Brahmamudi : భర్తని తెలివిగా కాపాడుకున్న భార్య!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -505 లో.....కంపెనీకి బాధ్యత వహించి పోలీసులకి కోపరేట్ చేస్తానని రాజ్ అంటాడు. తాతయ్య నమ్మకం పోగొట్టి ఈ తప్పు చేసి రాహుల్ పై తోసెయ్యాలని చూసావంటు రాజ్ ని రుద్రాణి తిడుతుంది. రాజ్ ని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. ఆగండి అంటు కావ్య వస్తుంది. ఈ ఫ్రాడ్ ఎవరు చేసారో కంపెనీకీ సంబంధించిన నకిలీ స్టాంప్ లు, సంతకాలు ఎవరు చేసారో.. ఈ ఫైల్ లో క్లియర్ గా ఉందని కావ్య.మ పోలీసులకి ఫైల్ ఇస్తుంది. అది చూసి రాజ్ గారు ఈ తప్పు చెయ్యలేదు.. తప్పు అంతా కూడా రాహుల్ చేసాడని అనగానే అందరు షాక్ అవుతారు. లేదు రాజ్ ని తప్పించడానికి కావ్య ఏదో నాటకం ఆడుతుందని రాహుల్ అనగానే..  రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. వదిన అంటూ అపర్ణపై రుద్రాణి కోప్పడుతుంది. ఎన్ని తప్పులు చేసినా ఈ ఇంట్లో ఉండనివ్వడం మాది తప్పు.. ఎప్పుడో మెడ పట్టుకొని గెంటాల్సింది.. ఆడపడుచు స్థానంలో ఉన్నావని వదిలి పెడుతున్నానని రుద్రాణిపై అపర్ణ విరుచుకుపడుతుంది. ఆ తర్వాత రాహుల్ తప్పు చేసాడో లేదో తెలియదు కానీ వాడిని పోలీసులు తీసుకొని వెళ్తున్నారు ఆపండి అని రుద్రాణి అందరిని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఎవరు పట్టించుకోరు. రాహుల్ ని పోలీసులు తీసుకొని వెళ్తారు. నువ్వు ఇదంతా ఎలా తెలుసుకున్నావంటూ రాజ్ అడుగుతాడు. రాహుల్ పై డౌట్ వచ్చి శృతిని గమనించమని చెప్పానని కావ్య అంటుంది. టైమ్ కి వచ్చి నీ భర్తని, కంపెనీ పరువుని కాపాడావని కావ్యని అపర్ణ అంటుంది. సారీ అక్క అని స్వప్నకి కావ్య చెప్తుంది. వాడి భార్యగా కంటే నేను.. నీ అక్కగా ఈ ఇంట్లో ఉంటేనే నాకు గౌరవమంటూ స్వప్న అంటుంది. అవన్నీ వింటున్న రుద్రాణి కోపంగా ఉంటుంది. మరొకవైపు కళ్యాణ్ ఉప్మా చేసుకొని వస్తాడు. ఇది ఉప్మానా సాంబారా అంటూ బంటి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ కి కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. మళ్ళీ రాహుల్ ని కావ్య అరెస్ట్ చేయించి తప్పు చేసిందన్నట్లు మాట్లాడేసరికి కావ్యకి కోపం వస్తుంది. నువ్వు కళ్యాణ్ ని ఇంటికి రప్పంచి ఉంటే ఇదంతా జరిగేది కాదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్యల దగ్గరకి రుద్రాణి వెళ్లి తన కొడుకుని విడిపించమని అడుగుతుంది. తరువాయి భాగంలో రాహుల్ విడుదలై ఇంటికి వచ్చి.. నేను తప్పు చెయ్యలేదని నన్ను వదిలేసారని రాహుల్ అంటాడు. అందరూ నా కొడుకు తప్పు చేశారన్నారని రుద్రాణి అనగానే.. బయటకి వచ్చాడంటే తప్పు చెయ్యలేదని కాదని అని కావ్య అంటుంది‌. దాంతో కావ్యపై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Sravanthi chokkarapu: వరదభాదితులకి లక్ష రూపాయలు విరాళమందించిన యాంకర్ స్రవంతి చొక్కారపు!

  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సేవ చేసేవాళ్ళున్నారు. వారిలో‌ కొంతమంది ఊళ్ళని దత్తత తీసుకున్నవాళ్ళు ఉన్నారు.‌ కానీ చిన్న సెలెబ్రిటీలు తమ స్థాయికి మించి సాయం చేస్తే వారిని అభిమానులు గుర్తుంచుకుంటారు. అలా సాయం చేసి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది యాంకర్ స్రవంతి చొక్కారపు.  తాజగా కురిసిన భారీ వర్షాలకి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదలొచ్చాయి. కొన్ని గ్రామాలు ముంపుకి గురయ్యాయి. అయితే అలా వరదల్లో చిక్కుకున్న వారికి కొంతమంది విరాళాలు ఇస్తున్నారు.   అయితే స్రవంతి తన వంతుగా లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఇదే విషయం తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది. ఇక స్రవంతి చేసిన ఈ ట్వీట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎమ్ఓ అధికారిక ట్విట్టర్ పేజీలని కూడా ట్యాగ్ చేసింది‌. ఇక తను చేసిన ఈ సాయానికి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీంతో స్రవంతి చొక్కారపు నెట్టింట వైరల్ గా మారింది.   స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో లైన్లోకి వచ్చింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరు ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్ మారిపోయింది. ఆ తరువాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

Biggboss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అంజలి పవన్!

  బిగ్ బాస్ సీజన్ మొదలవ్వకముందే కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు లీక్ అవుతుంది. అయితే చివరి వరకు ఎవరు వెళ్తారనే క్లారిటీ ఉండదు. అయితే హౌస్ లోకి వెళ్ళలేకపోయిన వారికి ఏదైన అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం కచ్చితంగా బిబి టీమ్ వద్దంటారు. అంజలి పవన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందనే వార్త గ్రాంఢ్ లాంచ్ మొదలయ్యేవరకు వినిపించింది. కానీ చివరి నిమిషంలో వెళ్ళలేదు. ఇక దానికి కారణం చెప్తూ అంజలి పవన్ తన యూట్యూబ్ ఛానెల్ లో  ' Sudden గా వీళ్ళకి ఏం అయ్యిందంటే.. My Biggboss 8 Telugu Entry Clarity ' అంటూ వ్లాగ్ ని చేసింది. ఇందులో తనేం చెప్పిందంటే.. మా ఆయనకి చికెన్ గున్యా వచ్చింది. తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళా మూడు రోజుల నుండి హాస్పిటల్ లోను ఉన్నాను. అందుకే బిగ్ బాస్ 8 కి వెళ్ళలేకపోయాను. దయచేసి ఎవరు ట్రోల్స్ చేయకండి. మా ఇంట్లో పాప ఉంది. మా ఆయనని చూసుకోవడానికి నేనే ఉన్నాను. అర్థం చేస్కోండి అంటు అంజలి పవన్ చెప్పింది. దయచేసి పాప ఫోటోలు పెట్టి చెత్త చెత్త థంబ్ నేల్స్ తో వీడియోలు చేయకండి.. నా గురించి, నా భర్త గురించి రాసిన నేను తీసుకుంటాను కానీ నా పాప గురించి మాత్రం అలా రాయకండి అంటు అంజలి పవన్ యూట్యూబ్ థంబ్ నేల్ బ్యాచ్ ని రిక్వెస్ట్ చేసింది. అయితే ఇదే వ్లాగ్ లో అంజలి పవన్ మరో హింట్ ఇచ్చింది. అదేంటంటే బిగ్ బాస్ ఎంట్రీపై ఇప్పుడే చెప్పలేను అని అంది.. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తను హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి అంజలి పవన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందా లేదా కామెంట్ చేయండి.

Biggboss 8 Promo: కట్టేసిన కుక్క మొరిగినట్టుగా మొరగడం నా నేచర్ కాదు!

  బిగ్ బాస్ సీజన్-8 మొదలైన రెండు రోజులకే నామినేషన్లు మొదలయ్యాయి. ఇక ఈ సీజన్ కూడా సీరియల్ బ్యాచ్ వచ్చేసింది. అయితే హౌస్ లో కన్నడ వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉందని తెలుగు అభిమానులు ఫీల్ అవుతున్నారు. నిఖిల్, యష్మీ గౌడ, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్ ఇలా కన్నడ బిగ్ బాస్ చూస్తున్నామా అనేలా‌ మారింది. అయితే ఈ రోజు వదిలిన ప్రోమోలో నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తుంది. వీటిలో ఒకరినొకరు గట్టిగానే తిట్టుకున్నారు. సోనియా ఆకుల ఫస్ట్ బేబక్కను నామినేట్ చేసింది. కుకింగ్ హెడ్‌గా ఉన్నా బేబక్క బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని చెప్పి సోనియా నామినేట్ చేసింది. ఇక వాళ్లిద్దరి నామినేషన్ జరుగుతుండగా.. కన్నడ బ్యాచ్ నిఖిల్, యష్మీలు మధ్యలోకి వెళ్ళి.. ఆమెని మాట్లాడనివ్వు అని అనడంతో.. వారికి సోనియా గట్టిగానే ఇచ్చిపడేసింది. ఇది నా నామినేషన్స్.. మీరు చెప్తే నేను వినాల్సిన పనిలేదంటు చీఫ్ లకి కౌంటర్ ఇచ్చింది సోనియా. సెకెండ్ నామినేషన్ గా నాగ మణికంఠని నామినేట్ చేసింది సోనియా. ఎవరితోనూ మాట్లాడటం లేదనే రీజన్ చెప్పడంతో మణికంఠ డిఫెండ్ చేసుకున్నాడు. 'ఊరికే కట్టేసిన కుక్క మొరిగినట్టుగా భౌ భౌ అని మొరగడం నా నేచర్ కాదు' అంటూ సోనియాకి మణికంఠ ఇచ్చిపడేశాడు. ఆ తరువాత శేఖర్ బాషాని నామినేట్ చేశాడు మణికంఠ. 'మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది ఒకేనా' అని మణికంఠ అనగానే.. ఒకేనా అంటే ఒకే కాదు అని శేఖర్ బాషా అనేసాడు. శేఖర్ బాషాని చూడగానే అందరికి ఒక్కసారిగా భోళే షావలి గుర్తొచ్చాడు. అందరు మరో భోళే షావలి అని శేఖర్ బాషాని అంటున్నారు. ఆ తరువాత ప్రేరణ, సోనియాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రేరణ అయితే పిచ్చెక్కినట్టు అరుస్తూ కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ చూడాల్సిందే.   

రాఘవ అండర్ వేర్ మీద బులెట్ భాస్కర్ పేరు...

  జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బులెట్ భాస్కర్ కామెంట్స్ కానీ రాకెట్ రాఘవ కౌంటర్లు కానీ మాములుగా లేవు. భలే ఫన్నీగా ఉన్నాయి. సరదా శుక్రవారం, సరిపోదా శనివారం టీమ్స్ మధ్య గొడవలు ప్రతీ వారం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం భాస్కర్ రాఘవకు ఒక సలహా ఇచ్చాడు. "రాఘవ గారు ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టిషర్ట్ మీద బులెట్ భాస్కర్, అండర్ వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమ్మానుయేల్ " అని పేర్లు రాసుకోండి అనడు. వెంటనే రాఘవ "సారీ అండి అండర్ వేర్ మీద భాస్కర్ పేరు రాసేసుకున్నా ఆల్రెడీ" అన్నాడు దానికి అందరూ పడీపడీ నవ్వేసాడు. "లక్ష రూపాయలు తెచ్చారా" అని భాస్కర్ అనేసరికి ఇలా అంటే అలా వస్తాయి అన్నాడు రాఘవా." "మా దగ్గర తీసుకున్న డబ్బులేగా ఎలా అరుగుతుందండి" అన్నాడు భాస్కర్ కుళ్లిపోతూ వెంటనే రాఘవ తన అండర్ వేర్ మీద చెయ్యేసి ఊరుకో భాస్కర్ ఊరుకో" అనేసరికి మాములుగా నవ్వలేదు అందరూ. కార్తీక్ ఇలా అని రాఘవ పిలిచేసరికి నడుచుకుంటూ వెళ్ళాడు అది చూసిన రాఘవ చూసావా "నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం" అని కౌంటర్ వేసాడు.

బిగ్ బాస్ లో ఈ సారి కెప్టెన్సీ పదవి లేదు.. హౌస్ లో ముగ్గురు ఛీఫ్ లు వాళ్ళెవరంటే!

  బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజు గొడవలతో, టాస్క్ లతో ఫుల్ కంటెంట్ దొరకింది. అయితే ఈసారి హౌస్ లో కెప్టెన్లు లేరంటూ ముందే బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్లు కాకుండా ఆ ప్లేస్‌లో ముగ్గురు చీఫ్‌లు ఉంటారని బిగ్‌బాస్ చెప్పాడు.  ఇక సీజన్ గ్రాండ్ లాంఛ్ టైమ్‌లో విన్ అయిన మూడు బడ్డీ జంటలకి మొదటి టాస్కు పెట్టాడు బిగ్‌బాస్ . "పట్టుకొని ఉండండి వదలకండి" అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం.. ఒక కేజ్‌లో రంగు రంగుల తాళ్లు ఉన్నాయి. వాటిని ఎక్కువసేపు పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే పట్టుకున్న వాళ్ల తాడును స్పిన్నింగ్ వీల్‌లో వచ్చే కలర్ బట్టి సంఛాలక్ కట్ చేస్తుంటాడు. చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్లే విన్నర్. ఇక ఈ గేమ్‌లో బేబక్క, యష్మీ గౌడ, నబీల్, నిఖిల్, నైనిక, శేఖర్ బాషా పాల్గొన్నారు. ఇందులో చివరి వరకు నిలబడి నిఖిల్ విన్నర్ కావడంతో హౌస్‌కి మొదటి చీఫ్ అయిపోయాడు.  మొదటి టాస్కులో ఓడపోయిన ఐదుగురు కంటెండర్లకి బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు. కోన్ గేమ్ అంటూ పెట్టిన రెండో టాస్కులో నైనిక అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ టాస్కులో గెలిచి హౌస్‌కి రెండో చీఫ్ అయిపోయింది. అయితే ఈ టాస్కుకి కిరాక్ సీత సంచాలక్‌గా చేసింది. ఆ సమయంలో తనని పక్కకెళ్లి ఆడుకోమంటూ నిఖిల్ అనడం తనకి నచ్చలేదంటూ గేమ్ అయిపోయిన తర్వాత మణికంఠతో చెప్పింది సీత. అప్పటికే నిఖిల్‌తో గొడవ అవ్వడంతో.. నువ్వు సైలెంట్‌గా ఉండకు ముఖం మీదే చెప్పెయ్ అంటూ సీతతో మణికంఠ అన్నాడు.  మిగిలిన నలుగురిలో ఒకరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలంటూ అప్పటికే చీఫ్‌లు అయిన నిఖిల్, నైనికలను కోరాడు బిగ్‌బాస్. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. మిగిలిన నలుగురిలో గేమ్ పరంగా చూసుకుంటే నబీల్, శేఖర్ బాషా బాగా ఆడారు. బేబక్క అయితే అసలేం ఆడలేదు. యష్మీ కూడా ఫర్లేదు కాబట్టి యష్మీని చీఫ్‌గా సెలక్ట్ చేద్దామంటూ నైనికతో నిఖిల్ అన్నాడు. నైనిక మాత్రం నబీల్ బాగా ఆడాడంటూ చెప్పింది. కానీ కన్విన్స్ చేసేసి మరీ సింపుల్‌గా యష్మీని సెలక్ట్ చేయించేశాడు నిఖిల్.  నేను సరిగ్గా టాస్కులో పర్ఫామ్ చేయలేదు.. కానీ నాలో ఏం చూసి మీరు నన్ను సెలక్ట్ చేశారో నాకు తెలియదు. చీఫ్‌లుగా ఉండటానికి మీరు అర్హులని ఈ నిర్ణయంతో తెలిసింది. ఇదంతా నా అదృష్టం ఏమో అంటూ చెప్పుకొచ్చింది యష్మీ. ఇక్కడే మిగిలిన కంటెస్టెంట్లకి కాలింది. తను సరిగా ఆడలేదని తనే ఒప్పుకున్నా కూడా యష్మీని చీఫ్‌గా ఎలా సెలక్ట్ చేశారంటూ తగులకుంది సోనియా ఆకుల. తనకంటే అన్ని విధాలా టాస్కుల్లో, మాట్లాడటంతో అన్నింట్లో నబీల్ బెస్ట్ అంటూ సపోర్ట్ చేసింది. యష్మీ అసలు చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. చాలా విషయాల్లో ఆమె కంటే నబీల్ బెస్ట్ అంటూ వాయిస్ రెయిజ్ చేసింది సోనియా. దీంతో తన గురించి ఎందుకు లాగుతన్నావంటూ యష్మీ కూడా గొడవకి దిగింది. కానీ యష్మీ వైపు చూడకుండా నిఖిల్, నైనికలకి పాయింట్ టూ పాయింట్ ఇచ్చిపడేసింది సోనియా ఆకుల. చీఫ్ అంటే ఏదో అదృష్టం వల్ల ఇవ్వడం కాదు ఎవరు అర్హులో వాళ్లకి ఇవ్వాలి.. ఇక్కడ ఫ్రెండ్ షిప్‌ను చూడటం కరెక్ట్ కాదంటూ సోనియా ఫైర్ అయ్యింది.

Bezawada Bebakka vs Sonia : కుక్కర్ తో మొదలైన హీటెడ్ ఆర్గుమెంట్స్!

    బిగ్ బాస్ సీజన్-8 లో హీటెడ్ ఆర్గుమెంట్స్ మొదలయ్యాయి. ఎవరు తగ్గట్లేదు.. మొదట హౌస్ లోకి నాగ మణికంటని బయటకి పంపిద్దామని అందరు ఓట్ చేయగా.. అతను అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు. దాంతో నిఖిల్ వెళ్ళి వివరించే ప్రయత్నం చేయగా అతను వినిపించకపోగా నిఖిల్ ని సాగదీయకని చెప్పాడు. ఇక హౌస్ లోకి బిగ్ బాస్ ఫుడ్ ఐటమ్స్ పంపించగా అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హౌస్ లో అందరు ఎవరి డ్యూటీ ఏంటో వాళ్ళు ఫిక్స్ అయ్యారు.‌ఇక కిచెన్ లోకి బేబక్క అండ్ టీమ్ వెళ్ళారు. ఇక బిగ్ బాస్ పంపిన కొత్త కుక్కర్ తో హౌస్ మేట్స్ తంటాలు పడ్డారు. కుక్కర్ లో సరిగ్గా పప్పు ఉడకడం లేదంటూ బేబక్క వచ్చి సోఫాలో కూర్చుంది. 'మా ఆకలంటే మీకు ఇర్రెస్పాన్సిబుల్ ఆ' అంటూ బేబక్క మీద సోనియా ఫైర్ అయ్యింది. అది ఫుడ్ .. అందరు ఆకలితో ఉన్నారు.. ‌ఇప్పుడు వచ్చి కుక్కర్ ఆఫ్ చేసి కూర్చుంటే ఎలా అంటూ సోనియా అనగానే.. నిఖిల్ వివరించే ప్రయత్నం చేశాడు. అయిన సోనియా తగ్గకుండా గొడవ పెట్టుకోవాలనే వాయిస్ ఎక్కువ చేసి బేబక్క మీద ఫైర్ అయింది. దానిని బేబక్క సున్నితంగా తీసుకొని సోనియాతో గొడవ పడకుండా కుక్కర్ దగ్గరికు వెళ్ళి మళ్ళీ ప్రయత్నం చేసింది. దాంతో గొడవ జరగకుండా అది ముగిసింది. అయితే సోనియా మాత్రం కంటెంట్ కోసమే చేస్తున్నట్లు ఒక వర్గం ఆడియన్స్ అనిపించగా.. మరోవిధంగా తను వ్యాలిడ్ పాయింట్లే మాట్లాడుతుందని అనిపిస్తుందని అనేవారు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ ఆర్జీవీ బ్యూటీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎవరినో ఒకరికి టార్గెట్ చేస్తూ ఇచ్చిపడేస్తుంది. హౌస్ లో జరిగే టాస్క్ లలో, గేమ్స్ లలో ఈ బ్యూటీ ఎలా పర్ఫామెన్స్ చేస్తదో చూడాలి మరి.   

Shekhar basha: శేఖర్ బాషాపై ఆర్జీవీ బ్యూటీ సోనియా ఫైర్...

  బిగ్ బాస్ గ్రాంఢ్ గా మొదలై మొత్తం ఏడు జోడీలుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళారు. వారిలో వారికి అప్పుడే గొడవలు మొదలయ్యాయి. మొదటిది శేఖర్ బాషా, ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల మధ్య జరిగింది. అదేంటో ఓసారి చూసేద్దాం.. బిగ్ బాస్ వేకప్ సాంగ్ వేసాక అందరు డ్యాన్స్ చేసి వస్తారు. ఫుడ్, అండ్ గ్రాసరీ పంపిస్తారు బిగ్ బాస్. ఇక ఈ ఫుడ్ ని మీరు జాగ్రత్తగా వాడుకోవాలని కండిషన్ కూడా చెప్తాడు. ఆయితే కాసేపటికి శేఖర్ బాషా అండ్ బ్యాచ్ ఆరెంజెస్‌తో క్యాచ్‌లు ఆడుకోవడం మొదలెట్టారు. ఇది చూసిన ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల.. ఓ డైలాగ్ కొట్టింది. ఎవరు ఆరెంజెస్‌తో ఆడుతున్నారో వాళ్లెవరూ తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ ఆర్డర్ వేసింది. అయిన ఫుడ్డుతో ఆడుకోవడమేంటి అంటూ ఫుల్ ఫైర్ అయ్యింది. దీనికి అందరూ సైడ్ అయిపోయిన శేఖర్ బాషా మాత్రం తన యూట్యూబ్ వాదనలు మొదలెట్టేశాడు. బిగ్‌బాస్ రూల్స్‌లో ఫుడ్డుతో ఆడకూడదని ఎక్కడైనా రాశాడా.. అయినా ఆరెంజెస్‌తో ఆడకూడదని చెప్పడానికి నీకేం రూల్ ఉందంటు శేఖర్ బషా ఎదురుతిరిగాడు. దీనికి అంతే స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చింది సోనియా. నీకు ఇచ్చిన ఫుడ్ ని నువ్వు కింద పడేసుకొని తిను, ఎక్కడైనా పడేసుకొని తిను నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు.. నీ ఫుడ్డును నువ్వు డ్రైనేజ్‌లో వేసుకొనైనా తిను.. నీ ఇష్టం అది..ఎవరైతే మనుషుల్లాగ తిందామనుకుంటున్నారో వాళ్లకి మాత్రం ఇవి పెట్టకండి అంటూ శేఖర్ పై సోనియా ఫుల్ ఫైర్ అయింది. ఇక సోనియాకి శేఖర్ బాషా కూడా గట్టిగానే కౌంటర్ వేశాడు. ఇదేమైనా దేశ జెండానా.. దీనికి అంత గౌరవం ఇవ్వడానికి అంటూ ఏదేదో మాట్లాడాడు. ఫుడ్ అంటే అంతకంటే ఎక్కువే అంటూ మరో పంచ్ ఇచ్చింది సోనియా. అంటే ఇప్పుడు కిందపడిన దాన్ని తింటున్న నేను పశువునా.. నేను మనిషిని కాదా అంటూ చేతిలో ఉన్న ఆరెంజ్‌ను తినేశాడు శేఖర్ బాషా. ఇక హౌస్ లో మొదటి రోజే సోనియా, శేఖర్ బాషా గొడవపడ్డారు. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి.  

Karthika Deepam2 : నువ్వు పనిమనిషి కూతురివి.. షాక్ లో జ్యోత్స్న!

  స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -139 లో.... వచ్చాక ఒక విషయం చెప్తానని కార్తిక్ కి ఫోన్ లో చెప్తుంది దీప. ఆ తర్వాత శౌర్య వచ్చి అమ్మ ఫోన్ చేసిందా అని అడుగుతుంది. హా ఇప్పుడే చేసింది బయలుదేరారట.. ఆలోపు మనం సరదాగా బయటకు వెళదామని శౌర్యని తీసుకొని కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు సుమిత్ర దాస్ అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. పారిజాతం వెళ్తుంటే.. అత్తయ్య మీతో జ్యోత్స్న గురించి మాట్లాడాలని అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి నా గురించి గ్రానీ తో ఎందుకు మాట్లాడ్డడమని జ్యోత్స్న అంటుంది. చిన్నచిన్న పొరపాట్లకి కూడ ఒక్కొక్కసారి పెద్ద శిక్ష పడుతుందని సుమిత్ర అనగానే.. అవును దీప నిన్ను కాపాడిందని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే.. ఇప్పుడు నాకే తలనొప్పిగా తయారైందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత నీ గురించి తెలిసినవాళ్లే కాదు ఒక్కరోజు నీతో ఉన్నా.. నీ గురించి తెలుస్తుంది. దాస్ ఎవరిని ఏం అనడివాడు.. నా పెంపకం బాలేదు అన్నాడని సుమిత్ర అనగానే.. వాడు ఎవడు నా గురించి మాట్లాడడానికి అని జ్యోత్స్న కోప్పడుతుంది. అన్న వాళ్ళపై అరవడం కాదు తప్పుని సరిదిద్దుకోవాలని సుమిత్ర అంటుంది. నీ కొడుకు ఎక్కడ గ్రానీ అంటు జ్యోత్స్న కోపంగా వెళ్తుంది.‌ ఆ తర్వాత రోడ్డు మీద స్పీడ్ గా వెళ్తున్న జ్యోత్స్నకి దాస్ ఎదురుపడతాడు. నేను ఎలా ఉండాలో మా మమ్మీతో చెప్పడానికి.. నువ్వు ఎవరని దాస్ ని నిలదీస్తుంది జ్యోత్స్న. నీ కొడుకుతో రాఖీ కట్టించుకున్నా అని నిన్ను బాబాయ్ అనుకోవట్లేదు.. ఏదో మా బావ కోసం మిమ్మల్ని భరించమని జ్యోత్స్న అంటుంది. నా ప్రవర్తన, పద్ధతుల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరని జ్యోత్స్న అనగానే.. నన్ను ఎవరు అంటున్నావ్.. అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా అని దాస్ అంటాడు. నేనెవరో నాకు తెలియకపోవడమేంటని జ్యోత్స్న అనగానే.. వచ్చి కార్ ఎక్కు నువ్వు ఎవరో.. నేను ఎవరో అంతా చెప్తానని దాస్ అంటాడు. మరొకవైపు దీప, అనసూయలు శౌర్యకి సైకిల్ తీసుకొని వస్తుంటారు. ఇకనుండి మనకి ఏం సమస్య లేదని దీప అనగానే.. అప్పుడే ఒక స్వామి వచ్చి.. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది.. నువ్వు శ్రీమంతుల బిడ్డవు.. నువ్వు చేరవలసిన చోటుకే చేరావని అనగానే.. అంటే దీప శ్రీమంతుల బిడ్డనా అని అనసూయ మనసులో అనుకుంటుంది. అవును నువు అనుకుంది నిజమేనని స్వామి అనగానే.. అనసూయ షాక్ అవుతుంది. స్వామి వెళ్ళిపోయాక మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అనసూయని దీప అడుగుతుంది. ఆ రోజు పిండం పెట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడ బ్రతికి ఉన్నవాళ్ళకి పిండం పెడితే ముట్టవన్నాడు. అసలు నా తండ్రి కుబేరేనా అని దీప అనగానే.. అంటే దీప తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అన్నమాట అనుకుంటుంది. కుబేర్ తన తండ్రి కాదన్న విషయం దీపకి అనసూయ చెప్పకుండా డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు జ్యోత్స్నని చిన్నప్పుడు తను పుట్టిన హాస్పిటల్ కి తీసుకొని వచ్చి నిజం చెప్తాడు దాస్‌. సుమిత్ర గారి కూతురిని మార్చేశి పనిమనిషి కూతురిని ఆ ప్లేస్ లో పెట్టారు. ఆ పనిమనిషి నా భార్య.. అంటే నువ్వు నా కూతురివి అని దాస్ అనగానే.. నో అంటూ జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : అర్థరాత్రి భార్యాభర్తల ముచ్చట్లు.. అత్త మాస్టర్ ప్లాన్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -191 లో.....రామలక్ష్మి శ్రీలత గదిలోకి వెళ్లి పడుకుంటుంది. దాంతో సీతాకాంత్ లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. తన పక్కన రామలక్ష్మి ఉందని ఉహించుకొని తన మనసులో మాటలు చెప్తుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి.. ఏంటి మనవడా నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. తాతయ్య నువ్వా అంటూ సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. అందుకే నీ మనసులో మాటని నీ భార్యకి చెప్పమని చెప్పానంటూ పెద్దాయన అంటాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి.. అమ్మ దూరంగా ఉండమని చెప్పింది కదా అని సీతాకాంత్ అంటాడు. మీ అమ్మ కలిసి ఉండకూడదు అంది కానీ మాట్లాడుకోకని చెప్పలేదు కదా ఇప్పుడు వెళ్లి నీ మనసులో మాటని రామలక్ష్మికి చెప్పమని పెద్దాయన అనగానే సీతాకాంత్ సరే అంటాడు. మరొకవైపు నందిని ఫోటో షూట్ కోసం సీతాకాంత్ కి సూట్ తీసుకంటుంది. దాన్ని చూస్తూ మురిసిపోతుంటే.. అప్పుడే హారిక వస్తుంది. నువ్వు కొన్నావ్ సరే తను వేసుకుంటాడా అని అడుగుతుంది. తనకి నాపై ప్రేమ ఉంది ఖచ్చితంగా వేసుకుంటాడని నందిని అంటుందిమ. నందిని అలా సీతాకాంత్ పై ప్రేమ చూపించడం చూసి ఆశ్చర్యపడుతుంది. ఆ తర్వాత శ్రీలత పైన పడుకుంటానని లేస్తుండగా అప్పుడే సీతాకాంత్ డోర్ కొడతాడు. దాంతో మళ్ళీ వెంటనే వెళ్లి పడుకుంటుంది. సీతాకాంత్ డోర్ తీసి పేపర్స్ తో రామలక్ష్మిని నిద్ర లేపుతాడు. వీడేంటి ఇలా చేస్తున్నాడని శ్రీలత అనుకుంటుంది. రామలక్ష్మి లేచి సీతాకాంత్ దగ్గరికి వెళ్లి ఏంటని అడుగుతుంది. నీతో మాట్లాడాలి పద అంటూ బయటకు తీసుకొని వస్తాడు.రామలక్ష్మితో తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. అది తప్ప అన్నీ మాట్లాడతాడు. మరొకవైపు వెళ్లేంటి ఇంకా రావడం లేదని శ్రీవల్లి దగ్గరికి శ్రీలత వెళ్లి.. నిద్రలేపి రామలక్ష్మిని గదిలో నుండి సీతా బయటకు తీసుకొని వచ్చాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్లు మాత్రం కలవకుండా చూడమని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత సందీప్ ని శ్రీవల్లి నిద్ర లేపి బలవంతంగా బయటకు తీసుకొని వస్తుంది. సీతాకాంత్ రామలక్ష్మిలు కూర్చొని ఉన్న దగ్గరే శ్రీవల్లి, సందీప్ లు కూర్చొని ఉంటారు. సీతాకాంత్ తన ప్రేమ విషయం చివరికి ధైర్యం చేసి చెప్తుంటే.. అప్పుడే సందీప్ తో శ్రీవల్లి మాట్లాడడం వినిపిస్తుంది. అది విని సీతాకాంత్ చెప్పకుండా ఆగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. రాహుల్ అరెస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -504 లో..  కళ్యాణ్ తో అటో దిగాక కావ్య మాట్లాడుతుంది. నువ్వు ఎంచుకున్న దారి కరెక్ట్ కానీ అక్కడే ఆగిపోకు.. ఇదే నీ గోల్ కాదు.. నీ గోల్ ని చేరుకోవడానికి ఇది ఒక దారి అని కళ్యాణ్ ని కావ్య మోటివేట్ చేస్తుంది. నువ్వు అనుకున్నది.. నువ్వే సాధించి చూపించపని కావ్య వెళ్తు.. ఛార్జి డబ్బులు చేతిలో పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణ హాల్లో కూర్చొని బుక్ చదువుతుంటే.. తనకి ఛాతిలో నొప్పి లేస్తుంది. అది గమనించిన సుభాష్ దగ్గరకి వస్తుంటే వద్దని అపర్ణ అంటుంది. సుభాష్ వెళ్లి రాజ్ ని తీసుకొని వస్తాడు. రాజ్ అపర్ణ దగ్గరికి వస్తాడు. సుభాష్ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసాక.. మీకు తనపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం.. ఆవిడ టాబ్లెట్స్ వాడడం లేదు.. ఇది వరకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి కదా అని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది కావ్య అవసరం ఉంటేనే అత్తని పట్టించుకుంటావా నీ అత్త ఏమో నీ గురించి గొప్పలు చెప్తుందని కావ్యని రుద్రాణి అంటుంది. కావ్యకి ఒక్కదానికేనా బాధ్యత.. నీకూ లేదా అంటు రుద్రాణికి చురకలు అంటిస్తుంది ఇందిరాదేవి. నాదే తప్పు నా అత్త గురించి నేనే పట్టించుకోవాలి.. ఇక నుండి అత్తయ్యని నేనే చూసుకుంటానని కావ్య అనగానే.. ఇదిగో టాబ్లెట్స్.. నువ్వు దగ్గర ఉండి చూసుకో.. నీకు వీలు కాకపోతే నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. మరొక వైపు అప్పు దగ్గరకి కళ్యాణ్ వచ్చి అయిదు వందలు ఇస్తాడు. ఇదిగో నా మొదటి సంపాదన అని అనగానే.. జాబ్ వచ్చిందా అని అడుగుతుంది. వచ్చింది డేటా ఎంట్రీ అని చెప్తాడు. మరి నెలకు శాలరీ ఇస్తారు కదా అని అప్పు అనగానే మనకి డబ్బులు కావాలి కదా అందుకే డైలీ పేమెంట్ చెయ్యమన్నానని చెప్తాడు.‌ కానీ కళ్యాణ్ అటో నడుపుతున్నాడనే విషయం అప్పుకి చెప్తే బాధపడుతుందని అబద్దం చెప్తాడు. మరుసటిరోజు దుగ్గిరాల ఇంటికి పోలీసులు వచ్చి.. అక్రమంగా బంగారం తరలిస్తుంటే పట్టుకున్నాము. అది మీ కంపెనీకి సప్లై అవుతుందని తెలిసింది.. అందుకే రాజ్ గారిని అరెస్ట్ చెయ్యడానికి వచ్చామని పోలీసులు అంటారు. రాహుల్ నువ్వే ఆఫీస్ కి వెళ్తున్నావ్? ఏంటి అని అందరు అడుగుతారు. నేను రెండు రోజుల నుండే ఆఫీస్ కి వెళ్తున్నాను.. నాకు తెలియదని రాహుల్ అంటాడు. రాజ్ చేసిన దానికి నా కొడుకుని అంటారని రుద్రాణి అంటుంది. కంపెనీ నాది కాబట్టి నేనే బాధ్యత వహిస్తానని పోలీసులకి రాజ్ కోవపరేట్ చేస్తానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో నువ్వు ఫ్రాడ్ చేసి నా కొడుకుని ఇరికించాలని చూస్తున్నావా అని రాజ్ ని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత  రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే.. కావ్య వచ్చి ఈ ఫైల్ తీసుకొని చుడండి‌ అన్ని మీకే తెలుస్తదని ఇన్‌స్పెక్టర్ కి కావ్య ఫైల్ ఇస్తుంది. అది చూసి ఇన్స్పెక్టర్ తప్పు చేసింది రాహుల్ అని అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మోక్షతో దొరికిపోయిన విష్ణు ప్రియ.. డబ్బుకోసమే ఇలా చేసిందా?

  బిగ్ బాస్ సీజన్-8 మొదలైన రెండో రోజు నుండే ట్రోలింగ్ మొదలైంది. ఎంతలా అంటే లోపలికి వెళ్ళే ముందు కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలని తీసుకొని సోషల్ మీడియాలోని కొంతమంది మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అందులో మొదటగా విష్ణుప్రియ చేరింది. విష్ణుప్రియ, రీతు చౌదరి ఇద్దరు బిగ్ బాస్ లోకి వెళ్తారనే టాక్ నిన్నటిదాకా వినిపించింది. ఇక నిన్నటితో విష్ణుప్రియ ఒక్కతే కన్ఫమ్ అని తేలిపోయింది. అయితే బిగ్ బాస్ కి వెళ్ళేముందు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. తనకి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదని, అసలు వెళ్ళనని చెప్పింది. తనేం అందంటే.. ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లను.. బయట ప్రపంచం చాలా అందంగా ఉంది.. అలాంటప్పుడు ఒక ఇంట్లోనే ఎందుకు ఉండాలి.. మన ఇంట్లో వాళ్లుంటారు.. వాళ్లని చూసుకోవాలి.. నేను బిగ్ బాస్ పర్సన్‌ని కాను.. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ చూడలేదు.. నేను అసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చేయను.. మీకు లిఖిత పూర్వకంగా రాసిస్తాను.. నేను ఎప్పుడూ ఆ షోకి వెళ్లనంటూ విష్ణు ప్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విష్ణుప్రియ అంత మాట్లాడి..ఇప్పుడు ఎందుకు వెళ్లిందంటూ నెటిజన్లు  ట్రోలింగ్ చేస్తున్నారు. డబ్బు కోసమే వెళ్లి ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే విష్ణుప్రియ స్టేజ్ మీద మాత్రం ఇంకోలా చెప్పింది. గత సీజన్ నుంచే తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టుగా ఓ విజన్ వచ్చిందని చెప్పేసింది. విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి. ఇప్పుడు విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. ఇక విష్ణుతో పాటు నాగపంచమి సీరియల్‌లో మోక్ష అనే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పృథ్వీ శెట్టి కూడా బిగ్‌బాస్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీని యాంకర్ విష్ణుతో కలిపి జంటగా హౌస్‌లోకి నాగార్జున పంపిచాడు. 

Bigboss 8 Telugu : ఈసారి బిగ్ బాస్ హిట్టా? ఫట్టా?

  బిగ్ బాస్ గ్రాంఢ్ లాంఛ్ ఆదివారం రోజు అట్టహసంగా మొదలు అయింది. ఈ సీజన్ అన్ని సీజన్ కంటే డిఫరెంట్ గా లిమిట్ లెస్ గా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ హౌస్ లోకి 14 మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో సగానికి సగం మంది జనాలకి తెల్సి ఉండరు. ఈ సారి సింగింగ్ కి సంబంధించిన ఒక్క కంటెస్టెంట్ కూడా లేరు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ కూడా జరగలేదు. కంటెస్టెంట్స్ లో ఇద్దరు, ముగ్గురు కొంచెం నాగార్జునని కాకా పట్టాలని ట్రై చెయ్యడానికే వచ్చినట్లు అనిపించింది. బెజవాడ బేబక్క స్టేజి మీద కొంచెం ఓవర్ అనిపించిన, బాషా వచ్చాక ఇద్దరికి ఇద్దరు సరిపోయారు అన్నట్లు ఉంది. ఇక స్టార్ మా టీవీలో‌ వచ్చిన 'కృష్ణ ముకుంద మురారి' హీరయిన్స్ యష్మీ గౌడ, ప్రేరణ కుంభం ఇద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  సెలెబ్రిటీలుగా రానా దగ్గుబాటి, నివేతా థామస్ హౌస్ లోకి జంటగా వెళ్లి.. వాళ్ళతో గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత నాని తన న్యూ మూవీ హీరోయిన్ తో కలిసి హౌస్ లో ఎంట్రీ ఇచ్చి గేమ్ అడించాడు. హౌస్ లోకి పద్నాలుగు మంది ఎంట్రీ అయ్యాక డైరెక్టర్ అనిల్ రావిపుడిని హౌస్ లోకి పంపించగా హౌస్ లో మొదటి రోజే ఫిట్టింగ్ పెట్టాడు. ఒకరిని నాతో తీసుకొని వెళ్లి వేరే వాళ్ళని స్వాప్ చేస్తానని అందరి కంటెస్టెంట్ ఒపీనియన్ అడుగుతాడు. అందరూ నాగ మణికంఠ పేరు చెప్పగా.. అప్పుడే అందరిపై తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. ఆ తర్వాత నాగ మణికంట ఏడుస్తుంటే ఫ్రాంక్ అని అనిల్ రావిపుడి చెప్తాడు. కానీ అందరు అతని పేరు చెప్పారన్న కోపం మాత్రం మణికంఠ ఫేస్ లో కన్పించింది. ఇక నామినేషన్ కి నాంది పలికినట్లే. ఈ సీజన్లో నో కెప్టెన్, నో రేషన్ అంట ఎవరు సంపాదించుకున్నంత వాళ్లకు.. అంతేకాకుండా ప్రైజ్ మనీ కూడా జీరో.. అది కూడా వాళ్లు అడే గేమ్ ని బట్టి నెంబర్ మారుతుంది. మరి వచ్చిన కంటెస్టెంట్స్ లో‌ మీ ఫేవరెట్ ఎవరు? ఈ సీజన్ హిట్ అవుతుందా లేదా మీ ఒపినీయన్ కామెంట్ చేయండి.  

బెజవాడ బేబక్క గురించి ఎవరికి తెలియని నిజాలు!

  బిగ్ బాస్ సీజన్ 8 లోకి 7వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన బేబక్క చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈమె యూట్యూబ్ లో కామెడీ వీడియోస్ ద్వారా వైరల్ గా మారింది. ముఖ్యంగా మంచు లక్ష్మిలాగా మాట్లాడడంతో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది.  అసలే వెటకారం, కామెడీ కాస్త ఎక్కువేమో.. బేబక్క ఎంట్రీ కూడా అలానే ఇచ్చింది. నాగ్ రమ్మని పిలిస్తే రాకుండా స్టేజ్ మీదకి ఎవరితోనే హార్ట్ సింబల్స్ పంపింది. ఇక చిరాకొచ్చి ఈసారి రాక తప్పదని అంటే అప్పుడు సిగ్గుపడుతూ ఎంట్రీ ఇచ్చింది. ఇక నాగ్‌ని చూస్తూ ఆమె సిగ్గుపడిన ప్రతిసారి.. దయచేసి మీరు సిగ్గుపడకండి అంటూ అదుర్స్‌లో బ్రహ్మీ చెప్పిన డైలాగ్‌యే గుర్తొచ్చింది. ఇక నాగ్ కోసం ఒక పాట కూడా పాడింది బేబక్క. బెజవాడ బేబమ్మలు, బేబక్కలు ఎక్కువ ఉంటారని వాళ్లకి కనెక్ట్ కావడం కోసమే బెజవాడ బేబక్కగా మారానంటు చెప్పింది‌. బెజవాడ బేబక్కగా యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈమె అసలు పేరు మధు నెక్కంటి. డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈమెసి స్వయానా పెద్దనాన్న. బెజవాడ బేబక్క అమ్మ వాళ్ల అక్కనే రాఘవేంద్రరావు వివాహం చేసకున్నారు. ఇండస్ట్రీతో కూడా ఈమెకి బాగా టచ్ ఉంది.  బేబక్క స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చి నాగార్జున ని చూస్తూ సిగ్గుపడుతుంది. నా కలల వీరుడు నువ్వే అంటూ వయ్యారలు తిప్పుకుంటూ ఉంటే గత సీజన్లో వచ్చిన కరాటే కళ్యాణిని గుర్తుచేసుకుంటారు. బేబక్క ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే రెండో మూడో వారంలోనే బయటకు వచ్చేలా కన్పిస్తుంది. బేబక్క అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. కానీ ఆ తర్వాత అక్కడే కొన్ని వందల షోలకి యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క యాంకరింగ్ మాత్రమే కాకుండా మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్‌గా, స్టాండప్ కమెడియన్‌గా బేబక్క తనలోని టాలెంట్ మొత్తం చూపించింది. ఇక ఇండియాకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కంపోజింగ్‌‌లో పలు సాంగ్స్ పాడింది. నరేష్-పవిత్ర లోకేష్ చేసిన 'మళ్లీపెళ్లి' సహా 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ఎన్ని చేసిన సరైన బ్రేక్ రాకపోవడంతో మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది బేబక్క.   

Biggboss 8 telugu contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్-8 లో కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ నిన్న సెప్టెంబర్ 1న రాత్రి ఏడు గంటలకి గ్రాంఢ్ గా లాంచ్ అయింది. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఒక్కొక్కరు ఒక్కో‌ పంథాలో ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు అనేలా ఉన్నారు . మరి వారెవరో ఓసారి చూసేద్దాం. గత సీజన్ లాగే ఈ సీజన్ కి హోస్ట్ నాగార్జునే. ఇక హౌస్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఏడు జోడీలుగా లోపలికి వెళ్ళారు. ఇక హౌస్ లోకి వెళ్ళిన వారికి మూడు బ్యాడ్ న్యూస్ లు కూడా చెప్పేశారు బిగ్ బాస్. నో రేషన్, నో కెప్టెన్సీ, జీరో ప్రైజ్ మనీ అంటు కండిషన్స్ చెప్పేశారు. ఇక ఫన్, ఎంటర్‌టైన్మెంట్ కి లిమిటే లేదు అనే థీమ్ తో మొదలైన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ సెలెక్షన్ భిన్నంగా ఉంది. మొదటి కంటెస్టెంట్ గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మీ గౌడ(Yashmi Gowda) లోపలకి వచ్చేసింది. రెండవ కంటెస్టెంట్ గా నిఖిల్(Nikhil) వచ్చాడు. కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన నిఖిల్ తెలుగులో కొన్ని సీరియళ్ళలో నటించాడు. మూడవ కంటెస్టెంట్ గా అభయ్ నవీన్(Abhai Naveen) వచ్చాడు. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. పెళ్ళిచూపులు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్.. తను దర్శకుడిగా రామన్నా యూత్ అనే సినిమాని కూడా తీశాడు. నాల్గవ కంటెస్టెంట్ గా ప్రేరణ కంభం(Prerana Kambam) వచ్చింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ కృష్ణ పాత్రతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. తనకి పెళ్ళి జరిగి ఎనిమిది నెలలే అవుతుంది. అయిదవ కంటెస్టెంట్ గా ఆదిత్య ఓం( Aditya Om) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ఆదిత్య ఓం.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వగా కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆరవ కంటెస్టెంట్ గా నటి సోనియా(Sonia) హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆర్జీవీ స్పెషల్ విషెస్ చెప్పడంతో ఈ భామ  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఏడవ కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క(Bezawada Bebakka )ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఫన్ వీడియోలు, మిమిక్రీ, సింగింగ్, యాంకరింగ్.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ గా ఉన్న బెజవాడ బేబక్క.. హౌస్ లో ఫుడ్ అన్ లిమిటెడ్ గా కావాలని అంది. ఎనిమిదవ కంటెస్టెంట్ గా శేఖర్ బాషా ( Shekar Basha) ఎంట్రీ ఇచ్చాడు. ఆర్జేగా ఎన్నో సంవత్సరాలు చేసిన శేఖర్.. తాజాగా రాజ్ తరుణ్-లావణ్యల మధ్య జరిగిన గొడవలో దూరి వైరల్ అయ్యాడు.   తొమ్మిదవ కంటెస్టెంట్ గా కిర్రాక్ సీత(Kirrak seetha) ఎంట్రీ ఇచ్చింది. 'బేబి' సినిమాలో‌ నెగెటివ్ రోల్ లో కన్పించిన తనని తనని చాలామంది ట్రోల్ చేశారంట. తను ఆ పాత్ర చేశాను.‌.‌కానీ అలా నేనుండను అంటూ ఎమోషనల్ అయ్యింది. పదవ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ(Naga Manikanta) హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, పదకొండో కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్(Prithviraj )ఎంట్రీ ఇచ్చాడు. ఇక పన్నెండో కంటెస్టెంట్ గా విష్ణుప్రియ వచ్చేసింది. పదమూడవ కంటెస్టెంట్ గా నైనిక( Nainika)  ఎంట్రీ ఇవ్వగా, పద్నాలుగో కంటెస్టెంట్ గా నబీల్ ఆఫ్రిదీ ఎంట్రీ ఇచ్చాడు. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఈ ఆఫ్రిద హౌస్ లో ఎలా ఉంటాడో ఎమో చూడాలి మరి.  

బేబీ సినిమాలో సీత...బూతులతోనే ఫేమస్

  బిగ్ బాస్ సీజన్ 8 ఏడు జంటలు, పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. అయితే ఇందులో ఎవరు ఎంటనేది టీవీలో చూసిన ప్రేక్షకులకి అర్థమవుతుంది.  శేఖర్ భాషా, బెజవాడ బేబక్క, యష్మీ గౌడ, ప్రేరణ కంభం, సీరియల్ యాక్టర్ నిఖిల్, అభయ్ నవీన్, పృథ్వీరాజ్, కిరాక్ సీత, సబీల్ ఆఫ్రిదీ, నాగ మణికంట, నైనిత, విష్ణుప్రియ, సోనియా, ఆదిత్య ఓమ్ బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ లో హౌస్ లోకి వెళ్ళారు.   ఇక హౌస్ లోకి వెళ్ళిన వారి ఒక్కొక్కరి ఏవీలో చాలా డెప్త్ ఉంది. అయితే వారిలో కిర్రాక్ సీత ఏవీ ఇంప్రెసివ్ గా ఉంది. కిర్రాక్ సీత అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ 7 ఆర్ట్స్ సీత, బేబీ సినిమాలో సీత అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు.రాయలసీమ నంద్యాలలో పుట్టి పెరిగిన సీత తర్వాత హైదరాబాద్‌ షిఫ్ట్ అయింది.ఆమె తండ్రి దూరదర్శన్‌లో పనిచేసేవారు. ఇక నటనపై ఇంట్రెస్ట్‌తో అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేసింది సీత. కానీ ఎక్కడా దొరక్కపోవడంతో చివరికి 7 ఆర్ట్స్‌లో పని చేసింది. 7 ఆర్ట్స్ అంటేనే బోల్డ్ కంటెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో 7 ఆర్ట్స్ సరయు కూడా బిగ్‌బాస్‌లో సందడి చేసింది.7 ఆర్ట్స్‌లో చాలా కాలం పని చేసిన తర్వాత సీతకి బేబీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంతోనే ఈమెకి బ్రేక్ వచ్చింది. ఇక పలు ఇంటర్వ్యూల్లో తన గురించి పలు విషయాలు పంచుకుంది సీత. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఐదేళ్లు ఓ అబ్బాయితో రిలేషనల్‌లో ఉన్నానని కానీ బ్రేకప్ అయిపోయిందంటూ కూడా చెప్పింది. సీతకి కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. సినిమాల్లోకి రావడం కోసం ట్రై చేయడానికి ఇంట్లో వాళ్ల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన ఖర్చు మొత్తం తనే సంపాదించుకొని, చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది సీత. మరి బిగ్‌బాస్‌లో ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.  

బిగ్ బాస్ లో  నాగార్జునని ఆట ఆడుకున్న బెజవాడ బేబక్క.. 

  బిగ్ బాస్ సీజన్ 8 అట్టహాసంగా మొదలయ్యింది. అన్ లిమిటెడ్ అంటూ మొదలెట్టిన ఈ సీజన్ లో ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎలాంటి ఢోకా లేనట్లు ఉంది. ఎందుకంటే బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది కాబట్టి. అసలు వచ్చీ రావడంతోనే నాగార్జునని ఓ ఆట ఆడేసుకుంది బేబక్క. ఈమె అసలు పేరు మధు నెక్కంటి.  బెజవాడ బేబక్కగా ఎందుకు మారింది? హౌస్‌లోకి ఎవరితో కలిసి ఎంట్రీ ఇచ్చింది బేబక్క. నాగార్జునకి చాలా హార్ట్స్ పంపిందండి బాబూ.. దెబ్బకి నాగ్ అయితే ఏందిరా నాకు ఈ టార్చర్ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇక చివరగా నువ్వు రావాలి అనగానే బేబక్క వచ్చేసింది. ఇక ఆ తర్వాత శేఖర్ భాషా వచ్చేశాడు.‌ రీసెంట్ గా రాజ్ తరుణ్-లావణ్యల విషయంలో వైరల్ గా మారిన ఆర్జే శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. తనకి మ్యాడ్ వస్తే బిగ్ బాస్ టైటిల్ పట్టుకెళ్తా అన్నాడు. ఇక ఇద్దరు కలిసి జోడీగా లోపలికి వెళ్ళారు.‌  హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా యష్మీ గౌడ వచ్చేసింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ముకుంద పాత్రలో నెగెటివ్ పాత్రతో ఆకట్టుకుంది. రెండవ కంటెస్టెంట్ గా  నిఖిల్ వచ్చాడు. ఇతను సీరియల్ యాక్టరే కావడం విశేషం. ఇక వీరిద్దరు కలిసి హౌస్ లోకి వెళ్ళారు.  మూడవ కంటెస్టెంట్ గా అభయ్ నవీన్ అలియాస్ 'పెళ్ళి చూపులు' విష్ణుగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత రామన్నా యూత్ తో దర్శకుడిగా మారాడు. ఇతనిది సిద్దిపేట్ లోకల్ . ఇక ఇతనికి బడ్డీగా నాల్గవ కంటెస్టెంట్ గా ప్రేరణ‌ కంబం వచ్చింది. తను‌ కృష్ణ ముకుంద మురారి లో కృష్ణ పాత్రలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ప్రేరణ-అభయ్ ఇద్దరు కలిసి హౌస్ లోకి వెళ్ళారు. బిబి హౌస్ లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

Shekar Basha: శేఖర్ బాషా మగజాతి ఆణిముత్యమేనా!

  బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో అందరికి గట్టి పోటీ అనిపించేది మాత్రం శేఖర్ బాషా అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్టేజి పై నాగార్జున తో మాట్లాడిన విధానాన్ని బట్టి గొడవలకి కొదవ లేదని అనిపించింది.  నాతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే కప్ నేనే తీసుకొని పోతానంటూ తన అటిట్యూడ్ తో మాట్లాడాడు. శేఖర్ బాషా RJ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ప్రముఖ టీవీ ఛానెల్ లో యాంకర్ గా పని చేసాడు. దాదాపు 100 గంటలు మాట్లాడిన RJ గా ఎవరికి రాని గుర్తింపు తెచ్చుకుని అవార్డు సొంతం చేసుకున్నాడు బాషా. కానీ చాలా రోజుల పాటు తెరపై కనిపించలేదు. ఆర్జేగా కూడా అంత ట్రెండింగ్ లో లేడు.. మళ్ళీ బిగ్ బాస్ ద్వారా కేరీర్ ని రీస్టార్ట్ చేస్తున్నాడు. ఒక నెల రోజులుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా శేఖర్ బాషా పేరే వినిపించింది. హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో మధ్యలో దూరిన శేఖర్ బాషా మగాళ్ల హక్కుల కోసం పోరాడుతున్నానటూ గట్టిగానే ఫైట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్స్‌లో వాదించి చివరికి లావణ్య చేతిలో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. అలాంటి శేఖర్ బాషా మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఇండియాలోనే ఇప్పటివరకూ ఆర్జేగా ఎవరూ సాధించనన్ని అవార్డులు గెలుచుకున్నట్లు చెప్పాడు శేఖర్. 18 ఏళ్లలో ఆర్జేగా 8 అవార్డులు గెలుచుకున్నట్లు చెప్పాడు. 15 ఏళ్ల క్రితమే శేఖర్ ఆర్జేగా సూపర్ పొజిషన్‌లో ఉన్నాడు. ఎంతలా అంటే ఉత్తమ ఆర్జేగా అప్పట్లోనే మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్నాడు శేఖర్. తాజాగా జరిగిన రాజ్ తరుణ్-లావణ్యల విషయంలో ఫుల్ వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటాడో చూడాలి మరి.  

bigg boss telugu 8: ఆర్జీవి స్టూడెంట్  సోనియా బిగ్ బాస్ లోకీ ఎంట్రీ...

  తెలుగు  బిగ్ బాస్ కి RGV కీ ఎదో తెలియని అనుబంధం వుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ప్రతీ సీజన్లో నా స్టూడెంట్ ని తీసుకోవాలని బిబి టీమ్‌తో‌ ఆర్జీవీ ముందే అగ్రిమెంట్ చేసుకున్నాడేమో. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ మాట అంటారు. RGV తో వీడియోలు చేసి వైరల్ అయి సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో అషురెడ్డి, అరియానా, ఇనాయ సుల్తానా వీళ్ళు కూడా ఆ కోవకి చెందినవారే. బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందంటే RGV పిల్ల ఉండాల్సిందే‌ అన్నట్లుగా మారింది. ఈ సీజన్ లో సోనియా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి వెళ్లే వరకు కుడా ఆమె కనీసం ముఖపరిచయం కూడా లేని అమ్మాయి. స్టేజ్ పైకి ఎంట్రి ఇచ్చాక నాగార్జున ఒక సర్ ప్రైజ్ వీడియో చూపించాడు. RGV సోనియాని సపోర్ట్ చేస్తూ అల్ ది బెస్ట్ చెప్పిన వీడియోని బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. సోనియా RGV స్టూడెంటే అని నాగార్జున ఆ వీడియో ప్లే చేసి‌ చూపేవరకు తెలియదు. నటనలో నువ్వేంటో ప్రూ చేసుకున్నావ్.. ఇప్పుడు హౌస్‌లో కూడా నీ టాలెంట్ చూపిస్తావని నమ్ముతున్నాను. నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తావ్.. త్వరగా గెలిచి వచ్చేయ్.. మనం పార్టీ చేసుకుందామంటూ ఆర్జీవీ అన్నాడు. తనకి కరాటే, కలరి లాంటి విద్యలు కూడా వచ్చంటూ చెప్పింది సోనియా. బయట ఎవరి మీదైనా ట్రై చేశావా అంటూ నాగార్జున అడిగితే ఖచ్చితంగా చాలా మందికి పడ్డాయి అంటూ షాకిచ్చింది.  మరి ఈ ఆర్జీవీ బ్యూటీ  హౌస్ లో ఎలా పర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి మరి.