుప్పెడంత మనసు‌ సీరియల్ కి ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది.  అయితే ఇప్పుడు ఈ సీరియల్ ముగిస్తుందంటు వచ్చిన కొన్ని పోస్ట్ లు చూసి ఈ సీరియల్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. నాలుగేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ కథ ముగిసిపోయింది. 2020 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ సీరియల్.. ఇప్పటి వరకూ 1150 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. రిషిగా ముఖేష్ గౌడ, వసుధారగా రక్షా గౌడ నటించింది. బుల్లితెర క్రియేటివ్ దర్శకుడు కుమార్ పంతం దర్శకత్వం వహించారు. ఈయనే.. బ్రహ్మముడి సీరియల్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. రిషి రీ ఎంట్రీ ఇచ్చింది మొన్నమొన్ననే.. వసుధారలు రిషిలు కలుసుకుని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈ కథ గాడిన పడింది. పూర్వ వైభవాన్ని అందుకుంది. రిషి, వసుధారలను జంటగా చూస్తుంటే కడుపునిండిపోతుంది. సీరియల్ అదిరిపోతుంది, చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. ఇలాంటి టైమ్ లో గుప్పెడంత మనసు( Guppedantha Manasu) ని క్లోజ్ చేయడమేంటి అంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఈ సీరియల్ ని ఎలా ముగిస్తారంటే.. రంగా ఎవరు అనేది పెద్ద క్వచ్ఛన్ మార్క్ కాబట్టి రిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడింది రంగానే.. రంగా కూడా రిషి పోలికలతోనే ఉండటం.. రిషిని కాపాడే ప్రయత్నంలో రంగా కోమాలోకి వెళ్లిపోవడం.. సరిగ్గా క్లైమాక్స్ నాటికి రంగా కోమాలో నుంచి బయటకు రావడం. రిషి వేరు రంగా వేరు.. ఇద్దరు డ్యుయెల్ రోల్ అని చెప్పి, రంగాకి ఆ సరోజతో ముడిపెట్టేస్తే సరే.. అలాగే శైలేంద్ర, దేవయానిల కుట్రలన్నీ రిషి బయటపెట్టేస్తే ఇక ఫ్యాన్స్ కూడా హ్యాపీ.. మరి దర్శకుడు ఎలా ముగిస్తాడనేది క్లారిటీ లేదు. చివరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జాను లైఫ్ స్టోరీ చూసి ...శేఖర్ మాస్టర్  ఎమోషనల్ 

  బుల్లితెరపై సినిమాలు, సీరియల్స్‌తో పాటు కొన్ని షోలు కూడా అలరిస్తున్నాయి. వాటిల్లో క్యాష్, బిగ్ బాస్, లతో పాటు ఢీ డ్యాన్స్ షో ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు కొరియోగ్రాఫర్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే కంటెస్టెంట్లుగా వచ్చి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో టీవీ ప్రేక్షకులను పలకరిస్తోంది. సీజన్ మారినప్పుడల్లా కొత్త వారిని పరిచయం చేస్తూ కొత్తగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకొస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. దీనికి నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక కంటెస్టెంట్లులకు టీమ్ లీడర్లుగా ఆది, శ్రీసత్య వ్యవహరిస్తున్నారు. జడ్జులుగా నటి హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ షోకు ఫిదా అయిపోయాడు శేఖర్ మాస్టర్. ఆమె జాను లైరి. తను ఆడితే అలానే చూడాలనిపచిందని శేఖర్ మాస్టర్ చెప్పగా తోటి డ్యాన్సర్స్ సైతం జాను లైరి డ్యాన్స్ కి ఫిధా అయ్యారు.  ఢీ సెలబ్రిటీ స్పెషల్-2లో ‘సెనిగ చేలా నిలబడి చేతులియ్యావే’ అంటూ సాగిపోయే ఫోక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసింది జాను. స్వతహాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ ఫోక్ డ్యాన్సర్ అయిన జాను.. ఈ పాటకు ఇచ్చి పడేసింది. గతంలో కూడా యూట్యూబ్ వేదికగా ఈ పాటకు కాలు కదిపిన ఈ నెమలి.. ఇప్పుడు ఢీ షోలో కూడా తన పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇక తాజాగా  రిలీజ్ చేసిన ప్రోమోలో తను డ్యాన్స్ చేస్తూ ఎమోషనల్ అయింది. తను నడుచుకుంటు వెళ్తుంటే కామెంట్లు చేసేవారని,  అవకాశాల కోసం ఎన్నో దాటుకొని వచ్చినట్టు చెప్పింది. కొన్నిసార్లు అవమానాలు తట్టుకోలేక చనిపోవాలనుకుంటే తన కొడుకు గుర్తొచ్చాడంటు ఏడ్చేసింది. ఇక తనని చూసి జడ్జ్ హన్సిక కూడా ఏడ్చేసింది.‌ ఢీ షోలని వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మీరు ఓ లుక్కేయండి.

అనుభవాలని చెప్తూ... నదిలో‌ కొట్టుకుపోయేవాళ్ళం!

  అంజలి అత్తోట.. ఈ పేరు ఎవరికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అంజలి పవన్ అందరికి సుపరిచితమే. కారణం యాక్టర్ పవన్ ని పెళ్ళి చేసుకొని ఫేమస్ అయింది. టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు యాక్టర్ గా మరొకవైపు యాంకర్ గా కెరీర్‌ ని స్టార్ట్ చేసింది అంజలి పవన్. మొగలిరేకులు సీరియలో నటించిన అంజలి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తనకి బోలెడు సినిమాల్లో, టెలివిజన్ రంగంలో ఆఫర్లు వచ్చాయి. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలి హైదరాబాద్ లో జన్మించింది. తన వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను ఎంతో  ఉన్నంతంగా ఉంటుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లని చూస్తుంటేనే తెలుస్తుంది. అయితే జనవరి 24, 2015  న సినిమా రంగంలో పనిచేస్తున్న సంతోష్ పవన్ ని పెళ్ళిచేసుకుంది అంజలి. అప్పటినుండి తన పేరును అంజలి పవన్ గా మార్చుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అంజలి పవన్. అంజలి తన భర్త పవన్ తో కలిసి 'నీతోనే డ్యాన్స్ షో' లో పర్ఫామెన్స్ చేసింది. వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు రాధ, తరుణ్ మాస్టర్, సదా అంతా ఫిధా అయ్యారు‌. ఈ వయసులో ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం చాలా కష్టమంటూ రాధ కూడా తనని పొగిడారు. అంజలి పవన్ వాళ్ళ పాప పేరు 'ఆద్య'.. ముద్దుపేరు చందమామ. అంజలి పవన్ ఫ్యామిలీతో కలిసి తాజాగా ఓ ట్రిప్ కి వెళ్ళారు. అక్కడ అమ్మవారి దర్శనం పూర్తయ్యాక ఓ నదిని దాటి వెళ్లాల్సి వచ్చింది. అయితే అది ప్రమాదకరం . అదే సమయంలో వర్షం స్టార్ట్ అయింది. ఇక నదిలోని నీరు ఎక్కువ అయింది. ఇక అదే ట్రిప్ కి వచ్చిన కొంతమంది సాయంతో చాలా కష్టపడి బయటకు వచ్చారు. లేదంటే ఆ నదిలో అంజలి, తన కూతురు చందమామ కొట్టుకుపోయేవారు. ఇక ఈ ట్రిప్ అనుభవాలని చెప్తూ అంజలి పవన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ ని అప్లోడ్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోని మీరు ఓ సారి చూసేయ్యండి.

Bigg Boss Telugu 8 Promo : ఎంటర్‌టైన్మెంట్, ఫన్, ట్విస్టులకి లిమిటే లేదు!

  టీవీ ప్రేక్షకులని అలరించడానికి సెప్టెంబరు మొదటి వారంలో రాబోతున్న బిగ్ బాస్ నుండి సెకెండ్ ప్రోమో వచ్చేసింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన బిగ్‌బాస్ టీజర్‌కి కొనసాగింపుగానే లేటెస్ట్ ప్రోమో ఉంది. కమెడియన్ సత్య దొంగ పాత్రలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే అద్భుత దీపం నుంచి వచ్చినప్పుడు.. కింగ్ నాగార్జున ఏం కావాలో కోరుకో అంటూ వరాలిస్తాడు. దీంతో నాకు అన్నీ అన్‌ లిమిటెడ్‌గా కావాలంటూ సత్య అడగ్గానే ఒక్క చిటికె వేస్తారు నాగార్జున.  చిన్న బ్రేక్ చిటికెలో వచ్చేస్తా అన్నట్లుగా కళ్లు మూసి తెరిచేలోపు బిగ్‌బాస్ హౌస్ మొత్తం అప్సరసలతో నిండిపోతుంది. ఇక వారితో నాగార్జున డ్యాన్స్ మొత్తం చాలా గ్రాండ్‌ గా ఉంది. ఇక దీనికి ఓ సపరేట్ సాంగ్ కూడా ప్లే చేశారు. ఇది గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్‌లా ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి లేనిది ఒకే ఒక్కటి అదే 'లిమిట్ ' అంటూ ఈ సీజన్ కాన్సెప్ట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ఇక ఈ ప్రోమోలో .. రోజూ ఇంట్లో గలాటలే, టోటల్ షో ధమాకాలే అంటు వచ్చే పాటలోని లిరిక్స్ బాగున్నాయి. ఇక మాకు ప్రైవసీ లేదా, ఏకాంతం కావాలంటూ దొంగగా వచ్చిన సత్య అడగ్గానే.. ఒక్కసారి ఆలోచించుకో ఇక్కడ ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదంటూ నాగార్జున గుర్తు చేశాడు. అయినా సరే నాకు ఏకాంతం కావాల్సిందేనంటూ సత్య అడగ్గానే.. మరో చిటికె వేసి దెబ్బకి ఏడారిలో చిరిగిపోయిన బట్టలతో సత్యను కూర్చోబెడతాడు. ఇక ప్రోమో చివరిలో ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 8 లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్స్, ట్విస్ట్‌లకి లిమిటే లేదంటూ నాగార్జున ఎండ్ చేశాడు. ఇక ఈ ప్రోమో చూస్తే సీజన్ 8 లో ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్ లా అనిపిస్తుంది. బిబి టీమ్ ఎలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకొస్తుందో‌ చూద్దాం మరి.  

కొనసాగుతున్న కోర్ట్ రూమ్ డ్రామా.. రోజుకో ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -120 లో....దీప దగ్గరకి పారిజాతం, జ్యోత్స్న లు వస్తారు. ముందు నుండి జాగ్రత్త పడి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పారిజాతం అనగానే.. మీరు చూసి ఇలా ఆనందపడే ఛాన్స్ ఉండేది కాదు కదా అని దీప అంటుంది. అంటే ఇప్పుడు నీ సిచువేషన్ చూసి ఆనందపడుతున్నామా అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే జ్యోతి, కార్తీక్ లు వస్తుంటే.. జ్యోత్స్న, పారిజాతంలు దీప దగ్గర నుండి వెళ్ళిపోతారు. టైమ్ అయిందంటూ లోపలికి వెళ్తారు. మరొకవైపు సుమిత్ర దగ్గరకి శ్రీధర్ కాంచనలు వస్తారు. సుమిత్ర ఏ టెన్షన్ లేకుండా ఉండడం చూసి.. నువ్వు చాలా గ్రేట్ వదిన అంటుంది. ఎందుకు నీకు కార్తీక్ పై నమ్మకం లేదా అని సుమిత్ర అడుగగా.. ఉంది అని కాంచన అంటుంది. కోర్టులో ఏం జరుగుతుందో, ఏంటో వెళదామని సుమిత్ర అంటుంది. మీరు వద్దు అన్నయ్య జరుగుతుంది మీకు నచ్చనప్పుడు అక్కడ జరిగేది కూడా నచ్చదు.. మేమ్ వెళ్తామంటూ కాంచనని సుమిత్ర తీసుకొని కోర్టుకి వెళ్తుంది. ఆ తర్వాత క్లయింట్ తన భార్య తప్పు చేసిందని ఆధారాలతో సహా నిరూపించాడు. దీప ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉందా అని లాయర్ అడుగుతాడు. ఎందుకు అంటే మళ్ళీ తీర్పు చెప్పే టైమ్ కి కింద పడిపోతే వాయిదా అడుగుతారని VV అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ని లాయర్ పిలుస్తాడు. మీకు దీప ఎప్పటినుండి తెలుసంటూ దీప గురించి ప్రశ్నలు అడుగుతాడు. తను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పడిపోతుంటే పట్టుకుంటే , దాన్ని ఏమంటారని కార్తీక్ అడుగుతాడు సాయమని లాయర్ అంటాడు. మరి నేను దీప విషయంలో చేసింది అదే శౌర్యని తీసుకొని వెళ్లిపోతుంటే వాడి నుండి కాపాడాలని, తన తండ్రి నేనే అంటూ అబద్ధం చెప్పానంటూ, నరసింహా చూపించిన సాక్ష్యాలు అబద్దమని కార్తీక్ చెప్తాడు. దయచేసి ఆ తల్లి కూతుళ్లని విడదీయకండి అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీప మాట్లాడుతు.. ఈ నిందలు పడడం.. నా వల్ల కాదు.. నాకు విడాకులు ఇవ్వండి అని దీప అనగానే.. ఏంటి మళ్ళీ ఇదొక ప్లానా అని VV అంటాడు. విడాకులు కావాలంటే బలమైన కారణం ఉండాలని లాయర్ అనగానే.. ఉంది భార్య ఉండగానే భర్త వేరొక పెళ్లి చేసుకుంటే విడాకులు ఇస్తారా అని దీప అడుగగా.. ఇస్తారని లాయర్ అంటాడు. అయితే నరసింహా నేను ఉండగానే శోభ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని దీప అంటుంది. వాడు తన ఫ్రెండ్ అని చెప్పాడని VV అనుకుంటాడు. దీప నిన్న చెప్తానన్న కారణం ఇదే అన్న మాట అని జ్యోతి అనుకుంటుంది. ఆ తర్వాత నరసింహా పక్కన ఉన్న ఆవిడే రెండో భార్య శోభ అని దీప చెప్పగానే.. శోభతో మాట్లాడాలని జ్యోతి బోన్ లోకి పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ సీక్రెట్స్ రివీల్ చేసిన యాంకర్ రవి!

బిగ్ బాస్ షో అంటే ఓ ఇరవై మందిని సెలెక్ట్ చేసి వారిని హౌస్ లోకి పంపించి, కొన్ని గేమ్స్ ఆడించి, వీకెండ్ లో ఓ ఎలిమినేషన్ చేపించడమే అని అనుకుంటారంతా కానీ అసలు లోపల వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తారు? ఎలా  ఉంటారనేది అందులో ఉండి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. యాంకర్ రవి తను ఎదుర్కున్న కొన్ని విషయాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. (Bigg Boss Telugu) యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌గా వెళ్తున్నాడంటే అతనే విన్నర్ అవుతాడని అనుకున్నారంతా కానీ అతనికి ఉన్న మంచి పేరుని బిగ్ బాస్ వాళ్లు తీసిపారేశారు. ముఖ్యంగా యాంకర్ లహరి ఇష్యూలో యాంకర్ రవిని పెద్ద విలన్‌గానే చూపించారు. పెళ్లైనా కూడా లహరి ఫేమ్ కోసం తన వెంటపడుతుందని వద్దని చెప్పినా వినడం లేదని రవి, నటి ప్రియతో అనడం.. ప్రియ ఆ విషయాన్ని లహరితో చెప్పడం. ఆ ఎపిసోడ్‌లో రవి ఇంత క్యారెక్టర్ లెస్ ఫెలోనా అన్నట్టుగా చూపించారు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ ఎడిటింగ్‌ కి తను ఎలా బలయ్యాడో అనేక సందర్భాల్లో రవి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ లో ప్రతీ శనివారం రోజు వరస్ట్ పెర్ఫామెన్స్ ఎవరని అడుగుతారు.. ఆదివారం రోజు నాగార్జున వచ్చి మా మధ్య ఏదొక ఫిటింగ్ పెడతారు. దాంతో వారం మొత్తం లాక్కుంటూ పీక్కుంటూ ఉంటాం. ఇదే బిగ్ బాస్ గేమ్ నేచర్. సోమవారం నాడు నామినేషన్స్.. వారంలో మూడు రోజులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడమే. మిగిలిన మూడు రోజులు కూడా.. ఎవడి గురించి ఏ కారణం చెప్పాలని వెతుక్కుంటూ ఉంటాం. తిండి కూడా సరిగ్గా ఉండదు. 19 మందికి ఒక పచ్చడి డబ్బా ఇస్తారు. నీకు ఎక్కువ వచ్చింది.. నాకు తక్కువ వచ్చిందని తిట్టుకోవడమే. తీవ్రమైన ఒత్తిడిలో ఉండి ఆట ఆడాలి.. కానీ ఒక్క గంట చూసి జడ్జ్ చేసేస్తారు. బిగ్ బాస్ ఆటని ఎడిటింగ్ చేసి ఒక గంట చూపిస్తారు.. మిగిలింది అన్ సీన్ అని చూపిస్తున్నారు. 24 గంటల్లో జరిగిన ఆటలో వాళ్లకి కావాల్సిన దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసి చూపిస్తారు. బిగ్ బాస్‌కి వెళ్లడమే చాలా ఒత్తిడితో వెళ్లారు. బిగ్ బాస్‌ కి వెళ్ళే ముందు నేను 85 రోజులు ఉంటే పది కేజీలు తగ్గాను. శ్రీరామ్ చంద్ర 12 కేజీలు, షణ్ముఖ్ జస్వంత్ 15 కేజీలు తగ్గిపోయాడు. నాకు డే 01 నుంచి డే 50 వరకు కూడా నా కూతురు కానీ నా ఫ్యామిలీ గురించి గానీ అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నా వాళ్లు ఏమైపోయారో అని వాళ్ల గురించే ఆలోచిస్తూ ఒత్తిడిలో ఉంటాం.. అలాంటి టైమ్ లోనే ట్రిప్ అవుతూ ఉంటాం. అలాగని అక్కడ నుంచి వెళ్లిపోలేం. ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయలేం. అమ్మ నాన్న పెద్ద వాళ్లు.. వాళ్లు ఎలా ఉన్నారో అని కెమెరాలకు దండం పెట్టి అడిగిన వాళ్ల నుంచి స్పందన రాదు. ప్రతి ఒక్కరూ కెమెరాల దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడతారు. నేను ఓ రోజు అలా మాట్లాడినందుకు నన్ను మాత్రమే చూపించారు. కొన్నే సెలెక్ట్ చేసి చూపించారు. నేను శ్రీరామ్, సన్నీ లతో చాలా బాగా ఉండేవాన్ని ఆ బాండింగ్ మాత్రం చూపించలేదు. నేను పాజిటివ్‌గా ఎంత చేసిన కూడా నెగిటివ్‌గానే చూపించేవారంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు.

మీ అత్తతో జాగ్రత్త నన్ను వాడుకుంది.. రామలక్ష్మి ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -172 లో..ఇకనైనా నీ ప్రయత్నం ఆపి ఒక మూలన కూర్చోమని శ్రీలతకు రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావని శ్రీలత అడుగగా.. మీరు ఎంత బాగా నటిస్తారు మహానటి. నమితతో అంతా చేయించి ఏం తెలియనట్లు భళే మాట్లాడుతున్నారని రామలక్ష్మి అంటుంది. నేను ఎందుకలా చేస్తానని శ్రీలత అంటుంది. నాకు అర్థం అయింది నమిత చెప్పకపోయిన మిమ్మల్ని చూసి భయపడడంలోనే నాకు అర్థమైందని రామలక్ష్మి అంటుంది. నీ భర్త నిన్ను బయటకు గెంటేలా ప్లాన్ చేస్తానని శ్రీలత అంటుంది. ఆ లోపే నేను ఒక బిడ్డని కంటాను.. అప్పుడు మీ కపట ప్రేమకి దూరం అయి, ఆ బిడ్డకి దగ్గర అవుతారని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది.  ఆ తర్వాత సీతాకాంత్  దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది.  నీ లక్ష్యం ఆశయాలు పక్కన పెట్టి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మీ ప్లాన్ ఫెయిల్ అయింది. మా ఆశలపై నీళ్లు చల్లారని శ్రీవల్లి అంటుంది. అవును నువ్వు నన్ను చైర్మన్ చేస్తానంటూ ఆశలు పెట్టావని సందీప్ అంటాడు. అది జరుగుతుంది కచ్చితంగా.. సీతాకాంత్ పై మచ్చ పడింది.. అది చాలు.. బోర్డు మెంబర్స్ అందరు నా మాట వినేలా చేస్తాను.. చైర్మన్ ని చేస్తానని శ్రీలత అంటుంది.  ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి భోజనం వడ్డీస్తుంది. రామలక్ష్మి కూడా సరిగ్గా తినలేదని పెద్దాయన చెప్పిన మాటలు సీతాకాంత్ గుర్తుచేసుకొని.. నువ్వు కూడా తిను అంటూ రామలక్ష్మికి తినిపిస్తాడు. ఆ తర్వాత నమిత తను ఏ కారణం వల్ల అలా చేసిందో తెలియదు కానీ మీరు బయటకు రావడానికి కారణం తనే కాబట్టి మళ్ళీ తనని క్షమించి లైఫ్ ఇవ్వండి అని రామలక్ష్మి అడుగగా.. సరే అంటాడు.  ఆ తర్వాత రామలక్ష్మి నమితని కలుస్తుంది. థాంక్స్ మేడమ్.. నేను తప్పు చేసిన మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చారని నమిత అంటుంది. మీ అత్తతో జాగ్రత్త నన్ను వాడుకున్నారని జరిగింది చెప్తుంది.. ఇక ఇప్పుడు మీకు సహాయం చెయ్యలేకపోవచ్చు కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం కచ్చితంగా హెల్ప్ చేస్తానని రామలక్ష్మికి నమిత చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేను సింగర్ గా మారడానికి కారణం మనో గారు

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3  ప్రతీ వారం మంచి పెర్ఫార్మెన్సెస్ తో దూసుకుపోతోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ లో జడ్జ్, సింగర్ కార్తీక్ ఒక ఇంటరెస్టింగ్ విషయాన్నీ చెప్పుకొచ్చారు. తాను ఇంత గొప్ప సింగర్ కావడానికి కారణం మనో గారు అని అన్నారు.  "మీ మ్యూజికల్ జర్నీలో మీకు ఘనమైన మూమెంట్ ఏమిటి" అని శ్రీరామా చంద్ర అడిగేసరికి సింగర్ కార్తీక్ తన మ్యూజికల్ జర్నీలో అసలు విషయాలు చెప్పుకొచ్చాడు. "1995 లో మా నాన్నకు సంగీతం మీద ఉన్న ఇంటరెస్ట్ కారణంగా నేను ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఆ షోలో నేను పాడాను. ఐదు నిమిషాల్లోనే నేను ఓడిపోయాను. అసలు నాకు సాంగ్స్ పాడడం మీద అవగాహన లేదు, బాగా పాడలేదు..ఓడిపోయాను. ఐతే ఆ ఎపిసోడ్ కి మనో గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ క్షణం వరకు నా లైఫ్ లో మ్యూజిక్ లేదు. అంతా ఖాళి. ఆ ఎపిసోడ్ షూటింగ్ ఐపోయాక నేను, అమ్మ, నాన్న కలిసి బస్సు స్టాండ్ కి నడుస్తూ వస్తున్నాం. అదే సమయంలో ఒక ఒపెల్ ఆస్ట్రా కారు మా ముందు నుంచి వెళ్తూ కనిపించింది. నేను ఆ కార్ చూసి నాన్న మనో గారు కార్ లో వెళ్తున్నారు అని చెప్పా. అదే టైములో మనో గారి కార్ మా ముందు ఆగింది. ఆయన మమ్మల్ని చూసి మా కోసమే కార్ ఆపారు. వెంటనే మేము మనో గారి దగ్గరకు వెళ్లాం. వెంటనే ఆయన నన్ను మా పేరెంట్స్ కి చూపిస్తూ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. మ్యూజిక్ నేర్పించండి...అదే అతన్ని నిలబెడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా ఆయన మాటలతో నా బుర్రలో ఒక ఆలోచనను వెలిగించారు. అంటే మనో గారు చెప్పారు కాబట్టి నేను మ్యూజిక్ నేర్చుకుంటే గొప్పవాడిని అవుతాను అనుకున్నాను. అలా నేను మ్యూజిక్ నేర్చుకున్నా..నాలుగేళ్ల తర్వాత నేను సింగర్ ని అయ్యాను." అని తన మ్యూజిక్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు.

మను తండ్రి ఎవరో శైలేంద్రకి తెలిసిపోయింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1150 లో.. అనుపమ దగ్గరకి వసుధార వస్తుంది. ఎందుకు మేడమ్ అలా సడెన్ గా వచ్చేసారని వసుధార అడుగ్గా.. అన్ని చెప్తాను.. నా బాధ నీకు కాకుండా ఎవరికి చెప్పుకుంటానని అనుపమ అంటుంది. మను తండ్రి మహేంద్ర అని దేవాయని, శైలేంద్రలకి తెలిసిందంటూ జరిగింది మొత్తం అనుపమ చెప్తుంది. మీరు మనుకి నిజం చెప్పండి అని వసుధార అంటుంది. నేను చేసిన పొరపాటు వల్ల మను తండ్రి గురించి దేవయాని, శైలేంద్రలకి తెలిసిందని వసుధార అంటుంది. ఆ మాట మను వింటాడు. మీరు త్వరగా మనుకి చెప్పండి అని వసుధార అంటుంది. ఇప్పుడు చెప్పలేనని అనుపమ అంటుంది. ఆ తర్వాత వసు వెళిపోతుంటే నా తండ్రి గురించి అందరికి తెలుసా అయినా చెప్పట్లేదా.. ఇప్పుడు నాకేం చెయ్యాలో తెలుసని మను అనుకుంటాడు.  మరొకవైపు శైలేంద్ర రిషి దగ్గరకి వచ్చి.. నువ్వేంటి వసధార ముందు ఓవర్ చేస్తున్నావ్ అంటాడు. అదేం లేదు అలా సపోర్ట్ చేయకుంటే వసుధార మేడమ్ కి డౌట్ వస్తుందని రిషి అంటాడు. రేపు బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తాను అందులో ఎండీగా నా పేరు చెప్పు.. ఇది నా డ్రీమ్ అందరు నా మాట వినాలని శైలేంద్ర అంటాడు. మొదట రిషి అడ్డు వచ్చాడూ.. వాడు వెళ్ళాక పిన్ని.. తను వెళ్ళాక వసుధార.. ఇప్పుడే నేను ఎండీ కావడానికి మంచి ఛాన్స్.. అసలు ఎండీ గురించి ఎన్ని చేసానో తెలుసా అని శైలేంద్ర చెప్పబోయి ఆగిపోతాడు. ఏం చేశారని రిషి అంటాడు. అదంతా నీకెందుకని శైలేంద్ర అంటాడు. వాళ్ళ మాటలన్ని వసుధార వింటుంది. మరొకవైపు మను దగ్గరికి ఏంజిల్ వస్తుంది. బావ నేనంటే నీకు ఇష్టమేనా పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. నాకు వారం రోజులు టైమ్ కావాలి. అప్పటి వరకు నేను ఎదరుచూస్తున్న నిరీక్షణ ఫలిస్తుందని మను అంటాడు. సరేనని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలు మాట్లాడుకుంటారు. ఆ వసుధార లెటర్ మనుకి ఇస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు అవుతుందని అంది. మనం లెటర్ ఇస్తే మనకి ప్లస్ ఆ మైనస్ ఆ అని శైలేంద్ర అంటాడు. అది మన ఇష్టమని దేవయాని అంటుంది. అపుడే ధరణి వచ్చి.. దేవయాని శైలేంద్రలతో మాట్లాడుతుంది. అప్పుడే శైలేంద్రకి మను కాల్ చేస్తాడు. చెయ్యగానే లిఫ్ట్ చేస్తే వాల్యూ ఏముంటుందని శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మళ్ళీ మీరు రావడం చాలా హ్యాపీగా ఉందంటు వసుధారతో అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అందుకే జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాను.. అలా చేయడం కరెక్ట్ కాదు!

జబర్దస్త్ షో రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. సరదా శుక్రవారం సరిపోదా శనివారం పేరుతో ఈ షో వస్తోంది. ఇప్పుడు ఈ రెండు ఎపిసోడ్స్ కి యాంకర్ గా రష్మీనే పని చేస్తోంది. ఇంతకుముందు అనసూయ యాంకర్ గా చేసేది. ఐతే ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. దీంతో ఈ షో నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె ప్లేసులో కన్నడ సీరియల్ నటి, బుల్లితెర యాక్టర్ సౌమ్యరావ్ వచ్చింది. వచ్చి రానీ తెలుగుతో కొద్దీ రోజులు ఆకట్టుకుంది. అప్పుడప్పుడే ఆడియన్స్ తెలుస్తోంది అనుకుంటున్న టైములో ఆమె కనిపించకుండా పోయింది. తర్వాత  ఆమె స్థానంలోకి వచ్చింది సిరి హనుమంతు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ షో మొత్తం స్టైల్ మార్చేశాక రష్మీ గౌతమ్ మాత్రమే యాంకర్ గా ఉంటోంది. అయితే చాలా మందికి సౌమ్య రావ్ ఎందుకు వెళ్లిపోయిందో అన్న విషయం తెలీదు. ఐతే ఆ విషయాల గురించి సౌమ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  జబర్దస్త్ నుండి సడెన్‌గా వెళ్లిపోవడానికి కారణం అగ్రిమెంట్ ఐపోవడమే అని చెప్పింది.  అందుకే ఈ షో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పింది.   "వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పారు. నెక్ట్స్ ఇయర్ కొత్త ఫేస్ ట్రైం చేస్తాం అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పా. అక్కడ ఉన్నప్పుడు మంచిగానే చూసుకున్నారు. బెంగళూరు నుండి ఇక్కడకు తీసుకొచ్చి, క్యాబ్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. పేమెంట్స్ ఇష్యూస్ కానీ, కంటెస్టెంట్ల నుండి కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. టీమ్ లీడర్స్, జడ్జెస్ , ప్రొడక్షన్ టీం, మేనేజ్ మెంట్ అందరూ నన్ను బాగా చూసుకున్నారు" అని సౌమ్య చెప్పింది.   ఆడియన్స్‌ తో ఎక్కువగా కనెక్ట్ కాకపోవడానికి కారణం కూడా చెప్పింది. "ఇలా వచ్చానో లేదో అలా సమయం అయిపోయింది. సీరియల్స్ లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ యాంకరింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్ చేయకూడదు. మళ్లీ మంచి ఆఫర్స్ వస్తే వెళతాను. ఐతే ఈ జర్నీ మొత్తంలో ఒకే కంపెనీపై కానీ, ఒకరిపై కానీ ఆధారపడకూడదు. ఒక ఆర్టిస్టుగా మన మార్గాలను మనమే వెతుక్కోవాలి. ఎక్కడ అవకాశాలు దొరికినా వెళ్ళాలి. ఎప్పుడూ ఒకే రూట్ లో వెళితే  ఆ దారిని ఎప్పుడు, ఎవరు, ఎలా క్లోజ్ చేస్తారో మనకు తెలియదు" అంటూ చెప్పుకొచ్చింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రోజే ఫస్ట్ నైట్.. ఇంటికి రావాల్సింది ఒక్కడే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -485 లో.... రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. భోజనం చేయడానికి రండీ అని అడుగగా.. నేను రానని రాజ్ అంటాడు. ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కళ్యాణ్ .. నాపై కోప్పడుతారేంటని కావ్య అంటుంది. అంటే కళ్యాణ్ గురించి ఇంట్లో అందరు బాధపడుతున్నారు. ఆ బాధ పోగొట్టాలని లేదా అని రాజ్ అనగానే.. నా ఇష్టంతో ఏమైనా పెళ్లి చేసుకున్నారా.. నేను తీసుకొని రావడానికి, లేదు కదా అని కావ్య అంటుంది. నా ఇష్టానికి విలువ ఇవ్వనప్పుడు నువ్వు పిలిస్తే నేను ఎందుకు రావాలి.. నేను రాను వెళ్ళిపోమంటూ కావ్యపై రాజ్ సీరియస్ అవుతాడు. మరొకవైపు కళ్యాణ్, అప్పులు ఇద్దరు అప్పు ఫ్రెండ్స్ రూమ్ లో భోజనం చేస్తుంటారు. వాళ్ళకి కొత్త గా పెళ్లి అయింది. వాళ్ళకి ప్రైవేసి ఉండాలని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని వదిలేసి సినిమాకి వెళ్తారు. అనామిక తో గొడవలు లేకుండా ఉంటే ఇలాంటి సిచువేషన్ వచ్చేది కాదు కదా అని అప్పు అనగానే.. అనామిక ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు.. ఎప్పుడు తనకి నచ్చినట్టు ఉండాలని ట్రై చేసేది.. తక్కువ చేసి మాట్లాడేది కానీ నువ్వు ఎప్పుడు నన్ను అలా చూడలేదు తక్కువ చేసి మాట్లాడలేదు. ఇక నుండి గతం గానీ అనామిక గురించి ఆలోచించొద్దు.. ఇప్పటి నుండి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నామని కళ్యాణ్ అంటాడు.  మరొకవైపు రాజ్ కి ఆకలిగా ఉంటుంది. కిచెన్ లోకి వస్తాడు. అక్కడే ఉన్న అపర్ణ ని తినడానికి ఫ్రిడ్జ్ లో ఏం లెవ్వని అడుగుతాడు. భోజనం చెయ్ అనగానే ఆ కావ్య వంట తినను అంటాడు. అప్పుడే కావ్య వచ్చి.. భోజనం చెయ్యండి అనగానే వద్దని వెళ్లిపోతాడు. ఏమైందని అపర్ణ అడుగగా.. కళ్యాణ్ వెళ్లిపోతుంటే ఆపలేదని కోపంగా ఉన్నారని కావ్య అంటుంది. వాడు ఆకలికి ఉండలేడని అపర్ణ అంటుంది. మరొకవైపు అసలు లెక్క ప్రకారం ఈ రోజు ఫస్ట్ నైట్ అని కళ్యాణ్ అంటాడు. అనుకున్నట్టు జరిగితే అవుతుంది కానీ మన పెళ్లి ఎలా జరిగిందని అప్పు అంటుంది. ఈ చీరని ఎలా కట్టుకుంటారో అంటూ ఇబ్బంది పడుతుంది అప్పు. తనని చూసి కళ్యాణ్ నవ్వుకుంటాడు  మరొకవైపు రుద్రాణి ఇంట్లో వాళ్లు అన్న మాటలకి కోపంగా డ్రింక్ చేస్తుంది. ఇన్ని రోజులు వీళ్ళపై జాలి చూపించాను కానీ ఇక అలా కాదు కళ్యాణ్ ని దూరం చేస్తాను. ధాన్యలక్ష్మికి ఇంట్లో వాళ్ళపై కోపం పెంచుకునేలా చేస్తాను. కావ్యని బయటకు పంపించి రాజ్ ని ఒంటరి వాడిని చేస్తాను. ఆస్తికి వారసుడిని చేస్తానని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ కిచెన్ లోకి వచ్చి.. పాలు వేడి చేసుకుంటుంటే తన చేయి కాలుతుంది.  తరువాయి భాగంలో కళ్యాణ్ ని ఎలాగైన ఇంటికి తీసుకొనిరా అని ప్రకాష్ అంటాడు. నేను వాళ్ళిద్దరిని తీసుకొని వస్తానని రాజ్ అనగానే.. ఇద్దరు ఎవరు? నాకు ఒక్కడే కొడుకు ఇంటికి రావలిసింది ఒక్కడే అని ధాన్యలక్ష్మి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిసిందే.

ఇండియన్ అనాబెల్ అంటూ మంజునాథ్ ని పొగిడిన బ్రిట్టో

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ మాన్సూన్ స్పెషల్ గా తీసుకొచ్చారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా డాన్సర్ బ్రిట్టో-సంధ్య, అలాగే లాస్య-మంజునాథ్ వచ్చారు. ఇక మాన్సూన్ స్పెషల్ కాబట్టి కూల్ టెంపరేచర్ హీటెక్కించే డాన్సులు కూడా చేయించింది శ్రీముఖి. అలాగే తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చింది. అదేంటంటే భార్యలతో భర్తలకు మేకప్ చేయించారు. మాములుగా కూడా భార్యల వెనక భర్తల్ని కూర్చోబెట్టి వాళ్ళ ముఖాలు చూడకుండా మేకప్ చేసే కాన్సెప్ట్ అన్నమాట. అలా అందరూ మేకప్ చేశారు. ఇక లాస్య మాత్రం మంజునాథ్ ని ఒక రేంజ్ లో మేకప్ చేసింది. చూస్తే భయమేసేలా చేసింది. అలాగే సంధ్య కూడా బ్రిట్టోకి అలాగే మేకప్ చేసింది. బ్రిట్టో మంజునాథ్ మేకప్ ని చూసి షాక్ అయ్యాడు. అంతే కాదు లాజీ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అలాగే బ్రిట్టో మంజునాథ్ కి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. మంజునాథ్ చూడడానికి "ఇండియన్ అనాబెల్" లా ఉన్నాడు అని అన్నాడు. అనాబెల్ అంటే ఒక హారర్ మూవీలో ఉండే బొమ్మ. దాని పేరే అది. ఆ కామెంట్ కి లాస్య పడీపడీ నవ్వేసింది. ఇక ఫైనల్ గా సీరియల్ హజ్బెండ్స్ తో సీరియల్ వైప్స్ కి జాడలేయించి మల్లెపూలు పెట్టించింది శ్రీముఖి.  

నంబి నారాయణ్ తో పూనమ్ కౌర్...చేనేత వస్త్రాల బహూకరణ

  పూనమ్ కౌర్ మూవీస్ లో నటించకపోయినా కానీ ఏపీ రాజకీయాలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ఐతే పూనమ్ రీసెంట్ గా జాతీయ చేనేత దినోత్సవాన్ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. చేనేత వస్త్రాలను ధరించిన ఆమె ఆ  డ్రెస్సింగ్ స్టైల్ లో డిఫరెంట్ గా  కనిపించి అదరగొట్టారు. ఐతే ఆమె రీసెంట్ గా ఈ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని   ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ ని కలిశారు. ఆయన కోసం కొన్ని చేనేత వస్త్రాలను తీసుకెళ్లారు. ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. "ఏపీ నుండి ప్రత్యేక చేనేత వస్త్రాలు ఆయన కోసం తీసుకెళ్ళాను. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక గంట పాటు ఎన్నో విషయాలు మాట్లాడారు. చిన్నతనంలో, మహాభారతం, రామాయణం వంటి పురాణ ఇతిహాసాల్లో  చెడుపై మంచి విజయం ఎలా సాధించిందో వంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నా. నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఇంచుమించు అలాగే ఉంటుంది, ఈ లివింగ్ లెజెండ్‌ను కలుసుకోవడం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను..  కష్ట సమయాల్లో,  ఎలా మన మాటకు, మన నడతకు కట్టుబడి ఉండాలో ఆయన్ని చూస్తే అర్ధమవుతుంది.  ఆయన షేర్ చేసుకున్న ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. ఆయన ఈ దేశానికి హీరో... నిజమైన దేశభక్తుడు" అంటూ రాసుకొచ్చింది..పూనమ్ గతంలో ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చేనేత వస్త్రాలు, పరిశ్రమలకు తగిన గుర్తింపు తెచ్చేందు

యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్! 

సరిపోదా శనివారం ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ రష్మీ పరువును నిలువెల్లా తీసేసాడు. అసలు పాపం రష్మీ ఏదో హీరోయిన్ గా అడిగింది అంటే భాస్కర్ మరీ అంత మాట అనేయాలా. "భాస్కర్ కొత్త సినిమా చేస్తున్నావ్ కదా అందులో నన్ను హీరోయిన్ గా" అని ఇంకా తన మాట పూర్తి చేయకుండానే భాస్కర్ ఫైర్ ఐపోయాడు. "ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు..మీవన్నీ బుల్లితెర ఫేస్ లు. నాది వెండి తెర ఫేస్. ఆల్రెడీ మీ ఫామిలీ వారంలో మూడు రోజులు ఈటీవీ మీద పడి మేస్తున్నారుగా ఇంకా సరిపోలేదా..ఒక పని చేస్తా,,ఉదయం పూట అమ్మకు శుభమస్తు ప్రోగ్రాం ఇప్పిస్తా జాతకాలు చెప్పుకోమను..తమ్ముడికి ఈటీవీ న్యూస్ ఇప్పిస్తా..రోజూ కనిపిస్తాడు. నువ్వు మిగతా మూడు రోజులూ సీరియల్స్ చేసుకో. వెండితెర మీద వెలగాలంటే నా లాంటి క్రేజ్ ఉండాలి, నా అంత గ్లామర్ ఉండాలి. నీ ఫేస్ వెండితెరకు సరిపోదురా.." అని భాస్కర్ నానా మాటలు అనేశాడు. దానికి రష్మీ పాపం ఫీలయ్యింది. ఎంత ఫీలయ్యిందంటే "గెస్ట్ అప్పియరెన్స్ గా ఒప్పుకున్నాను కదా నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి." అనేసరికి "పోనీ అభిరుచి ప్రోగ్రాం ఇస్తాను...మీ ముగ్గురూ కలిసి వంటల ప్రోగ్రాం చేసుకుంటారా" అనేసరికి రష్మీ షాకైపోయింది. అంతటితో ఆగలేదు భాస్కర్ రష్మీ ఫేస్ చూపిస్తూ "నీ ఫేస్ వెండితెరకు సూట్ కాదు" అని చెప్పేసాడు. "యు భాస్కర్...అడుక్కుతింటావ్. నన్ను హీరోయిన్ గా రిజెక్ట్ చేస్తున్నావా..మట్టిగొట్టుకుపోతావ్, నాశనమైపోతావ్...నీ మొహం మండా, నీ నోట్లు పురుగుల పకోడా.., నీ మొహం కాకులు పొడవా...నీ పడవా ముంచు." అని అన్ని బూతులు తిట్టేసింది. "నీ శాపనార్ధాలు నా దగ్గరేమీ పని చేయవు...పోరా బుల్లితెర ఫేస్" అని అన్నాడు భాస్కర్.  

Karthika Deepam2 : మరదలిపై కార్తీక్ ఫైర్.. కోర్టులో గెలిచేదెవరు?

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -119 లో....నువ్వు ఇక్కడే ఉండు బూచోడు వస్తాడని శౌర్య భయపడుతుంటే రాడని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న ఎక్కడ అని సుమిత్రని అడుగుతాడు. గదిలో ఉందని సుమిత్ర చెప్పగానే.. కోపంగా జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్. అసలు నీకు బుద్ది ఉందా చిన్నపిల్లలతో అలాగేనా మాట్లాడేదంటు కార్తీక్ కోప్పడతాడు. నీకు కాబోయే భర్తగా ఏదైనా అనే హక్కు నీకుంది.. కానీ వాళ్ళ విషయంలో అనే రైట్ లేదని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత  జ్యోత్స్నపై కార్తీక్ చెయ్ ఎత్తుతాడు. వాళ్ల గురించి నువ్వు ఎందుకు అంతలా అవుతున్నావని జ్యోత్స్న అంటుంది. దీప గురించి నీకెందుకని అడుగగా.. శౌర్యకి ఫ్రెండ్ ని, దీపకి శ్రేయోభిలాషిని అని కార్తీక్ అంటాడు. రేపు ఎలాగైనా నరసింహా తన కూతురిని తీసుకొని వెళ్తాడని జ్యోత్స్న అంటుంది. శౌర్య బాధపడేలా మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సుమిత్ర వస్తుంది. అందరూ ఇలాగే ఉన్నారు.. అర్థం చేసుకునేవాళ్లు లేరు.. ఎవరి ఇష్టానికి వాళ్లు మాట్లాడి బాధపెడతారు. అక్కడ అమ్మ కూడా అంతే.. ఒక నువ్వే అత్త అర్థం చేసుకునేది.. నీ కడుపున ఈ ఆవేశపరురాలు ఎలా పుట్టిందో.. నువ్వు అయినామన తనకి చెప్పు అత్త అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అనసూయ కోర్టులో జరిగింది గుర్తుకుచేసుకుంటుంది. అప్పుడే నరసింహా, శోభ వస్తారు. అమ్మ రేపు కోర్టులో మనమే గెలుస్తాం.. నా కూతురు ఇక్కడికి వస్తుందని నర్సింహా అంటాడు  రేపు నేను కోర్టుకి రానని అనసూయ అంటుంది. శౌర్యా వచ్చాక షాపింగ్ కి వెళదాం.. తన పేరు మారుస్తానని శోభ మురిసిపోతుంది. కూతురిని అడిగితే ఇవ్వలేదని, ఇంత పెద్ద నిందలు వేస్తున్నాడు.. ఇప్పుడు విడాకులు అడిగితే ఏం చేస్తాడో.. అయినా తప్పదు నా కూతురు కోసం తప్పదని దీప అనుకుంటుంది. కార్తీక్ కూడా దీప గురించి బాధపడతాడు. కార్తీక్ అన్న మాటలకు జ్యోత్స్న కోపంగా ఉంటుంది. మరుసటిరోజు ఉదయం కోర్టులో దీప దగ్గరికి నరసింహా వచ్చి మాట్లాడతాడు. కాసేపటికి పారిజాతం, జ్యోత్స్నలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భార్యని అలా హత్తుకొని థాంక్స్ చెప్పాడు.. ఇదేనా అసలు బంధం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -171 లో....రామలక్ష్మి నమితని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. సీతాకాంత్ సర్ ఏం తప్పు చెయ్యలేదు.. అంత నేనే చేశాను అసలు ఏం జరిగిందో చెప్తానని నమిత ఇన్స్పెక్టర్ తో అంటుంది. అప్పుడే సందీప్, శ్రీలతలు వస్తారు. వాళ్ళను చూసి నమిత ఆగిపోతుంది. నా కొడుకు ఏం తప్పు చేయకుండా ఇలా నిందలు వేసావంటూ ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే నమిత పేరెంట్స్ తన రౌడీల దగ్గర ఉన్న ఫోటోని పంపిస్తుంది. అది చూసి నమిత టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత నమిత అదంతా శ్రీలత సందీప్ లు చేశారని కాకుండా నేనే డబ్బులు కోసం ఇలా చేశానని చెప్తుంది. ఏంటి అలా చెప్తున్నావ్ దీని వెనకాల ఎవరున్నారో చెప్పమని రామలక్ష్మి అంటుంది. నేనే చేసానంటూ వాళ్ళకి భయపడి నమిత అలా చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ ని సెల్లో నుండి బయటకు తీసుకొని వస్తారు. అసలు ఇదంతా ఎందుకు చేసావని సీతాకాంత్ అంటాడు. నేనే తప్పు చేశాను ఎంత పెద్ద తప్పు చేసానో రామలక్ష్మి మేడమ్ చెప్పారు.. అందుకే కేసు వెనక్కి తీసుకుంటున్నానని నమిత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ పై శ్రీలత ప్రేమ నటిస్తూ ఉంటుంది. సీతాకాంత్ కాళ్ళ మీదపడి క్షమించని అడుగుతాడు సందీప్. నువ్వు బయటకు వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నా.. వెళ్లి వస్తానంటూ శ్రీలత, సందీప్ లు వెళ్తారు. ఆ తర్వాత రామలక్ష్మికి సీతాకాంత్ థాంక్స్ చెప్తాడు. నన్ను బయటకు తీసుకొని వచ్చవంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. అదంతా రామలక్ష్మి, నమితలని కాపాడిన అమ్మాయి చూస్తుంటుంది. మరొక వైపు ఇంట్లో రామలక్ష్మి వదిన కన్పించడం లేదని సిరి అంటుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తుంటారు. సిరి వెళ్లి సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది. అనుకున్నది చేసావ్ అమ్మ అని పెద్దాయన అంటాడు. అప్పుడే శ్రీలత, సందీప్ లు వస్తారు. ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి సీతాకాంత్ ని తీసుకొని వస్తానని సందీప్ ని తీసుకొని వెళ్ళాను. అప్పుడే రామలక్ష్మి, నమితని తీసుకొని వచ్చి నిజం చెప్పించిందని శ్రీలత అంటుంది. వెళ్లి హారతి ఇవ్వండి అనగానే.. నేనే ఇస్తా అని శ్రీలత అంటుంది. వద్దు మీకెందుకు శ్రమ నేనే తీస్తానంటు సీతాకాంత్ కి రామలక్ష్మి హారతి ఇస్తుంది. ఆ తర్వాత అత్తయ్య మీతో మాట్లాడాలని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. ఇక మీ ప్రయత్నం ఆపండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.