Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్ 8 ప్రోమో అదుర్స్.. ఈ సారి అన్ లిమిటెడ్ ఫన్!

తెలుగు బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. తెలుగు టీవీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ లాంఛ్ కి సమయం ఆసన్నమైంది. ఇందులో ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయింది. తాజాగా విడుదలైన ప్రోమోలో రాజ్ తరుణ్- లావణ్యల విషయంలో మాట్లాడిన శేఖర్ బాషా వాయిస్ స్పష్టంగా తెలుస్తోంది. అతనేం అన్నాడంటే నాతో వైరం పెట్టుకుంటే టైటిల్ కొట్టుకుని వెళ్లిపోతానని చెప్పాడు. ఇక గతంలో కంటే భిన్నంగా ఈసారి కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపబోతున్నారు. ప్రతిసారీ ఒక్కొక్కర్నీ హౌస్‌లోకి పంపుతుండగా ఈసారి ఇద్దరు చొప్పున జంటగా పంపిస్తున్నారు. మరి ఆ ఏడు జంటలెవరంటో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. నేను మాత్రం మీ కళ్లల్లోకి చూసి మాట్లాడలేను.. ఎందుకంటే ఆ కళ్లల్లోకి చూసి మాట్లాడితే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సర్ అని బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క అంది. ఇక తొలిరోజే కంటెస్టెంట్స్‌కి ఊహించని షాక్ ఇచ్చింది బిబి టీమ్. హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజే ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. ఆ ప్రాసెస్‌లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించారు. ఈసారి లిమిట్ లెస్ అంట.. ట్విస్ట్ అంట.. టర్న్ అంట.. ఇది ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెడుతున్నారని చెప్పిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు నేను ఒకర్ని బయటకు తీసుకుని వెళ్తున్నాను.. లక్కీ డ్రాలో వాళ్ల ప్లేస్ ఇంకొకర్ని స్వాప్ చేసి లోపలికి పంపిస్తామని చెప్తున్నాడు. అయితే ఇదేదో కంటెస్టెంట్స్‌ని టెన్షన్ పెట్టడానికి ఆడిన డ్రామాలాగే అనిపిస్తుంది. సెలెక్ట్ చేసి.. ఇంటర్వ్యూలు చేసి.. హౌస్‌లోకి పంపిన తొలిరోజే ఎలిమినేట్ చేయడం అయితే అంత నమ్మేట్టుగా లేదు. ఫన్ దర్శకుడుతో ఫన్ చేయిస్తున్నట్టుగానే ఉంది. నాని, రానా, నివేదా థామస్‌, ప్రియాంక మోహన్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. గెస్ట్‌లుగా రావడమే కాదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి కూడా వెళ్లారు. కంటెస్టెంట్స్ నవ్వుతూ సంతోషంగా ఉండటం చూసిన నాని.. మీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందని అనేశాడు.  ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలాగే కంటెస్టెంట్స్  ఫేస్ లు కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ రోజు రాత్రి ఏడు గంటలకి ప్రారంభమయ్యే బిగ్ బాస్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల బిబి అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా యూట్యూబ్ లో రిలీజైన ఈ ప్రోమో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Karthika Deepam 2 : కాశీ రాకతో గందరగోళం.. వాళ్ళిద్దరి పెళ్ళిని కార్తీక్ చేయగలడా!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -138 లో....శ్రీధర్ స్వప్నకి పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. దాంతో నన్ను ఇంత మోసం చేస్తావా మమ్మీ అని స్వప్న అనుకుంటుంది. నేనొక సారి అబ్బాయితో మాట్లాడుతనని స్వప్న అనగానే.. శ్రీధర్ సరే అని అబ్బాయిని పంపిస్తాడు. స్వప్న దగ్గరికి ఆ అబ్బాయి వచ్చాక.. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్న అని ఫోటో చూపించిగానే.. అతని పేరు కాశీ.. నాకు తెలుసని అతను అంటాడు. నువ్వు అతన్ని ప్రేమించావు.. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా పదా ముహూర్తం గురించి తెలుసుకుందామని అబ్బాయి అంటాడు. నాకు ఇప్పుడు విషయం అర్థమైంది.. ఇప్పుడు కాశీకి చెప్పి.. మేం నిర్ణయం తీసుకోవాలని స్వప్న అనుకొని.. కాశీకి ఫోన్ చేస్తుంది.. కానీ కలవదు. ఆ తర్వాత కార్తీక్ కాశీ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే శౌర్య వచ్చి కార్తీక్ తో మాట్లాడుతుంది. అప్పుడే కాశీ కూడా వస్తాడు. నిన్ను ఏమని పిలవాలని కాశీతో శౌర్య అనగానే.. దీపక్క అని పిలుస్తాను. కాబట్టి నువ్వు నన్ను మావయ్య అని పిలవమని కాశీ అంటాడు. ఈ విషయం అందరికి చెప్తానంటూ శౌర్య హ్యాపీగా వెళ్తుంది. కార్తీక్ తో బావ అంటు కాశీ మాట్లాడతాడు. బావ అంటే మీకు ఒకే కదా అని కాశీ అడుగుతాడు. వరుస కూడా అదే అవుతుంది కదా అని కార్తీక్ అంటాడు. మీరు నేను తెలియనప్పుడే హెల్ప్ చేశారు.. ఇప్పుడు నాకు బంధువులు అవుతారు.. మీ పెళ్లిలో అన్ని పనులు నేనే చూసుకుంటా బావ అని కాశీ అంటాడు. మా పెళ్లి బాధ్యత కూడా మొత్తం మీరే చూసుకోవాలని కాశీ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర దాస్ కి కాఫీ తీసుకొని వస్తుంది. మీ మంచితనం మీ కూతురికి రాలేదు వదినా.. మీ గుణం మీ పెంపకంలో లేదని దాస్ సుమిత్రతో జ్యోత్స్న గురించి మాట్లాడతాడు. ఆ మాటలు పారిజాతం వింటుంది. పారిజాతం చాటుగా వినడం శౌర్య చూస్తుంది. శౌర్య విందేమో అని పారిజాతం టెన్షన్ పడుతూ.. శౌర్యని ఎవరికి చెప్పాకూ అంటూ బుజ్జగిస్తుంటే.. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఏంటని అడుగగా.. మా అమ్మమ్మ , తాత మాట్లాడుకుంటుంటే చాటుగా వింటుంది.‌ తప్పు కదా అని శౌర్య అనగానే.. ఛీ నీకు బుద్ది రాదంటూ శివన్నయారాయణ పారిజాతాన్ని తిడతాడు. ఆ తర్వాత కార్తీక్ కి స్వప్న ఫోన్ చేసి.. విషయం చెప్తుంది. నాకు ఇప్పుడు చావు తప్ప.. వేరే లేదనగానే.. నేను మీ పెళ్లి చేస్తానని కార్తీక్ మాటిస్తాడు. ఆ తర్వాత శౌర్య వచ్చి కార్తీక్ ఫోన్ నుండి దీపకి చేస్తుంది. దీప లిఫ్ట్ చెయ్యదు. శౌర్య వెళ్తుంది. జ్యోత్స్న వస్తుంటే కార్తీక్ కి తల నొప్పి డిస్టబ్ చెయ్యకనగానే శౌర్యపై జ్యోత్స్న కోప్పడుతుంది. కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి నాతో మాట్లాడడం లేదని అడుగుతుంది. నన్ను కాసేపు వదిలేయమని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప ఫోన్ చేస్తుంది. కార్తీక్ చెప్పండి  అని దీప అనగానే.. నాతో మాట్లాడ్డం వీలు కాదు.. దీపతో మాట్లాడుతావా అని జ్యోత్స్న అనుకుంటుంది. నేను ఫోన్ చెయ్యలేదు శౌర్య చేసిందని కార్తీక్ అంటాడు‌. ఒక విషయం చెప్పాలి త్వరగా రండి అని కార్తీక్ అనగానే.. నేనొక విషయం చెప్పాలి ఇంటికి వచ్చాక చెప్తానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

జ్యోతిష్కుడి పేరుతో అత్తకి చుక్కలు చూపించిన కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -190 లో.....అందరు భోజనం చేస్తూ ధన గురించి మాట్లాడుకుంటారు. అక్కడ పర్మిషన్ రాగానే వచ్చేస్తానన్నాడు అని సిరి అంటుంది. వాడి ఆలోచన మొత్తం మీ దృష్టిలో మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకోవాలని ఉందని రామలక్ష్మి అంటుంది. తనకి ఏ సపోర్ట్ కావాలన్న చేస్తానని సీతాకాంత్ అంటాడు. అల్లుడికి మాత్రం అన్ని చేస్తారు. ఇక్కడ తమ్ముడికి ఏం చెయ్యరు. ఆఫీస్ లో పనివాడిగా ఉంటున్నారు.. అల్లుడు ఓనర్ అయిపోతున్నాడని శ్రీవల్లి అనగానే.. ఇప్పుడు మీ అయనకి ఎక్కడ విలువ తక్కువైందని పెద్దాయన అంటాడు. నోరు మూసుకొని తినమని శ్రీలత శ్రీవల్లిపై కోప్పడుతుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు.. తక్కువ కాదని సీతాకాంత్ అంటాడు. నన్ను మా ఆయనని దూరం చేస్తావా.. నీ సంగతి చెప్తానని రామలక్ష్మి అనుకుంటుంది. అత్తయ్య మీరు తినకూడదు మర్చిపోయారా.. ఉపవాసం ఉంటానని ఇందాక మమ్మల్ని దూరంగా ఉండమని జ్యోతిష్యడితో మీరు మాట్లాడడం నేను విన్నానని రామలక్ష్మి అంటుంది. అలా శ్రీలతని ఇరికిస్తుంది రామలక్ష్మి. కావాలంటే నెంబర్ ఇవ్వండి అడుగుతానని రామలక్ష్మి అనగానే.. అసలు జ్యోతిష్యుడే లేడు ఇప్పుడెలా అంటూ.. అవసరం లేదమ్మా గుర్తొచ్చింది తినను అంటుంది. ఇవన్నీ ఛాదస్తమని సీతాకాంత్ అనగానే.. అలా అయితే మనం దూరంగా ఉండడం కూడా ఛాదస్తమవుతుందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత మీరు కటిక నేలపై పడుకుంటానని కూడా అన్నారని రామలక్ష్మి చెప్తుంది. శ్రీలత ఏం చెయ్యలేక అవునని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి శ్రీలత కోసం పాలు తీసుకొని వస్తుంది. తనకి ఇవ్వకుండా తనే పాలు తాగుతుంది. అప్పుడే శ్రీవల్లి పాలు తీసుకొని వస్తుంది. దాంతో శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది. రామలక్ష్మి చేతిలో గ్లాస్ చూసి.. అత్తయ్య ఆల్రెడీ తాగేసారా అంటు తెచ్చిన పాలు శ్రీవల్లి తాగుతుంది. ఆ తర్వాత మీరు కిందపడుకోండి.. నేను పైన పడుకుంటానని రామలక్ష్మి అనగానే.. నువ్వే కిందపడుకోమని శ్రీలత కోప్పడుతుంది. ఇదంతా ఛాదస్తం అయితే.. నేను మా అయనకి దూరంగా ఉండడం ఎందుకని వెళ్తుంటే.. వద్దు కింద పడుకుంటానని శ్రీలత అంటుంది. శ్రీలత కింద పడుకుంటుంది. రామలక్ష్మి కావాలనే ఏసీ పెంచుతుంది. శ్రీలత చలికి వణుకుతుంది. మరొకవైపు రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. రామలక్ష్మి పక్కన ఉన్నట్టు ఉహించుకొని మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అదిరిపోయిన గుప్పెడంత మనసు సీరియల్ క్లైమాక్స్.. తండ్రీకొడుకులు ఒక్కటయ్యారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1168 లో..... వసుధారకి మను ఫోన్ చేసి.. మేడమ్ ఎక్కడున్నారని అడుగుతాడు. మహేంద్ర సర్ ని ఆ శైలేంద్ర కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నాడు. మీరు రండీ నేను కార్ ని ఫాలో అవుతున్నానని మను అనగానే.. ఇప్పుడు మేం వచ్చే పరిస్థితిలో లేము.. శైలేంద్ర గురించి మావయ్యకి తెలిసి కోపంగా మమ్మల్ని లోపల ఉంచి బయట తాళం వేశారని వసుధార అనగానే.. సరే నేను చూసుకుంటా మీరు టెన్షన్ పడకండని మను చెప్తాడు. ఏంటని రిషి అడుగగా.. మావయ్యని శైలేంద్ర కిడ్నాప్ చేసాడట అని వసుధార చెప్తుంది. (Guppedantha Manasu climax) ఆ తర్వాత అనుపమకి మను ఫోన్ చేసి విషయం చెప్పగానే.. రిషి, వసుధారల దగ్గరికి అనుపమ వెళ్లి తాళం పగులగొడుతుంది. మరొకవైపు మహేంద్రని కిడ్నాప్ చేసిన చోటు దగ్గరికి మను వెళ్లి వీడియో తీస్తాడు. మహేంద్రని చంపబోతుంటే అప్పుడే మను వెళ్లి రౌడీలని కొడతాడు. ఆ తర్వాత రిషి హీరోలా ఎంట్రీ ఇచ్చి ఇద్దరు కలిసి రౌడీలని కొడుతారు. తండ్రి తో పాటు ఇద్దరు కొడుకులు మీసం తిప్పుతారు. మహేంద్రని ఎలా కాపాడామో శైలేంద్రకి చెప్తాడు రిషి. అదంతా విని శైలేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత దేవయానితో రిషి మాట్లాడతాడు. మేమ్ ఏం చేసాం పెద్దమ్మ అంటూ రిషి ఎమోషనల్ అవుతాడు. తల్లి లాగా చూసాను ఇలా చేశారు.. మీకు ఎండీ పదవి ఇస్తాను.. నా తల్లిని ఇస్తారా అంటు రిషి అడుగుతాడు. దాంతో తప్పు చేశానని దేవయాని రిషి కాళ్ళపై పడబోతుంటే రిషి ఆపుతాడు. ఆ తర్వాత మీకు కావల్సింది ఆస్తులు కదా తీసుకోండి అంటూ పేపర్స్ ఇస్తాడు. కానీ కాలేజీ మాత్రం ఇవ్వను ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఉంది అనగానే.. నాకు పదవి కావాలని శైలేంద్ర అంటాడు. ఇంత జరిగాక మిమ్మల్ని బ్రతకనివ్వనని శైలేంద్ర గన్ తీసి రిషికి గురి పెడతాడు. రిషికి అడ్డుగా వసుధార వెళ్తుంది. వాళ్లిద్దరికి అడ్డుగా దేవయాని వెళ్తుంది. ఇన్ని రోజులు చేసిన తప్పులు చాలని శైలేంద్రతో దేవయాని అంటుంది. ఆ తర్వాత నాకు శిక్ష పడాలి అంటు గన్ తో శైలేంద్ర కాల్చుకోబోతుంటే.. రిషి అడ్డుపడతాడు. నీకు నేను శిక్ష వేస్తానని రిషి అంటాడు. ఆ తర్వాత కాలేజీ లో మీటింగ్ జరుగుతుంది. అందులో అందరికి శైలేంద్ర టీ, కాఫీలు ఇస్తాడు. శైలేంద్రకి రిషి వేసిన శిక్ష అతడిని ప్యూన్ చేయడం.. ఎప్పటికైన ఎండీ అవుతానని శైలంద్ర అంటాడు. అప్పుడే మహేంద్రకి మను ఫోన్ చేసి.. సర్ ఫారెన్ వెళ్తున్నానని అంటాడు ఎక్కడికి వద్దు ఏంజిల్ రెడీగా ఉంది.. పెళ్లి చెయ్యడానికి ముహూర్తం పెట్టడానికి వస్తున్నామని, నీ పెళ్లి బాధ్యత నాదే అని మహేంద్ర అంటాడు. సర్ అని మను అనగానే.. సర్ ఏంటి డాడ్ అనమని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఏంటి సర్ అంటు రిషి పక్కకి వెళ్తుంది వసుధార. ఏంటంటే శైలేంద్ర కూడా చూస్తుంటే నీకు ఎందుకురా అంటు ఫణీంద్ర కోప్పడతాడు. దాంతో అందరూ నవ్వుకుంటారు. వసుధార, రిషిలపై శుభంకార్డు పడుతుంది. గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.

ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ చేసిన రాహుల్.. రాజ్ అరెస్టు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -503 లో....కావ్యని తీసుకొని రాజ్ పక్కకు వస్తాడు. ఏం చేస్తున్నావ్ అసలు కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావా.. కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి.. అప్పుడే ఉమ్మడి కుటుంబం బాగుంటుంది లేదా సాక్షాలతో నిరూపించాలి.. నాకు నీకన్నా నా కుటుంబం ముఖ్యం.. నీ కోసం నా కుటుంబం వదులుకోలేనని రాజ్ అనగానే.. నేను ఈ కుటుంబంలో మనిషినే నన్ను ఎందుకు వేరుగా చూస్తున్నారు. ఆ రుద్రాణి , రాహుల్ గురించి మీకు తెలియదా అంటూ కావ్య బాధపడుతుంది. నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకని కావ్యకి చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. నా వల్ల నువ్వు మాటలు పడ్డావని అంటుంది. నిజంగా రాహుల్ ఫోన్ మాట్లాడ్డం.. నేను విన్నానని స్వప్న అంటుంది. నువ్వు అబద్దం చెప్పావ్ అనట్లేదు అక్క.. రాహుల్ , రుద్రాణిలు తెలివిగా నన్ను ఇరికించారని కావ్య అంటుంది. ఆ తర్వాత శృతికి కావ్య ఫోన్ చేసి రాహుల్ గురించి మొత్తం చెప్పి అతనిపై ఓ కన్ను వేసి ఉంచమంటుంది. స్వప్న రెడీ అయి వచ్చి హాస్పిటల్ కి వెళదామని కావ్యతో అనగానే.. సరేనని కాసేపటికి ఇద్దరు హాస్పటల్ కి బయలుదేర్తారు. మరొకవైపు ఇల్లీగల్ గోల్డ్ కి సంబంధించిన ఒకతను రాహుల్ దగ్గరికి వస్తాడు. వాటికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ శృతి తీసుకొని వచ్చి రాహుల్ కి ఇస్తుంది. ఆ తర్వాత శృతిని అక్కడ నుండి వెళ్ళమని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎంతకాలం ఈ కంపెనీకీ ఎండీగా ఉంటానో తెలియదు.. అందుకే ఇప్పుడే డబ్బులు సంపాదించుకొని కూడా బెట్టుకోవాలని అంటాడు. మనం చేస్తుంది ఇల్లీగల్ అయినప్పుడు.. అగ్రిమెంట్ ఎందుకని అతను అనగానే.. ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ మనకి రాకుండా రాజ్ కి వచ్చేలా అని రాహుల్ అంటాడు. ఆ తర్వాత కావ్య, స్వప్న హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తుంటారు. దారిలో కార్ ట్రబుల్ ఇస్తుంది. దాంతో ఆటో ఎక్కి వెళ్ళాలి అనుకొని ఆటో దగ్గరికి వస్తారు. ఆటో వెనకాల రేపటి కోసం అని ఉండడం చూసి.. ఇతనెవరో మన కళ్యణ్ లాంటి కవి అని స్వప్న అంటుంది. ఆటో డ్రైవర్ కళ్యాణ్ వాళ్ళని అద్దంలో నుండి చూసి షాక్ అవుతాడు. వాళ్లకి తెలియకుండా కర్చీఫ్ కట్టుకుంటాడు. ఆ తర్వాత ఆటోలో వెళ్తుంటారు. అంతా కళ్యాణ్ వల్లే తనే ఉండి ఉంటే.. మా అయనకి ఆఫీస్ బాధ్యతలు అప్పజేప్పేవారే కాదని స్వప్న అంటుంది. మంచిగా వెళ్ళు అంటూ కళ్యాణ్ ని స్వప్న తిడుతుంది. ఆ తర్వాత ఇంటిదగ్గర ఆటో ఆగగానే ఆకలిగా ఉంది అంటూ స్వప్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కావ్య డబ్బులు ఇస్తుంటే.. కళ్యాణ్ కర్చీఫ్ కిందకి తీసుకోబోతు వదిన ఆశీర్వాదం తీసుకుంటాడు. కావ్య డబ్బులు ఇస్తూ.. మేం చెప్పకుండా, మీరు అడగకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారని కావ్య అంటుంది. కళ్యాణ్ కవితలు తనకే చెప్తుంది. దాంతో కళ్యాణ్ కర్చీఫ్ తీస్తాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది.. మొదటి అడుగు వేసావంటూ కళ్యాణ్ కి దైర్యం చెప్తుంది కావ్య. తరువాయి భాగంలో పోలీసులు దుగ్గిరాల ఇంటికి వస్తారు. దారిలో అక్రమ గోల్డ్ ట్రాలీని పట్టుకున్నాం. అది మీ స్వరాజ్ గ్రూప్ కి సంబంధించిందని తెలిసింది. అందుకే రాజ్ గారిని అరెస్ట్ చెయ్యడనికి వచ్చామని పోలీసులు అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బికినీలో హాట్ హాట్ గా  షర్మిత గౌడ.. 

  షర్మిత గౌడ.. ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' చూసేవారికి ఇట్టే తెలిసిపోతుంది. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తున్న షర్మిత గౌడ మరోసారి వార్తల్లోకెక్కింది. కన్నడలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న షర్మిత గౌడ..  అ తర్వాత కొన్ని తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షర్మిత గౌడకి బ్రహ్మముడి సీరియలే తెలుగులో తొలి సీరియల్ కావడం విశేషం. షర్మిత గౌడ(రుద్రాణి) హాట్ ఫోటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ కి మేనత్తగా ముందు బాగున్నట్టు నటిస్తూ వెనుకాల గోతులు తీసే నెగెటివ్ పాత్రలో రుద్రాణి నటిస్తూ అందరిని మెప్పిస్తుంది. ఈ సీరియల్ లో పద్దతిగా చీరకట్టులో ఉంటుంది. సీరియల్ లో నెగెటివ్ రోల్ లో ఎక్కువ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది రుద్రాణి. అయితే రుద్రాణి అలియాజ్ షర్మిత గౌడ బయట మాత్రం ఈ సీరియల్ కి భిన్నంగా ఉంటుంది. బికినీతో పాటు ట్రెండింగ్ లుక్ లో కనిపిస్తుంది ఈ భామ. షర్మిత గౌడ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది. తాజాగా మాల్దీవులకి వెకేషన్ కి వెళ్ళిన షర్మిత గౌడ కొన్ని ఫోటోలని‌ షేర్ చేసింది. ' The only bad workout is the one that didn't happen ' క్యాప్షన్ తో బ్యాక్ లుక్ లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. గ్రీన్ కలర్ బికినీలో బ్యాక్ లుక్ లో ఫోజు ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. షర్మిత గౌడకి 176K ఫాలోవర్స్ ఉన్నారు. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ ఆకట్టుకుంటుంది.

శ్రీముఖి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా...నా లక్కీ హీరోయిన్!

  ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో మాత్రం కేక పుట్టిస్తోంది. ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ టీమ్ ఇక్కడికి వచ్చింది. వీళ్లకు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చింది శ్రీముఖి అండ్ టీమ్. ఇక ఈ టైములో రిషి అంటే గర్ల్స్ కి వసు అంటే బాయ్స్ పిచ్చ ఫాన్స్ అని స్రేముఖి చెప్పింది. అలాగే రిషి దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకుంది శ్రీముఖి. "గుప్పెడంత మనసు ఐపోయింది అని కాకుండా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని మాటివ్వు" అని అడిగింది. "బ్రహ్మముడి ఆర్టిస్టుల కన్నా నేనే ఎక్కువగా డేట్స్ ఇస్తా" అని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసాడు రిషి. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా రిషి సీరియల్ మదర్ జగతి వచ్చింది. ఇక రిషి వసునూ ఎత్తుకుని తిప్పేసరికి ఎంత బాగుంటుందో ఈ జోడి అని శ్రీముఖి కామెంట్ చేసింది. తర్వాత శ్రీముఖి రిషికి దూరం నుంచి కిస్ ఇచ్చేసింది. ఈలోపు అవినాష్ "చాలు ఇక రా" అని రిషి మీద కోప్పడేసరికి "లాస్ట్ మిగిలింది కొంచమే ఐపోతుంది" అన్నాడు రిషి. "కొంచెం కూడా బాధ లేదా సీరియల్ ఐపోయినందుకు" అన్నాడు అవినాష్. "పర్లేదు ఇక్కడ కాపురం చేసుకుందాం  లే" అని రిషి కౌంటర్ ఇచ్చాడు. తర్వాత మహేంద్ర వచ్చి జగతిని ఎత్తుకుని గిరగిరా తిప్పేసాడు. ఇక రక్షని పొట్టి పిల్ల అన్నాడు రిషి. వసు హైట్ తనకు సెట్ కాదని శ్రీముఖి హైట్ తనకు సెట్ అవుతుందంటూ పొగిడేసాడు రిషి. దాంతో వసుకి కోపం వచ్చింది. బుజ్జగించేసరికి రిషి ఇంకా అనరాని మాటలు అనేశాడు. "శ్రీముఖి నా దిల్..నువ్వు భార్యవైనా నాకు భారంగా ఉన్నావ్ పక్కకు పో" అన్నాడు. తర్వాత గుప్పెడంత మనసు లోగో టి షర్ట్స్ వేసుకుని వాళ్లకు నచ్చిన కామెంట్స్ ని రాసుకున్నారు. ఇక వసు ఐతే ఏడ్చేసింది. అలాగే  వసు తనకు లక్కీయేస్ట్ హీరోయిన్ అన్నాడు. తనకు ఒక గౌరవం తెచ్చింది, చనిపోయేముందు స్టార్ మా స్టేజి మీదకు వాళ్ళ నాన్న రావడం ఆయన ముందు అవార్డు అందుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నాడు రిషి.  

Karthika Deepam2 : కాశీ, దాస్ లని చూసి కార్తీక్ షాక్.. శౌర్యకి ఏదో ఉందని దీపకి డౌట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -137 లో....కాశీ , దాస్ వస్తున్నారని పారిజాతం హడావిడి చేస్తుంది. మనవడు వస్తున్నాడని పిన్ని హడావిడి అని దశరత్ అనగానే.. వాడికీ రాఖి కట్టడం ఇష్టం లేదు.. బావ కోసం మాత్రమే కడుతున్నానని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ కాశీ ఇంటికి రాగానే పారిజాతం వెళ్లి ఇద్దరినీ ప్రేమగా పలకరిస్తుంది. ఎలా ఉన్నావంటూ కాశీతో మాట్లాడుతుంది. ఇంట్లో అందరిని పారిజాతం పరిచయం చేస్తుంది. జ్యోత్స్న అక్క అవుతుందని దాస్ అనగానే.. జ్యోత్స్న చిరాకుగా చూస్తుంది. అప్పుడే కాంచనని తీసుకొని కార్తీక్ వస్తాడు. కాశీ, దాస్ లు అక్కడ ఉండడం చూసి.. ఏంటి ఇక్కడున్నారని కార్తీక్ అడుగుతాడు. ఆ తర్వాత పారిజాతం కొడుకు, మనవడు అని తెలుసుకొని కార్తీక్ షాక్ అవుతాడు. వాళ్ళని కూడా పారిజాతం కాశీకి  పరిచయం చేస్తుంది. స్వప్న మాటలు గుర్తు చేసుకొని.. వీళ్ళ పెళ్లి జరగాలంటే పేరెంట్స్ కావాలి అంటారు. అప్పుడు నాన్న గురించి నిజం బయటపడుతుందని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అని కోప్పడతాడు. కాశీకి జ్యోత్స్న రాఖీ కడుతుంటే.. తన చేతికి ఆల్రెడీ ఒక రాఖీ ఉంటుంది. అది చూసి ఎవరు కట్టారని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడే దీపక్క కట్టింది.. నా ప్రాణం కాపాడింది కదా.. నేనే కట్టమన్నానని కాశీ అనగానే.. అలాంటప్పుడు నన్నెందుకు కట్టమన్నావ్ .. అది తీసేయమని జ్యోత్స్న అనగానే అందరు తనపై కోప్పడుతారు. ఇక ఏం చెయ్యలేక జ్యోత్స్న రాఖీ కడుతుంది. కాంచన దశరత్ కీ రాఖి కడుతుంది. జ్యోత్స్నకి కాశీ డబ్బులు ఇస్తుంటే.. నాకు ఇచ్చే రేంజ్ నీది కాదు.. ఆ దీపకి ఇవ్వు అంటూ పొగరుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత దాస్ కి కాంచన రాఖీ కడుతుంది. దాంతో పారిజాతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కార్తీక్ బాబు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళను చూసి ఉంటారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని దీప అనుకుంటుంది. అప్పుడే అనసూయ వచ్చి.. ఇదిగో ఇల్లు నీ పేరున రిజిస్ట్రేషన్ అయిందని పేపర్స్ ఇస్తుంది. ఇదిగో డబ్బులు.. నీ దగ్గర అప్పట్లో తీసుకున్నాను.. నా పేరున పోస్టాఫీసు చేసినా.. ఇప్పుడు తీసుకున్నాను.. శౌర్యకి పనికి వస్తాయంటు.. శౌర్యకి ఏదో ఉందన్నట్లు అనసూయ మాట్లాడేసరికి దీపకి డౌట్ వస్తుంది. మళ్ళీ అనసూయ దాన్ని కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కార్తీక్ మంచితనం గురించి మాట్లాడుకుంటారు. మరొకవైపు స్వప్నకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు శ్రీధర్. ఆ విషయం తెలిసి స్వప్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భర్తకు దూరం ఉండాలన్న అత్త.. రామలక్ష్మి ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -189 లో.. మీరు ఇలా పాత ఐడియాలు చేస్తూ పోతే ఆ రామలక్ష్మి తిప్పి కొడుతుంది. ఆ తర్వాత మా పరిస్థితి ఏంటని శ్రీలతని శ్రీవల్లి అడుగుతుంది. నేను ఉండగా మీకు ఆ పరిస్థితి ఎప్పటికి రానివ్వను. ఆ రామలక్ష్మి ఇక మన జోలికి రాకుండా ప్లాన్ చెయ్యాలని శ్రీలత అనగానే.. అలా జరగాలంటే దాన్ని లేపేయ్యాలని సందీప్ అంటాడు. ఇది జరగపోతే అదే చేద్దామని శ్రీలత అంటుంది. వాళ్ళ మాటలు విని శ్రీవల్లి షాక్ అవుతుంది. మరొకవైపు సీతాకాంత్ అసలు నందిని ఎందుకు వచ్చింది? ఆ కంపెనీ నందినిది అని తెలిసి ఉంటే ఒప్పుకునే వాడిని కాదని సీతాకాంత్ అనుకుంటాడు. రామలక్ష్మి ఫోటో చూస్తూ సీతాకాంత్ మాట్లాడుకుంటుంటాడు. అప్పుడే రామలక్ష్మి, నందిని ఇద్దరు వస్తారు. అది నా ఫోటోలాగా ఉందేంటని రామలక్ష్మి అనుకుంటుంది. బోర్డు అఫ్ డైరెక్టర్స్ తో మీటింగ్ ఉందని నందిని అంటుంది. సీతాకాంత్ నందిని ఇద్దరు వెళ్తారు. ఆ ఫోటో ఎవరిదని రామలక్ష్మి చూసేసరికి తనదే ఉంటుంది. అది చూసి సీతా సర్ నన్ను ఇస్టపడుతున్నారన్న మాట అని హ్యాపీ గా ఫీల్ అవుతుంది. మరొకవైపు మీటింగ్ జరుగుతుంది. కంపెనీలో కొత్త యూనిట్ మొదలు చేస్తున్నాం.. దానికి పేరు పెట్టాలి.. కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన వారి పేరు పెడితే బాగుటుందని సీతాకాంత్ అంటాడు. నా పేరే పెడుతాడని నందిని అనుకుంటుంది కానీ రామలక్ష్మి పేరు చెప్తాడు సీతాకాంత్. అందుకు రామలక్ష్మి ఒప్పుకోదు.. నందిని గారు కంపెనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని తన పేరు పెట్టండి అని రామలక్ష్మి అంటుంది. అందుకు నందిని నా పార్టనర్ నీ పేరు పెట్టాలి అన్నాడు కదా.. అతని ఇష్టమే నా ఇష్టమని నందిని అంటుంది.. ఆ తర్వాత నందిని ఇంటికి వెళ్ళాక.. సీతాకాంత్ గురించి తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే హారిక వచ్చి సీతా సర్ కి తన భార్య ఇష్టం కాబట్టి తన పేరు యూనిట్ కి పెట్టాలి అనుకున్నాడని హారిక అనగానే.. ఇష్టం లేనివాళ్లు బయట పడొద్దని అలా చేస్తారని నందిని అంటుంది. అయితే నువు ఇష్టమని చెప్పలేదు కదా అని హారిక అనగానే.. అది నా మనసుతో చూడమని నందిని అంటుంది. మరొకవైపు రామలక్ష్మి బ్యాంగిల్స్ వేసుకుంటూ ఇబ్బంది పడుతుంటే.. సీతకాంత్ రావట్లేదని కోపంగా ఉంటుంది. దాంతో సీతాకాంత్ వచ్చి బ్యాంగిల్స్ వేస్తాడు. అప్పుడే శ్రీలత వచ్చి.. పక్షం రోజులు మీరు దూరంగా ఉండాలి కదా.. రామలక్ష్మి నా గదిలోకి రా అని శ్రీలత అంటుంది. వెళ్ళమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. సిరితో ధన గురించి  సీతాకాంత్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : శైలేంద్ర పాపాల చిట్టా బయటపెట్టిన రిషి...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1167 లో.. శైలేంద్రని చంపడానికి మహేంద్ర కోపంగా వస్తుంటే.. శైలేంద్ర ఎదరుపడుతాడు. కోపంగా ఎక్కడికో వెళ్తున్నారని శైలేంద్ర అడుగుతాడు. నీకోసమే వస్తున్నానురా అంటూ తన కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. ముందు నిన్ను ఫినిష్ చేసి తర్వాత వాళ్ళ పని చూస్తానని శైలేంద్ర అనగానే.. మహేంద్ర తన చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత కొందరు రౌడీలు మహేంద్రని పట్టుకుంటారు. కర్రతో శైలేంద్ర మహేంద్ర తలపైన కొడుతాడు. బాబాయ్ నీ గురించి తెలిసే నా ప్లాన్ లో నేనున్నానని శైలేంద్ర రౌడీలకి చెప్పి.. మహేంద్రని కిడ్నాప్ చేయిస్తాడు. ఆ తర్వాత మహేంద్రని ఒక దగ్గరికి తీసుకొని వెళ్లి తాళ్లతో కట్టేస్తాడు. ఇక తను చేసిన దుర్మార్గుల గురించి శైలేంద్ర చెప్తుంటాడు. నా గురించి నీకు ఎలా తెలిసిందని శైలేంద్ర అడుగుతాడు. జగతి నీ పాపాల చిట్టా మొత్తం ఒక లెటర్ లో రాసిందని మహేంద్ర చెప్తాడు. ఆ లెటర్ లో పిన్ని రాయని విషయాలు చాలా ఉన్నాయ్.. నీకు ఒక్కొకటి చెప్తా విను అని శైలేంద్ర అంటాడు. మా అమ్మ పిన్నిని ఇంట్లో నుండి పంపించేసింది. రిషి పై ఎటక్ చేసింది నేనే అని శైలేంద్ర అనగానే.. తెలుసని మహేంద్ర అంటాడు. మొన్న నీ మీద ఎటాక్ చేసింది కూడా నేనే అనగానే.. తెలుసని మహేంద్ర అంటాడు. నీకు తెలియని విషయం చెప్పనా అని మను తండ్రి ఎవరో తెలుసా అని శైలేంద్ర అనగానే.. తెలుసు నేనే మను తండ్రి అని మహేంద్ర అంటాడు. నీకు తెలియని విషయం చెప్పనా మను తల్లి అనుపమ కాదు జగతి. రిషి, మను కవల పిల్లలని మహేంద్ర అనగానే.. శైలేంద్ర షాక్ అవుతాడు. నీకు తెలియని విషయం ఏంటంటే జగతి పిన్ని హాస్పిటల్ నుండి వచ్చాక.. మేమే జ్యూస్ లో విషం కలిపామని శైలేంద్ర చెప్పగానే మహేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత రౌడీలతో మహేంద్రని చంపమని చెప్పి శైలేంద్ర వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార ఫణీంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి.. మావయ్య కన్పించడం లేదు.. ఈ శైలేంద్ర ఏదో చేసాడని అంటుంది. ఆ తర్వాత జగతి రాసిన లెటర్ ఫణీంద్రకి ఇస్తుంది. అది చదివి. ఫణీంద్ర తట్టుకోలేక గుండె పట్టుకుంటాడు. అంతలా ఏముందని దేవయాని అనగానే.. మీ పాపాల చిట్టా అని వసుధార అంటుంది. మేం ఏ తప్పు చెయ్యలేదు.. వాళ్లే కావాలని చేస్తున్నారని శైలేంద్ర అంటుంటే.. లేదు మావయ్య.. అంత వీళ్ళే చేశారు.. ఇన్ని రోజులు మీ గురించి అలోచించి ఏం చెప్పలేదని ధరణి అంటుంది. ఆ తర్వాత రిషి, మహేంద్రలు వస్తారు. అప్పటికే నేనేం తప్పు చెయ్యలేదని శైలేంద్ర అంటుంటే.. శైలేంద్ర మాట్లాడిన మాటలన్నీ వీడియో చూపిస్తాడు మహేంద్ర. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తావా అని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఆటో నడుపుకుంటున్న దుగ్గిరాల వారసుడు.. రాహుల్ ప్లాన్ సక్సెస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -502 లో... కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. రాహుల్ ఫ్రాడ్ చేస్తున్న విషయం చెప్తుంది. ఈ విషయం ఇంట్లో చెప్పి ఎలాగైనా దాన్ని ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆపాలని అనుకుంటారు. మరొకవైపు జాబ్ చేస్తే.. నెలంత కష్టపడితే డబ్బుకు వస్తాయ్.. అలా అయితే మాకు రోజు ఎలా గడుస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. అప్పుడే ఒక ఆటో డ్రైవర్ ని చూసి తన దగ్గరికి వెళ్లి జాబ్ కావాలి.. ఆటో నడుపుతానని అంటాడు. సరే నీకు సేట్ నెంబర్ ఇస్తాను ఆటో అద్దెకి ఇస్తాడు.. అన్నీ పోను అయిదు వందలు మిగులుతాయని అతను చెప్పగానే అందుకు కళ్యాణ్ సరే అంటాడు. మరొకవైపు రాహుల్ రెడీ అయి ఆఫీస్ కీ వెళ్తుంటే కావ్య, స్వప్నలు రాహుల్ ఆగమని చెప్తారు. ఈ రోజు నుండి ఈ రాహుల్ ఆఫీస్ కి వెళ్ళడానికి వీలు లేదని కావ్య అనగానే.. అందరు షాక్ అవుతారు. నువ్వు పిల్ల జెమిందర్ లాగా ఆర్డర్ వేస్తున్నావని కావ్యపై రుద్రాణి కోప్పడుతుంది. ఇన్ని సంవత్సరాలగా కంపెనీకి ఒక మచ్చ కూడా రాకుండా కాపాడారు. ఇప్పుడు రాహుల్ వాళ్ళ కంపెనీకీ బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉందని కావ్య అనగానే.. ఏం మాట్లాడుతున్నవంటూ రుద్రాణి, రాజ్ లు కావ్యని అంటారు.ఈ రాహుల్ అక్రమంగా దొంగ బంగారాన్ని కంపెనీ పేరుతో కొనడానికి సిద్ధపడ్డాడు మావయ్య అని కావ్య అనగానే.. అందరు షాక్ అవుతారు. ఇంత ద్రోహం చేస్తావా అంటూ ఒక్కొక్కరుగా రాహుల్ పై విరుచుకుపడుతారు. అసలు నేనేం చేసానని ఇలా అంటున్నారు సాక్ష్యాలు ఉన్నాయా అని రాహుల్ అంటాడు. ఉన్నాయ్ అవి నీ చేతిలోనే ఉన్నాయంటూ రాహుల్ చేతిలో ఫైల్ స్వప్న తీసుకొని రాజ్ కి ఇస్తుంది అది చుసిన రాజ్.. ఫైల్ అంత బానే ఉంది కదా అని అంటాడు. నేను ఇందాక చదివానని స్వప్న అంటుంది. మరి ఎక్కడ ఉందని రాహుల్ అంటాడు. మా అక్కని తప్పు ద్రోవ పట్టించావా అని కావ్య అంటుంది. ఆ తర్వాత చెయ్యని తప్పు నా కొడుకు పై వేస్తున్నారంటూ అక్కా, చెల్లెళ్ళపై రుద్రాణి విరుచుకుపడుతుంది. ఏ భార్య కూడా తన భర్తపై తప్పు మోపదు.. చేసి ఉండొచ్చని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు కలిసి కావ్య, స్వప్నలదే తప్పు అనేలా మాట్లాడుతారు. కావ్యని రాజ్ పక్కకి తీసుకొని వచ్చి.. ఎందుకిలా చేస్తున్నావ్.. కుటుంబాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు.. నీ కోసం నా కుటుంబాన్ని వదులుకోలేనని కావ్యతో రాజ్ అంటాడు. తరువాయి భాగంలో మొదటిసారి కళ్యాణ్ ఆటో నడపడానికి వస్తాడు. అప్పుడే కావ్య, స్వప్నలు ఆటో ఎక్కడానికి వస్తుంటారు. వాళ్లని అద్దంలో నుండి చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss Season 8: బిగ్‌బాస్‌ 8 ఫైనల్‌ లిస్ట్‌.. కామన్ మ్యాన్ ఎవరంటే!

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో హౌస్ లోకి ఎవరెవరు వెళ్తారా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇక రివ్యూలు, ఫ్యాన్ పేజీలు కంటెస్టెంట్స్ లిస్ట్ లు ఎవరికి వారే ఇస్తున్నారు. వీరిలో ఎవరు కన్ఫమ్? ఎవరు కాదనేది సండే రోజే తెలుస్తుంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు హౌస్ లోకి ఎవరు వెళ్తారనేది ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో చాలామంది చెప్పేశారు. ఇక హౌస్ లోకి ఎవరు వెళ్తారనేది ఓసారి చూసేద్దాం. ఆదిత్య ఓం, నిఖిల్‌ మళియక్కల్‌, అంజలి పవన్‌, యష్మీ గౌడ, అభయ్‌ నవీన్‌, యాంకర్‌ విష్ణుప్రియ, అభిరామ్‌ వర్మ, కిర్రాక్‌ సీత, ఖయ్యూం అలీ,  నాగ మణికంఠ, సోషల్‌ మీడియాలో ఇన్‌ ఫ్లూయన్సర్‌ బెజవాడ బేబక్క , రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుతో సంచలనంగా మారిన ఆర్జే శేఖర్‌ భాషా, సాహర్‌ కృష్ణన్‌, కళ్యాణి, విస్మయశ్రీ, నైనిక అనసురు, సోనియా ఆకుల ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.  గత బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో చెప్పనవసరం లేదు.  కామన్ మ్యాన్ గా వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ కి జనాలు విశేషంగా ఆదరించడంతో దానికి అంతటి క్రేజ్ వచ్చింది. నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ఉంటే అత్యధిక ఓటింగ్ లభించేది. అది కూడా అర్బన్, రూరల్  రెండు ఓటింగ్స్ గట్టిగానే వచ్చాయి. బిగ్ బాస్ ఆల్ టైమ్ రికార్ట్స్ లో విలేజ్ నుండి మిస్ డ్ కాల్స్ అత్యధికంగా వచ్చిన ఏకైక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. మరి ఇప్పుడు అలాంటి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.  

నా ఇమేజ్ కి బిగ్ బాస్ కరెక్ట్ కాదబ్బా

  బిగ్ బాస్ న్యూ సీజన్ రావడానికి ఇంకెంతో టైం లేదు. ఐతే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇది అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ లో ‘చక్రవాకం’, మొగలి రేకులు సీరియల్స్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఉన్నాడని  ప్రచారం జరుగుతోంది. అయితే ఇంద్రనీల్ మాత్రం తాను ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లడం లేదంటూ ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసాడు. తాను బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యానని, ఇంటర్వ్యూలకు కూడా వెళ్లానని చెప్పాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం వెళ్ళాను అనే విషయం బల్లగుద్ది చెప్పేసాడు. "నన్ను అభిమానించే ఫ్యాన్స్‌కి చెప్పేది ఏంటంటే..నేను బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లడం లేదు. ఎప్పటినుంచో ఈ మాట చెప్పాలని అనుకుంటున్నా. నాకు బిగ్ బాస్ టీమ్ కాల్ చేసినప్పుడు ఇదే మాట చెప్పా. నాకు ఇంట్రస్ట్‌ లేదని చెప్పాను. అప్పుడు  నా భార్య మేఘన నా పక్కనే ఉంది.  కనీసం ఒక్క ఇంటర్వ్యూకి అయినా రండి అన్నారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. సరేనని ఇంటర్వ్యూకి వెళ్లాను. అక్కడ వాళ్లు చాలా ప్రశ్నలు అడిగారు. అవి నాకు చాలా విచిత్రంగా అనిపించాయి.  నాకు తెలిసిన సమాధానాలు చెప్పేసి వచ్చాను.  రెండు వారాల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు పిలిచారు. ఈసారి ముంబయి టీం వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. బిగ్ బాస్ అప్ కమింగ్ ఆర్టిస్ట్‌లకు హెల్ప్ అవుతుంది.  నాలాంటి వాళ్లకి మాత్రం కాదు. నా ఇమేజ్‌కి బిగ్ బాస్ కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లిన తరువాత గొడవలు ఉంటాయి.  నామినేషన్స్ సమయంలో అగ్రెసివ్ గా ఉండాలి. ఫైట్స్  ఉంటాయి. ఇవన్నీ ఊహించుకున్న తర్వాత బిగ్ బాస్‌కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని క్లారిటీ ఇచ్చేశాడు ఇంద్రనీల్.  

Karthika Deepam2 : కాశీకి రాఖీ కట్టిన దీప..నిజం తెలుసుకొని షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -136 లో.....పారిజాతం దాస్ ని కలుస్తుంది. నేను చేసిన పనివల్ల మీ జీవితం ఇలా అయిందని పారిజాతం అనగానే.. అంత పెద్ద తప్పు ఏం చేసావని దాస్ అడుగుతాడు. చేశాను కానీ నీలా.. నీ కొడుకు, నా మనవడు అవ్వకూడదు.. వాడికి ఆ కుటుంబాన్ని దగ్గర చెయ్యాలని పారిజాతం అంటుంది. రేపు రాఖి పండుగ కదా కాశీని ఇంటికి తీసుకొని రా వాడితో జ్యోత్స్న చేత రాఖి కట్టిస్తానని పారిజాతం అంటుంది. అయిన వాళ్ళు రానిస్తారా.. నన్ను తిట్టారు.. కానీ వాడిని తిడితే భరించలేనని దాస్ అనగానే.. నువ్వు తీసుకొని రా నేను చూసుకుంటానని పారిజాతం అంటుంది.  ఆ తర్వాత నేను నేనొక విషయం చెప్పాలని దాస్ అంటాడు. ఏంటని పారిజాతం అడుగగా.. రేపు చెప్తానని దాస్ అంటాడు. ఏంటని పారిజాతం అడుగుతుంటే.. ఒక పుట్టుక.. ఒక చావు.. ఒక బతుకు అనుకుంటూ దాస్ వెళ్ళిపోతాడు. మరొకవైపు అనసూయ వంట చేస్తుంది. ఏంటి ఈ డబ్బా అని దీపని అనసూయ అడుగుతుంది. అది వేరే అందులో డబ్బులు వేస్తున్నాను.. కార్తీక్ బాబుకి ఇవ్వాలిసిన డబ్బులు.. అందులో జమ చేస్తున్నానని దీప అనగానే.. నీ పెంపకానికి నా పెంపకానికి ఎంత తేడా ఉందిరా తమ్ముడు అంటూ వాళ్ళ తమ్ముడిని గుర్తుచేసుకుంటుంది అనసూయ. ఆ తర్వాత శౌర్య గెంతుతుంటే.. నువ్వు అలా చెయ్యకూడదని అనసూయ అంటుంది. శౌర్య ఎందుకు అలా ఆడకూడదని దీప అడుగగా.. అనసూయ ఏదో ఒకటి కవర్ చేస్తుంది. మరొకవైపు పారిజాతం శివన్నారాయ దగ్గరికి వచ్చి.. తనని మాటలతో కూల్ చేసి.. రేపు దాస్ కొడుకు కాశీ ఇక్కడికి వస్తాడు. జ్యోత్స్న  కాశీకి రాఖీ కడుతుంది. కాశీని కాపాడలేదన్న కోపంలో కార్తీక్ ఉన్నాడు కదా.. ఇలా చేస్తే జ్యోత్స్న పై కోపం పోతుందని పారిజాతం అంటుంది. అయిన శివన్నారాయణ‌ ఒప్పుకోకపోగ..  అతడిని బలవంతంగా ఒప్పిస్తుంది. మరొకవైపు దీప, అనసూయలు శౌర్యని సుమిత్ర దగ్గరికి వెళ్ళమని చెప్పి.. ఊరు బయలుదేర్తుంటే అప్పుడే కాశీ, దాస్ లు వస్తారు. మీరు ఇక్కడికి వచ్చారని అడుగగా.. మా అమ్మ పారిజాతం రమ్మందని దాస్ చెప్తాడు. అది విని దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మీరు నన్ను కాపాడారు అక్క.. మీరు నాకు రాఖి కట్టండి అని దీపతో కాశీ రాఖీ కట్టించుకుంటాడు. ఇంకొక రాఖీ కోసం కాశీ, దేవ మళ్ళీ బయటకు వెళ్తారు. కార్తీక్ బాబు పెద్ద సమస్యలో పడ్డారని దీప ఆలోచిస్తుంటే.. ఏం ఆలోచిస్తున్నావని అనసూయ అనగానే.. వెళ్దామని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : మ్యాగజైన్ ఫోటో కోసం నందిని ప్లాన్.. భర్తని ఒప్పించిన భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -188 లో.....సందీప్, శ్రీలతలు కలిసి రామలక్ష్మి, సీతాకాంత్ లని దూరంగా ఉంచడానికి ప్లాన్ చేస్తారు. సీతాకాంత్, రామలక్ష్మిలు వస్తుండడం గమనించి యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు  నిప్పుల గుండంలో నడుస్తానంటున్నావని శ్రీవల్లి, సందీప్ లు శ్రీలతని అడుగుతారు. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. ఏమైందని అడుగుతారు. మీ జాతకం జ్యోతిష్యునికి చూపించాను. అందులో ఏవో దోషాలు ఉన్నాయట.. మీరు ఇద్దరు కలిసి ఉంటే మీకు గండం ఉందట అని శ్రీలత అంటుంది. దానికి పరిహారంగా ఇది చేస్తానంటున్నానని అనగానే.. వద్దని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఏ నిప్పుల గుండంపై నడవాల్సిన అవసరం లేదు.. నువ్వు చెప్పినట్టే దూరంగా ఉంటామని సీతాకాంత్ అంటాడు. దాంతో శ్రీలత మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. రామలక్ష్మి, సీతాకాంత్ వెళ్ళిపోయాక.. ఇలా మీకు ప్లాన్ ఉన్నట్టే నాకు ఏదోక ప్లాన్ ఉంటుంది కదా .. వెయిట్ చెయ్యండి అంటూ శ్రీలతకి సవాలు విసురుతుంది. మరొకవైపు సీతాకాంత్ కోసం నందిని చూస్తుంది. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. సీతాకాంత్ ని పలకరిస్తుంది. ఇబ్బందిగానే అతను సమాధానం చెప్తాడు. ఆ తర్వాత నందిని, రామలక్ష్మిని మీరు పిల్లల గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఇంకా లేదని రామలక్ష్మి అంటుంది. మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఇంకేంటని నందిని అనగానే.. మేమ్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. అది చెప్పి మీకు టైమ్ వేస్ట్ చెయ్యలేనని రామలక్ష్మి వెళ్లిపోతుంది. నువ్వు, సీతా పెళ్లి కోసం ఒకటయ్యారు కానీ పిల్లలు కోసం ఒకటి అవ్వరు.. సీతా మనసులో నువ్వు లేవు.. నేను ఉన్నానని నందిని అనుకుంటుంది. మరొకవైపు శ్రీలత గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. అమ్మ అలా భయపడుతుంది.. అసలు అమ్మని పట్టించుకోవడం లేదని సీతాకాంత్ అనగానే.. మీరు నన్ను కూడా పట్టించుకోవడం లేదని రామలక్ష్మి అంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి నందిని వచ్చి.. నాకు కంపెనీ డెవలప్ కి మంచి ఐడియా వచ్చింది. సీతాకాంత్ నేను ఒక ఫోటో షూట్ చేసి మ్యాగజైన్ లో వస్తే కంపెనీ గురించి ఎక్కువ మందికి తెలుస్తుందని నందిని అనగానే.. మంచి ఐడియా అని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్ వద్దని అంటాడు. అయిన రామలక్ష్మి ఒప్పిస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ పక్కన ఉంటే నా గురించి ఆలోచించడానికి ఇబ్బంది పడతాడని  రామలక్ష్మిని తనతో తీసుకొని వెళ్తుంది నందిని. మరొకవైపు రామలక్ష్మిపై శ్రీలత సందీప్, శ్రీవల్లి కలిసి కుట్ర చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : జగతి కొడుకే మను.. క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1166 లో.. నా కన్నతల్లి ఎవరో చెప్పమని అనుపమని మను నీలదీస్తాడు. కానీ అనుపమ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. నువ్వు ఇలా చెప్పావ్ అంటూ గన్ ని తన తల దగ్గర పెట్టుకొని.. ఇప్పుడు నిజం చెప్పమని అడుగుతాడు. మరొకవైపు జగతి రాసిన లెటర్ ని మహేంద్రకి ఇస్తాడు రిషి. ఆ లెటర్ చదువుతుంటాడు మహేంద్ర. జగతి ఎవరికి తెలియని కొన్ని నిజాలు అందులో చెప్తుంది. రిషి, మహేంద్ర నన్ను క్షమించండి.. మీ దగ్గర ఒక నిజం దాచాను.. మనకి ఇద్దరు కవలలు పుట్టారు. ఒకరు రిషి.. ఇంకొకరు మను అని ఉంటుంది. నేను ఒకరిని అనుపమకి ఇచ్చాను. తను ప్రేమగా మనుని పెంచుకుంటుందని జగతి లెటర్ లో రాస్తుంది. మను మన కొడుకా అంటూ మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అనుపమ కూడా మనుకి నిజం చెప్తుంది. నువ్వు జగతి కొడుకువు.. నాకు ఇచ్చిన మాట కోసమే ఇలా చేసింది.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు.. అందుకే జగతి తన బిడ్డని ఇస్తానని అంది.. అందుకే నిన్ను ఇచ్చిందంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత మహేంద్ర ఇంకా లెటర్ చదువుతుంటాడు. శైలేంద్ర చేసిన తప్పులు గురించి చెప్తాడు. దీనంతటికి కారణం శైలేంద్ర, దేవయాని అని జగతి లెటర్ లో.. వాళ్లు చేసిన పనులు గురించి రాస్తుంది. అది చదివిన మహేంద్ర కోపంగా ఇంత చేసిన వీడిని ఎందుకు ఏమనట్లేదని రిషిని‌ మహేంద్ర అడుగుతాడు. ఆ రోజు త్వరలోనే ఉందని రిషి అంటాడు. ఈ లెటర్ చదివి.. నా వల్లే నీకు అన్యాయం చేసారని చాలా బాధపడ్డానని రిషి అంటాడు. నన్ను పెంచిన నా పెద్దమ్మ అలా చెయ్యడమేంటని రిషి బాధపడతాడు. మరొకవైపు దేవయాని దగ్గరికి శైలేంద్ర వచ్చి..  వాడు రంగా కాదు రిషి అని అంటాడు. దాంతో దేవయానికి ఒక్కసారిగా చెమటలు పడుతాయి. రిషి మనల్ని వదలడని దేవయాని భయపడుతుంది. ఇక ఎవర్ని వదలనంటూ శైలేంద్ర ఆవేశపడుతాడు. మరొకవైపు రిషి, వసుధారలని గది లోపల ఉంచి బయటనుండి గడియపెడతాడు మహేంద్ర. శైలేంద్రని చంపుతానంటూ వెళ్తాడు. రిషి వసుధారలు పిలిచినా పట్టించుకోకుండా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : రాహుల్ వేసిన ప్లాన్ లో వాళ్ళు ఇరుక్కుంటారా.. అది నిజమైన బంగారమేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -501 లో.... అప్పు, కళ్యాణ్ లని ఇంటికి రమ్మని కృష్ణమూర్తి ఆహ్వానిస్తాడు. కానీ రాలేమని అప్పు చెప్తుంది. ఆ తర్వాత కనకం వెళ్ళిపోతు అప్పుకి మూడు వేయిలు ఇస్తుంది. వద్దని అప్పు అంటున్నా వినకుండా కనకం ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత కనకం వాళ్లు బయటకు వచ్చాక.. ఇలా వచ్చి అలా వెళ్తున్నామని కృష్ణమూర్తి అనగానే.. ఉంటే ఏం పెడుకతారు.. పాపం వాళ్ళకి తినడానికి కూడా లేదు.. వాయినం ఇచ్చిన ప్రసాదం మనకి ఇచ్చిందని కనకం అనగానే.. కళ్యాణ్ జాబ్ చూసుకున్నాకా అదంతా ఏం ఉండదని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత ఈ డబ్బులతో సరుకులు తీసుకొని రా అని అప్పు అనగానే.. అవి నీకు ఇచ్చిన డబ్బులు.. వద్దని కళ్యాణ్ అంటాడు. ఏదైనా జాబ్ చూసుకోవాలని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు కావ్య పై నుండి కిందకి వస్తుంటే.. రాజ్ క్యారం బోర్డు సెట్ చేసి రమ్మని పిలుస్తాడు. ఇంట్లో పని ఎవరు చెయ్యాలని కావ్య అనగానే.. ఈ రోజు నీకు రెస్ట్ పనిమనిషి చేస్తుందని రాజ్ అంటాడు. ఇద్దరు క్యారం ఆడుతుంటే ఇందిరాదేవి అపర్ణలు వచ్చి.. మేమ్ కూడా ఆడతామని అంటారు. రాజ్, ఇందిరాదేవి ఒకవైపు.. కావ్య, అపర్ణ లు ఒక వైపు ఉంటారు. అలా అందరు ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తారు. అందరు సరదాగా నవ్వుకుంటా ఉంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి, రుద్రాణిలు వస్తారు. వాళ్లు అలా ఉండడం చూసి.. చూసావా నీ కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడన్న బాధ ఒక్కరిలో కన్పించడం లేదని రుద్రాణి అనగానే.. నువ్వు కూడా రాత్రి చాలా నవ్వావు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. స్వప్న కావాలనే లాఫింగ్ గ్యాస్ వదిలింది.. అందుకేనని రుద్రాణి చెప్పగానే ఇదంత స్వప్న ప్లానా అని ధాన్యలక్ష్మి అంటుంది. నా కొడుకు వెళ్లిపోయిన వీళ్లకి అవసరం లేదు ఎలా హ్యాపీ గా ఉన్నారు వెళ్లి అడుగుతానంటూ ధాన్యలక్ష్మి వెళ్తుంటే.. ఇప్పుడే వద్దని రుద్రాణి ఆపుతుంది. మరొకవైపు రాహుల్ రుద్రాణిలు కావ్యపై అందరు కోప్పడాలిని ప్లాన్ చేస్తారు. రాహుల్ కావాలనే స్వప్నకి వినపడేలా.. ఈ ఇల్లీగల్ గోల్డ్ గురించి ఎవరికి తెలియదు.. ఇప్పుడు నేనే కంపెనీకి హెడ్ కాబట్టి అంతా చూసుకుంటానని అంటాడు. ఆ తర్వాత ఆ మాటలు విన్న స్వప్న వెంటనే వెళ్లి కావ్యకి చెప్తుంది. గోల్డ్ మన కంపెని కొంటే కంపెనీకి నష్టం జరుగుతుంది కదా అని స్వప్న అంటుంది. అప్పుడు మనం అడ్డుకున్న కూడా.. ఇంకా ఆ బిజినెస్ పైనే ఉన్నాడా అని కావ్య అంటుంది. తరువాయి భాగంలో అదే విషయం అక్కాచెల్లెలు ఇంట్లో అందరికి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Biggboss 8 Telugu contestant Aditya Om : బిగ్ బాస్ కి ఆదిత్య ఓమ్ కన్ఫమ్!

  బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది‌. దీంతో కొంత మంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిలో హీరో ఆదిత్య ఓమ్(Aditya Om) కూడా ఒకరు.  ఆదిత్య ఓమ్ ' లాహిరి లాహిరి లాహిరిలో ' సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ , మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు లాంటి సినిమాలని ఆదిత్య చేశాడు. అయితే బంధూక్ సినిమాతో హిందీలోకి అరంగేట్రం చేశాడు ఆదిత్య. ఈ సినిమాకి దర్శకుడిగా హీరోగా చేసిన అదిత్య పలు సినిమాలు చేశాడు. ఇక మళ్ళీ తెలుగులోకి దహనం, అమరం, నాతో నేను, ఎర్ర గుడి లాంటి చిన్న సినిమాలల్లో నటించినా పెద్దగా హిట్ పొందలేకపోయాడు. ఇక ఇప్పుడు కాస్త బ్రేక్ కోసం ఆదిత్య ఓమ్ చూస్తున్నాడు. బిబి టీమ్ అతడిని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. దాంతో అతను మరోసారి తెలుగు ప్రేక్షకులకి దగ్గరవ్వొచ్చనే ఉద్దేశంతో ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆదిత్య బిగ్ బాస్ సీజన్-8 కి కన్ఫమ్ గా వస్తున్నాడనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Bigg Boss Buzzz :  ప్రోమోతో దుమ్ములేపుతున్న అర్జున్!

  తెలుగు బిగ్ బాస్ సీజన్-8 కి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక కంటెస్టెంట్స్ ఎవరా అనే క్యూరియాసిటి అందరిలో పెరిగిపోయింది. ఈ తరుణంలో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేసేది ఎవరో కూడా కన్ఫమ్ చేస్తూ బిబి టీమ్ ప్రోమోని వదిలారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ సీజన్-7 లో టాప్-5 లో నిలిచిన కంటెస్టెంట్ అంబటి అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక  అతనికి ఎలివేషన్స్ మాములుగా లేవు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. బజ్ ప్రోమోతోనే నమ్మకాలు కలిగించేశాడు అంబటి అర్జున్. ప్రోమో మాత్రం అద్దిరిపోయింది. నిజం చెప్పాలంటే.. హోస్ట్ నాగార్జున ప్రోమో కంటే కూడా అంబటి అర్జున్ బజ్ ప్రోమోనే బాగుంది. ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఉన్నాయి. అంబటి అర్జున్ ఈ ప్రోమోతోనే అంచనాలు పెంచేశాడు. పిక్చరైజేషన్.. ఎలివేషన్స్.. డైలాగ్స్.. ఆర్ ఆర్.. అద్దిరిపోయింది. టైమ్ బాగుంటే బిగ్ బాస్ హౌస్‌కి వస్తారు.. వాళ్ల టైం బ్యాడ్ అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి వస్తారు.. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.. గుర్తుంచుకోండి.. ఈ సీటూ యమ హాటూ అంటూ అంబటి అర్జున్ చెప్పాడు.