Madonna Brit Awards London

కాలుజారిన మడోనా

  ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మడోనా కాలు జారింది. అపార్థం చేసుకోకండి.. పాపం మడోన్నా నిజంగానే కాలు జారి పడిపోయింది. లండన్లో జరిగిన బ్రిట్ అవార్డ్స్ ఫంక్షన్లో తన బృందంతో కలసి మడోనా మాంఛి ఉత్సాహంగా పాడుతూ ఆడుతూ వుండగా, సెట్‌లోని మెట్ల మీద నిల్చున్న ఆమె అకస్మాత్తుగా వెనక్కి పడిపోయింది. కనీసం నిలదొక్కుకోవడానికి కూడా వీల్లేకుండా దఢేల్మని కింద పడిపోయింది. పాపం, మడోనా డాన్సులూ అవీ బాగానే చేస్తుందిగానీ, వయసు మాత్రం మీద పడిపోయింది కదా.. ఇప్పుడు ఆమెకు 56 ఏళ్ళు... ఆ వయసులో కూడా డాన్స్ చేస్తున్న ఆమె ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఏమవుతుందో అని ఆ షో చూస్తున్న అందరూ భయపడిపోయారు. అయితే మడోనా మాత్రం చలాకీగా లేచి నిల్చుని షో కంటిన్యూ చేసింది. మడోనా అలా పడిపోయిందో లేదో ఇలా ఆ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేయడం మొదలెట్టాయి. ట్విట్టర్లో అయితే ఇదొక కామెడీ సబ్జెక్ట్ అయి కూర్చుంది. ఇదిలా వుంటే, మడోనా కూడా తాను పడిపోతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది తనకు ఒక కొత్త అనుభవం అని చెప్పుకుంది.

allu arjun boyapati srinu movie

అంతర్వేదిలో బన్నీ సినిమా స్క్రిప్టు

  అల్లు అర్జున్‌తో తన కొత్త సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నానని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన సోమవారం సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛాటనతో ఆయనకు ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై తాను చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టును అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వుంచి పూజ చేసినట్టు బోయపాటి శ్రీను తెలిపారు.

Actress lakshmi menon

మరో హీరోయిన్ బాత్రూమ్ సీన్లు...

  ఈమధ్య హీరోయిన్ల బాత్రూమ్ సీన్స్ అంటూ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో భారీ స్థాయిలో వ్యాపిస్తున్నాయి. మొన్నామధ్య రాధికా ఆప్టే, నిన్నగాక మొన్న హన్సిక ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఇలాంటి రూమర్ల బారిన పడింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. లక్ష్మీ మీనన్. ఈ కేరళ హీరోయిన్ స్నానాలగది దృశ్యాలంటూ కొన్ని హాట్ సన్నివేశాలు సోషల్ నెట్‌వర్క్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటిమీద లక్ష్మీ మీనన్ లేటు చేయకుండా స్పందించింది. ఆ స్నానం దృశ్యాలు తనవి కావని, మార్ఫింగ్ దృశ్యాలని వివరణ ఇచ్చింది. లక్ష్మీమీనన్ తాను త్వరలో సినిమాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించింది. అయితే సినిమా రంగంలో తానంటే గిట్టనివాళ్ళు తనను అప్రతిష్ట పాలు చేయడం కోసమే ఇలాంటి దృశ్యాలను ప్రచారం చేస్తున్నారని ఆమె అంటోంది. సినిమా రంగం నుంచి వెళ్ళే సమయంలో తనను ఇలా అవమానాల పాలు చేయడం భావ్యం కాదని ఆమె అంటోంది.