BBC Radio 1 slapped with ageist claims over Madonna diss

మడోనా... వార్త... అలాంటిదేమీ లేదు...

  బీబీసీ రేడియో 1 ప్లే లిస్ట్‌లో పాప్ సింగర్ మడోనా హాట్ ఫేవరెట్. అయితే మడోనా ముసలమ్మ అయిపోయిన కారణంగా ఆమె పాటలను బీబీసీ రేడియో 1 ప్లే లిస్టు నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో మడోనా అభిమానులు చాలా ఫీలయ్యారు. అయితే ఈ వార్తలను బీబీసీ ఖండించింది. దీని మీద బీబీసీ రేడియో 1 తన ఫేస్‌బుక్ పేజీలో స్పందించింది. తమ సంస్థ మడోనా మీద నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. తమ రేడియో 1 పాటల జాబితాను, మ్యూజికల్ మెరిట్స్‌ను యువ శ్రోతలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తామని, అంతే తప్ప ప్రత్యేకించి మడోనా మీద నిషేధం విధించామని అనడం వాస్తవం కాదని తెలిపింది.

Lady Gaga To Sing Special Tribute At Oscars

ఆస్కార్ వేదిక మీద లేడీ గాగా

  ఆమె పేరు చెబితే చాలు పాప్ ప్రేమికులు పులకరించిపోతారు. ఆమె ఎవరో కాదు.. పాప్ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి లేడీ గాగా. ఇప్పుడు ఈమె ఆస్కార్ అవార్డుల వేదిక మీద తన పాప్ ప్రదర్శన ఇవ్వడానికి అంగీకరించారు. త్వరలో జరగబోతున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదిక లేడీ గాగా పాప్ ప్రదర్శనతో హాట్ హాట్‌గా మారనుంది. లేడీ గాగా ఈ వేదిక మీద ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది. ఈమధ్య లేడీ గాగా తన హెయిర్ ‌స్టైల్‌ని పూర్తిగా మార్చేసింది. చాలా పొడవుగా వుండే తన జుట్టును బాబ్డ్ హెయిర్‌గా మార్చేసుకుంది. ఆ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన హెయిర్ స్టైల్ తనకు సూపర్‌గా నచ్చేసిందని పేర్కొంది. అయితే లేడీ గాగా తన హెయిర్ స్టైల్ మార్చుకుంది ఆస్కార్ ప్రదర్శన కోసం కాదట.. తనను ఎంతగానో ప్రేమించే ఒక వ్యక్తి కోసం తన హెయిర్ స్టైల్ మార్చుకున్నానని వగలు పోతూ చెబుతోంది లేడీ గాగా.

telugu tamil heroine hansika

ఆ వీడియో హన్సికదేనా?

  వార్నాయనో... ఈమధ్యకాలంలో ఇవి ఫలానా హీరోయిన్లవి అంటూ నగ్న వీడియోలు, నగ్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మొన్నామధ్య ఒక తమిళ హీరోయిన్ తన ప్రియుడితో చాలా ‘క్లోజ్’గా వున్న సెల్ఫీలు ఇంటర్నెట్‌లో విడుదలయ్యాయి. నిన్నగాక మొన్న బాలకృష్ణ సరసన నటిస్తున్న హీరోయిన్ రాధికా ఆప్టే నగ్న సెల్ఫీలంటూ కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో విడుదలయ్యాయి. అయితే అవి తన సెల్ఫీలు కావంటూ రాధికా ఆప్టే ఖండించింది. ఈసారి తన నగ్న సెల్ఫీలంటూ విడుదల చేసేవారు కాస్త తనలాగా వుండే మహిళను ఎంచుకోవాలని కామెంట్ కూడా చేసింది. సరే, ఇవి ఇలా వుంటే, లేటెస్ట్‌గా హీరోయిన్ హన్సిక షవర్ కింద స్నానం చేస్తున్న వీడియో అంటూ ఒక వీడియో ఇంటర్నెట్‌లో విజృంభిస్తోంది. యూట్యూబ్‌, ఫేస్‌బుక్, వాట్సప్... ఎక్కడ చూసినా ఈ వీడియో కనిపిస్తూ తిక్కపుట్టిస్తోంది. ఇంతకీ ఆ వీడియో హన్సికదేనా?

tamil actress manorama alive press release

బతికే వున్నా... మనోరమ

  తాను చనిపోయినట్టు వచ్చిన పుకార్లను సీనియర్ నటి మనోరమ ఖండించారు. సోమవారం నాడు మనోరమ మరణించారంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే మనోరమ నిక్షేపంలా వున్నారు. తాను బతికే ఉన్నానని ఆమె మీడియాకి వివరణ ఇచ్చారు. తాను బతికే వున్నానని తానే చెప్పుకునే పరిస్థితి రావడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. మనోరమ తరఫున ఆమె కుమారుడు భూపతి ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తెలిపిన ప్రకారం... మనోరమ కొద్ది రోజుల క్రితం బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారు. దాంతో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. అలాగే మూత్ర నాళానికి సంబంధించిన అనారోగ్య సమస్య కూడా ఆమెకు వుంది. వీటికి చికిత్స పొందడానికి ఆస్పత్రిలో చేరిన ఆమె, చికిత్స పొంది పరిస్థితి మెరుగు కావడంతో ఇంటికి చేరుకున్నారు. ఇదీ మనోరమ ప్రకటన సారాంశం.

temper dubbing jr ntr

‘టెంపర్’.. ఎన్టీఆర్ అలక నిజమే...

  జూనియర్ ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ‘టెంపర్’ సినిమా శుక్రవారం నాడు భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అసలు ఈ సినిమా శుక్రవారం నాడు విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు కలిగాయి. ఎందుకంటే, మొన్నటి వరకు ఎన్టీఆర్ డబ్బింగే చెప్పలేదాయే. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అలగటమే. తనకు రావల్సిన డబ్బును నిర్మాత ఇవ్వకపోవడంతో అలిగిన జూనియర్ డబ్బింగ్ చెప్పలేదన్న పుకార్లు గుప్పుమన్నాయి. అయితే వీటిని యూనిట్ ఖండించినప్పటికీ అవి నిజమేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పకపోతే, సినిమా విడుదల వాయిదా పడితే సినిమా ఖేల్ ఖతమ్ దుకాణం బంద్ అయ్యే ప్రమాదం వుంది కాబట్టి నిర్మాత బండ్ల గణేస్ అప్పో సొప్పో చేసి జూనియర్ ఎన్టీఆర్‌కి డబ్బు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. చేతిలో డబ్బు పడగానే యాక్టివ్ అయిపోయిన ఎన్టీఆర్ రాత్రికి రాత్రే డబ్బింగ్ చెప్పేశాడట.. సినిమా ఇండస్ట్రీలో డబ్బుకి డబ్బింగ్‌కి అంత లింక్ వుంటుంది మరి..

‘టెంపర్’... కొన్ని పాయింట్లు...

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా శుక్రవారం నాడు విడుదలవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరోయిన్ కాజల్. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు... *‘టెంపర్’ జూనియర్ ఎన్టీఆర్‌కి తప్పకుండా విజయం సాధించాల్సిన సినిమాలు. ఈ సినిమా అటూ ఇటూ అయితే కష్టమే. * ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ దయా దాక్షిణ్యాలు లేని దయా అనే పాత్రను ధరించాడు. * హీరో పాత్రకు దయ లేకపోయినప్పటికీ సినిమాలో మాత్రం కామెడీ ఫుల్లుగా వుంటుందని తెలుస్తోంది. * తాను తన ప్రతి సినిమా కోసం కష్టపడి పనిచేసేవాడినని, ఈ సినిమా కోసం మాత్రం కసితో పనిచేశానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. * ‘టెంపర్’ ఆడియో పర్లేదని అనిపించుకుంది. * ‘టెంపర్’లో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నాడు. * ఎన్టీఆర్ పూర్తిస్థాయి పోలీసు అధికారి పాత్రలో నటించిన సినిమా ఇది.

సెల్ఫీలు.. రాధికా ఆప్టే ఖండన..

  ఇటీవల ఇంటర్నెట్లో హీరోయిన్ రాధికా ఆప్టే నగ్న సెల్ఫీలంటూ ఓ మహిళ ఫొటోలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ ఫొటోల్లో కనిపిస్తున్న మహిళకు రాధికా ఆప్టే పోలికలు వుండటంతో ఇంటర్నెట్‌లో వైరస్‌లా వ్యాపించాయి. తనపేరుతో సెల్ఫీలు ఇలా ప్రచారంలోకి వచ్చినా రాధికా ఆప్టే ఎంతమాత్రం స్పందించకపోవడం, ఖండించకపోవడంతో రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. రాధికా ఆప్టే ముఖం చెల్లకపోవడంతో బయట పడటం లేదని కొందరు అంటే, రాధికా ఆప్టే నటించిన తాజా చిత్రం ‘బద్లాపూర్’ ప్రచారం కోసమే ఈ ఫొటోలను క్రియేట్ చేసి నెట్‌లో విడుదల చేశారని కొందరు అన్నారు. అయితే ఈ ఊహాగానాలన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టేలా రాధికా ఆప్టే ట్విట్టర్లో కామెంట్ పెట్టారు. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న ఫొటోలు తనవి కావని ఆమె స్పష్టం చేశారు. ఎవరో కొంచెం తనలా కనిపించే అమ్మాయి ఫొటోలు లీక్ చేసి తాను అంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈసారి ఎవరైనా తన నగ్న ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టదలుచుకుంటే, తన పోలికలకు ఇంకాస్త దగ్గరగా వుండే అమ్మాయి ఫొటోలు పెట్టండంటూ చురక కూడా విసిరారు.

వర్మ ‘365’ టీజర్... యాక్...

  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో కళాఖండంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘365’. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ప్రారంభంలోనే ‘రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ చిత్రం’ అనే మాట కనిపిస్తుంది. రామ్‌గోపాల్ వర్మ ఏంటీ.. రొమాంటిక్ ఏంటి అని అనిపిస్తుంది. పైగా టీజర్ బ్యాక్ గ్రౌండ్‌లో మొదటి నుంచి చివరి దాకా ఓ కొరియా సినిమా థీమ్ మ్యూజిక్ కొట్టేసి వినిపించాడు. ఈ టీజర్ చూస్తుంటే వర్మ మరో అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమా రూపొందించాడని ఖాయంగా తెలుస్తోంది. కాకపోతే హీరోయిన్‌గా నటించిన అనైక అనే అందగత్తెని ‘బాగా’ చూపించాడన్న విషయం మాత్రం అర్థమవుతోంది. టీజర్‌లో ఆమె నేలమీద పడుకుని కొండచిలువకి చెల్లెలిలాగా మెలికలు తిరుగుతోంది. ఇక సినిమాలో ఎన్ని మెలికలు తిరుగుతుందో ఏం పాడో. మొత్తమ్మీద వర్మగారి ‘365’ టీజర్ యాక్ అనిపించేలా వుంది. ఇంత చెప్పినా ఈ టీజర్ని చూడాలనిపిస్తే ఛలో యూ ట్యూబ్.