''బాటిల్ మొత్తం తాగాక ఒంటరిగా ఫీల్ అవుతానేమో"!

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన తల్లితో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. రీసెంట్ గా ఈ తల్లీకూతుళ్లు చీరలు కట్టుకొని చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో సుప్రీత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే రేంజ్‌లో ట్రోలింగ్‌కి గురవుతుంటుంది.  ట్రోలర్స్‌పై ఆమె మండిపడే తీరు కూడా వివాదాలకు దారి తీస్తుంటుంది. రీసెంట్ గానే సుప్రీత లైవ్‌లో ఓ నెటిజన్‌కు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా సుప్రీత మరోసారి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. తన గురించి ఎవరేం అనుకుంటున్నారో చెప్పమని సుప్రీత ఓ పోస్ట్ పెట్టింది. దానికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు .  కొందరు సుప్రీత వ్యక్తిత్వం మీద ప్రశ్నలు అడిగితే.. మరికొందరు మాత్రం పర్సనల్ విషయాల మీదే దృష్టి పెట్టారు. ఓ నెటిజన్ మాత్రం సుప్రీతను తాగుడు అలవాటు ఉందా..? అని నేరుగా అడిగాడు. "మీరు ఓ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా..?" అని సుప్రీతను అడగగా.. దానికి ఆమె. ''బహుశా మొత్తం బాటిల్ తాగాక అలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో'' అని చెప్పుకొచ్చింది. వైన్ గ్లాస్‌ను కూడా ఆమె షేర్ చేసింది. మొత్తానికి తనకు వైన్ తాగే అలవాటు ఉందని.. సుప్రీత నేరుగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. 

అవకాశాల కోసం..!

  ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు టీవీ కంటెంట్ కు కూడా క్రేజ్ పెరుగుతోంది. అందుకే టీవీ యాంకర్స్ తో పాటు ప్రోగ్రాంలో పాల్గొనే వారికి కూడా మంచి క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా లేడీ యాంకర్స్ పాపులారిటీ పెరిగిపోతుంది. పద్దతిగా ఉండేవారి కంటే హాట్ షో చేసేవారికి మంచి గుర్తింపు దక్కుతోంది. ఇప్పటికే అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి ఈ రంగంలో సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు యాంకర్ కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.  రీసెంట్ గా మొదలైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా టాలెంటెడ్ వ్యక్తులను గుర్తించి ఈ షోలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఆ ప్రదర్శనలతో పాటు సుడిగాలి సుధీర్ సహా 'జబర్దస్త్' టీమ్ సభ్యులు పాల్గొంటూ కామెడీ పంచుతున్నారు. వీరితో పాటు కొందరు అందమైన అమ్మాయిలను కూడా ఈ షోలోకి తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు.  సోషల్ మీడియాలో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ఈమె చాలా సార్లు కనిపించింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెల్స్ కి యాంకర్ గా పని చేసిన ఈమె మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేస్ తో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు నుంచొని ఆమె ఇచ్చిన ఫోజులకు యూత్ ఫిదా అయిపోయింది. సినిమా అవ‌కాశాల కోస‌మే ఆమె ఈ హాట్ పోజులిచ్చిందంటున్నారు నెటిజ‌న్లు.

నన్ను క్షమించండి.. ఏపీ రాజధాని వివాదంపై ప్రదీప్ స్పందన

యాంకర్‌ ప్రదీప్‌‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్‌ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని.. ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ప్రదీప్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. దీంతో ఈ వివాదంపై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని చెప్పాడు. రీసెంట్‌గా జరిగిన ఓ షోలో రాష్ట్రం-రాజధాని అనే అంశంపై ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నాడు.  తాను సిటీ పేరు చెప్పి, ఈ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడగడం జరిగిందని.. అయితే అవతలి వ్యక్తి మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ పూర్తి సంభాషణ తప్పు దోవలో వెళ్లిందని అన్నాడు. దీని ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని.. అందుకు మీ ఆశీస్సులు కావాలని ప్రదీప్ అన్నాడు.

సినిమాల్లో ఎంట్రీపై క్లారిటీగా ఉన్న‌ డాక్ట‌ర్ బాబు!

  బుల్లితెరపై అత్యధిక రేటింగులతో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది 'కార్తీకదీపం' సీరియల్. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తోన్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాలకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. సినిమా హీరోలనైనా గుర్తు పడతారో లేదో కానీ డాక్టర్ బాబుకి మాత్రం చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకు అందరూ అభిమానులే. ఎందుకంటే ప్రతీ ఇంట్లో 'కార్తీకదీపం' సీరియల్ ను చూసేవాళ్లు ఉన్నారు.  బుల్లితెరపై స్టార్ అనిపించుకున్న డాక్టర్ బాబు.. త్వరలోనే వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో చేయాలనే ఉందని.. 'కార్తీకదీపం' సీరియల్ వచ్చినట్లే.. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. కొన్ని క్యారెక్టర్లు వస్తున్నాయని.. కానీ తనకు సరిపోయే పాత్రను ఎంపిక చేసుకోవడానికి కాస్త టైం పడుతుందని అన్నారు.  ఎలాంటి పాత్రలను ఎన్నుకోవాలనే విషయంలో డైలమాలో ఉన్నానని చెప్పారు. ఇప్పటివరకు తనను సీరియల్స్ లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగానే చూశారని, ఇక సినిమాలంటే దానికి ఫిట్ అవుతానో లేదో ఆలోచించి అడుగులువేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ సినిమాలు కాకుండా.. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కథల్లో చేయాలని ఉందని తెలిపారు. ఇక హీరోల్లో మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని.. అలానే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తుంటానని అన్నారు. కానీ తన ఆల్ టైం ఫేవరెట్ మాత్రం చిరంజీవి గారే అని చెప్పుకొచ్చారు.  

ఏపీ రాజధానిపై వ్యాఖ్యలు.. వివాదంలో యాంకర్ ప్రదీప్

యాంకర్‌ ప్రదీప్‌‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్‌ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్‌ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ వివాదంపై ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికలపూడి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రదీప్‌ ను తీవ్రంగా హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై ప్రదీప్‌ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రదీప్‌ తను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకుంటే ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా, ఎందరో మనోభావాలతో ముడిపడి ఉన్న రాజధాని వంటి సున్నిత అంశంపై వ్యాఖ్యలు చేసిన ప్రదీప్.. ఏపీ పరిరక్షణ సమితి హెచ్చరికల నేపథ్యంలో క్షమాపణలు చెబుతారేమో చూడాలి.

మనకి అబ్బాయి పుడితే ముఖేష్, అమ్మాయి పుడితే ముఖ్యవతి అని పెడదాం!

  బుల్లితెరపై కామెడీ షోల పేరుతో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయాయి. 'జబర్దస్త్', 'ఎక్స్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఢీ', 'కామెడీ స్టార్స్' ఇలా అన్ని షోలలో బూతులు దొర్లుతూనే ఉన్నాయి. దీంతో టీవీ కామెడీ షోల‌లో కామెడీ శ్రుతి మించుతోంద‌నే విమ‌ర్శ‌లు త‌ర‌చూ వినిపిస్తున్నాయి. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ న్యాయనిర్ణేతలుగా ఉన్న 'కామెడీ స్టార్స్' షోలో తాజాగా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది యాంకర్ విష్ణుప్రియ.  ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ అందాల ప్రదర్శన చేస్తూ రకరకాల భంగిమల్లో షాకిస్తుంటుంది. తాజాగా కామెడీ స్టార్స్ షోకి చీరతో వచ్చి కాస్త పద్ధ‌తిగా కనిపించింది. కానీ తన మాటలతో బూతు కామెడీ చేసి రెచ్చిపోయింది. అవినాష్‌తో కలిసి ఓ స్కిట్ చేసింది విష్ణుప్రియ.  ''నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. నీ ముక్కు నాకు చాలా బాగా నచ్చింది. మన ముక్కులు కలిశాయి.. పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చిన చెక్కులు కూడా కలిసి వస్తాయి. మనకి అబ్బాయి పుడితే ముఖేష్ అని పెడదాం.. అమ్మాయి పుడితే ముఖ్యవతి అని పెడదాం అనుకున్నా. మన ముక్కులన్నీ కలిసి ముక్కాలా ముకాబులా అని డాన్స్ చేద్దాం'' అని అవినాష్ ని అడిగింది.  "కూపీ.. నీ కళ్లలో కరువు కనిపిస్తుంద"ని విష్ణు ప్రియ అంటే.. "అయితే కరవక ముందే వెళ్లిపో.. ఈ ఫైర్ ఎఫైర్‌గా మారకముందే వెళ్లిపోండి ప్లీజ్." అని అవినాష్ డబుల్ మీనింగ్ డైలాగ్‌ లతో రెచ్చిపోయాడు. 

'జబర్దస్త్' వర్ష పెళ్లికి రెడీ? ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?

  'జబర్దస్త్' షోతో పాపులారిటీ దక్కించుకున్న వర్ష.. అప్పుడప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా దర్శనమిస్తోంది. యాంకరింగ్ తో పాటు నటిగా కూడా రాణిస్తున్న ఈ బ్యూటీ తరచూ తన ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. తన చేతికి రింగు ధరించిన ఫోటోని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు షాకిచ్చింది వర్ష.  జూలై 4వ తేదీన ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని.. తెలిపింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎమోజీలను జత చేసింది.  దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ వర్ష పెళ్లి న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. మరికొందరేమో వర్ష పెళ్లి చేసుకుంటే ఇమ్మానుయేల్ ఏమైపోతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? లేక ఏదైనా ప్రోగ్రాం కోసం ఈ రకమైన ప్రమోషన్స్ చేస్తుందో తెలియాలంటే జూలై 4 వరకు ఎదురుచూడాల్సిందే!

అనసూయ డ్రెస్సింగ్‌పై కామెంట్స్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్!

  యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పొట్టి పొట్టి బట్టలేసుకునే అనసూయను నెటిజన్లు టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ట్రోల్స్ పై అనసూయ ఘాటుగా స్పందిస్తుంటుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది తన ఇష్టమని కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా ఆమె డ్రెస్సింగ్ పై యాంకర్ శివ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.  తాజాగా 'జబర్దస్త్' షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ప్రతీవారం ఎవరో ఒకరిని స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చే హైపర్ ఆది.. ఈసారి యాంకర్ శివను తీసుకొచ్చాడు. టిక్ టాక్, యూట్యూబ్ స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శివతో ఏదో స్కిట్ వేయించినట్లు ఉన్నాడు ఆది. అయితే స్కిట్ చివర్లో అనసూయను ఉద్దేశిస్తూ .. 'పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడంతో మీ పై కామెంట్స్ వస్తుంటాయి కదా.. దీని గురించి మిమ్మల్ని ఎప్పటినుండో అడగలనుకుంటున్నా' అని ప్రశ్నించాడు.  దాని అనసూయ ''వాళ్లెవరో అన్నారంటే.. ఇండస్ట్రీ గురించి తెలియదని అనుకోవచ్చు.. కానీ మీరు ఇక్కడి వారే కదా.. మీరు అడగడం ఏంటి..? అయినా ఇది నా వ్యక్తిగత విషయం'' అని బదులిచ్చింది. వెంటనే శివ 'పర్సనల్ అయితే మీ ఇంట్లో వేసుకోవచ్చుగా.. ఇక్కడ ఎందుకు' అని కౌంటర్ వేశాడు. దీంతో షాకైన అనసూయ స్టేజ్ మీద నుండి కిందకు వెళ్లిపోతూ ఆదిపై ఫైర్ అయింది. 'ఎవరెవరినో తీసుకొచ్చి.. మీకు తెలియకుండానే జరుగుతున్నాయా..?' అంటూ ఆదిపై కోప్పడింది. అయితే ఇదంతా నిజమా? లేక ప్రోమో కోసం ఇలా చేశారా..? అనేది తెలియాల్సివుంది. 

స్టేజ్ పైనే శేఖర్‌కి శ్రీముఖి ముద్దులు!.. మాస్ట‌ర్ భార్య ప‌రిస్థితేమిటో..!!

  కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో యాంకర్ శ్రీముఖి చాలా సన్నిహితంగా మెలుగుతుంటుంది. ఇద్దరూ కలిసి డాన్స్ వీడియోలు కూడా చేస్తుంటారు. అయితే తాజాగా ఓ టీవీ షోలో ఏకంగా స్టేజ్ మీదే శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టి షాకిచ్చింది శ్రీముఖి. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న సిక్స్త్ సెన్స్ నాల్గో సీజన్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి అనసూయ-హైపర్ ఆదిలు గెస్ట్ లుగా రాగా.. రెండో ఎపిసోడ్ కి శేఖర్ మాస్టర్-శ్రీముఖిలను తీసుకొచ్చారు ఓంకార్.  రెండు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఓంకార్ ఎలాంటి ఫిట్టింగ్ పెట్టారో తెలియదు కానీ.. శ్రీముఖి స్టేజ్ పైనే శేఖర్ మాస్టర్ కి గ్యాప్ ఇవ్వకుండా ముద్దులు పెట్టేసింది. వెంటనే శేఖర్ మాస్టర్ భార్య ఏమనుకుంటుందో అని.. 'మీ భార్య పేరేంటి..?' అని శేఖర్ మాస్టర్ ని అడిగి.. 'ఇది షోకి సంబంధించింది.. అన్నీ కల్పితాలే' అని చెప్పింది. నిజంగా ముద్దు పెట్టలేదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది.  కేవలం ముద్దులతో ఆగిపోలేదు. 'గిరా గిరా తిరిగే నడుము ఇది' అంటూ శ్రీముఖి నడుం దగ్గర శేఖర్ మాస్టర్ తలపెట్టి డాన్స్ స్టెప్పులు వేశారు. ఈ ముద్దులు, డాన్స్ లతో పాటు ఓంకార్ ను "బావా" అని పిలుస్తూ రెచ్చిపోయింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

"న‌న్ను చాలా మంది తిడుతున్నారు".. వాపోయిన డాక్ట‌ర్ బాబు!

  బుల్లితెరపై హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు 'కార్తీకదీపం' డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో పాటు 'హిట్లర్ గారి పెళ్లాం' అనే మరో సీరియల్ కూడా చేస్తున్నారు. అయితే నిరుపమ్ ఎక్కడికి వెళ్లినా.. 'కార్తీకదీపం' సీరియల్ గురించే అడుగుతుంటారట. వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మోనిత ప్రెగ్నెంట్ న్యూస్ తో మరింత ఆసక్తికరంగా మారింది.  దీప, కార్తిక్ లు కలుస్తారనుకునే సమయంలో మోనిత ఇచ్చిన ట్విస్ట్ తో సీరియల్ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో నెటిజన్లు ఈ సీరియల్ కు ముగింపు ఉండదా..? దీప, కార్తిక్ లు ఎప్పుడు కలుస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై చాలా మంది తనను తిడుతున్నారని.. పర్సనల్ మెసేజ్ లు కూడా పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.  ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కార్తీకదీపం' సీరియల్ గురించి మాట్లాడారు. ఈ సీరియల్ ఇంత క్లిక్ అవుతుందనుకోలేదని అన్నారు. వంటలక్క క్యారెక్టర్ విన్నప్పుడు సక్సెస్ ఫార్ములా కాబట్టి నమ్మకం ఏర్పడిందని.. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదని చెప్పారు. మీమ్స్, ట్రోల్స్ చూసినప్పుడు నవ్వుకుంటానని.. తిట్టినప్పుడు మాత్రం ఫీల్ అవుతుంటానని అన్నారు. తనకు పర్సనల్ గానే చాలా మంది మెసేజ్‌లు పెట్టి తిడుతుంటారని... ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోనని అన్నారు. 

వ్యాక్సిన్ వేయించుకోవడానికి అనసూయ పాట్లు!

  బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తరచూ ఏదొక టాపిక్ మీద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. ఆమెకి సపోర్ట్ చేసే వారికంటే ట్రోల్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆమె డ్రెస్సింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ట్రోల్స్ పడుతూనే ఉంటాయి. అయినప్పటికీ అనసూయ మాత్రం తనకు నచ్చినట్లే ఉంటుంది.  తాజాగా ఈ బ్యూటీ తన భర్త భ‌రద్వాజ్‌తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో స్వచ్చంద సంస్థలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపడుతున్నారు. దీంతో అనసూయ కూడా వ్యాక్సిన్ కోసం వెళ్లింది. అయితే ఆమెకి సూది మందంటే భయమని తెలుస్తోంది.  వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకొని.. కళ్లు మూసుకొని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నామని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంకుర హాస్పిటల్స్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుందని కూడా అనసూయ కితాబిచ్చింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. బుల్లితెరపై టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ పాత్రలో కనిపించనుంది. అలానే తమిళ, మలయాళ సినిమాల్లో కొన్ని సినిమాలు చేస్తోంది. 

వ‌న్ డే లైఫ్ వితౌట్ వైఫ్‌.. కౌశల్ వీడియో వైరల్!

  బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో కౌశల్ ఫాలోయింగ్ గురించి సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కౌశల్ కోసం ఏకంగా ఓ ఆర్మీ తయారైంది. ఆ తరువాత కొన్ని వివాదాలు కూడా జరిగాయి. ఈ విషయాలను పక్కన పెడితే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరూ యూట్యూబ్ లో సొంతంగా ఛానెల్స్ ఓపెన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.  వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. కౌశల్ కూడా అలానే ఓ ఛానెల్ మొదలెట్టాడు. కొన్ని రోజులుగా కౌశల్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కౌశల్ భార్య నీలిమకు కరోనా సోకడం.. ఆమె యూకేలో ట్రీట్మెంట్ తీసుకోవడంపై ఆ మధ్య పోస్ట్ లు వైరల్ అయ్యాయి.  ఇదిలా ఉండగా.. తాజాగా కౌశల్ ఓ వీడియో షేర్ చేశారు. ఒక రోజు భార్య ఇంట్లో లేకపోతే జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో వీడియోను రూపొందించారు. అయితే ఇందులో బిగ్ బాస్ షో అనుభవం పనికి వచ్చిందని కౌశల్ అన్నారు. వంట వండుకోవడం, తన పని తాను చేసుకోవడం అక్కడే అలవాటు అయిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి కౌశల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో తన పర్సనల్ విషయాలను పంచుకోవడంతో పాటు పిల్లలతో ఆడుకుంటూ కనిపించారు.

కామెడీని కామెడీలా చూడండి.. హైప‌ర్ ఆదిని వెన‌కేసుకొచ్చిన క‌మెడియ‌న్‌!

  ఓ కామెడీ షోలో హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, ఆడవాళ్లను కించపరిచారని తెలంగాణ జాగృతి విద్యార్ధి సంఘం నేతలు ఆదిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే దీనిపై ఆది క్షమాపణలు తెలియజేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా ఈ వివాదంపై జబర్దస్త్ కమెడియన్ మహిధర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక ప్రాంతాన్ని లేదా సంస్కృతిని హేళన చేసే వ్యక్తిత్వం హైపర్ ఆదికి లేదని మహిధర్ అన్నాడు.  ఈ ఇష్యూ చూస్తుంటే తనకొక డైలాగ్ గుర్తొస్తుందని.. మనోభావాలు ఉన్నదే దెబ్బతినడానికి అని వర్మ చెబుతుంటారని.. అవి ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉంటాయని ఆయన అంటుంటారని అన్నాడు. నిజానికి హైపర్ ఆది అయినా.. మరెవరైనా.. షోలో ఒక ప్రాంతాన్ని ఒక సంస్కృతిని కించపరచాలని అనుకోరని చెప్పాడు. కామెడీని కామెడీలా చూడటం మానేసి.. వివాదాన్ని వెతకడం అలవాటు అయిపోయిందని నిట్టూర్చాడు.  పట్టించుకోవాల్సిన విషయాలను పక్కన పెట్టేసి ఇలాంటి వాటిపై పడుతుంటారని విమర్శించాడు. స్కిట్ కోసం స్క్రిప్ట్ రాస్తే.. దాన్ని పర్సనల్ తీసుకుని ఫీల్ అయిపోతే ఏం చేయలేమని అన్నాడు. కామెడీ షోని కామెడీ షోగా చూస్తే మంచిదని అన్నారు. హైపర్ ఆదితో నాలుగేళ్లుగా పని చేస్తున్నానని.. ఆయన వ్యక్తిత్వం ఏంటో తనకు తెలుసని అన్నాడు. తెరపై పంచ్ లు వేసి నవ్విస్తుంటారేమో కానీ నిజ జీవితంలో చాలా నార్మల్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చాడు. 

"నాకు నువ్విష్టం.. నిన్ను తిన‌లేను క‌దా".. మ‌ర‌ద‌లు ప్రియ‌మ‌ణితో బావ ఆది స‌ర‌సాలు!

  'జబర్దస్త్' కామెడీ షోతో మంచి పాపులారిటీ దక్కించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీ అయ్యాడు. 'ఢీ' షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ పంచుతుంటాడు హైపర్ ఆది. తాజాగా విడుదలైన 'ఢీ 13' ప్రోమోలో హైపర్ ఆది చేసిన రచ్చ మాములుగా లేదు. ప్రియమణితో హైపర్ ఆది రొమాంటిక్ టూర్ వేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజం కానప్పటికీ ఆ రేంజ్ లోనే బిల్డప్ ఇచ్చారు.  ప్రియమణిని హైపర్ ఆది ఓ రిసార్ట్ కి తీసుకెళ్లినట్లు చూపించడంతో ఈ వీడియో వెంటనే వైరల్ అయింది. ఇక ఇందులో బావా మరదలుగా వాళ్లిద్దరూ రెచ్చిపోవడం బాగా హైలైట్ అయింది. 'ఢీ' డాన్స్ షోలో మెంటర్ గా ఉంటోన్న హైపర్ ఆది.. తన పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజా ప్రోమోలో మాత్రం తన రొమాంటిక్ మూడ్ తో షాకిచ్చాడు.  "ప్రియా..." అంటూ హైపర్ ఆది ముద్దుగా పిలుస్తుండగా.. "బావా".. అంటూ ప్రేమగా అతన్ని పిలుస్తూ కనిపించింది ప్రియమణి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదంటూ ఆది చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. "నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా?" అని ఆది అడ‌గ‌గా, "నీకేది ఇష్ట‌మో అదివ్వండి బావా.. నేను తింటాను." అని చెప్పింది ప్రియ‌మ‌ణి. "నాకు నువ్విష్టం.. నిన్ను తిన‌లేనుక‌దా" అని త‌న‌దైన స్టైల్‌లో ఆది పంచ్ వేశాడు. అత‌డి పంచ్‌కు ఫీలైపోయిన ప్రియ‌మ‌ణి ఆది భుజం మీద చేత్తో ట‌ప‌ట‌పా కొట్టేసింది. వీళ్లకు పక్క రూములో పూర్ణతో సుడిగాలి సుధీర్ ఉండడం.. ఈ రెండు జోడీల మధ్య సన్నివేశాలు, వాళ్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిపోయిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో తెగ‌ వైరల్ అవుతోంది. 

షర్ట్ లేకుండా అఖిల్.. 'అమ్మో' అంటూ మోనాల్‌!!

  బిగ్ బాస్ నాల్గో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లందరూ తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. కొందరికి పాజిటివ్ ఇమేజ్ రాగా.. మరికొందరికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఈ సీజన్ లో లవ్ ట్రాక్ లు బాగానే వైరల్ అయ్యాయి. ఇందులో మోనాల్ చుట్టూ తిరిగిన స్టోరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. మోనాల్, అభిజిత్, అఖిల్ ట్రాక్ ఎంతటి వివాదానికి దారి తీసిందో తెలిసిందే.  బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో మోనాల్ ఎక్కువగా అఖిల్, అభిజిత్ లతోనే సమయం గడిపేది. కానీ కొన్నాళ్ళకు అభిజిత్ కి, మోనాల్ కి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మోనాల్.. అఖిల్ కి మరింత క్లోజ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చినప్పుడు కూడా అఖిల్ కి మద్దతు తెలిపింది. కానీ అతడు రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో అఖిల్-మోనాల్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది.  అప్పుడప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై పోస్ట్ పై మరొకరు కామెంట్స్ పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా అఖిల్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన షర్ట్ బటన్ పెట్టుకోకపోవడంతో మోనాల్ సెటైర్ వేసింది. "షర్ట్ బటన్ పెట్టుకో" అంటూ లైవ్ లో చెప్పింది. తాజాగా అఖిల్ మరో పోస్ట్ పెట్టాడు. అందులో తన బెడ్ రూమ్ లో పడుకొని ఉన్నాడు. షర్ట్ లేకుండా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ లాక్ డౌన్ లో తన రోజులు ఇలా గడిచిపోతున్నాయని చెప్పాడు. దానికి మోనాల్.. ''బటన్ పెట్టుకోమని చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు షర్ట్ లేదు.. అమ్మో'' అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

డాన్స్ షోలో రమ్యకృష్ణ!

  కరోనా వైరస్ విజృంభ‌ణ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ ను ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెర‌గ‌డంతో సినిమా, టీవీ షూటింగ్ లను నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో రమ్యకృష్ణ షూటింగ్ లో పాల్గొంటున్నారు. విజ‌య్ టీవీలో ప్రసారమవుతోన్న 'బీబీ జోడిగళ్' డాన్స్ షోకి రమ్యకృష్ణ కో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.  తాజాగా ఈ షోకి సంబంధించిన షూటింగ్ లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రమ్యకృష్ణ. "బీబీ జోడిగళ్ సెట్ కు మళ్లీ వచ్చేశాం.. సేఫ్టీ ప్రొటోకాల్స్‌తో షూటింగ్ కొనసాగుతోంది. మాస్క్ లు పెట్టుకొని.. సురక్షితంగా షూటింగ్ చేస్తున్నాం" అంటూ రాసుకొచ్చారు రమ్యకృష్ణ. ఆ త‌ర్వాత ఆ షో లేటెస్ట్ ప్రోమో వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు జాగ్రత్తగా ఉండమంటూ సలహాలు ఇస్తున్నారు.  ఈ షోలో వనితా విజయ్ కుమార్ ఓ కంటెస్టెంట్. ఆమె కూడా రమ్యకృష్ణతో పాటు షూటింగ్ లో పాల్గొంది. ఈ షోలో సురేష్ చక్రవర్తితో కలిసి వనితా విజయ్ కుమార్, సోమశేఖర్‌తో శివానీ నారాయణ్, అజిద్ ఖాలీక్యుతో గ్యాబ్రియెల్లా చార్లటన్, షరీఖ్ హసన్‌తో అనితా సంపత్, సంయుక్త కార్తీక్‌తో జితన్ రమేష్  తదితరులు పాల్గొంటున్నారు.

అఖిల్ బెడ్ రూమ్‌లో మోనాల్ ఫోటో!

  బిగ్ బాస్ షోతో అఖిల్, మోనాల్ ల జంటకు పాపులారిటీ వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుస్తుంటారు. రీసెంట్ గా మోనాల్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. "నువ్వే నా రాణి" అంటూ తెగ పొగిడేశాడు అఖిల్. ఇక అఖిల్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో టాప్ లో నిలిస్తే 'అఖిల్ నెంబర్ వన్' అంటూ అతడిపై ప్రేమ కురిపించింది మోనాల్.  తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌తో అఖిల్ చిట్ చాట్ నిర్వహించాడు. ఈ ఇంటర్వ్యూ అఖిల్ ఇంట్లో జరిగింది. ఈ క్రమంలో అతడు తన బెడ్ రూమ్ ని చూపించాడు. అప్పుడ‌క్క‌డ‌ మోనాల్ గజ్జర్ ఫోటో కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ వెనుక ఆమె నిల్చొని ఉన్న సమయంలో తీసిన ఫోటో అది. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.  మోనాల్ గురించి మాట్లాడుతూ.. ఆమె అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. మోనాల్ ను ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తుంటానని... అందుకే ఆమె ఫోటోని బెడ్ రూమ్ లో పెట్టుకున్నట్లు చెప్పారు. "నాకోసం ఎక్కువగా ఆలోచించేవాళ్లలో మోనాల్ ఒకరు.. అందుకే ఆమె నాకు అంత దగ్గరైంది." అని వెల్ల‌డించాడు అఖిల్.   

వర్షిణితో లిప్ లాక్.. రవితో ఆడుకున్న ముక్కు అవినాష్‌!

  ఈ మధ్యకాలంలో బుల్లితెరపై మేల్ అండ్ ఫీమేల్ యాంకర్స్ చేస్తోన్న రచ్చ మాములుగా లేదు. పలు షోలలో కనిపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'కామెడీ స్టార్స్' షోకి మంచి టీఆర్పీలు వస్తుండడంతో షోకి మరింత రొమాన్స్ యాడ్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వర్షిణికి యాంకర్ రవి లిప్ లాక్ ఇస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  తాజాగా విడుదల చేసిన 'కామెడీ స్టార్స్' ప్రోమోలో ఈ లిప్ కిస్ కనిపించింది. ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ షోతో మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వర్షిణి ఈ షోలో యాంకర్ గా చేస్తోంది. అలానే రవి.. లాస్యతో కలిసి సందడి చేస్తున్నాడు. వీరితో పాటు చమ్మక్ చంద్ర, అవినాష్, హరి లాంటి బుల్లితెర కమెడియన్స్ ఫన్ పంచుతున్నారు.  ఈ క్రమంలో వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో ముక్కు అవినాష్ స్కిట్ కోసం యాంకర్ రవిని హీరోగా, వర్షిణిని హీరోయిన్ గా మార్చేశారు. డైరెక్టర్ గా కనిపించిన అవినాష్.. హీరోయిన్ వర్షిణితో మీకు లిప్ లాక్ సీన్ ఉంటుందని చెప్పడంతో రవి సంబర పడిపోయాడు. ముందుగా వర్షిణిని హగ్ చేసుకొని రొమాంటిక్ గా చూడమని చెబుతాడు అవినాష్. అయితే రవి పెర్ఫార్మన్స్ అవినాష్ కి నచ్చకపోవడంతో ఎలా చేయాలో తనే స్వయంగా చేసి చూపిస్తాడు. షాట్ ఓకే అంటూ రవిని ఫూల్ చేస్తాడు. ఈ ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది.

స్కిట్ తెచ్చిన తంటా.. క్షమాపణలు కోరిన హైపర్ ఆది!

  'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచేలా 'శ్రీదేవి డ్రామా కంపనీ' షోలో ఓ స్కిట్ చేశాడని.. అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ ముదిరిపోతుందని గ్రహించిన మల్లెమాల టీమ్ యూట్యూబ్ నుండి వీడియోను తొలగించింది.  ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించక తప్పలేదు. తను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమేనని స్క్రిప్ట్ తను రాయలేదని చెప్పాడు. తాజాగా తమ స్కిట్ కారణంగా బాధపడ్డ వాళ్లకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు హైపర్ ఆది. ఆంధ్ర, తెలంగాణ అనే బేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడూ ఉండవని ఈ వీడియోలో వివరించాడు.  అన్ని ప్రాంతాల వాళ్లం ఎంతో సరదాగా కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటామని.. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. కలిసే పరిష్కరించుకుంటామని తెలిపాడు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని స్పష్టం చేశాడు. అన్ని ప్రాంతాల వారి ప్రేమాభిమానాలు వలనే అందరినీ ఇలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నామని చెప్పాడు. ఏది ఏమైనా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నట్లు చెప్పుకొచ్చాడు.