మడోనా... వార్త... అలాంటిదేమీ లేదు...
posted on Feb 19, 2015 @ 4:50PM
బీబీసీ రేడియో 1 ప్లే లిస్ట్‌లో పాప్ సింగర్ మడోనా హాట్ ఫేవరెట్. అయితే మడోనా ముసలమ్మ అయిపోయిన కారణంగా ఆమె పాటలను బీబీసీ రేడియో 1 ప్లే లిస్టు నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో మడోనా అభిమానులు చాలా ఫీలయ్యారు. అయితే ఈ వార్తలను బీబీసీ ఖండించింది. దీని మీద బీబీసీ రేడియో 1 తన ఫేస్‌బుక్ పేజీలో స్పందించింది. తమ సంస్థ మడోనా మీద నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. తమ రేడియో 1 పాటల జాబితాను, మ్యూజికల్ మెరిట్స్‌ను యువ శ్రోతలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తామని, అంతే తప్ప ప్రత్యేకించి మడోనా మీద నిషేధం విధించామని అనడం వాస్తవం కాదని తెలిపింది.