వడ్డీకు ఇవ్వడం, తీసుకోవడం, ఇప్పించడం మహాపాపం
posted on Aug 16, 2024 @ 11:02AM
తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండేది.అప్పట్లో హైదరాబాద్ మహానగరంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. ఫసల్ బాబా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. ఐటిలో బిటెక్ చేసినప్పటికీ ఉద్యోగం దొరక లేదు. ఉద్యోగం లేనప్పటికీ మేనరిక సంబంధం రావడంతో పెళ్లి అయితే చేశారు పెద్దలు. ఒక బాబు పుట్టాడు. ఫస్ట్ బర్త్ డే గ్రాండ్ గా చేయాలని భార్య తరపు బంధువులు ఒత్తిడి పెట్టారు. చేసేదేమి లేక ఫసల్ బాబా నూటికి ఐదుపర్సెంటేజి క్రింద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ప్రతీనెలా ఠంచనుగా కట్టకపోతే వడ్డీ రేటు మారుతుందరి ఫైనాన్సియర్ కటువుగానే చెప్పాడు. సరేనన్నాడు ఫసల్ బాబా.
కొడుకు బర్త్ డే అని అందరికీ ఇన్విటేషన్స్ అయితే ఇచ్చాడు ఫసల్ బాబా. సాయంత్రం బర్త్ డే సెలబ్రేషన్స్ కు అందరూ సిద్దమయ్యారు. ఆరిఫ్ ప్రముఖ దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. వృత్తి జర్నలిజం. ప్రవృత్తి తక్రీర్ (ప్రవచనాలు) ఇవ్వడం.
మసీదుల్లో అయితే శుక్రవారం, పండగ రోజుల్లో తక్రీర్ ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతమైతే ఒక తక్రీర్ చెప్పడానికి మౌలానాలు ఐదు వేలు వసూలు చేస్తున్నారు. ఆరిఫ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తక్రీర్ లు చెప్పేవాడు. అదొక సామాజిక బాధ్యతగా భావించేవాడు. అది ధర్మ కార్యంగా భావించేవాడు.
ఫసల్ బాబా బర్త్ డే వేడుకలకు తీసుకెళ్లడానికి కొందరు యువకులు ఆరిఫ్ దగ్గరికి వచ్చారు.
యువకులు: ఆరిఫ్ బయ్ సాల్ గిరాకు వెళ్దామా అన్నారు.
ఆరిఫ్: అవునూ ఫసల్ బాబా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.
యువకులు: ఎక్కడా చేయడం లేదుబయ్
ఆరిఫ్: ఫిర్ పైసా కహాంసే లాయా
యువకులు. ఫైనాన్స్ పే
ఆరిఫ్: అయితే నేను రాను. సూద్ కే పైసాసే ఖాయేతే బీ అజమ్ నహీ హోతా. హలాల్ కే పైసా హజమ్ హోతా..యేతో హరామ్ కా పైసా హై. వో ఖానా జహర్ బన్ తా
ఆరిఫ్ : సూద్ పే పైసా లేనే వాలా.. సూద్ పే పైసా దేనేవాలా. సూద్ పే పైసా దిలానే వాలా.. తీనో డేంజర్ హై.. బచ్చో కా ఖేల్ హై క్యా.. సూద్ పే అల్లా జంగ్ కరేగా... మేరే ప్యారే బాయ్.. అల్లా కే వాస్తే మత్ కరో... అల్లా మదత్ నై కరేగా..
సూద్ కా పైసే సే బచ్చీయోంకీ షాదీ కర్నా హరామ్ హై.. హమ్ ఖుదా కే ఖిలాఫ్ జాకే కామియాబ్ నహీ హో సక్తే మేరే భాయ్.. బ్యాంక్ సే లోన్ లేనా జాహెజ్ హై.. మగర్ ఫైనాన్సర్ సే లేనా మనా హై..
వడ్డీల ప్రస్తావన వచ్చినప్పుడు ఆరిఫ్ తక్రీర్ ఇలా సాగేది.
హైదరాబాద్ జర్నలిస్టులకు ఆరిఫ్ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు. ఆరిఫ్ విలక్షణమైన వ్యక్తి. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని బలంగా నమ్మే జర్నలిస్ట్ ఆరిఫ్
90 దశకం ఆరంభంలోనే ఆరిఫుద్దీన్ అహ్మద్ అనే జర్నలిస్ట్ ఆంధ్రప్రభ హైద్రాబాద్ ఎడిషన్ లో చేరాడు. అప్పటికే దాసరినారాయణరావు ఉదయం తెలుగు దినపత్రికలో రిపోర్టర్ గా అనుభవం గడించిన ఆరిఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండేవి. రాజస్థాన్ కు చెందిన రామ్ నాథ్ గోయంకా యాజమాన్యంలో వస్తున్న ప్రచురణల్లో తెలుగు ఎడిషన్ ఆంధ్రప్రభ, ఇంగ్లీషులో ఇండియన్ ఎక్స్ ప్రెస్ దోమలగూడ నుంచి ప్రచురణ అయ్యేవి. కన్నడప్రభ మాత్రం బెంగుళూరు నుంచి వచ్చేది. నైతిక విలువలు, వృత్తి ప్రమాణాలు పాటించే పత్రికగా మార్కెట్లో పేరుండేది. వామపక్షభావజామున్న జర్నలిస్ట్ లు ఉదయం వంటి పత్రికల్లో చేరితే రైటిస్ట్ భావజాలమున్న జర్నలిస్ట్ లకు మాత్రం ఆంధ్రప్రభ వేదికయ్యేది. ఈనాడు, ఉదయం పత్రికల్లో సెంట్రల్ డెస్క్ అనుభవం గడించిన శంకరనారాయణ వంటి లబ్ద ప్రతిష్టులు ఆంధ్ర ప్రభలో ఫన్ గన్ కాలమిస్ట్ గా చేరిపోయారు. హస్యం, వ్యగ్యం ఉండే ఈ ఫీచర్ కు చాలా కాలం జీవం పోసింది శంకరనారాయణ మాత్రమే. హాస్యావధానాలతో తెలుగు ప్రజలను పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించే శంకరనారాయణకు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాలో విశేష గౌరవం ఉండేది. ఆరిఫ్ సెటైరికల్ గా చెప్పడాన్ని ఆయన పకపకానవ్వేవారు. అంతకుముందు ఉదయం పత్రికలో ఆరిఫ్, శంకరనారాయణ కల్సి పని చేయడం వల్ల ఇద్దరి వేవ్ లెంగ్త్ బాగా కలిసింది. ఆరిఫ్ లో ఉండే హైదరాబాద్ యాక్సెంట్ సెటైర్ వల్ల సీనియర పాత్రికేయులు పలువురు దగ్గరయ్యారు. ఆరిఫ్ చెప్పే హస్యోక్తులు వారిని ఆకర్షిచేవి. ఆంధ్రప్రభ డిప్యూటి ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రి, ప్రెస్ అకాడమీ పూర్వ చైర్మన్ దేవులపల్లి అమర్ వంటి కాకలు తీరిన జర్నలిస్ట్ లకు కూడా ఆరిఫ్ అంటే ఎంతో ఇష్టపడేవారు. పోలీస్ స్టేషన్ వద్ద సెంట్రీ , గవర్నమెంట్ ఆఫీస్ లో చప్రాసి నమస్తే చేయకపోతే ఆ వ్యక్తి ఈ సొసైటీకి పనికి రాడు అనే ఆరిఫ్ వాదన. మనుషుల తీరు తెన్నులను బాగా స్టడీ చేసే వాడు. ఆరిఫ్ కు తెలుగు భాషా ప్రావీణ్యం పెద్దగా లేకపోయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో సిద్దహస్తులు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు రాస్తూ పాలకుల మెడలు వంచి పని చేయించేవాడు. ప్రతీముస్లిం తన జీవిత కాలంలో మక్కా వెళ్లాలని ఇస్లాం చెబుతుంది. మహమ్బద్ ప్రవక్త జన్మించిన ప్రదేశాన్ని చూడాల్సిందే నని నిర్ణయించుకున్న ఆరిఫ్ తన కష్టార్జితంతో చిన్న తనంలోనే మక్కా సందర్శించాడు.ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న ఆరిఫ్ ఇస్లాం మార్గదర్శకాలను అనుసరించేవాడు. ప్రతీ రోజూ ఐదుసార్లు నమాజ్ పక్కా చేసే వాడు. ఓ పక్క వృత్తి ప్రమాణాలు పాటిస్తూనే ఇస్లాం పునాదుల మీద నిలబడే వ్యక్తిగా ఆరిఫ్ పేరు గడించాడు. జర్నలిస్ట్ గా సమాజానికి ఆరిఫ్ చేసిన సేవలకు గుర్తింపు లభిస్తున్న సమయమది. ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ కూడా ఆరిఫ్ ను పేరు పెట్టే పిలిచేంతగా గుర్తింపు సంపాదించాడు. ఆ రోజుల్లో ఆరిఫ్ తక్రీర్ విని మారిపోయిన వారు ఉన్నారు. వారు చెడు వ్యసనాలకు దూరమయ్యే వారు. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆరిఫ్ తక్రీర్ ఉపయోగపడేది. వడ్డీలు తీసుకోవడం, వడ్డీలకు ఇవ్వడాన్ని ఆరిఫ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడు. వడ్డీలకు ఇప్పించేవారిని కూడా ఆరిఫ్ అంతే దూరంగా పెట్టేవారు. వారిని కాఫీర్ అంటారని చెప్పేవాడు. కాఫీర్ అంటే దేవుడుని నమ్మని వారని అర్థం. స్వంత ఇంటి కోసం ఎవరైనా స్థలాలు కొనుగోలు చేసే సమయంలో తమ వద్ద ఉన్నబంగారాన్నిఅమ్మేసి కొనుగోలు చేయాలని ఆరిఫ్ సూచనచేసే వాడు.వడ్డీలకు తెచ్చి కొనుగోలు చేయొద్దనేవాడు. రామ్ నాథ్ గోయంకె నుంచి ఆంధ్ర ప్రభ మేనేజ్మెంట్ మారడంతో ఆరిఫ్ ఉద్యోగం కోల్పోయాడు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో హిందుజా సంస్థ ఇన్ కేబుల్ టీవీ ప్రసారాలు చేస్తోంది. ఎపి ఫ్రాంచైజ్ తీసుకున్న ఆర్వీఆర్ చౌదరి తన సంస్థలో క్రైంబ్యూరో చీఫ్ ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం కోసం కనీసం అప్లికేషన్ కూడాపెట్టుకోలేదు. ఆరిఫ్ జర్నలిజంలో చేసిన సేవలను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించారు ఆర్వీఆర్ చౌదరి. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి తన తక్రీర్ మాత్రం ఆపడం లేదు ఆరిఫ్ .
-బదనపల్లి శ్రీనివాసాచారి