Bigboss 8 episode review : బిగ్ బాస్ సీజన్-8 రివ్యూ!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం ఆసక్తికరంగా సాగుతుంది. వారం నుండి మెగా చీఫ్ కోసం హౌస్ లో పోటీ జరుగుతుంది. అందులో భాగంగానే విష్ణుప్రియ, యష్మీకి ఒక టాస్క్ జరిగింది. అది స్క్రూలు తిప్పి పజిల్ సెట్ చెయ్యాలి. ఇక మన నత్తి బ్రెయిన్ విష్ణు గురించి తెలిసిందే కదా.. చెత్త ఆటతీరును కొనసాగించింది. యష్మీ కాస్త స్మార్ట్ గా థింక్ చేసి హౌస్ మేట్స్ సపోర్ట్ తో ఆ టాస్క్ విన్ అయింది. ఇక ఆ తర్వాత ఆరెంజ్ కలర్ సూట్ కేసు ఓపెన్ చేయమని బిగ్ బాస్ యష్మీ కి చెప్తాడు. యష్మీ సూట్ కేసు ఓపెన్ చేసేసరికి అందులో డెబ్భై అయిదు వేలు ఉంటాయి‌ అవి ప్రైజ్ మనీ కి ఆడ్ చెయ్యాలి. తీరా చూస్తే యష్మీ ఓపెన్ చేసింది విష్ణుప్రియ సూట్ కేస్. యష్మీ సూట్ కేసు లో లక్ష ఏనబై వేలు ఉంటాయి. దాంతో అందరూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తారు. కానీ అమౌంట్ డెబ్భై అయిదు వేయిలు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి ఆడ్ అవుతాయి. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే హరితేజ, విష్ణుప్రియ కిచెన్ లో ఉంటారు. ఏం చేస్తున్నారు అంది అని గాసిప్ క్వీన్ అలిగితే నత్తి బ్రెయిన్ విష్ణు వెళ్లి బుజ్జగించింది.. ఇక కామెడీ అడిషన్స్ టాస్క్ లో రోహిణి, అవినాష్ ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. టాస్క్ తర్వాత విష్ణుని పృథ్వీ ఏమో అన్నాడని.. విష్ణు హర్ట్ అయింది. వాళ్ళకి పంచాయతీ చెప్పడానికి యష్మీ ట్రై చేసింది కానీ కాసేపటికి  విష్ణు వెళ్ళి అడిగి మరి పృథ్వీతో సారి చెప్పించుకుంది. ఆ తర్వాత టాస్క్ లో మంతనాలు ఎప్పటిలాగే ఇంకా ఏదో సాధించాలని యష్మీ ఆరాటం.. ఇక రేపటితో మెగా ఛీఫ్ ఎవరు అవుతారో తెలుస్తుంది. ఈ వారం మెగా ఛీఫ్ ఎవరు అవుతారో చూడాలి మరి!

డబుల్ ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్ .. పృథ్వీ ఇంటికేనా!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం ముగింపుకి వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు. ఇప్పటికే పది మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకూ వచ్చారు. ఇప్పటి వరకు ఒక కిర్రాక్ సీత, శేఖర్ బాషా ఎలిమినేషన్ ఆన్ ఫెయిర్ తప్ప మిగతావన్ని ఎలిమినేషన్ ఫెయిర్ అనే చెప్పాలి‌ ఇంకా గ్రాండ్ ఫినాలే కి అయిదు వారాలున్నాయి. హౌస్ లో పన్నెండు మంది ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో ఉన్నవాళ్లంతా దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే శనివారం ఎపిసోడ్ లో ఒకరు.. ఆదివారం ఎపిసోడ్ లో మరికరిని పంపించే ఛాన్స్ ఉంది. ఓటింగ్ లో గత వారం కంటే ఈ వారం భారీ మార్పులు వచ్చాయి. ఫస్ట్ లో ఉన్నవాళ్లు లాస్ట్ కి లాస్ట్ లో ఉన్నవాళ్లు ఫస్ట్ కి వచ్చారు. గౌతమ్ మణికంఠ స్థానంలో బయటకు వెళ్ళేవాడు. మణికంఠ సెల్ఫ్ నామినేటే అవ్వడం తో గౌతమ్ సేవ్ అయ్యాడు. అయితే ఇప్పుడు గౌతమ్ ఓటింగ్ లో రెండవ స్థానం లో ఉన్నాడు. చివరగా రెండు స్థానాలలో యష్మీ, హరితేజ ఉన్నారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్ ని కాకుండా ఒక మేల్ కంటెస్టెంట్ ని బయటకు పంపించే ఛాన్స్ లేకపోలేదు. అలా అయితే పృథ్వీ బయటకు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

హౌస్ మేట్స్ అంతా ఓవైపు ‌నబీల్ మరోవైపు.. రివెంజ్ స్టోరీ ఇక మొదలు!

  బిగ్ బాస్ మెగా చీఫ్ కోసం జరుగుతున్న టాస్క్ లో నబీల్ యష్మీ, ప్రేరణ, పృథ్వీ,  రోహిణి లు కంటెండర్స్ గా ఉన్నారు‌. అయితే టాస్క్ ఏంటంటే 'మూట ముఖ్యం'. ఈ టాస్క్ లో కంటెండర్స్ తమ కి కేటాయించిన కంటైనర్స్ లో కూర్చొని ఉంటారు. ఎవరు మెగా చీఫ్ వద్దని అనుకుంటున్నారో వాళ్ళ మూటలు ఎక్కువగా కంటైనర్ లో వెయ్యాలి. కంటైనర్ లో ఉన్న మూటలు కూడా తియ్యొచ్చు దానికి సంచాలకుడిగా అవినాష్ ఉన్నాడు. అలా మొదటి బజర్ కి అందరు యష్మీ కంటైనర్ లో మూటలు వేస్తారు. అలాగే నిఖిల్ బయటకు తీస్తున్నాడు. నబీల్ కంటైనర్ లో  హరితేజ ఎక్కువగా వేస్తుంటే అవినాష్, గౌతమ్ లు తీసేస్తున్నారు. ఇలా మొదట బజర్ కి యష్మీ అవుట్ అఫ్ ది టాస్క్ అవుతుంది. మిగతా హౌస్ మేట్స్ అంటే ఒక గౌతమ్, అవినాష్ తేజ తప్ప అందరూ కూడా ఈ సారీ నబీల్ ని తప్పించాలని మాట్లాడుకుంటారు. హరితేజకి నబీల్ అంటే ఎందుకు కోపమో తెలియదు కానీ నబీల్ ని తీసేయాలని అంటుంది. అలా రెండవ బజర్ కి అందరు నబీల్ ని టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా హరితేజ, నిఖిల్  , యష్మీ, విష్ణుప్రియ కలిసి నబీల్ ని టార్గెట్ చేశారు. వాళ్ళు కంటైనర్ లో మూటలు వేస్తుంటే గౌతమ్, అవినాష్ లు తీసేస్తుంటారు. ఇక నబీల్ కంటైనర్ లో ఎక్కువ మూటలుంటాయి. తనే అవుట్ అఫ్ ది టాస్క్ అవుతాడు. నబీల్ బయటకు వచ్చి.. చాలా థాంక్స్ నిఖిల్ణ యష్మీ, హరితేజ, విష్ణుప్రియ అని చెప్తాడు. ఇక రివెంజ్ స్టోరీ స్టార్టెడ్ అని హరితేజ ఇంకా రెచ్చగొట్టేల మాట్లాడుతుంది. దాంతో నబీల్ పక్కకు వెళ్లి.. రివెంజ్ స్టోరీ ఏంటి? నాకు సపోర్ట్ చేస్తే చేస్తాను.. లేదంటే చెయ్యనని నబీల్ అంటాడు. ఆ తర్వాత అవినాష్ తేజ, నబీల్ లు మాట్లాడుకుంటారు. నబీల్ ని అందరు ఇలా కొట్టేస్తున్నారు.. టార్గెట్ చేశారని అవినాష్ అంటాడు.

నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ పెళ్ళిలో అందాల భామలు

సినిమాల్లో విలన్‌గా, కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ పెళ్ళికి అందాల భామలంతా టోక్యో వెళ్లారు. ఖుష్బూ, రాధికా, శరత్ కుమార్, సుహాసిని, మీనా వీళ్లంతా వెళ్లారు. ఇక ఫోటోలకు ఫోజులిచ్చేసరికి నెటిజన్స్ అంతా దిల్ కుష్ ఇపోయారు. ఎందుకంటే అందాల భామలందరినీ ఒకే ఫ్రేమ్ లో చూడడం వాళ్లకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక  నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ అరుదైన కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు. ఐతే అతనికి తిరునెల్వేలిలోని మూలకరైపట్టికి చెందిన అక్షయ అనే అమ్మాయితో  వివాహం జరిగింది.  ఇక వీళ్లంతా కలిసి టోక్యోని చుట్టేశారు. జాపనీస్ ఐలాండ్ ఆఫ్ హోన్షుకి వెళ్లి అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇక లవ్ ఇన్ టోక్యో, లవ్ ఫ్రమ్ టోక్యో అంటూ క్యాప్షన్స్ పెట్టుకున్నారు. అలాగే నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ కి అక్షయకు మ్యారేజ్ విషెస్ ని చెప్పారు.

జబర్దస్త్ నుంచి ఎందుకు తీసేసారో తెలీదు

  "బంగారం ఒకటి చెప్పనా" అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో  ఫేమస్ ఐన శాంతి మొదట్లో చాలా కష్టాలు పడిందట. చాలామంది ఇంటర్వ్యూస్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసి ఒక బియ్యం బస్తా, సబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకుని కారెక్కి వెళ్లిపోయారని బాధపడుతూ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. అలా చాలామంది కూడా అలా ఇంటర్వ్యూస్ తీసుకుని ఏమీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇలా మోసం జరుగుతూ ఉంటుంది అనుకుని వదిలేసాను అని చెప్పింది శాంతి. తర్వాత చలాకి చంటి టీమ్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లి స్కిట్స్ లో నటించిందట శాంతి. ఆ తర్వాత బులెట్ భాస్కర్ టీమ్ లో రోహిణి టీమ్ లో కూడా స్కిట్స్ వేశానని చెప్పింది. ఐతే తర్వాత ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్తూ  అనుకోకుండా రెండు ఎపిసోడ్స్ కి వెళ్లకపోవడంతో జబర్దస్త్ నుంచి తీసేశారని చెప్పుకొచ్చింది. జబర్దస్త్ కోసమే హైదరాబాద్ వచ్చానని కానీ తప్పేమి లేకుండా ఎందుకు జబర్దస్త్ నుంచి తీసేసారు తెలీదని చెప్పింది. ఇక సోషల్ మీడియాలో తన ఫాన్స్ అంతా కూడా జబర్దస్త్ కి, బిగ్ బాస్ కి వెళ్ళమని సపోర్ట్ చేస్తామని చెప్తున్నారట..కానీ వాళ్ళు పిలవకుండా ఎలా వెళ్తాను అని శాంతి అంటోంది. ఐతే తన మీద జబర్దస్త్ టీమ్స్ కి ఎవరైనా చాడీలు చెప్పరేమో అందుకే జబర్దస్త్ కి రానివ్వట్లేదేమో అంటూ కొంతమంది తన అన్నారని చెప్పింది శాంతి. ఇక "హాయ్ బ్రో పెళ్లెప్పుడు" అనే వెబ్ సిరీస్ లో నటించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది బంగారం శాంతి.

అవినాష్, రోహిణి స్కిట్ కి పొట్టచెక్కలయ్యేలా నవ్విన హౌస్ మేట్స్!

  బిగ్ బాస్ ఎంటర్‌టైన్మెంట్ చెయ్యడంలో తగ్గేదేలే అన్నట్టూ రోజు రోజుకి వినోదాల విందులతో కనువిందు చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక సినిమా అడిషన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో అవినాష్ డైరెక్టర్ రోహిణి అసిస్టెంట్ డైరెక్టర్. అవినాష్ తియ్యబోయే న్యూ సినిమాకి అడిషన్స్ కి కొంతమంది యంగ్ స్టార్స్ వస్తారు. అవినాష్ తియ్యబోయే సినిమా పేరు 'హ చూస్తారా' అని అవినాష్ అనగానే.. మీరు చూసేలా తీస్తారా అని మంచి కామెడీ టైమింగ్ తో రోహిణి పంచ్ లు పేల్చింది. డైరెక్టర్ దగ్గరికి హరితేజ అడిషన్స్ కి వస్తుంది. పనిమనిషి క్యారెక్టర్ రోహిణి. యజమాని హరితేజ కాఫీ తీసుకొని వచ్చి మిస్టేక్ గా రోహిణి పై పడేస్తుంది. దాంతో రోహిణి తిడుతుంటే హరితేజ తన ఎక్స్ప్రెషన్ చూపించాలి. అందులో కూడ రోహిణి యజమానిలా కాకుండా పనిమనిషిలా చేసే నవ్వించేసింది... ఆ తర్వాత అవినాష్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. ఏబీసి.. కాప్షన్ అక్క కోసం బావని చూస్తున్నాడు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అందులో నిఖిల్, యష్మీ, గౌతమ్ అడిషన్స్ కి వచ్చారు. ముగ్గురు తమ టాలెంట్ చూపించాలనుకుంటారు. యష్మీ, గౌతమ్ లో అర్గుమెంట్ చేస్తుంటారు. అక్క అని గౌతమ్ అంటుంటే.. ప్లీజ్ కాల్ మి యష్మీ అని యష్మీ అంటుంది. అప్పుడే నిఖిల్ ఇన్వాల్వ్ అయి తను అక్క అనవద్దని చెప్తుంది కదా ఎందుకు పిలుస్తున్నావని అంటాడ నేను పిలవను.. నువ్వు పిలుస్తావా అక్క అని గౌతమ్ అంటాడు. దాంతో అందరు నవ్వుకుంటారు. సూపర్ మీరు అడిషన్స్ లో సెలక్ట్ అయ్యారంటూ డైరెక్ట్ చెప్తాడు. ఇదంతా ఫుల్ ఆఫ్ ఫన్ గా సాగుతుంది.  

అలాంటి తొక్కలో కామెంట్స్ పట్టించుకోవక్కర్లేదు

  జబర్దస్త్ లో కమెడియన్ వెంకీ మంకీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వెంకీ మంకీకి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐతే వెంకీ ఒక వేల్యుబుల్ పాయింట్ ని రైజ్ చేసాడు. అదేంటంటే ఇప్పుడు స్కిట్స్ బాగాలేదు అని అందరూ కామెంట్స్ పెట్టేస్తారు. బాగానే ఉంది. కానీ ఆ కామెంట్స్ కూడా బూతులతో కలిపి పెడతారు. అప్పుడు ఎవరూ కూడా ఆ కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన పని లేదు. రీజనబుల్ గా ఒక పద్దతిగా స్కిట్ బాలేదు..కొంచెం మార్చుకోండి అని చెప్తే పట్టించుకోవాలి..కానీ ఇలాంటి వల్గర్ వాళ్ళు పెట్టె కామెంట్స్ అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తే మార్చుకోవడంలో ఎదో ఒకటో చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ పని అసలు వాళ్ళు సరిగా చేస్తున్నారా ? పని లేని వాడు, సెన్స్ లేని వాళ్ళే ఇలాంటి కామెంట్స్ పెడతారు కాబట్టి అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు. నిజంగా స్కిట్ చూసి ఎనాలిసిస్ వాళ్ళు పెడితే వాళ్ళు బూతులు పెట్టరు. కాబట్టి అలాంటి వాళ్ళవి పట్టించుకుని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది, స్టుపిడ్ మెంటాలిటీ వాళ్ళు పెట్టిన ప్రతీ కామెంట్ ని పట్టించుకోవాల్సిన పని లేదు. కొన్ని స్కిట్స్ బాగున్నా కూడా ఎడిటింగ్ కి వచ్చేసరికి కొన్ని బాగుండవు...ఆ విషయాలు వాళ్లకు తెలీవు. నెగటివ్ కామెంట్స్ మీదనే కాన్సంట్రేషన్ పెట్టాలి. పాజిటివ్ పాయిజన్ లాంటిది. కాబట్టి నెగటివ్ కామెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ గా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు వెంకీ మంకీ ఒక ఇంటర్వ్యూలో.

Karthika Deepam2 : స్కెచ్ ఆర్ట్ చూపించి ఏడ్చేసిన శౌర్య..  రిసెప్షన్ ఓకే చెప్పిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -196 లో....సుమిత్ర కాంచన ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. మీపై కోపంగా ఉంది జ్యోత్స్నని మీ ఇంటికోడలిని చేసుకుంటానని మాట తీసుకోవడం మీ తప్పు.. ఇవ్వడం మీ అన్నయ్య తప్పు.. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు నా కూతురు బాధపడుతుందని కాంచన తో తన బాధ పంచుకుంటుంది సుమిత్ర. నేను నా కూతురు లాగా మాట్లాడలేను.. కార్తీక్, దీప లకి రాసి ఉంది.. అందుకే పెళ్లి జరిగిందిని సుమిత్ర అంటుంది. మీరు రేపు ఫంక్షన్ కి ఎలాగైనా రావాలి.. రానని మాత్రo చెప్పకండి వదిన ఎదరు చూస్తూ ఉంటానని అని కాంచన అంటుంది. నాకు మీరు ఎంత ఇష్టమంటే.. నా బాధ మీతో చెప్పుకునేంత అని సుమిత్ర అనుకుంటుంది. ఆ తర్వాత శౌర్య తన ఫ్రెండ్స్ తో ఐస్క్రీమ్ తింటూ మాట్లాడుతుంది. ఫంక్షన్ కి రండీ మా నాన్నని పరిచయం చేస్తానని అంటుంది. మరొక వైపు కొడుకు, కోడలికి గిఫ్ట్ తీసుకుందామని కావేరి అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. కాంచన అక్క.. నా కూతురిని తన కూతురు అనుకున్నప్పుడు.. నేను తన కొడుకుని కొడుకు అనుకోవాలి కదా అనగానే.. శ్రీధర్ చిరాకు పడతాడు. ఆ తర్వాత శౌర్య తన ఫ్రెండ్స్ తో తొక్కుడు బిళ్ల ఆడుతుంటే ఓడిపోతుంది. మా అమ్మ బాగా ఆడుతుంది అని శౌర్య తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. అప్పుడే దీప వస్తుంది ఆడమని శౌర్య రిక్వెస్ట్ చెయ్యగా దీప ఆడుతుంది. అప్పుడే కార్తీక్ చూసి ఇది శౌర్య పని అనుకుంటా అని దీప ఆడుతుంటే చూస్తుంటాడు. ఆ తర్వాత కార్తీక్ రాగానే శౌర్య తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత భోజనం రెడీ అయిందని కాంచన దగ్గరికి వెళ్తుంది దీప. ముందు మీ ఆయనకి పెట్టమని కాంచన అంటుంది. బాగా అన్నారు అమ్మ అని అనసూయ అనగానే.. నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాగే అంటుండని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఫోన్ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడే దీప వస్తుంది. ఇద్దరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. మళ్ళీ డాష్ ఇచ్చుకోండి లేదంటే కొమ్ములు వస్తాయని శౌర్య అనగానే మళ్ళీ డాష్ ఇచ్చుకుంటారు. తరువాయి భాగం లో మీరు నాకు అమ్మనాన్నలు కాదు.. అమ్మనాన్నలంటే ఇలా ఉండాలంటు ఒక స్కెచ్ ఆర్ట్  చూపిస్తుంది. అందులో అమ్మనాన్న మధ్యలో ఒక పాప ఉంటుంది. అది చూపించి నేను ఇలా ఉండాలి అనుకోవడం తప్పా.. ఎందుకు రిసెప్షన్ కి ఒప్పుకోవడం లేదని శౌర్య ఏడుస్తుంటే.. సరే అని దీప ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సవతి తల్లి కపట ప్రేమని గుర్తించని కొడుకు.. భార్యని అనుమానిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto   Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -247 లో... సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వచ్చి.. తన కపట ప్రేమని నటిస్తుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను.. నేను ఉండడం నీ భార్యకి ఇష్టం లేదు.. మీరు హ్యాపీగా ఉండండి అని శ్రీలత అంటుంది. ఈ ఆస్తులు సంపాదించింది ఎవరికోసం మన కుటుంబం కోసం కదా.. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతగా వెళ్తే తప్పు చేసిన వాళ్ళు వెళ్తారని సీతాకాంత్ అంటాడు. నువు ఎక్కడికి వెళ్లకంటూ శ్రీలత దగ్గర మాట తీసుకుంటాడు సీతాకాంత్. ఆ తర్వాత రామలక్ష్మి జరిగింది గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఇది కచ్చితంగా అత్తమ్మ పనే అనుకుంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. ఏంటి అంత కోపంగా చూస్తున్నావని శ్రీలత అడుగుతుంది. తనకి కోపం వచ్చేలా మాట్లాడేసరికి శ్రీలతపై రామలక్ష్మి చెయ్ ఎత్తుతుంది. ఏంటి భయపడుతున్నవా.. ఇంకొకసారి రామలక్ష్మి జోలికి వెళ్ళకూడదనేలా చేస్తాను చూడమని శ్రీలతకి సవాలు విసురుతుంది రామలక్ష్మి.ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేస్తే కోప్పడతాడు. నా తల్లి పై చెయ్ ఎత్తావంటూ కోప్పడతాడు. తను మీకు నా గురించి చెడుగా చెప్పి అనుమానం వచ్చేలా చేస్తుంది.. అసలు మీకు ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాడేమో అని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను.. మీకు చెప్పకపోవడం నా తప్పేనని రామలక్ష్మి అంటుంది. నాకు నీపై అనుమానం లేదు కానీ నువ్వు నా తల్లిపై చెయ్ ఎత్తావు అంటూ సీతాకాంత్ కోప్పడి వెళ్ళిపోతాడు. నాపై ఎలాంటి అనుమానం లేదని చెప్పాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి.ఆ తర్వాత మరుసటి రోజు సీతాకాంత్ కి రామలక్ష్మి అన్ని తీస్తుంటే.. తను ఇచ్చిందేం తీసుకోడు. మరొక వైపు డిటెక్టివ్ తప్పించుకుంటాడు. అభి ఆ విషయం నందినికి ఫోన్ చేసి చెప్పగా కోప్పడుతుంది. వాడి సంగతి నేనే చూసుకుంటానని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : సీఈఓ చేతుల మీదుగా దీపావళి బోనస్.. కావ్య, రాజ్ ల మధ్య రచ్చ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -561 లో.....ఇందిరాదేవి ఎంప్లాయిస్ కి ఇచ్చే బోనస్ చెక్కు లని చూడమని కావ్యకి ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి  నా కంటే మీ మనవడి చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందని కావ్య అనగానే.. అలా ఏం వద్దు నువ్వు సీఈఓ కాబట్టి నువ్వే ఇవ్వాలని ఇందిరాదేవి అంటుంది. మీరు ఇలా వినేలా లేరు.. నేనే ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడతానని రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. కావ్యని చూసి రాజ్ చిర్రు బుర్రులాడుతాడు. ఈ చెక్కు లు మీ చేతులు మీదుగా ఇవ్వండి అని కావ్య అనగానే.. ఏంటి జాలి చూపిస్తున్నావా.. నాకు అవసరం లేదు.. నేను ఇవ్వను నువ్వు టెంపరరీ సీఈఓవి నేనే ఆ కంపెనీ కి అసలైన సీఈఓని అని రాజ్ అంటాడు. మరోవైపు ఏంటి ధాన్యలక్ష్మి డల్ గా ఉన్నావంటూ రుద్రాణి వస్తుంది. నీ కొడుకు, కోడలు రాలేదని అలా ఉన్నావా అదిగో వస్తున్నారంటూ అప్పుడే వస్తున్న అప్పు, కళ్యాణ్ లని చూపిస్తుంది. ఆ తర్వాత ప్రకాష్ స్వప్నలు వస్తారు. నా కొడుకుకి టిఫిన్ పెట్టు స్వప్న అనగానే.. అంటే నా చెల్లికి  వద్దా అని స్వప్న అంటుంది. నువ్వు చూసుకుంటావ్ కదా నీ చెల్లిని అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి.. నువ్వు మీ పేరెంట్స్ కి తీసుకున్న బట్టలు ఇవ్వమని అంటుంది. ఇద్దరు వెళ్లి ధాన్యలక్ష్మి, ప్రకాష్ లకి నా మొదట శాలరీ తో తీసుకున్నానని కళ్యాణ్ అంటాడు కానీ ధాన్యలక్ష్మి కళ్యాణ్ కి ఒక్కడికే తీసుకుంటుంది. నేను అప్పుకి తీసుకున్నా అని ప్రకాష్ అప్పుకి చీర తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆ తర్వాత అందరు హ్యాపీగా ఉంటే చూడలేని రుద్రాణి.. అనామిక కి ఫోన్ చేసి ఏమైంది నీ ప్లాన్ అని అడుగుతుంది. న్యూస్ ఛానెల్ వాళ్ళు టైమ్ చెప్పగానే చెప్తానని అనామిక అంటుంది. ఆ తర్వాత పూజ జరుగుతుంది. తరువాయి భాగంలో నువ్వు ఎంప్లాయివేగా.. నీకు నేను బోనస్ ఇస్తున్నానని కావ్యకి రాజ్ చెక్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తేజ క్రష్ ప్రేరణ అంట.. సీక్రెట్ రూమ్ డ్రామా!!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం టాస్క్ లతో పాటు సీక్రెట్ రూమ్ డ్రామాలు కొనసాగాయి. ఒక నామినేషన్ , టాస్క్ మాత్రమే కాదు ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉంది అన్నట్టుగా నిన్నటి ఎపిసోడ్ సాగింది. బిగ్ బాస్ టేస్టీ తేజ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. అతని ముందు మూడు కప్ కేక్ లు పెట్టి.. అది తినాలి అంటే ప్రైజ్ మనీ నుండి మనీ కట్ అవుతుందని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో వద్దండి నేను డైటింగ్ లో ఉన్నాను.. నేను సన్నగా అయితే నాగార్జున సర్ తన షర్ట్స్ ఇస్తానన్నాడని తేజ అంటాడు. అయితే ఆ కేక్ తినాలంటే హౌస్ లో జరిగే ఒక గాసిప్ చెప్పమని తేజతో బిగ్ బాస్ అనగా.. మొన్నటి వరకు ఏ  వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే అంటూ జరిగింది కదా ఇక ఏ అంటే గౌతమ్ బి అంటే యశ్మీ సి అంటే నిఖిల్ లు.. బి, సి ల లైన్ క్లియర్ ఉందని 'ఏ' సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు బి, సి లు కూడ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.. ఏ మాత్రం 'బి' ని అక్కని చేసుకున్నాడు. ఇంతకు మించి ఏం లేదని తేజ చెప్తాడు. దాంతో కేక్ తినమని బిగ్ బాస్ చెప్తాడు. డైటింగ్ లేదు ఏం లేదు కేక్ ని తేజ లాగించేస్తాడు. తేజ మనలో మన మాట హౌస్ లో నీ క్రష్ ఎవరని బిగ్ బాస్ అడగగా.. కాస్త సిగ్గు పడుతూ 'ప్రేరణ' అని తేజ చెప్తాడు.అమ్మాయి బాగుంటది.. నాతో బాగా మాట్లాడుద్ది.. అన్నీ షేర్ చేసుకుంటామని చెప్పి బయటకు వచ్చి.. ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు తేజ. యష్మీ.. నీ సూట్ కేసు ఎవరైనా ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావంటూ బిగ్ బాస్ అడుగుతాడు. యష్మీ ఆలోచించకుండా గౌతమ్ కి అనేస్తుంది. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వస్తేనే ఇవ్వమంటూ పృథ్వీ, నిఖిల్ లు అంటున్నా కూడా గౌతమ్ కి అనేస్తుంది యష్మీ.  

కన్ఫెషన్ రూమ్ లో ప్రేరణ రివీల్ చేసిన సీక్రెట్ అదే!

  బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆట స్వభావమే మారిపోయింది. ప్రతి సీజన్ లో గాసిప్ చెప్పుకోవడానికి ఒకరుంటారు. అది అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఒక విషయం ఒక అమ్మాయికి తెలిస్తే ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కక్కరిగా అందరికి తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో గాసిప్ క్వీన్ ఎవరు అంటే హరితేజ అని తెలుస్తోంది.   హరితేజ సైలెంట్ గా ఉంటూ అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు.. ఏం మాట్లాడుతున్నారంటూ అంతా కనిపెడుతూ ఉంటుంది. విష్ణుప్రియ, పృథ్వీలు టాస్క్ అనంతరం.. విష్ణుప్రియ భుజాలపై పృథ్వీ చెయ్యి వేస్తుంది. అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హరితేజ వేరేవాళ్ళతో మాట్లాడుతు.. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. విష్ణు, పృథ్వీలు గంటలు గంటలు మాట్లాడుకుంటారు కదా అసలేం మాట్లాడుకుంటారని అంటున్నారు. నిజంగానే వాళ్ళ మధ్య ఏమైనా నడుస్తుందా.. అది ఎక్కడి వరకు వెళ్తదని తేజ వాళ్ళు అనుకుంటున్నారు. మనం హౌస్ లోకి వచ్చినపుడు మన గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి బెన్ఫిట్ తప్ప ఏం లేదని మళ్ళీ హరితేజ డ్యూయెల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్రేరణని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కేక్ ముందు పెట్టి.. అది కావాలంటే హౌస్ గాసిప్ చెప్పండి అని బిగ్ బాస్ అంటాడు. యష్మీ పట్ల నిఖిల్ కి ఏం లేదు అంటున్నాడు కానీ ఉంది బయటపడట్లేదని ప్రేరణ చెప్తుంది. హౌస్ లో ఎవరికి వారే లవ్ ట్రాక్ నడుపుతూ గాసిప్ కి ఛాన్స్ ఇస్తున్నారనేది అందరికి తెలిసిందే. మరోవైపు హౌస్ లో అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఎంటర్‌టైన్మెంట్ కావాలన్న ప్రతీసారీ తమ సత్తా చాటుతున్నారు.‌ ఇక హౌస్ లో ఏ గేమ్ లోనైనా బాయ్స్ తో పోటీగా ప్రేరణ పుడింగిలా ఆడుతుంది. ఈ వీక్ ఎవరు మెగా ఛీఫ్ అవుతారో చూడాలి మరి.

దుమ్ములేపుతున్న ప్రేరణ.. చెత్త పర్ఫామెన్స్ తో యష్మీ!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. మెగా చీఫ్ కంటెండర్ కోసం జరిగే టాస్క్ లో భాగంగా పృథ్వీ, విష్ణుప్రియ మధ్య టాస్క్ ఉంది. అందులో పృథ్వీ స్ట్రాటజీ ప్లే చేసి  విన్ అయి పృథ్వీ కంటెండర్ షిప్ ని పదిలపరుచుకుంటాడు. అంతేకాకుండా ఆరెంజ్ కలర్ సూట్ కేసుని విష్ణుప్రియకి ఇస్తాడు పృథ్వీ. దాంతో తను కూడా కంటెండర్ అవుతుంది. అయితే  ప్రేరణ, విష్ణుప్రియ, యష్మీ లు ఆరెంజ్ సూట్ కేసు పొంది మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారు. ఇప్పుడే అసలు బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టాడు. నబీల్, రోహిణి, పృథ్వీ లు సూట్ కేసు తీసుకోవడంతో కంటెండర్స్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు గెలిచి నబీల్, రోహిణి, పృథ్వీ ముగ్గురు కంటెండర్ షిప్ పదిలపరుచుకున్నారు. అయితే మళ్ళీ ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియలకి తమ కంటెండర్ షిప్ ని పదిలపరుచుకోవడానికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. బరువు గల బ్యాగ్ తో పూల్ నుండి వచ్చి టేబుల్ లో పడెయ్యాలి. అందులో విష్ణుప్రియ, ప్రేరణ పోటీపడి ఆడుతారు. యష్మీ మాత్రం స్లోగా ఆడుతుంది. అసలు తను ఎక్కువగా ట్రై కూడా చెయ్యలేదు. మిగతా ఇద్దరరు మూడు, నాలుగు బ్యాగ్ లు వేస్తుంటే యష్మీ ఒక్క బ్యాగ్ కూడా వేయదు. అది బజర్ టైమ్ కి‌ ఒక్క బ్యాగ్ వేసింది. ఈ లెక్కన యష్మీ నామినేషన్ లో ఉన్నంత ఊపు.. టాస్క్ కి వచ్చేసరికి కన్పించడం లేదు. అంతకు ముందు నేను వీక్ క.టెస్టెంట్ అనుకుంటున్నారు. నేను ఏంటో చూపిస్తానని ప్రేరణతో యష్మీ చెప్పింది. తీరా ఆట మొదలయ్యాక తెలిసింది యష్మీ జీరో అని.. ఇక టాస్క్ ముగిసాక కూడా నేను కూడా బాగా అంటుంది. ఏంటంటే యష్మీ నామినేషన్లో పులి.. టాస్క్ లో పిల్లి అని మనకి తెలుస్తోంది.  

మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ గా ఆఫ్ ది సీజన్ గా విష్ణుప్రియ!

  బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికి తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు పదో వారం నడుస్తోంది. ఇక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వీక్ కంటెస్టెంట్స్ అంటు ఓ కేటగిరీ తీస్తే వారిలో కన్నడ బ్యాచ్ తమ మాటలతో, ఆటలతో, స్ట్రాటజీలతో   సూపర్ గా రాణిస్తున్నారు. నబీల్ గేమ్ ఛేంజర్.. కానీ అతని ఒకే ఒక్క వీక్ నెస్ మాట. ఒక్కసారి అతను మాట ఇస్తే అది చేస్తాడు. ‌కానీ ఇది గేమ్ షో.‌ ఇక్కడ ఎవరి గేమ్ వారికి ఉంటుంది. టాస్క్ లు బాగా ఆడిన సరైన స్ట్రాటజీ ప్లే చేయకుంటే ఓడిపోవాల్సిందే. ప్రతీసారీ నబీల్ కి అదే జరుగుతుంది. ఎవరికోసమో త్యాగం చేస్తూ తన కంటెండర్ షిప్ ని కోల్పోతున్నాడు‌. ఇలాగే ఉంటే కన్నడ బ్యాచ్ నబీల్ ని జోకర్ కార్డు లా వాడుకొని వదిలేస్తారు.‌ ఇక టాప్-5లో ఉన్నా నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ చేస్తున్న స్ట్రాటజీలలో‌ నబీల్ షేర్ కాదు జీరో అవుతాడు.  మరోవైపు బిగ్ బాస్ మామ ఎడిట్ చేసే ప్రోమోలు, ఎపిసోడ్ లు అంతా విష్ణుప్రియకి ఫేవర్ గాను మిగతావారికి నెగెటివ్ గాను ఉంటున్నాయి.  ఇప్పటివరకు జరిగిన ఒక్క టాస్క్ లో కూడా గెలవలేదు విష్ణుప్రియ.. చెత్త రీజన్స్ తో  నామినేషన్ చేసినా, పృథ్వీకి బహిరంగంగా కిస్సులు, హగ్గులు ఇచ్చినా బిగ్ బాస్ తన ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మన నత్తి బ్రెయిన్ విష్ణుప్రియని టాప్-5 కి తెచ్చే ఆలోచనలో బిగ్ బాస్ మామ ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి లైవ్ ఎపిసోడ్  లో ఓ వైపు బిగ్ బాస్ టాస్క్ గురించి అనోన్స్ మెంట్ చేస్తుంటే పృథ్వీ వేసుకున్న షూ లేస్ ని కడుతుంది విష్ణుప్రియ. దాంతో బిగ్ బాస్ మామ తనని అలర్ట్ చేసి మళ్ళీ రూల్స్ చెప్తుంటాడు. లైవ్ లో ఇది ఉంది కానీ ఇది విష్ణుప్రియని నెగెటివ్ చేస్తోందని భావించిన బిగ్ బాస్ ఎడిటర్ మామని లేపేయమన్నాడు. ఇంకేం ఉంది విష్ణుప్రియని నెగెటివ్ చేసే కంటెంట్ అంతా లేపేస్తున్నారు బిబి టీమ్. ఇక జెన్యున్ గా ఆడే టేస్టీ తేజ, రోహిణి, అవినాష్, నబీల్, ప్రేరణ వారి పరిస్థితి ఏంటో.. ఇదో షో అని మర్చిపోయి విష్ణుప్రియ ఏం చేసినా కరెక్ట్.. అంటు మిగతావారిని తప్పుగా చూపిస్తున్నారు. ఓటింగ్ లో మాత్రం విష్ణుప్రియకి స్ట్రాంగ్ ఉంది. ఇది నిజమేనా లేక బిబి టీమ్ అంతా కలిసి ఓట్లు వేపిస్తున్నారో చూడాలి. ఇది ఇలానే ఉంటే జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి తీవ్ర నిరాశే మిగులుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

Karthika Deepam2 : ఎమోషనల్ అయిన సుమిత్ర.. రిసెప్షన్ కి దీప ఒప్పుకుంటుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -195 లో.....కార్తీక్ నా భర్త.. వాళ్ళది అసలు పెళ్లే కాదని జ్యోత్స్న అంటుంది. ఎలాగైనా నా బావని నా సొంతం చేసుకుంటానని సుమిత్రకి చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ప్లీజ్ అత్తయ్య నా కూతురిని వదిలెయ్యండి అని పారిజాతంతో చెప్తుంది సుమిత్ర. పెద్దవాళ్ళుగా చేసేది తప్పని చెప్పాలి కదా అంటుంది. మీరు చేసింది ఏంటని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దీప లోపలికి వెళ్తుంది. దీప ఎందుకు రిసెప్షన్ వద్దని అంటుందో నాకు అర్థమైందని అనసూయతో కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. అవి ఏంటని కాంచన అనగానే.. ట్యాబ్లెట్ మరియు వాళ్ళ రిసెప్షన్ కి శౌర్య వేసుకుంటందని బట్టలు తీసుకొని వచ్చానని కార్తీక్ అంటాడు. మరి దీపకి అని కాంచన అనగానే.. అది మీరు చూసుకుంటారు కదా అని కార్తీక్ అంటాడు. డాక్టర్ ఏమన్నాడని కాంచన అనగానే శౌర్యని హ్యాపీగా చూసుకోమని చెప్పాడు. ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలని కార్తీక్ అంటాడు. ఇంతకీ దీప ఎందుకు రిసెప్షన్ వద్దని అంటుందని కార్తీక్ అడుగుతాడు. అందరు మీ నాన్న ఎక్కడ అని అడుగుతారు కదా అని కాంచన అంటుంది. అవును అందుకే వద్దని అంటున్నానని దీప అప్పుడే వచ్చి అంటుంది. ఇక అప్పుడే స్వప్న, కాశీ లు వచ్చి డాడ్ ని మేమ్ పిలుస్తామని.. ఎలాగైనా రిసెప్షన్ జరగాలని అంటారు. దంతో దీప కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత స్వప్న, కాశీ లు శ్రీధర్ వాళ్ళ ఇంటికి బయలుదేర్తారు. మనం ఇక్కడ దీపని ఒప్పించాలని అనసూయ, కాంచన ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత కాశీ, స్వప్న కలిసి శ్రీధర్ ఇంటికి వెళ్తారు. లోపలికి రావద్దని అంటాడు. కానీ కావేరి లోపలికి పిలుస్తుంది. అన్నయ్య, వదినలకి రిసెప్షన్ చేస్తున్నాం రండీ అని అంటుంది. రానని శ్రీధర్ అంటాడు. మమ్మీ ఎలాగైనా డాడ్ ని తీసుకొని రా అనగానే నేను తీసుకొని వస్తానని కావేరి అంటుంది. ఆ తర్వాత కాంచన, సుమిత్ర లు ఫోన్ మాట్లాడుకుంటారు. నువ్వు కూడా కార్తీక్, దీపల పెళ్లిని తప్పు పడుతున్నావా అని అనగానే.. వాళ్ళని కాదు నిన్ను తప్పు పడుతున్నాను. నువ్వు మీ అన్నయ్య దగ్గర మాట తీసుకున్నావ్.. జ్యోత్స్న ఇంటికి కోడలిని చేసుకుంటానని చిన్నప్పటి అనుకున్నారు. అది ఇప్పుడు కార్తీక్ ని మర్చిపోలేకపోతుందని కాంచనకి సమిత్ర చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన సవతి తల్లి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -246 లో.....రామలక్ష్మి అభి ఉన్నా ఫోటోని చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. అదే టైమ్ అనుకొని శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు రామలక్ష్మి పై నెగటివ్ గా సీతాకాంత్ కి చెప్తారు. భర్తకి చెప్పకుండా అలా రామలక్ష్మి అక్క తనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసిన అభిని కలవడం ఏంటో అని అంటారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అని సీతాకాంత్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్ అంటూ శ్రీలత అడుగుతుంది. అది మీకు చెప్పనవసరం లేదని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఈ ఫోటోలో ఉన్నవాటికి సమాధానం చెప్పమని ఆ ఫొటోస్ విసిరేస్తుంది. అవి చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది. ఎందుకు ఆ అభి ని కలవడానికి వెళ్ళావని శ్రీలత అడుగుతుంది. అది సీతాకాంత్ కి చెప్పకుండా ఎందుకు వెళ్ళావంటూ శ్రీలత అడుగుతుంది. నేను చెప్పాలి అనుకున్న కానీ మీరు ఎక్కడ నాకు దూరం అవుతారోనని భయపడ్డా అని రామలక్ష్మి అనగానే.. ఇక చాలు ఒక్కొక్క రిగా కుటుంబం నుండి మమ్మల్ని దూరం చేసి ఆస్తులన్నీ తీసుకొని సీతాకంత్ ని ఒంటరిని చెయ్యాలని ప్లాన్ చేసావని శ్రీలత అనగానే.. శ్రీలత పై చెయ్ ఎత్తుతుంది రామలక్ష్మి. దాంతో మా అమ్మపై చెయ్ ఎత్తుతావా అంటూ రామలక్ష్మిపై సీతాకాంత్ చెయ్ ఎత్తుతాడు. చేసింది తప్పు.. అది చెప్పిన వాళ్ళని అలా అంటావా.. నా భార్య గా ఉండే అర్హత లేదని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అంటూ జరిగింది మొత్తం నందినికి శ్రీలత ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లి, సందీప్ ముగ్గురు సంబరపడుతుంటారు. మరొకవైపు హారికతో నందిని తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటంది. రామలక్ష్మి జరిగింది గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వచ్చి.. నేను ఇంట్లో ఉండను. మీ భార్యకి నేను ఇష్టం లేదని యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : భార్యతో ఉన్నట్టుగా పట్టపగలే ఊహల్లో భర్త! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -560 లో.. ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు కలిసి అప్పు, కళ్యాణ్ లని దీపావళికి ఇంటికి పిలవడానికి వస్తారు. కళ్యాణ్ ని రమ్మని ధాన్యలక్ష్మి అనగానే.. ఆలోచిస్తా అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడికి వరకు వచ్చి పిలిస్తే అలా అంటావని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పు నా భార్య.. తనని పిలవకుండా నన్ను పిలిస్తే ఎలా వస్తానని కళ్యాణ్ అనగానే.. నాకు తెలుసు అందుకే కదా పిలవడానికి వచ్చానని ధాన్యలక్ష్మి అంటుంది. అవునురా ఇద్దరిని పిలుస్తుందని ప్రకాష్ అనగానే.. వస్తాం మావయ్య అని అప్పు చెప్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి  ఇందిరాదేవి వస్తుంది. ఇంకా నిద్ర లేవలేదా.. ఈ రోజు దీపావళి అంటూ రాజ్ ని నిద్ర లేపుతుంది. లేచి గుమ్మానికి పువ్వులు కట్టు అంటూ పువ్వుల దండలు ఇచ్చి వెళ్తుంది. ఇక రాజ్ ఏం పని చేసినా కావ్యని ఉహించుకుంటాడు. తనతో మాట్లాడినట్లు అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య నిజంగానే వస్తుంటుంది. తనని చూసి మళ్ళీ ఉహ అనుకొని తన చుట్టూ తిరుగుతు ఉంటాడు. అది చూసి అపర్ణ, ఇందిరాదేవీలు ఎందుకు ఇలా చేస్తున్నావంటూ అడుగుతారు. అప్పుడు రాజ్ ని గిల్లుతుంది కావ్య. దాంతో రాజ్ ఉహలోనించి బయటకు వచ్చి ఎందుకు వచ్చవంటూ అడుగుతాడు. తను సీఈఓ తన చేతుల మీదుగా బోనస్ ఇవ్వాలని మీ తాతయ్య పిలిచాడనగానే రాజ్ కుళ్ళుకుంటాడు. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. ఏదో ప్లాన్ అన్నావ్ ఏంటని అడుగుతుంది. దాంతో అనామిక, కళ్యాణ్ ల డాక్యుమెంటరీ గురించి చెప్తుంది. టెలికాస్ట్ అయ్యే టైమ్ కి వాళ్ళని టీవీ చూసేలా చేయమని అనామిక అనగానే.. రుద్రాణి ఓకే అంటుంది.ఆ తర్వాత అపర్ణ సుభాష్ కి పాయసం చేసి తీసుకొని వస్తుంది. నువ్వే తినిపించు అనగానే అపర్ణ తినిపిస్తుంది. అప్పుడే కావ్య వచ్చి ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి బోనస్ ఇచ్చే చెక్కు లు చెక్ చేయమంటుంది. తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. బోనస్ నా చేతుల మీద కంటే మీరు ఇస్తేనే బాగుటుందని కావ్య అనగానే.. నీ దయ నాకు అవసరం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఊపందుకున్న బిగ్ బాస్ టాస్క్.. ఇద్దరి మధ్య చిచ్చు!

  బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం టాస్క్ ల జోరుగా సాగుతున్నాయి. నిన్న నబీల్, గౌతమ్ మధ్య జరిగిన  టాస్క్ లో నబీల్ గెలిచాడు. కంటెండర్ షిప్ కోసం సాగుతున్న ఈ టాస్క్ లు ఫుల్ జోష్ లో సాగుతున్నాయి. మొదటి టాస్క్ లో రోహిణి, రెండవ టాస్క్ లో నబీల్, మూడో టాస్క్ లో పృథ్వీ ఇలా ముగ్గురు సూట్ కేసు తీసుకున్న వాళ్ళే రేస్ లో పాల్గొన్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన మొదటి ప్రోమో ఉత్కంఠగా ఉంది. మూడో టాస్క్ లో విష్ణుప్రియకి ఆడే ఛాన్స్ వచ్చింది. ఇక సూట్ కేసు తీసుకున్న ముగ్గిరిలో ఇద్దరిని ఆల్రెడీ సెలక్ట్ చేసుకొని టాస్క్ పూర్తి చేశారు. మిగిలింది పృథ్వీ కాబట్టి తను టాస్క్ ఆడేందుకు విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక పృథ్వీ, విష్ణుప్రియ మధ్య టాస్క్ జరుగుతున్నట్లుగా ప్రోమోలో తెలుస్తోంది. అయితే ఈ సీజన్ మొదటి నుండి విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టం. కానీ పృథ్వీ మాత్రం లైట్ తీసుకుంటు వస్తున్నాడు. ఇద్దరు ఇంత వరకు ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు కంటెండర్ షిప్ కోసం జరుగుతున్న టాస్క్ లో వీరిద్దరి మధ్య  డిస్టబెన్స్ వచ్చేలా ఉంది. ఇద్దరికి మధ్య జరిగిన టాస్క్ ల..  సరైన 'కీ' తీసుకొని వెళ్లి తాళం ఓపెన్ చెయ్యాలి. ఈ గేమ్ లో పృథ్వీకి గట్టి పోటీ ఇచ్చింది విష్ణుప్రియ. కానీ పృథ్వీ మాత్రం వేరే 'కీ' తను ముందు పడేసి స్ట్రాటజీ ప్లే చేసి తను వొరిజినల్ 'కీ' తీసుకున్నాడు. అలా పృథ్వీ తాళం ఓపెన్ చేసినట్టుగా ప్రోమోలో తెలుస్తోంది. ఆ తర్వాత విష్ణుప్రియకి గేమ్ లో ఏం జరిగిందనేది రోహిణి, టేస్టీ తేజ వివరిస్తున్నారు. నువ్వు గేమ్ ఆడుతునప్పుడు వేరే 'కీ' లోపలికి ఎందుకు తీసుకొని వస్తారు. ఆ ప్లేస్ లో పృథ్వీ కాకుండా ఎవరైనా ఉంటే ఈ విషయం అడిగేదానివి కదా అంటూ విష్ణుప్రియతో రోహిణి, టేస్టీ తేజతో అంటున్నారు. మరి ఈ గేమ్ తర్వాత అయిన పృథ్వీ నిజస్వరూపం తెలుసుకొని విష్ణుప్రియ గేమ్ లో ముందుకి వెళ్తుందో లేదో చూడాలి మరి!  

రోహిణి ఎమోషనల్ ... మన పర్సనాలిటీకి ట్రోఫీలు రావులేరా

  బిగ్ బాస్ సీజన్-8 లో కొందరు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. మరికొందరు టాస్క్ లు ఆడుతున్నారు. ఇంకొంతమంది స్ట్రాటజీలు ప్లే చేస్తూ నెట్టుకొస్తున్నారు. సీజన్ మొదట్లో ఎంటర్‌టైన్మెంట్ తగ్గిందంటూ ఓ సీజన్ పై నెగెటివిటి మొదలైంది. కానీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోహిణి, అవినాష్, టేస్టీ తేజ వాళ్ళ ఎంట్రీతో బిగ్ బాస్ ఎంటర్‌టైన్మెంట్ కి కొదవ లేదనిపిస్తుంది. స్పాంటేనియస్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు.  ఇక అవినాష్, రోహిణి ల కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బోరింగ్ ఉన్న ప్రతీసారి అవినాష్ రోహిణి లని ఏదో ఒక సాకు చెప్పి వారితో కామెడీ చేపిస్తూ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నాడు. రోహిణి ఎంటర్‌టైన్మెంట్ విషయంలో తనని హౌస్ లో ఎవరు బీట్ చెయ్యలేరు. టాస్క్ లో కూడా బాగా ఆడుతుంది. తన కాలికి ఆపరేషన్ అయింది. అయిన కూడా గేమ్ బాగా ఆడుతుంది. టేస్టీ తేజ కూడా తనకి ఓపిక ఉన్నంత వరకు బాగా పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. రోహిణి, తేజ ఇద్దరు ఒకానొక సందర్భంలో లివింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటారు. మన పర్సనాలిటీకి ట్రోఫీలు మనకి రావులేరా.. ఏదో ఉన్నన్ని రోజులు మన వంతు ఎంటర్‌టైన్మెంట్ చెయ్యాలంటూ టేస్టీ తేజతో రోహిణి  అంటుంది. వారి మాటలు కామెడీగా ఉన్న మీనింగ్ బాధగా అనిపిస్తుంది. ఆ వీడియో క్లిప్ కాస్త వైరల్ గా మారింది. హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ అంటే రోహిణిది. అలాగే లావుగా ఉన్న టేస్టీ తేజ కూడా వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇలా నిజంగా ఉండేవాళ్లకి, ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేవారికి ఓట్ చెయ్యాలి అంతే కానీ ప్రతీగేమ్ లో ఫ్లిప్ అవుతు ఉండే వాళ్ళకి కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు తమ ఓట్లు మాత్రం వాళ్ళకే అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.